Sri Bhagavadgeetha Madanam-2
Chapters
29. భాగవత పద్య రత్నములు భాగవత పురాణమున తొలుతనే భాగవత సందేశము, దృక్పథము, సారము వివరింపబడినవి. పోతర 5 పద్యములలో ఈ సారమును వివరించి పాఠకులను ఈ పద్యముల భావము గ్రహించికాని భాగవతమును పఠించుట వ్యర్థమని హెచ్చరించెను. 1) చ|| జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్త వ ర్తనుడగు చక్రికిం గవు లుదాంపదంబుల జన్మకర్మముల్ వినుతులు సేయుచుందురు, వేదరహస్యములందు నెందు జూ చిన మఱిలేవు జీవునికి జెప్పిన కై వడి జన్మ కర్మముల్ భాగవతము 1-68 భాగవతము నిగమార్థ ప్రతిపాదక మగుటచేత దానిలో కథల మూలమున వేదములోని సత్యములు వెల్లడింపబడినవి. ఆ కథల సంకేతముల గ్రహించి శ్రీకృష్ణలీలల అంతరార్ధమును తెలిసికొనవలయును. జీవునికి వలె దేవునికి జన్మ కర్మముల వేదమున చెప్పలేదు. అయినను కవులు దేవుని జన్మకర్మముల వినుతించిరి. భాగవతము భగవంతుని ఏక వింశ్యవతారములు వర్ణించెను. వేద రహస్యము దెల్పుటకై 'భువన క్షేమంకరంబైన భాగవతామ్నాయము బాదరాయణుడు తా కల్పించె నేర్పొప్పగ9'' అని పోతన తెలిపెను. 2) భువనశ్రేణి నమోఘలీలు డగుచుం బుట్టించు రక్షించు, నం తవిధి9జేయు, మునుంగ డందు, బహుభూత వ్రాత మందాత్మ తం త్ర విహారస్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియు9 దవ్వుల9 దివి భంగింగొను, జిక్క, డింద్రియముల9 ద్రిప్పు9 సింబం ధించుచు9 భాగవతము1-63 ఈ పద్యములో సృష్టికి కారణము తెలుపబడినది. భగవంతుడు త్రిగునాత్మకమైన మాయచేసృష్టి స్థితి లయములను జేయుచు ఆత్మరూపమున వెలుగొందును. ఆతనికి సంసారబంధము లంటవు. సర్వమునకు కారణ మతడే. ఈ అభిప్రాయమే భగవద్గీతయందు చెప్పబడినది. శ్లో|| ఈశ్వర స్పర్వ భూతానాం హృద్దేశేర్జున! తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా గీత 18-16 సర్వభూతముల హృదయములందును ఈశ్వరుడున్నవాడై యంత్రగాడు కీలుబొమ్మల దిప్పునట్లు తన మాయచేత సమస్త భూతముల నాడించుచున్నాడు. శ్లో|| మయాధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్ -గీత 9-10 నా అధ్యక్షతచేతనే చరాచరమగు సమస్త భూతములను ప్రకృతి పుట్టించుచున్నది. 3) జగదధి నాథుడైన హరి సంతత లీలల నామరూపముల్ దగిలి మనో వచోగతుల దార్కిక చాతురి ఎంత గల్గియున్ మిగిలి కుతర్కవాది తగ మేరలుమీరి ఎఱుంగ నేర్చునే యగణిత నర్త నక్రమము ఆజ్ఞు డెరింగి నుతింప నోపునే. భాగవతము 1-76 తర్కము మనస్సువరకే పరిమితము. ఇంద్రియములకు మనస్సునకు అతీతమైన భగవంతుని లీలను తర్కబలముతో విమర్శింపతగదు. నామ రూపాత్మకమైన జగత్తును అనుసరించు మానవుడు చేయు తిర్కము కుతర్కమై భగవంతుని లీలలను గ్రహింపజాలదు. ఇంద్రియ మనో నిగ్రహమునగాని ఆత్మానుభూతి కలుగదు. భాగవతమును తర్కదృష్టితో పఠింపరాదని పాఠకులకు హెచ్చరిక చేయబడినది. 4) ఇంచుక మాయ లేక మది నెప్పుడు పాయని భక్తి తోడ వ ర్తించుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సే వించు నతం డెఱుంగు నరవింద భవాదులకై న దుర్లభో దంచితమైన యాహరి యుదార మహాద్భుత కర్మమార్గముల్. భాగవతము 1-71 హరి లీలలను గ్రహించుటకు భక్తియే సాధనము. భక్తి యనగా ఇంద్రియము లీశ్వరపర మొనర్చి మనస్సును ఏకాగ్రతతో భగవంతునిపై నిలుపుట. ఇది రజస్తమో పరిహారిణియైన భాగవతభక్తి. బ్రహ్మాదులకుకూడ హరిభక్తియే తరుణోపాయము. 5) మ|| హరి పాదద్వయ భక్తి మీవలన నిట్లా రూఢమై యుండునే తిరుగం బారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్ ధరణీ దేవతలారా మీరలు మమా ధన్యులో సమస్త జ్ఞులున్ హరిచింతన్ మిముజెంద వెన్నడును జన్మాంత వ్యథా యోగముల్. భాగవతము 1-72 హరిపై చిత్తవృత్తి గలవారు జన్మాంతర వ్యధలను పొందరు. వారి కర్మలు నశించి ఉద్దాను ధ్యానగరిష్ఠులై ముక్తిని గాంతురు. విశ్వమానవ కల్యాణ విజయ భేరీ రవములు రోదసి మారు మ్రోడునట్లు పోతన పై భాగవత సందేశము ప్రపంచమునకు జాటెను. ఈ సందేశము కేవలమొక జాతిని, ఒక దేశమును, ఒకకాలమును ఉద్దేశించినది కాదు. ఆతని కృతి సార్వకాలికత్వము సార్వదేశికత్వము గాంచినది. ప్రపంచమున ఏ మానవుడై నను మోక్షమును పొందగోరిన ఇంద్రియ మనోనిగ్రహములు సాధింపవలయును. అది భక్తి మార్గముచే సాధ్యమని భాగవతము సూచించినది. కులమత వివక్షతలేక ఈ మార్గమును అందరు అనుసరింపవచ్చును. అందువలన భాగవతము భువన క్షేమం కరము, వేద కల్పవృక్ష విగళితము, త్రిజగద్వర మంగళము, పరమ భాగవతులు పాటించు పథము.