Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ అష్టాదశోధ్యాయః

(పతంజలివ్యాఘ్రపాదులు వరములడుగుట

శ్లో** చక్రపాణివిధీశానవాసవాద్యా దివౌకసః|

త్రిసహస్రమునీన్ద్రాశ్చ నారదశ్చైవ తుమ్బురుః|

సిద్ధవిద్యాధరాశ్చాపి యక్షగన్ధర్వకిన్నరాః|

ఆశానాం పతయస్సర్వే మహితానేకవిక్రమాః||

గణవర్యాశ్చ యే చాన్యే తత్ర తాణ్డవకాఙ్‌క్షిణః|

తే సర్వే సహసా లబ్ధ్వా జ్ఞానదృష్టిముమాపతేః|

సుస్పష్టం దదృశుర్దివ్యం తాణ్డవం తచ్చిదమ్బరే||

విష్ణువు, బ్రహ్మ, ప్రభువగుఇంద్రుడు మొదలగుదేవతలు, మూడువేలమంది మునులు, నారదుడు, తుంబురుడు, సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, పరాక్రమవంతులైన దిక్పాలకులందరు, గణశ్రేష్ఠులు, అక్కడ తాండవమును జూడగోరిన ఇతరులందరు శివునివలన వెంటనే జ్ఞానదృష్టిని పొంది చిదంబరమున దివ్యమైనయాతాండవమును మిక్కిలిస్పష్టముగా జూచిరి.

శ్లో** తద్దృష్ట్వా పరమప్రీత్యా జన్మజన్మసు దుర్లభమ్‌ ||

ఉత్కూలానన్దసన్దోహాః కృతాఞ్జలిపరిగ్రహాః||

వేదైర్మృదఙ్గశఙ్ఖాదిరవై ర్ముఖరితే భృశమ్‌|

శమ్భోస్తపోధనాస్సర్వే మమజ్జుస్తాణ్డవార్ణవే||

ఆతపోధనులందరు జన్మజన్మలకు దుర్లభ##మైన యాతాండవమును మిక్కిలిప్రీతితో జూచి పొంగివచ్చు సంతోషముతో నమస్కరించుచు వేదమృదంగశంఖాదిధ్వనులతో మిక్కిలి ధ్వనించుచున్న శివుని తాండవసముద్రమున మునిగిరి.

శ్లో|| తదాలోకనసన్తుష్టాస్తదా సర్వే గణో త్తమాః||

తుష్టువుస్తం మహాదేవం నటరాజం పరం శివమ్‌||

అపుడాతాండవమును జూచుటచే సంతోషించిన గణశ్రేష్ఠులందరు మహాదేవుడు, పరమశివుడునగు నానటరాజును స్తుతించిరి.

శ్లో|| పరాత్పర! ప్రపఞ్చేశ!గఙ్గాధర!హర!ప్రభో!|

ఆదిధాతృశిరశ్ఛేదహేతో! విశ్వస్య ధారక||

పురశాసన!కామారే!కాలకాల!జగత్పతే!|

ఇతి ప్రకీర్య పుష్పాణి పాపనాశాయ తత్పదే|

హరేత్యుచ్చైర్వదన్తశ్చ తం ప్రణముః పునఃపునః||

నీవు సర్వోత్కృష్టుడవు ప్రపంచమును శాసించువాడవు. గంగను శిరమున ధరించినవాడవు. ప్రళయకాలమున సర్వమును సంహరించువాడవు. సర్వసమర్థుడవు. మొదటి బ్రహ్మతలను ఖండించినవాడవు. ప్రపంచమును పోషించువాడవు. త్రిపురానురసంహారము చేసినవాడవు. మన్మథుని భస్మముచేసినవాడవు. యమునిగూడ దండించువాడవు. లోకమును రక్షించువాడవు. అని నుతించి పాపము నశించుటకు శివుని పాదములపై పూవులచల్లి 'హరా' అని గట్టిగా పలుకుచు వానికి మరల మరల నమస్కరించిరి.

శ్లో** గుహ్యానామాగమార్థానాం ప్రకాశనపరశ్శివః*

దృష్ట ఇత్యవశాః ప్రీత్యా గాయన్తిస్మ దివౌకసః**

రహస్యమైన వేదార్థములను వెల్లడించు శివుని చూచి తిమని దేవతలు సంతోషముతో మైమరచి గానముచేసిరి.

శ్లో** ననృతుః కేచిదపరే తస్థుః స్తబ్ధవిలోచనాః*

అన్యే ప్రజహసుః ప్రీత్యా అపరే జగురుచ్చకైః**

కొందరు నృత్యముచేసిరి. మరికొందరు రెప్పపాటులేక నిలబడిరి. కొందరు సంతోషముతో బిగ్గరగా నవ్విరి. కొందరు గట్టిగా పాడిరి.

శ్లో** పాపరోగజ్వరాదీనాం దేహజానాం నిరన్తరమ్‌*

దివ్యౌషధం కటాక్షం తే దేహి నః కృపయా శివ!**

అపరాధసహస్రాణి కుర్వతాం తు దినేదినే**

దయాం కుర్వితిచాస్మాకంసురాః కేచిద్యయాచిరే**

శివ! ఎల్లప్పుడు శరీరమునబుట్టు పాప, రోగ, జ్వరములకు దివ్యౌషధమైన నీకటాక్షమును దయతో మాకిమ్ము. ప్రతిదినమున వేలకొలది తప్పులజేయు మమ్ములను దయజూడుము. అని కొందరు దేవతలు యాచించిరి.

శ్లో** బభ్రుకేశాని భూతాని బృహద్వక్త్రాణి కోటిశః**

తున్దిలాని విరూపాణి కరణాని వితేనిరే**

గోరోజనపురంగు జుట్టు, పెద్దముఖములు, పెద్దపొట్ట, వికారరూపముగల కోట్లకొలది భూతములు నృత్తవిశేషములగు కరణములను ప్రయోగించిరి.

శ్లో** జ్వలద్వహ్ని శిఖా భీమాః భృశం నీలవిలోచనాః**

అతిక్లిష్టముఖాకారాః దీర్ఘదంష్ట్రా బృహద్గలాః**

దహ్యమానోదరా నిత్యంక్షుద్దుఃఖోత్పన్న వహ్నిభిః**

పిశాచా భూతనృత్తానాం హస్తతాలం వితేనిరే**

మండుచున్న అగ్నియొక్క జ్వాలలవలె భయంకరులై అతినీలపు కన్నులు, మిక్కిలి పీడతో కూడిన ముఖాకారములు, పొడవైన కోరలు, పెద్దమెడలు, ఎల్లప్పుడు ఆకలి మంటచే మండు కడుపులు గల పిశాచములు భూతముల వృత్తములకు చేతులతో తాళమువేసిరి.

శ్లో** ఇతి గాయత్సు నృత్యత్సు భువనేషు ముహుర్ముహుః**

లబ్దకామేషు సర్వేషు సుఖితేషు తదా భృశమ్‌**

తౌ విలోక్య దయాధారో భగవాన్‌ భక్తవత్సలః**

వృణుతం వాఞ్చితానస్మద్వరానిత్యబ్రవీత్ర్పభుః**

ఈవిధముగా లోకములు మరలమరల గానముచేయుచు నృత్యము చేయుచునుండగా అందరు కోరికతీరి మిక్కిలి సుఖము జెందియుండగా దయానిధి భక్తవత్సలుడు, ఐశ్వర్యసంపన్నుడునగు నా ప్రభువు ఆమునులిద్దిరను జూచి మానుండి మీకిష్టమైన వరములను గోరుకొనుడని పలికెను.

శ్లో** ప్రసన్న వదనామ్భోజే ప్రసన్నార్తిహరే హరే

గిరా గమ్భీరమధురం స్నిగ్ధయేతి ప్రభాషిణి**

కింక ర్తవ్యత్వసంమూఢౌ తావుభౌ ప్రీతచేతసౌ*

పరస్పరం పరం వక్త్రే పద్మాభే సమదృశ్యతామ్‌**

భక్తులబాధలను బోగొట్టు శివుడు ప్రసన్నమైన ముఖముతో గంభీరము మధురమునై ప్రీతితో కూడిన మాటనిట్లు పలుకగా నామునులిద్దరును మనస్సున సంతోషించి ఏమిచేయవలెనో తెలియక కేవలము పద్మమువంటి ఒకరిముఖము నింకొకరు చూచుకొనిరి.

శ్లో** పూర్వస్తయోర్మహాతేజాః చిరాత్పక్వతపః ఫల*

బద్ధాఞ్జలిస్సపులకః వరం వవ్రే మహేశ్వరాత్‌**

ఆమునులిద్దరిలో మొదటివాడు, మహాతేజోవంతుడునగు వ్యాఘ్రపాదుడు చిరకాలమునకు తనతపఃఫలము పరిపక్వమైనందున శరీరము పులకరింప నమస్కరించుచు మహేశ్వరుని వరముకోరెను.

శ్లో** భగవన్‌! యన్మయాకారి భవతే పూజనం పురా*

ఉరరీక్రియతాం దేవ! భవతా పరతోపి యత్‌ **

దేవ! నేను నీకు పూర్వము చేసిన పూజను ముందుచేయబోవు పూజను నీవంగీకరింపుము.

శ్లో**ఏష ఏవ వరశ్శమ్భో! మమ శ్రేయానపశ్చిమః*

ప్రసీద మహ్యమిత్యుక్త్వాప్రణనామ నటేశ్వరమ్‌**

ఎల్లప్పుడు నీపూజ నాకులభింపవలెననునది యే నేను కోరువరము. అదియే నాకు శుభ##మైనది, ప్రధానమైనది, నాకు దానిననుగ్రహింపుమని పలికి నటరాజునకు నమస్కరించెను.

శ్లో** తతః స్ఫురత్ఫణారత్నః తత్ప్రసాదస్య గోచరః*

పునః ప్రణమ్య పరమం వవ్రే వరమను త్తమమ్‌**

పిమ్మట శివుని యనుగ్రహమునకు పాత్రుడై పడగల మీది రత్నములతో ప్రకాశించు పతంజలి నటరాజునకు మరల నమస్కరించి సర్వోత్తమమైన వరమును కోరెను.

శ్లో** భగవన్‌ ప్రాణినాం చిత్తం ధ్యేయే భవతు నిశ్చలమ్‌*

నృణాం రాగాదయః క్లేశాః ప్రతిక్షణవిలక్షణాః**

ప్రయాన్తు సద్యో విలయం స్మరణాత్తాణ్డవస్య తే*

నమస్తు చరణం సర్వే లోకాస్తాణ్డవభూషణమ్‌**

దేవ! ప్రాణులచిత్తము ధ్యానింపబడు నీయందు నిశ్చలముగా నిలుచుగాక, క్షణక్షణము విలక్షణముగాకలుగురాగా దిక్లేశములు నీతాండవమును స్మరించుటవలన వెంటనే నశించుగాక, లోకములన్నియు తాండవాలంకారమైన నీపాదమును నమస్కరించుగాక.

శ్లో|| మమ మాధ్యన్దినేశ్చాసి మునీనామత్రవాసినామ్‌|

అలంభావశ్చ నభ##వేత్‌ యుష్మత్తాణ్డవదర్శనే||

నాకు, వ్యాఘ్రపాదునకు ఇక్కడనుండు మునులకును మీతాండవదర్శనము చాలుననిపించకుండుగాక.

శ్లో|| అస్మిన్‌ లోక జనాస్సర్వే పరమానన్దమద్భుతుమ్‌|

అనుభూయేహ తృప్యన్తు సరేవసన్తు నిరామయాః||

ఈలోకమున జనులందరు నిక్కడ అద్భుతమైన పరమానందము ననుభవించి తృప్తిని చెందుదురుగాక. అందరును రోగములేనివారగుదురుగాక!

శ్లో|| నిస్తరంతు మహాఘోరం సద్యస్సంసారసాగరమ్‌|

న పిబన్తు పునస్తన్యం మాతుర్దృష్ట్వైవ తాణ్డవమ్‌||

మహాభయంకరమైన సంసారమను సముద్రముము వెంటనే దాటుదురుగాక, తాండవమును చూచినపిమ్మట మరల తల్లిపాలుత్రాగకుందురగాక (పుట్టకుందరుగాక)

శ్లో|| నశ్యాన్తంఘోరపాపాని తమాంసీవారుణోదయే|

లభ్యన్తాం వాంంఛితాస్సర్వైఃజనైరర్థామహత్తరాః||

అరుణోదయమైనతోడనే చీకట్లు పోయినటుల తాండవమును చూచినతోడనే మహాఘోరములైనను పాపములు నశించుగాక, జనులందరికోరికలు ఎంత పెద్దవైనను నెరవేరుగాక.

éశ్లో|| తదత్ర యత్కృతం నృత్తం సర్వమఙ్గలయా సహా|

సాక్షాద్భూయేహ సర్వేషాంతజ్జాయేత సనాతనమ్‌|

కనుక ఇక్కడ పార్వతితోకూడ నీవుచేసిన నృత్తము అందరకు కనబడి శాశ్వతమగుగాక.

శ్లో|| వర ఏష మమైవాసౌ వరేణ్య! మధురాకృతే!|

ప్రసీద పరమేత్యుక్త్వా ప్రాణంసీద్భువనర్థయే||

సుందరాకార! నావరమిదియే, సర్వోత్తమ! అనుగ్రహింపుము. అని లోకశ్రేయస్సుకొరడిగి నమస్కరించెను.

శ్లో|| తత స్తథేతి దేవేన వరే దత్తే దయో త్తరమ్‌|

ఉత్థాయ తౌముని ప్రీత్యా నృత్తలీలాం వితేనతుః||

పిమ్మట అట్లేయని శంకరుడు దయతో వరమునీయగా ఆమునులిద్దరు లేచి సంతోషముతో నృత్తముచేసిరి.

శ్లో|| ఆహో! దేవస్య మహతీ దయాస్మాస్వన్యదుర్లభా|

ఇతి లోకాశ్చ ననృతుః ఆనన్దేనానివారితాః||

దేవునకు మనయందు ఇతరులకు దుర్లభ##మైన దయగలిగినది. ఆహా! అని లోకములుకూడ ఆనందముతో అడ్డులేక నృత్తముచేసినవి.

శ్లో|| పుష్పశైలానివోత్తుఙ్గాన్‌ దర్శయన్తో మహీతలే|

వవర్షుః పుష్పవర్షాణి సర్వేదేవాస్సవాసవాః|

భూతలమున నెత్తైన పుష్పపర్వతములను చూపుచున్నటుల ఇంద్రునితో కూడ దేవతలందరు పుష్పములను వర్షించిరి.

శ్లో|| తతో వాద్యాని సన్నేదుః భానుకమ్పాదిభిర్గణౖః|

ఆహతాన్యాహతా స్తత్ర దేవదున్దుభయో7పిచ||

పిమ్మట భానుకంపాదిగణములు వాయించిన వాద్యములు మ్రోగినవి. దేవదుందుభులుకూడ అక్కడ మ్రోగింపబడినవి.

శ్లో|| అత్రా న్తరే సురై స్సార్థం తౌ పునర్మునిపుఙ్గవౌ|

ప్రణమ్య దణ్డవద్భూమావప్రాష్టాం ప్రమథేశ్వరమ్‌||

ఇంతలో దేవతలతో కూడ ఆమునిపుంగవులిద్దరు మరల సాష్టాంగముగా నమస్కరించి పరమేశ్వరునడిగిరి.

శ్లో|| ప్రసీద పరమేశాన! సర్వేషాంనఃకృతేవిభో!

దివ్యంపురాభవత్ప్రోక్తం దర్శయాద్యచిదమ్బరమ్‌||

సర్వవ్యాపకుడవైన పరమేశ్వర! అనుగ్రహించి మాకందరకు పూర్వము నీవు చెప్పిన దివ్యమైన చిందంబరమునిపుడు చూపుము.

శ్లో|| స తద్విజ్ఞాపనం శ్రుత్వా తేషాం సదయమానసః|

చిదమ్బరం దర్శయిష్యన్‌ తన్నిరుక్తం జగాద సః|

అతడు వారి యావిన్నపము నాలించి వారియందు దయతో కూడిన మనస్సుగలవాడై చిదంబరమును జూపబోవుచు ఆపదమున కర్థమును వివరించెను.

శ్రీనటేశః :

శ్లో బ్రహ్మన్‌! విష్ణో! సురాస్సర్వే! వ్యాఘ్రపాద పతంజలీ!

శృణుతోపనిషద్గీతం స్థానంచైతచ్చిదమ్బరమ్‌|

éశ్రీనటేశుడు ః

బ్రహ్మా! విష్ణూ! దేవతలారా! వ్యాఘ్రపాదపతంజలులారా! ఉపనిషత్తులలో చెప్పబడిన ఈచిందబరస్థానమును వినుడు.

శ్లో|| జ్ఞానమేవ మమ స్థానంతచ్చ మాం నైవముఞ్చతి|

ఏతజ్జానీత విబుధాః వాక్యం లోకోపకారకమ్‌||

జ్ఞానమే నాస్థానము. అది నన్ను విడువదు. జ్ఞానులారా! లోకమునకు మేలుచేయు నీ వాక్యమును తెలిసికొనుడు.

శ్లో|| శరీరిణ్యాత్మని యథా స్థితో7హం విమలాకృతిః|

తధా ప్రపంచదేహే7స్మిన్‌ విహరామి చిదమ్బరే||

శరీరధారియగు జీవాత్మయందు నేను శుద్ధమైన ఆకారముతో సాక్షిగా నెట్లుంటినో అట్లే ప్రపంచమను దేహముగల ఈటిదంబరమున విహరించుచుంటిని.

శ్లో|| తస్య జ్ఞానస్య పర్యాయః చిచ్ఛబ్దస్స్మర్యతేబుధైః|

చితశ్చైతన్యరూపాయాశ్చాన్తరం య త్తదమ్బరమ్‌||

ఆజ్ఞానమునకే 'చిత్‌' అని మరియొక పదముపండితులు వాడుదురు. చిత్‌ అనగా జ్ఞానము. అది చైతన్యరూపము, దాని అంతరభాగము చిదంబరము ఆనగా చిదాకాశము.

శ్లో|| తస్మాద్భూమిహృద స్తస్థం పుణ్డరీకా న్తరస్థితమ్‌!

దహం విపాపం గగనం చిదమ్బరమిహోచ్యతే||

కావున ప్రాణికోటియొక్క హృదయపుండరీకమధ్యమందున్న పాపరహితమైన దహరాకాశ##యే భూమియందలి చిదంబరము.

శ్లో|| తచ్చే దమితి జానీధ్వం యత్రాహముమయా సహ|

హరిదృష్టం యుష్మదర్థే కరోమ్యానన్దతాణ్డవమ్‌||

ఆచిదాకాశ##మే ఈ చిదంబరమని తెలిసికొనుడు. హరిచే చూడబడిన (ఇప్పుడుకూడా గోవిందరాజునామముగల విష్ణువు చేచూడబడుచున్న) ఆనందతాండవమునిచట మీకొరకు చూపుచున్నాను.

శ్లో|| అథోపదేశం విబుధా: లబ్ధ్వా శమ్భోరను త్తమమ్‌|

నిర్ణయాయ పునస్తస్య ప్రణముస్తం నటేశ్వరమ్‌||

దేవతలు శివునివలన సర్తోత్తమమైన ఉపదేశమును పొంది పిమ్మట దాని నిర్ణయముకొరకు మరల ఆనటేశ్వరునకు నమస్కరించిరి.

శ్లో || విబుధైర్వన్దితో దేవః ప్రణతార్తిహరశ్శిశం|

తద్వ్యక్త్యర్థం శుభాం వాచమాహ సంశయమహారిణిమ్‌||

దేవతలు నమస్కరింప మ్రొక్కినవారిబాధనుబోగొట్టు దేవుడగు శివుడు దానిస్పస్పష్టత కొరకు సందేహమును బోగొట్టు శుభ##మైన మాటను పలికెను.

శ్లో|| వేదాగమేషు ప్రథితా సభా కాప్యస్తి కాఞ్ఛనీ|

సురాసురమనుష్యాణామలక్ష్యా సా చిర న్తనీ||

వేదాగమములలో ప్రసిద్ధమైన కనకసభ ఒకటి కలదు. అది దేవతలకు, రాక్షసులకు, మనుష్యులకు కనబడనిది. పురాతనమైనది.

శ్లో|| సా చిదమ్బరమేవేతి శబ్ద్యతే మునిస త్తమైః|

తస్మాన్మహాసభా దభ్రసభా హేమసభా సభా||

చిదమ్బరస్య పర్యాయా స్తదేతద్ధి చిదమ్బరమ్‌|

అది చిదంబరమేయని మునిశ్రేష్ఠులు చెప్పుదురు. కనుక మహాసభ, దభ్రసభ, కనకసభ, సభయని చిదంబరమునకు పర్యాయపదములు, కనుకనిదియే చిదంబరము.

సూతః

శ్లో|| ఇతి నృత్తభువం దేవో నిర్దిదేశ చితమ్బరమ్‌|

సూతుడు :

ఈ విధముగా శివుడు నృత్తముచేయుప్రదేశమును చిదమ్బరముగా నిర్ణయించెను.

శ్లో|| ఆథ తౌ తాపసౌ దేవా మునయో గణపుఙ్గవాః

శ్రుత్వేతి వాచమత్యన్తం గుహ్యాం శఙ్కరభాహితామ్‌||

తన్నిర్డిష్టాం మహాభాగాం తాం తు తాణ్డవభూమి కామ్‌||

సర్వే ప్రదక్షిణీకృత్య నమశ్చక్రుర్మదాన్వితాః||

పిమ్మట వ్యాఘ్రపాదపతంజలులు, దేవతలు, మునులు, గణ శ్రేష్ఠులును మిక్కిలి రహస్యమైన శంకరునిమాటను విని వానిచేజూపబడిన పూజ్యమైన తాండువభూమికి సంతోషము తోనందురు ప్రదక్షిణముచేసి నమస్కరించిరి.

శ్లో|| తతస్తామభిత స్తపై#్తః శుద్ధైః పట్టైస్తు కాఞ్చనైః|

బద్ధ్వా పునర్నవీచక్రుః శ్రేయసే జగతా సురాః||

పిమ్మట దేవతలు లోకముల శ్రేయస్సుకొరకు ఆతాండవభూమికి చుట్టు పరిశుద్ధమైన మేలిమిబంగారపురేకులు కట్టి మరల క్రొత్తదిగా జేసిరి.

శ్లో|| యథా మేరుస్సమాసన్నాన్‌ కరోత్యాత్మసమాన్‌ గిరీన్‌|

ఆన్తఃక్షిప్తాని వస్తూని లావణీవ ఖనిర్యథా||

తథా స్వకీయపర్యన్తదేశాన్విబుధనిర్మితాన్‌|

గౌరవాదాత్మనశ్చక్రే సమానేవ చిదమ్బరమ్‌||

మేరుపర్వతము తనదగ్గరనున్న పర్వతములను తనతో సమానముగా జేయునటుల, ఉప్పుగని తనలోవేసిన వస్తువులను తనతో సమానముగాజేయువిథమున చిదంబరము తనకు దగ్గరగా దేవతలచే నిర్మింపబడిన ప్రదేశములను గౌరవమున తనతో సమానమైనవానినిగా జేసెను.

శ్లో|| తస్మాత్తిల్లవనే తత్ర పఞ్చక్రోశసమన్వితే

దత్తమిష్టం హుతం వాపి సర్వం కోటిగుణం భ##వేత్‌||

కనుక ఐదుక్రోసులప్రదేశము వ్యాపించియున్న తిల్లవనమున దానముచేసినను యజ్ఞమునచేసినను, హోమముచేసినను కోటిరెట్లు ఫలమునిచ్చును.

శ్లో|| తదారభ్య నృత్తేశః తస్మిన్‌ దివ్యే చిదమ్బరే|

ప్రకాశమానో దయయా నృణామపి దృశాంసదా||

మాధ్యన్దినిఫణిన్ద్రాభ్యామమరైశ్చ తపోజనైః|

స్తూయమాస్సమందేవ్యా కరోత్యానన్దతాణ్డవమ్‌||

అప్పటినుండి యానటేశ్వరుడు ఆదివ్యమైన చిదంబరమున దయతో మానవులకన్నులకుగూడ కనబడును వ్యాఘ్ర పాదపతంజలులు దేవతలు. మునులు స్తుతించుచుండగా పార్వతితో గూడ ఎల్లప్పుడు ఆనందతాండవమును జేయుచుండెను.

శ్లో|| దేవేశే దర్శయత్యేవం పరమానన్దతాణ్డవమ్‌|

శ్రుత్వా తస్యపదామ్భోజనూపురారావము త్తమమ్‌|

మృగాశ్చ పక్షిణస్సర్వే సమాగత్యాశు తత్‌క్షణాత్‌|

విస్మృతాహారసఞ్చారాః త్యక్తవైరాః పరస్పరమ్‌||

లబ్ధజ్ఞానాః క్రమేణౖతే సర్వే స్థానస్య వైభవాత్‌|

అమ్బికాచరణామ్చోజస న్తతాలోకతత్పరాః||

పతఞ్జలేశ్చిరాదాసీ త్తపసా దుష్కరేణ యత్‌|

అతులం సహసా ప్రాపుః సకలం తత్తపఃఫలమ్‌||

దేవదేవుడీవిధమున పరమానందతాండవమును జూపు చుండగా ఉత్తమమైన వానిపాదపద్మముల యందెలధ్వనిని విని మృగములు పక్షులు అన్నియు వెంటనే అక్కకువచ్చి ఆహారమును, సంచారమును మరచి పరస్పరవిరోధము విడచి స్థానమహిమవలన క్రమముగా నవియన్నియు జ్ఞానమును పొంది పార్వతీపాదపద్మములను నిరంతరము చూచుటయందానస్తిగలిగి కష్టమైన తపస్సుచే చిరకాలమునకు పతంజలికి లభించిన సాటిలేని తపఃఫలమునంతను వెంటనే పొందినవి.

శ్లో|| పశూనాం పక్షిణాం చాపి భావం దృష్ట్వా గణోత్తమాః|

ప్రణిపత్య పరం క్రుద్ధాః నన్దీశాయ వ్యజిజ్ఞపన్‌||

పశువులయొక్కయు పక్షులయొక్కయు స్థితినిచూచి గణశ్రేష్ఠులు మిక్కిలికోపించి నందీశ్వరునకు నమస్కరించి విన్నవించిరి.

శ్లో|| ప్రసీద నన్దికేశాన, శైలాదే! శంకరప్రియ!

విజ్ఞప్యమస్తి తచ్ఛ్రుత్వాసదృశం చిన్తయప్రభో||

శిలాదకుమార! శంకరునకు ప్రియమైననందికేశ్వర! అను గ్రహింపుము. మావిన్నపమొకటిగలదు. దానినివిని తగువిధమునక కర్తవ్యమునాలోచింపుము.

శ్లో|| నాథస్య నస్త్విదం నృత్తం నాకినాం చాపి దుర్లభమ్‌|

దృష్టం నారాయణనాపి తపౌభిరతిదుష్కరైః||

మన ప్రభువుయొక్క ఈనృత్తము దేవతలకుకూడా దుర్లభము. నారాయణుడుకూడా మిక్కిలికష్టతరమైన తపస్సు చేసి చూడగలిగెను.

శ్లో|| తదీదృశమిదం శమ్భోః తాణ్డవం సర్వజన్తుభిః|

దృశ్యం బభూవ పశ్వాద్యైరపి నిత్యమనర్గలైః||

అట్టి యీ శివతాండవము సమస్తప్రాణులు పశువులు మొదలగునవిగూడ అడ్డులేకుండ చూడదగినదైనది.

శ్లో|| ఏవం యేన వరశ్శమ్భోః వృతస్థాపనమానినా|

స దురాత్మా గణద్రోహి దణ్డ్యోస్మాభిరతన్ద్రతైః||

తాపసినని గర్వించి శివునివలన ఇట్టివరమునుకోరిన గణద్రోహియగు నాదుష్టుడు మాకు ఆశ్రద్ధచేయక దండింపదగిన వాడు.

శ్లో|| విజ్ఞప్తస్స తు శైలాదిరేవం క్రుద్ధైర్గణో త్తమైః|

స్మయమానముఖామ్భోజః ప్రత్యువాచగణశ్వరాన్‌||

కోపించిన గణశ్రేష్ఠులిట్లు విన్నవింప నందికేశ్వరుడు ముఖమున చిరునవ్వుతో వారికి సమాధానముచెప్పెను.

శ్లో|| గణాః! శృణుత భద్రం వః శమ్భోరాకూతమద్భు తమ్‌|

కారుణ్యపారావారస్య లోకానుగ్రహకారిణః||

గణములారా! మీకు శుభమగుగాక, దయాసముద్రుడు, లోకమునందను గ్రహము చూపువాడునగు శివుని యాశ్చర్యకరమగు నభిప్రాయము వినుడు

శ్లో|| వ్యాఘ్రపాదపతఞ్జల్యోః క్రీతో7హం తపసాయతః|

తస్మాత్స్వామీ స్వమాత్మీయం యథేష్టం వినియుజ్యతామ్‌|

ఇతి చేతసి కృత్వేశం తయోరేవ తపస్వినోః|

అభీష్టం పూరయామాసలోకానుగ్రహకామ్యయా||

''వ్యాఘ్రపాదపతంజలులు తపస్సుతో నన్ను కొనిరి. కనుక యజమాని తన ధనమును ఇష్టమువచ్చినటుల ఉపయోగించుకొనుగాక'' అని మనస్సులో తలచి శివుడు లోకమునను గ్రహించుతలంపుతో నామునులిద్దరికోరికను ఫలింపజేసెను.

శ్లో|| తస్మాద్బ్రహ్మాదయో దేవాః పిశాచాన్తాశ్చమానుషాః|

విప్రాద్యాః శ్వపచాన్తాశ్చ పశుపక్షిమృగాదయః||

సర్వే పశ్యస్తు సతతం చన్ద్రచూడస్య తాణ్డవమ్‌|

సర్వే దర్శనమాత్రేణ ముచ్యన్తాం పాపబన్ధనాత్‌||

కనుక బ్రహ్మమొదలుపిశాచములవరకు దేవతులు, బ్రాహ్మణుడు మొదలు కుక్కుమాంసమును తినునీచుని వరకు మనుష్యులు, పశువులు, పక్షులు, మృగములు మొదలగునవన్నియు చంద్రశేఖరుని తాండవమునెల్లపుడు చూచుగాక. దర్శనమాత్రముననే అందరును పాపబంధమునుండి విముక్తులగుదురుగాక.

శ్లో|| తస్మాదీశప్రసాదస్య మాకృఢ్వం ప్రతిఘం గణాః!

తసై#్మచాపి న కర్తవ్యో రోషశ్శేషతపస్వినే||

అందువలన గణములారా! ఈశ్వరానుగ్రహమునకు విరుద్ధముగా బ్రవర్తింపకుడు, ఆమానియగు పతంజలినికూడ కోపింపకుడు.

శ్లో|| ఇతిప్రసాదయత్యేవ గణసజ్ఘాన్‌ గణశ్వరే|

అలంఘ్యశాసనే బ్రహ్మవిష్ణ్వాదైరపిదైవత్తెః||

యదా గణానాం వదనేష్వీశభక్త్యా వివర్ణతా|

నాపై తి స్మ తదా నన్దీ పునరేవమభాషత||

బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలుకూడ మీరరాని శాసనముగల గణప్రభువగు నందికేశుడు గణములనీవిధమున శాంతపరచినను ఈశ్వరునియందలి భక్త్యతిశయముచేత వారి ముఖములయందు కాంతిహీనత తొలగనందున నతడు మరల వారితోనిట్లనెను.

శ్లో|| తథాపి దేవో దేవానాం బ్రహ్మాణ్డానామధీశ్వరః|

ఈశ స్తిల్లవనే నాట్యం సావరోధస్తనోతి యత్‌||

తస్మాద్రాజోపచారార్థం రక్షా కార్య హి సర్వశః|

అమరత్వప్రదం యస్మాదమృతం చాపిగుప్తిమత్‌||

ఐనను దేవదేవుడగు ఈశ్వరుడు సకలబ్రహ్మాండములకు ప్రభువుగనుక అతడు పార్వతితో తిల్లవనమున నాట్యము చేయుచుండెనుగనుకను రాజోపచారముగా అన్ని దిక్కుల రక్షణము నేర్పరుపవలెను. చావులేకుండజేయు శక్తికలదిగనుకనే కదా అమృతమునకుగూడ రక్షణము నేర్పరచెదరు.

శ్లో|| ఇత్యేవముక్త్వా గణపానీశస్య ప్రతిహారకః

శఙ్కరస్య గణాన్సర్వాన్‌ శశాస సుయశాపతిః||

ఈశ్వరుని ద్వారపాలకుడు, సుయశాభర్తయగు నంది కేశ్వరుడు గణాధిపతులతో నీవిధముగా జెప్పి శివగణముల నన్నిటిని శాసించెను.

శ్లో|| అథ నన్దివచః శ్రుత్వాతే సర్వే గణపుఙ్గవాః|

భువనేశప్రధానం తం పునరేవేదమబ్రువన్‌||

ఆనందికేశ్వరుని మాటవినినపిమ్మట గణశ్రేష్ఠులందరు శివునకు ప్రధానుడైననందికేశ్వరునితో మరలనిట్లనిరి.

శ్లో|| శర్వో7త్ర సర్వజన్తూనాం దర్శయేద్యది తాణ్డవమ్‌|

స్వతన్త్రన్య విభోః కృత్యం కోనివారయితుం క్షమః||

ఈశ్వరుడిక్కడ సమస్తప్రాణులకు తాండవమును జూపునెడల స్వతంత్రుడగు నాప్రభువుచేయుపని నెవరడ్డగలరు?

శ్లో|| ఏతావదస్మాన్‌ శాధి త్వమత్రహేసభా న్తరే|

కేన వా రక్ష్యతే సీమా సేవాకాలశ్చ కీదృశః||

ఈకనకసభలో హద్దునెవరు కాపాడవలెనో సేవాకాలమెప్పుడో ఈమాత్రము నీయాజ్ఞను మాకు తెలుపుము.

శ్లో|| ఇతి తేషాం వచశ్శుత్వా గణానాం గణరాట్‌ స్వయమ్‌

దిదేశ తేభ్యస్సంరక్ష్యాణ్‌ దేశాన్‌ దేశికపుజ్గవః||

గణములయొక్క ఈమాటను విని గణప్రభువగు నందికేశ్వరుడు స్వయముగా వారికి రక్షింపవలసిన ప్రదేశములను తెలిపెను.

శ్లో|| అరక్షకాన్‌ సభాయాస్స్వానన్తరఙ్గాన్సమన్తతః|

తదన న్తరకక్ష్యాయాః భూతాన్యాదిష్టరక్షణ||

అనన్తరాయాః కక్ష్యాయాః పిశాచానాదిశత్ప్రభుః|

సభచుట్టు రక్షణమునకు విశ్వాసముగల తనవారిని, తరువాతకక్ష్యను రక్షించుటకు భూతములను, ఆజ్ఞాపించెను. తరువాతకక్ష్యను రక్షించుటకు పిశాచముల నాజ్ఞాపించెను.

శ్లో|| తదన్తరకక్ష్యాయాః తస్యాః కాలీం స్వపార్శ్వగామ్‌|

పాలయిత్రీం వినిర్దిశ్యభైరవాదీం స్తతఃపరమ్‌|

రక్షకాన్కల్పయిత్వైవంకాలంచాకల్పయత్ప్రభుః||

దానికితరువాతకక్ష్యకు తనప్రక్కనున్న కాళీని పాలకురాలుగా నిర్ణయించి అటుపిమ్మట భైరపుడు మొదలగు వారిని రక్షకులుగా నేర్పరచెను. ఇట్లే సేవాకాలమునుకూడా నిర్ణయించెను.

శ్లో|| తత్ర పూర్వాహ్ణమధ్వాహ్నౌ సర్వేషాం నాకవాసినామ్‌|

సిద్దగన్ధర్వయక్షాణాం సాయాహ్నం సుదృశాం నిశామ్‌||

చతుర్ధైవం విభ##జ్యైవ సేవావసరమీశితుః

కల్పయిత్వానృణాం తద్వత్‌ సర్వకాలని షేవణమ్‌||

తతఃపరం చ యామిన్యాః పశ్చిమం ప్రహర ద్వయమ్‌||

స్వేచ్ఛావిహారసమయమీశస్వారచయత్సుధీః||

సేవాకాలమును తొలుత పూర్వాహ్ణము, మధ్యాహ్నము, సాయాహ్నము, రాత్రియని నాలుగుభాగములుచేసి పూర్వాహ్ణమధ్యాహ్నములను దేవతలకును సాయాహ్నమును సిద్ధగంధర్వయక్షులకును రాత్రి స్త్రీలకును సేవాకాలముగా నిర్ణయించెను. మనుష్యులకు సర్వకాలసేవనమును కల్పించెను. రాత్రిచివరిరెండు జాములు ఈశ్వరునకు స్వేచ్ఛావిహారసమయముగా నేర్పరచెను.

శ్లో|| అథ బ్రహ్మా చ విష్ణుశ్చ విబుధాశ్చ శతక్రతుః|

వ్యాఘ్రపాదోమునిశ్శ్రీమాన్‌సర్వేతే హృష్టచేతసః||

పతఞ్జలే! మహాభాగ! భవత్సజ్గవశాద్వయమ్‌|

పశ్యామహే మహేశస్య పరమానన్దతాణ్డవమ్‌||

పిమ్మట బ్రహ్మ విష్ణువు, దేవతలు, ఇంద్రుడు, వ్యాఘ్రపాదుడును అందరు మనస్సున సంతోషించి పతంజలీ! మహాత్మా! నీసాంగత్యమువలన మేము శివుని పరమానంద తాండవమును చూచుచున్నాము.

శ్లో|| పరమేశదయాపాత్ర! ఫణిరాజ! పతఞ్జలే!

ఇతి తే ప్రీతమనసః ప్రశశంసుర్ముహుర్ముహుః||

మనశ్చక్రుశ్చ తే వస్తుం సదా తత్రైవ పావనే|

ఫణిరాజ! పతంజలీ! నీవు పరమేశ్వరుని యనుగ్రహమును పొందినవాడవు. అని వారు సంతుష్టమనస్కులై మరల మరల పొగడిరి. పవిత్రమైన యాప్రదేశముననే ఎల్లప్పుడు నివసింపదలచిరి.

శ్లో|| తతస్తిల్లవనే తస్మిన్‌ సర్వే తాణ్డవలాలసాః|

కృత్వాశ్రమాన్‌ ప్రతిష్ఠాప్యలిఙ్గాంస్తేషు యథావిధి|

త్రిసన్ధ్యమర్చయన్తస్తే సుగన్ధికుసుమాదిభిః|

న్యవసన్‌ తాణ్డవసుధాంపాయంపాయమతన్ద్రితాః||

పిమ్మట తాండవమందధికేచ్ఛ గల వారందరు ఆతిల్లవనముననే ఆశ్రమములను నిర్మించుకొని వానిలో యథావిధిగా ¸°వనేశ, అనంతేశాది లింగములను ప్రతిష్ఠించుకొని మూడుసంధ్యాకాలములందును అలసతలేకుండ పరిమళించు పువ్వులతో పూజించుచు తాండవామృతము నేమరక మరల మలర త్రాగుచు నివసించిరి.

శ్లో|| యస్త్వేతమధ్యాయమనఙ్గశత్రోః|

ఆనన్దనృత్తప్రథమావతారమ్‌||

పఠేత్త్రిసన్ధ్యం ధుతపాశబన్ధో|

ముక్తోభ##వేద్యశ్చ శృణోతి నిత్యమ్‌|| 95 1/2

మన్మథశత్రువగు నీశ్వరునియొక్క ఆనందనృత్తప్రథ మావిర్భావరూపమైన ఈయధ్యాయమును మూడుసంధ్యాకాలముయందు నెవడు చదువునో నిత్యమునెవడు వినునో వాడుబంధములు తొలగిముక్తుడగును.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

ఆనన్దతాణ్డవప్రశంసనంనామ అష్టాదిశో7ధ్యాయః

----0----

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters