Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ ద్వాదశో7ధ్యాయః

(దేవదారువనచరితము)

శ్లో|| విప్రాన్తైదికకర్మ మార్గనిరతాన్నైరీశవాదోద్యతాన్‌

ముగ్ధాన్దేవకదారుకావనగతాన్‌ సామోహయ న్మోహినీ||

తేషాం యోషిత ఆశ్రమేషు మనసాహంకారభావం శ్రితాః|

శమ్భుర్భిక్షువపుర్వ్యమోహయదమూ రూపేణ నైజేన సః ||

వైదికమైన కర్మమార్గమందాసక్తిగలిగి నిరీశ్వరవాద మున కుద్యుక్తులగుచు అజ్ఞానులై దేవకదారుకావనములో నున్న బ్రాహ్మణులను స్త్రీరూపములోనున్న విష్ణువు మోహింపజేసెను. మనస్సున గర్వించి ఆశ్రమములోనున్నవారి స్త్రీలను బిక్షురూపములోనున్న శివుడు తన సౌంధర్యముచే మోహింపజేసెను.

మాధవః :

శ్లో|| ఆథాహమపి దేవస్య తస్యాజ్ఞాపరిపాలకః|

మోహనం జగతాం హారి కాన్తారూపమయాసిషమ్‌||

మాధవుడు :

నేను కూడ ఆ దేవుని యాజ్ఞను పాలించుచు లోకములను మోహింపజేయు మనోహరమైన స్త్రీరూపమును ధరించితిని.

శ్లో || విన్యస్య కబరీభారే భ్రమరీపం క్తిసన్నిభే|

వికచాని ప్రసూనాని తిమిరేష్వివ తారకాః|

లలాటఫలకే కాన్తమష్టమీచన్ద్రసన్నిభే|

తిలకం చ లసద్వృత్తం జగన్మోహనకారణమ్‌||

చేలాఞ్చలం శుభే న్యస్య స్తనభారే మదాకులమ్‌|

పాణిపద్మధృతోద్భాసి ఫుల్లకహ్లారశోభితమ్‌||

బద్ధరత్న సముద్భాసిమఞ్జుశిఞ్జా న మేఖలమ్‌|

ఇత్యాత్మానమఙ్కృత్య తత్సమీపముపాగతః||

తుమ్మెదల వరుసతో సమానమైన కేశపాశమున అంధకారమున నక్షత్రములువలె విడిచిన పువ్వులు పెట్టు కొని, అష్టమినాటి చంద్రునివలెనున్న నుదిటి యందు గుండ్రముగాప్రకాశించుచు లోకమును మోహింపజేయగల సుందరమైన తిలకమును ధరించి, శుభ##మైన రొమ్ముపై మదముచే కదలెడు పైటచెంగు ధరించి, పద్మమువంటి చేతితో వికసించి ప్రగాశించు ఎఱ్ఱకలువను పట్టుకొని, కూర్చిన రత్నములతో ప్రకాశించుచు మనోహరముగా ధ్వనిచేయు మొలనూలును ధరించి, యీ విధముగా నన్నలంకరించుకొని వానిదగ్గర కేగితిని.

శ్లో || కామారిస్సో పి మాం తత్ర సమాయాతో ధృతా దరః |

మునిసంమోహనై ర్యుక్తాం దృష్ట్వా భ్రూవిభ్రమై శ్శుభైః ||

అక్కడ మన్మథశత్రువుకూడ మునులను మోహింపజేయు మంచి భ్రూవిలాసములతో కూడిన నన్ను చూచి దగ్గర కాదరమతో వచ్చెను.

శ్లో || అపి కామజితా ధీరాః క్షణాదేతే తపోధనాః |

విజితా హిపరం సమ్యగధునై వేతి చిన్తయన్‌|

సాధుసాధ్వితి మాం దృష్ట్వా భ్రూవిక్షేపాంశ్చ మామకాన్‌|

మన్దం జహాస భగవాన్‌ లోకమోహనతత్పరాన్‌ ||

మన్మధుని జయించి ధీరులై నను ఈ తాపసు లిప్పుడే బాగుగా జయింపబడిరని తలచుచు నన్ను లోకమును మోహింపజేయుటయందాసక్తిగల నాకనుబొమ్మ విసరులను జూచి శివుడు' బాగుబాగు'అని చిరునవ్వు నవ్వెను.

శ్లో|| నివర్త్య పార్వతీం దేవీం తత స్తత్రైవ భూధరే|

మయానుగమ్యమానోసౌ కాన్తావేషేణ మన్థరమ్‌||

అజాతపుణ్యపాకానాం మనోభిరపి దుర్గమమ్‌|

దేవదారువనంన ప్రాప మునీన్ద్రైః వరిసేవితమ్‌||

పిమ్మట పార్వతీదేవి నాపర్వతముననే మరలించి స్త్రీవేషముతో మెల్లగా నేను వెంబడింప పుణ్యము పరిపాకము చెందనివారు మనస్సుచేతగూడ ప్రవేశింప శక్యముగానిది, మునిపుంగవులచే సేవింపబడినదియునగు దేవదారువనమునకు అతడు చేరేను.

శ్లో || అధ్యాసితాం స్తదా తత్ర మునీన్ద్రై రాశ్రమాన్‌ శుభాన్‌|

ఏకైకమేవ తాన్‌ గత్వా బహిరఙ్గణసంస్థితః||

భూయో డమరుకం తత్ర నాదయన్‌ ముదితాననః

అనర్ఘనూపురారావవిరాజితజగత్త్రయః||

ఆశ్రమాన్తా త్తత స్తస్మాద్భిక్షాం దాతుం వినిర్గతాః||

ఉపపశ్యన్నభినయానకరోత్తత్రకోటిశః ||

అపుడక్కడ మునీంద్రుల నివసించుచున్న యాశ్రమముల కొక్కొక్క దాని కేగి బయటి వాకిలో నిలబడి ముఖమున సంతసము దోప మరలమరల డమరుకమును వాయించుచు అమూల్యమైన నూపురధ్వనిచే మూడులోకములను ధ్వనింపజేయుచు పిమ్మట ఆశ్రమముల లోపలినుండి బిచ్చము పెట్టుటకు బయటకు వచ్చిన స్త్రీలను దగ్గర చూచి యక్కడ కోట్లకొలది యభినయములను జేసెను.

శ్లో || తతస్స్మరసముద్ర్బాన్తచేతనాభిరితస్తతః||

రురుధే భగవాన్‌ శమ్భుః భిక్షాదానాపదేశతః ||

పిమ్మట మన్మధునిచే చెదిరిన చిత్తముగల స్త్రీలు బిచ్చము పెట్టు నెపముతో నాభగవంతుడగు శివుని ఇటునటు నిరోధించిరి.

శ్లో || ఆలోలకబరీభారధారణాకులపాణయః |

కాశ్చిత్తత్ర గలత్కాఞ్చినీవీబన్ధాః పురస్థ్సితాః||

కదలి విడిపోవు కొప్పులను కంపించుచేతులతో పట్టుకొనుచు ముందున్న కొందరు స్త్రీల మొలనూలు, కోకముడి జారుచుండెను.

శ్లో || కాశ్చిత్సునిర్మలాం తస్య ప్రశవంసుః స్మితప్రభామ్‌ః||

ఆలిఙ్గనసుఖం కాశ్చన్నిం తరాం తం యయాచిరే||

కొందరాతని స్వచ్ఛమైన చిరునవ్వుకాంతిని పొగడిరి. మరికొందరు వాని యాలింగనసుఖము నెక్కువగా ప్రార్థించిరి.

శ్లో || కాప్యన్నాభావత స్తసై#్త్మ ధాతుమాదాయ తణ్డులాన్‌|

నిర్జగామ బభూవుస్తే పాణౌ పక్వాః స్మరాగ్నినాః||

ఒకతె అన్నములేకపోవుటచే పెట్టుటకు బియ్యము తీసికొని బయలుదేరెను. ఆబియ్యయు కామాగ్నిచేత చేతిలోనే ఉడికినవి.

శ్లో || ముక్తదుర్వారబాణన పీడితా చిత్తజన్మనా|

పాత్రబుద్ధ్యైవ తాం భిక్షాం తలే భూమేస్సమార్పయత్‌ః|

మన్మధుడు వేసిన అమోఘమైన బాణముచే పీడింపబడిన ఆస్త్రీ పాత్ర అనుకొని ఆబిచ్చమును భూమిమీదవేసెను.

శ్లో|| పాత్రే కుసుమమాదాయ కాశ్చద్వన్దితుముద్యతాః||

వికిర న్తి స్మ తత్పాదే వీక్షమాణా ముఖామ్బుజమ్‌||

పాత్రలో పుష్పములను తీసికొని కొందరు వానికి నమస్కరింపబోయి వాని ముఖపద్మమును జూచుచు వాని పాదములమీద చల్లిరి.

శ్లో|| తత్కరాస క్తనివ్లూని తద్వికీర్ణం సమ న్తతః|

భైక్షస్య శాకతాం ప్రాప పూర్వవృత్తస్య భూతలే||

వారి చేతికి తగిలి బాగుగా వాడి వారిచే నంతట చిమ్మబడిన పువ్వులు పూర్వము నేలమీద వేయబడియున్న భిక్షాన్నమునకు కూర అయినవి.

శ్లో || కాశ్చిత్పరితచితం కాన్తం ప్రణయాన్మేనిరే స్త్రియః|

రత్యా విరహితం కామం మూర్తిం కాశ్చన మేనిరే||

కొందరు స్త్రీలుప్రేమవలన పరిచితుడైన ప్రియునిగా తలచిరి. మరికొందరు రతీదేవిలేని మూర్తీభవించిన మన్మథునిగా తలచిరి.

శ్లో|| పఞ్చాపి బాణాన్యుగపదముఞ్చ న్మీననవేతనః||

ఆగతస్త్వనయా మూర్త్యేత్యేవం కాశ్చిద్భభాషిరే||

మన్మథుడై దుబాణముల నొక్కసారి వేసి యీరూప ముతో వచ్చెనని కొందరు పలికిరి.

శ్లో || భిక్షాదానార్థమాయాన్త్యై మహ్యం మోహమిమం దిశన్‌|

క్వ గచ్చసి నిశీథిన్యై తామిస్రమివ భాస్కరః||

సూర్యుడు రాత్రికి చీకటినిచ్చి పోయినటుల బిచ్చము పెట్టుటకు వచ్చిన నాకీ మోహము నిచ్చి యెచ్చటికే గెదవు?

శ్లో|| అభిఖ్యామృత మాపీయాప్యనలం భూతచేతసః||

ఆలంభావం మమేచ్ఛాయాం కాచిత్కుర్విత్యు వాచ తమ్‌||

సౌంధర్యమను అమృతమును త్రాగినను చాలునను భావము కలుగని చిత్తముగల నాకోరికలో చాలునను భావము కలిగింపుమని వానినొకతే కోరెను (అమృతము త్రాగినను చిత్తమగ్నియగుట విరోధము, చాలునను భావము లేకపోవుట పరిహారము.)

శ్లో|| వలయాన్యధునా యాని గలితాని తవేక్షణాత్‌|

అత్రైవ తాని మే దత్వా గచ్ఛ తూర్ణమితః పునః||

నిన్ను చూచుటవలన ఇప్పుడు జారిన నాకంకణముల నిక్కడే యిచ్చి మరల వెంటనే యిక్కడనుండి వెడలిపొమ్ము.

శ్లో|| అదత్వా నైవ గన్తవ్యం వదాదపి పదం త్వయా|

ఇతి తం ముదితః కశ్చిద్రరోధ తరుణీజనః||

ఈయకుండ నీవడుగుతీసి యడుగు పెట్టరాదు. అని సంతోషముతో నొకతే వానిని నిరోధించెను.

శ్లో|| దర్శయన్త్యః స్తనౌ తుఙ్గౌ భిశక్షాకపటశాలినే |

ఇత ఏహీతి తం కాశ్చిద్దర్శయామాసు రాశ్రమాన్‌||

కొందరు కపటభిక్షుకునకు ఎత్తైన స్తనములను జూపుచు ఇటురమ్మని వాని కాశ్రమములను జూపిరి.

శ్లో || కిము వా భవతే కార్యం యత్ర తే మనసో రుచిః

తదేవ భూతలం గేహమితి కాశ్చిద్బభాషిరే||

నీకేమిపని చేయవలెను? నీకెక్కడ ఇష్టమగునో ఆప్రదేశ##మే గృహము అని కొందరనిరి.

శ్లో || యా మహీ రోచతే నాథ! తవ బుద్ద్యై వనాన్తరే|

కాశ్చిత్తాం హి మహీమస్మాన్ప్రావయేతి వచో బ్రువన్‌||

నాథ! ఈ వనములో నీబుద్ధి కేప్రదేశమిష్టమగునో ఆప్రదేశమునకు మమ్ములను తీసికొనిపొమ్ము అని కొందరనిరి.

శ్లో || భిక్షాస్తి తుభ్యం దాతవ్యా మద్గృహే మహతీప్రభో|

న యాతవ్యం ప్రతిగృహమిత్యేనం కాచిదబ్రవీత్‌||

ప్రభూ! నీకీయదగిన బిచ్చము నాయింటిలో చాల ఉన్నది. ఇంటింటికి వెళ్ళవలదిని వానితో నొకతె పలికెను.

శ్లో || ప్రాణాః ప్రాప్తా ఇవాస్మాకం దశాం సన్దేహకారిణీమ్‌|

పరిష్వజ్య పునర్దేహి తానిత్యూచుశ్చ కాశ్చనః||

మాప్రాణములు సందేహస్థితిని పొందినట్లునవి . కౌగిలించుకొని మరల వానినిమ్ము అని కొందరు పలికిరి.

శ్లో || యమరూపేణ యావన్నః పీడయేన్న సమన్మథః |

తావద్రక్షేతి తం భిక్షుం కాశ్చిద్భీతా యయాచిరే||

యమరూపముతో మన్మథుడు మమ్ములను పీడింపకుండునంతలో రక్షింపుమని యాభిక్షువుని కొందరు స్త్రీలు భయపడుచు ప్రార్థించిరి.

శ్లో || అభిరామం సమాలోక్య శివం తత్రాశు తాదృశమ్‌|

కాశ్చిత్తద్దర్శనానన్దాన్ననృతుస్సుభ్రువశ్చిరమ్‌||

అక్కడ ఆవిధముగా సుందరమైన శివుని చూచి వెంటనే కొదరు స్త్రీలు వానిని చూచుటవలనగలిగిన యానందములవలన చాలసేపు నృత్యము చేసిరి.

శ్లో || నయనానన్దనే తత్ర నర్తనే వృత్తవత్యపి|

బహూనభినయాన్కాశ్చిత్కుర్వన్తిస్మస్మరాకులాః||

కన్నుల కానందమును గలుగజేయు నర్తన మక్కడ జరిగినను కొందరు స్త్రీలు మన్మధునిచే కలతచెంది చాల అభినయములను జేసిరి.

శ్లో || ప్రేరితా ఇవ కామస్య బాణపాతై స్సుదుస్సహైః |

తస్య పశ్చాన్మ హేశస్య కాశ్చిత్తన్య్వో జవాద్యయుః||

సహింపరాని మన్మధబాణములు పడుటచే ప్రేరింపబడినటుల కొందరు స్త్రీలు వేగముగా నీశ్వరుని వెంట వెళ్లిరి.

శ్లో || భిక్షాయై విధృతం పాత్రం కరోటిః కిమిదం తవ|

ఇతి దుర్దాన్త కామార్తః కాశ్చిత్పప్రచ్ఛురీశ్వరమ్‌||

నీవు భిక్షాప్రాత్రముగా పుఱ్ఱ పట్టుకొంటివేల? అని అణచరాని కామముతో బాధపడు కొందరు స్త్రీలు ఈశ్వరునడిగిరి.

శ్లో || త్వయా దత్తా వయం జాతా గతిం కల్పయ నాథ! నః |

యాచమానా ఇవేశానం తత్పార్శ్వం కాశ్చిదాయయుః||

నాథ! నీవు మమ్ములను సృజించితివి. మాకు గతి కల్పింపుము అని యీశ్వరుని యాచించుచున్నటుల కొందరు వాని ప్రక్కకు వచ్చిరి.

శ్లో|| ఆలోలకబరీభారమాలామౌ క్తి భూషణాః|

భిక్షార్థమాగతం దృష్ట్వా జగు స్తత్పార్శ్వ మాగతాః||

భిక్షకొరకు వచ్చిన వానిని జూచి కొప్పులయందలి దండలు, ముత్తెపుభూషణములు కదులచుండ వాని ప్రక్కకు వచ్చి పాడిరి.

శ్లో || అన్యాః కాశ్చన పద్మాక్ష్యో గలత్కాఞ్చీ గుణామ్బరాః|

పుష్పబాణశరావిద్ధాః నిపేతురుపరిక్షణాత్‌||

మరికొందరు పద్మాక్షులు మన్మథబాణములచే కొట్టబడి మొలనూలు, బట్టజారుచుండ క్షణములో మీదబడిరి.

శ్లో || సర్వాస్తత్ర తథాభూతాః తపోధనమనోరమాః|

బాలాశ్చ ¸°వనోన్మత్తాః ప్రాడాశ్చ జరతీజనాః||

అచ్చట మునిభార్యలైన బాలలు, ¸°వనమత్తులు ప్రౌఢలు, ముదుసలులు అందరు నావిధమున నుండిరి.

శ్లో || విమోహ్య సుతరాం తత్ర శుశుభే విభ్రమైః క్షణాత్‌|

విహస్య నితరాముచ్చైరాలోకిని పినాకిని|| 41

అక్కడ విలాసములతో క్షణములో మోహింపజేసి మిక్కిలి గట్టిగా నవ్వి ఈశ్వరుడు చూచుచుండగా నెక్కువ ప్రకాశించెను.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దినంవాదే చిదమ్బరమాహత్మ్యే

శ్రీమహేశ్వరభిక్షాటన ప్రసజ్గోనామ ద్వాదశో ధ్యాయః

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters