ఆపదలను ఎదుర్కొనుట ఎట్లు?
భగవద్గీతకు పరమార్థం ''తస్మాద్యుధ్యస్వ భారత'' అనే వాక్యం, ధర్మయుద్ధం అంటే ఉత్తమ మైన లోకం చేరడానికి, ఆ యుద్ధం ధర్మంగా ఉండాలి. క్షత్రియునికి అటువంటి యుద్ధం దొరకటం చాలా కష్టం. కుంభ##మేల లాంటివి దొరకనివి. దొరికినప్పుడు పుణ్యమునకు ఎట్లాంటి అవకాశమో అట్లాగే ఈ యుద్ధం కూడ ముక్తిని పొందుటకు ఒక మంచి అవకాశం, యుద్ధంలో మనము చంపుతాము. వాళ్ళు చస్తారు - అనేది లేదు, కనుక నీకు ఏడవటానికి కారణం లేదు. అని 'తస్మాత్ యుధ్యస్వభారత' అని యుద్ధం చేయమని పరమాత్మ గీతలో అన్నారు, ఈ ఉద్దేశం అర్జునుడు అంతవానికి జరిగింది.
అయితే మనకు యుద్ధం చేయడం ఎవరికీ తెలియదు, యుద్ధం చేయడం ఇంకొకరి పని అని అనుకునే అలవాటు అయింది. సంగీతం చాలామంది నేర్చుకుంటారు. సినిమాలలో నటన చేయటానికి ఇష్టపడతారు. కాని యుద్ధం అనగానే భయం! ఎవరు వెళతారు.
పరాశక్తి, దుర్గాదేవి, ఆ మహిషాసుర మర్దనియే సంహార కాలంలో కాళీ, చండీ రూపాలు ధరించింది. మన దేశంలో కూడా ఆడవారు యుద్ధంలో పాల్గొన్నారు. మన సంస్కృతిని నిలబెట్టడానికి ఝాన్సీరాణి యుద్ధం చేసింది.
కొలంబస్ పడమరగా వెళ్ళి ఇండియాకు బదులు ఇంకొక భూమిని చూశాడు. అసలు ఇండియాను చూశాక అక్కడి వాళ్ళకు 'రెడ్ ఇండియన్లు' అని పేరు పెట్టినారు.
యూరపుల తుపాకిని కనిపెట్టి అభ్యాసానికి తీసుకువచ్చినారు. అంతకు పూర్వం ధనుర్బాణాలు ఉపయోగించేవారు, స్పెయిను, ఫ్రాన్స్ వగైరా దేశములనుండి అమెరికావారు తుపాకితో వెళ్ళారు. అక్కడి సనాతన సంస్కృతిని నశింపజేశారు. అక్కడి వాళ్ళనుచంపి, ఆడవాండ్లను చెరచి తమ వేషభాషలు, సంస్కృతి అక్కడ ప్రవేశ##పెట్టి '' ఈ దేశంమాదే'' అని అమెరికా వాండ్లు చెపుతారు. ఆ దేశపు చరిత్ర వేరుగామనకు చెపుతారు. అసలు రాజనీతిలోనే భేదం వచ్చింది. ఇంగ్లీషు ఫ్రెంచి వారిని మనవారు తమ తమ బలములను పెంచుకొనుటకు గాను కలిసి కట్టుతనం. ఐకమత్యం మాట విడిచి ఆదరించినారు. ఆరు శతాబ్దములకు పూర్వం గజనీ వగైరాలు కొన్ని వేలమందిగా మాత్రమేవచ్చి కోట్లుగా జనం ఉండే ఈ దేశాన్ని బాధించారు. దానికి కారణం వాండ్లకు తుపాకి ఉండేది. పాశ్చాత్య దేశాలలో అందరూ కలిసి కసరత్తు, వ్యాయామం చేస్తారు, శరీర సౌష్ఠవాన్ని బలాన్ని వృద్ధి పరచుకొని శక్తివంతులుగా తయారవుతారు.
బ్రాహ్మణుడుగాని, శూద్రుడుగాని యుద్ధం చేసేది లేదు, అక్కడక్కడ క్షత్రియులు ఉన్నారు. రాజస్తాన్‌లో ఒక వర్గం అంతా యుద్ధం చేసేవారు ఉన్నారు.
స్వాతంత్ర్యము వచ్చిన తర్వాతనే అంతకు ముందు కంటే ఎక్కువ పాశ్చాత్య ప్రభావం మనపైన ఉన్నది. కట్టు, బట్టలోను మార్పు వచ్చింది. పాశ్చాత్య సంస్కృతికి దాసోహం అయి ఉంటాము మనం, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, స్వాతంత్ర్యమునకు పూర్వం సనాతన సంస్కృతి వ్యాప్తంలో ఉండేది, సనాతన సంప్రదాయం అనుసరిస్తూనే స్వాతంత్ర్యం నిమిత్తం పాటుపడేవారు. అది యిప్పుడు ఏమయిపోయింది?
భగవంతుడు చెప్పినది ఏమనగా ''పరాజ్ముఖుడవు కాకూడదు. ధర్మబద్ధంగా యుద్ధం చేయము'' అని.
బ్రాహ్మణులు యుద్ధం చేయవచ్చునా - అని ప్రశ్న ఉదయించ వచ్చును. శాస్త్రాది విషయాలలో ప్రసంగం చేసేటప్పుడు బ్రాహ్మణుని ముందు పెట్టుకొని మిగతా వారు నడవాలి. అట్లాగే సర్వవర్ణములు చేసేటప్పుడు క్షత్రియులను అగ్రంగా పెట్టుకొని చేయాలి అని ఉన్నది. బ్రాహ్మణుని వృత్తి ఏమిటి? అధ్యయనం అధ్యాపనం, వగైరా ఆచరణ. అన్ని విద్యలు గాంధర్వ విద్య, వేద వేదాంగాలు అధ్యాపన బ్రాహ్మణుడే చేయాలి. వృత్తికోసం యుద్ధం చేయకూడదు. అన్ని విషయములు తెలుసుకొని ఉండాలి. బ్రాహ్మణుడు యుద్ధం చేయవచ్చునా అంటే అధ్యాపనంవల్ల జీవిక లేకపోతే తర్వాత వారు ఇతర వృత్తులకు రావచ్చును. అని ప్రమాణాలు ఉన్నాయి. బ్రాహ్మణుడైన ద్రోణుడు యుద్ధం చేశాడు. ద్వారకా నగర రక్షణ విషయంలో స్త్రీలు యుద్ధం చేసినట్లు ఉన్నది. ఆపత్తు వచ్చినపుడు అంతా కలసి యుద్ధం చేయవచ్చును.
మనలో చాలామందికి కర్రపట్టుకొనుటే తెలియకుండా పోయింది. ఎవరినీ కొట్టుటకు కాదు; మనలను మనం రక్షించు కొనేందుకే అది. ఆపత్తులో ఇంకొకరు మన వద్దకు వచ్చి రక్షించేవరకు వేచి ఉండగలమా? అట్లా అయితే ఈలోగా జరుగవలసింది జరిగిపోతుంది, ఉత్తరం నుంచిదాడి వచ్చింది అందుకు మనంసిద్దంగా ఉన్నామా?
కాబట్టి సంగీతాదులు కొంతమాని వ్యాయామశాలలో చేరిగాని, హోంగార్డ్సులో చేరిగాని అభిమానంతో నిలబడడానికి, ఆపత్తు వచ్చినపుడు నిగ్రహించు కోడానికి యుద్ధాభ్యాసం చేయడం ముఖ్యం. ప్రతి వారుకూడా అందులో చేరవచ్చును. స్త్రీలు కూడా యుద్ధం చేయవచ్చును.
మనది మత ప్రమేయంలేని రాజ్యాంగ వ్యవస్థ. హిందువులకు యిప్పుడు లేనివికొన్ని యితరులకు ఉంటాయి. హిందువునికి బిడ్డలు లేకపోతే వంశాభివృద్ధి కొరకు ఇంకొక వివాహం చేసుకోడానికి చట్టం అనుమతించదు. కుటుంబ నియంత్రణము హిందువులచే కంటే యితరులచే ఎంత వరకు ఆచరింప చేయబడుతోంది. మనదేశంలో కొండల్లోను, మారుమూలల్లోనూ ఉండే వారిని గిరిజనులు అందురు. మధ్యప్రదేశ్, బీహారులలో ఒక జాతి గిరిజనులు ఉన్నారు. ఇతర సంస్కృతులను వాళ్లు అంగీకరించరు. ఎవరైనా బలవంతాన నోట్లో నీరుపోస్తే అట్లా పోయబడిన వానిని వెలివేస్తారు. ఆ ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీల ప్రచారం బలవంతంగా మతాంతరీ కరణం చేయడం ఎక్కువగా సాగుతోంది.
8-12ొ
|