Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

ఆహారశుద్ధి

మాంస భక్షణ తగ్గించాలి. మాంస భక్షణ చేయనివారు ఉన్నారు. గుజరాతీ బనియాలు, మార్వాడీలు మొదలగువారు ఉన్నారు. బెంగాల్‌లో మత్స్య భక్షణ ఉన్నప్పటికీ ఏకాదశి రోజున నీళ్ళుకూడా వారు ముట్టుకోరు. ఏకాదశి రోజున బెంగాలీలు మంచి నియమంగా ఉంటారు. వితంతువులు ఏ వర్ణంవారైనా కేశములు ఉంచుకోరు, వంట వేరే చేసుకుంటారు. ఉత్తరాదిన ఎక్కువ, తక్కువ జాతులు భేదం లేకుండా ఉంటారు. మిగతావారు ఎక్కువ జాతి వారైనావారిచేతి భోజనం కూడాతినరు. అంటే వాండ్లు తమ బంధువులు అయితే తప్ప మిగతా సమయాలలో స్వహస్తపాకం చేసుకుంటారు. గోధుమ రొట్టెలను, పూరీలను చేసుకొని కూడా తీసుకుపోతారు. కాబట్టి వంటలు స్వహస్తంగా అందరికి ఉండాలి. లేక బంధువుల సంబంధమైనా అయిఉండాలి. కాని యితరుల వంటలు తినకూడదు. ఎక్కువ తక్కువ జాతులు అనేవి ఏమీలేవు. ఈ విషయంలో బ్రాహ్మణుల యింట్లో నైనా తినరు. పాలతో కాని, నెయ్యితోగాని చేసిన పదార్థములకు అంటులేదు. హోటల్సు కాంటీనులు మన హిందూజాతిని నాశనం చేసినవి. ఉత్తర హిందుస్థానంలో హిందు ధర్మం ఉన్నది, వారలకు శిఖలు ఉన్నాయి, వారు స్వహస్తం చేసుకుంటారు. ఏ జాతివాడు అయినా స్వయం పాకం చేసుకోవాలి. కాబట్టి ఆదివారమైనా పురుషులు స్వయంగా వంటచేసి స్త్రీల బాధ్యత వహించాలి. గోధుమలతో రొట్టె కాల్చుకుని తినాలి. దానికి బాధ ఉండదు. మన సంస్కృతి ఔన్నత్యము నిలబడాలి అంటే మనం ఈవిషయాలు విధిగా పాటించాలి. స్వయంగా వంట చేసుకోడానికి అలవాటు పడాలి. సినిమాలకు వెళ్ళడం తగ్గించాలి. ఆడపిల్లలకు డ్యాన్సు చెప్పించడం మానాలి. ఎవరో యితరుల ఆడవాళ్ళు నటించి నారు అని అనుకొని మనం సినీమాలకు వెడితే అదికూడా తప్పు. మనం ఈ దురాచారాన్ని పోషించిన అభివృద్ధికి దోహదం చేసినట్లు అవుతుంది. కాఫీ, టీలు మాని మజ్జిగ తాగాలి. మాంస భక్షణం తగ్గించాలి. అశోక చక్రం చిహ్నంగా ఉన్న ఈ దేశంలో గోవధవున్నది. అశోక చక్రంలో చిహ్నంగా పెట్టుకొని అహింసా సిద్ధాంతం పాటించే బౌద్ధులు మాంసభక్షణ చేస్తున్నారు. మాంసభక్షణ తగ్గాలి. గోవధపోవాలి. లేకపోతే హాస్యాస్పదంగా ఉంటుంది.

ప్రపంచంలో ఎవరైనా వేదాంతం తెలుసుకోడానికి మన దేశం వస్తారు. అంటేదానినిబట్టి మనందేశం యొక్క సంస్కృతి, గొప్పతనము మనము గ్రహించవలెను. పాశ్చాత్యులలో సిగ్గు అనబడేవారు అంతా మనదేశ సంస్కృతిని మెచ్చుకొను చున్నారు. కాబట్టి సంగీతంవంటి గాంధర్వకళలు తగ్గించుకోవాలి. హోటల్సుకు వెళ్లుట, పిల్లలకు కాన్వెంటు చదువుకు పంపుట మానవలెను. శస్త్రాభ్యాసం, స్వయంగావంటచేసుకోనుట అభ్యాసం చేయాలి.

ఆహారశుద్ధి, పాతివ్రత్యం ఈరెండు శుద్ధిగా వుండాలి. అన్నింటిలోను మనం ఆదర్శంగా ఉండి, మనసంతతివారిని కూడా ఆదర్శంగా ఉండేటట్లు చేయవలెను.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page