Varahamahapuranam-1
Chapters
నవపంచాశో೭ధ్యాయః - ఏబది తొమ్మిదవ అధ్యాయము అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను. అథావిఘ్నకరం రాజన్ కథయామి శృణుష్వ మే, యేన సమ్యక్ కృతేనాపి న విఘ్న ముపజాయతే.
1 రాజా! నీకు అవిఘ్నకరమను వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము. అది చక్కగా చేసినచో విఘ్నము అనునది కలుగదు. చతుర్థ్యాం ఫాల్గునే మాసి గ్రహీతవ్యం వ్రతం త్విదమ్. నక్తాహారేణ రాజేన్ధ్ర తిలాన్నం సారణం స్మృతమ్, తదే వాగ్నౌచ హోతవ్యం బ్రాహ్మణాయ చ తద్భవేత్. 2 రాజా! ఫాల్గునమాసమున చవితినాడు ఈ వ్రతమును చేపట్టవలయును. రాత్రి పూట నువ్వులు కలిపిన భోజనము చేయ వలయును. దానినే హోమముచేసి బ్రాహ్మణునకును ముందు సమర్పింపవలయును. చాతుర్మాస్యం వ్రతం చైతత్ కృత్వా వై పఞ్చయే తథా, సౌవర్ణం గజవక్త్రం తు కృత్వా విప్రాయ దాపయేత్. 3 పాయసైః పంచభిః పాత్రై రుపేతం తు తిలైస్తథా, ఏవం కృత్వా వ్రతం చైతత్ సర్వవిఘ్నై ర్విముచ్యతే. 4 ఈ వ్రతమును కూడ నాలుగుమాసముల కాలము చేయవలయును. అయిదవనెలలో సువర్ణముతో విఘ్నేశ్వరుని ప్రతిమను చేయించి అయిదు పాత్రల యందు నువ్వులతో కూడిన పాయసముతో పాటు దానము చేయవలయును. ఇట్లు ఈ వ్రతమును చేసినవాడు అన్ని విఘ్నములనుండియు విడివడును. హయమేధస్య విఘ్నేతు సంజాతే సగరః పురా, ఏతదేవ చరిత్వా తు హయమేధం సమాప్తవాన్. 5 మునుపు సగరుడు తన అశ్వమేధ యాగమునకు విఘ్నము కలుగగా దీనినే ఆచరించి ఆ యజ్ఞము సమాప్తి చేసికొనెను. తథా రుద్రేణ దేవేన త్రిపురం నిఘ్నతా పురా, ఏత దేవ కృతం తస్మాత్ త్రిపురం తేన పాతితమ్, మయా సముద్రం పిబతా ఏత దేవకృతం వ్రతమ్. 6 అన్యైరపి మహీపాలై రేతదేవ కృతం పురా, తపో೭ర్థిభి ర్జానకృతై ర్నిర్విఘ్నూర్థే పరంతప. 7 త్రిపురాసురులను వధించునపుడు రుద్ర దేవుడు దీనినా చరించియే వారి సంహారము గావించెను. నేనును సముద్రమును త్రావునపుడు ఈ వ్రతము నాచరించితిని. మరియు పెక్కండ్రు రాజులు, తాపసులు, జ్ఞానవంతులు విఘ్నములు లేకుండుటకై ఈ వ్రతమును చేసియున్నారు. శూరాయ ధీరాయ గజాననాయ లంబోదరా యైక దంష్ట్రాయ చైవ, ఏవం పూజ్య స్తద్దినే తత్ పునశ్చ హోమం కుర్యాద్ విఘ్నవినాశ హేతోః. 8 శూరుడు, ధీరుడు, గజముఖుడు, లంబోదరుడు, ఏక దంతుడు అగు దేవునకు నమస్కారము. అనుచు ఆ దినమున పూజింపవలయును. విఘ్నములు నశించుటకై తిరిగి హోమము నాచరించవలయును. అనేక కృతమాత్రేణ సర్వవిఘ్నై ర్విముచ్యతే, వినాయకస్య కృపయా కృతకృత్యో నరో భ##వేత్. 9 ఈ వ్రతమునాచరించిన మాత్రమున నరుడు, నెరవేరిన ప్రయోజనములు కలవాడై వినాయకుని కృపచేత సర్వవిఘ్నముల నుండియు ముక్తుడగును. ఇతి శ్రీ వారాహ పురాణ భగవచ్ఛాస్త్రే నవపంచాశో೭ధ్యాయః ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబది తొమ్మిదవ అధ్యాయము.