Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu
Chapters
అథ ఏకవింశో7ధ్యాయః (సింహవర్మతిల్లవనమునుచేరుట) శ్లో|| వఙ్గాఙ్గోఢ్రకదేశసంచరణతఃప్రాప్తఆన్ధ్రాన్నృపః తత్రానమ్య చ కాలహ స్తిగిరిశం శ్రుత్వా కిరాతాత్సతః|| నానారణ్యవిచిత్రపుణ్యచరితం తద్దర్శితాధ్వా తతః| తిల్వారణ్యమవాప తత్ర మునిమప్యా సేదివాం స్తం కృతీ|| అతడు వంగ, అంగ, ఓఢ్రదేశములను సంచరించి యాంధ్రదేశమునుచేరి అచ్చట శ్రీకాళహస్తీశ్వరునకు నమస్కరించి సత్పురుషుడగు కిరాతునివలన అనేకారణ్యముల ఆశ్చర్యకరమైన పుణ్యచరిత్రను విని పిమ్మట అతడు మార్గము చూపగా తిల్లవనమును చేరి ఆపుణ్యాత్ముడామునినిగూడ చూచెను. కిరాతాః : శ్లో|| అహమస్మిన్మహాభాగ విపినే సత్వసంకులే| శ్వభిస్సహ మృగాన్వేషీ సంచరామ్యమునా పథా|| కిరాతుడు : మహాత్మా! నేనీజంతువులతో నిండిన యరణ్యమున మృగములను వెతకుచు కుక్కలతోకూడ ఈమార్గమువెంటతిరుగుచుంటిని. శ్లో|| దృష్టమత్ర మయా వక్ష్యే తవేచ్ఛా యదితచ్ఛృణు యువా కశ్చిచ్ఛునా సాకంచరత్యత్రాద్భుతాకృతిః|| నేనిక్కడ చూచినదానిని చెప్పెదను, నీకు కోరిక ఉన్నయొడల వినుము. అద్భుతమైన ఆకారముగల యువకుడొకడీవనమున కుక్కతో కూడ తిరుగును. శ్లో|| తటాకం కిఞ్చ విస్తీర్ణమస్త్యేవాత్ర వనాన్తరే| తత్పయః పీతమాత్రేణ జహాత్యేవ జరాంనృప!|| ఈవనములో నొక విశాలమైన చెరువు గలదు. దానిలోనినీరు త్రాగినంతనే ముసలితనము పోవును. శ్లో|| అవ్యాని స్వాదుతోయాని క్లాన్తిచ్ఛేదకరాణి చ| కాన్తాని పద్మకహ్లారైరత్ర తీర్థాన్యనేకశః|| రుచిగలనీరుగలవి, అలసటను బోగొట్టునవి, పద్మముల చేతను ఎఱ్ఱకలువలచేతను సుందరమైనవి ఇతరతీర్థములు అనేక ములిచ్చట గలవు. శ్లో|| కిఞ్చ సాధో! సువిస్తీర్ణో మార్గో7ప్యస్తి వనాన్తరే| అనిశ్చితాష్టదిగ్భాగస్సర్వేషాం భ్రామకశ్చ సః|| అయ్యా! ఈవనములో మిక్కిలివిశాలమైన మార్గము కూడ గలదు. దానిలో దిక్కులవిభాగము తెలియక అందరికి భ్రాంతిగలుగును. శ్లో|| అన్యస్మిన్పథి విస్తీర్ణే కో7పి శాఖీ ప్రదృశ్యతే| నిశ్చలా భవతి చ్ఛాయా తస్యస్నిగ్ధా శ్రమాపహా|| మరియొక విశాలమైన మార్గమున ఒక చెట్టు కనబడును. శ్రమను బోగొట్టునట్టిదానిదట్టనినీడ కదలక యుండును. శ్లో|| అలక్ష్యజనసఞ్చారో7ప్యేకో మార్గో మహామతే!| పురవద్ధీరనిర్ఘోషో రటత్యేవ దివానిశమ్|| మహామతీ! ఒకమార్గము జనసంచారము లేకున్నను పట్టముమువలె గంభీరమైన ధ్వనితో రాత్రింబగళ్లు ధ్వనించుచుండును. శ్లో|| అస్తి కూపో మహాన్ రాజన్నేకస్మిన్నపివర్త్మని| స్వచ్ఛాయామత్ర పశ్యన్తో నిపతన్తి జనాఃక్షణాత్|| రాజా! ఒకమార్గములో నొక పెద్దనుయ్యి గఅదు. దానిలో దమనీడను చూచినజనులు క్షణములో పడిపోవుదురు. శ్లో|| అత్ర నిత్యప్రవాహాయాః నద్యాస్తీరే మనోహరే| చూతశాఖీ మహాన స్తి స్నిగ్ధచ్ఛాయస్సదా ఫలీ|| ఇక్కడ ఎల్లపుడు ప్రవహించెడు నదియొక్క మనో హరమైన తీరముననొక పెద్ద మామిడిచెట్టు గలదు. అది ఎల్లపుడు కాయును. దానినీడ దట్టముగానుండును. శ్లో|| మూలే తస్య పరం లిఙ్గం దృశ్యతే సతతం సృప| కూపరూపా త్తదాసన్నాద్బిలాన్నిర్గత్యమన్థరమ్| కాచిన్నవామ్బుదశ్యామా కన్యా కువలయేక్షణా| లిఙ్గం సమర్చయత్యేవ ద్విసన్ధ్యం పరయా ముదా|| రాజా! ఆచెట్టుమొదట నెల్లపుడు పెద్దలింగము కనబడును. దానిదగ్గరనున్న నుయ్యివంటి బిలమునుండి క్రొత్త మేఘమువలె శ్యామవర్ణము, కలువలవంటి కన్నులుగల ఒక కన్య రెండుసంధ్యాకాలములయందు మెల్లగా బయటకువచ్చి మిక్కిలి సంతోషముతో నాలింగమును పూజించుచుండును శ్లో|| ఆరూఢతురగః కశ్చిద్యువా పాణౌ ధృతాఙ్కుశః| సరితం ప్రవిశన్నిత్యం నిర్గచ్ఛన్నతు లక్ష్యతే|| ఒకయువకుడు చేతిలో అంకుశమును పట్టుకొని గుఱ్ఱము నెక్కి ప్రతిదినము నదిలో ప్రవేశించును. మరల బయటకు వచ్చినటుల కనబడడు. శ్లో|| ఇత్యేతాని చ దృష్టాని మయా రాజన్మహావనే| అలక్షితాని చిత్రాణి నగణ్యన్తే పరశ్శతమ్|| రాజా! ఈ మహావనములో వీనిని నేనుచూచితిని. చూడని ఆశ్చర్యములు లెక్కపెట్టలేము. వందలకు దాటి యున్నవి. శ్లో|| ఇతి తస్య వచశ్ర్శుత్వా కిరాతస్యాథ భూమిపః|| తల్లిఙ్గదర్శనాకాంక్షీ పునరాహ వనేచరమ్|| ఆకిరాతుని యీమాటను విని పిమ్మట రాజు ఆలింగమును జూడగోరి మరల కిరాతునితో బలికెను. శ్లో|| లిఙ్గమత్ర వనే ప్రోక్తం చూతమూలనివాసి యత్| తద్దర్శయ త్వమస్మాకముపకారః కృతో భ##వేత్|| ఈయడవిలో మామిచెట్టు మొదట లింగమున్నదని చెప్పితిని. దానిని నీవు మాకు చూపుము. ఉపకారముచేసినటులగును. శ్లో|| ఇత్యుక్తస్స మహీపేన నిషాదో మాంసలోలుపః| తథేతి నిర్భయో హస్తే ధృతకోదణ్డసాయకః|| నిబిడోచ్ర్ఛితవృక్షేణ గత్వా కేనాపి పర్త్మనా| దర్శయామాస తలిఙ్గం రాజ్ఞేతసై#్మ మహాద్యుతిః|| రాజిట్లడుగగా మహాతేజోవంతుడైన బోయనాడు మాంసమందలి కోరికచే అట్లేయని చేతిలో విల్లమ్ములను ధరించి నిర్బయుడై దట్టముగాను, ఎత్తుగాను చెట్లుగల ఒక మార్గమున వెళ్లి ఆరాజునకాలింగమును జూపెను. శ్లో|| సౌ೭పి భూపః ప్రసన్నాత్మా చూతమూలనివాసినః జగదానన్దమూలస్య సన్నిధిం ప్రాప శూలినః|| ఆరాజుకూడ ప్రసన్నచిత్తుడై మామిడిచెట్టు మొదట నివసించుచు లోకముయొక్క ఆనందమునకు కారణమైన శివునిదగ్గరకు చేరెను. శ్లో|| తతః పరమయా భక్త్వాతం ప్రణమ్య జగద్గురుమ్| తత్సమీపే ప్రవాహిన్యాం కమ్పాసరసి నిత్యశః|| కృతస్నానవిధి స్తస్య కుర్వన్పూజాం నిరన్తరమ్| లాభాయ తత్ర్పసాదానాం తత్రోవాస చిరంనృపః|| పిమ్మట పరమభక్తితో నాజగదీశునకు నమస్కరించి, ఆసమీపమున ప్రవహించు కంపానదిలో నిత్యము స్నానము చేసి, వానియనుగ్రహము లభించుటకు నిరంతరము వాని పూజ చెయుచు చిరకాలమారాజచ్చట నివసించెను. శ్లో|| తస్య సేవారసం మోక్తుమసహో೭సౌ జనేశ్వరః| శ్యామాకామ్బుధృతప్రాణో నివసన్ప్రీతచేతనః|| ఏకదా ధృతకోదణ్డం స్థితమాత్మసమీపతః| భ్రూసంజ్ఞయా సమాహూయనిజగాద వనేచరమ్|| వానిసేవలోని యానందమును విడువలేని యారాజు చామనీటిని ప్రాణాధారముగా చేసికొని ప్రీతదిత్తుడై నివసించుచు నొకప్పుడు వింటిని ధరించి తనసమీపమున నిలిచిన కిరాతుని కనుబొమ్మసంజ్ఞలో బిలిచి పలికెను. శ్లో|| దక్షిణార్ణవపర్య న్తమితో గత్వా వనేచర! | స్వేచ్ఛయా తత్తదాశ్చర్యం దృష్ట్వా తధ్భూమిసంభవమ్|| పాశ్చాత్యవారిధే స్తీరం గన్తుమత్యాదరో మమ| తస్మాద్దర్శయతంమార్గంరమ్యం గమ్యమయత్నతః|| వనేచర! ఇచ్చటినుండి దక్షిణసముద్రసర్యంతము వెళ్లి ఆభూమిలో సంభవించిన ఆశ్చర్యములను స్వేచ్ఛగాజూచి పడమటిసముద్రమున కేగుటకు నాకు మిక్కిలి కుతూహలము గలదు. కనుక రమ్యమై అనాయాసముగావెళ్లదగినయట్టి మార్గమును జూపుము. శ్లో|| తవైవేదం సఖే! కార్యమనుగ న్తుమహం క్షమః| తతస్సో೭పి వచశ్ర్శుత్వా మహీపస్య జగాద చ|| ''మిత్రమా! ఇదినీవేచేయదగిన పని. నేను నీ వెంట వచ్చుటకు సమర్ధుడను''. పిమ్మట నతడు రాజుమాట విని పలికెను. శ్లో|| పదమాత్రస్తు నై వాత్ర గన్తవ్యం కాననే ప్రభో!| అస్య మధ్యగతేనాద్య దిగ్విభాగో న లక్ష్యతే!| ప్రభూ! ఈయడవిలో అడుగుదూరముకూడ వెళ్ల రాదు. దీనిమధ్యకువెళ్లినవానికి దిక్కులవిభాగము తెలియదు. శ్లో|| ఏతస్య నై వ పర్యన్తో దృష్టః కైశ్చిదపి క్వచిత్| అహమేవ పురా గత్వా వర్త్మ సఞ్చిన్త్య కాననే|| ఆగమిష్యామి తావత్త్వమత్ర తిష్ఠ మహామతే!| మహామతీ! దీనిచివర నెవ్వరును ఎప్పుడును చూడలేదు. నేనే ముందువెళ్లి అడవిలో మార్గమాలోచించి వచ్చెదను. అంతవరకు నీవిక్కడనుండుము. శ్లో|| ఇత్యుక్త్వాతం ప్రణమ్యాసౌ ధృతకోదణ్డసాయకః| వనవర్త్మవిచారార్థం త్యక్తభీతిర్వినిర్య¸°|| అనిచెప్పి వానికి నమస్కరించి ధనుర్బాణములనుతీసి కొని భయములేక వనమార్గమును తెలిసికొనుటకు బయలు దేరెను. శ్లో|| అసాద్య సరణిం సిన్ధోః కాననాన్యపి పర్వతాన్| అలోక్య శనకై ః కాలాత్పునరాగత్య లుబ్ధకః|| ఏకాకినం మహీనాథం ప్వస్యాగమనకాంక్షిణమ్| ప్రణిపత్య వనే తస్మిన్యథాదృష్టమువాచ సః|| ఆవేటకాడు సముద్రమార్గము ననుసరించి మెల్లగా అడవులను పర్వతములనుగూడ చూచి కొంతకాలమునకు తిరిగి వచ్చి ఒంటరిగా తనరాక కెదురుచూచుచున్న రాజునకు నమస్కరించి ఆవనములోచూచినవిధమున జెప్పెను. శ్లో|| గతో೭హం కాననే శ్రీమన్! దూరం యత్నేన దుర్గమే! దృష్టం నై వ కిమప్యత్రమయామార్గం విచిన్వతా|| కిన్తు దూరే వనస్యాన్తే నదీ కాచిద్విలోకితా| అయ్యా! వెళ్లుటకు మిక్కిలికష్టమైన అరణ్యమున ప్రయత్న పూర్వకముగా దూరమువెళ్లితిని. మార్గమును వెతకుచున్న నా కేమియు నచ్చట గనబడలేదు. కాని దూరమున వనముచివర ఒకనది కనబడినది. శ్లో|| తస్యాస్తీరే೭తివిపులే శ్రీమత్తిల్లవనం ప్రభో!| తన్మ ధ్యేపుల్ల హేమాబ్జంమహత్తీర్థవరంశుభమ్|| ప్రభూ! అతివిశాలమైన దానియొడ్డున అందమైన తిల్లవనముగలదు. దానిమధ్య వికసించిన సువర్ణపద్మములుగల పవిత్రమైన గొప్పతీర్థశ్రేష్టము గలదు. శ్లో|| తద్దక్షిణతటే రమ్యే వ్యాఘ్రరూపకరాంఘ్రికః| కశ్చిదాస్తే మహాతేజాః నిద్రావిష్ట ఇవానిశమ్|| సుందరమైన దాని దక్షిణతీరమున పులివంటిచేతులు కాళ్లుగలిగి మహాతేజోవంతుడగువాడొకడు ఎల్లప్పుడు నిద్ర అవేశించినట్లుండును. శ్లో|| దృష్టే తస్మిన్మహాప్రాజ్ఞ! నివృత్తో೭ హం తతోభియా ఏతాని తత్ర దృష్టాని త్వదాజ్ఞావశవర్తినా|| మహాబుద్ధిమంతుడా! వానినిచూచినతోడనే భయముతో అక్కడనుండి మరలివచ్చితిని. నీయాజ్ఞననుసరించి నేనక్కడ వీనినిచూచితిని. శ్లో|| నిషాదస్య వచశ్ర్శుత్వా సింహవర్మాపి తత్షణాత్| ప్రీతచేతాస్సముత్థాయ తత్ర గన్తుం కృతోద్యమః|| వ్యాఘ్రరూపం తమేవాశు దర్శయేతి వనేచరమ్| ఉక్త్వా తద్గమనార్థాయ చూతమూలనివాసినమ్|| ప్రణిపత్య మ హేశానం సహ తేన వినిర్య¸°| కిరాతునిమాటవిని సింహవర్మ సంతుష్టచిత్తుడై వెంటనేలేచి అక్కడకు వెళ్లుటకు యత్నించి వ్యాఘ్రరూపముగల వానినే తొందరగా జూపుమని కిరాతునితోపలికి అక్కడకు వెళ్లుటకు మామిడిచెట్టుమొదటనున్న ఈశ్వరునకు నమస్కరించి కిరాతునితో కూడ బయలుదేరెను. శ్లో|| కిరాతో೭పి వనా న్తేన సృపమానీయ దూరతః| క్రమేణ ప్రాపయామాస రమ్యం తిల్లవనా న్తరమ్| కిరాతుడు రాజును వనముచివరనుండి దూరముగా తీసికొనివచ్చి క్రమముగా సుందరమైన తిల్లవనములోనికి తీసికొని వెళ్లెను. శ్లో|| సో೭పి తత్ర వనే దివ్యే తటాకస్య సమీపతః| దదర్శ తం తపస్యన్తం చిత్రార్పితమివానలమ్|| ఆరాజాదివ్యమైన వనమున చెరువుసమీపమున తపస్సు చేయుచు చిత్రపటములోని అగ్నివలెఉన్న వానిని జూచెను. శ్లో|| అథ దృష్ట్వా మహాభాగం భయవిహ్వలమానసః| సమీపం న గతస్తస్య న నివృత్తశ్చ తత్షణమ్|| é ఆమహాత్మునిజూచి భయముచే మనస్సుచలింపగా వానిదగ్గరకు వెళ్లలేదు. వెంటనే వెనుకకుమరలలేదు. శ్లో|| కస్త్వమిత్యత్ర పృచ్ఛామి యది శాపం తు దాస్యతి| ఇత్యనిశ్చితకర్తవ్యః కేవలం నిశ్చలః స్థితః|| నీవెవరనిఅడిగినచో శాపమిచ్చును. అని యేమిచేయవలెనో నిశ్చయముతేలక కేవలము నిశ్చలముగానుండెను. శ్లో|| స్థిత్వా చైవం చిరం తత్ర విస్మయాకులమానసః| పశ్యం స్తస్య వపుశ్శాన్తం పునశ్చిన్తాపరో೭భవత్|| చాలసేవచ్చటనట్లుండి మనస్సున నాశ్చర్యముజెంది శాన్తమైన వానిశరీరమును జూచుచు మరల ఆలోచనలోమునిగెను. శ్లో|| అస్యాసన్నకృతస్నావా మూర్తిరార్ద్రం చ వల్కలమ్| ఏతచ్చ కిఞ్చి పాలాశం పలాశం చ నవోచ్ఛృతమ్|| కుశానాం మూర్తిరార్ద్రైవ ముఞ్చన్తి సమిధోరసాన్| వీనిశరీరముకొలదిసమయమునకు పూర్వమే స్నానము చేయబడినది. నారబట్ట తడిగానున్నది. ఈఆకుపచ్చని మోదుగాకుకూడ క్రొత్తగా కోయబడినది. కుశల స్వరూపముగూడ తడిగానేయున్నది. సమిధలు రసమును విడుచుచున్నవి. శ్లో|| పుష్పాణ్యపచితాన్యద్య వ్యాకోచాని శ##నెశ్శనైః| జటాభారో೭పి ముక్తాభాఞ్జలబిన్దూన్విముఞ్చతి|| కోసినపువ్వులిప్పుడు మెల్లమెల్లగావిడుచుచున్నవి. జటలముడికూడ ముత్యములవంటి నీటిబిందువులను విడుచుచున్నది. శ్లో|| తస్మాత్ర్పవృత్తమాత్రో೭యం సమాధిస్తు మహాత్మనా| అద్యైవ పునరప్యేష మౌనం ముఞ్చేత వానవా|| కనుక ఈమహాత్ముడిప్పుడే సమాధిలో ప్రవేశించియుండును. ఇప్పుడే మరలనితడు మౌనమును విడుచునో విడువడో. శ్లో|| కింకరోమీతి చిన్తాభిర్డోలాయితమనాశ్చిరమ్| వినయేన భ##యేనాపి ప్రాణమత్తం తపోనిధిమ్|| ఏమిచేయుదును అని యాలోచనతో మనస్సు చిరకాలమూగులాడ వినయముతోడను భయముతోడను ఆతపోధనునకు నమస్కరించెను. శ్లో|| ప్రణిధాయ మహానన్దమయ మానన్దతాణ్డవమ్| విరరామ మహాయోగీ విశ్వవిజ్ఞానతత్పరః|| ఆమహాయోగి మహానందముతో నిండిన యానందతాండవమును ధ్యానముచేసి ప్రపంచజ్ఞానమందాసక్తిగలిగి విరమించెను. శ్లో|| అథేన్దుమౌలిపాదాబ్జచిన్తాస న్తతస క్తయా| విభేదం చత్రికాలస్య జానాతి స్మ ధియా భృశమ్|| మరియు శివుని పాదపద్మచింతనమందెల్లప్పుడు లగ్నమైన బుద్ధితో త్రికాలములభేదమునుగూడ బాగుగా తెలిసికొనుచుండెను. శ్లో|| గతస్య వర్తమానస్య కాలస్యాపి భవిష్యతః| స్థితిం విచిన్త్య చిత్తేన చిరం నిర్మలచేతనః|| కాలే ప్రవర్తమానే೭స్మిన్ నూర్యవంశసముద్భవః| మనోస్తు వఞ్చమశ్ర్శీమాన్ఫూమేరద్యహి శాసితా|| తస్య భూపస్యపుత్రాణాంత్రయాణామయమగ్రణీః| సింహవర్మేతి విఖ్యాత స్తం విదిత్వా తపోనిధిః|| పశ్యన్పురస్థితం భీతం కృతాంజలిపరిగ్రహమ్| స్వాగతం కిం తవాద్యేతి సంహవర్మాణమబ్రవీత్|| ఆతపోధనుడు నిర్మలచిత్తుడై భూతవర్తమానభవిష్యత్కాలములస్థితిని చిత్తములో చాలసేపాలోచించి 'ఈజరుగుచున్నకాలమున సూర్యవంశములో పుట్టిన మనువుకైదవవాడగు శ్రీమంతుడు భూమికి పాలకుడుగదా. ఆరాజుకుమారులు ముగ్గురలో నితడు పెద్దవాడు సింహవర్మయని ప్రఖ్యాతిచెందినవాడు' అని వానిని తెలిసికొని ఎదుట భయముతో దోసి లొగ్గియున్న సింహవర్మను నీకిపుడుస్వాగతమా? యని అడిగెను. శ్లో|| ఏవముక్తోమునీన్ద్రేణ సింహవర్మాచ సాదరః| పునః కృతానతి స్తసై#్మ ముదం చమహతీం దధౌ|| మునిపుంగవుడిట్లడుగ సింహవర్మ ఆదరముతో వానికి మరల నమస్కరించి ఎక్కువసంతోషమును పొందెను. శ్లో|| అవలమ్బ్యకరేణాథ మునిః కమలశోభినా| భూపమత్ర నిషీదేతి సన్నివేశ్యాసనా న్తికే|| ఆగతః కిం త్వమేకాకీ దుర్గమే೭స్మిన్వనా న్తరే| కారణం కథయ స్వేతి తమపృచ్ఛత్తపోనిధిః|| 56 పిమ్మట ముని తామరపువ్వువంటిచేతితో రాజునుపట్టుకొని 'ఇక్కడకూర్చుండుము' అని ఆసనసమీపమున కూర్చుండబెట్టి ప్రవేశించుటకు కష్టతరమైన ఈయరణ్యములో నీవు ఒంటరిగావచ్చితివేల? కారణము చెప్పుము, అని వానినడిగెను. ఇతి శ్రీ స్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే హిరణ్యవర్మతిల్లవనప్రాప్తిర్నామ ఏకవింశో೭ధ్యాయః --0--