Sri Matsya Mahapuranam-1    Chapters   

శ్రీ

శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతము

శ్రీ మత్స్య మహాపురాణము

(అనేక శ్రౌతస్మార్త ధర్మసంగ్రహాత్మకము)

ఆంధ్రానువాద సహితము

(ప్రథమ సంపుటము)

అనువాదకులు :

శ్రీ పాతూరి సీతారామాంజనేయులు ఎం. ఏ.,

(తెలుగు-సంస్కృతము)

ప్రకాశకులు :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు-500020.

ప్రథమ ముద్రణము సర్వస్వామ్యములు ప్రకాశకులవి.

1986

ప్రతులు : 2000 కాపీలు మూల్యము : రూ. 81-00

ప్రతులకు : ముద్రణ :

శ్రీవేకంటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌ సహజ ప్రింటర్స్‌,

గురుకృప బాకారాం, ముషీరాబాదు,

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు-500 048

హైదరాబాదు-500 020. ఫోన్‌ : 6 8 0 4 1.

 

మహదాశీర్వచనమ్‌

'ఆమ్నాయ సరస్వతీ' 'వేదభాష్య విశారద' 'వేద భాష్యాలంకార' 'పద్మభూషణ్‌'

శ్రీ ఉప్పులూరి గణపతిశాస్త్రి

వేద పండితులు - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము (State Laureate)

ఆస్థాన విద్వాన్‌ :-తిరుమల తిరుపతి దేవస్థానము - ఆంధ్రప్రదేశ్‌.

సభ్యులు - రెలిజియస్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము.

టెలిఫోన్‌ నం. 822758

ఇం. నం. 10-3-102/1

64-B. తూర్పు మారేడుపల్లి

సికిందరాబాద్‌ - 500 026.

పాతూరి సీతారామాంజనేయులు గారు చాలా గ్రంథములు విమర్శించి అపూర్వ విషయములు వ్రాసినారు.

ఇంతవరకు వీరు వ్రాసిన విషయములు ఎవరును వ్రాసియుండలేదు.

మత్స్య పురాణములో సంక్షేపంగా ఉన్న విషయములను ఛాందోగ్యం మున్నగు అనేక గ్రంథములు విమర్శించి వ్రాసినారు.

దురవగాహములగు విషయములను వ్రాసినారు.

పరమేశ్వరుడు వీరికి ఆయురారోగ్యములు ప్రసాదించుగాక !

23-9-'86 (సం.) ఉ. గ. శాస్త్రి

శ్రీమత్స్య రూప నారాయణ స్తుతి

ప్రళయ పయోధి జలే

ధృతవానసి వేదమ్‌ |

విహిత వహిత్ర చరిత్ర మఖేదమ్‌ |

కేశవ! ధృత మీన శరీర !

జయ జగదీశ ! హరే !

తా. మీనరూపము ధరించిన కేశవా! పూర్వతర కల్పమునందు సృష్టి ప్రక్రియలో బ్రహ్మకు వేదములు సాయముగా ఉండెను. కల్ఫావసానమున అవి ప్రళయ మహాసాగర జలములో అస్తవ్యస్తములయినచో మరల జరుగవలసిన సృష్టిలో బ్రహ్మకు ఈ శబ్దరాశి అందకపోవును. అట్టి చిక్కు రాకుండ నీవు ఈ అవతారము దాల్చితివి. ఓడయందు సరకులు నిలిపి కాపాడినట్లు నీపమునే వానిని నిలిపి అనాయాసముగ కాపాడితివి. ఈ మహాకార్యము నీకు తప్ప మరి ఎవరికి సాధ్యము! జగదీశా! హరీ! నీవు సర్వోత్కృష్టుడవయి వర్ధిల్లుచున్నావు. ఇట్టి నీకు వందనములు.

(జయదేవుడు-గీత గోవింద కావ్యము)

Sri Matsya Mahapuranam-1    Chapters