Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ దశమో7ధ్యాయః

(ఉపమన్యుచరితము)

శ్లో || పిత్రాజ్ఞామనుపాలయన్‌ స భగినీమూఢ్వా వసిష్ఠస్య తామ్‌

లబ్ధ్వాస్యాముపమన్యుముత్తమసుతం శమ్భోర్ద యాయాః పదమ్‌|

క్షీరాబ్ధిన్ధయమాదిశంశ్చ మహితాయాసై#్మ స శై వం మనుం|

ద్రష్టుం తాణ్డవమీశ్వరస్య సుచిరం తేపే తపో వ్యాఘ్రపాత్‌||

ఆవాఘ్రపాదుడు తండ్రియాజ్ఞను గౌరవించి వసిష్ఠుని సోదరిని పెండ్లాడి ఆమెయందు శంకరుని దయకు పాత్రుడైన ఉపమన్యుడను నుత్తమకుమారుని కని క్షీరాబ్ధినిత్రాగు నాకుమారునికి శివమంత్రము నుపదేశించి శివతాండవమును జూడ గోరి చాలకాలము తపస్సు చేసెను.

సూతః:

శ్లో || ఏతస్మిన్న న్తరే శ్రీమాన్‌ పితా తస్య మహాతపాః |

శ్రుత్వా సర్వముదన్తం తం శఙ్క రానుగ్రహాశ్రయమ్‌||

సుజన్మానం తపోరూపం వంశదీపం తపోనిధిమ్‌

పుత్రం తథావిధం ద్రష్టుమాజగామ తపోవనాత్‌||

సూతుడు :

ఇంతలో మహాతపస్వియగు వ్యాఘ్రపాదుని తండ్రి వాని శంకరానుగ్రహమునకు సంబంధించిన యావృత్తాంతమునంతను విని మంచిపుట్టుకగలవాడు, తపోరూపుడు, వంశమునకు దీపమువంటివాడు, తపోనిధియునగు నట్టి కుమారుని జూచుటకు తపోవనమునుండి వచ్చెను.

శ్లో || ఆయాన్తం పితరం ప్రీతం దృష్ట్వా పుత్రః ససమ్ర్భమమ్‌|

ప్రత్యుద్గమ్య తదా సద్యః ప్రణనామ మహీతలే||

సంతోషముతో వచ్చుచున్న తండ్రిని జూచి కుమారుడు తొందరగా నెదురేగి వెంటనే భూమిమీద సాష్టాంగముగా నమస్కరించెను.

శ్లో || సో7పి చైనం సముత్థాప్య పరిష్వజ్య పునః పునః |

అవాప మహతీం ప్రీతిం తదాలోకనసమ్భవామ్‌||

అతడును కుమారుని లేవనెత్తి మరలమరల కౌగిలించుకొని వానిని జూచినందువలన మహాప్రీతిని బొందెను.

శ్లో || ప్రాదిష్టవర్త్మా తేనైవ సుతేనాద్భుతరూపిణా|

హేమపద్మతటాకాఖ్యం తీర్థమాప శ##నైశ్శనైః ||

అద్భుతరూపముగల యాకుమారుడు మార్గము జూప మెల్లమెల్లగా హేమపద్మతటాకమను తీర్థమును చేరెను.

శ్లో || కృతస్నానవిధిస్సద్యః తస్మిన్‌ తీర్థవరే శుభే

శ్రీమూలస్థాననిలయం పూజయామాస శఙ్కరమ్‌||

పవిత్రమైన యాతీర్థరాజమున వెంటనే స్నానమాచరించి మూలస్థానముననున్న శంకరుని పూజించెను.

శ్లో || ఆత్మనో మఠికాయాం చ తేన పుత్రేణ యశ్శివః |

స్థాపితో7భూద్విధానేన తం చ భక్త్యా సమర్చయత్‌||

ఆకుమారుడు తన పర్ణశాలయందు యథావిధిగా స్థాపించిన శివునిగూడ భక్తితో బూజించెను.

శ్లో || #9; స్వాదుభిః కన్దమూలాద్యైః తర్పయన్‌ తద్వనోద్భవైః |

తత్ర కాలమసంఖ్యేయం నినాయ క్షణమాత్రవత్‌||

ఆవనములో పుట్టిన రుచిగల కందమూలాదులతో తృప్తి జెందుచు చాలకాల మచ్చట క్షణముగా గడిపెను.

శ్లో || తతః కాలే గతే7సంఖ్యే కదాచిన్మునిసత్తమః |

విధాయ పూజామిశస్య పార్శ్వస్థం సుతమబ్రవీత్‌||

చాలకాలము గడచినపిమ్మట నొకప్పుడు మునిపుంగవుడు ఈశ్వరుని పూజించి ప్రక్కనఉన్న కుమారునితో పలికెను.

శ్లో || సుప్రతిష్ఠాం గతో వంశః త్వయా వత్స మహామతే|

పూతా చ సకలా సత్యముచ్చైర్భూతా చ మేదినీ ||

బిడ్డా! మహామతీ! నీచేత వంశము మంచికీర్తిని పొందినది. సమస్తమైన భూమి నీచేత పవిత్రమైనది. గొప్పదైనది.

శ్లో || అతఃపరం తు వంశ్యానాం పితౄణాం తృప్తయే సదా|

ఆత్మీయఋణానాశాయ దృఢం పుత్ర! మనః కురు||

అటుపిమ్నట వంశములోని పితృదేవతల కెల్లప్పుడు తృప్తికలుగుటకు నీపితృఋణము తీరుటకును పుత్రోత్పత్తి యందు కోరికగలవాడవగుము.

శ్లో || #9; ఆశ్రమో7యం త్వయా పూర్వః యథా శుచిమతా సుత|

ప్రసిద్ధో 7భూద్ద్వితీయో7పితథైవ క్రియతామిహ||

కుమారా! పరిశుద్ధుడవైన నీవీ మొదటి బ్రహ్మచర్యా శ్రమమునెట్లు ప్రసిద్ధము చేసితివో అట్లే రెండవదియగు గృహస్థాశ్రమమునుగూడ ప్రసిద్ధము చేయుము.

శ్లో || అతస్త్వ మస్మద్వచనమఙ్గీకురు విశేషతః|

ఇత్యుక్త్వా మధురం వాక్యం ధర్మవిత్స పితా తదా||

వసిష్ఠభగినీం కన్యాం శీలరూపవిభూషణామ్‌|

సూనోస్తస్య విధానేన ధర్మపత్నీం చకార హి ||

కనుక నీవు విశేషముగా మామాట నంగీకరింపుమని ధర్మము తెలిసిన యాతండ్రి మధురమైన మాటను పలికి యపుడు రూపము స్వభావము అలంకారములుగాగల కన్యయగు వసిష్ఠసోదరిని ఆకుమారునకు ధర్మపత్నిని జేసెను.

శ్లో || తతశ్చ వ్యాఘ్రపాదేన తస్యాం కాలేన శీలవాన్‌|

ఉత్పాదితస్సుతశ్ర్శీమానుపమన్యుసమాఖ్యకః ||

పిమ్మట వ్యాఘ్రపాదున కామెయందు కాలక్రమమున శీలవంతుడు శ్రీయుతుడునగు ఉపమన్యుడను పేరుగల కుమారుడు పుట్టెను.

శ్లో || ధర్మపత్నీ వసిష్ఠస్య ధర్మసత్యమయీ సతీ|

ఋషేః శ్రుత్వా సుతం జాతం సమాగత్య తపోవనాత్‌||

స్నేహాకులా సమాదాయ తం బాలం పుణ్యలక్షణమ్‌|

సర్వోపకారకం రమ్యం పునరాన స్వమాశ్రమమ్‌||

ధర్మస్వరూపురాలు, సత్యస్వరూపురాలు, పతివ్రతయు నగు వసిష్ఠుని భార్య వ్యాఘ్రపాదునకు కుమారుడు కలిగినటుల విని తమ తపోవనమునుండి వచ్చి ప్రేమతో శుభలక్షణములుగల ఆ బాలుని తీసుకొని అందరకు ఉపకారకము, సుందరమునగు తనుయాశ్రమమునకు మరల వెళ్లెను.

శ్లో || యథాకాలం యథాప్రాప్తం యథాశ్రద్ధమనిన్దితా|

సౌరభేయేన పయసా తం మునిం పర్యవర్థయత్‌||

సమయములోగాని ఉన్నదానిలోగాని శ్రద్ధలోగాని లోపము లేకుండ కామధేనువు పాలతో ఆమునిని పెంచెను.

శ్లో || వసిష్ఠస్యాశ్రమే తస్మిన్‌ తద్దారపరిరక్షితః |

కఞ్చిత్కాలమయం బాలో గమయామాస లీలయా||

ఆవసిష్ఠుని యాశ్రమమున నతనిభార్య పెంచుచుండగా నీబాలుడు కొంతకాలము సంతోషముతో గడపెను.

శ్లో || పితరౌ లోకవిఖ్యాతౌ తత్స్నే హాకులమానసౌ|

తమేనమదిదృక్షేతామాత్మజం గుణినాం వరమ్‌||

లోకప్రసిద్ధులైన తలిదండ్రులు వాత్సల్యముచే మనస్సున కలతజెంది గుణవంతులలో నుత్తముడగు నాకుమారుని జూడగోరిరి.

శ్లో || #9; సురభేః క్షీరపానేన మహాతేజాః స బాలకః |

ఆనీయత పునస్తస్మాజ్జనకేన స్వమాశ్రమమ్‌||

కామధేనువు పాలు త్రాగి మహాతేజోవంతుడైన యా బాలుని తండ్రి వసిష్ఠునియాశ్రమమునుండి మరల తనయాశ్రమమునకు తీసికొనివచ్చెను.

శ్లో || ఆనీయ జనకౌ పుత్రం లలితం క్షీరపాయినమ్‌|

కన్దమూలాని శాకాని దదతుః స్వాశ్రమోచితమ్‌||

పాలుత్రాగి సుందరుడైన యాకుమారుని తీసికొని వచ్చి తలిదండ్రులు తమయాశ్రమములోనుండు కందమూలశాకములను పెట్టిరి.

శ్లో || దత్తాని తాన్యనాదృత్య మాత్రా పిత్రా చ సాదరమ్‌|

ఆరేభే రోదితుం స్మృత్వా సౌరభం తత్పయః శిశుః ||

తలిదండ్రులు ప్రేమతో బెట్టిన కందమూలముల నాబాలుడు నిరాకరించి యాకామధేనువు పాలు తలచుకొని యేడువసాగెను.

శ్లో || సుతస్య వదనం దీనం పరిక్లాన్తం భృశం తదా|

దయాలుః పురతః పశ్యన్‌ వాక్యమేవమువాచ సః ||

ఎదుట కుమారుని ముఖము విచారముతో మిక్కిలి వాడిపోవజూచి దయాళువైన తండ్రి యీ వాక్యమును పలికెను.

శ్లో || #9; కిం రోదిషి సదా వత్స! రుదిత్వాప్యత్రం కిం భ##వేత్‌|

అకిఞ్చనో7హ్యహం సత్యం శివమేకం వినా విభుమ్‌||

నాయనా!ఎల్లప్పుడు నేలయేడ్చెదవు? ఏడ్చినను ఇక్కడ ఏమి లాభము? సర్వవ్యాపకుడైన యాశివుడొక్కడు తప్ప వేరేమియు లేని దరిద్రుడను నేను. నిజము.

శ్లో || సురభిః సా చ పరమా తపోలోకే హి తిష్ఠతి|

రసం చ తస్యాః పయసః నైవ వేద్మి కదాచన||

ఉత్తమమైన యాకామధేనువు తపోలోకములో నుండునుగదా, దాని పాలరుచి నేనెన్నడు నెరుగనే యెరుగను.

శ్లో || సత్యం సత్యం వదామ్యేవంశృణు బాల మహామతే!

వినానేన మహేశేన విద్యతే నైవ కిఞ్చన||

బాల! మహామతీ! నేనిట్లు నిజము చెప్పుచున్నాను. వినుము. ఈమహేశ్వరుడుతప్ప ఏమియు లేనేలేదు. నిజము.

శ్లో || #9; అమరాణాం పురా శమ్భుః నిఖిలానాం దయానిధిః |

దదౌ సుధాం రసోత్కూలాం నిత్యమానన్దకారిణీమ్‌||

దయాసముద్రుడగు శివుడు పూర్వము సమస్తదేవతల కును ఎక్కువరుచిగలిగి నిత్యము నానందమునిచ్చు అమృతము నిచ్చెను.

శ్లో || తవాపి సుమతే! సూనో! శమ్భురేవ పరాగతిః |

యత్ర్పసాదేన లభ్యన్తేసర్వై స్సర్వాశ్చ సమ్పదః||

సుమతీ!కుమారా! ఎవని యనుగ్రహముచే నందరునన్నిసందపదగలను పొందుదురో అట్టి శంకరుడే నీకును ఉత్తమ మైన దిక్కు.

శ్లో || ఇత్యుక్త్వామధురం వాక్యం ములస్థాననివాసినమ్‌|

శరణ్యం జగతామీశం దర్శయామాస సూనమే||

అని తియ్యనిమాట చెప్పి లోకరక్షకుడు మూలస్థాన నివాసియునగు నీశ్వరుని కుమారునకు జూపెను.

శ్లో || #9; సో7పి బాలః పరిక్లాన్తః పయః పానకృతాదరః |

జగన్మూర్తేశ్శివస్యాపి రురోద పునరగ్రతః ||

పాలు త్రాగుటయందు ప్రీతిగల ఆ బాలుడు క్షీణించి జగత్స్వరూపుడగు నాశివుని యెదుటకూడ మరల నేడ్చెను.

శ్లో || #9; పురః స్థితం రుదన్తం తం దేవః క్షుత్పరిపీడితమ్‌|

ప్రసూనమాతపక్లాన్తమివ దృష్ట్వా స శఙ్కరః||

కారుణ్యపూర్ణలహరీపరిపూర్ణవిలోచనః|

క్షీరార్ణవం దదౌ తసై శిశ##వే క్షీరపాయినే||

ఆకలితో బాధపడుచు నెదుట నేడ్చుచున్న యాబాలుని ఎండకు వాడిన పుష్పమువలె జుచి కారుణ్యమయమైన ప్రవాహముతో నిండిన కన్నులుగల ఆ శంకరుడు పాలుత్రాగెడు నాబాలునకు క్షీరసముద్రము నిచ్చెను.

శ్లో || సో7పి బాలో వరం లబ్ధ్వా దయామూర్తేరుమా పతేః ||

ప్రసన్నహృదయస్తస్థౌ దిక్షు విశ్రుతవైభవః ||

ఆ బాలుడును దయామూర్తియగు పార్వతీపతివలన వరమును పొంది హృదయమున ప్రసన్నుడై దిక్కులయందు ప్రసిద్ధమైన కీర్తిగల వాడయ్యెను.

శ్లో || అథ తజ్జనకః శ్రీమాన్‌ వ్యాఘ్రపాదో మహామునిః |

సన్నిధౌ పరమేశస్య మూలస్థాననివాసినః ||

ప్రయతో యతవాక్కాయమానసశ్శివభావనః |

శైవమానన్దజననం యోగం కర్తుం ప్రచక్రమే||

పిమ్మట వానితండ్రి, మహామునియగు శ్రీవ్యాఘ్రపాదుడు మూలస్థానమున నుండు పరమేశ్వరుని యెదుట పరిశుద్ధుడై మనోవాక్కాయములను నిగ్రహించి శివుని భావించుచు ఆనందమును గలిగించు శివయోగము నభ్యసింప నారంభించెను.

శ్లో |. #9; వామపాదమధః కృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతలః |

సన్నభ్యోదరమాక్లిష్టమురన్థలముదారధీః ||

ఈషన్న మ్రభుజోద్భాసీ స్థాణువన్నిశ్చలాకృతిః |

ఉత్తానితకరద్వన్ద్వ మఙ్కమధ్యే మనోహరే||

నిశ్చలాం మహతీం కాన్తాం దీర్ఘీకృత్య శిరోధారామ్‌|

దన్తాస్పృష్టస్వజిహ్వాగ్రశోభమానముఖామ్బుజః ||

కల్యాణలక్షణ దీర్ఘే నాసాగ్రే న్యస్తలోచనః |

సేవితో మరుతా మన్దం పుష్పమంజరిగన్ధినా||

ఇతి పద్మాసనస్థస్య మునేః పరమతేజసః |

తదా చిత్తే సుప్రసన్నే శివయోగో మహానభూత్‌||

ఎడమపాదమును క్రిందబెట్టి పిరుదుతో భూమినితాకుచు పొట్టను రొమ్మువరకు బాగుగా నక్కళించి ఋజుబుద్ధి గల వాడై కొంచెము వంచిన భుజములతో ప్రకాశించుచు చెట్టు మొదలువలె చలింపని యాకారముగలిగి మనోహరమైన ఒడిలో రెండు చేతులను వెలికిల బెట్టుకొని కదలనిది, పెద్దది మనోహరమైనదియునగు మెడను చాచి దంతములకు తగలని నాలుకచివరతో నందముగానున్న ముఖపదమ్ముగలవాడై శుభలక్షణములుగలిగి పొడవైన ముక్కుచివర దృష్టినుంచి పూలగుత్తులవాసనగల గాలి మెల్లగా తననుసేవింప నీవిధమున పద్మాసనమందున్న మహాతేజోవంతుడైన మునియొక్క ప్రసన్నమైన చిత్తము గొప్ప శివయోగము భాసించెను.

శ్లో || తసై#్యవం వర్తమానస్య కదాచిద్యోగవైభవాత్‌|

ఆవిరాసీద్ధృది స్వచ్చే ప్రవృత్తిః పారమేశ్వరీ||

ఈవిధముగానున్న వాని స్వచ్ఛమైన హృదయమున నొకప్పుడు యోగమహీమవలన పరమేశ్వరసంబంధమైన ప్రవృత్తి కలిగెను.

శ్లో || #9; అత్రాన్తరే మహాదేవః శంకరశ్శశిభూషణః |

సంహృత్య మోహం కృపయా సర్వానుగ్రహకశ్శివః

యోగనిర్ధూతతమసాం మునీనాం భావితాత్మనామ్‌|

దేవదారువనే దివ్యే దర్శయామాస తాణ్డవమ్‌||

ఇంతలో మహాదేవుడు, సుఖమును గలిగించువాడు, చంద్రశేఖరుడు, అందరును అనుగ్రహించువాడునగు శివుడు దివ్యమైన దేవదారువనములో యోగముచే అజ్ఞానము తొలగి థ్యానముచే పవిత్రమైన చిత్తముగల మునులకు దయతో మోహమును బోగొట్టి తాండవమును జూపెను.

శ్లో || తద్దిదృక్షాసముద్భూతగాఢోత్కణ్ఠానిపీడితః |

స బబన్ధ మనశ్శమ్భోః పరమానన్దతాణ్డవే||

దానిని చూడవలెనను గాఢమైన కోరిక బాధింప నావ్యాఘ్రపాదుడు మనస్సును శివుని పరమానందతాండవమున లగ్నము చేసెను.

శ్లో || తస్య త్వనుపలమ్భేన దుఃఖితో7సౌ ముహుర్ముహుః |

బభూవ సుచిరం తత్ర చిన్తాకులితచేతనః ||

తాండవము కనబడకపోవుటచే మరలమరల దుఃఖించుచు చిరకాల మచట మనమున విచారము చెందెను.

శ్లో || కారుణ్యమూర్తిరీశానః సాక్షాద్యత్ర మహీతలే|

తాణ్డవం తనుతే నిత్యమానన్దాభ్ధిసుధాకరమ్‌||

తపసే తద్వనం గచ్ఛేత్యశాసిత్వై వ పృచ్ఛతః |

మూలస్థానం భజస్వేతి పిత్రామే కధితం కుతః ||

దయాస్వరూపుడగు నీశ్వరుడు ఏభూప్రదేశమున నానందసముద్రమునకు చంద్రుడువంటి తాండవమును ప్రత్యక్షముగా నిత్యము చేయుచున్నాడో నేనడిగినపుడు మాతండ్రి తపస్సునకు నన్నావనమునకేగుమని శాసింపక మూలస్థానమును సేవింపుమని యేలచెప్పెను?

శ్లో || అథవా తత్స్వసంవేద్యం సర్వలోకశుభావహమ్‌|

పాదారవిందమీశస్య కథం ద్రక్ష్యామి భూతలే||

లేనిచో తనంతతాను తెలిసికొనదగినది, సమస్తలోకమునకు శుభమును గలిగించునదియునగు ఈశ్వరుని యాపాదపద్మమును భూతలమున నెట్లు చూడగలను?

శ్లో || కిఞ్చ వా తాదృశీ భక్తిః మమ నాస్త్యేవ నిశ్చలా |

పరయా యస్య పాదాబ్జం యయా తత్పరి దృశ్యతే||

అదియుగాక వాని పాదపద్మమును జూడగలుగునంతటి యుత్కృష్టమైన నిశ్చలభక్తి నాకు లేనేలేదు.

శ్లో || తస్మాన్మమ కథం దేవః సమం శైలేన్ద్రకన్యయా|

జ్ఞానేనైవ పరం దృశ్యం తాణ్డవం దర్శయిష్యతి||

కనుక పార్వతితోకూడ శివుడు నాకు జ్ఞానముచేత మాత్రమే చూడదగిన తాండవము నెట్లు చూపును?

శ్లో || ఇతి నిర్విణ్ణహృదయఃపితృవాక్యవశే స్థితః |

స్వభావం సతతం శమ్భోః బబన్ధానన్దతాండవే||

అని హృదయమున విచారము చెంది తండ్రిమాటకు కట్టుబడియుండి తనమనస్సు నెల్లప్పుడు శివునియానందతాండవమందే లగ్నము చేసెను.

శ్లో || పునరప్యస్య హి మునేః చిన్త్యమానస్య సర్వదా|

ప్రత్యభాదయమేవార్ధః స్వఖేదధ్వంసకారణమ్‌||

ఎల్లప్పుడు నాలోచించుచున్న యామునికి తనదుఃఖమును బోగొట్టు ఈవిషయమే మరల తోచెను.

శ్లో || యత్ర నృత్యతి దేవేశః పరమానన్దవిగ్రహః|

సర్వమంగలయా సాకం సగణః సర్వదా ప్రభుః||

తస్య దేశస్య నామాని శ్రుతాన్యేతాని భూతలే|

తద్గురుశ్చపరంతత్వంసర్వకామప్రదోనిధిః||

అమలంసత్‌ పరంనిత్యంమహాన్‌ కోశోహిరణ్మయః |

అన్తఃపురంవివిక్తంచపుణ్ణరీకగుహావరమ్‌||

గగనంపరిశుద్ధంచపరమాద్భుతముత్తమమ్‌|

సత్యాస్పదంసుషుమ్నాయామాత్మజ్ఞానసుఖోదయమ్‌|

చిదమ్బరంస్వముక్తిశ్చలసద్ర్బహ్మసురోత్తమ|

శక్తిశ్చమహతీదివ్యా విపులశ్చశివాలయః||

ఏతానిచైతదన్యానిశ్రుతాన్యేతానికోటిశః|

ఉక్తానినియతం వేదై రాగమైరఖిలైరపి||

పరమానందవిగ్రహుడు దేవదేవుడునగు శివుడు గణసహితుడై పార్వతితో కూడ నేల్లప్పుడు నృత్యముచేయు ప్రదేశమునకు భూతలమున నీపేర్లు వినబడినవి. గురువు, పరతత్వము సమస్తమైనకోరికలనిచ్చుగని, స్వచ్ఛము, పరము, సత్యము, నిత్యము, మహత్తు హిరణ్మయము, కోశము, అంతఃపురము ఏకాంతము, పుండరీకగుహ, మహాద్భుతము, ఉత్తమము పరిశుద్ధము, ఆకాశము, సుషుమ్నయందుఆత్మజ్ఞానము సుఖము, గాగలుగు సత్యస్థానము, చిదంబరము, స్వీయముక్తి, ప్రకాశించు బ్రహ్మ, దివ్యమైన మహాశక్తి విశాలము, శివాలయము ఇవియు ఇతరమైనవియు కోట్లకొలది పేర్లు వినబడినవి. వేదములయందును సమస్తాగమములయందును స్పష్టముగా జెప్పబడినవి.

శ్లో || ఏవముక్తా పరా శమ్భోఃనృత్తభూమిః సువిస్తృతా|

కేన దృష్టా పురా భూమ్యామిత ఏవేతి సా సభా ||

ఉత్కృష్టము విశాలమునైన శివుని నృత్తభూమి ఈ విధముగా జెప్పబడినది. ఆసభ భూమి యందిటేయని పూర్వమెవరు చూచిరి?

శ్లో || #9; తథాపి భూతలే శమ్భోః తాణ్ణవం మునిసత్తమైః|

దృష్టమిత్యవబుద్ధత్వాత్తన్మమాప్యత్ర సేత్స్యతి|

ఐనను భూతలమున శివుని తాండవము మునులకు కనబడినదని తెలియుటవలన అది నాకును సిద్ధించును.

శ్లో || ఇతి నిశ్చతచిత్తో7పి తాణ్డవాలోకనేచ్ఛయా|

విషాదహర్షవారాశా స మమజ్జ మహామునిః||

ఈవిధముగా మనస్సున నిశ్చయము కలిగినను తాండవమును చూడవలెనను కోరికచే నామహాముని సంతోష విచారముల సముద్రములో మునిగెను.

శ్లో || పునః ప్రబుద్ధస్య మునేః ప్రసాదాత్పరమేష్ఠినః |

యోగానుభూతనృత్తస్య సేయం బుద్ధిరజాయత||

పరమేశ్వరుని యనుగ్రహమువలన యోగమునందు నృత్తమును జూచి మేల్కాంచిన మునికీబుద్ధి కలిగెను.

శ్లో || కారుణ్యమూర్తిరీశానః సాక్షాదత్ర చిదమ్బరమ్‌|

దర్షయిష్యతి మే దేవః సహాయం చ స దాస్యతి||

దయాస్వరూపుడు, ప్రభువునగు నాదేవుడిచ్చట చిదంబరమును ప్రత్యక్షముగా జూపును. ఆతడు సహాయునిగూడ నిచ్చును.

శ్లో || ఏవం మనసి నిశ్చిత్య వ్యాఘ్రపాదమునిశ్చిరమ్‌|

తత్రానన్యమనా భూత్వా తస్థౌ నృత్తపరాయణః ||

ఇట్లు మనస్సున నిశ్చయించుకొని వ్యాఘ్రమపాదముని ఇతరచింతలు లేక నృత్తమందే ఆసక్తుడై అక్కడ చిరకాలముండెను.

శ్లో || #9; యః పఠత్యేతమధ్యాయమేకదాపి మునీశ్వరాః |

శృణోతి వా జనస్సర్వో జీవన్ముక్తో భ##వేదయమ్‌|| 66

మునులారా! ఈయధ్యాయము నొక్కపర్యాయమైనను చదగివినవాడును వినినవాడును జీవన్ముక్తుడగును.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

వ్యాఘ్రపాదచరితం నామ దశమో7ధ్యాయ

----0----

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters