Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu
Chapters
అథ చతుర్వింశో7ధ్యాయః (త్రిసహస్రమునీశ్వరులు తిరిగిచిదంబరముచేరుట) శ్లో|| అత్త్రెవేక్షితాణ్డవేన ముదితః శ్రీసౌనకః సూత్రకృత్ ఆసీజ్జై మినిరాతనోదిహవరం శ్రీవేదపాదస్తవమ్|| అహూతో నృప అగతేన పురమాగన్తుం వసి ష్ఠేనసః| వ్యాఘ్రాం ఘ్రేర్వచసా న్యవర్తయదసౌ గఙ్గాతటాదీక్షితాన్|| ఇక్కడే తాండవమునుచూచి సంతోషంచి శ్రీశౌనకుడు సూత్రక ర్తమయ్యెను. ఇక్కడజైమిని శ్రేష్టమైన వేదపాద స్తవమును చేసెను. వసిష్ఠుడువచ్చి పురుమునకు రమ్మని రాజును పిలువగా సతడు వ్యాఘ్రపాదుని మాటచే వెళ్లి గంగఒడ్డునుండి దీక్షితులను మరల తెచ్చెను. వ్యాఘ్రపాదః : శ్లో|| కిఞ్చ తే కథయిష్యామి స్థానస్యాస్య చవై భవమ్ ఇతిహాసపురాణషు శ్రూయమాణం పునఃపునః|| వ్యాగ్రపాదుడు : మరియు ఇతిహాసపురాణములలో మరలమరల వినబడుచున్న ఈస్థానముయొక్క వైభవమును నీకు చెప్పెదను. శ్లో|| అస్తిశౌనక ఇత్తుక్తో భృగుణామగ్రిణీర్మునిః | యముద్దిశ్య సమూద్బూతా శ్రూయతే భారతీకథా|| భృగువులలో శ్రేష్ఠుడటగు శౌనకుడను ముని గలడు వానినిగూర్చి భారతకథ వినబడుచున్నది. శ్లో|| స కదాచిత్పరిజ్ఞానపరిపూర్ణశిలాదజమ్| పప్రచ్ఛార్థమిదం నత్వా పర్యాయపరమేశ్వరమ్| అతడొక్పపుడు రెండువపరమేశ్వరుడు జ్ఞానుముతో పరిపూర్ణుడనగు నందికేశ్వరునకు నమస్కరించి ఈవిషమమునడిగెను. శౌనకః : శ్లో|| తాణ్డవం తనుతే శమ్భుః సర్వమంగలయా సహ| జగతాముపకారాయ త్రిసన్ధ్యమితి మిశ్రుతమ్|| శౌనకుడు : శివుడు సర్వమంగళతో కూడ లోకముల ఉపకారము కొరకు మూడూసంధ్యాకాలములందు తాండవము చేయుచున్నాడని వింటిని. శ్లో|| దివి వా భువి వా తత్తు పర్వతే వా జలే7పి వా| వనేవోపవనే వాపి తథా పితృవనే7పివా|| మణ్డలే చణ్డభానోర్వా బిమ్బే వా శితరోచిషః స్థానేష్వేతేషు భౌమేషు కుత్ర దృశ్యేత తాణ్డివమ్|| అది ఆకాశమందా భూమిమూదనా? పర్వతముమీదనా? నీటియందా? అడవియందా? తోటలోనా? లేక శ్మశానమందా? సూర్యమండలమందా? చంద్రబింబమందా? ఈస్థానములలోగాని భూమియందితర స్థానములలోగాని ఎచ్చట తాండవము కనబడును. శ్లో|| ఇతి పృష్టస్సమునినా శైలాదిశ్శఙ్కరప్రియః| ప్రహర్షమతులం ప్రాప్య శౌనకం తమభాషత|| అని మునియడుగగా శంకరునకిష్టుడగు నంది మిక్కిలి సంతసించి ఆశౌనకునితో పలికెను. నన్దికేశ్వరః : శ్లో|| కైలాసే సర్వదా దేవః తాణ్డవం తనుతే మునే! | కేవలం తముమాదేవీ పశ్యత్యన్యో న పశ్యతి|| నందికేశ్వరుడు : మునీ! దేవుడెల్లప్పుడు కైలాసమున తాండవము చేయును. దానినుమాదేవిమాత్రము చూచును. ఇతరుడు చూడలేడు. శ్లో|| పుణ్డరీకపురేకిన్తు భగవాననిశం శివః | శ్రీమద్దభ్రసబామధ్యే తనోత్యానన్దతాణ్డవమ్|| కాని పుండరీకపురమున శ్రీదభ్రసభమధ్యలో భగవంతుడగు శివుడెల్లప్పుడు ఆనందతాండవము చేయును. శ్లో|| కై లాసే విహితం యత్తు నృత్తంకాలస్య వైరిణా| కాత్యాయన్యైకయా దృష్టం కాదాచిత్కం చ తం విదుః || కైలాసమున శివుడచేసిన నృత్తమును పార్వతియొక్కతేయే చూచును. అదియను ఒకప్పుడే జరగును అని యందురు. శ్లో|| యత్తు హేమసభామధ్యే రచితం చన్ద్రమౌలినా| తత్సనాతనమిత్యాహుః సర్వదృశ్యం చ శౌనక! || శౌనక! చంద్రశేఖరుడు కనకసభలో చేసినది మాత్రము సనాతనము, అందరుచూడదగినది యందురు. శ్లో|| దిదృక్షా తవ యద్యస్తి తత్ర త్వం గన్తుమర్హసి| నాపరం శివగఙ్గాయాః తీర్థం స్థానం చిదమ్బరాత్|| నీకు చూడగోరికయున్నయెడల నీవక్కడకు వెళ్లుము. శివగంగకంటె ఉత్తమమైన తీర్థములేదు. చిదంబరముకంటె ఉత్తమక్షత్రములేదు. శ్లో|| తన్మన్త్రాపరో మన్త్రః నా స్తిదేవోనటేశ్వరాత్| తదాలోక్యాప్నుహి ఫలం చార్మణసై#్యవచక్షుషః|| వానిని మంత్రముకంటె గొప్పమంత్రము లేదు. నటేశ్వరునికంటె గొప్పదేవుడు లేడు. నటేశ్వరునికంటె గొప్పదేవుడు లేడు. దానిని చూచి చర్మచక్షస్సులకు గూడ ఫలమును పొందుము. శ్లో|| ఇత్యుక్తో యోగివర్యేణ శౌనకో మునిసత్తమః| ఏతత్తిల్లవనం రాజన్! సత్వరం ప్రాపపావనమ్|| రాజా! ఈవిధముగా యోగిశ్రేష్ఠుడైన నందికేశ్వరుడు చెప్పగా మునిపుంగవుడైన శౌనకుడు వెంటనే పావనమైన ఈతిల్లవనమునకు చేరెను. శ్లో|| అత్ర స్నాత్వా మహాతీర్థే శివగఙ్గాభిధానకే| చికార దుష్కరతరం తపస్తాణ్డవదర్శనాత్|| ఇక్కడ శివగంగయను మహాతీర్థమున స్నానముచేసి తాండవదర్శమునకై మిక్కిలి దుష్కరమైన తపస్సు చేసెను. శ్లో|| సంవత్సరాన్తే బగవాన్ తసై#్మ కారుణ్యసాగరః| దర్శయామాస మునయేశ్రీముత్తాణ్డవమద్భుతమ్|| సంవత్సరాంతమున కారుణ్యసముద్రుడగు భగవంతుడామునికద్భుతమైన తాండవమును జూపెను. శ్లో|| స దృష్ట్వా పరమానన్దమయమానన్దతాణ్డవమ్| స్వయం ననర్తహర్షేణ పులకాఞ్చితవిగ్రహః|| అతడు పరమానందమయమైన తాండవమును జూచి శరీరముపులకరింప సంతోషముతో తాను నృత్తము చేసెను. శ్లో|| అనన్దాశ్రుపరిక్లిన్నదృష్టిర్విరచితాఞ్జిలిః| తుష్టావ ఋగ్భిర్భగవాన్ స్తుత్యంసుమనసాంగణౖః || ఆనందాశ్రువులతో తడిసిన కన్నులుగలవాడై దోసిలొగ్గి దేవతాసమూహములకు స్తుతింపదగిన పరమేశ్వరుని ఆపూజ్యుడు ఋక్కులతో స్తుతించెను. శ్లో|| స్తుత్యన్తే భగవాన్ శమ్భుః దదౌ తసై#్మ వరద్వయమ్| బహ్వృచామాధిపత్యం చ ఋక్శాఖాసూత్ర కారితామ్|| స్తుతించినపిమ్మట భగవంతుడగు శివుడు బహ్వృచుల కాధిపత్యము, ఋక్శాఖాసూత్రకర్తృత్వము అను రెంéడువరముల నాతనికిచ్చెను. శ్లో|| వరద్వయం చ లభ్ద్వైవం మహేశాన్మునిపుఙ్వవః| అసిష్టాత్ర చిరేణాత్ర శాస్త్రచర్చాంచకార హి|| మునిపుంగవుడు మహేశ్వరునివలన నీవిధముగా రెండు వరములను పొంది ఇచ్చట చిరకాలముండి శాస్త్రచర్చచేసెను. శ్లో|| ఏవమస్య మహాభాగ! స్థానస్యాస్య హివైభవమ్ పునర్నిబోధ మహాత్మ్యం పుణ్డరీకపురస్య తు|| మహాత్మా! ఈస్థానముయొక్క వైభవమిట్టిది. మరల పుండరీకపురముయొక్క మహాత్మ్యమును వినుము. శ్లో|| కదాచిజ్జై మినిమునిః కర్మకాండప్రవర్తకః| సామ్నాం సహస్కశాఖానాం పారదృశ్యా మహామతిః|| అకర్ణ్య వైభవం శ్రీమాన్ స్థానస్యాస్య మహాద్భుతమ్ || శిషై#్యస్సహ సమాగమ్య తిల్లారణ్యమిదం మహత్|| శితలే శివగఙ్గాయాః స్నాత్వా పాథసి పావనే| దృష్ట్వా చిదమ్బరం దివ్యం దేవంసపూజ్యభక్తితః|| తురీయపాదశ్రుతిభిః స్తోత్రైః స్తుత్వా నటేశ్వరమ్| సంప్రాప్యసర్వకామో7సౌగాణాపత్యమవాప్తవాన్|| కర్మకాండను ప్రవర్తింపజేసినవాడు, సామవేదము యొక్క వేయిశాఖలతుదిచూచినవాడు మహాబుద్ధిమంతుడునగు జైమినిముని యొకప్పుడు ఈస్థానముయొక్క మహాద్భుతమైన వైభవమును విని శిష్యులతోకూడ ఈగొప్పతిల్లా రణ్యమునకువచ్చి పవిత్రమైన చల్లనైన శివగంగనీటిలో స్నానముచేసి దివ్యమైన చిదంబరమును చూచి దేవుని భక్తితో పూజించి నాల్గవపాదములందు వేదవాక్యముగల స్తోత్రములతో నటేశ్వరుని స్తుతించి అన్నికోరికలను పొంది యతడు గణాధిపత్యమును పొందెను. శ్లో|| సామగానప్రియస్యాస్య శమ్భోరానన్దతాణ్డవమ్| అత్యన్తపశ్చాద్భాగస్సన్నాద్యాప్యాలోకతే మునిః|| సామగానమందు ప్రీతిగల ఈ శివునియొక్క ఆనందతాండవమును ముని మిక్కిలి వెనుకభాగముననుండి ఇప్పిటికిని చూచుచుండెను. శ్లో|| సర్వే వసిష్ఠప్రముఖాః మునయో నారదాదయః| పరోక్షఫలమదాయీని త్యక్త్వా స్థానాని భూతలే| సదా వసన్తి చాక్షుప్యే శఙ్కరానన్దతాణ్డవే| ముక్తిదే దృష్టమాత్రణ స్థానే7స్మిన్మునిపుఙ్గవాః|| విసిష్ఠుడు, నారదుడు మొదలుగు మునులందరు భూమియందు పరోక్షమున ఫలమునిచ్చు స్థానములను విడచి కన్నులకుగనబడు శంకరానందతాడవముగలది, చూచినమాత్రమున మోక్షమునిచ్చునదియునగు నీస్థానముననెల్లప్పుడు నివసించెదరు. శ్లో|| అపి చాకర్ణయాస్మాకమత్రాగమనకారణమ్| అలభ్యస్య చ సింసిద్ధిమావాసాభిరతిం తథా|| మరియు మేమిక్కడకువచ్చుటకు కారణమును. లభ్యముకానిసిద్ధి లభించుటను, నివాసమందు కోరికను వినుము. శ్లో|| మాధ్యందినేన పిత్రాహం సమాదిష్టో మహీపతే!| అత్ర తిల్లవనారణ్య కృత్వోటజమనాకులః || తపస్యన్ సతతం ప్రీతో న్యవసంవత్సరాన్బహున్| అత్రాద్భుతాని వసతో మమ జాతాన్యనేకశః|| రాజా! తండ్రియగు మధ్యందినునిచే ఆజ్ఞపింపబడి నేనీ తిల్లవనమున పర్ణశాలను నిర్మించుకొని తొట్రుపడక ఎల్లప్పుడు తపస్సచేయుచు ప్రీతితో విడువక చాలసంవత్సరములు నివసించితిని. నేనిక్కడ నిసించుచుండగా చాల అద్భుతములు జరిగినవి. శ్లో|| చరితానినతానీహ సంఖ్యాతుం శక్నుమోవయామ్| ఏతావన్త్యేవ వాచ్యాని జిజ్ఞాసోస్తే మయా నృప!|| రాజా! ఆచరిత్రలను మనము లెక్క పెట్టలేము. తెలిసి కొనదలచిన నీకు నేను చెప్పదగినవివియే. శ్లో|| ఇత ఏవ తపశ్చారు ఇతో వై యాఘ్రపాదతా| ఇతో హి దాస్వీకారః ఇతః పుత్రాప్తిరేవ చ|| ఇత ఏవ మహాదేవః తసై#్మ క్షీరాభ్ది మానయత్| ఇతో హి దేవకీసూనుముపమన్యురదీక్షయాత్|| ఇక్కడనే మంచితపస్సు చేసితిని. ఇక్కడనే వ్యాఘ్రపాదుడనైతిని ఇక్కడనే వివాహము జహిగినది. ఇక్కడనే పుత్రుడు కలిగెను. ఇక్కడనే మహాదేవుడు వానికొరకు పాలసముద్రమును రప్పించెను, ఇక్కడనే ఉపమన్యుడు కృష్ణునకు దీక్షనిచ్చెను. శ్లో|| ఇతశ్శివాగమార్థాంశ్చ స కృష్ణో7బోధి తన్ముఖాత్| ఇతో హి మూలస్థానేశపూజనాత్సర్వసిద్ధయః|| ఇక్కడనే ఉపమన్యునుండి కృష్ణుడు శైవాగమవిషయములను తెలికొనెను. ఇక్కడనే మూలస్థానేశ్వరుని పూజించుటవలన సర్వసిద్ధులు కలిగెను. శ్లో|| ఇతో మునీనాం సర్వేషాం సమాగమమహోత్సవః | ఇతశ్చ దృష్టో భగవానీశబ క్తః పతఞ్జలిః|| మునులందరితో కలిసికొను ఉత్సవమిక్కడనే జరిగెను. పూజ్యుడు, ఈశ్వరభక్తుడనగు పతంజలి ఇచ్చటనే కనబడెను. శ్లో|| ఇతో విష్ణువిరిఞ్చాదిదుర్లభం తాణ్డవామృతమ్| అవామపాయయచ్ఛమ్భురన్యతృష్టానవిర్తనమ్|| బ్రహ్మ, విష్ణువు మొదలగువారికి దుర్బభ##మైనది, ఇతరమైనదప్పికలను పోగొటునదియునగు తాండవామృతమును శివుడు మాకిక్కడే త్రాగించెను. శ్లో|| ఇతశ్చ దేవశ్రీకార్యధురీణస్య మహాత్మనః | దర్శనం తవ సంజాతమస్మాకం సింహవర్మణః|| ఇక్కడ దేవకార్యములు నెరవేర్చుటకు సమర్థుడవు' మహాత్ముడవు, సింహవర్మవునగు నీదర్శనము మాకులభించినది. శ్లో|| ఇతశ్చ తాణ్డవేశస్య ప్రసాదాత్తవ భూమిప!| దుర్ఘటనస్యయోతోజాతోదుర్ఘటశ్రేయసో7న్వయః|| రాజా! ఇక్కడ దుర్ఘటమైన నటేశుని యనుగ్రహము వలన నీకు దుర్లభ##మైన శ్రేయస్సు కలిగినది. శ్లో|| శ్రీమద్ధిరణ్యవర్మత్వం శివగంగాప్రబావతః| కేనేదం వర్ణ్యతే తీర్థం శివగఙ్గాభిధానకమ్| శివగంగాప్రభావమువలన హిరణ్య వ్రమవైతివి. కనుక శివగంగయనునీతీర్థము నెవరువర్ణింపగలరు? శ్లో|| అన్యాని యాని స న్తీహ స్థానస్యాస్య విశాంపతే!| వైభవాని న శక్నోమి వక్తుం వవర్షశ##తై రపి|| రాజా! ఈస్తానమునకున్న ఇతరవైభవములను నూరు సంవత్సరములకైనను చెప్పలేను. శ్లో|| భూమైశ్రేష్ఠతమం స్థానంస్థానా త్తీర్ధంమహా త్తరమ్|| తీర్థాచిచితమ్బరం శ్రేష్ఠం శ్రేష్ఠోమ న్త్రశ్చిదమ్బరాత్|| భూమిలోనిది శ్రేష్ఠమైనస్థానము. స్థానముకంటె తీర్థమింకను గొప్పది, తీర్థముకంటె చిదంబరము గొప్పది. చిదంబరముకంటె మంత్రము శ్రేష్ఠమైనది. శ్లే|| మన్త్రాన్మ హేశ్వరో దేవో మహాదేవో మహానటః| దేవాచ్ఛ్రేష్ఠతమ స్తస్య శ్రీమత్తాణ్డవభూషితః|| భవామ్భోధిమహాపోతః పాదః పద్మారుణ్చవిః| తస్య దర్శనమాత్రేణ సకృత్పాపీ చ ముచ్యతే|| కింపునస్సుకృతీ క్షేత్రవాసీ నిత్యనిరీక్షకః| మంత్రముకంటె మహాదేవుడు, మహానటుడునగు మహేశ్వరుడు శ్రేష్ఠుడు. దేవునికంటె తాండవభూషితమైనది. సంసారసాగరముదాటుటకు పెద్ద ఓడవంటిది, పద్మమువలె ఎఱ్ఱనికాంతిగలదియునగు శ్రీయుతపాదము శ్రేష్ఠము. ఒకసారి దానిని చూచినమాత్రమున పాపికూడ ముక్తుడగును. క్షత్రమందు నివసించుచు నిత్యముచూచున్న ధన్యునివిషషయము చెప్పనేల? సూతః : శ్లో|| ఇదమాధ్యన్దినేస్సర్వంమహాత్మ్యం హేమసంపదః|| ఆకర్ణయతి భూపే ఖాత్తేజోరాశిరవాతరత్|| సూతుడు : ఈ విధముగా రాజు వ్యాఘ్రపాదునినుండి కనుకసభయొక్క మహాత్మ్యమునంతను వినుచుండగా నాకాశము నుండి తేజోరాశిదిగెను. శ్లో|| సర్వే నిమీల్య చక్షూంషి పునరున్మీల్యయత్నతః| కిమిదం కిమిదం తేజః ఇత్యన్యోన్యం బభాషిరే|| అందరు కన్నులు మూసికొని మరల ప్రయుత్నముతో తెరచి ఏమిదిటయేమిదేతేజస్సని ఒకరితో నొకరు పలికిరి. శ్లో|| అత్రానతరే భూవో7భ్యాశం కాషిరాసాద్య తేజోసామ్| వసిష్ఠో భగవానాసీద్రాజ్ఞః కులపురోహితః|| ఇంతలో తేజోరాశి భూమిసమీపమునకు చేరి రాజు యొక్క కులపురోహితుడు, పూజ్యుడునగు వసిష్ఠుడయ్యెను. శ్లో|| తం దృష్ట్వా మునయస్సర్వే సముత్థాయ ససంభ్రమమ్|| సత్ర్కియాం చక్రిరే తసై#్మ వినయేన యథోచితమ్|| వానినిజూచి మునులందరు తొందరగాలేచి వినయముతో తగినవిధమున వానికి గౌరవముచేసిరి. శ్లో|| స చ సంభావ్య తాన్సర్వానుపచారై ర్యథోచితమ్| అనతం పాదయోర్భూపమాశీర్భిరభినన్ద్య చ || వచసాపృచ్ఛ్య కుశలం మాధ్యన్దినిముఖాన్మునిః| శివగఙ్గాంభసి స్నాత్వా సంప్రవిశ్య చిదమ్బరమ్|| దదర్శ తాణ్డవం శమ్బోర్నునావ చ ననామ చ| ఆమునియు వారినందరను తగువిధమున నుపచారములతో గౌరవించి పాదములకు ప్రణమిల్లిన రాజునాశీస్సులతో నభినందించి వ్యాఘ్రపాదుడు మొదలగువారిని వాక్కుతో కశలమడిగి శివగంగాజలములో స్నానముచేసి చిదంబరము ప్రవేశించి శివునితాండవముచూచి నమస్కరించి స్తుతించెను. శ్లో|| ననన్ద స జగౌ మన్దం ముమోద చ ననర్త చ తతో నిర్గత్య సంప్రాప్య వ్యాఘ్రపాదోటజంమునిః | నినాయ తత్రహోరాత్రం విధివ త్తేన పూజితః| అతడానందించెను. మెల్లగాపాడెను. సంతోషించెను. నృత్యముచేసెను. పిమ్మటనావసిష్ఠుడు బయలుదేరి వ్యాఘ్రపాదమునియున్న పర్ణశాలకు వచ్చి అతడు యథావధిగా పూజింపగా నచ్చట ఒకరోజుగడపెను. శ్లో|| శ్వఃప్రభాతే సముత్థాయ కృతనిత్యక్రియస్సుధీః|| ప్రణతం ప్రాహ రాజానం బుద్ధాఞ్జలిపుటం పునః|| మరునాడుదయమునలేచి నిత్యక్రియలు నెరవేర్చుకొనివసిష్ఠుడు నమస్కరించి దోసిలొగ్గియున్నరాజునుగూర్చి మరలపలికెను. శ్లో|| పితా తే జరయాక్రాన్తో హన్తరాజ్యమనాయకమ్| గృహాణ తావకం రాజ్యం యవీయాంసౌహిబాలిశౌ|| నీతండ్రి ముసలివాడయ్యెను. అయ్యో! రాజ్యమరాజకమయ్యెను. నీరాజ్యమును నీవు గ్రహింపము. తమ్ములజ్ఞానులు గదా. శ్లో|| ఇతీరితముపశ్రుత్య మునినా పృథివీపతిః | జగాద మధురాం వాణీం బాఢం భోగేష్వలాలసః|| ఈవిధముగా మునిచెప్పిన మాటలు విని రాజు భోగములయందెమియు కోరికలేక మధురమైను మాటపలికెను. శ్లే|| ప్రసీద మహ్యం భగవన్నహమత్రైవ పావనే| వసంసల్తిల్లవనే కాలం నేష్యామీత్యేవ నిశ్చితః|| మహాత్మా! నన్ననుగ్రహింపము. నేనిక్కడనే పవిత్రమైన తిల్లవనమున నివసించుచు కాలముగడపలెనని నిశ్చయించుకొంటిని. శ్లో|| ఆదరో7పి న భోగేషు తస్మాత్కంచిద్యవీయసోః| భూభారభరణార్థాయ కల్పయేః కరుణానిధే! | నాకు భోగములయందు ప్రీతికూడలేదు. కనుక దయానిధీ! తమ్ములిద్దరిలో నొకనిని భూభారమును మోయుటకేర్పరుపుము. శ్లో|| మమ తావదిమౌవిద్ధి పితరావృషిదమ్పతీ| వరివస్యన్నిహాస్యేహమనయోః పాదపఙ్కజమ్|| నాకుమాత్రము ఈఋషిదంపతులిద్దరు తలిదండ్రులు. నేను వారిపాదపద్మములను సేవించుచు ఇక్కడనుండెదను. శ్లో|| ఇతివాదినమేవై నమహ మధ్యందినిర్మునిః| అత్రవా స్తవ్యతాబుద్ధిర స్తిచే త్తవ సువ్రత!|| గత్వా పురం నివర్తస్వ ససైన్య స్థాపయన్ప్రజాః| ఇట్లుపలికిన వీనినిగూర్చి వ్యాఘ్రపాదమహర్షి పలికెను. సువ్రత! నీకిక్కడ నివసింపవలెనను బుద్ధియున్నడెల నీపురమునకువెళ్లి ప్రజలను సేన్యముతో స్థాపించి తిరిగిరమ్ము. శ్లో|| ఆనయేమం ముదా దేశమన్తర్వదిస్థితాన్మునీన్| అరప్య స్యన్దనం స్థానమానయసై#్వతదఞ్జసా|| అంతర్వేదియంతుడుమునులను సంతోషముతో రథమెక్కించి వేగముగా నీ పేరదేశమునకు తీసికొనిరమ్ము శ్లో|| ఏవం మునివరేణక్తోరాజాధ్యాత్వాహ్యుపేత్య చ | ప్రవిశ్య సందంహైమీం ప్రణమ్యపరమేశ్వరమ్|| తేనాపి దేవదేవేన చోదితో నృపసత్తమః| ఋషిణాం త్రిసహస్రాణం సముదాయ మిహానయ|| ఈ విధమున మునిశ్రేష్ఠుడు చెప్పగా ధ్యానముచేసి దగ్గరకువచ్చి హేమసభనుప్రవేశించి పరమేశ్వరునకు నమస్కరించి యారాజు మూడువేలమంది ఋషులసముదాయమును తీసికొనిరమ్మని దేవదేవునిచేగూడ ప్రేరేపింపిబడెను. శ్లో|| ఇత్యేవం చోద్యమానస్తు నటేశేన ముహుర్ముహుః| అనుజ్ఞాప్య నమస్కృత్య వ్యాఘ్రపాదపతఞ్జలీ|| అనమ్య ప్రమథాన్సమ్యగాపృచ్ఛ్వ సకలానృషీన్| పురీం చికీర్షయాలోక్య పుణ్యాం తిల్లవనే భువమ్|| పునః పునర్నిరీక్ష్యైన పరివృత్య చిదమ్బరమ్| పురోధసం పురస్కృత్వ వసిష్ఠం పుణ్యదర్శనమ్|| హిరణ్యవర్మా నృపతిః ప్రతస్థే నగరీం నిజామ్| ఇట్లీవిధముగా నటరాజుచే మరలమరల ప్రేరేపింపబడి వ్యాఘ్రపాదపతంజలులకు నమస్కరించి అనుమతింపజేసిప్రమతగణములకు బాగుగానమస్కరించి ఋషుల సంపదను సెలవడిగి తిల్లవనమునందలి పుణ్యభూమిని పుట్టణముగా చేయదలచి, చూచి, వెనుదిరిగి, చిదంబరమును మరలమరలచూచి పవిత్రదర్శనుడైన పురోహితుడగు వసిష్ఠుని ముందుంచుకొని రాజగు హిరణ్యవర్మ తననగరమునకు బయలు దేరెను. శ్లో|| ప్రవిశ్య నగరీం సర్వానాహూయాథ బలాధిపాన్| చతురఙ్గవతీం సేనాం సజ్జామాదాయ సత్వరమ్|| ఆగచ్ఛత మయాసార్థమితి సంశాప్య సాదరమ్| సబన్ధవస్సానుచరస్సాయుధస్యానుజచో నృపః|| సకోశవాహనస్సద్యస్సబలస్సవినిప్య¸°|| నగరమును ప్రవేశించి పిమ్మట సైన్యాధిపతులనందరను పిలచి సిద్ధముగానున్న నాలుగంగములతో గూడిన సేనను వేగముగా తీసికొని నాతో కూడరండని ఆదరముతో శాసించి బంధువలతోను సేవకులతోను సోదరులతోను కూడిన రాజు ఆయుధములను, ధనమును, వాహనములను తీసికొని బలముతో కూడ బయలుదేరెను. శ్లో|| తతోనిర్గత్య నగరాదన్తర్వేదిగతానృషీన్| అసాద్యానమ్య తాన్సర్వానారోప్య స్యన్దనేషు సః|| దినైః కతిపయైరేవ తిల్లారణ్యం సమావిశత్| పిమ్మట నగరమునుండి బయలుదేర అంతర్వేది యుందుండు ఋషులదగ్గరకేగి నమస్కరించి వారల నండరను రథములమీదనెక్కంచుకొని కొలదిదినములలోననే తిల్లవనమును ప్రేవేశించెను. శ్రీ|| ప్రవిశ్య తిల్లవిపినం ప్రణనామ మహీతలే| స మునింసగణం దేవం సామ్బికంససుతంశివమ్|| తిల్లపనమును ప్రవేశించి మునులతో, గదుణములతో పార్వతితో, కుమారులతో, కూడనన దేవుడగకు శివుని సాష్టాంగముగా నమస్కరించెను. శ్లో|| తతస్తస్మిన్మహాతీర్థే సానుజస్సజనేశ్వరః| సబలస్సహసామన్తస్సస్నౌ హృష్టస్సబాన్ధవః| పిమ్మట నారాజు సంతోషించి తమ్ములతోను, సేనతోను, సామన్తులతోను, బంధువలతోను, కలసి ఆమహాతీర్థమునస్నానముచేసెను. శ్లో|| తతస్సభాం సమాసాద్య సర్వైరేవ సమన్వితంః| దదర్శ తాణ్డవం శమ్భోః చిదానన్దం చితమ్బరే|| పిమ్మట అందరితో కూడ సభకువెళ్లి చిదంబరమున చిదానందరూపమైన శివుని తాండవమును చూచెను. శ్లో|| అనుభూయ తదా సాక్షాదక్షిప్రసరతస్కరమ్| అశేషకల్మషచ్ఛేదిశమ్భోరానన్దతాణ్డవమ్|| అనలంభూష్ణువాగ్వ్రత్తిరనలంభూష్ణుదర్శనః| అనలంబూష్ణుహృదయఃస ముమూర్ఛరసాకులః|| చూపునాకర్షించునది, సమస్తపావములను బోగొట్టునదియునగు శివునితాండవమును ప్రత్యక్షముగాచూచి స్తుతింపలేక చూడలేక ధ్యానింపసమర్ధుడై ఆనందముచే తన్నుయుడై మూర్ఛపోయెను. శ్లో|| తతశ్చ తాణ్డవాలోకాజ్జాతమోహవినిర్గమే| వటరాజం నమస్కృత్య నిస్ససార తతో నృపః|| పిమ్మట తాండవమును చూచుటవలన మోహము తొలగగా రాజు నటరాజునకు నమస్కరించి అక్కడనుండి వెడలెను. శ్లో|| తతస్సందర్శయామాస తానానీతాన్మినీశ్వరాన్| మునయే వ్యాఘ్రపాదాయమోదమానహృదే తదా|| పిమ్మట తానుతీసికొనివచ్చిన మునులనపుడు హృదయమున సంతోషించు వ్యాఘ్రపాదమునికి చూపించెను. శ్లో|| తేషాం తు తత్ప్రసక్తానాం మునీనాం భావితాత్మనామ్| స త్రిసాహస్రసంఖ్యానామేకంనాలోకయత్ప్రభుః|| వానితో వచ్చిన పవిత్రహృదయులగు నామునులు మూడువేలమందిలో నొకడాప్రభువునకు కనబడలేదు. శ్లో|| తదా వివర్ణవదనో విషణ్ణహృగయే నృపః| పునః పునశ్చ గణయన్గణనాపూరకం మునిమ్|| దుర్లభం సక్వలోకేషు నాలోకిష్ట యదా తదా| విలపత్యవనీనాథే తస్మిన్వాగుదజ్మమ్భత|| ప్రసన్నమధురా శ్వావ్యా వాణీనా మశరీరిణీ| అపుడు రాజు హృదయమున విచారమపడుచు కాంతిహీనమైన ముకముతో లోటువచ్చిన మునినిగూర్చి మరలమరల లెక్క పెట్టి అన్నిలోకములందును దర్లభుడైన ఆముని కనబడకపోవుటచే నారాజు విలపించుచుండగా ప్రస్నము, మధురము, వాక్కులలో శ్రావ్యమునైన ఆశరీరవాక్కు వినబడెను. శ్లో|| హిరణ్య వర్మన్నేతేషు మునిష్వేకో న లక్ష్యతే| కథం త్విదమితి స్వాన్తే మాకృథాః మహాతీం శుచమ్| హిరణ్యవర్మా! ఈమునులలోనొకడు కనబడులేదు. ఇదియెట్లుజరిగినదని మనస్సులో ఎక్కవవిచారింపకుము. శ్లో|| శుద్ధాన్వయానామేతేషాం జ్వలత్పావకరోచిషామ్| అహమేకస్త్రిసాహస్రసంఖ్యాతిపూరకః|| పవిత్రమగు వంశముగలవారు మండు అగ్నియొక్క కాంతిగలవారునగు వీరిలో మూడవేల సంఖ్యయొక్క లెక్కను పూర్తిచేయు నేనొకడను. శ్లో|| ఇతి రాజా గిరం శ్రుత్వా రాజశేఖరవాక్సమామ్| శోకం విసృజ్య మేనే తాన్విప్రేన్ద్రానీశవిగ్రహాన్|| ఇట్లు చంద్రశేఖరునివాక్కుతో సమానమైన వాక్కును విని రాజు విచారమును విడచి అబ్రహ్మణులను ఈశ్వరస్వరూపులనుగా దలచెను. శ్లో|| ప్రసన్నవదనుస్వాన్తాః మునయస్తే మహౌజసః| మధ్యన్దినిం మహాభాగం ప్రణిపత్య సమబ్రువన్|| ప్రసన్నమైన ముఖము, మనస్సుగలిగి తేజోవంతులైన ఆమునులు మహాత్ముడైన వ్యాఘ్రపాదునకు నమస్కరించి పలికిలిరి. శ్లో|| అన్తర్వేదిభువం ధాత్రా ప్రాపితా స్త్వతనుజ్ఞయా| సర్వే వయం మహాభాగ! పునరత్ర సమాగతాః|| మహత్మా! మమ్ములనందరలును బ్రహ్మ నీయనుజ్ఞతో అంతర్వేదియును భూమికి తీసికొని వెళ్లెను. మరల ఇక్కడకు వచ్చితిమి. శ్లో|| ఇతఃపరం తు ధాత్రా త్వం యాచితో7పి ముఖాయనః|| నప్రపాహిణోః సమంతేన కదాప్యస్మాచ్చిదమ్బరాత్|| ఇటుపిమ్మట బ్రహ్మ మమ్ములను యజ్ఞముకొరకు పంపుమని నిన్ను యాచంచినను ఎప్పుడును వానితో కూడ ఈచిదంబరమునుండి పంపకుము. శ్లో|| స చ మాధ్యందినిస్తేషాం మునీనామమితౌ జాసామ్| వచశ్శ్రుత్వా హసన్మన్దం తథై వేతివచో7బ్రవీత్|| ఆవ్యాఘ్రపాదుడును మిక్కిలి తేజస్సుగల ఆమునుల యొక్క మాటవిని చిరునవ్వునవ్వి అట్లేయని పలికెను. శ్లో|| తతో హేమసభాయాశ్చ పశ్చాద్భాగేమునీశ్వరాన్ నివేశయిత్వా సేనాం చ ప్రహర్షమతులంగతః|| పిమ్మట హేమసభకు మెనుకభాగమున మునీశ్వరులను సేనను ఉంచి మిక్కిలి సంతసించెను. శ్లో|| సేనాభిశ్చ మునీన్ద్రైశ్చ సహ సర్వజనేన చ| ఉవాస తాణ్డవం పశ్యన్ శమ్భోస్తత్ర మహీతపతిః|| రాజక్కడ మునీంద్రులతోను సేనలతోను సమస్తజనముతోను శివునితాండవమునుజూచుచు నివసించెను. సూతః : శ్లో|| అధ్యయమేతత్తు హిరణ్యవర్మచరిత్రసంబద్ధ పవిత్రశబ్దమ్| పఠత్యజస్రం శ్రుణుతే తథాయఃపరంపదం శైవము పైత్యజస్రమ్|| 91 సూతుడు : హిరణ్య వర్మచరిత్రకు సంబంధించిన పవిత్రశబ్దములతో గూడిన ఈయధఅయాయమునెల్లప్పుడు చదువువాడును వినువాడును తప్పక శివసంబంధమైన పరమపదమును పొందును. ఇతి శ్రీ స్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం శ్రీ మహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమహాత్మ్యే హిరణ్యవర్మచరితంనామ చతుర్వింశో7ధ్యాయః -0-