Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

శ్రీ చి ద మ్బ ర మా హా త్మ్య

వే ద పా ద స్త వ ము లు

 

 

శ్రీ శివకా మసుందరీసమేత శ్రీ నటరాజస్వామినేనమః

 

 

శ్రీ చిదమ్బరమహాత్మ్య

వేదపాదస్తవములు

(శ్రీ వేదవ్యాస, జైమిని, శఙ్కరభగవత్పాదకృతములు)

ఆంధ్ర తాత్పర్య సహితము

ఆంధ్ర లిపి పరివర్తన తాత్పర్యకర్తలు:

శ్రీ శ్రీపాద వెంకటేశ్వరులు

(శ్రీ చిదమ్బర మహాత్మ్యము)

శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రి

(శ్రీ వేదపాద స్తవములు)

సంపాదకులు - ప్రకాశకులు :

శ్రీ దర్బా సూర్యనారాయణ

సివిల్‌ ఇంజనీరింగు ప్రొఫెసరు- అణ్ణామలై యూనివర్సిటి

చిదమ్బరము - తమిళనాడు

All rights Reserved 1972

వెల : రు. 12

1972 ప్రథమముద్రణము - 1000 ప్రతులు

సర్వస్వామ్యములు ప్రకాశకులవి.

శ్రీ సత్యనారాయణ ప్రెస్‌,

రాజమండ్రి - 1.

 

ప్రధమ భాగము

శ్రీ చిదమ్బరమాహాత్మ్య నిత్య పారాయణవిధి

చిత్సభావర్ణనము

చిదమ్బర రహస్యస్వరూపనిర్ణయము

చిత్సభానాయకవర్ణనము

శ్రీ శివకామసుందరిస్తుతి

శ్రీ వ్యాఘ్రపాద చిదమ్బ రేశ్వర వన్దన స్తవము

శ్రీ శివకామసున్దర్యష్టకము

 

శ్రీ చిదమ్బర మాహాత్మ్యము

(26 అధ్యాయములు)

ప్రధమాధ్యాయసాఠము, మహేశ్వరనంది సంవాదము

క్షేత్రప్రశంసనము

మూర్తివైభవకధనము

éశివగంగాతీర్థవర్ణనము

త్రిసహస్ర ద్విజేంద్రప్రశంసనము

మాధ్యందిని చరితము

వాల్కలి చరితము

వుల్కస చరితము

వ్యాఘ్రపాద చరితము 

ఉపమన్యు చరితము

తాణ్డవమహిమ కధనము

దేవదారు వన చరితము

ఆనంద నర్తనదర్శనము

మహేశ్వర శేషసంవాదము

పతఞ్జలి చరితము

పతఞ్జలి వ్యాఘ్రపాద ప్రసంగము

ఆనన్ద తాణ్డవ ప్రదర్శనము

పతఞ్జలి వ్యాఘ్రపాదులు వరములడుగుట

బ్రహ్మ యాగవృత్తాంతము

సింహవర్మ చరితము

సింహవర్మ తిల్లవనముచేరుట

సింహవర్మ హిరణ్యవర్మయగుట

వ్యాఘ్రపాద హిరణ్యవర్మ సంవాదము

త్రిసహస్ర మునీశ్వరులు తిరిగి చిదంబరముచేరుట

మహోత్సవవిధి

రధోత్సవ తీర్థవిధానవర్ణము

ఫలశృతి

శ్రీ పతఞ్జలి మునికృత నటేశాష్టకము

శ్రీ నటేశాష్టోత్తర శతనామావలి

ద్వితీయ భాగము

శ్రీ వేదపాదన్తవములు

శ్రీ నటరాజ వేదపాదస్తవము

ఫలశృతి

శ్రీ ఆనన్ద నటరాజధ్యానము

శ్రీమత్రిపురసుందరీ వేదపాద స్తవము

చిదమ్బరక్షేత్రమున జరుగు పూజలు ఉత్సవములు

తప్పొప్పులపట్టిక

 

శ్రీ శివకామసున్దరీసమేత శ్రీనటరాజస్వామినేనమః

సమర్పణము

శ్రీ చిదమ్బరమాహాత్మ్య వేదపాదస్తవములు అను పవిత్రగ్రన్థ

సంపుటము శ్రీ శివకామసున్దరీసమేత శ్రీ నటరాజస్వామివారి

పాదపద్మములందు శ్రీపరీధావి సంవత్సర జ్యేష్ట బహుళ

చతుర్దశీ ఆదిత్యవారమున శ్రీ మాసశివరాత్రి పర్వ

దినమున (9-7-1972) పూజాపుష్పగుచ్ఛముగా

నిష్కామభక్తితో

దర్భా సూర్యనారాయణ శ్రీమతి సౌభాగ్యవతి సుబ్బలక్ష్మి

దంపతులచే సమర్పితము

శ్రీ శృంగేరీ జగద్గురు

శ్రీ మదభినవ విద్యా తీర్థ స్వాములవారు

 

ఓమ్‌

శ్రీ శృంగేరీ శ్రీ జగద్గురు సంస్థానమ్‌

శ్రీ

విద్యా

శఙ్కర

శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య, పదవాక్య ప్రమాణ పారావారపారీణ, యమనియామాసనప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణాసమాధ్యష్టాఙ్గ యోగానుష్ఠాననిష్ఠ తపశ్చక్రవర్త్యనాద్యవిచ్ఛన్న శ్రీశఙ్క రాచార్య గురుపరమ్పరా ప్రాప్త, షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర, సకలనిగమాగమసారహృదయ, సాంఖ్యత్రయ ప్రతిపాదిక వైదికమార్గ ప్రవర్తక, సర్వతన్త్రస్వతన్త్రాదిరాజధానీ విద్యానగర మహా రాజధానీ కర్ణాటకసింహాసన ప్రతిష్ఠాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురుభూమణ్ణలాచార్య, ఋష్యశృఙ్గపుర వరాధీశ్వర, తుఙ్గభద్రాతీరవాసి, శ్రీమద్విద్యాశఙ్కర పాద పద్మారాధక శ్రీజగద్గురు శ్రీచన్ద్రశేఖర భారతీస్వామిగురు కరకమలసఞ్జాత

శ్రీ జగద్గురు

శృంగేరీ శ్రీమదభినవ విద్యాతీర్థస్వామిభిః ||

అస్మదత్య న్తప్రియశిష్య శ్రీ దర్భా సూర్యనారాయణ విషయే నారాయణ స్మరణపూర్వకం విరచితా శీఆషస్స ముల్లన్తు ||

వేదో హి నస్సమేషాం శ్రేయస్సాధనావగమాయ ప్రభవతి | నకేవలం తస్మాత్‌ శ్రేయస్సాధనా వగమఏవ కింతుఅధీయమాన స్సఏవ శ్రేయస్సాధనతాం ప్రపద్యతే | ఆత్రచ ప్రత్యక్షరం శ్రూయమాణం పుణ్య ముత్పాదయతీతి శాస్త్రవిదాంసిద్ధాన్తః ||

భగవాన్‌ జైమినిః పుణ్డరీకపురం ప్రాప్య భగవన్తం చిత్సభేశం వేదపదనిబద్ధైః శ్లోకైస్తుష్టావః తేషుచ శ్లోకేషు సర్వత్ర అంతిమః పాదః వేదరూపఏవ భవతీతి స్తోత్రస్యాస్య మహత్వాతిశయః

త్రిపురసున్దరీ వేదపాదస్తవమితి స్తుతికావ్యం శ్రీమచ్చఙ్కర భగవత్పాదప్రణీతం దేవీభక్తవర్గేషు సుప్రధితమాస్తే || తత్రాపి సర్వే7సి శ్లోకాః పాదాన్తేషు వేదరూపాఏవ || అనయోః స్తోత్రయోః పఠనేన నైకే లోకాః స్వాభిలాషితా న్యాసాదయన్తి పరాంతృప్తించ విన్దతే.

ఏవం చిత్సభేశ తత్షేత్రవృత్తాన్తాదికం హృదయఙ్గ మయా శైల్యాప్రతిపాదయత్‌ | చిదమ్బరమాహాత్మ్యం భక్త జనోల్లాసకరం సత్‌ ప్రకాశ##తే || తదేతత్త్రితయస్యాపి ఆన్ధ్ర భాషా మాత్రాభిజ్ఞేషు జనేష్వపి విశిష్టప్రచారాయ ఆన్ధ్రతాత్పర్యేణ సహ ముద్రాప్య ప్రకాశయతు ముద్యుఞ్జానా భవన్తః వేదేపాదస్తవయోః శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రి ముఖేన, చిదమ్బరమాహాత్మ్యస్య శ్రీ శ్రీపాద వెంకటేశ్వరశర్మ ముఖేన చాన్ధ్రానువాదం సంపాద్య ప్రకాశయన్‌ || సర్వేపీమే లౌకికం ప్రయోజనం కించిదప్యనపేక్షమాణాః భగవతః కృపాం కేవలం కాంక్షమాణాః కార్యే7స్మి న్ప్రవృత్తా ఇత్యేతత్‌ నితరాం ప్రశంసార్హమ్‌ ||

సానువాదం గ్రన్ధత్రితయ మిద మవలోక్య హృష్టాన్తరఙ్గౌ వయం || సకుటుమ్బాన్‌ భవతః అత్ర ఉద్యుఞ్జానా నిమాన్‌ సర్వానపి శ్రీ శారదా చన్ద్రమౌళీశ్వరౌ మజ్గళపరమ్పరాభిః నమభి వర్ధయతా మిత్యాశాస్మహే ||

శృజ్గగిరి                                             ఇతి నారాయణస్మరణమ్‌

పరీధావి, అధిక వైశాఖ

కృష్ణదశమీ ఇన్దువాసరః శ్రీ

8-5-1972

శ్రీ

అస్మదత్యంత ప్రియశిష్యులైన శ్రీ దర్భా సూర్య నారాయణగారికి నారాయణ స్మరణపూర్వకాశీస్సులు.

మనమందరము వేదమునుండియే శ్రేయస్సాధనమును తెలిసికొనుచున్నాము. అంతమాత్రమే కాదు. ఆ వేదాధ్యయనముకూడా శ్రేయస్సాధనమే- ఆ వేదమందు వినబడు ప్రతియొక అక్షరము కూడ పుణ్యజనకమని శాస్త్రవేత్తల సిద్ధాంతము.

భగవంతుడగు జైమినిమహర్షి చిదమ్బర క్షేత్రమునకు వచ్చి భగవంతుడగు చిత్సభానాధుని వేదపదములతో గూడిన శ్లోకములతోస్తుతించెను.ఆశ్లోకములన్నిటియందును చివర పాదము వేదరూపముగా నుండును. గావున ఈస్తోత్రము చాల మహత్వ పూర్ణముగనున్నది.

త్రిపురసున్దరీ వేదపాదస్తవమను పేరుతో శ్రీమచ్ఛఙ్కర భగవత్పాదులచే రచింపబడిన స్తుతికావ్యము దేవీభక్తులందు ప్రసిద్ధమై యున్నది. ఆస్తోత్రమందును ప్రతిశ్లోకము యొక్క చివరపాదము వేదరూపముగనే యుండును. ఈ స్తోత్రమును పఠించి అనేకభక్తజనులు తమ అభీష్టములను, మరియు తృప్తిని పొందుదురు.

అట్లే చిదమ్బరనాధునియొక్కయు, చిదమ్బరక్షేత్రము యొక్కయు, వృత్తాన్తాదులను హృదయంగమయిన శైలితో ప్రతిపాదించు చిదమ్బదమాహాత్మ్యము భక్తజనులమనస్సులకు ఆహ్లాదకరమై విరాజిల్లుచున్నది. ఈ మూడింటికిని ఆంధ్రభాష తెలిసిన జనులయందుకూడ ప్రచారమునకై ఆంధ్రతాత్పర్యముతో నచ్చువేయించి ప్రకాశింపనుద్యుక్తులై వేదపాదస్తవములకు శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రిగారిచేతను, చిదమ్బర మాహాత్మ్యమునకు శ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లుగారిచేతను అనువాదము చేయించి ప్రకాశింపజేసితిరి. వీరందరును లౌకిక ప్రయోజనము నేమాత్రము నపేక్షింపక కేవలము భగవత్కృపనే కోరి ఈ పనియందు ప్రవృత్తులై రన్నది మిక్కిలి ప్రశంస నీయము.

అనువాదముతో గూడిన ఈ మూడుగ్రంథములను చూచి మేము సంతసించినవారమై, సకుటుంబులయిన తమరిని, మరియు నీకార్యమందు సహకరించిన వారినందఱను శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులు మంగళపరంపరలతో అభివర్థింప జేయుదురుగాక యని యాశీర్వదించుచున్నాము.

శృంగేరి                                             ఇతి నారాయణస్మరణమ్‌

పరీధావి అధికవైశాఖబహుళ

దశమి సోమవారము శ్రీ

8-5-1972

ఆముఖ మాశీర్వచనంచ

శ్రీమతే గణశాయ మఙ్గళం

శ్రీమతే చిత్సభేశ్వరాయ మఙ్గళం భవతు ||

శ్రుతిభి స్తస్మూలాభిః స్మృతిభి శ్చ తథాపురాణనివ హైశ్చ బహశః ప్రపఞ్చిత మిదం చిదమ్బరం సర్వలోక విఖ్యాతమ్‌.

లోకే తావత్ర్పసిద్ధం తత్తత్‌ క్షేత్ర మాహాత్మ్యత త్తత్‌క్షేత్ర మాహాత్మ్య గ్రన్థేషు బహుధా ప్రతిపాద్యతే| అస్య చిదమ్బర క్షేత్రస్య మాహాత్మ్యస్య శ్రుతి స్మృతి పురాణతిహాసేతర క్షేత్రమాహాత్మ్యగ్రన్థ మన్త్రశాస్త్రమూలభూతా కాశ##భైరవ కల్పాదిభిః బహుభి ర్గ్రన్థైర్బహుశః ప్రతిపాద్యమానత్వాత్‌| అస్య చిదమ్బరక్షేత్రస్య సర్వక్షేత్రో త్తమత్వస్య వజ్రలేపాయి తత్వాత్‌, (1) సూతసంహితాయాం (2) హాలాస్య మాహాత్యే (3) ఆదివుర మాహాత్మ్యే(4) శైవైకాదశరుద్రసం హితాయాం (5) భరద్వాజసంహితాయాం (6) పుణ్డరీక మాహాత్మ్యే, ఇత్యాదిగ్రన్థేషు చ సమ్యక్‌ ప్రతిపాద్యమాన త్వాచ్చ నాస్తి పునరిదానీం వక్తవ్యాశంలేశః |

తచ్చేదం చిదమ్బరమాహాత్మ్యం చిదమ్బరపురాణస్య పఞ్చ భాగాత్మకస్య ప్రదమం కుసుమమ్‌. ఇదం 26 అధ్యాయఘటితమ్‌. 1444 1/2 శ్లోకోపేతంచ శతాధిక సంవత్సరాత్పూర్వం గ్రన్ధలిప్యాం, ఆన్థ్ర లిప్యాంచ ముద్రితం దుష్ప్రాస్య ముద్దిశ్య, తాణ్డవాధ్యా¸° (17-18) కేవలం మూలమాత్రం దేవనాగరిలిప్యాం, ఆన్థ్రలిప్యాం వ్యాఖ్యోపేతంచ ప్రకాశ##కేన అనేన ముద్రాప్య ప్రకాశితౌ | అనన్తరం భక్తానాం సహాయోగేన, ఇదంచ మహాత్మ్యం దేవనాగరిలిప్యాం 1971 తమే హాయనే ముద్రాప్య ప్రకాశితమ్‌ | తదిద మధునా ఆన్థ్రలిప్యా మాన్థ్రజనోపకారాయ, ఆన్థ్రభాషాతాత్పర్యోపేతం, సమగ్ర మన్యధనసాహాయ్య మనపేక్ష్య శ్రీనటరాజమూర్తౌ, అస్మాసుచ, భక్తివిశ్వాసౌ సంభావ్య, గోదావరీతీరవర్తి, రాజమహేన్ద్రనరనగరాభిజనేన, అన్నామలై విశ్వవిద్యాలయ సివిల్‌ ఇంజనీరింగు ప్రొఫెసరు శ్రీ దర్భా సూర్యనారాయణ శర్మణా సంప్రకాశ్యతే | వేదపాదన్తవః శ్రీజైమినికృతః శ్రీ నటేశస్తోత్రరూపః, తథా శ్రీ శఙ్కర భగవత్పాదకృతః శ్రీ త్రిపురసున్దరీ వేదపాదస్తవశ్చ మాహాత్మ్యం చాస్మిన్‌ సంయోజితౌ |

భక్తజనోపకారం కృతవతే ప్రకాశకాయా సై#్మ, తద్ధర్మపత్న్యై, శ్రీమత్యై సుబ్బలక్ష్మెచ అయురారోగ్యాభివృద్ధిః | సర్వసంపత్సమృద్ధిః, సర్వమఙ్గళావాప్తిః, అచఞ్చల నిష్కపట భక్తిసిద్ధిః జ్ఞాన వైరాగ్య సిద్ధిశ్చ భూయాదితి శ్రీనటరాజరాజం సంప్రార్థ్యాశాస్మహే |

తథా ఆన్థ్రభాషాతాత్పర్యకర్తృభ్యాం బ్రహ్మశ్రీ శ్రీపాద వేంకటేశ్వరశాస్త్రిణ, బ్రహ్మశ్రీ కొల్లి అనంతపద్మనాభ శాస్త్రిణ, పుస్తకప్రకాశ##నే సహయోగం కృతవతే బ్రహ్మశ్రీపీసుపాటి సూర్యప్రకాశశాస్త్రిణ చ శ్రీమత్‌ హేమ సభానాథః చిదమ్బర మహానటః శివకామిమనోజ్ఞశ్చ దేయాన్మఙ్గళసన్తతిమ్‌, జ్ఞానవైరాగ్యసిద్ధిం చ, ఆయురారోగ్యసమ్పదం, చిన్తితార్థప్రదానం చ దేయాత్‌ తిల్లవనేశ్వరః | శ్రీభగవతీ సర్వదేవోత్తమే, దేవతా సార్వభౌమే, అఖిలాంణ్డ కోటి బ్రహ్మాణ్డనాయకే బ్రహ్మవిద్యాస్వరూపశ్రీశివకామనున్దరీసనాధే ఆనన్దతాణ్డవరాజే, అతీవభక్తిం సంభావ్య తత్కృపయా కేవల మిదం తాత్పర్యం నిష్కామనయా కృత మభీనన్దనీయం.

శ్లో || గోరక్షిరత్నం భువనైకరత్న |

ముమాజనా ¸°వన భాగ్యరత్నం |

నటేశరత్నం సురసేవ్యరత్నం|

నమామి తం దీక్షితవంశరత్నం ||

శ్లో || గోరక్షిన్నితి నృత్తేశ ప్రచురక్షీర వాఞ్చయా |

శ్రితో మాతృస్తనక్షీర మప్యలభ్యం త్వయా కృతమ్‌||

ఇత్థం శ్రీదివ్యనటేశ చరణారవిన్దారాధనతత్పరః చిదమ్బరం శాస్త్రాచార్యపణ్డతరాజ సోమ శేఖరదీక్షితః చిదమ్బరం శ్రీనటరాజదేవాలయనిర్వాహకః సుహృత్సభాస్థాపకశ్చ |

పరీధావి వైశాఖ 13 శుక్ల చతుర్దశీ విశాఖ నక్షత్రం శ్రీగౌరీ మహాదేవ కల్యాణమహోత్సవదినం శుక్రవార 26-5-1972.

శ్రీ చిత్సభేశః శుభమాతనోతు.

 

శ్రీః

శ్రీ చంద్ర మౌళీశ్వరా

శ్రీమత్పరమహంస పరివ్రాజ కాచార్యవర్య

శ్రీమచ్ఛంకర భగవత్పాదప్రతిష్ఠిత

శ్రీకాంచీ కామకోటి పీఠాధిప జగద్గురు

శ్రీమచ్చన్ద్ర శేఖరేన్ద్ర సరస్వతీ

శ్రీపాదాదేశానుసారేణ శ్రీమజ్జయేన్ద్ర

సరస్వతీ శ్రీపాదైః

చిదమ్బరే అణ్ణామలై విశ్వవిద్యాలయ ఇంజనీరింగు కళాశాలాయాం అధ్యాపక పదవీం అధిష్ఠాయ విరతస్య శ్రీ దర్భా సూర్యనారాయణ శర్మణో విషయే క్రియతే నారాయణస్మృతిః

"దర్శనాదభ్రసదసి" "చిదమ్బరక్షేత్రము దర్శించుటచేతనే మోక్షమునిచ్చును" అని ప్రసిద్ధినందిన చిదమ్బర క్షేత్రముయొక్క మాహాత్మ్యమును దెల్పు మీ ప్రకటించిన గ్రంథమును జూచి చాలసంతోషించినాము. అందు వేదపాదస్తవములు శ్రీనటరాజ శివకామసున్దరీ సహస్రనామ స్తోత్రములు శ్రీసుబ్రహ్మణ్యశ్వర స్తోత్రరత్నములు మొదలగు వానిని సంకలనముచేసి ముద్రింపించి ప్రకాశము చేసిన మీ కృషి విని ఆనందభరితులయినారము.

ఇటువంటి సద్గ్రంథములను ప్రకటించుచు సత్ప్రవృత్తి యందున్న మీరు శ్రీ త్రిపురసున్దరీ సహితి శ్రీచన్ద్ర మౌళీశ్వర ప్రసాద పాత్రులయి సుఖాన నుండవలెనని ఆశించుచున్నారము.

యాత్రాస్థానమ్‌

విజయవాడ

ఆనంద - మాఘ ఇతి నారాయణస్మృతిః

పూర్ణిమీ సౌమ్య

వాసర ః

26-2-1975

ఓమ్‌

Dr. c.s. venkateswran , M.A.PhD.,

professor and Head of the Department of Sanscrit

Annamalai University

Annamalai Nagar

3-5-1972

ఆ శీ స్సు

"పరోపకారయ సతాం విభూతయ" "ఏకః స్వాదునభుఞ్జీత" ఇతిచ అస్తి అభియుక్తానా ముక్తిః | సుఖస్య మూలం మనసః శాన్తిః | శాన్తి సాధనసామగ్రేషు గరీయసీ భక్తిః | భగవచ్చరిత్రస్మరణన, తస్తోత్రపఠనేనచ భక్తి రఖివర్థతే | ఉభయమపి అమృతవత్‌ మధురం స్వాదు చ భవతి | అతఏవ అమృతత్వకామైః మర్యైః తదుభయ మవశ్య మాస్వాద నీయంచ | తదాస్వాదనే ఉపకుర్వన్తః నూనం క్మతకృత్యా జాయన్తె |

తత్వ మిదం మనసి విధాయ అణ్ణామలై విశ్వవిద్యాలయ వాస్తువిద్యావిభాగే ప్రాచార్యపద మతిష్ఠద్భిః కులీనైః ఆస్తికవరైః శ్రీదర్భా సూర్యనారాయణమహాశ##యైః భగవతః ఉమాపతేః . మాహాత్మ్యపరం చరితం స్తోత్రంచ దేవనాగరీ లిప్యాం ముద్రితం సామ్ప్రతం సానువాద మాన్ధ్రభాషాయాం తల్లిప్యాంచ ప్రకాశ్యతే తద్దేశీయానాముపకారాయ | తత్ర ప్రథమం షడ్వింశత్యధ్యాయయుతం చిదమ్బరమాహాత్మ్యమ్‌ |చిదమ్బరక్షేత్రే శ్రీనటరాజస్యా నన్దనటనావసరే దివిషదాం సదసి మహర్షిణా జైమినినా విరచితం, సార్థశతశ్లోకసమ్మితం వేదపాదస్తవాఖ్యం | స్తోత్రరత్నం ద్వితీయం దశోత్తర శతశ్లోక యుక్తం భక్తిమసృణం త్రిపురసున్దరీవేదపాదస్తోత్రం శ్రీశఙ్కరాచార్యప్రణీతం తృతీయం చ విజయతే |

అనువాదే మార్గదర్శకాః లంక వెంకటరామశాస్త్రి సోమయాజిమాహాశయాః తాత్కార్యే నిపుణం నిర్వూఢవన్తః శ్రీపాదవేంకఙ్కటేశ్వరశాస్త్రిమహోదయాః | కొల్లి అనన్తపద్మనాభశాస్త్రిణశ్చ సర్వధా అభినన్దనీయాసి, ఆచార్యానుగ్రహ మవలమ్బ్య భక్తిపూర్వ మేతాదృశకార్యేషు ప్రవృత్తానాం సకుంటుమ్బానాం దర్భసూర్యనారాయణ మహాశయానాం శ్రద్ధాభక్తిసుఖసమ్పదః ఉత్తరోత్తరమభివర్థన్తామ్‌ ఇతి శ్రీ శివకామసున్దరీసమేతం శ్రీశివనటరాజం ప్రార్థయామః |

ఏవం అన్నామలైవిశ్వవిద్యాలయ సంస్కృత విభాగాధ్యక్షఃవెఙ్కటేశ్వరశర్మా-

C. S. Venkateswaran

ఓమ్‌

లంక వెంకటరామశాస్త్రి సోమయాజి

సాంగవేదార్ధసమ్రాట్‌, అభినవాపస్తంబ

ఆశీస్సు

శ్రీ నటరాజయనమః

పరమేశ్వరుడు ప్రపంచములోని పాషాత్ముల నుద్ధరించుటకు అక్కడ్కడ వెలసి తనదర్శనమును చేయువారి నుద్ధరించుచున్నాడు శ్లో || అగ్నౌ దెవో ద్విజాతీనాం యోగి నాం హృదయె తధా | ప్రతిమాస్వ ల్పబుద్ధీనాం|| అను వచనము ననుసరించి పాపాత్ములు వివేకజ్ఞానము లేనివారు.ఆయాదేవతలను దర్శించి తరించుచున్నారు. ఇట్లుండ దక్షిణదేశమందు సుప్రసిద్ధమగు దివ్యక్షేత్రమగు చిదంబరక్షేత్రమందలి నటరాజేశ్వరస్వామివారి చరిత్ర (మాహాత్మ్యము) స్కాందపురాణములో నున్నది. ఆ మాహాత్మ్యమును బ్రహ్మశ్రీ దర్భాసూర్య నారాయణగారు. చాలా కాలమునుండి ఆక్షేత్రమందు అన్నామలై యూనివ్సటిలో సివిల్‌ ఇంజనీర్‌ ప్రొఫెసర్‌ గా పని చేయుచు సివసించుటవలన వారికి విశేషముగా వారి సతీమణి సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిగారికి శ్రీనటరాజస్వామివారియందున్న అపరిమితభక్తిచే చిదంబర మాహాత్మ్యమును తెలుగుతాత్పర్యముతో అచ్చువేయించిన ఆంధ్రులందరు తరించుటకు సాధనమగునని తలచి బ్రహ్మశ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లు (రిటైర్డు సంస్కృతపండితులు, రాజమండ్రి) గారిచే తెలుగు తాత్పర్యమును వ్రాయించి అచ్చువేయించిరి. ఇందులో వేదపాదస్తవము (జైమినిమహర్షి రచితము) ను శ్రీ శంకరభగవత్పాదకృతమగు త్రిపురిసుందరీ పాదస్తవమునుకూడ బ్రహ్మశ్రీ కొల్లి అనంతపద్మనాభ శాస్త్రిగారిచే తాత్పర్యమును వ్రాయించి కూర్చి " చిదంబర మాహాత్మ్య వేదపాస్తవములు" అని పేరుపెట్టిరి. ఇంతేకాక వ్యాప్రాదమహర్షి చేరచించబడిన చిత్సఖేశ్వర వందన స్తవమును శివకామసుందర్యష్టకమును పతఞ్జలమహర్షి విరచితమగు శ్రీ నటేశాష్టకమును తెలుగుతాత్పర్యములతో అచ్చువేయించి ఒకే గ్రంధముగా కూర్చిరి. వీటికి తాత్పర్యములను వ్రాసి వారునాకు చూపించిరి. వాటిని చాలవరకు నేను చూచినాను. మూలానుసారముగానే స్పష్టముగా వ్రాయబడినవి. ఈపుస్తకము సంస్కృతభాషరాని ప్రతిఆంధ్రునకు ఆంధ్రభాషను తెలిసికొనిన ప్రతిమానవునకు ఉపయోగించుననుటలో ఎంతమాత్రము సందియము లేదు. ఈ పుస్తకమును అచ్చు వేయించిన దర్భా సూర్యనారాయణగారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురమునకు సరిహద్దు గ్రామమగు ఇందుపల్లి గ్రామవాసులగు దర్భా శేషయ్యగారికుమారులు. శేషయ్య గారు రామమంత్రమును సదా జపించుచు రామానుగ్రహమును పొంది ఒక కార్తికశుద్ధైకాదశినాడు 1928 సం|| కోనసీమలోని గంగలకుర్రు గ్రామమందలి ఉత్తరవాహినియగు కౌశికనదియందు స్నానముచేసి గ్రామములోనికివచ్చుచు మార్గమధ్యమందు రామనామస్మరణమును చేయుచు శరీరత్యాగమును చేసిరి. వారిని నేను బాగుగా ఎరుగుదును. వారి తపఃఫలము వీరు. వీరిభార్య సౌ|| సుబ్బలక్ష్మిగారుకూడా వీరి కనుకూలమగు సాధ్వీమణి. ముఖ్యముగా ఈగ్రంధ ముద్రణ మందు ఆమెప్రోత్సాహ మెక్కువగానున్నది. ఇంతియేకాక వీరికింకను ఇట్టి గ్రంథప్రచారమును చేయుట యందభిలాష కలదు. ఈ గ్రంథములు వీరికి పుత్రస్థానీయములై వీటిప్రచారమువలన ఈ దంపతులకు ఐహికాముష్మికసుఖములను గలిగించి సుఖింపచేయుటకును, ఈ గ్రంథములకు, తెలుగుతాత్పర్యముల వ్రాసి బ్రహ్మశ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లుగారికి బ్రహ్మశ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రి గారికి ఆయురారోగ్యైశ్వర్యాభి వృద్ధినిచేయుచు ఇంకను అనేకగ్రంథములకు తాత్పర్యములను వ్రాయుటకు శక్తినిచ్చుటకును శ్రీ శివకామసుందరీసహిత శ్రీ నటరాజేశ్వరస్వామి వారిని ప్రార్థించుచున్వాను.

నేదునూరు                                లంక వెంకటరామశాస్త్రి సోమయాజి

తూ||గో||జిల్లా.                             సాంగ వేదార్థసామ్రాట్‌ 7అభినవాపస్తంబ

8-6-1972

ఓమ్‌

రెమిళ్ల సూర్యప్రకాశ శాస్త్రి

వేదార్దసమ్రాట్‌, మీమాంసావిద్యాప్రవీణ

శ్రీగౌతమీవిద్యాపీఠ సంస్కృతకళాశాలాధ్యక్షః

రాజమండ్రి - 1

ఆ శీ ర్వ చ న మ్‌

"సుఖం మే భూయాత్‌ దుఃఖం మే మాభూత్‌" అని సర్వప్రాణులు సుఖముకావలెననియు, దుఃఖము వద్దనియు కోరుచుందురు. సుఖప్రాప్తి దుఃఖపరిహారములకు వేదశాస్త్రములయందు అధికార తారతమ్యము ననుసరించి అనేకోపాయములు బోధింపబడినవి. "నిర్విణ్ణానాం జ్ఞానయోగో న్యాసినామిహకర్మను న నిర్విణ్ణో నావిసక్తో భక్తియోగో 7స్యసిద్ధిదః" అని శ్రీమద్భాగవతమందు అధికారి భేధముననుసరించి మధ్య మాధికారులకు భక్తియోగము ఉత్తమపురుషార్థ సాధనమని చెప్పబడినది. ఈ భక్తియోగము సర్వోపాయములలో అత్యనసులభోపాయమని శ్రీ అధ్యాత్మరామాయణమున "కర్మయోగో జ్ఞానయోగోభక్తియోగచ్చ శాశ్వతః | తేషాంతుశసులభోమార్గో భక్తియోగ స్సుపూజితః | అని చెప్పబడినది. భక్తియోగ మనగా పరమేశ్వరునియొక్క కథాశ్రవణాదినవవిధోపాయముల నాశ్రయించుట. అందు పరమేశ్వర స్తోత్రరూపోపాయము నాశ్రయించుట. అందు పరమేశ్వర స్తోత్రరూపోపాయము నాశ్రయించు వాడు వైదికమయిన యజ్ఞయాగాదులయొక్క ఫలమును బొందగలడని, "యోజాత మస్యమహతో మహిబ్రవాత్‌, సేదుశ్ర్శవోభిర్యుజ్యం చిదభ్యసత్‌" అను శ్రుతి స్పష్టముగా బ్రతిపాదించుచున్నది. ఈ ప్రకారము వేదశాస్త్రములచే మిక్కిలి ఉత్తమమయిన పురుషార్థ సాధనముగా వర్ణింపబడుచున్న భక్తియోగముయొక్క తత్వమును బాగుగా గుర్తించినవారు శ్రీ దర్భా సుబ్బలక్ష్మీ సూర్యనారాయణ దంపతులు. వీరు దక్షిణకాశీ యనబడుచున్న శ్రీ గౌతమీనదీతీరమునగల రాణ్మహేంద్రవరపురవా స్తవ్యులు ప్రస్తుతము అన్నామలై విశ్వవిద్యాలయములో సివిల్‌ ఇంజనీరింగు ప్రొఫెసరుగా యుండిరి. శ్రీ వీరిదంపతులు సుప్రసిద్ధమగు దివ్యక్షేత్రమయిన చిదంబరమందు నివసించుచు శ్రీ శివకామసుందరీసమేత నటరాజస్వామి వారియందు మిక్కిలి శ్రద్ధాభక్తియుక్తచిత్తులై వారుతరించుయేగాక ఆంధ్రభాషాభిజ్ఞులెల్లరును తరింపజేయుటకై ఉద్యుక్తలయిరి; గనుకనే శ్రీ జైమిని, శంకరభగవత్పాదులచే రచింపబడిన, మహామహిమోపేతమయిన వేదపాదస్తవములను, చిదంబరక్షేత్రమాహాత్మ్యమును శ్రీశ్రీపాద వెంకటేశ్వర్లుగారిచేతను, శీ కొల్లి అనన్తపద్మనాభశాస్త్రిగారిచేతను చక్కగా ఆంధ్రభాషలో తాత్పర్యమును వ్రాయించి లౌకికప్రయోజనము నపేక్షింపక పరమేశ్వరార్పరణబుద్ధితో ఇట్టి కార్యమును నిర్వహించుటకై సంకల్పించిరి. ఇందు వేదపాద స్తవములయందు శ్రి జైమిని శంకరభగవత్పాదులు ప్రతిశ్లోకముయొక్క అన్తిమభాగమున సాక్షాత్తు వేదవాక్యములనే పాదరూపములనుగా కూర్చుటవలన గ్రంధములు వేదపాద స్తవములని వ్యవహరింపబడుటయే గాక శ్రి శాస్త్రిగారు వీటికి తెలుగుతాత్పర్యమును వ్రాయు సందర్భములో ప్రకృతమున వేదవాక్యార్థయోజనకి నాతో సంప్రదించగా గ్రంథము నామూలాగ్రముగా చూచు భాగ్యము నాకున్న కలిగినది. శ్రి శాస్త్రివర్యులచే ఆంధ్రభాష సులభ##శైలిలో అనువదింపబడిన, చిదంబరమాహాత్మ్యవేదపాదస్తవములనబడు ఈ గ్రంథరాజము ఆంధ్రభాషాభిజ్ఞులందరికీ ఉపయోగపడుననుటలో ఎంతమాత్రము అతిశయోక్తిలేదు. ఇట్టి సర్వజనతారకమయిన ధర్మకార్యమును నిర్వహించుటకు బూనికొనిన శ్రీ సుబ్బలక్ష్మీ సుర్యనారాయణ దంపతులను శ్రి శివకామసుందరీ సహిత నటరాజేశ్వరస్వామి ఇతోధికముగా సకల శ్రేయో7బివృద్ధులను ఇచ్చి రక్షించుగాక యని నా యాశిర్వచనము.

23-6-1972                              రేమిళ్ల సూర్యప్రకాశశాస్త్రి

 

ఓమ్‌

గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి

ఋగ్వేదభాష్యపరీక్షాధికారి, న్యాయవేద్తా విద్వాన్‌

(మైసూరు)

శ్రీగౌతమీ విద్యాపీఠ సంస్కృతకళాశాల

రాజమండ్రి - 1

ఆ శీ స్సు

ధర్మార్థకామమోక్షములను నాలుగుపురుషార్థములలో మోక్షము పరమపురుషార్థము. దీనికి జ్ఞానమే సాథనమైనను అజ్ఞానమును కర్మోపాసనలచే సంపాదించవలయును. ఉపాసనా మార్గమునే భక్తిమార్గమమందురు. వీటిలో కర్మలు చిత్తశుద్ధిని, భక్తియనగా ఉపాసనచిత్తైకాగ్రతను సంపాదించి జ్ఞానమునకు సాధనములగుచున్నవిగాన కర్మలకంటె భక్తి అంతరంగసాధనమగుచున్నది. అట్టి భక్తిమార్గములో శివకామసుందరీ నటరాజస్వాములను చిరకాలముగా సేవంచుచున్న భక్తవర్యులగు అణ్ణామలై యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగుశాఖలో వాస్తువిభాగమునకు అధ్యక్షులగు బ్రహ్మశ్రీ దర్భాసూర్య నారాయణగారు, వారిసతీమణి శ్రీమతి సౌ|| సుబ్బలక్ష్మిగారి ప్రేరణచే వేదపాదస్తనములను (జైమిని వేదపాదస్తవము త్రిపురసుందరీ వేదపాదస్తవము) లిపిపరివర్తనము ఆంధ్ర తాత్పర్యముతో ఆంధ్రమహాజనుల మహోపకారముకొరకు వ్రాయించి ముద్రితముగావించి భగవత్సమర్పణము చేయవలయునను సత్కార్యమునకు పూనుకొనిరి. ఈ కార్యము వేదభాగములతో కూడియుండటచే కష్టసాధ్యమైనది. దీనిని శ్రీ గౌతమీవిద్యాపీఠం సంస్కృతకళాధ్యక్షులగానుండి విశ్రాన్తితీసుకొన్న శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రిగారు నిర్వహించుటకు పూనిరి. దీనిదినేను ఆమూలాగ్రముగాచూచితివి. అచ్చటచ్చట నిక్షిప్తలుగానున్న వేదపాదములను ప్రకృతానుగుణముగా సమన్వయముచేసి చక్కటి తాత్పర్యమును చాల శ్రమ తీసుక1ని శ్రీ శాస్త్రిగారు రచించిరి. దీనినిచూచి నాకు చాలా ఆనందము కలిగినది. ఇటువంటి మహాకార్యమును చేయించిన శ్రీ సూర్యనారాయణ దంపతులకు శ్రీ శివకామసుందరీ సమేత నటరాజస్వామి ఆయురారోగ్యైశ్వర్యాది సకలాభ్యుదయ నిశ్రేయసములను ఒసంగి రక్షించుగాక యనియు యాఆదిదంపతులను ప్రార్థించుచున్నాను ఇట్టి తాత్పర్యమును రచించిన శ్రీ అనంతపద్మనాభశాస్త్రిగారికి ఆపరమేశ్వరుడు చతుర్విధపురుషార్థముల నిచ్చుగాకయని యాపరమేశ్వరుని ప్రార్థించుచున్నాను.

24-6-1972                                         గోడా సుబ్రహ్మణ్యశాస్త్రి

 

వి జ్ఞ ప్తి

చిదమ్బరము (పుండరీకపురము) భారతదేశమున సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము. పంచభూతములలో నొకటైన అకాశమూర్తికి క్షేత్రము. ఇక్కడ ఎల్లప్పుడు శ్రీశివకామ నున్దరీ సమేత శ్రీ నటరాస్వామి దివ్యమైన ఆనందతాణ్డవ దర్శనము భక్తులకు ప్రసాదించును.

సమస్త ప్రపంచమును ప్రకాశింపజేయు జ్యోతిస్వరూప మీహృదయ పుండరీకములో నున్నది. చిదమ్బరము ప్రపంచమంతటికి హృదయపుండరీకము వంటిది. శరీరధారియగు జీవాత్మయందు ఈశ్వరుడు శుద్దమయిన ఆకారముతో సాక్షిగా నెట్లుండునో, అట్లే ప్రపంచమను దేహమునకు హృదయపుండరీకమయిన ఈ చిదమ్బరక్షేత్రమున శ్రీనటరాజు శివకామసుందరితో సాక్షిగానుండి సమస్త ప్రపంచమును ప్రకాశింపజేయును. శ్రీనటరాజే వేదస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఆస్వరూపమే చిదాకాశము లేక చిదమ్బరము. భక్తితో చిత్సభేశ్వరుని నారాధించుటచే సర్వభయ బాధా నివారణమయి, మానవుని జీవితమంతయు నూతన చైతన్యము గలదై ఆనందనిలయమగును. భక్తియే మానవునకు శరణ్యము. "ముక్తి సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి".

శ్రీ శివకామ సుందరీ నటరాజుల కృపచే చిదమ్బర క్షేత్రముననున్న అణ్ణామలై విశ్వవిద్యాలయమున 22 సంవత్సరములు ఇంజనీరింగు కాలేజీలో ప్రొఫెసరుగా విద్యార్థులకు పాఠములుచెప్పు అవకాశము మరియు ఈ పార్వతీపరమేశ్వరుల దర్శనభాగ్యములు లభించినవి. చిదమ్బరక్షేత్ర మహిమను ఆంధ్ర సోదరీసోదరులకు తెలుపవలయునని సంకల్పము కలిగినది. భక్తురాలయిన నాభార్య శ్రీమతి సుబ్బలక్ష్మి ప్రేరేపణ ప్రోత్సాహము నా సంకల్పమునకు బలము చేకూర్చినవి. మాకును, మరియు ఆధ్రమహాజనులందరికి సులభముగా తెలియునట్లు తాత్పర్యసహితముగా "శ్రీ చిదమ్బర మహాత్మ్య వేదపాదస్తవములు" అను పుస్తకమును నా స్వీయద్రవ్యముతో ముద్రించి శ్రీ శివకామసుందరీ నటరాజులకు సమర్పించవలయునని సంకల్పిచితివి. దీనివలన మా భక్తిని పెంపొందించుకొనుటకును, పార్వతీపరమేశ్వరులను సర్వకాలములందు స్మరించు భాగ్యము చేకూరుటకును, మరియు ముక్తి పొందుటకు ఈ భక్తి మార్గమే శ్రేష్టమనియు తోచినది.

నా సంకల్పమును, నామిత్రులు, శ్రేయోభిలాషులు, సద్గుణసంపన్నులు, ఈశ్వరభక్తులు శ్రీపీసపాటి సూర్యప్రకాశం గారికి (ఇనకమ్‌ టాక్సు ప్రాక్టీషనరు, రాజమండ్రి) తెలియచేసినాను. వారీవిషయములో భక్తిశ్రద్ధలు చూపి మహాపండితులగు శ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లుగారితోను, శ్రీకొల్లి అనంతపద్మనాభ శాస్త్రి గారితోను పరిచయము చేసి వారుభయులు ఈ కార్యమును నిర్వహించుటకు సమర్థులని చెప్పి వారి స్నేహభాగ్యము కలుగచేసిరి. కోరినంతనే వీరుభయులు మహానందముతోను ఈశ్వరభక్తితోను ఈ పుస్తకమును కొలది దినములలో లిపిపరివర్తనము తాత్పర్యము వ్రాసి యిచ్చిరి.

శ్రీ వెంకటేశ్వర్లు గారు, శ్రీ అనంత పద్మనాభశాస్త్రి గారు, అగ్రశ్రేణికి చేరిన గొప్ప సంస్కృతాంధ్రపండితులు. ఇది శ్రీ నటరాజేశ్వరుని పవిత్ర కార్యమగుచే వీరు విశ్రాంతి తీసికొనుచున్నను, చాల శ్రమకోర్చి భక్తిశ్రద్ధలతో రచన పూర్తిచేసినారు. వీరు తాత్పర్యమును మృదుమధురమయిన శైలితో సుకుమారమతులకు కూడ బోధపడునట్లు వ్రాసి, ఆంధ్రమహాజనులకు శాశ్వతమగు గొప్పసేవ చేసినారు. వీరు నిష్కామముతోను, స్వార్థరహితమయిన చిత్తముతోను అచంచలభక్తితోను చేసిన కృషి ఫలితమే ఈ పవిత్రగ్రంథము. వీరికి నా కృతజ్ఞత తెలుపుట ఎట్లో తెలియకున్నది.

ఈ పుస్తకములోని ప్రథమభాగములో శ్రీ వ్యాఘ్రపాద మహర్షి వ్రాసిన చిదమ్బరేశ్వర వన్దన స్తవము, శివకామ సుందర్యష్టకము, 26 అధ్యాయములు గల చిదమ్బరమహాత్మ్యము, పతఙ్జలి మహర్షి వ్రాసిన నటేశాష్టకము గలవు. మొత్తము సుమారు 1500 శ్లోకములు. ఈభాగమునకు ఆంధ్రభాషా తాత్పర్యకర్తలు శ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లుగారు. ఇదివరలో 1970 సంవత్సరమున ప్రచురింపబడిన శ్రీనటరాజు ఆనందతాణ్ణవదర్శనమను చిన్నపుస్తకమునకు లిపిపరివర్తనము తాత్పర్యము శ్రీ వెంకటేశ్వర్లు గారు వ్రాసిన విషయము పాఠకులకు తెలియును. వీరి భక్తి శ్రద్ధలు, ఓపిక కార్యదీక్ష, పాండిత్యము ప్రశంసనీయము. శ్రీ వెంకటమహాలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర్లు గారికి నా కృతజ్ఞతాభివందనములు సమర్పించుచు వారికుటుంబములోని అందరిని శ్రీ శివకామసుందరీ నటరాజులు సర్వశుభములను ప్రసాదించుగాక అని ప్రార్థించుచున్నాను.

ఈ గ్రంథములోని ద్వితీయభాగము శ్రీ వేదపాదస్తవములకు మొత్తము 275 శ్లోకములకు శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రి గారు ఆంధ్రభాషావివరణకర్తలు. వీరు చాలకృషిచేసి, వేదపాదములకు స్థలనిర్దేశముచేసి సుందరమైన తాత్పర్యము వ్రాసిరి. వీరిభక్తి, కార్యదీక్ష పాండిత్యము చాల ప్రశంసనీయము. శ్రీ బంకారమ్మసమేత శ్రీ అనంత పద్మనాభశాస్త్రి గారికి వారి కుటుంబమునకు శ్రీ శివకామసుందరీ నటరాజులు సర్వశ్రేయములు ప్రసాదించుగాక అని ప్రార్థించుచు నా కృతజ్ఞతాపూర్వక వందనములు తెలుపుచున్నాను.

ఈ సంవత్సరము మే నెల 6-9 తేదీలు నేను నాభార్య పవిత్ర శృంగేరి క్షేత్రములో ఉండి శ్రీ శ్రీ శ్రీ శృంగగిరి శారదా పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ మదబినవ విద్యాతీర్థ భగవత్పాదుల వారిని దర్శించి ఈ పుస్తకమును వారికి చూపెడి భాగ్యము కలిగినది. శ్రీవారి పుస్తకమును బాగుగా పరిశీలించి చాల సంతోషించి, చేసిన కృషిని ప్రశంసించి శ్రీవారి శ్రీముఖము, ఆశీస్సులు, ప్రసాదములు మంత్రాక్షతలు మరియు వారి ఫోటోబ్లాకును ఇచ్చి మమ్ములననుగ్రహించి కృతార్థులను చేసినారు. శ్రీవారి శ్రీముఖము ఆశీస్సులు, మహాభాగ్యములు. శ్రీవారి ప్రేమ ఆదరణ, ఆసక్తి శునిశితప్రజ్ఞ చాలగొప్పవి. శ్రీవారికి మా హృదయపూర్వక సాష్టాంగప్రణామములను భక్తితో తెలుపుకొను చున్నాము.

చిదమ్బర క్షేత్రమున సుప్రసిద్థ సంస్కృత పండితులు, శ్రీనటరాజ దేవాలయ పరిపాలక పూజకులు, మాకు దీక్షితులు అయిన శాస్త్రాచార్య, పండితరాజు, సోమశేఖర దీక్షితులుగారు, వారి పుత్రుడు చతుశ్శాస్త్రశిరోమణి శ్రీసోమసేతు దీక్షితులుగారు ఈ గ్రంధమును తయారుచేయుటలో పెక్కు సలహాలిచ్చి మార్గదర్శకులై నాకీభక్తి మార్గము చూపినందులకు, మరియు వారి అముఖాశిర్వాదములకు నాకృతజ్ఞతాపూర్వక నమస్కృతులు సర్పించుచున్నాను.

అణ్ణామలై విశ్వవిద్యాలయమున సంస్కృత విభాగముమునకు అగ్రస్థానము వహించిన నాకు చిరకాలమిత్రులయిన ప్రొఫెసరు. సి.యస్‌. వెంకటేశ్వరన్‌గారు ఈ గ్రంధమును చూచి చాల సలహాలిచ్చి ప్రశంసించి ఆశీస్సులను ప్రసాదించిరి.

నేదునూరు వాస్తవ్యులు, అనేక యజ్ఞయాగాదులు చేసిన మహనీయులు "సాంగవేదర్దసామ్రాట్‌, అభినవ అపస్తంబ" ఇత్యాది బిరుదాలంకృతులునగు శ్రీలంక వెంకటరామశాస్త్ర సోమయాజి ఘనాపాఠీ గారు ఈపుస్తకము ప్రారంభించినది మొదలు చాల ప్రోత్సాహము, సలహాలనిచ్చి సందేహములను తీర్చి మార్గదర్శకులై వారి అభిప్రాయము ఆశీస్సులు ఇచ్చినారు.

మీమాంసవిద్యాప్రవీణ సాంగవేదార్థ సమ్రాట్‌, అభినవ విద్యారణ్య మొదలగు బిరుదులచే కీర్తింపబడు శ్రీ రేమిళ్ల సూర్యప్రకాశశాస్త్రిగారు పెక్కుసలహాలిచ్చి తోడ్పడి ఆశీర్వదించినారు.

సాంగఋగ్వేదనిష్ణాతులును, వ్యాకరణతర్క వేదాంత శాస్త్రములలో అగ్రశ్రేణికు చెందిన పండితులును గౌతమీ విద్యాపీఠ సంస్కృత కళాశాలయందు న్యాయవేదాన్తాచార్యులును అగు శ్రీ గోడా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వేదపాదస్తవములు వ్రాయుటలో వేదవాక్యార్థ నిర్ణయమునందు సంపూర్ణ సహాకారమొనర్చి తమ ఆశీస్సుల నిచ్చినారు.

సర్వవిధముల మాకు సలహాలిచ్చి సంపూర్ణసహకారములిచ్చి దయతో నాశీర్వదించిన పై మహనీయుందరికీ కృతజ్ఞతాపూర్వకముగా నమస్కృతులు సమర్పించుచున్నాను. శ్రీ శివకామసుందరీ శ్రీ నటరాజులు వీరందరికి సర్వశ్రేయములు ప్రసాదించుగాక అని నాప్రార్థన.

శ్రీ పీసుపాటి సూర్యప్రకాశంగారు బహుకార్య నిమగ్నులై ఉండియు ఈ పుస్తకముద్రణ కార్యమందు సంపూర్ణ సహకారమిచ్చి చేసిన మహాకృషి ఫలితమే నేటి గ్రంటరాజము. వీరికి నా కృతజ్ఞత తెలుపుటకు ఎట్లో తెలియకున్నది? శ్రీ శివకామసుందర నటరాజులు శ్రీ సూర్యప్రకాశంగారిని వారికుటుంబమును ఆశీర్వదించి వారికి సర్వమంగళములు ప్రసాదించుగాక.

ఈ గ్రంధములో ముద్రించిన కొన్ని శ్రీ శివకామ సుందరీ నటరాజస్వామివారి ఫోటోలకు బ్లాకులు ఇచ్చి సహాయపడిన శ్రీ శివకామసుందరీ కుంభాభిషేకము కమిటీవారికి మరియు శ్రీ ధర్మపురం అధీనమువారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములు.

ఈపుస్తకమును సకాలములో శ్రద్ధతీసికొని చక్కగా ముద్రణచేసి ఇచ్చిన శ్రీ సత్యనారాయణప్రెస్సు యజమానులైన శ్రీకూసుపూడి వెంకట్రావుగారికి, వారి పనివారికి నా అభినందనములు.

ఈ పుస్తకములో ఏవిధమైన పొరపాట్లు తప్పులు ఉన్నను వానిని పాఠకులు మన్నించి తెలియపరచిన, కృతజ్ఞనతో స్వీకరించి ఇంకొక ప్రచురణలో సరిదిద్దుకొందును.

"చిదమ్బర మాహాత్మ్య వేదపాదస్తవములు" శ్రీ శివకామసుందరీ నటరాజులకు భక్తితో వినమ్రుడనై సమర్పించుకొనుచున్నాను. ఈపవిత్ర గ్రంధమును నాయందు కృపజూపి, పరిపూర్ణానుగ్రహముతో స్వీకరింపుమని వేడుకొనుచున్నాను. ఈకృషిలో సహాయపడిన వారినందరి ఆశీర్వదించి వారికి శుభములు ప్రసాదింపుమని ప్రార్థించుచున్నాను.

శ్లో|| శఙ్కరస్య చరితాకధామృతం చంద్రశేఖర గుణాను కీర్తనమ్‌|

నీలకంఠ! తవపాదసేవనం, సంభవంతు మమ జన్మ జన్మని ||

అన్యధాశరణం నాస్తిత్వమేవ శరణం మమ|

తస్మాత్‌ కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వర||

అపరాధసహస్రాణి క్రియన్తే7హర్ని శంమయా |

దాసో7యమితి మాం మత్వాక్షమస్వ పరమేశ్వర ||

అణ్ణామలై నగరము దర్భా సూర్యునారాయణ F.I.E.

తమిళనాడు (సంపాదకులు-ప్రకాశకులు)

9-71972 సివిల్‌ ఇంజనీరింగు పొఫ్రెసరు

అణామలె యూనివర్సిటీ

 

గురుర్బ్రహ్మా గురువిష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుస్సాక్షా త్పరంబ్రహ్మాతసై#్మ శ్రీగురవేనమః ||

శ్రీ జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామివారు,

శ్రీ దర్భా సూర్యునారాయణ, సుబ్బలక్ష్మి దంపతులు,

శృంగేరి. 8-5-1972

 

పరిచయము

శ్లో|| నాపరం శివగఙ్గాయాః

తీర్థం, స్థానం చిదమ్బరాత్‌ |

తన్మ న్తాన్నాపరో మన్త్రః

నాస్తి దేవో నటేశ్వరాత్‌ |

తదాలోక్యాప్నుహి ఫలం

చార్మణసై#్యవ చక్షుషః ||

చిదమ్బరమాహాత్మ్యే 24 అధ్యా.

ప్రాణిమాత్రము కోరునది సుఖము. పరమసుఖప్రాప్తికి జ్ఞానము, కర్మ, భక్తియని మూడు సాధనములు. జ్ఞానమునకు సాధనచతుష్టయసంపన్నుడే అర్హుడు. కర్మ కష్టతరము, బహుద్రవ్యసాధ్యము. కనుక పైమూడు సాధనములలో భక్తి ఉత్తమము, సులభము. భక్తికి మనుష్యమాత్రుడు లేక ప్రాణిమాత్రమధికారి. భక్తియనగా ఈశ్వరునియందు గాఢమైన ప్రేమయనియు "సాత్వస్మి9 పరమప్రేమరూపా" భగవద్గుణశ్రవణాదులచే మనస్సుకరగి ధారగా ప్రవహించి భగవదాకారమును బొందుటయనియు"ద్రుతస్య భగవద్ధర్మార్ధారావాహికతాం గతా| సర్వేషే మనసో వృత్తిర్భక్తిరిత్య భిధీయతే||" చెప్పిరి. భగవద్గుణ విశేష వర్ణనరూపమైన గ్రంథములను పఠించుటచేతను, వినుటచేతను భక్తి లభించును. పురాణములలో భగవద్గుణవర్ణనము, తద్భక్తుల చరిత్రలు విననగును.

ఈ చిదంబరమాహాత్మ్యము స్కాందపురాణములోనిది. ఇది ఇరువదియారధ్యాయముల గ్రంథము. దీనిలో చిదంబరముయొక్క గొప్పతనము, శివగంగమహిమ, కరుణామయుడైన పరమశివుడు వ్యాఘ్రపాద పతంజలుల ననుగ్రహించి యానందతాండవమును జూపుట, లోకమునుగూడ అనుగ్రహించుట, నృసింహవర్మను హిరణ్యవర్మగా జేయుట ఆ పరమ భక్తుడగు హిరణ్యవర్మ అచ్చటి దేవాలయాదులను, బ్రాహ్మణ గృహములను గ్రొత్తవిగాజేసి నటరాజస్వామి కుత్సవముల నేర్పాటుచేయుట మొదలగు విషయములు గలవు.

చిదంబరము వేదమందును సూతసంహితాదులయందును బ్రసిద్ధమైనది. ఈశ్వరనిర్మితమైన అరువది ఎనిమిది ముక్తిక్షేత్రములలో నిది సర్వోత్తమైనది. కాశీలో మరణించుటవలనను, అరుణాచలమును స్మరించువలనను, చిదంబరమున తాండవమూర్తిని చూచుటవలనను ముక్తి లభించును. వీనిలో జనన మరణ ధ్యానములు దుర్లభములు. మిక్కిలి సులభ##మైనది దర్శనము, కనుక చిదంబరము వానిలో నుత్తమము. పంచభూతముల లింగములుగల క్షేత్రములుగలవు. కాంచీపురమున పృథ్వీగంగము, జంబుకేశ్వరమున జలలింగము. అరుణాచలమున తేజోలింగము, కాళహస్తియందు వాయులింగము, చిదంబరమున ఆకాశలింగము. ఈ ఐదు క్షేత్రములలో అన్నిటికంటె సులభముగా దర్శనమాత్రముచేతనే ముక్తినిచ్చు ఉత్తమక్షేత్రము చిదంబరము.

ఇచ్చట మహాతపస్సు చేసిన వ్యాఘ్రపాద పతంజలులకు పరమశివుడు పార్వతితో వచ్చి కనకసభలో ఆనందతాండవమును జూపి లోకమందలి యనుగ్రహముచే నందరకును తాండవమునుజూపి తరింపజేయ నచ్చట స్థిరముగా నివసించెను. నటరాజు సేవకై భూమిలోనున్న ఏకామ్రేశ్వర, సుందరేశ్వరాది దేవతలందరు నిత్యము రాత్రి చిదంబరమునకు వచ్చెదరట పరమశివుడు పంచకృత్యపరాయణుడుగదా! నటరాజ రూప మాతడుచేయు ఐదుపనులను తెలుపునందురు. డమరుకము సృష్టిని, అభయహస్తము స్థితిని, అగ్నిగల హస్తము సంహారమును, స్థిరపాదము తిరోధానమును, కుంచితపాదము అనుగ్రహమును సూచించును. ఈనటరాజునుసేవించి వ్యాసుడు, సూతుడు జైమిని, మొదలగు ఋషులేగాక మార్గములలో బ్రహ్మహత్యలు చేసి ధనమపహరించిన పుల్కనుడు మొదలగు మహా పాపాత్ములుకూడ తరించిరి. సింహరూపమున బుట్టి దుఃఖించి రాజ్యమునువిడచి చిదంబరమునకు వచ్చిన సింహవర్మయను రాజు నటరాజుయొక్క అనుగ్రహముచే శివగంగలో స్నానముచేసి సింహరూపము తొలగ బంగారమువంటి కాంతితో హిరణ్యవర్మ యయ్యెను. అతడే తొలుత దేవాలయమును అచ్చటిమూడు వేలమంది బ్రాహ్మణుల గృహములను బాగుచేయించి ఉత్సవముల నేర్పరచినవాడు.

ఈవిధమున భక్తుల చరిత్రలు, నటరాజు మహిమయు నీ చిదంబరమాహాత్మ్యమున బాగుగా వివరింపబడినవి. ఈ గ్రంథమును చదివి, విని భక్తితో చిదంబరములోని నటరాజును సేవించినవారి కాతడు జ్ఞానదృష్టి నొసగును. దానితో వారు "సర్వైర్ముముక్షుభిర్ధ్యేయః, శమ్భురాకాశమధ్యగః" అను విధమున హృదయపుండరీకమధ్యముననున్న దహరాకాశములోని తాండమూర్తిని సేవించి పరమసుఖరూపమైన మోక్షమును పొందగలరు. ఈ చిదంబరమాహాత్మ్య ముపదేశించు ప్రధాన విషయమిది యనదగును. తుదకీ చిదబంరమాహాత్మ్యమును నిత్యము పారాయణచేసినను క్రమముగా తరింపగలరు.

ఈగ్రంధమును తెలుగులిపిలో తాత్పర్యముతో వ్రాయుటకు ప్రోత్సహించి అచ్చువేయించినవారు అణ్ణామలై విశ్వవిద్యాలయమున సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగములో ప్రొఫెసరుగానున్న శ్రీ దర్భా సూర్యనారాయణగారు, స్కాందపురాణము దుర్లభమగుటచే వారు మొదట గ్రంధక్షరిలో వ్రాయబడిన చిదంబరమహాత్మ్యమునుండి 17. 18 అధ్యాయములను చిదంబరములోని శాస్త్రాచార్య, పండితరాజ శ్రీ సోమశేఖర దీక్షితులవారిచే నాగరీలిపిలో వ్రాయించి అచ్చు వేయించిరి. పిమ్మట వీరి ధర్మపత్ని సౌభాగ్యవతియు నగు శ్రీ సుబ్బలక్ష్మిగారి ప్రేరణచే నాపుస్తకమును తెలుగులిపిలో తాత్పర్యముతో వ్రాయించి అచ్చువేయించిరి. తరువాత చిదంబరములోని సుహృత్సభ నుండి ఇరువదియారధ్యాయముల చిదంబరమాహాత్మ్యము సంపూర్ణగ్రంధము దేవనాగరీలిపిలో వెలువడగనే శ్రీ దర్భా సూర్యనారాయణగారు తెలుగువారందరికిగూడ సంపూర్ణగ్రంథము నందజేయవలెనను సత్సంకల్పముతో నాగ్రంధమును నాకుపంపి తాత్పర్యముతో తెలుగులిపిలో వ్రాయమని ప్రోత్సహించిరి. విశేషజ్ఞుడను కాకున్నను వారు నన్ను ప్రోత్సహించుటకు కారణము ఆజగత్పితరులగు శివకామసున్దరీ నటరాజుల కీవచ్చియు రాని మాటలు విని యానందింపవలెనను కోరిక యొక్కటెయని నాకు భాసించుచున్నది. తల్లిదండ్రులదగ్గర బాలుడట్టి మాటలు పలుకటకు సందేహింపక ఉత్సాహపడునుగదా! ఆజగత్పితరుల ప్రీతికొరకీ గ్రంధమును వ్రాసితిని. అల్పజ్ఞుడనగుటచే తాత్పర్యము వ్రాయుటలో నీగ్రంధమున కొన్ని దోషములు వచ్చియుండవచ్చును. విజ్ఞులు మన్నించి వానిని తెలిపినచో శిరసావహింతును.

ఈగ్రంధమును చాల భాగమున సరిచూచి దోషములను సవరించి నాకెంతయు సహాయముచేసిన నెల్లూరులోని సంస్కృతకళాలాధ్యాపకులగు శ్రీమాన్‌ కే.యస్‌. రామానుజాచార్యులుగారికిని, రాజమహేంద్రవరమున గౌతమీ విద్యాపీఠస్థ సంస్కృతకళాశాలయందు భూతపూర్వాధ్యక్షులగు శ్రీ కొల్లి అనంత పద్మనాభశాస్త్రులుగారికిని నేను కృతజ్ఞతను తెలుపుచుంటిని.

ఈ గ్రంధమును వ్రాయుటకు నన్ను ప్రేరేపించిన పుణ్య దంపతులు శ్రీ సుబ్బలక్ష్మీ సూర్యనారాయణుల కాశివకామ సుందరీ నటరాజు లఖిలాభీష్టము లొసగెదరుగాక.

మమ్ముల నాశీర్వదించి కృపజూపిన జగద్గురువులు శృఙ్గగిరిపీఠాధిపతులు నగు శ్రీ మదభినవవిద్యాతీర్థ భగవత్పాదులకు నా సాష్ఠాంగ దండప్రణామము లర్పించుచున్నాము.

ఇన్నీసుపేట ఇట్లు

రాజమహేంద్రవరము-2 శ్రీపాద వెంకటేశ్వర్లు

16-6-1972 రిటైర్డు సంస్కృత పండితులు

ప్రభుత్య కళాశాల

ఓమ్‌

ఉపోద్ఘాతము

ఏకరాశిగానున్న వేదసమూహమును ఋగాదిభేదముచే వ్యాస (విభాగ) మొనర్చుటచే సాత్యవతేయుడు వేదవ్యాసుడను నన్వర్ధనామధేయుడయ్యెను. ఆ మహర్షి అష్టాదశపురాణములను, ఉపపురాణములను, ఉపనిషదాధారముగా బ్రహ్మసూత్రములను, సర్వోపనిషత్సారమగు భగవద్గీతను రచించి, మనకు ప్రసాదించినాడు. ఋషియన బ్రహ్మమనియు నర్థము. బ్రహ్మబోధకమగుటచే వైదిక మతమునకు ఆర్షమతనియు ప్రఖ్యాతి గల్గినది.

శ్రీ వేదవ్యాసులవారు రచించిన స్కాందపురాణములో నంతర్గతము చిదంబరమాహాత్మ్యము . విరాట్పురుషుని రూపములోని పంచమహాభూతములలో ప్రధాన భూతమగు ఆకాశమూర్తికి స్థలము చిదంబరక్షేత్రము. పుష్యమీ నక్షత్రయుక్త పౌర్ణమాసీదినమున నటరాజస్వామి శివకామసుందరీ పరాశక్తిగూడి ఆనంద తాండవామృతమును మహర్షులు, సిద్ధులు, గంధర్వలు, దేవతలు మున్నగు భక్తవర్యులకు ప్రసాదించును.

దాక్షిణాత్యభక్తకవిపండితులు చిందరక్షేత్ర మహత్వమును బహువిధములుగా వివరించిరి. వారివాక్యముల యుర్థమును నిటపొందుపఱతును.

అయిదు భూతములలో నాకాశ##మే ప్రధానము. కావున ఆకాశ ప్రధానమయిన యీక్షేత్రము అన్నిటికన్న ప్రశస్తము. (1) తిరువాలంగాడు అనుక్షేత్రము రత్నసభ, (2) మధుర వెండిసభ, (3) తిరునల్వేలి తామ్రసభ, (4) తిరుక్కుంటాలము చిత్రసభ, (5) చిదంబరము కనకసభయు అని ప్రసిద్ధములు, ఈయైదు సభలలో పరమేశ్వరుడు పరమేశ్వరితో గూడి నటన మొనర్చుచుండును.

ఈనాట్యములో పరమేశ్వరుని పంచకృత్యములు నాట్యభంగిమములవలన వ్యక్తమగుచుండును. డమరుకమున్న చేతితో సృష్టి, అభయహస్తముచేస్థితి ఎత్తిన చేతితో సంహారము, నాట్యముచేయు పాదముచే అనుగ్రహము, మరొకపాదముచే తిరోధానమును సూచితములు. ఇది స్థూలచిదంబరము,

శరీరాంతర్గతమయినది సూక్ష్మచిదంబరము. భూతాకాశము లేక యితర భూతముల స్థితియెట్లులెదో అట్లే హృదయస్పందనములేక మిగిలిన యవయవములు పనిచేయవు. కనుక హృదయమును చిదాకాశముగా చెప్పుదురు. భగవంతుని స్థానము చిదాకాశము. భగవంతుని నటనముయొక్క ప్రతిధ్వనియే మన హృదయ స్పందనము. ఇడ. సుషుమ్న , పింగల, యను మూడు నాడులు మనశరీరములోగలవు. అందు సుషుమ్న మధ్యనాడి, దానిలో 6 చక్రములు గలవు. రెండేసి చక్రములు గలిసి యొకగ్రంధిగా నుండును. మూలాధారచక్రముమధ్య కులకండమను బిందువున కఱచి పెట్టుకొని కుండలినీశక్తి యుండును. మూలాధారము సుషుమ్నా నాడికి మూలస్థానము 4 దళములుగలది. బాహ్యప్రపంచముననిది కమలాపురము అను తిరువారూర్‌ గా నున్నది స్వాధిష్ఠానము 6 గళములు గలది. ఇది బాహ్యప్రపంచమున జంబుకేశ్వరముగా ప్రసిద్ధిగాంచినది, ఇది శరీరములో లింగప్రదేశము స్థానముగాగలది. ఈరెంటికి పైన బ్రహ్మగ్రంధికలదు. ఈరెండుచక్రములపైన మణిపూరచక్రము గలదు. అది 10 దళములతో విరాజిల్లును. ఇది బాహ్యప్రపంచమున అరుణాచలక్షేత్రము. మణిపూర చక్రముపైన 12 దశములుగల అసాహతచక్రముగలదు. ఇది శరీరములో హృదయ క్షేత్రమునగలదు. దీనిని సంవిత్కమలమనియు, పూర్ణగిరి పీఠమనియు స్తుతింతురు. దీనిని 12 సూర్యులు సంపూర్ణ కాంతితో ప్రకాశింపజేయుదురు. ఈ చక్రము బాహ్యప్రపంచమున చిదంబరము. దీనిపై గ్రంధి విష్ణుగ్రంధిః దీనికి పైన 16 దళములుగల విశుద్ధచక్రము మన కంఠస్థానమున నున్నది. ఇది వాయుస్థానము. ఇది కాళహస్తిగా చెప్పబడుచున్నది. దీనిపైన ద్విదళము ఆజ్ఞాచక్రము భ్రూమధ్యమందున్నది. ఇది బాహ్య ప్రపంచమున కాశీక్షేత్రము. దీనిపైన రుద్రగ్రంధి యుండును. దీనిపైన సహస్రదళములుగలిగి జ్వలించు సహస్రారచక్రము గలదు. దీనికి చంద్రమండలమనియు, ద్వాదశాంతమనియు, బ్రహ్మరంధ్రమనియు నామములుగలవు. దీనిని బాహ్యమున కైలాసమందురు.

శరీరములో మధ్యస్థానమగు హృదయమే చిదాకాశము. ఇదియే చిదంబరము. ఇదియే పరమేశ్వరుని నాట్యస్థానము. దీనివలన చిదంబరము స్థూలరూపము. దహరాకాశము సూక్ష్మరూపము - అని పర్యవసానము.

పుష్యమీ నక్షత్రయుక్త పౌర్ణమాసీదినమున చిత్సభయందు పరమేశ్వరుడు భక్తులకు ప్రసాదించు ఆనందతాండవామృతమును తనివితీర నాస్వాదించుటకు మహర్షి సిద్ధగంధర్వ దేవతాదులు నిరీక్షింతురు.

జైమిని మహర్షి అగ్ని కేశాదిశిష్యసమేతుడై దేవ గంధర్వాది సంసేవితమయిన చిత్సభ##కేతెంచెను. అచ్చట పరమేశ్వరుని నాట్యమును దూరమునుండియే గాంచి సాష్టాంగ ప్రణామ మొనర్చెను. నటరాజు నాట్యమును పార్శ్వము నుండి తిలకించు శివకామసుందరీ మహాదేవినిగాంచి సంతోషముతో ప్రణమిల్లెను. జైమిని పరమశివుని యనుగ్రహమున వేదాంత సారమును సంపూర్ణముగా నాకళించుకొని భక్తితో దోసిలి కట్టి యీయత్యు త్తమమయిన వేదపాదాంతస్తవమును రచించెను. ఇది జైమిని మహర్షి కర్తృకమగుటచే జైమిని వేదపాదస్తవముగా ప్రసిద్ధి గాంచెను.

శ్రీ వేదవ్యాసుల వారికి నలుగురు శిష్యులు పైలుడు జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు. జైమిని మహర్షి వ్యాసశిష్యులలో ప్రధానుడు. సర్వ వేదార్థసార సంపన్నుడగు నీమహర్షి సామవేదశాఖీయుడగు మహాత్ముడని యందురు. ఈయన పూర్వ మీనాంసాశాస్త్రప్రవర్తకుడు వేదములోని పూర్వభాగము కర్మబోధకము వేదార్థ నిర్ణాయకములగు నియమముల ననుసరించి వేదార్థమును నిర్ణయింపవలెను. ద్వాదశాధ్యాయ పరిమితమగు పూర్వమీమాంసాసూత్రముల నీజైమిని మహర్షి రచించెను.

లోకమున భక్తులగుకవు లనేకవిధములుగా విశిష్టభక్తి భావామృత పరిపుతమయిన తమ కవితాసుధాపూరముచే పరమేశ్వరుని తృప్తిగావించి, కృతార్థులయిన వారుగలరు. వారి స్తవరత్నములును పెక్కు గలవు. గానప్రియుడగు పరమాత్మను నాదబ్రహ్మోపాసకులయిన త్యాగరాజాది భక్తవరేణ్యులు రాగతాళసంపుటితమగు తమ గానమాధురీ భరిత సుధాభిషేకమున తనియించి ధన్యులయినవారును గలరు. వారి వారి రచనలు సుప్రసిద్ధములై లోకమున వ్యాపించియున్నవి. కాని యీజైమిని కృత స్తవమునకు వానికన్న విశిష్టతకలదు. ప్రతిశ్లోకాంతపాదము వేదవాక్యరూపమగుటయు సమస్తవేదవేదాంగ సార స్వరూపాభిజ్ఞుడు, సాక్షాద్వేదవ్యాస శిష్య సత్తముడగు జైమినిమహర్షి ముఖారవిందస్సృత మకరందమగు దీనిమాధుర్యము ప్రాశస్త్యము చెప్పుటయనావశ్యకము.

ఇట్లే పరమేశ్వరునితో నవినాభావినియగు శ్రీమత్త్రి పురసుందరియొక్క వేదపాదస్తవము. దీనిని రచించినవారు సాక్షాచ్ఛంకరావతారమయి, అద్వైత ప్రస్థానత్రయ రచయితలును, తత్ర్పవర్తకులును, ఇంకను ననేక ప్రకరణాది గ్రంథముల నద్వైతపరముగా రచించి, తమ యఖండ ప్రతిభావిశేషముచే నితరమత నిరసనపూర్వకముగా సర్వవేదాంతములకు నద్వైత మందే పరమతాత్పర్యమని శ్రుతియుక్తి ప్రమాణములతో నిర్ణయించి మనకు ప్రసాదించిన శంకరభగవత్పాదులగుట దీనిప్రాశస్త్యమును వేఱ చెప్పనేల!

ఈస్తవములు రెండును నిత్యపారాయణమొనర్చి తరించుటకు సర్వదా ఉపయుక్తములు.

వేదము సర్వధర్మములకును మూలము. అని వేదలక్షక్షణము: ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారములకు, అలౌకికోపాయ బోధకమగునని వేదము "అలౌకిక శ్రేయస్సాధనతాలోథకోవేదః" మరియు "యస్యనిశ్వసితంవేదాః" అను సూక్తిచే పరమేశ్వరుని ముఖమునుండి నిశ్వాసమువలె నప్రయత్నముగ వెలువడినవని చెప్పుటచేత నవి యపౌరుషేయములనియు, నిత్యములనియు నిర్థారితమైనది. మరియు వేదః ప్రాచేతసాదాసీత్సాక్షాద్రామాయణాత్మనా" అనియు "భారతం పంచమో వేదః" అనియు రామాయణ మహాభారతములు వేదధర్మములను ప్రధాన తాత్పర్యముతో బోధించుటచే వానియందు వేదత్వమాగోపితమగుటచే వేదవైశిష్ట్యము బహుముఖముగా బోధింపబడుచున్నది.

అట్టి వేదవాక్యము పాదాన్తముగల స్తవములగుటచే నివి నిత్యపారాయణమువలన వేదపారాయణ ఫలమును ప్రాప్తింపజేయుచున్నవి. వీనియర్థమును దెలిసికొని పఠించినచో ఫలాధిక్యము సుస్పష్టమేకదా. "యదేవవిద్యాయాకరోతితదేవ వీర్యవత్తరంభవతి" అని శాస్త్రము. ఈరెండు వేదపాదస్తవములును సంస్కృతభాషలో నున్నవి. సంస్కృతభాషాసంస్కారము గలవారికే యవిగ్రాహ్యములు. ఆంధ్రజనసామాన్యము పఠించి తరించుటకు నవకాశమును కల్పింపవలెనని లిపిపరివర్తనము. ఆంధ్రభాషలో తాత్పర్యము వ్రాయించి ప్రకటింపవలయునను పవిత్రాశయముతో అన్నామలై విశ్వవిద్యాలయములో సివిల్‌ ఇంజనీరింగుశాఖలో వాస్తువిభాగమున కధ్యక్షులుగానున్న బ్రహ్మశ్రీ దర్భా సూర్యనారాయణగారు వారి ధర్మపత్ని, సాధ్వీమణి, శివకామసుందరీ నటరాజాది మదంపతులయందు పరమభక్తిబావసమన్విత శ్రీమతి, సౌభాగ్యవతి, సుబ్బలక్ష్మిగారి ప్రేరణచే నీసత్కార్యమునకు పూనుకొనిరి. "శివశ్శక్యాయుక్తోయదిభవతిశక్తః ప్రభవితుం" అనిగదా శ్రీ మచ్ఛంకరభగవత్పాదసూక్తి.

కాపాప్తమిత్రులును సత్కార్యనిర్వహణధురీణులును, భగవద్భక్తులును, సహృదయులునగు అడిటర్‌ బ్రహ్మశ్రీ పీసపాటి సూర్యప్రకాశముగారి ద్వారమున నీవేదపాదద్వయాంధ్రతాత్పర్యరచన చేయవలసినదని నాకు తెలియజేసిరి. వేదార్ధగంధములేని నేను వేదపాదస్తవముల కర్థమువ్రాయుటా యని జంకితిని. నిశ్చయించితిని. కాని శ్రీ సూర్యప్రకాశముగారి యందలి గౌరవమడ్డుకొన్నది. సత్కార్యముకదా! వేదవిద్యానిష్ణాతుల సాయమునుదీసికొని యీకార్యము నిర్వహింపలేమా! అని ధైర్యముతో నీకార్యమునకు పూనితిని. నా యోపినకలది పెద్దలసాయమును సంపూర్ణముగా గ్రహించి, యీరెండు పుస్తకములకును తాత్పర్యము వ్రాసితిని.

వేదములో నాయావేదభాగములసందర్భములు భిన్న భిన్నములుగానుండును. ఈ స్తోత్రములలో పైమూడు పాదముల యర్థముతో సమన్వితమగునట్లు చేయుట కొంతకష్టతరమగు విషయము. ఎంతవరకు నిర్వహింపగలిగితినో! "ఆపరితోషాద్విదుషాం నసాధు మన్యే ప్రయోగవిజ్ఞానమ్‌" అను కాళిదాసమహాకవి సూక్తిని మనసులో మననముచేసికొనుచున్నాను.

ప్రొఫెసరు దర్భా సూర్యనారాయణగారి కోరికచే స్కాందపురాణాంతర్గతమగు 26 అధ్యాయపరిమితసంస్కృత నటరాజమాహాత్మ్యమును పండితవర్యులు బ్రహ్మశ్రీ శ్రీపాద వెంకటేశ్వర శాస్త్రిగారు లిపిపరివర్తనము తాత్పర్యమును చక్కని మృదుమధురశైలిలో తెలుగుభాషలో సర్వాంగసుందరముగా రచించిరి. దానికనుబంధముగా నా రచనయగు నీస్తవద్వయమును గలిపి యేకసంపుటముగా జేసి ముద్రణము చేయించిరి.

వేదపాదస్తవ తాత్పర్యరచనకు, వేదాపాదార్థ వివరణముపై పాదములయర్థ సమన్వయము వేదపాదాపదార్ధనిర్ణయాదులలో నాకత్యంతము సాయముచేసిన పండితవర్యులు. సాంగవేదార్థసమ్రాట్‌. అభినవాపస్తంబ బ్రహ్మశ్రీ లంక వెంకటరామశాస్త్రి సోమయాజులుగారు సాంగవేదార్థసమ్రాట్‌. వేదర్థభాస్కర, మీమాంసావిద్యాప్రవీణ శ్రీ గౌతమీ విద్యా పీఠసంస్కృతకళాశాల ప్రిన్సిపాలు బ్రహ్మశ్రీ రేమిళ్ల సూర్యప్రకాశశాస్త్రి గారు.

ఋగ్వేదభాష్యపరీక్షాధికారి. న్యాయవేదాంత వ్యాకరణశాస్త్ర నిష్ణ్వాతులును, ప్రస్తుతము శ్రీ గౌతమీవిద్యాపీఠ సంస్కృత కళాశాలా న్యాయవేదాంత శాఖోపన్యాసకులునగు బ్రహ్మశ్రీ గోడా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు.

ఈ మహావిద్వాంసులు మువ్వురు చేసిన సాయముచేతనే ఈమాత్రమయిన నేను వ్రాయగల్గితిని. కావున నీవేదమూర్తి త్రయమునకు నామస్కారముల నర్పించుకొనుచున్నాను.

జగద్గురువులును శృంగగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమదభినవవిద్యాతీర్థమహాస్వామి గురువరేణ్యులను శ్రీ సూర్యనారాయణగారు దర్శించినప్పుడు ఈకృషికి శ్రీవారు మహానందముపొంది వారొసంగిన శ్రీముఖములో మాకృషిని ప్రస్తావించి, సంతసించి, మాకాశీర్వచనముల నొసంగిన శ్రీ జగద్గురుప్రభువులకు, మాసాష్టాంగ నమస్కారములను శ్రద్ధాభక్తిపూర్వక వినమ్రతతో నర్పించుకొనుచున్నాము.

మరియు నీకృషిని సంతోషముతో నాదరించిన పెద్దలకందరకు మాప్రణామములు.

ఇట్టి పరమపవిత్రకార్యమును సంకల్పించి, సత్కార్యనిర్వహణదీక్షాదక్షులగు సీసపాటి సూర్యప్రకాశముగారి సంపూర్ణ సాహాయ్యముతో నిర్వహించి, ఈ పవిత్రకార్య నిర్వహణమున మాకుగూడ సదవకాశమును కల్పించి శ్రీ శివ కామసుందరీసహిత నటరాజ పరమేశ్వర కారుణ్యలేశమున మాకుగూడ స్ధానముకల్పించి శ్రీ సుబ్బలక్ష్మీ సూర్యనారాయణ దంపతులకు వారి యిష్టదైవములు శ్రీ శివకామసుందరీ నటరాజాదిమదంపతులు దీర్ఘాయురారోగ్య సర్వసంపత్సమృద్ధి సమన్వితులను జేయుగాక, అని వారికిని మాకును ఇష్టదైవమగు శ్రీ శివకామసుందరీ సమేత నటరాజపరమాత్మను ప్రార్థింతును.

అనువాదమునందలి నా దోషములను, ముద్రణ దోషములను సహృదయులు దయతో తెల్పినచో కృతజ్ఞతతో స్వీకరించి వానిని సవరించుకొందును.

పరీధావిజ్యేష్ఠ                                     కొల్లి అనంతపద్మనాభ శాస్త్రి

శుక్లపూర్ణిమ                                        రిటైర్డు ప్రిన్సిపల్‌

26-6-1972                                 శ్రీ గౌతమీ విద్యాపీఠ ప్రాచ్య సంస్కృత

                                             కళాశాల, రాజమండ్రి.

 

శ్రీ శంకరకృప

11, హనుమున్‌ కోవిల్‌ వీధి

మద్రాసు - 600033

దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదాపీఠమువారి యాజ

మాన్యమున వెలువడు ఆధ్యాత్మిక మాసపత్రిక

ఏప్రిల్‌ 1975

శ్రీ చిదంబరమాహాత్మ్య వేదపాదస్తవములు. (శ్రీ వేదవ్యాస, జైమిని, శంకరభగత్పాద విరచితములు) ఆంధ్రతాత్పర్యసహితము.

సంపాదకులు, ప్రకాశకులు : ఆచార్య శ్రీ దర్భా సూర్య నారాయణ (అణ్ణామలై యూనివర్సిటి, చిదంబరము)

గ్రంథములు దొరకుచోటు : శ్రీమతి దర్భా సుబ్బలక్ష్మీ కేరాఫ్‌ శ్రీ దర్భా సూర్యనారాయణ , సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌, అణ్ణామలై యూనివర్సిటి, అణ్ణామలైనగరము తమిళనాడు 600 పుటలు వెల రు 12-00.

ఇది ఉత్తమభక్తి సాహిత్య గంధము. దీనిని సంపాదించి ప్రకటించుటలో సంపాదకులైన ఆచార్య దర్భా సూర్యనారాయణగారి భక్తి పారవశ్యము ద్యోతమాన మగుచున్నది. శ్రీ శ్రీపాద వేంకటేశ్వర్లు శ్రీ కొల్లి అనంత పద్మనాభశాస్త్రి గారలు సమకూర్చిన ఆంధ్ర తాత్పర్యములు సులభ సుందరముగా నున్నవి. ఈ గ్రంధము నందు చిదంబరహస్య స్వరూపనిర్ణయము, శివకామ సుందరీస్తుతి, శ్రీ వ్యాఘ్రపాద కృతస్తవము, శివకామ సుందర్యష్టకము, చిదంబరమాహాత్యము, పతంజలి కృతనటేశాష్టకము, నటేశ అష్టోత్తర శతనామావళి, శ్రీ జైమినిమహర్షి కృత శ్రీనటరాజ వేదపాదస్తవము శ్రీ శంకర భగవత్పూజ్యపాదకృత శ్రీమత్త్రిపురసుందరీ వేదపాదస్తోత్రము- ఆంధ్ర తాత్పర్యసహితముగ నున్నవి.

శ్రీ శృంగేరీ జగద్గురు చరణులు ఈ గ్రంధమును పరిశీలించి, వాత్సల్యపూర్ణముగా సంపాదకులకృషిని ప్రశంసించి, ఆశీర్వదించినారు.

భగవంతుడైన జైమినిమహర్షి పరమేశ్వరుడైన చిత్సభానాధుని వేదపదములతో కూడిన శ్లోకములతో స్తుతించెను. ఆ శ్లోకములన్నిటియందు చివరపాదము వేదరూపమగా నుండును. శ్రీమచ్ఛంకర భగవత్పూజ్యపాదులు రచించిన త్రిపురసుందరీ వేదపాదస్తోత్రమునందును ప్రతిశ్లోకముయొక్క చివరపాదము వేదమంత్రరూపముగ నుండును. కావున ఈస్తోత్రములు రెండును చాల మహత్వపూర్ణమైనవి.

చిదంబరమాహాత్మ్యము వేదవ్యాసకృతము. ఇది ప్రత్యక్షర పుణ్యజనకమైనది.

ఈ గ్రంధప్రకటనములో ప్రకాశకులు లౌకిక ప్రయోజనమును కాంక్షింపక, భగవత్కృపాపేక్షతో పూనుకొనిరి, ఇది ప్రశంసాపాత్రమైన విషయము.

ఈ గ్రంధమును పఠించిన ఆస్తికజనులు అభీష్టసిద్ధులను పొంది శ్రీ శివకామ సుందరీ నటేశ్వరుల కృపకు పాత్రులై మంగళపరంపరలను పొందుదురని చెప్పవచ్చును.

(శ్రీపాదుక).

శ్రీ చి ద మ్బ ర మా హా త్మ్య ము

(శ్రీ వేదవ్యాస ప్రణీతము)

స్కాందపురాణాంతర్గతము

లిపిపరివర్తనము - తాత్పర్యము

సాహిత్యవిద్యాప్రవీణ, ఉభయభాషాప్రవీణ

శ్రీ శ్రీపాద వెంకటేశ్వర్లు

రిటైర్డు సంస్కృతపండితులు, ప్రభుత్వకళాశాల

రాజమహేంద్రవరము

సంపాదకులు- ప్రకాశకులు

శ్రీ దర్భా సూర్యనారాయణ

సివిల్‌ ఇంజనీరింగు ప్రొఫెసరు

అణ్షామలై విశ్వవిద్యాలయము

చిదంబరము - తమిళనాడు

1972

 

ప్ర ధ మ భా గ ము

1972 ప్రధమ ముద్రణము

సర్వస్వామ్యములు ప్రకాశకులవి

 

శ్రీ వేదవ్యాస భగవానుడు

శ్లో || నమోస్తు7తే వ్యాస విశాలబుద్ధే|

పుల్లారవిందాయతపత్రనేత్ర|

యేనత్వయా భారతతైలపూర్ణః |

ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః ||

 

శ్రీ చి ద మ్బ ర మా హా త్మ్య

ని త్య పా రా య ణ వి ధిః

పారాయణక్రమః

అన్య శ్రీ చిదమ్బరమాహాత్మ్యస్య భగవాన్‌ వ్యాసో ఋషిః || అనుష్టుప్‌ ఛందః || దహరకుహరమధ్యగః శ్రీ చిత్సభేశ్వరః శ్రీమదజానన్దతాణ్డవరాజో దేవతా | ఓం బీజం నమః శక్తిః| శివాయేతి కీలకమ్‌ | శ్రీచిత్సభేశ్వరప్రసాదసిద్ధిద్వారా సకలభోగమోక్షసిధ్యర్థే వినియోగః ||

యస్మాత్సర్వం అంగుష్టాభ్యాం నమః| సముత్పన్నం తర్జనీభ్యాంనమః| చరాచరమిదం జగత్‌ మధ్యమాభ్యాంనమః . ఇదం నమః | అనామికాభ్యాంనమః | నటేశాయ తసై#్మ కనిష్ఠికాభ్యాం నమః | కారుణ్యమూర్తయే కరతలకరపృష్టాభ్యాం నమః | యస్మాత్సర్వం హృదయాయనమః |సముత్పన్నం శిరసేస్వాహా| చరాచరమిదం జగత్‌ శిఖాయై వౌషట్‌| ఇదంనమః కవచాయ హుం| నటేశాయ తసై#్మనేత్రత్రయాయ వౌషట్‌ | కారుణ్యమూర్తయే అస్త్రాయ ఫట్‌ | భూర్భవస్సువ రోమితి దిగ్బంధః |

ధ్యానం

శ్లో || హరిహరవిధిముఖ్యాన్‌ యో7సృజత్‌ విశ్వకర్తౄన్‌|

దహరకుహరమధ్యే యం ప్రపశ్యన్తి సన్తః |

ద్యిజకులతిలకై ర్యః పూజ్యతే వేదరీత్యా |

స భవతు మమ సేవ్యః సాంబమూర్తిః సభేశః ||

సాంబమూర్తిం నటేశాం చిత్సభాపతిమీశ్వరమ్‌ |

సోమరాజం దేవరాజం చిన్తయామిష్టసిద్థయే ||

మూకంకరోతివాచాలం పంగుం లంఘయతేగిరిమ్‌ |

యత్‌ కృపా, తమహంవన్దే పరమానందతాణ్డవమ్‌ ||

లం పృధివ్యాత్మనే గన్ధం సమర్పయామి | హం ఆకాశాత్మనే పుష్పాణి సమర్పయామి | యం వాయ్వాత్మనే ధూప మాఘ్రాపయామి| రం వహ్న్యాత్మనే దీపందర్శయామి| పం అమృతాత్మనే అమృతం నివేదయామి| సం సర్వాత్మనే సర్వోపచారాన్‌ సమర్పయామి.

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే|

ఓంకాఠనిలయం దేవం గజవక్త్రం చతుర్భుజం |

పిచండిలమహం వన్దే సర్వవిఘ్నోపశాంతయే||

వ్యాసంవశిష్టనప్తారం శ##క్తేః పౌత్రమకల్మషమ్‌|

పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిమ్‌||

అష్టాదశపురాణానాం కర్తారం చ మహామునిమ్‌|

బ్రహ్మసూత్రప్రణతారం నౌమి సత్యవతీసుతమ్‌ ||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే

నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః||

 

శ్రౌతకాండంసూత్రజాలైః యేన సంగ్రధితం క్రమాత్‌

యేనాధీతా దహ్రవిద్యా వ్యాసాత్తం జైమినిం నుమః ||

అష్టాదశపురాణానామాలయం కరుణాలయం

పారాశర్యస్య సచ్ఛాత్రం వందే సూతం చ శాంభవమ్‌ ||

శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం,

నమామి భగవత్పా దశంకరం లోకశంకరమ్‌ ||

ధర్మస్త్వం వృషరూపేణ జగదానందకారక|

అష్ణమూర్తేః అధిష్ఠానం అతః పాహి సనాతన||

చామీకరాచలప్రఖ్యం సర్వాభరణభూషితమ్‌|

బాలేందుమకుటం సౌమ్యం త్రినేత్రం చ చతుర్భుజం||

దీప్తశూలమృగీటంకహేమవేత్రధరం ప్రభుమ్‌||

చంద్రబింబాభవదనమ్‌ భ##జే శ్రీసుయశాపతిమ్‌||

ఉపమన్యుం నందికేశం మణివాచకము త్తమమ్‌|

శ్రీమద్దహరవిద్యాయాః సంప్రదాయగురూన్‌ భ##జే||

మధ్యందినసుతం శాంతం వశిష్ఠభగినీపతిమ్‌|

ఉపమన్యోశ్చ పితరం వ్యాఘ్రపాదం నమామ్యహం||

పతంజలిం మహాభాష్యకరారం ఫణినాయకమ్‌|

అత్రేః సూనుం మహాభాగం అనసూయాత్మజం భ##జే||

నటరాజసమాన్‌ వందే త్రిసహస్రమునీశ్వరాన్‌|

నటేశపూజకాన్‌ విప్రాన్‌ చిదంబరనివాసినః||

యస్మాత్సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్‌|

ఇదం నమో నటేశాయ తసై#్మకారుణ్యమూర్తయే|

నమశ్శివాయ సాంబాయ సగణాయ సమానవే|

సనందినే సగంగాయ సవృషాయ నమో నమః||

పూ జ న మ్‌

తతః ప్రతిదినం సమగ్రం వా. తాణ్డవాధ్యాయం వా, ఏకాధ్యాయం వా, నద్రుతవిలంబితం ముక్తకణ్ఠమ్‌. న మృదు తారం సాధు సార్థబోధం పఠనీయమ్‌. పఠనానంతరం, పుస్తకం పీఠే నిధాయ, ధూపదీపాది ప్రదర్శ్య క్షీరం, ఫలం, స్వాద్వన్నం చ, నివేద్య, మంగళనీరాజనం విధాయ, పుష్పాంజలిం సమర్పయేత్‌. సాష్టాంగం ప్రణిపత్య, శ్రీ శివకామసుందరీపరాంబాసమేత శ్రీ నటరాజమూర్తిం ధ్యాయేత్‌. తతః పూర్వవత్‌ అంగన్యాసం కృత్వా ఇతి దిగ్వి మోకః ఇతి ఉక్త్వా ధ్యానశ్లోకాన్‌ పఠిత్వా, ఇమే శ్లోకాః పఠనీయాః.

యస్మాత్సర్వం హృదయాయ నమః

సముత్పన్నం శిరసే స్వాహా

చరాచరమిదం జగత్‌ శిఖాయై వషట్‌

ఇదం నమః కవచాయ హుం

నటేశాయ తసై#్మ నేత్రత్రయాయ వౌషట్‌

కారుణ్యమూ ర్తయే అన్త్రాయఫట్‌

భూర్భువస్సువరోమితిదిగ్విమోకః||

ధ్యా నం

శ్లో|| హరిహరవిధిముఖ్యాన్‌ యో7సృజత్‌ విశ్వకర్తౄన్‌

దహరకుహరమధ్యే యం ప్రపశ్యన్తి సన్తః|

ద్విజకులతిలకై ర్యః పూజ్యతే వేదరీత్యా|

స భవతు మమ సేవ్యః సాంబమూర్తిః సభేశః||

సాంబమూర్తిం నటేశాం చిత్సభాపతిమీశ్వరమ్‌||

సోమరాజం దేవరాజం చిన్తయామిష్టసిద్ధయే||

మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్‌|

యత్కృపా తమహం వన్దే పరమానందతాణ్డవమ్‌||

లం, పృధివ్యాత్మనే గంధం సమర్పయామి| హం ఆకాశాత్మనే పుష్పాణి సమర్పయామి| యం వాయ్వాత్మనే ధూపమాఘ్రపయామి| రం వహ్న్యాత్మనే దీపం దర్శయామి వం అమృతాత్మనే అమృతం నివేదయామి| సం సర్వాత్మనే సర్వోపచారాన్‌ సమర్పయామి|

ఫ ల శ్రు తి

శ్లో|| మంగళం చిత్స భేశాయ మహనీయగుణాత్మనే|

చక్రవర్తినుతాయ శ్రీ నటరాజాయ మంగళమ్‌||

శ్లో|| స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం|

న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః |

గోబ్రాహ్మణభ్యః శుభమస్తు నిత్యం|

లోకాస్సమస్తాః సుఖినో భవంతు||

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ|

దేశో7యం క్షోభరహితోబ్రాహ్మణాస్సంతు నిర్భయాః ||

అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః |

అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాం శతమ్‌|

ఆయుర్వృద్ధికరం స్త్రీణాం సౌమంగళ్యస్య వర్థనమ్‌ |

మాహాత్మ్యపఠనం హ్యేతత్‌ సర్వసౌభాగ్యకారకమ్‌|

కరచరణకృతం, వాక్కాయజం కర్మజం వా|

శ్రవణనయజనంవా మానసం వా7పరాధమ్‌|

విహితమవిహితం వా సర్వమేతత్‌ క్షమస్వ|

శివ శివ కరుణాబ్ధే శ్రీనటేశ ప్రసీద||

ఆత్మా త్వం గిరిజా మతిః పరిజనాః ప్రాణా శరీరం గృహం|

పూజతే విషయేపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరః |

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్‌||

కాయేన వాచా మనసేన్ద్రియైర్వా|

బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్‌|

కరోమి యద్యత్సకలం పరసై#్మ|

సదాశివాయేతి సమర్పయామి||

సర్వేజనాః సుఖినో భవన్తు|

సమస్త సన్మంగహాని సన్తు||

 

చిత్సభా (విమాన) వర్ణనము

శ్లో|| వామాద్యా నవశక్తయో యదుపరి

శ్రీస్వర్ణకుమ్భా నవై

వ్యాసాం చిన్మయసంసది ప్రతనుతే

నృత్తం నటేశః సదా|

తద్వామే నగజా, రహస్యమపి త

ద్దక్షే7స్తి చైదమ్బరం

శ్రీవ్యాఘ్రజ్ఘ్రిపతఞ్జలీ మునివరౌ

తత్పార్శ్వయోః సంస్తుతః

వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళీ, కలవికరణి, బలవికరణి, బలప్రమధిని, సర్వభూతదమని, మనోన్మని అను తొమ్మిదిశక్తులు తొమ్మిది పసిడికుండలుగా పైనగల చిత్సభయందు నటరాజు నాట్యము చేయుచుండెను. వానియెడమ భాగమున శివకామ సుందరి గలదు. కుడి భాగమున చిదంబర రహస్యము గలదు. ఆసభకొకప్రక్క వ్యాఘ్రపాదమహర్షి, మరియొక ప్రక్క పతంజలి మహర్షి నిలబడి స్తోత్రము చేయుచుండిరి.

1. చిదంబర రహస్య స్వరూప వర్ణనము

శ్లో|| శ్రీచక్రాదివిశేషయ న్త్రఘటితం

భిత్తిస్వరూపం సదా

నన్దజ్ఞానమయం మహేశశివయోః

సమ్మేళనం బోధయత్‌

శ్రీజామ్బూనదబిల్వపత్రరచితైః మాలాగణౖర్లక్షితం

కస్తూరీమసృణం చిదమ్బరమిదం

స్థానం రహస్యం విదుః|

శ్రీచక్రము, చిదంబరచక్రము, సమ్మేళనచక్రము, తాండవచక్రము, దహరచక్రము, చింతామణిచక్రము మొదలగు విశిష్టమైన యంత్రములతో కూర్పబడినది, గోడస్వరూపముతో నున్నది, ఎల్లప్పుడును ఆనందమయము జ్ఞానమయమునైనది, శివునకును శక్తికిని ఐక్యమును బోధించునది, బంగారపు మారేడు దళముల మాలలతో చూడబడునది, కస్తూరి పూయబడినదియునగు నాచిదాకాశస్థానమును రహస్యమందరు. (చిదంబర రహస్యము)

2. చిత్సభానాయక వర్ణనము

శ్లో|| స జయతి దివ్యనటేశో

నృత్యతి యో7సౌ చిదమ్బరసభాయామ్‌|

పాణిన్యాదిమమునయో

యస్య చ కృపయా మనోరథానభజన్‌||

చిదంబరసభలో నృత్యము చేయుచు పాణిని మొదలగు మునులకు దయతో కోరికల నొసంగిన యాదివ్యనటరాజు సర్వోత్కృష్టముగా బ్రకాశించుచుండెను.

శ్లో|| కిఞ్చిత్కుఞ్చితవామహస్తచరణః కిఞ్జల్కితాస్యస్మితః

భూతస్థాపితదక్షిణాఙ్ఘ్రిరభయం

హస్తేన బిభ్రన్ముదా

అన్యాభ్యాం డమరుం విభావసుశిఖాం

పాణ్యమ్బుజాభ్యాం వహన్‌

యో7సౌ నృత్యతి దివ్యసంసది శుభం

దేయాత్సభానాయకః||

ఎడమకాలిని ఎడమచేతిని కొంచెము వంచి ముఖమున పద్మకింజల్కమువంటి చిరునవ్వును ధరించి కుడిపాదమును భూతముమీద నుంచి సంతోషముతో అభయహస్తమును ధరించి మిగిలిన రెండుచేతులలో డమరువును అగ్ని శిఖను ధరించి దివ్యసభలో నృత్యము చేయుచున్న ఆసభానాయకుడు శుభము నిచ్చుగాక.,

శ్లో|| లోకానాహూయసర్వాన్‌ డమరుకనినదైః

ఘోరసంసారమగ్నాన్‌

దత్వా భీతిం దయాలుః ప్రణతభయహరం

కుఞ్చితం వామపాదమ్‌|

ఉద్ధృత్యేదం విముక్తేరయనమితి కరాత్‌

దర్షయన్‌ ప్రత్యయార్థం

బిభ్రద్వహ్నిం సభాయాం కలయతి నటనం

యశ్శివో నస్స పాయాత్‌ ||

భయంకరమైన సంసారసముద్రములో మునిగియున్న జనులనందరను డమరుకధ్వనితో పిలిచి అభయమిచ్చి భక్తుల భయమును బోగొట్టెడు కొంచెము వంచిన యెడమ కాలినెత్తి ఇది ముక్తికి మార్గమని చేతితో జూపుచు విశ్వాసముకొరకగ్నిని చేతితో బట్టుకొని సభలో నాట్యముచేయు పరమ శివుడు మనలను రక్షించుగాక.

3. శ్రీ శివకామ సున్దరీస్తుతి

శ్లో|| తతః స్వర్ణనిభాం దేవీం విద్యుల్లేఖేన భాస్వరామ్‌

నీవారశూకవత్తన్వీం పీతాం భాస్వత్తనూపమామ్‌||

శివకమామసున్దరీదేవి బంగారమువంటి రంగుగలది, మెరపువలె ప్రకాశించునది, నివ్వెరధాన్యపు ముల్లువలె సూక్ష్మమైనది, పచ్చనిది, సూర్యమండలముతో పోల్పదగిన తేజస్సు గలది, లేక ప్రకాశించు సూక్ష్మవస్తువులకు పోలికయైనది.

శ్లో || స్వేచ్ఛాపఙ్కజమధ్యస్థాం

స్వేచ్ఛాకల్పితవిగ్రహామ్‌

సద్వి నేత్రాం చతుర్హస్తాం

మధ్యే సూక్ష్మాం స్తనోన్న తామ్‌||

తనకోరిక ప్రకారముద్భవించిన పద్మముమధ్యలోనున్నది, తన ఇచ్చవలన రూపము కల్పించుకొన్నది, రెండు కన్నులు. నాలుగుచేతులు, సన్నని నడుము, ఎత్తైన స్తనములు గలది.

శ్లో|| నితమ్బతటవిస్తీర్ణాం శ్యామాం నీలాలకాన్వితామ్‌|

హారకేయూరరశనామేఖలాద్యుపశోభితామ్‌||

విశాలమైన పిరుదులుగలది, నల్లని రంగుగలది, నీల వర్ణపు ముంగురులుగలది, ముత్యాలహారము, బాహువురులు, పదియారుపేటల మొలనూలు, ఎనిమిది పేటల మొలనూలు మొదలగువానిచే నలంకరింపబడినది.

శ్లో|| స్పురన్మకుటమాణిక్యకింకిణీరవశోభితామ్‌|

దుకూలవసనోపేతాం కిఞ్చిత్ర్పహసితాననామ్‌||

ప్రకాశించు కిరీటమందలి మాణిక్యములచేతను చిరుగంటల ధ్వనిచేతను విలసిల్లునది, పట్టుబట్టను ధరించినది, చిరునవ్వుతో కూడిన ముఖముగలది.

శ్లో || అనౌపమ్యగుణాం సౌమ్యాం

మహాసాత్వికరూపిణీమ్‌|

దక్షిణోర్థ్వకరాబ్జేన

చాక్షమాలాధరాం శివామ్‌||

సాటిలేని గుణములుకలది, సౌమ్యమైనది, మిక్కిలి సాత్వికరూపముగలది, కుడివైపు పైచేతిలో జపమాలను ధరించినది, మంగళరూపముగలది.

శ్లో || వామేనోర్ధ్వకరాబ్జేన శుకవత్సధరాం పరామ్‌|

దక్షాధఃకరపద్మేన పుల్లకహ్లారధారిణీమ్‌||

ఎడమవైపు పైచేతిలో చిలుకపిల్లను ధరించినది కుడి వైపు క్రిందుచేతిలో పరిమళించు ఎఱ్ఱకలువను పట్టుకొనియున్నది.

శ్లో || లమ్బితాన్యకరాబ్జేన కటిదేశే సమన్వితామ్‌|

బ్రహ్మవిష్ణ్విన్ద్రమకుటై ః సంఘర్షితపదామ్బుజామ్‌||

ఏవం ధ్యాయేత్పరేశానీం| పుణ్డరీకపురేశ్వరీమ్‌

ఎడమవైపు క్రిందిచేతిని నడుమున చేర్చినది. బ్రహ్మ విష్ణుఇంద్రులచే నమస్కరింపబడుచున్నదియని పుణ్డరీకపురేశ్వరి యగు పరమేశ్వరి నీవిధముగా ధ్యానము చేయవలెను.

 

వతా ప్రార్థన

శ్రీ చిత్సభేశాయ నమః

శ్రీవ్యాఘ్రపాదమునీన్ద్రవిరచిత శ్రీచిదమ్బరేశ్వర

వన్దన స్తవః

శ్లో|| వన్దే శమ్భుముమాపతిం సురగురుం

వన్దే జగత్కారణం

వన్దే పన్నగభూషణం మృగధరం

వన్దే పశూనాం పతిమ్‌|

వన్దే సూర్యశశాఙ్కవహ్నినయనం

వన్దే ముకున్దప్రియం

వన్దే భక్తజనాశ్రయం చ వరదం

వన్దే శివం శఙ్కరమ్‌||

పరమానందస్వరూపుడు, పార్వతీపతి, దేవగురువు, ప్రపంచమునకు కారణభూతుడు, సర్పముల నాభరణముగా ధరించినవాడు, కృష్ణమృగమును చేతిలో ధరించినవాడు, జీవులను సంసారబంధమునుండి విడిపించి రక్షించువాడు, సూర్యచంద్రాగ్నులను నేత్రములుగా ధరించినవాడు, విష్ణువునకు ప్రియమైనవాడు, భక్తులకాశ్రయుడు, కోరిన వరముల నిచ్చువాడు, సుఖమును కలిగించువాడునగు శివుని నమస్కరించుచున్నాను.

శ్లో || వన్దే సర్వజగద్విహారమతులం వన్దే కరిత్వగ్ధరం

వన్దే దేవశిఖామణిం శశినిభం వన్దే హరేర్వల్లభమ్‌|

వన్దే పర్వతకన్యకార్థవపుషం వన్దే పరం చిన్మయం

వన్దే భక్తజనాశ్రయం చ వరదం

వన్దే శివం శఙ్కురమ్‌||

లోకమునందంతటను విహరించు వ్యాపకుడు, సాటి లేనివాడు, గజచర్మమును ధరించినవాడు, దేవశ్రేష్ఠుడు చంద్రునివంటి కాంతిగలవాడు విష్ణువునకు ప్రియుడు, పార్వతిని సగము శరీరమున ధరించిన యర్ధనారీశ్వరుడు, పరస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు భక్తుల కాశ్రయుడు, కోరిన వరముల నిచ్చు వాడు, సుఖమును కలిగిచువాడునగు శివుని నమస్కరించు చున్నాను.

శ్లో|| వన్దే వ్యోమసభాపతిం నటపతిం

వన్దే7ర్కదన్తాపహం.

వనేనిర్మలమాదిభూతమనిశం

వన్దే మఖధ్వంసినమ్‌|

వన్దే నిత్యమగేన్ద్రజాప్రియకరం వన్దే7తిశాన్తాకృతిం

వన్దేభక్తజనాశ్రయం చ వరదం

వన్దే శివం శఙ్కరమ్‌ ||

చిదమ్బర సభాధిపతి, నటరాజు, వీరభద్రరూపమున సూర్యుని దంతములను బోగొట్టినవాడు, పాపరహితుడు సమస్త లోకమునకు మొదటివాడు, దక్షయజ్ఞమును ధ్వంసము చేసినవాడు, పార్వతి కెల్లపుడు ప్రీతిని గలుగజేయు వాడు, మిక్కిలి శాంతమైన యాకారము గలవాడు, భక్తుల కాశ్రయుడు, కోరిన వరముల నిచ్చువాడు, సుఖమును గలిగించువాడునగు శివుని నమస్కరించుచున్నాను.

శ్లో || వనే భూరథమమ్బుజాక్షవిశ్మిఖం

వన్దే త్రయీవాజినం

వన్దే శైలశరాసనం ఫణిగుణం వన్దే 7బ్ధితూణీరకమ్‌|

వన్దే పద్మజసారథిం పురహరం వన్దే మహాభైరవం

వన్దే భక్తజనాశ్రయం చ వరదం

వన్దే శివం శఙ్కరమ్‌||

భూమిని రథముగను, విష్ణువును బాణముగను, వేదములను గుఱ్ఱములుగను, పర్వతమును విల్లుగను, ఆదిశేషువు నల్లెత్రాడుగను, సముద్రము నమ్ములపొదిగను, బ్రహ్మను సారధిగను, జేసికొని మహా భయంకరుడై త్రిపురాసురసంహారము జేసినవాడు, భక్తులకాశ్రయుడు, కోరిన వరముల నిచ్చువాడు, సుఖమునిచ్చువాడు నగు శివుని నమస్కరించుచున్నాను.

శ్లో|| వన్దే పఞ్చముఖామ్బుజం త్రిణయనం

వన్దే లలాటేక్షణం

వన్దే వ్యోమకవచం జటాసుముకుటం

వన్దే7బ్జగజ్గౌధరమ్‌|

వన్దే మారహరం త్రిపుణ్డ్రనిటలం

వన్దే7ష్టమూర్త్యాత్మకం

వన్దే భక్తజనాశ్రయం చ వరదం

వన్దే శివం శఙ్కరమ్‌||

తామరపువ్వులవంటి ఐదు ముఖములుగలవాడు, మూడు నేత్రములు గలవాడు, ఫాలమున కన్ను గలవాడు, ఆకాశము జుట్టుగాగలవాడు, మంచి జటల కిరీటము గల వాడు, చంద్రుని, గంగను ధరించినవాడు, మన్మధుని భస్మము చేసినవాడు నుదిటియందు మూడు విభూతి రేఖలను ధరించిన వాడు, ఎనిమిది మూర్తులుగా నున్న వాడు, భక్తుల కాశ్రయుడు, కోరిన వరముల నిచ్చువాడు, సుఖము నిచ్చువాడునగు శివుని నమస్కరించుచున్నాను.

శ్లో|| వన్దే రాజతపర్వతాగ్రనిలయం వన్దే సురాధీశ్వరం

వన్దే నిర్గుణమప్రమేయమమలం

వన్దే యమద్వేషిణమ్‌|

వన్దే కుణ్డలిరాజకుణ్డలధరం వన్దే సహస్రాననం

వన్దే భక్తజనాశ్రయం చ వరదం

వన్దే శివం శఙ్కరమ్‌||

కైలాస పర్వతశిఖరమున నివసించువాడు, దేవ దేవుడు, గుణాతీతుడు, తెలిసికొన శక్యము కానివాడు, స్వచ్ఛమైనవాడు, మృత్యువును జయించినవాడు, సర్పరాజును కుండలముగా ధరించినవాడు, వేయి ముఖములుగల వాడు, భక్తుల కాశ్రయుడు, కోరిన వరముల నిచ్చునాడు, సుఖము నిచ్చువాడునగు శివుని నమస్కరించుచున్నాను.

శ్లో || వన్దే7నన్తరవిప్రకాశమగుణం వన్దే7న్ధకస్యాన్తకం

వన్దే పద్మజ విష్ణుగర్వకులిశం

వన్దే దయామ్భోనిధిమ్‌|

వన్దే చిత్సభమీశ్వరం సురనుతం

వన్దే త్రిమూర్త్యాత్మకం

వన్దే భక్తజనాశ్రయం చ వరదం

వన్దే శివం శఙ్కరమ్‌||

అనేకసూర్యుల ప్రకాశము గలవాడు, సత్వరజస్తమో గుణములు లేనివాడు, అంధకాసురుని సంహరించినవాడు, లింగరూపముయొక్క అద్యంతములను కనుగొనుటలో బ్రహ్మ విష్ణువులయొక్క గర్వమును బోగొట్టినవాడు, దయా సముద్రుడు చిత్సభేశ్వరుడు దేవతలచే పొగడబడినవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, భక్తుల కాశ్రయుడు, కోరిన వరముల నిచ్చువాడు, సుఖము నిచ్చువాడునగు శివుని నమస్కరించుచున్నాను.

శ్లో|| వన్దే 7పస్మృతిశిక్షకం విషహరం

వన్దే మృడం ధూర్జటిం

వన్దే విప్రవరై స్సుపూజితపదం

వన్దే భవోత్తారకమ్‌|

వన్దే ధర్మముఖార్థదం శ్రుతినుతం

వన్దే గురూణాం గురుం

వన్దే భక్తజనాశ్రయం చ వరదం

వన్దే శివం శఙ్కరమ్‌||

అపస్మారకుని కాలిక్రింద అణగద్రొక్కినవాడు, విషమును బోగొట్టువాడు, భక్తులను సుఖింపజేయువాడు, బరువైన జటాసమూహమును ధరించినవాడు, మూడువేలమంది వైన జటాసమూహమును ధరించినవాడు, మూడు వేలమంది బ్రాహ్మణశ్రేష్ఠులచే బాగుగా పూజింపబడిన పాదములు గలవాడు, సంసారమునుండి తరింపజేయువాడు, ధర్మము మొదలగు పురుషార్థముల నిచ్చువాడు, వేదములచే పొగడపడినవాడు, గురువులకు గురువు, భక్తుల కాశ్రయుడు, వరముల నిచ్చువాడు, సుఖము నిచ్చువాడునగు శివుని నమస్కరించుచున్నాను.

శ్లో|| శార్దూలాంఘ్రిమహర్షిణా విరచితం

సంకీర్తయేద్వన్దన

స్తోత్రం తద్గతనామభిర్యజతియ

శ్శమ్భుం సభాయాఃపతిమ్‌|

సన్ధ్యాసు ప్రతివాసరం సునియతో

ధర్మాదిసత్సమ్పదః

లబ్ధ్వేహేన్దుకలాధరస్య సచివో

భూత్వా స చ క్రీడతి||

ఎవడు వ్యాఘ్రపాద మహర్షి రచించిన ఈ వందన స్తోత్రమును నిత్యము పఠించునో. దీనిలోని నామములతో ప్రతిదినము సంధ్యా కాలములయందు నియమముగా సభాపతినిగూర్చి హోమము చేయునో వాడు ధర్మము మొదలగు మంచి సంపదలను పొంది ఇక్కడ చంద్రశేఖరునకు మంత్రియై యానందించును.

ఇతి శ్రీవ్యాఘ్రపాదమునీన్ద్రవిరచితః శ్రీచిదమ్బరేశ్వర

వన్దనస్తవః

సమాప్తః

శ్రీ వ్యాఘ్రపాదమహర్షి ప్రణీత శ్రీ శివకామ

సున్దర్యష్టకమ్‌

శ్లో || పుణ్డరీకపురమధ్యవాసినీం

నృత్తరాజసహధర్మచారిణీమ్‌|

అద్రిరాజతనయాం దినే దినే

చిన్తయామి శివకామసున్దరీమ్‌||

పుండరీకపురమున నివసించునది, నటరాజు ధర్మపత్నియు, పర్వతరాజు కుమార్తెయునగు శివకామసుందరిని ప్రతిదినము స్మరించెదను.

శ్లో|| బ్రహ్మ విష్ణుముఖరామరేడితాం

బాహుపద్మశుకవత్సశోభితామ్‌|

బాహులేయకలభాననాత్మజాం

చిన్తయామి శివకామసున్దరీమ్‌||

బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలచే స్తుతింపబడినది, పద్మమువంటి బాహువున చిలకపిల్లచే అలంకరింపబడినది, కుమారస్వామి, గజాననుడు కుమారులుగా గలదియునగు శివకామసుందరిని తలచెదను.

శ్లో|| #9; వేదశీర్షవినుతాత్మవైభవాం

వాఞ్చితార్థఫలదానతత్పరామ్‌|

వ్యాససూనుముకతాపసార్చితాం

చిన్తయామి శివకామసున్దరీమ్‌||

ఉపనిషత్తులచే పొగడబడిన వైభవముగలది, కోరిన కోర్కెల ఫలము నిచ్చుటయందాసక్తిగలది, సూతుడు మొదలగు తాపసులచే పూజింపబడినదియునగు శివకామసుందరిని తలచుచున్నాను.

శ్లో|| దివ్యరత్నమణిభూషణామ్బరాం

దేవరాజమహిలాదిసంవృతామ్‌|

దానవారిసహజాం దయానిధిం

చిన్తయామి శివకామసున్దరీమ్‌||

దివ్యమైన రత్న మణి భూషణాంబరములు ధరించినది, శచీదేవి మొదలగువారిచే సేవింపబడునది, విష్ణువు తోబుట్టువు దయా సముద్రురాలునగు శివకామసుందరిని తలచుచున్నాను.

శ్లో|| షోడశార్ణపరదేవతాముమాం

పఞ్చబాణనిచయోద్భవేక్షణామ్‌|

పారిజాతతరుమూలమణ్డపాం

చిన్తయామి శివకామసున్దరీమ్‌||

పదునారు ఆవరణములలోనుండు పరదేవత, ఉమ, మన్మథసమూహమునకు కారణమైన కన్నులుగలది, పారిజాత వృక్షము మొదట మండపముగలదియునగు శివకామసుందరిని స్మరించుచున్నాను.

శ్లో || విశ్వయోనిమమలామనుత్తమాం

వాగ్విలాసఫలదాం విచక్షణామ్‌

వారివనాహసదృశాలకామ్బరాం

చిన్తయామి శివకామసున్దరీమ్‌||

ప్రపంచమునకు కారణభూతురాలు, నిర్మలమైనది, సర్వోత్తమైనది, ఉత్తమవాక్కుల ఫలమునిచ్చునది. విశేషముగా బలుకునది మేఘమువంటి ముంగురుల బట్టగలదియునగు శివకామసుందరిని స్మరించుచున్నాను.

శ్లో|| నన్దికేశవినుతాత్మవైభవాం

నామమన్త్రజపకృత్సుఖప్రదామ్‌|

నాశహీనపదదాం నటేశ్వరీం

చిన్తయామి శివకామసున్దరీమ్‌|

నందికేశ్వరునిచే పొగడబడిన వైభవముగలది, నామ. మంత్ర, జపము చేయువారలకు సుఖము నిచ్చునది, నాశము లేని స్థానమైన మోక్షము నిచ్చునది, నటేశ్వరియగు శివ కామసుందరిని స్మరించుచున్నాను.

శ్లో|| సోమసూర్యహుతభుగ్విలోచనాం

సర్వమోహనకరీంసుధీడితామ్‌|

సత్రివర్గపరమాత్మసౌఖ్యదాం

చిన్తయామి శివకామసున్దరీమ్‌||

చంద్రసూర్యాగ్నులు మూడు నేత్రములుగాగలది, అందరను మోహింపజేయునది, పండితులచే పొగడబడినది, ధర్మార్ధకామములతో కూడ మోక్షసుఖము నిచ్చునదియునగు శివకామసుందరిని స్మరించుచున్నాను.

శ్లో|| పుణ్డరీకచరణర్షిణా కృతం

స్తోత్ర మేతధఘహం పఠన్తి యే|

పుణ్డరీకపురనాయికామ్బికా

యచ్ఛతీష్టమఖిలం మహేశ్వరీ||

వ్యాఘ్రపాదమహర్షిచే జేయబడినది, పాపమును బోగొట్టునదియునగు ఈస్తోత్రము నెవరు చదువుదురో వారికి పుండరీకపురనాయిక, మహేశ్వరియునగు జగదంబ కోర్కెల నన్నిటి నొసగును.

 

 

---0---

 

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters