Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచత్రింశదుత్తరశతతమో7ధ్యాయః.

దేవపరాజితమయదానవానాం దైన్యకథనమ్‌.

సూతః : ప్రమథై స్సమరే భగ్నా సై#్త్రపురాస్తే మయాదయః | వివిశు స్త్రిపురం భీతాః ప్రమథై ర్భగ్నగోపురమ్‌. 1

శీర్ణదంష్ట్రా యథా నాగా భగ్నశృఙ్గా యథా వృషాః | యథా విపక్షా శ్శకునా మేఘాః క్షీణోదకా యథా. 2

మృతప్రాయా స్తథాదైత్యా దైన్యేన వికృతాననాః | బభూవుస్తే విమనసః కథం కార్యం భ##వేదితి. 3

అథ తాన్ల్మానమనస స్తదా తామరసాననః | ఉవాచ దైత్యాన్‌ దైత్యానాం పరమో7ధిపతి ర్మయః. 4

కృత్వాఘోరాణి యుద్ధాని ప్రమథైస్సహ సామరైః | త్రాసయిత్వా సురాన్యుద్ధే ప్రమథా నమరైస్సహ. 5

వ్యిజితప్రథమం దైత్యాః పశ్చాత్తైరపి తాడితాః | ప్రవిష్టా నగరం త్రస్తాః ప్రమథై ర్భృశదుఃఖితాః. 6

*అప్రియంవో మహత్ప్రాప్తం దేవైర్నాస్త్యత్ర సంశయః | వృషాణామివ నో భఙ్గ శ్శృఙ్గభఙ్గసమో7భవత్‌.

అహో కాలస్యహి బల మహో కాలో7తిదుర్జయః | యత్రేదృశస్య దుర్గస్య ఉపరోధో7య మాగతః . 8

ఏవంవదతి దైత్యేన్ద్రే మయే బుద్ధిమతాంవరే | బభూవు ర్నిష్ప్రభా దైత్యా గ్రహా స్సూర్యోదయే యథా. 9

వాపీపాలా స్తతో7భ్యేత్య నభఃకాల ఇవామ్బుదాః | మయమాహు ర్యమప్రఖ్యం ప్రాఞ్జలి ప్రశ్రయాన్వితాః.

నూట ముప్పదియైదవ అధ్యాయము

దేవపరాజితులగు మయాది దానవుల దీనస్థితి.

సూతుడు ఋషులతో ఇట్లు చెప్ప నారంభించెను: ప్రమథుల చేతిలో యుద్ధమున భంగము నందిన మయాది త్రిపురదుర్గ దానవులు భయమంది ప్రమథుల చేతిలో విరిగిన గోపురాదులు గల త్రిపురమును ప్రవేశించిరి. వారెల్లరును కోరలు చిదికిన సర్పములవలెను కొమ్ములు విరిగిన వృషభములవలెను ఱక్కలు పోయిన పక్షులవలెను నీరు లేకుండ పోయిన మేఘములవలెను అయిరి. దైన్యముతో వారి ముఖములు వికృతము లయ్యెను. వారు మృతప్రాయు లయిరి. ఇకమీదట తాము ఏమి చేయపలయునో తోచని వారయిరి. ఇట్లు వాడిన మనస్సులతో నున్న దానవులను చూచి పద్మము వలె వికసితమగు ముఖముగలవాడయి దైన్యములేక దైత్యోత్తముడగు మయుడు ఇట్లు పలికెను: దైత్య దానవులారా! మీరు ప్రమథులతోను దేవతలతోను ఘోర యుద్ధములు చేసితిరి. వానియందు దేవతలను ప్రమథులను భయపెట్టితిరి. మొదట మీరే వారిని గెలిచితిరి. కాని తరువాత వారి చేతిలో ఓడిపోతిరి. ఇపుడు ప్రమథుల చేతిలోనే దెబ్బలు తిని మిగుల దుఃఖ మంది భయపడుచు నగరమును ప్రవేశించితిరి. దేవతల చేతిలో మీకు ఎంతయో దుఃఖము ప్రాప్తించినది. ఇందు ఏ మాత్రమును సందేహము లేదు. మనకు కలిగిన ఈ అవమానము వృషభములకు జరిగిన శృంగభంగము వంటిది. ఈనాడు ఇటువంటి త్రిపురదుర్గమునకే ఇటువంటి ముట్టడి తటస్థించిన దనిన అహో! కాలమహిమ ఎంత యాశ్చర్యకరమయినది! కాలము ఎట్టి(మనవంటి)వారికిని జయింపరానిదనుట ఆశ్చర్యకరమే కదా!

మహాబుద్ధిశాలియగు మయుడు ఇట్లు పలుకుచుండ అది వినుచున్న దైత్యదానవశ్రేష్ఠులు సూర్యోదయము కాగానే గ్రహములవలె కాంతిహీను లయిరి. అదే సమయమున వర్షాకాల మేఘములవంటి నీలకాయులైన వాపీపాలురు వచ్చి వినయము కలవారై దోసిలి యొగ్గి యమునివంటి మయునితో ఇట్లు పలికిరి:

యా సా7మృతరసా గూఢా వాపీ వై నిర్మితాత్వయా | సదేవాసురశార్దూల పీతా కేనాపి సంవృతా. 11

సమాకులోత్పలవనా సమీనాణ్డపఙ్కజా | వాపీయా7ద్య త్వయా సృష్టా మృతసఞ్జీవనాత్మికా. 12

పీతా నో వృషరూపేణ కేనచి ద్దైత్యనాయక | వాపీపాలవచ శ్శ్రుత్వా మయో7సురవరః ప్రబుః. 13

కష్ట మేత త్సకృత్ప్రోచ్య దితిజా నిద మబ్రవీత్‌ | మయా మాయాబలకృతా వాపీ పీతా7సురా యది. 14

వినష్టాఃస్మ నసన్దేహ స్త్రిపురం దానవాగతమ్‌ | నిహతాన్నిహతా& దైత్యా నాజీవయతి దైవతైః. 15

వాపీ;యదిహి సావాపీ పీతాసాపీతవాససా | కో7న్యో మన్మాయయా గుప్తాం వాపీ మమృతదాయినీమ్‌. 16

పాస్యతే విష్ణుమజరం వర్జయిత్వా గదాధరమ్‌ | సుగుహ్యమపి దైత్యానాం నాన్యస్య విదితం యతః. 17

యతో మత్కౌశలం జ్ఞాతం విబుధై స్సర్వతోముఖైః | సమోయం రుచిరోదేశో విద్రుమో విగతాచలః. 18

తే వయం విరథా స్తస్మా ద్బాధన్తే7స్మా న్గణాన్సురాః | తే యూయం యది మన్యధ్వం సాగరోపర్యధిష్టితాః. 19

ప్రమథానాం మహావేగం సహామ హ మనోజవమ్‌ | ఏతేషాం న సమారమ్బా స్తస్మి న్త్సాగరసవ్ల్పువే. 20

నిరుత్సాహా భవిష్యన్తి దుర్గే మార్గం వినా7మరాః | యుధ్యతాం నిఘ్నతాం శత్రూ నహితానాం ద్రవిష్యతామ్‌.

సాగరో7మ్బరసఙ్కాశ శ్శరణం నో భవిష్యతి |

ఎవరికిని ఎరుగరానట్లు అమృతరసపూర్ణమయిన 'అమృతరసా' అను వాపిని నీవు నిర్మించితివి గదా! దేవదానవు లెల్లరలో ఉత్తముడవగు మయా! దాని నెవరో రహస్యముగా త్రావి వేసిరి. అనగా మరికొందరు దానవులు వచ్చి ఇట్లనిరి. మృత సంజీవనశక్తిగల వాపిని నీవు సృజించితివి గదా! దైత్యనాయకా! దాని నెవడో వృషభ రూపమున వచ్చి త్రావెను. ఎడములేక కలువలగుంపులతో మత్స్యములతో పక్షులతో పద్మములతో కూడియుండు దానియందేమియు నీరే లేకుండ పోయినది.

అనగా వాపీపాలురు పలికిన మాటలు విని దైత్యవరుడును ప్రభువును నగు మయుడు 'ఇది ఎంత జరుగరాని బాధాకరమగు విషయము జరిగినది!' అని ఒకమారు పలికి దానవులతో ఇట్లు పలికెను: అసురులారా! నేను నా మాయాబలముతో నిర్మించిన 'అమృతరస' వాపినే ఎవరోత్రావిపోయినారనిన-దానవులారా! మన త్రిపురదుర్గము కూడ లేకుండ పోయినదవియే నిస్సందేహముగ చెప్పవచ్చును. దేవతల చేతిలో ఎన్నిమారులు చచ్చినవారినైనను దైత్య దానవులను మరల మరల ఆజీవింపజేయుచుండిన అమృతరస వాపిని ఎవరో త్రావిరనిన అది ఎవరో కాదు పీతాంబరుడగు విష్ణువే త్రావియుండును. నేను నా మాయతో గుప్తపరచి నిర్మించిన అమృతజలదాయినియగు 'వాపి'ని అజరుడును గదాధరుడును నగు విష్ణువు తప్ప మరి ఎవ్వరు పానము చేయగలరు? ఏలయన మిగుల గూఢముగా నుంచినదైనను దైత్యుల ప్రతియొక విషయమును మరి ఎవ్వరికిని తెలియకున్నను ఆతనికి తప్పక తెలియును. దేవతలు సహజముగా సర్వతోముఖులు కారు; ఐనను వారు సర్వతోముఖులయి ఇది ఎరిగి రనిన అది విష్ణువు పనియే.

ఇదిగో! మన దుర్గము ఇపుడున్న ప్రదేశము చూడుడు-చదునైన బయలు; దీనియందు వృక్షములు లేవు; పర్వతములు లేవు. అందుచేత మనము రథాది చతురంగ బలముండియు లేనివారమయితిమి. అందుచేతనే మనలను ప్రమథులును దేవతలును బాధించగలుగుచున్నారు. కనుక ఇది ఎరిగి మీరు ఇష్టపడినచో మనము సముద్రోపరితలమును మన ఆశ్రయముగా ఏర్పరచుకొందము. అట్లయినచో ప్రమథులు ఎంతగా మనోవేగము గలవారే అయినను వారి వేగమును మనము ఓర్చుకొనగలము. వారు చేయు సంరంభములును ప్రయత్నములును అన్నియు సాగర జలమధ్యమున శక్తిహీనములగును. అమరులును అచటికి వచ్చుటకు మార్గముండదు. కావున వారును నిరుత్సాహులగుదురు. ఏలయన సాగరము ఆకాశమువంటిదే. మనము శత్రువులతో యుద్ధము చేసినను వారిని కొట్టినను తరిమినను సాగరము మనకు ఆశ్రయముగా నుండగా వారు మనలను ఏమియు చేయజాలరు.

త్రిపురైస్సహ దానవానాం సాగరప్రవేశః.

ఇత్యుక్త్వా స మయో దైత్యా& దైత్యానా మధిప స్తదా. 22

త్రిపురేణ య¸°తూర్ణం సాగరం సిన్ధువల్లభమ్‌ | సాగరేశ్వరసఙ్కాశ ముత్పపాత పురంవరమ్‌. 23

అవతస్థుః పురాణ్యవ గోపురాభరణనతు | అపక్రాన్తేథ త్రిపురే త్రిపురారి స్త్రిలోచనః. 24

పితామహ మువాచేదం వేదవాదవిశారదమ్‌ | పితామహ! దృఢం భీతా దానవా భగవ& హి తే. 25

విపులం సాగరంసర్వే దానవాసై#్త్రపురా గతాః | యతఏవహి తే యాతా స్త్రిపురేణతు దానవాః. 26

తతఏవహి తాంస్తూర్ణం ప్రాపయస్వ పితామహ | సింహనాదం తతఃకృత్వా దేవా దేవరథంతదా. 27

పరివార్య యయుర్హృష్టా స్సాయుధాః పశ్చిమోదధిమ్‌ | తతోమరామరగురుం పరివార్య శివం హరమ్‌. 28

అనుయాన్తో యయుస్తూర్ణం సాగరం దానవాలయమ్‌ | అథ చారుపతాకభూషితంవా పటహాడమ్బరశఙ్ఖనాదితమ్‌. 29

త్రిపుర మభిసమీక్ష్య దేవతా విబుధబలాః ప్రణదు ర్యథాఘనాః |

అసురవరపురేపి దారుణ జలధరఇవ మృదఙ్గగహ్వరః. 30

దనుతనయనినాదమిశ్రితః ప్రతినిధిసఙుక్షభితార్ణవోపమమ్‌ |

అథ భువనపతి ర్గతిస్సురాణామరిమృగయాం ప్రతి లబ్ధలుబ్ధబుద్ధిః. 31

త్రిదశగుణపతిం హ్యువాచ శక్రం త్రిపురగతం సహసా నిరీక్ష్య శత్రుమ్‌ |

త్రిదశగణపతే! నిశామయైతత్‌ త్రిపురనికేతన ముత్తమం సురేంద్ర |

యమవరుణకుబేరషణ్ముఖైసై#్తస్సహ గణపైరపి హన్మి తావదేవ. 32

విహితపరబలాభిఘాతభూతం యద్యుదధిమధ్యగతాః పురాణితస్థుః |

ససురగణవృత స్సమర్థ ఈశో హ్యుదధి మగా త్త్రిపురం నిహన్తు మేకః. 33

ఇతిపరిగణయత్‌ దితే స్తనూజా హ్యవతస్థు ర్లవణార్ణవోపరిష్టాత్‌ |

(అ)భిభవతి త్రిపురం సదానవేన్ద్రం శరవర్షె ర్ముసలైశ్చ వజ్రకల్పైః. 34

అహమపి రథవర్య మాశ్రిత స్సురగణవర్య భవామి పృష్ఠతః |

అసురవరవధార్థముద్యతానాం ప్రతివిదధామి సుఖాయవోనఘ. 35

ఇతిభవవచనప్రచోదితో దశశతనయనవపు స్సముద్యతః |

త్రిపురపురజిఘాంసయా హరిః ప్రవికసితామ్బుజలోచనో య¸°. 36

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే త్రిపురసహితదానవానాం సాగర

ప్రవేశాదికథనం నామ పఞ్చిత్రింశదుత్తరశతతమోధ్యాయః.

దైత్యాధిపుడగు మయుడు దానవులతో ఈ విధముగా పలికి త్రిపురదుర్గముతో కూడ సర్వనదీనాధుడగు సముద్రునికడకు పోయెను. సాగరేశ్వర సమీపమునకు ఆ త్రిపురము ఎగిరిపోయెను. త్రిపురములును వాని ఆయా గోపురములును ఇతరాలంకారములును ఆ దుర్గమెగరుటలో ఏమియు చెదరక అట్లే ఉండెను. త్రిపురదుర్గమట్లు తన స్థానమునుండి తొలగిపోవుటచూచి త్రిపురారియు త్రిలోచనుడునునగు శివుడు వేదవాదమునందు నిపుణుడగు బ్రహ్మ దేవునితో నిట్లు పలికెను. భగవన్‌! పితామహా! దానవులందరును చాల ఎక్కువగా భయమందిరి. అందుచే త్రిపుర వాసులగు దానవులెల్లరు విపులమగు మహాసముద్రములోనికి వెళ్ళినారు. కావున నీవు శీఘ్రమే మనరథమునక్కడకు చేర్చుము. అనగా వెంటనే మహాదేవ రథమును చుట్టుముట్టి దేవతలందరును సాయుధులై హర్షముతో పశ్చిమ సముద్రమునకు పోయిరి. (దీనినిబట్టి దానవులు తమ త్రిపురదుర్గముతో కూడ పశ్చిమ సముద్రములోనికి పోయిరని తెలియును. ఇది ఈనాటి అరేబియా సముద్రమే.) అంతట అసురులందరును అమరులకు గురుడు (తండ్రి-రక్షకుడు) అగు శుభకరుడగు హరుని పరివారించి అతనిని అనుసరించి త్వరితముగా దానవులకు ఆశ్రయమగు సాగర ప్రదేశమునకు పోయిరి. మనోహరములగు పతాకలతో అలంకృతములయి పటహముల ఆడంబరములతో నిండినదియు శంఖముల ధ్వనులతో పూరితమునునగు త్రిపురదుర్గము కనబడగానే దేవతలును దేవతా సైనికజనులును మేఘములవలె గర్జన ధ్వనులు చేయసాగిరి. వెలుపల దేవతల విషయము ఇట్లుండ త్రిపురదుర్గమునందును దారుణములగు మృదంగధ్వనులు గంభీరమయి మేఘధ్వనులవలె వినబడుచుండ అవి దానవుల ధ్వనులతో మిశ్రితమయి సముద్ర ధ్వనితో సమానమయి వినబడుచు ఆ త్రిపురదుర్గము సముద్రమునకు ప్రతినిధియేయో యనిపించుచుండెను.

అంతట సకల భువనాధిపతియు సురలకు గతియునగు హరుడు శత్రువులనెడు మృగములను వేటాడవలయునను లోభముగల లుబ్ధకుని (వేటగాని) వంటి బుద్ధి కలిగినవాడై దేవశత్రువులగు త్రైపుర దానవులు బలవంతులయి జల మధ్యగతమయిన త్రిపుర దుర్గమునందుండుట చూచి దేవగణాధిపతియగు ఇంద్రునితో ఇట్లు పలికెను: దేవేంద్రా! ఇటు చూడుము; త్రిపురదుర్గమను ఈ దానవపురమెంత ఉత్తమముగా నున్నదో చూడుము. ఏమయిన నాకేమి లెక్క? యమ వరుణ కుబేర షణ్ముఖులును ప్రమథగణాధిపతులును నాకు తోడు పడగా అంతటి దానిని గూడ నాశము చేయుదును. పరబలముల నభిహతము చేయు ఏప్రదేశమున ఈ త్రిపురదుర్గమున్నదో అట్టి సముద్రదేశమునకు పోవుదము పదండు-'భవుడగు శివుడు త్రైలోక్యమను రథమును ఆరోహించి తాను కడు సమర్థుడు గావున త్రిపుర దుర్గమును మరల ముట్టడించదలచి సముద్రముకడకు వచ్చును'.

అని ఇట్లు జరుగునని ఊహించి దైత్యులు లవణ సముద్రపు పైభాగమునందు దుర్గమును నిలుపుకొని యున్నారు. కనుక మీరు వారిని లెక్కపెట్టక దానవేంద్ర సహితముగా త్రిపుర దుర్గమును శరవర్షములతో ముసల వజ్రాఘాతములతో ముట్టడిచేయుడు. నేనును నారథవరమునారోహించి సురేంద్రా! మీ వెనుకనే వచ్చుచుందును. అసురవరులను వధించుటకు ఉద్యమించిన వారికి ఏమేమి చేయవలయునో ఆ సహాయమంతయు చేయుదును.

ఇట్లు అనిన శివుని మాటలప్రేరణతో ఇంద్రుడు సన్నద్ధుడై త్రిపురదుర్గమును నాశ మొందించు తలంపుతో కడు వికసించిన లోచన పద్మములతో ముందునకు సాగిపోయెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున హరి అమృతవాపీపానము చేయుట-త్రిపుర దానవులు సముద్రము ప్రవేశించుట-హరుడు అటకు పోవుట-అను నూట ముప్పది యైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters