Varahamahapuranam-1
Chapters
త్రయస్త్రింశ దధిక శతతమో೭ధ్యాయః - నూటముప్పది మూడవ అధ్యాయము శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు చెప్పెను. శృణు తత్త్వేన మే భూమి కథ్యమానం మయా೭నఘే, పురీషం ముచ్యతే యస్తు మమ కర్మ సమాచరన్.
1 భూమీ! నా అర్చనము చేయుచు మలమును విసర్జించు దోషమును గూర్చి నేను చెప్పుచున్నదానిని వినుము. దివ్యం వర్షసహస్రం తు రౌరవే నరకే వసేత్, పురీషం భక్షయేత్ తత్ర మహాదుఃఖ సమన్వితః.
2 అట్టివాడు రౌరవ నరకమున దేవతల వేయియేండ్లు మలము తినుచు మహాదుఃఖము ననుభవించును. ప్రాయశ్చిత్తం వదా మ్యత్ర యేన ముచ్యేత కిల్బిషాత్, మమకర్మ పరిభ్రష్టో విహతేనాన్తరాత్మన.
3 చెడిన బుద్ధితో నా ధర్మమునుండి పరిభ్రష్టుడైనవాడు పాపమునుండి విడివడు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. వినుము. ఏకాం జలమయీం శయ్యా మేకమాకాశ శాయనమ్, ఏవం కృత్వా విధానం తు సో೭పరాధాత్ ప్రముచ్యతే. 4 నీటిలో ఒకదినము, బయలున ఒక దినము నిద్రించి ఈ అపరాధము వలన విడుదల పొందును. ఏతత్ తే కథితం భ##ద్రే పురీషం యః సముత్పృజేత్, మద్భక్తేషు విశాలాక్షి అపరాధ వినిశ్చయః.
5 పూజావిధానసమయమున మలము విసర్జించు నా భక్తుల అపరాధమును, ప్రాయశ్చిత్తమును నీకు తెలియజెప్పితిని. ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రయస్త్రింశ దధిక శతతమోధ్యాయః ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్చాస్త్రమున నూటముప్పది మూడవ అధ్యాయము.