Varahamahapuranam-1
Chapters
ఏకత్రింశో7ధ్యాయః - ముప్పదియొకటవ అధ్యాయము మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు పలికెను. మనోర్నామ మనుత్వంచ యదేతత్ పఠ్యతే కిల, ప్రయోజనవశాద్ విష్ణు రసావేవ తు మూర్తిమాన్. 1 మనువను పేరును, మనువుతనమును గ్రంథములలో కానవచ్చుచున్నది. ఒక ప్రయోజనము కొఱకు విష్ణువే యీ మనువు రూపమును దాల్చెను. యో೭సౌ నారాయణో దేవః పరాత్ పరతరో నృప, తస్య చిన్తా సముత్పన్నా సృష్టిం ప్రతి నరోత్తమ. 2 రాజా! పరముకంటె ఇంకను పరమైన ఈ నారాయణ దేవునకు సృష్టిని గూర్చి ఆలోచన పుట్టెను. సృష్టా చేయం మయా సృష్టిః పాలనీయా మమైవ హ, కర్మకాణ్డం త్వమూర్తేన కర్తుం నైవేహ శక్యతే, తస్మా న్మూర్తిం సృజమ్యేకాం యయా పాల్యమిదం జగత్. 3 ఈ సృష్టిని నేనే చేసితిని. దీనిని నేనే పాలింపవలయును గదా! ఆకారములేని సృష్టితో ఆయా పనులు చేయనలవి కాదు. కావున ఒక మూర్తిని సృజింతును. అది ఈ జగము నెల్ల పాలించును. ఏవం చిన్తయత స్తస్య సత్యాభి ధ్యాయినో నృప, ప్రాక్ సృష్టిజాతం రాజన్ వై మూర్తిమత్ తత్పురో బభౌ. 4 సత్యమునే ధ్యానించు ఆ విష్ణువు ఇట్లు తలపోయుచుండగా మునుపటి సృష్టిసముదాయమంతయు రూపుగొని ఆతని ముందు ప్రకాశించెను. పురోభూతే తత స్తస్మిన్ దేవో నారాయణః స్వయమ్, ప్రవిశన్తం దదర్శాథ త్రైలోక్యం తస్య దేహతః. 5 ఆ సృష్టియంతయు నెదుట నిలిచి యుండగా తన దేహము నుండి మూడులోకములు అందు ప్రవేశించుచుండుటను స్వామి గమనించెను. తతః సస్మార భగవాన్ పరదానం పురాతనమ్, వాగాదీనాం తత స్తుష్టః ప్రాదాత్ తస్య పునర్వరమ్. 6 అంతట ఆ భగవంతుడు మునుపు వాక్కుమొదలగు వానికి తానిచ్చిన వరమును స్మరించెను. దానితో తృప్తిపడి మరల పరమొసగెను. సర్వజ్ఞః సర్వకర్తా త్వం సర్వలోకనమస్కృతః త్రైలోక్యవిశనాచ్చ త్వం భవవిష్ణుః సనాతనః 7 నీవు సర్వమెరిగినవాడవు. సర్వమునకు కర్తవు. సర్వలోకము నీకు మ్రొక్కును. మూడులోకములను ప్రవేశించుటవలన సనాతనుడవగునీవు 'విష్ణువు' అను పేరుగల వాడవగుదువు. దేవానాం సర్వదా కార్యం కర్తవ్యం బ్రహ్మణ స్తథా, సర్వజ్ఞత్వం చ భవతు తవ దేవ నసంశయః. 8 బ్రహ్మదేవుడు ఎల్లవేళల దేవతల కార్యము చేయుచుండ వలయును. ఓదేవా! నీకు సర్వజ్ఞత కలుగుగాక, సందియములేదు ఏవముక్త్వా తతో దేవః ప్రకృతిస్థో బభూవ హ, విష్ణు రప్యధునా పూర్వాం బుద్ధిం సస్మార చ ప్రభుః. 9 ఇట్లు పలికి ఆదేవుడు మరల సహజస్థితికి వచ్చెను. విష్ణువు ఇప్పుడు ఆ పూర్వపు బుద్ధిని స్మరించెను. తదా సంచిన్త్య భగవాన్ యోగనిద్రాం మహాతపాః, తస్యాం సంస్థాప్య భగవానిన్ద్రియార్ధోద్భవాః ప్రజాః, ధ్యాత్వా పరేణ రూపేణ తతః సుష్వాప వైప్రభుః. 10 అప్పుడు గాఢభావనగల ఆభగవానుడు యోగనిద్రను భావించెను. ఇంద్రియవిషయములవలన పుట్టిన నందరను అందు స్థాపించి శ్రేష్ఠమగురూపముతో ధ్యానించి ఆప్రభువు నిదురించెను. తస్య సుప్తస్య జఠరా న్మహత్ పద్మం వినిఃసృతమ్, సప్తద్వీపవతీ పృథ్వీ ససముద్రా సకాననా. 11 అట్లు గాఢనిద్రనొందిన ఆభగవంతుని కడుపునుండి ఒక పెద్ద పద్మము వెలువడెను. అందు ఏడుద్వీపములతో, సముద్రము లతో, అడవులతో నిండిన భూమియంతయు ఏర్పడెను. తస్య రూపస్య విస్తారం పాతాలం నాలసంస్థితమ్, కర్ణికాయాం తథామేరు స్తన్మధ్యే బ్రహ్మణో భవః. 12 ఆ పద్మము రూపము అట్లు విస్తరిల్లెను. పాతాళము కాడయందు నెలకొనెను. దుద్దునందు మేరువు కన్పట్టెను. దానినడుమ బ్రహ్మపుట్టుక ఏర్పడెను. ఏవం దృష్ట్వా పరం తస్య శరీరస్య తు సంభవమ్, ముముచే తచ్ఛరీరస్థో వాయు ర్వాయుం సమంసృజత్. 13 ఆతని శరీరమునుండి పుట్టిన దీనినంతటిని గాంచి ఆ శరీరముననే యున్న వాయువు మరియొక వాయువును సృజించి వెలుపలికి వదలెను. అవిద్యా విజయం చేమం శఙ్ఖరూపేణ ధారయ, అజ్ఞానచ్ఛేదనార్థాయ ఖడ్గం తే೭స్తు సదాకరే. 14 కాలచక్ర మిమం ఘోరం చక్రం త్వం ధారయాచ్యుత, అధర్మ గజ ఘాతార్థం గదాం ధారయ కేశవ. 15 స్వామీ! అజ్ఞానమును జయించుటకై దీనిని శంఖరూపముతో ధరింపుము, అజ్ఞానమును రూపుమాపుటకై నీచేత ఎల్లప్పుడు ఈ ఖడ్గము నిలుచుగాక! ఇదిగో ఈ ఘోరమైన చక్రము కాలచక్రము. అచ్యుతా! అధర్మమనెడు ఏనుగులను మోదుటకై కేశవా! గద గ్రహింపుము. మాలేయం భూతమాతాతే కణ్ఠ తిష్ఠతు సర్వదా, శ్రీవత్సకౌస్తుభౌ చేమౌ చన్ద్రా దిత్యచ్ఛలేన హ. 16 భూతములకు తల్లియగు ఈ మాల ఎల్లవేళల నీమెడలో నిలుచుగాక! ఈ శ్రీవత్సము కౌస్తుభమును చంద్రసూర్యులకు బదులుగా నీ కడ నుండును. మారుత స్తే గతి ర్విర గరుత్మాన్ స చ కీర్తితః, త్రైలోక్యగామినీ దేవీ లక్ష్మీస్తే೭స్తు సదాశ్రయే, ద్వాదశే చ తిథిస్తే೭స్తు కామరూపీ చ జాయతే. 17 వాయువే నీ గమనము. దానిని గరుత్మంతు డందురు. మూడులోకములలో సంచరించు లక్ష్మీదేవి ఎల్లవేళల నిన్నాశ్రయించి యుండును. నీకు ప్రియమైనతిథి ద్వాదశి. అది యిచ్చవచ్చిన రూపుతాల్చిన దగును. ఘృతాశనో భ##వేద్యస్తు ద్వాదశ్యాం త్వత్పరాయణః, సస్వర్గవాపీ భవతు పుమాన్ స్త్రీవా విశేషతః. 18 ద్వాదశితిథియందు నీయందు మనసు నిలిపి నేతి భోజనము చేయు వ్యక్తి స్త్రీయైనను, పురుషుడైనను స్వర్గమునందు నివసించును. ఏష విష్ణు స్తవాఖ్యాతో మూర్తయో దేవదానవాః, హన్తి పాతి శరీరాణి సృజత్యన్తాని చాత్మనః. 19 దేవదానవుల మూర్తలన్నియు. ఈ విష్ణువే. అతడే శరీరములను సృజించును. రక్షించును. సంహరించును. యుగే యుగే సర్వగో೭యం వేదాన్తే పురుషో హ్యసౌ, నహీన బుద్ధ్యా వక్తవ్యో మనుష్యో೭యం కదాచన. 20 ప్రతియుగమున ఈతడే సర్వత్ర వ్యాపించు పరమదైవము వేదాంతమున పురుషుడని ఈతనినే అందురు. హీనబుద్ధితో అతనిని కేవలము మనుష్యుడని యెన్నటికిని పలుకరాదు. య ఏవం శృణుయాత్ సర్గం వైష్ణవం పాపనాశనమ్. స కీర్తి మిహ సంప్రాప్య స్వర్గలోకే మహీయతే. 21 పాపమును పటాపంచలుచేయు ఈ విష్ణుసంబంధమైన సృష్టిని వినువాడు ఇహలోకమున చక్కని కీర్తిపొంది స్వర్గలోకమున శాశ్వతముగా నిలుచును. ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకత్రింశో೭ధ్యాయః ఇది శ్రీ వారహపురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పదియొకటవ అధ్యాయము