Jagadguru divyacharithra   Chapters   Last Page

 

5. జగద్గురువులు - ఆదిశంకరులు

విశుద్ధజ్ఞానదేహాయ త్రివేదీ యజ్ఞచక్షుషే |
శ్రేయఃప్రాప్తి నిమిత్తాయ నమ స్సోమార్థ ధారిణ ||


వేదములు పరమేశ్వరుని నిశ్శ్వాసరూపములు. కనుకనే అవి పరమేశ్వరునివలెనే శాశ్వతములైనవి. వేదములు ధర్మమునకు మూలం. కనుక వేదాల నుద్ధరించటమే ధర్మోద్ధరణం. వేదరక్షణమే ధర్మరక్షణం. వేదపోషణమే ధర్మ పోషణం. అలాంటి వేదాలకు అపార్థాలను చెప్పగా దుష్టభావాలు ప్రచారమై దుర్మతాలు ప్రబలుతవి. అవే తుదకు నాస్తిక రూపాన్ని పొందుతవి.

ద్వాపరయుగంలోని శ్రీకృష్ణభగవానుని నిర్యాణానంతనరం కలియుగం ఆరంభ##మైంది. అందులో రెండువేల సంవత్సరాలు దాటినవి. అప్పటికి దుర్మతాలు బాగా వ్యాపించినవి. ధర్మగ్లాని ఏర్పడింది. ఆ సమయంలో ధర్మరక్షణ కోసం సాక్షాత్తు శంకరులే 'శంకరాచార్య'రూపంలో అవతరించారు.

భారతదేశంలో కేరళప్రాంతంలో కాలడి అనే గ్రామం ఉన్నది. అందులో శివగురువు ఆర్యాంబ అనే పుణ్యదంపతుల పుణ్యవశాన వైశాఖ శుద్ధ పంచమినాడు అవతరించిన బాలుడే ఆదిశంకరులు. వీరికి బాల్యంలోనే పితృవియోగం జరిగింది.

వీరు ఎనిమిదేళ్ళు వయస్సు వచ్చేసరికి నాలుగు వేదాలను పండ్రెండేళ్ళ వయస్సులో, సర్వశాస్త్రాలను అభ్యసించారు. పదహారేళ్ళ ప్రాయంలో భాష్యరచన చేశారు. ముప్పదిరెండేళ్ళ వయస్సు నిండేసరికి కైలాసగమనం చేశారు.

అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్‌

షోడశే కృతవాన్‌ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్‌ ||

ఉపనయనానంతరం వీరు నియమపూర్వకంగా మాధుకరవృత్తితో వేదాధ్యయనం చేస్తూండగా ఒకరోజున ఒక బీద బ్రాహ్మణ గృహానికి భిక్షకువెళ్ళారు. ఆ ఇల్లాలు భిక్ష నిచ్చుటకు తనవద్ద ఏమీ లేనందున ఒక్క ఉసిరిక పండును తెచ్చి ఇచ్చింది. అపుడు వీరు ఆ 'అమలక' భిక్షను గ్రహించి 'కనకధారాస్తవం'తో మహాలక్ష్మిని స్తోత్రం చేయగా ఆ బ్రాహ్మణి గృహపరిసరం అంతా సువర్ణామలక వృష్టి వర్షించింది.

వీరి తల్లి అనారోగ్యంగా ఉండటంచే ఆమె నిత్యం వెళ్ళే చూర్ణినదికి స్నానానికి వెళ్ళలేకపోయేసరికి ఆ నదీ ప్రవాహమార్గాన్ని తమ గృహసమీపానికి మళ్ళించారు. ఇప్పటికి ఈ చిహ్నం అచ్చట కన్పించుతుంది.

తరువాత తమతల్లితో ఆ నదికే స్నానానికి వెళ్ళగా అచ్చట వీరి పాదాన్ని ఒక మొసలి పట్టుకున్నది. ఈ గండం తప్పించు కోవటానికి సన్న్యసించాలి అని తల్లితో చెప్పి ఆమె అనుజ్ఞతో ఆశ్రమం స్వీకరించారు. అప్పుడే వారు జగత్కుటుంబియై లోకోద్ధరణానికి పూనుకొన్నారు. కాని తల్లికోరిన ప్రకారం ఆమె మరణ సమయానికి వచ్చి ఆమె అంత్యక్రియలను మాత్రం తామే తప్పక నిర్వర్తించునట్లు ఆమెకు వాగ్ధానం చేసి బయలుదేరారు.

క్రమంగా నర్మదానదీ తీరానికి వెళ్ళారు. అచట శ్రీగోవిందభగవత్పాదులవారున్న గుహదగ్గరకు వెళ్ళారు. 'శివః కేవలో7హం' అనే 'దశశ్లోకి'ని అచట చెప్పారు. వారి వద్ద 'మహావాక్యోపదేశాన్ని' పొందారు. శాస్త్రీయంగా తురీయాశ్రమాన్ని స్వీకరించారు.

గుర్వాజ్ఞను పాటించి కాశీక్షేత్రానికి వచ్చేశారు. వేదవ్యాసుల బ్రహ్మసూత్రములకు దశ ఉపనిషత్తులకు, భగవద్గీతకు భాష్యాన్ని వ్రాశారు. శిష్యులకు ఉపదేశించారు. అద్వైత బ్రహ్మవిద్యా ప్రచారాన్ని ఆరంభించారు.

ఒక రోజున గంగానది కాలవ ఒడ్డున ఉన్న శిష్యు నొకని రమ్మని పిలచారు. ఆ శిష్యుడు ప్రవాహాన్ని కూడ లక్ష్యపెట్టకుండగా వెంటనే ప్రవాహంలోకి వచ్చేసరికి గంగానది ఆ శిష్యుని పాదాలక్రింద పద్మాలను సృజించి సేతువుగా చేసింది. ఆ పద్మాలపై పాదాలనుంచి వారు గురుసన్నిధికి చేరుకొన్నారు. నాటినుండి ఆ శిష్యులు పద్మపాదాచార్యులుగా ప్రసిద్ధి నొందారు.

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి వెళ్లుతున్న సమయంలో నాల్గువేదాలను నాలుగు శునకాలుగా చేసికొని పరమేశ్వరుడొక చండాలుని రూపంలోవచ్చి ఆచార్యులవారితో వాదం జరిపారు. తుదకు తమ నిజరూపాన్ని చూపారు. ఆ సమయంలోనే వీరు మనీషాపంచకాన్ని వ్రాశారు.

వీరికి పదహారు సంవత్సరాల వయస్సులో వేదవ్యాసులు మారువేషంలో ప్రత్యక్షమై వీరి బ్రహ్మసూత్ర భాష్యంపై వాదం జరిపి తమ

[5]

సూత్రాలకు వీరు వ్రాసిన భాష్యం సరియైనదని చెప్పారు. అద్వైత బ్రహ్మవిద్యా ప్రచారానికై వీరికి మరొక పదహారు సంవత్సరాల ఆయువును ప్రసాదించారు.

ఆనందగిరి అనే వీరి శిష్యులు వీరిని 'తోటక' ఛందస్సు గల పద్యాలతో స్తోత్రం చెయ్యటంవల్ల వారికి తోటకాచార్యులని పేరు వచ్చింది. అలాగే హస్తామలకుడు మున్నగు శిష్యులు వీరి ననుసరిస్తూ ఉండేవారు.

మండనమిశ్రుడనే పూర్వమీమాంసావాది కర్మ సిద్ధాంతమే పరమ ప్రమాణమని నమ్మినవాడు. శ్రీ ఆచార్యుల వారికి వీరికి వాదం జరిగింది. మండనమిశ్రుడు ఓడిపోయి సన్న్యసించి శ్రీవారికి శిష్యుడై సురేశ్వరులనే పేరుతో ప్రసిద్ధి పొందారు.

శ్రీసురేశ్వరుల ధర్మపత్ని సరసవాణి లేక ఉభయభారతి ఆమెనుకూడ ఎంతో క్లిష్టమైన శాస్త్రచర్చల్లో ఓడించారు. ఆ సరస్వతి స్వరూపిణిని శారదాదేవిగా శృంగేరిలో ప్రతిష్టించారు. శ్రీ సురేశ్వరులు ఆచార్యులవారి ననుగమించి తుదివరకు వారితోనే ఉండి కంచిలో ఆచార్యులవారి అనంతరం కామకోటిపీఠ పరిపాలన బాధ్యతను స్వీకరించి అచటనే సిద్ధిపొందారు.

ఆచార్యులవారు శిష్యులతో కలిసి భారతదేశం అంతటా రెండు పర్యాయములు విజయయాత్రలను సలిపారు. మొదట దుర్మతాలను ఖండించి అద్వైతజ్ఞాన మార్గాన్ని సుప్రతిష్ఠతం చేశారు.

రెండవ పర్యాయం అనేక పుణ్యక్షేత్రాలలో తీర్థాలను దైవములను సేవించుకొన్నారు. వాటిని ఉద్ధరించి యంత్ర ప్రతిష్ఠలు చేసి వైదికారాధన పద్ధతులను ప్రవర్తింపజేశారు. వైభవాన్ని లోకానికి ఉద్భోధించారు.

యోగశక్తితో భౌతికకాయాన్ని విడచి కైలాసానికి వెళ్ళి అచట పరమేశ్వరు నుండి ఐదు స్ఫటిక లింగాలను తీసికొని వచ్చారు. వాటితో సౌందర్యలహరి అనే అమ్మవారి స్తోత్ర గ్రంథాన్ని కూడ తీసికొని వచ్చారు.

ఆ ఐదు స్ఫటిక లింగాలలోను శృంగేరిలో భోగలింగాన్ని, చిదంబరలో మోక్షలింగాన్ని, నేపాలంలో వరలింగాన్ని, కేదారంలో ముక్తిలింగాన్ని ప్రతిష్ఠించారు. యోగలింగమును తామే స్వయంగా అర్చించుకొంటూ ఉండేవారు.

వీరు తమ విజయయాత్రలో జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి ఆలయానికి విచ్చేశారు. ఆమె ఉగ్రకళలను శాంతింప చెయ్యటానికై ఆమె దృష్టి కెదురుగా 'గణపతి'ని ప్రతిష్టించారు. శ్రీ చక్రాలను తాటంకాలుగా రూపొందించి ఆమెకు అలంకరించి తామే వాటిని ప్రతిష్ఠను నిర్వచించారు.

అలాగే శ్రీరంగంలో జనాకర్షణ యంత్రాన్ని, తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధిని ధనాకర్షణ యంత్రం మొదలైన ప్రతిష్ఠలను నిర్వహించారు.

అద్వైత వేదాంత ప్రచారానికి వేదోక్తధర్మ ప్రచారానికి అనువుగా యావదార్భతంలో పూరి, బదరీ, ద్వారక, శృంగేరి మున్నగు ప్రసిద్ధ క్షేత్రాలలో తమ శిష్యులద్వారా మఠాలను స్థాపన చేశారు.

ఇంతకు పూర్వం తమతల్లికి చేసిన వాగ్ధానం ప్రకారం ఆమె మరణసమయంలో ఆమె సన్నిధికివెళ్ళి ఆమెకు పుణ్యలోకాలను కల్పించి ఆమె ఉత్తర క్రియలను నిర్వర్తించారు.

వీరు సుమారు 18 భాష్యగ్రంథాలను 40 ప్రకరణ గ్రంథాలను 70 లేక 80 స్తోత్రాది లఘుగ్రంథాలను రచించి మనకు ప్రసాదించారు.

తరువాత కాంచీ క్షేత్రానికి విజయం చేశారు. అచట కామాక్షీదేవి ఉగ్రకళలను శాంతింపజేయటానికై సాలగ్రామ శిలపై శ్రీ చక్రాన్ని స్వయంగా లిఖించి అమ్మవారి ఎదుట ప్రతిష్ఠించారు. అచట వైదికారాధనా పద్ధతులను ప్రవర్తింపజేశారు.

మహారాజులు, మహాపండితుల ప్రార్థన నంగీకరించి కాంచీ క్షేత్రంలోనే అమ్మవారి ఎదుట 'సర్వజ్ఞ' పీఠాధిరోహణం చేశారు.*

ఇచ్చటనే ఆచార్యులవారి వద్దకొక బాలుడు తీసికొని రాబడ్డాడు. వయస్సు ఆరేళ్ళు. బాలునిపేరు మహాదేవ. తండ్రిపేరు వర్ధనుడు బాలుడు మూగవాడు. మాటలాడేవాడు కాదు. తండ్రి బాలుణ్ణి ఆచార్యుల వారి దర్శనం చేయించటం కోసం తీసికొనివచ్చాడు. ఆచార్యదర్శనానంతరం బాలుడు వాక్శుద్ధితో వారితోనే వేదాంతచర్చ ఆరంభించాడు. వారి శిష్యుడై ఆశ్రమ స్వీకారం చేసి వారివద్దనే ఉండి 'సర్వజ్ఞాత్ము'లనే పేరుతో ఆచార్యుల వారి అనంతరం కామకోటిపీఠ గురుస్థానమునం దభిషిక్తులైరి.

___________________________________________

*ఈ విషయం అంతా 'కామకోటి సర్వజ్ఞపీఠం' అనే శీర్షిక క్రింద ఇంతకు పూర్వం అధ్యాయంలో వివరింపబడినది.



తాము కైలాసం నుండి తెచ్చిన స్ఫటిక లింగాలలో ఐదవదగు యోగలింగమును శ్రీమేరువుతో సహా తామే అర్చించుకొంటూ కంచిలోనే శ్రీ శారదామఠము నందుండి తదధిష్ఠానమందు తామే జగద్గురువులుగా సుస్థితులైనారు. ఈ పరంపరలో అవిచ్ఛిన్నంగా జగద్గురువులు సింహాసనాభిషిక్తులై ధర్మపాలనం చేస్తున్నదే 'కంచి కామకోటిపీఠం'గా ప్రసిద్ధమైనది.

మోక్షపురియైన కంచిలో శ్రీకామాక్షి దేవ్యాలయం రెండవ ప్రాకారంలో ఆత్మానుభూతినొంది సిద్ధిపొందారు. ఆ ప్రదేశంలోనే ఆచార్యుల వారి పురుషాకృతి సమమైన శిలాప్రతిమ ప్రతిష్ఠంపబడి అది నాటినుండి నేటివరకు పూజల నందుకొంటున్నది. *

వీరి సిద్ధి సమయము రక్తాక్షి సంవత్సర వైశాఖశుద్ధ ఏకాదశి. (బి.సి. 477)

శివరహస్య గ్రంథము అతిప్రాచీనమైన ఇతిహాసము. తరువాతి శంకరవిజయ గ్రంథాలన్నింటికి ఇదే మూలమని చెప్పవచ్చు. సుమారు యాభైవేల సంఖ్యకు మించిన శ్లోకములిందున్నవి. ఇది కన్నడలిపిలో కన్నడ భాషానువాదంతో మైసూరు మహారాజా జయరామ రాజేంద్ర

___________________________________________ *సుప్రసిద్ధ కాశీ పండితులు శతవృద్ధులునైన, మహామహోపాధ్యాయ పద్మవిభూషణ శ్రీ గోపినాథ్‌ కవిరాజ్‌, ఎం.ఏ; డి.లిట్‌., గారు అద్వైత వేదాంతసంగ్రహ చరిత్రను సమీక్షించుతూ 'అచ్యుత' కాశీ నుండి వెలువడే పత్రికలో 56 వ పుటలో ఇలా వ్రాశారు.

శంకర సంప్రదాయ్‌ కే మతానుసార్‌ శంకర అంతిమ సమయ్‌ తక్‌ కాంచీ మేcహి థీ''

గంథమాలా సీరీస్‌లో నెం 32, 23వ సంపుటం 1950లో ప్రచురింపబడినది. అందు 200 పుటలో 16 అధ్యాయం, 9వ అంశంలో కంచి శ్రీఆదిశంకరుల సిద్ధిస్థానమని క్రింది శ్లోకంలో పేర్కొనబడినది.

తద్యోగభోగ వరముక్తి సుమోక్ష యోగ

లింగార్చనా త్ర్పాప్తజయ స్ప్వకాశ్రమం |

తాన్‌ వై విజిత్య తరసాక్షత శాస్త్రవాదైః

మిశ్రా 9 కాంచ్యామఠ సిద్ధిమాప ||

బెంగాలీ విజ్ఞాన సర్వస్వం (విశ్వకోశం)-1982 లో ప్రచురణ 'కంచీ' - అనే శీర్షిక క్రింద ఇట్లున్నది.

'కాంచీపుర్‌ ఏక్‌ ప్రాచీన్‌ మహాతీర్థ్‌ హై - కేవల్‌ తీర్థ్‌ హి నహీ(. కంచి మహాపీఠస్థాన్‌ హై. కామాక్షీదేవికా మందిర్‌ కుచ్‌ ఛోటా హై. ఇన్‌ కే ప్రాంగణ్‌మే( భగవాన్‌ శంకరాచార్య కా సమాధి హై. ఇన్‌ సమాధి పర్‌ ఉన్‌కీ ప్రస్తరమయీ మూర్తి ప్రతిష్టిత్‌ హై.

యావద్భారతమున రెండుమారులు దిగ్విజయయాత్ర చేసి వైదిక మతాన్నుద్ధరించి అద్వైతబ్రహ్మవిద్యా ప్రచారాన్ని భువియందు సుప్రతిష్ఠితం చేసిన శ్రీ ఆదిశంకరుల జీవిత చరిత్రను సమగ్రంగా విపులంగా వ్రాయటం సుసాధ్యం కాదు. అంతేకాక ఇచట విస్తరభీతిచే ప్రధానాంశాలు మాత్రం పేర్కొనబడినవి.

కాని వారు చూపిన ధర్మమార్గాన్ని అనుసరించి కృతుకృత్యులం కాదటం మనవిధి. అదియే మనం శంకరులయెడ చూపవలసిన గురుభక్తి..

షడ్భిరంగై రుపేతాయ విచిధైరవ్యయై రపి |

శాశ్వతాయ నమస్తుభ్యం వేదాయచ భవాయచ ||

Jagadguru divyacharithra   Chapters   Last Page