Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ చతుర్దశో7 ధ్యాయః

(మహేశ్వర శేషసంవాదము)

శ్లో || ఏవం దేవకదారుకావనకృతం నృత్తం మహేశస్య తత్‌||

శ్రుత్వా విష్ణుముఖా త్తదీక్షణధియా శేషో7నుమత్యా హరేః|

కైలాసం సముపేత్య ఘోరతపసా సన్తోషయిత్వాం హరం|

కాన్తార్ధాఙ్గమపశ్యదాత్మనయనై ర్దేవం వస్రన్నం పురః||

ఈ విధముగా దేవకదారుకావనమున చేసిన శివుని యానృత్తమును విష్ణువు చెప్పగా విని శేషుడు దానిని చూడవలెనను కోరికతో విష్ణువుయొక్క ఆనతి పొంది కైలాసమునకేగి ఘోరతపస్సుచే శివుని మెప్పించి ఎదుట ప్రసన్నమైన అర్థనారీశ్వరుని తన కన్నులతో జూచెను.

శ్లో || ఇతి దేవో రమాకాన్తః శేషాయ పరిపృచ్ఛతే|

కథయామాస దేవస్య దివ్య తాణ్డవవై భవమ్‌||

ఈవిధముగా లక్ష్మీకాంతుడు అడుగుచున్న శేషునకు శివుని దివ్యతాండవవైభవమునుగూర్చి చెప్పెను.

శ్లో || నృత్త శ్రవణమాత్రేణ శమ్బోస్స చ ఫణీశ్వరః|

అఞ్జలిం మస్తకే బద్ధ్వా సానన్దా శ్రువిలోచనః||

దృష్టవానివ తం నృత్తం పరమానన్దకారణమ్‌|

ప్రీతిపుల్లఫణోద్భాసీ ముదమాప తదా పరమ్‌||

శివుని నృత్తమును వినినమాత్రమున ఆ శేషుడు తలపై యంజలిఘటించి కన్నులనుండి యానందాశ్రువులు వెడల పరమానందమునకు కారణమైన యానృత్తమును చూచినవాడు వలె సంతోషమున విప్పారిన పడగలతో ప్రకాశించుచు నపుడు పరమానందమును పొందెను.

శ్లో|| శేషం తథావిదం దృష్ట్వా తద్గతో మధుసూదనః|

మోద మానహృదమ్భోజో భగవానిత్యచి న్తయత్‌||

ఆవిధముగానున్న శేషుని జూచి వానిమీదనున్న భగవంతుడగు మాధవుడు హృదయమున సంతోషించుచు నీవిధముగా నాలోచించెను.

శ్లో|| ఏష శేషో మహేశస్య తాణ్డ వోద న్తవర్ణనమ్‌|

కథ్యమానం మయా శ్రుత్వా మమ జ్జానన్దసాగరే||

ఈశేషుడు శివుని తాండవచరిత్రవర్ణనమును నేను చెప్పుచుండగా విని ఆనందసముద్రములో మునిగెను.

శ్లో || అస్య కృత్యం చ దేవస్య సదా పాదబ్జసేవనమ్‌|

మమాప్యేష హి మోక్తవ్యః శివానన్దమయః ఫణీ||

ఎల్లప్పుడు దేవుని పాదపద్మముల సేవించుట ఇతని పని, శివానందముతో నిండిన శేషుని నేను విడువవలెను.

శ్లో || కృత్యం కిమపిమే కార్య మనేవాద్య మహాత్మనా|

ఇతి నిశ్చిత్య చిత్తేన తమాహ ఫణిపుఙ్గవమ్‌||

ఇప్పుడీమహాత్ముడు నాకు చేయవలసిన కార్యమొకటి కలదు అని మనస్సున నిశ్చియించి ఆఫణి పుంగవుని గూర్చి పలికెను.

శ్లో|| అద్యప్రభృతి భోగీశ! శయ్యారూపం విముచ్యతామ్‌|

ధన్యో భవసి భూభారధారణోచిత! సువ్రత! ||

సర్పరాజా! ఇప్పటినుండి శయ్యారూపమును విడువుము. భూభారమును మోయుటకు తగినవాడవు. మంచివ్రతముగల వాడవు ధన్యుడవైతివి.

శ్లో || అద్యకర్తుం యథాపూర్వం యోగనిద్రాంతవోపరి|

రోచతే నై వమే తస్మాత్పుత్రంతల్పం ప్రకల్పయ||

ఇప్పుడు పూర్వమువలె నీమీద యోగనిద్రచేయుటకు నాకిష్టమగుటలేదు. కనుక కుమారుని ప్రక్కగా ఏర్పాటు చేయుము.

శ్లో || నృత్తం తత్పరమం ద్రష్టుం మృగ్యమాద్యగిరామపి|

సత్వరం త్వమితోగత్వా కురుశేష! మహత్తపః||

శేష! వేదములకు గూడ గోచరముకాని ఆమమానృత్తమును జూచుటకు నీవిక్కడనుండి వేగముగా వెళ్ళి మహాతపస్సు చేయుము.

శ్లో|| ఏవము క్తం వచశ్శ్రత్వా పఙ్కజాక్షేణ సాదరమ్‌|

వినయావనతశ్శేషఃప్రణిపత్యా బ్రవీద్వచః||

విష్ణువాదరముతో నీవిధముగా పలికిన మాట విని శేషుడు వినయముతో వంగి నమస్కరించి యీమాటపలికెను.

శ్లో || వాంచా యద్యపి మే దేవ! శమ్భుతాణ్డవదర్శనే|

త్వాం చ మోక్తుం న శక్తో7హమితి తత్ర సుదుఃఖితః||

దేవ! శివతాండవము చూడవలెనను కోరిక నాకు గలదు. కాని నిన్ను నేను విడువలేకున్నానని యక్కడ మిక్కిలి వాచారించెను.

శ్లో || ఇత్యుక్త స్తేన శేషేణ దయాలుః కమలాపతిః|

కైలాసభూధరస్యాశు పార్శ్వం గచ్చేత్యదా ద్వరమ్‌||

శేషుడీవిధముగా పలుక దయాళువగు లక్ష్మీపతి వేగముగా కైలాసపర్వతముప్రక్క కేగుమని వరమునిచ్చెను.

శ్లో || పూజ్యమానస్త్వయా తత్ర సర్వకామప్రదశ్శివః|

అలంభావం త్వదిచ్ఛాయాందాస్యత్యేవనసంశయః||

అచ్చట సమస్తవాంచలనొసగెడి శివుడు నీవు పూజింప నీకొరికకు చాలునను భావమునొసగలడు. సందేహములేదు.

శ్లో || ఏవం దత్తరస్తేన విష్ణునా స ఫణాదరః|

నిర్వఘ్నమస్తు మత్కార్యమితి భూయో ననామతమ్‌||

ఈ విధముగా నావిష్ణువు వరమిచ్చి నపిమ్మట నాసర్పప్రభువు నాకార్యము నిర్విఘ్నమగుగాక యని వానికి మరల నమస్కరించెను.

శ్లో || అథ ప్రీతమనాశ్శేషో లబ్ధానుజ్ఞస్సకేశవాత్‌|

కైలాస్య య¸° పార్శ్వం సద్యః కైవల్య కారణమ్‌||

పిమ్మట మనస్సున సంతసించిన శేషుడు కేశవుని యనుమతిపొంది వెంటనే మోక్షమునకు కారణమైన కైలాసము దగ్గరకేగెను.

శ్లో || తత్ర నిత్యం ప్రదీప్తానాం పావకానాం సమన్తతః|

గతో మధ్యం సముత్పుల్లఫణారత్నప్రభావతః||

జ్వాలాబిర్నయానగ్నీనాం త్రస్తచణ్డాంశుమణ్డలః|

శివస్య తాణ్డవం ద్రష్టుం దపః కర్తుం ప్రచక్రమే||

అక్కడ నిత్యము అన్నివైపుల మండు అగ్నులమధ్యకు విడిన పడగలమీది రత్నముల ప్రభావమువలన నేగి కన్నులనుండి వచ్చు మంటలచే సూర్యమండలము భయపడునటుల పంచాగ్నిమధ్యమున శివతాణ్డవము జూచుటకై తపస్సు చేయనారంభించెను.

శ్లో || ధృతజీవో7పి పవనై రాహారా న్తం న కేవలమ్‌|

అకరోదాత్మవాయుం చ ముఞ్చతి స్మనిరాకులః||

గాలినే జీవనాధారముగా గ్రహించువాడైనను కేవలము ఆహారమువరకే చేయలేదు. లోపలి వాయువును గూడ కలత చెందక విడుచుచుండెను.

శ్లో || బ్రహ్మసంసక్తచి త్తత్వాదవిజ్ఞాతదివావధిః|

న వివేద గతం కాలనన్తఃఫణిపుఙ్గవః||

సర్పశ్రేష్ఠుడగు అనంతుడు చిత్తము బ్రహ్మయందు లట్నమైనవాడు గనుక రోజుల హద్దు తెలియకపోవుటచే గడచినకాలము నెరగడయ్యెను.

శ్లో || సర్వేషామాత్మ నేత్రాణాం నృత్తదర్శనకాంక్షిణామ్‌|

సర్వావలోకినీం సద్యః ప్రాపయన్నివ దివ్యతామ్‌ః|

అత్యుగ్రతా పసన్తాపే దత్తదృష్టిద్వివస్వతిః|

శరీరే చన్ద్రసంకాశే కార్శ్వమేవ వ్యవర్ధయత్‌||

వృత్తమును చూడగోరుచున్న తన కన్నులకన్నిటికి సమస్తము కనడెడు దివ్యత్వము వెంటనే కలుగజేయుచున్న వాడువలె మిక్కిలి తీవ్రమైన వేడిమిచే తపింపచేయు సూర్యానియందు దృష్టినుంచి చంద్రునితో సమానమైనన శరీరమున కృశత్వుమునే పెంపొందించెను.

శ్లో || ఏవం తపాంసి కుర్వాణ శేషే7శేషఫణీశ్వరే|

భక్తచిత్తే సదావర్తీ నృత్తకర్తా నటేశ్వరః||

దేవదారువనస్థానాం మహర్షీణాం తపస్యతామ్‌|

మనాంసి స ప్రవిజ్ఞాతుం యథాపూర్వం గతో7 భవత్‌||

తథా ఫణాదరస్యాపి ప్రవిజ్ఞాతుమనా మనః|

హంసమారుహ్య వేగేన ప్రాదురాసీచ్చతుర్ముఖః||

సమస్తసర్పములకు రాజగు శేషుడు ఈవిదముగా తస్సుల నాచరించుచుండ భక్తుల చిత్తములయందెల్లప్పుడు నుండువాడు, నృత్తముచేయువాడునగు, మహేశ్వరుడు దేవదారువనమున తపస్సుచేయు మహర్షుల చిత్తములను తెలిసి కొనుటకు అతడు పూర్వమెట్లు వెళ్లెనో అట్లే ఫణిరాజుయొక్క మనస్సును గూడ తెలిసికొనగోరి వేగముగటా హంసనెక్కి చతుర్ముఖుడుగా ప్రత్యక్షమయ్యెను.

శ్లో|| అనన్తో7పి విలోక్యైసమావిర్భూతమజం తదా|

అర్ఘ్యాదిపూజయా తత్ర కేవలం తమపూజయత్‌||

అనంతుడును ఆవిర్భవించిన యాబ్రహ్మను చూచి ఆపుడచ్చట కేవలము అర్ఘ్యము మొదలగు వానితో వానిని పూజించెను.

శ్లో || ప్రతిగ్రాహితపూజో7యం తేన శేషేన సాదరమ్‌|

తమాలోక్య జగాదై వముపనవిష్టౌ మహీతలే||

ఆ శేషుడాదరముతో జేసిన పూజనాతడు గ్రహించి భూమిమీద కూర్చుని వానిని జూచి యిట్లు పలికెను.

శ్లో || అలం శేష! మహా ప్రాజ్ఞ! తపోభిరతిదుష్కరైః|

యత్రవస్తుని తే వాంఛా తస్య హేతురిదం తపః|

మహాబుద్దిమంతుడైవైన శేష! మిక్కిలి కష్టతరమైన తపస్సులు చాలు. నీకు దేవనియందు కోరికగలదో దానికొరకే గదా ఈ తపస్సు.

శ్లో || అహమద్య ప్రదాస్యామి సమ స్తమపి దుర్లభమ్‌|

భోగే వాకిస్తు విద్యాసు కిము సిద్ధిషు ముక్తిషు|

భోగమునగాని విద్యలలోగాని సిద్దులలోగాని ముక్తులలోగాని దుర్లభ##మైనను కోరినను సమస్తమును నేనిపుడిచ్చెదను.

శ్లో || బ్రహ్మణో క్తం వచశ్శ్రుత్వా ఫణిసన్తాననాయకః|

ఉవాచ మధురం వాక్యం శమ్భుతత్పరమానసః||

ఫణిరాజు బ్రహ్మచెప్పిన మాట విని శివునియందు లగ్నమైన మనస్సుగలవాడై మధురమైన మాటపలికెను.

శ్లో || ఏతేషు నైవ మే వాఞ్చా త్వదుక్తే షుచతుర్ముఖ|

కరోమి నిర్మలం ద్రష్టుమీశ##మేవ తపో మహత్‌||

చతుర్ముఖా! నీవుచెప్పినవానియందు నాకు కోరిక లేదు. నిర్మలమైన యీశ్వరుని చూచుటకే మహాతపస్సు చేయుదును.

శ్లో || స ఏవ భగవానీశో గతిర్నాన్యా పితామహ!|

స ఏవ దాస్యత్మస్మాకం దుర్లభానీప్సితాతన్వరాన్‌||

పితామహ! ఆభగవంతుడగు ఈశ్వరుడే దిక్కు. మరియొకటికాదు. అతడే మాకు కోరిన దుర్లభవరములనిచ్చును.

శ్లో || తస్య తద్వచనం శ్రత్వా సోపి విస్మితచేతనః|

గాఢమస్య ప్రవిజ్ఞాతుం భావం పునరువాచ తమ్‌||

వాని యామాటను విని అతడును మనస్సున నాశ్చర్యముచెంది వాని గాఢమైన భావమును తెలిసికొనుటకు వానితో ననెను.

శ్లో || తస్యాగమేన కిం కార్యం యదవాప్తుం తపో మహత్‌|

తప్యతే యేనకేనాపి దీయతాం తత్ఫణీశ్వర!||

ఫణీశ్వర! నీవు దేనిని పొందగోరి మహాతపస్సు చేయుచుంటివో దానికీశ్వరుడు రా బనియేమి? ఎవరో ఒకరిచ్చెదరు గాక.

శ్లో || అతస్త్వం వదమే సత్యం యదవాప్తుం కృతాదరః|

అత్రైవాహం ప్రదాస్యామి సర్వమేవ తవేప్సితమ్‌||

కనుక నీవు దేనిని పొందుటకాస క్తి గలిగియుంటివో నాకు నిజము చెప్పుము. నికోరిక నంతను ఇక్కడనే నెనిచ్చెదను.

శేషః :

శ్లో || కిమత్ర బహునో క్తేన బ్రహ్మన్‌! మద్వచనం శృణు|

నహి కార్యం త్వయాచాన్యైః శివమేకం వినా విభుమ్‌||

శేషుడు :

బ్రహ్మా ! ఎక్కువ మాటలేల? నామాట వినుము వ్యాపకుడైన శివుడొక్కడు తప్ప నీవలన గాని ఇతరులవలన గాని ప్రయోజనము లేదు.

సూత:

శ్లో || అకృతాదరమన్యేషు దృష్ట్వా మాయావిమోచకః|

నిజగాద పునర్వాక్యం హంసవాహశ్చతుర్ముఖః||

సూతుడు:

మాయనుతొలగించెడి హంసవాహనుడైన బ్రహ్మ ఇతరమైన వానియందాదరము లేకపోవుట చూచి మరల వాక్యము పలికెను.

శ్లో || వాఞ్చా నై వ మధు క్తేషు యది సత్యం ఫణాధర!|

కిముద్దిశ్య త్వయా నిత్యం తప్యతే సమమత్తపః||

ఫణాధర! నేను చెప్పినవానియందు నీకు నిజముగా కోరికలేనియడల దేనికొరకు నీవు నిత్యము మహాతపస్సు చేయుచుంటివి.

శేషః :

శ్లో|| సన్త్యజ్య మనసా సర్వమీశసంసక్తచేతసః|

భోగైః కిం మమ విద్యా భిస్సిద్దిర్ముక్తిభిశ్చవా||

శేషుడు :

మనస్సుతో సర్వమును విడచి ఈశ్వరునియంఉ లగ్నమైన చిత్తముగల నాకు భోగములతో గాని విద్యలతో గాని సిద్ధులతో గాని ముక్తులతో గాని ఏమిప్రయోజనము ?

శ్లో|| దేవదారువనస్థానాం మునీనాం యత్ప్రదర్శితమ్‌|

తదేవ తాణ్డవం ద్రష్టుం మమ వాఞ్చాప్రజాయతే||

దేవదారువనమునందున్న మునుల కేతాణ్డవము చూపబడినదో దానినే చూచుటకు నాకు కోరిక కలుగుచున్నది.

బ్రహ్మాః:

శ్లో || విధాయ పరమం కార్శ్యం కాయేన పరిశోభినా|

ముఞ్చతిం త్వాం న వాఞ్ఛేయం ప్రాయో దుర్లభకాంక్షిణీ||

బ్రహ్మా:

శోభిల్లెడి శరీరమును మిక్కిలి కృశింపజేసియు తరచుగ దుర్బభము సభిలషించెడి యాకోరిక నిన్ను విడుచుటలేదు.

శ్లో|| యోగిభిః పరమైర్దివ్యైరమితాత్మా మహేశ్వరః|

ZNP[ƒ«s ªy˳ÏÁùLóRi»R½M xmspLRi*Li ZNP[uyLiƒ«sX»R½òª«sVµR…LRi+¸R…V»`½ee

దివ్యమైన పరమయోగులచేత తెలియబడని స్వరూప ముగల యీశ్వరుడు పూర్వమెనరిచే కోరబడెను? ఎవరికి నృత్తమును జూపెను?

శేషః:

శ్లో || దర్శయత్యేవ మే దేవః స్వయమానన్దతాణ్డవమ్‌|

అభ్యర్థితస్స కేనాపి తత్కథం నైవ దర్శయేత్‌||

శేషుడు :

దేవుడు నాకు స్వయముగా నానంతతాండవమును తప్పక చూపును. ఎవడైనను వానిని కోరినచో దానినాతడేల చూపడు?

బ్రహ్మా :

శ్లో|| అనన్తే7పి గతే కాలే శేష! సన్తాపకారిణీ|

మహితీ నావ తేకస్మాన్నృ త్తవాఞ్ఛా నివర్తితా||

బ్రహ్మ :

శేష| చాలకాలము గడచినను లంకా%ుమును హలిగించెడి గొప్పదైన ఈనృత్తవాంఛ నీ కేలమరలలేదు.

శేషః :

శ్లో|| కాలే పరమసన్తాపే కుర్వతో మే మహత్తపః

కాయ ఏవ గతః కార్శ్యం న హికాలః పితామహ||

శేషుడు :

పితామహ! పరమసన్తాపకరమైన కాలమున మహా తపస్సు చేయచున్న నాశరీరమే కృశించినది కాని కాలము కృశించలేదు.

బ్రహ్మ

శ్లో|| ప్రేక్ష్యసి త్వం తథా నృత్తం శమ్భోరాద్యం తు పన్నగ! |

ఆత్మసందేహకారిణ్యాం దశాయాం కిం కరిష్యసి||

బ్రహ్మ :

పన్నగ! నీవటులనే శివుని మొదటినృతత్మును చూచెదవు. శరీరమునకు సందేహము కలిగిన సమయమున నేమి చేయుదువు?

శేషః :

శ్లో|| పశ్యామి తాణ్డవం శమ్భోర్యద్యప్యస్మిన్న జన్మని|

జన్మాన్తరే చ తద్ర్బహ్మన్‌పశ్యామ్యేవనసంశయః||

శేషుడు :

బ్రహ్మా! శివుని తాండవము నీజన్మలో చూడకపోయినను జన్మాంతరమందు దానిని తప్పక చూచెదను. సందేహము లేదు.

శ్లో|| శేషస్యాతిస్థిరం భావం దృష్ట్వా సరసిజాసనః|

హంసం చ వాహనం సద్యః కృత్వా తత్ర వృషాధి పమ్‌||

చతుర్భిరాననై రూపమఙ్కితం తద్విహాయ చ|

వామాలఙ్కృతవామాఙ్గః శమ్భురాసీత్తదైవ సః||

49

శేషుని మిక్కిలి స్థిరమైన బావమును జూచి బ్రహ్మవా హనమైన వహంసనక్కడ వృషభరాజుగా జేసి నాలుగు ముఖములతో నున్న యారూప విడచి అప్పుడే అరధనారీశ్వరుడగు శివుడయ్యెను.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమహాత్మ్యే

మహేశ్వరశేషసంవాదోనామ చతుర్దశో7ధ్యాయః

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters