Sri Bhagavadgeetha Madanam-2
Chapters
26 ఉద్దవునకు శ్రీకృష్ణుడు పరమార్ధోపదేశము చేయుట శ్రీకృష్ణ నిర్యాణమునకు ముందు ఉద్ధవుడు పరమార్ధోపదేవము చేయుమని శ్రీకృష్ణుని కోరెను. అప్పుడు శ్రీకృష్ణు డుపదేశించిన భక్తి ధ్యాన మార్గంబులు గమనింపదగినవి. 1) ''నీ రూపం బేలాగున గానవచ్చు'' నను ఉద్ధపుని ప్రశ్నకు శ్రీకృష్ణుని సమాధానమును చూడుడు. ''భక్తి భావ పరాయణుండై కృపారస తత్పరుండై మిత భాష ణుండై బొంకక కర్మంబులు మదర్పణంబు సేసి యతండు భాగవతుండనం బరగు. మత్కథలను మజ్జన్మ కర్మంబులను వినుచు మత్సేవ కులైన భాగవతులం జూచి తన గృహంబునకు గొనిపోయి మజ్జన పూజన భోజన శయ నాసనాదికంబుల బరితుష్టులంజేసిన యతండైనను భాగవంతుండనబడు. ఇట్టెంతకాలము జీవించు నంతకాలంబును నడపు నతండు మద్రూపంబున వైకుంఠ నిలయంబు నొందు'' భాగవతుల కర్తవ్యమిందు గోచరించుచున్నది. (భాగవతము 11-90) 2) ధ్యానమార్గం బేరీతియాన తీయవలయుననిన హరి ఇట్లనియె ''ఏకాంత మానసులై హస్తాబ్జంబు లూరు ద్వయంబున సంధించి నాసా గ్రంబున నీక్షణంబునిలిపి ప్రాణాయామంబున నన్ను హృదయ గతుం గాదలంచి అసాదశ ధారణా యోగసిద్ధు లెఱింగి యం ణిమాదులు ప్రధాన సిద్ధులుగా దెలిపి, యింద్రియంబుల బంధించి మనం బాత్మయందుజే నాత్మతో గిలించిన బ్రహ్మాకుదంబు బొందు భాగవతశ్రేషు లితర ధర్మంబుల గానో దన్ను గాంతును.'' భాగవతము 11-90