Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

తృతీయోధ్యాయః

(మూర్తివైభవకధనము)

శ్లో|| ఈశేనైవ చిదమ్బరం సునిరమాయ్యే తత్పురం కౌతుకాత్‌||

తత్‌ తత్రైవ స ఆతనోతి నటనం దేవ్యా మహేశస్సదా||

తత్పోశ్యన్తి వతఞ్జలిప్రభృతయో యోగీశ్వరా దీక్షితాః|

విష్ణుబ్రహ్మమహేన్ద్రదై వతగణాః హృష్యన్తి భక్తాః సమే||

ఈ చిదంబరమును ఈశ్వరుడే వేడుకతో నిర్మించెను. అందువలన నామహేశ్వరు డెల్లపుడు పార్వతితోకూడ అక్కడనే నాట్యము చేయుచుండెను. ఆనాట్యమును పతంజలి మొదలగు యోగీశ్వరులు, దీక్షితులు, విష్ణువు, బ్రహ్మ, మహేంద్రుడు, దేవతా సంఘములు, భక్తులు అందరును చూచి యానందించుచుండిరి.

ఈశ్వరః :

శ్లో|| పుణ్డరీకపురం వహ్నేస్సదృశం తద్విశోధనే|

మునిభిర్యోగనిష్టాతైస్సేవితం భుక్తిముక్తిదమ్‌||

ఈశ్వరుడు :

ఆపుండరీకపురము పవిత్రతను గలుగజేయుటలో అగ్నికి సమానమైనది. యోగసిద్ధులైన మునులచే సేవింపబడినది. భుక్తిముక్తుల నిచ్చునది.

శ్లో|| మయా చ విష్ణునా ధాత్రా హేరమ్బాద్యైస్త దాదరాత్‌|

నిషేవితం పురం దివ్యమా స్తికైర్మునిపుఙ్గవైః||

ఆ దివ్యపురము నాచేతను, విష్ణువుచేతను బ్రహ్మచేతను గణపతి మొదలగు వారిచేతను ఆస్తికులైన ముని పుంగవులచేతను ఆదరముతో సేవింపబడినది.

శ్లో|| శ్రుతిస్మృతిభ్యాం తత్థ్సానం యత్నే నాపి పురాతనమ్‌|

అలం న గోచరీకర్తుం పుణ్యసీమాతలం శుభమ్‌||

శ్రుతి స్మృతులకంటె పురాతనమైన ఆస్థానము ప్రయత్నము చేసియు తెలిసికొనుటకు శక్యముగానిది. పుణ్యమునకు సరిహద్దు. శుభ##మైనది.

శ్లో|| మయా విలోకితై ః పుంభిః లభ్యం నాన్యైరిదం పురమ్‌|

అశుభధ్వంసం సద్యస్సర్వసిద్ధేః పరం పదమ్‌||

ఈ పురమును నా అనుగ్రహము కలవారే పొందగలరు. ఇతరులు పొందలేరు. ఇది వెంటనే ఆశుభమును జోగొట్టును. సర్వ సిద్ధులకు ఉత్తమమైన స్థానము.

శ్లో|| ఆనన్దకారణం నిత్యం వసతాం భువి తత్పురమ్‌|

నుహతా తేజసా నన్దిన్‌! సమమాదిత్యకోటిభిః||

నందీ! ఆ పురము భూమిలో నివసించువారలకు నిత్యమానంద కారణము. మహా తేజస్సుచే కోటి సూర్యులతో సమానము.

శ్లో|| పురాతనానాం పుణ్యానాం నిత్యమక్షీణసమ్పదామ్‌|

మయా తన్నిర్మితం స్థానమనపాయమసుత్తమమ్‌||

నిత్యము క్షీణింపని సంపదలుగలవారి పూర్వ పుణ్యములకు అపాయములేని సర్వోత్తమమైన యా స్థానమును నేను నిర్మించితిని.

శ్లో|| స్థానమేతదతిసంపదుజ్జ్వలం వేదవిద్భిరఖిలైర్ని షేవితమ్‌||

పూజితం చ సతతం మయా భృశం సాదరేణ సహ శైలకన్యయా||

ఈ స్థానము మిక్కిలి సంపదచే ప్రకాశించునది, వేద వేత్త లందరిచేతను సేవింపబడినది, ఎల్లప్పుడు నా చేతను పార్వతిచేతను ఆదరముతో నెక్కువ పూజింపబడినది.

శ్లో|| తత్త్రై పరమం నృత్తం శుద్ధబోధసుఖావహమ్‌|

హృది స్థితం చ భక్తానాం నన్ది&! నిత్యం కరోమ్యహమ్‌||

నందీ! ఆత్మానంద సుఖమును గలిగించుచు భక్తుల హృదయమందుండు ఉత్తమనృత్తమును నేను నిత్యము అక్కడనే చేయుచున్నాను.

శ్లో|| భవానీ జగతాం మాతా మమ వామాంగభూషణా|

అనన్దకారి, తం నృత్తమాదరాత్పరిపశ్యతి|

లోకములకు తల్లి నాయోడమశరీరమున కలంకారము నగుభవాని ఆనందమును కలిగించు నానృత్తము నాదరముతో జూచుచుండును.

శ్లో|| విఘ్నాన్ధకారచండాంశుర్గజవక్త్రో మహాయశాః|

పశ్యన్ననిమిషం నృత్తం మోదతే ముదితాననః||

విఘ్నములనెడు అంధకారములకు సూర్యుడు, మహాకీర్తిమంతుడునగు గజాననుడు నృత్తమును రెప్పపాటు లేక చూచుచు సంతుష్టముఖుడై యానందించుచుండును.

శ్లో|| బ్రహ్మా విష్ణుస్సహస్రాక్షః పద్మజాపి సరస్వతీ|

ప్రీత్యా సమ్ఫుల్లవదనా విలసత్పద్మలోచనా||

బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడును సంతసింతురు. ప్రకాశించు పద్మములవంటి కన్నులుగల లక్ష్మి సరస్వతియు ప్రీతితో వికసించిన ముఖముగలవారై సంతసింతురు.

శ్లో|| మధ్యందినసుతస్యాపి విమలజ్ఞానచక్షుషః|

శబ్దసీమాభువః పత్యుః ఫణినాం జగతీభృతః||

మునీనాం త్రిసహస్రస్య నృపతేర్హే మవర్మణః|

ఆనన్దతాణ్డవం దివ్యం తత్ర సాక్షాద్భవిష్యతి||

దోషరహితమైన జ్ఞానదృష్టిగలవ్యాఘ్రపాదునకును శబ్దములకు చరమ సీమయై భూమిని మోయుచున్న ఫణిపతికిని మూడు వేలమంది మునులకును హేమవర్మయను రాజునకును దివ్యమైన ఆనందతాండవ మచ్చట సాక్షాత్కరించును.

శ్లో|| న దృష్టం యేన నృత్తం మే కీటస్తత్రన కేవలమ్‌|

తస్య పుణ్యం చ సుమహత్‌ పాపరూపం చ జాయత్‌||

అక్కడ నా నృత్తమును చూడనివాడు కేవలము కీట మగుటయేగాక వాని గొప్ప పుణ్యము పాపముగా మారును.

శ్లో|| మత్ర్పసాదాత్సుజాతేన చక్షుషా దివ్యతేజసా|

దదృశుర్మామకం దివ్యం తత్రైవానన్దతాణ్డనమ్‌||

నా యనుగ్రముచే మిక్కిలి దివ్య తేజస్సు గలిగిన దృష్టితో దివ్యమైన నా యానంద తాండవము నచ్చటనేచూచిరి.

శ్లో|| మోహీతాశ్శబ్దజాలేన తర్కేణాపి చ యే నరాః|

న తత్ర దదృశుర్నృత్తం భక్తిహీనా అనుత్తమమ్‌||

శబ్ద సమూహముచేతను తర్కముచేతను మోసగింపబడిన మానవులు భక్తిహీనులై సర్వోత్తమమైన నృత్తము నచ్చట చూడలేదు.

శ్లో|| వేదబాహ్యా చ సరణిః కేవలాశ్చ ప్రజాః పునః|

యే భోగైర్మోహితాస్తే చ దదృశుర్నైవ తాణ్డవమ్‌||

వేదబాహ్యమైన పద్ధతిగలవారు, సామాన్యులు, భోగములచే మోహితులైనవారు మాత్రము తాండవమును జూడలేదు.

శ్లో|| తత్ర పశ్యన్తియే నృత్తం మమ తాదృగభఙ్గురమ్‌|

ఇచ్ఛన్తి నైవతి యజ్ఞైః స్వర్గలోకం తు భోగదమ్‌||

నాశములేనియట్టి నా నృత్తము నచట జూచినవారు యజ్ఞములచే భోగముల నిచ్చెడు స్వర్గమును మాత్రము కోరనే కోరరు.

శ్లో|| చిద్ఘనాం సుఖసంపన్నాం పరాం ముక్తిం చ తాదృశీమ్‌|

చిత్తేనాపి న వాఞ్ఛన్తిమమ నృత్తావలోకినః||

నా నృత్తమును జూచినవారు ఆత్మజ్ఞానరూపమై సుఖముతో నిండిన పరాముక్తినిగూడ మనస్సుతోనైనను తలపెట్టరు.

శ్లో|| చక్షుషాముత్సవం నన్దిన్‌ పరమానన్దతాణ్డవమ్‌|

లభ##తే న హి యస్తత్ర పాపినామగ్రణీర్మతః||

నందీ! నేత్రోత్సవమైన పరమానంద తాండవము నచట చూడనివాడు పావులలో మొదట లెక్కింపదగినవాడు.

శ్లో|| జన్మాపి విఫలం తస్య మోహబుద్ధిధార్మికః|

అముక్తో బహుభిః పాశైః భ్రమత్యేవ స జన్మసు||

వాని పుట్టుక వ్యర్థము. మోహముచెందిన బుద్ధిగలవాడై అధార్మికుడై చాల బంధములనుండి విడువబడక జన్మపరంపరలో తిరుగుచునేయుండును.

శ్లో|| కిమత్ర బహునోక్తేన తస్య స్థానస్య వై భవమ్‌|

కిథితం విస్తరేణౖ వ గుహ్యమన్యదిదం శృణు||

ఆ స్థాన వైభవమును విస్తరముగనే చెప్పితిని. ఇక నెక్కువగా జెప్పనేల? ఈమరియొక రహస్యమును వినుము.

శ్లో|| తపోభిర్దుష్కరైర్లభ్యా ముక్తిః పుణ్యవతాం చిరాత్‌|

అనన్యలభ్యా సా నిన్దిన్‌! తత్ర సంవసతాం నృణామ్‌||

నందీ! ముక్తి పుణ్యాత్ములకు దుష్కరమైన తపుస్సులచే చిరకాలమునకు లభించును. ఆ ముక్తి అక్కడ నివసించువారలకు మరియొక దానివలన లభించనక్కలేదు. ఆ నివాసమువలననే లభించును.

శ్లో|| పుణ్డరీకపురముత్తమోత్తమం నిత్యతాణ్డవవిధేర్మ హాఙ్జణమ్‌|

కల్పితం భువి మయైవ యత్నతః సర్వలోకన యనోత్సవో మహాన్‌||

నిత్య తాండవమునకు పెద్దవాకిలి, ఉత్తమోత్తమమునగు పుండరీక పురమును భూమిలో నేనే ప్రయత్నపూర్వకముగా, సమస్త లోకమునకు గొప్ప నేత్రోత్సవముగా కల్పించితిని.

సూతః

శ్లో|| తస్య స్థానస్య మాహాత్మ్యం నన్దినే విమలాత్మనే|

కథితం శమ్భునా పూర్వంమయాప్యద్య తపోధనాః||

సూతుడు :

ఓ తపోధనులారా! ఆస్థానముయొక్క మాహాత్మ్యమును పూర్వ మీశ్వరుడు నిర్మలాత్ముడగు నందికి చెప్పెను. ఇప్పుడు నేను మీకు జెప్పితిని.

శ్లో|| ముక్తయే మునయః! తస్మాత్పుణ్డరీకపురం మహత్‌|

సేవాయైశివయోశ్చాపి సదా భజత సువ్రతాః||

కనుక మంచి వ్రతాచరణముగల మునులారా! ముక్తికొరకును ఉమాశంకరుల సేవకొరకును గొప్ప పుండరీక పురము నెల్లపుడు సేవింపుడు.

శ్లో|| య ఇమం పఠతే దివ్యమధ్యాయం శృణుయాచ్చ యః|

సర్వక్లేశవినిర్ముక్తో జీవన్ముక్తో భ##వేదయమ్‌||27é

ఈ యధ్యాయమును చదువువాడును వినువాడును సమస్త క్లేశములు తొలగి జీవన్ముక్తుడగును.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమార సంహితాయాం

మహేశ్వర నన్ది సంవాదే చిదమ్బర మాహాత్మ్యే

చిదమ్బర మహిమ కథనంనామ

తృతీయో ధ్యాయః

--0--

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters