Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తవింశుత్యుత్తరశశతతమోధ్యాయః

త్రిపురాసురోపాఖ్యానప్రారమ్భః.

ఋషయః : కథం జగామ భగవా న్పురారత్వం మహేశ్వరః | దదామ స కథం దేవ స్తన్నోవిస్తరతో వద.

పృచ్ఛామ స్త్వా వయం సర్వే బహుమానా త్పునః పునః

త్రైపురంచ యథా దుర్గం మయమాయా వినిర్మితమ్‌ 2

దేవేనై కేషుణా దగ్దం తథా త్వం వద మానద

సుతః : శృణుద్వం త్రైపురం దేవో యథా దాహితవా న్భవః 3

మయోనామ మహామయి మాయానాం జనకోసురః | నిర్జిత స్సతు సజ్ఞ్రౌమే తతాప పరమం తపః 4

తపస్యన్తంతు తం విప్రా దైత్యేన్ద్రోపర్యనుగ్రహాత్‌ | తసై#్యవ కృతముద్దిశ్య తేపతుః పరమం తపః 5

విద్యున్మాలీచ బలవాం స్తారకాక్షస్తు వీర్యవా& | మయతేజ స్సమాక్రన్తౌ తేపతు ర్మయపార్శ్వగౌ 6

లోకా దేవా యథా మూర్తా స్త్రయ స్త్రయ ఇవాగ్నయః | లోకత్రయం తాపయన్త స్తే తేపు ర్ధానవాస్తవః 7

హేమన్తే జలశయ్యను గ్రిష్మే పఞ్చతపా స్తథా | వర్షాసుచ తథా೭೭కాశే క్షపయన్త స్తపఃప్రియాః 8

స(తే)వనా త్ఫలమూలాని స్వాదూనిచ మృదూనిచ | అన్యథా రచితాహారః పంకేనరావృతవల్కలాః9

మగ్నా శ్శైవాలపాశేషు సమలే ష్వమలేషుచ | నిర్మాంసాశ్చ తథా జాతాం కృశా ధమనిసన్తాతాః 10

తేషాం తపఃప్రభావేన నాబభౌ విద్రుమం తథా | నిష్ర్పభంచ జగత్సర్వం మన్దతేజా విభావసుః 11

దహ్యమానేషు లోకేషు త్తైస్త్రీభి ర్దానవాగ్నిభిః | తేషాంమధ్యే జగద్బన్దుః ప్రాదూర్భూతః పితామహః 12

మయాదీనాం వరప్రదానార్థం బ్రహ్మావిర్బావః

తతస్తే లోకకర్తారం తందృష్ట్వా సహసా೭೭గతమ్‌ | స్వయం పితామహం దైత్యా నేము స్తుష్టువురేవచ 13

అథ తా& దానవా న్ర్భహ్మా తపాసా తపన ప్రభా& | ఉవాచ హర్షపూర్ణాజ్గౌ& హర్షపూర్ణముఖేక్షణః 14

వరదోహం హి వో వత్సా స్తపస్తోషిత ఆగతః | భవతా మీప్సీతం యద్వా నవిచారం తదుచ్యతామ్‌ 15

నూట ఇరువది ఏడవ అధ్యాయము.

త్రిపురాసురోపాఖ్యానము-మాయాదులకు బ్రహ్మవర ప్రాప్తి

(విశేషము: దేవాసుర యుద్దములు మొత్తము పండ్రెండు అని లోగడ నలువది ఏడవ అధ్యాయమున చెప్పబడినది. వానిలో త్రైపుర యుద్దము ఏడవది. మిగిలిన వానిలో వృత్రవధము మాత్రము (పురాణములలో) భాగవతమునందును భారతము నందును (ఇతిహాసమున) వర్ణింపబడినది. మిగిలిన వానిలో పండ్రెండవది లోగడ నలువది ఏడవ అధ్యయములో చెప్పబడినది. నారసింహ వామనవారహామృతమంథన తారకామయాడీ వధాంధకారములును ఈ మత్య్స పురాణమునందే యున్వి. ఈ దేవాసుర సంగ్రామములన్నియు శాస్త్రీయాశాస్త్రీయ చిత్తవృత్తలకును జ్ఞానా జ్ఞానములకును వివేకా వివేకలములకును నడుమ జరిగిన పోరాటములు, వీనిలో చివరకు శాస్త్రీయ చిత్తవృత్తికే గెలుపు కలిగి భగవదుపానముతో ప్రాణులు తరించు మార్గమే పైచేయిగా మిగులుట ఈ దేవాసుర యుద్దముల పరమ తాత్పర్యము. వీని యందు వైదిక సంప్రదాయ తత్త్వములు రహస్యాత్మకములుగ అంతర్నిహితములై యున్నవి. వానిని సంప్రదాయజ్ఞులవలన తెలసికొనదగును. ప్రకృతమీ త్రైపురవధమను దేవాసుర సంగ్రామమున ఉపాసన విధానముల సంకేతము గూఢముగను శాస్త్రీయాశాస్త్రీయ చిత్తవృత్తులపోరు బాహ్యముగను ప్రతిపాదింపబడినది.)

ఋషులు సుతునిట్లడిగిరి: భగవానుడగు మహేశ్వరుడు పురారి ఎట్లయ్యెను? (పుర+అరి =పురములకు శత్రువు) ఆదేవుడు పురములనెట్టు దహించెను? మాకది విస్తరించి చెప్పుము. ఆ కథయందును అది చెప్పగల వాడనని నీయందును గల ఆదరముతో మేము నిన్ను మరలమరల (బ్రతిమాలి) అడుగుచున్నాము. మయమాయా మాకు తెలుపుము. అనగా సూతుడు ఇట్లు చెప్పనారంభించెను: దేవుడగు భవుడు త్రైపుర దుర్గముల నెట్లు దహించెనో తెలిపెద; వినుడు. మహామాయశాలియు మాయలకు జనకుడునగు మయుడను అసురుడుండెను. వాడు దేవతలతో బలవంతుడగు విద్యున్మాలి వీర్యశాలియగు తారకాక్షుడునను అసురులును మయుని యందలి అనుగ్రహబుద్దితో ఆతని వలె (బ్రహ్మ విష్ణు రుద్రులను) దేవత్రయమువలె అగ్నిత్రయమువలె కనబడుచు లోకత్రయమును సంతాపింపజేయుచు ఆ దానవులుతపమాచరించుచుండిరి. వారు తపఃప్రియులై హేమంతమున జలశయ్యలపైనుండి గ్రీష్మమున పంచాగ్ని మధ్యముం దుండి వర్షర్తువనందు నిరావరణమగు ఆకాశము క్రింద నిలిచి గడపుచుండిరి. వారు క్రమముగా వనమునుండి సంపాదించుకొనిన రుచ్యములు మృదువులునగు ఫలములు మూలములు పిమ్మట మరియొక విదమగు (కఠినమగు) అహా వల్కలములు బురదతో కప్పువడియు ఉండుచు శరీరములు చిక్కిపోయి ధనునులతో వ్యాప్తముకాగా మాంసమే లేక తపమాచరించసాగిరి. వారి తపోగ్ని ప్రభావమున పగడమేదియో గుర్తింపరాక పోయెను. సర్వజగత్తును కాంతిహీన బడుచుండ జగద్బందుడగు బ్రహ్మ వారి నడుమ సాక్షాత్కరించెను. అంతట ఆకస్మికముగ స్వయముగ వచ్చిన లోక కర్తయగు పితామహుని చూచి దైత్యులు నమస్కరించి స్తుతించిరి. తపస్సుచే రవివలె వెలుగుచు తనుగాంచి హర్ష పూర్ణముఖ నేత్రులగు ఆ దానవులో హర్ష పూర్ణముఖ నేత్రుడగుచు బ్రహ్మ ఇట్లు పలికెను: నాయనలారా! నేను మీ తపమునకు తుష్టుడనై వరమీయవచ్చితిన. మీ కోరికి ఏమియో సంకోచింపక తెలుపుడు.

ఇత్యేవముచ్యమానస్తు ప్రసన్నం ప్రవితామహమ్‌ | విశ్వకర్మా మయః ప్రాహ ప్రహర్షోత్ఫుల్లలోచనః 16

దేవ! దైతః పురా దేవై స్సజ్గ్రౌమే తారకాహ్వయే | నిర్జితాశ్చ హతా శ్చైవ ని స్త్రింశై రాయుధైరపి 17

దేవై స్సదాతివిద్దాజ్గౌ బాధితా భయవేపితాః | శరణం నైవ జానీయ స్సర్వధా శరణార్థినః 18

సోహం తపఃప్రభావేన భవద్భక్త్యా తథైవచ | ఇచ్చామి దుర్గం తత్కర్తుం యద్దేవైరపి దుర్గమమ్‌ 19

తస్మింశ్చ త్రిపురే దివ్యే మత్కృతే కృతినాంవర | కృత్యానాం జలజనాంచ దోషాణాం వహ్నితేజసామ్‌

దేవప్రహణానాంచ దేవానాంచ ప్రజాపతే | అలజ్ఘనీయం భవతు త్రిపురం యది తే ప్రియమ్‌ 21

విశ్వకర్మా ఇతివోక్త స్సతదా వివ్వకర్మణా | ఉవాచ ప్రహసన్వాక్యం మయ దైత్యగణాధిప 22

సర్వామరత్వం నైవాస్తి నసద్వృత్తస్య దానవ| తస్మాద్దుర్గవిధానంహి క్షణాదపి విధీయాతమ్‌ 23

పితామహవచ శ్వ్రుత్వా ఇత్యేవం దానవో మయః | ప్రాఞ్జలిః పునరప్యాహ బ్రహ్మాణం పద్మసమ్భవమ్‌ 24

యత్త దేకేషుణా దుర్గం సకృన్ముక్తేన నిర్దహేత్‌ l సచ న స్సంయుగే హన్యా దవధ్య శ్శేషతో భ##వేత్‌. 25

ప్రసన్నుడయి ఇట్లు పలికిన బ్రహ్మతో విశ్వకర్మయగు మయుడు ప్రహర్షమున కనులు విప్పార ఇట్లనెను. దేవా! పూర్వము తారకయుద్ధమున ధైత్యులు దేవతల చేతిలో ఓడిరి. ఖడ్గములతో ఆయుధములతో కొట్టి చంపబడిరి. ఎడతెగక మావారి దేహములు దెబ్బతినెను. వారు బాధితులు భయకంపతులునైరి. వారు శరణార్థులైరికాని తమకు శరణమేదియో వారెరుగరైరి. ఇట్టి స్థితిలో నేను తపఃప్రభావము%ు చేతను నీసేవకు ఫలముగాను దేవతలకును చొరరాని దుర్గము నిర్మింపదలచుచున్నాను. నిర్మాతలలో శ్రేష్ఠుడవగు ప్రజాపతీ! నేను నిర్మించు ఆత్రిపురమును దివ్యదుర్గము ఎట్టి కృత్యములకును కృత్య అనెడు ఆభిచారిక శక్తులకును జలదోషములకును అగ్ని తేజస్సులకును దేవతల అయుధములకును దేవతలకును కూడ చేరరానిది కావలయును.

ఈ మాట విని విశ్వ సృష్టిక ర్తయగు బ్రహ్మ నవ్వుచు విశ్వకర్మయగు మయునితో ఇట్లు పలికెను: 'దైత్యగణా ధిపా!మయా! సద్వర్తనములేని వాని కెవ్వనికిని సర్వామరత్వము లభింపదు. కనుక (అమరత్వము కోరక) క్షణకాలమలో దుర్గ నిర్మాణమే చేసికొనుము. బ్రహ్మ మాట విని మయుడు ప్రాంజలియై పద్మసంభవుడగు బ్రహ్మణో మరల ఇట్లనెను:''ఒకే సారి విడిచిన ఒకే బాణముతో మాత్రమే నేను నిర్మించు దుర్గమును కాలవలయును; మేమును చావవలయును. మరియొక విధమున మాకు వధ్యత్వ ముండరాదు.'

ఏవమస్త్వితి చాప్యుక్త్వా మరుం దేవః పితామహః l స్వప్నేలబ్ధో యథార్థౌవస స్తథైవాదర్శనం య¸°. 26

గతే పితామహే దైత్యా పగత్వా వహ్నిరవిప్రభాః l వరదృప్తా బభూవుస్తే తపసాచ మహాబలాః. 27

మరుస్త్వథ మహాబుద్ధి ర్ధానవో ఋషిసత్తమాః l దుర్గం వ్యవసితః కర్తుమితి చిన్తయతే తథా. 28

కథంనామ భ##వేద్దుర్గం తన్మయా త్రిపురం కృతమ్‌ l వత్స్యతే తత్పురం దివ్యం మత్తః కో7న్యోన సంశయః. 29

యథా చైకేషుపాతేన తత్పురం న విహన్యతే l దేవైస్తథా %ొవిధాతవగం మయా మతివిచారణాత్‌. 30

విస్తరో యోజనశత మేకైకస్య పురస్యతు l కార్యం తేషాంచ విష్కమ్భ మేకైకం శతయోజనమ్‌. 31

పుష్యయోగేచ నిర్మాణం పురాణాంచ భవిష్యతి l పుష్యయోగేనచ దివి సమేష్యన్తి

పరస్పరమ్‌. 32

పురాణ్యక ప్రహారేణ స తానిచ హనిష్యతి l ఆయసంతు క్షితితలే రాజతంతు నభస్థ్సలే. 33

రాజతస్యోపరిష్టాచ్చ సౌవర్ణం భవితా పురమ్‌ l ఏవం త్రిభిః పురై ర్యుక్తం తరిపురం తద్భవిష్యతి. 34

శతయోజన ·విష్కమ్భైరస్తరై స్తద్దురాసదమ్‌ l అట్టాలకై ర్యన్త్రశతఘ్ని భిశ్చ సశక్తిశూలోపలకమ్పనైశ్చ. 35

ద్వారై ర్మహామన్దరమేరు కల్పైః ప్రాకారశృజ్గైశ్చ విరాజమానమ l

సతారకాక్షేణ మయేన గుప్తం ఖస్థసం గుప్తం తటిన్‌ మాలినాచ. 36

కోనామ హన్తుం తరిపురం సమర్థో ముక్త్వా త్రిణత్రం భగవన్త మేకమ్‌.

ఇది శ్రీమత్స్య మహాపురాణ తరిపురోపాఖ్యానే మయాదీనాం బ్రహ్మదత్తవరాది కథనం నామ సప్తవిపశత్యుత్తరశతతమో7ధ్యాయః.

'అట్లే యగుగాక!' అని మయునితో పలికి బ్రహ్మదేవుడు స్వప్నమందు లభించిన ధనమువలె అదృశ్యుడయ్యెను. పితామహుడు ఏగిన తరువాత అగ్ని భాస్కరతేజులగు ఆ రాక్షసులను ఆబనుండి వెడలిరి. నాటినుండి వారు తపముచే మహాబలులగుటతోపాటు వరముచే మదించిరి.

__________________________________________________________________

విస్తారైరస్తరై

ఋషి సత్తములారా! పిమ్మట మహాబుద్ధిశాలియగు ఆ మయుడు దుర్గము నిర్మింప సంకల్పించి ఇటు లాలొచించ సాగెను: నేను తప్ప మరి ఎవరును నివసింప అలవి కాని త్రిపుర దుర్గమును నేను ఎట్లు నిర్మింతును! నేను నామతి విచారణశక్తి నుపయోగించి దేవతలు ఏక బాణపాతముతో దానిని విహతము చేయజాలకుండునట్లు ఆదుర్గమును నింటింపవలయును. ప్రతియొక పురమునకు పోడవు వెదల్పులు ఏకశత యోజనము లుండునట్లు నింటింతును. పుష్యయోగమునందు ఆపురముల నింటించి పుష్యయోగము ననే అవి పంస్పరము కలియునట్లు చేయుదును. పుష్యయోగమున వానిని సమీపించి చేరినవాడు మాత్రమే వానిని ఏకశర ప్రహారముతో కొట్టివేయగలుగను. వానిలో అయోదుర్గము క్షితితలమున రజత దు%్‌గ మంతరిక్షమున సౌవర్ణదుర్గమంతకును మీద ఉండునట్లు ఆ త్రిపుర దు%్‌గము నింటితమగును. శతయోజన విస్తరమగల అంతరములతో అట్టాలకములతో యంత్ర శతఘ్నులతొ శక్తులు శూలములు ఉపలకంపనములు(ఱాలను కదలించు యంత్రములు) మహాద్వారములతో మేరు మందర సదృశ మహాప్రాకారములతో విరాజమానమగుచు ఏరికిని చేరరానిదయి తారకాక్ష మరు విద్యున్మాలులు కాపాడుచుండ ఆ త్రిపుర దుర్గమును భగవానుడగు త్రిణత్రుడు కాక అన్యుడెవ్వడు నశింపజేయగలుగును?

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున మయాదులకు బ్రహ్మవరప్రాప్తియను నూట ఇరువది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters