Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu
Chapters
అథ పఞ్చదశో7ధ్యాయః (పతంజలిచరితము) శ్లో|| ప్రత్యక్షం పురతో నిరీక్ష్య వృషభారూఢం స శేషః శివం | ప్రాణం సీద్భువి దణ్డివిచ్చ ముదితో7స్తాపీచ్చ మన్త్రైః స్తవైః || ఈశో7ప్యేనముపాదిశత్స్వనటనాలోకాయ తీవ్రస్పృహం| గన్తుం తిల్లవనం యదత్ర నటనం సన్దర్శయేయం త్వితి|| ఆ శేషుడు తనముందు ప్రత్యక్షముగా వృషభారూఢుడైనయున్న శివుని జూచి సంతసించి సాష్టాంగముగా నమస్కరించి మంత్రములచేతను స్తోత్రములచేతను స్తుతించెను. ఈశ్వరుడును తన నటనము జూచుటకు గాఢావాంఛగల వానిని తిల్లవసమున నటనము చూపెదను. అక్కడకేగుమని యాదే శించెను. సూతః : శ్లో|| దృష్ట్వాథ శఙ్కరం శేషః కమ్పమానకరాఙ్ఘ్రకః| బద్దాఞ్జలిః చప్రసన్న స్తమస్తౌషీదమితొజసమ్|| సూతుడు : శేషుడు శంకరునిచ5చి చేతులుకాళ్లువణకగా నమస్కరించుచు శాంతుడై యామహాతేజోవంతుని స్తుతించెను. శ్లో|| మృగ్యరూప! విరూపాక్ష! మమనాథ! మహేశ్వర!| బాలేన్దుశేఖర! శ్రీమన్! దేవదేవ! నమో7స్తుతే|| é వెతుకవలసిన రూపముగలవాడా! బేసికన్నులవాడా! నాప్రభూ! మహేశ్వర! బాలచంద్రుని శిరమున దాల్చినవాడా! శ్రీమంతుడా! దేవదేవ! నీకు నమస్కారము. శ్లో|| అజ్ఞానవిహితాన్సర్వానపరాధాన్సహస్వ మే| కాలకణ్ఠ! శివానాథ! నటనాథ! నమో7స్తుతే|| నల్లనికంఠముగలవాడా! పార్వతీపతీ! నటేశ్వర! నీకు నమస్కారము. ఆజ్ఞానముచే జేసిన నానర్వాపరాధములను క్షమించును. శ్లో|| ఇత్యానన్దవిలీనాత్మా శేషః పుణ్యతపా స్తదా| వాఞ్ఛితస్పర్శనోద్యుక్తో దుణ్డవత్ప్రణనామ తమ్|| ఈ విధముగా నానందములోమునిగిన మనస్సుగల వాడు, పవిత్రమైన తపస్సుగలవాడనగు శేషుడప్పుడు కోరినస్పర్శకు సిద్ధపడుచు వానికి సాష్టాంగముగా నమస్కరించెను. é27) శ్లో|| మహేశో7పి తతస్తస్య ప్రాపయన్నంతికం వృషమ్| ఉత్థాప్యతంకరేణాశు సమాలింగ్యముహుర్ముహుః|| కృపాం చ పరమాం కుర్వన్ త్మిన్సర్వార్థ దాయినీమ్| తస్య మూర్ధ్నికరామ్భోజం నిధాయ ప్రససాదసః|| పిమ్మట మహేశ్వరుడును వృషభమును వానిదగ్గరకు పోనిచ్చి వెంటనే వానిని చేతితో లేవదీసి మరలమరల కౌగిలించుకొని వానిమీద సమస్తము నొసగునట్టి పరమదయను జూపుచు వానితలమూద హస్తమపద్మముంచి యనుగ్రహించెనున. శ్లో|| ఏతాదృశా వినా శేష! తపసా దుష్కరేణ తే! అదృశ్యం పరమం దివ్యంమమతాణ్డవమద్భుతమ్|| శేష! ఉత్తమము, దివ్యము, ఆశ్చర్యకరమునైననాతాండవము ఇట్టి దుష్కరమైన తపస్సు చేయక నీకు జూడ శక్యముకానిది. శ్లో|| సర్వథా దర్శయిష్యామి తపసాతే వశీకృతః| జహీహి తత్కృతక్లేశమద్యైవాలం ఫణాధర!|| ఫణీ! తపస్సుచే నీకు వశ##మైతిని, తప్పక చూపెదను. దానివలన కలిగిన క్లేశము నిప్పుడే విడువుము. చాలును. శ్లో|| యథార్థం మత్స్వరూపస్య లోకై రమితతేజసః| అతిగుహ్యం స్వసంవేద్యంశృణుత్వం వదతోమమ|| లోకములు చెప్పలేని తేజస్సుగల నాస్వరూపము యొక్క యాథార్థ్య మతిరహస్యమైనది. స్వయముగా తెలసికొనదగినది. నేనుచెప్పుచుంటినివినుము. శ్లో ఏష మాయాసముత్పన్నః ప్రపఞ్చః కర్మణి స్థితః| నైవ జానాతి మరణం సుఖం దుఃఖం భయం ద్విషమ్|| ఈ ప్రపంచము మాయవలన బుట్టినది. కర్మపరతంత్రమైనది. మరణమును, సుఖమును, దుఃఖమును, భయమును, శత్రువును ఎరుగదు, శ్లో|| కల్ప్యతే నియతం కర్త్రా మృత్తికాయాం యథ ఘటః| మాయమా పరికల్ప్యన్తే తథా సర్గాదికాః క్రియాః|| కుండను నిశ్చయముగా కుమ్మరి మట్టితో నెట్లు చేయునో అట్లే సృష్టి మొదలగుపనులను మాయ చేయును. శ్లో|| సకలంనిష్కలం చేతి మమరూపద్వయంస్మృతమ్ | సకలం చక్షుషాగ్రాహ్యంధ్యేయంచనియతాత్మభిః|| నాకు సకలము నిష్కలము అని రెంéడు రూపములు గలవు. సకలము (సావయవము) కన్నులతో జూడదగినది స్థిరచిత్తులచే ధ్యానింపదగినది. శ్లో|| నిష్కలం తు నిరాకారం నిరఞ్జనమనామయమ్| తన్న దృశ్యం న చ ధ్యేయం నైవాలోచ్యం నృభిః ఫణిన్|| నిష్కలము (నిరవయవము) మాత్రము ఆకారము లేనిది, నిస్సంగము, నిర్దుష్టము. ఫణీ! అది మనుష్యులకు కనబడదు. ధ్యానముచేయుటకు శక్యముగాదు. ఊహింపి శక్యము గాదు. శ్లో|| తథాపి తే తు పశ్యన్తి యేబుద్ధ్యా మత్పరాయణాః| నిర్ద్వన్ద్వా నిరహంకారా నిర స్తకలికల్మషాః|| ఐనను ఎవరు బుద్ధిచే నాయందు లగ్నమై, సుఖదుఃఖా దిద్వంద్వాతీతులై అహంకారములేక, కలికల్షము తొలగియుందురు వారుచూచెదరు. శ్లో|| పరిక్వమలానాం తు నృణాం దీక్షావిశేషతః| పాశజాలం పరిచ్ఛేత్తుం దయమానస్య కేవలమ్|| అచారస్య స్మృతా మూర్తిరేకా మే తత్ప్రదర్శనే|| అన్యాపి చిన్మయీ నిత్యా నిష్కలజ్క స్థితామమ|| దీక్షావిశేషమువలన దోషములు పరిపక్వమైన మనుష్యులకు కేవలము పాశములను ఛేదించుటక దయదలచిన గురువుయొక్క మూర్తియొకటిమాత్రమునాయొక్క ఆరూపమును జూపునదిగా జెప్పబడినది. జ్ఞానరూపము, నిత్యము, నిష్కలంకమునగు నాయొక్క మూర్తి మరి యొకటి గలదు. శ్లో|| ద్వయోరపిపరం తస్య జ్ఞానమేవ వపుర్మమ| తస్య ప్రాణమయానన్దస్సో7హమేవ ప్రకీర్తితః || ఈ రెండిటియొక్క ఉత్కృష్టమైన జ్ఞానము నాయామూర్తియొక్క శరీరము. దాని %ిప్రాణరూపమైన యానందము నేనే యని కీర్తింపబడినది. శ్లో|| ఏవంవిధస్య మే నామ పరిజ్ఞానం పరాత్పరమ్ అతిగుహ్యమిదం ప్రోక్తం శేషాన్యచ్చ వదామి తే|| శేష! ఇట్టి పరాత్పరరూపమై చాలరహస్యమైన నాయొక్క పరిజ్ఞానము నీకు జెప్పబడినది. మరియొకటిగూడ నీకు చెప్పెదను. శ్లో|| పఞ్చ కృత్యాని మే నిత్యం తాదృశస్య విధాయినః| ఇదమేవ వరం దివ్యం తాణ్డవం పరికీర్తితమ్|| సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ, రూపమైన అయిదు పనులను నిత్యము చేయునట్టి నాయొక్క ఆయైదుపనులే దివ్యము శ్రేష్ఠమునగు తాండవమని కొనియాబడును. శ్లో|| ప్రకృతానన్దనృత్తం మాం సర్వే వేదా వదన్తి చ| తస్య హేతుందిశం కాలం స్థానం జానన్తినైవచ|| ఆనందవృత్తమును జేయునన్ను అన్నివేదములు చెప్పుచున్నవి. దానికి కారణమును దిక్కును కాలమును స్థానమును ఎరుగవు. శ్లో|| దేవదారువనే తస్మిన్పూర్వం యోగిని షేవితే| సన్నిధై కేశవాద్యానాం సర్వేషాం త్రిదివౌకపామ్|| ఆనన్దసిన్దులహరీపూర్ణచన్ద్రోదయే పరే| క్రియమాణ మయా నృత్తే స్వసంవేద్యే రసాశ్రయే|| తద్భారనిస్సహం శేష! తదా తచ్చతపోవనమ్!| ప్రచలద్భూరూహతలం చకమ్పే సుచిరం మహత్ || శేష! పూర్వము యోగులునివసించిన యాదేవదారు వనమున విష్ణువు మొదలగు సమస్త దేవతల సన్నిధిలో ఆనంద సముద్రమునకు పూర్ణచంద్రోదయము, ఉత్తమము, స్వయముగా తెలిసికొనదగినది, రసమునకుస్థానమునగు నృత్తమును నేను చేయుచుండగా అపుడు తపోవనభూమి చెట్ల మూలములతో కూడ చాలసేపు ఎక్కువగా కంపించెను. శ్లో|| మయావనివ్యథాం దృష్ట్వా సర్వతో మహతీం క్షణాత్| ప్రస్తావనావిధావేవనృత్తం మన్దీకృతం పునః|| నే నన్నివైపుల భూమియొక్క ఎక్కువ బాధను చూచిక్షణములో ప్రస్తానతోనే మరల నృత్తమును తగ్గించితిని. శ్లో|| తస్మాచ్ఛేష! తవాప్యద్య తత్ప్రకాశయితుం పరమ్| కృతోద్యమస్య మే మేగాతమమేతచ్చ న స్థలమ్|| కనుక శేష! నీకుకూడ ఆఉత్కృష్ఠమైన నృత్తము నీవుడు చూపుటకు సిద్ధపడిన నావేగమునకు ఈస్థలముగూడ తగినదికాదు. శ్లో|| తతమా మహతీ కాచిద స్తిదవ్యాసభా భువి| ఇతి స్వర్వహితార్థాయ ప్రోక్తవాన్ భగవాన్ శివః || దానినోర్చునది గొప్పది దివ్యమైనదియునగు సభయొకటి భూమిలో గలదు అని సర్వశ్లేయస్సుకొరకు భగవంతుడుశివుడు చెప్పెను. సూతః: శ్లో|| శివస్య వచనం శ్రుత్వా ఫణిరాజో7పి సాదరః| వినయావనతో భూత్వా భూయోవచనమబ్రవీత్|| సూతుడు : శివునిమాట విని ఫణిరాజుకూడ ఆదరముకలిగి వినయముతో వంగి మరల మాటపలికెను. శ్లో|| మమ భాగ్యాయ చేదస్తి సభా భువి తథా విధా| ప్రపఞ్చైరాగమైర్వేదైరలక్ష్యా యాపరాత్పరా|| సాక్షాద్భవసి మే దేవ! తస్యాం సదసి శఙ్కర!| అస్మాదపి పరం కార్యం కిమునాథ! దయానిధే! || దేవ! శంకర! రక్షక దయానిధీ! నాఅద్పష్టముచే ప్రపంచములకు, అగమములకు, వేదములకుక నబడని పరాత్సరరూపమైన అట్టిసభ భూమిలో నున్నయెడల, ఆసభలో నీవు నాకు ప్రత్యక్షమగునెడల దానికంటె గొప్పకార్య మేమిగలదు? శ్లో ఏవముక్తస్తతస్తేన ఫణినాథేన శఙ్కరః| తస్మన్దయాం పరాం కుర్వన్ వాచమూచే దయానిధిః|| ఆ ఫణిరాజీవిధముగా బలుక దయామయుడగు శంకరుడు వానియందు మిక్కిలి దయజూపుచు నీమాటను పలికెను. శ్లో|| భూతలం చ శరీరం చ సమం ప్రోక్తే మహామతే| é ఇడా తస్య మహానాడీ లఙ్కం ప్రాప్నోతి సన్తతమ్|| మహామతీ! భూతలము, శరీరము సమానముగా జెప్పబడినవి. భూమియొక్క ఇడయనుమహానాడిలంకను పొందుచున్నది. శ్లో|| అన్యా తు పిఙ్గలానామ హిమవన్తముపాశ్రితా| తయోర్మధ్యేగతా యాచసుషుమ్నేతి ప్రకీర్తితా|| ప్రాప్నోతి సన్తతం తస్య మధ్యం తిల్లవనస్య సా| భూతలస్యాతివిస్తారా శోభినః పురుషాకృతేః|| పింగళయను మరియొకనాడి హిమవత్పర్వతమును చేరియున్నది. ఆ రెండిటికి మధ్యనున్నది., నుషుమ్నయని కీర్తింపబడునది, పురుషాకృతితో శోభిల్లు భూమికి అతివిస్తారమైనది యనగు నానాడి ఎల్లపుడు నాతిల్లవనమధ్యమున పొందును. శ్లో|| మూర్ధ్ని శ్రీపర్వతః ప్రోక్తః ఫాలే కేదారపర్వతః| శిరస్యస్య మహాస్థానం కైలాసశిఖరాహ్వయమ్|| దీనిమార్ధ్సతానమున శ్రీపర్వతము, నుదుట కేదారపర్వతము, శిరోభాగమున కైలాసశిఖరమును మహాస్థానము గలవు. శ్లో|| స్మృతా వారాణసిశేష! భ్రూమధ్యే పుణ్యవాహినీ | కుచస్థానే కురుక్షేత్రం ప్రయాగో నాభిసంజ్ఞి తమ్ || శేష! కునుబొమ్మలనడుమ పవిత్రమైన గంగగల వవారాణసి గలదు. కుచస్థానమున కురుక్షేత్రము, నాభిస్తానమున పర్యాగ గలవు. శ్లో|| చిదమ్బరం తు హృన్మధ్యమాధారః కమలాలయః| స్థానమేతత్పరిత్యజ్య పరస్థానాని యో ప్రజేత్|| పాణిస్థం స మహారత్నం త్యక్త్వా కాచం విమార్గతే| తన్మధ్యే విపులే దివ్యే విమలే బ్రహ్మసన్నిభే|| అస్తి లిఙ్గం మహచ్ఛేష! శ్రీమూలస్థాననామకమ్| తస్య దక్షిణభాగే తునాతిమారే ప్రబావినీ|| అమ్బరాఖ్యా సభా కాచిదస్తి సర్వశుభాశ్రయా| అభఙ్గురమహం తస్యాం కరోమ్యానన్దతాణ్డవమ్|| హృదయమధ్యము చిదంబరము ఆధారము కమలాలము, ఈ హృదయశ్తానమును విడచటి ఇతరస్థానములకేగు వాడు చేతిలోనున్న మహారత్నమును విడచి గాజుపూసను వేతకువాడే. శేష! విశాలమై దివ్యమైన స్వచ్ఛమై బ్రహ్మతో సమానమైన దానిమధ్యలో మూలస్థానేశ్వరుడను పేరుగల పెద్దలింగము గలదు. దానికి దక్షిణభాగమున సమీపములో ప్రభావముగలిగి సర్వశుభములకు స్థానమగు అంబరమను నొకసభగలదు నేను దానిలో తప్పక యానందతాండము చేయుదును. శ్లో|| చితమ్బరమితి ఖ్యాతా తస్మాత్సా సర్వవన్దితా| అశ్రయన్తే సభామేనాం పుణ్యవన్త స్తపోధనాః| ఆసభ చిదమ్బరమని ప్రసిద్ధమైనది, కనుక దానినందరు నమస్కరింతురు. పూణ్యాత్ములైన తాపసపుంగవు లాసభనాశ్రయింతురు. శ్లో|| యే చ తేషు మహాత్మానః పరమజ్ఞానలోచనాః| తే తు పశ్యన్తితాం నిత్యంసర్వవేదై రభిష్టుతామ్|| వారిలో నేమహాత్ముల కుత్తమమైన జ్ఞానదృష్టిగలదో వారు సమల్తవైదములచే స్తుతింపబడిన యాసబను నిత్యము చూచెదరు. శ్లో|| యాని పాపాని మర్త్యానాం సంచితాని భ##వేభ##వే| సద్యస్తాని వినశ్యన్తి స్మృతే జాతు చిదమ్బరే|| చిదంబరము నొక్కమారు స్మరించినను జన్మజన్మలలో నార్జించిన మానవుల పాపములు వెంటనే నశించును. శ్లో|| అలబ్ధపుణ్యపాకా యే పశ్యన్తి చిదమ్బరమ్ అముక్తాస్తే సదా పాశైర్భూయే జన్మ భజన్తి హి || పుణ్యము పరిపాకముచెందక చిదంబరము చూడని మానవులు ఎప్పుడును పాశములనుండి విడదలచెందక మరల జన్నను పొందుదురు. శ్లో|| మయాపి నైవవర్ణ్యన్తే ప్రభావా స్తస్య పన్నగ!| తత్ప్రాప్తుపాయమత్రైవ శృణుషై#్వకాగ్రమా నసః || పన్నగ! నేను దానిప్రభావములను వర్ణించుటలేదు. దానిని చేరు ఉపాయము నిక్కడే ఏకాగ్రచిత్తుడవై వినుము. శ్లో|| అశీవిష! ఫణీన్ద్ర! త్వాం జ్వలదగ్వహ్నివిలోచనమ్| సహస్రశిరసం దృష్టావ భ##వేల్లోక భయాకులః|| కోరయందు విషముగల ఫణిరాజా! మండు నిప్పువంటి కన్నులు వేయితలలుగల నిన్ను జూచి లోకము భయముతో కలతజెందును. శ్లో|| అత్రిర్నామ మహాతేజాః పురా దివ్యస్తపోధనః| అనుసూయా చ తత్పత్నీ పుత్రం త్వాం ప్తాప్తుమిచ్ఛయా|| కమలాక్షమజం విష్ణుంద్వామపూజయతాం చిరమ్| ప్రదదౌ త్వాం తయోశ్శేష! సో7పిదేవః కృపానిధిః|| పూర్వము మహాతేజోవంతుడగు అత్రియను పేరుగల దివ్యతావసునుడు వాని భార్యయగు అనసూయయు నిన్ను పుత్రునిగా బొందగోరి కమలములంవంటి కన్నులుగలిగి, జన్మరహితుడైన విష్ణుపునిద్దరును చిరకాలము పూజించిరి. శేష! దయానిధియగు నా దేవుడు నిన్ను వారికిచ్చెదను. శ్లో|| తదాజన్మభయాద్బాలో లసత్పఞ్చఫణాన్వితః| తత్పత్న్యాః స్నానశుద్ధాయాః దృష్టో7భూస్త్వం కరాఞ్జలౌ|| అప్పుడు పుట్టుకయందలి భయమువలన ప్రకాశించు అయిదుపడగలతో బాలుడవై నీవు స్నానపరిశుద్ధురాలైన వానిభార్యయొక్క దోసిలిలో కనబడితివి. శ్లో|| పుత్రాభిలాషిణ్యపి సా కరస్థం బాలరూపిణమ్| విలోక్య సహసా భీతా త్వాం వ్య ముఞ్చన్మహీతలే || ఆమె పుత్రునియందు కోరికగలదైనను బాలరూపుడవై చేతిలోనున్న నిన్నుజూచి భయపడి వెంటనే భూమిమీద విడచెను. శ్లో|| పతఞ్జలిసమాఖ్యో7భూ స్తదా తత్పనాద్భువి| అద్యత్వంతాదృశోభూత్వాసహితః వ్రజ్ఞయానయా|| నామ్నా పతఞ్జలిఖ్యాతో ధ్యాయన్మాం హృది సన్తతమ్| వర్త్మనా చారుణా గచ్ఛ నాగలోకానుసారిణా|| అప్పుడు భూమిమూద పడుటవలన పతంజలియని పేరు గలవాడైవితి. ఇప్పుడు నీవట్టివాడవై ఈ జ్ఞానముకలిగిపతంజలియను పేరుతో పిలువబడుచు నన్మెల్లప్పుడు బృదయమున ధ్యానించుచు నాగలోకమునకేగు సుందరమైన మార్గము వెళ్ళుము. శ్రో|| అత్రమధ్యే మహానద్రిరస్తి తుఙ్గో7వర్త్మనః| తస్య దక్షిణపార్శ్వే తు బిలద్వారమను త్తమమ్|| ఆ దారిలో మధ్యా ఎత్తైన పర్వతము గలదు. దానికి దక్షిణపుప్రక్క ఉత్తమమైన బిలద్వారము గలదు. శ్లో|| తదగ్రతః ప్రభూతస్య శ్రీమత్తిల్లవనం స్మృతమ్| తద్వారస్యోత్తరే భాగే వటభూరహమూలగమ్|| శైషాస్తి పరకమం లిఙ్గం శ్రీమూలస్థాననాకమ్| తల్లిఙ్గం భూతలే నిత్యం స్తూయతేసకలై స్సురైః|| శేష! విశాలమైన దానికి చివర శ్రీతిల్లవనమున్నది. ఆ ద్వామున కుత్తరభాగమున మఱ్ఱిచెట్టు మొదట శ్రీమూలస్థానేశ్వరుడను పేరుగల పెద్దలింగముగలదు. ఆలిజ్గము భూతలమున నిత్యము సకల దేవతలచే స్తుతింపబడును. శ్లో|| తదేవ పూజయన్ భక్త్యా తద్ధ్యాయన్మమ తాణ్డవమ్|. వ్యాఘ్రపాద ఇతి ఖ్యాతస్తపశ్చరతి సువ్రతః || ఆలింగమునే భక్తితో పూజించుచు నాతాండువమును ధ్యానించుచు వ్యాఘ్రపాదుడను ప్రసిద్ధుడై సువ్రతుడొకడు తపస్సు చేయుచున్నాడు. శ్లో|| తత్రతిష్ఠ సమంతేన మునినాపుణ్వశాలినా| పూర్ణిమాయాం పౌషమాసే7మృతయోగేన సంయుతే|| వారే చ గౌరవే తస్య పుష్యరే చ శుభావహే దినస్య మధ్యమం భాగం సంప్రాప్తే చ దివాకరే|| పుణ్యముతో ప్రకాశించు నామునితో కూడ అక్కడ నుండుము. పౌషమాసమునపూర్ణమయందు అమృతయోగముతోడను శుభకరమైన పుష్యమీనక్షత్రముతోడను, కూడిన గురువాసరమున సూర్యుడు దినమధ్యమును పొందిన సమయమున నీకును, వ్యాఘ్రపాదునకును ఉత్తమమైన తాండవమును జూపెదను. శ్లో|| ఇతి వాచమనన్తో7పి శ్రుత్వా తాంశమ్భునేరితామ్ ప్రణిపత్య చిరం తస్థా పరమానన్దమోహితః|| ఈవిఢముగా శివుడు చెప్పిన మాటను అనన్తుడువిని మహానందముతో చాలసేపు నమస్కరించుచు మైమరచి యుండను. శ్లో|| మహేశో7పి దయామూర్తిః స్తూయమానో గణో త్తమైః| అద్రీన్ద్రకన్యయా సాంక క్షణాదన్తరధీయత|| దయాస్వరూపుడగు ఈశ్వరుడు గణశ్రేష్ఠులు స్తుతించటుచుండ పార్వతితో గూడ నదృశ్యుడయ్యెను. శ్లో|. తతస్స తద్గతస్వాన్తః, సుతపాః ఫణినాయకః|| ప్రణమ్య తద్గతామాశామాశావి శ్రుతధీగుణః| పూర్వరూపంమహాకాయంపరిత్యాజ్యాశుదీప్తిమత్| పతఞ్ఛలిత్వమాప్తుం తత్ తత్ర ధ్యానపరో7భవత్ || పిమ్మట మంచి తపస్సుచేసి దిక్కుసలయందు ప్రసిద్ధమైన బుద్ధిగుణముగల ఆ ఫణిరాజు శివునియందు లగ్నమైన చిత్తము గలవాడై శివుడు వెళ్ళిన దిక్కునకు నమస్కరించి పూర్వరూపమగు, తేజోవంతమైన, పెద్దశరీరమును వెంటనేవిడచి ఆపతంజలిరూపమును పొందుటకు ధ్యానమగ్నుడయ్యెను. శ్లో- అథ ధ్యానవిశేషేణ మహతా స భుజఙ్గమః| శమ్భుప్రసాదితం రూపమఙ్గీచక్రే మహాద్యుతిః || పిమ్మట విశేషమైన గొప్పధ్యానముచేత మహాకాన్తి గల శేషుడు శివుడగు గ్రహించిన రూపమును ధరించెను. శ్లో|| శోభమాన స్తతస్తేన వపుషా ఫణిపుంగవః|| శనకైరాత్మనో లోకమాప మార్గేణ చారుణా|| పిమ్మట శేషుడాశరీరముతో శోభిల్లుచు సుందరమైన మార్గమున మెల్లగా తనలోకమునకు చేరెను. శ్లో|| శ్రుత్వాస్య తపసః పాకం శమ్భుసాన్నిధ్యకారణమ్. సర్వే కుతూహలావిష్టాః ప్రత్యాజగ్ముః ఫణీశ్వరాః || శివసాన్నిధ్యమునకు కారణమైన వానితపస్సు ఫలించుట విని కుతూహలముగలిగి సర్పవనాయకులందరు దగ్గరకు వచ్చరి. శ్లో|| స వహన్ శమ్భునా దత్తం రూపం తద్విమ లోత్దతమమ్| రుద్ధపార్శ్వో ముదావిష్టైరభూత్సర్వైః ఫణీశ్వరైః || సంతోషముతో కూడిన సర్పనాయకులందరు స్వచ్ఛము ఉత్తమమునగు ఈశ్వరుడిచ్చిన రూపమును ధరించిన యాశేషనిచుట్టు చేరిరి. శ్లో|| ఈశేనోక్తం ప్రసన్నాబమథ తత్ర మహీధరమ్| వినయావనతశ్శేషః ప్రణనామ మహీతలే|| పిమ్మట శేషుడు ఈశ్వరుడుచెప్పిన ప్రసన్నకాంతిగల పర్వతమునచ్చట వినయముతో వంగి సాష్టాంగముగా నమస్కరించెను. శ్లో|| కార్కోటకాద్యాః ఫణిన-కృతశైలానతిం ముదా| స్వామినం తముపస్తుత్య చిన్తయా పరయా బ్రువన్|| కార్కోటకుడు మొదలగు సర్పములు సంతోషముతో పర్వతమునకు నమస్కరించిన యాప్రభువును స్తుతించిమిక్కిలి చింతతో పలికిరి. శ్లో|| అశేషభోగిసన్తాననాథ! భూభారధారక! | సహస్రశిరసా శైలస్త్వయసౌ కింనమస్కృతః|| సుమ స్తసర్పలోకప్రభూ! భూభారమును మోయువాడా! వేయిశిరస్సులుగల నీవేల పర్వతమును నమస్కరించితి? శ్లో|| ఇత్యేవ పృచ్చతస్సో7పి విస్మయావిష్టచేతసః| స్మయమానముఖో నాగా న్ప్రత్యువాచమహామతిః|| ఈవిధముగా నడుగుచున్న నాగులనుగూర్చి మహాబుద్ధి మంతుడగు శేషుడు మనస్సన నాశ్చర్యపడి చిరునవ్వుముఖముతో సమాధానము చెప్పెను. శ్లో|| అస్య మూలం తు పాతాలమగ్రం తిల్లవనం గిరేః| తస్మత్సాక్షాహేశానం ప్రాణంసిషమహం ప్రభుమ్|| ఈపర్వతముయొక్క మొదలు పాతాళము, చివర తిల్ల వనము. కనుక నేను ప్రత్యక్షముగా ప్రభువగు మహేశ్వరునకే నమస్కరించితిని. శ్లో|| మోదమానముఖం కాన్తఫణపఞ్చకభూషణమ్|| భూయో7నన్తం నమస్కృత్య ప్రత్యూచుస్తే భుజహ్గమాః|| సంతోషముతో కూడిన ముఖముగలవాడు, మనోహరమైన ఐదుపడగలు భూష ణముగాగలవాడునగు అనంతున కాసర్పములు మరల నమస్కరించి పలికినవి. శ్లో|| అనన్త! శృణు వక్ష్యామః సుమతే! విశ్వరక్షక!|| సంశయో7త్త్రెవ వసతామస్మాకం వర్తతే7నఘ!|| బుద్ధివంతుడా! ప్రపంచమును రక్షించువాడా! పాపరహితుడా! అనంతా! ఇక్కడనే నివసించుచున్న మాకు సందేహముగలదు చెప్పెదము వినుము. శ్లో|| అస్యశైలస్య వంద్యమత్రత్యం తు బిలం చ యత్| తస్యాపి మూలమగ్రం చ నైవవిద్మః ఫణీశ్వర|| ఫణీశ్వర! ఈపర్వతము నమస్కరింపదగినదనియు మే మెరుగుము. ఇక్కడనున్న బిలముయొక్క మొదలను చివరను మే మెరుగుము. శ్లో|| బ్రువన్తస్తద్యమేవంతే సహన్యే7పి భుజఙ్గమాః| ఈశరూపధరం శైలం ప్రణము స్తం పునఃపునః|| ఈవిధముగా నిజము చెప్పుచు వారును ఇతరమైన సర్పములును ఈశ్వరరూపమును ధరించిన యాపర్వతమునకు మరలమరల నమస్కరించిరి. శ్లో|| అనన్తో7పి మహాతేజాః తాన్నివర్త్య కృతానీతీన్|| పరిశుద్ధం బిలద్వారం ప్రణిపత్య ముదాన్వితః|| చిన్తయానో దయామూలంప్రాసాదం పరమేశితుః| విశ్వక్లేశవినాశార్థమారురోహ తమఞ్జసా|| మహతేజోవంతుడగు శేషుడు నమస్కరించిన యా సర్పములను మరలించి సంతోషముతో పరిశుద్ధమైన బిలద్వారమునకు నమస్కరించి దయకు మూలమైన ఈశ్వరానగ్రహమును తలంచుకొనును ప్రపంచక్లేశము నశించుటకు వేగ ముగా నాబిలములోనికెక్కెను. శ్లో|| సమారుహ్య మహాతేజాః పఞ్చాక్షరవిలోచనః| నిరగాదచి రేణౖవ తేన మార్గేణ పన్నగః||| గొప్పతేజోవంతుడగు శేషుడు బిలమునెక్కి పంచారీమంత్రమునే కన్నులుగా జేసికొని కొలదికాలములేనే ఆ మార్గమున బయటకు వచ్చెను. శ్లో|| రత్నాకరేణ సతతం ర్తనపుషై#్పశ్చ మౌక్తికైః | అర్చ్యమానోపకణ్ఠం తద్వీచీహసై#్తర్మనోహరైః|| సచన్ద్రకేణమహతా నీలకణ్ఠన నృత్యతా| ససాలఙ్కృతమధ్యం తం దివ్యయోగిని షేవితమ్|| జన్మపాపవినాశాయ జగన్మఙ్గల హేతవే|| కామం క్రోధం చ లోకనాం మోహధ్వాన్తం నివారయత్|| సఫలాని చ చక్షూంషి కరిష్యన్ జగతాం సదా| సర్వసిద్ధికరఁ శ్రీమత్పుణ్యం తిల్లవనంయ¸° || 81 1/2 సముద్రునిచే మనోహరమైన కెరటములనెడి హస్తములతో నెల్లప్పుడు రత్నములనెడి పుష్పములచేతను, ముత్యముచేతను పూజింపబడు సమీపప్రదేశముగలది, పురివిప్పి నృత్యముచేయు పెద్దనెమలిచేఎల్లపుడు అలంకరింపబడినమధ్యభాగము గలది, దివ్యయోగులచే సేవింపబడినది. జన్మపాపము నశించుటకును లోకకల్యాణమునకు లోకములయొక్క కామక్రోధములను మోహాంధకారమును తొలగించుచున్నది, లోకుల యొక్క క్నులనెల్లప్పుడు సఫలముచేయునది. సర్వసిద్ధులను కలిగించునది, పరవిత్రమైనదియనగదు శ్రీతిల్లవనమున కేగెను. ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం శ్రీమహేశ్వరం సన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే శ్రీవతఞ్జలేః తిల్లవనప్రాప్తి ర్నామ పఞ్చదశో7ధ్యాయః