Jagadguru divyacharithra   Chapters   Last Page

 

3. ఆదిశంకరుల అవతరణం

సంప్రదాయ చరిత్ర

(బి. సి. 509 కలిశకం 2593)

''సన్తః పరీక్ష అన్యతర ధృజంతే''

ఆదిశంకరులు కేరళ ప్రాంతంలో అవతరించారు. అచటి ఆచారాన్ని అనుసరించి వీరి పవిత్రనామమైన 'శంకర' అనే పదంలోనే వీరి జన్మతిథి సూచన ఉన్నది.

'కటపయాది' సంఖ్యా పద్ధతి అని ఒక లెక్క ఉన్నది. దాని ప్రకారము 'య' నుండి లెక్కపెడితే 'శ' ఐదవ అక్షరం. క నుండి లెక్కవేస్తే 'క' మొదటి అక్షరమే కదా ! 'య' నుండి లెక్కచూస్తే 'ర' అనేది రెండవ అక్షరం. కనుక 5-1-2 అనే అంకెలు వచ్చినవి.

''అంకానాం వామతో గతిః'' అని సంస్కృత భాషలో అంకెలను ఎడమనుండి కుడికి లెక్క పెడతారు. అపుడు 2-1-5 అనే వరుస వస్తుంది.

అనగా మాసాల్లో రెండవది వైశాఖం. పక్షాల్లో మొదటిది శుద్ధపక్షం. తిథుల్లో ఐదవది పంచమి.

ఆనాటినుండి నేటివరకు వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు శంకరుల జన్మతిథి, మహాపర్వంగా 'శంకర జయంతి' మహోత్సవం జరుపబడుతోంది.

1. ఆదిశంకరుల సమకాలికులైన చిత్సుఖాచార్యుల బృహచ్ఛంకర విజయం ప్రకారం - నందన వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం ఆదిశంకరుల జన్మతిథి అని స్పష్టమౌతోంది. అభిజిల్లగ్నం. (32 ప్రకర. 12-16 శ్లో.)

2. ఈ అంశంలో టి.యస్‌. నారాయణశాస్త్రిగారు (మదరాసు) రచించిన 'ఏజ్‌ ఆఫ్‌ శంకర' (1930) అనే గ్రంథంలోను, శ్రీ కోటవేంకటాచలంగారు రచించిన గ్రంథాలలో సుదీర్ఘ పరిశోధనా పురస్సరంగా బి.సి. 509 నందన సంవత్సరం ధృవపరుపబడినది.

''శ్రీకృష్ణ నిర్మాణంతోనే కలి ప్రవేశం'' అనే అంశంపై సుదీర్ఘమైన పరిశీలనచేసి శ్రీమద్భాగవతాది గ్రంథ ప్రామాణ్యంతో కలిశకం 'ప్రమాది' సంవత్సరంతో ఆరంభ##మైనదని డా || శ్రీ కోట నిత్యానందశాస్త్రిగారు నిశ్చయించారు. (చూ. జాగృతి 5-4-65)

దీని ననుసరించి చూచినా పై ప్రమాదినుండి బి.సి 509 కి నందన సంవత్సరం సరిపోతుంది.

3. ఆదిశంకరులు స్థాపించిన పీఠములలోని గురు పరంపరను బట్టి లెక్కించి చూచినప్పటికి పై అంశం ధృవపడుచున్నది.

1. కంచి కామకోటిపీఠ జగద్గురు పరంపర బి.సి. 509 నుండి ఇప్పటివరకు అన్ని వివరములతో ఈ గ్రంథంలోనే వ్రాయబడిఉన్నది. 509 నుండి 1969 వరకు అనగా సుమారు రెండువేల ఐదు వందల సంవత్సరాలకు 68 మంది గురువులున్నారు. సగటున వీరి పీఠాధిపత్యకాలం ఒక్కొక్కరికి 37 సంవత్సరాల కాలానికి మించి లేదు.

2. ద్వారకాపీఠ గురుపరంపర ననుసరించినప్పటికిని బి.సి- 5 వ శతాబ్దినుండి 79 మంది గురువు లున్నారు. వీరి సగటు పీఠాధిపత్యకాలం చూస్తే 32 సంవత్సరాలకు మించి లేదు. *

3. పూరి గోవర్థనపీఠం - జగన్నాధం - వీరి గురు పరంపరలో కూడ బి.సి. 5వ శతాబ్దినుండి 144 మంది గురువులున్నారు. వీరి సగటు పీఠాధిపత్యకాలం చూచినా ఒక్కొక్కరికి 18 సంవత్సరాలకు మించి లేదు. *

4. బదరి జోతిర్మఠ వివరములు తెలియటంలేదు.

4. పై 1, 2, 3 కాక శృంగేరీపీఠ చరిత్రలు మున్నగు అనేక అమూల్యాంశాలను తెలిసికోదలచినవారు ''ది ట్రెడిషనల్‌ ఏజ్‌ ఆఫ్‌ శ్రీ శంకరాచార్య అండ్‌ మఠ్స్‌'' అనే ఆంగ్ల గ్రంథాన్ని చదివి అనేక విశేషాలను గ్రహింపవచ్చును. s

5. భారతచరిత్ర విషయంలో సంప్రదాయసిద్ధమైన ఆధారాలతో విశేష పరిశోధనచేసిన 'పండిత' శ్రీ కోట వేంకటాచలం (విజయవాడ) గారి గ్రంథాలనుగూడ పేర్కొనవలసియున్నది.

___________________________________________

* ఈ గ్రంథంలోనే తుదిని 'తెలిసికోదగిన అంశాలు' అనే అధ్యాయంలో 'ద్వారకాపీఠ' గురుపరంపర - పూరి జగన్నాథపీఠ గురు పరంపర బి.సి 509 నుండి ఇప్పటి వరకూ చూపబడినది.

s ఈ గ్రంథాన్ని శ్రీ ఎ. నటరాజయ్యర్‌, శ్రీ యస్‌. లక్ష్మీ నరసింహశాస్త్రి, ఎం.ఏ., యల్‌.టి., గారలు రచించారు. ఇది కామకోటి కోశస్థానం, 4 ఫ్రాన్సిస్‌ జోసెఫ్‌ వీధి, మదరాసు-1 కు వ్రాసి పొందవచ్చును. వెల రు. 3-00 లు.

ఈ పండితులు 1885లో జన్మించారు. సంప్రదాయ సిద్ధమైన భారతచరిత్ర విషయంలో 1925 లో పరిశోధన ఆరంభించారు. కేవలం చరిత్రపై ఆంగ్ల ఆంధ్రభాషల్లో 21 గ్రంథాలను రచించి ప్రచురించారు. ముపై#్ఫఏళ్ళు నిర్విరామకృషి చేశారు. 'భారతచరిత్ర భాస్కర', 'విమర్శకాగ్రేసర' ప్రతిష్ఠతో 'ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌'లో సభ్యురై సభలకు వెళ్ళి ఐతిహాసిక పరిశోధకులకు కనువిప్పు కలిగించారు. వీరు తుదిలో తురీయాశ్రమస్వీకారం చేసి 'శ్రీ అద్వయానంద శంకర భారతీస్వామి' అను ఆశ్రమ నామంతో 75వ ఏట సిద్ధిపొందారు. వీరి రచన లింకా అముద్రితాలు కూడ కొన్ని ఉన్నవి.

5. వీరు రచించిన - (1) క్రోనాలజీ ఆఫ్‌ కాశ్మీర్‌ హిస్టరీ రీకనస్ట్రక్టెడ్‌-146 వ పుట (2) క్రోనాలజీ ఆఫ్‌ నేపాల్‌ హిస్టరీ రీకనస్ట్రక్టెడ్‌-57 వ పుట (3) కలిశక విజ్ఞానం-3 వ భాగం- 56వ పుట- ఈ మూడు గ్రంథాలలోను కంచి కామకోటి, ద్వారకా, పూరీపీఠ గురుపరంపరలతో పాటు తక్కిన భారతదేశచరిత్రను జోడించి ఆదిశంకరుల అవతరణం బి.సి. 509 అని నిర్ధారించారు.

6. శ్రీ కల్యాణానంద భారతీమాంతాచార్యస్వామి వారు (గుంటూరు) రచించిన 'Epochs of the History of Bharata Varsha' అనే గ్రంథంలో (p. 130 Ed.1931) ఆదిశంకరుల అవతరణం బి.సి. 509 అని నిర్ధారింపబడినది.

7. 'విద్యావాచాస్పతి' 'విద్వత్కవిరత్న' - మహోపాధ్యాయ వైయాకరణ కేసరి - ధర్మోపన్యాస కేసరి బిరుదాంచితులగు శ్రీ పుణ్య ఉమామహేశ్వరశాస్త్రిగారు తాము రచించిన ''నవశంకర విజయర్యాసహస్రం''అనే సంస్కృత గ్రంథంలో 4 వ పుట-ఆది శంకరుల అవతరణం కలిశకం 2593 (బి.సి. 509) అని నిశ్చయించారు.

8. సుప్రసిద్ధ గ్రంథకర్తలు, పండిత పరిశోధకులునైన శ్రీ కనుపర్తి మార్కండేయ శర్మగారు ''శ్రీ మచ్ఛంకరాచార్య చరిత్రము'' అనే గ్రంథం (1932లో ప్రచురణ)లో సైతం కంచికామకోటి, పూరీ, ద్వారకాపీఠ గురు పరంపరల ననుసరించి ఆది శంకరుల జననం బి.సి. 509 అని నిశ్చయించారు.

9. శ్రీ పి. యన్‌. ఓక్‌గారు (అధ్యక్షులు - ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ రీరైటింగు ఇండియన్‌ హిస్టరీ) బి.సి. నుండి ఏ. డి. 7, 8 శతాబ్దుల వరకుగల భిన్న వాదాలను సోపపత్తికంగాను సప్రమాణంగాను ఖండించి, ఆదిశంకరుల జననం బి. సి. 509 అని నిశ్చయించారు.

(జాగృతి 8-5-1967)

10. జైనులకు ప్రమాణ గ్రంథమైన జిన విజయ గ్రంథంలో సుప్రసిద్ధ మీమాంసాచార్యులైన కుమారిల భట్టునుగూర్చి పేర్కొన్న అంశాలను పరిశీలించినా ఆదిశంకరుల జననం బి. సి. 509 అని స్పష్టమౌతుంది. (కుమారిల భట్టు జననం బి.సి. 557)

11. #9; పూరీగోవర్థన పీఠాధిపతులైన (144) శ్రీయోగీశ్వరానందతీర్థలవారు వ్రాసిన ''ఏన్‌ ఎస్సె బేస్‌డ్‌ ఆన్‌ రీసర్చ్‌ ఏజ్‌ టు ది ఎగ్జాక్ట్‌ డేట్‌ ఆఫ్‌ శ్రీ ఆదిశంకరాచార్యాన్‌ బర్త్‌'' అనే పరిశోధనా వ్యాసంలో ఆదిశంకరుల జననం బి. సి. 509 అని నిర్ధారింపబడినది. (శ్రీ ఆదిశంకరుల మఠ సంప్రదాయ చరిత్ర అపెండెక్సు-బి)

12. #9; ద్వారకా పీఠాధిష్ఠితులైన 73 వ గురువులు శ్రీ రాజరాజేశ్వర శంకరాశ్రమి స్వామివారు ద్వారకా గురుపరంపరను 'విమర్శ' అనే గ్రంథంలో 1898 లో ప్రచురించారు. అది వారణాసిలో రాజరాజేశ్వరీ ప్రెస్సులో ముద్రింపబడినది. ఇందులో కూడ యుదిష్ఠరశకం 2631 అని (బి.సి. 509) ఆదిశంకరుల జననం నిర్ధారింపబడినది.

శ్రీశృంగేరీ పీఠాధిపతుల అత్యాధునిక వ్యవస్థ

(క్రీ.శ. 1966 లో)

1966 జూన్‌ లో 'మహాతపస్వి' అనే గ్రంథం విజయవాడలో ప్రచురింపబడినది. దీని ప్రకాశకులు శ్రీ గంటి సూర్యనారాయణ మహగ్ని చిద్యజ్వగారు. ముద్రణ ద్రవ్యదాత శ్రీ తల్లం సత్యనారాయణగారు (విజయవాడ-1) ఈ గ్రంథం కాపీరైటు శ్రీ జగద్గురు శృంగేరీ మహా సంస్థానమువారిది.

ఈ గ్రంథంలో ప్రచురింపబడిన శృంగేరీపీఠ జగద్గురు పరంపరలో ఆదిశంకరుల జననం క్రీ. శ. 684 అని పేర్కొనబడినది.

దీని క్రింద ''ఇది మిక్కిలి ప్రామాణికమైనది. ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు శ్రీమ దభినవ విద్యాతీర్థ మహా స్వాములవారు 'కాశీ లక్ష్మణశాస్త్రి విరచిత (1735) గురువంశ కావ్యము.... మైసూరు ఆర్కియాలాజికలు డిపార్టుమెంటు వారి వార్షిక నివేదికలు' మున్నగువానిని సవిమర్శముగా పరిశీలించి, వెనుక, ప్రకటించిన పట్టికలయందలి భ్రమ ప్రమాదములను తొలగించి, నిర్ధుష్టముగా నిర్ణయించియున్నారు. శ్రీవారి ఆదేశానుసారం, శ్రీవారి ప్రత్యక్ష పర్యవేక్షణమున సంసిద్ధమైనందున పరమప్రమాణముగా గ్రహింపదగిన''దని వ్రాయబడి యున్నది.

దీనిని బట్టి ఆదిశంకరుల జననం క్రీ. శ. 684.

శ్రీ సురేశ్వరుల శృంగేరీ పీఠాధిపత్యం

800 సంవత్సరాలు

1966 లోనే ''శారదాపీఠం'' అనే గ్రంథం తెలుగులో ప్రచురింపబడినది. దీని తమిళ మూలాన్ని ఆర్‌.కృష్ణస్వామి అయ్యర్‌ ఎం. ఏ. బి.యల్‌., (తిరునల్వేలి-అడ్వకేటు) గారు రచించారు.

ఈ గ్రంథంపైన ''25-3-1966 న శ్రీ శృంగేరీ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీమదభినవ విద్యాతీర్థస్వామి 'నారాయణ్‌ రేడియో స్టోర్సు'కు విచ్చేసిన సందర్భమున బహుకరింపబడినది.'' అని ఉన్నది.

ఈ గ్రంథంలో 26 వ పుటలో తుదిని ఇట్లున్నది :

''సురేశ్వరులు చాలానాళ్ళు శృంగేరీ పీఠాధిపత్యము నిర్వహించిరి. వారు అక్కడ ఎనిమిదివందల సంవత్సరము లుండినట్లు కొందరు చెప్పుదురు. అది కలియుగములో సాధ్యపడని సంగతియని మరికొందరి యభిప్రాయము.

ఇచ్చట కొందరెవరో, మరికొంద రెవరో వివరణలేదు.

1966 తరువాత శృంగేరీ గ్రంథాలు

1) 1968-69 సంవత్సరానికి సంబంధించిన కీలకసంవత్సర పంచాంగాన్ని శ్రీ జగద్గురు శ్రీ శృంగేరీ శారదా మఠీయ ఆంధ్ర

[4]

పంచాంగ కర్తలు 'న్యాయ - వేదాంత - మీమాంసా జ్యోతిష పండితులు శ్రీ కుప్పా శివరామ బైరాగిశాస్త్రిగారు (అనంతవరం - గుంటూరు జిల్లా) రచించారు. ఇది ఆనందభారతీ పవర్‌ ప్రెస్సు మదరాసు-1లో ముద్రింపబడినది.

ఈ పంచాంగంపైన కలి శకం, శాలివాహన శకంతో పాటు 'శ్రీ శంకర భగవత్పూజ్యపాదావతారాబ్దాః 2478'- అని వ్రాసి అలాగే రామానుజ, మధ్వాచార్యులవి - హిజరీ మొదలైన వానిని పేర్కొన్నారు.

అనగా ఇప్పటికి జరిగిన కలిశకం 5069 లో 2478 ని తీసివేయగా 2591 వచ్చును. ఇది బి.సి. 509 కి రెండు సంవత్సరాల తేడాతో ఉన్నది. కంచి కామకోటి మున్నగు పీఠ పట్టికలనే ఇది బలపరుస్తున్నది.

2). 1968 లోనే 'బ్రహ్మవిద్యా సింహాసనము' (తెలుగు)అను గ్రంథం ప్రచురింపబడినది. దీనిని శ్రీ ఆర్‌.కె. వెంకట్రామన్‌గారు రచించారు.

ఈ గ్రంథంలోనే 7 వ పుటలో శంకరుల జనన సంవత్సరం క్రీ.శ. 805 అని వ్రాసి ఉన్నది. దీనికి గురువంశ కావ్యం ప్రమాణమట.

పైన పీఠాధిపతుల నిర్ణయానికి (684) దీనికి కూడ ప్రమాణం గురువంశకావ్యం కావటం మరొక విచిత్రాంశం.

పైగా మాధవీయంకూడ దీనికి ప్రమాణమట. కాని మాధవీయంలో శంకర జననాన్ని గూర్చి సంవత్సరంగాని, మాసం. తిథి అనేవిగాని లేదనేది జగత్ర్పసిద్ధమైన అంశము.

3) 1967 లో శ్రీ ఆర్‌. కృష్ణస్వామి అయ్యర్‌, శ్రీ కె.ఆర్‌. వెంకట్రామన్‌ గారు కలిసి వ్రాసిన గ్రంథం మరొకటి ప్రచురింపబడినది. కుం| మ| య| చరిత్ర అనే ఈ విమర్శగ్రంథంలో 170 వ పుటలో -

''శ్రీరామునికంటే పూర్వము వాడైన నలునిచరిత్రలో కలియుగమున 2000 సం||రముల తరువాత ప్రభవించిన శంకరులు సంపాదించిన యోగలింగము-'' అని ఉన్నది.

పై శృంగేరీపీఠాధిపతుల వ్యవస్థ ప్రకారం కలియుగం 3796 వరకు వెళ్ళింది.

కాని పై 2 వేల విషయం భవిష్యపురాణం చెప్పిన ''కల్యాదౌ ద్విసహస్రాన్తే'' - 'సహస్రద్వితీయాత్పరం' అనే సంప్రదాయ వాదాన్ని సమర్థిస్తోంది. పై పీఠాధిపతుల వ్యవస్థయందు గౌరవం ఉంటే కనీసం 3000 తరువాత అని వ్రాసి ఉండేవారు.

4) వరంగల్లు వాస్తవ్యులేకాక కా| ది| చ| వి| కారులుగా ప్రసిద్దులైన 'అద్వైతవేదాంతశిరోమణి. మీమాంసా విశారద' శ్రీ మల్లావజ్ఘల సుబ్బరామశాస్త్రిగారు రిటైర్డు వైస్‌-ప్రిన్సిపాల్‌గా కూడ ఖ్యాతులైనారు.

1968 లో ప్రచురింపబడిన వీరి ది| చ| విమర్శగ్రంథంలోనే 77వ పుటలో మరల ''శ్రీరాముని కంటె...... ..... యోగలింగమును'' అని పై దాని చూచి వ్రాత ఉన్నది. ఇది వీరి గ్రంథచౌర్యకళకంటె అంధానుకరణనైపుణికే నికషోపలమని నే ననను.

కాని ఆ పుస్తకంలో ఆ గ్రంథకర్తయే 56వ పుటలో ఇలా వ్రాశారు.

''బి. సి. 300 శతాబ్దిలోని శంకరభగవత్పాదులకు సమకాలీన శిష్యుడయిన ఆనందగిరి క్రీ.శ. 1 2వ శతాబ్దిలోని రామానుజలను గూర్చి వ్రాయుట దుశ్శకము''.

బి.సి. 300 శతాబ్ది అంటే ఇప్పటికి 32 వేల సంవత్సరాలని తేలుతోంది. ఇది బహుశ ( భూలోకవాసుల లెక్కఐ ఉండదు. వీరికే పాతాళవాసుల పంచాంగమో ప్రమాణమై ఉంటుంది. మరి న్వవచన వ్యాఘాతుకం కాకూడదు కదా !

ఇలా పై 3, 4 గ్రంథాల ననుశీలించి విమర్శకు పూనుకొంటే ఎన్ని విరోధాంశాలనైన చూపవచ్చు. చెదపురుగులకు కూడ వీటిని చూస్తే వికారం కలుగక మానదు.

సారాంశము

పై పీఠాధిపతుల వ్యవస్థను, దాని తరువాత ప్రచురించిన గ్రంథాలనుబట్టి - వారి భక్తులకీ వ్యవస్థ ఇంకా జీర్ణం కాలేదనిపిస్తోంది.

ఇంక 800 సంవత్సరాల కథ

పైన చూపిన 2వ గ్రంథాన్ని తెలుగునకు శ్రీతుమ్మలపల్లి రామ లింగేశ్వరరావుగారు అనువదించారు. వీరికి ముఖ్య మిత్రులేకాక, జగత్ర్పసిద్ధులైన 'కవిసమ్రాట్‌' 'కళాప్రపూర్ణ' శ్రీ విశ్వనాథసత్యనారాయణగారికికూడ ఈ సంప్రదాయ చరిత్రయందు ఆసక్తి మెండుగా ఉన్నది.

శ్రీ విశ్వనాథవారు 1959 నుండి 64 వరకు 4000 పుటలు గల 12 గ్రంథాలను వ్రాశారు అందు ప్రతి గ్రంథపీఠికలోను బాహూవులెత్తి ఆక్రోశిస్తూ శ్రీ టి.యన్‌. నారాయణశాస్త్రిగారి 'ఏజ్‌ ఆఫ్‌ శంకర' అనే గ్రంథాన్ని - పండిత కోట వేంకటాచలంగారి గ్రంథాలను చదివి యథార్థ చరిత్రను తెలిసికోవలసిందిగా నెత్తిన నోరుపెట్టుకొని చెప్పుచూ తమ ఆందోళనను వ్యక్తం చేసికొన్నారు.

పై పండ్రెండు గ్రంథాలలో ఒకటైన 'నివేదిత' పీఠికలో ''భారత దేశ చరిత్ర చతురాననుడైన బ్రహ్మీభూతులునైన శ్రీ కోట వేంకటాచలముగారు తన జీవితమునంతయు పాశ్చాత్యులు చేసిన యన్యాయమును విప్పి చూపుటకు వ్యయముచేసిరి'' అని వ్రాశారు.

శ్రీ వేంకటాచలముగారి 'కలిశక విజ్ఞానం' 3 వ భాగం 57వ పుట 2వ పేరాలో ఇలా ఉన్నది.

''శ్రీ శంకరులవారి జననము క్రీ.పూ 36 వ సంవత్సరమని శృంగేరీపీఠ జగద్గురు పరంపరవలన తెలియుచున్నటుల కొందరభిప్రాయపడుచుండిరి. కాని ఆ పీఠమునం దిటీవల కలిగిన కలతల వలన ఆ రికార్డంతయు వ్యతిరేకులచేత( జిక్కుటయు, వారివారి కనుకూలముగ పరంపరను దెలుపు భాగములో కొన్నిటిని తీసివేసియు, కొన్నింటిని మార్చియు, పరంపరను దెలిపెడి భాగమును చెడగొట్టిరి. ఇప్పుడు శృంగేరీ పీఠమునందు గలది సరియైన జాబితాకాదు. దాని ననుసరించుటకు వీలులేదు. ప్రథమ పీఠస్వామియైన శ్రీశంకరులవారి శిష్యులైన సురేశ్వరచార్యుల తరువాత ఆరువందల సంవత్సరముల కాలమున గల గురుపరంపర కనబడుటలేదు. అందువలన సురేశ్వరాచార్యులే 600 సంవత్సరములున్నటుల ఆ పరంపరను దెలుపు పత్రములం దుదాహరింపబడినది.''

ఆ గ్రంథంలోనే 58వ పుటలో : - ''శృంగేరీ పరంపర పరస్పరస్పర్థగల ఇరువురి మధ్యబడి విచ్ఛిన్నము చేయబడి నందున దానిని, దాని ననుసరించు వానిని ప్రమాణముగా అంగీకరింప వీలులేదు.

ఇంతకుముందు నేను పేర్కొన్న శ్రీ కనుపర్తి మార్కండేయశర్మగారి ' శ్రీ శర్మగారి 'శ్రీ మచ్ఛంకరాచార్య చరిత్ర' (1932) 10వ పుటలో శృంగేరీ గురుపరంపరను గూర్చి వ్రాశారు. దానిని వారు శ్రీ బి. సూర్యనారాయణ రావుగారు ప్రకటించిన 'జీర్ణ కర్ణాటక రాజ్యచరిత్ర అను గ్రంథమునుండి గ్రహించినట్లు వ్రాశారు. అందు ఆదిశంకరుల జననం బి.సి. 36 అని సురేశ్వరులు 800 సంవత్సరాలు పీఠాధిపత్యం వహించినట్లున్నదని వ్రాశారు. ఆదిశంకరుల నుండి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారి వరకు 34 గురు, గురువుల పట్టికను చూపినారు.

'రాయల్‌ ఏషియాటిక్‌ సొసైటీ-బొంబాయి విభాగం అది నివేశంలో 12-12-874లో శ్రీ కే.టి. తెలాంగ్‌ మహాశయులు 'శ్రీ మధుసూదన సరస్వతి' కాలనిర్ణయాన్ని గూర్చి ఒక పరిశోధనావ్యాసం చదివారు. అది ఆ సొసైటీ జర్నల్‌ 30వ సంచికలో 20వ వ్యాసంగా ప్రచురింపబడినది. (Vol.x1871-1874)

ఇందులో ఆదిశంకరులు మొదలు విద్యారణ్యులు వరకు 32 మంది ఆచార్యులున్నారు. ఇందు సురేశ్వరుల పేరేలేదు. పృథ్వీధరుల ప్రథమాచార్యులు. విద్యారణ్యులు 32వ గురువులుగా పేర్కొనబడిరి.

ఈ అంశాన్ని శ్రీ అనంతానందేంద్ర సరస్వతీస్వామి వారుకూడ 'గురురత్నమాలిక' ఉపోద్ఘాతంలో వ్రాశారు.

పైగా ఇలా పేర్కొన్నారు.

''శృంగేరీ గురుపరంపరకు చెందిన పట్టికలు నాలుగైదున్నవి. అందులో ఒకటి శ్రీ బెంగుళూరు సూర్యనారాయణ రావుగారు M.R.A.S, 'Never to be forgotten Empire' అనే గ్రంథంలో ప్రకటింపబడినది. ఇది శృంగేరీ జగద్గురువుల పూజాపేటికలోనున్న పట్టికకు సరియగు నకలు అని కూడ పేర్కొన్నారు. అందులో ఆదిశంకరుల జననం బి.సి. 44 అని ఉన్నది.

''సురేశ్వర చరితం'' అనే గ్రంథం 1922లో ధార్వార్‌లో ప్రచురింపబడినది. అప్పటి శృంగేరీ పీఠాధిపతులు శ్రీముఖాన్నిచ్చి దానికి ఆమోదముద్ర వేశారు. అది పై అంశాన్నే చెప్పుతోంది.''

తరువాత 'ఆదిశంకరుల మఠసంప్రదాయ చరిత్ర గ్రంథంలో సురేశ్వరులు బి.సి. 12 నుండి ఎ. డి. 773 వరకు పీఠాధిపత్యం వహించినట్లు వ్రాశారు. శ్రీ చంద్రశేఖర భారతీస్వామి వరకు 31మంది గురువులను పేర్కొన్నారు. కాని క్రీ.శ 1879లో శ్రీకృష్ణరాజేంద్ర ఉడయార్‌ మహారాజా వారు పై 34 గురిలో ఇరువురిని తగ్గించి 32 మందినే పేర్కొన్నారట.

గురురత్నమాలిక 106 వ పుట : ఆత్మ బోధేంద్రుల 'సుషమ'లో ఇట్లున్నది.

''అత్రేదమనుసంధేయం అనంతర మాచార్య శ్రీశంకర భగవత్పాదేభ్యః ఏకాదశతమాత్‌ ఆచార్యదారభ్య శృంగగిరౌ అధిశారదాపీఠమబ్దాష్టశతీం యాపదభవన్‌ నకే7ప్యదిష్ఠాతారః''

&#అనగా ఆదిశంకరుల పిమ్మట 11వ ఆచార్యులకు తరువాత 800 సంవత్సరములవరకు శృంగేరీపీఠము నధిష్టించినవారెవ్వరును లేరని దీని తాత్పర్యము.

'ఆదిశంకరుల మఠసంప్రదాయ చరిత్ర' అనే ఆంగ్ల గ్రంథంలో శృంగేరీచరిత్రలో శ్రీ సురేశ్వరులు బి.సి. 12 నుండి ఎ. డి. 774 వరకు ఉన్నట్లు వ్రాసి ఉన్నదని చెప్పారు.

ఆ గ్రంథంలోనే 73వ పుట నుండి 97 వ పుటవరకును శ్రీ సురేశ్వరులను గూర్చి చాల వివరణ నిచ్చిరి. సురేశ్వరులు 800 సంవత్సరాలు పీఠాధిపత్యం కాదని, రాజ్యక్షోభలవలన ఆ పీఠము 800 సంవత్సరము లన్యాక్రాంత మైందని నిరూపించిరి. అందువల్ల పునరుద్ధరింపబడి నపుడు మరల వీరికి వెనకటి దేవతార్చన అన్యాక్రాంతమగుటచే వీరశైవుల నుండి ఆ భోగలింగమునే తీసికొని ఉంటారని నిరూపించారు. ఇది సాకుగా తీసికొని వీరశైవులు చంద్రమౌళీశ్వరలింగమును ఆదిశంకరులకు తామే ఇచ్చినట్లు వారి చరిత్రలో వ్రాసికొనే అవకాశం చిక్కింది.

నంజనాచార్య-వేదంతసార వీరశైవ చింతామణి 6శ్లో|| శంకరాచార్య సన్నామ యోగీంద్రాయ మహోజ్జ్వలం

చంద్రమౌళీశ్వరం లింగం దత్తవానితి విశ్రుతం |

శ్రీ రేణుక గణశాఖ్యం రేవణం సిద్ధదేశికం |

వీరశైవమతాచార్య వందే7హం శ్రీజగద్గురుం ||

శివతత్త్వరత్నాకరం 12వ తరంగం 4 వ కల్లోలం 9-11 శ్లోకాలివి :

తతః సరేవణసిద్ధ సంప్రదాయ ప్రవర్తినాం

శంకరాచార్యవర్యాణాం పారంపర్యక్రమాగతం |



సంన్యాసిన ముపాశ్రిత్య వినయాననతో 7ధికం

వృత్తాంత మఖిలం తసై#్మయతయేస్వంవ్యజిజ్ఞపత్‌ ||



రేవణాసిద్ధసంప్రాప్తం చంద్రమౌళీశమప్యదాత్‌ ||

ఆఖ్యాచ్చానేన లింగేన తవాభీష్టాప్తిరిత్యపి ||

 

ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం వ్రాసిన 'రావుబహుదూరు' హెచ్‌.కృష్ణశాస్త్రిగారు అందు-పై శ్లోకాల నాధారం చేసికొని, శృంగేరీలో పూజింపబడుచున్న చంద్రమౌళీశ్వర లింగం వీరశైవులిచ్చినదని రేవణసిద్ధ సంప్రదాయమే శృంగేరిలో ప్రవర్తితమౌతోందని వ్రాశారట. ప్రస్తుతం వీరశైవులిచ్చిన చంద్రమౌళీశ్వర లింగమే అక్కడ ప్రధానంగా పూజింపబడుతోందని వీరి అభిప్రాయం. ఇందుకు అనుగుణంగానే శృంగేరికి పరమప్రమాణ గ్రంథమైన గురువంశ కావ్యం, 5, 6 సర్గలలో విజయనగర సామ్రాజ్యస్థాపకులైన హరిహర, బుక్కారము లిరువురు బల్లాలునిచే నిష్కాసితులై అడవిలో ఉన్నపుడు వారి స్వప్నంలో రేవణసిద్ధుడు ప్రత్యక్షమౌతాడు. అచట చంద్రమౌళీశ్వర లింగప్రసక్తి కూడ ఉన్నది.

అంతేకాదు. గురువంశ కావ్యంలోనే 3వ సర్గలో 33, 34 శ్లోకాలివి.

శ్రీ చంద్రమౌళీశ్వర లింగమసై#్మ సద్రత్న గర్భం

గణనాయకంచ |

సవిశ్వరూపాయ సుసిద్ధదత్తం దత్వాన్యగాదీత్‌ చిరమర్చయేతి |

సురేశ్వరాచార్య సరస్వతీంత్వం సంపూజయన్నా స్వచిరా దిహేతి |

దత్వాభ్యనుజ్ఞాం వినతాయ తసై#్మ శిషై#్యస్సయసై#్తః సజగామ కాంచీం ||

ఈ శ్లోకాలకు గ్రంథకర్తచేతనే 18వ శతాబ్దంలో అప్పటి పీఠాధిపతులు వ్రాయించిన వ్యాఖ్యలో ఇలా ఉన్నది.

వ్యాఖ్య :- సుసిద్ధేన = రేవణసిద్ధ మహాయోగినా, దత్తం, శ్రీ చంద్రమౌళీశ్వరలింగం, సద్రత్నగర్భం, సద్రత్నం = మాణిక్యం గర్భేయస్యసః తథోక్తస్తం గణనాయకం, విఘ్నేశ్వరంచ --

సుమారు 12 వ శతాబ్దిలోని వారైన వీరశైవచార్యులగు రేవణచార్యులు వీరికిది ఇవ్వటం వీరి చరిత్రకు కళంకంగా ఉన్నదని 1966లో వీరు గ్రహించారు. అందువల్ల ఈ గ్రంథాన్ని వ్యాఖ్య లేకుండగ ముద్రించారు. అంతతో తృప్తి లేక రేవణసిద్ధుడంటే గోవిందభగవత్పాదాచార్యులు అని అర్థన కల్పనచేస్తున్నారు. అది సరికాదని ఇంతకు పూర్వం అధ్యాయంలో ఈ గ్రంథంలోనే నిరూపింపబడినది. అంతేకాక 1966లో ప్రచురింపబడిన 'శారదాపీఠం' అనే గ్రంథంలో (తెలుగు) 26 వ పుటలో చూడండి-

''ఆచార్యులవారు అల్లక్కడి కైలాసమునుండి తీసికొని వచ్చినట్లు చెప్పెడు అయిదు చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగములలోను.... శృంగేరీ మతమునకై ఒక చంద్రమౌళీశ్వర లింగమును సురేశ్వరుల వారి కిచ్చిరి'' అని వ్రాశారు.

ఆ గ్రంథంలోనే 126 వ పుటలో శ్రీ శంకరాచార్యష్టోత్తర శతనామావళిలో ''కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజాకాయనమః అని వ్రాశారు.

ఈ రెండంశములు వీరి చరిత్రకు పూర్తిగా విరుద్ధమైనప్పటికి సాహసించి వ్రాసికోవటం ఒక అద్భుతం.

మరల 1966లోనే ఇంకొక వైపున రేవణసిద్ధుని పేరు చెరుపుకోవటం కోసం వ్యాఖ్యలేకుండా గురువంశకావ్యాన్ని అచ్చువేసికొంటూ అందులోనే రేవణసిద్దుడంటే గోవింద భగవత్పాదులని అర్థం చెప్పుకోవటం అద్భుతసృష్టిలోకెల్ల పరమాద్భుతానికి పరాకాష్ఠ అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు.

శృంగేరీ - పుస్తకసన్న్యాసం

(క్రీ.శ. 1570)

తరువాత ఈ అంశాన్ని గురించి కూడ తెలిసికోదగిన విశేషాలున్నవి. ఈ గ్రంథంలోనే తుదిని 'తెలిసికోదగిన అంశాలు' అనే అధ్యాయంలో చూచి చదవండి.

క్రీ.శ. 1873లో

'శ్రీముఖసిద్ధాంత పత్రిక' అనే గ్రంథంలో తుదిని ఉభయవేదాంత ప్రవర్తక' శ్రీ వేదాంతరామానుజజియ్యం గార్లగారు ఇలా నిశ్చయించారు.

''విద్యారణ్య ప్రశిష్యపరంపరవారైన ఈ శృంగగిరి వారు భగవత్పాదులచే శృంగగిరిలో నిర్మితంబైన విద్యాపీఠమునకు నధిపతులు గారని స్పష్టముగ తెలియుటచే గుఱ్ఱం వేంకట శాస్త్రిగారు... చేసిన వ్యవస్థ నిర్వివాదంబైనదనియు మేము త్రికరణ శుద్ధిగా జెప్పగల వారము.''

'చివరకు మిగిలింది'

కనుక 'పండిత' శ్రీ కోట వేంకటాచలంగారు చెప్పినట్లు శృంగేరీ గురుపరంపరను బట్టి ఏ విషయము నిర్ణయింప వీలులేదని చివరకు స్పష్టమైనది.

హేమ్న స్సం లక్ష్యతే హ్యగ్నౌ

విశుద్ధి శ్శామికాపివా

- కాళిదాస మహాకవి.

Jagadguru divyacharithra   Chapters   Last Page