Sri Bhagavadgeetha Madanam-2
Chapters
''భగవంత
మధికృత్య కృతం పురాణం భాగవతం'' భాగవతము
భగవత్తత్త్వార్థ ప్రతిపాదకము. భాగవతమున
భగవత్ సంబంధము లైన భక్తి వేదాంత విచారములేకాక,
భాగవతుల కథలు, ఆ భాగవతులు పాటించు పథము వివరింపబడినవి.
భగవంతుని చరితము భాగవతుల కథలతో
ముడిపడియుండుట సహజమే కదా! అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు దశమాస వయస్కుడై తల్లి గర్భమున నున్నప్పుడు అశ్వత్థామ ''అపాండవ మగుగాక'' అని బ్రహ్మాస్త్రము ప్రయోగించెను. ఆ బాణానలము గర్భస్థ శిశువగు పరీక్షిత్తుని దహింప మొదలిడెను. అంత శిశు విట్లు దిగులు చెందెను.
శ్రీ మహాభాగవతములో
అజామీళో పాఖ్యానము భగవన్నామ సంకీర్తన యొక్క
ప్రాశస్త్యమును చాటుచున్నది. నామ జపము
నిరంతరమగు భగవత్ స్మృతికి సాధనము.
నామానుసంధానము వలన మనోలయము సిద్ధించును.
భాగవతమున దక్షయజ్ఞ కథలో అభేదభక్తి చక్కగా నిరూపించబడినది. సర్వదేవతలు భగవన్మాయా విభూతులేనని భావించి అభేదభక్తిని పాటించవలయును. (శివకేశవ భేదము పాటించిన దక్షుడెట్లు శిక్షింపబడెనో చూడుడు) మార్కండేయోపాఖ్యానము ద్వాదశ స్కంధాంతమందు కలదు. భాగవతారంభమున పోతన తాను మహేశ్వర ధ్యానము సేయగా శ్రీరాము డగుపించి, శ్రీకృష్ణ చరితమైన భాగవతమును వ్రాయుమని కోరెను. ఇట్లు హరిహరులకు అభేదమని సూచించెను. మార్కండేయోపాఖ్యానమున ఈ అభేదభక్తియే గానవచ్చుచున్నది.
విషయానుక్రమణిక
విన్నపము
రామాయణము మహాకావ్యము;
భారతము మహేతిహాసము; భాగవతము మహా
పురాణము. కావ్యేతిహాసము లైన రామాయణ
భాగవతములు మానవునకు బాధ్యతాయుతమైన
ప్రవృత్తి ధర్మము నెక్కువగా బోధించు చున్నవి.
10-Chapter
11-Chapter
కలికాలమున మానవులు మందప్రజ్ఞులని భావించి వ్యాసుడు ఒకటిగానున్న వేదమును ఋగ్యజుస్సామాధర్వణములను నాలుగు వేదములుగా విభజించెను. స్త్రీ శూద్రుల నిమిత్తము భారతమును రచించి వేదార్థములను దెలిపి స్త్రీ శూద్ర
12-Chapter
13-Chapter
14-Chapter
ఈ కథవలన విష్ణు సాక్షాత్కారము కేవల ఆత్మానాత్మ విచారము చేతనే అనగా జ్ఞానమార్గము చేతనే సాధ్యమగునను అపోహను తొలగించుచున్నది. బాలకుడైన ద్రువునకు శాస్త్రపరిజ్ఞానము లేదు. పంచవయస్కుడగు బాలుడగుటచే వైదిక
15-Chapter
భరతుడను మహారాజు పంచజని యను కన్యను పెండ్లియాడి, అహంకారమునకు పంచ తన్మాత్రలు పుట్టిన రీతిని, ఏవురు పుత్రులను కనెను. అతడు ధర్మంబున రాజ్యము చేయుచుండి భగవదారాధనల యందు కాలము గడపి ఏబది
16-Chapter
భీముని గదా ఘాతములచేత దుర్యోధనుడు తొడవిరిగి కూలగా దుర్యోధనునకు ప్రియము సేయనెంచి అశ్వత్థామ నిదురించు ద్రౌపది పుత్రుల (ఉపపాండవుల) శిరములు ఖండించెను. ఆ వార్తవిని ద్రౌపది నేలబడి ఏడ్చెను.
17-Chapter
గజేంద్రమోక్షము జీవుడు ముక్తినిజెందు కథ. ''గజరాజ మోక్షణ కథను వినువారికి మోక్ష మరచేతిదై యుండు'' (8-135) నని ఫలశ్రుతి యందు చెప్పబడినది.
18-Chapter
శ్రీహరిచేత తన తమ్ముడగు హిరణ్యాక్షుడు నిహతుడు కాగా హరిని నిర్జించుటకై హిరణ్యకశిపుడు బ్రహ్మనుగూర్చి తప మొనరించెను.
19-Chapter
భగవత నవమ స్కంధమున అంబరీషోపాఖ్యానము కలదు. మహాభక్తుడైన అంబరీషునియెడ ''జగదప్రతిహతంబైన బ్రాహ్మణ శాపము'' నిరర్థక మయ్యెను, అట్లే బ్రాహ్మణుడైన అశ్వత్థామచే ప్రయోగింపబడిన ''ప్రతిక్రియా
20-Chapter
బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని విచిత్రమైన లీలలు విని, అతనిని పరీక్షింపదలచెను. గోవులను, గోపకులను మాయచేసి ఒక గుహలో దాచియుంచెను. శ్రీకృష్ణుడిది బ్రహ్మచేసిన పనిగా గ్రహించి గోవుల గోపకుల రూపములను తానే పొంది ఒక
21-Chapter
శ్రీకృష్ణుని సేవించుటకై దేవతలు ఋషులు గోవులు గోపికలై పుట్టిరి. ఒకప్పుడు కా త్యా య నీ వ్రతనిష్ఠలై గోపికలు వివస్త్రలై స్నానము చేయుచుండిరి. ఇది వ్రతభంగ కారణ మగుటచేత కృష్ణుడు వారిని మందలింపదలచి
22-Chapter
భగవద్భక్తురాలికిని పతివ్రతకును చక్కని సామ్య మున్నది. గోపికలు కామోత్కంఠత, ఉద్ధామ ధ్యాన గరిష్ఠులై శ్రీహరిని పొంద గలిగినట్లే, పతినే ప్రత్యక్షదైవముగా భావించి పతివ్రత త త్సేవా నిమగ్నురాలై తరింపవచ్చునని రుక్మిణీ కల్యాణ కథ సూచించుచున్నది.
23-Chapter
వృత్రాసురవధ కథ ఋగ్వేదము, యజుర్వేదము, భారతము, భాగవతము, దేవీ భాగవతము, పరాశర సంహిత-వీనియందు కలదు. రామాయణముకూడ వృత్రాసురవధ నాధారముగ జేసికొని వ్రాసినదే నని పెద్దల అభిప్రాయము. ఇన్నిటియందు ఈ కథ అగుపించుటచేత దీని ప్రాశస్త్యమును గూర్చి తెలుపనవసరములేదు.
24-Chapter
''అనౌచిత్య దృతేనాన్య ద్రస భంగస్య కారణమ్'' ఔచిత్యము లోపించిన రసభంగ మగును. రసపోషణ చేయునప్పుడు ఔచిత్యమును తప్పక పాటించవలయును. ఔచిత్యములేని విషయమును ఎంతటి రస పోషణతో వివరించినను రసభంగమే యగును.
25-Chapter
పోతన జీవితమే ఒక భాగవతము. అతడు ప్రహ్లాద కుచేలాది భాగవత భక్తులతో తాదాత్మ్యము బొందియుండెడి భాగవత నైష్ఠికుడు. షష్ఠస్కంధమున సింగన సుక వినుతి యొనర్చుచు పోతనగూర్చి ఇట్లు వ్రాసెను.
26-Chapter
మార్కండేయోపాఖ్యానము ద్వాదశ స్కంధాంతమందు కలదు. భాగవతారంభమున పోతన తాను మహేశ్వర ధ్యానము సేయగా శ్రీరాము డగుపించి, శ్రీకృష్ణ చరితమైన భాగవతమును వ్రాయుమని కోరెను. ఇట్లు హరిహరులకు అభేదమని సూచించెను. మార్కండేయోపాఖ్యానమున ఈ అభేదభక్తియే గానవచ్చుచున్నది.
27-Chapter
28-Chapter
భక్తి రసమా? భాగవతము భక్తి ప్రధానమైన గ్రంథము. నవ రసములనేగాక భక్తినికూడ రసముగా పరిగణింపవచ్చునా? ప్రాచీనాలంకారికులగు విశ్వనాథ కవిరాజు, మమ్మటుడు, జగన్నాథ పండితుడు, హేమచంద్రుడు మొదలగువారు భక్తిని ఒక భావముగా పరిగణించిరి.
భాగవత పురాణమున తొలుతనే భాగవత సందేశము, దృక్పథము, సారము వివరింపబడినవి. పోతర 5 పద్యములలో ఈ సారమును వివరించి పాఠకులను ఈ పద్యముల భావము గ్రహించికాని భాగవతమును పఠించుట వ్యర్థమని హెచ్చరించెను.
''భాగవతో వాజ్మయావతారః'' భాగవత పురాణమే వాజ్మయ రూపమైన భగవదవతారమని పెద్దలు అన్నారు. ఈ పురాణములో భగవంతుని దశావతారములేగాక కపిలాది ఇతరఅవతారములు కూడ చేర్చబడినవి.
31-Chapter
మానవుడు దుఃఖ నివృత్తికి, సుఖప్రాప్తికి నిరంతర కృషి సల్పుచున్నాడు. అన్ని మతములు దుఃఖ నివృత్తికి సుఖప్రాప్తికి మార్గములు సూచించుచున్నవి. షడ్దర్శనములు పురాణములు ఇట్టి ఉద్దేశ్యముతోనే వ్రాయబడినవి.
మతప్రసక్తి నేటికాలమున వివాదగ్రస్తమైనది. కాని భాగవతము నిరూపించిన మతము సర్వ సమ్మతమైన మతమని విశ్వశ్రేయోదాయకమని విశదపరచుటకు ప్రయత్నింతును. భారతము, అందలి భగవద్గీత ''కులధర్మ గౌరవమునకు
33-Chapter
చేతిలో ఒక పాదమును పట్టుకొని ఆ పాదముయొక్క బొటన వ్రేలిని నోటిలో నుంచుకొని అశ్వత్థపత్రముపై శయనించి యున్న బాలకృష్ణుని స్మరించుచున్నాను.