Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu Chapters
అథ ద్వావింశో7ధ్యాయః
(సింహవర్మహిరణ్యవర్మయగుట)
శ్లో|| స వ్యాఘ్రాఙ్ఘ్రిమహర్షయే స్వచరితంసర్వం నివేద్యాత్మనః|
సైంహేఙ్గే విజుగుప్సయా స్వపదవీత్యాగం చ రాష్ట్రేకృతమ్|
తేన వ్యాఘ్రపదానుమన్త్ర్య మునినా శేషేణ తాభ్యామథో
ఈశోక్త్యాశివగఙ్గికామ్భసికృతస్నానాద్ధిరణ్యాకృతిః||
ఆసింహవర్మ వ్యాఘ్రసాదమహర్షికి తనచరిత్రనంతను, సింహశరీరమందేవగింపుచే రాష్టములో తానుజేసిన పదనీత్యాగమును తెలిపి ఆతనితోడను మునియైనశేషునితోడను ఆలోచించి పిమ్మట ఈశ్వరునిమాటచే శివగంగికాజలములో స్నానముచేయటవలన బంగారపురంగుగలవాడయ్యెను.
సింహవర్మా :
శ్లో|| ప్రథమో గౌడనాథస్య రాజ్ఞః సూసురహం మునే|
మమ ద్వౌ మహితౌ ప్రాజ్ఞావనుజౌ పుణ్యలక్షణౌ||
సింహవర్మ :
మూనీ! నేను రాజగు గౌడనాథుని మొదటికుమారుడను. నాకు బుద్ధిమంతులు, పూజ్యులు, శుభలక్షణములు గల వారుఇద్దరు తమ్ములుగలరు.
శ్లో|| త్వత్కటాక్షేణ తం ముక్త్వా భవబన్ధం భయఙ్కరమ్|
ప్రాప్తుమీశపదామ్భోజం పరమానన్దదాయకమ్||
రాజ్యభారస్య దుఃఖాని త్యక్త్వా సర్వాణి చేతసా||
నిర్గతో೭హం తపః కర్తుమేకాకీ మునిపుఙ్గవ||
నీయనుగ్రహముచే భయంకరమైన యాసంసారబంధమును విడచి పరమాసందమునిచ్చునట్టి యీశ్వరుని పాదపద్మమును పొందుటకు మనస్సుతో రాజ్యభారముయొక్క దుఃఖములనన్నిటిని విడచి తపస్సుచేయుటకు నేను ఒంటరిగా బయలు దేరితిని.
శ్లో|| సింహవర్మవచశ్ర్శుత్వా వ్యాఘ్రపాదో మహామునిః|
విషణ్ణో విస్మితోభూత్వావ్యాజహార నృపాత్మజమ్||
సింహవర్మమాటవిని మహామునియైన వ్యాఘ్రపాదుడు విచారించి ఆశ్చర్యపడి రాజకుమారునితో పలికెను,
వ్యాఘ్రపాదుః :
శ్లో|| ధర్మతో రాజ్యభారస్య ధారకో7సి మహామతే|
పితా చ తే జరావిష్టోనై వ హన్తుం క్షణఃపరాన్||
వ్యాఘ్రపాదుడు :
మహామతీ! ధర్మానుసారముగా రాజ్యభారమును భరింపవలసినవాడవైయుంటివి. నీతండ్రిని ముసలితసమావేశించినది. శత్రువులను చంపలేడు.
శ్లో|| ఏవంస్థితే పరిత్యజ్య సర్వం నిస్పృహచేతసః|
తపశ్చర్యా వనా న్తే తే యుక్తం న ప్రతిభాతి మే||
ఇట్లుండగా నీవు కోరికలులేక సమస్తమును విడచి అడవిలో తపస్సుచేయుట ధర్మముగా నాకు తోచుటలేదు.
సింహవర్మా :
శ్లో|| రాజ్యం నై వాహమర్హామి సింహరూపధరో మునే!|
తస్మాద్రాజ్యే నమేవాంఛా న చ రాజ్యభ##రే೭ధువా||
సింహవర్మ :
మూనీ! సింహరూపముగల నేను రాజ్యమునకర్హుడనుగాను. కనుక నాకిపుడు రాజ్యమందును కోరికలేదు. రాజ్యభారమందును లేదు.
శ్లో|| కిస్తు నాకం గతే తాతే మమ భూమిధురంధరే|
అస్మద్రాజ్యస్య రక్షాయై దక్షావేవ మమానుజౌ||
భూభారమును మోయగల నాతండ్రి స్వర్గమునకు వెళ్లినపిమ్మట మారాజ్యమును రక్షించుటకు నాతమ్ములు సమర్దులే.
శ్లో|| తస్మాదద్య కృపాధార! విశ్వక్లేశవినాశక!|
కేవలం మమ రక్షాయై కారుణ్యం కురుసువ్రత!||
కనుక దయకాధారమైనవాడా! అందరిక్లేశమును బోగొట్టువాడా! సువ్రత! కేవలమిపుడు నారక్షణముకొరకు దయజూపుము.
శ్లో|| వ్యాఘ్రపాదో వచశ్శ్రుత్వా సదయం మునిపుఙ్గవః|
ముక్తో7యం సింహరూపేణ యది సద్యో నృపాత్మజః ||
పసుధాం బాహువీర్యేణ సకలాం పాలయిష్యతి|
మునిపుంగవుడైన వ్యాఘ్రపాదుడు దయతో ఆ మాటనువిని ఈరాజకుమారుడు వెంటనే సింహరూపము పోయిన యెడఅ బాహుపరాక్రమముతో భూమినంతను పాలించును.
శ్లో|| అద్య మే సింహరూపత్వాన్మహీవాంఛీ మునీశ్వర!
అద్య నా స్తీత్యనేనో క్తం వ్యక్తమేవ సుదుఃఖినా||
మునీశ్వర! ఇప్పుడునాకు సింహరూపముగలదుకనుక భూమియందుకోరిక ఇప్పుడులేదు. అని దుఃకముతో స్పష్టముగా చెప్పెను.
శ్లో|| యది కిన్తు నటేశో7యమస్య రక్షాం కరిష్యతి|
సర్వాణి శివకార్యాణి కర్తుం యోగ్యో భ##వేదయమ్||
కాని ఈనటేశుడు వీనిని రక్షించినయెడల ఇతడన్నియు మంచి కార్యములు చేయుటకు తగినవాడగును.
శ్లో|| విభావ్యైవం చిరం చిత్తే శివజ్ఞానైకతత్పరే|
అత్రాస్వ క్షణమిత్యుక్త్వా భూపం ప్రాప తదా శ్రమమ్||
యత్రాస్తే భగవాన్ప్రీతః పతజ్ఞలిమహామునిః|
సీమా దురవగాహయ్స శబ్దామ్భోధేరనుత్తమః|
ఈవిధముగా శివజ్ఞానమందే కేవలము లగ్నమైన చిత్తమున చాలసేపు ఆలోచించి క్షణకాలమిక్కడనుండుమని రాజుతో పలికి ప్రవేశింపశక్యముకాని శబ్దసముద్రమునకు సరిహద్దు, ఉత్తముడునగు పతంజలిముని ప్రీతుడైయున్న యాశ్రమమునకేగెను.
శ్లో|| తత్సమీపం సమాగత్య వ్యాఘ్రపాదమునిర్ముదా|
విస్తరాదాగమం తసై#్మ తస్యరాజ్ఞోన్యవేదయత్||
వ్యాఘ్రపాదముని వానిసమీపమునకు వచ్చిసంతోషముతో ఆరాజురాకను విస్తరముగా వానికి విన్నవించెను.
శ్లో|| సో7పి తస్య వచశ్శ్రుత్వా తేన సాకం పతఞ్జలిః|
సేవావసరమాలోక్య నటేశస్యాన్తికం య¸°||
ఆపతంజలియు వానిమాటవిని వానితో కూడ సేవాకాలముచూచి నటేశునిదగ్గరకు వెళ్లెను.
శ్లో|| అథ తస్మిన్గతే సద్యః సింహవర్మా మహీపతిః|
వివేశ మహతీం చిన్తాం పరిశూన్యేన చేతసా||
వ్యాఘ్రపాదుడు వెళ్లినపిమ్మట వెంటనే రాజగు సింహవర్మ శూన్యచిత్తముతో ఎక్కువ విచారమునుపొందెను.
శ్లో|| అవిజ్ఞాతప్రవృత్తస్య సర్వగస్య నిరన్తరమ్|
స్వేచ్ఛయా హ్యన్యథా కర్తుం కస్సమర్ధో విధేర్బలమ్||
అద్యదృష్టో మునీన్ద్రో7పి గతఏవ వనాన్తరమ్|
ముందు తకెలికుండజరుగునది. ఎల్లప్పుడు అంతటఉండునదియునగు విధియొక్క బలమును తనకోరిక ప్రకారమెవడు మార్చగలడు? ఇప్పుడు కనబడిన మునీశ్వరుడుకూడ అడవిలోనికి వెళ్లిపోయెను.
శ్లో|| కిం కరోమీతి నిర్విణ్ణః ఖిద్యమానేన చేతసా|
అధ్యాసిష్టాశ్రమతరోరసహాయస్త్వధో నృపః||
ఏమిచేయుదునని నిరాశ##చెంది విచారముతో కూడిన చిత్తముతో రాజు ఒంటిరిగా ఆశ్రమవృక్షముక్రింద కూర్చుండెను.
శ్లో|| అథతౌతాణ్డవసుధారససన్తుష్టమానసౌ|
ఆవేదితే నరేన్ద్రస్య ఆగమే సింహవర్మణః||
న విద్మో నటరాజోసై#్మ ప్రసీదేత్కుప్యతీతి వా|
యావన్ని వేదయిష్యావో నటేశాయ తదాగమమ్||
ఇతి నిశ్చిత్యతౌ చిత్తే దేవదేవం ప్రణమతుః|
పిమ్మట వ్యాఘ్రపాదపతంజలులిద్దరు తాండవామృత రసముచే మనస్సున సంతోషించి రాజగు సింహవర్మయొక్క రాకను తెలిపినచో నటరాజు వీనిననుగ్రహించునో కోపించునో ఎరుగము. నటేశునకు వానిరాకవరకు అంతయు విన్న వింతము. అని చిత్తమున నిశ్చంచి వారిద్దరు దేవదేవునకు నమస్కరంచి.
శ్లో|| కరుణార్ద్రవపుస్తుత్వా కాలజ్ఞావృగ్భిరీశ్వరమ్|
వృత్తం తస్య నటేశాయ తౌవ్యజ్ఞాపయతాముభౌ||
దయతోనిండిన శరీరముగలవారు, సమయము తెలిసిన వారునగు వారిద్దరు ఈశ్వరుని స్తుతించి ఆరాజుచరిత్రను నటేశునకు విన్నవించిరి.
మునీ :
శ్లో|| ప్రసీద దేవదేవేశ! పార్థివః పఞ్చమో మనోః|
సింహవర్మా తపఃకర్తుమయాసీదస్మదాశ్రమమ్||
దయయా తాణ్డవం తసై#్మ దర్శయిత్వా మహేశ్వర! |
సింహత్వమపనీయైనం త్రాయస్వేతి ప్రణమతుః||
మునులు :
దేవదేవ! మహేశ్వర! అనుగ్రహింపుము. మనువునకై దవరాజగు సింహవర్మ తపస్సుచేయుటకు మాయాశ్రమమునకు వచ్చెను. దయతో వానికి తాణ్డవమును జూపి సింహరూపమును బోగొట్టి వానిని రక్షింపుమని నమస్కరించిరి.
శ్లో|| ఏతదాకర్ణ్య భగవానిన్దుమౌలిర్దయానిధిః |
ప్రోవాచ మునిశార్దూలౌ ప్రౌఢగమ్భీరయా గిరా||
ఇదివిని భగవంతుడు, దయాసముద్రుడునగు చంద్రశేఖరుడు ప్రౌఢము, గంభీరమునైన వాక్కుతో మునిశ్రేష్ఠులనుగూర్చి పలికెను.
శ్రీ మహేశ్వరః :
శ్లో|| జానే సమాగతం తస్య తావకం చ మనీషితమ్|
తదద్యైవ కరిష్యామి తస్య వామపి యద్ధితమ్||
ఈశ్వరుడు:
వానిరాకను మీకోరికనుగూడ నెరుగుదును. కనుక వానికిని మీకునుగూడ ఇష్టమునిప్పుడే చేయుదురు.
శ్లో|| తస్మిం స్తీర్థవరే రమ్యే శివగఙ్గావరాభిధే|
సంస్నాప్యసింహశర్మాణమానయత్వంమద న్తికమ్|
అతఃపరం విచిత్రాయామచ్ఛక్తేర్దృశ్యతాం గతిః|
నీవు సింహవర్మను శివగంగయని శ్రేష్ఠమైనపేరుగల ఆతీర్థశ్రేష్ఠమున స్నానముచేయించి నాదగ్గరకు తీసికొనిరమ్ము. అటుపిమ్మట విచిత్రమైన నాశక్తియొక్క నడకను చూడుము.
శ్లో|| మాధ్యందినిమితి ప్రౌఢమాదిదేశ మహేశ్వరః|
తతస్స పరమప్రీతః పతంజలీసమన్వితః||
జగామ సత్వరం తస్య సమీపం సింహవర్మణః|
అనియిట్లు మహేశ్వరుడు వ్యాఘ్రపాదుని గట్టిగా నాజ్ఞాపించెను. పిమ్మట నతడు మిక్కిలిసంతసించి పతంజలితో కూడ తొంతరగా నాసింహవర్మదగ్గరకు వెళ్ళెను.
శ్లో|| అత్రా న్తరే నిమిత్తాని శుభాన్యాసన్మహీక్షితః|
తాని దృష్ట్వా స సంప్రీతః పశ్యన్నాస్తాగమంమునేః||
ఇంతలో రాజునకు శుభశకునములు కనబడినవి వానిని జూచి యతడు ప్రీతిజెంది మునిరాకను నిరీక్షించుచుండెను.,
శ్లో|| తతః ప్రసన్నమనసౌ తావాగత్య మునీశ్వరౌ|
ధన్యో7పీతి మహాభాగం సింహవర్మాణమాహతుః||
పిమ్మట ప్రసన్నమనస్కులై ఆమునులిద్దరువచ్చి మహాత్ముడైన సింహవర్మనుగూర్చి ధన్యుడవైతివని పలికిరి.
శ్లో|| సింహవర్మన్మహారాజ! శృణు దేవ దయామితః|
హరిబ్రహ్మాదిదేవానామావయోశ్చాతిదుర్లభమ్||
ఆనన్దతాణ్డవం తుభ్యం దర్శయిష్యతి శఙ్కరః||
సింహవర్మమహారాజ! దేవునిదయను మావలనవినుము. హరిబ్రహ్మాదిదేవతలకును, మాకును దుర్లభ##మైన యానందతాండవమును శంకరుడు నీకుచూపును.
శ్లో|| తత్త్వం తీర్థవరే హ్యస్మిన్సివగఙ్గాభిధే ద్రుతమ్|
స్నాత్వా పశ్య సభాధీశపాదాబ్జంతాండవోజ్జ్వలమ్||
దుశ్చరన్తు తపఃకృత్వాయదాప్నోషి తదాప్నుహి|
కనుక నీవు తొందరగా శివగంగయనుపేరుగల ఈతీర్థశ్రేష్ఠమున స్నానముచేసి తాండవముచేప్రకాశించు సభాపతి పాదపద్మమును జూడుము, ఆచరింపశక్యముకాని తపస్సునాచరించి దేనినిపొందుదువో దానినిపొందుము.
శ్లో|| ఇతి తద్వచనం శ్రుత్వా రాజా విస్మయమానసః|
ప్రశస్య తత్సఙ్గఫలం స్నాతుం తీర్థమవాతరత్||
ఈవిధముగా వారిమాటను విని రాజు మనస్సున నాశ్చర్యపడి సత్పరుషులసాంగత్యమువలన ఫలమును పొగడి స్నానముచేయుటకు తీర్థములోదిగెను.
శ్లో|| మమజ్జ శివగంగాభస్యసౌ సింహవపుర్నృపః|
ఉన్మమజ్జస్ఫురత్కాన్తిర్దధౌ దేహంహిరణ్మయమ్||
సింహశరీరముతో నున్న ఈ రాజు శివగంగలో మునిగి బంగారుశరీరమును ధరించి ప్రకాశించుకాంతితో తేలెను.
శ్లో|| శివగంగాంభస స్తస్మాదున్మజ్జన్స మహీపతిః|
మహార్ణపజలాదుద్యద్బాలాదిత్య ఇవాబభౌ||
ఆశివగంగనీటనుండిలేచురాజు మహాసముద్రపునీటినుండి ఉదయించు సూర్యుడువలె ప్రకాశించెను.
శ్లో|| హిరణ్మయవుపుచ్ఛాయం తం దృష్ట్వా మునయస్సురాః|
తతో హిరణ్యవర్మేతి నామ తస్యాభిచక్రిరే|| 39 1/2
బంగారపు శరీరచ్చాయగల వానినిజూచి మునులు దేవతలు తరువాత వానికి హిరణ్యవర్మయని పేరుపెట్టిరి.
ఇతి శ్రీ స్కాన్దే మహాపురాణ సనత్కుమారసహితాయాం
శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే
హిరణ్యవర్మవరలాభోనామ ద్వావింశో7ధ్యాయః
-0-