Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

32. వర్ణవ్యవస్థ

రామాయణ భారత భాగవతములు

కుల ధర్మము:-

మతప్రసక్తి నేటికాలమున వివాదగ్రస్తమైనది. కాని భాగవతము నిరూపించిన మతము సర్వ సమ్మతమైన మతమని విశ్వశ్రేయోదాయకమని విశదపరచుటకు ప్రయత్నింతును. భారతము, అందలి భగవద్గీత ''కులధర్మ గౌరవమునకు ప్రాధాన్యత నివ్వగా భాగవతము ''కులధర్మ గౌరవము సిద్ధి వహించునె ఎన్ని మేనులన్‌'' అని ప్రశ్నించుచున్నది. భక్తికి ప్రాధాన్యత నిచ్చుచున్నది.

చ|| తన కులధర్మమున్‌ విడచి దానవవైరి పదార విందముల్‌

పనివడి సేవ సేసి పరిపాకము జెందక ఎవ్వడేని జ

చ్చిన మఱుమేననై న నది సిద్ధి వహించు; దదీయ సేవ బా

పిన గులధర్మగౌరవము సిద్ధి వహించునె ఎన్ని మేనులన్‌

భాగవతము 1-100

బ్రాహ్మణు డెవరు :-

˳ØgRiª«s»R½ª«sVV ""xqsµj…*ÇÁ úZaP[¸R…V''\®ªsVƒ«s úgRiLiµ³R…ª«sVV. gS¸R…Vú¼d½»R½»yòQ*LóRi úxms¼½FyµR…NRP\®ªsVƒ«s úgRiLi´R…ª«sV¬s ¬sLRiWzmsLiÀÁ¸R…VVLiÉÓÁ¬s. µj…*ÇÁ aRP‡ôÁª«sVVƒ«sNRPV ryµ³yLRiß᪫sVVgRi úËØx¤¦¦¦øßáV ²R…¬s @LóRiª«sVV.

జన్మనా జాయతే శూద్రః

కర్మణా జాయతే ద్విజః

గాయత్రి ఉపదేశముచేత వైదిక కర్మాచరణమునకు అధికారియైనవాడు కర్మ లేదా వృత్తిపరముగా బ్రాహ్మణుడు. గుణపరముగా తీసికొన్నచో సత్త్వగుణ ప్రధానుడు బ్రాహ్మణుడు. జ్ఞానపరముగా బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రాహ్మణుడు. ఏ నిర్వచనము నుద్దేశించి బ్రాహ్మణ శబ్దము వాడబడిదో పరిశీలించిగాని ఆ యా సందర్భానుసారము అర్థము చెప్పుటకు వీలుపడదు. అనగా కర్మబ్రాహ్మణుడా గుణ బ్రాహ్మణుడా జ్ఞానియా అని తెలిసికొనవలయును.

భాగవతమున బ్రాహ్మణునిగూర్చిన ప్రశంసలను పరిశీలింతము. అనేక స్థాయిలకు చెందిన బ్రాహ్మణులు ఇందు కనుపించుచున్నారు.

1) భగావతములో ప్రథమమున చెప్పబడిన కథ పుత్రఘాతి యగు ఆశ్వత్థామ నవమానించుకథ. ఆశ్వత్థామ బ్రాహ్మణుడు, గురు పుత్రుడు. కాని ఉపపాండవులను జంపిన శిశుహంత. సత్వగుణ ప్రధానుడుకాడు. హంతవ్యుడు. క్షంతవ్యుడుకాడు. పుత్రశోకమున కుములుచున్న ద్రౌపదివద్దకు రెక్కలుకట్టుకొని తీసికొనిరాబడిన అశ్వత్థామను జూచి ఆమె నిందింపక నమస్కరించినది. ఇచట ద్రౌపది ''సుస్వభావ'' యని చెప్పబడినది. ఆమెయే సత్త్వగుణమున మిన్న. ఆశ్వత్థామను చంపజూచు భీమార్జునులను వారించినది. అతడు భూసురుడు కావున ''ప్రాణ విముక్తుడైన అతిపాపము, బ్రాహ్మణ హింస మానరే'' అని బోధించినది.

ఆమె ఇట్లనియెను

క|| భూపాలకులకు విప్రుల

గోపింపం జేయదగదు. గోపించిన ద

త్కోపానలంబు మొదలికి

భూపాలాటవుల గాల్చు భూకంపముగన్‌

భాగవతము 1-168

''బ్రాహ్మణో నహంతవ్య'' మని వేదము శ్రుతంబగుటచేత ఆశ్వత్థామను సంహరింప సంరంభమున జనుదెంచు భీముని వారించుటకు ఇతరులకు సాధ్యముగాదని శ్రీకృష్ణపరమాత్మయే చతుర్భుజుడై భీముని వారించి ఆశ్వత్థామను కాపాడెను. ఇచట ఆశ్వత్థామ కర్మ చేత బ్రాహ్మణుడు. సత్త్వగుణముగాని జ్ఞానము గాని లేదు. ఉపపాండవులను నిద్రించువారిని జంపినవాడు, క్షాత్రధర్మము కలవాడు. కర్మమాత్ర బ్రాహ్మణుడు.

2) సనక సనంద నాదులు శ్రీహరిని దర్శింప వై కుంఠమున కేగిరి. వాటిని ద్వారపాలకులైన జయ విజయు లడ్డిగించిరి, వారు కోపగించి ద్వారపాలకుల శపించిరి. అంత శ్రీహరి చనుదెంచి వారిని మన్నింపుమని. సనక సనందనాదుల కోరెను. మహర్షులు, జ్ఞానులు, బ్రాహ్మణులైన సనక సనందనాదులను ప్రశంసించెను. యజ్ఞములో వ్రేల్చిన నేయికంటె భూసురుడు భుజించిన ఆహారమే శ్రీహరి నెక్కువగా తృప్తి పరచునట.

చ|| క్రతువులు సేయుచో శిఖి ముఖంబున వ్రేలుచున్నట్టి తద్ఘృత

ప్లుత చరు భక్షణన్‌ ముదము బొందదు నిస్పృహ ధర్మమార్గసం

స్తృత కబళంబునన్‌ మనము తృప్తి వహించినరీతి మిచ్చలున్‌

భాగవతము 3-560

''వర విప్రాను పదైక పుణ్య రజమే'' శ్రీహరి కాభరణమట సనక సనందనాదులు మహర్షులు. జ్ఞానులు బ్రహ్మచారులు ''వర విప్రులు''.

3) సప్తమస్కంధమున పూజించుటకు నారాయణుడు. పాత్రంబని తెలుపబడినది. పురుషులలోన హరి తనువైన వేదంబును ధరించు సంతోష విద్యా తపో గరిష్ఠుడైన బ్రాహ్మణుండు పాత్రంబు. బ్రాహ్మణులలోన ఆత్మజాన పరిపూర్ణుడైన యోగి మఖ్యపాత్రము.

ఆ|| అఖిల లోకములకు హరిదైవతము సూడ

హరికి దైవతము ధరాధినాథ!

పద పరాగలేక పంక్తి చే ద్రైలోక్య

పావనంబు సేయు బ్రాహ్మణుండు. భాగవతము 7-551

ఇచ్చట బ్రాహ్మణుడై ఆత్మజ్ఞాన పరిపూర్ణుడైన యోగి చెప్పబడెను.

4) పరీక్షిత్తు మృగయా వినోదియై చరించి దప్పిగొని శమీకముని కడకేగి దాహము తీర్చమని కోరెను. కాని శమీకుడు ''ప్రత్యాహ్తృత బాహ్యాంతరింద్రియుం డగుట నిమీలిత లోచనుండై'' సమాధి యందు బాహ్య ప్రపంచమును మరచి యుండుటచేత బదులు పలుకడయ్యెను. అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహముగలిగి ఆవస్థాత్రయము దాటి శమీకుడు సమాధిస్ధితిలో నుండెను. అట్టి బ్రాహ్మణశ్రేష్ఠు నవమానించుటయే పరిక్షిత్తునకు శాపకారణ మయ్యెను. ఇచట శమీకుడు యోగారూఢుడు.

పై ఉదాహరణములలో బ్రాహ్మణ ప్రశంస గానింపబడినది. కాని అప్రతిహతమైన బ్రాహ్మణతేజము రిత్తపోయిన సంఘటనలను కూడ భాగవతము వర్ణించినది.

1) అశ్వత్థామ లోకమంతయు అపాండవ మగుగాక అని ప్రయోగించిన బ్రహ్మాస్త్రము ఉత్తర గర్భమునందున్న శిశువును బాధింపగా ఆమె శ్రీకృష్ణుని శరణు వేడెను.

క|| దుర్భర బాణానలమున

గర్భములో నున్న శిశువు ఘన సంతాపా

విర్భావంబున బొరలెడి

నిర్భరకృప గావవయ్య విఖిల స్తుత్యా!

భాగవతము 1-179

అప్పుడు శ్రీకృష్ణుడు చక్రహస్తుడై వైష్ణవ మాయచే ద్రోణతనయుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నడచెను. ''ఇట్లు ద్రోణ తన యుండేసిన ప్రతిక్రియా రహితంబైన బ్రహ్మ శిరంబనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవతేజమున నిరర్థకం బయ్యె. నిజమాయచే సకలలోక సర్గస్థితి సంహారంబు లాచరించునట్టి హరికి ధరణీసుర బాణనివారణంబు విచిత్రంబు గాదు.''

2) దక్షప్రజాపతి ఆల్లుడగు శివువి ఆహ్వానింపక యజ్ఞముసేయ బూనెను. పార్వతి (సతీదేవి) తన తండ్రియగు దక్షుడుచేయు యజ్ఞమును స్త్రీ చాపల్యమున శివుని మాటలు లెక్కసేయక చూడవచ్చెను. దక్షుడామెను తిరస్కరించెను. ఆమె వెనుకకు మరలిపోవ నిచ్చగించక యోగాగ్నిచే తన్నుతాను దహించుకొనెను. ఆమె వెంట వచ్చిన రుద్రగణములు కోపించి యజ్ఞశాలను ధ్వంసము సేయబూనిరి. అది గాంచి భృగుమహాముని అభిచారికహోమము గావించి దేవతలను సృష్టించి వారివలన రుద్రగణములను తరిమి వైచెను. బ్రాహ్మణ తేజము నెదిరించి రుద్రగణములు నిలువజాలక శివుని కడకేగి జరిగినది చెప్పిరి. అంతట శివుడు కుపితుడై వీరభద్రుని సృష్టించెను. వీరభద్రునకుకూడ తాను బ్రాహ్మణతేజము నెదింపగలనా యను సందేహము కలిగెను.

శివు డతని నిట్లాజ్ఞాపించెను

చ|| గురు భుజ శౌర్యభూరి రణకోవిద మద్భట కోటికెల్ల నీ

వరయ వరూధినీ వరుడవై చని యజ్ఞముగూడ దక్షునిన్‌

బరువడి ద్రుంపు మీ వచట బ్రాహ్మణతేజ మజేయమంటివే

నరిది మదంశ సంభవుడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్‌.

భాగవతము 4-109

వీరభద్రుడు రుద్రాంశ సంభూతు డగుటచే బ్రాహ్మణతేజ మతనిని ఎదిరింపజాలదని శివుడు తెలిపెను. వీరభద్రుడు దక్షునిజంపి భృగువు మొదలగు ఋషులను పరిభవించెను. బ్రాహ్మణతేజము భగవంతుని ఆంశసంభవుడగు వీరభద్రునిముందు నిలువజాలదయ్యెను. మహర్షులుకూడ ఎదిరింపజాలరైరి.

3) అంబరీషుడనురాజు విష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతము సేయుచున్నఎడ దూర్వాసు డతిదిగా నేతెంచెను. అతడు స్నానసంద్యాద్యనుష్ఠానముల దీర్చుకొనుటకై వెడలి తడ వొనర్చెను. ఏకాదశి ఘడియలు మించిపోవుటచేత అంబరీషుడు ఉదకపాన మొనర్చెను. దూర్వాసుడు దానిని గ్రహించి కుపితుడైయతనిపై కృత్యను (బ్రహ్మదండము) ప్రయోగించెను. అంత శ్రీహరి అంబరీషుని గాపాడుటకై సుదర్శనమును బంపెను. అది కృత్యను సంహరించి అంబరీషుని వెన్నంటెను. బ్రహ్మ, శివుడు, విష్ణువు - వీరెవ్వరు. దూర్వాసుని సుదర్శనము నుండి రక్షింపరైరి. తుదకతడు అంబరీషునే శరణు జొచ్చెను. అంబరీషుడు సుదర్శనమును ప్రార్థించి దాని నుపశమింప జేసెను.

ఈ కథలో జగద ప్రతిహతమైన బ్రాహ్మణశాపము భాగవతుడైన అంబరీషునిఎడ నిష్ఫలమయ్యెనని చెప్పబడినది.

ఇట్లు పై కథలలో సత్వగుణ ప్రధానమైన బ్రాహ్మణతేజము నిర్గుణుడైన భగవంతునిముందు నిష్ర్పయోజనమని తెలియుచున్నది. బ్రాహ్మణుల విషయ మిట్లుండ చాతుర్వర్ణములు భగవంతుడేల సృష్టించెను?

చాతుర్వర్ణములు:- గీతయందు భగవంతు డిట్లు తెలిపెను.

శ్లో|| చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః

తస్య కర్తారమపి మాం విద్ధ్య కర్తార మవ్యయమ్‌

గీత 4-13

సత్యరజస్తమోగుణ విభాగముచేతను కర్మవిభాగము చేతను నాచే నాలుగు వర్ణములు సృజింపబడెను. వానికి కర్తను నేనై నను మాయకు వశుడను గాకపోవుటచేత నాకట్టి కర్తృత్వములేదు.

అనగా మాయ సత్వరజస్తమో గుణాత్మకమైనది భగవంతుని అధ్యక్షతచేతనే త్రిగుణములతో సృష్టి జరిపినది. మానవులు త్రిగుణాత్మకులు. అందులో సత్వగుణప్రధానమువలన బ్రాహ్మణులు, సత్వోవనర్జన రజమువలన క్షత్రియులు. తమ ఉపసర్జన రజఃప్రధానముచేత వైశ్యులు, రజ ఉపనర్జన తమఃప్రధానముచేత శూద్రులు గుణకర్మ విభాగమున ఏర్పడిరి.

శ్లో|| బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాంచ పరంతప!

కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభ##వైర్గుణౖః గీత 18-41

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులకు కర్మములు స్వభావము నుండి పుట్టిన గుణములచే విభజింపబడినవి. ఆనువంశికముగా (heri-ditary) సంభవించి సత్వప్రధానములైన శమదమాది స్వాభావిక సాత్విక లక్షణములు సంక్రమించుటచే బ్రాహ్మణులకు క్రింది కర్మలు విధింపబడినవి.

శ్లో|| శమో దమస్తప శ్శౌచం క్షాన్తి రార్జన మేవచ

జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బాహ్యకర్మ స్వభావజమ్‌

గీత 18-42

అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము, తపస్సు, శౌచము, క్షమ, ఋజుత్వము, జ్ఞానము అనుభవజ్ఞానము, ఈశ్వరుడు గలడను నమ్మకము, ఇవి బ్రాహ్మణునకు స్వభావములగు కర్మములు.

అట్లే క్షత్రియులకు

శ్లో|| శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం యుద్ధేచా ప్యపలాయనమ్‌

దాన మీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్‌

గీత 18-43

శూరత్వము, పరాక్రమము, ధైర్యము, సామర్ధ్యము, యుద్ధమున వెనుదీయకుండుట, దాతృత్వము, పరిపాలనా శక్తి యనునవి క్షత్రియునకు స్వభావమైన కర్మములు. వైశ్య శూద్రులకు

శ్లో|| కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్‌

పరి చర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్‌

గీత 18-44

వ్యవసాయము, పశు సంరక్షణము, వ్యాపారము ఇవి వైశ్యుల స్వభావ కర్మములు. పరిచర్యచేయుట శూద్రుల స్వభావము.

అయితే వారివారి కర్మలు వారు ఈశ్వరార్పణబుద్ధితో నిష్కామముగా ఆచరించిన ముక్తి లభించునవి పరమాత్మ వచించెను.

శ్లో|| స్వే స్వేకర్మ ణ్యభిరత స్సం సిద్ధిం లభ##తే నరః

స్వకర్మ నిరత స్సిద్ధిం యథా విన్దతి తచ్ఛృణ

--గీత 18-45

శ్లో|| యతః ప్రవృత్తి ర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః

--గీత 18-46

ప్రతివాడును కర్మములయం దాసక్తి గలవాడైనచో జ్ఞానయోగ్యుడగును. తన కర్మను విడువకుండువాడు సిద్ధినెట్లు బొందుచున్నాడో వినుము. సర్వభూతములకు బుట్టుక మొదలగు వ్యాపార మెవ్వరివలన గలుగుచున్నదో ఏ పరమాత్మ ఈ ప్రపంచమంతటను నిండియున్నాడో అట్టి పరమాత్మను స్వకర్మచే బూజించు మానవుడు సిద్ధిబొందును.

మానవునకు గృహాభివృద్ధికిని నంఘ పురోభివృద్ధికిని తోడ్పడ వలసిన భాధ్యత లున్నవి. రెండవదగు సంఘ పురోభివృద్ధికి చాతుర్పర్ణ్య ధర్మములను చక్కగా నిర్వర్తించశవలెను. కేవలము ఒక వర్ణమువలననే సంఘము పురోభివృద్ధి గాంచదు. వైదికకర్మలైన యజ్ఞయాగాదు లొనర్చి దేవతల తృప్తి పరచి వర్షముల కురిపించి దేశము సుభిక్షముచేయు బ్రాహ్మణులుమాత్ర మున్నచాలదు. దేశరక్షణకు క్షత్రియులు వ్యాపారమునకు వైశ్యులు శూద్రులు అవసరమే కదా. అందరికి బాధ్యతలు విధింపబడినవి. ఒకరిపై యొకరు ఆధారపడవలసియున్నది. ఒకని దేహములో అన్ని అవయవములు తమ తమ కార్యములను సక్రమముగా నిర్వర్తింప గలిగినప్పుడే దేహాము స్వస్థతకలిగి ఆరోగ్యముగా పురోగమించును. అట్లే సంఘ పురోభివృద్ధికి అన్ని వర్ణములవారు తమ తమ బాధ్యతలను నెరవేర్చవలయును. అందులకే విరాట్‌ పురుషునిదేహము పురుషసూక్తము నెట్లు వర్ణింపబడినదో చూడుడు.

బ్రాహ్మణో న్య ముఖ మాసీత్‌

బాహూ రాజన్య కృతః

ఊరూ తదస్య యద్వైశ్యః

పద్భ్యాం శూద్రో అజాయతే

అంగములలో ఏది లోపించినను ముప్పు వాటిల్లును.

అయినచో ఆనువంశికముగా ఇట్టి వర్ణవిభజన ఏర్పాటుచేయుట ఎందులకని ప్రశ్నింపవచ్చును. అనువంశికముగా శిశువునకు గుణములు సంక్రమించునవి ఆర్యుల నమ్మకము. క్షత్రియులకున్న శౌర్యగుణము బ్రాహ్మణులకు లేదు. అందులకే భారతమున బ్రాహ్మణులకు క్షత్రియులకు భేదమిట్లు చూపబడినది.

ఉ|| నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కుదారుణా

ఖండల శస్త్రతుల్యము..... ..... విక్కమీ

రెండును రాజులందు విపరీతము...... .......

నేటి మనస్తత్వ శాస్త్రజ్ఞులుకూడ జీనులవలన వంశములోని పూర్వులనుండి, తల్లిదండ్రులనుండి కొన్ని స్వభావ లక్షణములు గుణములు శిశువునకు సంక్రమించునని ఆ శిశువు పురోభివృద్ధికి అని పెట్టు బడిగా ఉపయోగపడునని భావించిరి. పరిసర ప్రభావమువలన ఈ సంక్రమించిన గుణములు వృద్ధి చెందునని కూడ భావించిరి. కాని ఒక్కొక్కపుడు ప్రహ్లాదునివంటి పరమ భాగవతులు రాక్షస కులమునను పుట్టవచ్చును.

వర్ణవిభజన ప్రకృతి విరుద్ధమా:-

మానవులలో గాక కర్మవిభాగము జంతువులు కీటకములలో కలదా? జీవశాస్త్రజ్ఞులు సృష్టిలోని రహస్యములను పరిశీలించిరి. చీమలలోను, తేనెటీగలలోను క్రమవిభాగము జరిగినదని వారు కనుగొనిరి, చీమలలో ఒక రాణిచీమ, కొన్ని రాజులనబడు మగచీమలు, సంరక్షిణకై కొన్ని సైనికచీమలు, ఆహార సేకరణకై కొన్ని పనిచేయు చీమలు ఏర్పడియున్నవి. ఇట్టి స్వత స్సిద్ధమైన కర్మవిభాగము కొన్ని జీవ రాసుల యం దగుపించుచున్నది. అందువలన వర్ణవిభజన ప్రకృతి విరుద్ధము కాదని చెప్పవచ్చును.

అన్ని వర్ణములకు ముక్తి లభించునా?

తమోగుణు రజోగుణు వీనిని తొలగించుకొని శుద్ధ సత్త్వ గుణము నందుటయే బ్రాహ్మ్యము. ''సత్వాత్‌ సంజాయతే జ్ఞానమ్‌'' శుద్ధసత్త్వము లేదా బ్రాహ్మ్యమువలన జ్ఞాన మేర్పడును. ముక్తి లభించును. దీనిని తెలుపుటకు ఘటికాచల మాహాత్మ్యమున నొక ఇతి హాసము కలదు.

ఇంద్రద్యుమ్నుడను రాజు విష్ణుభక్తుడై మరణ సమయమున శ్రీహరిని ధ్యానింపక ''హరహర'' యని పొరపాటున ఉచ్చరించి మరణించెను. ఆతడు శ్రీప్రదమైన శివపదము అనగా కైలాసము జేరెను. ఈశ్వరుడు వృషభ వాహనారూఢుడై దర్శన మిచ్చెను. ''నే నెందులకు కైలాసము జేరితి?'' ననియు ''వైకుంఠము నేల జేరనైతి'' ననియు ఇంద్రద్యుమ్నుడు ప్రశ్నించెను. అంత శివుడు ''నేనులేని విష్ణువులేడు. మాకు భేదములేదు. నీకేమి కావలయునో కోరుకొమ్మ'' నేను. ''నాకు మోక్షము కావలెనని'' ఇంద్రద్యుమ్నుడు కోరెను. ''నీవు ఘటికాచలము నున్న నరహరిని సేవింపుము. బ్రాహ్మ్యమోక్షములు సిద్ధించు'' నని శివు డానతిచ్చెను. ఇంద్రద్యుమ్ను డట్లొనర్చి తరించెను.

ఈ కథవలన బ్రాహ్మ్యము సిద్ధించినగాని మోక్షము సిద్ధింపదా? అను ప్రశ్న ఏర్పడును. ఇంద్రద్యుమ్నుడు క్షత్రియుడు, రజోగుణము కలవాడు. అతనికి శుద్ధసత్వగుణ మేర్పడినగాని జ్ఞానము సిద్ధించదు. తమోగుణము రజోగుణము నశించి శుద్ధ సత్వగుణ మేర్పడినగాని బ్రాహ్మ్యము సిద్ధించదు. తరువాత త్రిగుణాతీతమైన ముక్తి లభించును. అందులకే భాగవతమున ''హరిసేవా నిరతింజేసి'' నారదునకు రజస్తమోగుణ పరిహారిణియగు భక్తి సంభవించినదని వ్యాసునితో చెప్పికొనెను.

రాజర్షియగు విశ్వామిత్రుడు తపస్సుచేసియు తొలుత మేనకకు లొంగిపోయెను. అతనికి శుద్ధనత్వ మేర్పడువరకు బ్రహర్షిగా వశిష్ఠు డంగీకరింపడయ్యెను. రజస్త మోగుణు పరిహారిణియగు భక్తి నొందని కేవల కర్మ బ్రాహ్మణునకంటె భక్తుడైన చ డాలుడు మేలనిభాగవతము తెలుపుచున్నది.

శ్లో|| విప్రా ద్విషడ్గుణ యుతా దరివిందనాభ

పాదారవింద విముఖా చ్ఛ వచం వరిష్టం

మన్యే తదర్పిత మనో వచనాస్మగేహ

ప్రాణః పునాతి సకలం నతు భూరి మానః

భాగవతము 7-9-10

శ్రీహరి పాదముల నర్చింపని బ్రాహ్మణునికంటె హరి పాదసేవ యెనర్చు చండాలు డుత్తముడు. తన మనస్సు, దేహము, జీవితము భగవంతున కర్పణచేసిన చండాలుడు సర్వమును పునీతము సేయును. బ్రాహ్మణు డెంత పండితుడైనను అట్లు చేయజాలడు.

శో|| నశూ దా భగవద్భక్తాః విప్రా భగవతా స్మృతాః

సర్వ వర్ణేషు తే శూద్రా యేహ్యభక్తా జనార్దనే

భగవద్భక్తులు శూద్రులుకారు. వారే విప్రులు. జనార్దనునియందు భక్తిలేనివారు ఏ వర్ణమునకు జెందినను శూద్రులే.

కాబట్టి అన్ని వర్ణముల వారు తమ వర్ణాశ్రమ ధర్మములను కర్తవ్యములని ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామముగా నిర్వర్తించిన సత్వ శుద్ధి యేర్పడి జ్ఞానమునకు దారిచూపి ముక్తులను జేయును. అందులకే భగవద్గీత ''స్వేస్వే కర్మణ్య భిరతః సంసిద్ధిం లభ##తే నరః'' అని తెలుపుచున్నది.

బ్రహ్మర్షియైన తరువాత విశ్వామిత్రుడు శస్త్రాస్త్ర విద్యల నెరిగియు తానొనర్చు యజ్ఞమును గాపాడుటకు మారీచ సుబాహులను చంపలేదు. అది క్షత్రియ ధర్మమగుటచే శ్రీరామునకు అస్త్ర మంత్రములు నేర్పి ఆతనిచే చంపించెను. భగవంతుడైన శ్రీరాముడు క్షత్రియుడు. శ్రీకృష్ణుడు యాదవులలో పెరిగెను. అన్ని వర్ణములవారు వారిని దైవములుగా ప్రార్థించిరి.

నేటికాలమున వర్ణాశ్రమ ధర్మముల నిర్మూలింప బూని ఆర్య సమాజము బ్రహ్మసమాజమని క్రొత్త మతములు కల్పింప బడినవి. ఇట్లనేక సమాజము లేర్పడుచున్నవి.

రామాయణము గృహస్థ ధర్మమునకు ప్రాముఖ్యమును, భారతము వర్ణాశ్రమ ధర్మమునకు ప్రాముఖ్యము, భాగవతము ఆత్యంతిక భక్తికిని ప్రాముఖ్యత నిచ్చినవి. అందువలన మానవుడు గృహస్థ ధర్మము నిర్వర్తించి గృహమును, వర్ణాశ్రమ ధర్మముల నిర్వర్తించి సంఘమును, అత్యంతిక భక్తితో దైవసేవ నిర్వర్తించి తన్నుతాను ఉద్ధరించు కొనవలయునని ఫలితాంశము. ఈ మూడును మానవుని కర్తవ్యములు. (బాధ్యతలు, నిధులు)

Sri Bhagavadgeetha Madanam-2    Chapters