Varahamahapuranam-1    Chapters   

పఞ్చదశాదిక శతతమో ధ్యాయః - నూటపదునైదవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

మయా ప్రోక్తవిధానేన యస్తు కర్మాణి కారయేత్‌,

శృణుష్వ త్వం మహాభాగే యేన సాఫల్య మాప్నుయాత్‌. 1

పుణ్యులారా! నేను చెప్పిన తీరున కర్మములు ఆచరించు వాడు ఎట్లు సఫలత్వముపొందునో చెప్పెదను వినుము.

ఏకచిత్తః సమాధాయ అహంకారవివర్జితః,

మచ్చిత్తోపగతో నిత్యం క్షాన్తోదాన్తో జితేన్ద్రియః 2

చెదరని చిత్తమును కూర్చుకొని అహంకారమును వదలి వైచి, మనస్సును, ఇంద్రియములను అణచివైచుకొని నన్నే హృదయ మున నిలుపుకొనవలయును.

ఫలములాని శాకాని ద్వాదశ్యాం వా కదాచన,

పయో వ్రతశ్చ తత్కాలే పునశ్చైవ నివామిషః. 3

అప్పుడప్పుడు ద్వాదశియందు దుంపలు, కూరలు తినుచు పాలుత్రాగుట యను వ్రతమునవలంబించి సాత్తికాహారమును భుజింపవలయును.

షష్ఠ్యష్టమీ అమావాస్యా ఉభేపక్షే చతుర్ధశీ,

మైథునం నాభిసేవేత ద్వాదశ్యాం చ తథాప్రియే. 4

షష్ఠి, అష్టమి, అమావాస్య, రెండు పక్షములందును చతుర్ధశి, ద్వాదశి అను తిథులందు మిథునకర్మముజోలికి పోరాదు.

ఏవం యోగవిధానేన కర్మ కుర్యాద్‌ దృఢవ్రతః,

పూతాత్మా ధర్మసంయుక్తో విష్ణులోకంతు గచ్ఛతి. 5

ఇట్లు యోగవిధానముతో చెడనివ్రతముకలవాడై కర్మమాచరించువాడు పవిత్రమైన హృదయము కలవాడై ధర్మముతో కూడినవాడై విష్ణులోకమున కరుగును.

నగ్లాని ర్న జరా తస్య నమోహో రోగ ఏవచ,

భుజాష్టాదశ జాయన్తే ధన్వీ ఖడ్గీ శరీ గదీ. 6

అతనికి అలసత, ముసలితనము, మతిచంచలత, రోగము అనునవి కలుగవు. విండ్లు, ఖడ్గములు, శరములు, గదలు గల పదునెనిమిది భుజములు కలవాడగును.

తేషాం ప్యుష్టిం ప్రవక్ష్యామి మమ కర్మసముత్థితామ్‌,

షష్టి వర్షసహస్రాణి షష్టివర్షశతాని చ,

మమార్చన విధిం కృత్వా మమలోకే మహీయతే. 7

నాసంబంధమగు ఈ కర్మము వలన కలుగు ప్రయోజనము చెప్పెదను. ఈ విధముగా నా అర్చనవిధిచేసినవాడు, అరువదివేల ఆరువందల సంవత్సరములు, నాలోకమున ప్రతిష్ఠపొందును.

దుఃఖ మేవ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

ఉచితే నోపచారేణ దుఃఖమోక్ష వినాశనమ్‌. 8

వసుంధరా! ఇప్పుడు దుఃఖమును గూర్చిచెప్పెదను. తగు విధములగు ఉపచారములతో పోగొట్టుకొనదగు దుఃఖములెట్టివో వివరింతును.

అహంకారవృతో నిత్యం నరోమోహేన చావృతః,

యే మాం నైవ ప్రపద్యన్తే తతో దుఃఖతరం ను కిమ్‌. 9

ఎల్లప్పుడు అహంకారము పైకొనగా మోహము చుట్టుకొనగా నన్ను శరణు పొందకుండుటకంటె మిక్కిలి దుఃఖ మే ముండును?

సర్వాశీ సర్వవిక్రేతా నమస్కారవివర్జితః,

యే చ మాం నప్రపద్యన్తే తతో దుఃఖతరంను కిమ్‌. 10

అన్నియుతినువాడు, అన్నింటిని అమ్మువాడు, నమస్కారము మానినవాడునై నన్ను శరణు పొందనివాడు పొందు దుఃఖము కంటె మించినదేమి కలదు?

సర్వాన్నానితు సిద్ధాని పాకభేదం తు కారయేత్‌,

నవైశ్వదేవా నాశ్నన్తి తతో దుఃఖతరం తు కిమ్‌? 11

పెక్కువిధములతో పాకములతో అన్నితీరులగు అన్నము లను సిద్ధపరచుకొని వైశ్వదేవము చేయక, తాము తినకుండుటకంటె మించిన దుఃఖ మేది?

ప్రాప్తకాలే వైశ్వదేవే దృష్టమతిథి మాగతమ్‌,

అదత్వా తస్య యోభుంక్తే తతో దుఃఖతరంను కిమ్‌. 12

వైశ్వదేవ సమయమున కానవచ్చిన అతిథికి పెట్టక తినువాడు పొందు దుఃఖముకంటె మించినదేది?

అసంతుష్టశ్చ పైశూన్యే పరదారాభిమర్మకః,

పరోపతాపీ మన్దాత్మా తతో దుఃఖతరం నుకిమ్‌? 13

తృప్తినందడు, లోభమునందే నిలుచును. పరులభార్యలను తాకుచుండును. ఇతరులను బాధించుచుండును. బుద్ధిలేని వాడగును. దీనికి మించిన దుఃఖ మేది?

అకృత్వా పుష్కలం కర్మ గృహే సంపసతే నరః,

మృత్యుకాలవశం ప్రాప్త స్తతో దుఃఖతరం ను కిమ్‌ 14

ఇంటిలో నివసించుచు పుష్కలముగా మంచిపనులు చేయక చావుదాపురించినపుడు పొందు దుఃఖముకంటె మించిన దేది?

హస్త్య శ్వరథయానాని గచ్చమానాని పశ్యతి,

న చేత్‌ తస్యాగ్రతః పృష్ఠే తతో దుఃఖ తరంను కిమ్‌. 15

ఒకయేనుగుగాని, గుఱ్ఱముగాని, వాహనముగాని తనకు ముందు వెనుకలుగా పోవుచుండుటను చూడకుండుట కంటె మించిన దుఃఖమేది?

అశ్నన్తి పిశితం కేచిత్‌ ఘృతశాలిసమన్వితమ్‌,

శుష్కాన్నం కేచి దశ్నన్తి తతో దుఃఖతరం సుకిమ్‌. 16

కొందరు నెయ్యి, మంచిధాన్యముతో అలరారు భోజనము మాంసముతో పాటు తినుచుండగా కొందరు సారములేని కూడు తినుచుందురు. అంతకంటె మిగిలిన దుఃఖమేది?

వరవస్త్రవృతాం శయ్యాం సమాసేవన్తి భూషితామ్‌,

కేచిత్‌ తృణషు శయతే తతో దుఃఖతరం ను కిమ్‌. 17

కొందరు మేలిమి వస్త్రములు, భూషణములుగల హంస తూలికాత్పములపై నిద్రించుచుండగా కొందరు గడ్డిపరకలపై వ్రాలియుందురు - అంతకంటె దుఃఖమేముండును?

సురూపో దృశ్యతే కశ్చిత్‌ పురుష శ్చాత్మకర్మభిః,

కేచిద్‌ విరూపా దృశ్యన్తే తతో దుఃఖతరం ను కిమ్‌. 18

ఒకనరుడు తనపుణ్యకర్మములచేత పరమసుందర రూపముకలవాడై యొప్పారును. కొందరు వికృతాకారములతో కానవత్తురు. అంతకుమించిన దుఃఖమేది?

విద్వాన్‌ కృతీ గుణజ్ఞశ్చ సర్వశాస్త్ర విశారదః,

కేచి న్మూకాశ్చ దృశ్యన్తే తతో దుఃఖతరంను కిమ్‌. 19

విద్వాంసుడు, ప్రయోజనమును సాధించువాడు, గుణము లెరిగినవాడు, సర్వశాస్త్రములలో ఆరితేరినవాడు నై ఒకడుండగా కొందరు మూగివారై కానవత్తురు. దానికి మించిన దుఃఖమేది?

విద్యమానే ధనే కేచిత్‌ కృపణా భోగవర్జితాః,

దరిద్రో జాయతే దాతా తత్ర దుఃఖతరంను కిమ్‌. 20

ధనమున్నను కొందరు పిసినిగొట్టు లై భోగములకు దూరమగుదురు. దాత దరిద్రుడగుచుండును. ఇంతకంటె దుఃఖమేది?

పురుషస్యద్వయే భార్యే తాభ్యాం చైకపుమాంస్తదా,

ఏకా పి దుర్భగా తత్ర తతో దుఃఖతరం నుకిమ్‌. 21

ఇద్దరుభార్యలు, ఒక్కపురుషుడు. వారిలో ఒకతె నికృష్ట అంతకంటె దుఃఖమేమి?

లబ్ధ్వాతు మానుషీం సంజ్ఞాం పంచభూతసమన్వితామ్‌,

మామేవ న ప్రపద్యన్తే తతో దుఃఖతరం ను కిమ్‌. 22

పంచభూతములతో ఏర్పడిన మనుష్యత్వమనుస్థితిని పొందియు నన్ను శరణుకోరరు. ఇంతకు మించి దుఃఖమేది?

లబ్ధ్వా బ్రాహ్మనభావంతు వర్ణానా ముత్తమం ధరే,

పాపకర్మరతో యః స్యాత్‌ తత్ర దుఃఖతరంనుకిమ్‌. 23

అన్నివర్ణములలో ఉత్తమమైన బ్రాహ్మణభావమును పొంది పాపకర్మములందు ఆసక్తి కలిగియుండుటకంటె మించినదుఃఖమేది?

ఏతత్‌ తే కథితం భ##ద్రే దుఃఖకర్మవినిశ్చయమ్‌,

సర్వభూతహితార్థాయ యత్త్వయా పరిపృచ్ఛితమ్‌. 24

మంచిదానా! ఇట్లు నన్ను నీవడిన దుఃఖ కర్మముల నిశ్చయమును గూర్చి సర్వభూతముల హితమును కోరి చెప్పతిని.

యచ్చ మాం పృచ్ఛసే భ##ద్రే శుభం కీదృశ ముచ్యతే,

తచ్ఛ్రుణుష్వానవద్యాంగి మమ కర్మ వినిశ్చయమ్‌. 25

ఓ నిర్మలాంగీ! శుభకర్మ మెట్టిదని నన్నడిగితివి. చెప్పు చున్నాను. నేను చేయు కర్మనిర్ణయమును వినుము.

కృత్వా తు విపులం కర్మ మద్భక్తేషు నివేదయేత్‌,

యస్య బుద్ధ్యా చ జాయేత స సుఖాయోపపద్యతే. 26

విస్తృతమైన కర్మమునొనరించి నాభక్తులయందు నివేదింప వలయునను బుద్ధి ఎవనికి కలుగునో వాడు సుఖమును పొందును.

మా మేవ మర్చనంకృత్వా తత్ర ప్రాపణ ముత్తమమ్‌,

శేష మన్నం సమశ్నాతి తతః సౌఖ్యతరం నుకిమ్‌ 27

నన్నే అర్చించి అందు నివేదించిన ఉత్తమమగు మిగిలిన అన్నమును భుజించుట కంటె మించిన సుఖమేది?

త్రికాలం యే ప్రపద్యన్తే మామేచ చ వసుంధరే,

కృత్వా సాయాహ్నికం కర్మ తతః సౌఖ్యతరం నుకిమ్‌. 28

మూడుకాలములలో నన్నే శరణు పొంది సాయంకాలము చేయు సంధ్యావందనముచేయుట కంటె సుఖమేది?

దేవతాతిథి మర్త్యానాం దత్వా చాన్నం వసుంధరే,

పశ్చాత్‌ స వై సమశ్నాతి తతః సౌఖ్యతరంను కిమ్‌. 29

దేవతలకు, అతిథులకు, మనుజులకు అన్నమొసగి మిగిలిన అన్నమును తరువాత తినువానికంటె సుఖవంతుడెవ్వడు?

ప్రవిష్ట స్త్వతిథిర్యస్య నిరాశో యన్న గచ్ఛతి,

యేన కేనచిద్తత్తేన తతః సౌఖ్యతరంను కిమ్‌. 30

తనయింటికి అతిథిరాగా ఏదో కొంత ఆతనికిచ్చి ఆతనిని నిరాశునిగా పంపకుండుట కంటె సౌఖ్యతరమేముండును?

మాసి మాస్యేకదిపస మమావాస్యేతి యోచ్యతే,

పితరో యస్య తృప్యన్తి తతః సౌఖ్యతరంను కిమ్‌. 31

నెల నెల అమావాస్యనాడు ఎవని పితరులు తర్పణములు పొందుదురో అంతకుమించిన సుఖమేమి కలదు?

భోజనేషు ప్రపన్నేషు యవాన్నం యః ప్రయచ్ఛతి,

అభిన్నముఖరాగేణ తతః సౌఖ్యతరంను కిమ్‌? 32

భోజనములకు వచ్చినవారికి ముఖములో ఏ భేదము లేని అనురాగభావముతో యవాన్న మిడుటకంటె సౌఖ్యము ఏముండును?

ఉభయో రపి భార్యాసు యస్య బుద్ధి ర్న నశ్యతి,

సమం పశ్యతి యో దేవి తతః సౌఖ్యతరం సుకిమ్‌. 33

ఇద్దరు, లేక ఇంకను మించిన సంఖ్యతో భార్యలున్నపుడు బుద్ధి నశింపక సమముగా ఎవడు చూడగలడో అంతకు మించిన సుఖమేముండును?

అహింసనం తు కుర్వీత విశుద్ధే నాంతరాత్మనా,

అహింసోపరతః శుద్ధః ససుఖా యోపపద్యతే. 34

విశుద్ధమగు అంతరాత్మతో అహింసనమును పాటింప వలయును. అట్లు అహింసచే ఆనందపడు శుద్ధుడు సుఖము పొందును.

పరభార్యాసు రూపాసు మనో దృష్ట్వా నచాల్యతే,

యస్య చిత్తం నగచ్ఛేత తతః సౌఖ్యతరం నుకిమ్‌. 35

సుందరరూపముగల ఇతరులభార్యలను చూచి ఎవని మనస్సు చలింపదో, ఎవనిమనస్సు వారియందు ప్రవర్తింపదో వానికంటె సుఖము కలవాడెవ్వడు?

మౌక్తికాదీని రత్నాని తథైవ కనకాదయః,

లోష్ఠవత్‌ పశ్యతే యస్తు తతః సౌఖ్యతరంను కిమ్‌. 36

ముత్యములు, రత్నములు, సువర్ణాభరణములు మొదలగు వానిని మట్టిముద్దలవలె చూడగలిగినదానికంటె మించిన సుఖమేది?

ముదితే చాశ్వనాగేన్ద్రే ఉభేసైన్యే పథి స్థితే,

యస్తు ప్రాణాన్‌ ప్రముచ్యేత తతః సౌఖ్యతరంను కిమ్‌. 37

గుఱ్ఱములు, ఏనుగులు గల రెండుసైన్యములు తనదారి యందు ఆనందముతో నుండగా ప్రాణములు కోల్పోయిన వారు పొందుసుఖము కంటె మించినది ఏమికలదు?

లబ్ధేన చాప్యలబ్ధేన కుత్సితం కర్మవర్జితమ్‌,

యస్తు జీవతి సంతుష్టః ససుఖాయోపపద్యతే. 38

కుత్సితమైన పనిని చేపట్టక లాభనష్టములకు వగవక సంతృప్తితో జీవించుటకంటె మించినసుఖమేముండును?

భర్తుస్తు వై వ్రతం స్త్రీణా మేవ మేవ వసుంధరే,

యేన తుష్యతి భర్తారం తతస్సౌఖ్యతరం నుకిమ్‌. 39

వసుంధరా! స్త్రీల విషయములలో భర్తకిదియే వ్రతము. తనవలన ఆమె సంతోషము పొందవలయును. ఇంతకంటె సుఖమేమి?

విద్యతే విభ##వేనాపి పురుషో యస్తు పణ్డితః,

నిగృహీ తేన్ధ్రియః పఞ్చ తత్ర సౌఖ్యతరం నుకిమ్‌. 40

ఐశ్వర్యము సమగ్రముగానుండినను పండితుడై పురుషుడు అయిదు ఇంద్రియములను నిలువరించి యుండువాడైనచో అంతకంటె సుఖమేముండును?

సహతే చావమానంతు వ్యసనే నతు దుర్మనాః,

యుస్యేదం విదితం సర్వం తతః సౌఖ్యతరం నుకిమ్‌. 41

అవమానమును సహించును. కష్టమునందు మనసు వికలముకాదు. ఇట్టి స్పష్టముగాతెలిసిన ప్రవర్తన కలవానికంటె సుఖవంతుడెవ్వడు?

అకామో వా సకామో వా మమ క్షేత్రే వసుంధరే,

యస్తు ప్రాణాన్‌ ప్రముచ్యేత తతః సౌఖ్యతరం నుకిమ్‌ 42

కోరియో కోరకయో నాపుణ్యస్థలమున ప్రాణము విడుచుట కంటె మించిన సుఖము ఏమండును?

మాతరం పితరం చైవ యః సదా పూజయే న్నరః,

దేవతే వ సదా పశ్యేత్‌ తతః సౌఖ్యతరం సుకిమ్‌. 43

తల్లిని తండ్రిని దేవతవలె సర్వకాలములలో పూజించుట కంటె మించిన సుఖమేముండును?

ఋతుకాలేచ యో గచ్ఛే న్మాసేమాసేతు మైథునమ్‌,

అనన్యమానసో భూత్వా తతః సౌఖ్యతరం నుకిమ్‌. 44

ప్రతిమాసమునందును ఋతుకాలమునందే మిథున కర్మమును, ఇతరవ్యక్తులందు మనసుపెట్టక, ఆచరించుటకంటె మించినసుఖమేమి కలదు?

ప్రయుక్తః సర్వదేవానాం యో మామేవం ప్రపూజయేత్‌,

తస్యాహం నప్రణశ్యామి స చమే న ప్రణశ్యతి 45

నన్నెట్లు చక్కగా పూజించునో అట్లే సర్వదేవతల యందును శ్రద్ధకలవాడై పూజించువానికి నేను దూరము కాను. ఆతడు నా విషయమున చెడడు.

ఏతత్‌ తే కథితం భ##ద్రే శుభాశుభ వినిశ్చయః,

సర్వలోకహితార్థాయ యన్మాం త్వం పరిపృచ్ఛసి. 46

శుభశీలా! ఈ విధముగా అన్నిలోకముల మేలును గోరి నీవు నన్నడిగిన శుభాశుభముల వినిశ్చయమును నీకెరిగించితివి.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పఞ్చదశాధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపదునైదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters