Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రినవతితమో7ద్యాయః.

నవగ్రహస్వరూపకథనమ్‌.

ఈశ్వరః : పద్మాసనః పద్మకరః పద్మ గర్భసమద్యుతిః| సప్తాశ్వ స్స ప్తరజ్జుశ్చ ద్విభుజ స్సవితా రవిః. 1

శ్శ్వేత శ్శ్వేతామ్బరధర శ్శ్వేతాశ్వ శ్శ్వేతభూషణః | గదాపాణి ర్ద్విబాహుశ్చ కర్తవ్యో వరద శ్శశీ. 2

రక్తమాల్యామ్బరధర శ్శక్తిశూలసమన్వితః | చతుర్భుజో మేషగమో వరద స్స్యా ద్ధరాసుతః 3

పీతమాల్యామ్బరధరః కర్ణికారదళద్యుతిః | ఖడ్గచర్మగదాపాణి స్సింహస్థో వరదో బుధః. 4

దేవదైత్య గురూ తద్వ త్పీతశ్వేతౌ చతుర్భుఔ | దణ్డినౌ వరదౌ కార్యౌ సాక్షసూత్రకమణ్డలూ. 5

ఇన్ద్రనీలద్యుతి శ్శూలీ వరదో గృధ్రవాహనః | ప్రాసబాణాసనధరః కర్తవ్యో7ర్కసుతస్సదా. 6

సదా కరాళః ఖడ్గీచ చర్మశూలధర స్తథా | నీల స్సింహాసనస్థశ్చ రాహురత్ర ప్రశస్యతే. 7

ధూమ్రా ద్విబాహవ స్సర్వే గదినో వికృతాననాః | గృధ్రాసనగతా నిత్యం కేతవో నృవరప్రదాః. 8

సర్వే కిరీటినః కార్యా గ్రహా లోకహితావహోః | ద్వ్యఙ్గు లేనోచ్ఛ్రితా స్సర్వే శతమష్టోత్తరా శ్శుభాః. 9

ఇతి శ్రీమత్స్యమహాపురాణ నవగ్రహస్వరూపకథనం నామ

త్రినవతితమో7ధ్యాయః.

తొంబది మూడవ అధ్యాయము.

నవగ్రహ స్వరూపకథనము.

ఈశ్వరుడు నారదునకు నవగ్రహ స్వరూపము ఇట్లు తెలిపెను! రవి పద్మము ఆసనము (పీఠము)గా గలవాడు; చేతులయందు పద్మమునుండును. పద్మపు లోపలి భాగపు కాంతివంటి దేహకాంతికలవాడు. ఏడు గుర్రములు వాహనము అయి వాటి ఏడు త్రాళ్లును చేతులధరించి రెండు భుజములతో ఒప్పారును. చంద్రుడు తెల్లని దేహము వస్త్రముల గుర్రములు భూషణములు కలిగి గదాపాణియై ద్విభుజుడై ఉండును. అంగారకుడు ర క్త మాల్యాంబరధరుడు మేష వాహనుడు చతుర్భుజుడు శ క్తి శూల హస్తుడునై యుండును. బుధుడు పీత (పసుపు పచ్చని) మాల్యాంబర ధరుడు పచ్చగన్నేరు పూరేకుల కాంతివంటి కాంతి కలవాడు ఖడ్గచర్మ(డాలు)గదాపాణి-సింహవాహనుడునై యుండును. గురుశుక్రు లిరువురును చతుర్బుజులు దండాక్ష మాలాకమండలు ధరులు; బృహస్పతి పసపు పచ్చని-శుక్రుడు తెల్లని- దేహకాంతి కలవారు. శని ఇంద్రనీల సమానకాంతి-శూలాయుధము-గృధ్రవాహనము కలిగి-ప్రాసధనువులు ధరించినవాడు. రాహువు భయంకరుడు. ఖడ్గము-డాలు-శూలము ధరించినవాడు-నల్లనివాడు-సింహాసనస్థుడు; కేతువులు ధూమ్ర వర్ణులు-ద్విబాహువులు-గదలు దాల్చినవారు వికృతముఖులు-గృధ్రవాహనులు నయియుండురు. (ఇచట కేతువు ఒకడుగా మాత్రముకాక దూమ కేతువులు మొదలగు అనేక గ్రహములుగా భావనచేసి చెప్పబడినది.) అన్ని గ్రహములను కిరీటములు గలవిగాను రెండు భారతీయాంగుళముల ఎత్తుకలవిగాను నిర్మింప జేయవలెను. 'ఇచట శతమష్టోత్తరాః శుభాః' అనునది సరిగా అవగతముచేసికొనుట కవకాశము లేకున్నది. ప్రతియొక గ్రహమునకు సంబంధించిన మంత్రమును కనిష్ఠ సంఖ్యగా నూట ఎనిమిది మారులైన జపించిన యెడల శుభము కలిగింతురు అని ఆర్థము కావచ్చును.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున నవగ్రహ స్వరూప కథనమను తొంబది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters