Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu
Chapters
శ్రీ శివకామసున్దరీ నటేశాభ్యాం నమః శ్రీ నటరాజ వేపాదస్తవము (మహర్షి జై మినికృతము) శ్లో|| వక్రతుణ్ఠ మహాకాయ కోటిసూర్యసమప్రభ| నిర్విఘ్నం కురు మే దేవ పర్వకార్యేషుసర్వదా'' 1. వంకరగానున్న తొండముగలవాడును, పెద్దశరీరము గలవాడును, కోటిసూర్యుల తేజస్సుగలయోదేవా! నాకుసర్వ కార్యములయందును, విఘ్నములను లేకుండజేయుము. శ్లో|| కుణ్డలీకృతనాగేన్ద్రం ఖణన్దుకృతశేఖరం| పిణ్డీకృతతమహావిఘ్నందుణ్డిరాజం సమామ్యహమ్|| 2. సర్పరాజను కుండముగాచేసికొన్న వాడును. చంద్రకళను శిరోభూషణముగా ధరించినవాడును, విఘ్నములను ముద్దగా చేసిన దుండిరాజును నమస్కరింతురు. శ్లో|| మాతామహశైలం మహస్తదపితామహమ్| కారణం జగతాం వన్దే కణ్ఠాదుపరివారణమ్|| 3. పర్వతరాజు (హిమవంతుడు) మాతామహుడు (తల్లి తండ్రి) గాగలదియు, పితామహుడు (తండ్రితండ్రి) లేనిదియు, సమస్తజగములకు కారణమును, కంఠమునకు పైభాగము ఏనుగురూపముగా గల తేజస్సునకు నానమస్కారము శ్లో|| పన్దే మహేశ్వరం శమ్భుం విఘ్నేశం షణ్ముఖం గురుమ్|| 4. సర్వజగత్ప్రభునగు శంభునకును, విఘ్నములకు ప్రభువగు వినాయకునకును, ఆఱుముఖములుగల గురువగు కుమారస్వామికిని, నంది మున్నగు గణాధీశ్వరులకును, శివభక్తులగు మునీశ్వరులకును నానమస్కారము. శ్లో|| ఉమాపత్య ముమాజాని ముమాం చోమసహోదరమ్| ఉమానవాన్దరం పద్మాం విధింవయమపాస్మహే|| 5. ఉమాదేవిపుత్రుని (వినాయకుని) ఉమభార్యగా గల వానిని (శివుని) ఉమాదేవిని, ఉమాదేవిసోదరుని (విష్ణుమూర్తిని) ఉమాదేవివదినెయగులక్ష్మిని, బ్రహ్మను మేము ఉపాసన చేయుచున్నాము. శ్లో|| పఞ్చాక్షరతనుం పఞ్చవదనం ప్రణవం శివమ్| అపారకరుణారూపం గురుమూర్తి మహం భ##జే|| 6. శివపంచాక్షరీమంత్రము శరీరముగా గలవాడు, అయిదు ముఖములు గలవాడును, ఓంకారస్వరూపుడును, మంగళకరుడును, హద్దు లేనికరుణయే స్వరూపముగా గలవాడును, దక్షిణామూర్తి గురుస్వరూపుడగు ప్రభువును నమస్కరించుచున్నాడు. శ్లో|| నమో విష్కలరూపాయ నమోనిష్కలతేజసే| సమ స్సకలనాథాయ నమస్తే సకలాత్మనే|| 7. నిరవయవరూపుడును (అవయములులేనివాడు) అవయవములు (భాగములు) లేనిలేజోరూపుడును, సకలమునకును ప్రభువును, సకలమునకును ఆత్మస్వరూపుడును అగు నీకునమస్కారము. శ్లో|| నమః ప్రణవచ్యాయ నమఃప్రణవలఙ్జినే| నమః సృష్ట్యాదికర్త్రేచ నమః పఞ్చముఖాయతే| 8. ఓం కారమునకు అర్ధమగువాడును, ఓంకారము చిహ్నము (గుర్తు) గాగలవాడును, సృష్టిస్థితిసంహారములను జేయువాడును, ఐదుముఖములుగలనీకు నమస్కారము. శ్లో|| పఙ్చబ్రహ్మస్వరూపాయ పఞ్చకృత్యాయతేనమః ఆత్మనే బ్రహ్మణ తుభ్య మనంతగుణశక్తయే|| సకలాకలరూపాయశమ్భవే గురవే నమః శ్రీ గురుచరణారవిన్దాభ్యాంనమః|| 9. అయిదుగురు బ్రహ్మలు స్వరూపముగాగలవాడును, (పంచబ్రహ్మలనగా బ్రహ్మం, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు) అయిదు కార్యములు గలవాడును, (సృష్టి, స్థితి, సంహార, అనుగ్రహ, తిరోధానములు) అగు నీకు సమస్కారము. అనంతమగుగుణములు, శక్తులుగలవాడును, ఆత్మస్వరూపుడను బ్రహ్మయగు నీకు నమస్కారము. అవయవ ములుకలవాడును, అవయములు లేనివాడును, గురుస్వరూపుడగు బ్రహ్మమునగు నీకు నమస్కారము. అవయవ ములుకలవాడును, అవయములులేనివాడును, గురుస్వరూపుడగు శంభుప్రభువునకు నమస్కారము. శ్రీగురుపాదారవిందములకు నమస్కారము. శ్లో|| పుణ్డరీకపురాధీశం పుణ్డరీకాజినామ్బరమ్| పుణ్డరీకరుచిం వన్దే పుణ్డరీకాక్షసేవితమ్|| 10. పులితోలు వస్త్రముగా ధరించినవాడును, తెల్లతామర పూవుకాంతిగలవాడును, విష్ణుమూర్తిచే సేవింపబడినవాడును, హృదయపుండరీకమునకు అధీశుడును నగుమహాత్మునకు నమస్కారము. ఋషులు సూతుని అడిగిరి : శ్లో|| పుణ్డరీకపురం ప్రాప్య జై మినిర్మునిసత్తమః| కిం చకార మహాయోగీ సూత నోవక్తుమర్హసి|| 11. యోగిపుంగపుడగు జైమినిమహర్షి పుండరీకపురమును (చిదంబరమును) జేరి యేమి యొనర్చెనో అవిషయములను మాకు తెలుపుము. సూతునిప్రతివచనము : శ్లో|| భగవాన్ జైమిని ర్ధీమాన్ పుణ్డరీకపురే పురా| మహర్షిసిద్ధగన్ధర్వయక్షకిన్నరసేవితే|7 నృత్యద్భిరప్సరస్సజ్ఘై ర్దివ్యగానైశ్చ శోభితే| నృత్యన్తం పర మీశానం దదర్శ సదసి ప్రభుమ్|| 12, 13, మహర్షులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు అనువారిచే సేవింపబడినడియు, నాట్యము, చేయు అప్సరస్సమూహములతోడను, దివ్యగానములతో డను ప్రకాశించు పుండరీకపురమందలి సదస్సున నాట్యముచేయుచున్న ప్రభువగు పరమేశ్వరుని, షడ్గుణౖశ్వర్యసంపన్నుడును, బుద్ధిశాలియునగు జై మినిమహర్షి దర్శించెను. (షడ్గుణములు: ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము). శ్లో|| నవామ దూరతో దృష్ట్యా దణ్డవత్ క్షితమణ్డలే| పపా వుత్థాయ దేవస్య తాణ్డవామృతమాగళమ్|| 15. జై మినిమహర్షి దూరమునుండియే జగత్ప్రభువును గాంచి సాష్టాంగదండప్రణామమును చేసెను. లేచియాజగన్నాధుని తాండవమను అమృతమును కుత్తుకబంటిగా త్రాగెను. శ్లో|| పార్శ్వస్థితాంమహాదేవీం పశ్యన్తీం తస్యతాణ్డవమ్|| దృష్ట్యా సుసంహృష్టమ్రనా: పపాత పురతోమునిః|| 15. ఆ ప్రభువు యొక్క తాండవమును గాంచుచు ప్రక్కనున్న మహాదేవినిజూచి సంతుష్టాంతరంగుడై యాజైమిని మహర్షి యాపరమేశ్వరికి నమస్కరించెను. శ్లో|| తత శ్శిష్యాన్నమాహూయ వేదశాస్త్రార్థపారగాన్| అగ్నికేశ మకేశంచ శతయాగం జటాధరమ్|| వక్రనాసం సమిత్పాణిం ధూమగన్దిం కుశాసనమ్| ఏతై స్సార్ధం మహాదేవం పూజయామాస జైమినిః| 16, 17. తర్వాతజై మినిహహర్షి, అగ్ని కేశ, ఆకేశ, శతయాగ, జటాధర, వక్రనాగు, సమిత్పాణి, ధూమగంధి, కుశాసన, నామములుగలవారును వేదశాస్త్రార్థములందు గొప్పవిద్వాంసులగు తనశిష్యవర్గముతోగూడి మహాదేవుని పూజించెను. శ్లో|| తతో వివేద వేదా న్తసారార్థం తత్ప్రసాదతః| కృతాఞ్జలి రువాచేదం వేదాన్తస్తవ ముత్తమమ్|| 18. పిమ్మట నాపరమేశ్వరుని యనుగ్రహమువలన వేదాం తసారరూపమయిన యర్థమును దెలిపికొని, దోసిలికట్టి యా జైమిని పరమేశ్వరుని మిక్కిలియుత్తమమగు వేదము అంతమందుగల స్తవము నిట్టొనర్చెను. శ్రీజైమిని చెప్పుచున్నాడు- వేదాపాదస్తుతిః శ్లో|| ఓం విఘ్నేశవిధిమార్తాచన్ద్రేన్ద్రోపేన్ద్రవన్దిత| నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే|| 1. విఘ్నములకు ప్రభువును, బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, విష్ణువు, వీరిచేనమస్కరింపబడినవాడును, వేదములకును బ్రాహ్మణులకును ప్రభవగు ఓగణనాధా! నీకు నమస్కారము. ఋగ్వేద-2-6-29 యజుర్వేద-2-3-14 శ్లో|| ఉమాకోమలహస్తాబ్జసంభావితలలాటికమ్|| హిరణ్యకుణ్డలం వన్దె కుమారం పుష్కరస్రజమ్|| 2. పార్వతీదేవియొక్క మృదువులగు పద్మములను బోలు హస్తములచే నుదిటియందు దిద్దబడిన బొట్టుకలవాడును, బంగారుకుండలయములుగలవాడును, తామరపూలదండను ధరించిన కుమారస్వామికి నమస్కారము. శ్లో|| శివం విష్ణోశ్చ దుర్దర్శం నరః కః స్తోతుమర్హతి| తస్మాన్మత్తః స్తుతి స్సేయ మభ్రాదృష్టి రివాజని|| 3. విష్ణువునకను బ్రహ్మకును కనుగొన శక్యముగాని యాకారము గలశివుని స్తుతింప నేనరుడు సమర్థుడు? కావున నేనొర్చుస్తుతి మేఘమునుండి వర్షముకురియునట్లు అప్రయత్నముగానే యగుచున్నది. ఋగ్వేద-5-17 ఇచ్చట నీశివపురాణకథ అనుసంధింపదగినది, ఒకప్పుడు విష్ణువు, బ్రహ్మయు అందఱకన్న నేనేగొప్పవాడను, నేనే గొప్పవానినడ తగవులాడుకొనిరి. ఇంతలో శివుడు దివ్వకాంతులతో లింగరూపమున నావిర్భవించెను. శివలింగముయొక్క ఆదిని జూచుటకు విష్ణవు, అంతమును జూచుటకు బ్రహ్మయును పూనుకొనిరి. విష్ణువు వరాహరూపమును ధరించి ఆదిన కనుగొనుటకు వెళ్లెను. బ్రహ్మ హంసరూపమును దాల్చి పైకి వెళ్ళెను. ఉభయులును యసత్యము పల్కెను. శివుడు ప్రతక్షమై అసత్యము పల్కినందులకు బ్రహ్మకు పూజ లేకుండునట్లు శపించెను. బ్రహ్మవిష్ణువులు శివునకు నమస్కరించిరి. శ్లో|| నమశ్శివాయ సామ్బాయ నమశ్శర్వాయ శమ్భవే| నమో నటాయ రుద్రాయ సదసప్పతయే నమః|| 4. జగదంబయగు పార్వతితో గూడినవాడును, పాపములను నశింపచేయువాడును, సుఖమునిచ్చువాడును, నటరాజును, దుఃఖమును పోగొట్టువాడును, అగుసభాపతికి నమస్కారము. యజు-3-2-4 శ్లో|| పాదభిన్నాహిలోకాలయ మౌళిభిన్నాణ్డభిత్తయే భుజభ్రాన్తదిగన్తాయ భూతానాం పతయే నమః|| 5. లింగోద్భవకాలమునపాదములచే పాతాళలోకమును ఛేదించినవాడును, శిరముచే బ్రహ్మాండపుపై గోడను ఛేదించిన వాడును, దిగంతములవఱకు వ్యాపించిన భజములు గలవాడును, సమస్తప్రాణికోటికిని ప్రభవగు శివునకు నమస్కారములు. శ్లో|| క్వణన్నూపురయుగ్మాయ విలసత్కృత్తివాససే ఫణీన్ద్రమేఖలాయాస్తు పశూనాం పతయే నమః|| 6. ఢ్వని చేయురెండు పాదాభరణములగలవాడును, ప్రకాశించు గజచర్మమును ధరించినవాడును, సర్పరాజును మొలత్రాడుగా గొప్పవాడును, సమస్తప్రాణికోటికి సధీశ్వరుడుగు పరమశివునకు నానమస్కారమగుగాక. య-4-5-2 శ్లో|| కాలకాలయ సోమాయ యోగినే శూలపాణయే| అష్టిభూషాయ శుద్ధాయ జగతాం పతయే నమః|| 7. యమునకు సంతకుడును, ఉమాదేవితో నిత్యము కలిసియుండువాడును, (అర్ధనారీశ్వరుడు) మహాయోగియు త్రిశూలాయుధమును చేత ధరించినవాడును, ఎముకలు భూషణముగా గలవాడును, నిత్యపరిశుద్ధుడును, సకలజగములకు ప్రభవగు పరమేశ్వరునకు నానమస్కారములు. య-4-5-2 శ్లో|| పాత్రే సర్వస్య జగతః నేత్రే సర్వదివౌకసామ్| గోత్రాణాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః|| 8. సమస్తజగములను రక్షించువాడును, సర్వదేవతలకును ప్రభువును, పర్వతములకు అధిపతియు సర్వశరీరముల కును పతియగు నీకు (పరమశివునకు) ప్రణామము. య-4-5-2 శ్లో|| శఙ్కరాయనమస్తుభ్యం మఙ్గళాయ నమోస్తుతే| ధనానాం పతయే తుభ్యమన్నానాంపతయనమః 9. సర్వప్రాణులకును సుఖములు గల్గచేయు ఓ ప్రభువా! నీకు నమస్కారము మంగళస్వరూపా! నీకు ప్రణామము ధన ములకునధిపతీ! నీకునామనస్సు. అన్నములకన్నటికి నధిపతివగు నీకు నానతులు. య-4-5-2 శ్లో|| అష్టాంగాయా తిహష్టాయ క్లిష్టభ##క్తేష్టదాయినే| ఇష్టిఘ్నాయాస్తు తుష్టాయ పుష్టానాం పతయే నమః|| 10. పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు- అను ఎనిది శరీశములుకలవాడును, నిరతిశయసంతోషముగలవాడును, భక్తులకష్టములనుతోలగించి మనోభీష్టముల నొసంగువాడును, దక్షునియజ్ఞమును ధ్వంసంచేసినవాడును, అతడు తిరిగి ప్రార్థింపగా సంతుష్టి చెందినవాడును, పరిపూర్ణగుణములు గల పురుషుపుంగవులకు ప్రభవగు పరమేశ్వరునకు నమస్కారము. శ్లో|| పఞ్చభూతాధిపతయే కాలాధిపతయేనమః నమ ఆత్మాధిపతయే దిశాం చ పతయేనమః|| 11. పృధివ్యాదిపంచమహాభూతములకు ప్రభువును, కాలమునకు నధిపతియు, సమస్తజీవులకు నధీవ్వరుడును, దిక్కులకన్నిటికి నధిపుడగు పరమశివునకు సమస్కృతి. య-4-5-2 శ్లో|| విశ్వకర్తేమహేశాయ విశ్వభ##ర్త్రేపినాకినే| విశ్వహన్త్రే7గ్ని నేత్రాయ విశ్వరూపాయ వై నమః|| 12. జగములనుసృష్టిచేయువాడును, జగత్ప్రభువును, జగములన్నింటిని పోషించువాడును, పినాకమనుధనస్సును ధరించి నవాడును, విశ్వమునకంతకు లయు మొనర్చువాడును, అగ్ని మూడవకన్నుగాగలవాడును జగత్కారణమగుటచే సర్వజగద్రూపుడగు మహాత్మునకు నమస్కారము. శ్లో|| ఈశాన తే తత్పురుష నమో ఘోరాయతే సదా| వామదేవ నమస్తే7స్తుసద్యోజాతాయ వై నమః|| 13. #9; పరమేశ్వరునకు అయిదుముఖములు. (1) అందు తూర్పుముఖము తత్పురుషము (2) అందు తూర్పుముఖము తత్పురుషము (3) పశ్చిమముఖము సద్యోజాతము (4) ఉత్తరముఖము వామదేహము (5) ఊర్ధ్వముఖము ఈశానము (1) ఈశానరూపుడవగునీకు నమస్కారము (2) తత్పురుషమంత్రప్రతిపాద్యుడపయినీకు నమస్కృతి (3) అఘోర స్వరూపుడవగునీకు నమస్కారము (4) వామదేవరూపుడవగు నీకు నమస్కారము (సుందరమయిన దేవుడు) (5) సద్యోజాతరూపుడవగునీకు నమస్కారము (భక్తులకు వెంటనే ఆవిర్భ వించువాడు) శ్లో|| భూతిభూషాయ భక్తానాం భీతిభఙ్గరతాయ తే| నమో భవాయ భర్గాయ నమో రుద్రాయ మిఢు షే|| 14. విభూతిభూషణముగాగలవాడును, భక్తులభయమును తొలగించువాడును, జగత్కారణమయినవాడు, తేజోరూపుడును, భక్తులకోర్కెలను దీర్చువాడును, అగురుద్రునకు నమస్కారము. య-3-47-3 శ్లో|| సహస్రాఙ్గాయ సామ్బాయ సహస్రాభీశషచే నమః| సహస్రబాహవే తుభ్యం సహస్రాక్షాయ మీఢుషే|| 15. వేలకొలది అవయవములుగలవాడును, ఉమాదేవితో గూడినవాడును, వేలకొలది కిరణములుగలవాడును, వేలకొదలి చేతులుగలవాడును, వేలకొలది నేత్రములుగల వాడును, కర్మఫలప్రదాతయగు శివునకు నమస్కారము. య-4-5-1 శ్లో|| సుకపోలాయ సోమాయ సులలాటాయసుభ్రవే| సుదేహాయ నమస్తుభ్య ......... సుమృడీకాయమిఢుషే|| 16. మనోజ్ఞమయిన చెక్కిళ్ళుగలవాడును, ఉమాదేవితో గూడినవాడును, మంచినుదురుగలవాడును, మేలగు కనుబొమలుకలవాడును, యోగ్యువగు దేహముగలవాడును, సంతోషమునిచ్చువాడును, ఫలదాతయగునీగు నమస్కారము. ఋ-1-2-16 శ్లో|| భవక్లేశనిమిత్తోరుభయచ్ఛేదకృతే సతామ్| నమ స్తుభ్య మషాఢాయసహమానాయమిఢూషే|| 17. సత్పురుషులకు సంసారయాత్రలోని కష్టములవలన గల్గిన భయమునుతొలగించువాడును, పలాశదండమును ధరించినవాడును, ప్రలాశమనగా మోదుగుకఱ్ఱ - శివునిభర్తగా గాగోరి పార్వతి కఠోరమున తపస్సు చేయుచుండగా ఆమె మనోదార్ఢ్యమును పరిశీలింపగోరి శివుడు బ్రహ్మచారిచిహ్నమగు పలాశదండమును ధరించి పార్వతి ఆశ్రమమునకువచ్చిన వాడు) భక్తులు చేసిన అపరాధములను సహించువాడును, నగు ఫలదాతకు నమస్కారము. య-3-1-13 శ్లో||వన్దే7హం దేవ మాననన్దసన్దోహం లాస్యసున్దరమ్| సమస్తజగతాం నాథం సదసస్పతి మద్భుతమ్|| 18. ప్రకాశించువాడును, నిరతిశయానంద స్వరూపు డును, నటనచేసుందరుడును, సమస్తజగములకును ప్రభువును, సమస్తజగములకు అంతర్యామిగానున్న వాడును, మనసునకు గూడ ఊహింపరాని రచనగలజగమును అనాయాసముగా నిర్మించుటచేత ఆశ్యర్యకరుడును నగు శివునకు నమస్కారము. శ్లో|| సజఙ్ఘ సూదరం సూరుం సుకణ్ఠం సోమభూషణమ్ 19. మంచిపిక్కలుగలవాడును, మంచిఉదరముకలవాడును, మేలైనతొడలుగలవాడును, మంచికంఠముగలవాడు, చంద్రకళభూషణముగాగలవాడును, అందమయిన చెక్కిళులు కలవాడును, మంచికన్నులుగలవాడును, సువాసనగలవాడును, అభ్యుదయమునుగలగించు శివునకు నమస్కారము. ఋ-5-30 య-1-3-5 శ్లో||భిక్షాహారం హరిత్‌క్షౌమం తక్షభూషం క్షితిక్షమమ్ యక్షేశేష్టం నమామీశ మక్షరంపరమం ప్రభుమ్| 20 బిచ్ఛమెత్తగావచ్చినది యాహారముగలవాడును, ఆకుపచ్చని పట్టుబట్టగలవాడును, తక్షకుడను సర్పరాజును భూషణముగా ధరించినవాడును, భూమియోర్పువంటియోర్పు కలవాడును, కుబేరునకు మిత్రుడును, నాశనరహితుడును, సర్వనియామకుడగుటచే ప్రభవగు పరమేశ్వరునకు నమస్కారము. యజు. ఉపనిషత్ - నారాయణము శ్లో|| అర్ధాలక మనస్త్రార్ధ మస్థ్యుత్పలదలస్రజమ్| అర్థపుంలక్షణం వన్దే పురుషంకృష్ణపింగళమ్|| 21. శరీరములో శిరమున సగభాగము శిరోజములు గలవాడును, సగముశరీరమున బట్టలేనివాడును, ఒక్కప్రక్కన యొముకలు మరోకప్రక్కన నల్లకలువలదండకలవాడును, సగ భాగమున పురుమలక్షణములుగలవాడును, కుడిప్రక్కన నల్లనివర్ణము, ఎడమప్రక్కన గోరోచనవర్ణముగల పురుషునకు (అర్ధనారీశ్వరునకు) నమస్కారము. య. అరు-10-23 శ్లో|| సకృత్ప్రణత సంసారముమహాసాగరతారకమ్| ప్రణమామి త మిశానం జగత స్తస్థుషస్పతిమ్|| 22. ఒక్కసారి నమస్కరించినను అట్టివారిని సంసారసముద్రమునుండి తరింపజేయువాడును, చరాచరాత్మకమగు సమస్తజగమునకు ప్రభువగు నీశ్వరునినమస్కరించుచున్నాను. ఋ-1-6-15 శ్లో|| ధాతారం జగతా మిశందాతారం సర్వసంపదాకమ్| నేతారం మరుతాం వన్దే జేతార మపరాజితమ్|| 23. సర్వజగములను పోషించువాడును, సర్వమునకును ప్రభువును, సర్వసంపదలనొసంగువాడును, మరుత్తులకు (దేవతలకు) నాయకుడును, ఇతరులచే జయింపబడిన పరమేశ్వరునకు నమస్కారము. ఋ-4-1-19 శ్లో|| తంత్వామన్తకహన్తారం వన్దే మన్దాకినీధరమ్| తతాని విదధేయో7య మిమాపి త్రీణి విష్టపా|| 24. యమునిజయించినవాడును, దివ్వగంగనది శిరమున ధరించినవాడును, విశాలయమయిన యీమూడులోకములును నిర్మించిన మహాత్మునకు నాసమస్కారము. ఋ-6-6-14 శ్లో|| సర్వజ్ఞం సర్వగం సర్వం కవిం వన్దే త మీశ్మరమ్| యతశ్చ యజుపాసార్ధ మృచ స్సామాని జజ్ఞిరే|| 25. సర్వమును దెలిసినవాడును, సర్వమునువ్యాపించినవాడును, సర్వస్వరూపుడును, విచిత్రరచనానైపుణ్యము గలవాడును, ఎవనివలన ఋగ్వేజుస్సామవేదములు ప్రకటింపబడినచో అట్టియీశ్వరునకు నమస్కారము. ఋ-8-4-18 శ్లో|| భవన్తం సుదృశం వన్దే తభవ్యభవన్తిచ త్యజన్నితరకర్మాణి యో విశ్వా భవిపశ్యతి|| 26. భూతభవిష్యద్వర్తమానవిషయములను లెస్సగా జూచువాడును, సర్వకర్మలను విడిచి ప్రాణులయభివృద్ధిని మాత్రమేచూచునీకు నమస్కృతి. ఋ-3-4-10 శ్లో|| హరం సురనియన్తారం పరం త మహా మానతః| యదాఙ్ఞయా జగత్సర్వం వ్యాప్యనారాయణఃస్థితః|| 27. దేవతలకునియామకుడును, ఎవనియాజ్ఞచే నారాయణుడు (విష్ణువు) జగములవెలుపలను వ్యాపించియున్నాడో అట్టి పరమాత్మకు నమస్కారములు యజు-ఆరు-10-13 శ్లో|| తం నమామి మహాదేవం యన్నియోగిదిదం జగత్|| కల్పాదౌ భగవాన్ ధాతా యథా పూర్వ మకల్పయత్|| 28. ఏపరమేశ్వరుని యాజ్ఞానుసారము సృష్టికర్త కల్పముయొక్క ఆదియందు సమస్తజగత్తును పూర్వకల్పము లోవలెనే సృజించెనో ఆమహాదేవునకు నమస్కారము. ఋ-8-848 యజు-ఆరు-10-1 శ్లో|| ఈశ్వరం త మహం వన్డే యస్య లిఙ్గ మహర్నిశమ్| యజన్తే సహభార్యాభి రిన్ద్రజ్యేష్టా మరుద్గణాః|| 29. ఏపరమేశ్వరునిలింగమును ఇంద్రుడు మొదలగు దేవతలు వారిభార్యలతో గూడి రాత్రియు పగలును పూజింతురో అట్టిపరమేశ్వరునకు నానమస్కారములు. ఋ-2-8-9 శ్లో|| నమీత త మియం రుద్రం య మభ్యర్చ్యం సకృత్పరా | అవాపు స్స్వం మైశ్వర్యం దేవాసః పూషరాతయః|| 30. ఏరుద్రుని పూర్వమొకసారిమాత్రమే పూజించుటచేత సూర్యునియనుగ్రహముగల దేవతలు తమతమ ఐశ్వర్యములనుబొందిరో అట్టిరుద్రునకు నానమస్కారము. శ్లో|| తం వన్దే మీశానం యం శివం హృదయామ్బుజే| సతతం యతయ శ్శాన్థా స్సఙ్జానానా ఉపాసత|| శమదమాదిసంపన్నులగు యతీశ్వరులు ఏయీశ్వరుని లెస్సగా దెలిసికొన్నవారై నిరంతరము తమపద్మమువంటి హృదయములన పూజించిరో అట్టిశివునకు నామస్కృతి. ఋ-8-8-49 శ్లో|| దతసై#్య సతతం కుర్మో నమః కమలకాన్తయే| ఉమాకుచపదోరస్కా యాతే రుద్ర శివా తనూః|| 32. ఓరుద్రా ! మంగళప్రదమున యేనీశరీరము ఉమాదేవికుచములకు స్థానమయిన పక్షుస్థలముకలదో కమలమువంటి కాంతిగల యట్టినీశరీరమునకు మేమెల్లప్పుడును నమస్కారముల నర్పింతుము. య-4-5 శ్లో|| నమస్తే రుద్రభావాయ నమస్తే రుద్రకేళ##యే| నమస్తే రుద్రశాన్త్యై చ నమస్తే రుద్ర మన్యవే| 33. ఓరుద్ర! నీభావమునకును, నీక్రీడకును, నీశమగుణ మునకును, నీకోపమునకును నమస్కారము. య-4-5 శ్లో|| వేదాశ్యరథనిష్టాభ్యాం పాదాభ్యాం త్రిపురాన్తక| బాణ కార్మిక యుక్తాభ్యాం బాహుభ్యాముత తే నమః|| 34. త్రిపురాసురులనుసంహరించిన మహాత్మా! వేదములనెడు గుఱ్ఱములుగలరథమున నుంచిననీపాదములకు నానసమస్కారమలు. బాణములు ధనస్సుగల నీబాహువులకు నా పునఃపునఃప్రణామములు. శ్లో|| ఈశానం సకలారాధ్యం వన్దే సంపత్సమృద్ధిదమ్| యస్య చాసీద్ధరి శ్శస్త్రం బ్రహ్మా భవతి సారథి| 35. అందఱచే పూజింపబడువాడును, సకలసంపదల నొసంగువాడును ఏ మహాత్మునకు శ్రీమహావిష్ణువు ఆయుధము=అస్త్రము బ్రహ్మ సారథిగా నయ్యోనో అట్టి ఈశానునకు నానమస్సులు. ఋ-2-3-1 శ్లో|| నమస్తే వాసుకిజ్యాయ విస్ఫారాయ చశఙ్కర| మహతే మేరురూపాయ నతస్మే ఆస్తు ధన్వనే|| 36. ఓశంకరా! వాసుకి వింటినారిగాగలదియు, విస్తృతమైనదియు, మేరుపర్వతరూపమయిన నీగొప్పధనుస్సునకు నా నమస్కారమగుగాక. య-4-5-1 శ్లో|| నమః పరశ##వే దేవ శూలాయానలరోచిషే| హర్యగ్నీన్ద్వాత్మనే తుభ్య ముతో త ఇషవే నమః|| 37. ఓదేవ! అగ్ని కాంతులుగ నీశూలమునకు, నీగండ్ర గొడ్డలికిని, సూర్య, అగ్ని, చంద్రస్వరూపుడవగునీకును, నీబాణ మునకును నాపునఃపునఃప్రణామములు. శ్లో|| సురేతరవధూహారహారీణి హర యానితే| అన్యాన్యస్త్రాణహం తూర్ణ మిదం తేభ్యో7కరం నమః|| 38. ఓహరా! ఏనీయితరాస్త్రములు రాక్షసస్త్రీల మెడలలోనిహారములను తొలగించుచున్నవో (వారిభర్తలను జంపుటచే స్త్రీలు వితంతులైరి అనిభావము) అట్టి నీయితరా స్త్రములన్నింటికి అతిశీఘ్రముగా నానమస్కారములను చేయుచున్నారు. ఋ-8-3-23య-4-5-1 శ్లో|| ధరధరసుతా లీలాసరోజాహతబాహవే| తసై#్మ తుభ్య మనోచామ నమోఅస్మాఅవస్యవః|| 39. పార్వతీదేవి చేతిలో విలాసార్థము ధరించిన పద్మముచే కొట్టబడిన బాహువులుగలవాడును, జగత్ప్రసిద్ధుడునగునీకు మేము రక్షణకోరి నమస్కరించుచున్నాము. ఋ-1-8-6 శ్లో|| రక్షమామక్షమం క్షిణ మక్షక్షత మశిక్షితమ్| అనాధం దీన మాపన్నం దరిద్రం నీలలోహిత|| 40. ఓనీలలోహితా! అసమర్థుడను, శరీరదార్ఢ్యములేని వాడను ఇంద్రియములకు అధీనుడు, తల్లిదండ్రులచే సరియగు మార్గమున నడపబడనివాడును, రక్షకుడు లేనివాడను, దీక్కులేనివాడను, ఆపదను పొందినవాడను అగు నన్ను రక్షింపుము. య-4-5-10 నీలలోహిత. అనగా నల్లనివాడును, ఎఱ్ఱనివాడును అయినివాడు. పూర్వము బ్రహ్మహోమము చేయుచుండగా అతనిచెమటబిందువు అగ్నిలోపడి మొదలనల్లనై తర్వాత ఎఱ్ఱనైనది. దానినుండిపుట్టినవాడగుటచే శివుడు నీలలోహితుడయ్యెను. లేక గరళభక్షనముచే కంఠమున నలుపు జడలయందు ఎఱుపుగల్గుటచే నీలలోహితుడయ్యెను. అనియు నింకొకయర్థము. శ్లో|| దుర్ముఖం ద్రుష్రియం దుష్టం రక్ష మా మీశ దుర్దృశమ్| మాదృశానా మహం న త్వదన్యం విన్దామిరాధసె|| 41. దుష్టములగు మాటలపల్కువాడను, చెడుపనులు చేయువాడును, దుర్మార్గుడను, చెడుచూపు గలవాడనునగు నన్ను ఓ ప్రభూ! రక్షింపుము. మావంటి వారిని రక్షించువానిని నీకంటె మరియొక్కరిని పొందును. ఋ-6-2-17 శ్లో|| భవాఖ్యేనా గ్నినా శమ్భో రాగద్వేషమదార్చిషా| దయాళో దహ్యమానానా మస్తామక మవితా భవ|| 42. దయాళూ! శంభూ! రాగము, ద్వేషము, మదము, అనుజ్వాలలతో గూడిన అగ్నిచే దహింపబడుచున్న మాకు రక్షకుడవు కమ్ము. ఋ-2-5-6 శ్లో|| పరదారం పరావాసం పరవస్త్రం పరాప్రియమ్| హర పాహి వరాన్నం మాం పురుణామన్ పురుష్టుత|| 43. పరభార్యలయందాసక్తి గలవాడను, ఇతరుల యిండ్లయందు నివసించువాడను, ఇతరుల బట్టలుకట్టుకొని జీవించువాడను, ఇతరులకిష్టుడను కానివాడను, ఇతరుల యన్నమును భుజించువాడనగు నన్ను పెక్క నామములచే పూజింపబడునట్టియు, పెక్కురచే స్తుతింపబడు ఓహరా! రక్షింపుము. ఋ-6-6-24 శ్లో|| లౌకికై ర్యత్కృతం పుష్టై ర్నావమానం సహామహే| దేవేశ తవ దాసేభ్యో భూరిదా భూరి దేహి నః|| 44. లౌకికులగు ధనవంతులగు వారు మాకు చేయు అవమానమును మేముసహింపము. సమస్తదేవతలకును ప్రభువగు నోపరమేశ్వరా! అధికముగానినిచ్చునీవు నీదాసులమగు మాకు కావలసినవానిని పుష్కలముగా నిమ్ము. శ్లో|| లోకానా ముపపన్నానాం గర్విణా మీశ పశ్వతామ్| అస్మభ్యం క్షేత్ర మాయు శ్చ మసుస్ఫార్హం తదాభర|| 45. మేమే గొప్పవారమను గర్వముగల సంపన్నులగు జనులు చూచుచుండగనే మీకు భూమిని, దీర్ఘాయువును, కోరదగినధనము నిమ్ము. ఋ-6-3-49 శ్లో|| యాఞ్చాదౌ మహాతీం లజ్జా మస్మదీయా ఘృణానిధే| త్వ మేవ వేత్సి నస్తూర్ణమిష.......స్తోతృభ్యాభర|| 46. ఓదాయానిధీ! యాచనము మున్నగువానియందు మిక్కిలి అధికమయిన యాలజ్జ నీకే తెలియును. కావున నిన్ను స్తోత్రముచేయుమీకు శీఘ్రముగా అన్నమును దయచేయుము. ఋ-6-8- య-4-4-4 శ్లో|| జాయా మాతా పితా చాన్యే మాం ద్విషన్త్య మతిం కృశమ్| దేహి మే మహతీం విద్యాం రాయా విశ్వపుషా సహ|| 47. జ్ఞానహీనుడగు, మిగులకృశించియునున్న నన్ను, భార్య, తల్లి, తండ్రి ఇంకను ఇతరులును ద్వేషింతురు. కావున నాకు అన్నిటిని పోషించు ధనముతో గూడ గొప్ప విద్యను ప్రసాదింపుము. ఋ-6-2-27 శ్లో|| అదృష్టార్థేషు సర్వేషు ద్మష్టార్థేష్యపి కర్మసు| మేరుధన్వన్న శ##క్తేభ్యో బలంధేమి తనూషు నః|| 48. మేరుపర్వతము విల్లుగా గొన్న యో ప్రభు! కనబడని స్వర్గాదులే ఫలముగాగల యాగములు మున్నగుసర్వ కర్మలయందును, కనబడుఫలముగల సర్వకర్మలయందును, ఆశక్తులమగు మాకు మాశరీరములందు పరిపుష్టమగు బలము కల్గింపుము. ఋ-3-3-22 శ్లో|| లబ్ధానిష్టసహస్రస్య నిత్య మిష్టనియోగినః| హృద్రోగం మమ దేవేశ హరిమాణం చ నాశయ|| 49. ఓసమస్తదేవతాప్రభూ! నిత్యమువేలకొలది అనిష్టములను (ఆపదలను) పొందువాడను: ఇష్టములను విడిచిన వాడను. జ్ఞాన విజ్ఞాన నాశకమగు నాహృదయదౌర్బల్యమును పోగోట్టుము. శ్లో|| యే యే రోగాః పిశాభా వా నరా దేవాశ్చ మా మిహ| బాధన్తే దేవతాన్ సర్వాన్‌నిబాధస్వ మహా....అసి|| 50. ఓ దేవ! రోగములు, పిశాచములు, నరులు, దేవతలు, ఎవరెవరునన్నిట బాధించుచున్నారో వారినందఱను నీవు బాధింపుము. నీవు మహాత్ముడవు కదా! ఋ-6-4-44 శ్లో|| త్వ మేవ రక్షితా స్మాకం నాన్యః కశ్చన విద్యతే| తస్మాత్ స్వీకృత్య దేవేశ రక్షాణో బ్రహ్మణస్పతే| 51. దేవతలకును వేదములకును ప్రభవగు నో మహాత్మామమ్ము రక్షించువాడవు నీవే. నీకన్న నున్యులెవ్వరును లేరు. కావున మాప్రార్థనలను స్వీకరించి మమ్ము రక్షింపుము. శ్లో|| మేవోమా పతే మాతా త్వం పితాత్వం పితామమహః| త్వమాయు స్త్వం మతి స్త్వం శ్రీ రుత భ్రాతో త న స్సఖా| 52. ఓఉమాపతీ! నీవే మాకు తల్లివి, తండ్రివి, నీవే తాతవు, నీవే మాకు ఆయస్సు, నీవే మాకు బుద్ధివి, నీవే సంపదవు. మరియు నీవే సోదరుడవు. మిత్రుడవును. ఋ-8-8-44 శ్లో|| యుత స్త్వ మేవ దేవేశ కర్తా సర్వస్య కర్మణః| తతః క్షమస్వ తత్సర్యం యన్మయా దుష్కృతం కృతమ్|| 53. ఓసర్వదేవతా ప్రభూ! నేనొనర్చు సర్వకర్మలకు నీవేకర్తవు (ప్రేరణ చేయువాడవు) కావున నేనొనర్చిన సర్వ పాపములను (పాపకర్మలను) నీవేక్షమింపుము. య-ఆరు-10-1 శ్లో|| త్వత్సమో న ప్రభుత్వేన ఫల్గుత్వేన చ మత్సమః| అతో దేవ మహాదేవ త్వ మస్మాకం తవ స్మసి|| 54. ఓ దేవ! ప్రభుత్వమున నీతోసమానుడు లేదు. ఆశక్తత్వమున నాతోసమానుడు లేడు. కనుక నోమహాదేవా! నీకు మేమును మాకు నీవును పరస్పరంబంధముకలవారము. ఋ-6-6-20 శ్లో|| సుస్మితం భస్మగౌరాఙ్గం తరుణాదిత్య విగ్రహమ్' ప్రసన్నవదనం సౌమ్యం గాయేత్త్వా నమసాగిరా|| 55. ఓప్రభూ! చిరునవ్వు గలవాడును, విభూతిని ధరించుటచే తెల్లనిశరీరముగలవాడును, ఉదయకాలసూర్యుని తేజస్సుగలవాడును, అనుగ్రహమును సూచించు ముఖముగల వాడును, చంద్రునివలె ప్రియమగు దర్శనము గలనిన్ను సమస్కారముతో గూడిన వాక్కులతో కీర్తించుచున్నాను. ఋ-6-6-4 శ్లో|| ఏష ఏవ వరో7స్మాకం నృత్యన్తంత్వాంసభావతే| లోకయన్త ముమాకాన్తం పశ్యేమ శరదశ్శతమ్|| 56. ఓసభాపతీ! ఉమాదేవితో గూడినవాడవును, నాట్యముచేయువాడవును, జీవులను ప్రేమతో జూచు నిన్ను శతసంవత్సరములు (వందలకొలది సంవత్సరములు) చూతుముగాక-ఇదియే మాకు మహారవము. ఋ-5-5-11 యు-ఆరు.4-42 శ్లో|| అరోగిణో మహాబాగా విద్వాంస శ్చ బహుశ్రుతాః| భగవన్ త్వత్ప్రసాదేన జీవేన శరద శ్శతమ్|| 57. ఓభవంతుడా! నీయనుగ్రహముచే మేము రోగములు లేనివారమై, గొప్ప అభ్యుదయముగలవారమై, పండితులమయి, వేదాధ్యయనమొనర్చువారమై శతసంవత్సరములు జీవింతుము గాక. ఋ-5-5-11 య-ఆరు-4-4-42 శ్లో|| సదారా బంధుభి స్సార్ధం తృదీయం తాణ్డవామృతమ్| పిబన్తః కామ మీశాన సన్దామ శరద శ్శతమ్|| 58. ఓ ఈశానా! మేముభార్యలతోడను బంధువులతోడను గూడి నీనాట్యము అను అమృతమును సంపూర్ణముగా త్రాగి శతసంవత్సరములు ఆనందింతుముగాక. య-ఆరు-4-42 శ్లో|| దేవదేవ మహాదేవ త్వదీయాంఘ్రిసరోరు హే| కామం మధుమయం పీత్వా మోదాయ ళరద శ్శతమ్|| 59. ఓమహాదేవ ! నీపాదపద్మమునందలి మకరందమును పూర్తిగా క్రోలి శతసంవత్సరములు సంతసింతుముగాక. య-ఆరు-4-42 శ్లో|| కీటా నాగాః పిశాచా వా యే వా కే వా భ##వే భ##వే| తవ దాసా మహాదేవ భవామ శరద శ్శతమ్|| 60. మహాదేవ! పురుగులుగా గాని, సర్పములుగా గాని పిశాచములుగాని యే యే రీతులుగా ఎన్నిజన్మములను పొందినను, నీకు దాసులముగా శతసంవత్సరములుందుము గాక. య-ఆరు-4-40 శ్లో|| సభాయా మీశ తే దివ్యం నృత్త వాద్య కలస్వనమ్| శ్రవణాభ్యాం మహాదేవ శ్రుణవామ శరద శ్శతమ్|| 61. మహేశా! చిత్సభయందు నీనాట్య సమయమున వాయించు వాద్యముల మృదుమధురధ్వనిని మాచెవులతో శతసంవత్సరములు విందుముగాక. యం-ఆరు-4-42 శ్లో|| స్మ్మతిమాత్రేణ సంసారవినాశనపరాణి తే నామాని తవ దివ్యాని ప్రబ్రవామ శరద శ్శతమ్|| 62. తలంచిన మాత్రముననే సంసారమును (జనన మరణరూపమగు జీవయాత్రను) నశింపజేయు నీదివ్యనామములను మేము ఎక్కువగా మాటిమాటికి చెప్పుకొందుముగాక. య-ఆరుయ-4-42 శ్లో|7 ఇషు సన్ధాన మీత్రేణ దగ్ధ త్రిపురధూర్జటే| అధిభి ర్వ్యాధిభి ర్నిత్య మజీతా స్వామ శరద శ్శతమ్|| 63. బాణమును వింటియందు ఎక్కు పెట్టినంతమాత్ర ముననే త్రిపురములను సంహరించిన ప్రభువా! మనోవ్యాధులను, శరీరవ్యాధులను నిత్యముపొందని వారమై శతసంవత్సరములు జీవింతుముగాక. య-ఆరు.-4-42 శ్లో|| చారుచామీకరాభాపం గౌరీకుచపదోరసమ్| కదా ను లోకయిస్వామి యువానం విశ్పతిం కవిమ్|| 64. ప్రభూ! అందమయిన బంగారురంగు కలవాడును, ఉమాదేవికుచములకు స్థానమగు ఱోమ్ముకలవాడును, ¸°ననవంతుడును, లోకప్రభువును కవియునగు నిన్ను నే నెప్పుడు చూడగల్గుదునో! ఋ-6-3-41 శ్లో|| ప్రమధేన్ద్రావృతం ప్రీతవదనం ప్రియభాషిణమ్| సేవిష్యే7హం కదా సామ్బం సుభాసం శుక్రశోచిషమ్|| 65. ప్రధాన ప్రమథగణములచే కొలువడినవాడును, సంతోషము చిందు ముఖముగలవాడును, ప్రియమగు మాటలు గలవాడును, మంచి కాంతిగలవాడును, శుక్రగ్రహమువంటి కాంతిగలిగి, అంబతో గలిసియున్న నిన్ను నేనెప్పుడు సేవింపగల్గుదునో! ఋ-6-2-13 శ్లో|| బహ్వేనసం మా మకృతపుణ్యలేశం చ దుర్మతిమ్| స్వీకరిష్యతి కింత్వీ శో నీలగ్రీనో విలోహితః|| 66. వివభక్షణముచే నల్లని కంఠముగలవాడును, మిక్కిలి యెఱ్ఱనివాడును (సూర్యమండలమందుండి ఉదయాస్తమయములగు ప్రవర్తింపజేయుటచే ఎఱ్ఱని కాంతిగలవాడని యర్థము). సర్వలోకములకును ప్రభవగు పరవశివుడు అనేక పాపములొనర్చినవాడును, కొంచమేని పుణ్యములేనివాడను, దుష్టబుద్ధిల నన్నుస్వీకరించునా! అనిసందేహించుచున్నాను. శ్లో|| కాలశూలాసలాసక్త భీతివ్యాకులమానసమ్| కదా ను ద్రక్ష్యతీశో మాం తు విగ్రీవో అనానతః|| 67. యమధర్మరాజుయొక్క శూలజ్వాలలమందెక్కువగా తగుల్కొను భయముచే మిక్కిలికలతచెందిన మనస్సు గల నన్ను, గరళభక్షణముచయే వికారముచెందిన కంఠముగల వాడును, ఎవరికిని లోబడిన యాజగత్ప్రభువు నన్నెపుడు దయార్త్రదృష్టితో చూడగలడో! ఋ-6-4-45 శ్లో|| గాయకా మాయ యది రాయాదిలిస్పవః| ధనదస్య సఖే శో7య ముసాసై#్మగాయతానరః|| 68. ఓగాయకులారా! మీకుధనాదులను పొందవలెనని కొర్కెయున్నచో రండు - ధనములు కధిపతియగు కుబేరునకు ఈసర్వేశ్వరుడు మిత్రుడు - ఓనరులారా! ఈ ప్రభువును స్తుతింపుడు. ఋ-6-7-36 శ్లో|| అగచ్ఛత సఖాయో మే యది యూయం ముముక్షవం|| స్తుతే శ మేనం ముక్త్యర్థ మేషవిపై#్రరభిష్టుతః|| 69. ఓమిత్రులారా! మీకు ముక్తియందు కోరిక యున్నచో రండు. ఈ ప్రభువును స్తుతింపుడు. ముక్తినిగాంచుటకు బ్రాహ్మణులు బ్రహ్మవేత్తలు ఈమహాత్మునిస్తుతింతురు. ఋ-6-7-21 శ్లో|| పదేపదే పదేదేవ పదం నః సేత్స్యతి ధ్రువమ్| ప్రదక్షిణం ప్రకురుత మధ్యక్షం ధర్మణా మియమ్|| 70. ఓపాదములారా! సకలధర్మములకు ప్రభువగు నీ పరమేశ్వరునకు (దేవాలయమందున్న ప్రభువునకు అని అర్థము) ప్రదక్షణము చేయుడు. దానివలన మనకు ప్రతిపాదముండును ప్రతిప్రదక్షిణమందును దేవత్వము తప్పక సిద్ధింపగలదు. ఋ-6-3-32 శ్లో|| సర్వం కార్యం యువాభ్యాం హి సుకృతం సుహృదౌ మమ| అఞ్జలిం కురుతం హస్తా రుద్రాయ స్థిరధన్వనే|| 71. మిత్రములగు నాహ స్తములారా! మీచేత నమస్తకార్యములు చేయబడినవి. మహాధనుస్సును శివునకు దోసిలియొగ్గి ప్రార్థింపుడు. శ్లో|| మన్మూర్ధన్ మరుతా మూర్ధ్వం భవం చన్ద్రార్ధ మూర్ధజమ్| మూర్ధఘ్నం చ చతుర్మూర్ధ్నః నమస్యా కల్మలీకినమ్|| 72. నాశిరమా! సర్వదేవతలకు నారాధింపదగినవాడును, చంద్రకళను శిరమున ధరించినవాడును, చతుర్ముఖ బ్రహ్మశిరమును ఖండించినవాడును, సమస్తపాపములను నశింపజేయునీశ్వరుని సమస్కరింపుము. ఋ-5-4-13 శ్లో|| నయనె నయనోధ్బూథదహనాలీఢమన్మథమ్| పశ్యన్తం తరుణం సౌమ్యం భ్రాజమానం హిరణ్మయమ్|| 73. ఓనేత్రములారా! నేత్రాగ్నిచే మన్మధుని దహించినవాడును, బంగారురంగు గల్గిప్రకాశించువాడును, ప్రశాంతుడును, పడుచువయస్సులోనున్న ప్రభువును తిలకింపుడు. య-6-7-26 శ్లో|| సభాయాం శూలిన స్సన్ధ్యానృత్త వాద్య స్వనామృతమ్| కర్ణౌ తూర్ణం యథాకామం పాతంగౌరావివేరిణ|| 74. చెవులారా! చిత్సభయందు ఈశ్వరుని సంధ్యాకాల నాట్యమందలి వాద్యధ్వనియను అమృతరసమును ఎడారి భూమియందు దప్పికగొన్నవానివలె ఉధేచ్ఛముగా వెంటనే త్రాగుడు. ఋ-6-6-610 శ్లో|| నాసికే వాసుకి శ్వాసవాసితాభాసితోరసమ్| ఘ్రాయతం గరళీగ్రీవ మస్మభ్యం శర్మయచ్ఛతం|| 75. ముక్కురంధ్రములారా! ఆభరణముగా ధరించిన వాసుకియొక్క నిట్టూర్పులచే నువాసనగలిగి ప్రకాశించు ఱొమ్ముగల గరళకంఠుని వాసనచూడుడు. మాకుసుఖము నొసంగుడు. ఋ-1-1-33 శ్లో|| స్వస్త్యస్తుసుహితే జిహ్యే విద్యాదాతురుమావతేః| స్తవముచ్చతరం బ్రూహి జయతా మివదుస్దుభిః|| 76. మేలొనర్చు ఓనాలుకా! నీకు శుభమగుగాక. మనకు విజ్ఞానమనొసంగు పరమేశ్వరునిస్తోత్రమును, జయించినవారి జయస్తోత్రమును దుందుభివలె బిగ్గరగా చేయుడు. ఋ-1-225 శ్లో|| చేతః పోతన శోచస్త్వం నిన్ద్యం విన్దాఖిలంజగత్|| అస్య నృత్తామృతం శంభో గౌరో నతృషితః పిబ|| 77. ఓఅల్పచిత్తమా! విచారింపకుము. జగము నింద్యమయినదిగా తెలిసికొనుము. పరమేశ్వరుని నాట్యముఅను అమృతరసమును గౌరమృగమువలె త్రాగుము. శ్లో|| సుగన్ధి సుఖసంప్పర్శం కామదంసోమభూషణమ్| గాఢ మాలిఙ్గమచ్చిత్తయోషాజారమిప ప్రియమ్|| 78. ఓచిత్తమా! స్త్రీత తనకు ప్రియుడగువిటుని కౌగిలించినట్లుగా, మంచినువాసనగలవాడును, సుఖరమయిన స్పర్శకలవాడును, కోరినకోర్కెల నిచ్చువాడును, చంద్రుని అలంకరించుకొన్న శివుని బిగువుగా కౌగిలించుకొనుము. ఋ-6-8-22 శ్లో|| మహామయూఖాయ మహాభుజాయ మహాశరీరాయ మహామ్బరాయ| మహాకిరీటాయ మహేశ్వరాయ మహోమహీం సుష్టుతి మీరయామి|| 79. ఎక్కువ తేజోవంతములగు కిరణములగలవాడును, మిక్కిలి పెద్దవియగు భజములుగలవాడును, పెద్దశరీరముగల వాడును, గొప్ప వస్త్రమును ధరించినవాడును, అత్యున్నతమయిన కిరీటమను ధరించిన మహేశ్వరునకు నేనుజేయు నీగొప్పస్తోత్రము సందించుచున్నాను. ఋ-2-7-17 శ్లో|| యథాకథంచి ద్రచితాభి రీశప్రసాదత శ్చారుభి రాదరేణ| ప్రపూజయామిస్తుతిభిర్మ హేశ మషాఢముగ్రం సహమాన మాభిః|| 80. ఈశ్వరా! నీయనుగ్రహమును మహాదరముతో నెంతో కష్టపడి రచించిన యీ మనోహరమయిన స్తవములచే పలాశదండమును (మోదుగుకఱ్ఱ బ్రహ్మచారికి చిహ్నము) ధరించినవాడును, భక్తులయపరాధమును సహించువాడును, శత్రువులకు భయంకరుడగు శివుని పూజించుచున్నాను. ఋ-6-4-4 శ్లో|| నమశ్శివాయ త్రిపురాన్తకాయ జగత్యధీశాయ దిగమ్బరాయ నమో7స్తు ముఖ్యాయ హరాయ శమ్భో నమో జఘన్యాయ చ బుధ్నిమాయ|| 81. శంభూ, శివునకు నాసమస్కారము. త్రిపురాసుర సంహారముచేసిన మహాత్మునకు ప్రణామము. జగత్ప్రభువునకు నాప్రణతి. దిక్కులేవస్త్రముగాగలవిభునకు నానమోవాకము. ముఖ్యుడును, భక్తులపాపములను హరించుదేవునకు సమస్కృతి. వెనుకను ముందును ఉండు నీకు నమస్కారము. త్రిపురాసురసంహారకథ విద్యున్మాలి, తారాకాక్షుడు. కమలాక్షుడు అనువారు తారకాసురుని కుమారులు. వారు మహాతపస్సుచేసి బ్రహ్మను మెప్పించి అతనివలన కామగమున మువలన మూడుపట్టణములు వరముగాపొందిరి. అపట్టణములు ఒకదానితో నొకటికలియక యున్నంతకాలము వారినెవరును జయింపలేరు. కలిసినచో బలహీనులగుదురు. మయునిచే వారు బంగారు వెండి ఇనుములతో మూడు పట్టణములను నిర్మించుకొని స్వేచ్ఛగా తిరుగుచు నీనతములతో నితరపట్టణముల మీద వ్రాలగా నవి పొడిపొడి అడుచుండెడివి. అపుడు శివుడు బ్రహ్మాదుల తేజస్సును తనలో నైక్యముచేసుకొని, భూమిరథముగను, వేదములు గుఱ్ఱములుగను, సూర్యుడు చంద్రుడును చక్రములుగను, బ్రహ్మను సారధిగాజేసికొని వెళ్ళి తననిండుతేజముతో నాపట్టణములనుస్మరింపగా పని యొకచోటికి జేరినవి. శివుడు తన పాశుపతాస్త్రముతో నామూడుపురములను దగ్ధము చేసెను. (భారతము) శ్లో|| నమో వికారాయ వికారిణ నమో భవాయాస్తు భవోద్భవాయ| బహుప్రజాత్యన్తవిచిత్రరూపా యతః ప్రసూతా జగతః ప్రసూతీ| 82. అనేక ప్రజలతో కూడిన మిక్కిలి విచిత్రరూపమగు జగత్తు ఏ మహాత్మునివలన గల్గినదో అట్టివాడును, జగద్రూపమయిన కార్యమునకు కారణమైనవాడును, జగద్రూపుడును (కార్యకారణములకు అభేదము) సంసారస్వరూపుడును, సంసారకారణమును అగు నీకునమస్కారము. శ్లో|| తసై#్మ సురేశో రుకిరీట వావారత్నావృతాష్టాపద మిష్టరాయ| భస్మాఙ్గతరాగాయ నమః పరసై#్మ యస్మాత్స పరాన్నా పర మస్తికించిత్|| 83. ఏ పరమాత్మకన్నా నన్యమయిన కారణముగాని కార్యముగాని లేదో, దేవేంద్రునికిరీటమునందు పొదుగబడిన నానానరత్నములచే నావరింపబడిన బంగారుపాదపీఠముగలవాడును, శరీరమునిండ విభూతిధరించినవాడు నగు అపరాత్పరునకు నమస్కారము. యం-ఆరు-10-12 శ్లో|| సర్పాధిరాజా షధినాధ యుద్ధక్షుభ్య జ్జటామణ్డలస గహ్వరాయ| తుభ్యం నమ స్సున్దరతాణ్డవాయ యస్మిన్నిదం.... సంచవిచైతి సర్వమ|| 84. సర్పరాజునకును, చంద్రునకును, యుద్ధమువలన కలతచెందిన జటామండలముగలవాడును, సుందరమయిన నాట్యముగలవాడును, ఏమహాత్మునియందు సమస్తలోకములునున్నవో అట్టి ఈశ్వరునకు నమస్కారము. య-ఆరు-10-1 శ్లో|| నమామి నిత్యం త్రిపురారి మేనం యమాన్తకం షణ్ముఖతాత మీశమ్| లలాటనేత్రార్దిపుష్పచాపం విశ్వం పురాణం తమసః పరస్తాత్|| 85. నిత్యుడును (మూడు కాలముయందుండువాడును) త్రిపురముల నశింపజేసినవాడును, యమునిగర్వమడంచినవాడును, కుమారస్వామికి తండ్రియు, నుదిటియందలి మూడవ కంటిచే మన్మథుని దహించినవాడును, సమస్తస్వరూపుడును, పురాణపురుషుడును, అజ్ఞానమునకులోబడని పరమేశ్వరుని నమస్కరించుచున్నాను. య-ఆరు-10-1 శ్లో|| మురారినేత్రార్చితపాదపద్మ ముమాంఘ్రిలాక్షా వరిరక్తపాణిమ్| నమామి దేవం విషనీలకణ్ఠం హిరణ్యదంతం శుచివర్ణ మరాత్|| 86. మహావిష్ణునినేత్రములచే పూజింపబడిన పద్మములవంటి పాదములుగలవాడును, ఉమాదేవి కాలిపారాణిచే సెఱ్ఱనగుచేతులుగలవాడును, విషక్షణముచే నల్లనికంఠము గలవాడును, బంగారుదంతములుగలవాడును, తెల్లనివర్ణము గల దేవుని శీఘ్రముగా నమస్కరించుచున్నాడు. ఋ-3-8-14 శ్లో|| అనన్తమవ్యక్తమచిన్త్య మేకం హరన్త మాశార్బర మమ్బరాఙ్గమ్| అజం పురాణం ప్రణమామి యో7య మణో రణీయాన్ మహాతో మహీయాన్|| 87. అంతములేనివాడును, చక్షురాదులకు కనబడని వాడును, ఊహలకందనివాడును, అద్వితీయుడును, దిక్కులే బట్టగాగలవాడును, ఆకాశ##మే దేహముగాగలవాడును, జన్మలేనివాడును, అతిప్రాచీనుడు, ఏమహాత్ముడు అణువు కన్నచిన్నవాడును, మహత్తు (ఆకాశాదుల)న కన్న పెద్దవాడునో, అట్టి పరమాత్మను సమస్కరింతురు. అణువు అన్నిటికన్నచిన్నది. అదిఅస్మదాదులకు కనబడదు. అయినను, యోగీశ్వరులకు ప్రత్యక్షవిషయమగు చున్నది. కాని పరమాత్మ యోగులప్రత్యక్షమునకుగూడ అతీతుడనిభావము. ఆకాశాదికము మహత్పరిమాణముగలదు. ఈ అకాశము ఈ బ్రహ్మాండముననేకలదు. పరమాత్మ అనేకకోటి బ్రహ్మాండములలో వ్యాపించియుండుటచే ఆకాశమునకన్న నధికుడని తాత్పర్యము. శ్లో|| అ న్తస్థ మాత్మాన మజం న దృష్ట్యా భ్రమన్తి మూఢా గిరిగహ్యరేషు పశ్చాదుదగ్దక్షిణతః పురస్తాత్ అధస్వి దాసీ(3)ను పరిస్విదా సీ(3)త్ 88. తనలోనున్న జన్మరహితుడగు పరమాత్మను మూఢులు తెలిసికొనలేక కొండగుహలకు బోవుచున్నారు. అపరమాత్మ నలుదిక్కులందును, క్రిందను, పైనిగూడ ఉన్నాడు. ఋ-8-17-8-9 శ్లో|| ఇమం న మా మీశ్వర విన్దుమౌళిం ళివం మహానన్ద మశోకదుఃఖమ్| హృదయమ్బుజే తిష్ఠతి యః పరాత్మా పరీత్య సర్వాః ప్రదివో దిశశ్చ|| 69. సర్వదిక్కులయందును, విదిక్కుల (మూలాలు) యందును వ్యాపించియున్న యేపరమాత్మ హృదయపద్మమందున్నాడో, అట్టివాడును, చంద్రుని శిరమునధరించినవాడును, మంగళస్వరూపుడును, మహానందస్వరూపుడును, శోకము దుఃఖము లేనివాడును, నగు ఈశ్వరుని నమస్కరింతును. య-ఆరు-10-1 శ్లో|| రాగాదికాపద్యసముద్భవేన భగ్నం భవాఖ్యేన మహామయేన| విలోక్య మాం పాయ చన్ద్రమౌళే భిషక్తమం త్వాం భీషజాం శృణోమి|| 90. ఓచంద్రమౌళీ! (చంద్రునిశిరమున ధరించినవాడా!) రాగద్వేషాదులను అహితపదార్థములచే గల్గినసంసారమనెడు మహాయోగముచే బాధింపడిన నన్నుగాంచి రక్షింపుము. నిన్నువైద్యులతో అతిశ్రేష్ఠవైద్యునిగా వినుచున్నానుగదా. ఋ-2-7-16 శ్లో|| దుఃఖాంబురాశిం సుఖలేశహీన మస్పష్టపుణ్యం బహుపాతకం మామ్ మృత్యోః కరస్థం భవరక్షభీతం పశ్చా త్పురస్తా దధరాదుదక్తాత్|| 91. దుఃఖముసముద్రములోనున్నవాడను, కొంచెమేని సుఖములేనివాడను, పుణ్యసంబంధములేనివాడను, మహారాపాత్ముడను, మృత్యువుచేతిలోనున్నవాడను, మిక్కిలిభయము చెందియున్న నన్ను వెనుక ముందు పైని క్రింద అన్నిదిక్కుల నుండి రక్షింపుము. ఋ-8-49 శ్లో|| గిరీన్ద్రజాచారు ముఖావలోక సునీతయో దేవ తదైవ దృష్ట్యా| మయం దయాపూవరితయైన తూర్ణమపో నవానా దురితా తరేమ| 92. హిమాలయపుత్రికయగు పార్వతి ముఖమును గాంచుటచే చల్లనైన దయతో నిండిన నీదృష్టిచేత పాతకములను మేము శీఘ్రముగా నావచేత ఉదకములనువలె తరింతుముగాక. ఋ-5-1-12 ఋ-1-1-112 శ్లో|| అపారసంసారసముద్రమధ్యే నిమగ్న ముత్క్రోశ మనల్పరాగమ్| మా మక్షమం పాహి మహేశజుష్ట మెజిష్టియా దక్షిణయేవ రాతిమ్| 93. దరిలేని సంసారముసముద్రమధ్యమున మునిగియున్న వాడను, మొరపెట్టుచున్నవాడను, అనేకములైన కోరికలు గలవాడను, అసమర్థుడను అగునన్ను ఓ మహేశా! ఎక్కువ దక్షిణాద్రవ్యముచే ప్రీతిబొందిన దాతవలె రక్షింపుము. ఋ-2-4-8 శ్లో|| స్మరన్ పురా సంఞ్చితమపాతకాని ఖరం యమస్వాపి ముఖం మయారే| బిభేమి మే దేహి యధేష్టమాయ ర్యదిక్షతాయుర్యది వా పరేతః|| 94. యముని శిక్షించిన మహాత్మా! పూర్ము నేను సంపాదించిన పాపములను, భయంకరమయిన యమునిముఖమును స్మరించుచు, భయపడుచున్నాను. కావున నేను అల్పాయువుకలవాడనైను, మృత్యుగ్రస్తుడనగు నన్ను యధేష్టమయిన ఆయువునొసంగి రక్షింపుము. ఋ-8-8-19 శ్లో|| సుగన్ధిభి స్సున్దరభస్మగౌరై నరస్తభోగై ర్ముదులై రఘోరైః| ఇమం కాద లిఙ్గతి మాం పినాకీ స్థిరేభి రఙ్గై పురురూప ఉగ్రః|| 95. సరిమళము గలవియు, అందమగు భస్మముపూత గలవియు, అనంతమయిన పాములపడగలు కలవియు, మృదువయినవియు, భయంకరములు కానివియు, స్థిరములును అగు అవయవములచే అనేక రూపములుగలవాడును, శత్రుభయంకరుడును, పినాశకమను విల్లుధరించిన పరమేశ్వరుడు ఈనన్నెప్పుడు కౌగిలించునో కదా! ఋ-2-7-17 శ్లో|| క్రోశన్తమీశః పతతం భవాబ్ధౌ నాగస్య మణ్డూక మివా తిభీతమ్| కదాసుమాం రక్ష్యతి దేవదేవో హిరణ్యరూప స్సహిరణ్యసందృక్|| 96. పామునోటిలో నున్నకప్పవలె భయముచెంది సంసారసముద్రమున బడియున్నవాడను గనుకనే మొఱపెట్టుచున్న నున్న దేవతలకుదేవుడును, బంగారురంగుకలవాడును, బంగారపు (మేలైన) చూపులు గలయాప్రభువు నన్నెప్పుడు రక్షించునోకదా! ఋ-2-7-23 శ్లో|| చారుస్మితం చన్ద్రకలావతంసం గౌరీకటాక్షార మయుగ్మనేత్రమ్| ఆలోకయిష్యామి కదా ను దేవ మాదిత్యవర్ణం తమసః పరస్తాత్|| 97. మనోహరమయిన నవ్వుగలవాడును, చంద్రకళను శిరోభూషణముగా ధరించినవాడును, పార్వతీదేవి క్రీగంటి చూపున కర్హుడును, (సౌమ్యుము) మూడుకన్నులు గలవాడును, సూర్యునివలె ప్రకాశమనమగు తేజస్సుగలవాడును, తమస్సున కతీతుడునగు ప్రభువును నేనెప్పుడు చూడగల్గుదునో కదా! య-ఆరు-3-13 శ్లో|| అగచ్ఛతా త్రాశు ముముక్లవో యే యూయం శివం చింతమత్తాన్తరాబ్జే| ధ్యాయన్తిముక్త్యర్ధ మిమం హి నిత్యం వేదాస్త విజ్ఞాన సునిశ్చితార్థాః|| 98. ముక్తియందు కోర్కెగలవారెవరో వారువెంటనే రండు. శివుని మీయొక్క పద్మములంటి మనస్సులలో ధ్యానింపుడు- ఉపనిషద్విచారముచేత బాగుగా నిశ్చయించుకొన్న పరమాత్మతత్వముగల మహాత్ములు ముక్తికై యీ పరమేశ్వరునే ధ్యానించుచుందురు. య-ఆరు-10-1 శ్లో|| ఆయాత యూయం భువనాధిపత్యకామా మహేశం సకృదర్చయధ్వమ్| ఏనం పూరాభ్యర్చ్య హిరణ్యగర్భో భూతస్య జాతః పతి రేక అసీత్|| 99. లోకమున ప్రభుత్వమునకు కోరుప్రాణులారా రండు. ఒక్కమారు పరమేశ్వరుని పూజింపుడు. హిరణ్యగర్భుడు (సృష్టికర్త) పూర్వమీపరమేశ్వరుని పూజించి, సమస్తభూతములకుడు ఏకాధిపతి అయ్యెనుకదా! ఋ-8-7- య-4-1-8 శ్లో|| యే కామయన్తే విపులాం శ్రియం తే శ్రీకణ్ఠ మేనం సకృదానమన్తామ్| శ్రీమానయం శ్రీపతివంద్యపాద శ్శ్రీణా ముదారో ధరుణోరణీయాన్|| 100. ఎవరు ఎక్కువ సంపదలనుకోరుదురో, వారు శ్రీకంఠుని ఒక్కసారి నమస్కరింతురుగాక. ఈ శ్రీకంఠుడు శ్రీమంతుడు. శ్రీమహావిష్ణువుచే నమస్కరింపదగిన పాదములు గలవాడు. సంపదలనొసంగువాడు. సంపదలనుధరించువాడు. ఋ-7-8-28 య-4-2-2 శ్లో|| సుపుత్రకామా అపియే మనుష్యా యువాన మేనం గిరిశం సమన్తామ్| యతః స్వయాభూర్జగతాం విఛాతా హిరణ్యగర్భ స్సమవర్తతాగ్రే|| 101. మంచిపుత్రులను కోరువారెవరో వారు, యువకుడును, కైలాసశైలమందు శయనించు ఈశ్వరుని సేవింపుడు. ఎవనివిలవ స్వయముగా జన్మగలవాడును జలములను జగములను సృజించెడు హిరణ్యగర్భుడు మొదలుపుట్టెనో. ఋ-8-7-3 శ్లో|| అలం కి ముక్తైర్బహుభి స్సమీహితం సమస్త మస్యాశ్రయణన సిధ్యతి| పురైన మాశ్రిత్య హి కుమ్భసంభవో దివా న నక్తం పలితో యువా7జని|| 102. పెక్కుమాటలతో పనియేమి? ఈ ప్రభువు నాశ్రయించినచో కోరికలన్నియుసిద్ధించును. పూర్వమీప్రభువు నాశ్రయించియే అగస్త్యుడు ముదిమిని పోగొట్టుకొని ¸°వనమను తిరిగి సంపాదించుకొనెను. ఋ-2-213 శ్లో|| అన్యత్పరిత్యజ్య మమాక్షభృఙ్గ స్సర్వం సదైనం శివ మాశ్రయధ్వం| అమోదవా నేష మృదు శ్శివో7యం స్వాదుష్కి లాయం మధుమా......ఉతాయమ్|| 103. నాయింద్రియములను తుమ్మెదలారా! అన్నింటిని విడిచి యీ ఎల్లపుడును శివునాశ్రయింపుడు. ఈతడు సువాసనగలవాడు. మృదువైనవాడు, మంగళస్వరూపుడు, మధురమైనవాడు, మంచితేనెతో గూడినవాడు. ఋ - 4-7-30 శ్లో|| భవిష్యసి త్వం ప్రతిమానహీనా వినిర్జితాశేషనరా మరా చ| నమో7స్తు తే వాణి మహేశ మేనం....స్తుహి శ్రుతం గర్తసదం యువానమ్|| 104. ఓవాణీ (సరస్వతీ) నీవు సాటిలేనిదానవును. సమస్తమగుదేవతలను నరులను జయించినదానవును కాగలవు నీకు నమస్కారము. ప్రసిద్ధుడును గోతివంటి భక్తులహృదయ పద్మములుయందెల్లప్పుడును నివసించువాడును. నిత్యయువకుడను నగు ఈమహ్మాత్ముని స్తుతింపుము. ఋ-2-7-8 య-4-5-10 శ్లో|| యద్యన్మశ్చింతయసి త్వమిష్టం తత్తద్భువిష్యత్య ఖిలం ధ్రవంతే| దుఃఖే నివృత్తి ర్విషయే కదాచిదా చక్ష్మహే సౌమనసాయ రుద్రమ్|| 105. ఓచిత్తమా! నీవు ఏయేవస్తువును గుఱించి యాలోచించుచున్నావో అదినీకు తప్ఫక సిద్ధింపగలదు. దుఃఖమగు విషయమెప్పుడును నిన్నుసోకదు. మనస్సుయొక్క సౌమసమస్యముకొఱకు రుద్రుని పూజింపుము. ఋ-4-2-1 శ్లో|| అజ్ఞానయోగా దపచారకర్మ యత్పూర్యమస్మాభి రనుష్ఠితం తే| తద్దేవ సోఢ్వా సకలం దయాలో! పితేవ పుత్రాన్ ప్రతినో జుషస్వ| 106. పూర్వము అజ్ఞానముచే మేముచేసిన దుష్టకర్మలను సహింపుము. ఓదాయామయా! పుత్రులను తండ్రివలె ప్రీతితో మమ్ముచూడుము. ఋ-5-4-21 య-ఎ-2-15 శ్లో|| సంసారాఖ్యక్రుద్ధసర్పేణ తీవ్రైఃరాగ ద్వేషోన్మాద లోభాదిదంతైః| దుష్టం దృష్ట్వా మాం దయాళుః పినాకీ దేవస్త్రాతా త్రాయుతా మప్రయుచ్ఛన్|| 107. సంసారము అనుకోపించిన సర్పము రాగము, ద్వేషము, మదము, లోభము మొదలగు పదనగుదంతములచే దర్మార్గుడ నన్ను కఱచినది. దయాశీలుడును, పినాకమను వింటినధరించినవాడును, రక్షక్షుడునగు ప్రభువు కోపములేని వాడై ననను రక్షించుగాక. ఋ-1-7-24 శ్లో|| ఇత్యుక్త్వాన్తేయత్సమాధేర్నమన్తః రుద్రాద్యా స్త్వాం యాన్తి జన్మాహి దష్టాః| సన్తోనీలగ్రీవసూత్రాత్మనాహం తత్వాయామి బ్రహ్మణా వన్దమానః|| 108. రుద్రాదులగు ఏ యోగీశ్వరులు జన్మమను పాముచేకఱవబడి తమ తమస్సమాధినుండిలేచి ఇట్లుస్తుతించి నమస్కరించినవారై నీసాయుజ్యమును పొందుచున్నారు. ఓనీలకంశా! నేనుసూత్రప్రాయమయిన వేదవాక్యములచే నమస్కరించిన వాడనై నిన్నుపొందుదును. ఋ-1-2-15 య-2-2-11 శ్లో|| భవాతిభీషణ జ్వరేణ పీడితాన్మహాభాయా| నశేషపాతకాలయా నదూరకాలలోచనాన్| అనాధునాధతే కరేణ భేషజేన కాలహ| న్ను దుషణో వసౌ మహేమృశస్వశూరరాధసే|| 109. సంసారము అను మిగులభయంకరమైన జ్వరముచే పీడింపబడినవారము. మిగులభయము కలవారము. అన్నిపాపములను జేసినవారము. దగ్గరగానున్న యమునికన్ను చూపుగలుగలవారము. ఓ అనాధనాధ! యమాంతకా! నీ హస్తము అనుమందుచే మమ్ముద్ధరింపుము. ఋ-6-5-9 శ్లో|| జయేమ యేను సర్వమేతదిష్ట మష్టదిగ్గజం| భువః స్థలం సభః స్థలం చ తద్గతమ్| య ఏష సర్వదేవదానవా నత స్సభావతి| స్సవో దదాతు తం రయిం పిశఙ్గసందృశమ్|| 110. అష్టదిగ్గజములచే వహింపబడిన యీభూతలము నంతను ఆకాశమున, తద్గతమయిన స్వర్గాదికమును మేము దేనిచేత జయింపగలమో, ఏమహాత్ముడు సమస్తదేవతల చేతను రాక్షసులచేతను నమస్కరించుబడువాడో అట్టిపరమేశ్వరుడు మాకు బంగారముతో తుల్యమయిన మహాధనమును మాకొసంగుగాక. ఋ-2-8-8 శ్లో|| నమో భవాయ తే హరాయ భూతి భూషితోరసే| నమో మృడాయతే హరాయ భూపతిభీతిభజ్గినే| నమ శ్శివాయ విశ్వపాయ శాశ్వతాయ శూలినే| న యస్య హన్యతే సఖా న జీయతే కదాచన|| 111. ఎవనిస్నేహితుడు (భక్తుడు) ఎప్పుడును కొట్టబడడో, మరియు జయింపబడడో, అట్టి జగత్కారణమగు ప్రభువునకు నమస్కారము. హరునకు నమస్కారము. విభూతి పూసినఱొమ్ముగల యాతనికి ప్రణామము. సుఖమునుచేయు నాతనికి నమస్కారము. సంసారమును హరించువానికి సనమన్సు. ప్రాణులభయమును తొలగించు నాప్రభువునకు నమస్కారము. మంగళరూపునకు సమస్కృతి. జగత్పరిపాలనకునకు నమస్కారము. నాశనరహితునకు నానమోవాకము. త్రిశూలధారికి నా ప్రణామము. శ్లో|| సురపతిపతయే నమోనమః| క్షితిపతిపతయే నమో నమోనమః| ప్రజాపతిపతయే నమో7 ంబికా| పతయ ఉమాపతయే పశువతయే సమానమః|| 112. దేవేంద్రునకుప్రభువగు వానికి నమస్కారము. రాజాధికాజునకు నమస్కారము. ప్రజాపతులకు (సృష్టికర్తలకు) ప్రభువగువానికి నమస్కారము. అంబికాపతికిని, ఉమాపతికిని, ప్రాణికోటికి ప్రభువును అగునతనికి నమస్కారము. య-ఆరు-10-22 శ్లో|| వినాయకం వన్దకను స్తకాహతి ప్రణాద సంఘష్ట సమస్తవిష్టవమ్| నమామి నిత్యం ప్రణతావాశనం కవిం కవీనా ముపవశ్రవస్తమమ్|| 113. సాష్టాంగనమస్కారములు చేయువారి శిరస్సుల ధ్వనులచే ప్రతిధ్వనులుగల మూడులోకములుగలవాడును, నమస్కరించు వారి బాధలను తొలగించువాడును, నిత్యుడును, కవులలో మహాఠవియు, ఎక్కువకీర్తిగలవాడునకు వినాయకునకు నమస్కారము. ఋ-2-6-29 య-2-3-14 శ్లో|| దేవా యుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్యాయం హ్యాయమ్| యం సిద్ధయ న్తి స్కందం వన్ధేసుబ్రహ్మణ్యో .....సుబ్రహ్మణ్యోమ్|| 114. దేవతలు యుద్ధమందును, బ్రాహ్మణులు యాగములందును ఏమహాత్ముని పిలిచి, తయయిష్టసిద్ధిని సిద్ధింపజేసికొనుచున్నారో అట్టికుమారస్వామికి సుబ్రహ్మణ్యో ...... సుబ్రహ్మణ్యోం అని నమస్కరించుచున్నాను. య-ఆరు-1-2-12 శ్లో|| నమశ్శివాయై జగదంబికాయై శివప్రియామై శివవిగ్రహాయై, సుముద్భభువాద్రిపతేస్సుతా యా చతుష్కపర్దాయువతిస్సుపేశాః|| 115. హిమాచలముయొక్క యేకుమార్తె నాలుగు పాపిటలుగల కేశములుకలదిగ పుట్టినదో, అట్టిదియు, జగన్మాతయు, శివునకు మిక్కిలి యిష్టురాలును, మంగభకరమగు శరీరముగలదియు, యోగ్యమగు వర్ణముగల పార్వతికి నా నమస్కారము. ఋ-8-6-16 శ్లో|| హిరణ్యవర్ణాం మణినూపురాంఘ్రం ప్రసన్నవక్త్రాం శుకపద్మహస్తమ్| విశాలనేత్రాం ప్రణమామి గౌరీం పచోవిదం వాచ మునీరయన్తీమ్|| 116. బంగారు రంగుకలదియు, రత్నములుకూర్చిన పాదాభరణములుగలదియు, అనుగ్రహమును సూచించుముఖముగలదియు, చిలుకను పద్మమును హస్తమందు ధరించినదియు ఆకర్ణాంతవిశాలనేత్రములు గలదియు, వేదార్థమును దెలిసి వేదవాక్యములను పలుకుచున్న గౌరీదేవికి నా నమస్కారము. ఋ-6-7-8 శ్లో|| నమామి మేనాతనయా మమేయా ముమా మిమాం మానవతీతం చ మనా%్‌యమ్|| కరోతి యా భూతిసితో స్త నౌ ద్వౌ ప్రియ సఖాయం పరిషస్వజావా|| 117. ఏ ఉమాదేవి తన ప్రియ స్నేహితుడైన శివుని కౌగిలించుకొని తన స్తనములను విభూతిచే తెల్లనివిగా జేసెనో అట్టిదియుచ, మేనా దేవి పుత్రికయు, తెలిసికొఓన శక్యముగాని చిత్తౌన్నత్యము గలదియు పూజ్యురాలనునగు ఉమాదేవిని నమస్కరించుచున్నాను. ఋ-5-1-19 య-4-5-6 శ్లో|| కాన్తా ముమా కాన్త నితాన్త కాన్తి భ్రాన్తా ముపాన్తానత హద్యజేన్త్రామ్|| నమో సి%్‌మ యా స్తె గిరిజస్య పార్శ్వే విశ్వానిదేవి భువనాభి చక్ష్య|| 118. మిక్కిలి అలందముగలదియు, తన ప్రియుని కాంతిచే మోహింపబడినదియుచ దగ్గరకుజేరి నమస్కరించు విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు కలదియు శివుని పార్శ్వము నుండి సమస్త లోకములను జూచుచున్న ఉమాదేవిని నమస్కరించుచున్నాను. ఋ-1-6-25 శ్లో|| వన్దే గౌరీం తుఙ్గపీనస్తనీంతాం చన్ద్రచూడాం శ్లిష్టసర్వాంగరాగామ్|| ఏషా దేవీ ప్రాణినా మంతరాత్మా దేవం దేవం రాధసే చోదయన్తీమ్|| 119. ఉన్నతము బలిసిన స్తనములు గలదియు, చంద్రుని శిరోభూషణముగా ధరించినదియు, శరీరమును సుగంధ ద్రవ్యముల నలదికొన్నదియు, నగు గౌరీదేవికి నమస్కారము. ఈ దేవి సర్వప్రాణుల అంతరాత్మయై ఆయా దేవతలను ఫలముల నిచ్చుటకు ప్రేరణ చేయుచున్నది. ఋ-5-5-26 శ్లో|| ఏనాం వన్దే దీనరక్షా వినోదాం మేనాకాన్యా మానతానన్దదదాత్రీమ్| యా విద్యానాం మంగళానాం వాచా మేషా నేత్రీ రాధస స్సూనృతానామ్|| 120. ఏ పార్వతి విద్యలకును మంగళకరములును సత్యములునగు వాక్కులను, ఫలసిద్ధికిని నాయకురాలో, దిక్కులేని వారిని రక్షించుటయే వినోదముగా గలదియో మరియు నమస్కరించు వారి కానందము గల్గించునదియో ఆ మేనాకన్యను (పార్వతిని) నమస్కరించుచున్నాను. ఋ-5-5-23 శ్లో|| భవాభిభీతో రుభయాపహన్త్రి భవాని భోగ్యాభరణౖకభోగైః| శ్రియం పరాం దేహి శివప్రియే నో యయా తివిశ్వా దురితా తరేమ|| 121. భయము చెందిన భక్తులభయమును తొలగించు భవానీ! శివునకు ప్రియురాలా! సర్వ పాపముల నుండి మమ్ము తరింపజే సంపదలను, అనుభవింపదగు వస్తువులకు భూషణమగు అనుభవముతో గూడ మాకు దయచేయుము. ఋ-6-3-28 శ్లో|| శివే కథం త్వం మతిభి స్తు గీయసే జగత్కృతిః కేళిరయం శివః పతిః| హరి స్తు దాసో నుచరేని%్‌దరా శచీ సరస్వతీ వా సుభగా దదిర్వసు|| 122. ఓ దేవీ! జగత్తుల సృజించుట నీకు విలాసము. శివుడు నీకు భర్త. విష్ణువు నీకు దాసుడు. ఐశ్వర్యము నొసంగు లక్ష్మీ నీకు పరిచారిక. శచీదేవి, సరస్వతియు నిన్ననుసరించి యుండువారు. అట్టి నిన్ను నా స్తోత్రములచే నెట్లు స్తుతింపగలను? ఋ-6-2-4 శ్లో|| ఇమం స్తవం జైమినినా ప్రచోదితం| ద్విజోత్తమో యః పఠతీశ భక్తితః| త మిష్టవాక్ సిద్ధిమతిద్యుతి శ్రియః| పరిష్వజన్తే జనమో యథాపతియ్|| 123. జైమిని మహర్షి చేసిన యీ స్తోత్రమును ఏ బ్రాహ్మణ శ్రేష్ఠుడు భక్తితో చదువునో, అతనిని ఇష్టమగు వాక్కు సిద్ధి బుద్ధి సంపదలు ప్రియభార్య పతినివలె కౌగిలింపగలవు. ఋ-7-8-24 శ్లో|| మహీపతి ర్య స్తు యుయుత్సు రాదరా| దిమం పఠత్యస్య తథైవ సాదరామ్| ప్రయాన్తి శీఘ్ర మధాన్త కాన్తికమ్| భియం దధననా హృదయేషుశత్రవః|| 124. ఏ మహారాజు యుద్ధము చేయదలచి యీ స్తవము నాదరముతో పఠించునో ఆతని శత్రువులు హృధయములందు భయము చెంది శీఘ్రముగా యముని సమీపమునకు బోవుదురు. ఋ-8-3-19 శ్లో|| త్రైవర్ణికేష్వన్యతమో య ఏనం నిత్యం కదాచిత్పఠతీశభకి%్‌తతః| కళేబరాన్తే శివపార్శ్వవర్తీ నిరఞ్జన స్సామ్య ముపైతి దివ్యం|| 125. ఓ యీశ్వరా! త్రైవర్ణికులలో (బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో) నెవ్వడేనీ నిత్యము భక్తితో నొక్కమారు చదివినను, అతడీ శరీరమును విడిచిన తర్వాత శివుని సమీపమునుజేరి పాపరహితుడై శివసాయుజ్యము బొందుచున్నాడు. ముండక-3-2-8 శ్లో|| లభ##న్తే పఠన్తో మతిం బుద్ధికామాః లభ##న్తే చికాయు స్తధా యుష్యకయామాః లభ##న్తే హపుత్రాన్ లభ##న్తే హ పుత్రాన్|| 126. బుద్ధిని కోరువీరి స్తవమును పఠించినచో ఉత్తమ బుద్ధిని పొందుదురు. ఆయువును కోరు వారి దీనిని పఠించినచో చిరాయువును పొందుదురు. సంపదను (పుష్టి) కోరువారు దీనిని పఠించిన సంపదలను బొందుదురు. పుత్రులను బొందుదురు. ఫలశ్రుతి శ్లో|| ఇత్యనేన స్తవేనేశం స్తుత్వా సౌ జైమినిర్మునిః| స్నేహాశ్రుపూర్ణ నయనః ప్రణవామ సభాపతిమ్|| 1. జైమిని మహర్షి యిట్లీ స్తవముచే నీశ్వరుని స్తుతించి ఆనంద బాష్పములతో గూడిన కన్నులుగలవాడై చిత్సభాపతిని నమస్కరించెను. శ్లో|| ముహుర్ముహుః పిబన్నీ శతాణ్డవామృతమాగమ్| సర్వాన్కామానవాప్యాన్తే గాణాపత్యమవాపహ|| 2. ఆ మహర్షి మాటిమాటికి పరమశివుని తాండవామృతమును కుత్తుక (కంఠము) వఱకుక్రోలి, సమస్తమగు కోర్కెలను బొంది తుదను శివుని ప్రమథ గణములకు ప్రభువయ్యెను. శ్లో|| పాదం వాప్యర్థ పాదం వా శ్లోకం శ్లోకార్థమేవ వా| యస్తు వాచయతే నిత్యం శివలోకం స గచ్ఛతి|| 3. ఈ స్తోత్రములో నొక పాదమును గాని సగము పాదముగాని శ్లోకమునుగాని శ్లోకార్థమునుగాని నిత్యము చదువువాడు శివలోకమును పొందును. శ్లో|| వేద శ్శివః శివో వేదః వేదాధ్యాయీ సదాశివః| తస్మాస్సర్వ ప్రయత్నేన వేదాధ్యాయిన మర్చయేత్| 4. వేదమే శివుడు, శివుడే వేదము వేదము నధ్యయనము చేయువాడు సదాశివుడు. కావున వేదమును జదివిన వానిని సర్వ ప్రయత్నముల చేతను పూజింపవలెను. శ్లో|| అధీవిస్మృతావేదా వేదపాదస్తవం పఠన్| స చతురే%్‌వదసాహస్రపారాయణ ఫలం లభేత్|| 5. వేదాధ్యయనము చేసి మరచిపోయినవాడు వేదపాదస్తవమను పఠించినచో నాలుగు వేదములు వేయిమారులు పారాయణము చేసిన ఫలమును పొందును. శ్లో|| చిదమ్భర మితి బ్రూయాత్ సకృజ్జననవర్జితః| ముక్తిఘణ్టామణి పథం మోక్షమేవసమశ్నుతే|| 6. ఒక్కమారు చిదంబరమని యుచ్చరించినవాడు తిరిగి జన్మలేనివాడై, ముక్తి, ముక్తి అని గణగణమ్రోగు గంటలు గల మార్గముగల మోక్షమునే పొందుచున్నాడు. శ్లో|| కృపాసముద్రం పసుముఖం త్రిణత్రం| జటాధరం పార్వతీ వామభాగమ్| సదాశివం రుద్ర మనంత రూపం| చిదమ్బరేశం హృది భావయామి|| 7. దయకు సముద్రుడును, దర్శనీయమయిన (అందమైన) ముఖముగలవాడును, మూడు కన్నులు గలవాడును, జడలను ధరించినవాడును, పార్వతీదేవి ఎడమప్రక్కనగలవాడును, సదాశివస్వరూపుడును అగు చిదంబర ప్రభువును హృదయమున ధ్యానింతును. శ్లో|| ఆనన్తనృత్త సమయే నటనాయకస్య| పాదారవిన్దమణినూపురశింజితాని| ఆనన్దయన్తి మదయన్తి వియోహయన్తి| రోమాంచయన్తి నయనాని కృతార్థయన్తి| 8. నటరాజు యొక్క ఆనంద తాండవ సమయమందు ఆయన పాదపద్మములయందు ధరించిన మణులతో కూర్చిన పాదాభరణముల ధ్వనులు ఆనందమును కల్గించుచున్నవి. ఒడలు తెలియకుండ జేయుచున్నవి. శరీరమున గగుర్పాటు కలిగించుచున్నవి. నేత్రములకు సార్ధక్యమును గల్గించుచున్నవి. శ్లో|| శివకామేశ్వరీ శ్రీమన్నటరాజ మహేశ్వరౌ| బ్రహ్మజ్ఞాన ప్రదానేన త్రాయేతాం పాఠకాన్సదా|| 9. శ్రీ శివకామసుందరీ నటరాజ మహేశ్వరు లుభయులును ఈ వేదపాద స్తవరాజమును పఠించు పాఠకులకు బ్రహ్మజ్ఞాన మొసంగా వారినెల్లప్పుడును రక్షింతురు గాక. శ్లో|| అతిభీషణ కటుభాషణ యమకిఙ్కర వటలీ! కృతతాడన పరిపీడన మరనాగమ సమయే| ఉమయా సహ మయచేతసి యమశాసన నివసన్| హర శఙ్కర శివ శఙ్కర హర మే హర దురితమ్|| 10. హర, శఙ్కర, శివ, శఙ్కర, మిక్కిలి భయంకరులును, పరుష వాక్కులు పల్కువారును అగు యమదూతలు కొట్టుటవలన గల్గిన బాధగల మరణ సమయమునందు ఓ యమశాసనా! ఉమాదేవితో గూడి నా చిత్తమున నివసించుచు నా పాపమును హరింపుము. ఫలశ్రుతి సమాప్తము శ్రీశివకామసున్దరీ నటరాజ పరమేశ్వరార్పణమస్తు. శ్రీ అనన్ద నటరాజ ధ్యానము శ్లో|| సప్తార్ణవ పరిక్షిప్తాం ద్వీపైః స్సప్తభి రని%్‌వతామ్| పంచాశత్కోటి విస్తీర్ణాం ధ్యాయేత్సర్వాం సభాం మహీమ్|| 1. సప్తసముద్రములచే వ్యాపింపబడినదియు, సప్తదీపములతో గూడినదియు, ఏబది కోట్ల యోజనముల విస్తీర్ణతలగల సమస్త భూమిని చిత్సభగాధ్యానింపవలెను. శ్లో|| తస్యా శ్చ హృదమ్భో జే మాతృకాక్షర కేసరం| ధ్యాయేదష్టదలం ధీమాన్ మహాహృదయమత్రచ|| 2. ఆ భూమి యొక్క హృదయ పద్మమున ఆకారాది క్షకారాంతవర్ణములు కింజల్కములుగాగల ఎనిమిది దళములు గల మహాహృదయమునుగా పండితుడు చిదంబరమును ధ్యానింపవలెను. శ్లో|| తస్య మధ్యే త్రికోణ తు తరుణన్దుశిఖామణిమ్| చారుచూడజటాపాశం చలద్బోగీన్ద్రకుణ్డలమ్|| 3. ఆ మహాహృదయమున త్రికోణము యొక్క మధ్యమ నూతననమయిన చంద్రకళను శిరోభూషణముగా ధరించినవాడును, మనోజ్ఞమగు జలాజూటము గలవాడును, ఇటునటు కదలు సర్పరాజులు కుండలములుగా గలవాడును, శ్లో|| త్రిపుణ్ద్రం విలసత్ఫాలం చన్ద్రార్కానలలోచనమ్| వామభాగస్థితాం దేవీం వీక్షయన్త మపాఙ్గతః| 4. మూడు విభూతి రేఖలు గలవాడును, ప్రకాశించు నుదురు కలవాడును, చంద్రుడు, సూర్యుడు, అగ్ని నేత్రములుగా గలవాడును, తన యెడమ భాగమందున్న పరమేశ్వరుని క్రీగంటితో చూచుచున్నవాడును. శ్లో|| అధరోల్లంఘనాకార సంజిహానస్మితాఙ్కురమ్| కస్తూరికాసితోద్దామ కాలకూటలసద్గళమ్|| 5. క్రింది పెదవిని అతిక్రమించి పైకివచ్చుచున్న చిరునవ్వుగలవాడును కస్తూరివలె నల్లని గొప్ప కాలకూటముచే ప్రకాశించు కంఠముగలవాడును. శ్లో|| మహా డమరు వాధ్యూర్ధ్వ దక్షపాణి సరోరుహమ్| త్వదఙ్ఘ్రికర పద్మాన్త చలదుత్థిత పావకమ్|| 6. మహా డమరు (వాద్య విశేషము డమరుగము) కము వాయుంచు పై కెత్తిన కుడి హస్త పద్మము గలవాడును వేరొక పద్మమువంటి హస్తము నుండి చలించును. పైకివచ్చిన ఆగి కలవాడును. శ్లో|| దక్షాధఃకరపద్మేన హరన్తం ప్రాణినాం భయమ్| విక్షిప్తాన్యకరం తిర్యక్ కుంచితేవాంఘ్రినాధమమ్|| 7. క్రింది కుడిహస్తముతో (నాలుగు భుజములలో) ప్రాణికోటి భయమును పోగొట్టుచున్న వాడును, క్రిందికి అడ్డమబుగా ముడిచిన యొక కాలితో క్రిందికి ఉంచబడిన మరియొక హస్తముగలవాడును. శ్లో|| వామేతరప్రకోష్టాన్త నృత్యత్పణ ధరేశ్వరమ్| కల్పబ్రహ్మకపాలావాం మాలయా లమ్భమానయా|| 8. కల్పాంతములయందలి సృష్టికర్తలయొక్క వ్రేలాడుచున్న పుఱ్ఱల మాలకలవాడును, కుడి ముంజేతి దగ్గర నాట్యము చేయుచున్న సర్పరాజుకలవాడును. శ్లో|| స్వతన్త్ర మాత్మనో రూప మాచక్షాణంస్వభావతః| వ్యాఘ్రచర్మామ్బరధరం కటిసూత్రితపన్నగమ్| దక్షపాదాబ్జ విన్యాసాత్ అధఃకృత తమోగుణమ్|| 9. స్వతంత్రమగు తన స్వరూపమును స్వభావముచేతనే ప్రపదర్శించుచున్నవాడును పెద్దపులితోలును ధరించిన వాడును, సర్పమును మొలత్రాడుగా జేసికొన్నవాడును, కుడిపాదము యొక్క విన్యాసముచే తమస్సును (అజ్ఞానమును) క్రిందికి అణగద్రొక్కినవాడును. శ్లో|| భస్మోద్ధూళిత సర్వాంగం పరమానన్ద తాండవమ్| ఏవం ధ్యాయేత్పరేశానం పుణ్డరీకపురరేశ్వరమ్|| 10. భస్మము ధరించిన సర్వ శరీరము గలవాడును, పరమానందమె కలగుజేయు తాండవము గలవాడును, అగు పుండరీక పురాధీశ్వరుడగు పరమేశ్వరునిట్లు ధ్యానింపవల యును. నమఃశావాయశివాయైనమః శ్లో|| శ్రీ శఙ్కరాచార్య, మథాస్య పద్మ| పాదం చ, హస్తామలకం చ శిష్యమ్| తం తోటకం వార్తికకార, మవ్యా| సస్మద్గురూన్ త్సంతతమానతోస్మి|| శ్రీ మత్త్రిపుర సున్దరీ వేదపాదస్తోత్రము (శ్రీ శంకర భగవత్పాద కృతము) శ్లో|| వేదపాదస్తవం వక్ష్యే దేవ్యాః ప్రియచికీర్షయా| యథామతి మతిం దేవస్తన్నోదన్తి ప్రచోదయాత్| తై నారాయణోపనిషత్ అను1 1. శ్రీమత్త్రిపురసుందరీ దేవికి ప్రియమను చేయదలచి నా బుద్ధినసుసరించి వేదపాదస్తవమను చెప్పగలను. కాన ప్రభువగు వినాయకుడు నాబుద్ధిని ప్రేరేపించుగాక. శ్లో|| అకించిత్కరకర్మభ్యః ప్రత్యాహృత్య కృపావశాత్| సుబ్రహ్మణ్యః స్తుతా వస్యాం తన్నః షణ్ముఖః ప్రచోదయాత్|| తై నారాయణ-1 2. నిష్ప్రయోజనమగు పనుల నుండి #9; మరలించి ఆరు ముఖములుగల సుబ్రహ్మణ్య స్వామి యీ స్తుతియందు దయతో మమ్ము ప్రేరేపించుగాక. శ్లో|| అకారాదిక్షకారాంత వర్ణావయవశాలినీ| వీణా పుస్తకహస్తా వ్యాత్ప్రణో దేవీ సరస్వతీ|| తై-య-1-8-22 3. అకారము మొదలు క్ష కారము వరకు గల యక్షరములు అవయవములుగా గలదియు వీణ పుస్తకమును హస్తమునందు ధరించిన సరస్వతీదేని మమ్ము రక్షించునుగాక. శ్లో|| యా వర్ణపదవాక్యార్థ గద్యపద్యస్వరూపిణీ| వాచి వర్తయతు క్షిప్రం మేధాం దేవి సరస్వతీ|| తై-య-నా-42 4. వర్ణములు, పదములు, వాక్యములు వీనియర్థము గల గద్య, పద్య స్వరూపము కల యే సరస్వతి కలదో ఆమె బుద్ధి విశేషమును నా వాక్కును శీఘ్రముగా నటింపజేయుగాక. శ్లో|| ఉపాస్యమానా విప్రేన్ద్రైః సన్ద్యాసు చ త్రిపృష్వసి| సద్యః ప్రసీద మే మాతః సన్ద్యావిద్యే సరస్వతీ|| తై-య-నారా-34-అనువాకము 5. తల్లియగు సంధ్యా! మూడుకాలములయందును బ్రాహ్మణులు ఉపాసనయుయు సరస్వతివగు నీవు ఇప్పుడు నాకు ప్రసన్నురావుకమ్ము. శ్లో|| మన్దా నిన్దాలోలుపాహం స్వభావా| దేతత్ స్తోత్రం పూర్యతే కిం మయేతి| మాతే భీతి ర్హే మతే త్వాదృశావా| మేషా నేత్రీ రాధసః సూనృతానాం|| ఋ-మం-7-76-7 6. ఓబుద్ధి! మాంద్యము గలదానను. స్వభావముచే నిందించుటయందాసక్తి గలదానను అగు నేను ఈ స్తవమును పూరింపగలనా! అనుభవమువలదు. ఈమె స్తోత్రము చేయు మీవంటి వారికి సూక్తుల నొసగునది. శ్లో|| తరఙ్గభ్రుకుటీ కోటి భఙ్గా తర్జయతే జరామ్| సుధాయయామ శుభ్రాయ సన్దూనాం పతయే నమః|| తై-య-4 8 2 7. తరంగములు అను కనుబొమ్మల ముడిచేత ముదిమిని భయపెట్టునదియు, శుభ్రమును, అమృతమయమునగు సముద్రమునకు నమస్కారము. శ్లో|| తస్య మధ్యే మణిద్వీపః కల్పకారామభూషితః| అస్తు మే లతితావాసః స్వస్తిదా అభయంకరః|| తై-య-నారా-అను-1 8. అసుధానముద్ర మధ్యమున కల్పవృక్షములు ఉదా%్‌యనముతో ప్రకాశించు లలితాదేవి నివాసమగు మణిద్వీపము మాకు భయమును తొలగించునదై పరలోక కల్యాణము నొసంగునదియగుగాక. శ్లో|| కదమ్బ మఞ్జరీ నిర్యద్వారుణీ పారణోన్మదైః| ద్విరేఫై ర్వర్ణనీయాయ వనానాం పతయే నమః|| తై-య-4-5-2 9. కడిమిపూల గుత్తుల నుండి వచ్చు మకరందమును త్రాగి మదించిన తుమ్మెదలచే మనోహరమయిన వనపతికి నమస్కారము. శ్లో|| తత్ర వప్రాలీలీలా గగనోల్లఙ్ఘి గోపురమ్| మాతః కౌతూహలం దదా%్‌యత్స ఆహార్యం గరం తవ|| య అర-1-31-అనువాదము. 10. ఓ తల్లీ! అచ్చట ఆకాశముపైకి పోయిన ప్రాకారపు గోడలుగల బహిర్ద్వారముగల మనోజ్ఞమయిన నీనగరము మాకు ఆనందమును కల్గించునుగాక. శ్లో|| మకరన్దఝరీ మజ్జన్మిలిన్ద కుల సంకులామ్| మహాపద్మాటవీం వన్దే యశపా సంపరీవృతామ్|| 11. పువ్వుల తేనె ప్రవాహములో మునిగిన తుమ్మెదల రొదకలదియు కీర్తిచేత వ్యాప్తమయిన మహాపద్మవనమును నమస్కరించుచున్నాను. (బ్రహ్మాండము పై భాగమున మూడు లక్షల యోజనముల విస్తీర్ణమగు పద్మాటవి కలదని అచ్చట శ్రీదేవి వసించునని భావము) శ్లో|| తత్రైవ చిన్తామణి తోరణార్చిభి| ర్వినిర్మితం రోపితరత్న శృఙ్గమ్| భ##జే భవానీభవనావతంస| మాదిత్యవర్ణం తమసః పరస్తాత్|| తై-య-ఉ-చిత్తి ప్రశ్న-13 అనువాదము 12. #9; ఆ మహాపద్మాటవీనవమందే చింతామణులచే నిర్మింపబడిన బహిద్వారము (వెలుపలి ద్వారము) యొక్క కాంతులచే వ్యాప్తమయినదియు, రత్నములు కూర్చిన శిఖర భాగము కలదియు సూర్యుని రంగు కలదియు, చీకటికి (అజ్ఞానమునకు) అతీతమయిన శ్రీదేవి భవన శ్రేష్ఠమును సేవించుచున్నాను. (నమస్కరించుచున్నాను). శ్లో|| మునిభిః స్వాత్మలాభాయయచ్చక్రం హృదిసేవ్యతే| తత్ర పశ్యామి బుధ్యా తదక్షరే పరమే వ్యోమన్|| య-నారా-1 అను 13. మునీశ్వరులు స్వాత్మప్రాప్తి కొరకు హృదయమందే చక్రమును సేవింతురో ఆ చక్రమును పరమేశ్వరునియందు బుద్ధిచే చూచుచున్నాను (తాదాత్మ్యబుద్ధితో చూచుచున్నాను) శ్లో|| పఞ్చ బ్రహ్మమయో మఞ్చః తత్రయో బిన్దుమధ్యగః| తవ కామేశి వాసోయ మాయుష్మస్తం కరోతు మామ్ (శ్రీ సూక్తము) 14. ఓ కామేశ్వరీ! ఆ చక్రమందు బిందుస్థాన మధ్యగతమయినయే పంచబ్రహ్మమయమయిన మంచము నీకు నివాసమో అది నన్ను దీర్ఘాయుష్మంతునిగ జేయునుగాక. పంచబ్రహ్మమయ మంచము బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నల్గరు నాలుగు మంచము కోళ్ళు సదాశివుడు పర్యంకము. శ్లో|| నానారత్న గుళుచ్ఛాలీ కాన్తి కిమ్మీరితోదరమ్| విమృశామి వితానం తేతిశక్ష మతిలోమశమ్|| తై-య-బ్రాహ్మణము-3-4-19 15. అనేకములగు రత్నపుగుత్తుల కాంతిచే చిత్రవర్ణము గల మధ్య భాగము కలదియు, మిగుల సూక్ష్మమయినదియు, మిక్కిలి దట్టమయిన మృగరోమముగల నీవితానము (మేలు కట్టు-హిందీ చాందినీ) ను నేను ధ్యానించతును. శ్లో|| పర్యఙ్కతల్పోపరి దర్శనీయం సబాణచాపాఙ్కుశ పాశపాణిమ్| అశేషభూసారమణీయ మీ త్రిడేలోచనం నీలకణ్ఠం ప్రశాన్తమ్| కైవల్య-ఉప-1-ఖం-7-సూ 16. మంచపు పానుపుపైన మనోహరమయినవాడును, బాణము, ధనుస్సు, అంకుశము, పాశమును హస్తమందుగల వాడును సమస్త భూషణములచే సుందరమయినవాడును మూడు నేత్రములు గలవాడును, నల్లని కంఠముగలవాడును, పరమశాంతుడును. శ్లో|| జటారుణం చన్ద్రకళాలలామ ముద్వేల లావణ్య కళాభిరామమ్| కామేశ్వరం కామశరరాసనాఙ్కం సమస్తపాక్షిం తమసః పరస్తాత్|| కైవల్య-ఉప-1-ఖం-7-సూ 17. జడలచే నెఱ్ఱనివాడును, చంద్రకళను శిరోభూషణముగా ధరించినవాడును, హద్దులేని కాంతి విశేషముచే ప్రకాశించువావడును కామము (సో కామయత అనుశ్రుతి వాద్యమయిన) అను విల్లు చిహ్నముగా గలవాడును, సమస్తమునకు సాక్షియు, అవిద్యాతీతుడగు కామేశ్వరుని స్తుతించుచున్నాను. శ్లో|| తత్ర కామేశవామాఙ్కె ఖేలన్తీ మలికున్తలామ్| సచ్చిదానన్దలహరీం మహాలక్ష్మీ ముసాస్మహే శ్రీ సూక్తము 18. #9; అచ్చట కామేశ్వర ప్రభువు యొక్క ఎడమ తొడ భాగమున విలాసముతో నున్నదియు, తుమ్మెదలవంటి కేశములు గలదియు, సచ్చిదానంద ప్రవాహరూపిణియగు మహా లక్ష్మిని ఉపాసించుచున్నాము. శ్లో|| చారు గోరోచనాపఙ్క జమ్బాలిత ఘనస్తనీమ్| నమామి త్వా మహం లోకమాతరం పద్మమాలివీమ్|| శ్రీ సూక్తము 19. అందమగు గోరోజన ద్రవమును పూసికొన్న ఘనమగు స్తవములు గలదియు, పద్మమాలను ధరించిన లోకమాతయగు నిన్ను నమస్కరించుచున్నాను. శ్లో|| శివే నమని%్‌నర్జరకుఞ్జరాసుర| వ్రతోలికా మౌలి మరీచి వీచిభిః| ఇదం తవ క్షాలన జాతసౌభగం| చరణం నో లోకే సుధితాం దధాతు|| తై-య-బ్రా-3-12-3 20. #9; మంగళస్వరూపిణీ! నమస్కరించుచున్న దేవతా శ్రేష్ఠుల యొక్కయు, రాక్షసుల యొక్కయు పంక్తియందలి కిరీట కాంతి తరంగములు క్షాళనచేయుటచే సౌందర్యముగల నీ పాదము లోకమున మాకు పాండిత్యము కల్గించుగాక-లేక తృప్తులను జేయుదుగాక. శ్లో|| కల్పస్యాదౌ కారణశానపి త్రీన్| స్రష్ఠుం దేవి త్రీణ్ గుణా నాదధానామ్| సేవే నిత్యం శ్రేయసే భూయసే త్వా| మజా మేకాం లోహితశుక్ల కృష్ణామ్|| తై-య-నా-రా-10-అనువాకము 21. ఓ దేవి! కల్పాదియందు సృష్టి స్థితి లయకారకులగు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడ సృజించుటకు రజస్సత్వ తమోరూపములగు మూడు గుణములను ధరించుచున్నదియు, జన్మములేనియు ఏకము (అద్వితీయము) ఎరుపు, తెలుపు నలుపు రూపములుగా గల నిన్ను (మూలప్రకృతిని) నిత్యము గొప్ప శ్రేయస్సు కొరకు సేవింతును. శ్లో|| కేశోద్భూతై రద్భుతామోదపూరై| రాశాబృన్దం సాన్ద్ర మాపూరయన్తీమ్| త్వా మానమ్య త్వత్ప్రసాదాత్స్వయంభూ| రస్మాన్మాయీ సృజతే విశ్వ మేతత్|| శ్వేతా-ఉప-అధా%్‌య-4-9 22. నీ కేశముల నుండి పుట్టిన ఆశ్చర్యకరమగు సుగంధ ప్రవాహముచే దిక్కుల నన్నింటిని దట్టముగా నిండించుచున్న నిన్ను నమస్కరించి, బ్రహ్మ నీయనుగ్రహము వలన మాయతో గూడినవాడై మమ్మును ఈ సమస్త జగములను సృజించుచున్నాడు. శ్లో|| అర్థోన్మీలద్యౌవనోద్దామ దర్పాం| దివ్యాకల్పై రర్పయన్తీం మయూఖాన్| దేవి ధ్యాత్వా త్వాం పురా కైటభారి| ర్విశ్వం బిభర్తి భువనస్య నాభిః|| తై-య-నారా-1-అనువాకము 23. సగము కనిపించిన ¸°వనముచే (ఉదయద్యౌవనముచే గొప్ప గర్వము గలదియు ప్రకాశమానమగు వస్త్రాద్యలంకరణములచే కిరణములను వ్యాపింపజేయునదియు, నగు నిన్ను ధ్యానించి, పూర్వము విష్ణువు భువనమునకు నాభిస్థానీయుడై యీ విశ్వమును బోషించుచున్నాడు. శ్లో|| కల్హార శ్రీమఞ్జరీ పుఞ్జరీతిం ధిక్కుర్వన్తీ మంబ! తే పాటలిమ్నా మూర్తిం ధ్యాత్యా శాశ్వతీం భూతి మాయ| న్నిన్త్రో రాజా జగతో య ఈశే|| తై-య-చిత్తి-ప్రశ్న-11వ అనువాకము 24. ఓ తల్లీ! ఏ దేవుడు రాజయి జగమును పాలించుచున్నాడో అతడు ఎఱ్ఱ కలువపూల గుత్తుల పద్ధతిని తిరస్కరించు ఎరుపుదనముగల నీ రూపమును ధ్యానించి, శాశ్వతమయిన యైశ్వర్యమును బొంది యింద్రుడన బడుచున్నాడు. శ్లో|| దేవతాన్తర మన్త్రౌఘ జపశ్రీ ఫలభూతయా జాపక స్తవ దేవ్యన్తె విద్యయావిన్దతే మృతమ్| ఈశావాస్య-ఉప-11-మంత్రము 25. ఓ దేవి! ఇతర దేవతా మంత్రముల జరమునకు ఫలమయిన నీ మంత్రమును జపించినవాడు, శరీరము విడిచిన తర్వాత మోక్షమును బొందుచున్నాడు. (చరమ జన్మని శ్రీవిద్యోపాసకోభవి-అనుసూక్తి) శ్లో|| పుంస్కోకిల కలక్వాణ కోమలాలాప శాలిని| భద్రాణి కురు మే మాత ర్దురితాని పరాసువ|| తై-య-నారా-39-అనువాకము 26. మగ కోకిల యొక్క అవ్యక్త మధుర ధ్వనివలె మధురమయిన మాటలుగల యో తల్లీ నాకు శుభములను జేయుము. పాపములను పో జేయుము. శ్లో|| అన్తేవాసిన్నస్తిచిత్తే ముముక్షా| వక్ష్యే యుక్తిం ముక్త సర్వైషణస్సన్| సద్భ్య స్సాక్షాత్ సున్దరీం జ్ఞప్తిరూపాం| శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదివేహి|| కైవల్యోపనిషత్-ఖం-1-2 సూక్తము 27. ఓ శిష్యుడా! నీకు చిత్తమున మోక్షమందు కోరికయున్నచో ఉపాయమును చెప్పెదను. కోరికలన్నింటిని విడిచి చిద్రూపిణియగు త్రిపురసుందరీ దేవిని శ్రద్ధా భక్తి ధ్యాన యోగములచే సత్ఫురుషులవలన దెలిసికొనుము. శ్లో|| షోఢాన్యాసాదిదేవైశ్చ సేవితా చక్రమధ్యగా| కామేశమహిషీ భూయః షోడశీ శర్మ యచ్ఛతు|| తై-య-సం-1-41-నారా-1వ అను 28. ఆరు విధములగు న్యాసములు మున్నగు వానిచేతను, వారిదేవతల చేతను సేవింపబడినదియు, శ్రీ చ్రకమందున్న షోడశీ రూపిణియగు మహాకామేశ మహిషి కామేశ్వరీ పరదేవత మాకు సుఖము నిచ్చుగాక. షోడన్యాసములు ః (1) గణశన్యాసము (2) గ్రహన్యాసము (3) నక్షత్ర న్యాసము (4) యోగినీ న్యాసము (5) రాశిన్యాసము (6) పీఠన్యాసము అనునవి. శ్లో|| శాన్తో దాన్తో దేశికేన్ధ్రం ప్రణమ్య తస్యాదేశాత్తారకం మన్త్రతత్వమ్| జానీతే చేదమ్బ ధన్యః సమానం| నాతః పరం వేదితవ్యం హి కించిత్|| శ్వేతాశ్వాతర-1-12 29. అంబా! శమము (మనోనిగ్రహము) దమము (బాహ్యేంద్రియ నిగ్రహము) కలవాడై గురువర్యుని సమస్కరించి, యతని ఆజ్ఞానుసారము సంపారమును తరింపజేయు మంత్రత్వమును దెలిసికొన్నచో వాడు ధన్యుడు. దీనికన్న నితరమయినదియు దీనితో సమానమయినదియు, తెలిసికొనదగినది మరొక్కటేదియు లేదు. శ్లో|| త్వమేవ కారణం కార్యం క్రియాజ్ఞానం త్వమేవ చ| త్వా మమ్చ న వినా కించిత్త్వయి సర్వం ప్రతిష్టితమ్|| నారా-1 అను 30. ఓ తల్లీ! నీవే కారణమవు కార్యము, క్రియ, జ్ఞానము నీవే. నిన్ను విడిచిన దేదియు లేదు. నీయందే సర్వము స్థిరమై యున్నది. శ్లో|| పరాగ మదీన్ద్రసుతే! తవాఙ్ఘ్రి| సరోజయో రమ్బ దధామి మూర్ధ్నా| అలంకృతం వేదవధూశిరోభి| ర్యతో జాతో భువనాని విశ్వా|| శ్వేతా-ఉ-46-4-మం 31. #9; ఓ పర్వతరాజపుత్రీ! అంబ! దేనివలన సమస్తభువనములు పుట్టినవో, అట్టిదియు, వేదమాతయొక్క శిరస్సులచే నలంకరింపబడినదియు (వేదాంత వాక్య ప్రతిపాద్య) నగు నీపాద పద్మముల పరాగమును నేను శిరమున ధరించుచున్నాను. శ్లో|| దుష్టాన్ దైత్యాన్ హన్తుకామాం మహర్షీ| న్శిష్టాన న్యాన్పాతుకామాం కరాబ్జెః| అష్టాభిస్త్వాం సాయుధై ర్భాసమానాం| దుర్గాం దేవీ శరణ మహం ప్రపద్యే|| తై-య-నారా-2-అనువాకము 32. #9; దుష్టులగు రాక్షసులను జంపుకోరికగలదియు, మహర్షులను, ఇతరులగు శిష్టులు (సదాచారసంపన్నులను) రక్షించు తలంపు కలదియు, ఆయుధములతో గూడిన ఎనిమిది హస్త పద్మములతో ప్రకాశించునదియు, నగు దుర్గాదేవిని నేను శరణును పొందుచున్నాను. శ్లో|| దేవి సర్వానవద్యాఙ్గి! త్వా మనాదృత్య యే క్రియాః| కుర్వన్తి నిష్ఫలా స్తేషా మదుగ్ధా ఇవ ధేనవః|| ఋ-మం-7-32-22 తై-సం-2-4-14 33. #9; నిర్దోషమయిన సర్వాంగములు గల యో దేవీ! నిన్ను విడిచి చేసిన క్రియలన్నియు వట్టిపోయిన ఆవువలె నిష్ఫలములు. శ్లో|| వాహం మన్యే దైవతం మాన్య మన్య| త్త్వత్పాబ్జాదమ్బకే! కుమ్భజాద్యాః| యే ధ్యాతారో భక్తి సంశుద్ధ చిత్తాః| పరామృతాత్ పరియుచ్యన్తి సర్వే|| తై-య-నారా-12-అను 34. అంబికా! భక్తిచే శుద్ధమగు చిత్తముగల ఆగస్త్యుడు మున్నగు ఏధ్యాతలు (నిన్ను ధ్యానించినవారు) అందరును, జగత్కారమణగుటచే పరమును, బ్రహ్మజ్ఞానము లేక నశింపదగుటచే అమృతమును అగు అజ్ఞానము నుండి విడువబడుచున్నారో, అట్టి నీ పాదపద్మము కంటె అన్యమును, మాన్యమునగునది మరొక్కటి లేదు. శ్లో|| కుర్వాణోపి దురారమ్బాంస్తవనామాని శామ్భవి| ప్రజపన్నేతి మాయాన్త మతిమృత్యుం తరామ్యహమ్|| య-తై-బ్రా-1-2-1-అను 35. #9; ఓ శాంభవి! దుష్ట కార్యములు చేయువాడయినను, నీ నామములను పఠించువాడు సంసారబంధము నుండి తొలగును. నేను మృత్యువును తప్పక దాటుదును. శ్లో|| కల్యాణి త్వం కున్ద హాస ప్రకాశై| రన్తర్థ్వాన్తం నాశయన్తీ క్షణన| హన్తాస్మాకం ధ్యాయతాం త్వత్పదాబ్జ| ముచ్చతిష్ఠమహతే సౌభగాయ|| తై-య-సం-4-1-17 36. ఓ కల్యాణీ! మల్లె మొగ్గలవంటి నవ్వులదీప్తిచే క్షణములో లోని చీకటిని (అజ్ఞానమును) తొలగించు నీవు ఆహా! నీ పాదాంబుజమును ధ్యానము చేయు మాకు గొప్ప సౌభాగ్యమును సమకూర్ప సన్నద్ధురాలవు కమ్ము. శ్లో|| తితీర్షయా భవామ్భోధేర్హయగ్రీవాదయః పురా| అప్రమత్తా భవత్పూజాం సువిద్వాసో వితేనిరే|| తై-య-సంహి-4-6-5 37. పూర్వము మంచి జ్ఞాన సంపన్నులగు హయగ్రీవాదులు సంపార సముద్రమును దాటదలచి జాగరూకతగలవారై నీ పూజను విశేషముగా సల్పిరి. శ్లో|| మద్వంళ్యా యే దురాచారా యే చ సన్మార్గగామినః| భవత్యాః కృఫయా సర్వే సువర్యన్తు యజమానాః|| తై-య-4-6-5 38. నా వంశమునందు దురాచారము గలవారు గాని, సన్మార్గవర్తనులుగాని యెవరు గలరో ఆ యజమానులందరును నీ దయవలన స్వర్గమును పొందుదురు గాక. శ్లో|| శ్రీచ్రకస్థాం శాశ్వతైశ్వర్యదాత్రీం| పౌణ్డ్రం చాపం పుష్ప బాణాన్ దధానామ్| బన్థూకాభాం భావయామి త్రినేత్రాం| తా మగ్నివర్ణాం తపసా జ్వలన్తీమ్|| తై-య-నారా-2-అను 39. శ్రీ చక్రమందున్నదియు, సుస్థిరమగు నైశ్వర్యము నిచ్చునదియు, చెరకువింటిని పువ్వుల బాణములను ధరించునదియు, మంకెనపూవు వంటి శరీరము గలదియు, మూడు నేత్రములు గలదియు, అగ్నివంటి దీప్తిగలదియు, తపస్సుచే ప్రకాశించు ఆ త్రిపురసుందరీ దేవిని భావన చేయుచున్నాను. శ్లో|| భవాని! తవపాదాబ్జ నిర్ణేజన పవిత్రితాః| భవామయ ప్రశాన్త్యై త్వా మపో యాచామి భేషజామ్|| తై-య-బ్రా-2-5-8 40. ఓ భవానీ! సంసారమును రోగము యొక్క నివృతి%్‌తకై మందు అగు నీ పాదపద్మములను కడుగుటచేత పవిత్రములుగా చేయబడిన ఉదకమును నిన్ను కోరుచున్నాను. శ్లో|| చిదానన్ద సుఖామ్బోధే స్తవానన్ద లవోస్తి యః| కారణశై స్త్రిభిః సాకం తది%్‌వశ్వ ముసజీవతి|| తై-య-బ్రా-2-4-6-అను 41. పరమేశ్వరీ! నీ చిదానంద సముద్రములోని యొక చిన్న కణము (బిందువు) ఏది కలదో అది జగత్కారణములగు బ్రహ్మ విష్ణు రుద్రులతో గూడ ఈ విశ్వమును ఆశ్రయించి యున్నది. శ్లో|| నో వా యాగై ర్నైవ పూర్తాకృత్యె| ర్నోవా జాపై#్య ర్రో మహద్భి స్తపోభిః| యో వా యోగైః క్లేశకృద్భిః సుమేధాః నిచాయ్యే మాం శాన్తి మత్యన్త మేతిః| కఠ-1-1|17 శ్వేతాశ్వరతర అధ్యా-4-11 అను 42. మంచి బుద్ధి గలవాడు, యాగముచేతను, చెరువులు త్రవ్వించుట మొదలగు పుణ్య కార్యముల చేతను, జపముల చేతను, మహా తపస్సులచేతను, అతిక్లేశములు గల్గించు యోగముల చేతను సాధ్యముగాని అత్యంతమతు శాంతిని ఈ పరదేవతను సాక్షాత్కరించి పొందుచున్నాడు. శ్లో|| ప్రాతః పాహిమహావిద్యే మధ్యాహ్నేతుమృడప్రియే| సాయం పాహి జగద్వన్ద్యే పునర్నః పాహివిశ్వతః|| తై-య-సం-1-5- అను తై-య-సం-4-2-1 43. మహా విద్యా స్వరూపిణీ! ప్రాతకాలమున మమ్ము రక్షింపుము. ఈశ్వరునకు ప్రియురాలా! మధ్యాహ్నము మమ్ము రక్షింపుము. జగముచే నమస్కరింపదగు తల్లీ! సాయం కాలము మమ్ము రక్షింపుము. మరియు మమ్ము అన్నిటి నుండి రక్షింపుము. శ్లో|| బన్ధూకాభై ర్భానుభి ర్భాసయన్తీ విశ్వం శశ్వత్తుఙ్గ స్తనార్ధా| లావణ్యాభ్ధేః సున్దరి త్వం ప్రసాదా| దాయుః ప్రజా రయి మస్మాసు ధేహి|| తై-య-బ్రా-2-5-8 44. మంతెన పూవు వర్ణముగల (ఎఱ్ఱని) కిరణముల చేత సమస్త ప్రపంచమును ప్రకాశింపజేయునది, ఎల్లప్పుడును బలిసిన ఏక స్తనము గలదియు (అర్థనారీశ్వరి)స్త్ర లావణ్య సముద్రమున ఓ సుందరీ! నీవు అనుగ్రహించి ఆయువును, సంతానమును, ధనమును, మాకు పోషింపుము. శ్లో|| కర్ణా కర్ణయ మే తత్వం యా చిచ్ఛకి%్‌త రితీర్యతే| త్రి ర్వదామి ముముక్షూణాం సా కాష్ఠా సా పరా గతిః|| కఠ-1-అ-3, వలి%్‌ల-11-లాం 45. నా చెలీ! ఏదిచిచ్ఛక్తి యని చెప్పబడుచున్నదో అదియే నాతత్వము. దానినే ముమ్మారు చెప్పెదను. అది మోక్షమందు కోరికగలవారికి పరమావధి. అది పరమ ప్రాప్త్యము (ముఖ్యముగా పొందతగినది) శ్లో|| వాగ్ధేవితి త్వాం వతన్త్యమ్భ కేచి| ల్లక్ష్మీర్గౌరీ త్యేక మన్యే ప్యుశన్తి| శశ్వన్మాతః ప్రత్యగద్వైతరూపాం| శంసన్తి కేచిని%్‌నవిదో మనానాః|| ఋ-6-67-10 46. అంబా! కొందరు నిన్ను వాగ్దేవి యని వచింతురు. మరికొందరు లక్ష్మియనియు అన్యులు గౌరియనియు చెప్పుదురు. శాశ్వతజగన్మాతా! జ్ఞాన సంపన్నులు (బ్రహ్మజ్ఞాన సంపన్నులు) అగు కొందరు నిన్ను జీవునితో ఐక్యము కలదానినిగా స్తుతింతురు. శ్లో|| లలితేతి సుధాపూర మాధురీ చోర మవ్హిుకే| తవ నామాస్తియత్తేన జిహ్వా మే మధుమత్తమా|| తై-శిక్ష-4--అను 47. లలియని అమృత ప్రవాహము యొక్క మాధురమును అపహరించిన యే నామముగలదో దానినే నా జిహ్వ మిక్కిలి మాధుర్యముకలది యగుగాక. శ్లో|| యే సంపన్నా స్సాధనై సై#్తశ్చతుర్భిః| శుశ్రూషాభి ర్ధేశికం ప్రీణయన్తిః| సమ్యగ్విద్వాన్ శుద్ధ సత్వాన్తనాణాం| తేషా మేవైతాం బ్రహ్మవిదా%్‌యం వదేత| మండ-ఉప-3 మండకుము - 2 ఖండము-10 48. ఎవరు సాధన చుష్టయముతో గూడినవారై, తమ సేవలచే గురువును సంతసింపజేయుదురో అట్టి పరిశుద్ధ చిత్తముగలవారికే మంచి విద్వాంసుడు ఈ బ్రహ్మవిద్య నుపదేశింపవలయును. సాధన చతుష్టయము బ్రహ్మవిచారము జేయువారికి ఈ సాధనము నాలుగును అత్యంతావశ్యకము (1) నిత్యానిత్యవస్తు వివేకము (2) ఐహాముద్ర ఫలభోగ విరాగము (3) శమదమాది సంపత్తి (4) మముక్షత్వము. శ్లో|| అభిచారాదిభిః కృత్యాం యః ప్రేరయతి మయ్యుమే! తవ హుంకారసం త్రస్తాప్రత్యక్కర్తార మృచ్ఛతు|| అధర్వ వేద-4-19-6 49. ఉమాదేవి! శత్రు సంహారకమగు క్రియలచే, నాపై నెవడు కృత్యను (శక్తి విశేషమును) ప్రయోగించునో నీహుంకారముచే నది భయమును చెంది, ప్రయోగించిన వానిని తిరిగి పొందుగాక. శ్లో|| జగత్పవిత్రి! మామికా మపహరాశు దుర్జరాం| ప్రసీద మే దయాధుని ప్రశస్తి మమ్భ నః కృథి| ఋ-మం-2-42-16 50. #9; జగమును పవిత్రము చేయు తల్లీ! నాదుష్టమగు ముసలితనమును శీఘ్రముగా హరింపుము. దయానిధీ! నాకు ప్రసన్నుడవు కమ్ము. ఓ తల్లీ! జననీ! మాకు ప్రశస్తిని (ప్రఖ్యాతిని చేయుము.) శ్లో|| కదమ్బారుణ మమ్బాయా రూపం చన్తయ చత్తమే| ముఞ్చ పాపీయసీం నిష్ఠాం మాగృధః కస్యచిద్ధనమ్ ఈశావాస్య-1-అనువాశ 51. ఓ నాచిత్తమా! కడిమి పూవువలె నెఱ్ఱని రంగు గల అంబ యొక్క రూపమును ధ్యానింపుము. పాపపు వృత్తిని విడనాడుము. ఎవని ధనమునకు ఆశపడకుము. శ్లో|| భణ్డ భణ్డనలీలాయాం రక్తచన్దన పఙ్కిలః| అఙ్కుశస్తవ తం హన్యాద్యశ్చ నో ద్వదేషతే జనః|| తై-సం-4-1-10 52. భండాసురునితో యుద్ధ సమయమున రక్తము అను గంధముచే పూయబడిన నీ అంకుశము మమ్ము ద్వేషించిన వానిని సంహరించుగాక. శ్లో|| రే రే చిత్త త్వం వృధా శోకసిన్ధౌ| మజ్జ స్యన్తర్వచ్యు పాయం విముక్త్యై| దేవ్యాః పాదౌ పూజయైకాక్షరేణ| తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమ్| కఠ-ఉప-1-2-15 53. ఓయీ చిత్తమా! శోకమును సముద్ర మధ్యమున నీ వేల మున్గెదవు! శోకము పోవుటకు నీకు ఉపాయమును చెప్పెదను. నీకు సంక్షేపముగా నొక పదమును చెప్పెదను. ఓం అను ఒక యక్షరముచే శ్రీదేవి పాదములను పూజింపుము. శ్లో|| చఞ్చద్భాలాతపజ్నోత్స్నా కలామణ్డల శాలినే! ఐక్షవాయ నమో మాత ర్భాహుభ్యాం తవధన్వనే|| య-4-5-1 54. ఓ తల్లీ! ప్రకాశించు లేతయెండ కాంతి మండలముతో గూడిన నీ చెరకు వింటికేసి నీ బాహువులకును నమస్కారము. శ్లో|| తామేవాద్యాం బ్రహ్మవిద్యా ముపాసే| మూర్తై ర్వేదైః న్తూయమానాం భవానీమ్| హన్త స్వాత్వత్వేన యాం ముక్తి కామో| మత్వా ధీరో హర్షశోకో జహాతి కఠ-ఉపవ-1-2-12 55. ముక్తిని గోరు పండితుడు ఆహా! ఏ భవానీదేవిని స్వాత్మగా ధ్యానించి శోకమును మోహమును విడుచుచునా%్‌నడో అట్టిదియు మూర్తిని ధరించిన దేవములచే స్తుతింపబడినదియును, ఆద్యము, బ్రహ్మ విద్యారూపిణియగు భవానీ దేవిని నేనుపాసించుచున్నాను. శ్లో|| శరణం కరవాణ్యమ్భ చరణం తవ సున్దరి| శ##పేత్వత్పాదుకాభ్యాం మే వాన్యః పన్థా అయవాయ| చిత్తి ప్రశ్న-12-అను 56. ఓ తల్లీ! త్రిపుర సుందరీ! నీ పాదమున నేను రక్షకముగా చేయుచున్నాను. నీ పాదుకలతో ఒట్టుపెట్టుచున్నాను. నీ పాదముకన్న ముక్తికి మరొక మార్గము లేదు. శ్లో|| రత్నచ్ఛత్రైశ్చామరై ర్దర్పణాద్యై| శ్చక్రే శానీం సర్వదోపాచరన్త్యః యోగిన్యో న్యాః శక్తయ శ్చాణిమాద్యా| యూయం పాతస్వస్తిభి స్సదానః|| తైయం-సం-4-1-8 తైయ-సం-2-2-14 57. రత్నపు గొడుగులు పట్టియు, వింజామరలను వీచియు, అద్దములను చూపియు చక్రీశ్వరికి నుపచారములు చేయుయోగినులను, అణిమాదిశక్తులును, మీరందరును మాకు ఎల్లప్పుడును శుభములనిచ్చి రక్షింపుడు. శ్లో|| దరిద్రం మాం విజానీహి సర్వజ్ఞాసి యతః శివే| దూరీ కృత్యాశు దురిత మథా నో వర్థయా రయిమ్|| తై-సం-1-5-5-తై-సం-4-7-13 58. ఓ వరదేవతా! నీవు సర్వము తెలిసినదానవు గావున నన్ను దరిద్రునిగా దెలిసికొనుము. పాపమును శీఘ్రముగా పోజేసి మాకు మరియు సంపదను వృద్ధినొందింపుము. శ్లో|| మహేశ్వరి మహామన్త్ర కూటత్రయ కళేబరే| కాదివిద్యాక్షర శ్రేణి ముశస్తస్త్యా హవామహే|| య-సం-2-6-12 59. మహేశ్వరీ! పంచదశీ మంత్రములోని మూడు కూటములు (వాగ్భవకయూటము, కామరాజకూటము, శక్తికూటము) శరీరముగాగల తల్లీ! కకారము మొదటగల అక్షరముల పంక్తి స్వరూపిణియగు నిన్నుకోరి ఆహ్వానించుచున్నాము. శ్లో|| మూలాధారాదూర్ధ్వ మన్తశ్చరన్తీం| భిత్వాగ్రన్థీ న్మూర్థ్ని నిర్యత్సుధార్ధ్రామ్| పశ్యన్తస్త్వాం యే చ తృప్తిం లభ##న్తే| తేషాం శాన్తిః శాశ్వతీ నేతరేషామ్|| కఠ-5 వల్లి 13 60. మూలాధార చక్రమునకు పై భాగమున సుషుమ్నానాడి యందు సంచరించునదియు, (ఇడ- సుషుమ్న పింగల అనునవి మూడు నాడులు) బ్రహ్మగ్రంథిని, విష్ణుగ్రంధిని, రుద్రగ్రంధిని (ఇవి మూడును గ్రంధులు) భేదించి సహస్రారకమలము నుండి స్రవించు అమృతముచేత తడిసిన నిను%్‌న సాక్షాత్కరించి తృప్తిని పొందువారికే శాశ్వతమయిన శాంతి, ఇతరుల శాంతి లేదు. శ్లో|| మహ్యం ద్రుహ్యన్తి యే మాతః త్వధ్ద్యనాసక్త చేతసే| తానమ్భ సాయకై రేభి రవ బ్రహ్మ ద్విషో జహి|| ఋ-4-4-29 శ్రీ సూక్తము 61. ఓ జననీ! నిన్ను ధ్యానించు మనస్సుగల నాకెవరు ద్రోహము చేయుదురో, ఆ బ్రహ్మద్వేషులను బాణములచే చంపుము. శ్లో|| త్వద్భక్తానామమ్భ కాన్తై షణానాం| బ్రహ్మిష్ఠానాం దృష్టిపాతేన పూతః| పాపీయాన ప్యావృతః స్వర్వధూభిః| శోకాతిగో మోదతే స్వర్గలోకే|| కఠ-1 వల్లి 18 62. ఓ తల్లీ! పాపాత్ముడైనప్పటికిని, దారేషణ (భార్యయందు కోరిక) ధనేషణ (ధనమందు కోరిక) పుత్రేషణ (పుత్రులందు కోరిక) లేని బ్రహ్మనిష్ఠులగు నీ భక్తుల దృష్ఠి ప్రసరించుటచే పవిత్రుడై, దేవతాస్త్రీలచే సేవింపబడి శోకము నతిక్రమించి స్వర్గలోకమున సంతోషమునందు చున్నాడు. శ్లో|| సస్తు విదా%్‌య జగత్యస్మిన్సంసాభ్రమ హేతవః| భ##జేహం త్వాం మయా విద్వాన్విద్యయా మృత మశ్నుతే|| ఈశావాస్య-11 మంత్రము 63. సంసారమున పరిభ్రమించుటకు కారణములగు విద్యలు లోకముననుండుగాక, విద్వాంసుడు (బ్రహ్మనిష్ఠుడు) ఏ విద్యనే మోక్షమునందుచున్నాడో ఆ విద్యయగు నిన్ను సేవింతును. శ్లో|| విద్వన్ముఖ్యెర్విద్రుమాభం విశాల| శ్రోణీ శిఞ్జన్మేఖలా కిఙ్కిణీకమ్| చన్ద్రోత్తంసం చిన్మయం వస్తు కించి ద్విద్ధిత్వ మేతంని హితం గుహాయామ్ కఠ-1-1-14 64. పగడపు రంగు గలదియు, విశాలమగు శ్రోణీ (పిరుదు) భాగమున ధ్వనించు ఒడ్డాణపు మువ్వలుకలదియు, చంద్రుని శిరోభూషణముగా ధరించినదియు చిద్రూపమగు నొకానొక వస్తువును విద్వద్వరులచే బుది%్‌ద గుహయందున్నదిగా తెలిసికొనుము. శ్లో|| న విస్మరామి చిన్మూర్తి మిక్షుదణ్డశాలినీమ్| యునయస్సనక ప్రేష్ఠా స్తా మాహుః పరమాం గతిమ్|| కఠ-2-3-10 65. చెఱకు విల్లుగా ధరించిన చిన్మూర్తిని నేను మఱువను. ఆ చిన్మూర్తిని సనకాది మునిశ్రేష్ఠులు ఉత్కృష్టమగు గతిగా (పొందదగినదిగా) చెప్పుచున్నారు. శ్లో|| చక్షుః ప్రేఙ్ఖత్రేమ కారుణ్యధారాం| హంసజ్యోత్స్నా పూర హృష్యచ్చకోరామ్| యా మాశిష్యన్మోదతే దేవదేవః| సా నో దేవీ సుహవా శర్మ యచ్ఛతు|| తై-య-బ్రా-2-4-2 66. కన్నుల నుండి ప్రవహించు ప్రేమతో గూడిన దయా ధారగలదియు, తెల్లనికాంతి ప్రవాహముచే సంతసించు చకోరపక్షులు గలదియు, నగు ఏదేవిని కౌగిలించి పరమశివుడు సంతసించుచునా%్‌నడో ఆ దేవి మంచి ఆహ్వానము (పిలుపు) గలదై మాకు సుఖమునిచ్చుగాక. తత్వమనగా ః అప్రళయంయస్తిష్ఠతి సర్వేషా భోగదాయ భూతానాం తత్తత్వమితి ప్రోక్తంః| శ్లో|| ముఞ్చ వకఞ్చకతాం చిత్త పామరం చాపి దైవతమ్| గృహాణ పదమమ్బాయా ఏతదాలమ్బనం పరమ్‌ః| అ-త-1-217 కఠ-17 67. ఓ చిత్తమా! మోసమును విడువుము. పామరదైవతమును గూడ నిడువుము. పరదేవతపాదముల నాశ్రయింపుము. ఇదియే నీకు గొప్ప ఆధారము (పట్టుకొమ్మ.) శ్లో|| కా మే భీతిః కా క్షతిః కిం దురాపం| కామే శాఙ్కోత్తుఙ్గ పర్యఙ్క సంస్థామ్| తత్వాతీతా మచ్యుతానన్దదాత్రీం| దేవీ మహం నిరృతిం వన్దమానః| తై-య-సం-4-2-5 68. నాకు భయమేమి? నాకు నష్టమేమి? నాకు పొంద శక్యముగాదనిదేది? కామేశ్వర ప్రభువు తొడయను మంచమందున్నదియు, తత్వములకు (మూలపదార్థములకు) భిన్నమయినదియు శాశ్వతానందము నొసంగునదియుగు నిరృతి యను దేనిని నమస్కరించుచున్నాను. శ్లో|| చిన్తామణి మయోత్తంస కాన్తి కఞ్చకితాననే| లతితే త్వాం సకృన్నత్వా నబిభేతి కుత శ్చ న|| ఉపనిషత్ బ్రహ్మవల్లి 9 అనువాకము 69. శిరోభూషణముగా ధరించిన చింతామణి కాంతులచే నావరింపబడిన ముఖముగల లలితాంబా! నిన్నొకసారి నమస్కరించినవాడు ఎవరివలనను భయమును పొందడు. శ్లో|| తారుణ్యోత్తుఙ్గితకుచే లావణ్యోల్లాసితేక్షణ| తవాజ్ఞయైన కామాదా%్‌య మాస్మాన్ప్రాప న్నరాతయః|| తై-య-బ్రా-2-4-3 70. ¸°వనముచే నున్నతమయిన కుచములు గల జననీ! లావణ్యముచే (అందముచే) వికసించిన నేత్రములుగల తల్లీ! నీ ఆజ్ఞచేత ఏ కామ క్రోధాది శత్రువులును మమ్ము పొందకుండుగాక. శ్లో|| అకర్ణాకృష్ణ కామాస్త్ర జఞ్జౌతం తాప మమ్భ మే అచామతు కటాక్ష స్తే పర్జన్యో వృష్టి మానిప|| తై-య-సం-1-4-30 71. ఓ అంబ! చెవివరకు లాగి ఎక్కుపెట్టిన మన్మధ బాణమువలన గలిగిన తాపమును నీకటాక్షము(క్రీగంటి చూపు) వర్షించు మేఘమువలె పోగొట్టును గాక. శ్లో|| కుర్వే గర్వేనాపచారాన పారాన్యద్యప్యమ్భ త్వత్పదాబ్జం తధాపి| మన్యే ధన్యే దేవి! విదా%్‌యవలమ్బం మాతేవ పుత్రం బిభృతాస్వేనమ్| తై-య-సం-4-2-3 72. ఆలోచింపగా గర్వముచేత అనేకములగు అపరాధములను చేయుచున్నాను. అయినను ఓ దేవీ విద్యకు (బ్రహ్మ విద్యకు) ఆధారమయిన నీ పాదపద్మమును ధా%్‌యనము చేయుచునా%్‌నను. ఈ నన్ను తలి%్‌ల కుమారునివలె పోషింపుము. శ్లో|| యథోపాస్తిక్షతి ర్నస్యాత్ తవ చక్రస్య సున్తరి| కృపయా కురు కల్యాణి! తథామే స్వస్తిరాయుషీ|| ఋగ్వేదఖిలకాండ 73. ఓ త్రిపురసుందరీ! నీచక్రోపాసనకు ఎట్లు భంగము కలుగకుండునో అట్లు ఓ కల్యాణీ (మంగళ స్వరూపిణీ) దయతో నాకు శభము, దీర్ఘాయువును ప్రసాదింపుము. శ్లో|| చక్రం సేవే తారకం సర్వసిధ్యై| శ్రీమన్మాతః సిద్ధయ శ్చాణిమాధ్యాః| నిత్యా ముద్రాః శక్తయ శ్చాఙ్గదేవ్యః| యస్మిన్దేవా అధివిశ్వే నిషేదుః తై-నారా-1 అనువాకము 74. శ్రీమతి యగు తల్లీ! ఆణిమాది సిద్ధులు పంచదశ (15) నిత్యలు, సర్వసంక్షోభిణ్యాదిముద్రలు, అంగ దేవతలగు శక్తులును, సమస్త దేవతలును ఏ శ్రీ చక్రమందుందురో ఆ శ్రీ చక్రమును సమస్తము యొక్క సిద్ధికై సేవించుచున్నాను. శ్లో|| సుకుమారే సుఖాకారే సునేత్రే సూక్ష్మమధ్యమే| సుప్రసనా%్‌న భవ శివే సుమృడీకా సరస్వతీ| య-తై-అర-4-42(మంత్ర బ్రా తుది అనువాకము) 75. సౌకుమార్యము సుఖకరమగు ఆకారము మంచి నేత్రములు, సన్నని నడుము, మంగళస్వరూపమునుగల ఓ తల్లీ! సుఖమును కలుగజేయుదానవు వాగ్డేవతారూపిణివియునగు నీవు ప్రసన్నురాలవు కమ్ము. శ్లో|| విద్యుద్వల్లీ కన్దళీం కల్పయన్తీం| మూర్తిం స్ఫూర్త్యా పఙ్కజం ధారయన్తీమ్| ధ్యాయన్ హి త్వాం జాయతే సార్వభౌమో| విశ్వా ఆశాః పృతనాః సంజయఞ్జయన్|| తై-య-బ్రా-2-4-7 76. మెఱపుతీగ యొక్క మొలకను స్ఫూర్తి చేత కల్పించుచున్నదియు, పద్మమును ధరించు నిన్ను ధ్యానము చేయువాడు సమస్త దిక్కులను. సేవలను, జయించుచు, జయించుచు (ఎక్కువగా జయించుచు) చక్రవర్తి యగుచున్నాడు. శ్లో|| అవిజ్ఞాయ పరాం శక్తి మాత్మభూతాం మహేశ్వరీమ్| అహో పతన్తి నిరయేష్వేకే చాత్మహనో జవాః| ఈశావాస్య-3 మం 77. మహేశ్వరి యగు పరాశక్తిని ఆత్మగా దెలిసికొనలేని ఆత్మహంతకులు (ఆత్మజ్ఞానము లేని కొందరు జనులు) నకములందు పడుచున్నారు. అయ్యో! శ్లో|| సిన్దూరాభైః సున్దనై రంశుభీన్దై| ర్లాలక్ష్యాం మజ్జయన్తీం జగన్తి| హేరమ్భామ్భ! త్వాం హృదాలమ్భతే య| స్తసై#్మ విశః స్వయ మేవానమన్తే|| తై-య-బ్రా-2-4-6 78. ఓ వినాయక జననీ! సిందూరపురంగుగల సుందరమయిన కిరణసమూహములచే లోకములను లక్కయొక్క కాంతి యందు (ఎఱుపున) ముంచుచున్న నిను%్‌న ఎవరు హృదయముచే ధరించునో వానికి మానవులందరును స్వయమగునే వినమ్రులగుదురు. శ్లో|| తవ తత్వం విమృశతాం ప్రత్యగద్వైత లక్షణం| చిదానన్ద ఘవాదన్యన్నే హ నానా స్తి కించన|| కఠ 4 వల్లి 11 మం 79. నీతత్వమును జీవబ్రహ్మక్య స్వరూపమును విచారించినవారికి చదానందఘనము కన్న నానారూపమగు సన్యమేదియు దీనియందు గోచరింపదు. శ్లో|| కణ్డాత్కుణ్డలినీం నీత్వా సహస్రారం శివే| తవ| న పున ర్జాయతే గర్భే సుమేధా అమృతో క్షితః|| తై-య-శిక్షావల్లీ 10 అనువాకము 80. ఓ మంగళ స్వరూపుణీ! కంఠము నుండి (విశుద్ధ చక్రము) నీకుండలినీశకి%్‌తని సహస్రారపద్మమును పొందించిన బుద్ధిమంతుడు సహస్రారమందలి అమృతముచే తడపబడి, తిరి తల్లిగర్భమున పుట్టడు. శ్లో|| త్వత్పాదుకాసన్ధాన ప్రాప్త సర్వాత్మతా దృశి| పూర్ణాహంకృతిమత్యస్మిన్న కర్మ లిప్యతే నరే|| ఈశావాస్య 2 మం 81. నీ పాదుకా మంత్రమును అనుసంధానము చేయుటచే సర్వము ఆత్మయేయయను జ్ఞానమును పొందిన పూర్ణాహం స్ఫూర్తిగల మనుజునకు కర్మ అంటదు. శ్లో|| తవానుగ్రహనిర్భిన్న హృదయ గ్రన్ధి రద్రిజే! స్వాత్మత్వేన జగన్మత్వా తతో నవిజుగుప్సతే| ఈశావాస్య మం 6 82. పర్వతరాజ పుత్రీ! నీ యనుగ్రహముచే అహంకారమును గ్రంథిని ఛేదించినవాడు జగత్తును స్వాత్మగా తలచి జగత్తును ఏవగింపడు. శ్లో|| కదా వసుదళోపేతే త్రికోణ నవకాంఞ్చితే అవాహయామి చక్రే త్వాం సూర్యాంభాం శ్రియ మైశ్వరీమ్|| శ్రీసూక్తము 83. ఎనిమిది దళములతో గూడినదియు,చ నవయోన్యాత్మకము (తొమి%్‌మది త్రికోణములు) అగు శ్రీ చక్రమున సూర్యునితో సమానమగు కాంతిగలదియు, ఈశ్వరసంబంధ శ్రీరూపిణి యగు నిన్ను నేనెప్పుడా వాహనమొనరు%్‌తనో! శ్లో|| హ్రీ మిత్యేకం తావకం వాచకార్ణం! యజ్జిహ్వాగ్రే దేవి జాగర్తి కించిత్| కోవా యంస్యా త్కామకామ స్త్రిలోకా%్‌యం| సర్వే సై#్మదేవా బలి మావహన్తి తై శిక్షావల్లి 5 అగు 1-31 అనువాకము 84. 'హ్రీం- అను నిన్ను బోధించు ఏకాక్షరము ఎవని జిహ్వాగ్రమందు కొంచెము మెలకువగా నుండునో ముల్లోకములయందు మన్మధునకు గూడ మన్మధుడగు నీతడు (ఎక్కువ అందగాడు) ఎట్టివాడగును! (చాల గొప్పవాడగును) దేవతలందరు వానికి పూజను సమర్పింతురు. శ్లో|| నాక స్త్రీనాం కిన్నరీణాం నృఫాణా| మప్యాకర్షీ చేతసా చిన్తనీయమ్| త్వ త్పానిస్థం కుంకుమాధం శివే యం! ద్విష్మ స్తస్మిన్ర్పతియుఞ్చామి పాశమ్| తై-యం-3-1-4 85 ఏ పాశము దేవతాస్త్రీలను, కిన్నరస్త్రీలను, రాజస్త్రీలను ఆకర్షించునో, అట్టిదియు మనస్సుచే ధ్యానింపదగినదియు కుంకుమయొక్క రంగుగల నీహస్తమందలి పాశమను నేను ద్వేషించువారిపై ప్రయోగింతును. శ్లో** నూనం సింహాసనేశ్వర్యాస్తవాజ్ఞాం శిరసావహన్| భ##యేన పవమానో7యం సర్వాదిశోనువివా (ధావ) తి|| తై-బ్రా-2-3-9 86. సింహాసనేశ్వరివగు(మహారాజ్ఞి) నీయాజ్ఞను శిరమునధిరించి యీవాయువు సమస్త దిక్కులయందును అంతటకు వీచుచు పరుగిడుచున్నాడు. శ్లో|| త్రికలాఢ్యాం త్రిహృలేఖాం ద్విహం సస్వర భూషితామ్| యో జపత్యమ్బ తే విద్యాం సో7 క్షరః పరమ స్స్వరాట్ || తై-య-నారా-ఉప-13 అనువాకము 87, మూడుకకారములు, మూడులకారములును గలదియు మూడు హ్రీంకారములుగలదియు రెండుహకారములును రెండుసకారములుగలదియు, రెండు అచ్చులతో గూడిన నీవిద్యను (పంచదశీమంత్రమును) ఎవడు జపించునో వాడు నాశనరహితుడగు పరమాత్మస్వరూపుడు అగును. శ్లో|| దారిద్ర్యాబ్ధౌ దేవి మగ్నోపి శశ్వ| ద్వాచా యాచే నాహ మమ్బ త్వదన్యమ్| తస్మాదస్మద్వాఞ్చితం పూరయైత| దుషా సా నక్తా సుదుఘేవ ధేనుః|| ఋ-మం-1-186-4 88. దేవీ!తల్లీ!ఎల్లప్పుడును దారిద్ర్యమున మునిగిన వాడనయ్యు, నేను నిన్ను దప్ప ఇతరుని వాక్కుతో యాచింపను. కావున మాయీకోర్కెను, రేయింబవలు మంచిపాలనిచ్చు ఆవువలె సఫలము చేయుము. శ్లో|| యో వా యద్యత్కామనా కృష్టచిత్తః| స్తుత్వోపాస్తే దేవి తే చక్రవిద్యామ్| కల్యాణానా మాలయః కాలయోగా| త్తం తం లోకం జయతే తాంశ్చ కామాన్|| ముండక-3-1-10 89. ఓదేవీ! ఎవడు ఏకోరికగలచిత్తముతో నీచక్రవిద్యను ఉపాసనచేయునో ఆతను కాలక్రమమున శుభములకు స్థానమై ఆయాలోకములను, ఆయాకోర్కెలను బొందును. శ్లో|| సాధక స్సతతం కుర్యాదైక్యం శ్రీచక్రదేహయోః| తధా దేవ్యాత్మనోరైక్య మేతావనదనుశాసనమ్|| కఠ-వల్లి 6-15 మం 90. సాధకుడు (ఉపాసనచేయువాడు) ఎల్లప్పుడును శ్రీచక్రమునకును తనదేహమునకును ఐక్యమును భావింపవలయును. అట్లే దేవికిని తనకును ఐక్యమును భావింపవలయును. ఇంతియే ఉపదేశము. శ్లో|| హస్తామ్భోజ ప్రోల్లసచ్చామరాభ్యాం* శ్రీవాణీభ్యాం పార్శ్వయో ర్వీజ్యమానామ్* శ్రీసమ్రాజ్ఞి త్వాం సదా7లోకయేయం* సదా సద్భిః సేవ్యమానాం నిగూఢామ్** 91. ఓ శ్రీమహారజ్ఞి? లక్ష్మీ సరస్వతులు రెండు ప్రక్కలను ఉండి హస్తములయందు వింజామరలధరించి ఉపచరింపగా ఎల్లప్పుడును సత్పురుషులచే సేవింపబడు రహస్యమయిన నిన్ను ఎప్పుడును సాక్షాత్కరింతునుగాక. శ్లో** ఇష్టానిష్ట ప్రాప్తి విచ్ఛిత్తి హేతుః* స్తోతుం వాచాం క్లుప్తి రిత్యేవ మన్యే* త్వద్రూపం హి స్వానుభూత్యైకవేద్యం* న చక్షుషా గృహ్యతే నాపి వాచాట** ముండక ఉప-3-1-8 92. ఇష్టప్రాప్తికిని, అనిష్టపరిహారమునకును సాధనము నీస్తోత్రరచనయే యనితలంచుచున్నాను. నీస్వరూపము కన్నులకు గన్పడదు. వాక్కులచే చెప్పరానిది స్వానుభవముచేతనే తెలియదగినది. శ్లో** హరస్వరైశ్చతుర్వర్గపదం మన్త్రం సబిందుకమ్ దేవ్యా జపత విప్రేన్ద్రా అన్యా వాచో విముఞ్చథ ముండక ఉప-2-2-5 93. విప్రవర్యులారా!హకారము, రేఫము. ఈకారము బిందువుతో గూడినదియు ధర్మార్థ కామ మోక్షములకు స్థానమగు దేవీమంత్రమును జపింపుడు. ఇతరములగు వాక్కులను విడిచిపెట్టుడు. శ్లో** యస్తే రాకాచన్ద్రబిమ్బాసనస్థాం* పీయూషాబ్ధిం కలృయన్తీం మయూఖైః* మూర్తిం భక్త్వా ధ్యాయతే హృత్సరోజే* న తస్య రోగో న జరా న స మృత్యుః** శ్వేతాశ్వతర-2-2-12 94. కిరణములచే అమృతసముద్రమును కల్పించుచున్నదియు, సహస్రారమందలి పూర్ణచంద్రమండలమందున్న నీమూర్తి నెవడు తనహృదయపద్మమందు ధ్యానముచేయుచున్నాడో అతనికి రోగము, ముదిమి, మృత్యువును గలుగవు. శ్లో** తుభ్యం మాత ర్యో ೭ఞ్జలిం మూర్ధ్ని ధత్తే* మౌళిశ్రేణ్యా భూభుజ స్తం నమన్తి* యః స్తౌతి త్వా మమ్బ చిద్వల్లి! వాచా* తం ధీరాసః కవయ ఉన్నయన్తి* * తై-య-బ్రా-3-5-1 95. ఓతల్లీ!ఎవడు శిరస్సున నీకు అంజలి ఘటించునో వానిని రాజులు శిరములవరుసతో నమస్కరింతురు. ఓ అంబ!చిద్వల్లీ! వాక్కుచే నిన్నెవడు స్తోత్రముచేయునో వానిని పండితులు కవులును గౌరవింతురు. శ్లో* * వైరిఞ్చౌఘైర్విష్ణు రుద్రేన్ద్ర బృన్ద్రైర్దుర్గా కాళీ భైరవీ శక్తిసంఘైః* యన్త్రేశి? త్వంవర్తతే స్తూయమానా న తత్ర* సూర్యోభాతి న చన్ద్ర తారకం* * కఠ-5-వల్లీ-15 ముండక 96. యంత్రాధీశ్వరీ! సృష్టికర్తల సమూహముచేతను, విష్ణు, రద్ర, ఇంద్ర సమూహములచేతను, దుర్గా, కాళీ, భైరవీ, శక్తిసమూహములచేతను నీవుస్తుతింపబడుచున్నావు. నీవున్నచోటు సూర్య చంద్ర నక్షత్రకాంతులకు అతీతమయినది. శ్లో* * భూత్యైభవాని త్వాం వన్దేసురాః శతమఖాదయః* త్వా మానమ్య సమృద్ధా స్యురాయో ధామాని దివ్యాని* * తై-య-మం-4-1-1 తస్యక్షిప్రం త్వత్ర్పసాదేన మాతః* సత్యాఃసన్తు యజమానస్య కామాః* * తై-య-సం-4-2-3 102. మాతా! భక్తియుండికాని లేకకాని శ్లోకాము చివర వేదముగల యీస్తుతిచే నేమానవుడు నిన్ను స్తుతించునో నీయనుగ్రహముచే శీఘ్రముగా ఆయజమానునికోర్కెలు ఫలవంతములగుగాక. శ్లో* * బాలిశేన మయా ప్రోక్త మపి వాత్సల్యశాలినోః* ఆనన్ద మాదిదమ్పత్యో రిమా వర్ధన్తు వాం గిరః* * తై-య-4-7-1 103. ఈస్తోత్రము అజ్ఞానినగు నాచేచెప్పబడినను, వాత్సల్యపరిపూర్ణులగు ఆదిదంపతులగు మీకు(కామేశ్వరీ కామేశ్వరులకు) స్తోత్రరూపమయిన ఈ వాక్కులు ఆనందమును వృద్ధిని జేయుగాక. శ్లో* * మాధురీ సౌరభావాస చాప సాయక ధారిణీమ్* దేవం ధ్యాయన్ పఠేదేతత్సర్వ కామార్థసిద్ధయే* * శ్రీసుక్తము 104. మాధుర్యమునకు స్ధానమగు చెఱుకువింటిని సుగంధమునకుస్ధానమగు పుష్పబాణమును ధరించిన శ్రీదేవిని ధ్యానించుచు అన్నికోర్కెలు సిద్ధించుటకీ స్తవమును పఠింపవలెను. శ్లో* * స్తోత్ర మేతత్ర్పజపత స్తవ త్రిపురసున్దరి* అనుద్వీక్ష్య భయాద్దూరం మృత్యుర్ధావతిపంచమః* * తై-య-ఆనందవపల్లి ఉప 8 అనువాకము 105. త్రిపురసుందరీదేవీ! నీయీస్తవమును పఠించు వారిని భయమువలన చూడకుండనే అయిదవవాడగు యముడు పర్వెత్తును. ఇట యముడైదవవాడనగా నీక్రిందిశ్రుత్యర్థము అను సంధేయము. పరమేశ్వరునివలన భయముచే వాయువు వీచుచున్నాడు. సూర్యడుదయించుచున్నాడు. అగ్నియు, ఇంద్రుడును, అయిదవవాడగు యముడును, వారికార్యములకు పర్వెత్తుచున్నారు. పరమేశ్వరునకును పరదేవతకును అభేదము. శ్లో* * యఃపఠతి స్తుతి మేతాం విద్యావన్తం త మమ్బ ధనవన్తమ్* కురు దేవియశస్వన్తంవర్చస్వన్తం మనుష్యేషు* * తై-య-సం-3-3-1 106. ఓజననీ! మనుష్యులలో నెవడీప్తవమును పఠించునో వానిని విద్యానంతునిగను, ధనవంతునిగను, కీర్తిమంతునిగను, తేజోవంతునిగను జేయుము. శ్లో* * యేశృణ్వన్తి స్తుతి మిమాం తవ దేవ్యనసూయకాః* తేఖ్యోదేహి శ్రియం విద్యా ముద్వర్చం ఉత్తనూబలమ్* * తై-య-సం-4-1-10 107 దేవీ!అసూయలేనివారై యెవరు ఈస్తవమును విందురో వారికి సంపదను, విద్యను, గొప్పవర్చస్సును ఎక్కువ శరీరబలమును ఇమ్ము. శ్లో* * త్వామేవాహం స్తౌమి నిత్యం ప్రణౌమి* శ్రీవిద్యేశాం వచ్మి సంచిన్తయామి* అధ్యాస్తే యా విశ్వమాతా విరాజో* హృత్పుణ్డరీకం విరజం విళుద్ధమ్* * కైవల్య-ఉపఖం-1-5 సూక్తము 108.ఏజగజ్జనని విశుద్ధమయిన రజోగుణశూన్యమయిన విరాట్పురుషుని హృదయపద్మమునందున్నదో అట్టి నిన్ను నేస్తుతింతును. నిత్యము నిన్నే నమస్కరింతును శ్రీవిద్యేశ్వరిని నిన్నే చెప్పెదను. నిన్నే ధ్యానింతును. శ్లో* * శఙ్కరేణ రచితం స్తవోత్తమం* యః పఠేజ్జగతి భక్తిమాన్నరః* తస్య సిద్ధి రతులా భ##వేద్ధ్రువా* సున్దరీ చ సతతం ప్రసీదతి* * 109. శంకరునిచే రచింపబడిన యీస్తవము నెవడు జగమున భక్తికలవాడై పఠించుచున్నడో వానికి సాటిలేని స్ధిరమగు సిద్ధ అగును. త్రిపురసుందరీదేవియు నెల్లపుడాతని ననుగ్రహించును. శ్లో* * యత్రైవ యత్త్రైవ మనో మదీయం తత్త్రైవ తత్త్రైవ తవ స్వరూపమ్ యత్త్రైవ యత్త్రైవ శిరో మదీయం తత్త్రైవ తత్త్రెవ పదద్వయం తే 110.ఎక్కడెక్కడ నామనస్సుండనో అక్కడక్కడ నీస్వరూపమును, ఎక్కడెక్కడ నాశిరస్సుండునో అక్కడక్కడ నీపాదద్వయమును ఉన్నది. శ్లో* * మహా కామేశ్వరాఙ్క నిలయా* మహా త్రిపుర సున్దరీ* పాఠకేభ్యః పరాం భక్తిం* దేయాన్ముక్తిం చ శాశ్వతీమ్* * 111.మహాకామేశ్వర ప్రభువుయొక్క అంకపీఠకను నివసించియున్న మహాత్రిపురసున్దరీ పరాభట్టారిక ఈస్తోత్రమును పఠించు పాఠకులకు పరాత్మక భక్తిని, శాశ్వతమయిన ముక్తిని ప్రసాదించుగాక. ఇది శ్రీ త్రిపురసున్దరీవేదపాదస్తవము సంపూర్ణము. శ్రీమ త్త్రిపురసున్దరీ పరదేవతార్పణమస్తు శ్రీః శ్రీః శ్రీః -0- శ్రీ చిదంబర నటరాజు దేవాలయమున సౌరసమాసముప్రకారము వైదికపద్ధతిగా జరుగు నిత్యపూజలు, ఉత్సవములు. 1. నిత్యపూజలు: ఉదయం 7 గం. విశ్వరూపదర్శనము పాలు నైవేద్యము. 9గం. మొదటికాల పూజ. శ్రీ చంద్రమౌళీశ్వర (స్పటికలింగమునకు) అభిషేకము, దీపారాధన. 10 గం. శ్రీ చంద్రమౌళీశ్వరునకు మరియు శ్రీ రత్నసభాపతికి (మరకత నటరాజు విగ్రహము) అభిషేకము, దీపారాధన. 11గం. శ్రీచంద్రమౌళీశ్వరునకు అభిషేకము, దీపారాధన. సాయంకాలము 6గం. 8గం. మరియు 10గం' శ్రీ చంద్రమౌళీశ్వరునకు అభిషేకము, దీపారాధన. నిత్యఉత్సవములు. రాత్రి 7గం. శ్రీనటరాజు రత్నపాదుకలు వెండిపల్లకి విజ్ఞానమయప్రాకారములో ఊరేగింపు. రాత్రి 9గం. శ్రీ బలీశ్వర (చంద్రశేఖర) పల్లకి. మనోమయప్రాకారములో ఊరేగింపు. రాత్రి 10గం. శ్రీ నటరాజు స్వర్ణపల్లకి విజ్ఞానమయ ప్రకారములో ఊరేగింపు. 2.మహాభిషేకములు: సంవత్సరమునకు 6 మహాభిషేకములు శ్రీ శివకామసుందరీ నటరాజులకు కనకమభయందు సాయంకాలము 6-9 జరుగును. (1) మేషమాసము (చైత్ర) శ్రవణానక్షత్రము (2) మిధునమాసము(జ్యేష్ఠ) ఉత్తరనక్షత్రము (3) సింహమాసము (శ్రావణ) శుక్లచతుర్దశితిధి (4) కన్యామాసము (భాద్రపదము) శుక్లచతుర్దశితిధి (5) ధనుర్మాసము (మార్గశీర్షము) ఆరుద్రనక్షత్రము (6) కుంభమాసము(మాఘ) శుక్లచతుర్దశి తిధి 3.మహోత్సవములు: సంవత్సరమునకు రెండు మహోత్సవములు. (1) మిధునమాసము(జ్యేష్ఠ) ఆణి (ఉత్తర) తిరుమంజనము. (2) ధనుర్మాసము(మార్గశీర్షము)- ఆరుద్ర ఈ మహోత్సవములు 13 దినములు జరుగును. 12వ దినము రధోత్సవము, 13 వ దినమున దర్శనము. ప్రతిదినము వాహనముల మీద శ్రీ శివకామసుందరీ నటరాజులను 4 రాజవీధులలో రాత్రిళ్లు ఊరేగింపు. శోధనపట్టిక పండితాభిప్రాయములు, ఆశీస్సులు పుట - పంక్తి - తప్పు - ఒప్పు i 13 మహారాజధానీ మహారాజరాజధానీ v #9; #9; #9; #9; #9; #9; 2 శీఆషస్సముల్లన్తు ఆశిషస్సముల్లసన్తు vi #9; #9; #9; #9; #9; #9; 3 ప్రకాశయతు ప్రకాశయితు vii 21 హృదయంగమయిన హృదయంగమమయిన 22 చిదమ్చద చిదమ్బర ix 8 మహాత్మ్య మహాత్మ్యం x 3 వక్తవ్యాశంలేశః వక్తవ్యాంశ##లేశః 5 ప్రదమం ప్రధమం 7 గ్రన్ధ గ్రన్ధ ఆన్ధ్ర ఆన్ధ్ర xi 2 లక్ష్మె లక్ష్మై 9 పీసుపాటి పీసపాటి 12 భగవతీ భగవతి 13 ముమాఙనా ముమాఙ్గనా xii 1 వాఞ్చయా వాఞ్చయా xiii 1 పరోపకారయ పరోపకారాయ 4 సామగ్రేషు సామగ్రీషు 5 తస్తోత్ర తత్త్సోత్ర రఖివర్ధతే రభివర్ధతే 7 మర్త్యేః మర్త్యైః 9 జాయన్తె జాయన్తే 11 మతిష్ఠద్భిః మధిష్ఠద్భిః 13 దేవనాగరీ దేవనాగరీ xiv #9; #9; #9; #9; #9; 2 సార్థ సార్ధ 7 నిర్వూఢ నిర్వ్యూఢ 11 దర్భ దర్భా xv 3 వేదార్ధ వేదార్థ 5 నటరాజయ నటరాజాయ 6 పాషాత్ముల పాపాత్ముల xvi 4 సుందరీపాద సుందరీవేదపాద 7 వ్యాప్రాద వ్యాఘ్రపాద 8 పతఞ్జల పతఞ్జలి xvii 1 చేని చేసి 15 చున్వాను చున్నాను xviii 3 వేదార్ధ వేదార్థ 17 యోగచ్చ యోగశ్చ తేషాంతుశసులభో తేషాంతుసులభో ixx 13 లెల్లరును లెల్లరను xx 8 బూని బూను 10 శ్రేయో೭బి శ్రేయో೭భి xxi 3 వేదా೨ విద్వాన్ వేదాన్తవిద్వాన్ 10 మా ೧ము మార్గము xxii 2 కళాధ్యక్షులగా కళాధ్యక్షులుగా 4 దీనిది దీనిని xxiii 19 గరీయసి గరీయసీ xxv 22 తాణ్ణవ తాణ్డవ xxvi 5 అందరిని అందరికి 13 బంకారమ్మ బంగారమ్మ 19 శ్రీమదబినవ శ్రీమదభినవ xxvii 4 శునిశిత సునిశిత 19 వేదార్ద వేదార్ధ 21 శాస్త్ర శాస్త్రి xxviii 8 శ్రేణికు శ్రేణికి 13 సలహాలిచ్చ సలహాలిచ్చి 14 మహానీయుందరికి మహానీయులందరికి 18 పీసుపాటి పీసపాటి 20 గ్రంట గ్రంథ 21 తెలుపుటకు తెలుపుట ixxx 1 సుందర సుందరీ 14 కృతజ్ఞనతో కృతజ్ఞతతో 20 వారినందరి వారినందరిని xxxi 4 తన్మన్తాన్నాపరో తన్మన్త్రాన్నాపరో xxxii 18 గంగము లింగము xxxv 13 భాగమున భాగమున xxxvii 7 మతనియు మతమనియు ixxxx 2 గళములు దళములు 7 దశములు దళములు xxxx 8 అచ్చటపర అచ్చట 9 సాషాంగ సాష్టాంగ 14 స్తవమునురచిం స్తవమును 17 వలుగురు నలుగురు xxxxi 5 పరిపుత పరిప్లుత 18 వెదపాద వేదపాద xxxxii 5 నుండి 7 వరకు వేదము సర్వధర్మములకును వేదము సర్వధర్మములకును మూలము "అలౌకికశ్రేయ ఇష్టప్రాప్తి, అనిష్టపరిహార స్సాధనతాబోధకోవేదః" ములకుఅలౌకికోపాయబోధ అనివేదలక్షణము. ఇష్టకమగుననివేదము."అలౌకిక ప్రాప్తి, అనిష్టపరిహారము శ్రేయస్సాధన తాబోధకో లకు అలౌకికోపాయబోధవేదః" కమగునది వేదము. 17 పాదాన్తము 9; 9; 9; 9; పాదాన్తమున xxxxiii 12 కాపాప్త 9; 9; 9; 9; 9; వాకాప్త xxxxv 2 నిష్ణ్వాతులును 9; 9; 9; నిష్ణాతులును 19 సీసపాటి 9; 9; 9; 9; 9; పీసపాటి 1 15 వౌషట్ 9; 9; 9; 9; 9; 9; వషట్ 4 10 కరారం 9; 9; 9; 9; 9; కర్తారం 5 17 అన్త్రాయ 9; 9; 9; 9; 9; అస్త్రాయ 8 3 పూజతే 9; 9; 9; 9; 9; పూజాతే 6 శంఖో 9; 9; 9; 9; 9; 9; శంభో 13 సన్మంగహాని 9; 9; 9; 9; సన్మంగళాని 17 3 వనే 9; 9; 9; 9; 9; 9; వన్దే 15 విశ్మఖం 9; 9; 9; 9; 9; విశిఖం 18 9 కవచం 9; 9; 9; 9; 9; కచం 23 18 సుద్దరీమ్ 9; 9; 9; 9; 9; సున్దరీమ్ 36 6 తరశ్చైతద్ర్బహ్మ 9; 9; తరఞ్చైతద్ర్బహ్మ 39 11 41 40 47 10 తచ్ఛృణుః 9; 9; 9; 9; తచ్ఛృణు 52 8 నుహతా 9; 9; 9; 9; 9; మహతా 80 7 మువగతః 9; 9; 9; 9; 9; ముపగతః 83 2 తత్సరం 9; 9; 9; 9; 9; తత్సర్వం 11 ప్రణిపత 9; 9; 9; 9; 9; ప్రణిపత్య 83 16 తససాం ; ; ; ; ; తపసాం 86 19 లభ##తే 9; 9; 9; 9; 9; 9; లభ్యతే 101 11 తత్కత్పా 9; 9; 9; 9; 9; తత్కృత్వా 117 15 జస్మ 9; 9; 9; 9; 9; 9; జన్మ 128 8 యాస్యనఘా 9; 9; 9; 9; యాప్యనఘా 136 15 తృప్తిజెందుచు 9; 9; 9; తృప్తిపరచుచు 142 12 తసై 9; 9; 9; 9; 9; 9; తసై#్మ 155 5 ఆనన్థస్య 9; 9; 9; 9; 9; ఆనన్దస్య 168 5 5గలత్కాఞ్చి 9; 9; 9; 9; గలత్కాఞ్చీ 174 11 ప్రౌడాశ్చ 9; 9; 9; 9; 9; ప్రౌఢాశ్చ 179 11 కుణ్డాన్యసి 9; 9; 9; 9; కుణ్డాన్యపి 186 4 తదనుఙ్ఞయా 9; 9; 9; 9; తదనుజ్ఞయా 189 10 పౌదం 9; 9; 9; 9; 9; 9; పాదం 200 6 పూర్వ 9; 9; 9; 9; 9; 9; పూర్వం 203 2 నికోరిక 9; 9; 9; 9; 9; నీకోరిక 212 15 ఆచారస్య 9; 9; 9; 9; 9; ఆచార్యస్య 214 3 సిన్దు 9; 9; 9; 9; 9; 9; సిన్ధు 215 19 అద్పష్టముచే 9; 9; 9; 9; అదృష్టముచే 221 6 నన్మెల్లప్పుడు ; ; ; నన్నెల్లప్పుడు 222 7 పుణ్య పుణ్య 14 పూర్ణమ పూర్ణిమ 227 4 బ్రువన్తస్తద్యమేవం బ్రువన్తస్తధ్యమేవం 246 7 శమ్బోః శమ్భోః 248 10 ప్రధధ్మః ప్రదధ్ముః 14 ఆనన్తరం అనన్తరం 250 6 కర్ణాయుష కర్ణాయుష్య 14 యధా యథా 259 19 తైలోక్య త్రైలోక్య 272 12 సథస్సంసార సత్యస్సంసార 287 1 మధ్వాహ్నౌ మథ్యాహ్నౌ 294 5 ప్రణమ ప్రణమ్య 307 6 రేఖేన్త్ర లేఖేన్ద్ర 318 18 తలిఙ్గం తల్లిఙ్గం 331 20 సమర్దులే సమర్ధులే 335 8 నిశ్చంచి నిశ్చయించి 361 18 పోగొటునది పోగొట్టునది 368 17 ఇది ఇతి 369 1 స్యానుజో స్సానుజో 14 నండరను నందరను 375 13 యవరాజు యువరాజు 379 1 అధౌసౌ అథాసౌ 380 17,18 పంక్తులమధ్య కరుణాలోకనైర్దేవ! తానప్యుత్తారయప్రభో! 381 18 మంగళముతో మంగళములతో 390 6 చేతసాన్ చేతసామ్ 17 పూర్వము పూర్వము 398 1 శ్రుత్యా శ్రుత్వా 402 5 సమ్రాఎపై సమ్రాఎప్తే 403 8 ముర్దలం మరజం మర్దలం మురజం 105 2 రత్నేః రత్త్నెః 407 17 రమ్బా రమ్భా 418 17,18 పంక్తులమధ్య వరుణుడిట్లడుగగా భక్తులకు వరములనిచ్చు మహేశ్వరుడు 421 3 వ్యాఘ్రపార వ్యాఘ్రపాద 423 8 శతాధ్యి శతాధిక 430 5 కటక కటకకి 441 11 ఇది ఇతి నటరాజ వేదపాస్తవము 445 4 తుణ్ఠ తుణ్డ 446 4 ఖడేన్దు ఖణ్డన్దు 450 1 క్షితమణ్డ లే క్షితిమణ్డలే 7 హృష్టమ్రనాః హృష్చమనాః 451 9 మార్తా మార్తాణ్డ 452 10 గొప్పవానినడ గొప్పవాడనని 455 6 శరీరములు శరీరములు 457 8 సహస్రాభీశషదే సహస్రాభీషవే 459 11 బిచ్ఛ బిచ్చ 460 3 ఎముకలు ఎముకలదండ 14 థాతారం దాతారం 18 జయింపబడిని జయింపబడని 461 3 గంగ గంగా 10 ఋగ్వేజు ఋగ్వజు 462 16 జ్యేష్టా జ్యేష్ఠా 464 4 నడవ నడప 473 7 జీవేన జీవేమ 475 7 మీత్రేణ మాత్రేణ 15 కథా కదా 476 12 కింత్వీశో కిన్వీశో 18 కొంచమేని కొంచెమేని 480 6 యచ్చతం యచ్ఛతమ్ 13 చేయుడు చేయుము 484 1 విచిత విచిత్ర 484 9 పరమాత్మకన్నా పరమాత్మకన్న 487 16 పద్య పథ్య 488 3 యోగముచే రోగముచే 4 వైద్యులతో వైద్యులలో 17 తదైవ తవైవ 490 5 ర్ముదువై ర్మృతులై 18 రక్ష్యతి రక్షతి 491 13 (సౌమ్యము) (సౌమ్యుడు) 493 12 జగములను జగములను జగములను 494 4 భృఙ్గ భృఙ్గా 496 1 తీవ్రైః తీవ్రై 499 11 మహాఠవి మహాకవి 500 5 సుముద్బభూవ సముద్బభూవ స్పుతా స్సుతా 10 మంగభకర మంగళకర 16 మునీరయన్తీం ముదీరయన్తీం 5021 11 పూజ్యురాలను పూజ్యురాలును 16 నమో೭స్మి నతో೭ స్మి 20 పార్శ్వమునుండి పార్శ్వముననుండి 502 4 చన్ద్రచూడాం చంన్ద్రాచూడాం 15 ఆనన్దదదాత్రీమ్ ఆనన్దదాత్రీమ్ 19 వాక్కులను వాక్కులకును 503 6 ళ్రియం శ్రియం 9 పాసములనుండి పాపములనుండి 10 ళూషణమగు భూషణమగు 505 14 పుత్రులనుపొందుదురు పుత్రులనుపొందుదురు పుత్రులనుపొందుదురు. 507 12 చిదమ్భర చిదమ్బర 510 5 సస్తద్వీప సప్తద్వీప 511 ; ; ; ; 11 వాకార నాకార 16 వాధ్యూర్ధ్వ వాద్యూర్ధ్వ 512 1 అగి అగ్ని 9 నృత్యత్పణ నృత్యత్ఫణ శ్రీ త్రిపురసున్దరీ వేదపాదస్తవము 516 12 హస్తమునందు హస్తములందు 517 14 భవము భయము 521 7 మీత్రిడే మీడేత్రి 522 3 వాద్య వాచ్య 527 1 షోడన్యాసములు షోఢాన్యాసములు 5 దేశికేన్ధ్రం దేశికేన్ద్రం 528 4 మధీన్ద్ర మద్రీన్ద్ర 14 కరాబ్జెః కరాబ్జైః 529 11 త్త్వత్పాబ్జా త్త్వత్పాదాబ్జా 532 15 కృత్యే కృత్యై 533 11 తల్లీ తల్లీ 19 మంతెన మంకెన 534 7 నాచెలీ! నాచెవీ! 10 వాగ్దేవితి వాగ్దేవీతి వతన్త్యమ్బ వదన్త్యమ్బ 535 4 మాధురము మాధుర్యము 9 ప్రీణయన్తిః ప్రీణయన్తి 15 చతుష్టము చతుష్టయము 17 ఐహాముద్ర ఇహాముత్ర 535 18 మముక్షుత్వము ముముక్షుత్వము 536 14 దయానిదీ! దయానిధీ! 537 11 వచ్యుపాయం వచ్మ్యుపాయం 539 10 చక్రీశ్వరి చక్రేశ్వరి 14 దూరీకృత్యాళు దూరీకృత్యాశు 542 5 విద్వమ్మఖ్యె విద్వమ్మఖ్యై 20 ఆనూచ్మిర్తిని ఆచిన్మూర్తిని 543 3 ఆశిష్య ఆశ్లిష్య 12 సర్వేషా సర్వేషాం భోగదాయ భోగదాయి 548 2 లక్ష్యాం లక్ష్మ్యాం 11 లక్షణం లక్షణమ్ 555 10 యన్త్రేశి? యన్త్రేశి? వర్తతే వర్తసే 560 3 తేఖ్యో తేభ్యో 563 1 సౌరసమానము సౌరమానము 564 18 నటరాజులను నటరాజులకు 19 రాత్రిళ్లు రాత్రి