Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుఃస ప్తతితమో7ధ్యాయః.

కల్యాణస ప్తమీవ్రతమ్‌.

బ్రహ్మా : భగవ& దుఃఖసంసార సాగరోద్ధారకారకమ్‌| కిఞ్చిద్ర్వతం సమాచక్ష్వ స్వర్గారోగ్యఫలప్రదమ్‌. 1

ఈశ్వరః : సౌరధర్మా న్ప్రవక్ష్యామి నామ్నా కల్యాణసప్తమీ | మన్దారస ప్తమీ తద్వ త్ఫలాఢ్యా సాపనాశనీ.

శర్కరాస ప్తమీ పుణ్యా తథా కమలస ప్తమీ | మన్దారస ప్తమీ తద్వ త్స ప్తమీ శుభసప్తమీ. 3

సర్వా7నన్తఫలాః ప్రోక్తా స్సర్వా దేవర్షిపూజితాః | విధాన మాసాం వక్ష్యామి యథావ దనుపూర్వశః. 4

యదాతు శుక్లసప్తమ్యా మాదిత్యస్య దినం భ##వేత్‌ | సాతు కల్యాణినీ నామ విజయా భువి కథ్యతే. 5

ప్రాత ర్గవ్యేవ పయసా స్నాన మస్యాం సమాచరేత్‌ | తత శ్శుక్లామ్బరః పద్మ మక్షతాభిః ప్రకల్పయేత్‌. 6

ప్రాఙ్ముఖో7ష్టదళే మధ్యే తద్వ ద్వృత్తాంచ కర్ణికామ్‌ | పుష్పాక్షతాభి ర్దేవేశం విన్యసే త్సర్వతః క్రమాత్‌.

డెబ్బది నాలుగవ అధ్యాయము

కల్యాణ స ప్తమీ వ్రతము

బ్రాహ్మ ఈశ్వరుని ఇట్లడిగెను. 'భగవన్‌! సంసార సాగర దుఃఖమునుండి ఉద్ధరించు సాధనమగుచు స్వర్గారోగ్య ఫలప్రదమగు వ్రతమేదయిన తెలుపుము.' ఈశ్వరు డిట్లు చెప్పెను: సౌర(సూర్యోపాసం ప్రధానములగు) ధర్మములను చెప్పెదను. వాటి పేరులు-కల్యాణ సప్తమి-విశోక సప్తమి-ఫల సప్తమి-శర్కరా సప్తమి-కమల సప్తమి-మందార సప్తమి-శుభ సప్తమి. ఇవియన్నియు అనంతఫలదములును దేవర్షులచే కూడ పూజితములును. వీటి విధానమును కల్పోక్త ప్రకారమున నామక్రమమున చెప్పెదను.

ఆదిత్య వారముతో కూడిన శుక్ల సప్తమికి కల్యాణ సప్తమియని లోకప్రసిద్ధి. ఈనాటి ఉదయమున గోక్షీర స్నానము చేయవలెను. పిమ్మట తెల్లని స్వచ్ఛ వస్త్రములు ధరించి అక్షతలతో అష్టదళ పద్మము వేయవలెను. దాని నడుమ గుండ్రని కర్ణికను వేయవలెను. ఈ పద్మమునందంతట నిండునట్లు పుష్పములతో అక్షతలతో నారాయణుని ఆకృతి వేయవలెను.

పూర్వేణ తపనాయేతి మార్తాణ్డాయేతి వై తతః | యామ్యే దివాకరాయేతి విధాత్రేతిచ నైరృతే. 8

పశ్చిమే పరుణాయేతి భాస్కరాయేతి చానిలే | సౌమ్యే విక ర్తనాయేతి రవయే చాష్టయే దళే. 9

ఆదావన్తేచ మధ్యేచ నమోస్తు పరమాత్మనే | మన్త్రై రేభి స్సమభ్యర్చ్య నమస్కారా న్తదీపితైః. 10

శుక్లవసై#్త్రః ఫలైర్భక్ష్యై ర్ధూపమాల్యానులేపనైః | స్థండిలే పూజయా ద్భక్త్యా గుడేన లవణన చ. 11

తతో వ్యాహృతిమన్త్రేణ విసృజ్య ద్విజపుఙ్గవా& | శక్త్యా తం పూజయే ద్భక్త్యా గుడక్షీరఘృతాదిభిః. 12

తిలపాత్రం హిరణ్యంచ బ్రాహ్మణాయ నివేదయేత్‌ | ఏవం నియమకృ త్సుప్త్వా ప్రాత రుత్థాయ మానవః.

కృతస్నానజపో విపై#్ర స్సహైవ ఘృతపాయసమ్‌ | భుక్త్వాచ వేదవిదుషే బైడాలవ్రతవర్జితమ్‌. 14

ఘృతపాత్రం సకనకం సోదకుమ్భం నివేదయేత్‌ | ప్రీయతా మత్ర భగవా న్పరమాత్మా దివాకరః. 15

అనేన విధినా సర్వం మాసి మాసి సమాచరేత్‌ | తతస్త్రయోదశే మాసి గాశ్చ దద్యా త్త్రయోదశ. 16

వస్త్రాలఙ్కారసంయుక్తా స్సువర్ణాస్యాః పయస్వినీః | ఏకామపి ప్రదద్యాద్వా విత్తహీనో విమత్సరః. 17

న విత్తశాఠ్యం కుర్వీత విత్తమోహా త్పతత్యధః | అనేన విధినా యస్తు కుక్యా త్కల్యాణస ప్తమీమ్‌. 18

సర్వపాపవినిర్ముక్త స్సూర్యలోకే మహీయతే | ఆయురారోగ్య వైశ్వర్య మన న్త మిహ జాయతే. 19

సర్వపాపహరా నిత్యం సర్వదైవతపూజితా | సర్వదుష్టోపశ మనీ సదాకల్యాణస ప్తమీ. 20

ఇమా మనన్తఫలదాం యస్తు కల్యాణ ప్తమీమ్‌ | శృణోతి పఠతే చేహ సోపి పాపైః ప్రముచ్యతే. 21

ఇతి శ్రీమత్స్యమహాపురాణ కల్యాణసప్తమీవ్రతకథనంనామ

చతుస్సప్తతితమో7ధ్యాయః.

పూర్వస్యాం దిశి తపనాయనమః-ఆగ్నే యతః మార్తాండాయనమః-దక్షిణస్యాం దిశి దివాకరాయనమః-నైరృత్యాం విధాత్రేనమః-పశ్చిమాయాం వరుణాయనమః-వాయవ్యాం భాస్కరాయనమః-ఉత్తరస్యాం వికర్తనాయనమః-ఐశాన్యాం రవయేనమః-ఆదౌ పరమాత్మనేనమః-మధ్యే పరమాత్మనేనమః-అంతే పరమాత్మనేమః-ఈ మంత్రములతోను శుక్లవస్త్రఫల భక్ష్య ధూపమాల్యానులేపనములతో గుడ లవణములతో పరమాత్ముని పూజించవలెను.

పిమ్మట భూః-భువః-సువః-అను వ్యాహృతి మంత్రములతో బ్రాహ్మణులను యథాశక్తిగా భక్తి పూర్వకముగా గుడక్షీర ఘృతాదికముతో పూజించవలెను. తిలపాత్రమును హిరణ్యమును బ్రాహ్మణునకర్పించవలెను. ఈ నియమముల పాటించి వ్రతము జరిపి నిద్రించి ఉదయమున మేలుకని స్నాన జపములాచరించి బ్రాహ్మణులతో కూడ ఘృతపాయసము భుజించవలయును. దంభమునకు కాక నిష్కపట భావముతో వేదవేత్తయగు విప్రునకు ఘృతపాత్రమును ఉదకుంభమును బంగారమును 'దీనిచే పరమాత్ముడగు దివాకర భగవానుడు ప్రీతి చెందుగాక!' అను మంత్రముతో సమర్పించవలయును. ఈ విధముగా ప్రతి మాసమునందును చేయవలయును. పదుమూడవ మాసమున మొగమునందు బంగారు పట్టె వస్త్రాలంకారములు కలిగిన పాడియావులను పదుమూడింటిని దానమీయవలయును. ధనము లేనివాడు ఇతరులతో పోటీపడక ఒక పాడి ఆవునైన ఈయవలయును. ధనము కలవాడు మాత్రము తనకు శ క్తియుండియు ధనలోభముచే తక్కువ ఈయరాదు. విత్త మోహము చూపుటచే అధఃపతితుడగును. ఈ విధానమున కల్యాణ సప్తమీ వ్రతము చేయువాడు సర్వపాప వినిర్ముక్తుడై ఇహమున అనంతములగు ఆయురారోగ్యైశ్వర్యములను పొంది పరమున సూర్యలోకమున పూజితుడగును. ఈ కల్యాణ సప్తమి సదా సర్వపాప హరయును సర్వదేవతా పూజితయును సర్వ దోషోపశమని యునునైనది.

అనంత ఫలప్రదయగు ఈ కల్యాణ సప్తమీ విషయమును వినినను చదివినను పాపముక్తుడగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున కల్యాణ సప్తమీ వ్రతకథనమను డెబ్బది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters