Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వాత్రింశో7ధ్యాయః.

శర్మిష్ఠాదేవయాన్యోః పుత్త్రవిషయకసంల్లాపః.

శౌనకః :

 శ్రుత్వా కుమారం జాతంతు దేవయానీ శుచిస్మితా చిన్తయామాస దుఃఖార్తా శర్మిష్ఠాంపతి భారత. 1

తతో7భిగమ్య శర్మిష్ఠాం దేవయాన్యబ్రవీదిదమ్‌ |

దేవయానీ : కిమిదం వృజినం సుభ్రూః కృతం తే కామలుబ్ధయా. 2

స మయా నువరః కామం ప్రార్థితో ధర్మ సంహితమ్‌. 3

నాహ మన్యాయతః కామ మాచరామి శుచిస్మితే | తస్మాదృ షే ర్మమాపత్య మితి సత్యం బ్రవీమి తే. 4

దేవయానీ : శోభనం భీరు సత్యం చే దథ సంజ్ఞాయతే ద్విజః |

గోత్రనామాభిజనత శ్శ్రోతు మిచ్ఛామి తం ద్విజమ్‌. 5

శర్మిష్ఠా : ఓజసా తేజసా చైవ దీప్యమానం రవిం యథా|తందృష్ట్వా మమ సంప్రష్టుం శ క్తి ర్నాసీ చ్ఛుచిస్మితే.

దేవయానీ : యద్యేత దేవం శర్మిష్ఠే న మన్యు ర్విద్యతే మమ |

అపత్యం యది తే లబ్ధం జ్యేష్ఠం శ్రేష్ఠాత్తు వై ద్విజాత్‌. 7

శౌనకః : అన్యోన్యమేవ ముక్త్వాచ సమ్ప్రహస్యచ తే మిథః | జగామ భార్గవీ వేశ్మ తథ్యమి త్యభిజానతీ.

యయాతి ర్దేవయాన్యాంతు పుత్త్రావజన యన్నృప | యదుంచ తుర్వసుంచైన శక్రవిష్ణూ ఇవాపరౌ. 9

తస్మాదేవతు రాజర్షే శ్శర్మిష్ఠా వార్షపర్వణీ | ద్రుహ్యుం చానుంచ పూరుంచ త్రీన్కుమారా నజీజనత్‌. 10

తతః కాలే తు కస్మింశ్చి ద్దేవయానీ శుచిస్మితా | యయాతిసహితా రాజ న్జగామ రహితం వనమ్‌. 11

దదర్శచ తదా తత్ర కుమారా న్దేవరూపిణః | క్రీడమానా న్ఛుచీ న్ఛుద్దా న్విస్మితా చేద మబ్రవీత్‌. 12

దేవయానీ : కసై#్యతే దారకా రాజ న్దేవపుత్త్రోపమా శ్శుభాః| వర్చసా రూపతశ్చైవ దృశ్యన్తే సదృశా స్తవ.

శౌనకః : ఏవం పృష్ట్వాతు రాజానం కుమారా న్పర్యపృచ్ఛత |

కిం నామధేయం గోత్రం వః పుత్త్రకాః కస్య పణ్డితాః. 14

విబ్రూత మే యథా తథ్యం శ్రోతు మిచ్ఛామి తత్త్వహమ్‌ |

తే7దర్శయ న్ప్రదేశిన్యా త మేవ నృపసత్తమమ్‌. 15

శర్మిష్ఠాం మాతరం చైవ తస్యా ఊచుశ్చ దారకాః |

ముప్పది రెండవ యధ్యాయము

శర్మిష్ఠా దేవయానుల సంభాషణము-యయాతికి శుక్రశాపము

ఎప్పుడును పవిత్రమగు చిరునవ్వుతో ఉండెడి దేవయాని శర్మిష్ఠకు కుమారుడు కలిగెనని విని దుఃఖముతో ఆర్తురాలయి శర్మిష్ఠ విషయమున ఏమేయో ఆలోచించెను. తరువాత ఆమె శర్మిష్ఠ ఉన్నచోటికి పోయి ఆమెతో ఇట్లు పలికెను. ''చక్కని కనుబొమలుకల సుందరీ! నీవు కామ సుఖమునకు ఆసపడి ఎటువంటి పాపము చేసితివి!'' శర్మిష్ఠ: ''ధర్మాత్ముడును వేదపారంగతుడును కోరిన వరము లేవయిన ఈయగలవాడును అగు ఋషియొకడు ఇక్కడకు వచ్చెను. నేనతనిని ధర్మమునకు విరుద్ధము కాని కోరికను వేడితిని. శుచిస్మితా! నేను న్యాయవిరుద్ధమగు ఏకామపర మగు పనిని చేయుదానను కాను. ఆ ఋషివలననే నాకీ సంతానము కలిగినది. నేను నీకు సత్యమునే చెప్పుచున్నాను. (నీవునా ఈ మాటలనమ్మి నిర్మలమగు చిరునవ్వు నవ్వుము.)'' దేవయాని: ''చాల మంచిదే. నీవు భయపడకుము! ఇదే నిజమయినచో ఆ బ్రాహ్మణుని విషయము నీకు బాగుగ తెలిసియున్నచో అతని గోత్రము నామము వంశము అంతయు వినగోరుచున్నాను.'' శర్మిష్ఠ: ''సూర్యునివలెఓజస్సు-తేజస్సు కలిగి ప్రకాశించుచుండుటచే అతనిని చూడగానే నేనతని నవి ఏవియు అడుగజాలకపోయితిని.'' దేవయాని: ''ఇది ఇంతేయైనచో శర్మిష్ఠా! నీ మొదటి సంతానము వర్ణమున శ్రేష్ఠుడగు బ్రాహ్మణుని వలననే కలిగినది అనుచున్నావు కనుక నాకు కోపము ఉండదు.''

శర్మిష్ఠా దేవయానులు ఇట్లు మాటలాడుకొని ఒకరిని చూచి మరొకరు నవ్వుకొనిరి. శర్మిష్ఠ మాటలు నిజమేయను నమ్మికతో దేవయానియును తన గృహమునకు పోయెను.

ఇట్లు యయాతికి దేవయానియందు ఇంద్రుడు విష్ణువువంటి యదుతుర్వసు లను ఇరువురు కుమారులు కలిగిరి. శర్మిష్ఠకు యయాతివలన ద్రుహ్యువు అనువు పూరుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి.

తరువాత ఒకానొక కాలమున శుచిస్మిత యగు దేవయాని యయాతితో కలిసి ఏకాంతోద్యానమునకు పోయెను. ఆమెకు అచ్చట దేవరూపులగు కుమారులు (ముగ్గురు) కనబడిరి. వారు శుచులును శుద్ధులునై యుండిరి. ఆడుకొనుచుండిరి. వారిని చూచి ఆశ్చర్యపడుచు దేవయాని యయాతితో ఇట్లనెను. ''రాజా! ఈ కుమారు లెవ్వరివారు? వీరు దేవకుమారులవలె చక్కగా ప్రకాశించుచున్నారు. వర్చస్సులోను రూపమునందును నిన్ను పోలియున్నారు.'' ఇట్లు రాజు నడిగినపిమ్మట దేవయాని ఆ కుమారులనే ఇట్లడిగెను: ''మీ పేరులేమి? గోత్రము ఏమి? ఎవరి కుమారులు? మీరు పండితులు అన్ని విషయములు బాగుగా ఎరిగినవారు. నేనిది యంతయు వినగోరుచున్నాను. ఉన్నది ఉన్నట్లు వివరించి చెప్పుడు.''

ఆ బాలురు తమ చూపుడు వ్రేలితో ఆ రాజసత్తమునే చూపిరి. శర్మిష్ఠ మా అమ్మ అనియు వారా దేవయానితో చెప్పిరి.

శౌనకః : ఇత్యుక్త్వా సహితా స్తేతు రాజాన ముపచక్రముః. 16

నాభ్యనన్దత తాన్రాజా దేవయాన్యా స్తదా న్తికే | క్రన్దన్త స్తేతు శర్మిష్ఠా మభ్యము ర్బాలకా స్తదా. 17

శ్రుత్వాతు తేషాం బాలానాం సవ్రీడ ఇవ పార్థివః| దృష్ట్వాతు తేషాం బాలానాం ప్రత్యయం పార్థివం ప్రతి.

బుద్ధ్వాచ త త్త్వతో దేవీ శర్మిష్ఠా మిద మబ్రవీత్‌ |

దేవయానీ : మదధీనా సతీ కస్మా దకార్షీ ర్విప్రియం మమ. 19

తమేవాసురధర్మంత్వ మాస్థితా న బిభేషి మామ్‌ | శర్మిష్ఠా:యదుక్త మృషి రిత్యేవం తత్సత్యం చారుహాసిని!

న్యాయతో ధర్మతశ్చైవ చరన్తీ నబిభేమి తే | యది త్వయా వృతో భర్తా వృతేఏవ మయా తదా. 21

సఖీభర్తా హి ధర్మేణ భర్తా భవతి శోభ##నే | పూజ్యా7సి మమ మాన్యాచ జ్యేష్ఠాచ బ్రాహ్మణీ హ్యసి. 22

త్వత్తోహి మే పూజ్యతమో రాజర్షిః కిం న వేత్థ తత్‌ |

శౌనకః : శ్రుత్వా తస్యాస్తు తద్వాక్యం దేవయా న్యబ్రవీ దిదమ్‌. 23

రాజ న్నాద్యేహ వత్స్యామి విప్రియం మే త్వయా కృతమ్‌ |

సహసా7ప్యుత్థితాం శ్యామాం దృష్ట్యా తాం సాశ్రులోచనామ్‌. 24

తూర్ణం సకాశం కావ్యస్య ప్రస్థితాం వ్యధిత స్తదా| అనువవ్రాజ సమ్భ్రాన్తః వృష్ఠత స్సాన్త్వయ న్నృపః.

న్యవర్తత న సా చైవ క్రోధసంర క్తలోచనా | అవిబ్రువన్తీ కిఞ్చిత్సా రాజానం సాశ్రులోచనా. 26

అచిరా దేవ సమ్ప్రాప్తా కావ్యస్యోశనసో7న్తికమ్‌ | సాతు దృష్ట్వైవ పితర మభివాద్యా గ్రతస్థ్సితా. 27

అనన్తరం యయాతిస్తు పూజయామాస భార్గవమ్‌| దేవయానీ: అధర్మేణ జితో ధర్మః ప్రవృత్త మధరో త్తరమ్‌.

శర్మిష్ఠయా నివృత్తా7స్మి దుహిత్రా వృషపర్వణః | త్రయో7స్యాం జనితాః పుత్త్రా రాజ్ఞా తేన యయాతినా.

దుర్భగాయా మమ ద్వౌ తు పుత్త్రౌ తాత బ్రవీమి తే | ధర్మజ్ఞ ఇతి విఖ్యాత ఏష రాజా భృగూర్వహ! 30

అతిక్రా న్తశ్చ మర్యాదాం కావ్యైత త్కథయామి తే.

ఇట్లు పలికి వారందరును రాజు కడకు పోయిరి. కాని తాను దేవయాని ఎదుట ఉండుటచే అతడు వారిని ప్రీతితో అభినందించలేదు. (ముద్దు చేయలేదు.) ఆందుచే అపుడా బాలురు ఏడ్చుచు శర్మిష్ఠ కడకు పోయిరి. బాలుర మాటలు విని ఏడుపు విని రాజు సిగ్గుపడిన వాడువలె అయ్యెను. ఆ బాలురకు రాజు విషయమున గల ప్రత్యయము (విశ్వాసము-ప్రీతి) చూచి వాస్తవ స్థితిని గుర్తించి దేవయాని శర్మిష్ఠతో ఇట్లు పలికెను: ''నీవు నా అధీనమందుండుదాన వయి కూడ నాకు ప్రీతికరము కాని పనిని చేసితి వేల? నీవు నీ స్వాభావికమగు ఆసురధర్మమునే ఆశ్రయించియున్నావు. కాని నాకు భయపడుచున్నావు కావు.'' శర్మిష్ట: ''చారుహాసినీ! 'ఋషి! అని నీతో నేను చెప్పినది నిజమే. న్యాయమును ధర్మమును అనుసరించి నడుచుచున్నాను కావున నేను నీకు భయపడుటలేదు. నీవు భర్తను వరించినపుడే నేనును వరించితిని. స్త్రీకి తన సఖీ భర్త తనకును భర్తయగును. నీవు నాకు పూజ్యవు-మాన్యవు-జ్యేష్ఠురాలవు-బ్రాహ్మణివి. ఈ రాజర్షి నీకంటెను నాకు పూజ్యతముడు. నీకీ మాత్రము తెలియదా?''

శర్మిష్ఠ చెప్పినది విని దేవయాని ఇట్లు పలికెను: ''రాజా! నీవు నాకు ప్రీతికరము కాని పని చేసితివి. నేను ఇక ఇక్కడ ఉండను.'' అని చట్టున లేచి ఆ సుందరి కన్నీరు కార్చుచు శుక్రుని దగ్గరకు పోవుటకై బయలుదేరెను. అది చూచి యయాతి మనస్సులో వ్యథనొందెను. వెంటనే అతడును కళవళ పడుచు ఆమెను బ్రతిమాలుచు ఆమె వెంటనే పోవసాగెను. దేవయాని వెనుకకు మరలలేదు. క్రోధముతో ఎర్రనైన కన్నులతో కన్నీరు కార్చుచు త్రోవలో రాజుతో ఏమియు మారుపలుకక త్వరితముగా కావ్యుడగు ఉశనసుని (శుక్రుని) కడకు చేరెను. ఆమె తండ్రిని దర్శించుచునే అతనకి అభివాదము చేసి అతని ఎదుట నిలువబడెను. తరువాత వెంటనే యయాతియును భార్గవుని నమస్కరించెను. దేవయాని: ''అధర్మము ధర్మమును జయించినది. క్రిందు మీదు-మీదు క్రిందు ఐనది. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ నన్ను వెనుకకు నెట్టివేసినది. ఈ యయాతిరాజువలన ఆమెకు ముగ్గురు కుమారులు కలిగినారు. దుర్భగను (పెనిమిటి అనురాగమునకు నోచుకొననిదానను) అగు నాకు ఇద్దరు కొడుకులు మాత్రమే కలిగినారు. తండ్రీ! నామాట నిజము. భృగు వంశ శ్రేష్ఠుడవు నీవు. ఈ రాజు కూడ ధర్మజ్ఞుడు అని ప్రసిద్ధి పొందినవాడేకదా! తాను అట్టివాడయ్యు ఇంతటి నీకు అల్లుడయ్యును- ఇతడు మర్యాదను అతిక్రమించినాడు. అని నీకు చెప్పవలసివచ్చుచున్నది.''

శుక్రః : భర్మజ్ఞ స్త్వం మహారాజ! యో7ధర్మ మకృథాః ప్రియమ్‌. 31

తస్మా జ్జరా త్వా మచిరా ద్ధర్షయిష్యతి *మానద |

యయాతిః : ఋతుంవై యాచమనాయా భగవ న్త్సత్యచేతసా. 38

దుహితు ర్దానవేన్ద్రస్య ధర్మ మేత త్కృతం మయా | ఋతుంవై యాచమానాయా న దదాతి పుమా న్వృతః.భ్రూణహే త్యుచ్యతే బ్రహ్మ న్త్స చేహ బ్రహ్మవాదిభిః |

ఋతుకామాం ప్రియాం యస్తు గమ్యాం రహసి యాచితః. 34

నోపైతి హి స ధర్మేషు భ్రూణహే త్యు చ్యతే బుధైః| ఇత్యేతాని సమీక్ష్యాహం కారణాని భృగూద్వహ! 35

అధర్మభయసంవిగ్న శ్శర్మిష్ఠా ముపజగ్మివా& | శుక్రః : నన్వహం ప్రత్యవేక్ష్యస్తే మదధీనో7సి పార్థివ. 36

ధర్మలోపే పతత్యేవ మిథ్యా చరిసి పార్థివ | మిథ్యా చరసి ధర్మం త్వం చౌర్యవానసి పార్థివ! 37

శౌనకః : క్రుద్దేనోశనసా శప్తో యయాతి ర్నాహుష స్తదా |

పూర్వం వయః పరిత్యజ్య జరాం సద్యో7న్వపద్యత. 38

యయాతిః : అతృప్తో ¸°వనే తస్యాం దేవయాన్యాం భృగూద్వహ |

ప్రసాదం కురు మే బ్రహ్మ న్జరేయం న విశేత మామ్‌. 39

శుక్రః : నాహం వృథా వదామ్యేత జ్జరాం ప్రాప్తోసి పార్థివ |

జరాం త్వేతాం త్వమన్యసై#్మ సంక్రామయ య ఇచ్ఛతి. 40

యయాతిః : రాజ్యభా క్స భ##వే ద్బ్రహ్మ న్పుణ్యభా క్కీ ర్తిభాక్తథా |

యో మే దద్యా ద్వయః పుత్త్ర స్తద్భవా ననుమన్యతామ్‌. 41

శుక్రః : సఙ్క్రామయిష్యసి జరాం యథేష్టం నహుషాత్మజ |

మా మనుధ్యాయ భావేన న చ పాప మవాప్స్యసి. 42

___________________________________________

*దుర్జయ.

వయో దాస్యతి తే పుత్త్రో య స్స రాజా భవిష్యతి | ఆయుష్మా న్కీర్తిమాంశ్చైవ బహ్వపత్య స్తథైవ చ.

ఇది శ్రీ మత్స్యమహాపురాణ శౌనకశతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతి

చరితే యయాతే ర్జరాప్రా ప్తికథనం నామ ద్వాత్రింశో7ధ్యాయః.

శుక్రుడు: ''మహారాజా! నీవు ధర్మజ్ఞుడవు అయి ఉండియు అధర్మముపై ప్రీతి చూపినావు. కావున త్వరలో నిన్ను ముసలితనము బాధించును. నీవు అభిమానవంతుడవు కదా! దీని కిదే దండనము.'' యయాతి: ''భగవన్‌! నేను సత్యమునందే మనస్సు నిలిపియుండువాడను. నిజమునే చెప్పుచున్నాను. దానవేంద్రుని కూతురు ఋతుఫలమును కోరగా నేను చేసిన ఈ పని ధర్మమే కాని అధర్మము కాదు. 'ఋతు ఫలము ఇమ్మని కోరుచు తానైవచ్చి వరించగా దానిని ఈయని పురుషునకు భ్రూణహత్యా దోషము అంటును.' అని వేదతత్త్వ వే త్తలు (మీవంటి వారే) చెప్పుదురుకదా! (భ్రూణుడు=షడంగములతో కూడ వేదమును అధ్యయనము చేసిన వాడు) 'ఋతుఫలమును కోరినదియును ప్రీతికరముగ ప్రవర్తించు నదియు పొందదగినదియు అగు స్త్రీ ఏకాంతమున తను కోరగా ఆమెను పొందనివాడు భ్రూణహత్యా దోషము పొందు' నని ధర్మశాస్త్రములలో పండితులు చెప్పియున్నారు. భృగువంశ##శ్రేష్ఠా! ఈ మొదలగు హేతువులను బాగుగా పరిశీలించి ఆలోచించి అధర్మమునకు భయపడి నేను శర్మిష్ఠతో కూడితిని.'' శుక్రుడు: ''రాజా! నీవు నా అధీనములోని వాడవు కదా! నా విషయము నీవు ఆలోచించనక్కరలేదా? ధర్మలోపము చేసినవాడు పతితు డగును. అను మాట నిజమే. కాని నీవు మిథ్యా ధర్మమును అనుష్ఠించువాడవు. (నీకు ప్రియమయిన పనిచేసి దానిని ధర్మమని పైకి చూపుచున్నావు.) మనస్సులో ఒకటి పెట్టుకొని చేసిన పనిని పైకి మరి ఒకటిగా చూపుచున్నావు. కనుక నీవు దొంగతనము చేసినవాడ వైనావు.''

నహుష పుత్త్రుడు యయాతి క్రుద్ధుడైన శుక్రుని వలన ఈవిధముగా శాపము పొందినాడు. వెంటనే అతనికి మొదటి వయస్సుపోయి ముసలితనము క్రమ్మినది. యయాతి! ''భృగూద్వహా! నేను ఈ దేవయాని విషయములో ¸°వన సుఖములను పొందుటలో నాకు ఇంకను తృప్తి కలుగలేదు. నన్ను అనుగ్రహించుడు. ఈ ముసలితనము నన్ను క్రమ్మ కుండునట్లు దయ చూపుడు.'' శుక్రుడు: ''నేను పలికిన మాట వ్యర్థముకాదు. రాజా! ఈ జర నిన్ను క్రమ్మనే క్రమ్మినది. ఇష్టపడిన మరొకనికి ఇది నీవు సంక్రమింపచేయవచ్చును.'' యయాతి: ''బ్రాహ్మణోత్తమా! నాకు తన ¸°వనమును ఇచ్చిన కుమారుడు నా రాజ్యమునకును పుణ్యమునకును కీ ర్తికిని పాత్రుడు అగునట్లు తాము అనుమతించ వేడుచున్నాను.'' శుక్రుడు: ''నహుషాత్మజా! నీ ఇష్టము వచ్చినవానికి ఎవ్వనికైనను నీవార్ధకమును సంక్రమింపజేయవచ్చును. భావములో నన్ను నిలుపుకొని నీవు ఈ పని చేసినచో నీకు ఏపాపమును అంటదు. నీకు ¸°వనము ఇచ్చిన కుమారుడే రాజ్యమునకు అధికారియును అయుష్మంతుడును కీ ర్తిమంతుడును బహుసంతతిమంతుడును అగును.''

ఇది శ్రీమత్య్సమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున శర్మిష్ఠా దేవయానీ సంవాదము-యయాతికి శుక్రశాపము అను ముప్పదిరెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters