Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

ఓం

||శ్రీ ప్రసన్న గణపతయేనమః ||

||శ్రీచిత్సభేశాయనమః ||

||శ్రీపతఞ్జలిమునికృత శ్రీ నటేశాష్టకమ్‌ ||

శ్లో|| సదఞ్చితముదఞ్చితని కుఞ్చితపదం

ఝులఝులంచలితమఞ్జంకటకం

పతఞ్జలిదృగఞ్జనమనఞ్జనమచ

ఞ్చలపదంజననభఞ్జనకరమ్‌|

కదమ్బ రుచిమమ్బరవసంపరమమ

మ్బుదకదమ్బకవిడమ్బకగలం

చిదమ్బుధిమణింబుధహృదమ్బుజరవిం

పరిచిదమ్బరనటం హృదిభజ||

సత్ఫురుషులచే పూజింపబడినవాడు, ఎక్కువగా పూజింపబడిన కుంచిత (వంచబడిన) పాదముగలవాడు 'గల గల' అని కదలు మనోహరమైన అందెగలవాడు. పతంజలియొక్క కన్నులకు కాటుకవలె సంతోషమను కలుగజేయువాడు, దోషములేనివాడు స్థిరమైనపాదముగలవాడు, పుట్టుక, చావులు లేకుండ బోగొట్టువాడు కడిమి పుష్పమును బోలిన కాంతి గలవాడు, చిదంబరమున (దహరాకాశమున) నివసించువాడు, ఉత్కృష్టమైనవాడు, మేఘసమూహమును పోలిన కంఠముగలవాడు, జ్ఞాన సముద్రమున మణివంటివాడు, మోగుల హృదయము పద్మమునకు సూర్యుడునగు సర్వోత్తమమైన చిదంబర నటరాజును మనుస్సులో సేవింపుము.

శ్లో|| హరంత్రిపురభఞ్జనమనన్తకృతక

ఙ్కణమఖణ్డదయమన్తరహితం

విరిఞ్చిసురసంహతి పురన్దరవిచి

న్తితపదంతరుణచన్ద్రమకుటమ్‌|

పరంపదవిఖణ్డియబంభసితమ

ణ్డితతనుంమదనవఞ్చనపరం

చిరన్తనమముంవ్రణతనఞ్చితనిధిం

పరచిదమబరనటం హృదిభజ||

భక్తులపాపములను, బాధలను బోగొట్టువాడు, తారకాసురుని కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలియనువారి మూడు పురములను నాశనము చేసినవాడు, అదిశేషువును కంకణముగా ధరించినవాడు, పరిపూర్ణమైన దయగలవాడు, నాశములేనివాడు, బ్రహ్మచేతను, దేవతాసమూహము చేతను, ఇంద్రునిచేతను, ధ్యానింపబడిన పాదముగల వాడు, బాలచంద్రుని శిరమున ధరించినవాడు, సర్వోత్తమమైనవాడు కాలితో యమునడంచినవాడు, విభూతితో అలంకరింపబడిన శరీరముగలవాడు, ప్రాచీనుడు, భక్తులపాలిటి పెన్నిధి, పరాత్పరుడునగు ఈ చిదంబరములోని నటరాజును, మనస్సులో సేవింపుము.

శ్లో|| అవస్తమఖిలంజగదభఙ్గగుణతు

ఙ్గమమతం ధృతనవిమంసురసరి

త్తరఙ్గనికురుమ్బధృతిమ్పటజటం

శమనడమ్బసుహరంభవహరమ్‌

శివందశదిగ న్తరవిజృమ్భితకరం

కరలసన్మృశఙశుంసశుపతిం

హరంశశిధనఞ్జయపతఙ్గనయనం

పరచిదమ్బరనటం హృదిభజ||

ప్రపంచమునంతను రక్షించువాడు, నాశములేని గుణములతో ఉన్నతమైనవాడు, ఊహింప శక్యముకానివాడు. చంద్రుని ధరించినవాడు. గంగాతరంగ సమూహమును ధరించుట యందు మిక్కిలి కోరికగల జటలుగలవాడు యముని గర్వమును బోగొట్టినవాడు, సంసార దుఃఖమును నశింపజేయువాడు, మంగళరూపుడు, పది దిక్కులయందు వ్యాపించిన చేతులుగలవాడు, చేతియందందమైన లేడిపిల్లగలవాడు, ప్రాణులకు రక్షకుడు, ప్రళయమున సర్వమును వారించువాడు, సూర్యచంద్రాగ్నులను నేత్రములుగా ధరించినవాడు, సర్వశ్రేష్ఠుడునగు చిదంబరములోని నటరాజును మనుస్సులో సేవింపుము.

శ్లో|| అనన్తనవరత్న విలసత్కటక

ఙ్కిణిఝులంఝులంఝులదవం

ముకున్దవిధిహస్తగతమద్దడలలయ

ధ్వనిధిమిద్ధిమితనర్తనపదమ్‌|

శకున్తరథవహ్ని రథనన్దిముఖద

న్తి ముఖభృఙ్గిరిటిసఙ్ఘ నికటం

సనన్దసనకప్రముఖ వన్దితపదం

పరచిదమ్బరనటం హృదిభజ||

లెక్కలేనన్ని నవరత్నములతో ప్రకాశించు మురుగుల యొక్క చిరుగంటల జలజలధ్వనులు గలవాడు, మోక్షమునిచ్చు విష్ణువు చేతిలోని మద్దెలయొక్క లయధ్వనిచేత ధిమిద్ధిమియను శబ్దముతో కూడి న వర్తనమందలి అడుగు గలవాడు బ్రహ్మ, సుబ్రహ్మమణ్యశ్వరుడు, నందికేశ్వరుడు, గజాననుడు, భృంగింటియనువారి సమూహము సమీపమున గలవాడు, సనందసనకాదిమునుచే సమస్కరింపబడిన పాదములుగలవాడు, సర్వోత్కృష్టుడునగు చిదంబరములోని నటరాజును మనస్సులో సేవింపుము.

శ్లో|| అన న్తమహసం త్రిదశవన్ద్యచరణం

మునిహృద న్తరవస న్తమమలం

కబన్ధవియదిన్ద్వవనిగన్ధవహవ

హ్నిమఖబన్ధురవిమఞ్జువపుషమ్‌

అనన్తవిభవం త్రిజగద న్తరమణిం

త్రిణయనంత్రిపురఖణ్దనపరం

సననన్దమునివన్దితపదంకరుణం

పరచిదమ్బరనటంహృదిభజ||

అంతములేని తేజస్సుగలవాడు, దేవతలచేత నమస్కరింపబడు పాదములుగలవాడు, మునులహృదయములలో నివసించువాడు, పరిశుద్ధుడు, జలము, ఆకాశము, చన్ద్రుడు, భూమి, వాయువు, అగ్ని, జోమయాజి, సూర్యుడు అనుఎని మిదిమంది రూపము సుందర మైనశరీరముగలవాడు, అంతము లేని యైశ్వర్యముగలవాడు, మూడులోకములకు మణివంటి వాడు, మూడుకన్నులుగలవాడు, త్రిపురాసురసంహారము చేసినవాడు, సనన్దమునిచే నమస్కరింపబడిన పాదములుగల వాడు, దయగలవాడు, సర్వశ్రేష్ఠుడునగు చిదమ్బరములోని నటరాజును మనస్సులో సేవింపుము.

శ్లో|| అచిన్త్యమళిన్దరుచిబన్ధురగళం

కురితకున్దనికురుమ్బధవళం

ముకున్దసురబృన్దబలహన్తృకృతవ

న్దనలసన్తమహికుణ్డలధరమ్‌

అకమ్పమనుకంపితరతిం సుజనమ

ఙ్గళనిధింగజవారం పశుపతిమ్‌

ధనఞ్జయనుతం ప్రణతరఞ్జనపరం

పరచిదమ్బరనటంహృదిభజ|

మనస్సుచే ఊహింపశక్యముకానివాడు, తుమ్మెదగలగుపు యొక్క కాంతివంటి కాంతిచే సుందరమైన కంఠముగలవాడు, గ్రుచ్చబడిన మల్లెపూలదండవలె తెల్లనివాడు, విష్ణువుచేతను, దేవతాసమూహముచేతను ఇంద్రుని చేతను, నమస్కరింపబడి ప్రకాశించువాడు, సర్పమును చెవికిభూషణముగా ధరించినవాడు, చలింపనివాడు, రతీదేవినను గ్రహించినవాడు, సజ్జనులకుశుభములకు గనివంటివాడు. గజానురుని సంహరించినవాడు, సమస్తప్రాణులకు ప్రభువు, అర్జునునిచేస్తోత్రము చేయబడినవాడు, నమస్కరించినవారిని సంతోషింపచేయువాడు, సర్వశ్రేష్ఠుడునగు చిదంబరములోనినటరాజును మనస్సులో సేవింపుము.

శ్లో|| పరంసురవరం వురహరం పశుపతిం

జనితదన్తిముఖషణ్ముఖమముం

మృడంకనకపిఙ్గళజటంసనకప

ఙ్కజరవింసుమనసంహిమరుచిమ్‌|

అసఙ్గమనసంజలధిజన్మగరళం

కబలయన్తమతులంగుణనిధిం

సనన్దవరదం శమితమిన్దువదనం

పరచిదమ్బరనటం హృదిభజ||

సర్వవ్యాపకుడు, దేవతలలో శ్రేష్ఠుడు, మూడుపురములను నశింపజేసినవాడు, వృషభవాహనముగలవాడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యశ్వరుడు కుమారులుగాగలవాడు, భక్తులకు సుఖమునిచ్చువాడు, బంగారమువలె పింగళవర్ణపుజటలు గలవాడు, సనకమర్షియను పద్మమునకు సూర్యుడువంటి వాడు, దయతో కూడిన మనస్సుగలవాడు, మంచువలె తెల్లని కాంతిగలవాడు, కోరికలు లేనివాడు, పాలసముద్రమునుండి పుట్టినకాలకూటవిషమును మ్రింగినవాడు. సాటిలేనివాడు, గుణములకుగనివంటివాడు, సనందమర్షికి వరములనచ్చినవాడు, శాంతుడు, చంద్రునికంటి ముఖముగలవాడు, సర్వశ్రేష్ఠుడునగు చిదంబరనటరాజును మనస్సులో సేవింపుము.

శ్లో|| అజంక్షితిరథంభుజగపుఙ్గవగుణం

కనకశృఙ్గిధనుషంకరలస

త్కురఙ్గపృధటజఙ్కపరశుంరుచిరకు

ఙ్కుమరుచిండమరుకంచదధతమ్‌|

ముకున్దవిశిఖంనమదవన్ధ్యఫలదం

నిగమబృన్దతురగంనిరుపమం

సచణ్డికమముంఝటితిసంహృతపురం

మరచిదమ్బరనటంహృదిభజ||

భూమినిరథముగను, అదిశేషుని వింటిత్రాడుగను మేరుపర్వతమును విల్లుగను, విష్ణువును బాణముగను, వేదములను గుఱ్ఱములుగను జేసికొనివాడు, చేతిలో ప్రకాశించులేడి, పెద్దులి, గండ్రగొడ్డలిగలవాడు, ఉమరుకవాద్యమునుగూడ ధరించినవాడైన వేగముగా త్రిపురాసురసంహారము చేసిన వాడు, పుట్టుకలేకనివాడు, అందమైన కుంకుమకాంతిగలవాడు, సమస్కరించువారలకు వ్యర్థము కానిఫలమునిచ్చువాడు, పోలికలేనివాడు, పార్వతితో కూడినవాడు, సర్వశ్రేష్ఠుడునగు చిదంబరనటరాజును మనస్సులో సేవింపుము.

శ్లో|| అనఙ్దపరిపన్థినమజంక్షితిధురం

ధరమలఙ్కరుణయన్తమఖిలం

జ్వలన్తమనలందధతమ న్తకరింపు

సతతమిన్ద్రసురవన్దితపదమ్‌|

ఉదఞ్చదరవిన్దకులబన్ధుశతబి

మ్బరుచిసంహతిసుగన్ధివపుషం

వతఞ్జలినుతం ప్రణవఞ్జరశుకం

పరచిదమ్బరనటం హృదిభజ||

మన్మథునకు శత్రువు, చావుపుట్టుకలు లేనివాడు, భూ భారమునుమోయువాడు, సమస్తజగమును మిక్కిలిదయతోజూచువాడు, మండుచున్న నిప్పును చేతిలోధరించినవాడు, మయునికిశత్రువు, ఎల్లప్పుడు ఇంద్రునిచేతను దేవతలచేతను నమస్కరింపబడిన పాదములుగలవాడు; ఉత్కృష్టమైనపద్మ సమూహమునకు బంధవుగుసూర్యుని సూరుబింబములకాంతి సమూహముకలవాడు, మంచిపరిమళముతో కూడిన శరీరము కలవాడు, పతంజలిచే స్తుతింపబడినవాడు, ఓంకారమనెడు పంజరములో చిలుకవంటివాడు, సర్వశ్రేష్ఠుడునగు చిదంబర నటరాజును మనల్సులో సేవింపుము.

శ్లో|| ఇతి స్తవమముం భుజగపుఙ్గవకృతం

ప్రతిదినంపఠతియఃకృతముఖః

సదఃప్రభుపదద్వియదర్శనపదం

సులలితంచరణశృఙ్గరహితమ్‌|

సరఃప్రభవసమ్భవహరిత్పతిహరి

ప్రముఖదివ్వనుతశఙ్కరపదం

సగచ్ఛపరంనతుజనుర్జలధింప

రమదుఃఖజనకందురితపదమ్‌||

ఈవిధముగ పతంజలిచే చేయబడినది, నటరాజు పాద ద్వంద్వమును చూచుటకుమార్గమైనది, మిక్కిలి సుందరమైనది, మొదలుచివర లేనిదియునగు ఈస్త్రోత్రమును ఎవడు కంఠస్థముచేసి ప్రతిదినము చదువునో వాడు బ్రహ్మదిక్పాలకులు విష్ణువు మొదలగు దేవతలచే పొగడబడినది, శ్రేష్ఠమైనదియు నగు శివస్థానమునుపొందును. మిగులదుఃఖమును పాపమును కలిగించు జనన మరణ మహాసముద్రమును పొందడు.

శ్రీపతంజలికృత శ్రీనటరాజస్తోత్రము సంపూర్ణము

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters