Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu
Chapters
పంచమో೭ధ్యాయః (త్రిసహస్రద్విజేంద్రప్రశంసనము) శ్లో|| ఏతత్షేత్రవాసినో మఖివరా వేదేషు శాస్త్రేషు చ వ్యుత్పన్నాః త్రిసహస్రికాం నటపతిం సంయుజ్య సంఖ్యామగుః| ఏతే೭ర్చన్తి నటేశపాదయుగలం భక్త్యా సదానన్య గాః తేషామేవ చ తుష్టయే స నటరాడ త్రైవ నృత్యత్యహో|| ఈ క్షేత్రమున నివసించువారు యజ్ఞములు చేసిన వారు, వేదశాస్త్రములయందు పండితులు. వీరు నటపతితో కలసి మూడువేలమంది యుండిరి. వీరితరచింత లేక ఎల్లపుడు భక్తితో నటేశుని పాద ద్వంద్వమును పూజించుచుందురు. వారి సంతోషముకొరకే ఆ నటరాజక్కడ నృత్యము చేయుచుండెను. ఆహా! మహేశ్వరః : శ్లో|| త్రిసహస్రద్విజా స్తత్ర నివసన్తి నిరన్తరమ్| వాగేవ మధురా యేషాం శారదేతి నిగద్యతే|| మహేశ్వరుడు : మూడువేలమంది బ్రాహ్మణు లక్కడ నిరంతరము నివసించుచుండిరి. వారి వాక్కు మధురము. సరస్వతియే యని చెప్పబడును. శ్లో|| ద్విజన్మాన స్సుజన్మాన స్తపోభిశ్శుద్ధచేతసః| వేదేషు తే గణాధీశ! సర్వే పర్యాయవేధసః|| గణాధీశ! ఆబ్రాహ్మణులు మంచి పుట్టుక గలవారు. తపస్సులచే పరిశుద్ధమైన చిత్తము గలవారు. వేదములయందు వారందరు మరియొక బ్రహ్మలే. శ్లో|| సుదక్షిణౖర్మహాయజ్ఞైస్తర్పయ స్తస్సదా సురా&| ఆకృత్రిమేణ చిత్తేన మమ పూజాం ప్రకుర్వతే|| మంచి దక్షిణలతో గొప్ప యజ్ఞములు చేసి దేవతల నెల్లప్పుడు తృప్తిపరచుచు ఆకృత్రిమమైన చిత్తముతో నా పూజ చేయచుందురు. శ్లో|| ఆజటాబాలచన్ద్రేణాప్యఫాలా న్తరచక్షుషా| ఆవామావామభాగేన వపుషా మమ మూర్తయః|| జటలయందు బాలచంద్రుడు లేనిదియు, నుదుటి యందు కన్ను లేనిదియు, ఎడమ భాగమును స్త్రీ లేనిదియునగు శరీరముతో వారు నా మూర్తులు, శ్లో|| సుప్రసన్నా ముఖే వాణీ కటాక్షే కమలాసనా| శాన్తిశ్చిత్తేషు దేహేషు కాన్తిస్తేషాం స్థితాసదా|| వారి కెల్లప్పుడు ముఖమున ప్రసన్నమైన సరస్వతి కటాక్షమున లక్ష్మి, చిత్తములయందు శాంతి, శరీరములయందు కాంతి యుండును. శ్లో|| కామక్రోధాదిభిర్దోషైర్ముక్తాస్తే భాగ్యశాలినః| అన్యేషాం తు మనుష్యాణాం దుష్కృతచ్ఛేది దర్శనాః|| వారు కామ క్రోధాది దోషములు తొలగిన భాగ్యశాలురు. ఇతరుల పాపమును బోగొట్టు దర్శనము గలవారు. శ్లో|| సత్యవ్రతేషు సంరక్తాః పావకోజ్జ్వతేజసః| ధర్మాద్రిశిఖరం ప్రాప్తాః పాపధ్వాన్తదివాకరాః|| సత్య వ్రతములయందనురాగము గలవారు. అగ్నివలె ప్రకాశించు తేజస్సు గలవారు. ధర్మమనెడు పర్వతము యొక్క శిఖరమునకు జేరినవారు. పాపమనెడు చీకటికి సూర్యులు. శ్లో|| లబ్ధనిర్బీజయోగత్వాత్ నిర్మలజ్ఞానదాయినః| శివం చిత్తేషు పశ్యన్తో మోదన్తే తే తవస్వివః|| నిర్బీజయోగమును పొందినవారు గనుక నిర్దుష్ట జ్ఞానమునిచ్చు ఆ తావసులు మనస్సులో శివుని జూచూచు ఆనందించుచుందురు. శ్లో|| పరం నిర్మలవర్ణాశ్చ వాచస్తేషాం ద్విజన్మనామ్| ఉన్మూలయన్తి పాపాని మానవానామ హేతుకమ్|| ఆబ్రాహ్మణులయుక్కనిర్మలమైన వర్ణములుగల వాక్కులు కారణము లేకుండగనే మానవుల పాపములను బోగొట్టును. శ్లో|| కలావిలాసినీకాన్తాః విద్యాయువతివల్లభాః| శాస్త్రాబ్ధిశశినో నన్దిన్! ఆగమారామకోకిలాః|| నందీ! వారు కళలనెడు శాన్తలకు కాంతులు, విద్యల నెడు యువతులకు ప్రియులు, శాస్త్రములనెడు సముద్రములకు చంద్రులు, వేదములనెడు తోటలలో కోకిలలు. శ్లో|| ఆతిథేయాస్సదా తే చ షట్కర్మాచరణ రతాః| మూర్తయస్సత్యశుద్ధానామాచారాణాం ద్విజోత్త మాః|| ఆ బ్రాహ్మణవర్యులు ఎల్లప్పుడు అతిధుల విషయమున సాధువులు. యజనాది షట్కర్మలయం దాసక్తి కలవారు. సత్యశుద్ధమైన యాచారముల కాకారములు. శ్లో|| అహమప్యేక ఏవాస్మి తేషు నన్దిన్! ద్విజన్మసు| తత్రైవ వర్తమాన సై#్తస్సాకం ప్రీతో భవామి చ|| నందీ! నేను కూడ ఆబ్రాహ్మణులలో నొకడను. అక్కడనే ఉండి వారితో కూడ ఆనందించుచుంటిని. శ్లో|| #9; త ఏవ మమ జానన్తివైభవం వరతఃపరమ్| కిఞ్ఛిదప్యుత్తమం నైవ జానే తేషాం తువైభవమ్|| ప్రపంచాతీతమైన నా వైభవమును వారే యెరుగుదురు. ఉత్తమమైన వారి వైభవమును మాత్రము కొంచెము కూడ ఎరుగను. శ్లో|| సకృదాలోకనం తేషాం చిరకాలతపఃఫలమ్| తదీయస్మరణాదాశు విలయం యాన్తి పాతకాః|| ఒక్కసారి వారి దర్శనము లభించుట చాలకాలము చేసిన తపస్సునకు ఫలితము. వారిని స్మరించిన వెంటనే పాపములు నశించును. శ్లో|| చిదమ్బరస్య తే సాక్షాద్రక్షితారః స్వశక్తిభిః| తత్ర్పభావం చ జానన్తి సమ్యగ్వాచామగోచరమ్|| నాకు తమశక్తులతో ప్రత్యక్షముగా చిదంబరమును రక్షించువారు. వాక్కులకు గోచరముగాని దాని ప్రభావము నుగూడ బాగుగా నెరుగుదురు. శ్లో|| మహాతాం మత్ర్పసాదావామాలయా నిలయా స్సదా| హస్తామలకవచ్ఛక్తిం మమ జానన్త్యమాయినః|| వారు ఎల్లపుడు నాగొప్ప అనుగ్రహములతో నిండిన గృహములు. మాయారహితులై నాశక్తిని అరచేతిలోని ఉసిరికాయనువలె సులభముగా దెలిసికొందరు, శ్లో|| భూతేర్విన్దన్తి మాహాత్మ్యం ప్రసూతేస్సర్వసమ్పదామ్| తస్య ధారణమాహాత్మ్యం ధారణస్యాపి లక్షణమ్|| వారు సర్వసంపదలను గలుగజేయు విభూతియొక్క మాహాత్మ్యమును దానిని ధరించుటయందలి వైభవమును ధరించెడు విధము నెరుగుదురు. శ్లో|| మాహాత్మ్యం మమ పూజాయాః వైభవం చ యథావిధి| సునిర్మలేన చిత్తేన ప్రవిజానన్తితే ద్విజాః|| ఆబ్రాహ్మణులు నిర్మలమైన చిత్తముతోయథావిధిగా నాపూజయొక్క మాహాత్మ్యమును వైభవమును ఎరుగుదురు. శ్లో|| అనన్యవైభ##వేచిత్త యేన లిఙ్గే స్థితో೭స్మ్యహమ్| జానన్తి తే పురం గుహ్యం ద్విజేన్ద్రాస్తస్యకారణమ్|| నేను లింగము నందుండుటకు పరమరహస్యమైన కారణము నా బ్రాహ్మణు లసాధారణ శక్తిగల చిత్తమున నెరుగుదురు. శ్లో|| తేషాం చిత్తం సమాశ్రిత్య సదా తిష్ఠతి సన్తతమ్| క్షమా చ ప్రమథాధీశ! సర్వహేతురభఙ్గురా|| ప్రమథాధీశ! అన్నిటికి కారణము, స్థిరమునగు ఓర్పు గూడ వారి చిత్తము నెల్లపు డాశ్రయించి యుండును. శ్లో|| భస్మభూషితమూర్తీనామేకదాపి ద్విజన్మనామ్| అక్లేశకారి దేహస్య దర్శనం సుమహత్తవః|| భస్మముచే అలంకరింపబడిన శరీరములుగల ఆబ్రాహ్మణులయొక్క, క్లేశమును జోగొట్టెడి శరీరదర్శనముకూడ గొప్ప తపస్సు. శ్లో|| అయత్నసులభం సత్యం సర్వతీర్థని షేవణమ్| శివస్థానస్య సర్వస్య సేవనం తత్ర్పకీర్త్యతే|| ఆదర్శనము అప్రయత్నముగా లభించిన సత్యము, సమస్త తీర్థములను సేవించుట, శివస్థానముల సన్నిటిని సేవించుట యని కీర్తింపబడును. శ్లో|| భావయన్తి తథా నన్దిన్! బుధ్యా యే తాన్ద్వి జన్ననః| మామేవ తే మహేశానం మత్ర్పియం చ ప్రకు ర్వతే|| నందీ! ఎవరా బ్రాహ్మణుల నావిధముగా భావించెదరో వారు మహేశ్వరుడనైన నన్నే భావించినవారు, నాకు ప్రీతిని గలుగ జేయువారు నగుదురు. శ్లో|| తేషామేవ సదా ప్రీత్యై తస్యాం కల్యాణసంపది| దర్శయామి ప్రకాశేన పరమానన్దతాణ్డవమ్|| వారి ప్రీతికొరకే ఆ కల్యాణసభలో పరమానంద తాండవము నెల్లప్పుడు బహిరంగముగా జూపుచున్నాను. శ్లో|| తేషామాగమలీలానాం మత్పరాయణచేతసామ్| సమో೭హమేక ఏవాస్మి నా స్త్యన్యో భువనత్రయే|| శాస్త్రములు క్రీడలుగా గలిగిన నాయందు లగ్నమైన చిత్తములుగల వారికి సాటి నే నొక్కడనే గాని మూడులోకములలో మరియొకడు లేడు. శ్లో|| హ్రియా ధియా భియా వాపి కామాత్ర్కోధాచ్చమోహతః| యదృచ్ఛయా వా పశ్యన్తి యే తత్ర మమ తాణ్డనమ్|| తే೭పి దర్శనమాత్రేణ ముక్తా ఏవ న సంశయః| కిం పునర్భావభ క్తిభ్యాం యే జనాః పర్యుపాసతే|| సిగ్గుతో గాని, బుద్ధిపూర్వికముగాగాని, భయముతో గాని, కోరికతో గాని క్రోధమువలనగాని మోహమువలనగాని ఆకస్మికముగాగాని ఎవరక్కడ నా తాండవమును జూచెదరో వారుకూడ దర్శనమాత్రముచేతనే ముక్తు లగుదురు. సందేహము లేదు. భావముతోడను, భక్తితోడను సేవించువారి విషయము చెప్పనేల? శ్లో|| తదీదృశం మహద్దివ్యం తాణ్డవం పరమాద్భుతమ్| యథావత్తే హి జాన న్తి ద్విజా స్తత్షేత్రవాసినః|| ఈవిధముగా దివ్యమై పరమాద్భుతమైన యా గొప్ప తాండవమును యథార్థముగా నాక్షేత్రవాసులైన బ్రాహ్మణులెరుగుదురు. శ్లో|| తదిదం గుణముఖ్యస్య తవ సత్యం మయోచ్యతే| తేషాం సర్వమహం వక్తుం నైవ శక్నోమి వైభవమ్|| గుణశ్రేష్ఠుడవైన నీ కీసత్యమును చెప్పుచుంటిని. వారి వైభవము నంతను నేను చెప్పనేలేను. శ్లో|| హేమవర్మాచ నృపతిః వ్యాఘ్రపాదః పతఞ్జలిః| ద్రక్ష్యన్తి తేద్విజేన్ద్రాశ్చమమ నృత్తమభఙ్గురమ్|| రాజగు హేమవర్మయు, వ్యాఘ్ర పాదుడును పతంజలియు, ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులును ఆసశ్వరమైన నా నృత్యమును జూచెదరు. సూతః : శ్లో|| ఇత్యుక్తం శమ్భురా పూర్వం వైభవం తద్ద్వి జన్మనామ్| కథితం విస్తరేణాద్య మునయస్సంశితవ్రతాః|| సూతుడు : ప్రతసమాప్తి చేసిన మునులారా! ఆబ్రాహ్మణుల యొక్క వైభవము పూర్వము శివునిచే నీవిధముగా జెప్పబడినది. ఇప్పుడు దానిని విస్తరముగా జెప్పితిని. శ్లో|| యఃపఠేదిమమధ్యాయం శృణుయాద్వా సమా హితః| స వినిర్ధూతసర్వాఘశ్శివలోకే మహీయతే|| 32 ఎవ డేకాగ్ర చిత్తుడై ఈ యధ్యాయమును చదువునో లేక వినునో వాడు సర్వపాపములు పోయి శివలోకములో నానందించును. ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ ననత్కుమారసంహితాయాం మహేశ్వరనన్దిసంవాదే చిదంబరమాహత్మ్యే త్రిసహస్రద్విజేన్తప్రశంసనం నామ పఞ్చమో೭ధ్యాయః --0--