Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

షష్ఠోధ్యాయః

(మాధ్యాందినిచరితము)

శ్లో|| మాధ్యన్దైనమహర్షిరాత్మతనయాయాదిశ్య పఞ్చాక్ష రీమ్‌|

క్షేత్రే తిల్లవనే తపాంసి చరితుం పుత్రం సమాదిష్ట వాన్‌|

యత్రేశః స్వయమమ్బికామువగతః శ్రీమూలనాథాభిధః|

మూలం సర్వజగత్తరోర్మునినుతో లిఙ్గాత్మనా రాజతే||

తిల్లవనమను క్షేత్రమున సమస్త ప్రపంచ వృక్షమునకు మూలమైన శివుడు అంబికాసహితుడై మూలనాథుడను పేరుతో లింగరూపమున విరాజిల్లుచుండెను. మధ్యందిన మహర్షి తన కుమారునకు పంచాక్షరి నుపదేశించి ఆతిల్లవనమున తపస్సు చేయుమని యాదేశించెను.

ఋషయః :

శ్లో|| పుణ్డరీకపురే తస్మిన్‌ తత్వనిష్ణాతసేవితే|

వ్యాఘ్రపాదమునిశ్ర్శీమానకరోత్కిం పురా తపః||

ఋషులు :

తత్త్వపారంగతులచే సేవింపబడిన యా పుండరీక పురమున శ్రీవ్యాఘ్రపాదమహర్షి పూర్వ మేమి తపస్సు చేసెను?

శ్లో|| స కథం దుర్లభం చిత్రం వ్యాఘ్రపాదత్వమాప్త వాన్‌|

కథం తత్ర మహేశేన తసై#్మ నృత్తం ప్రదర్శి తమ్‌||

అతడు దుర్లభము నాశ్చర్యకరము నగు వ్యాఘ్రపాదముల నెట్లు పొందెను? ఈశ్వరు డాతని కచ్చట నృత్తము నెట్లు చూపెను?

శ్లో|| ఏతత్సమస్తం విస్తార్య బ్రూషి సువ్రత!సూత!నః|

అస్తినోమహాతీ వాంఛా శ్రోతు మీదృశమద్భు తమ్‌||

సువ్రత! నూత! ఇట్లి యద్భుతమును వినుటకు మా కెక్కువ కోరిక గలదు. దీని నంతను విస్తరించి మాకుజెప్పుము.

శ్లో|| మునీనామగ్రణీశ్ర్శీమాన్‌ బ్రహ్మనిష్ణాతచేతనః|

జజ్ఞే మధ్యన్దినో నామ మునిః పుణ్యతపాః పురా||

పూర్వము మునులలో శ్రేష్ఠడు, బ్రహ్మైకాయత్తచిత్తుడు, పుణ్యతపోయుక్తుడు నగు శ్రీ మధ్యందినుడను మహర్షిపుట్టెను.

శ్లో|| తపస్సత్యం దయా శాన్తిః యస్మాద్ధర్మోప్య జాయత|

పవిత్రతా చ యేనాసీదుర్వీ గుర్వీ మహౌజసా||

తపస్సు, సత్యము, దయ, శాంతి, ధర్మము, పవిత్రత వానినుండిపుట్టినవి.గొప్ప తేజస్సుగల వానిచే భూమి గౌరవము గల దైనది.

శ్లో|| తస్య సూనురభూద్ధీమాన్‌ పావకాదివ పావకః|

శివజ్ఞానప్రకాశాత్మా విశ్వక్లేశప్రణాశనః||

అగ్నినుండి యగ్ని పుట్టినటుల వానికి బుద్ధిమంతుడు, శివజ్ఞానప్రకాశస్వరూవుడు, ప్రపంచదుఃఖమును బోగొట్టువాడు నగు కుమారుడు జనించెను.

శ్లో|| ఏకమేవ సుతం లబ్ధ్వా స పితా లోకవిశ్రుతః|

మనసా పరమానన్దమవాప మునిపుఙ్గవః||

లోకప్రసిద్ధుడు మునిశ్రేష్ఠుడునగు ఆతండ్రి ఒక్కనినే కుమారుని పొంది మనమున నెక్కున సంతసించెను.

శ్లో|| ధర్మజ్ఞస్సవిధాయాస్య సర్వం కర్మ కులోచితమ్‌|

సమధ్యాప్య చ కాలేన వేదాన్సాఙ్గానయత్నతః||

పఞ్చాక్షరం మహద్దివ్యం పాశవిచ్ఛేదకారణమ్‌|

సరహస్యం సదోపాస్యముపదిశ్య యథావిధి||

యత్ర తే వర్తతే వాఞ్ఛా మహతీ వత్స! సువ్రత!

విధాస్యామ్యద్య తత్సరం ప్రోచ్యతామితి చాబ్ర వీత్‌||

ధర్మము నెరిగిన యాతండ్రి కుమారునకు కులోచితమైన సమస్త కర్మను చేసి కాలమున సులభముగా వేదవేదాంగములను జెప్పి, పాశములను ఛేదించుటకు కారణము, గొప్పది, దివ్యమైనది, ఎల్లప్పుడు నూపాసింపదగినదియునగు పంచాక్షరమంత్రమును సరహస్యముగా యథావిథిగా నుపదేశించి; సువ్రత! బిడ్డా! నీకు దేనియందెక్కువ కోరిక గలదో చెప్పుము. దాని నంతను ఇప్పుడు చేసెదను. అని యడిగెను.

శ్లో|| ఇత్యుక్తవన్తం పితరం ప్రణివత సుతస్తదా|

వినయేన సహోవాచ కృతాఞ్జలిపరిగ్రహః||

ఇట్లు పలికిన తండ్రికి ప్రణమిల్లి కుమారు డప్పుడు వినయముతో దోసిలోగ్గి పలికెను.

సూతః :

శ్లో|| తససాం ముక్తిమూలానాం నిత్యమక్షీణసమ్ప దామ్‌|

యత్తపో దుష్కరం లోకే సర్వసిద్ధిదముత్తమమ్‌||

భవామ్బురాశిమగ్నానాం సద్య ఉత్తారకం చ యత్‌|

యద్దదాతి సదానన్దం యచ్చక్లేశై ర్వివర్జితమ్‌||

పూజ్యతే యేన దేవేశో భగవానమ్బికాపతిః|

విస్తరాత్తన్మమాచక్ష్వ జనక! త్వం సునిర్మలమ్‌||

సూతుడు :

తండ్రీ! లోకములో ముక్తికి మూలమై ఎల్లపుడు క్షీణింపని సంపదలుగల తపస్సులలో ఏతపస్సు దుష్కరమైనదో సర్వసిద్ధుల నిచ్చునదో ఉత్తమమైనదో; ఏతపస్సు సంసార సముద్రములో మునిగియున్న వారిని వెంటనే తరింపజేయునో ఏది ఎల్లపుడు ఆనందము నిచ్చునో ఏది క్లేశములు లేనిదో; దేనిచే దేవదేవుడు భగవంతుడునగు అంబకాపతి పూజింపబడనో మిక్కిలి నిర్మలమైన యట్టి తపస్సునుగూర్చి నీవు నాకు విస్తరముగా జెప్పుము.

శ్లో|| ద్రష్టాసర్వరహస్యానాం శ్రుత్వా పుత్రవచః పితా|

మన్దం సుధాముచం వాచం పునరాహ తపోనిధిః||

సమస్త రహస్యములకు ద్రష్ట తపోధనుడునగు తండ్రిపుత్రుని మాట విని మెల్లగా అమృతమును గురియు మాటను మరల పలికెను.

శ్లో|| హేమన్తే శిశిరే కాలే వర్షాకాలే శరత్సు చ|

మధునామని కాలే చ కామగర్వాకరే భృశమ్‌||

ఘర్మకాలేపి నితరాం తీవ్రసంతాపితేపి వా|

అన్యేషు పుణ్యకాలేషు తపనగ్రహణాదిషు||

ధారాశీతలదుర్వారపవమానాసు రాత్రిషు|

జలమధ్యేషు తుఙ్గేషు శిఖరేషు మహీభృతామ్‌||

శివక్షేత్రేషు దివ్యేషు దుర్గమేషు వనేషు చ|

సరి త్తీరేషు శీతేషు మూలేష్వపి మహీరుహామ్‌||

ఆరామేషు సముత్ఫుల్లకలికాశోభీశాఖిషు|

దేశేన్యస్మిం స్తథాన్యేషు తపోధామ్ని మనఃప్రియే||

కన్దమూలఫలాహారై స్తరువర్ణాశ##నై స్తథా|

జలపానధృతప్రాణౖ స్స్నాననిర్మలమూర్తిభిః||

పవనాశనతృపై#్తశ్చ బ్రహ్మతత్పరబుద్ధిభిః|

క్రియతే యత్తపో లోకైః సర్వదైవ సుదుష్కు రమ్‌||

హేమంతకాలమున శిశిర ర్తువున, వర్షాకాలమున, శరత్కాలమున, మిక్కిలి కాముని గర్వమునకునసమయమైన వసంతకాలమున; ఎక్కువ తాపమును గలుగజేయు గ్రీష్మకాలమున, సూర్యగ్రహణము మొదలగు ఇతర పుణ్యకాలములయందును; ఎడదెగని చల్లదనముచే భరింపరాని గాలులుగల రాత్రులయందు, జలమధ్యములయందు, ఎత్తైన పర్వత శిఖరములయందును; దివ్యమైన శివక్షేత్రములయందు, చొరరాని వనములయందు, చల్లని నదీతీరములయందు, చెట్ల మూలములయందు; మొగ్గలు వికసించి అందముగానున్న కొమ్మలుగల తోటలయందును తపస్సునకు తావై మనస్సున కిష్టమైన ఇతర ప్రదేశమందును అన్య ప్రదేశములయందును; కంద మూల ఫలముల నాహారముగా దీసికొనియు. చెట్ల ఆకులు తినియు, నీరు మాత్రమే త్రాగి ప్రాణములు నిలుపుకొనియు స్నానముచే నిర్మలమైన శరీరములుగలిగి; వాయువును మాత్రమే భక్షించి తృప్తిపడియు బ్రహ్మయందు లగ్నమైన బుద్ధులతో జనులే తపస్సు చేయుదురో అది ఎల్లప్పుడు దుష్కరము.

శ్లో|| తద్ర్బహ్మలోకసంప్రాప్తిసాధనాయైవ కేవలమ్‌|

పునరావృత్తిరహితం శివసాయుఙ్యకారణమ్‌||

ఆతపస్సు కేవలము బ్రహ్మలోక ప్రాప్తికే సాధనమగును. తిరిగి జనన మరణములు లేని శివసాయుజ్యమునకు కారణము.

శ్లో|| పదమాస్థాతుమాస్థాచేత్‌ కురు సేవాముమాపతేః|

సైవ హేతుః పరాము క్తేః క్రియతే యది చేతసా||

శివపదమును బొంద కొరిక కలదేని శివుని సేవచేయుము. మనస్సుతో గూడ సేవ చేసినయెడల అదియే పరాముక్తికి కారణమగును.

శ్లో|| శివసేవార్చనం కర్తుం యది వాఞ్ఛా తవోత్తమమ్‌|

అలమన్యేన తవసా సర్వం తేనైవ లభ్యతే||

ఉత్తమమైన శివసేవార్చనము చేయుటకు నీకు కోరిక ఉన్నయెడల మరియొక తపస్సు అక్కలేదు. దానివలననే సర్వము లభించును.

శ్లో|| భవోపి స్యాత్పరిత్యక్తః దూరతః పాపబన్ధనః|

భ##వేత్తు పరమానన్దస్సంసారక్లేనాశకః||

పాపరూప బంధముగల సంసారముకూడ సంపూర్ణముగా విడువపబడును. సంసారక్లేశమును బోగొట్టు పరమానందము గలుగును.

శ్లో|| గురుణోక్తం వచః శ్రుత్వా మఘరం మధురా కృతిః|

ప్రహృష్టహృదయో బాలః పునరాహ మహామతిః||

మధురమైన ఆకారముగలిగి మహా బుద్ధిమంతుడగు బాలుడు తండ్రి మధురముగా జెప్పిన మాటను విని హృదయమున సంతసించి మరల పలికెను.

శ్లో|| ఏతేషు సర్వలోకేషు చన్ద్రాలఙ్కృతమ స్తకః|

సాన్నిధ్యం కురుతే యత్ర శివః కారుణ్యవిగ్రహః||

జనక! త్వం మమాచక్ష్వ తదిహ స్థానము త్తమమ్‌|

కరిష్యామి మహ త్తత్ర తపో జన్మనివృత్తయే||

తండ్రీ! ఈసర్వలోకములయందును కారుణ్యస్వరూవుడ చంద్రశేఖరుడునగు శివు డెచ్చట దగ్గర నుండునో అట్టి యుత్తమ స్థానమును నాకిప్పుడు చెప్పుము. జన్మనివృత్తికొర కచ్చట మహాతపస్సు చేయుదును.

పితా :

శ్లో|| శివస్య సన్నిధిస్సర్వః ప్రపఞ్చోసౌ దయానిధేః|

నాస్త్యేవ పుత్ర! సుమతే! తద్విముక్తం జగత్క్వ చిత్‌||

తండ్రి :

కుమారా! సుమతీ! ఈప్రపంచ మంతయు దయాసము ద్రుడగు శివుని సన్నిధి నున్నది. ఆతడు లేనిప్రదేశ మెక్కడను లేనేలేదు.

శ్లో|| భావయన్తి న యే బుద్ధ్యా తద్విధం సకలం జగత్‌|

చిత్తపాకేన తే హీనాః సదా మూహ్య న్తి జన్మసు||

ఎవరు బుద్ధితో సర్వప్రపంచము నావిధముగా భావింపరో వారు చిత్తపరిపాకము లేక మోహముచెంది ఎల్లప్పుడు జన్మలలో దిరుగుచుందురు.

శ్లో|| తపఃపాకవిహీనాస్తే జ్ఞానహీనా వృధా జనాః|

కీటాదిసమజన్మానః పాపసంవృద్ధి హేతవః||

ఆజనులు తపస్సు పరిపాకము జెందక జ్ఞానము లేక పురుగలతో సమానమైన జన్మగలవారై పాపమువృద్ధిజెందుటకు కారణ మగుదురు.

శ్లో|| తథాపి యత్ర సాన్నిధ్యం కురుతే సన్తతం శివః|

అస్త్యేవ తాదృశం స్థానం సర్వలోకై రభిష్టుతమ్‌||

ఐనను శివు డెల్లప్పుడు సన్నిధియందుండునది, సమస్త లోకములచేత స్తుతింప బడినదియునగు నట్టి స్థానము గలదు.

శ్లో|| సుభూమిః పుణ్యబీజానాం నవఖణ్డా వసున్ధరా|

మూలతస్సంయుతా చైషా విశ్వాధారేణ మేరుణా||

తొమ్మిది ఖండములుగల భూమి పుణ్యబీజములకు మంచి చోటగుచు ప్రపంచమున కాధారమైన మేరుపర్వతముతో నిది మూలమున కలసియున్నది.

శ్లో|| తాదృశై రతితుజ్గాగ్రైర్మహితై శ్చ కులాద్రిభిః

ముక్తారత్నసుసంపూర్ణై రుదన్వద్భిరలఙ్కృతా||

అట్టి మిక్కిలి ఎత్తైన శికరములుగల గొప్ప కులపర్వత ములచేతను ముక్తారత్నములతో నిండిన సముద్రములచేతను ఈభూమి అలంకరింపబడినది.

శ్లో|| న పార్యతే మహాసీమా వసుధాయాం మహాత్మనా|

గిరీశేనాపి సంక్షిప్య వక్తుం వర్షశ##తైరపి||

మహత్ముడైన శివుడుకూడ భూమియందలి. విశాల ప్రదేశమును గూర్చి నూరు సంవత్సరములకైనను సంక్షేపముగా జెప్పలేడు.

శ్లో|| సర్వాధారే సువిస్తీర్ణే తస్మిన్నత్ర మహీతలే|

నివస న్తి మహాత్మానో బహవః పరమౌజసః||

సమస్తమున కాధారమై మిక్కిలి విశాలమైన యీ భూమండలమున మహా తేజోవంతులైన మహాత్ములు చాల మంది నివసించుచున్నారు.

శ్లో|| తేషాం విముక్తయే దేవేప్యఖణ్డానన్డవిగ్రహః|

భూమౌ స్థానేష్వనేకేషు సాన్నిధ్యం కురుతే సదా||

వారి ముక్తి కొరకు దేవుడఖండానందస్వరూపుడై భూమిలో ననేక ప్రదేశములందెల్లప్పుడు సన్నిధిలో నున్నాడు.

శ్లో|| తథావిధాని స్థావాని సహస్రాణి మహీతలే|

ప్రియంకరాణి దేవస్య వత్స! సంశృణు సువ్రత!||

బిడ్డా! సువ్రత! అట్టి స్థానములు భూమిలో వేలకొలది గలవు. అవి దేవునకు ప్రియమైనవి. వానిని వినుము.

శ్లో|| తేసు తిల్లవనం దివ్యం తపోవృద్ధికరం మహత్‌|

సర్వైరపి పురాణౖ స్తదు త్తమం పరికీర్తితమ్‌||

వానిలో తిల్లవనము దివ్యమైనది. తపస్సును వృద్ధిచేయునది. గొప్పది. అన్నిపురాణములచేత నుత్తమమైనదిగా కొనియాడబడినది.

శ్లో|| తస్య మధ్యగతం స్థానం శ్రీమూలస్థాననామకమ్‌|

యస్య మధ్యే జగద్దీపః శోభ##తే నిశ్చలశ్శివః||

దాని మధ్యస్థానము శ్రీమూలస్థానమను పేరుగలది. దాని మధ్యయందు జగత్తునకు దీపమై నిశ్చలముగా శివుడు ప్రకాశించుచుండెను.

శ్లో|| పూజ్యతాం స శివో నిత్యం త్వయా మూగ్ధేన్దుభూషణః|

స్వయం భువి వరే లిఙ్గే యస్సదా సుత! శోభ##తే||42

కుమారా !

ఆబాలచంద్రభూషణుడగు శివుని నీవు నిత్యము పూజింపుము. అతడు శ్రేష్ణమైన స్వయంభూలింగమందెల్లప్పుడు విరాజిల్లుచుండెను.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

మహేశ్వరనన్దిసంవాదే చిదంబరమాహాత్మ్యే

మాధ్యన్దినోత్పత్తిర్నామ షష్ఠోధ్యాయః

--0--

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters