Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu
Chapters
ఫలశ్రుతి ః శ్లో|| నిత్యం యే తు చిదమ్బరస్థఘల మహామాహాత్మ్య వర్యాన్తర| శ్లోకేష్వేకమపీశ్వరం నటపతిం ధ్యాయన్పఠన్తి స్వయమ్|| తేషాం మేమబసభేశ్వరశ్చ భగవాన్ యచ్చత్య భీష్టాన్ వరాన్|| మాహాత్మ్యస్య సమగ్రపాఠమహిమా వాచామతీతో ధ్రువమ్|| నిత్యము చిదంబరము యొక్క గొప్ప మాహాత్మ్యములోని శ్లోకములలో నొక్కదానినైనను నటేశ్వరుని ధ్యానించుచు స్వయముగా జదువువారికి కనక సభాపతి కోరిన వరముల నిచ్చును. మాహాత్మ్యమును పూర్తిగా జదువుటలోని మహిమను మాటలతో జెప్పలేము. నిశ్చయము. శ్లో|| సత్రార్ధేన భవార్థకాఙ్క గణితశ్లోకాన్వితాధ్యాయకైః| షడ్యుగ్వింశతిసంఖ్యకైః పరిమితం చై దమ్బరం విశ్రుతమ్| మాహాత్మ్యం చ పరాశరాత్మజముఖాత్ శ్రుత్వా మునిభ్యః పరమ్| సూతః ప్రాహ పురా తు నై మిశవనే సత్రావసానే ముదా|| (టీకా-అర్ధేన-అర్ధశ్లోకేనత్రా-సహ; భవార్థ కాంకగణితశ్లోకాః-కటపయాదిసంఖ్యయా అఙ్కానాం వామతోగతిరితి న్యాయమాశ్రిత్య, భకా రవకారౌ చతస్సంఖ్యాం బోధయతః| అర్థః-పురు షార్థః ధర్మార్థకామమోక్షాఖ్యః చతుర్విధః చతుస్సంఖ్యాం గమయతి| కకారః ఏకసంఖ్యాం| సూచయతి| తథాచ లేఖణ 1444 1/2 సంఖ్యా లభధితే| సార్థచతుశ్చత్వారింశదుత్తరచతుశ్శ| తాధ్యికసహస్ర సంఖ్యాకాః శ్లోకా ఇతి యావత్||) ఒక వేయి నాలుగు వందల నలుబది నాలుగున్నర శ్లోకములు గల ఇరువదియారధ్యాయముల పరిమితమైనది చిదంబర మాహాత్మ్యము. ఈ మాహాత్మ్యమును సూతుడు పూర్వము వ్యాసునివలన విని నైమిశారణ్యమున మునులకు యజ్ఞావసానమున సంతోసముతో జెప్పెను. శ్లో|| అనమ్యాదౌ గణశం విధివదపి సమావాహ్య కోశే నటేశం| సంపూజ్యాత్యంతభక్త్యా సురభిలకుసుమైః శుద్ధకౌశేయపిఠే|| సంస్థాప్యాచార్య వర్యాన్ ప్రతికృతవినతిః సుస్వరం సార్థబోధం| నిత్యం ప్రాతః పఠన్తోప్య నితరసులభానిష్టకామాన్ లభ##న్తే|| మొదట గణశునకు నమస్కరించి పుస్తకముమీద నటేశుని యథావిధిగా అవాహనము చేసి మిక్కిలి భక్తితో పరిమళించు పువ్వులతో పూజించి పవిత్రమైన పట్టుబట్టపరచిన పీఠమున ఆచార్యోత్తములను కూర్చుండబెట్టి నమస్కరించి మంచి స్వరముతొ అర్థము తెలిసికొనుచు నిత్యము చదువువారు ఇతర విధముల లభింపని ఇష్టమైన కోరికలను పొందెదరు. శ్లో|| విఘ్నేశం గుహమీశ్వరం గిరిభవాం విష్ణుం విధిం నన్దనిమ్| వ్యాఘ్రాంఘ్రిం చ పతఞ్జలిం జిమినంజం వ్యాసం తరక్ష్వంఘ్రిజమ్|| త్రైసాహస్రమునీశ్వరాన్ దహనవిద్వర్యాన్ నటాధీశ్వర| శ్రీ విద్యామిలితాత్మమన్త్ర సమయాచార్యాన్ సదా భావయేత్|| విఘ్నేశ్వరుని, కుమారస్వామిని, పార్వతిని, విష్ణువును, బ్రహ్మను నందిని, వ్యాఘ్రపాదుని పతంజలిని, జైమినిని, వ్యాసుని ఉపమన్యుని, దహరవిద్యానిపుణులు, శివశక్తి వాచకమైన హంసమంత్రమునుప దేశించు వారునగు మూడు వేలమంది మునులను ఎల్లప్పుడు భావించవలెను. శ్లో|| కాఞ్చీ పృథ్వీ చ జమ్బూనిలయమసి జలం శోణశైలో హుతాశః| వాయుః శ్రీకాలహస్తీ వియదపితచ పురం పుణ్డరీకాభి ధానమ్|| క్షేత్రేష్వేతేషు పఞ్చస్వపి చ జననతోవాసతో೭ న్తే స్మృతేశ్చ| కాదాచిద్దర్శనేన ప్రభజతి నితరాం సత్త్రివర్గాప వర్గమ్|| కాఞ్చీపురమున పృథ్వీలింగము జంబుకేశ్వరమున జలలింగము శోణాద్రియందు తేజోలింగము కాళహస్తిలో వాయులింగం, పుండరీకపురమున ఆకాశలింగము, ఈ ఐదు క్షేత్రములయందు క్రమముగా పుట్టుటవలన, నివసించుటవలన, మరణమువలన, స్మరణమువలన, ఒక్కసారి దర్శనమువలన మానవుడు ధర్మార్థకామ మోక్షములను పొందును. శ్లో|| ముక్తిః శ్రీ కమలాలయే జననతః కాశ్యాం మృతేశ్చాన్తిమే| ధ్యానోచ్చోణగిరేః చిదంబరపురే సన్దర్శనాత్ప్రాణి వామ్|| ఇత్మాహుం కిల తేషు జన్మమరణధ్యాత్రయం దుర్లభం| యత్సన్దర్శనమేకమేవ సులభం పశ్యామి తత్తాణ్డవమ్|| ప్రాణులకు వమలాలయమున పుట్టుటవలనను చివర కాశీయందు మరణించుటవలనను శోణాద్రిని ధ్యానించుటవలనను చిదంబరము నొక్కసారి చూచుటవలనను ముక్తిలభించునని యందురుగదా. వానిలో పుట్టుక, చావు, ధ్యానము ఈ మూడును దుర్లభము. దేని సందర్శన మొక్కటే సులభమో ఆ తాండవమును చూచుచున్నాను. శ్రీమన్న టేశుడు శుభమును కలుగజేయుగాక