Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

శుభమస్తు

శ్రీ శివకామసున్దరీసమేత శ్రీచిత్సభేశ్వరాయనమః

శ్రీ చిదమ్బర మాహాత్మ్య ప్రారమ్భః

ప్రథమాధ్యాయసారః

శ్లో|| సూతః ప్రోవాచ పృష్టో మునివరనిక రై

ర్నైమిశారణ్యమధ్యే7|

వోచన్మాహాత్మ్యమస్యాః పుర ఉదితముమానాయకే

నైవ పూర్వమ్‌

యచ్ఛ్రుత్వా నన్దికేశో7వదదనుమునయే

వ్యాసనామ్నేచ సో7పి

సూతాయాహ స్మ దివ్యం చరితమిదమపి

శ్రేయ సేమానుషాణామ్‌

చిదంబరమాహాత్మ్యమును బూర్వముమాపతి చెప్పగా నందికేశుడు విని వ్యాసుడనుపేరుగల మునికి జెప్పెను. ఆ వ్యాసుడాదివ్యచరిత్రను మానవుల శ్రేయస్సుకొరకు నూతునకు జెప్పెను. ఆసూతుడు నైమిశారణ్యములోని మునులడుగగా బూర్వము శివుడు చెప్పినదానినే వారికి జెప్పెను.

శ్లో|| శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌|

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాన్తయే||

సమస్త విఘ్నములు తొలగుటకు తెల్లనివస్త్రమును ధరించినవాడు చంద్రునివంటిరంగు నాలుగుబాహువులు ప్రసన్నమైన ముఖముగలవాడునగు విష్ణువును ధ్యానింపవలెను.

శ్లో || యస్మాత్సర్వం సముత్పన్నం చరాచరమిదం

జగత్‌|

ఇదం నమో నటేశాయ తసై#్మ కారుణ్య

మూర్త యే ||

ఎవనినుండి స్థావరజంగమాత్మకమైన యీ ప్రపంచమంతయుపుట్టినదో అట్టి దయామయుడగు నటేశునకిదిగో నమస్కారము.

శ్లో || ఋషయో నైమిశారణ్య సర్వసంపత్సమన్వితే

నివస న్తి స్మ విమలే చరన్తో దుష్కరం తపః ||

సమస్తసంపదలతో ఁగూడి పవిత్రమైన నైమిశారణ్యమున ఋషులు దుష్కరమైన తపస్సు చేయుచు నివసించుచుండిరి.

శ్లో || వివృణ్వన్తః పరం బ్రహ్మ నిత్యమానన్దదాయకమ్‌|

నిదానం సర్వలోకానాం భవభీతినివారణమ్‌||

వారు, సమస్తలోకోములకు మూలమై సంసార భయమును దొలగించి నిత్యమునానందమునిచ్చు పరబ్రహ్మను వివరించుచుండిరి.

శ్లో || విద్యావిద్యోతమానాస్తే దాన్తాశ్శాన్తి పరిగ్రహాః

నిర్వాణాశేషసర్వాశాః భూయోనిర్వాణలాలసాః||

శమదమాదులుగలిగి మిగులకుండ సమస్తవాంఛలు శాంతింప మోక్షమునుమాత్రము కోరుచు విద్యచే ప్రకాశించు చుండిరి.

శ్లో || ప్రసన్నాః పుణ్యతపసః పూర్ణోల్లాసా విమత్సరాః|

సన్త్యక్తాన్యసమారమ్భాః శివపూజాపరాయణాః

ప్రసన్నులై పరిపూర్ణమైన ఉత్సాహముతో పవిత్రమైన తపస్సునార్జించుచు ఈర్ష్యాదులు లేక ఇతర ప్రయత్నముల నన్నిటిని విడచి శివపూజా పరాయణులై యుండిరి.

శ్లో|| తపోభిశ్చ పురాణానామాగమానాం చ చిన్తయా|

అసంఖ్యేయదినం కాలం నయన్తః క్షణమాత్రవత్‌||

తపస్సులచేతను పురాణాగమముల విచారణచేతను ఎన్నిరోజుల నైనను క్షణముగా గడుపుచుండిరి.

శ్లో|| సూర్యమండలసంకాశాః జ్వలద్వహ్ని జటాభరాః

తన్వన్తో దృష్టిపాతేన విశ్వం శుద్ధం సమన్తతః ||

సూర్యమండలముతో సమానులై మండు అగ్నిజ్వాల వంటి జటలను ధరించి దృష్టిపాతముచేతనే ప్రపంచమునంతను పవిత్రముగా జేయుచుండిరి.

శ్లో|| ఆనన్దవల్లరీకన్దాః శాన్తిసింధునిశాకరాః|

పాపాటవ్యాశ్చ దహనాః పుణ్యబీజసుభూమయః

వారు ఆనందమగు తీగకు దుంపలు, శాంతియను సముద్రమునకు చంద్రులు పాపమను నరణ్యమునకగ్నులు, పుణ్యమను బీజములకు మంచి భూములు.

శ్లో || జన్మదుఃఖం పరిత్యక్తుం నిత్యం బ్రహ్మ సమాశ్రితాః|

నియతాః పుణ్యహృదయాః జగత్పావనహేతవః ||

జన్మదుఃఖమును విడచుటకు నిత్యము బ్రహ్మ నాశ్రయించినవారు, నిగ్రహము గలవారు, పవిత్రమైన హృదయము గలవారు, లోకమును పవిత్రము చేయుటకు కారణభూతులు.

శ్లో || నిర్మలాః నిరహంకారాః తత్త్వజ్ఞానప్రదర్శకాః|

సుప్రసన్నముఖామ్భోజాః దుష్కృతధ్వాన్త భానవః ||

దోష రహితులు గర్వము లేనివారు తత్త్వ జ్ఞానమును వెల్లడించువారు ప్రసన్నమైన ముఖ పద్మములు కలవారు, పాపమను చీకటికి సూర్యులు.

శ్లో || కదాచిదథతాన్సర్వానఖణ్డానన్దసమ్పదః|

అజగామ మునీన్ద్రష్టుం సూతో వ్యాసతపః ఫలమ్‌||

వ్యాసుని తపస్సునకు ఫలరూపమైన సూతు డొకప్పుడు అఖండమైన యానంద మను సంపదతో గూడిన యా మునుల నందరనుజూచుటకు వచ్చెను.

శ్లో || పురావిదాం తమగ్రణ్యం సూతం దృష్ట్వా మునీశ్వరాః |

ప్రత్యుద్గమ్య మహాత్మాన ముత్కూలానన్దచేతసః ||

నివేశ్య విష్టరే తత్ర క్షణనాత్యన్త గౌరవాత్‌|

అపూజయన్యధాన్యాయంసమ్యగర్ఘ్యాదిపూజయా||

పురాణవేత్తలలో శ్రేష్ఠుడైన నూతుని జూచి మనస్సున పొంగివచ్చు సంతోషముగల యామునీశ్వరులా మహాత్ముని కెదురేగి మిక్కిలి గౌరవముతో క్షణములో నాతని నాసనమున గూర్చుండబెట్టి యర్ఘ్యపాద్యాదులతో యథావిధిగా బూజించిరి.

శ్లో|| పురశ్చ సమాసీనాః క్మతాఞ్జలిపరిగ్రహాః

మహోత్సవం యథా పుణ్యం ననన్దుస్తస్య

దర్శనమ్‌||

ఎదురుగా కూర్చుని నమస్కరించును వాని దర్శనమును పవిత్రమైన గొప్ప యుత్సవమునుగా నానందించిరి.

శ్లో|| ప్రసన్నవదనం సూతం పూజయా పరయా భృశమ్‌|

పప్రచ్చుర్ముదితస్వాన్తాః మునయస్తే మహౌజసః||

ఉత్తమమైన పూజచే మిక్కిలి ప్రసన్నమైన ముఖము గల యాసూతుని తేజోవంతులైన మునులు సంతుష్టమనస్కులై యడిగిరి.

ఋషయ :-

శ్లో|| సూత! వేత్తా పురాణానాం సర్వేషాం త్వం మహామతే

పూతం సర్వం ద్వితీయేన భానునేవ త్వయా జగత్‌||

ఋషులు :-

సూత! మహామతీ! నీవు సమస్త పురాణములు తెలిసిన వాడవు. రెండవ సూర్యునివంటి నీచేత లోకమంతయు పవిత్రమైనది.

శ్లో|| నిఖిలానాంపురాణానాంత్వామేవాధారమవ్యయమ్‌ |

లోకానుగ్రహకర్తా హి వేదవ్యాసః పురాసృజత్‌ ||

లోకము ననుగ్రహించు వేదవ్యాసుడు పూర్వము సమస్త పురాణములకు స్థిరమైన యాధారముగా నిన్నే సృజించెనుగదా.

శ్లో|| శివస్థానాని తీర్థాని భువి తేషాం చ వైభవమ్‌ |

త్వయోక్తాని పురాణాని విస్తరేణౖవ నః పురా||

నీవు లోకములోని ప్రాచీనమైన శివ క్షేత్రములను, తీర్థములను వాని వైభవమును మాకు పూర్వము విస్తరముగా జెప్పితివి.

శ్లో|| తేషు భూయశ్చ పృచ్ఛామః పుణ్డరీకపురాశ్రయమ్‌|

ప్రభావం పుణ్యదం నిత్యం భూక్తిముక్తికరం పరమ్‌||

వానిలో పుణ్యమునిచ్చునది నిత్యమైనది భుక్తిముక్తులను గలుగ జేయునది శ్రేష్ఠ మైనదియునగు పుండరీక పురప్రభావమును మరల అడుగు చుంటిమి.

శ్లో|| భవార్జితాని మర్త్యావాం హన్తి పాపాని యత్షణాత్‌|

త్వన్ముఖాదిహ తచ్ర్ఛోతుమస్మాకం చాదరో మహాన్‌||

జనులకు సంసారమున ప్రాప్తమైన పాపములను క్షణములో బోగొట్టు దానిని గూర్చి ఇపుడు నీ ముఖమున వినుటకు మా కెక్కువ కుతూహలము గలదు.

శ్లో|| అతస్సూత! పరం ప్రాజ్ఞ! వైభవం తస్య విస్తరాత్‌|

అర్హసి వ్యాసశిష్యస్త్వం వక్తుం తత్త్వార్థకోవిదః||

కనుక సూత! మహాప్రాజ్ఞ! వ్యాస శిష్యుడవై యధార్థము నెరిగిన నీ వాపుర వైభవమును వివరముగా జెప్పదగుదువు.

శ్లో|| ఇత్యుక్తో మునిభిస్సర్వైస్తత్త్వజ్ఞానపరాయణౖః|

ప్రహర్షమతులం ప్రాప్తస్సూతః పారాణికాగ్రణిః||

తత్వజ్ఞానమున మునిగియున్న యామును లిట్లడుగగా బౌరాణిక శ్రేష్ఠుడైన సూతుడు మిక్కిలి సంతసించెను.

శ్లో|| జగదాది మనాద్యన్తం పురుషం పురుషార్థదమ్‌|

వ్యాసాఖ్యం చ గురుం నత్వా వక్తుం సముపచక్రమే||

జగత్తునకు మూలమైన జనన మరణములు లేక పురుషార్థము నొసగు పరమాత్మకును గురువగు వ్యాసునకును నమస్కరించి సూతుడు చెప్ప నారంభించెను.

శ్లో|| మునయః! సాధు యుష్మాకం బుద్ధిర్భాగ్యాను సారిణి|

యత్ర్పష్టుముద్యతాశ్చిస్త్యం స్థానం జన్మశ##తై రపి||

ఓ మునులారా! అదృష్టమువలన మీకు మంచి బుద్ధిపుట్టినది. కనుక నూరు జన్మల కైనను తెలిసికొన దగిన స్థానమును గూర్చి యడుగుటకు సిద్ధపడితిరి.

శ్లో|| వేదాగమైర్యదద్యాపి పరిచ్ఛేత్తుం న శక్యతే|

వైభవం తస్య విజ్ఞాతుం కోను శక్తో జగత్త్రయే||

దేనిని వేదాగమము లిప్పటికిని నిర్ణయింప లేకున్నవో దాని వైభవమును మూడు లోకములలో నెవడు తెలిసికొన గలడు?

శ్లో|| ఆద్యోదివిషదాం శ్రేష్ఠో వాచామీశో బృహస్పతిః|

దెత్తేయావాం పురోధాశ్చ శుక్రో నీతివిశారదః||

సహస్రవదనశ్శేషః షణ్ముఖోపి మహామతిః|

హేరమ్బో విష్నుభేత్త చ సవితా తేజసాం పతిః||

నాయకాశ్చ దిశాం సర్వే ప్రభూతో త్తమవిక్రమాః|

విజ్ఞాతుమస్య మాహాత్మ్యంనైవ శక్తాస్తపోధవాః||

తాపసులారా! దేవతలలో మొదటివాడు శ్రేష్ఠుడు వాక్పతియు నగు బృహస్పతియు, దైత్యులకు పురోహితుడు నీతి నిపుణుడు నగు శుక్రాచార్యుడును వేయి ముఖములు గల యాదిశేషుడును మహా బుద్ధిమంతుడగు నారుముఖముల దేవరయు, విఘ్నములను బోగొట్టు గణాధిపతియు, తేజోనిధి యగుసూర్యుడును మహాపరాక్రమవంతులగు దిక్పాలకులును దీని మాహాత్మ్యమును దెలిసికొనలేరు.

శ్లో|| గుహ్యాద్గుహ్యతరశ్చైతద్ర్బహ్మరూపమిదంపురమ్‌|

తాణ్డవస్య సదా శమ్బోరాద్యరఙ్గం సువిస్తృతమ్‌|

ఈ పురము రహస్యము లన్నిటికి రహస్యమైనది. బ్రహ్మ రూపమైనది. ఎల్లపుడు నీశ్వరుని తాండవమునకు మిక్కిలి విశాలమైన మొదటి రంగస్థలము.

శ్లో|| సత్యమేతద్వదామ్యత్ర శృణుధ్వం మునిసత్తమాః|

యత్పురం శఙ్కరో వేత్తి వేత్తా నాన్యో జగత్త్రయే|

మునిశ్రేష్ఠులారా! నే నిందు నిజము చెప్పుచుంటిని వినుడు ఆ పురమును శంకరు డెరుగునుగాని మూడు లోకములలో మరియొక డెరుగడు.

శ్లో|| బ్రహ్మా విష్ణుః ప్రపఞ్చశ్చ యస్యాంశః పరికీర్తితః

తత్తేజః సతతం యత్ర కరోత్యానన్దతాణ్డవమ్‌||

బ్రహ్మ, విష్ణు, వుప్రపంచము ఏతేజస్సుయొక్క భాగమని చెప్పబడినదో ఆ తేజస్సు ఎల్లపుడచట ఆనందతాండవము చేయుచుండును.

శ్లో|| తత్సమీపే మహాదేవీ సదా తాండవసాక్షిణీ|

సవిత్రీ సర్వలోకానాం చకాస్త్యానన్దాదాయినీ||

దాని దగ్గర సకల లోకములకు తల్లి తాండవ సాక్షిణియునగు మహాదేవి ఆనందమును గలుగజేయుచు నెల్లపుడు ప్రకాశించుచుండును.

శ్లో|| యస్యాః స్మితప్రభా దేవ్యాః లోకమౌక్తికదీపికా|

యా దేవీ పరమానన్దచన్ద్రోదయ విభావరీ||

ఆదేవి చిరునవ్వుకాంతి లోకమునకు ముతైపు దీపము ఆ దేవి పరమాసందమనెడు చంద్రోదయమునకు రాత్రి.

శ్లో|| లభ్యతే సకలా సంపత్తస్యాః కారుణ్యవీక్షణాత్‌|

శివపూర్వపదా నామ్నా భవానీ కామసున్దరీ||

ఆమె కరుణాకటాక్షమువలన సకలసంపదలు లభించును. ఆ భవాని యచట శివకామ సుందరి యనబడును.

శ్లో|| చిదమ్బరాభిధానస్య క్షేత్రవర్యస్య వైభవమ్‌|

మహాభాగో మహేశోపి భగవాన్వేత్తి వా న వా||

అట్టి చిదంబరమను క్షేత్రరాజము యొక్క వైభవమును మహాత్ముడు భగవంతుడునగు మహేశ్వరు డెరుగునో యెరుగడో.

శ్లో|| అష్టాదశపురాణషు యత్పురాణం పరం మతమ్‌|

భుక్తిదం ముక్తిదం చైవ శృణ్వతామఘనాశనమ్‌||

ఇదం చిదమ్బరోత్పన్నం పురాణం నన్దికేశ్వరః||

ఉమానాథముఖాచ్ర్ఛుత్వా పురాప్రీతో మహా మతిః||

సనత్కుమారమునయే కథయామాస విస్తరాత్‌|

సోపి చైతత్ర్పవిస్తార్య వ్యాసాయ ప్రయతాత్మనే||

పదునెనిమిది పూరాణములలో నుత్తమముగా నంగీకిరింపబడినది వినువారి పాపముల బోగొట్టి భుక్తిముక్తుల నిచ్చునదియునగు నీచిదంబర పురాణమును బూర్వ మీశ్వరుని నోటినుండి నందికేశ్వరుడు విని సంతసించి యా మహా బుద్ధిమంతుడు విస్తరముగా సనత్కుమార మునికి జెప్పెను, అతడు కూడ దీనిని విస్తరించి పరిశుద్ధ మనస్కుడైన న్యాసునకు దెలిపెను.

శ్లో|| తేనాపి కథితం దివ్యం తదిదం మమ పృచ్ఛతః||

తదద్య నంప్రపక్ష్యామి కర్ణాయుష్యం తపోధనాః||

నేనడుగగా నాతడా దివ్యచరిత్రను నాకు బ్రసాదించెను తపోధనులారా! ఆ కర్ణామృతము నిపుడు మీకిచ్చుచుంటిని.

శ్లో|| అశ్రద్ధయాపి యో మర్త్యః చిదమ్బర సమాశ్రయమ్‌||

పురాణం శృణుయాత్తస్య పాపరాశిః ప్రణస్యతి||

అశ్రద్ధోతో నైనను చిందబర పురాణమును వినినవాని పాపరాశి నశించును

శ్లో|| తస్య స్నావాని దావాని సఫలాని తపాంపి చ|

పశ్యత్యబ్జనిభం శమ్భోః పదంతాణ్డవగన్ధియత్‌||41

వాని స్నానములు దానములు తపస్సులు సఫలము లగును. తామరపువ్వుతో సమానమైన శివుని తాండవ పాదమును జూచును.

ఇతి శ్రీమతి స్కాన్దే మహాపురాణ సనత్కుమార

సంహితాయాం మహేశ్వరనన్దిసంవాదే

చిదమ్బర మాహేత్మ్యే

ప్రథమోధ్యాయః

--0--

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters