Aathmabodha Chapters Last Page
శ్రీ గురు మహారాజ్‌జీకీ జై
10. శ్రీ ఆదిశంకరుల ఆత్మబోధ
ఆనందం పొందే మార్గం
1. తపోభిః క్షీణ పాపానాం
శాంతానాం వీతరాగిణాం
ముముక్షూణా మపేక్ష్యో 2 యం
ఆత్మబోధో విధీయతే || 1
»R½F¡Õ³ÁM = తపస్సు చేయటం చేత, క్షీణ పాపానాం = క్షీణించిన పాపములుకలవాళ్ళును, శాంతానాం = ప్రశాంతత నొందిన స్వరూపం కలవాళ్ళును, వీత రాగిణాం = అనురాగాలు నశించిన వాళ్ళును, ముముక్షూణాం = మోక్షమునందు అధికమైన కాంక్ష కలిగిన వాళ్ళును, అపేక్ష్యః = కోరదగినది, అయం = ఈ, ఆత్మబోధః = ఆత్మజ్ఞానం, విధీయతే = రాయటం జరుగుతూ ఉంది.
తా|| తపస్సుచేయటం చేత క్షీణించిన పాపం కలవాళ్ళును, ప్రశాంతత పొందిన స్వరూపం కలవాళ్ళును, అనురాగాలు నశించిన వాళ్ళును మోక్షమునందు కాంక్ష కలిగిన వాళ్ళును కోరతగిన ఆత్మజ్ఞానాన్ని రాయటం జరుగుతూ ఉంది.
వివరణ :- భగవంతుని కోసం నిరంతరం పరితపించటాన్నే తపస్సు అంటారు. మనోవాక్కాయకర్మల యందు అధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్థిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అట్లా తపస్సు చేయటం చేత మల విక్షేప ఆవరణాలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం తొలగుతుంది. మననం చేత విక్షేప దోషం తొలగుతుంది. నిరంతర ధ్యానమనే నిది ధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శరీరాన్ని శుద్ధి చేసుకొన్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వాసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపీ తొలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్నీ, ఇంద్రియలోలత్వాన్ని బుద్ధిపూర్వకంగా నిగ్రహించుకోవటంవల్ల మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి. తపస్సు చేయాలంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాలు చేరాలి అని కాదు. ప్రతి మానవుడు తాను జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. తన ఇల్లే తనకు, తపస్సుకు కూడా అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. తాను మారాలి. ఎందుకు ? మోక్షాకాంక్ష ఉండబట్టి. మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు, ఉద్దేశించాడు) ఏర్పరిచాడు. మానవుడు దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్ధిగా తపస్సంపన్నుడు కావాలి. దేనికి? ఆనందం కోసం - మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది. ఆనందం ఎక్కడ ఉంది? ఆనందం ఆత్మలోనే ఉంది. ఆత్మానందమే నిజమైన సచ్చిదానందం. దానికి ఆత్మజ్ఞానం కలిగితే మానవుడు సక్రమ మార్గంలో జీవించటానికి వీలు కలుగుతుంది. నిషిద్ధమైన కర్మల్ని ఆచరించకుండా ఉంటే మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు, మానసికమైన వ్యభిచారం కూడా లేకుండా చూసుకోవాలి. మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల వ్యభిచరిస్తూ ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది. ఈ ఆధునిక కాలంలో మానవులందరిలోను జరుగుతున్న నిత్య కృత్యం ఈ మానసిక వ్యభిచారం. దాన్ని అన్ని విధాల అరికట్టాలి. దాన్ని అరికట్టటానికి మనస్సుకి తోడుగా ఆత్మ అనే భగవంతుని దానికి అందించి, ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేటట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. దీనికి వివేకం, వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్ధిస్తుంది. బంగారానికి తావి అబ్బినట్లు అవుతుంది. అయితే పాపాలు నశించి, ప్రశాంతత చేకూరి, సాధకుడు మోక్షంకోసం జీవించాలంటే అనురాగం కూడా నశించినవాడై ఉండాలన్నారు. విషయాల్ని దూరం చేసినంత మాత్రం చేత రాగం నశించదు. విషయంతోపాటు దానియందలి అనురాగం కూడా దూరం కావాలి అంటే మనస్సుకి ఆత్మ అనే భగవంతునితో అనుసంధానం చేకూరిస్తేనే రాగం కూడా నశిస్తుంది. సాధకుడు అభిమానం, అహంకారం వంటి వాటికి తనలో స్థానం ఏర్పరుచుకొంటే ప్రత్యేకమైన కోరికలకు అది నిలయం అవుతుంది. కావున సాధకుడు అభిమానం, అహంకారం అనే వాటికి స్థానం లేకుండా చేసుకొంటూ వెళ్ళాలి. అప్పుడు కోరికలకు స్థానం లేకుండా పోతుంది. మనస్సుకి నిస్సంకల్ప స్థితి చేకూరుతుంది. అదే మోక్షాన్ని కాంక్షించటానికి తగిన స్థితి. మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని ఆత్మనుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయటం అన్నమాట. మనస్సుని ఆత్మలో లయమయ్యేటట్లు చెయ్యటం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేదని చాలామంది భ్రమపడుతున్నారు. అది తప్పు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమేకాని మరొకటి కాదు. సాధనలో మెలకువలో నిద్రను, నిద్రలో మెలకువను అనుభవించాలి. అదే మోక్షం. ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్ళవాళ్ళకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. దాన్ని ఎంత అని ప్రతినిత్యం కొలవటంకాదు చేయవలసింది. ఆత్మ అనే భగవంతునితో అనుసంధానమై ఆత్మసాధన కొనసాగిస్తూ జీవించటం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాసక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం ఆనందం పొందాలనే వాళ్ళందరు ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.
2. బోధో2న్యసాధనేభ్యో హి
సాక్షాన్మోక్షైక సాధనం
పాకస్య వహ్నివత్ జ్ఞానం
వినా మోక్షో న సిద్ధ్యతి|| 2
FyNRPxqsù = వంట చెయ్యటానికి, వహ్నివత్ = అగ్ని వలె, జ్ఞానం వినా = ఆత్మ జ్ఞానం లేనిచో, మోక్షః = ముక్తి, న సిద్ధ్యతి = లభించదు, అన్య సాధనేభ్యః = ఇతర సాధనాల కంటే, సాక్షాత్ = ప్రత్యక్షంగా, బోధః ఏకహి = గురుబోధ అనే ఆత్మజ్ఞానం ఒక్కటే, మోక్ష సాధనం = మోక్షానికి సాధనం
తా|| వంట చెయ్యటానికి అగ్ని ఎట్లా ప్రధాన సాధనం అయి ఉందో అట్లాగే మోక్షాన్ని పొందటానికి ఆత్మజ్ఞానం ముఖ్య సాధనం అయి ఉంది. ఇతర సాధనాలతో పోల్చినప్పుడు గురుబోధ అనే ఆత్మజ్ఞానం ఒక్కటే మోక్షానికి (ఉత్తమమైన)సాధనం.
వివరణ :- దేహమే నేను అనే భ్రాంతిని తొలగించుకొని, ఆత్మే నేను అనే జ్ఞానాన్ని గ్రహించటమే నిజమైన జ్ఞానం అయి ఉంది. గురువు శిష్యునికి జ్ఞానాన్ని ఇవ్వటం అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వు దేహానివి కావు, నీ పరమేశ్వరుడు నీ లోనే ఉన్నాడు, నీ ఆత్మని నువ్వు తెలుసుకొని నీ చైతన్యాన్ని నీ సత్ తో కలుపుమని జ్ఞానాన్ని బోధిస్తాడు. అపరోక్ష జ్ఞానాన్ని శిష్యుడు అవగతం చేసుకొనేటట్లు చేస్తాడు. దేహమే నేను అని అనుకోవటమే అజ్ఞానమని, దాన్నుంచి విముక్తి పొంది జ్ఞానంతో జీవించమని శిష్యునికి గురువు బోధిస్తాడు. చిత్ సత్ తో కలుపటానికి కావలసిన సాధన మార్గాన్ని బోధించి శిష్యుడు సచ్చిదానందాన్ని అనుభవించేటట్లు చెయ్యగలగుతాడు. జ్యోతిర్బ్రహ్మను అనుభవించటానికి, నాదబ్రహ్మను అనుభవించటానికి శబ్దబ్రహ్మను అనుభవించటానికి, అమృత బ్రహ్మను అనుభవించటానికి కావలసిన సాధన మార్గాన్ని గురువు శిష్యునికి ప్రసాదించి శిష్యుడు తానే బ్రహ్మగా నిలిచేటట్లు చెయ్యగలుగుతాడు. ఇదే ఆత్మజ్ఞానానికి నిజమైన మార్గం. లోకంలో సాధకునికి కర్మ మార్గం, భక్తి మార్గం, యోగమార్గం అని అనేక మార్గాలు ఉన్నప్పటికి ఆత్మబోధకు, ఆత్మానందానికి జ్ఞానమార్గం ఒక్కటే సరైన దారని ఆది శంకరాచార్యులవారు ఇక్కడ తెలియజేశారు.
సూర్యుని బొమ్మను చూపించి సూర్యకాంతి వస్తుంది అంటే రాదు కదా? హోటల్‌లో సర్వరు వంటల పట్టిక ఎంతసేపు ఏకరువు పెట్టినా ఆకలి తీరటం కాని, రుచిని ఆస్వాదించటం కాని జరుగదు కదా ? అదే విధంగా వంటకు కావలసిన పప్పు, ఉప్పు, బియ్యం, కారం, చింతపండు, కాయగూరలు, నూనె వగైరా అన్నీ ఉన్నా తింటానికి కావలసింది తయారుకాదు గదా ? అగ్ని లేకపోతే పదార్థాలన్నీ కూడా వాటి పూర్వస్థితిలోనే ఉండిపోతాయి కదా ? పొయ్యి కింద నిప్పుపెట్టి, పదార్థాలను అన్నిటిని తగుపాళ్ళలో ఉపయోగించి వంట చేసినప్పుడే కదా కావలసిన రుచి, తింటానికి పదార్థం లభిస్తుంది. పదార్థాలు పక్వం అవ్వటానికి, ఆహారం తినటానికి నిప్పు ఎంత అవసరం అయిందో అదే విధంగా ఆత్మానందాన్ని అనుభవించటానికి ఆత్మజ్ఞానం కూడా అంతే అవసరం అయి ఉంది.
తపస్సు, మనో నిగ్రహం, శాస్త్రజ్ఞానం, జ్ఞాన విచక్షణ, వివేకం, శ్రద్ధ మొదలైనవి అన్నీ కూడా పారమార్థిక జ్ఞానాభివృద్ధిని కలిగిస్తాయే కాని, మోక్షానికి కావలసిన ఆత్మానందాన్ని మాత్రం ఇవ్వలేవు. గురువు ప్రసాదించే ఆత్మజ్ఞానం మాత్రమే ఆ అనుభూతిని, ఆ ఆనందాన్ని ప్రసాదించగలుగుతాయి. కావున సాధకుడు ఆత్మసాక్షాత్కార వైభవాన్ని గురుజ్ఞానంద్వారా మాత్రమే పొందగలుగుతాడు. పుస్తకాల్లో ఎన్ని రాసి ఉన్నా జీవించి ఉన్న గురువుద్వారా ప్రత్యక్షంగా వాటి సాధనలను, సాధక బాధకాలను అవగాహన చేసుకొని అనుభూతిని పొందినప్పుడే సాధకుడు నిజమైన జ్ఞానం ఏమిటో గ్రహించగలుగుతాడు. ఆత్మను తెలుసుకొన్న వాడికి ఈ జీవితమనే శోక సముద్రాన్ని దాటటం తెలుస్తుంది. పుట్టింది దుఃఖించటానికి కాదు, ఆత్మానందాన్ని అనుభవించటానికి అని తెలుస్తుంది.
ఆత్మ అంటే వస్తురహితమైన చైతన్యం అయి ఉంది అని సుందర చైతన్యానంద స్వామి వారు చెప్పారు. కాన ఆత్మను దర్శించటం అంటే ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలు కాకుండా శుద్ధ చైతన్యమైన ఆత్మను తానే అయి ఉన్నాను అని గ్రహించగలగటమే అయి ఉంది. దీనికి సుందర చైతన్యానందస్వామివారు ఉదాహరించిన ఉదాహరణను స్వీకరించిన బాగా అర్థం చేసుకోవటానికి వీలు కుదురుతుంది.
''భార్య మగబిడ్డను ప్రసవించింది. తపాలా ఆలస్యం చేత వార్త భర్తకు అందలేదు. తండ్రి కావటానికి భర్త ప్రతి క్షణం కుతూహలపడుతున్నాడు. యథార్థానికి తాను తండ్రియే అయి ఉన్నాడు. ఇచ్చట కావలసింది తండ్రికి వార్త తెలియటమే కాని తల్లి మళ్ళీ ప్రసవించ వలసిన అవసరం లేదు. అలాగే మనం ఆత్మయే అయి ఉన్నాం. కావలసింది జ్ఞానమొక్కటియే.''
గురువు వద్ద జ్ఞానం పొందినా గమ్యం చేరటానికి భక్తి మార్గమని, యోగమార్గమని పేర్లు చెప్పినా చెప్పకపోయినా కొన్నిటినైనా వాటికి అనుకూలంగా కొనసాగిస్తేనే ఏనాటికైనా లక్ష్యం సిద్ధిస్తుందని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువమంది ఉన్నారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులని యోగప్రవీణులు వివరించి ఉన్నారు. మంత్రమని, యంత్రమని, తంత్రమని కొంత తంతును చెప్పేవాళ్ళూ ఉన్నారు. ఆధునిక కాలంలో వీటన్నిటినీ పాటించటం వీలుగాక, ఇవన్నీ చెయ్యలేము కనుక అసలుకే ఎగనామం పెట్టే వాళ్ళే ఈ విధంగా ఎక్కువ అయ్యారు. కావున మధ్యేమార్గంలో కాలానికి అనుకూలంగా, శక్తియుక్తులకు తగిన విధంగా శిష్యులను నడిపించటానికే, ఈనాడు ఆత్మజ్ఞాన సాధన అన్నివిధాల వీలుకుదిరేటట్లు, ఆధునిక గురువులు అయిన కారణజన్ములు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తు ఉన్నారు, నేనే ఆత్మను అని తెలుసుకోలేని అజ్ఞానాన్ని గురువులు ఇచ్చే జ్ఞానమనే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయిస్తూ ఉన్నారు.
రమణ మహర్షిని దర్శించిన ఒక సందర్శకుడు ''తరతమ భేదాలు లేకుండా అందరికీ ఒకటే బోధిస్తూ ఉన్నారు ఏమిటి?'' అని అడిగితే ''నేనేమి చెబుతున్నానయ్యా, అహంకారాన్ని తగ్గించుకోమంటున్నాను'' అని సమాధానం చెప్పారు. ఆత్మజ్ఞానాన్ని గురువు శిష్యులకు బోధించే విధానంలో వ్యత్యాసాలు అనేవి లేవు. అద్వైత మార్గంలో జీవించటానికి, అనుభూతిని పొందటానికి, తరించటానికి గురువులు సాధకునకు ఉత్తమ మార్గాన్ని చూపిస్తున్నారు. భారతదేశమందు కులాలు, మతాలు, జాతులు అంటూ పాటింపబడుతూ వస్తూ ఉన్న వ్యత్యాస భావం ఈ ఆత్మబోధయందు లేదు. నేను అనే అహంకారం నుంచి విముక్తి పొంది, జీవచైతన్యమైన ''నేను'' అనే ఆత్మతో జీవించటమే ఆత్మమార్గం, జ్ఞానమార్గం అయి ఉన్నాయి.
మోక్షం అంటే ఏమిటి? విముక్తి. దేనికి విముక్తి? శరీరం నుంచి సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మను వేరు చేసి, దానితో పరిశుద్ధమైన మనస్సుగా మారి జీవించేటట్లు చెయ్యటానికే ఆ విముక్తి. మాయ ఆవరించిన ఆత్మే జీవుడుగా ఉన్నాడు. ఆ జీవుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న శరీరాన్ని, ప్రకృతిని, సంపదను శాశ్వతాలుగా భావించి స్వార్థంతో జీవించటానికే ప్రయత్నిస్తూ ఉన్నాడు. మానవుడు మరణించక పూర్వం ''శివం''గా భావించిన శరీరాన్నే మరణించిన తర్వాత ''శవం''గా పరిగణిస్తూ ఉన్నారు. ఈ రెంటి మధ్య వచ్చిన అంతరం ఏమిటి? శరీరంలో ఉన్న జీవచైతన్యం ఆత్మ - సత్ తొలగిపోవటం. మిగిలినవి అన్నీ అక్కడే ఉన్నాయి. శరీరంలో ఉన్న
1. జ్ఞానేంద్రియాలు - కన్ను, ముక్కు, చెవి, రుచి చూసే నాలుక, చర్మం - 5
2. కర్మేంద్రియాలు - కాళ్ళు, చేతులు, మూత్ర విసర్జన చేసేది శిశ్నం, మల విసర్జన చేసేది గుదం, మాట్లాడే నాలుక - 5
3. అంతఃకరణ చతుష్టయం - మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం - 4
4. పంచతన్మాత్రలు - శబ్దం (ఆకాశగుణం), స్పర్శ(గాలిగుణం), రూపం (అగ్నిగుణం), రసం (నీటి గుణం) గంధం (భూమిగుణం) - 5
5. పంచప్రాణాలు - లోనికి తీసుకొనే గాలి శరీరంలో అయిదు రకాలుగా పనిచేస్తూ ఉంది - ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం - 5
అనేవి అన్నీ కలిసి మానవుడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా జడమైన 24 తత్త్వాలు 25వది అయిన జీవుణ్ణి కలిపి 26వది అయిన ఆత్మను గ్రహించటానికి, ఆత్మ తత్త్వాన్ని అనుభవించటానికి అవరోధంగా నిలుస్తూ ఉన్నాయి. వాటిని తొలగించి ఆత్మతో జీవించటానికే గురువు వద్ద నుంచి శిష్యుడు జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అంటే చైతన్యం ఉండగానే అంటే సచేతనంగానే శరీరంతో వేర్పడి ఆత్మతో జీవించే జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే బ్రహ్మవిద్యను నేర్చుకొంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ బ్రహ్మవిద్యకు ఇద్దరు దాతలు ఉన్నారు. నిజమైన మొదటిదాత శిష్యుడే. శిష్యుడు తన శరీరాన్ని, మనస్సుని గురువుకు అర్పించి గురువు వద్ద జ్ఞానం స్వీకరిస్తున్నాడు. ఎప్పుడైతే గురువు వద్ద శిష్యుడు ఆ విధంగా శారీరకంగాను, మానసికంగాను విముక్తిని పొందాడో అప్పుడే మోక్షాన్ని పొందాడు. కాన శిష్యుడు గురువు మీద నమ్మకంతో, గురువు ఇచ్చే జ్ఞానం మీద విశ్వాసంతో నిరంతరం సాధన చేసి జ్ఞాననిష్ఠుడై ఆత్మజ్ఞానాన్ని ఆత్మానుభవాన్ని అనుభవపూర్వకంగా పొందుతాడు. చీకటిని వెలుగు పారద్రోలినట్లు గురువు శిష్యునకు జ్ఞానాన్ని ఇచ్చి శిష్యుని యొక్క అజ్ఞానాన్ని పోయేటట్లు చెస్తాడు.
దేన్నయితే మనస్సు గ్రహించలేదో - అయినప్పటికి దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తూఉందో, దేన్నయితే కళ్ళు చూడలేవో - అయినప్పటికి దేనిచేత కళ్ళు చూడగలుగుతున్నాయో, దేన్నయితే చెవులు వినలేవో - అయినప్పటికి దేనిచేత చెవులు వినేశక్తి పొందగలుగుతున్నాయో, దేన్నయితే ముక్కు వాసన చూడలేదో - అయినప్పటికి దేనిచేత ముక్కు వాసన చూడగలుగుతుందో, అదే ఆత్మ స్వరూపం అని కేనోపనిషత్తు వివరంగా వివరించింది.
@¬sõ BLiúµj…¸R…WÌÁNRPV Gµj… aRPNTPò¬s BÀÁèLiµ][ A aRPNTPò»][ A aRPNTPò¬s BÀÁ胫s µy¬sõ µ³yù¬sLi¿RÁÉجsZNP[ ryµ³R…NRPV²R…V @Li»R½LRiVøÅÁV²R…V @ªy*ÖÁ. @®µ…[ Çì؃«sLi. xqsLRi* BLiúµj…¸R…WÌÁNRPV ªyÉÓÁ ªyÉÓÁ NSLRiùNRPÍØFyÌÁV ¬sLRi*QQLjiòLi¿RÁÉجsNTP aRPNTPò ryª«sVLóSQùÌÁV BxqsVòƒ«sõ A ú‡Áx¤¦¦¦øxqs*LRiWFy¬sõ, A A»yøLSª«sVVßñÓá µR…Lji+Li¿RÁÉجsZNP[ Çì؃«sLi»][ µ³yùƒ«sLi ¿Á[xqsVòLi²yÖÁ. @xmsöV®²…[ Çì؃«s ˳ØxqsäLRiV\®²…ƒ«s A»R½ø x¤¦¦¦XµR…¸R…WNSaRPª«sVLiµR…V c ÀÁµyNSaRPª«sVLiµR…V c DµR…LiVVLiÀÁ »yƒ«sV úxmsNSbPxqsWò, xqsLS*¬sõ úxmsNSbPLixms ¿Á[xqsVòLiµj….
3 అవిరోధితయా కర్మ
నా విద్యాం వినివర్తయేత్
విద్యా విద్యాం నిహంత్యేవ
తేజస్తిమిర సంఘవత్ || 3
NRPLRiø = కర్మ చేయటం అనేది, అవిద్యాం = దేహమే నేను అనే భ్రాంతిని, న వినివర్తయేత్ = అంతం చేయలేదు, అవిరోధితయా = (కారణం ఏమిటంటే అవి రెండు కూడా) ఒక దానికి ఇంకొకటి విరోధం అయినవి కావు, తేజః = కాంతి, తిమిర సంఘవత్ = గాఢమైన చీకటిని తొలగించునట్లు, విద్యా ఏవ = ఆత్మే నేను అనే జ్ఞానమే, అవిద్యాం = దేహమే నేను అనే భ్రాంతిని, నిహంతి = నశింపచేస్తుంది.
తా|| కర్మ చేయటం అనేది దేహమే నేను అనే భ్రాంతిని అంతం చేయలేదు. కారణం ఏమిటంటే కర్మ, అవిద్య అనేవి రెండూ కూడా ఒక దానికి ఇంకొకటి విరోధం అయినవి కావు. ప్రకాశ##మే దట్టమైన చీకటిని పారద్రోలునట్లు''ఆత్మే నేను'' అనే జ్ఞానమే ''దేహమే నేను'' అనే భ్రాంతిని నశింప చేస్తుంది.
వివరణ :- ఆత్మానందం అనేది నిరాకారమైంది. అఖండమైంది. కర్మలతో కూడి ఉన్న ఆనందం సాకారంతో కూడి ఉన్న ఏదో ఒక వస్తువుతో కూడి ఉంది. దాని నుంచి పొందే ఆనందం కూడా ఖండమై ఉంది. దాని వల్ల ఈ రెండూ కూడా చాలా వ్యత్యాసంతో కూడి ఉన్నాయి. ''కర్మ'', ''అవిద్య'' అనేవి రెండూ కూడా ఒకదానికి ఇంకొకటి విరోధం అయినవి కావు. కావున కర్మలు అజ్ఞానాన్ని తొలగించలేవు. కర్మల వల్ల కర్మఫలం అజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుందే కాని జ్ఞానాన్ని అందించదు.
ఆత్మ దేహంలోపలే ఉంది. ఆత్మకోసం, ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మానందం కోసం అంతర్ముఖం కావలసి ఉందే కాని బహిర్ముఖం కావటం కాదు చేయవలసింది. కర్మలన్నీ మానవుని బహిర్ముఖుని చేస్తున్నాయి. కర్మలు మనస్సును పరిపరి విధాలుగా సంచరించేటట్లు చేస్తున్నాయి. కర్మల వల్ల కోరికలు అనంతంగా అభివృధ్ధి చెందుతున్నాయి. కర్మలు దేహభ్రాంతికి, దేహసౌఖ్యానికి నిలయాలు అవుతున్నాయి. కావున కర్మలు అజ్ఞానానికి వ్యతిరేకమైనవి కావు. జ్ఞానమే నిజంగా అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కాంతి చీకటిని పారద్రోలినట్లు జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. నేను ఆత్మనే అయి ఉన్నాను అని భావించిన వెంటనే ఆత్మను ఆవరించి ఉన్న మాలిన్యం తొలగిపోతుంది. మాలిన్యంతో కూడి ఉన్న అద్దానికి మాలిన్యం తొలగించగానే ప్రతిబింబం స్వచ్ఛంగా కనిపించినట్లు ఆత్మే నేను అని తెలియగానే దేహమే నేను అనే భ్రాంతి తొలగిపోతుంది. దేహమే నేను అని అనుకోవటంవల్ల అజ్ఞాన జనితాలైన కర్మలు అనంతంగా విజృభించి కర్మఫలాలతో బంధించి వేస్తున్నాయి. ఈ విధంగా చెప్పటంవల్ల కర్మలను అన్నిటిని త్యజించమని బోధిస్తున్నట్లు భావించవద్దు. కర్మ సన్యాసం చేయమని బోధించటం లేదు. అర్జునునికి శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసం బోధించలేదు. అర్జునుడు విధ్యుక్త కర్మని ఆచరించేటట్లు చేయించాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటంలో కర్మల శక్తిహీనతను వివరించాడు. అంతే. అయితే మరి ఏమి చెయ్యాలి అంటే జ్ఞానాన్ని స్వీకరించి, జ్ఞానంతో ధ్యానాన్ని సాధన చేసి తరించటం నేర్చుకోవాలి.
అందరిలోను ఆత్మ ఉంది అని తెలుసుకొని ఆత్మతో అనుసంధానం అయి జీవించటమే జ్ఞానం. అనంతమైన ఆత్మతో అనుసంధానం చెందటానికి ఆత్మతో జీవించటం అలవరచుకోవాలి. ప్రతి వాని లోపల ఆత్మ పుట్టినప్పటి నుంచి ఉంది. అది కొత్తగా వచ్చింది కాదు. ఆత్మ శరీరం లోపలే ఉంది అని తెలుసుకోవటంతోనే ఆత్మ యొక్క పునఃప్రాప్తి జ్ఞానం ద్వారా జరిగింది. దీనివల్ల ఆత్మయొక్క నిజస్వరూపాన్ని మరుగుపరుస్తూ ఉన్న అజ్ఞానాంధకారం అనే భ్రమను మాత్రమే తొలగించటం జరిగింది. కర్మల ద్వారా ఈ అజ్ఞానం అనే ముసుగును తొలగించటానికి వీలు కుదరదు. జ్ఞానంతో మాత్రమే అజ్ఞానం అనే ముసుగు తొలగించటానికి వీలు కుదురుతుంది. ఆత్మ దర్శనం, ఆత్మానందం చేకూరుతాయి. అజ్ఞానానికి ఆత్మజ్ఞానమే ఔషధం కాని కర్మలు కావు అని ఆది శంకరుల వారు ఇక్కడ బోధించారు.
కర్మల వల్ల, యోగం వల్ల కొన్ని సిద్ధులు లభిస్తాయి. కొన్ని శక్తులు చేకూరుతాయి. అవి విషయసుఖాల కన్నా ఉన్నతమైన సుఖాల్నే అందిస్తాయి. కాని వాటిని ఆత్మానందంతో పోల్చినప్పుడు మాత్రం అవన్నీ అల్పమైనవే అని అనుభవ పూర్వకంగా సాధకునికి తెలుస్తుంది. వ్యాస మహాముని యొక్క శిష్యుడైన జైగిషవ్యుడు స్వానుభవంతో ఈ విషయాన్నే వ్యాసునికి వివరించినట్లు వ్యాసుడు పతంజలి యోగసూత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ ఈ విషయాన్ని వివరించారని సుందరచైతన్యానందస్వామి వారు చెప్పారు. ఒక గదిలో చీకటిపోవాలంటే దీపాన్ని వెలిగించాలే గాని మరొక మార్గం ఏది స్వీకరించినా ఆ చీకటి పోదు. అట్లాగే అజ్ఞానానికి జ్ఞాన జ్యోతే విరుగుడుకాని మరొకటి కాదు.
4. పరిచ్ఛిన్న ఇవాజ్ఞానాత్
తన్నాశే సతి కేవలః
స్వయం ప్రకాశ##తే హ్యాత్మా
మేఘపాయే2 0శుమానివ|| 4
A»yø = జీవచైతన్యమైన ఆత్మ, అజ్ఞానాత్ = అజ్ఞానం చేత, పరిచ్ఛిన్న ఇవ = శరీర పరిమితమైనట్లుగా అనగా అనేకమైన ఆత్మలు అయినట్లుగా అనిపిస్తుంది, మేఘాపాయే = మబ్బు తొలగగానే, అంశుమానివ = సూర్యుడు ప్రకాశించునట్లు, తత్ = ఆ అజ్ఞానం, నాశే సతి = నశించగానే, కేవలః = ఏకమై - అఖండమైన ఆత్మయై, స్వయం ప్రకాశ##తే = తనకు తానుగా ప్రకాశిస్తుంది.
తా|| జీవ చైతన్యమైన ఆత్మ అజ్ఞానం వల్ల శరీర పరిమితమైనట్లుగా - అంటే అనేకమైన ఆత్మలు అయినట్లుగా అనిపిస్తుంది. మబ్బు తొలగగానే సూర్యుడు ప్రకాశించునట్లు ఆత్మకు సంబంధించిన అజ్ఞానం తొలగగానే అఖండమైన ఆత్మయై తనకు తానుగా ప్రకాశిస్తుంది.
వివరణ :- సకల వస్తు విషయ జ్ఞానాన్ని గ్రహించే సాక్ష్మిమాత్రమైన వస్తురహిత చైతన్యమే ఆత్మ అయి ఉంది. ఆత్మ సర్వ ఇంద్రియాలకు శక్తిని ఇస్తూ ఉండబట్టే సర్వ ఇంద్రియాలకు జ్ఞానాన్ని తెలుసుకొనే శక్తి కలుగుతుంది. కావున ఆత్మే జ్ఞాన స్వరూపం. జీవుని యందు ఉన్న ఆ ఆత్మే ప్రకృతి అంతా ఉన్న ఆత్మ అయినా ఆ ఆత్మ ఆలోచనలకు, భావనలకు అందటానికి వీలుకానిది అయి ఉంది. దాని వల్ల ఆ ఆత్మ ఎవరికి వారు అనుభవించటానికి వీలైందేకాని వర్ణించటానికి, వివరించటానికి వీలైందికాదు. దాన్ని విచారణా మార్గంలో అర్థం చేసుకోవాలని, అనుభవించాలని రమణ మహర్షి బోధించారు. ఆత్మానాత్మల విచారణా మార్గంలో ప్రశ్నిస్తూ మూలాన్ని కనిపెట్టమని రమణ మహర్షి బోధించారు. ప్రశ్న ఉదయించగానే, లేదా కోరిక పుట్టగానే ఆ ప్రశ్న, ఆ కోరిక ఎక్కడ నుంచి వచ్చింది అని ఎదురు ప్రశ్న ఆ మనస్సుకే వేయమని చెప్పారు. దాని వల్ల ఆ ప్రశ్న, ఆ కోరిక, ఆ ఎదురు వేసిన ప్రశ్న అనే సమాధానం అన్నీ కూడా వచ్చిన చోటుకే చేరి లీనమైపోతుంటాయి అని చెప్పారు. ఆ విధంగా క్రమక్రమంగా మనస్సు ఆలోచనారహితమైన ఆత్మలో లీనమవ్వటానికి విచారణా మార్గంలో వీలు కుదురుతుంది. మనస్సు అనే పెరుగును విచారణ అనే కవ్వంతో చిలికితే జ్ఞానమనే వెన్న, ఆత్మానుభూతి అనే నేయి లభిస్తాయి. ఆ విధంగా ఆత్మానుభూతి చేకూరితేగాని అఖండమైన సచ్చిదానందం లభించదు. అంతవరకు సాధకుడు నిరంతరం ఆత్మమీద, జ్ఞానం మీద విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధతో సాధన చేస్తూనే ఉండాలి. అప్పుడే ఆత్మ పరిచ్ఛిన్నం కాదని లేదా విచ్ఛిన్నం కాదని, అనంతం, అఖండమైందని అనుభవానికి వస్తుంది.
అయితే అనంతమైన ఆత్మ పరిమితంగా ఎట్లా కనిపిస్తుంది. పరిమితమైంది అని భావించిన ఆత్మ అనంతంగా ఎట్లా అనుభవానికి వస్తుంది అనేది ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది.
సామాన్యమైన మానవునికి ఆత్మ దేహేంద్రియ మనోబుద్ధులకు పరిమితమైంది అన్నట్లు కనిపిస్తుంటుంది. సాధకునికి కూడా ప్రకృతి అంతా సాధనకు పూర్వం ఉంది సాధన తర్వాత కూడా ఉంది. సాధనలోనే ఆ ప్రకృతి అంతా నశించింది. సాధనలో సాధకుడు మెలకువగా ఉన్న గాఢ నిద్రాస్థితిని సచేతనమైన సమాధి స్థితిని పొందటం వల్ల, ఆత్మజ్యోతితో ఆనందాన్ని అనుభవించటంవల్ల ప్రకృతి మిథ్య అని తెలుసుకోగలుగుతున్నాడు. ఆత్మ ఈ శరీరానికి, ఈ మనస్సుకి వేర్పాటుగా, సాక్షిమాత్రంగా ఉంది అని సాధకుడు తెలుసుకోగలుగుతున్నాడు. అప్పటికి కూడా సాధకునకు ఆత్మ పరిచ్ఛిన్నంగానే కనిపిస్తూ ఉంటుంది. సాధకుడు నిర్వికల్ప సమాధి స్థితిలోకి లీనం అవుతూ ఉన్న పరిస్థితులయందు అనంతమైన ఆత్మజ్యోతి మాత్రమే నిలిచి సాధకుని దేహం కూడా సంపూర్ణంగా నిత్య ప్రకాశంగా నిలిచిపోతుంది. అప్పుడు సాధకుడు అనంతమైన ఆత్మానుభూతిని పొంది ఆత్మ పరిచ్ఛిన్నం కాదనియు, ఆత్మ అనంతం అనియు ప్రత్యక్షానుభవంతో తెలుసుకోగలుగుతాడు. ఈ విధమైన అపరోక్షానుభూతిని పొందుటవలన శంకరాచార్యులవారు చెప్పిన (1) బ్రహ్మసత్యం (2) జగం మిథ్య (3) బ్రహ్మమే జగత్తు అనేవి సత్యమని అనుభూతి పొందగలుగుతాడు. అంటే జగం మిథ్యే అని సాధనలో సాధకుడు అర్థం చేసుకోగలిగాడు. సాధకుడు దానివల్ల సర్వత్రా సమతా భావంతో సంచరిస్తూ తోటి వారితో సమదృష్టితో జీవించగలుగుతాడు. అతనికి అద్వైతం సంపూర్ణంగా అనుభవానికి వస్తుంది.
ఈ దేహం అనగానే ఒక శాశ్వతమైన దానితో, ఇంకొక అశాశ్వతమైంది కలిసి ఉంది. మానవుడు అశాశ్వతమైన దేహదృష్టితో ఆలోచిస్తూ ఉండటం వల్ల శాశ్వతమైన ఆత్మను కూడా పరిచ్ఛిన్నంగా భావించటం జరుగుతుంది. సాధకుడు సాధనలో ఆత్మను అఖండంగా, అనంతంగా అనుభూతిని పొందటంవల్ల అపరిచ్ఛిన్నంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు.
దీన్నే ఆదిశంకరులవారు చక్కటి ఉపమానంతో వివరించారు. మబ్బుకంటే అనంతమైన కోట్లకొలది పెద్దదైన సూర్యుడు అల్పమైన మబ్బుచేత కప్పబడినట్లు కనిపిస్తున్నాడేకాని మబ్బు సూర్యుణ్ణి కప్పలేదు కదా ! కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్లు మబ్బు చేత కప్పబడినట్లుగా తాత్కాలికంగా కనిపిస్తున్నాడు. అంతేకాని మబ్బు అడ్డగించి ఉన్నప్పటికి సూర్యప్రకాశంవల్ల సూర్యుని ఉనికిని తెలుసుకొంటూనే ఉన్నారు కదా! అనంతమైన సూర్యుడు పరిమితమైన దృష్టివల్ల మేఘునిచేత కప్పబడినట్లుగా కనిపించాడేకాని మేఘుడు తొలగిపోగానే అనంతమైన సూర్యప్రకాశం కనిపిస్తూనే ఉందికదా! అదే విధంగా అజ్ఞానం చేత ఆత్మను పరిచ్ఛిన్నంగా భావించిన వారు అజ్ఞానం తొలగగానే ఆత్మ అద్వయమైందనియు, అనంతమైందనియు అనుభూతిని పొందగలుగుతారు.
అజ్ఞానం జ్ఞానం వల్లనే నశించగలదు అనుట వల్ల వైదిక కర్మ ప్రయాసలు ఫలసిద్ధిని ఇవ్వజాలవు అని సూచింపబడింది అని స్వామి చిన్మయానందగారు వివరించి ఉన్నారు.
5. అజ్ఞాన కలుషం జీవం
జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం
కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్
జలం కతకరేణువత్ || 5
ÇÁÌÁLi = నీటిని, కతక రేణువత్ = చిల్లగింజపొడివలె (ఇందుగు గింజ, ఇండుపుకాయ, ఇండుగు కాయ - పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా), అజ్ఞాన కలుషం = అజ్ఞానం చేత కలుషితమైన, జీవం = జీవుని, జ్ఞానాభ్యాసాత్ = జ్ఞానాభ్యాసం వల్ల, వినిర్మలం = బాగా పరిశుద్ధునిగా, కృత్వా = చేసి, జ్ఞానం = గురుజ్ఞానం, స్వయం = తనంతట తానుగానే, నశ్యేత్ = నశించిపోతూ ఉంది.
తా|| చిల్లగింజపొడి మురికి నీటిని పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా అజ్ఞానం చేత కలుషితమైన జీవుని జ్ఞానాభ్యాసం అనేటటువంటిది బాగా పరిశుద్ధునిగా చేసి గురువు ఇచ్చిన జ్ఞానం అనేది తనంతట తానుగానే లీనమైపోతూ ఉంది.
ఇక్కడ వివరించారు. అంతఃకరణ చతుష్టయంతో విచ్ఛిన్నం అవుతూ ఉండే ఆత్మే జీవుడుగా నిలుస్తున్నాడు. పారమార్థికమైనటువంటి విజ్ఞానం సరిగా లేకపోవటం వల్లే మానవుడు మనస్సుతో జీవిస్తూ అహంకారంతో సంచరిస్తూ ఉన్నాడు. అహంకారమే జీవుడుగా అయి జీవిస్తున్నాడు. ఇహలోక జీవభ్రాంతితో పరలోకాన్ని, శాంతిని విడిచిపెడుతూ ఉన్నాడు. కావున మానవుడు మనస్సుకు జీవభ్రాంతితో చేకూరుతున్న వ్యయ ప్రయాసల్ని, అశాంతిని తొలగించుకోవటానికి జ్ఞానాభ్యాసాన్ని నిరంతరం కొనసాగించవలసిన అవసరం కలుగుతుంది. దానికోసమే మానవుడు ధ్యానాన్ని స్వీకరించి ఆత్మతో జీవించటానికి ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. నేనే ఆత్మను అనే భావంతో మానవుడు జీవించాలని నిరంతరం ఎంత ప్రయత్నం చేసినా, ఆలోచనా ప్రవాహాలు, అవసరాలు, స్వలాభాకాంక్షలు జ్ఞానానుభవాన్ని భంగం చేస్తూనే ఉంటాయి. గాఢ నిద్రలో (సుషుప్త్యవస్థలో) మాత్రమే అనగా అజ్ఞానంలో మనస్సు ఆత్మలో లీనం అవుతూ ఉంది. కాన మనస్సుని ఆ విధంగా జ్ఞానంలో ఉన్నప్పుడు లీనమయ్యేటట్లు చెయ్యాలి.
జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలు అన్నిటిలోను, లోపల బయట అంతటాకూడా నిండి ఉన్నటువంటిది, సర్వావస్థలను ప్రకాశింప చేస్తూ ఉన్నటువంటిది అయిన చైతన్య స్వరూపం ఏదయితే ఉందో ఆ బ్రహ్మాన్ని నేనే అనే అనుభూతిని పొందటం అనేదే మోక్షం, అసలైన ఆనందం. అది నిరంతర జ్ఞానసాధన చేతనే సాధ్యం అవుతుంది. కనుక అటువంటి జ్ఞానం చేత అజ్ఞానాన్ని తొలగించాలి.
మనస్సు అనేది సంకల్ప వికల్పాలతో నిరంతరం చరిస్తూ ఉంటుంది. సెకండులో వందవ వంతు కాలంలో కూడా అది నిలువదు. అట్లా సంచరించటమే దాని సహజ స్వభావం అయి ఉంది. అటువంటి మనస్సుకి జ్ఞానేంద్రియాలనే అయిదు గుర్రాలు అయిదు ఆయుధాలై ఉండటం వల్ల అవి బహిర్ముఖం అయి వస్తు విషయ జ్ఞానంతో ఆనందిస్తూ గడపటానికి ప్రయత్నం చేస్తుంటాయి. కోరికల పుట్టతో పరిపరి విధాల సంచరిస్తూ మనిషికి శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అటువంటి మనస్సుకి, ఇంద్రియాలకి గురుజ్ఞానం అనే దాన్ని తోడుగా చేయటం వల్ల మనస్సు, ఇంద్రియాలు అంతర్ముఖంగా ఉన్న దృశ్యాల్ని తిలకిస్తాయి.
దానితో మానవుని లోపలే ఉన్న విచిత్రమైన ఆత్మజ్యోతిని, అనంతమైన నాదాన్ని, నిశ్శబ్దమైన ప్రశాంతతను, అది శబ్దమైన పరావాణిని, అనంతమైన అమృతత్త్వాన్ని ఆస్వాదించాలనేది జ్ఞానసాధకునికి ఏర్పడుతుంది.
ఏనుగు తొండాన్ని ఒక్క సెకండు కూడా కదలకుండా ఏనుగు నిలుపలేదు. కాని మావటివాడు దానికి ఒక కర్రముక్కను అందిస్తే చాలు ఆ ఏనుగు ఆ కర్రముక్కను పట్టుకుని తొండాన్ని కదపకుండా నడుస్తుంది. దొంగగొడ్డు బయట దొరికే రుచికరమైన దొంగమేత తింటానికి అలవాటుపడి, చిరుతిళ్లకు మరిగి నిరంతరం బయట పొలాలలోకి పోయి మేసి వస్తూ ఉంటుంది. దాన్ని అట్లా బయటకు వెళ్లనియ్యకుండా పట్టుకొని కట్టుకొయ్యకు కట్టిపడేస్తే నాలుగు రోజులు ఆహారం సరిగా తీసుకోవటానికి మొరాయిస్తుందే కాని క్రమేపి ఉన్న ఆహారంతోనే తృప్తిపడి జీవించటానికి అలవాటు పడుతుంది. ఇంటిముందుకు వచ్చే కుక్కకు రోజు ఆహారం వేస్తూ ఉంటే అది రోజూ ఇంటి ముందుకు వచ్చి నిలబడటానికే అలవాటుపడుతుంది. అదే విధంగా క్రమంతప్పకుండా వస్తూ ఉన్నదానికి ఆహారాన్ని వెయ్యటం మానేస్తే అదే రావటం మానేస్తుంది.
అదే విధంగా ఈ మనస్సును గురుజ్ఞాన సాధనలో నిలిపి ఆనందింప చేయటానికి ప్రయత్నం చేస్తే ప్రారంభంలో ఎక్కడెక్కడికో పోవటానికి మనస్సు ప్రయత్నం చేస్తూనే గడుపుతుంది. దాన్ని నిశితంగా పరీక్షిస్తూ దాని వెంట సాక్షిమాత్రంగా పయనించి దాని స్వభావాన్ని అర్థం చేసుకొని, దాన్ని మళ్ళీ మళ్ళీ బుజ్జగించి వెనుకకు, గురుజ్ఞానం మీదకు తీసుకువచ్చి, జ్ఞానంలో జీవించేటట్లు చేస్తుంటే మనస్సు అంతర్ముఖమై విచిత్రాలలో లీనమయి క్రమేపీ మిత్రుడుగా మారుతుంది.
మనస్సును ఈ విధంగా నిగ్రహింప వలసింది మళ్ళీ మనస్సే అయి ఉండటం వల్ల మనస్సు కొంతసేపు లయం చెందుతూనే మళ్ళీ ప్రకోపిస్తూ బహిర్ముఖంగా నడుస్తుంటుందే కాని పూర్తిగా నశించదు. మనస్సును సంపూర్ణంగా నశింప చేసినప్పుడు మాత్రమే జ్ఞానం చేత శుద్ధమైన మనస్సు ఆత్మగా నిలవటానికి వీలుకుదురుతుంది. మనస్సు ఆత్మలో లయం కావాలంటే విచారణ ద్వారా వీలుకుదురుతుంది. ఆత్మానాత్మ వివేచనతోనే జ్ఞానోదయం అనేది ప్రతి ఇంద్రియానికి చేకూరుతుంది. ప్రతి ఇంద్రియంలోను అణువణువు మార్పుచెందుతూ వస్తేకాని మనస్సు లయం కాదు. దాన్ని సాధించటం కోసం మనస్సునకు వస్తు విషయాల్ని దూరం చేసినంత మాత్రం చేత అది సిద్ధించదు. వాటి యందు మనస్సుకు కల రాగాన్నికూడా దూరం చెయ్యటానికి అభ్యాస వైరాగ్యాలచేత, విచారణతో ప్రయత్నం చేస్తేనే వీలు కుదురుతుంది. ఇంద్రియాలన్నిటిని నిరంతరం జ్ఞానంతో జీవించేటట్లు చెయ్యటానికి ప్రయత్నం చెయ్యాలి.
సాధకునికి నేనే బ్రహ్మాన్ని అనే భావపూరితజ్ఞానం నిరంతరం కదులుతూ ఉండాలి. భ్రమరకీటన్యాయంలా అంటే కీటకం భ్రమరాన్నే తలంచుకొంటూ భ్రమరంగానే రూపుదిద్దుకొంటున్నట్లు, మనస్సు ఎట్లా కదులుతూ ఉంటుందో మనిషి అట్లా అవుతాడు అనే దానికి అనుకూలంగా శరీరాన్ని, ఇంద్రియాల్ని మార్చాలి. నేనే సచ్చిదానంద బ్రహ్మాన్ని అనే జ్ఞానంతో నిరంతరం చింతించేవాడు, దానికి అనుకూలంగా జీవన విధానాన్ని కొనసాగించ గలిగేవాడు. బ్రహ్మమే అవుతాడు అని అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ బోధిస్తూవచ్చారు.
అనుభవజ్ఞులు చెప్పిన మాట నమ్మాలి, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది అని చెబితే ప్రతివాడు వెళ్ళి చూసి రాలేడు కదా ! ఉదాహరణలతో వివరించి నిరూపించి చూపిస్తూ ఉంటే అర్థం చేసుకొని విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం కదా ! అమెరికా ఉంది అంటే ప్రతివాడు వెళ్ళి చూసిరాలేడు కదా! అమెరికా వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటే నమ్ముతూనే ఉన్నాం కదా! ఈ ఆత్మజ్ఞానం కూడ అటువంటిదే. ఈ ఆత్మజ్ఞానాన్ని కూడ అనుభవ పూర్వకంగా ఇతరులు అనుభవించి చెప్పినదాన్ని ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవలసిందే కాని ఇంకొక విధంగా వీలుకాదు.
గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది, జ్ఞానానికి అనుకూలంగా విషయాల్ని, వస్తువుల్ని, కోరికల్ని వివేచనతో విచారణ చేస్తూ, అనవసరమైన వాటిని తొలగించు కొంటూవస్తే క్షణక్షణం అజ్ఞానం కాలుష్యం తొలగటానికి వీలవుతూ ఉంటుంది. విచారణ మార్గం ప్రతి సాధకునికి ప్రతిక్షణం అవసరమై ఉంటుంది. అజ్ఞానంతో ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, సుఖభోగాలనే భ్రమలకు లోనవుతూ, దోషాల్లో కూరుకుపోతూ ఉన్న కలుషిత మనస్సును గురుజ్ఞానం శుద్ధి చేస్తుంది. విచారణ మార్గం మనస్సును సంపూర్ణంగా శుద్ధి చేసి ఆత్మలో లయం అయ్యేటట్లు చేస్తుంది. అంతః కరణ చతుష్టయం అయిన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వివేకంతో విచారణ మార్గంలో నడవటంవల్ల ఒకదానితో మరొకటి లీనమౌతూ అహంకారం కూడా సంపూర్ణంగా లయమైపోతుంది. ఆత్మ మాత్రమే ప్రశాంతంగా నిలుస్తుంది. ఈ విధంగా జ్ఞానం చేత మిత్రుడుగా పరిణామం చెందిన మనస్సు ఆత్మలో లీనమయి పోతుంది. అప్పుడు గురుజ్ఞానం కూడా సచ్చిదానందంలో లీనమై పోతుంది. దీన్ని సాధించటానికి సాధకునికి నిరంతరం దృఢమైన అభ్యాసం కావాలి. దానికి ఎటువంటి ఆటంకాలు వస్తున్నా, దేనికీ లొంగకుండా, పట్టుదలతో నిరంతరం ధ్యాన నిమగ్నుడై ఉండాలి, అప్పుడే జ్ఞానం జ్ఞానానందాన్ని ఇచ్చి లీనమైపోతుంది. ఏవిధంగానయితే చిల్లగింజ పొడి వర్షాకాలంలో మట్టితో మాలిన్యం తో ఎర్రగా తయారయిన నీళ్ళను పరిశుభ్రంచేసి తాగటానికి అనుకూలంగా అందించి అదికూడా చివరికి నీటిలో కలిసిపోతుందో అదేవిధంగా ఆత్మజ్ఞానం అనేది సాధకుడైన వానిని దేహాత్మబుద్ధినుంచి మరల్చి ఆత్మలో జీవించేటట్లు చేసి అఖండమైన సచ్చిదానందంలో లయమయ్యేటట్లు చేస్తుంది. దానికార్యం అది నెరవేర్చిన తర్వాత అది కూడా సచ్చిదానందంలో లయమైపోతుది.
6. సంసారః స్వప్నతుల్యోహి
రాగద్వేషాది సంకులః
స్వకాలే సత్యవత్ భాతి
ప్రబోధే అసత్యవత్ భ##వేత్ || 6
LSgRi®µ…[*xtsQ + ఆది = రాగద్వేషాలు , సుఖదుఃఖాలు మొదలైనవాటితో, సంకులః = ఒక దానితో ఇంకొకటి పొసగకుండా విరుద్ధంగా ఉండేటటువంటిది అయిన, కలుషితమైన, సంసారః = సంసారం, లేక ఈ ప్రపంచం, స్వప్నతుల్యోహి = స్వప్నంతో సమానం అయినటువంటిది, స్వకాలే = స్వప్నకాలమందుమాత్రమే, సత్యవత్ = సత్యమైందిగా, భాతి = గోచరిస్తూఉంది, ప్రబోధే = ఆత్మజ్ఞానం కలుగగానే, అసత్యవత్‌భ##వేత్ అసత్యంఅవుతూఉంది.
తా : రాగద్వేషాలు, సుఖదుఃఖాలు మొదలైన వాటితో ఒకదానికి ఇంకొకటి పొసగకుండా విరుద్ధంగా ఉంటూ కలుషితమైన ఈ సంసారం లేక ప్రపంచం స్వప్నంతో సమానమైంది. స్వప్నకాలమందు మాత్రమే సత్యంగా తోచి మేల్కొనగానే స్వప్నం ఏవిధంగా అదృశ్యం అవుతుందో ఆవిధంగా ఆత్మజ్ఞానం కలుగగానే సంసారం కల వలె అసత్యం అవుతూ ఉంది.
వివరణ : ఎంతకాలం మానవుడు అజ్ఞానంతో ఉంటాడో అంతకాలం ప్రపంచం యథార్థంగానే కనిపిస్తుంది. జ్ఞానోదయం అయినవెంటనే ఈ ప్రపంచం కల వలె అసత్యం అవుతుంది. అంతేకాకుండా ఈ జాగ్రదవస్థ దీర్ఘకాల స్వప్నం వంటిదని తెలుస్తుంది.
అయితే ఈ స్వప్నతుల్యాన్ని ఎట్లా అర్థం చేసుకొంటాం, స్వప్నం అంటే ఏమిటి? అని ప్రశ్నించుకొని దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి జ్ఞానంతో జీవించటానికి ప్రయత్నించిన నాడు మాత్రమే దాని నిజస్వరూపం తెలుస్తుంది.
మానవుని జీవితం ప్రతిరోజూ మూడు అవస్థలతో నడిచిపోతూ ఉంది. 1.జాగ్రదవస్థ అంటే ఉదయం మేల్కొని నప్పటి నుంచి నిద్రపోయేవరకు ఉన్న అవస్థ 2. స్వప్నావస్థ అంటే మెలకువ కాకుండా గాఢనిద్రకాకుండా అనుభవిస్తూ ఉన్నకాలం ఏదయితే ఉందో అది 3. సుషుప్త్యవస్థ అంటే గాఢమైన నిద్రావస్థ.
జాగ్రదవస్థలో శరీరం ఉంది, మనస్సుఉంది, చైతన్యంఉంది. స్వప్నావస్థలో శరీరం లేదు, మనస్సుఉంది, చైతన్యం ఉంది. సుషుప్త్యవస్థలో శరీరంలేదు, మనస్సు లేదు, చైతన్యం మాత్రమే ఉంది. మూడు అవస్థల్లోను ఉన్న చైతన్యమే మానవునకు సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మఅయి ఉంది. ఆ గాఢనిద్రలో మనస్సు సర్వేంద్రియాలతో కలిసి ఆ చైతన్యరూప మైన ఆత్మతో లీనం అవుతుంది. కనుక నిద్ర అజ్ఞానంలో ఆనందాన్ని అందిస్తుంది. నిద్ర సుఖాన్ని ఇస్తుంది. అందుకనే ఆ సుఖనిద్ర కోసం, ఆశాంతికోసం అనేకమంది అనేక విధాల పరితపిస్తు ఉంటారు. పురుషుడైతే స్త్రీ సాంగత్యాన్ని, స్త్రీ అయితే పురుషుని సాంగత్యాన్ని కోరి దాని వల్ల చేకూరే సుఖాన్ని అనుభవించి మత్తుగొని హాయిగా నిద్రిస్తూ ఉన్నారు. మరికొందరు అనేకమైన మత్తుమందులతో మైమరచి నిద్రిస్తూ అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు. అవే ఆనందానికి మార్గాలని నమ్మి అజ్ఞానంలో గడిపేస్తూఉన్నారు. ఇవేవీ శాశ్వత మైనవి కావని, ఈ సంసారం, ఈప్రపంచం స్వప్నతుల్యమని ఆత్మజ్ఞానం తెలిసిన గురువులు బోధిస్తున్నారు. దాన్ని అవగాహన అయ్యేటట్లు చెయ్యటానికే స్వప్నాన్ని ఉదాహరణగా స్వీకరించారు.
స్వప్నం అంటే మనస్సుచేత కల్పింపబడింది. స్వప్నం అనుభవిస్తున్నంత వరకూ అది యథార్థంగానే కనిపిస్తుంది. మేల్కొనగానే ఆ కల అబద్ధం అని, అది జరగలేదని అర్థం అవుతుంది. స్వప్నావస్థలో మానవుడు కాశీకి వెళ్ళి గంగలో మునిగాడు అనుకొందాం. ఆ గంగలో మునిగింది ఏది? శరీరం, మనస్సు రెండూ అని స్వప్నంలో భ్రమకొల్పుతుంది. మెలకువ రాగానే ఏమితెలిసింది? శరీరం మంచంమీదే ఉంది. మనస్సు మాత్రమే గంగలో మునిగింది అని తెలిసింది. కాని నిజానికి ఆ మనస్సుకూడా మునగలేదని, అదికూడా వట్టి భావనేఅని, వట్టి కల్పనే అని, భ్రమేఅని జాగ్రదవస్థ లోకి వచ్చినప్పుడు తెలిసింది కదా?
అదేవిధంగా జాగ్రదవస్థ యొక్క మిథ్యాజ్ఞానాన్ని కూడా ఆత్మ జ్ఞానంయొక్క అనుభవం చేత అర్థం చేసుకొంటున్నారు. అది ఎట్లా తెలుస్తుంది? అంటే ఆత్మ జ్ఞానసాధనలో సాధకుడు కూర్చొన్నప్పుడు ఈ దేహం, మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అన్నీకూడా ఆత్మలో లీనమయి పోయి ఆత్మజ్యోతితో ఆనందిస్తున్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా భ్రమే నని, వట్టి కల్పనే అని తెలుసుకొంటున్నాడు. గాఢనిద్రలో ఏవిధంగా ఒక్క చైతన్యమే మిగిలిందో అదేవిధంగా ఆత్మజ్ఞాన సాధనలో మెలకువగా ఉన్న నిద్రను అనుభవిస్తూ చైతన్యంతో ఆనందాన్ని అనుభవించినప్పుడు తెలుసుకొంటున్నాడు. కాన స్వప్నం ఎటువంటి భ్రమో జాగ్రదవస్థ కూడ అటువంటి భ్రమే అని అనుభూతిని పొందుతున్నాడు.
(1) బ్రహ్మ సత్యం (2) జగంమిథ్య (3) బ్రహ్మసర్వస్వం. అనగా ఆత్మ స్వరూపమైన బ్రహ్మ ఒక్కటి మాత్రమే సత్యమైంది అని, ఈ ప్రపంచంఅంతా నశించేటటువంటిదే అని, సర్వత్ర బ్రహ్మం ఉన్నాడని, అన్ని వస్తువుల్లోను అందరిలోను ఉన్నటువంటి బ్రహ్మాన్ని చూడాలని అవగతం చేసుకొంటున్నాడు. దీనివల్ల ప్రపంచం అంతా స్వప్నత్యుల్యమేగాని సర్వత్ర బ్రహ్మం వ్యాపించి ఉంది అని అద్వైతాన్ని ధ్యానంలో అనుభవపూర్వకంగా అవగాహన చేసుకొంటున్నాడు. ఆ విధంగా ఆత్మ తప్ప మిగిలిన నామరూపాలు అన్నీ కూడా మిథ్యారూపాలో అనిస్వప్నస మానమయినవే అని అవగతం చేసుకొంటాడు.
ఆత్మజ్ఞానం తెలియనంత వరకు దేహభ్రాంతితో ఉండటం వల్ల సంసారం సత్యమనిపించింది, అజ్ఞానం నశించగానే జ్ఞానోదయంతో స్వప్నం ఎంత భ్రమో జాగ్రదవస్థ కూడా అంతే భ్రమ అని, కాకపోతే అది దీర్ఘకాల స్వప్నం వంటిది అని తెలుసుకుంటున్నాడు.
7. తావత్సత్యం జగద్భాతి
శుక్తికా రజతం యథా
యావన్న జ్ఞాయతే బ్రహ్మ
సర్వాధిష్ఠాన మద్వయం || 7
xqsLRi* + అధిష్ఠానం = సర్వానికి ఆధారమైన, అద్వయం = రెండుకానటువంటి అఖండమైన, బ్రహ్మ = పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మ, యావత్ = ఎంత వరకు, నజ్ఞాయతే = తెలియకుండా ఉంటుందో, తావత్ = అంతవరకు, జగత్ = ప్రపంచం, శుక్తికా = ముత్యపు చిప్పయందు, రజతం వెండి వలె, భాతి = ప్రకాశిస్తుంది.
తా. సర్వసృష్టికి ఆధారమైన ఏకైక పర బ్రహ్మ స్వరూపం ఎంతవరకు తెలియకుండా ఉంటుందో అంతవరకు ప్రపంచం ముత్యపు చిప్ప వెండి అనిపించినట్లు సత్యమైందిగా ప్రకాశిస్తుంది.
వివరణ : కలుషితమైన మనస్సే జీవుడు అని ఆది శంకరాచార్యులవారు ముత్యపు చిప్ప మీద సూర్యరశ్మి ఉన్నంత సేపు అది వెండే అనిపిస్తుంటుంది. అదే విధంగా సర్వసృష్టికి మూలాధారమైన పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోనంతవరకు ప్రపంచం అంతా కూడా సత్యమే అనిపిస్తుంది, ముత్యపు చిప్పను వెండి అనుకోవటం భ్రాంతే. అట్లాగే భ్రాంతి వల్లే ప్రపంచం సత్యం అనిపిస్తుంది. ఏకైకమైన పరమాత్మ యొక్క రసానుభూతి యందు సర్వాధిష్ఠానమైన ఆత్మయందు అనుభవం పొందిన నాడు ఈ ప్రపంచం మీద భ్రాంతి భావం అనేది ఉండదు. అది తొలగిపోతుంది.
మట్టితో కుండ చేసేటప్పుడు కుండ కార్యం అయింది. మట్టి కారణం అయింది. అట్లాగే ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు జగత్తు కార్యం అయింది. పరబ్రహ్మ స్వరూపం కారణం అయింది. కాన ప్రపంచం అంతా బ్రహ్మమే అయి ఉంది. దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. నగలో బంగారాన్ని దర్శించినప్పుడు నగలేదు. కుండలో మట్టిని దర్శించినప్పుడు కుండలేదు. రజ్జు సర్వభ్రాంతిలో తాడును తాడుగానే చూసినప్పుడు సర్పం లేదు. అట్లాగే సృష్టిలో కార్యాన్నే చూసినప్పుడు బ్రహ్మంలేదు. ప్రపంచమే కనిపిస్తుంది. కారణమైన బ్రహ్మం కనపడదు. కారణమైన బ్రహ్మాన్ని చూసినప్పుడు కార్యం అయిన ప్రపంచం కనపడదు. కారణమైన బ్రహ్మానుభవం పొందినప్పుడు, సచ్చిదానందాన్ని అనుభవించినప్పుడు సృష్టి లేదు. సృష్టి భ్రమ అని మాయ అని అర్థం అవుతుంది. ఇదే తాత్త్వికులు చేప్పేటప్పుడు వివర్తం అంటారు. అంటే లేనిది ఉన్నట్లుగా గోచరించటం అని. దాన్నే శాస్త్రపరిభాషలో వివరిస్తే అధ్యాస అంటారు. అధ్యాస అన్నా లేనిది ఉన్నట్లుగా అనిపించటమే. ఇక్కడ ఉంది బ్రహ్మం. కాని ప్రపంచం ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. కాని ప్రపంచం అధ్యాస, వివర్తం అయింది. ఎవరికి? సాధకునికి.
సాధకునికి సాధనకు పూర్వం సాధన తర్వాత కూడా ప్రపంచం ఉంది. సాధనలోనే ప్రపంచం అంతరించింది. కాన సాధకుడు ప్రపంచం భ్రమ అని, బ్రహ్మమే సత్యం అని అనుభూతిని పొందగలిగాడు. కాన సాధకుడు జీవన విధనంలో ఆ విధంగా జీవించగలుగుతున్నాడు.
తాడు పాముగా అనిపించటాన్నే రజ్జు సర్పభ్రాంతి అంటారు. చీకట్లో కాలుకు తగిలిన తాడు సర్పం అనిపిస్తుంది. కాంతి రాగానే అది తాడు అని తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానం రాగానే ప్రపంచం భ్రాంతి అని తెలుస్తుంది. కాన శాశ్వతమైన దానిని సరైన మార్గంలో వివేకంతో, విజ్ఞానంతో అర్థం చేసుకోవాలి. దేనికైతే ఆది అంతం ఉంటాయో అది నశిస్తుంది. అది అనిత్యమైంది. దేనికైతే ఆది అంతం ఉండవో అది నిత్యమైంది. అది నశించదు. భ్రాంతిలో సర్పం ఉందని అనిపించింది. జ్ఞానం రాగానే పాము అదృశ్యమైపోయింది. కనుక సర్పానికి ఆది ఉంది. అంతం ఉంది. కనుక అది నశిస్తుంది. తాడు అనే అస్తిత్వానికి ఆది లేదు అంతం లేదు. కావున అది నశించదు. కావున సృష్టి ఆద్యంతాలు కలిగి నశించేది అయిఉంది. భ్రాంతితో అది శాశ్వతం అనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మానికి ఆద్యంతాలు లేవు కనుక బ్రహ్మం శాశ్వతమైంది. బ్రహ్మం నిత్యుడు అనంతుడు అని అవగతం అయినవాడు ఈ ప్రపంచం మీద వ్యామోహం వదలి, సచ్చిదానందానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి సాధకుడు ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. సాధకుడు లేక జ్ఞానానుభవం కలిగినవాడు జ్ఞానంతో జీవిస్తూ ప్రపంచంలోనే ఉంటూ సుఖంగా కాలాన్ని గడపగలుగుతున్నాడు. అంటే దృశ్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏది పొందదగింది అయి ఉందో ఆ జ్ఞేయానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి చిదాత్మకమైన జ్ఞానంతో జీవిస్తున్నాడన్న మాట.
ఈ ప్రపంచాన్నే నిర్వచించటానికి వీలుకాని ప్రకృతిశక్తి అని, మాయ అని, మిథ్యాజ్ఞానం అని, అవిద్య అని, అజ్ఞానం అని అనేకరకాలుగా వివరిస్తుంటారు. దీన్ని అర్థం చేసుకొని అంటే ఈ అజ్ఞానాన్ని అర్థం చేసుకొని సత్యమైన బ్రహ్మాన్ని తెలుసుకొని, బ్రహ్మం చేతిలో నేను సాధనాన్నే కాని నాదీ అనే అహంకారంతో వ్యక్తిత్వంతో నిలవగలిగింది ఏదీ లేదు అని అర్థం చేసుకొని మానవుడు జీవించటాన్నే జ్ఞానం అంటారు. అదే బ్రహ్మజ్ఞానం. అదే భగవత్తత్త్వం. ఆ భగవత్తత్త్వం తెలిసిననాడు మానవుడు విషయవాంఛలకు లోనుకాకుండా బ్రహ్మానందానుభూతిని పొంద గలుగుతాడు. ముత్యపు చిప్పయందు వెండి, భ్రాంతి చేత భావించినట్లే, ఆత్మయందు ప్రపంచారోపణ భ్రాంతి చేత భావించటం జరుగుతుంది. అది భ్రాంతి అని నిరంతర ధ్యానంతో ఆరోపించబడిన దాన్ని తొలగించుకొని సచ్చిదానందంతో జీవించటానికి నిరంతరం పట్టుదలతో, ఆసక్తితో అభ్యాసం చెయ్యాలి.
8. ఉపాదానే 2 ఖిలాధారే
జగంతి పరమేశ్వరే
సర్గస్థితి లయాన్యాన్తి
బుద్బుదా నివ వారిణి || 8
అఖిల + ఆధారే = సర్వానికి ఆధారమైన, ఉపాదానే = సృష్టి యొక్క మూలసామగ్రికి కారణమైన, పరమేశ్వరే = పరమాత్మయందు, జగంతి = లోకాలు, వారిణి = నీటియందు బుద్బుదాన్ ఇవ = బుడగల వలె, సర్గ-స్థితి-లయాన్ = పుట్టుట పెరుగుట నశించుట, యాంతి = పొందుతున్నాయి.
తా||సర్వానికి ఆధారమైన సృష్టియొక్క మూల సామగ్రికి కారణమైన పరమేశ్వరుని యందు ప్రపంచాలు నీటి యందు బుడగలవలె పుట్టి, పెరిగి, నశిస్తున్నాయి.
వివరణ :- ప్రపంచం క్రమం తప్పకుండా కార్యరూపంలో కనిపిస్తుంది కనుక దీనికి మూలాధారమైన కారణం ఏమిటి? అని ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లా పర్యాలోచన చేసిన నాడు సాధకునికి సాధనలో బ్రహ్మమే అని తెలుస్తుంది. కార్యకారణ సంబంధం బ్రహ్మమే అని తెలుస్తుంది. అయితే సర్వానికి ఆధారమైన బ్రహ్మసృష్టికి మూల సామగ్రి ఏది అని పరిశీలించిననాడు బ్రహ్మమే తప్ప మరొకటి లేదు అని తెలుస్తుంది. కనుక బ్రహ్మ సృష్టి అయిన ప్రపంచాలన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి. అన్నీ కూడా బ్రహ్మం నుంచే పుడుతూ, పెరుగుతూ, లయించిపోతున్నాయి. నీటి బుడగ నీటికంటే అన్యమైంది అవదు కదా? నీటికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలే నీటి బుడగకు కూడా ఉంటాయి కదా! కాన నీటికి నీటి బుడగకు ఏ భేదం ఉంటానికి వీలు లేదు కదా ? అట్లాగే బ్రహ్మాన్ని బ్రహ్మ సృష్టి అయిన లోకాలకు ఏ భేదం ఉంటానికి వీలులేదు కదా? అందువల్ల లోకాలు బ్రహ్మం రెండు కూడా బ్రహ్మమే అయి ఉన్నాయి.
ఉదాహరణకు ఆత్మను తీసుకొన్నట్లయితే ఆత్మ బ్రహ్మం కంటె వేరు అయింది కాదు కదా? మాయ ఆవరించిన ఆత్మయే జీవుడుగా జీవిస్తున్నాడు కాన పరాత్పరుని నుండి ప్రతిరోజు అనేక లోకాలు సృష్టింపబడి పెరిగి లయించినట్లే జీవుని యందు ఈ లోకంలో అనేక లోకాలు సృష్టింపబడి పెరిగి లయిస్తున్నాయి. జీవుడు స్వార్థచింతనలతో జగత్తుతో తాదాత్మ్యం చెందటం వల్ల వాస్తవ స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. కనుక జీవుడు అనేకమైన కోరికలను పుట్టిస్తూ, వాటిని వృద్ధిచేస్తూ, వాటితోనే లయించిపోతున్నాడు. మానవుడు కలలో ఏ విధంగా తీరని కోరికలను తీర్చుకొంటూ, అనేకమైన వాటిని పుట్టిస్తూ, అనుభవిస్తూ, లయిస్తూ గడుపుతూ ఉన్నాడో అదే విధంగా జీవుడు భౌతికమైన జీవభ్రాంతితో ప్రతినిత్యం నూతనమైన కోరికలతో, విషవలయంలో పుడుతూ, పెరుగుతూ, లయిస్తూ గడుపుతున్నాడు. దాని నుంచి విముక్తి పొందగోరిన జీవుడు మాత్రమే ప్రయత్న పూర్వకంగా సాధన చేసినవాడు సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మతో లీనం అవుతున్నాడు. అప్పుడు ఆత్మ బ్రహ్మంకంటే వేరు కాదు అని అటువంటి సాధకునికి తెలుస్తుంది.
ఒక వస్తువును సృష్టించాలంటే దానికి మూడు కారణాలు అవసరం. 1) ఉపాదాన కారణం, 2) నిమిత్త కారణం, 3) సహకార కారణం. కుమ్మరికుండ చెయ్యాలనుకుంటే మూల సామగ్రి అయిన మన్ను ఉపాదాన కారణం అవుతుంది. కుమ్మరి నిమిత్త కారణం అవుతున్నాడు. అతని చక్రం సహకార కారణం అవుతుంది. ఇక్కడ సృష్టికి మూల సామగ్రి అయిన ఉపాదాన కారణం బ్రహ్మే అయ్యాడు. సృష్టించిన బ్రహ్మ నిమిత్తకారణం కూడా అయ్యాడు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండూ కూడా ఒక్కటే అయిపోయాయి.
కార్యకారణ సంబంధాన్ని ఆలోచించినప్పుడు బంగారం కారణం అయితే ఉంగరం కార్యం అయింది. దూది కారణం అయితే వస్త్రం కార్యం అయింది. మట్టి కారణం అయితే కుండ కార్యం అయింది. బ్రహ్మం కారణం అయితే సృష్టికార్యం అయింది. కావున సృష్టికి మూలద్రవ్యం అయిన ఉపాదాన కారణం బ్రహ్మమే అయింది. సాలెగూడుకు సాలీడే కారణం అయితే గూడు కార్యం అయింది. దానికి ఉపయోగపడిన మూలద్రవ్యమైన ఉపాదాన కారణం కూడా సాలీడే అయింది. ఈ విధంగా సాలెపురుగు సాలెగూడుకు నిమిత్త కారణం, సహాయ కారణం, ఉపాదాన కారణం మూడు కూడా తానే అయి ఉంది. అదే విధంగా బ్రహ్మం ఈ సృష్టికి అన్నీ తానే అయి ఉంది. అందువలన నీటిలో నీటిబుడగ పుట్టి పెరిగి లయించినట్లు ప్రపంచాలు బ్రహ్మంలోనే పుట్టి పెరిగి బ్రహ్మంలోనే లయిస్తున్నాయి. అయినా ఏవీ బ్రహ్మంకు అంటటం లేదు. బ్రహ్మం సాక్షి మాత్రంగానే ఉంటుంది. దీనిని వర్ణించటానికే రమణ మహర్షి సినిమా హాలులో కనిపించే సినిమా తెరను ఉదాహరించారు. తెరపైకి బొమ్మలు వస్తుంటాయి. పోతుంటాయి. ఏవీ కూడా తెరకు అంటవు. అదే విధంగా సృష్టికర్తయైన బ్రహ్మానికి ఏదీ అంటకుండా సృష్టి సర్వం తనలోనే సాగిపోతుంటుంది. బ్రహ్మమయిన తెర నిత్యం అయితే సృష్టి అయిన ఈ ప్రపంచం లేక జీవరాసులు అనిత్యం అయి ఉన్నాయి.
సాధకుడు తానే బ్రహ్మమై నిలిచిన నాడు ఈ ప్రపంచం అంతా ఆతని హృదయ సీమయందు ఆ విధంగానే వస్తూపోతూ ఉంటుంది. ఏదీకూడా ఆ సిద్ధిపొందిన రమణ మహర్షి వంటి వారికి అంటదు. ఒక సందర్శకుడు రమణ మహర్షిని ''చిన స్వామి వారు ఈ పృచ్ఛకులతోనే ఎక్కువసేపు కాలం గడిపేస్తున్నారు. సాధనలో మునిగేది ఎప్పుడూ'' అని ప్రశ్నించాడు. రమణ మహర్షి ''మునగనిది ఎప్పుడు?'' అని ఎదురు ప్రశ్న వేశారు. అంటే నిరంతరం ఆత్మే అయి తాను జీవిస్తున్నానని చెప్పారు.
సుషుప్తి అంటే గాఢనిద్రలో మనస్సు లయించి పోవటం. అంత మాత్రాన మానవుడు లయించిపోతున్నాడా? లేదు కదా !'' మానవుడు మేల్కొనగానే జగత్తు అనుభవానికి వస్తుంది. మానవుని కోరికలే, ఆలోచనలే, భావనలే ప్రపంచాన్ని తయారుచేస్తున్నాయి. కనుక ప్రపంచం మానవునిలో ఉంది. మానవుడు ప్రపంచంలో ఉండటం కాదు. అందుకే సాధనలో ప్రపంచం లయించి పోతుంది. అట్లా అవ్వటానికి మూల కారణం సంకల్పాలే. కావున సంకల్పాలకు మూల కారణం అయిన కోరికలు జీవచైతన్యంలో అంటే ఆత్మలో లయించి పోయిననాడు సంకల్పాల చేత సృష్టింపబడ్డ జగత్తు కూడా లయించిపోతుంది. అంటే జీవుని యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నీ కూడా జీవచైతన్యమైన ఆత్మజ్ఞాన స్వరూపంలో కలిసిపోతున్నాయి. ఆ విధంగా నీటి బుడగలు నీటిలో కలిసిపోయినట్లు జీవుడు ఆత్మలో కలిసిపోతున్నాడు. జీవుడు నేను ఆత్మను అని గ్రహించి ఆత్మజ్ఞానంతో జీవించిన నాడు మాత్రమే ఆత్మ అనంతమైన ఆత్మలో కలిసిపోతుంది. లేనినాడు జీవుడు చావుపుట్టుకల విషవలయంలో చిక్కుకొంటూ పుడుతూ, పెరుగుతూ, లయిస్తూ గడుపుతుంటాడు.
సూర్యుడు ప్రధాన కేంద్రంగా ఉండి అనేకమైన గోళాలు దానిచుట్టూ తిరుగుతున్నాయి గదా ! అదే విధంగా సూర్యునిలా ఉన్నటువంటి మిగిలిన వాటిని పాలపుంతలు అంటున్నారు. అట్లాంటి పుంతలు ఇప్పటికి తొమ్మిదింటిని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక్కొన్నారు. పూర్వులు సూర్యుని పుంతలనే సూర్యులన్నారేమోనని అనిపిస్తుంది. ద్వాదశాదిత్యులు భూమి చుట్టు వచ్చిననాడు భూమి లయించిపోతుంది అని చెప్పి ఉన్నారు కదా ! కాన సృష్టిరహస్యాలను సామాన్య జ్ఞానంతో వివరించలేము. బ్రహ్మం నుంచి ఎన్నిలోకాలు పుడుతున్నాయో ఎన్ని లయిస్తున్నాయో సామాన్యమైన మానవులు చెప్పలేరు.
9. సచ్చిదాత్మన్యనుస్యూతే
నిత్యా విష్ణౌ ప్రకల్పితాః
వ్యక్తవ్యో వివిధా స్సర్వాః
హాటకే కటకాదివత్ || 9
@ƒ«sVxqsWù¾»½[ = సర్వగతమైన, నిత్య = శాశ్వతమైన ఆత్మ, వివిధాః = అనేక రకాలై, సర్వాః = సర్వత్ర, వ్యక్తవ్యః = బహిర్గతం అవుతున్న రూపాల్లో, హాటకే = బంగారమునందు, కటక + ఆదివత్ = గాజులు మొదలైన ఆభరణాలవలె, ప్రకల్పితాః = కల్పింపబడ్డాయి.
తా|| అన్నిటియందు ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సర్వవ్యాప్తి అయినటువంటి సత్ చిత్ స్వరూపమైన ఆత్మ అనేకరకాలై సర్వత్ర బహిర్గతం అవుతూ ఉన్న రూపాల్లో బంగారమునందు రకరకాలైన ఆభరణాల వలె కల్పింపబడ్డాయి.
వివరణ : - భ్రాంతివల్ల రకరకాల రూపాల్లో అనేకాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయే కాని నిజానికి సర్వాంతర్యామి అయి అంతటా నిండి ఉన్నటువంటి వాడు సత్ చిత్ ఆత్మ స్వభావము కలిగిన ఆ పరబ్రహ్మం ఒక్కడే అయి ఉన్నాడు. సత్ అనగా సత్యమైంది. శాశ్వతమైంది. ఏ సత్ అయితే శాశ్వతమై ఉందో ఆ సత్ ఆత్మలో ఉంది అని రమణ మహర్షి వివరించారు. సత్ అంటే పురుషోత్తముడు. చిత్ అంటే ప్రకాశం. అదే చైతన్యమై ఉంది. ఆ చైతన్యం ఉండగానే చిత్ సత్‌తో కలిపిననాడు ఆత్మానుభవం చేకూరుతుంది. సచ్చిదానందం చేకూరుతుంది. శాంతి లభిస్తుంది. శాశ్వతమైన పరబ్రహ్మం సర్వత్ర ఉండి సర్వప్రాణికోటిలోను సత్ చిత్ స్వరూపమైన ఆత్మగా వెలుగొందుతున్నాడు. ప్రాణికోటిలో మానవునికి ఒక్కనికే ఆ విషయజ్ఞానం గ్రహించి వాటిద్వారా ఆ పరాత్పరుని చేరటానికి దారిని అర్థం చేసుకోగలిగేటట్లు ఆ పరాత్పరుడు చేయగలిగాడు. సర్వత్రా ఉన్న చైతన్యాన్ని ఆత్మ జ్ఞానంతో గురుకృపతో ఆజ్ఞా చక్రం వద్ద అనగా శివుని మూడవ నేత్రం అయిన భ్రుకుటి మధ్య మనస్సుతో కలిసేటట్లు చెయ్యాలి. అప్పుడే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు అన్నీ ఆత్మలో లీనమయి పరమశాంతిని పొందుతాయి. అక్కడినుంచే ఆత్మ సహస్రారము వరకు ప్రయాణం చేస్తుంది. అక్కడే పురుషోత్తముడు ఉన్నాడు. ఆ పురుషోత్తముని ఆత్మ దర్శించినప్పుడే సో 2 హం, సో 2 హం అనగా వాడే నేను, వాడేనేను అని ఆనందాన్ని, తన్మయత్వాన్ని అనుభవిస్తూ పలుకుతుంది అని రాధాస్వామి సత్సంగు బ్యాసువారి (Science of the Soul) ఆత్మ విజ్ఞానంలో 81 పేజీలో శ్రీ మహారాజ్ సర్దార్ బహదూర్ జగత్‌సింగ్‌జీ చెప్పారు. ఎంతకాలం దూరంగా ఉండిపోయాను అనుకొంటు ఆ పరాత్పరునిలో కలిసిపోవటానికి ఆత్మ పరితపించిపోతూ ఈ మాటలు అంటుంది. ఇదే సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మజ్ఞానం. జీవించి ఉన్న గురువుద్వారా ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించి, గురుకృపతో గురువు చెప్పినట్లు విని నిరంతరం సాధన చేసి సచ్చిదానందాన్ని అనుభవించాలి.
దేశ కాల పాత్రలను బట్టి వ్యక్తులు భిన్న వ్యక్తిత్వాలతో కనిపిస్తున్నప్పటికి ఆత్మచేత అందరు మానవులు ఒక్కటే అయి ఉన్నారు. ఆత్మ ప్రతిప్రాణిలోను ఒక్కటే అయిఉంది. నామ రూపాల్ని తొలగించి చూసిననాడు బ్రహ్మానుభవం కలుగుతుంది. ఆభరణాలను నామరూపాలు తొలగించి బంగారంగా తిలకించిననాడు అన్ని ఆభరణాలలోను ఒక్కటే ఉన్నదని తెలుస్తుంది. అదే విధంగా మానవులందరి లోను ఉన్న ఒకటే అయిన బ్రహ్మాన్ని తిలకించి బ్రహ్మానందాన్ని, శాంతిని అనుభవించాలి.
బంగారంతో వస్తువులు చేయకముందు, వస్తువులు చేసిన తర్వాత, వస్తువుల్ని కరిగించిన తర్వాతకూడా అక్కడ ఉన్నది బంగారమే. ఆభరణాలను రకరకాల పేర్లతో పిలుస్తున్నామే కాని వాటిలో ఉన్నది బంగారమే. అదే విధంగా సమస్తమైన ప్రపంచం కూడా నామరూప భేదాలతో వేరువేరుగా దర్శిస్తూ ఉన్నామే కాని ప్రపంచం అంతటా ఉన్నటువంటి వాటిలో ఉన్నవాడు ఆ పరాత్పరుడు ఒక్కడే.
భగవంతుని మాయాశక్తి వల్ల లేదా ప్రకృతి యొక్క మాయవల్ల ప్రపంచం అంతా వేరువేరుగా కనిపిస్తుందే కాని అవి ఏవీ కూడా వేరువేరు కావు. ఆత్మజ్ఞానం కలుగగానే సాధకునికి అందరూ సోదరులేననియు, సర్వజీవరాసులు అటువంటివే అనియు దివ్యోపదేశం సిద్ధిస్తుంది. కాంతి, విద్యుచ్ఛక్తుల వలె మానవులందరూ ఒక్కటేనని, రకరకాలుగా దృష్టి భేదాన్ని బట్టి, విషయ వివరణలనుబట్టి, వేర్వేరుగా కనిపిస్తున్నారని అంతకంటే వేరేమీ కాదని అనుభవానికి వస్తుంది. ''ఏకమేవ అద్వితీయం బ్రహ్మ'' అంటే బ్రహ్మఒక్కడే ఉన్నాడు. రెండవది లేదు. ''త్వమేవాహ'' అంటే నీవే నేను అంటే ఆ బ్రహ్మమే నేను అయి ఉన్నాను. ''అహం బ్రహ్మాస్మి'' అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను. ''ప్రజ్ఞానం బ్రహ్మ'' అంటే ఆత్మయే బ్రహ్మ. ''సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మ'' అంటే సత్యము జ్ఞానము అనంతము అయినది బ్రహ్మము వంటి మహావాక్యాలన్నీ కూడా సత్ చిత్‌తో కూడిన ఆత్మయే బ్రహ్మం అని తెలియజేస్తూ ఉన్నాయి.
మానవుని దేహంలో కాలి కొనగోరునుంచి తలమీది వెంట్రుక కొనవరకు సర్వత్ర ఆత్మ వ్యాపించి ఉంది. అనాత్మ అయిన ప్రాణికోటి లేదు. సర్వము ఆత్మతో కూడి ఉంది. అంటే సర్వము బ్రహ్మమే అయి ఉంది. సాధనలో సాధకుడు ఈ విషయాలను గ్రహించగలుగుతాడు. దేహ భ్రాంతి వల్ల అనగా అవిద్య వల్ల ఆత్మ ఒక్కటే అయినా అనేకంగా కనిపిస్తుంది. అన్నిటిలోను ఉన్న బ్రహ్మాన్ని సచ్చిదానందమనే ఆత్మ జ్ఞానంతో నిరూపించి ఆది శంకరాచార్యులవారు అద్వైతాన్ని అనుభవించేటట్లు చేయగ.
''ఆత్మ'' ''బ్రహ్మ'' ఒక్కటేను అదే సత్యాన్ని గ్రహించేటటువంటి బ్రహ్మానుభవం మానవునికి కలగటం అనేది శతకోటి జన్మల సుకృత ఫలంగా ఆదిశంకరాచార్యులవారు వివేక చూడామణి రెండవ శ్లోకంలో చెప్పారు. అదే శ్లోకంలో ప్రాణికోటికి మానవజన్మ అరుదుగా లభిస్తుందిఅని, అందున ''విప్రత్వం''లభించటం మరీ అరుదుఅని చెప్పారు. వేదవేత్త విప్రుడవుతాడు అని కొందరంటున్నారు. వేదం చదువుకొని వేదజ్ఞానంతోనే గడుపుదామంటే పోషించే దాతలు లేరు. బ్రతుకు తెరువుకోసం ప్రతివాడు పలురకాల పనులు చేయవలసి వస్తుంది. కాన కులాల ప్రకారం జీవించటానికి ఈనాడు సంఘస్థితి నడవటంలేదు. ఆ పదాలు ఏర్పడిన నాటి స్థితి మరలరాదు కాన వాటిని కాలానుగుణంగా అర్థంచేసుకోవాలి. బ్రాహ్మణంః కులే భవత్వాద్వా బ్రాహ్మణంః అనిగదా! బ్రహ్మకులమందు పుట్టినవాడు బ్రాహ్మణుడు అని, బ్రాహ్మణోపత్యం బ్రాహ్మణనః అనగా బ్రహ్మ సంతతివాడు బ్రాహ్మణుడు అని, బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్ఠా వత్త్వాత్ బ్రాహ్మణః అనగా పరబ్రహ్మయందు నిష్ఠగలవాడు బ్రాహ్మణుడు అని అమరకోశ వ్యాఖ్యాత లింగాభట్టీయ గురుబాల ప్రబోధినిలో చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఆలోచించినా పరబ్రహ్మయందు నిష్ఠకలిగినవారందరు బ్రాహ్మలు అవుతూ ఉన్నారు. పరబ్రహ్మ జ్ఞానం సర్వశ్రేష్ఠం అని తెలుస్తుంది. కులంచేతో, జాతి చేతో, దేశంచేతో భేదభావంగా ఆలోచించకుండా గుణంచేత బ్రహ్మనిష్ఠుల్ని ఉన్నతంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ ''విప్రతా''అనే పదానికి హిందూమతంలోని సనాతనులు, ఛాందసులు అపార్థాన్ని కల్పించారని, పొరపాటునో గ్రహపాటునో బ్రాహ్మల ఇంట్లో పుట్టటమే ఒక అర్హత అని ఆ పదాన్ని నిర్వచించారు అని, ఆ విధంగా తెలివితక్కువగా నిర్వచించటం వల్ల ఈనాడు హిందూమతానికి జరిగిన హానిని సరిదిద్దటం అనుభవం ఏమో అని అనిపిస్తుంది''అని స్వామి చిన్మయానందగారు వివరించారు. ఆ పదానికి నిజంగా చెప్పుకోవలసిన అర్థం ఏమిటంటే మనోబుద్ధులకు ఉండవలసిన ఒక ప్రత్యేక అర్హత అని ఆయన వివరించారు. అంటే మనోబుద్ధుల్ని నిగ్రహించి ఆత్మతో జీవించాలనే ఉత్తమ గుణాలు కలిగి ఉండటమే అని ఆయన వివరించారు. కాన స్వామి చిన్మయానందగారు ప్రదర్శించిన విజ్ఞతను, దూరదృష్టిని, కాలోచితమైన అర్థ వివరణనూ అందరూ సరిగా అర్థం చేసుకొని పాటించవలసిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. అందరూ ఆత్మజ్ఞానానికి అర్హులే. అందరికి సత్, చిత్ ఆత్మ అనేవి సమానంగా ఉన్నాయి. అందరు సచ్చిదానందాన్ని అనుభవించటానికి సమానమైన అర్హతలు కలిగి ఉన్నారు. భగవంతుడు అందరికీ అన్నీ సమానంగా ఇచ్చాడు.
''దృఢ నిశ్చయం కలిగి ఉండటం, వైరాగ్య భావం, సునిశితమైన మేధ, లక్ష్యాన్ని సాధించాలనే దీక్షతో ఏకాగ్రం శాంతం అయిన మనోబుద్ధుల ప్రసన్నతా'' సాధకునికి కావాలని అదే మనోబుద్ధులకు ఉండవలసిన ఒక ప్రత్యేక అర్హత అని స్వామి చిన్మయానందగారు వివరించి ఉన్నారు. కాన సాధకుడు పట్టుదలతో ఆత్మానందాన్ని పొందాలని ప్రయత్నిస్తేనే సాధిస్తాడని, దాన్ని ఇతరులు ఎవ్వరూ సాధకునితో తరగతిలో పిల్లల్ని కూర్చోబెట్టి పాఠం చెప్పి చదివించినట్లుగా ఇది సాధకునితో సాధించేటట్లు చేయటానికి వీలుకాదని సత్య సాయిబాబాగారు కూడా వివరించారు. శిరిడి సాయిబాబా కూడా గురువును ఆశ్రయించి ఆయనను మనసులో నిలుపుకొని నిరంతర సాధనతో ఆత్మానందాన్ని సాధించాలనే బోధించారు. కాన సాధకులు జీవించి ఉన్న గురువును ఆశ్రయించి ఆత్మానందాన్ని అనుభవించాలి. మానవుని రోగం నయం కావాలంటే బ్రతికున్న డాక్టరు కావాలి కదా!
10 యథాకాశో హృషీకేశః
నానోపాధిగతో విభుః
తత్ భేదాత్ భిన్నవద్భాతి
తన్నాశే కేవలో భ##వేత్ || 10
ANSaRPM = ఆకాశం, నానా + ఉపాధిగతః = రకరకాల ఉపాధులను పొందటంవల్ల, భిన్నవత్ భాతి = వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తూ, తత్ + భేదాత్ = ఆ ఉపాధుల భేదం, తత్ + నాశేసతి = నశించగానే, యథా = ఏ విధంగా అయితే, కేవలః = ఏకంగా, భ##వేత్ = అవుతుందో అదే విధంగా, హృషీక + ఈశః = ఇంద్రియాల్ని నిగ్రహించేటటువంటివాడైన, విభుః = పరమాత్మ (అవుతున్నాడు).
తా|| ఆకాశం రకరకాల ఉపాధులను పొందటం వల్ల వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తూ ఆ ఉపాధుల భేదం నశించగానే ఏ విధంగా ఒకటిగా అవుతుందో ఆ విధంగానే పరమాత్మ ఉపాధులతో కలవటం వల్ల వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తున్నా ఆ ఉపాధులు నశించగానే అఖండమై ప్రకాశిస్తున్నాడు.
వివరణ :- హృషీకేశుని సంబోధించటంవల్ల ఇంద్రియ నిగ్రహం కలిగిన సాధకులే శరీర రహితులై పరమాత్మానుభూతిని పొందుతారు అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.
మానవుడు తాను ఆత్మే అయి ఉండి, తాను దేహంగా భ్రాంతి చెంది ఆత్మయందు దేహాన్ని ఆరోపించుకొంటూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఇదే బంధానికి కారణం. ప్రకృతి, సంసారం రెండూ కూడా మానవుణ్ణి బంధితుణ్ణి చేస్తున్నాయి. శరీరమే మానవునికి ఉపాధి అవటం వల్ల దేహమే ఆత్మ అనే భ్రాంతికి లోను అయ్యేటట్లు చేస్తుంది. దానివల్ల లోకంలో ఉపాధుల భేదంతో భిన్నంగా భావింపబడుతున్నాడు. ఈ ఉపాధియే అజ్ఞానానికి కారణం. సర్వత్ర వ్యాపించి ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మే తానై ఉన్నాడు. అది అర్థం చేసుకొని అనుభవించవలసిన అవసరం ప్రతి మానవునికి ఉంది. దాన్ని తెలియచెయ్యటానికే ఆకాశాన్ని ఉపమానంగా స్వీకరించారు.
తన కళ్ళను తాను నమ్మవద్దు అని, తన చెవులను తాను నమ్మవద్దు అని పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఆకాశంలో చంద్రుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి కదులుతూ ఉంది మేఘం. మనం రైలులో కూర్చొని ఉండగా మన రైలు ఆగితే మన ప్రక్కరైలు పట్టాలపైన కదులుతూ ఉంటే మన రైలు కదులుతూ ఉంది అని అనిపిస్తుంది. నిజానికి కదులుతుంది మన ప్రక్క రైలు మాత్రమే.
అసలు మానవుడు దేహ భ్రాంతికి ఎందుకు లోనవుతున్నాడు? మానవుడు తల్లిదండ్రులనుండి పొందిన జీవాణువుల వల్ల, ప్రారబ్ధ కర్మల వల్ల, తనచుట్టూ ఉన్న పరిసరాలు నేర్పిన జ్ఞానంవల్ల మానవుడు దేహభ్రాంతికి లోనవుతున్నాడు. ఆత్మ జ్ఞానం తెలియక జీవిస్తున్నవారికి లోకాన్ని దర్శిస్తూ ఉన్నా, అనేక ఉత్తమ గ్రంథాలు చదువుతున్నా లోకజ్ఞానం సర్వస్వం గ్రహిస్తున్నాను అని భావించినా, మానసిక తత్త్వ పరిశీలనా జ్ఞానం సంపూర్ణంగా అవగాహన చేసుకొన్నాను అని తలంచినా అవి అన్నీ కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. అవి అన్నీ కూడా అరకొరగానే అర్థం అవుతుంటాయి. కారణం ఏమంటే రాజమార్గం అయిన ఆత్మజ్ఞానం తెలియక పోవటమే. దాన్నే కర్మపరిపాకం కాలేదు అని పెద్దలు ఒక్కముక్కలో తేల్చేస్తారు. ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత తాను పూర్వం చూసినవి, చదివినవి, గ్రహించినవి, అనుభవించినవి అన్నీ కూడా నూతనార్థాలతో స్ఫురిస్తుంటాయి. నూతనానుభవాల్ని చేకూరుస్తుంటాయి. విచారణా మార్గానికి దోహదం చేస్తుంటాయి. ఆత్మానందానికి మార్గాన్ని సుగమం చేస్తుంటాయి. ఆ విధంగా మానవుడు ఆత్మజ్ఞానంతో, ఆత్మ జ్ఞాన సాధనతో, ఆత్మానందాన్ని అనుభవిస్తూ జీవించిననాడు అఖండమైన పరమాత్మానుభవం చేకూరుతుంది.
ప్రపంచంలో మానవులు, వస్తువులు, జంతువులు, క్రిమికీటకాదులు, వృక్షాలు మొదలైనవి అన్నీ కూడా వివిధ రూపాల్లో కనిపిస్తుండగా, వివిధ రకాల అనుభవాలు అనుభవిస్తుండగా అంతా ఒక్కటేనని, చావుపుట్టుకలు లేని ఆత్మే అంతా కూడి ఉంది అని ఎట్లా అర్థం చేసుకోవటం అనే సమస్య మానవుణ్ణి ఎల్లవేళలా వేధిస్తుంటుంది. అద్వితీయమైన పరాత్పరుడే అయిన ఆ జీవచైతన్యం సత్యం అయితే అనుభవంలో ఈ వ్యత్యాసాలు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ఆలోచన ప్రతి మానవుణ్ణి వేధిస్తుంది. మరి అట్లాంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకొంటాం అంటే ఘటాకాశాన్ని ఉదాహరణగా తీసుకొని అవగాహన చేసుకోవటానికి వీలు కల్పించారు.
ఒక కుండలో నీళ్ళు ఉన్నాయి అనుకొందాం. ఆ కుండలోచూస్తే మనకు ఆకాశం కనిపిస్తుంది. అది ఘటాకాశం. దాని ప్రక్కనే ఉన్న అనేక కుండల్లో నీళ్ళుపోసి చూశాము అనుకోండి. అన్ని కుండల్లోను ఆకాశం కనిపిస్తుంటుంది. ఆకాశం ఏ కుండకు ఆ కుండకే పరిమితమై ఉండటం వల్ల అనేక ఆకాశాలు ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఒక కుండను పగలగొట్టాం అనుకొందాం. ఆ కుండలో ఆకాశం ఏమయింది ? నశించి పోయిందా? లేదు అన్ని కుండలు పోయాయి అనుకొందాం. ఆకాశం ఏ కుండలోనూ కనబడటం లేదు అంటే ఘటాలతోపాటు ఆకాశం కూడా నశించి పోయిందా అంటే నశించలేదు. ఎందుకని? ఆకాశం ఘటానికి పరిమితం కాలేదు. ఆకాశం సర్వత్ర నిండిఉంది. అందువల్ల పుట్టటం, పెరగటం, నశించటం అనేవి ఆకాశానికి లేవు. కుండకు మాత్రమే వికారం కలిగింది. కనుక కుండకే మార్పు పరిమితమై ఉంది. ఆకాశానికి మార్పులేదు. అది వికారం చెందదు. ఆ విధంగా ఘటాకాశం ఉదాహరణతో మానవులు పరిమితమైన దేహభ్రాంతినుంచి విముక్తిని పొందాలి. ఆత్మ పరిమితమైంది కాదని, అనంతమైంది అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఆత్మ నశించదు. నశించేది దేహం మాత్రమే. చావుపుట్టుకలు దేహానికే ఉన్నాయి. మానవుడు దేహం నశిస్తుంది కాన తాను నశిస్తున్నాను అని భ్రాంతి చెందుతున్నాడు. అది నిజం కాదు. మానవుడు శరీరం అనే ఉపాధి కారణంగా పరిమితునిగా భావిస్తున్నాడు. శరీరం అనే ఉపాధి తొలగగానే అనంతమైన ఆత్మగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. కాన మానవుడు ఉపాధితో భ్రాంతికిలోనుగాక అనంతమైన ఆత్మకోసం, ఆత్మజ్ఞానంతో, ఆత్మానందంతో జీవించాలి.
ప్రతి మానవునిలో ఉన్న జీవచైతన్యమైన ఆత్మయే సాక్షి మాత్రంగా ఉండి అనుభవాన్ని చేకూరుస్తుంది. లోకంలో దుమ్ము, పొగ వంటి రకరకాల మాలిన్యాలు ఉన్నా ఆకాశానికి ఏ మాలిన్యం అంటటం లేదు. అట్లా ప్రతి మానవునిలో సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మకు ఏ మాలిన్యం అంటటంలేదు. ఆత్మ అమలినమైంది. కర్మ సాక్షిమాత్రమైంది. అన్నిటికి శక్తిని ఇస్తూ, అన్నిటిని అనుభవింపచేస్తూ సాక్షిమాత్రంగా ఉంటుంది. ఆత్మే అయిన జీవుడే అన్నిటిని గ్రహిస్తున్నాడు. జడమైన దేహం దేన్నీ గ్రహించలేదు. దేహం అనేది దృశ్యం అనగా మానవుడు ఏది చూస్తున్నాడో అది. అయితే తానే దృక్కు అనగా చూపు అయి దేహం అనే దృశ్యాన్ని చూస్తున్నాడు. కళ్ళకి శక్తి లేదు. కళ్ళలో ఉన్న జీవచైతన్యానికి శక్తి ఉంది. కళ్ళజోడుతో అన్నిటినీ చూస్తున్నాడు. అయితే కళ్ళద్దాలకు ఆ శక్తి ఉందా? లేదు ఆ శక్తి లోపల ఉన్నటువంటి ఆ జీవచైతన్యానికే ఉంది. కాని దేహం అనే ఉపాధితో మానవుడు ఆ జీవ చైతన్యాన్ని పరిమితం చేయటం వల్ల నేను అనే అహంకారానికి లోనవుతున్నాడు. దానితో బహురూపాలైన ఉపాధుల్ని ప్రపంచంలో అనుభవిస్తుండటం వల్ల నేను అనే అహంభావం సత్యం అని మానవుడు భ్రమ చెందుతున్నాడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా మానవుని యందు ఉన్నటువంటిది శాశ్వతమెన జీవచైతన్యమే. మానవుడు ఉపాధి కారణంగా అఖండమైన ఆ జీవచైతన్యాన్ని అజ్ఞానంతో దర్శిస్తూ రకరకాలుగా భావిస్తూ పరిమితంగా భావిస్తున్నాడు. కాన మానవుడు అనంతమైన ఆత్మ జ్ఞానాన్ని పొంది అద్వైతాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ విధంగా జీవించగలిగిన నాడు ఆతనిని జీవన్ముక్తుడు అంటారు. అంటే జీవించి ఉండగానే ముక్తి పొందాడు అని అర్థం. శరీరం ఉండగానే ఆత్మతో జీవించి, అనంతమైన ఆత్మను అనుభవించి, తామరాకుమీద నీటిబొట్టులాగా ప్రపంచంలో జీవయాత్రను కొనసాగించగలిగాడు అని అర్థం. అట్టి జీవన్ముక్తుడు పరమ సుఖాన్ని, పరమశాంతిని అనుభవిస్తూ జీవించగలుగుతాడు. రెండు పూటలా భోజనం చేస్తున్నా నిత్యనిరాహారిగానే ఉంటాడు. భార్యతో జీవిస్తున్నా నిత్య బ్రహ్మచారిగానే జీవిస్తాడు. అదే జీవన్ముక్తుని లక్షణం.
11. నానోపాధివశాదేవ
జాతి వర్ణాశ్రమాదయః
ఆత్మ న్యారోపితా స్తోయే
రసవర్ణాది భేదవత్ || 11
»][¹¸…[V = నీటియందు, రసవర్ణ + ఆది భేదవత్ = రుచి రంగు మొదలైన భేదాల వలె, ఆత్మని = ఆత్మయందు, నానా +ఉపాధి వశాత్ + ఏవ = రకరకాలు అయిన ఉపాధుల సంబంధం వలననే, జాతి వర్ణ + ఆశ్రమాదయః = జాతి, కులం, ఆశ్రమం మొదలైనవి, ఆరోపితాః = ఆరోపింపబడుతున్నాయి
తా|| నీటియందు రుచి, రంగు, వాసన మొదలైన భేదాలు ఏ విధంగా ఆరోపింపబడ్డాయో ఆ విధంగానే ఆత్మయందు రకరకాల ఉపాధుల సంబంధం చేత జాతి, కుల, ఆశ్రమాల వంటివి ఆరోపింపబడుతున్నాయి.
వివరణ :- వర్షం కురిసే నీటికి రుచి రంగు వాసన ఏవీ లేవు. ఆ నీరు క్రింద పడ్డ చోటునుబట్టి, ఆ భూమికి ఉన్న గుణాలను బట్టి రుచి రంగు వాసన కలుగుతున్నాయే కాని వేరుకాదు. అదే విధంగా మానవుల్లో పుట్టేటప్పుడు ఎవరికీ ఏ తేడాలేదు. మానవులందరికీ జాతి కుల ఆశ్రమాలు అనేవి మధ్యలో కల్పించినవే కాని వేరుకాదు. అవి అన్నీ కూడా ఆత్మకు ఆరోపింపబడుతున్నాయేకాని ఆత్మకు ఆ భేదాలు ఏవీలేవు. మానవులు అందరూ ఒకేలా పుడుతున్నారు. ఒకేలా మరణిస్తున్నారు. వాళ్ళు ఉన్న స్థితిగతుల్ని బట్టి వీళ్ళు బీదవాళ్ళు. వాళ్ళు ధనికులు అని వ్యత్యాసాలు చూపిస్తున్నారు. అంతేకాని ఇవి ఏవీ ఆత్మకు అంటవు. విద్యుచ్ఛక్తిని ఉదాహరణంగా తీసుకొంటే ఉపయోగించే వస్తువునుబట్టి ఆ వస్తువు ప్రదర్శిస్తున్న గుణాన్ని బట్టి విద్యుచ్ఛక్తిని భేదభావంతో ఆలోచించేటట్లు చేస్తుందేకాని విద్యుచ్ఛక్తిలో ఏ భేదం లేదు. విద్యుచ్ఛక్తి బల్బుకు పంపితే కాంతిని ఇస్తుంది. పంకాకు పంపితే గాలిని ఇస్తుంది. కూలర్‌కి పంపితే చల్లదనాన్ని చేకూరుస్తుంది. రెఫ్రిజిరేటరుకు పంపితే వస్తువుల్ని చెడిపోనీయకుండా ఉంచి వాటిని చల్లగా చేస్తుంది. క్లీనర్‌కు పంపితే ఇంటిలో ఉన్న దుమ్మును తొలగిస్తుంది. ఆ విధంగా దాన్ని ఉపయోగించే వస్తువులనుబట్టి అది చేసే పని మారి, దాని గుణం వేరుగా ఉన్నట్లు కనిపిస్తుందే కాని నిజానికి వాటి అన్నిటిలోనూ ఉపయోగపడేది విద్యుచ్ఛక్తి ఒక్కటే. అదే విధంగా మానవులు అందరిలోను ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి అయిన ఆత్మ ఒక్కటే అయి ఉన్నా సంఘంలో జీవన విధానానికి నిర్ణయించిన నియమాలనుబట్టి వేరువేరుగా కనిపిస్తున్నారు.
మాయ ఆవరించిన మానవుని జీవన విధానానికి, సంఘం కట్టుబాట్లకు, సంఘాన్ని నడపటానికి జ్ఞానులైన వారు మానవుని మీద అనేక ప్రయోగాలు చేసినట్లు కనిపిస్తూ ఉంది. సత్త్వ రజ స్తమో గుణాలతో సంఘాన్ని మూడుగా విభజించినవారు తర్వతా చాతుర్వర్ణ్యం అని నాలుగు విభాగాలుగా విభజించారు. అదల్లా క్రమేపి అయిదు విభాగాలుగా చేసి పంచముల్ని సృష్టించారు. అవి క్రమేపి మారి మారి ఆంజనేయుని తోకలా పెరిగి పెరిగి నేటికి ఐదువందల కులాలకంటే ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విధానంలో రానురాను ఆచార వ్యవహారాలే మతం అనే స్థాయికి హిందూమతం చేరి కులాలకుంపటి ఆరకుండా ఉండేటట్లు చేసింది. ఇది రావణ కాష్టం అవ్వటంతో అనాదరణ, అవమానాల వంటివాటిని సహించలేని దళితులు, స్వేచ్ఛాప్రియులు, ఆత్మాభిమానులు పరమతాల్ని ఆదరించారు. దానితో భారత జాతిలో జైనం ఉద్భవించింది. భౌద్ధం ప్రత్యేక స్థానం ఆక్రమించింది. వీటికి తోడు మహమ్మదీయ మతం, క్రైస్తవ మతం కూడా స్థానం ఏర్పరుచుకొన్నాయి. ఇవి అన్నీ కూడా ఈ దేశంతో స్థానం సంపాదించటానికి కారణాల్లో భారతీయుల్లో ఉన్నతులుగా పరిగణింపబడుతూ ఉన్నవారు, అయాచితంగా లభించిన అధికారాన్ని పోనీయకుండా కాపాడుకోవటం కోసం, తోటి వారిమీద చూపిన అనాదరణ, తారతమ్యాలే కాని మరింకేమి కాదని ఈనాడు అందరికి అర్థమవుతూ ఉంది. మహమ్మదీయ, క్రైస్తవ మతాలు ప్రదర్శించిన ఆధ్యాత్మిక ప్రత్యేకతల వల్ల హిందూజాతి ప్రజలు వాటిలో చేరిన దాఖలాలు ఈ నాటికి కూడా కనిపించటం లేదు. ఈ నాటికి కూడా హిందూమతంలో అణగారిన జాతులు ప్రదర్శిస్తూ ఉన్న ఓర్పు, సహనం వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ భగవద్భక్తికి నిదర్శనం అని అందరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈనాడు కులవృత్తుల్ని పాటించవలసిన అవసరం లేదు. వాటిని రక్షించే రాజులు రాజరికాలు లేవు. అందరూ అన్నీచేస్తున్నారు. అందరూ అన్నిటికీ అర్హులని చాటి చూపిస్తున్నారు. అయినా మధ్యలో కల్పించిన కులం కలుషితం చేస్తూ జాతి మొత్తానికి సంకట స్థితిని కల్పిస్తున్నది. దీన్ని సరైన దారిలో పరిష్కరించి జాతికి శాంతి సుఖాల్ని చేకూర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికే ఆత్మమార్గం, అద్వైత మార్గం ఉత్తమ మార్గాలుగా రూపుదిద్దుకొన్నాయి. సంఘానికి అవసరం ఏదైతే ఉందో దానికోసం, ఏదైతే సత్యం అయి ఉందో దానికోసం, ఆదిశంకరాచార్యులవారు స్వచ్ఛమైన నీటిని ఉపమానంగా తీసుకొని కులాలను, జాతులను, ఆశ్రమాలను అర్థం చేసుకోవటానికి వీలు కల్పించారు.
ప్రపంచం మానవుల్లో వారి వారి చదువుల వల్ల, వృత్తుల వల్ల, వయో భేదాల వల్ల అనేక రకాలుగా మానవులు కనిపిస్తున్నా వాళ్ళందరి అంతరంగాల్లో ఉన్న శుద్ధ చైతన్యమైన ఆత్మ యందు ఏ భేదం లేదు. ఏ జాతి వారైనా వారి ఆత్మ ఒక్కటే అయిఉంది. వారి జాతిని బట్టి, కులాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి వేషభాషల్లో జీవన విధానంలో వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నా వారి అందరి యందు ఉన్న శుద్ధచైతన్యమైన ఆత్మ ఒక్కటే అయి ఉంది. క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు, మానవులు వివిధ రూపాల్లో కనిపిస్తున్నా, భేదాలు దర్శింపబడుతున్నా అన్నిటియందు ఉన్న ఆత్మ ఒక్కటే అయి ఉంది. ఉపాధి భేదం వల్ల అవి అన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి. వేష భేదం చేతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రకులాలుగా చెప్పబడుతూ ఉన్నారే అని ఆత్మచేత అందరూ ఒక్కటే అయి ఉన్నారు. ఆత్మకు లింగభేదంలేదు. పురుషుడు అని స్త్రీ అని వ్యత్యాసం లేదు. నియమాలలో ఉన్న వ్యత్యాసం వల్ల బ్రహ్మచారి అని, సన్యాసి అని ఆశ్రమ భేదాలను ప్రకటిస్తున్నారే కాని ఆత్మ స్థాయిలో వీరందరికీ ఏ భేదం లేదు. ఆత్మకు బాల్యం అని, ¸°వనం అని, వృద్ధాప్యం అని ఏ భేదాలు లేవు. వయస్సును బట్టే శరీరానికి మార్పు వస్తుంది కాని ఆత్మకు ఏ మార్పూ లేదు.
ప్రపంచంలో అనేక జాతుల వారు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్క ఆత్మ లేదు. జైనుల ఆత్మ, బౌద్ధుల ఆత్మ, మహమ్మదీయుల ఆత్మ, క్రైస్తవుల ఆత్మ, యూదుల ఆత్మ, రెడ్ ఇండియన్ల ఆత్మ, నీగ్రోల ఆత్మ, జొరాస్ట్రియన్ల ఆత్మ, హిందువుల ఆత్మ అని అనేక రకాల ఆత్మలు లేవు. అందరికీ ఆత్మ ఒక్కటే. అందరికీ భగవంతుడు ఒక్కడే. దానినే ఆది శంకరాచార్యులవారు వివరించారు.
ప్రపంచంలో మానవులందరు అనేక రకాలుగా జీవిస్తున్నారు. అందులో కొందరు మేము పాపులం, దొంగలం, హంతకులం, స్మగ్లర్లం అంటూ పలురకాలుగా చెపుతూ మా మనస్సు క్షణం కూడా నిలువదు, మేము ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవటానికి తగిన వాళ్ళం కాదు, మా మనోమాలిన్యాలు, మా శరీరమాలిన్యాలు తొలగిపోయాకే ఆత్మజ్ఞానాన్ని తీసుకొని ఆత్మ మార్గంలో జీవిస్తాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆలోచనా విధానమే చాలా తప్పు. అది ఎన్నటికీ నెరవేరేది కాదు. పెళ్ళి కుదిరితేగాని పిచ్చి కుదరడు, పిచ్చి కుదిరితే గాని పెళ్ళి కుదరదు అనే సామెత వంటిదిగా ఉంటుంది ఆ ఆలోచనా విధానం. ఆత్మను గురించి తెలిసిన మరు క్షణం గురువును ఆశ్రయించి, జ్ఞానాన్ని స్వీకరించి, ప్రతిరోజు సాధనచేస్తుంటేనే క్రమేపి, ఒక్కొక్క మాలిన్యం తొలగిపోతుంటుంది. సాధనలో ఆత్మజ్ఞానియైన మానవుడు నిజమైన మానవుడుగా రూపుదిద్దుకొంటాడు. పుట్టినప్పటినుంచి ఆవరించి ఉన్న అనేకమైన అజ్ఞానపు తొడుగులు సాధకునికి ధ్యానంలో తొలగిపోతుంటాయి. కాన ఆత్మ భావనతో అందరూ ఒక్కటేనని, ఆత్మజ్ఞానాన్ని స్వీకరించటానికి పిచ్చివాళ్ళు తప్ప అందరూ అర్హులేనని, తెలుసుకోవాలి. ఎవరు దుఃఖనివృత్తిని పొందాలను కొంటున్నారో, ఎవరు అశాంతిని పారదోలాలనుకొంటున్నారో, ఎవరు అసంతృప్తినుంచి సంతృప్తి దరిచేరాలనుకొంటున్నారో వాళ్ళందరు ఆత్మజ్ఞానాన్ని స్వీకరించి వాటిని అనుభవించండి అనే ఆదిశంకరులవారు నీటిని ఉపమానంగా తీసుకొని వివరించారు.
ఆదిశంకరుల వారు కన్యాకుమారినుంచి కాశ్మీరు వరకు వెళ్లి మళ్ళీ తిరిగి కన్యాకుమారి చేరేవరకు భారతదేశంలో ఉన్న అనేక ఆశ్రమాలను దర్శించారు. ఆ ఆశ్రమవాసులకు ఆయన అఖండమైన ఆత్మను గురించి, అద్వైత మార్గాన్ని గురించి బోధించారు. రకరకాల ఆశ్రమాలను రకరకాల దృక్పథాలతో ఉన్నటువంటి వారిని చూశారు. వాళ్ళందరిని ఆత్మ జ్ఞానపరులుగా చేసి జ్ఞాన మార్గంలో నడిచేటట్లు చేసి, జ్ఞానాన్ని ఇచ్చి సాధన చేయించి అనుభూతిని పొందేటట్లు చేశారు. ఆవిధంగా అనేక రకాలైన భగవద్భక్తుల్ని చూశారు కాన ఆత్మకు కూడా పలు ఆశ్రమాలలో పలురకాలైన ఆరోపణలు జరుగుతున్నాయి అని చెప్పారు. సగుణం నుంచి నిర్గుణానికి, సాకారం నుంచి నిరాకారానికి, ద్వైతం నుంచి అద్వైతానికి ఆశ్రమవాసుల్ని మార్చటంలో వచ్చిన అవాంతరాలను దర్శించబట్టే శంకరాచార్యులవారు ఆశ్రమాలలో ఆత్మకు అనేక ఆరోపణలు ఉన్నాయి అని చెప్పారు. ఒకసారి శంకరుల వారు ఆధ్యాత్మిక బోధ చేస్తు ఉండగా ఆయన మీదకు ఏనుగును తోలారట. ఆయన పలాయనం చిత్తగించగా స్వామీ గజం మిథ్య, గజం మిథ్య అని హేళన చేశారట. దానికి శంకరులవారు జగం మిథ్య, గజం మిథ్య, పలాయనం మిథ్య అని హేళన చేయదలచిన వారి నోరు మూయించారట. నీకు గజం కనిపిస్తుంది, జగం కనిపిస్తుంది కనుక పలాయనం కనిపిస్తుంది అని అన్నారు. అంటే సాధకునకు సాధనకు పూర్వం, సాధనకు తర్వాత కూడా సృష్టి అంతా ఉంది. సాధనలోనే జగం అంతా మిథ్య అయి భాసించింది. సాధనలో లేని సమయంలో కూడా రమణ మహర్షి వంటి వారు సర్వత్ర ఆత్మనే దర్శించగలరు కాన అటువంటి వారికి జగం మిథ్యే అవుతుంది. అది తెలియక సామాన్యులు ఆదిశంకరులను హేళన చేశారు. శంకరులవారు బ్రహ్మసత్యం, జగం మిథ్య, బ్రహ్మ సర్వస్వం అన్నారు. జగం మిథ్యే కాని సర్వత్ర బ్రహ్మం ఉంది అని చెప్పారు. మిథ్యే అని ప్రకృతిని తేలిక భావంతో చూడమని చెప్పలేదు. జగం అంతా మిథ్యే అని తెలిసి జీవిస్తూ ఉండమన్నారు. అయినప్పటికి ప్రతిదానిలోను బ్రహ్మ ఉన్నాడు అని బ్రహ్మ భావంతో జీవించమన్నారు. రామకృష్ణ పరమహంసను ఒక భక్తుడు పులిని కూడా బ్రహ్మం అని చూడమంటారా అని అడిగాడట. తప్పకుండా అట్లాగే చూడమని చెప్పి, దూరం నుంచే దానికి నమస్కారం చేసి తప్పుకోమన్నారట. అద్వైత మార్గంలో సర్వత్ర పరమేశ్వర భావంతో ఆలోచించేటప్పుడు జీవించేటప్పుడు, సామాన్యులకు అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. సాధకునికి కూడా అటువంటివే అనేకం ఎదురవుతుంటాయి. కాని సాధకుడు నిరంతరం సాధనలో అంతర్ముఖం అయి నిజమైన తన భగవంతుని తాను అర్చన చేయటం వల్ల, తనను తాను తెలుసుకొని అనుభూతిని పొందటం వల్ల, తనను తాను ప్రతి రోజూ కలుసుకొంటూ ఉండటం వల్ల, సాధకుడే శుద్ధ చైతన్యమూ, ఆత్మా, దైవం అయి ఉన్నాడు అని తెలుసుకోవటం వల్ల, శాంతి సుఖాలు అనుభవిస్తూ ఉండటం వల్ల, గురువుల మాటలను నమ్మి, విశ్వాసంతో, శ్రద్ధతో లక్ష్యంకోసం జీవిస్తూ ఉండగలుగుతున్నాడు. అటువంటి సాధన లేనివారు మాటలలో, తర్కంలో నిజాన్ని అర్థం చేసుకోలేక ఆరోపణలతో భ్రాంతికి లోనవుతున్నారు. ఆయా ఆశ్రమాల్లో ఉన్న ఆశ్రమ వాసులు కూడా నిరంతరం సాధనలో ఉన్నారే కాని సాధన మార్గంలో వ్యత్యాసం ఉంది. అన్ని మార్గాల్లోను, వారికి చివరికి అహంకారం మిగులుతుంది. ఆత్మ మార్గంలో మాత్రం అహంకారం సంపూర్ణంగా నశిస్తుంది. ఆ అహంకారం నశించిన నాడే అద్వైతం అవగతం అవుతుంది. దానికి కులం, జాతి, ఆశ్రమం అనేవి ఏవీ లేవు అని అనుభవానికి వస్తుంది.
12 పంచీకృత మహాభూత
సంభవం కర్మసంచితం
శరీరం సుఖదుఃఖానాం
భోగాయతన ముచ్యతే || 12
NRPLRiøxqsLiÀÁ»R½Li = పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి, పంచీకృతం = పంచీకరణం చెందుట ద్వారా, మహాభూత సంభవం = పంచమహాభూతాలైన ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి నుండి ఏ తెంచిన, శరీరం = శరీరం (స్థూల శరీరం అని పిలువబడుతూ), సుఖదుఃఖానాం = సుఖదుఃఖాలకు, భోగ + ఆయతనం = అనుభవించే క్షేత్రం, ఉచ్యతే = చెబుతారు.
తా|| పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి పంచీకరణం చెందుట ద్వారా పంచమహాభూతాల నుండి ఏతెంచిన స్థూల శరీరం సుఖదుఃఖాలకు అనుభవించే క్షేత్రంగా ఉందని చెబుతారు.
వివరణ :- శరీరం, తల, వక్షం, వీపు, కాళ్ళు, చేతులు, తొడలు వంటి అంగాలు, ఉపాంగాలు కలిగి ఉంది. ఇది జడపదార్థాలు అయిన చర్మం, రక్తం, నరాలు, ఎముకలు, మూలుగ వంటి పదార్థాలతో కూడి ఉంది. ఇది ఆహార సారంతోనే నిర్మింపబడుతూ ఉంది. అన్నంతోనే జీవిస్తుంది. అన్నం లేకపోతే నశిస్తుంది. కాన ఇది ''అన్నమయ కోశాని'' కి చెంది ఉంది. మాయ కప్పబడిన ఆత్మ అయిన జీవుడు ఈ శరీరానికి ఆధారమై ఉన్నాడు. ఇది అహంకార నిలయమై ఉంది. నేను నాది అనే భ్రమతో, అహంకార మమకారాలతో జీవిస్తూ ఉంది. దీన్ని సరిగా అర్థం చేసుకోవటానికి శరీరంలో ఉన్న వివిధ రకాలైన భాగాలు, అవి పనిచేసే విధానం, అవి లోక జ్ఞానాన్ని గ్రహించే మార్గాలు వంటివి జాగ్రత్తగా పరిశీలించి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా వాటన్నిటినీ తెలుసుకొన్ననాడు ఆ శరీరం అనేది ఒక శుద్ధ చైతన్యశక్తి ఆధారపడి నడుస్తుంది అని తెలుస్తుంది. ఈ శరీరాన్ని (1) స్థూల శరీరం (2) సూక్ష్మ శరీరం (3) కారణ శరీరం అని మూడు భాగాలుగా విభజించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. ఈ శ్లోకంలో స్థూల శరీరాన్ని గురించి వివరిస్తున్నారు.
శరీరానికి ఆరు విధాలైన వికారాలు ఉన్నాయి. అవి ఏవి అంటే అదిపుడుతుంది, ఉంటుంది, పెరుగుతుంది, మార్పు చెందుతుంది, కృశిస్తుంది, నశిస్తుంది. కావున దీన్ని ''షడ్భావ వికారం'' కలది అని అంటారు. మాయకమ్మిన ఆత్మ అయిన జీవుడు శబ్ద స్పర్శ రూప గంధాలతో కూడి ఉన్న ఇంద్రియ విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు. అందువల్ల శరీరాన్ని ''స్థూల భోగాయతనం'' అని కూడా అంటారు. ఈ స్థూల శరీరం భోగసాధనం కనుక కులం, మతం, జాతి, ఆశ్రమం వంటి వాటిని అనుసరించి సాంఘిక వ్యత్యాసాలు, నిందాస్తుతులు, సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటుంది. రోగాలు, బాధలు కూడా ఇదే అనుభవిస్తూ ఉంటుంది. ఇవి ఏవీ కూడా ఆత్మకు అంటవు.
ఈ శరీరాన్ని ''మల మూత్ర భాండం'' అని అంటారు. దీనిలో ఉన్న నవరంధ్రాల నుంచి కూడా వ్యర్థపదార్ధాలే బహిర్గతం అవుతాయి. కళ్ళనుంచి పుసి, చెవునుంచి గుబిలి, ముక్కునుంచి చీమిడి, నోటినుంచి కళ్ళి పాచి, శిశ్నం నుంచి మూత్రం, గుదం నుంచి మలం విసర్జింపబడుతూ ఉంటాయి. రోమకూపాలు అన్నిటి నుంచి కూడా చెమట బహిర్గతం అవుతూ ఉంటుంది. ఈ విధంగా శరీరం నుంచి అన్నీ కూడా ఏహ్యమైనవే విసర్జింపబడుతూ ఉండటం వల్ల దీన్ని మలమూత్రభాండం అన్నారు. మానవుడు ఎంతో ప్రేమతో, అనురాగంతో పోషించుకొంటూ జాగ్రత్తగా కాపాడుకొనే దేహంమీద మానవునికి అసహ్యమైన భావన కలిగించటానికే దీన్ని ''మలమూత్రభాండం''అన్నారు. మలమూత్రభాండాన్ని ఎవరూ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు కదా !
శరీరం పంచమహాభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే వాటి సూక్ష్మ రూపాలచేత ఏర్పడుతూ ఉంది. పంచమహాభూతాలను తన్మాత్రలు అంటారు. అంటే తత్ అనగ అది, మాత్రము అనగా కొలిచేది అని అర్థం. అంటే అది ఒక్కటే అయి ఉంది అని అర్థం. ఆ తన్మాత్రలు అప్పుడు తమ ప్రత్యేకమైన శుద్ధస్థితిలో ఉంటాయి. తర్వాత అవి పంచీకరణంచెందుతాయి. ప్రతి తన్మాత్ర రెండుగా చీలి ఒక అర్థభాగం ఏ వికారం చెందకుండా నిలుస్తుంది. మిగిలిన సగభాగం నాలుగు భాగాలుగా చీలుతుంది. అంటే ప్రతి ఒక్క తన్మాత్రలోని సగభాగం, మిగిలిన తన్మాత్రలలో ఒక్కొక్క దాని నుండి ఎనిమిదవ వంతు చొప్పున గ్రహించి పూర్ణమయిన తన్మాత్ర అంతటి రూపం ధరిస్తూ ఉంది. దీనినే 'పంచీకరణం' చెందటం అంటారు. అంటే పంచమహాభూతాల సూక్ష్మాంగాలుగా మారటాన్నే పంచీకరణం అంటున్నారు. శరీరంలోని అవయవాలు ఈ విధంగా పంచీకరణం చెందినవాటి చేతనే ఏర్పడుతూ ఉన్నాయి. అవి అదే పాళ్ళలో ఉన్నాయి అని ఎట్లా చూపించటానికి వీలు అవుతుందో తెలియదు. అయినా ప్రాచీన కాలంనుంచి గురుపరంపరగా అదే విధంగా చెప్పబడుతూ ఉన్నాయి. అవి ఈ క్రింది పట్టికలో చూపబడుతూ ఉన్నాయి.
____________________________________________
1) పంచీకృతమైన ఆకాశం = 1/2 ఆకాశం + 1/8 గాలి + 1/8 అగ్ని +
= చెవి 1/8 నీరు + 1/8 భూమి
2) పంచీకృతమైన గాలి = 1/2 గాలి + 1/8 ఆకాశం + 1/8 అగ్ని +
= చర్మం 1/8 నీరు + 1/8 భూమి
3) పంచీకృతమైన అగ్ని = 1/2 అగ్ని + 1/8 ఆకాశం + 1/8 గాలి +
= కన్ను 1/8 నీరు + 1/8 భూమి
4) పంచీకృతమైన నీరు = 1/2 నీరు + 1/8 ఆకాశం + 1/8 గాలి +
= నాలుక 1/8 అగ్ని + 1/8 భూమి
5) పంచీకృతమైన భూమి = 1/2 భూమి + 1/8 ఆకాశం + 1/8 గాలి +
= ముక్కు 1/8 అగ్ని + 1/8 నీరు
____________________________________________
ఇక ''పంచ మహాభూతాల్ని'' గురించి ఆలోచించినట్లు అయితే సహజంగా క్రింద మనకు కనిపిస్తున్న భూమినుంచే మిగిలిన భూతాలు ఉత్పన్నం అయినాయి అని భావించటానికి అనుకూలంగా ప్రకృతి కనిపిస్తుంటుంది. కాని ఈ పంచమహాభూతాలు అట్లా ఉద్భవించలేదు. కార్యానికి ముందు కారణం ఉంటుంది కదా ! దానికి అనుకూలంగా అనంతము, ఆనందస్వరూపము అయిన ఆత్మ నుండి ప్రకృతి ప్రథమ వికారమైన ఆకాశం పుట్టింది. దాని సహజగుణము శబ్ధము. దాని నుండి రెండవ ప్రకృతి వికారమయిన వాయువు పుట్టింది దాని సహజ గుణము స్పర్శ. ఆ వాయువు నుండి తృతీయ ప్రకృతి వికారమయిన అగ్ని పుట్టింది. ఆ అగ్ని సహజ గుణము రూపము. దాని నుండి నాల్గవ ప్రకృతి వికారమయిన జలము పుట్టింది- దాని సహజగుణము రసము. జలము నుండి భూమి పుట్టింది. దాని సహజ గుణము గంధము (వాసన). ఈ విధంగా పంచమహా భూతముల పుట్టుకతో సృష్టి ప్రారంభమయింది. వీటిలో ప్రతి భూతమునకు దాని సహజగుణముతో పాటు ఆకాశాది పూర్వభూతముల గుణాలు కూడా సంక్రమించాయి. అది ఈ క్రింది పట్టికతో వివరింపబడుతూ ఉంది.
ఆత్మ gనిత్యానంద స్వరూపం
$
ఆకాశం gశబ్దం
$
వాయువు gశబ్దం, స్పర్శ
$
అగ్ని gశబ్దం, స్పర్శ, రూపం
$
నీరు gశబ్దం, స్పర్శ, రూపం, రుచి
$
భూమి gశబ్దం, స్పర్శ, రూపం, రుచి, గంధం.
1) శబ్దం - చెవులు - ఉల్లం - ఆకాశతత్త్వం - కపాలం నుంచి కనుబొమల వరకు
2) స్పర్శ - చర్మం - మనస్సు - వాయుతత్త్వం - బొమముడి దగ్గరనుంచి గొంతు వరకు
3) రూపం - కళ్ళు - బుద్ధి - అగ్ని తత్త్వం - గొంతుకనుండి గుండె వరకు
4) రసం - నాలుక - చిత్తం - జల తత్త్వం - గుండెనుండి నాభి వరకు
5) గంధం - ముక్కు - అహంకారం - పృథ్వితత్త్వం - నాభినుంచి మూలాధారం వరకు
ఆత్మజ్ఞానాన్ని సాధనచేయు వారికి రమణ మహర్షి అంతఃకరణాన్ని అయిదుగా విభజించి వాటిని అర్థం చేసుకోవటానికి వీలుగా ఉల్లం అంటే శుద్ధ మనస్సు లేక తలంపులు లేని మనస్సు అనే దాన్ని చేర్చి పంచతత్త్వాలను వివరించిన విధానాన్ని తన్మాత్రలతో జతచేయటం జరిగింది.
ఆకాశాది సూక్ష్మ భూతాలు కలిసి క్రమేపి స్థూలరూపాలయి స్థూల శరీరానికి హేతువు అవుతున్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు పంచీకరణం చెందని సూక్ష్మాంశాల వల్లనే ఏర్పడుతున్నాయి.
మానవుడు మరణించే ముందుకూడా పంచమహాభూతాలు ఏ క్రమంలో భూమి మీదకు వచ్చాయో అదే క్రమంలో మానవుని నుంచి నిష్ర్కమిస్తాయి. ముందు ఆతడు చెప్పేమాట వినిపించదు. ఆకాశం లోపిస్తూ ఉంటుంది. తర్వాత అతని నాడి చూస్తుంటే ఆ నాడి అందదు. ముక్కు వద్ద వేలు పెట్టి చూస్తే గాలి ఆడటం లేదని తెలుస్తుంది. వాయువు లోపిస్తుంటుంది. ఆ తర్వాత శరీరం చల్లబడుతుంటుంది. దానికిగాను ఆయుర్వేద వైద్యులు చింతామణి వేస్తారు. పసుపు వెల్లుల్లి నూరిన ముద్దను కాళ్ళకు రుద్దుతారు. అగ్ని లోపిస్తుంటుంది. ఆ తర్వాత మరణిస్తాడు. శవాన్ని తగులబెట్టినా పాతిపెట్టినా నీటిలోను భూమిలోను కలిసిపోతుంది.
కర్మ సంచితం : - మానవులందరి చావు పుట్టుకలు ఒకేలా ఉన్నా అవి ''కర్మసంచితం'' అని ఎందుకు అన్నారు. ఈ గీత కర్మ సంచితాన్ని ఎట్లా తెలుసుకోగలుగుతాం? అంటే అందరి దేహాలు ఒకేలా ఉన్నా రూపాల్లో భేదాలు కనిపిస్తున్నాయి. ప్రవర్తనలో భేదాలు కనిపిస్తున్నాయి. ఒకే విషయాన్ని అందరూ ఒకేలా దర్శించినా - అనుభూతులు పొందటంలో తారతమ్యాలు కనిపిస్తున్నాయి. కాన అందరిలో చైతన్యం ఒకేలా ప్రకాశిస్తున్నా సూక్ష్మ శరీరాల్లో గత కర్మానుసారం వ్యత్యాసం ఉండటం వల్ల అట్లా జరుగుతుంది అని భావిస్తున్నారు.
''సుఖదుఃఖానాం భోగాయతనం'' - జీవుడు గత జన్మలో పొందిన అనుభూతులు, ఆచరించిన కర్మలు ''వాసన''లుగా ఉన్న సూక్ష్మశరీరంలో స్థూల శరీరాన్ని పొందుతున్నాడు. అప్పుడు మాయకప్పిన జీవుడు శరీరంతో తాదాత్మ్యం చెందటం వల్ల జ్ఞానేంద్రియాలను అనుసరించి సుఖదుఃఖాలు అనుభవించే క్షేత్రంగా, స్థూల శరీరం సుఖదుఃఖాలు అనుభవించే అనుభవక్షేత్రంగా అవుతుంది. జీవుడు స్థూల శరీరంతో, సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందటం వల్ల అనుభూతులు, అనుభవాలు అన్నీ స్థూల శరీరానికి కలుగుతున్నాయే కాని అవేవీ ఆత్మకు కలగటంలేదు. ఆత్మ సాక్షిమాత్రంగా ఉంది. ఆద్దంలో ఉన్న ప్రతిబింబానికి కలిగిన బాధలు, వికారాలు, సుఖాలు బింబానికి ఎట్లా అంటటం లేదో అట్లాగే అహంకార రూపుడైన జీవునికి పరిమితమైన బంధాలు, బాధలు ఆత్మకు అంటటంలేదు. అద్దానికి కళాయి సరిగా లేకపోయినా, అద్దం ఎత్తుపల్లాలుగా ఉన్నా ప్రతిబింబం రకరకాలుగా కనిపిస్తుంది. అవేవీ బింబానికి అంటవు. ఆ విధంగానే ఆత్మకు ఏవీ అంటవు.
''ఆయతనం'' అంటే ఇల్లు. ఇంటి యజమాని బయట ప్రపంచంలో తనకు కావలసినవి అన్నీ సంపాదించుకొని ఇంటిలో అనుభవిస్తుంటాడు. అదే విధంగా మాయకమ్మిన ఆత్మ అయిన జీవుడు ఇంద్రియ సాహచర్యంతో బయటి ప్రపంచంలోని వస్తువులతో సంబంధం పెట్టుకొంటాడు. వాటి వల్ల వచ్చిన సుఖదుఃఖాలు శరీరం అనే గృహంలో అనుభవిస్తుంటాడు. ఆ విధంగా స్థూల శరీరం సుఖదుఃఖాలు అనుభవించే క్షేత్రంగా ఉంది.
13. పంచప్రాణ మనోబుద్ధిః
దశేంద్రియ సమన్వితం
అపంచీకృత భూతోత్థం
సూక్ష్మాంగం భోగసాధనం || 13
xmsLi¿RÁúFyßá = ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం సమానం అనే పేరుల చేత పిలువబడుతూ ఉన్న పంచ ప్రాణాలు అయిన అయిదు విధాలైన పంచప్రాణాలు, మనోబుద్ధిః = మనస్సు బుద్ధి, దశ + ఇంద్రియః = జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి రుచి రూసే నాలుక చర్మం కలిసి అయిదు కర్మేంద్రియాలైన కాళ్ళుచేతులు మాట్లాడే నాలుక ఒకటికి వెళ్ళేది రెంటికి వెళ్ళేది అయిన కర్మేంద్రియాలు అయిదు, సమన్వితం = కలిసి, అపంచీకృతం = పంచీకరణం జరుగకుండా ఉన్నటువంటి, భూత = ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి యొక్క సూక్ష్మ భూతాల చేత, ఉత్థం = ఏర్పడిన, సూక్ష్మాంగం = సూక్ష్మదేహం, భోగసాధనం = సుఖదుఃఖాలు అనుభవించటానికి వీలైన పనిముట్టు అని, ఉచ్యతే = చెప్పబడుతూ ఉంది.
తా|| పంచప్రాణాలు, మనోబుద్ధులతోకూడి ఉన్న అంతఃకరణం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలిసి పంచీకరణం చెందని తన్మాత్రలైన పంచసూక్ష్మ భూతాల చేత ఏర్పడిన సూక్ష్మ శరీరం భోగసాధనం అయి ఉంది అని చెప్పబడుతుంది.
వివరణ :- సూక్ష్మశరీరం (Subtle body)సూక్ష్మ భూతాలైన తన్మాత్రల వలన ఏర్పడుతూ ఉంది. స్థూల శరీరం (gross body) పంచీకరణం చెందిన సూక్ష్మభూతాల వల్ల ఏర్పడుతుంది. స్థూల శరీరంలో తల, వక్షం, వీపు, కాళ్ళు, చేతులు తొడలు వంటి అంగాలు, ఉపాంగాలు కలిగి ఉన్నాయి అని వివేక చూడామణిలో చెప్పారు. ఇవి పంచీకరణం చెంది రూపొందాయి అని చెప్పారు. ఇప్పుడు సూక్ష్మ శరీరం పంచీకరణం చెందని తన్మాత్రల చేత ఏర్పడింది అని చెప్పారు. అయితే ఈ మనోబుద్ధులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పంచీకరణం చెందకుండా - పంచీకరణం చెందిన శరీరంలో ఉన్నాయి అని వివరించినట్లు అయింది. అయితే కాళ్ళు చేతులు అనేవి పంచీకరణం చెందిన చోట పంచీకరణం చెందనిచోట కూడా చెప్పటం వల్ల రెండుచోట్ల చెప్పినట్లు అయింది. వీటిని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. అనుభూతులు పొందటంలో కల వ్యత్యాసాన్ని తెలుసుకోవటానికే ఈ పంచీకరణం చెందటం, పంచీకరణం చెందక పోవటం అనేది వివరిస్తూ ఉన్నారు.
సూక్ష్మ శరీరం అంటే వాసనల సముదాయంతో కూడి ఉన్న పాముల పుట్ట. పూర్వజన్మనుంచి ఈ జన్మకు మనస్సు, జ్ఞానేంద్రియాలు అనే ఆరింటి ద్వారా జీవునికి సంక్రమించిన పూర్వజన్మానుభూతులే వాసనలు అయి ఉన్నాయి. అందరిలోనూ ఒకే జీవచైతన్యం ఉన్నా ఒక విషయాన్ని చూసినప్పుడు అందరు ఒకేలా అనుభూతిని పొందటం లేదు. పూర్వ జన్మానుభూతుల వల్లనే ఆ విధంగా జరుగుతూ ఉంది అని భావన చేస్తూ ఉన్నారు. అందరిలోను ఒకే శుద్ధ చైతన్యం ఉన్నా కర్మాచరణలో దీనివల్లనే వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. సూక్ష్మశరీరం అందించిన అనుభవాలు, అనుభూతులే స్థూలశరీరం అనుభవిస్తూ ఉంది. కోటి రూపాయలు బ్యాంకులో నిల్వ చేయ్యాలనుకొన్నవాడు అనుకొన్న లక్ష్యం పూర్తి చెయ్యగానే ఎనలేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.సంతోషంతో, తన్మయత్వంతో మునిగిపోతున్నాడు. ఆ ఆనందంలో ఎక్కడలేని శాంతిసౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నాడు. కాన ఆనందం శరీరంలోనే ఉంది కాని కోటిరూపాయల్లోను, బ్యాంకులోను లేదు. ఆనందం మానవుని లోపల ఉంది. ఆ తృప్తి లోపల ఉంది. కాన పాధకుడు ఆత్మానందం అనుభవించటానికి, కర్మరాహిత్యం పొందటానికి ఆత్మజ్ఞానంతో జీవించాలి. మానవునికి శాంతిసౌఖ్యాలు-ఈ ఆత్మమార్గంలోనే ఉన్నాయి. మనం ఏ విత్తనాలు చల్లితే ఆ పంటే పండుతుంది కదా ! చిన్న మొక్క అయినా పెంచి పోషిస్తే మ్రానయినాక మదించిన ఏనుగును కూడా కట్టేయటానికి సమర్థం అవుతుంది. పూర్వజన్మ వాసనలతోను, దుష్టసాంగత్యాలతోను, మదించిన మదగజం వంటి మనస్సును ఆత్మజ్ఞానం అనేది సాధనతో బంధిస్తుంది.
పంచప్రాణాలు :- శ్రీ శృంగేరీ పీఠాధిపతులైన చంద్రశేఖర భారతీస్వాములవారు పంచప్రాణాలు అంటే శరీరం లోపల సంచరిస్తూ ఉన్న ప్రాణమే వేరువేరుగా అవుతుంది అని ఈ క్రింది విధంగా వివరించారు. (1) ''ముఖ నాసికల నుండి ప్రవేశ నిర్గమనములు చేయుచుండుట ప్రాణనము. (2) మలాదులను క్రిందికి నెట్టుట అపననము. (3) తిని త్రాగిన అన్న - రసాదులు నాడీ ముఖమునందు వ్యాపించునట్లు చేయుట వ్యాననము. (4) వమన కాలమున పైకి తీసుకుని పోవుట ఉదాననము. (5) భుజించిన అన్న రసాదులను అరిగించుటకై జఠరాగ్నిని ప్రేరేపించుట సమాననము'' అని ప్రాణము చేయు అయిదు వృత్తులు అయి ఉన్నాయి అని చెప్పారు.
శ్రీ మళయాళ స్వాములవారి అంతే వాసి అయిన శివచరణముగారు ''ప్రాణ వాయువు ఒకటియే వ్యాపార భేదము చేత (1) హృదయ స్థానము నుండి ఉచ్ఛ్వాస నిశ్శ్వాస రూప వ్యాపారముచే ప్రాణమనియు (2) పాయు స్థానమందుండి మల మూత్ర విసర్జనరూప వ్యాపారముచే అపానమనియు (3) శరీరమంతటను వ్యాపించి యుండునదియై ప్రాణాపాన సంచారోత్పాదక వ్యాపారముచే వ్యానమనియు (4) కంఠస్థాన మందుండి వాయు కర్షణ ఆకర్షణ రూప వ్యాపారముచే ఉదానమనియు (5) నాభిప్రదేశమందుండి భుక్తపీతాన్న జలములను సమీకరణ రూప వ్యాపారముచే సమానము' అనియు అయిదు విధములుగా వ్యవహరింపబడుచున్నది అని చెప్పారు. అయినా ముఖ్య ప్రాణం ఆత్మే అని ఉపనిషత్తులు చెప్పుతున్నాయి అని కూడా చెప్పారు.
స్వామి చిన్మయానందగారు సహజంగానే ఆధునిక సైన్సుతో విషయాన్ని మేళవించి విచారించు తర్కబుద్ధి, ఉన్నత దృక్పథం వంటి ఉన్నత భావాలు కలిగి ఉన్నారు. కావున ఆయన వివరించిన విధానాన్ని సక్రమంగా వివేచనతో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారు ఈ క్రింది విధంగా వివరించారు. ''ఈ శ్లోకంలో ప్రాణం అంటే జీవకళఅని. ఊపిరి పీల్చుట విడుచుట కాదని దేహంలో అది చేస్తున్న వివిధ ప్రాణ వ్యవహారాలని చెప్పారు (1) ప్రాణం అంటే జ్ఞానేంద్రియ వ్యవహారాలను నియమించు, రక్షించు శక్తి. ఈశక్తి వల్లనే, జ్ఞానేంద్రియాలు చైతన్యంతో వ్యవహరించగలుగుతూ ఉన్నాయి. (2) అపానం -ఆరోగ్యమగు దేహంనుచి విసర్జం చేయించు శక్తి. దేహానికి అనవసరం, హానికరం అగు విషయాలను వెలుపలికి తొలగించు శక్తి. (3) వ్యానం - జీర్ణకోశమున కల శక్తి ఆహారాన్ని, జీర్ణించి దేహానికి ఉపయోగపడేటట్లు చేసే శక్తి. (4) సమానం - జీర్ణమయిన ఆహారాన్ని, న్యాయరీతి, అవసర నిమిత్తాలకు అనువుగా దేహం ఆద్యంతం పంచిపెట్టగల శక్తి, చేతులు పనిచేయుచుండిన వాటికి ఆహారం ఎక్కువ పోవును. (5) ఉదానం ఉన్నత ఆశయాల్ని దృష్టించి, పేరుకొని ఉండు దురభిమానాలు పైకి ఎగసి, నూతన సంపర్కాల రీతి అనుభవింపగలుగుట''అని వివరించారు. ఏకైక జీవచైతన్యం అయిదు వేరువేరు విధాలుగా ప్రాణవ్యవహారం నడుపుతూ ఉంది అన్నారు. ''జ్ఞానేంద్రియంతో మనస్సు స్పర్శింపక పోయిన ఎడల ఎట్టి స్పర్శయు అనుభవానికిరాదు. నిద్రిస్తూ ఉన్నవాడు కాని, దీర్ఘాలోచన చేయుచున్నవాడు కాని తన ప్రక్కన నిలిచి ఉన్న వ్యక్తిని కనుగొనుట లేదు. ఎందుకనగా అతని మనస్సు వ్యాపించి అతని నేత్రేంద్రియంతో సంపర్కం పొందుట లేదు'' అని వివరించారు.
ఈ ముగ్గురు చెప్పిందాన్ని పరిశీలించి చూసిన తర్వాత ఇప్పుడు సహజంగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే మనస్సుకి ఇంద్రియాలు అన్నీ ఆయుధాలు అయి ఉన్నాయి. మనస్సు తోడు లేకపోతే ఇంద్రియాలు ఏమీ పనిచెయ్యలేవు. మనస్సు ఇంద్రియాలు అన్నిటితో కలిసి పనిచేస్తున్నాయి. మనస్సు శరీరంలో ఉన్న Remoter. ఆత్మ మనస్సుకు శక్తిని ఇస్తే మనస్సే రారాజై పని చేస్తుంది. మనస్సుని సక్రమంగా అర్థం చేసుకోవటం, అన్ని అవయవాలను సక్రమంగా వివరించటం అంత తేలికైన పనికాదు. వాస్తవాలు అనేవి అన్నిటి కన్నా దృఢం అయినాయి. అవి ఏవీ అంత తేలిగ్గా కొరుకుడు పడవు. గురుజ్ఞానం, గురుకృప మాత్రమే సాధకుని ఒడ్డుకు చేర్చగలుగుతాయి. గురువు మీద శిష్యునికి విశ్వాసం ఉంటే చాలు సాధకునికి సాధనలో అన్నీ ఆత్మలో లీనం అవుతాయి.
మానవుని శరీరంలో ఆత్మ రాజయితే మనస్సు మంత్రి లేక సైన్యాధ్యక్షుడు అయి నడుస్తూ ఉన్నాడు. ఆత్మరాజయినప్పటికి సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండటం వల్ల మంత్రే స్వతంత్రించి నడుస్తూ అహంకారంతో ప్రవర్తించటం జరుగుతుంది. మనస్సనే మంత్రి రాజును మించిపోయి నడుస్తూ రాజును బంధించాలని చూస్తూ ఉన్నాడు. రాజే తన రాజ్యాన్ని పాలించుకోవటానికి పూనుకొని పనిచేసుకొంటూ వెళ్ళినప్పుడు మంత్రి ఏమీ చెయ్యలేడు. జ్ఞాన మార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చేయటంవల్ల మనస్సు ఆత్మలో లయించవలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై శాంతి సౌఖ్యాలను అందిస్తుంది.
˳ØLRi»R½LiÍÜ[ ª«sVƒ«sNRPV µR…LRi+ƒ«s„sV¿Á[è N_LRiª«s FyLi²R…ª«soÌÁV úxms¼½ ª«sWƒ«sª«so¬s ÍÜ[xmsÌÁ DƒyõLRiV. ª«sWƒ«sª«soÌÁV ª«sVƒ«sxqsV=ƒ«sV |msLiÀÁ x¤¦¦¦XµR…¸R…W¬sõ »]ÌÁgjiLiÀÁ BLiúµj…¸R…WÌÁ»][®ƒs[ ÒÁ„sxqsWò ‡Áz¤¦¦¦LRiVøÅÁV\ÛÍÁ gRi²R…Vxmso»R½W Dƒ«sõxmsöV²R…V µR…VL][ùµ³R…ƒyµR…VÌÁV @ª«so»R½VƒyõLRiV. ÇìØ®ƒs[Liúµj…¸R…WÌÁƒ«sV ‡Áz¤¦¦¦LRiVøÅÁLi NS¬ds¸R…VNRPVLi²y @Li»R½LRiVøÅÁLi ¿Á[zqs A»R½øª«sWLæRiLiÍÜ[ ƒ«s²T…ÀÁƒ«sƒy²R…V xmsLi¿RÁFyLi²R…ª«soÌÁƒ«sV ÍÜ[xmsÌÁNRPV xmsLizmsƒ«sªyÎÏÁ§þ @ª«so»R½VƒyõLRiV. µR…VL][ùµ³R…ƒyµR…VÌÁƒ«sV ƒyaRPƒ«sLi ¿Á[xqsWò Dƒ«sõªyÎÏÁ§þ @ª«so»R½W DƒyõLRiV. µk…¬sõ @LóRiLi¿Á[xqsVN]¬s ÒÁ„sLi¿RÁÈÁLiÍÜ[®ƒs[ Çì؃«sª«sWLæRiLi B„sV²T… DLiµj….
అయితే మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఉంటే ఈ ఇంద్రియాలన్నీ అంతరించిపోతున్నాయా, పనిచెయ్యకుండా వింటున్నాయా అంటే అవి అంత తేలిగ్గా సమసిపోవు. రమణమహర్షిని ఒక పృచ్ఛకుడు ''నేను ధ్యానం చేసేటప్పుడు మామూలు కంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి. వాటివల్ల నేను చెదిరిపోతూ ఉంటాను''అని అడిగాడట. దానికి రమణ భగవానులు''దాన్ని గురించి విచారించకు. లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అట్లా బయటపడటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవలసింది. త్వరత్వరగా బయట పడుతుందన్నమాట. ఇది గురువు అనుగ్రహం వల్ల జరుగుతుంది''అని చెప్పారు. ''గురువుని తలచుకొని ధ్యానిస్తే మామూలు కన్నా ఎక్కువ భావాలే వస్తాయి. మనస్సులోకి. వాటిని గురించి విచారించక్కర్లేదు. అవి అన్నీ అట్లా పైకి రావటం కూడా గురు కటాక్షం వల్లనే' అని రమణ మహర్షి వివరించారు. అంటే ధ్యానమార్గంలో ఆలోచనలనే వాసనల ముసుగులు ఒక్కొక్కటే క్రమక్రమంగా తొలగిపోతున్నాయి అన్నమాట. క్రమక్రమంగా సూక్ష్మశరీరం వాసనారహితం అవుతుంది అన్నమాట.
మనోబుద్ధులు :- శుద్ధ చైతన్యమైన ఆత్మ సహాయం లేకుండా ఏ ఇంద్రియం కూడా పనిచెయ్యలేదు. అన్నిటికి ఆత్మే వెనుక ఉండి ఇంద్రియాలన్నిటిని జీవుని ద్వారా నడిపిస్తూ ఉంది. మాయ కమ్మిన ఆత్మే జీవుడు. ఆజీవుడే నేను నాది అనే అహంకారంతో మమకారాలతో సంచరిస్తూ ఉంటాడు. ఆ అహంకారం అంతఃకరణ చతుష్టయం లోనే ఉంది. శరీరం లోపల పని చేస్తూ ఉన్న మనస్సు నాలుగు విధాలుగా పిలువబడుతూ ఉంది. అంతేకాని అది నాలుగు పనిముట్టులు కాలేదు, ఒకేపనిముట్టు అయిన మనస్సు-మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అది పనిచేసే విధానాన్ని బట్టి, సందర్భాలను అనుసరించి ఆ విధంగా చెప్పుకొంటూ ఉన్నారు. ఈ శ్లోకంలో మనోబుద్ధులు అని రెండింటిని మాత్రమే చెప్పారు. అయినప్పటికి వాటన్నిటినీ అర్థంచేసుకొంటే సాధకునికి సాధనలో అన్ని విధాల ఉపకరిస్తుంది కనుక వాటన్నిటినీ గురించీ తెలుసుకొంటూ ఆయాపనులను అన్నిటిని రెండింటిక్రింద సమన్వయం చేసుకోవాలి.
(1)''మనస్సు'' సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా, కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకల్లోలంగా, ఆశానిరాశలతో, ఊగిసలాడటం అనేటటువంటి వికల్పాలతో నిలుస్తుంది. (2)''బుద్ధి'' ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రాయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణయిస్తుంది, ప్రణాళికలను తయారుచేస్తుంది. (3) తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగుతున్నాను అని భావన చేసేదే ''అహంకారం''. కార్యానికి సంబంధించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడా నేనే చేసుకొన్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడా నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకొంటూ ప్రతి పనిమీదా ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే''అహంకారం''అంటారు. నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది. (4)''చిత్తం'' అంటే తన ప్రయోజనాన్నే చింతిస్తుంది. ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కూడి వాటిని పర్యవేక్షిస్తూ, రాబోయే వాటికి సలహాలను ఇస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళల గుర్తుచేస్తూ, గడచిపోయినసంఘటనలను జ్ఞాపకం పెట్టుకొంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే ''చిత్తం''.
ఇక్కడ స్వామి చిన్మయానందగారు చెప్పిన ఒక విషయాన్ని బాగా ఆలోచించవలసిన అవసరం ఉంది. మానవునిలో ఉన్న ''చైతన్యం మనోబుద్ధ్యహంకారాలపై నర్తిస్తూ ఉంటే చిత్తం అవుతుంది. ఈ మూడింటి చేత పరిమితం కాని స్థితిలో శుద్ధమైన చిత్తమే శుద్ధచైతన్యం అవుతుంది. ఆ శుద్ధ చైతన్యమే ''ఆత్మ'' అని స్వామి చిన్మయానందగారు చెప్పారు.
''చిత్''వేరు, ''చిత్తం''వేరు అని అందరూ అంటూఉంటారు. ''చిత్తం''అనేది మనస్సుకు సంబంధించిన కార్యం మాత్రమే అయి ఉంది. దానికి ''చిత్''కి ఏ మాత్రం సంబంధంలేదు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. స్వామి చిన్మయానందగారు మాత్రం చిత్తం స్వార్థం వీడినప్పుడు, అహంకారాన్ని తొలగించుకొన్నప్పుడు అది శుద్ధచైతన్యమై అలరారుతుందని కాన అది ఆత్మగా రూపొందుతుంది అని అంటున్నారు. మనస్సులో నేను అనేది లేనప్పుడు దాని వ్యక్తిత్వం అనేది తొలగిపోయి ఆత్మలో లీనమైపోతుంది కదా ! మిగిలేది అప్పుడు ఆత్మే కదా ! కాన స్వామి చిన్మయానందగారు చెప్పుతున్నటువంటి వివరణ కూడా ఆలోచించతగియే ఉంది.
శంకరాచార్యులవారు మనోబుద్ధులనే వివరించి మిగిలిన రెండింటిని ఎందుకు విడిచిపెట్టారు అని ఆలోచించినప్పుడు చిత్తం చేస్తున్న పనులు కానీ, అహంకారం కానీ బుద్ధి యొక్క వివిధరూపాలలో లీనం అవుతూ ఉన్నాయి. సహజ సిద్ధమైన మనస్సు యొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ధి నిర్వహించగలుగుతుంది. అందువల్ల ఆది శంకరాచార్యులవారు మనోబుద్ధులనే పేర్కొని మిగిలిన రెండింటిని విడిచిపెట్టారు.
దశ ఇంద్రియాలు :- జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు కలిసి దశ ఇంద్రియాలు అయినాయి. వస్తువులను శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల ద్వారా చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు అనునవి గ్రహిస్తూ ఉన్నాయి. కాన చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు అను వానిని జ్ఞానేంద్రియాలు అంటూ ఉన్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు ఇంద్రియాలు కావు. అవి తన్మాత్రల గుణాలు. అవి వస్తు విషయ జ్ఞానాన్ని అందించగలుగుతున్నాయి. ఆ జ్ఞానానికి అనుకూలంగా కాళ్ళు, చేతులు, నాలుక, గుదం, జననేంద్రియం క్రమంగా నడవటం, ఇతరులకు ఇవ్వటం, ఇతరులనుంచి తీసుకోవటం మాట్లాడటం, మలమూత్రాదుల్ని వదలటం, ఆనందాన్ని అనుభవించటం వంటి పనుల్ని చేస్తూ ఉన్నాయి. కాన వీటిని కర్మేంద్రియాలు అన్నారు.
®ªsVV»R½òLi „dsVµR… xqsWORPQQø aRPLkiLRiLi @LiÛÉÁ[ xqs*Fyõª«sxqósÍÜ[ µk…¬s xqs*˳ت«sLi ËØgS @LóRiLi ¿Á[xqsVN][ª«sÉجsNTP „dsÌÁV NRPVµR…VLRiV»R½VLiµj…. ËØz¤¦¦¦LRiLigS ¿RÁW}qsµy¬sõ ‡ÁÉíÓÁ ª«sWƒ«sª«so¬s úxmsª«sLRiòƒ«sƒ«sV @Li»y NRPW²y C xqsWORPQQøaRPLkiLRi®ªs[V ƒ«s²R…Vxmso»R½W DLiµj… @¬s @¬szmsxqsWò DLiÈÁVLiµj…. ÇØúgRiµR…ª«sxqósÍÜ[ xqósWÌÁ aRPLkiLRiLi»][ NRPÖÁzqsF¡LiVV ƒ«s²R…VxqsVòLiµj…. xqs*Fyõª«sxqós ª«s¿Á[èÈÁxmsöÉÓÁNTP A xqósWÌÁ aRPLkiLRiLi NRPW²y ÍÜ[zmsLiÀÁLiµj…. ª«sÉíÓÁ xqsWORPQQø aRPLkiLRi®ªs[V „sVgjiÖÁ Dƒ«sõÈýÁV NRP¬szmsxqsVòLiµj…. NSƒ«s ÇØúgRiµR…ª«sxqósÍÜ[ ¼d½LRi¬s N][LjiNRPÖÁõ, Ex¤¦¦¦ÖÁõ, ˳تyÖÁõ, ú˳ÏÁª«sVÖÁõ @¬sõÉÓÁ¬ds xqsWORPQQø aRPLkiLRiLi xqs*Fyõª«sxqósÍÜ[ ¼d½LRiVèN]LiÈÁVLiµj…. C „sµ³R…LigS ª«sWƒ«sª«s aRPLkiLRiLiÍÜ[ @ƒ«sV˳ÏÁª«sLi @®ƒs[µy¬sõ @ƒ«sV˳ÏÁ„sLi¿RÁÉجsNTP xqósWÌÁaRPLkiLRiLi ˳ÏÁª«sƒ«sLiÍØgS Dxms¹¸…WgRixms²R…V»R½W DLiÛÉÁ[ xqsWORPQQø aRPLkiLRiLi ryµ³R…ƒ«sLiÍØgS xms¬s¿Á[xqsWò DLiµR…¬s ¾»½ÌÁVxqsWò DLiµj….
14 అనాద్యవిద్యానిర్వాచ్యా
కారణోపాధి రుచ్యతే
ఉపాధి త్రితయా దన్యం
ఆత్మాన మవధారయేత్ || 14
@¬sLS*¿yù = నిర్వచించుటకు వీలుకానిది, అనాది = ఆదిలేనిది (అయిన), కారణ + ఉపాధిః = కారణ శరీరంగా (Body of cause Casual body), ఉచ్యతే = చెప్పబడుతూ ఉంది, ఉపాధి + త్రితయాత్ +అన్యం = స్థూల శరీరం సూక్ష్మశరీరం కారణ శరీరం అనే మూడింటికి వేరుగా, ఆత్మానం = ఆత్మను గూర్చి అవధారయేత్ = తెలుసుకోవలసిఉంది.
తా|| అదిఇట్లాగే ఉంటుంది, అది అట్లాగే ఉంటుంది, అది అట్లాంటిదేను అని వివరించి చెప్పటానికి వీలుకానిది, దాని పుట్టుక ఎక్కడో ఎప్పుడో ఏమిటో ఏమీ తెలుసుకోవటానికి వీలుకానిది అయిన అజ్ఞానాన్నే, అనగా ఆత్మజ్ఞానం తెలియని దాన్నే లేక శరీరమే సత్యం అనే మిథ్యా జ్ఞానాన్నే కారణ శరీరం అంటూ ఉన్నారు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు వేరుగా ఉన్న ఆత్మను తెలుసుకోవలసి ఉంది.
వివరణ :- కారణ శరీరం అంటే ఆత్మజ్ఞానం అనేది తెలియకుండా ఉన్న గాఢ నిద్రాస్థితే అయి ఉంది. ఆ స్థితిలో ఏ ఇంద్రియాలు పని చేయటం లేదు. గుణత్రయంతో నడిచే ఏ పనులూ లేవు. స్థూల సూక్ష్మ శరీరాలకంటే భిన్నమైన దేహం మాత్రమే ఉంది. అది కూడా అవ్యక్తమైన స్థితిలో ఉంది. అది నాకు ఏమీ తెలియదు అనే గాఢ నిద్రాస్థితి అయి ఉంది. అయినప్పటికి ఉన్న సంస్కారాలన్నీ, అనుభవాలన్నీ కూడా ఆ నిద్రాస్థితిలో విత్తనం వంటి రూపంలో మనస్సులో ఉంటూ ఉన్నాయి. మానవుడు నిద్రలేవగానే ఆ బీజస్థితిలో ఉన్నవే మళ్ళీ తిరిగి వచ్చి కళ్ళముందు ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. దాని వల్లే మానవుడు మళ్ళీ మామూలుగా ఈ లోకంలో లీనమయిపోతూ ఉన్నాడు. దీనికి కారణం గాఢనిద్రలో ఏముందో అది - అంటే ఆత్మ - తెలియకపోవటమే. కాన దీన్ని అజ్ఞానం, అవిద్య, మాయ అని వివిధ నామాల చేత పిలుస్తూ ఉన్నారు. ఈ గాఢనిద్రాస్థితిలో మెలకువగా ఉన్నప్పటి అనుభవాలు లేవు. స్వప్నంలో అనుభవించిన అనుభవాలు లేవు. ఏ విషయ జ్ఞానమూలేదు. అంటే ఆత్మజ్ఞానం ఉందా అంటే అది కూడా లేదు. మరి ఏముంది అంటే కేవలం అజ్ఞానం అంటే ఏమీ తెలియని స్థితి ఉంది. మనస్సు పూర్తిగా ఆత్మలో లయించిపోయింది. కనుకే గాఢనిద్రను మానవులందరూ కోరుకుంటారు. నిద్ర సుఖమెరుగదు, ఆకలి రుచి ఎరుగదు అన్నట్లుగా నిద్రవచ్చే సమయానికి మానవుడు ఎట్లా ఉన్నా నిద్రపోతాడు. నిద్రలో తెలియని సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకే నిద్రలేచాక హాయిగా నిద్రపోయాను అంటాడు. నిద్రపట్టకపోతే చాలా బాధగా ఉంది అంటాడు. నిద్రపోవటానికి వీలుకానప్పుడే మానవునికి నిద్రలో ఉన్న సుఖం ఏమిటో బాగా అర్థం అవుతుంది.
జాగ్రత్ప్రపంచంలో జీవుడు స్థూల సూక్ష్మ శరీరాలతో లీనమై ఇంద్రియాల ద్వారా అనుభవాల్ని పొందుతూ ఉన్నాడు. స్వప్న ప్రపంచంలో జీవుడు సూక్ష్మ శరీరంతో లీనమై స్వప్నానుభవాల్ని పొందుతూ ఉన్నాడు. గాఢనిద్రా ప్రపంచంలో జీవుడు విషయప్రపంచం లేకుండా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఏవీ లేకుండా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నాడు. అంటే ఇదే అయోమయమైన స్థితి అని కొందరు అంటూ ఉన్నారు. ఇది అయోమయమైన స్థితి కాదు. ఆ స్థితే జ్ఞానంలో లీనమయి ఉండగా కావాలి ఆ అనుభూతే మెలకువగా ఉండగా పొందాలి. దాన్ని ఆ విధంగా ప్రత్యక్షంగా మానవుడు అనుభవించగలిగిననాడే ఆత్మజ్ఞానం, ఆత్మానందం అనుభ##వైకవేద్యం అవుతుంది. అది జరుగనినాడు ఆత్మజ్ఞానం అనేది వినికిడి జ్ఞానంగానే నిలుస్తుంది. లేదా పుస్తక జ్ఞానంగానే నిలుస్తుంది.
ఈ కారణ శరీరానికి ఆది ఎక్కడ అని ప్రశ్నిస్తే 84 లక్షల జీవరాసుల్ని ఒకేసారి భగవంతుడు సృష్టించాడు అంటారు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా జరిగింది వంటి ప్రశ్నల పరంపరలకు సమాధానాలు ఎవరూ చెప్పలేరు. సృష్టివిధానం ఆ విధంగా భారతదేశంలోనే ఎందుకు జరిగింది? మిగిలిన ప్రపంచం అంతా ఏమయింది? చాతుర్వర్ణ్యం ఈ ఒక్క దేశంలోనే ఎట్లా పుట్టింది? చాతుర్వర్ణ్యం భగవంతుని సృష్టి అయితే ప్రపంచం అంతా ఉండాలి కదా ? అట్లా ఎందుకు జరుగలేదు ? ఇట్లాంటి ప్రశ్నల శరపరంపరలను ఎవ్వరూ ఎదుర్కోవటానికి ఇష్టపడరు. ఇవన్నీ వాద వివాదాలతో కూడి ఉన్నాయి.
ఆత్మ అనేది ఉంటే ప్రారంభం నుంచే మానవునికి తెలియకుండా మాయకప్పిన ఆత్మ అయిన జీవుడుగా ప్రారబ్థకర్మతో ఎట్లా జన్మించాడు? అట్లా కాకపోతే ప్రారబ్ధ కర్మ ఎట్లా సంప్రాప్తించింది? జన్మతః ఉన్న నిర్మలమైన ఆత్మకు ఈ ప్రకృతి అనే మాయ ఏ విధంగా భ్రమ కొల్ప గలిగింది ? మిగిలిన జీవరాసులకు లేనటువంటి ''మాట'', ''మనస్సు'' మానవునికే ఇచ్చి ఆత్మను తెలుసుకొని దాని ద్వారా తనను ఆరాధించి తన దగ్గరకు రమ్మనమని ఆ పరాత్పరుడు ఎందుకు ఆడుకొంటున్నాడు? ఈ మాయా ప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా ఆ జగన్నాటక సూత్రధారి అయిన పరాత్పరుని, అర్థం చేసుకొని జీవించటం ఎట్లా ? అనే తర్క వితర్కాలు అనేకం ప్రబలి ఉన్నాయి. వీటి అన్నిటికీ కారణం అజ్ఞానం. అజ్ఞానానికి సత్యం తెలియదు. మాయ అంటేనే లేనిదాని నుండి పుట్టి ఉన్నట్లు కన్పిస్తుంది. వర్తమానంలో మన అజ్ఞాన దృష్టికి లేనిది ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తుంది. (1) అందువల్లనే ఆలోచనా పరిధిలో అజ్ఞానం అనేది అనిర్వచనీయం అన్నారు. (2) అదే అజ్ఞానానికి ఆత్మజ్ఞానం కలుగగానే ఈ జగమంతా మిథ్య, ఏమీలేదు, ఇది అంతా నశిస్తుంది అని తెలుస్తుంది. (3) అదే అజ్ఞానానికి శరీరమే సత్యం, మనస్సే సత్యం అని నమ్మి జీవిస్తూ ఉన్న వానికి జగత్తు అంతా పరమసత్యంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక అజ్ఞానం అనే విషయం ఈ విధంగా మూడు రకాలుగా అర్థం అవుతుంది. అందువల్లే అజ్ఞానాన్ని, అవిద్యని, తెలుసుకోవాలని, అనుభవించాలని సాధకుడు ప్రయత్నం చెయ్యటానికి పూనుకోవద్దు అని గురువులు స్పష్టంగా వివరించారు. అజ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే గుర్రం ముందు బండిపెట్టినట్లు అవుతుంది అని చెప్పారు.
అయితే ఈ సృష్టియందు చెట్టుముందా? విత్తుముందా? గుడ్డుముందా? పిల్లముందా? ఏది ఆది అనేది ఈనాటికి ఎవరికీ తెలియదు. కనుకే ఈ సృష్టి రహస్యం అనిర్వచనీయం గానే మిగిలిపోయింది. అసలు అజ్ఞానాన్ని నిర్వచించేది ఎవరు? మనస్సే, మనస్సే అజ్ఞానం ఆవరించినది అయినప్పుడు మనస్సు ఎట్లా నిర్వచిస్తుంది ? మనోమాలిన్యం తొలగిన నాడు కదా ఆ మనస్సు నిర్వచించ కలిగేది? కాన మనస్సు సామాన్య స్థితిని దాటి అసామాన్యమైన ఆత్మ స్థితికి వెళ్ళిననాడు కదా కారణ శరీరం స్థితిని తెలియటానికి వీలు కలుగుతుంది. అయితే అది ఎట్లా సాధ్యం అవుతుంది అని ఆలోచించవలసిన స్థితి ఏర్పడింది. అందుకే నిద్రపోయినవాడిని గూర్చి వివరించారు.
నిద్రపోయినవాడు మరణించిన వాడితో సమానం అని అంటూ ఉంటారు. అంటే ప్రతివాడు ప్రతిరోజు నిద్రలో మరణానుభవాన్ని కాస్తకాస్త పొందుతూనే ఉన్నాడు అన్నమాట. అచలమైన అద్వైతి అయిన రమణ భగవానునికి తన పదహారవ ఏట క్రీ.శ. 1895 వ సంవత్సరంలో మరణానుభూతి కలిగింది. ఆయనకు తాను చనిపోయాను అని అనిపించింది. ఆయనకు చెప్పలేనంత భయం ఆయన్ను చుట్టుముట్టింది. భయం వల్ల ఆయన మనస్సు అంతర్ముఖం అయింది. చావు అంటే ఏమిటి ? అనే ఆలోచనలతో చావుకి సహజంగానే సహజత్వం ఇవ్వటానికి ఆయన నిజంగానే చనిపోయినట్లు ప్రవర్తించారు. అంటే శరీరం బిగుసుకుపోయేటట్లు చేశారు. ఊపిరి బిగపట్టారు. లోపలినుంచి ఏ శబ్దం అంటే ''నేను'' అనేది కూడా రానీయకుండా పెదవుల్ని బంధించారు. ''శరీరం చనిపోయింది. ఈ కట్టెను తగుల బెడతారు. అయితే శరీరం చనిపోయినంత మాత్రాన నేను చనిపోయానా ? నేను అంటే ఈ దేహమేనా? నేను అన్నది నిశ్శబ్దంగా, నిశ్చేష్టంగా ఉన్నా అది సజీవంగానే ఉన్నట్టు నాకు తెలుస్తూనే ఉంది. అంటే ఈ శరీరాన్ని అధిగమించిన ఆత్మను 'నేను' అన్నమాట. శరీరమైతే చనిపోతుంది గాని ఆత్మకి చావు లేదు. అంటే అమరమైన ''ఆత్మ''ని నేను అన్నమాట. అదంతా క్రమబద్ధమైన ఆలోచనవలె నాకు తట్టలేదు. సజీవ సత్యం వలె హఠాత్తుగా నాలో మెరిసింది. చింతనా వ్యాసంగానికి అతీతమై స్పష్టంగా స్ఫురించింది. ''నేను''అన్నది ఒక్కటే పరమ సత్యం. సచేతనమైన శరీర వ్యాపకం అంతా ఆ ''నేను'' చుట్టు జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆ ''నేను''అన్నదానిపైనే కేంద్రీకరించాను. మృత్యువు అంటే భయం ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ క్షణం నుంచి అవిచ్ఛిన్నంగా ఆత్మలో లీనమైపోయాను'' అని రమణ మహర్షి తాను ప్రత్యక్షంగా అనుభవించిన మరణానుభవాన్ని అందరికీ అనుభ##వైకవేద్యంఅవ్వటానికి చెప్పారు. అంటే ప్రతి సాధకులు తమ సాధనలో ఈ కారణ శరీరం గాఢనిద్రలో ఉన్న స్థితికి మెలకువగా ఉండగా అంటే చేతనత్వంలో ఉండగా రావాలి అన్నమాట. సాధకులు ప్రతివారు ఆ అనుభూతిని పొందుతారు అన్నమాట. అప్పుడే ఈ కారణ శరీరం అంటే ఏమిటో, ఆత్మానుభూతి అంటే ఏమిటో అర్థం అవుతుంది అన్నమాట. అంటే అది ఎవరికివారు తెలుసుకోవలసిందే కాని ఇతరులు వర్ణించి, వివరించి చెప్పేదికాదు. ఆత్మజ్ఞానం అంటే ఎవరికి వారు నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకోవటం అన్నమాట. అంటే అట్లా అనుకొన్నంత మాత్రం చేత సరిపోదు. ఎవరికి వారు ఉత్తమ ప్రవర్తనతో ప్రవర్తించాలి. దుర్వాసునిలా ప్రవర్తించకూడదు. ధర్మవ్యాధుని కథలో సన్యాసి అయిన కౌశికుడు కోపావేశంతో కాకిని చంపినట్లు పతివ్రతను శపిస్తాను అనేటట్లు ప్రవర్తించకూడదు.
అజ్ఞాన దశయందు మనస్సులేదు కాన అది అనాది అయింది. అజ్ఞానం అనేదానికి ఆది తెలియటం లేదు. కనుక అనాది అయింది. ఆది లేనిదానికి అంతం కూడా ఉండదు. కాన ఆది అంతం లేనివాడు ఆ పరాత్పరుడే అవుతాడు. అంటే ఈ అజ్ఞానం అట్లా అవుతుందా అంటే అది అట్లా అవటంలేదు. ఆత్మజ్ఞానం తెలియగానే అజ్ఞానం అంతం అవుతుంది. మాయ వల్లే దానికి జ్ఞానం తెలియటంలేదు. అంతేకాని అజ్ఞానం ఆది లేంది కాదు. అంతం లేంది కాదు. మిథ్యాజ్ఞానంతో ప్రకృతే సత్యమని భ్రమకొల్పుతుంది కాన ఇది అనాది అయింది. ఆ మాయా జ్ఞానం కూడా ఎట్లా తొలుగుతుంది అంటే జ్ఞానం వల్ల, ఆత్మ గురువు వల్ల. కాన గురువు వద్ద జ్ఞానాన్ని పొంది ఆత్మమార్గంలో సాధనతో ప్రతిరోజు జీవించాలి. అప్పుడే మానవుడు జ్ఞాని అవుతాడు. ముత్యంలాగా మారతాడు. తామరాకుమీద నీటిబొట్టులా సంఘంలో నిలుస్తాడు.
ఇక ఆత్మను గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు ఆత్మ అంటే సత్యమైంది అని తెలుస్తుంది. ఆ సత్యమైందాన్ని తెలుసుకోవాలంటే అసత్యమైందాన్ని వదలివేయాలి. అసత్యమైందాన్నుంచి అధిగమించగలగాలి. అంటే ఆత్మని ఆవరించి ఏవేవి ఎట్లా నడుస్తూ ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి మూడు ఉపాధుల్ని ఏవేవి ఎట్లా నడుపుతూ ఉన్నాయో తెలుసుకోవాలి. అప్పుడు ఆ మూడు ఉపాధులు కంటే విలక్షణమైందిగా ఉన్నది ఏది ఉందో అది ఆత్మ అని తెలుస్తుంది. మానవ శరీరావసరాలకు అనుకూలంగా ప్రతిరోజు జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని మూడు అవస్థలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రదవస్థలో శరీరం ఉంది, మనస్సు ఉంది. స్వప్నావస్థలో మనస్సు మాత్రమే ఉంది. సుషుప్త్యవస్థలో శరీరం లేదు. మనస్సులేదు. మరి ఏముంది అని ఆలోచిస్తే మూడు అవస్థలకు సాక్షిమాత్రంగా ఉన్న శుద్ధ చైతన్యమైన ఆత్మ ఉంది. అంటే సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉన్నప్పటికీ అట్లా తెలియటంలేదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి కావలసిన శక్తి సామర్థ్యం, దానికి కావలసిన అహంకారంకాని ''నేను'' అనే సాక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఇదే అనుమాన ప్రమాణంచేత తెలుసుకోవటానికి వీలు కుదురుతుంది. పగలంతా మనస్సు చేసే పనుల వల్ల, అన్నీ తన స్వశక్తి వల్లే జరుగుతూ ఉన్నాయి అని, అన్నిటికీ తన దేహమే ఆధారంగా నిలిచి ఉంది అని అనుకొంటూ భ్రమ ప్రమాదాలకు లోనయిన మానవుడు నిద్రాస్థితిలో అవేవి తనకు ప్రధానం కావని, వాటి అన్నిటికీ కూడా ఏది ఆధారమై ఉందో అదే ఆ నిద్రలో తనకు ఆధారంగా నిలిచి, తనకు శాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉంది అని తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. అందువల్ల ఆత్మ అంటే ఆ నిద్రలో ఉన్న శుద్ధచైతన్యం అని తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. ఆత్మ అంటే కర్త కర్మ క్రియ అన్నీ ఒకటే అయి నిలుస్తుంది. చూసే ద్రష్ట, చూడబడే దృశ్యం, అనుభవించే దృక్కు అయిన మూడు కూడా ఒక్కటే అవుతూ ఉన్నాయి. ఆత్మానుభవం వద్ద, ఆత్మానందం వద్ద శరీరం, అంతఃకరణ అన్నీ ఆత్మలో లీనమైపోతూ ఉన్నాయి. అప్పుడు కేవలం సచ్చిదానందం మాత్రమే మిగిలింది. మనస్సనే అద్దం ముందు ఏదైనా వస్తువు, జగత్తు, సంసారం ఉంటే దాన్ని అద్దం ప్రతిబింబిస్తుంది. అద్దంముందు ఏదిలేనప్పుడు అద్దం దేన్ని ప్రతిబింబిస్తుంది. దేన్ని కూడా ప్రతిబింబించలేదు. కాన అంతఃకరణం అనే అద్దాన్ని పరిశుద్ధం చేసుకొంటే ఆత్మదర్శనం, ఆత్మానందం లభిస్తుంది. అట్లా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని జీవించి ఉన్న గురువుద్వారా పొంది, నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో, పట్టుదలతో నిరంతరం క్రమంతప్పకుండా సాధన చేసి మల విక్షేప ఆవరణాది దోషాల్ని తొలగించుకోవాలి.
మల దోషం అనేది శ్రవణం ద్వారా తొలుగుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, శాస్త్రాలు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం వంటి ఉత్తమ గ్రంథాలలోని విషయాలను రోజూ వింటూ ఉంటే మానవునిలో అవి జీర్ణించి పోయి మానవుని స్వభావంలో మార్పు వస్తుంది అని చెప్పుతూ ఉంటారు. గురు వాక్యమే వేదవాక్యం. గురుజ్ఞానమే సర్వవిజ్ఞానం. గురువు యొక్క సత్సంగాలే గమ్యానికి లక్ష్యసాధనాలు ''నానా పంథ్ జగత్‌మే నిజనిజ గుణ గావే'' అన్నట్లు రకరకాల మార్గాల్లో నడుస్తూ ఉన్న ప్రపంచంలో సత్యమార్గంలో నడవటానికి కావలసిన దాన్ని చెప్పవలసింది అని ఆయన బోధించే ఉత్తమ మార్గమే సాధకునికి కావలసిన జ్ఞానమని విశ్వసించి, నమ్మి ఆ జ్ఞానానికి సంబంధించిన వీడియోలు చూడటం, క్యాసెట్లు వినటం వంటివి చేయాలి. అప్పుడే మానవుని ఆవరించి ఉన్న మలదోషం తొలుగుతుంది.
విక్షేపం అనేది నామ జపంతో తొలుగుతుంది అంటారు. విక్షేపం అంటే బాహ్యవస్తువుల ఆభాస చింతనం. అంటే అశాశ్వతమైన బాహ్యవస్తువులు శాశ్వతమని భ్రమకొల్పి విక్షేపాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ విధమైన విక్షేప దోషం నామాన్ని మననం చేయటం వల్ల తొలుగుతుంది అంటారు. ఆత్మ జ్ఞానంలో నామం అంటే అంతర్ముఖంగా నిరంతరం సాగుతున్న నాదం అంటారు. ఓంకార నాదం అంటారు. పరావాణి అంటారు. అజపా గాయత్రీ అంటారు. సాధకుడు శరీరంతో జీవిస్తూ ఉన్నా, నిత్యకృత్యాలు కొనసాగిస్తూ ఉన్నా, నిరంతరం మనస్సుని ఆ నాదం మీద లీనం చెయ్యటం వల్ల విక్షేప దోషం తొలుగుతుంది అంటారు. విరామం దొరికినప్పుడు, నలుగురిలో సంభాషించేటప్పుడు, జ్ఞానావసరం కలిగినప్పుడు గురుబోధని, గురుజ్ఞానాన్ని, గురువు యొక్క ఉదాహరణల్ని, మననం చేసుకొంటూ ఉండాలి. వారంవారం సత్సంగాలకు ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆత్మజ్ఞానులైన సత్సంగీయులతో గడపాలి. గురువుల ఆజ్ఞలను పాటిస్తూ సేవలో జీవించాలి. అట్లా సాధకుడు జీవించిన నాడు విక్షేపదోషం తొలుగుతుంది. ''మాయామోహనదీ జల, జీవ బహె సారె, స్వామీ జీవ బహె సారె, నామ్ జహాజ్‌బిఠాకర్, శబ్ద్ జహాజ్ చఢాకర్, గురుపలమె తారె, జయదేవ్ జయ సద్‌గురుదేవ్||''. ''మాయామోహ నదీ జలంలో జీవాలన్నీ కొట్టుకుపోతున్నాయి నామం (నాదం) అనే ఓడలో కూర్చుండబెట్టి శబ్దమనేటటువంటి ఓడలో ఎక్కించి గురువు క్షణంలో తరింపచేస్తాడు.'' కాన విక్షేప దోషం దాటటం అనేది జీవించి ఉన్న గురువును ఆశ్రయించటం వల్లే వీలుకుదురుతుంది.
ఆవరణ దోషం అంటే అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్ని దాటటం అని అంటారు. ఇప్పటి వరకు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల్ని గురించి వివరంగా తెలుసుకొన్నాం. ఆ మూడు ఉపాధుల్ని దాటినాకే ఆనందమయ కోశం చేరుకొంటాం. అప్పుడే ఆవరణ తొలుగుతుంది. ఈ విధమైన పారిభాషిక పదాలతో మానవశరీరాన్ని అవగాహన చేసుకొని వాటిని దాటటం అనేది ఎంతో గారడీగా కనిపిస్తున్నా. ఇంతటి క్లిష్ట సమస్యలన్నిటినీ కూడా గురుజ్ఞానం తొలగిస్తుంది. గురువు ప్రసాదించిన టెక్నిక్కులను ఒక్కొక్కదాన్ని విడువకుండా, క్రమం తప్పకుండా, నిరంతరం సాధన చేస్తూ ఉంటే సాధనలో శరీరం, మనస్సు, బుద్ధి, చూసేవాడు, చూసేది, అనుభవించేవాడు, అనుభవము, ఆలోచించేవాడు, ఆలోచనలు, వస్తువులు, ఉద్రేకాలు వంటివి అన్నీ ఏవీ లేకుండా నిశ్చలమైన స్థితిలో వాటి అన్నిటికీ సాక్షిమాత్రంగా సాధకుడు నిలిచినప్పుడు అనుభూతి పొందిన శుద్ధ చైతన్యమే ఆత్మ అని సాధకునికి తెలుస్తుంది.
ఇట్లా ఎన్ని విన్నా, ఎన్ని చదివినా, ఎన్ని మననం చేసినా ఆత్మానుభూతి కలుగదు. ఆత్మజ్ఞానంతో, ఆత్మసాధనతో నిరంతరం దానిలో తన్మయత్వం చెందిన వారికి మాత్రమే ఆ ఆత్మదర్శనం, ఆత్మానుభూతి, ఆత్మానందం అనేవి కలుగుతాయి. ఆత్మసిద్ధికి కావలసింది సాధనేకాని మరొకటికాదు. ఆత్మదాహర్తిని తీర్చటానికి గురువు కావాలి. రోగమొకటయితే మందు మరొకటిలా అందరూ భక్తి మార్గమని, కర్మమార్గమని, యోగమార్గమని వివిధ రకాలుగా చెపుతూ ప్రాథమిక దశలోనే ఉంచి అసలయిన ఆత్మ స్వరూప జ్ఞానాన్ని సాధకునికి అందించకుండా వదిలివేస్తూ ఉన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, రామాయణ భారత భాగవతాదులు, నామజపాలు అన్నీకూడా మానవుని నీటిదాకా తీసుకువెళుతూ ఉన్నాయే కాని నీటిని తాగించలేకపోతూ ఉన్నాయి. కావున నీటిని (ఆత్మజ్ఞానాన్ని) తాగించి దాహాన్ని తీర్చగల(ఆత్మానుభవాన్ని అందించగల) గురువును ఆశ్రయించి, గురుజ్ఞానంతో ప్రతినిత్యం కాస్తకాస్త శక్తిని కూడదీసుకోవటం ఉత్తమమైన మార్గంఅయి ఉంది. కాన అజ్ఞానం అనే నిద్రనుంచి ప్రతి మానవుడు తొందరగా మేల్కోవాలి. అట్లా మేల్కోలేనినాడు మానవుడు తన జీవిత లక్ష్యాన్ని తొందరగా చేరుకోలేడు. ప్రతి మానవుని జీవిత లక్ష్యం ఆత్మానందమే అయి ఉంది. దానికోసమే భగవంతుడు ఈ జన్మను ప్రసాదించాడు.
ప్రపంచం అంతటా ఆధునిక శాస్త్రజ్ఞులు ఆత్మను గురించి అనేక విధాల పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎవరికీ ఏ విధంగాను ఈనాటకీ అంతు చిక్కలేదు. ఈ సంవత్సరంలో అనగా ది.12-5-95 మధ్యాహ్నం హైదరాబాద్ దూరదర్శన్‌లో యూనివర్సిటీ గ్రాంట్సు కమీషన్ వాళ్ళు కొనసాగిస్తూ ఉన్న ప్రోగ్రాంలో వ్యక్తి మరణానికి పూర్వం కన్నా మరణించిన తర్వాత 20 మిల్లీగ్రాముల బరువు తగ్గినట్లు కనుక్కొన్నామని చెప్పారు. దానివల్ల ఆత్మ బరువు 20 మిల్లీగ్రాములని తలంచుచున్నట్లుగా చెప్పారు.
15 పంచకోశాది యోగేన
తత్తన్మయ ఇవస్థితః
శుద్ధాత్మా నీలవస్త్రాది
యోగేన స్ఫటికోయథా || 15
¬dsÌÁª«sxqsòQû + ఆదియోగేన = నీలం మొదలైన వస్త్రాల సంబంధం చేత, స్ఫటికః = స్ఫటికం, యథా = ఏ ప్రకారంగా ఆయా రంగులు కలదానిగా కనిపిస్తూ ఉందో అదే ప్రకారంగా, శుద్ధ + ఆత్మ = పరిశుద్ధమైన ఆత్మ, పంచకోశ + ఆది యోగేన = పంచకోశాల సంబంధంచేత, తత్+తన్మయ ఇవ = ఆ యా స్వరూపాలు పొందినట్లు, స్థితః = కనిపిస్తూ ఉంది.
తా|| నీలం మొదలైన వస్త్రాల సంబంధం చేత స్ఫటికం ఏ ప్రకారంగా ఆ యా రంగులు కల దానిగా కనిపిస్తూ ఉందో అదే ప్రకారంగా పరిశుద్ధమైన ఆత్మ పంచకోశాల సంబంధం చేత ఆ యా స్వరూపాలు పొందినట్లు కనిపిస్తూ ఉంది.
వివరణ :- నీలం, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ మొదలైన రంగు రంగుల వస్త్రాలమీద స్ఫటికాన్ని పెడితే స్ఫటికం ఆయా రంగులు కలదానిగా కనిపిస్తూ ఉంటుంది కదా ! అదే విధంగా ఆత్మ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలతో తాదాత్మ్యం చెందినప్పుడు ఆత్మే ఆయా కోశాలు అయి ఉందేమో అనే భ్రమకొల్పుతూ ఉందేగాని ఆత్మ ఆయా కోశాల్లో లీనం అవటం లేదు. ఆత్మ సాక్షి మాత్రంగానే తామరాకు మీద నీటి బొట్టులా వాటితో గడుపుతూ ఉంది.
ఇంతకు పూర్వం శరీరాన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని వివరంగా వర్ణించి చెప్పటం జరిగింది కదా ! వాటినే మరో విధంగా అవగాహన చేసుకోవటానికి వీలుగా ఆవరణలనే అయిదు కోశాలుగా వివరిస్తూ ఉన్నారు. కోశం అంటే ''ఒర'' అని అర్థం. ఖడ్గాన్ని పెట్టుకోటానికి ఒరను ఎట్లా ఉపయోగిస్తూ ఉన్నారో అట్లాగే శరీరంలో ఆత్మ ఉండేటటువంటి ఆయా ఆవరణాల్ని కోశాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు.
(1) అన్నమయ కోశం :- స్థూల శరీరాన్నే అన్నమయ కోశం అంటూ ఉన్నారు. ఇది అన్నంవల్లనే పుట్టి అన్నం వల్లనే వృద్ధి అయి, జీవిస్తూ ఉంది. అన్నం లేకపోతే నశిస్తూ ఉంది. ఇది నశించాక కూడా అన్నోత్పత్తికి ఉపయోగపడుతూ ఉంది. అన్నం ద్వారానే అన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. కనుక దీన్ని అన్నమయకోశం అన్నారు. అన్నం తినటం వల్లనే ఇది శుక్లశోణితాల్ని ఉత్పన్నం చేస్తూ ఉంది. ఇది మలినాలతో కూడిఉండటం వల్ల దీన్ని మలభాండం అని కూడా అన్నారు.
(2) ప్రాణమయ కోశం :- కర్మేంద్రియాలు, ప్రాణశక్తి అయిన పంచప్రాణాలు, కలిపి ప్రాణమయకోశం అన్నారు. ప్రాణమయ కోశంతోనే ఆవరింపబడి అన్నమయ కోశం తన కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంది. అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉంది.
(3) మనోమయ కోశం :- మనస్సును అజ్ఞానం ఆవరించి ఉండటంవల్ల నేను నాది అనే అహంకారం తలెత్తుతూ ఉంటుంది. అందువల్ల బంధ మోక్షాలన్నిటికీ మనస్సే కారణం అయి నడుస్తూ ఉంటుంది. శబ్ద స్పర్శరూప రసగంధాలైన పంచవిషయాలను జ్ఞానేంద్రియాలు మనస్సుకు అందించి విషయజ్ఞానం తెలుసుకొనేటట్లు చేస్తూ ఉంటాయి. కనుక జ్ఞానేంద్రియాలను, మనస్సును కలిపి మనోమయకోశం అంటున్నారు. ప్రాణమయకోశంలో మనోమయకోశం ఉంది.
(4) విజ్ఞానమయ కోశం :- ఇక్కడ బుద్ధి జ్ఞానేంద్రియాలతో కూడి ఉంటుంది. సంసార కార్యకలాపాల నన్నింటినీ ఇదే నిర్వహిస్తూ ఉంటుంది. నేను, నాది అనే భావన చేస్తూ ఉండే జీవుడే విజ్ఞానమయకోశం అవుతూ ఉన్నాడు. ఇది నేను చేస్తూ ఉన్నాను. ఇది నేను తింటూ ఉన్నాను, ఇది నా శరీరం, ఇది నాది అనే కర్తృత్వం, అహంకారం వంటి వ్యక్తిత్వ భావాల్ని వ్యక్తం చేసేదే విజ్ఞానమయకోశం అయి ఉంది. దీనిలో ఈ కర్తృత్వ, భోక్తృత్వ భావాలు ఉండటం వల్లే ఇది తర్వాతి జన్మకు కారణం అవుతూ ఉంది. మనోమయ కోశం లోనే విజ్ఞానమయకోశం ఉంది.
(5) ఆనందమయకోశం :- గాఢ నిద్రయే ఆనందమయకోశం అయి ఉంది. అజ్ఞానం ఆవరింపబడి ఉంటుంది. దుఃఖ స్థానాలైన విషయాలు ఏవీ తెలియని స్థితి అయి ఉంది. అహంకార మమకారాలను, అనిత్య పదార్థాలను విడిచి ఆనందంతో ఉన్న స్థితే ఆనందమయ కోశం అయి ఉంది. విజ్ఞానమయ కోశం లోనే ఈ ఆనందమయకోశం ఉంది.
అన్నమయకోశం, ప్రాణమయకోశం, అనే రెండూ స్థూల శరీరంలో ఉన్నాయి. మనోమయ కోశం, విజ్ఞాన మయకోశం అనే రెండూ సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఆనందమయకోశం అనేది కారణ శరీరంలో ఉంది. అన్ని కోశాలు ఒక దానికి మరొకటి సంబంధం కలిగే ఉన్నాయి. అవన్నీ కలిసి శరీరమనే సంసార సముద్రాన్ని దాటటానికి ఒక దానితో మరొకటి అనుసంధానం అయి నడుస్తూ ఉన్నాయి. కాని వాటన్నిటికి శక్తిని ఇచ్చిన శుద్ధ చైతన్యాన్ని మాత్రం తెలుసుకోలేక తాత్కాలిక సుఖాలకోసం అర్రులు చాచి దుఃఖంలో మునిగిపోతూ ఉన్నాయి. చెరువులో అడుగున ఉన్న దాన్ని పొందాలంటే చెరువులో పైపైన ఈదితే దాన్ని పొందలేం కదా! అడుగున ఉన్నదాన్ని పట్టుకోవటానికి శ్రమపడి అడుగుకు వెళ్ళి దాన్ని సాధించవలసి ఉంటుంది కదా ! ఆ శ్రమ ఫలితం అనంతం అయినప్పుడు ప్రతిమానవుడు ప్రతినిత్యం దానికోసం నిరంతరం శ్రమపడాల్సి ఉంటుంది కదా! అట్లా ఇంద్రియాలతో అంతర్ముఖం అవటం అనే దాన్నే ధ్యానం అన్నారు. ఇంద్రియాలన్నీ భగవంతుడు మానవునకు ఇచ్చింది ప్రపంచంలోను, ప్రకృతిలోను, బయట ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవటానికి. అయితే, వాటన్నిటినీ విడిచి పెట్టి లోనికి వెళ్ళు, లోనికి వెళ్ళు అని బోధిస్తారు ఏమిటి అని ప్రశ్నించేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. చీకటిలో నల్ల పిల్లిని వెతుకుతానంటారు. ఏమిటి అని హేళన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చీకట్లో కాంతిని వెతికితే కాంతి ఎక్కడ నుంచి వస్తుంది అని, అది అంతా కూడా భ్రమ ప్రమాదాలకు లోనయ్యేదే కాని వేరుకాదు అని కుతర్కాలతో నిందించేవాళ్ళూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు సమాధానంగానే మనకు సమీప కాలంలో, మనకు పూర్వులైన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటివారు ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు.
రమణ మహర్షి ఏ కోశాలు, ఏ శరీర విభాగాలు తెలియకుండానే క్రీ.శ. 1896లో తిరువణ్ణామలై చేరిన తర్వాత అరుణాచలేశ్వరుని ఆలయాన్ని దర్శించి భగవంతునికి తన రాకను విన్నవించుకొన్నారు. తర్వాత దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు చేరి తన తిండికోసం దారిలో ఒక ఇల్లాలు ఇచ్చిన పిండివంటల పొట్లాన్ని కూడా పారవేశాడు. తనకు తర్వాత భోజనం ఎక్కడ, ఎప్పుడు అనే ధ్యాస కూడా లేకుండా చేతిలో ఉన్న ఆహారాన్ని విడిచిపెట్టాడు. తన పంచెను చింపి గోచిని తీసుకొని మిగిలిన పంచెను ఆ చెరువులో పారవేశాడు. రెండవ కౌపీనానికి కావలసిన బట్టకూడా కనీసం ఆ పంచెలోంచి తీసుకోలేదు. ఆ మిగిలిన బట్ట తర్వాత తాను తుండుగా ఉపయోగించుకోవచ్చు అని కూడా ఆయన ఆలోచించలేదు. ఆయన అరుణాచలేశ్వరుని గుడి ప్రహరీ గోడలోపలే ఉన్న ఇంకొక గుడిలో ధ్యానం చేసుకొంటూ ఉంటే శరీరం అంతా పుళ్ళు పడిపోయినా లెక్కచేయలేదు. ఆయన దోమల బాధతోను చలిబాధతోను శ్రమపడుతూ ఉంటే చూడలేని ఒక భక్తుడు కొత్త రగ్గు తీసుకువచ్చి ఇవ్వటానికి ఎంత ప్రయత్నం చేసినా తీసుకోవటానికి సమ్మతించలేదు. ఆయన స్థూల శరీరాన్ని లెక్క చేయకుండా అంతటి నిశ్చలత్వం కలిగి లక్ష్యాన్ని సాధించటం కోసం నిరంతరం శ్రమించాడు. రామకృష్ణ పరమహంసకు రాణీరాసమణి అల్లుడు శాలువా కొని ఇస్తే దాన్ని కింద పారవేసి, తొక్కి, దాని మీద ఉమ్మువేసి వదిలివేశాడు. ఆ విధంగా స్థూల శరీరాన్ని కాపాడుకోవటం అనే ప్రయత్నమే లేకుండా వాళ్ళు నిరంతరం ఆత్మ జ్ఞానంతో, లక్ష్యసిద్ధికోసం పనిచేసి అన్నమయ ప్రాణమయకోశాల్ని అవలీలగా దాటారు. రమణ మహర్షి భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఇల్లాలు ఆయనను తన కొడుకులా చూసుకొంటానని, విస్తరివేసి భోజనం పెడతానని ఎంత బతిమాలినా వినకుండానే దోసిలిలో భిక్ష తీసుకొని వెళ్ళిపోయాడు. అంతటి పట్టుదల, అంతటి వైరాగ్యం, అంతటి కార్యదీక్ష కలిగిన వారికి వెనువెంటనే ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయి. స్థూలశరీరం ఆత్మసాధనతో అవలీలగా స్వాధీనం అవుతుంది. శరీర సుఖాన్ని, జిహ్వాచాపల్యాన్ని విడిచిన వారికి స్థూలశరీరం దాసోహం అంటుంది.
మనస్సును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే అన్నారు. అట్లాంటి మనోమయ, విజ్ఞానమయ కోశాల్ని జయించటం అంత తేలికైన పనికాదు అని మీనమేషాలు లెక్క పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. విషయాన్ని ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించకూడదు. మానవుడు సాధనకోసం స్వీకరించే లక్ష్యాన్ని బట్టి, ఎన్నుకొనే మార్గాన్ని బట్టి కార్యం నెరవేరటానికి కావలసిన దారులు చేకూరుతాయి. మనస్సు కోరే కోరికలు, మనస్సు కాంక్షించే అహంకారం, మనస్సు కోరే కీర్తి ప్రతిష్ఠలు కంటే కూడా స్వీకరించే లక్ష్యం ఉన్నతమైంది. అయితే పెద్ద గీతలో చిన్నగీత లీనమయినట్లు మనస్సు క్రమేపి క్రమేపి లక్ష్యంలో లీనమయిపోతుంది. మనస్సును అంటి ఉన్న కర్మవాసనలు, సుఖాకాంక్షలు, అహంకారం అన్నీ కూడా ఆ పరాత్పరుని ఆనందం ముందు బహుస్వల్పమై ఉన్నాయి. కాన సాధకుడు భగవంతుని కార్యమే నేను నెరవేరుస్తూ ఉన్నాను. నాది అనేది ఏదీ లేదు అనే స్వభావంతో లక్ష్యసాధనకు అనుకూలంగా నడుస్తూ ఉన్నప్పుడు ఈ రెండు కోశాలుకూడా ఆనందమయ కోశంలో అంతర్లీనమవుతాయి. మనస్సుకి నిరంతరం ఆత్మసాధన అనే బృహత్తర కార్యాన్ని అప్పచెప్పటం వల్ల, దానికి అనుకూలంగా గురువు చెప్పినట్లు సాధకుడు సాధనలో నడుస్తూ ఉండటం వల్ల మనోమయ, విజ్ఞాన మయకోశాలు అతి స్వల్ప కాలంలోనే స్వాధీనం అవుతాయి. సాధన చెయ్యాలి. అనే వాళ్ళకి పట్టుదల, ఓర్పు, శరణాగతి, ప్రవత్తి ఉంటే తేలిగ్గా ఆ ఆత్మానందమనే దాహాన్ని తీర్చటానికి ప్రత్యక్షంగా ఉన్న భగవంతుడనే గురువే ఆ కార్యసాఫల్యాన్ని చేకూరుస్తాడు. సాధకునికి సహాయంగా గురువే కృపతో కార్యాన్ని సఫలీకృతం అయ్యేటట్లు చూస్తాడు.
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సాధనలో క్రమక్రమంగా ఒక దానిలో ఒకటి లీనం అవుతూ ఉండటం వల్ల సాధకునికి సాధనలో మిగిలేది ఆనందమయకోశ##మే అవుతుంది. అటువంటి ధ్యానస్థితిలో సాధకునికి పగలు రాత్రిగాను, రాత్రి పగలుగాను మారిపోతుంది. సాధకుడు సాధనలో వచ్చే ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు చేకూరే విరామాన్ని పెంచుకొంటూ వెళ్ళటమే ధ్యానంలోచేయవలసింది అని రమణ మహర్షి సాధన మార్గాన్ని సూచించారు. అది సాధనలో సాధకునికి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. ఎంతకాలం సాధన చేసినా గమ్యాన్ని చేరలేకపోతున్నానని నిరాశకు లోనవకుండా సాధన కొనసాగిస్తూనే ఉండాలి.
ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కవసేపు ఉండని కల మానవునికి ఎంతో దీర్ఘకాలం అనుభవాన్ని ఇచ్చినట్లు అనుభూతిని కలిగిస్తూ ఉంది. అట్లాంటి అనుభూతిని చేకూర్చే ఆనందమయకోశంలో పొందే ఆనందం, అనంతమైన శాంతి సౌఖ్యాల్ని చేకూరుస్తుంది. స్వామి శివానంద సరస్వతి ధారణ ధ్యానాలను గురించి చెబుతూ పన్నెండు సెకనుల కాలం ఏదైనా ఒక వస్తువు మీద మనస్సును ఏకాగ్రంగా నిలప గలిగితే అది ''ధారణ''అవుతుంది అని, అట్లాగే పన్నెండు ధారణలు అంటే రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండుల కాలం వరకు ఆ రీతిగా ఉంటే ''ధ్యానం''అవుతుందని, అట్లాగే పన్నెండు ధ్యానాలు అయితే అంటే ఇరవై ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండుల కాలం అయితే ''సమాధి''అవుతుంది అని కూర్మ పురాణంలో రాసి ఉన్నట్లు చెప్పారు. ఆత్మజ్ఞాన సాధకులు అనేకమంది ఈ సమాధి స్థితిని తమకు తాము తెలియకుండానే పొందుతూ ఉంటారు. ఈ సమాధిస్థితిలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలకంటే వేరై సాక్షిమాత్రంగా ఉన్న శుద్ధచైతన్యమైన ఆత్మానుభూతిని తెలియకుండానే అనేకమంది సాధకులు పొందుతూనే ఉంటారు. నిర్వికల్ప సమాధిస్థితిని పొందటానికి సాధన దీర్ఘకాలం చేయవలసి ఉంటుందే కాని అరగంట కాలం పొందే సమాధిని సాధనలో పెక్కుమంది అనుభూతిని పొందుతూనే ఉంటారు.
ఈ పంచకోశాలు ఆత్మేనా అంటే అవి ఆత్మకావు. మాయ ఆవరించిన ఆత్మేజీవుడై ఉన్నందున పంచకోశాల కార్యాలు నెరవేరుతూ ఉన్నప్పుడు ఆత్మే ఆ కార్యాలన్నీ నెరవేరుస్తూ ఉన్నట్లు భ్రమకొల్పుతూ ఉంటుందేకాని అవి ఆత్మవికావు. కోశాలన్నీ ఆత్మవేనని జ్ఞానం లేనివాళ్ళు భావిస్తూ ఉంటారు. సాధకుడు ఆ కోశాలు అన్నీ ఆత్మకంటే వేరుగా ఉన్నాయి అని తెలుసుకోగలుగుతూ ఉంటాడు. విమర్శనాదృక్పథంతో ఈ పంచకోశాలను పరిశీలించిననాడు చావుపుట్టుకలు కలిగిన అన్నమయ ప్రాణమయకోశాలు శాశ్వతమైన ఆత్మకాజాలవు. మనస్సు నిద్రలో ఆనందమయకోశంలో అదృశ్యం అవుతూ ఉంది కాన అది కూడా ఆత్మ కాజాలదు. ఈ మనస్సు జడమయింది. అది వికారాలు పొందుతూ ఉంటుంది. అంతేకాక అహంకారంతో స్థిరత్వం లేకుండా ఉంటుంది. కాన అది ఆత్మకాజాలదు. ఆనందమయ కోశం అజ్ఞానం ఆవరించి ఉంటుంది. దానిలో ఉన్న సుఖం ఏమిటో తెలియకుండా ఉంటుంది. ఆ విధంగా అది తెలియని స్థితి అవటం వల్ల అది కూడా ఆత్మకాదు. అయితే ఆత్మ ఏది అని ప్రశ్నించుకొంటే శరీరానికి, ప్రాణానికి, మనస్సుకి, బుద్ధికి, సుషుప్తికి శక్తినిఇచ్చి అవన్నీ నడవటానికి కావలసిన శక్తితో సాక్షిమాత్రంగా ఉన్నది ఏదో అదే ఆత్మ అవుతుందే కాని ఆ కోశాలు ఏవీ ఆత్మకావు. రంగు వస్త్రాలు తీసేస్తే స్ఫటికం స్వచ్ఛంగా తెల్లగా ప్రకాశించినట్లు పంచకోశాలు తొలగించి తిలకించిననాడు ఆత్మ నిర్మలమై, ప్రకాశవంతమై వెలుగొందుతుంది.
బంగారు వస్తువులు అన్నిటిలోను ఉన్న పదార్థం అయిన బంగారం మాత్రం ఒక్కటే అయి ఉంది. ఆకారాల్ని బట్టి ఆభరణాలు వేరువేరుగా పిలువబడుతూ ఉన్నాయేకాని అవి ఏవీ కూడా బంగారం కంటే వేరుకాదు. మానవ శరీరాలన్నీ వికారాలతో వేరువేరుగా కనబడుతూ, పిలవబడుతూ ఉన్నాయేకాని అవి ఏవి కూడా వేరు కాదు. అన్నిటిలోను ఉన్నది ఆత్మ ఒక్కటే అయి ఉంది. పరమాణువును ఛేదించినప్పుడు అణుశక్తి ఉత్పన్నం అవుతూ ఉంది. శుద్ధ చైతన్యం అయిన ఆత్మ యొక్క శక్తి ఆ అణుశక్తి కన్నా కూడా అత్యంత సూక్ష్మమైంది అయి ఉంది. ఇది సకల పదార్థాలయందు నిండి ఉంది. పరమాణువులో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను అని మూడు భాగాలు కలిగి సచేతనంగా కదులుతూ ఉన్నాయి. ఆ మూడింటికి చేతనత్వాన్ని ఇచ్చి వాటిని నడపగలిగిన అతి సూక్ష్మమయిన శక్తి ఏదయితే ఉందో అదే ఆత్మ శక్తి అయి ఉంది. ఆత్మ ఎంతటి సూక్ష్మాతి సూక్ష్మమైంది అయి ఉందో అంతటి అనంతమైన శక్తి కలిగి సచేతనమై శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంది. ఆత్మచైతన్యం వల్లనే మనస్సు మొదలైన ఇంద్రియాలు చైతన్యవంతమై సర్వప్రపంచాన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నాయి. కాన స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళినకొద్ది అనంతమైన శక్తి సంపదను, అనంతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ ఆత్మ నవ్యజ్యోతి, సర్వప్రకాశం, నిత్యం, సర్వవ్యాపకం అయి ఉంది. అదియే పరమేశ్వరుడు అయి ఉన్నాడు. ఎవడు అయితే నేను ఆనందాత్ముడను అని భావిస్తాడో వాడు శరీరం ఉన్నా శరీరంలేనివాడే అవుతాడు. అటువంటి వాడికి ప్రియం అప్రియం అనేవి ఉండవు. సుఖదుఃఖాల్ని కూడా ఏవీ కలిగించలేవు.
రమణ మహర్షికి చేతిమీద క్యాన్సర్ వచ్చింది. అదిఅమితమైన బాధ కలిగించేది. అయినా ఆయన బాధపడుతున్నట్లు కనిపించకుండా గడిపేవాడు. భక్తులు ఆయన్ను సమీపించి మీకు బాధ కలగటం లేదా అని అడిగారట. ఆయన బాధలేకే బాధ ఉంది. కాని నేను దేహం అనుకొన్నప్పుడు బాధగా ఉంటుంది. నేను ఆత్మను అనుకొన్నప్పుడు, ఆత్మగా జీవిస్తూ ఉన్నప్పుడు బాధ ఉండదు. కాన బాధలేదు అని చెప్పారట. ఆయన ఎదురు ఒక ఉదాహరణను పృచ్ఛకులకు చెప్పారు. పిప్పి పన్ను వచ్చింది. పగలంతా బాధపడ్డావు. రాత్రికి నిద్రపోయావు. నిద్రలో బాధ ఏమయింది? నేను శరీరాన్ని అనుకొన్నప్పుడు బాధ ఉంది. నిద్రలో శరీరాన్ని, మనస్సుని విడిచి గాఢనిద్రలో ఉన్నందున నొప్పిలేదు కదా అని చెప్పారట. ఆ విధంగానే ఆత్మజ్ఞానంతో జీవించటానికి సాధకుడు అలవాటు చేసుకొంటూ ఉంటే ఆత్మతోనే జీవించటం జరుగుతుంది. అటువంటివారే ద్వంద్వ విముక్తులు అవుతారు.
మానవులు పంచకోశాలతోనూ జీవిస్తూ ఉన్నారు. అట్లా జీవిస్తూ ఉండగా కొందరు ఏదో ఒక కోశంతో తాదాత్మ్యాన్ని పొంది దానికి సంబంధించిన వ్యక్తిత్వాన్నే తనకు అంటగట్టుకొంటూ ప్రవర్తిస్తూ ఉంటూ ఉంటారు. దీనివల్లే మానవుల్లో ఒకే వ్యక్తియందు అనేక వ్యక్తులు జీవిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. మానవులు పంచకోశాల్ని ఉపయోగించుకోకుండా ఏదో ఒక్కకోశంతోనే అయిక్యత పొంది జీవించినప్పుడు అవివేకులుగా పరిగణింపబడుతూ ఉంటారు. అట్లాగే బుద్ధితో ఐక్యం పొంది జీవిస్తూ ఉన్నప్పుడు స్థూలకోశాలకు సంబంధించిన కోరికలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా మానవులు సూక్ష్మతర కోశాల సంతోషానికై స్థూలకోశాలను త్యాగం చేయవలసి వస్తూ ఉంటుంది. ఆ విధానమే శాంతికి సరైన దారి చేకూరుస్తుంది. మానవుడు దుఃఖాన్ని, మానసిక అశాంతిని తొలగించుకోవటానికి స్థూలశరీరాన్ని త్యాగంచేసి సూక్ష్మాతిసూక్ష్మమైన ఆత్మతో జీవించవలసి వస్తుంది. శరీరం మీద వచ్చిన కురుపును తొలగించుకోవటానికి శస్త్ర చికిత్స చేయించుకోటానికి సమ్మతిస్తూ ఉన్నట్లే ధ్యానమార్గంలో స్థూల శరీరాన్ని తొలగించుకొని శాశ్వత సుఖాన్ని, శాంతిని పొందటానికి మార్గం ఏర్పరచుకోవాలి. మానవ శరీరాన్ని ఆవరించిన విషయ ప్రకృతి అనే విషయకోశాల్ని తొలగించుకొని దివ్యశక్తిని పొందాలి. విషయపూరితకోశాలు దివ్యశక్తిని ఆవరించటంవల్ల దుఃఖాల్ని అనుభవిస్తూ ఉన్నారు. ధ్యానంలో క్రమేపి, క్రమేపి వాటిని తొలగించుకొంటూ పోతే దివ్యశక్తి అయిన ఆత్మతో మానవుడు జీవించగలుగుతాడు. దాన్ని అర్థం చేసుకొని జీవించటానికే ఈ కోశాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. మానవుడు దేహదౌర్బల్యం వల్ల అనేక జన్మలలో చేకూరిన పూర్వవాసనల వల్ల దురవస్థలకు లోను అవుతూ ఉన్నాడు. మానవుడు వీటిని అతిక్రమించటానికే ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించి ధ్యానం ద్వారా సిద్ధిని పొందాలి. మానవుడు అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే తనలో ఉన్న దోషాల్ని తాను తెలుసుకొని వాటినుండి విముక్తి పొందగలుగుతాడు. ఆత్మజ్ఞానంతో మానవుడు శరీరంలోపల ఉన్న అనేకరకాలైన వస్తు సామగ్రికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని అవగాహన చేసుకొని జీవించగలుగుతాడు. అది పరిపూర్ణ ఆనందానికి దోహదకారి అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోవటం వల్ల సాధకుడు సాధనలో శరీరానికి జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి సరైన సమన్వయం చేకూర్చగలుగుతాడు. ఆ విధానం వల్ల జీవన విధానంలో చక్కటి పొందికను అలవరుచుకొని మానవుడు జీవించగలుగుతాడు.
నేను ఈ విధంగా జీవించటానికి, నా స్వభావానికి, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా కులం, నా దేశం, నా కాలం, నా పరిసరాలు, నాకు ఎదురు అవుతున్న సంఘటనలే కారణం కాని మరొకటికాదు అని వాదించే వారు చాలామంది ఉన్నారు. అదే విధంగా పూర్వజన్మలో ఆచరించిన ధర్మాలు, అధర్మాలు కారణంగానే ఈ జన్మలో మనస్సు శరీరం ఏర్పడినప్పుడు ప్రత్యేకంగా దానికి వ్యతిక్రమంగా నేను చేయగలిగింది ఏముంటుంది అనే వారు ఉన్నారు. అది సరి అయింది కాదు. స్వభావాన్ని శాసించేది ఎవరికి వారే కాని ఇతరులు కాదు. చెడ్డవాడు అవ్వటానికి ఎంత స్వేచ్ఛఉందో మంచివాడు అవ్వటానికి కూడా అంతే స్వేచ్ఛ ఉంది. ఆదర్శాలు, ఆశయాలు, లక్ష్యాలు అనే వాటిని అనుసరించే మానవుని జీవన విధానం నడుస్తుంది. నిర్ణయాధికారం మానవుని మీదే ఆధారపడి ఉంది. కాన మానవుడు స్వతంత్ర వ్యక్తి అయి ఉన్నాడు. కర్త కూడా తానే అయి నడుస్తూ ఉన్నాడు. కాన మానవుడు తాను ఆచరించాలనే పద్ధతియందు, లక్ష్యమందు శ్రద్ధాసక్తులు కలిగిననాడు క్రమక్రమంగా లక్ష్యాన్ని సాధిస్తాడు. దానికి గురువు తోడ్పడి ఆనందానికి అనుకూలంగా దారి చేకూరుస్తాడు. దానికి అనుకూలంగానే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దోహదకారులు అవుతారు. అప్పుడు సుఖశాంతులు సిద్ధిస్తాయి. మానవుడు నిర్ణయించుకొనే లక్ష్యాన్ని బట్టే తన ఆవరణలను దాటటానికి వీలు కుదురుతుంది. తనకు ఏది ధర్మం అని తోస్తే దాన్ని ఆచరిస్తూ దానికి తన కర్మే కారణం అని, భగవంతుడే కారణం అని అనటం తగింది కాదు. ఎవరికి దేనియందు శ్రద్ధ ఉంటుందో వాళ్ళు అదే అవుతారు అని (17-3) భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. అది అక్షరాల నిజంకాన దాన్ని నమ్మి విశ్వసించి ఆవరణలు దాటి ఆత్మతో జీవించటానికి ప్రతినిత్యం ప్రయత్నించాలి. రమణ మహర్షి, రామకృష్ణపరమహంస వంటి వారు కారణజన్ములు కాన వారు ఆవరణలు దాటటానికి, ఆత్మతో జీవించటానికి వీలు అయింది కాని మాకు వీలుకాదు అని చెప్పి శ్రమకోర్చి సాధన చేయటానికి ఇష్టం లేక తమ తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేయటం తగింది కాదు.
16 వపు స్తుషాదిభిః కోశైః
యుక్తం యుక్త్యవఘాతతః
ఆత్మాన మన్తరం శుద్ధం
వివిచ్యాత్తండులం యథా || 16
»R½VxtsQ + ఆదిభిః = ఊక మొదలైన వాని చేత, యుక్తం = కూడి ఉన్నటువంటి, తండులం బియ్యాన్ని, యథా = ఏ ప్రకారంగా అయితే, అవఘాతతః = రోకటిపోటులచేత వేరుచేస్తూ ఉన్నామో, (అదే విధంగా), కోశైః = పంచకోశాల చేత, వపుః = రూపుదాల్చి ఉన్నటువంటి, అన్తరం = లోలోపల ఉన్నటువంటి, శుద్ధం = పరిశుద్ధం అయినటువంటి, ఆత్మానం = ఆత్మను, యుక్త్యా = ఉపాయం చేత, వివిచ్యాత్ = వేరుచేయాలి.
తా||ఊకతోను, తవుడుతోను కూడి బియ్యాన్ని రోకటితో దంచి ఏ విధంగా వేరుచేస్తూ ఉన్నామో అదే విధంగా పంచకోశాలచేత ఆవరింపబడి ఉన్నటువంటి, లోలోపల ఉన్నటువంటి, పరిశుద్ధమైనటువంటి ఆత్మను ఉపాయంతో (గురువు ఇచ్చిన జ్ఞానంతో ధ్యానం చేస్తూ) వేరు చేయాలి.
వివరణ :- సాధకుడు శరీరంలో ఆత్మ ఉంది అనే జ్ఞానాన్ని గ్రహించాడు. ఆ ఆత్మ శాశ్వతమైంది. బ్రహ్మానందమయమయింది అనే జ్ఞానాన్ని కూడా గ్రహించాడు. అయినంత మాత్రం చేత ఆ ఆత్మ అంతతేలిగ్గా చేజిక్కుతుందా ? దాన్ని పొందాలన్నా అంత తేలిగ్గా పొందగలుగుతాడా? అంటే అది అంత తేలిక అయింది ఏమీ కాదు. అయిదు కోశాలనే పంచ ఆవరణలను దాటితే కాని అది చిక్కదు. అయితే ఆ అయిదు కోశాల్ని ఎట్లా దాటాలి అనే దానికే ''యుక్తి''కావాలి అని ఆచార్యులవారు ఉపాయం చెప్పారు. ఆ ''యుక్తి''అంటే ఏమిటి? అంటే అదే గురుజ్ఞానం, అదే జ్ఞానమార్గం, అదే సచ్చిదానందాన్ని చేరే మార్గం అయి ఉంది. దానికి కాలానికి తగిన గురువును చేరితే ఆయనే సమయానికి తగిన విధంగా, పాత్రానుగుణంగా జ్ఞానాన్ని బోధిస్తాడు. మా తాత తవ్విన నూతిలో ఉప్పునీరైనా అదే తాగుతాను అదే విధంగా కాకుండా ఆధునిక గురువు జ్ఞానాన్ని ప్రసాదించి కోశాల్ని దాటేటట్లు చేయగలుగుతాడు. శిష్యుడు గురుజ్ఞానాన్ని స్వీకరించి గురుబోధకు అనుకూలంగా సాధనచేసిననాడు సాధనలో పరిశుద్ధమైన ఆత్మానుభూతిని పొందగలుగుతాడు. సాధకుడు అంతర్ముఖం అయినప్పుడు విచిత్రమైన కాంతిని, నాదాన్ని, శబ్దాన్ని అనుభవిస్తూ లీనమయిననాడు పరిశుద్ధమైన ఆత్మలో లీనమయిన అమృత బ్రహ్మను ఆశ్వాదించ గలుగుతాడు. దానికి గురకృపే ఆలంబనం అయి ఉంది. గురు జ్ఞానమే సాధన అయి ఉంది. సాధకుడు గురుజ్ఞానాన్ని విశ్వసించి సాధన చేయగా, చేయగా బియ్యంమీద పొట్టు దంచగా, దంచగా ఎట్లా ఊడిపోతుందో అట్లాగే ఆత్మనుంచి పంచకోశాలు విడిపోయి పరిశుద్ధమైన ఆత్మతో నిలవటానికి వీలుకుదురుతుంది.
కోశం అంటే ''ఒర'' అంటే తొడుగు. ఈ పంచకోశాలనే తొడుగులకు ఆత్మ విలక్షణంగా ఉంటూ ఈ దేహాన్ని సాధనంగా మాత్రమే స్వీకరిస్తూ ఉంది దాన్ని విచారణ ద్వారా తెలుసుకొని ఆత్మను వేరుచేసి ఆత్మతో జీవించాలి. జ్ఞాని కూడా సంఘంలోనే జీవయాత్ర కొనసాగిస్తూ ఉంటాడు. కాన సమస్యలు క్షణ క్షణం ఎదురవుతూనే ఉంటాయి. పులి కూడా ఆత్మే అని తెలిసినా దూరంనుంచే నమస్కారం చేసి తప్పుకోమని రామకృష్ణ పరమహంస హితబోధ చేశారు. పులిలాగానే కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాలు అనేవి పొంచి ఉండి జ్ఞానిని కూడా కబళించటానికి, వంచించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు ఏ విధంగా మానవుని లోబరుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాయో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. వాటిని దాటిపోవటానికి తరుణోపాయాన్ని రమణ మహర్షి సూచించారు. దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడల్లా హెచ్చరికలు చేస్తూ ఆ హెచ్చరికల ద్వారా వాటిని దాటిపోవాలని సాధన మార్గాన్ని చెప్పారు. హెచ్చరికలు అనేవి పెరిగినకొద్దీ కామాదులు దూరం అవుతూ ఉంటాయి అని, అవి క్రమేపి క్రమేపి నశించి పోతాయి అనికూడా చెప్పారు. పొటమరించిన దుష్ట ఆలోచనలను ప్రారంభంలోనే తుంచి వేస్తూ ఉండాలి. ప్రత్యక్షంగా కనిపించే రూప సౌందర్యం, శబ్దమాధుర్యం అంతా కూడా మాంసం కొవ్వుతో కూడిన మాంసపుముద్దలే కాని వేరుకాదని, చీము నెత్తురుతో కూడిన మలభాండమే కాని వేరుకాదని, కంకాళానికే రూపాన్ని, శబ్దాన్ని, చైతన్యాన్ని ఆపాదించుకొని భ్రమచెందుతూ ఉన్నామని ఈ విధంగా రకరకాల హెచ్చరికలు చేసుకొంటూ గడుపుతూ ఉంటే ఉద్భవించిన ఆలోచనలు ప్రారంభంలోనే తుంచివేయటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వివిధ రకాలకు సంబంధించిన గుణలోపాల్లోన వాటివాటికి తగిన విధంగా హెచ్చరికలు చేసుకొంటూ వెళ్తూ ఉంటే నుసితో కప్పిన నిప్పును దాటటానికి మసి ఆధారం చేసుకొని తోసుకొంటూ వెళ్ళేటట్లుగా జీవితాన్ని కొనసాగించుకొంటూ వెళ్ళవచ్చు. క్షణికమైన సుఖాన్ని ప్రసాదించే విషయసుఖాలు జీవిత పరమావధి కాదని తెలుసుకొని వాటితో తృప్తి పొందటానికి ప్రయత్నించకుండా లక్ష్యసిద్ధికి అనుకూలంగా జ్ఞాని నడవాలి. ఆ విధానం అనేది నిరంతర సాధన అయి ఉండాలి. లోకంలో ఎవరైనప్పటికి ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా గడిపినా ప్రతివానికి కూడు, గూడు, గుడ్డలకు సంబంధించిన అవసరాలు తప్పవు. జ్ఞానికూడా వాటి అవసరాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైన విషయాలు ఆటంకాలుగా నిలుస్తూ ఉంటాయి. ఆయా పరిస్థితులలో జీవుడు బద్ధుడై పంచకోశాలతో తాదాత్మ్యం చెందే నడుస్తూ ఉంటాడు. కాన వాటిని ఎవరికి తగిన విధంగా వారు అధిగమించటానికి ప్రయత్నించి సంఘంలో తామరాకుమీద నీటిబొట్టులా నిలవాలి. అనంతమైన ఆనందం ఆత్మయందే ఉంది. కాని ప్రత్యక్షంగా అందుబాటులోకి వస్తూ ఉన్న వీటిలో లేదని హెచ్చరికలు చేసుకొంటూ ముందుకు నడవాలి. ఈ పంచకోశాల్ని దాటటానికి మంత్రం, తంత్రం, యంత్రం, ఉపాసనా అంటూ అనేకమంది అనేకరకాలుగా సాధనలు బోధిస్తూ ఉంటారు. అట్లాంటి వాటిలో చిక్కుకోకుండా గురుజ్ఞానం అనే ఆత్మమార్గంలోనే సాధన చేసుకొంటూ వెళ్తే సాధకుడు స్వల్పకాలంలోనే గమ్యాన్ని చేరగలుగుతాడు. ఆత్మమార్గానికి ప్రత్యక్షంగా జీవించి ఉన్న గురుమార్గమే కావాలి. ఆయన వద్దే శరీరమనే జీవిత ద్వారాన్ని దాటటానికి కావలసిన తాళం చెవి ఉంటుంది.
విచక్షణా జ్ఞానంతో వరుసగా పంచకోశాల్ని పరిశీలించినట్లయితే చావుపుట్టుకలు కలిగిన అన్నమయ కోశం శాశ్వతమైన ఆత్మకాజాలదు. అంతేకాక శరీరంలో ఒక అవయవం కాని లేక కొన్ని అవయవాలు కాని లోపించినా దేహం జీవయాత్ర కొనసాగిస్తూనే ఉంది కాన దేహం ఆత్మకాదు. దేహానికి బయట వాయువుగా సంచరిస్తూ దేహంలోపల చైతన్యంతో కూడి శ్వాసగా సంచరిస్తూ ప్రాణరూపంగా ఉన్న వాయువు జడమయిందే కాని ప్రాణశక్తికాదు. కాన ప్రాణమయ కోశం కూడా ఆత్మకాదు. జడమయిన మనస్సు నిద్రలో అదృశ్యమయినా చైతన్యం నశించలేదు కాన మనోమయకోశంకూడా ఆత్మకాదు. సుషుప్తిలో బుద్ధిలోపించినా చైతన్యం లోపించలేదు కాన విజ్ఞానమయకోశం కూడా ఆత్మకాదు. నిద్ర అనే కార్యం నెరవేరినప్పుడే పరిమితంగా చేకూరుతున్న ఆనందం తెలుసుకోవటానికి వీలుకాని స్థితిలో ఉన్నందున ఆనందమయకోశంకూడా ఆత్మకాదు. ఈ విధంగా పంచకోశాలకు విలక్షణంగా, శాశ్వతంగా ఉన్న ఆత్మానుభూతిని పొందటానికి ఆత్మజ్ఞానం కావాలి. పంచకోశాలకు చైతన్యాన్ని చేకూర్చి సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మ పంచకోశాలతో తాదాత్మ్యం చెందిన జీవుడుగా కనిపిస్తూ ఉందే కాని ఆత్మ పంచకోశాలు కాదు. ఊక, తవుడు వంటి వాటిని తొలగించి బియ్యాన్ని పొందినట్లే పంచకోశాల్ని విచక్షణా జ్ఞానంతో నైపుణ్యంగా తొలగించి ఆత్మను పొందాలి. గురుజ్ఞానం అనే యుక్తితో పంచకోశాల్ని వేరుచేసి సాధకుడు ఆత్మానందాన్ని శాశ్వతంగా అనుభవించాలి.
17 సదా సర్వగతో2 ప్యాత్మా
న సర్వత్రావభాసతే
బుద్ధావేవావభాసతే
స్వచ్ఛేషు ప్రతిబింబవత్ || 17
A»yø = ఆత్మ, సదా = ఎల్లప్పుడూ, సర్వగతః + అపి = సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికిని, సర్వత్ర = అన్నిటియందును, న అవభాసతే = ప్రకాశించుటలేదు, స్వచ్ఛేషు = పరిశుద్ధమైన (అద్దమునందు), ప్రతిబింబవత్ = ప్రతిబింబం కనిపించునట్లు, బుద్ధౌ = పరిశుద్ధమైన బుద్ధియందు, ఏవ = మాత్రమే, అవభాసతే = ప్రకాశిస్తూ ఉంది.
తా|| ఆత్మ ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నప్పటికి సర్వత్ర ఉన్నట్లు కనిపించటంలేదు. పరిశుద్ధమైన అద్దంలోనే ప్రతిబింబం కనిపిస్తూ ఉన్నట్లు పరిశుద్ధమైన బుద్ధిలో మాత్రమే ఆత్మ ప్రకాశిస్తూ ఉంది.
వివరణ :- ప్రస్తుతం మనం ఇప్పుడు పరిశుద్ధమైన బుద్ధి ఎట్లా కలుగుతుంది అని ఆలోచించాలి. పరిశుద్ధమైన బుద్ధే ప్రధానమై ఉంది. మానవుడు ప్రపంచంలో జీవిస్తూ ఉన్నప్పుడు మానవ సహజమైన కోరికలతో గడుపుతూ ఉండటం సర్వ సహజమై ఉంటుంది. కాని ఆత్మజ్ఞాని గృహస్థుడై సంఘంలో జీవిస్తూ ఉన్నప్పటికి సామాన్య మానవుడిలా కాకుండా ఒక రకమైన ప్రత్యేకతతో గడుపుతూ ఉంటాడు. ఆతడు ఆధ్యాత్మిక జ్ఞానంతో గడుపుతూ ఉంటాడు. కాన ఆతనికి కోరికలు ఉపశమించి ఉంటాయి. అవి ఆతని అదుపులో ఉంటాయి. జ్ఞాని కాన ఆతడు సంఘంలో నిమిత్త మాత్రంగా జీవిస్తూ ఉంటాడు. దానివల్ల ఆతని మనస్సుకు చంచలత్వం తొలుగుతుంది. చిత్తానికి అనుబంధాలు, ప్రేమలు, మమకారాలు అనేవి లేకుండా సమదృష్టితో సంచరిస్తూ చిత్తం నిర్వికారంగా నడుస్తూ ఉంటుంది. అహంకారం అడుగంటి ఉంటుంది. కావున ఆతనికి ఇక మిగిలింది బుద్ధి మాత్రమే అయి ఉంది. ఆ బుద్ధి కూడా నిర్మలమై, నిశ్చలమై, పరిశుద్ధమై ప్రకాశిస్తూ ఉంటుంది. కావున ఆత్మజ్ఞాని మనస్సు ఆతనికి మిత్రునిగా పరిణామం చెందుతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఆతనికి పరిశుద్ధమైన బుద్ధి ఏర్పడి శాంతిని చేకూరుస్తుంది. దాని వల్ల ఆతడు సర్వత్ర ఆత్మను దర్శించగలుగుతాడు.
జ్ఞాని నేను శరీరాన్ని కాను, నేను ఆత్మను అనే దృక్పథంతోనే ఎల్లవేళల గడుపుతూ ఉన్నప్పటికీ, లోకజ్ఞత అంతా కలిగి ఉన్నప్పటికీ కూడా దేహానికి సంబంధించిన అవసరాలకు, బంధాలకు, బంధుత్వాలకు తలవంచవలసిన అవసరాలు అడుగడుగునా ఏర్పడుతూనే ఉంటాయి. అవసరాలకు అనుకూలంగా జ్ఞాని సంచరించటానికి ఇష్టపడనినాడు లోకులు ఆతనిని నిందించే నిందలకు లోనవవలసి వస్తూ ఉంటుంది. పిచ్చివాడు, సురాపాన మత్తుడు, జ్ఞాని ఒకేలా సంచరిస్తూ ఉంటారు అని కాకులు పొడిచినట్లు ఆతనిని నిందిస్తూ ఉంటారు. నిజానికి ఆ నింద సరి అయింది కాదు. కారణం ఏమిటంటే పిచ్చివానికి, సురాపాన మత్తునికి మనస్సు పనిచేయని స్థితి ఏర్పడుతుంది. అంటే వారికి మనస్సు తాత్కాలికంగా లోకజ్ఞానానికి సంబంధం లేకుండా ఉంటుంది. కాని జ్ఞాని లోకజ్ఞత లేని స్థితిలో ఉండడు. జ్ఞాని ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే అటువంటి స్థితికి వెళ్ళటానికి ప్రతినిత్యం సాధన చేస్తూ ఉంటాడు. ఆ విధంగా సాధన చెయ్యటానికి ఎక్కువ సమయం. ఎక్కువసార్లు ప్రతినిత్యం వీలుకాకపోవచ్చు. కాన జ్ఞాని విరామ సమయాల్లో మౌనంగా, ఏకాంతంగా గడపటం అనేదాన్ని సాధన చేస్తూ ఉండటం అవసరం అవుతూ ఉంటుంది. దాని వల్ల జ్ఞాని శుద్ధబుద్ధిని గ్రహించటానికి వీలు కుదురుతుంది. కళ్ళుమూసుకొని, మౌనంగా కూర్చున్నప్పుడు మనస్సు, శరీరం, ఇంద్రియాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయో జ్ఞానికి అవగాహన అవటానికి వీలు కుదురుతుంది. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అది సరికాదు. ఎవరు మౌనంగా ఉన్నారో వాళ్ళ మనస్సుకూడా మౌనం వహించవలసిన అవసరం ఏర్పడుతుంది. హృదయస్థితమైన పరబ్రహ్మమందు ఆతని మనస్సు రమించవలసి ఉంటుంది. అంతరంగంలో ఉన్న పరమేశ్వరుని ఉపాసించవలసి ఉంటుంది. అంటే పరమేశ్వరుని సమీపమందు మనస్సుకు ఆసనాన్ని చేకూర్చవలసి ఉంటుంది. లోనున్న భగవంతుని ఆరాధించవలసి ఉంటుంది. గురువు చెప్పిన విధంగా ఏకాంతంలో ధ్యానం చెయ్యటం కాకుండా నలుగురిలో ఉంటూనే జ్ఞాని మనస్సుకు ఏకాంతాన్ని చేకూర్చటం జరుగుతుంది అన్నమాట. ఎవరి భగవంతునికి వారు నిజమైన పూజ చేయటం జరుగుతుంది అన్నమాట. అదే నిజమైన మౌనాన్ని పాటించటం అనేది అని అవగాహన చేసుకొని దాన్ని పాటించాలి. దక్షిణామూర్తి మౌనంతోనే సనక సనందనాదులకు జ్ఞానోదయాన్ని కలిగించాడని మరువరాదు. ప్రతినిత్యం ధ్యానం ఎంత ప్రధాన సాధనం అయిందో, విరామ సమయాల్లో మౌన సాధనకూడా అంత ప్రధాన సాధనం అయి ఉంది. అట్లా చేస్తూ ఉన్నప్పుడే సాధకునికి శుద్ధబుద్ధి ఏర్పడిందీ లేనిదీ సరిగా అవగాహన అవుతుంది.
ద్రష్ట దృశ్యం, దృక్కు అన్నీ ఒక్కటే అయినప్పుడు విషయానందాన్ని అనుభవించి చెప్పేవాడు ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాడు? అనుభూతికి సంబంధించిన సచ్చిదానందం యొక్క ప్రత్యేకత ఎక్కడ ఉంది? అంటే బంగారం వన్నె ఒరిపిడి రాయి నిరూపించగలిగినట్లు శుద్ధబుద్ధి ప్రత్యేకంగా మొనతేలి పరిశీలించకలిగిననాడు సచ్చిదానందం యొక్క ప్రత్యేకత బోధపడుతుంది. దానికే మౌన సాధన కావాలి. మౌనంలో ఇంద్రియాల స్వరూప స్వభావాలు అన్నీ అవగాహన అవ్వటానికి వీలుకుదురుతుంది. రమణ మహర్షి బోధించిన విచారణ మార్గం కూడా మౌన సాధనలో ప్రత్యక్షంగా అవగాహన చేసుకోవటానికి వీలు కుదురుతుంది. మనస్సు, శరీరం రెండూ నిర్మలం అయినయ్యో లేదో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాయి. కాన మౌనసాధనం అనేది పరిశుద్ధమైన అంతఃకరణానికి మెరుగులు పెట్టుకోవటానికి, పరిశుద్ధమైన బుద్ధితో నిలవటానికి అన్నివిధాలా సహాయకారిగా ఉంటుంది.
ఆత్మజ్ఞానులు అయినప్పటికి సంఘంలో అందరు జడభరతునిలా అవధూతలు కాలేరు. కాని ఆత్మజ్ఞాని అనేవాడు ఆర్తుడు, జిజ్ఞాసువు, ఆర్థార్థి, జ్ఞాని అనే విభాగాలలో ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట రకరకాల పరిస్థితులలో నిలుస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు భగవంతుని రక్షింపమని కోరేవాడు ''ఆర్తుడు'', భగవంతుని తత్త్వాన్నే తెలుసుకోవాలని గాఢమైన కోరికతో భగవంతుని ఆశ్రయించేవాడు ''జిజ్ఞాసువు'', డబ్బు కోసం భగవంతుని ఆశ్రయించేవాడు ''అర్థార్థి'', భగవంతుని తత్త్వాన్ని తెలిసికొని సర్వం భగవంతునిగా చూసేవాడు ''జ్ఞాని''అయి ఉన్నారు. జ్ఞానమార్గంలో జీవించేటప్పుడు ఉన్నతస్థాయికి చేరేవరకు జ్ఞాని అనేవాడు పైన ఉదాహరించిన నాలుగు అవస్థలలోనూ కత్తిమీద సాము చేయవలసి వస్తూనే ఉంటుంది. దానిని అర్థం చేసుకొని నడవటానికే శుద్ధబుద్ధి అవసరం అయి ఉంటుంది. ఆ శుద్ధబుద్ధితో సంఘాన్ని కూడా భగవంతుని తత్త్వానికి అనుకూలంగా మలచుకోవటానికి ప్రయత్నం చేసే సేవలో నిష్ణాతుడై నిలిచినప్పుడే ''మహాత్ముడు''గా నిలుస్తాడు. ''సేవే'' నిజంగా జ్ఞాని స్వభావాన్ని పరిశీలించుకోవటానికి ఉపకరిస్తుంది. నేను జ్ఞానిని అయ్యాను అని మునగ తీసుకొని మూల కూర్చోవటంవల్ల ఆత్మకు పరిపక్వత సిద్ధించదు. అన్నీ తెలిసి మునగతీసుకొన్నవాడే పెద్ద మనిషి అవుతాడు. జ్ఞాని శుద్ధబుద్ధితో సమతా భావంతో సంచరిస్తూ జీవించగలిగినప్పుడే లక్ష్యం సిద్ధించినట్లు అవుతుంది. మహాత్ములు లోకంలో కనిపిస్తూ ఉన్న పాపాల్ని, దుఃఖాల్ని చూస్తూ కూడా యుద్ధం చేయను అని యుద్ధంనుండి తప్పుకుపోవటానికి ప్రయత్నం చేసిన అర్జునుని వలె ఉద్వేగాన్ని పొంది సంఘాన్నుంచి తప్పుకుపోవటానికి ప్రయత్నం చేయరు. మహాత్ములు అట్లాంటి ఆవేశాన్ని ఉద్వేగాన్ని పొందకుండా శాంతచిత్తతతో, శుద్ధబుద్ధితో సంఘానికి సేవచేయటానికి, ఆత్మమార్గానికి వీలైనంత మందిని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తూనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
సంఘాన్ని, తత్త్వాన్ని, భక్తిమార్గంలోను, ఆచార వ్యవహారాల మార్గంలోను మాత్రమే చూస్తూ జ్ఞానిగా మారిన రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఇక్కడ పరిశీలించ తగి ఉంది. రామకృష్ణ పరమహంస దిగంబర యోగి నుంచి యోగ సాధనాన్ని ఆరునెలల్లోనే నేర్చుకోగలిగాడు. అట్లాంటి పరిస్థితుల్లో గురుశిష్యులు గురువుగారి హోమగుండం వద్ద కూర్చొని మాట్లాడుకొంటూ ఉండగా దారివెంటపోయే ఒక అంత్యజుడు ఆ హోమగుండంనుంచి అగ్నిని తీసుకొని చుట్టముట్టించుకొని దాన్ని మళ్ళీ హోమగుండంలో వేశాడు. అప్పుడు దాన్ని చూసిన దిగంబర యోగి నా హోమగుండాన్ని మైలపరచావు కదా, నీకు ఇంకా ఎక్కడా నిప్పుదొరకలేదా అని ఆ అంత్యజుని నిందించాడు. దాన్ని చూపిన రామకృష్ణ పరమహంస ఆ అంత్యజుడు వేరు, ఈ హోమగుండం వేరు అనే భావనతో ఉన్నంత కాలం పరిపక్వత ఎక్కడనుంచి సిద్ధిస్తుంది అని గురువుకే హితబోధ చేశాడు.
శూద్రస్త్రీ అయిన రాణీరాసమణి కట్టించిన దుర్గాదేవి ఆలయంలో రామకృష్ణ పరమహంస అన్నగారు పూజారిగా పనిచేస్తూ ఉండేవారు. సోదరుడు తయారు చేసిన దేవాలయ ఫలహారం అయినా ఆ దేవాలయం కట్టించింది శూద్ర స్త్రీ కనుక ఆ ఫలహారం మైలపడిపోయి ఉందని, దాన్ని స్వీకరించటానికి నిరాకరించిన వాడే ఈనాడు అట్లాంటి భేదభావమే తగింది కాదని గురువుకే జ్ఞానమార్గాన్ని బోధించాడు. రామకృష్ణ పరమహంస చాలా కొద్ది కాలంలోనే పరిణతి చెంది భక్తి మార్గంలో జీవిస్తూ శుద్ధభక్తికి అభివృద్ధి చెంది, విషయాలను జ్ఞానమార్గంలో తిలకించగలిగిన విధానం పరిశీలించిన తగి ఉంది. ఈ విధానం అనేది శుద్ధబుద్ధి వల్లనే చేకూరుతుంది.
ఆత్మ అఖండం అయితే ఖండఖండాలుగా ప్రతివారిలోను ఆత్మ ఎట్లా కనిపిస్తుంది. ఖండఖండాలు అఖండంగా ఎప్పుడు కలుస్తాయి. ఖండఖండాలు అఖండంగా ఏ విధంగా కలుపుతారు. అనే సమస్య సామాన్యంగా మానవులకు వస్తూ ఉంటుంది. అంతటా ఏర్పాటు చేసిన విద్యుత్తీగల్లో విద్యుచ్ఛక్తి ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది. ఎక్కడ బల్బు పెట్టుకొంటే అక్కడ వెలుగు వస్తుంది. ఆ వెలుగువల్ల అక్కడ కరెంటు ఉంది అని తెలుస్తూ ఉంది. అట్లాగే ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళకు, శుద్ధబుద్ధి ఏర్పడిన వాళ్ళకు సర్వత్ర ఉన్న ఆత్మ, తన ఆత్మ ఒక్కటే అని తెలుస్తుంది. మలిన మనస్సుకి, మలిన బుద్ధికి ఆత్మను గ్రహించటానికి, వివరించటానికి వీలుకాదు. దాని వల్ల ప్రశ్నలు పరంపరగా ఉద్భవిస్తూ ఉంటాయి. ఆత్మను దర్శించినవారు, అనుభవించినవారు చెప్పిన మాటలు నమ్మి, సాధన చేసిననాడు ఆత్మానుభవం చేకూరుతుంది.
ఆత్మానుభవం కావాలనుకొన్నవారు ముందు విషయసుఖాల మీద అలవాటు అయి ఉన్న అనుబంధాల్ని తగ్గించుకొంటూ రావాలి. దాని వల్ల క్రమేపి క్రమేపి ఇంద్రియాలు బహిర్ముఖంగా తిరగటం అనేది తగ్గుముఖం పడతాయి. సాధకుడు ఆ విధమైన ఇంద్రియాలతో జ్ఞానసాధనలో ఉంటూ ఉన్నప్పుడు ఇంద్రియాలు తేలిగ్గా అంతర్ముఖం అవుతాయి. కాన సాధకుడు గురువు ఇచ్చిన జ్ఞానం మీద శ్రద్ధ, అంతరంగంలో ఉన్న పరమేశ్వరుని యందు భక్తి గురువునందు భక్తివిశ్వాసాలు, నమ్మకం కలిగి నిరంతరం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బుద్ధి శుద్ధం అవుతుంది. అప్పుడు సాధకుడు శుద్ధబుద్ధితో ఆత్మయందు జీవించగలుగుతాడు.
ఆత్మ ఈ లోకంలో ఆచరించే రకరకాల కర్మల ద్వారా లభించదు. ఆత్మను పొందాలంటే సాధకుడు మనోమాలిన్యాల్ని తొలగించుకోవాలి. శుద్ధ బుద్ధి అనేది ఒక్కసారిగా ఆకాశంనుంచి ఊడిపడదు. సాధకుడు ప్రతినిత్యం ఆత్మజ్ఞాన సాధనతో శుద్ధబుద్ధిని పెంపొందించుకోవాలి. ఆత్మదర్శనం ఇవ్వకపోవటానికి గల లోపం ఆత్మలో లేదు. లోపం అనేది మానవుని మనస్సులో ఉంది. మనస్సును ఆశ్రయించి జీవిస్తూ ఉన్న శరీరం, ఇంద్రియాలలో ఉంది. కాన మనస్సు, శరీరం, ఇంద్రియాలు వంటి వాటి మాలిన్యాలు తొలగించుకొంటే పరిశుద్ధమైన అద్దంలో బింబం స్వచ్ఛంగా కనిపించినట్లు ఆత్మ శుద్ధబుద్ధిలో ప్రకాశమానంగా కనిపిస్తుంది. కత్తుల బోనువంటి ప్రపంచంలో మాయ అనే కత్తుల వంతెననుండి బయటపడటానికి ఎన్నో మార్గాలు అవలంబించవలసి వస్తూ ఉంటుంది. జ్ఞాని అయినా ఈ మాయను దాటటానికి గురుకృపనే శరణుగా స్వీకరించాలి. జ్ఞాని అయినా సంఘంలో జీవిస్తూ ఉన్నంతసేపూ నెత్తిమీద కత్తి వేళ్ళాడుతూ ఉంటే దాని కింద భోజనం ఆనందాన్ని ఎట్లా ఇవ్వదో అట్లాగే సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేడు. అయినప్పటికి సంఘంలోనే జీవిస్తూ శుద్ధబుద్ధితో ఆత్మను తిలకించినవారు ఉన్నారు.
రమణ మహర్షి దగ్గరకు వచ్చిన ఒక పృచ్ఛకుడు ''స్వప్నంలో వలె ఒక్కొక్క వేళ వస్తువులూ, మనుష్యులూ, అనిర్వర్యమూ, స్ఫటిక నిర్మలమూ అయిన రూపాలు గైకొన్నట్లు కనిపిస్తారు. వారిని చూస్తే, ఎవరో బయటి వారిని చూసినట్లుండదు. అంటీఅంటనట్లుగా వారి సాన్నిహిత్యం తెలుస్తుంటుంది. కాని తానుగా వారిని తెలుసుకొంటున్నా ననిపించదు. మనస్సు శాంతి గంభీరంగా ఉంటుంది. ఆత్మలో మునిగిపోయే తరుణాలు అట్టివా?'' అని ప్రశ్నించారు. రమణమహర్షి శోధించే ''నేను''ను బోధించి కనుగొన్న వ్యక్తి అడిగిన దానికి రమణమహర్షి ''మనస్సులో శాంతిలోపాలు చేతనమూ ఉంది. ప్రాప్యమైన స్థితే ఇది. ఈ స్థితిని గూర్చి సంశయం వచ్చిందంటే అదే ఆత్మ స్థితి అని తెలియలేదని, ఆ స్థితి ఇంకా తాత్కాలికమై, స్థిరపడలేదని స్పష్టం అవుతుంది'' అని చెప్పారు. ఈ విధంగా శుద్ధబుద్ధిని తిలకించి సర్వత్ర ఆత్మను తిలకించినవారు ఉన్నారు. కాన సాధనచేసి సాధకులు సచ్చిదానందాన్ని అనుభవించాలి.
అయితే ఈ ఆత్మప్రబోధం అనే ప్రచారం ఎందుకు, ఎవరికి కావలసి వస్తే వాళ్ళు వాళ్ళంతటవాళ్ళు శోధించుకొంటారుగదా అంటే ఆత్మజ్ఞానానికి జీవించి ఉన్న గురవు కావాలి. అందువల్ల ఆత్మ ప్రబోధాన్ని జ్ఞానులు స్వీకరించారు. జ్ఞానులు అనుభవిస్తూ ఉన్న ఆనందాన్ని తోటి మానవులకు అందించాలనే సత్సంకల్పంతో, ఉత్తమ ఆదర్శంతో, ఉత్తమ ఆశయంతో అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. దానివల్ల దేహమే ప్రధానమని, తానే సర్వస్వమని భావన చేసి దుఃఖాల్లో కూరుకుపోతున్న సామాన్యమానవులకు ఆత్మజ్ఞానం సంజీవనిలా పనిచేస్తూ ఆత్మానందాన్ని చేకూరుస్తూ ఉంది.
18 దేహేంద్రియ మనోబుద్ధి
ప్రకృతిభ్యో విలక్షణమ్
త ద్వృత్తి సాక్షిణం విద్యాత్
ఆత్మానం రాజవత్సదా || 18
దేహ = శరీరం, ఇంద్రియ = ఇంద్రియాలు, మనః = మనస్సు, బుద్ధి = బుద్ధి, ప్రకృతిభ్యః = ప్రకృతి కంటే, విలక్షణం = వేరుగా ఉన్నటువంటిదియు, తత్ + వృత్తి సాక్షిణం = ఆయా ఇంద్రియ వృత్తులకు సాక్షిగా ఉన్నటువంటిదియు అయిన, ఆత్మానం = ఆత్మను, సదా = ఎల్లప్పుడు, రాజవత్ = రాజువలె, (సాక్షిగా ఉండునటువంటిది అని), విద్యాత్ = తెలిసికొనుము.
తా|| శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రకృతుల కంటే విలక్షణంగా ఉన్నటువంటియు, ఆయా వృత్తులకు సాక్షిగా ఉన్నటువంటిదియు అయినటువంటి ఆత్మ ఎల్లవేళల రాజువలె సాక్షిగా ఉంటుందని తెలుసుకోవాలి.
వివరణ :- వృత్తి అంటే నడవడిక, జీవనోపాయం అనే అర్థాలు ఉన్నాయి. మానవునిలో ఉన్న శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రకృతి వీటి అన్నిటి నడవడికకు, జీవనోపాయానికి ఆత్మ సాక్షిమాత్రంగానే నడుస్తూ ఉంది. సాక్షి అంటే జరుగుతూ ఉన్న వాటిని ప్రత్యక్షంగా చూస్తూ ఉండటమే. ఆత్మ అట్లా చూస్తూనే గడుపుతూ ఉంది. మానవునిలో ఉన్న అన్ని అవయవాలు కూడా వాటివాటి జీవనోపాధికి తగినట్లుగా అని నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ ఆ విధంగా నడవటానికి కావలసిన జీవచైతన్యాన్ని, శక్తిని కూడా ఆత్మ ఇస్తూనే ఉంది. అయినప్పటికి దేహానికి సహజమైన నేను అనే అహంకారంతో ఆ దేహం సంచరిస్తూనే ఉంటుంది. ఆత్మను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా దేహం స్వేచ్ఛగా జీవిస్తుంది. సుషుప్త్యవస్థలో అనగా గాఢనిద్రలో తప్పితే మిగిలిన జాగ్రదవస్థలో, స్వప్నావస్థలో మనస్సునేను అనే అహంభావంతోనే గడుపుతుంది. గాఢనిద్రలో బీజరూపంలో ఉన్న నేను అనే మానవ సహజమైన వ్యక్తిత్వం మేల్కోగానే దేహాన్ని ఆశ్రయించి రజోగుణం, తమోగుణంతో నడుపుతుంది. ఆ విధంగా కోరికలతో, అవసరాలతో, ఆకలి దప్పులతో, త్రిగుణాలతో జీవించటం అనేది మనస్సు సహజ లక్షణం అయి ఉంది. ఆ విధానం ఆత్మ లక్షణం కాదు. మనస్సు సకల దుఃఖాలు, బాధలు, సుఖాలు అనుభవిస్తూఉంటే ప్రత్యక్షంగా చూస్తూ, వాటికి కావలసిన శక్తిని ఇస్తూ ఆత్మ సాక్షిమాత్రంగా ఉంటుందే కాని దేనిలోను ప్రమేయం కల్పించుకోదు. సుషుప్తిలో ఇంద్రియాలు, మనస్సు, శరీరం గాఢనిద్రలో లయించిపోగా ఆత్మ చైతన్యం మాత్రం సాక్షిమాత్రంగానే గడుపుతుంది. నిద్రలో కొనసాగించవలసిన శ్వాసక్రియ, జీర్ణశక్తి, మాలిన్యాన్ని బహిర్గతం కావించటం మొదలైన వాటిని వెన్నుపూస వెనుక ఉన్న Reflective nerves నడుపుతుంటే ఆత్మసాక్షిగా నిలుస్తుంది. ఆ గాఢనిద్రాసమయంలో Reflective nerves మనస్సు నుంచి ఆజ్ఞలను తీసుకోకుండానే స్వేచ్ఛగానే కార్యాల్ని నిర్వహిస్తాయి. అందుకేనేమో రమణ మహర్షి మానవుని ప్రాణం వెన్నుపూసలో ఉంది అన్నారు. దీని వల్ల తెలుసుకోవలసింది ఏమిటంటే మానవునిలోని అన్ని అవయవాల జీవనోపాయం అనే వాటి నడవడిక ఆత్మ చైతన్యం వల్లే జీవిస్తూ, ఆత్మ చైతన్యంలోనే లయిస్తూ ఉన్నాయి. ఆత్మ అంటే ఆనంద స్వరూపం, జ్ఞాన స్వరూపం అయి ఉంది. వస్తు ప్రపంచం ఉన్నంతసేపు ఆత్మ ఆయా వస్తువుల్ని చూట్టానికి, వింటానికి, భావించటానికి, ఆయా విషయాలు అనుభవించటానికి కావలసిన చైతన్యశక్తిని ఇచ్చి, ఆయా గుణాలుగా కనిపిస్తూ ఉంది. ఆ చూడటం, ఆ వినటం, ఆ వాసన చూడటం, ఆ రుచిని ఆస్వాదించటం, ఆ స్పర్శాజ్ఞానాన్ని పొందటం అయిపోగానే ఆత్మ మళ్ళీ చైతన్యంగా మారిపోతూ ఉంది. అంతేకాని ఆత్మ ఏ కార్యం చేయటంలేదు. కానీ ఆత్మ ఈ ప్రపంచం ఉన్నంతసేపు తాను ఇంద్రియాలు పనిచేయటానికి అనుకూల శక్తిని ఇస్తూ వాటిని తెలుసుకొంటునే ఉంది. ప్రపంచం లోపించగానే తాను నిష్ర్పపంచం అయిపోతుంది. తాను వస్తు రహితమైన చైతన్యంగానే భాసిస్తూ ఉంది. కాన వృత్తులన్నీ మనోస్థాయికి సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవి కావు. కాన జాగ్రదవస్థలోను, స్వప్నావస్థలోను జరిగేవి అన్నీ కూడా సంబంధిత సత్యాలేకాని నిత్యసత్యాలు కావు. ఆత్మజ్ఞానం అనేది నిత్యసత్యం. ఆత్మ జ్ఞాన స్వరూపిణి. అది స్వయంప్రకాశ##మై అలరారుతుంది. అదిదేశకాలాదులకు, అవస్థాత్రయానికి అతీతంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందువల్లనే ఆత్మను సాక్షిమాత్రమైంది అని, రాజువలె సాక్షిమాత్రంగా ఉంటుంది అని ఆచార్యులవారు బోధించారు.
రాజు తన రాజ్యంలో జరిగే సమస్త కార్యాల్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆయనకు తెలియకుండా ఏ రాచకార్యం జరుగదు. అయినా ఆయన ఏ పనీ చెయ్యడు. రాజుగారి సిబ్బంది మాత్రమే ఆ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఉంటుంది. రాజు అన్నిటికీసాక్షి మాత్రుడే అయి ఉంటాడు. అదే విధంగా ఆత్మకు దేహంలో జరిగే ఏ వృత్తులకు గాని, ఆ వృత్తులవల్ల వచ్చే పాపపుణ్యాలకుగాని, అజ్ఞానంచేత జరిగే కలుషితాలకుగాని ఏ విధమైన బాధ్యత లేదు. ఆత్మ నిర్మలమై, నిశ్చలమై, ప్రశాంతమై సాక్షిమాత్రంగానే గడుపుతుంది.
రమణ మహర్షిని ఆశ్రమ ఆస్తుల విషయమై అరుణాచలేశ్వరుని కేసులో విచారణ కొరకు పదిరోజుల పాటు కోర్టు మెజిస్ట్రేటులు ఆశ్రమానికి వచ్చి నానారకాలుగా ప్రశ్నలు వేస్తూ, విసిగిస్తూ విచారించారు. రమణమహర్షి ఏమాత్రం అలసిపోలేదు. ఆఖరుకు ఆ మెజిస్ట్రేటులు మిమ్మల్ని ఈ విధమైన విచారణతో చాలా బాధపెట్టాం అని బాధపడ్డారు. రమణ మహర్షి మాత్రం నాకేమి బాధలేదు అన్నారు. మీరు ఈ విధంగా ఎన్నాళ్ళు అడిగినా నేను బాధపడేది ఏమీ లేదు అని అన్నారు. అంతేకాకుండా ఇవి అన్నీ శరీరానికే గాని ఆత్మకు సంబంధించినవి కావు అని అన్నారు. ఆయన ఆత్మతోనే జీవిస్తూ ఉన్నారు కాన, ఆయన సాక్షిమాత్రుడుగానే ఉంటూ ఉన్నారు కాన ఈ విషయాలతో ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతటి నిష్క్రియాపరులై సాక్షిమాత్రంగా ఆయన జీవించారు.
మా గురువుగారైన బాలయోగీశ్వర్ సంత్ మహారాజ్‌జీగారు ఆధునిక కాలంలో సాక్షిమాత్రంగా ఉండటానికి చక్కటి నిదర్శనంగా ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ కనిపిస్తూ ఉంటారు. ఆయన విమానాల్లోనూ, కారుల్లోనూ తిరుగుతూ ఉన్నా, అనేక సుందర భనవాల్లో జీవిస్తూ ఉన్నా అనేక ఆశ్రమాల్లో అనేకమంది శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఉన్నా ఆయన తామరాకుమీద నీటిబొట్టులాగానే జీవిస్తూ ఉంటారు. ఆయన స్థానంలో ఎవరైనా ఉండి ఉంటే సెకండులో అరవయ్యో భాగంలో ఉండే సమయంలోనే మిలియన్ల ముక్కలు కింద అయిపోయి ఉండేవారని వారే ఒక సందర్భంలో వివరించి ఉన్నారు. సంవత్సరంలో ఒక్క నలభై రోజులు తప్ప మిగిలిన మూడు వందల ఇరవై అయిదు రోజులూ కూడా ఆత్మబంధువుల సేవకోసమే ఆయన వినియోగిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సూర్యోదయం, సూర్యాస్తమయం అనేవి కూడా లెక్కచేయకుండా ప్రపంచం అంతా సొంత విమానంలో సంచరిస్తూ బ్రాహ్మిమూర్తిగా వెలుగొందుతూ ఉంటారు. త్రిమూర్తుల రూపం అయి ఉన్న ఆయన అందరికీ సచ్చిదానందాన్ని అందించాలని, అందరిని దుఃఖ సముద్రం నుంచి దాటించాలని సేవచేస్తూ ఉంటారు. ఇంటింటి తలుపు తట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, అందరూ ఆత్మమార్గంలో జీవించేటట్లు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మ బంధువులు అందరూ ఆత్మజ్ఞానానికి అర్హులే అనీ, అందరూ ఆత్మ జ్ఞానంతో అంతర్ముఖులై నిజమైన భగవంతునికి అర్చన చేసేటట్లు చూడాలనీ ఆయన సేవ చేస్తూ ఉంటారు. కోటిమందికి పైగా శిష్యులు కలిగిన ఆయన సంసారం ఎంతపెద్దదో ఆలోచించి చూడండి. ఇంతమందికి సుఖశాంతుల్ని ప్రసాదిస్తూ, నిరంతరం ఇతరులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, ప్రపంచాన్నే శాంతిమయం చేయాలనే సంకల్పంతో సేవచేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. సమస్యలు ఉత్పన్నమై చికాకుగా ఉన్నప్పుడు జ్ఞానంతో కూర్చుంటే వాటంతట అవే విడిపోయి నెరవేరిపోతూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. ఆ విధమైన గురువును ఆశ్రయించి, జ్ఞానాన్ని పొంది అందరూ జ్ఞానంతో జీవిస్తూ సంఘంలో సాక్షిమాత్రంగా జీవించాలి.
వశిష్ఠులవారు భార్యాపిల్లలు కలిగి ఉన్నా ఆయన సంఘంలో సాక్షిమాత్రంగానే జీవించగలిగారు. ప్రహ్లాదుడు సర్వత్రా భగవంతుని దర్శిస్తూ సాక్షిమాత్రంగానే గడపగలిగాడు. హిరణ్యకశిపుడు తన హృదయంలో ఉన్న పరాత్పరుని చూడకుండా తన సోదరుణ్ణి చంపిన వాడికోసం ప్రపంచమంతా వెదికాను, వాడెక్కడా నాకు కనపడలేదు. వాడు ఎక్కడున్నాడో నాకు చూపించరా అని ప్రహ్లాదుని అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ చూడాలనుకొంటే అక్కడే ఉన్నాడు అంటాడు. సంఘంలో సాక్షిమాత్రంగా జీవిస్తూ ఉన్నవాడికి భగవంతుడు ప్రతిచోట దర్శనమిస్తాడు. అంబరీషుడు దుర్వాసునిచేత బాధకు లోనవబోతున్నాను అని తెలిసి కూడా తన రక్షణ కోసం తనవద్ద ఉంచిన విష్ణుచక్రాన్ని కూడా శరణు వేడకుండా సాక్షిమాత్రంగానే ఉండిపోతాడు. కావున సాధకులు జీవన విధానంలో సాక్షిమాత్రంగా జీవించటానికి నిరంతరం సాధనచేస్తూ జీవిస్తూ ఉండాలి. గాంధీ మహాత్ముడు సాక్షిమాత్రంగానే జీవించగలిగాడు.
19 వ్యాపృతే ష్వింద్రియేష్వాత్మా
వ్యాపారీ వావివేకినామ్
దృశ్యతే 2 భ్రేషు ధావత్సు
ధావన్నివ యథా శశీ || 19
¸R…V´y = ఏ విధంగా అయితే, అభ్రేషు = మేఘాలు, ధావత్సు = కదులుతూ ఉండగా, శశీ = చంద్రుడు, ధావన్నివ = పరుగిడుతూ ఉన్నట్లుగా (కనిపిస్తూ ఉందో ఆ విధంగా), ఇంద్రియేషు = ఇంద్రియాలు, వ్యాపృతేషు = చలిస్తూ ఉండగా, అవివేకినాం = అజ్ఞానులకు, ఆత్మా = ఆత్మ, వ్యాపారీవ = చలిస్తూ ఉన్నట్లు, దృశ్యతే = గోచరిస్తూ ఉంది.
తా|| ఆకాశంలో మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడు పరుగెత్తుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుందో అట్లాగే ఇంద్రియాలు విషయ ప్రపంచంలో క్రీడిస్తూ ఉంటే అజ్ఞానులకు ఆత్మ క్రీడిస్తూ ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంటుంది.
వివరణ :- సామాన్య మానవునికి ఆత్మజ్ఞానం లేకపోవడం చేత ఆత్మ అంటే ఏమిటో తెలియక, ఆత్మ జ్ఞానం తీసుకోకపోవటంవల్ల, ఆతనికి దేహమే ఆత్మ అనే భ్రాంతి కలుగుతూ ఉంటుంది. ఆతడు ఆత్మను అనాత్మగాను, అనాత్మను ఆత్మగాను భావించటం వల్ల భ్రమ ప్రమాదాలకు లోనవుతూ ఉన్నాడు. శుద్ధచైతన్యమైన జీవశక్తి శరీరానికి, మనస్సుకు, ఇంద్రియాలకు శక్తిని ఇస్తూ ఉండటం వల్ల ఆ జీవశ##క్తే అన్నీ చేస్తూ ఉంది అని భ్రమపొందుతూ ఉన్నాడు. దాని వల్లే శుద్ధచైతన్యమైన ఆత్మే సర్వకార్యాలు చేస్తూ ఉంది అని అజ్ఞానంచేత సామాన్య మానవుడు అనుకొంటూ ఉన్నాడు. కానీ అది నిజం కాదని ఎట్లా తెలుస్తుంది అంటే క్రింద ఉదహరిస్తూ ఉన్న వాటిని తిలకిస్తే బాగా అర్థం అవుతుంది.
ఒక ఆవిరి యంత్రం నడుస్తూ ఉంటుంది. ఆ నీటి ఆవిరి ఆ యంత్రం అట్లా నడవాలి అని అనుకోలేదు. ఆ నీటి ఆవిరికి సంబంధించిన శక్తిని యంత్రానికి ఉపయోగించారు. దానివల్ల యంత్రం నడిచింది. అట్లాగే విద్యుచ్ఛక్తి వల్ల బల్బు వెలుగుతుంది, రైలు ప్రయాణం చేస్తూ ఉంది, యంత్రాలు నడుస్తూ ఉన్నాయి. విద్యచ్ఛక్తి ఈ కార్యాలు ఏవీ చెయ్యాలని అనుకోలేదు. ఆ విద్యుచ్ఛక్తి యందున్న శక్తి వల్ల ఆయా కార్యాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఆ విధంగానే ఆత్మశక్తి వల్ల మానవుని మనోబుదధీంద్రియాలన్నీ పనిచేశాయి. జడమైన శరీరం శుద్ధచైతన్యమైన ఆత్మశక్తి చేత నడుపబడుతూ ఉంది. భగవంతుడు ఉత్తమమైన ఇంజనీయరులా మానవునకు కావలసినవి అన్నీ ఇచ్చి అందులో బ్యాటరీ వంటి ఆత్మ శక్తిని పెట్టి వదిలేశాడు. ఆ ఆత్మ చైతన్యం పనికి ఉపయోగపడినంత కాలం ఉపయోగపడి మానవుని అంత్యకాలానికి అది తప్పుకు పోతుంది. ఆ చైతన్యం తప్పుకొన్న తర్వాత మిగిలింది ఏమిటి ? జడమైన శరీరం, మనస్సు, ఇంద్రియాలు. ఇవి అన్నీ మరణించక పూర్వం కూడా ఉన్నాయి. మరణించిన తర్వాత కూడా ఉన్నాయి. మానవుడు వివేచనతో ఆలోచించి పరిశీలించి చూసిననాడు తెలిసింది ఏమిటి ? చైతన్యశక్తి లోపించింది అని. భగవంతుడైన ఆ చైతన్యశక్తికి ఈ మనస్సును, ఈ ఇంద్రియాలను, ఈ శరీరాన్ని ''నేను'' అనే అహంకారంతో నడపాలనే ఆలోచనలేదు. ఆ ఆత్మ సహజ స్వభావం ఆనందం అయి ఉంది. కనుక ఆనందాన్ని కనుక్కొని దాని ద్వారా తనను చేరమని ఆ భగవంతుడు దేహానికి ఆ చైతన్యశక్తిని ప్రసాదిస్తే సామాన్య మానవుడు దాన్ని దేహమే అనే భ్రాంతితో దుర్వినియోగం చేసుకొంటూ ఉన్నాడు. దేహమే ఆత్మ అని నమ్మి, ఆత్మే అన్నీ చేస్తూ ఉంది అంటూ సంచరిస్తూ ఉన్నడు. అది సరైంది కాదు. కాన ఆత్మ సాధకుడు భగవంతుడు శరీరాన్ని ఎందుకు ప్రసాదించాడో తెలుసుకొని శరీరాన్ని సద్వినియోగం చేసుకొని, జీవశక్తి అయిన ఆత్మతో జీవించి, భగవంతుని చేరి ఆనందించాలి.
చంద్రుడు మబ్బులకు అవతల ఉండటం వల్ల, మబ్బులకు ఇవతల ఉన్న మానవుడు కదులుతున్న మబ్బుల్ని గ్రహించలేక, కదలని చంద్రుని చూస్తూ చంద్రుడు కదులుతూ ఉన్నాడు అని భ్రమపడుతూ ఉన్నాడు. అది భ్రాంతి వలన చేకూరిందే కాని వేరు కాదు. మబ్బులు లేనప్పుడు చంద్రుని తిలకిస్తే చంద్రుడు కదలటం లేదు అని తెలుస్తూ ఉంది. రైలులో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రక్కన ఉన్న చెట్లు పొలాలు అన్నీ గిర్రున తిరుగుతూ కదిలిపోతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. కారణం కదలకుండా ఉన్నటువంటి వ్యక్తికి కదలకుండా ఉన్నటువంటి చెట్లకు మధ్య కదులుతున్న రైలు ఉంది కాన కదులుతున్నరైలు మీద కళ్ళు నిలుచుట వల్ల, చలించు స్వభావం వల్ల కళ్ళకు చెట్లు చేమలు అన్నీ కూడా కదిలి వెళ్ళిపోతూ ఉన్నట్లు భ్రమకొల్పుతుంది. మనం ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే నావ కదులుతూ ఉండగా గట్టునున్న చెట్లు చేమలు కదులుతూ ఉన్నట్లు భ్రమకొల్పుతూ ఉంటుంది. మనం ఒక రైలు బండిలో కూర్చొని ఉండగా మన బండి కదలకుండా స్టేషనులో ఆగి ఉంది అని అనుకోండి. ప్రక్కనున్న పట్టాలమీద బండి కదిలివెళ్తూ ఉంటే మన బండి కదిలి వెళ్తూ ఉన్నట్లు భ్రమకొల్పుతుంది. కదిలివెళ్తూ ఉన్న దాన్ని తదేకంగా చూస్తూ ఉండటం వల్ల చలించే స్వభావం కల నేత్రాలు తమలో చలనాన్ని భావించి చలించని దాన్ని చలిస్తూ ఉన్నట్లు పొరపడుతూ ఉంది. కదులుతున్న రైలుబండి నుంచి కదలకుండా ఉన్న రైలుమీదికి దృష్టిని మళ్ళిస్తే కదిలే బండి ఏదో కదలని బండి ఏదో తెలుస్తుంది. కావున దేహంలో ఏవి చలిస్తూ ఉన్నాయో ఏవి చలించటం లేదో తెలుసుకోవటానికి ఆత్మజ్ఞానం పొంది అంతర్ముఖం అయి ఆత్మతో సాధకుడు జీవిస్తే శుద్ధచైతన్యమైన ఆత్మకు సర్వేంద్రియాల కార్యాలకు ఏ సంబంధం లేదు అని తెలుస్తుంది. ఆత్మ నిశ్చలమైంది, సత్యమైంది, శాశ్వతమైంది, ప్రకాశమానమైంది, జ్ఞాన స్వరూపిణి అని అర్థం అవుతుంది. సాధకునికి ధ్యానంలో శరీరానికి సంబంధించిన నేను అనే అహం నశించిపోతుంది. శుద్ధచైతన్యమే మిగులుతుంది. కాన శుద్ధచైతన్యం కదలటంలేదు అని, ఏ కార్యాలు నిర్వహించటంలేదు అని, దానికి ఏ కాంక్షాలేదు అని, శాంతి సౌఖ్యాలకు అది నిలయం అని తెలుస్తుంది.
సామాన్య మానవులు నిరంతరం విషయలోలత్వంలో ఉండటం వల్ల, చలించే ఇంద్రియాలకు దాసులై జీవిస్తూ ఉండటం వల్ల ఆత్మే చలిస్తూ ఉంది అని భ్రాంతి చెందుతూ ఉన్నారు. ఇంద్రియాలు విషయాలతో కదులుతూ ఉన్నప్పుడు, నిరంతరం చలించే స్వభావం కలిగిన మనస్సు ఇంద్రియాలతో సంయోజనం చెంది నిరంతరం కదులుతూ ఉండటంవల్ల, ఆ మనస్సుకు ఆధారమైన ఆత్మ కదులుతూ ఉంది అని భ్రాంతికి లోనవుతూ ఉన్నారు. ఆత్మ సాక్షిమాత్రంగనుక మనస్సు, ఇంద్రియాలు, శరీరం వంటి వాటి కార్యాలతో ఆత్మ సంబంధం కలిగిలేదు. కాన కదలని రైలుబండి కదిలే రైలుబండి ప్రక్కన ఉన్నదాని వలె ఆత్మ కదలకుండా ఉంది. కాన భ్రమచేత ఆత్మ కదులుతూ ఉంది అని అలపిస్తూ ఉంది అని, అది భ్రాంతే కాని నిజంకాదు అని తెలుసుకోవలసి ఉంది. శ్రీ కృష్ణ భగవానుడు దీన్నే భగవద్గీతలో, కర్మసన్యాస యోగంలో (5-8, 9) స్పష్టంగా వివరించాడు. తత్త్వవిదుడైన జ్ఞాని అనగా ఆత్మజ్ఞానం తెలిసినవాడు చూస్తూ వింటూ, తాకుతూ, వాసనచూస్తూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ గాలి వదుల్తూ, మాట్లాడుతూ, విసర్జిస్తూ, గ్రహిస్తూ, కళ్ళు తెరుస్తూ, మూస్తూ (ఈ కార్యాలయందు కూడా) ఇంద్రియాలు విషయాలందు చరిస్తూ ఉన్నాయేకాని నేను ఇసుమంతైనా చేయటంలేదు అనే భావించగలుగుతాడు అని వివరించి చెప్పారు. వీటి అన్నిటివల్ల అజ్ఞానంతో మేఘాల కదలికలు చంద్రునియందు ఆరోపించినట్లు ఇంద్రియాల చలనాలను ఆత్మయందు ఆరోపిస్తూ ఉన్నారు అని తెలుసుకోవాలి.
20 ఆత్మచైతన్య మాశ్రిత్య
దేహేంద్రియ మనోధియః
స్వక్రియార్థేషు వర్తన్తే
సూర్యలోకం యథాజనాః || 20
¸R…V´y = ఏ విధంగా అయితే, జనాః = మానవులు, సూర్యలోకం = సూర్యుని కాంతిచేత (వారివారి కార్యకలాపాల్లో వ్యవహరిస్తూ ఉన్నారో అట్లాగే), ఆత్మచైతన్యం = ఆత్మచైతన్యాన్ని, ఆశ్రిత్య = ఆశ్రయించి, దేహ +ఇంద్రియ మనః + ధియః = దేహం ఇంద్రియాలు మనస్సు బుద్ధి, స్వక్రియ + అర్థేషు = వాటి వాటి కార్యాలందు, వర్తంతే = వ్యవహరిస్తూ ఉన్నాయి.
తా|| ఏ విధంగా అయితే మానవులంతా సూర్యకాంతిని ఆశ్రయించి వాళ్ళ వాళ్ళ పనుల్ని నెరవేర్చుకొంటూ ఉన్నారో అదే విధంగా ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించి దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా వాటి వాటి పనుల్లో నడుస్తూ వాటి వాటి పనుల్ని చేసుకొంటూ ఉన్నాయి.
„sª«sLRißá :c xqsWL][ùµR…¸R…VLi NSgS®ƒs[ ª«sWƒ«sª«soÌÁLi»y Fsª«sLji xmsƒ«sVÌÁV ªyÎÏÁ§þ ¿Á[xqsVN]LiÈÁW DLiÉØLRiV. A NSLRiùNRPÍØFyÌÁª«sÌýÁ D»R½öƒ«sõª«sV¹¸…[Vù xqsVÅÁµR…VMÆØÌÁNRPVgS¬s, ÍØ˳ÏÁƒ«suíyÌÁNRPVgS¬s xqsWLRiVù¬sNTP G xqsLi‡ÁLiµ³R…Li ÛÍÁ[NRPVLi²y®ƒs[ @ª«s¬dsõ ƒ«s²T…ÀÁF¡»R½W DLiÉØLiVV. @ÉýØlgi[ ª«sWƒ«sª«so¬s aRPLkiLRiLiÍÜ[ Dƒ«sõ ª«sVƒ¯[‡ÁVµôðk…Liúµj…¸R…WÌÁª«sÌýÁ D»R½öƒ«sõª«sV¹¸…[Vù xqsVÅÁµR…VMÆØÌÁNRPV, LSgRi®µ…[*uyÌÁNRPV NRPW²y A»R½øNRPV G xqsLi‡ÁLiµ³R…Li ÛÍÁ[NRPVLi²y®ƒs[ ªyÉÓÁNTP @„s ƒ«s²T…ÀÁF¡»R½W DLiÉØLiVV. A»R½øaRPNTPò INRPäÛÉÁ[ @LiVV DLiµj…. @LiVVƒ«sxmsöÉÓÁNTP µy¬sõ ª«sWú»R½Li ª«sVƒ«sxqsV=, ‡ÁVµôðj…, BLiúµj…¸R…WÌÁV LRiNRPLRiNSÌÁVgS Dxms¹¸…WgjiLi¿RÁVN]LiÈÁW DƒyõLiVV. xqsWLRiVù²R…V ÀdÁNRPÉÓÁ¬s »]ÌÁgjiLiÀÁ ÍÜ[NS¬sNTP úxmsNSaS¬sõ BxqsWò ª«sWƒ«sª«sN][ÉÓÁNTP G „sµ³R…LigS Aµ³yLRi˳ÏÁW»R½LigS DLiÈÁW Dƒyõ²][ A „sµ³R…LigS®ƒs[ A»R½ø NRPW²y »R½ƒ«s ÒÁª«saRPNTPò¬s ÇÁ²R…\®ªsVƒ«s aRPLkiLRiLi, ª«sVƒ«sxqsV=, BLiúµj…¸R…WÌÁNRPV BÀÁè ¾»½[ÇÜ[ª«sLi»R½Li, aRPNTPòª«sVLi»R½Li ¿Á[xqsWò G„dsV @LiÈÁNRPVLi²y®ƒs[ gRi²R…Vxmso»R½W DLiµj…. úxmsxmsLi¿RÁLiÍÜ[ Dƒ«sõÈÁVª«sLiÉÓÁ INRPä ª«sWƒ«sª«soÛÍÁ[ NSNRP xqsª«sVxqsòQ\®ªsVƒ«s ÇÁ²R…xmsµyLóSÌÁ¬dsõ NRPW²y @ÅÁLi²R…\®ªsVƒ«s A»R½ø¿Á[¾»½[ \¿Á»R½ƒ«sùª«sLi»R½Li @ª«so»R½W DƒyõLiVV. @ª«s¬dsõ NRPW²y ª«sV×dÁþ @Li»R½Li @ª«s*gS®ƒs[ A»R½øÍÜ[®ƒs[ ÖdÁƒ«sLi @ª«so»R½W DƒyõLiVV. ˳ÏÁgRiª«sLi»R½V²R…V xqsª«sVxqsò xqsXztísQNTP Aµ³yLRi˳ÏÁW»R½\®ªsV, @¬sõLiÉÓÁ¬s xqsXztísQLiÀÁ, @ª«sùQQNRPòLigS DLiÈÁW, @¬sõÉÓÁNTP aRPNTPò¬s BÀÁè, @¬sõÉÓÁ¬s ƒ«s²R…Vxmso»R½W Gµk… @LiÈÁNRPVLi²y ryOTPQª«sWú»R½LigS®ƒs[ DLiÈÁW Dƒyõ²R…V. xqsLRi*ú»R½ ªyùzmsLiÀÁ Dƒ«sõ AxmsLRiª«sW¾»½[ø xqsXztísQ, zqós¼½, ÌÁ¸R…WÌÁƒ«sV NS„sxqsWò Dƒyõ²R…V. ª«sWƒ«sª«s aRPLkiLS¬sNTP A»R½øNRPW²y @Li¾»½[ @LiVV DLiµj….
దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా జడమైనవే కాన వాటంతట అవి ఏమీ చెయ్యలేవు. అవి అన్నీ కూడా ఆత్మ ఇచ్చే జీవశక్తితోనే వాటి వాటి ప్రవృత్తులకు అనుకూలంగా మనుగడ సాగిస్తూ ఉంటాయి. మానవుని దేహంలో భగవంతుడే ఆత్మ స్వరూపుడై ఉన్నాడు. ఆత్మ మానవ శరీరాన్ని అంతటినీ చైతన్యం చేస్తూ ఉంది. ఆత్మ సూర్యుని వలె మానవ శరీరం అంతటా ప్రకాశిస్తూ ఉంది. ఆత్మ కదలకుండానే అన్ని అవయవాలకు చైతన్యాన్ని ఇచ్చి అన్ని పనుల్ని జరిగేటట్లు చూస్తూ ఉంది. ఒక దృశ్యాన్ని ఉదహరణంగా తీసుకొన్నట్లయితే ఆత్మే దృశ్యమై ఉంది. ఆ దృశ్యాన్ని చూట్టానికి దృక్కుగా వెళుతుంది. దృశ్యాన్ని చూస్తుంది. ఆ దృశ్యాన్ని దృక్కు వెనుకకు తీసుకు వచ్చి మనస్సుకు అందించగా అప్పుడు ఆత్మ ఏమీ అంటకుండా చైతన్యంగా నిలిచిపోతూ ఉంది. పై ఉదాహరణలో దృశ్యం అయిన ప్రకృతి లేక వస్తువు, దృక్కు అయిన కళ్ళు, శబ్ద స్పర్శరూప రసగంధాలైన పంచతత్త్వాలతో విషయాన్ని గ్రహించే మనస్సు అన్నీ కూడా జడమే అయినా వాటికి చైతన్య శక్తిని ఇచ్చి వాటివాటి కార్యాల్ని నిర్వహించేటట్లు చేయించింది అంతా ఆత్మ శ##క్తే, అయినా ఆత్మకు ఆ యా పనులలో ఏ సంబంధంలేదు. వాటి అన్నిటికి జీవశక్తిని ఇస్తూనే ఏ కార్యం తనకు అంటకుండా శుద్ధచైతన్యంగా నిలిచిపోతుంది. ఇది చూట్టానికి వింతగానే ఉంటుంది. అన్నీ తనే చేస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉండగా తనకు అంటకుండా ఎట్లా ఉంది అంటే విద్యుచ్ఛక్తిని ఉదాహరణంగా తీసుకొంటే తెలుస్తుంది. విద్యుచ్ఛక్తి ఒక్కటే అయినా దాన్ని ఉపయోగించే పనులవల్ల అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల కార్యాలు అది నిర్వహిస్తూ ఉన్నా ఏ కార్యంలోనూ దానికి సంబంధం లేదు. ఆ కార్యాలకు సంబంధించిన మంచి చెడులు కూడా దానికి అంటవు. విద్యుచ్ఛక్తి బల్బు ద్వారా కాంతిని ఇవ్వాలని అనుకోలేదు. బల్బు కరెంటును ఉపయోగించుకొంటానికి పూనుకొంటే ఉపయోగపడింది. బల్బుపని అయిపోగానే మళ్ళీ కరెంటు యథాస్థితికి వచ్చి ఉండిపోయింది. అట్లాగే ఆత్మశక్తి కూడా అన్ని అవయవాలకు ఉపయోగపడి ఆ పని అయిపోగానే అది యథాస్థితికి వచ్చి ఉండి పోతుంది. ప్రపంచంలో కూడా ప్రకృతి అంతటిలోను ఆత్మశక్తి ఆ విధంగానే ఉపయోగపడుతూ ఉంది. ఆత్మకు ఏది అంటకుండానే ఆత్మ నిష్ర్పపంచంగా, నిష్క్రియంగా, నిశ్చలంగా ఉండగలుగుతూ ఉంది. అంతా తానే అయి ఉండి కూడా ఆత్మ తాను ఏదీకాని విధంగా నిలుస్తూ ఉంది. పరాత్పరుని లక్షణం కూడా అంతే అయి ఉంది. సృష్టి, స్థితి, లయకారకుడై, ఏదీ అంటకుండా ఉండగలుగుతూ ఉన్నాడు.
గాఢనిద్రలో శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీ విశ్రాంతి తీసుకొంటూ ఉంటే వాటన్నిటికి ఆత్మే చైతన్యాన్ని ఇస్తూ కాపాడుతుంది. నిద్రలేచాక వాటికి కావలసిన శక్తిని కూడా ఇస్తూ ఉంది. అయినా ఏదీ అంటకుండా, మానవుని స్వేచ్ఛకు భంగం రానీయకుండా తన సహాయం తాను చేస్తూ తాను మాత్రం ఏ బాధాపడకుండా, ఏ బాదరబందీ లేకుండా ఆత్మ గడపగలుగుతూ ఉంది. ఆత్మ ఎంతటి స్వేచ్ఛ కలిగి ఉంది. భగవంతుడు ఎంత ఉన్నతంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. భగవంతుడే ఆ ఆత్మ అయి ఉన్నప్పుడు ఆ శుద్ధచైతన్యాన్ని లేక జీవశక్తిని చేరటానికి ప్రతి మానవుడు ఆత్మజ్ఞానం చేత సాధన చేయాల్సి ఉందా లేదా అనేదాన్ని వివేకవంతులందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. సాధకుడు సామాన్య సుఖాలలో, తాత్కాలిక భ్రమలలో ఆనందిస్తూ ఉన్నవారిని చూసి భ్రమపొందకూడదు. తాను శాశ్వతానందమయిన ఆత్మనని, శాశ్వత సుఖశాంతుల ముందు ఆ కనిపించే క్షణికానందాలు బహు అల్పమైనవని, తాను సూర్యునివంటి తేజోవంతమైన వాడినని, ఆ పరబ్రహ్మస్వరూపమే తానై గడుపుతూ ఉన్నానని, నిశ్చలానంద సంధాయిని అయిన ఆత్మతో జీవిస్తూ ఉన్నానని, నిత్యముక్తుడనని భావనచేస్తూ నిశ్చలానందంతో జీవించాలి. అప్పుడు ఆత్మ సాధకునికి సుఖశాంతులు ముంజేతి కంకణంగా నిలుస్తాయి. కాంతాకనకాలతోనో, అధర్మాలతోనో క్రీడిస్తూ తాత్కాలికానంద పరవశులైన మానవులను తిలకించి ఏహ్యపడక, వారి ప్రారబ్ధకర్మవల్ల వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారేకాని వేరుకాదని అర్థం చేసుకొంటూ, తాను మాత్రం ఆత్మతోనే రమిస్తూ వారినుండి తప్పించుకుపోతూ ఉండాలి. నిరంతరం సుఖశాంతులతో జీవిస్తూ ఉన్న ఆత్మ సాధకుడు ఒక నాటికి ఆ దుఃఖసాగరమగ్నులకు ఆదర్శంగా కనిపించక మానడు. అప్పుడే వాళ్ళు సాధకుని అనుసరించి జీవించటానికి వస్తారు. కబీరుదాసుని ఆ విధంగానే ఒకనాటికి లోకం అనుసరించి వచ్చింది. కాన సాధకుడు ఆత్మానందంతో తృప్తినొంది సుఖశాంతులతో జీవించాలి. తాత్కాలిక భ్రమలకు లోనై ఉన్న ప్రతి వానికి ఆత్మ లక్షణం, ఆత్మానందం బోధించాలని ఆత్మసాధకుడు ప్రయత్నించకూడదు. ఆత్మజ్ఞానాన్ని కోరి సమీపించిన వారికి మాత్రమే ఆత్మమార్గాన్ని బోధించాలి. లోకంలో మానవులు ఎన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నారో అన్ని రకాలుగా భగవంతుని చేరటానికి మార్గాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మానవులు ఎవరికి సంబంధించిన విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ, సాధన చేస్తూ, అలసిపోయినప్పుడు వాళ్ళంతట వాళ్ళే ఆత్మమార్గాన్ని ఆశ్రయించటానికి వెతుక్కొంటూ వస్తారు. ఆనాడే ఆ జ్ఞానాన్ని, ఆ మార్గాన్ని వాళ్ళకు అందించటానికి ప్రయత్నించాలి. ఆనాడు వాళ్ళని ప్రేమతో, ఆదరణతో చేరతీసి ఆనందించేటట్లు చేయగలగాలి. పాపులకు ఆత్మమార్గం అంటదని, ఫలించదని నిందించక, అందరూ పొందదగిందే ఆత్మ మార్గమని ఆదరణతో ఆనందింప చేయాలి.
21 దేహేంద్రియ గుణాన్ కర్మా
ణ్యమలే సచ్చిదాత్మని
అధ్య స్యన్త్య వివేకేన
గగనే నీలతాదివత్ || 21
gRigRi®ƒs[ = ఆకాశమునందు, నీలత + ఆదివత్ = నీలాది వర్ణాలు ఆరోపిస్తూ ఉన్నట్లుగానే, అమలే = శుద్ధమైన, సత్ + చిత్ + ఆత్మని = సత్‌చిత్ స్వరూపమైన ఆత్మయందు, దేహ + ఇంద్రియ గుణాన్ = శరీరమునందలి సత్వరజస్తమోగుణాలకు సంబంధించిన వాటిని, కర్మాణి = చేసేపనులను, అవివేకినా = అజ్ఞానంచేత, అధ్యస్యన్తి = ఆరోపిస్తూ ఉన్నారు.
తా||స్వచ్ఛమైన ఆకాశానికి నీలం మొదలైన రకరకాల రంగుల్ని ఆరోపిస్తూ ఉన్నట్లుగానే శుద్ధమైన, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మయందు శరీరానికి సంబంధించిన సత్వ, రజో, తమోగుణాల వంటి వాటిని , ఇంద్రియాలు చేసే పనుల్ని అజ్ఞానం చేత ఆరోపిస్తూ ఉన్నారు.
వివరణ:- ఆకాశం అంటే అవకాశం ఇచ్చేది అంటే ఇతరులు తిరగటానికి ఖాళీగా ఉన్నదాన్నే ఆకాశం అంటూ ఉన్నారు. ఆకాశం అంటే కొండ అని, ఆ కొండపైనే స్వర్గం ఉంది అని చిన్నపిల్లలనాటి నుంచి కథలు కథలుగా చెప్పుకొనే ఆకాశం మనకు పైనలేదు. గోళాలకు మధ్య ఖాళీస్థలం మాత్రమే మనకు ఉంది. దాన్నే ఆకాశం అంటూ ఉన్నాం. మరి ఆ ఖాళీస్థలం నీలంగా ఎట్లా కనిపిస్తూ ఉంది అని ఆలోచించవలసి ఉంది. సూర్యుని నుండి ప్రవర్తిస్తూ ఉన్నకాంతికిరణాలు వాతావరణంలో ప్రవేశించేటప్పుడు అవి తొంభై డిగ్రీలలో పరావర్తనం చెందుతూ ఉన్నాయి. అట్లా పరావర్తనం చెందినప్పుడు ఆకాశంనీలి వర్ణంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సూర్యుని కిరణాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నీటిమీద పడినప్పుడు ఆకిరణాలు తొంభైడిగ్రీల్లో పరావర్తనం చెందుతూ ఉన్నాయి. కాన ఏ చెరువు వద్దకైనా మధ్యాహ్నం పన్నెండుగంటలకు వెళ్ళి చూస్తే ఆ నీళ్ళు అన్నీ నీలంగా, సుందరంగా కనిపిస్తాయి. స్వచ్ఛంగా, తెల్లగా ప్రకాశిస్తూ ఉన్న నీళ్ళు ఎట్లా నీలంగా మారి కనిపిస్తూ ఉన్నాయో ఆకాశం కూడా సూర్యకిరణాల చేత వాతావరణానికి పైన స్వచ్ఛంగా, తెల్లగా ప్రకాశిస్తూనే వాతావరణంలో ప్రవేశించగానే ఆకాశం నీలవర్ణంగా కనిపిస్తూఉంది. అజ్ఞానం చేత మానవులు ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకోలేక నీలాది వర్ణాల్ని భ్రమచేత ఆకాశానికి ఆరోపిస్తూ ఉన్నారు. అట్లాగే ఆత్మజ్ఞానం లేకపోవటం చేత సత్ చిత్ ల రూపమైన ఆత్మకు సత్త్వర జస్తమోగుణాల్ని, ఇంద్రియాలు చేసే పనుల్ని ఆరోపించటం జరుగుతుంది.
ఇక సచ్చిదాత్మను గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు సత్ అంటే సత్యమైంది, ఉన్నది అని, చిత్ అంటే చైతన్యం, ప్రకాశం అని. శుద్ధచైతన్యమైన చిత్ సత్యమైన సత్ తో కలిస్తే ఆత్మ అవుతుంది. దేహంలో సాధకునికి సాధనయందు ప్రకాశమానమై వెలుగొందే కాంతే ఆత్మ అయిఉంది. సత్, చిత్ కలిసినప్పుడు ఆనందం కలుగుతుంది. దాన్నే సచ్చిదానందం అంటున్నారు. అట్లాంటి ఆత్మ మానవుని దేహ లక్షణాలకు భిన్నంగా ఉంది. ఆత్మ కంటే చావుపుట్టుకలు లేనిది, ఎల్లప్పుడు శాశ్వతంగా ఉండేది, శరీరం నశించినా నశించనిది, ప్రత్యక్షప్రమాణాలచేత తెలుసుకోవటానికి వీలుకానిది, అగ్ని దహించలేనిది, నీరు తడుపలేనిది, గాలి ఎండింపలేనిది, సర్వవ్యాపి, నిశ్చలమైనది, ప్రకాశమానమైనది, ఇంద్రియాలకు గోచరం కాంది, వికారాలు పొందింపతగనిది, ఒకడు చంపలేనిది, ఒకణ్ణి చంపంది, అయి సూక్ష్మాతి సూక్ష్మరూపంలో మానవదేహంలో శుద్ధచైతన్యమై ఉంది, అదే మానవునికి జీవశక్తిని ఇస్తూ ఉంది. మానవుల్లో ఉన్న దేహేంద్రియ మనోబుద్ధులకు కల బాల్య, ¸°వన, కౌమారాది అవస్థలు పొందకుండా ఉంటుంది, నిష్క్రియమై ఉంటుంది. జ్ఞాన స్వరూపమై ఉంటుంది. అజ్ఞానంచేత మానవులు దేహాన్ని ఆత్మగా భ్రాంతి చెంది దేహేంద్రియ గుణాది వ్యాపారాలను ఆత్మకు ఆరోపిస్తూ ఉన్నారు. మానవునితో ఆత్మసాక్షి మాత్రంగానే ఉంది కాని దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి సంబంధించిన సత్త్వరజస్తమోగుణాల కార్యాలు ఏవీ దానంతట అది పూనుకొని చేయటం లేదు. కాన అవేవీ ఆత్మకు సంబంధించినవి కావు.
ఇక త్రిగుణాలను గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు దేహమే సత్త్వరజస్తమోగుణాలతో సంచరిస్తూ ఉంది, సత్త్వగుణం నిర్మలమై ఉంది. అది ప్రకాశాన్ని కలుగచేస్తుంది, ఉపద్రవాలు లేకుండా ఉంటుంది, అయినప్పటికి సుఖాల మీద, జ్ఞానం మీద ఆసక్తి చేత అది జీవుని బంధిస్తూ ఉంటుంది. రజోగుణం అనేది వస్తువుల మీద అభిలాషను పెంచుతుంది. లభించిన దానిమీద ఎక్కువ అనుబంధం పెంచుకొని, ఆసక్తి కలిగి ఉంటుంది, నిషిద్ధకార్యాలు చేయటం, కామ్యకర్మలందు నిమగ్న మవ్వటం వంటి రకరకాల పనుల వల్ల ఖ్యాతిని అర్జించాలని కోరుకుంటూ ఉంటుంది. ఆవిధంగా ప్రాపంచిక కర్మల్లో చిక్కుకొని జీవుని బంధిస్తుంది, తమోగుణం అనేది అజ్ఞానాన్ని కలిగిస్తుంది. మోహాన్ని అంటే అవివేకాన్ని పెంచుతుంది. మరిచిపోవటం, పరాకు, సోమరితనం, అతినిద్ర వంటి వాటిని పెంచి పోషిస్తుంది. వీటి వల్ల జీవుడు బంధింపబడుతూ ఉంటాడు. ఈవిధంగా అజ్ఞాన వశాన జీవుడు త్రిగుణాలచేత బంధింపబడుతూ ఉంటాడు. ప్రపంచంలోని సమస్త దుఃఖాలకు ఈ త్రిగుణాలే కారణం అయి ఉన్నాయి. ఈ ప్రపంచంలో కల జగన్నాటకాన్ని ఈ త్రిగుణాల ఆధారంగానే మనస్సు నడుపుతూ ఉంది. త్రిగుణాల వల్ల కర్తృత్వం విజృంభిస్తుంది. నేను అనే అహంకారం ప్రకోపిస్తుంది. ఈ త్రిగుణాలు అందరిలోనూ ఒకేలా ఉంటాయి అని చెప్పలేము. తరతమ భేదాలతో రకరకాలుగా అందరిలోనూ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గుణం ఒక్కొక్కసారి అధికంగా ఉండి మిగిలినగుణాల్ని అణగద్రొక్కి ప్రవర్తిస్తూ ఉంటుంది. సాధకుడు సత్త్వ గుణానికి అనుకూలంగా సంచరిస్తూ దాన్ని అధికాధికంగా పెంచుకొంటూ మిగిలిన వాటిని తొలగించుకొంటూ వస్తూ, చిట్టచివరకు సత్త్వ గుణాన్ని కూడా తొలగించుకొంటూ పోవాలి. అప్పుడు సాధకుడు శుద్ధ చైతన్యంతో నిర్వికల్ప సమాధికి చేరగలుగుతాడు.
అజ్ఞాని ఈవిధమైన విషయాలు తెలుసుకోవాలని తలంచడు. అతనికి ఆత్మ, దైవం, ఇంద్రియనిగ్రహం వంటి పారమార్థిక విషయాలకు సంబంధించిన వాటిని గూర్చి తెలుసుకోవాలని ప్రయత్నం కూడా ఉండదు. అట్లాంటివాటియందు జాగరూకత కలిగి కూడా ఉండడు. అట్లాంటి వాటియందు నిర్లక్ష్యంగా కూడా ప్రవర్తిస్తాడు. అతడు ఇంద్రియ విషయాల యందే అధికాధికంగా మేలుకొని సంచరిస్తాడు. దైవ విషయాలయందు విరక్తి కలిగి ఉండి, విషయభోగాల యందు అనురక్తి కలిగి సంచరిస్తూ ఉంటాడు. ఆ విధంగా సామాన్య మానవుడు త్రిగుణాలతో అనురక్తుడై, ప్రపంచవిషయాలతో తాదాత్మ్యం చెందటం వల్ల అహంకార మమకారాలతో నిరంతరం జీవిస్తూ ఉంటాడు.
ఆత్మజ్ఞానం లేకపోయినంత మాత్రాన దుఃఖం కలగాలని కూడా లేదు. ఆత్మను గూర్చి తెలియని స్థితిలో కూడా ఆనందంతోనే ఉండవచ్చు. అది తాత్కాలికానందానికి సంబంధించింది. గాఢనిద్రలో - సుషుప్త్యవస్థలో ఆనందమయ కోశంలోనే మానవుడు ఉంటూ ఉన్నాడు. అప్పుడు మానవుడు కారణ శరీరంతో నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రలో ఇంద్రియాలు, మనస్సు, శరీరం అన్నీ కూడా ఏవిషయవాంఛలు లేకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొంటూ ఉన్నాయి. అందువల్ల శరీరానికి ఏ ఆవేదన లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. తెలుసుకోవలసిన సత్యవస్తువైన ఆత్మ తెలియక పోయినా దుఃఖం లేకుండానే తాత్కాలికంగా ఆ సమయంలో గడుపుతూ ఉన్నాడు. 'సత్' పదార్థమైన ఆత్మను తెలుసుకోవటం జరుగలేదు. అయనప్పటికి కనీసం ఇంద్రియాలు, మనస్సు, శరీరం ఏ పనిచేయకుండా ఏ విషయవాంఛలు లేకుండా ఉంటే -పంచ కోశాల్ని దాటటం అనేది తెలియకుండానే- ఆనందం ఉందని అర్థం చేసుకొంటే మానవునికి సుఖశాంతులు లభించటానికి మార్గం ఏర్పడుతుంది. ఆ విధంగా తెలుసుకోవటం వల్ల సామాన్య మానవుడు కూడా గురువును ఆశ్రయించిననాడు ఆత్మవేరని, ఆత్మానందం లోపలే ఉందని ఇంద్రియాల్ని అంతర్ముఖం చేస్తే సుఖశాంతులు లభిస్తాయని అర్థం చేసుకోగలుగుతాడు. ఆత్మజ్ఞానంతో జ్ఞానిగా మారి సాధనలో దేహేంద్రియాది గుణాలకు, ఆత్మకుగల వ్యత్యాసాన్ని, సంబంధాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆనాడు ఆరోపణలు తొలగి ఆత్మతో జీవించటం జరుగుతుంది. అన్నిమార్గాలకంటే కూడా ఆత్మ మార్గంలోనే మానవునికి ఇంద్రియ నిగ్రహం తేలిగ్గా అలవడుతుంది. భగవంతుడు ప్రసాదించిన మానవదేహాన్ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ప్రతివానికి ఎంతైనా ఉంది. తెలిసి జీవించటానికి సామాన్యమానవునికి కూడా ఆత్మజ్ఞానం అన్నివిధాల ఉపకరిస్తుంది.
22 అజ్ఞానా న్మానసోపాధేః
కర్తృత్వాదీని చాత్మని
కల్ప్యతే 2 ంబుగతే చంద్రే
చలనాది ర్యథాంభసః || 22
¸R…V´y = ఏ విధంగా అయితే, అంబుగతే = నీటియందు ప్రతిబింబిస్తూ ఉన్న, చంద్రే = చంద్రుని యందు, అంభసః = నీటి యొక్క, చలన + ఆది = చలించుట మొదలైన వాటిని (చంద్రునివిగా అనుకొంటూ ఉన్నారో అదే విధంగా), అజ్ఞానాత్ = జ్ఞానం లేకపోవుట వలన, (ఆత్మను గురించి సరైన వివేకజ్ఞానం తెలియకపోవటం వల్ల), మానస + ఉపాధేః = మనోవ్యాపారాల వల్ల సంభవించినటువంటి, కర్తృత్వము భోక్తృత్వము వంటి కర్మలను, ఆత్మని = ఆత్మయందు, కత్ప్యతే = కల్పింప బడుతూ ఉన్నాయి.
తా|| ఏ విధంగా అయితే నీటి యందు ప్రతిబింబిస్తూ ఉన్న చంద్రుని నీటి యొక్క చలనాలు మొదలైన వాటివల్ల చంద్రుడు చలిస్తూ ఉన్నాడు అని అనుకొంటూ ఉన్నారో అదే విధంగా అవివేకులు మనోవ్యాపారాలైన కర్తృత్వ భోక్తృత్వాల వంటి కర్మలను ఆత్మయందు ఆరోపిస్తూ ఉన్నారు.
వివరణ :- మానవుడు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడు, గూడు, గుడ్డ అనేవి మూడు కావలసిన వస్తువులే అయి ఉంటాయి. దాని వల్ల కర్మలు చేస్తునే ఉండవలసి వస్తూ ఉంటుంది. కర్మలు అన్నీ కూడా మనస్సుకు సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, చైతన్య శక్తి స్వభావం తెలియని వాళ్ళు మనస్సువల్ల చేకూరుతున్న కర్తృత్వ, భోక్తృత్వాలను ఆత్మకు ఆపాదిస్తూ ఉన్నారు. నిద్రలేవగానే మనస్సును ఆవరించిన నేను అనే అహంకారం చేత నేను అనే ఆలోచనలతో ఉండటం వల్ల ఆ పనులన్నీ మనస్సు చేత జరుగుతున్నవే కాని ఆ పనులు ఏవీ కూడా ఆత్మకు సంబంధించినవి కావు. రైలు ఇంజనులో ఉపయోగించిన బొగ్గు వేడి పుట్టించి నీటిని ఆవిరిగా మారుస్తూ ఉంది. ఆ నీటి ఆవిరి శక్తిని ఉపయోగించుకొన్న రైలు ప్రయాణం చేస్తూఉంది. ఆ నీటి ఆవిరిగాని, ఆ బొగ్గు యొక్క వేడి కాని ఆ రైలు నడవాలి అని అనుకోలేదు. ఆ రైలుకు చేకూరే లాభనష్టాలతో ఆ నీటికి కాని, ఆ బొగ్గుకు కాని ఏసంబంధం లేదు. ఆ విధంగానే ఆత్మకు మనస్సు యొక్క కర్తృత్వ, భోక్తృత్వాలతో ఏ సంబంధం లేదు. అది అవగాహనలేని వాళ్లు మాత్రమే వాటిని ఆత్మకు ఆరోపిస్తూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవటానికే శంకరాచార్యులవారు నీటిలో కదిలే చంద్రుని ఉపమానంగా వివరించారు. నీటిలో కదులుతున్న చంద్రుని చూసి చంద్రుడు కదులుతూ ఉన్నాడు అంటున్నారు. నిజంగా కదులుతూ ఉంది చంద్రుడు కాదు. నీటి మీద వీచిన గాలి తాకుడుల వలన నీరు కదులుతూ ఉంది. ఆ నీటి కదలికల వల్ల చంద్రుని ప్రతిబింబం కదులుతూ ఉన్నట్లు భ్రమకొల్పుతూ ఉంది. ఆ కదులుతూ ఉన్న చంద్రుని చూసేవాళ్ళు నీటి మీదనుంచి దృష్టి మళ్ళించి ఆకాశం వైపు తిప్పితే కదలకుండా ఉన్న చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడికి, ఆ కదలికలకు ఏ సంబంధం లేదని చూసే వాళ్ళకు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. అదే విధంగా సాధకుడు ధ్యాన సాధనలో ఆత్మకు, కర్మలకు ఏ సంబంధం లేదని తెలుసుకో గలుగుతాడు. అయినప్పటికి సాధకుడు కూడా దేహయాత్ర కొనసాగించటానికి కర్మలు చేయక తప్పదు గనుక నిష్కామ బుద్ధితో విధ్యుక్త కర్మల్ని ఆచరించాలి. కర్మ సన్యాసం చేస్తానని సాధకుడు భావించకుండా కర్మయోగంతో కర్మల్ని చేయాలి. దాన్నే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి విశ్వరూప సందర్శనంతో వివరించాడు. నువ్వు చంపటం కన్నా ముందే నీ శత్రువులు అందరూ చంపబడుతూనే ఉన్నారు అని విశ్వరూపంలో చూస్తూ ఉన్నావు కదా ! కాన నువ్వు నిమిత్తమాత్రుడివే కాని వేరు కాదు అని తెలుసుకొని నీ కార్యాల్ని నువ్వు నిర్వహించి కీర్తి ప్రతిష్ఠల్ని పొందు అని శ్రీకృష్ణుడు హితోపదేశం చేశాడు. ఆ హితోపదేశం అర్జునుడు ఒక్కడికే కాదు, ప్రతిసాధకునికి చేసిన హితబోధ అని తెలుసుకొని ఆచరించాలి. ఆ జ్ఞానంతో ఎవరికర్మల్ని వారు నిస్వార్థబుద్ధితో ఆచరించాలి. భగవంతుని చేతిలో మనం సాధనం మాత్రమే అని తెలిసి ఆత్మజ్ఞానంతో జీవించాలి. సాధకునికి జీవన విధానంలో కామం ఆవరిస్తూ ఉన్నప్పుడల్లా అగ్నికి పొగ ఆవరిస్తూ ఉన్నట్లు, అద్దాన్ని మసికప్పుతూ ఉన్నట్లు, ఆత్మజ్ఞానానికి మాలిన్యం ఆవరిస్తూ ఉందని తెలిసి ఆత్మ మార్గంలో గడపాలి. దానివల్ల సాధకునికి సాధనలో ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉన్నగుణాలు, పరిసరాలు తొలగిపోవటానికి కావలసిన మార్గం ఏర్పడుతుంది. పంచతత్త్వాలైన శబ్ద స్పర్శ రూప రసగంధాలనే క్రూర జంతువులే ప్రబల శత్రువులై శరీరాన్ని అయిదువైపుల నుంచి పీక్కు తింటున్నాయి అని అర్థం చేసుకోవటానికి వీలుకుదురుతుంది. అందువల్ల అటువంటి పరిస్థితులు తటస్థించి నప్పుడల్లా సాధకుడు ఎక్కువగా సత్సంగాలకు వెళ్ళాలి. ధ్యానాన్ని ఎక్కవసార్లు చెయ్యాలి. సేవలో లీనం అవ్వటానికి ప్రయత్నం చెయ్యాలి. దానితో మనస్సు దారికి వచ్చి ఆత్మ మార్గంవైపు మొగ్గుతూ గడుపుతూ ఉంటుంది. జ్ఞాని అయినవాడు భగవంతుడు కూడా లోకాన్ని రక్షించటానికి ఈ విధంగానే కర్మల్ని ఆచరించాడని, లోక సంగ్రహార్థం తాను కూడా కర్మల్ని ఆ విధంగానే తెలిసి ఆచరించాలని వివేకంతో అర్థం చేసుకొని నడుచుకోవాలి. కర్మాచరణ వల్లనే నిష్క్రియమైన ఆత్మ రూపం అర్థం అవుతుంది. ఆత్మమార్గంలో స్థిరంగా నిలవటానికి వీలు కుదురుతుంది. అందుకే గురువులు సేవా కార్యక్రమాలకు శిష్యుల్ని తరచుగా పిలుస్తూ ఉంటారు. సాధకుడు ఆ సేవాకార్యక్రమాల్ని ఆచరించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అటువంటివాని జీవితం ధన్యమవుతుంది.
23 రాగేచ్ఛా సుఖ దుఃఖాది
బుద్ధౌ సత్యాం ప్రవర్తతే
సుషుప్తౌ నాస్తి తన్నాశే
తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః || 23
LSgRiLi = అనురాగం, ఇచ్ఛా = కోరిక, సుఖ దుఃఖ + ఆది = సుఖము దుఃఖము మొదలయినవి, బుద్ధౌ సత్యాం = బుద్ధి ఆలోచించు వరకు సత్యంగానే, ప్రవర్తతే = తెలుస్తూ ఉంటాయి, సుషుప్తౌ = గాఢ నిద్రయందు, తత్ + నాశే = ఆ బుద్ధి నశించుటచేత, న + అస్తి = రాగం ఇచ్ఛ సుఖం దుఃఖం వంటి గుణాలు ఏవీకూడా ఉండటం లేదు, తస్మాత్ = అందువల్ల, బుద్ధేస్తు = బుద్ధి యందే కాని, ఆత్మనః = ఆత్మయందు, న = లేవు.
తా|| ప్రేమానురాగాలు, కోరికలు, సుఖదుఃఖాలు మొదలైనవి అన్నీ కూడా బుద్ధి పనిచేస్తూ ఉన్నంత వరకు అవి అన్నీ కూడా సత్యమైనవే అనే విధంగా తెలుస్తూనే ఉంటాయి. బుద్ధిపనిచేయకుండా లయించిపోయిన గాఢ నిద్రాస్థితిలో ఆ గుణాలు ఏవీ తెలియవు. కావున అవి అన్నీకూడా బుద్ధికి సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవి కావు.
వివరణ :- మానవుడు మనస్సు, బుద్ధి వల్లనే తన సహజ స్వరూపమైన ఆత్మస్థితిని తెలుసుకోలేకుండా ఉన్నాడు. దాని వల్ల తన సహజసిద్ధమైన ఆత్మ స్థితికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. పచ్చకామెర్లు కమ్మినవాడు లోకాన్నంతా పచ్చగా చూసినట్లు మనస్సువల్ల ప్రపంచాన్నంతా సర్వవికారాలతో కూడిన అనుభవాలతో చూస్తూ ఉన్నాడు. రాగద్వేషాలు, కామక్రోధాలు, సుఖదుఃఖాలు, ఆకలిదప్పులు, జరామరణాలు వంటి ద్వంద్వాలతో మనస్సు గడుపుతూ ఉంది. అవేవి ఆత్మకు సంబంధించినవికావు. ఆత్మ ద్వంద్వాతీత మయింది. కావున సాధకుడు మనస్సును తన మార్గంలో పెట్టుకొన్నప్పుడు తన యథార్థ స్వరూపానికి రాగలుగుతాడు.
అనురాగం అంటే ప్రేమ అనే అర్థంలోనే లోకంలో వాడబడుతూ ఉంది. ప్రేమ అనగానే ప్రేయసీ ప్రియుల మధ్య, భార్యా భర్తల మధ్య కల అనుబంధాన్నే లోకం ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమ భగవంతునికి భక్తునికి మధ్య మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమలో స్వార్థం అనేది లేదు. అందులో ఏ కోరికా లేదు. అందులో ప్రపత్తి, సేవా, సమర్పణ, త్యాగం వంటి భావాలు అన్నీ ఇమిడి ఉన్నాయి. భక్తుడు భగవంతుని కొరకు గుళ్ళోకి వెళ్ళి గంటకొట్టి, కొబ్బరికాయ కొట్టి, నాలుగు కోరికలు కోరే భక్తుని వద్ద పైన ఉదాహరించిన లక్షణాలు అన్నీకూడా హారతి కర్పూరంలా హరించి పోతూ ఉన్నాయి. భార్యభర్తల మధ్య ప్రేమలో ఒకరి అవసరం ఇంకొకళ్ళకు ఉంటుంది. ఒకళ్ళనుంచి మరొకరు కోరికల్ని వాంఛిస్తూ గడుపుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ప్లాటో ప్రకటించిన ప్లాటోనిక్ లవ్ నందు మాత్రమే శారీరకమైన ఏ వాంఛాలేని ఆరాధన, అనురాగం కనిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల యందు, సోదర సోదరీ మణులయందు, బంధు మిత్రులయందు రకరకాలుగా ప్రేమానురాగాలు ప్రతిమానవుడు ప్రదర్శిస్తూఉంటాడు. ఆయా రకాల ప్రేమలలో మానవుడు తాత్కాలికహృదయానందంతో జీవించటం కనిపిస్తూనే ఉంటుంది. అయినా అవి దూరం అయిననాడు దుఃఖం అనుభవించటం కనిపిస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమ అనేది సాధకుడు ఆత్మానుబంధంతో మెలిగినప్పుడే ఏ కోరికలు, ఏ కామం లేని ఆనందంగా నిలుస్తూ ఉంది. కాన రాగం, ఇచ్ఛ, సుఖం, దుఃఖం అనేవి బుద్ధికి సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవి కావు అని తెలుస్తూ ఉంది. రాగం, ఇచ్ఛ, సుఖం, దుఃఖం అనేవి సర్వమానవ సహజగుణాలు అయి ఉన్నాయి. అందుకే ఏ విద్య, ఏ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ గుణాలతో సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నాం అంటూ ఉంటారు. వాళ్ళకు కలిగే బాధకూడా వాళ్ళకు సుఖంగానే కనిపిస్తూ ఉంటుంది. ఒకళ్ళ కోసం మరొకరు పడే బాధ, ఆ త్యాగం, ఆ సేవ ఒక రకంగా వాళ్ళ సెంటి మెంట్సును (Respected love) తృప్తి పరుస్తూ ఉంటుంది. ఆ విధమైన ఆనందాలతో జీవించే సంఘాలు ఈ ఆధ్యాత్మిక మార్గాల్ని ఎందుకు అని నిరసిస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మేము బాగానే ఉన్నాము. మాకెందుకు ఈ హితబోధలు చెయ్యాలని చూస్తూ ఉన్నారు అని అంటూ ఉంటారు. అందుకనే హృదయదాహం ఎవరికి ఉంటుందో, ఆ దాహార్తిని తీర్చుకోవటానికి ఎవరు ప్రయత్నిస్తూ ఉంటారో వారితోనే ఆత్మశక్తి, ఆత్మమార్గం, ఆత్మజ్ఞానం వంటి వాటిని గురించి మాట్లాడవలసి ఉంటుంది. వారికే గురువును సూచించవలసి ఉంటుంది. అప్పుడే వాళ్ళు గురుజ్ఞానంతో తరించగలుగుతారు.
దేహమే ఆత్మ, దేహమే అన్నీ అనే భావన ఉన్నవాళ్ళమీద రాగ మహిమ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు తృప్తి అనేది ఉండదు. వాళ్ళు నిరంతరం కోరికల విషవలయంలో చిక్కుకొని జీవిస్తూఉంటారు. వాళ్ళు జీవించి ఉన్నంతకాలం సమయాన్ని వృథా చేయకుండా ఈ బంధాల్ని, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని అనుభవిస్తూనే గడపాలంటారు. అదే విధంగా డబ్బు మీద కాంక్ష ఉన్నవాళ్ళు కూడా ఆత్మజ్ఞానాన్ని గూర్చి వింటానికి కూడా ఇష్టపడరు. వాళ్లు డబ్బుతో భక్తిని, భగవంతుని కొనెయ్యగలమని నమ్మి నడుస్తారు. వాళ్ళు డబ్బుతో వాళ్ళ పాపాల్ని పరిహారం చేసుకోగలమని నమ్మి జీవిస్తారు. అట్లాంటి వాళ్ళకు, హేతువాదులకు, నాస్తికులకు, శాస్త్ర పరిశోధకులకు కూడా సుషుప్త్యవస్థ అంటే గాఢ నిద్రాస్థితి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. కాన ఆధ్యాత్మిక మార్గంలో సుషుప్త్యవస్థను సక్రమంగా అర్థం అయ్యేటట్లు చేయగలిగితే వాళ్లు చాలావరకు దారిలోకి వస్తారు. ఆనాడు ఎవళ్ళ అనుభవం వాళ్ళు పొందవలసిందే కాని ఆత్మానందాన్ని ఇతరులు ఇవ్వలేరు అని కూడా వాళ్ళు ఆత్మజ్ఞానంతో తెలుసుకోగలుగుతారు. సుషుప్త్యవస్థలో'బుద్ధి'ఏ ప్రమేయం లేకుండా లయించి పోయింది. ఆత్మలో మనస్సు, ఇంద్రియాలు లీనమయిపోయి, శరీరం ఏ పనిలేకుండా ఉండి పోయింది. కాన సుషుప్తిలో ఆత్మకు రాగేచ్ఛ, సుఖదుఃఖాది లక్షణాలకు ఏ సంబంధం లేదు అని తెలుస్తుంది.
లోకంలో ఆశావాదులు optimists , నిరాశావాదులు Pessimists అని రెండు రకాల మనుష్యులు ఉన్నారు. ఒక సీసాలో వక్కలు పోసుకొని రోజు ఒక మంచి వక్క తీసుకొని తిందామని ఆశావాది అనుకొన్నాడు. చివరి వక్కవరకు వాటిలో ఉన్న మంచి గుణాల్ని ఎన్నుకొంటూ, వాటిలో ఉన్నమంచితో ఆనందిస్తూ ఆశావాదిగా గడిపాడు. నిరాశావాది ప్రతిరోజు చెడ్డ వక్కను ఏరేద్దాం అని చెడ్డ వక్కను తొలగించే ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు ఇది చెడ్డది అంటూనే తిన్నాడు. చివరి వక్కలో కూడా నిరాశావాది ఏదో లోపాన్ని చూస్తూనే దాన్ని తిన్నాడు. కాన నిరాశావాది ఉన్న దాంట్లో లోపాల్ని ఎన్నుతూనే అశాంతిని అనుభవిస్తూ కాలం గడిపాడు, కాన ఆత్మసాధకుడు ఉన్నంతలో తృప్తిని అనుభవిస్తూ ఆశావాదిగా ఆత్మజ్ఞానంతో సుఖశాంతుల్ని అనుభవిస్తూ ఉన్నామని ఆనందిస్తూ, ప్రతి రోజూ సాధనలో కొంత శక్తిని పొందుతూ గడపాలి. అట్లా చేయగా చేయగా ఒకనాటికి సచ్చిదానందాన్ని గంటల తరబడి అనుభవించటం జరుగుతుంది. దాని వల్ల ఆత్మవేరు, ఇంద్రియాలు వేరు అని ప్రత్యక్షంగా తెలుస్తుంది.
24 ప్రకాశో 2 ర్కస్య తోయస్య
శైత్యమగ్నే ర్యధోష్ణతా
స్వభావః సచ్చిదానంద
నిత్య నిర్మల తాత్మ నః || 24
@LRiäxqsù = సూర్యునికి, ప్రకాశః = కాంతి, తోయస్య = నీటికి, శైత్యం = చల్లదనం, అగ్నేః = అగ్నికి, ఉష్ణతా = వేడి, యథా = ఏ విధంగా (స్వభావం అయి ఉన్నాయో ఆ విధంగా), ఆత్మనః = ఆత్మకు, సత్ = సత్యమైంది - భూతకాలం భవిష్యత్కాలం వర్తమానకాలం అనే మూడు కాలాల్లోను ఉండునది - ఎల్లప్పుడూ ఉండేది, చిత్ = చైతన్యం - ప్రకాశం - సర్వం తెలియునది, ఆనంద = ఆనందం, నిత్య = శాశ్వతత్వం, నిర్మలతా = నిర్మలత్వం, స్వభావః = స్వభావం అయి ఉన్నాయి.
తా|| సూర్యునికి ప్రకాశం, నీటికి చల్లదనం, అగ్నికి వేడి ఎట్లా స్వభావం అయి ఉన్నాయో ఆ విధంగానే ఆత్మకు సచ్చిదానందం, శాశ్వతత్వం, నిర్మలత్వం స్వభావం అయి ఉన్నాయి.
వివరణ : - సూర్యుని సహజ స్వభావం కాంతిమంతంగా ప్రకాశించటం, నీటి సహజ స్వభావం చల్లగా ఉండటం, అగ్ని సహజ స్వభావం వేడిగా ఉండటం అనేవి ఎట్లా ఉన్నాయో అట్లాగే ఆత్మకు సహజ స్వభావం ఎల్లప్పుడు చైతన్యంతో ఆనందంగా ఉండటం, ఏ అలజడులు లేకుండా నిర్మలంగా ఉండటం, నిత్యమై ఉండటం అయి ఉన్నాయి. అయినా సామాన్య మానవులు ఆత్మ స్వభావాన్ని, నిత్యానందాన్ని తెలుసుకోలేక దేహమే ఆత్మ అనే భావనతో దుఃఖసాగరంలో మునిగిపోతూ ఉన్నారు. అయినప్పటికి దేని స్వభావం అది ప్రకటిస్తూనే ఉంటుంది. ఆత్మ స్వభావం తెలియని వాళ్ళు మాత్రమే శరీర స్వభావాన్ని ఆత్మకు ఆరోపిస్తూ ఉంటారు. ఆత్మ సహజ స్వభావం తెలిసినవాళ్ళుమాత్రం ఆత్మతో జీవించి ఆనందం పొందాలని అనుకొంటారు. అది తెలియని వాళ్ళు మాత్రమే అశాశ్వతమైన, అనిత్యమైన, దుఃఖ భూయిష్ఠమైన దేహంతో జీవించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రం ఆత్మ మార్గంలో జీవిస్తూ ఆత్మానందం కోసం తపించిపోతూ ఉంటారు. అట్లా తపించిపోయే వాళ్ళ ఆత్మదాహాన్ని తీర్చటానికే శంకరాచార్యులవారు ఆత్మలక్షణాల్ని ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడు, నీరు, అగ్ని వంటి వాటి గుణాలను ఉదాహరించి, పోల్చి చూపించి వివరించారు. జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకొన్నప్పటికి ఆత్మ మూడు కాలాల్లోను ఉంటుంది. శాశ్వతమైంది, సత్యమైంది, చైతన్యవంతమైంది, ప్రకాశమానమైంది, ఆనందమైంది, సంసారదుఃఖ సాగరాన్నుంచి తరింపచేసేది అయి ఉంది అని హితబోధకావిస్తూ ఉన్నారు. సర్వమానవులు సుఖాన్ని కాంక్షించటం అనేది సహజ స్వభావం అయి ఉంటుంది. అయితే అట్లాంటి సుఖాకాంక్షను తీర్చగలిగింది ఏదైనా ఉంది అంటే నిత్యమై, శాశ్వతమై, అనంతమై, ఆనందాన్ని ప్రసాదించగలిగేది అయిన ఆత్మ ఒక్కటే అయి ఉంది. అందుకే దాన్ని వివేకంతో, వివేచనతో అర్థం చేసుకోవటానికి వీలుగా ఉపమానాల సమాన ధర్మాలైన కాంతి, చల్లదనం, వేడిని చూపించి అసామాన్యమైన, అగోచరమైన, అనంతమైన, అఖండమైన ఆత్మయొక్క సచ్చిదానంద స్వరూపాన్ని శంకరుల వారు నిరూపించి చూపించారు. ఉయ్యాల్లో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు, మెళ్ళో కంఠాభరణాన్ని పెట్టుకొని ఇల్లంతా వెతికినట్లు, దేహంలోనే ఆనందాన్ని పెట్టుకొని దాన్ని తెలుసుకోలేక, పొందలేక, అనుభవించలేక బహుర్ముఖులై దుఃఖానికి లోనవుతూ ఉన్న మానవులకు శంకరాచార్యులవారు కనువిప్పు అయ్యేటట్లు నిరూపించి చూపించారు. కస్తూరి మృగం తన పొట్టకిందే కస్తూరిని పెట్టుకొని దాన్ని తెలుసుకోలేక ఆ కస్తూరి వాసనకోసం అడివంతా తిరుగుతూ ఉన్నట్లు సామాన్య మానవులు నిజమైన సచ్చిదానందాన్ని దేహంలోపలే పెట్టుకొని దాన్నిపొందటానికి అంతర్ముఖం కాకుండా, బహిర్ముఖం అయి తనకు దర్శనమిచ్చే అనేకమైన వాటిల్లో సుఖాన్ని పొందటానికి తపించిపోతూ ఉంటారు. కాన సాధకుడు సుఖం, ఆనందం, శాంతి, శాశ్వతత్వం, నిర్మలత్వం లోపలే ఉన్నాయి అని విశ్వాసంతో నమ్మి నిరంతరం సాధన చేసి తరించాలి. కాలాతీతమైన ఆత్మానుభూతితో జీవించగలగటానికి వీలున్నందువల్ల సాధకుడు సాధనలో నిరంతరానందాన్ని, శాంతిని, సుఖాన్ని పొందగలుగుతాడు. ఆత్మ సహజధర్మం ఆనంద స్వరూపమే గనుక ఆత్మజ్ఞానం తెలిసినప్పటి నుంచి సాధకుడు నిరంతరం నేను సచ్చిదానంద స్వరూపుడను అని తలంచుచు, దుఃఖాల్ని దరిచేరనీయకుండా చూసుకొంటూ జీవితాన్ని కొనసాగించాలి.
శరీరానికే బాల్యం, ¸°వనం, కౌమారం, వృద్ధాప్యం, జరామరణాలు అనేవి ఉన్నాయి కాని ఆత్మకు అట్టి పరిణామ స్థితి లేదు. కాన ఆత్మ నిత్యమై, శాశ్వతమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ అఖండమై, అద్వయమై అలరారుతూ ఉంటుంది గాన అది నిర్మలమై శోభిస్తూ ఉంటుంది.
పంచదార స్వభావం తియ్యదనం అయినట్లే ఆత్మస్వభావం సచ్చిదానందం అయి ఉంది. పంచదార స్వభావం తెలుసుకోవాలంటే ఎవరికి వారుతిని ఎట్లా తెలుసుకోగలుగుతున్నారో అదే విధంగా ఆత్మ స్వభావం తెలుసుకోవాలంటే ఎవరికి వారు స్వానుభవంతో తెలుసుకోవలసి ఉంటుంది. దాన్ని ఇతరులెవ్వరూ ఎవ్వరికీ ప్రసాదించలేరు. ఆకలి తీరాలంటే ఎవరికి వారు అన్నం తినాల్సిందే కదా! దాహం తీరాలంటే ఎవరికి వారు మంచినీళ్ళు తాగాల్సిందే కదా! అట్లాగే అనంతమైన ఆత్మానందాన్ని పొందాలంటే సాధకుడు అంతర్ముఖం అయి ధ్యానంలో ఆ సచ్చిదానందాన్ని అనుభవించాలి.
సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. సూర్యుడు ప్రకాశించనప్పుడు మనకు కనబడటం లేదు. కనబడటం లేదు కాన సూర్యుడు లేడని అంటామా? సూర్యుడు మనకు కనిపించనప్పుడు కూడా వేరొక చోట ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ వేరొక చోటికి మనం వెళ్ళ లేక పోతున్నాం కనుక సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటున్నాము. అంతేగాని సూర్యుడు లేకపోయినా కాలం అంటూ లేదు. అట్లాగే మానవులు ఆత్మ దర్శనం చేసుకోలేక పోయినప్పుడు కూడా అది మానవుని దేహం లోపలే చైతన్యంతో, జీవశక్తి అయి ప్రకాశిస్తూ ఉంది. కావున అటువంటి ఆత్మను చూపించటానికి, అనుభూతిని పొందేటట్లు చేయటానికి ఇతరులు ఎవ్వరు శక్తిమంతులు కారు. అయినప్పటికి ఈ భూలోకంలో చూపించ గలిగిన శక్తిమంతుడు ఒక్కడు ఉన్నాడు. సద్గురువంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువు. కాన అటువంటి గురువును ఆశ్రయించి గురుజ్ఞానం స్వీకరించాలి. ఆ గురుజ్ఞానం మానవుని ఆత్మద్వారాన్ని తెరుస్తుంది. ఆ గురువు ఆశీస్సులే శక్తిమంతమై సాధకునికి ఆత్మానుభూతిని ప్రసాదిస్తాయి. కాన సాధకుడు గురుదర్శనంతో, గురుసేవతో, గుర్వాజ్ఞాపాలనతో నిరంతరం సాధన చేసి శాశ్వతమైన, నిర్మలమైన సచ్చిదానందాన్ని పొందాలి. ఆశబారెడు -ఆచరణ మూరెడు అంటే లక్ష్యం అంత తేలిగ్గా సిద్ధించదు. పిండి కొద్దీ రొట్టెకదా! శ్రమ కొద్దీ ఫలితం ఉంటుంది. అయినప్పటికి సాధనలో కొద్ది కొద్దిగా శక్తిని సంపాదిస్తూ దాన్ని కూడా బెట్టుకొంటూ వస్తూ ఉంటే ఆనకట్ట వల్ల నీళ్ళు అనంతమైన శక్తిని ఇస్తూ ఉన్నట్లు ఆకూడ బెడుతూ ఉన్న శక్తి ఒకనాటికి అనంతమైన శక్తి సంపదను అందిస్తుంది.
25 ఆత్మనః సచ్చిదం శశ్చ
బుద్ధేర్వృత్తిరితి ద్వయం
సంయోజ్య చావివేకేన
జానామీతి ప్రవర్తతే || 25
A»R½øƒ«sM = ఆత్మయొక్క, ద్వయం = రెండు స్వభావాలైన, సత్ + చిత్ + అంశః + చ = సత్ = సత్యమైంది (ఉన్నది, ఎల్లవేళల ఉండునది, ఉనికి), చిత్ = చైతన్యం అయింది అయిన (ప్రకాశం, తెలివి, ఎరుక), అంశః = ఆత్మ యొక్క కొంత భాగమైన జీవశక్తిని, చ = కూడా తాదాత్మ్యం చెందిన, బుద్ధేః = బుద్ధియొక్క, వృత్తిః + ఇతి = నడవడిక అనేటటువంటివి, సంయోజ్య = కలిసి, చ = మరియు, అవివేకేనా = అవివేకంతో (తాను నిర్వహించే కార్యాలు అన్నిటికి ఆత్మే శక్తిని ఇస్తూ ఉంది అని తెలియక), జానామి + ఇతి = నేనే తెలుసుకొంటూ ఉన్నాను అనే భావంతో (నేనే చేస్తూ ఉన్నాను, నాశక్తి సామర్థ్యాలవల్లే ఈ జీవితం కొనసాగుతుంది వంటి ఆలోచనలతో కూడిన అహంకారంతో), ప్రవర్తతే = ప్రవర్తిస్తూ ఉన్నాడు.
తా|| ఆత్మయొక్క రెండు స్వభావాలైన సత్, చిత్‌ల జీవశక్తితో తాదాత్మ్యం చెందిన బుద్ధి అవివేకంతో ఆత్మ శక్తిని తెలుసుకోలేక నేనే తెలుసుకొంటూ ఉన్నాను అనే భావంతో ప్రవర్తిస్తూ ఉంది.
వివరణ :- మానవుడు మరణించక పూర్వం ఏ ఏ అవయవాలు ఉన్నాయో అవి అన్నీ మరణించిన తర్వాత కూడా శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే లేనిది ఏమిటి అంటే చైతన్యం మాత్రమే. ఆ చైతన్యం ఎక్కడిది అని అర్థం చేసుకోవటానికి, విచారణ చేసి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది ఆత్మశక్తిది అని అర్థం అవుతుంది. ఆ చైతన్యం ఆత్మశక్తి యొక్క చిత్ సత్‌ల సంయోజనం చేత శరీరావయవాలకు లభిస్తూ ఉంది. ఆ సత్ చిత్ ప్రభావం వల్లనే జీవన విధానానికి జీవశక్తి లభించింది అని గ్రహించలేక మానవుని బుద్ధి అజ్ఞానంచేత తానే విషయాలను అన్నింటిని తెలుసుకొంటూ ఉన్నాను అని భ్రమ పొందుతూ ఉంటుంది. ఆత్మజ్ఞానం తెలియకపోవటం అనే అజ్ఞానంవల్లే బుద్ధికి ఈ విధంగానే నేను అనే అహంకారం ప్రకోపిస్తూ ఉంటుంది, జడమైన బుద్ధికి చైతన్యంతో కూడిన నేను అనే వ్యక్తిత్వం దేని వల్ల చేకూరింది. సత్‌చిత్‌ల అంశ వల్ల చేకూరింది. అంశ అంటే ఒక భాగం. ఆ పరాత్పరుని శక్తిలో ఒక భాగం మాత్రమే లభించింది. సత్ చిత్‌ల సర్వశక్తిని అవి బుద్ధికి అందించవు. అవి ఒక కాంతి రేఖను అందించినంత మాత్రానికే బుద్ధి అంత విర్రవీగిపోతూ ఉంటే సాంతం ఆ సత్‌చిత్‌ల సర్వశక్తి దానికి అందించి ఉంటే ఆ బుద్ధి ఎంత విర్రవీగుతుందో ఎంతటి వెర్రి తలలు వేస్తుందో వివేకంతో ఆలోచించండి.
శుద్ధచైతన్యం సత్‌తో కలిస్తే ఆత్మ అవుతుంది. A»R½ø @LiÛÉÁ[ A xmsLS»R½öLRiV\®²…ƒ«s $ª«sVƒyõLS¸R…VßáV®²…[. $NRPXxtñsv²R…V @LêRiVƒ«sV¬s»][ A»R½øƒ«sV gRiVLjiLiÀÁ ¿Á}msöÈÁxmsöV²R…V ƒ«sVª«so* ƒ«sLRiV²T…„s, ®ƒs[ƒ«sV ƒyLS¸R…VßáV²T…¬s @¬s ¾»½ÖÁzqs ƒ«s²R…VxqsWò Dƒyõƒ«sV. ¬dsNRPV ¾»½ÖÁ¸R…VµR…V. @Li¾»½[ ª«sV¬sµôR…LjiNTP Dƒ«sõ ¾»½[²y @LiÉزR…V. @LiÛÉÁ[ úxms¼½ª«sWƒ«sª«so²R…V ƒ«sLRiƒyLS¸R…VßáV²R…V @¹¸…[Vù Dƒyõ²R…V. ƒ«sLRiV²R…V »R½ƒ«sƒ«sV »yƒ«sV ¾»½ÌÁVxqsVN]LiÛÉÁ[ ƒyLS¸R…VßáV²R…V @ª«so»y²R…V. ¾»½ÌÁVxqsVN][NRPVLi²y ®ªsNTPÖÁgS xqsLi¿RÁLji}qsò ªyƒ«sLRiV²R…V @ª«so»R½W DLiÉزR…V. FyLRi*¼d½ xmsLRi®ªs[VaRP*LRiVÌÁV NRPÖÁzqs F¡LiVV @LóRiƒyLkiaRP*LRiV²R…VgS FsÉýØ @¸R…Wù²][ @®µ…[„sµ³R…LigS ƒ«sLRiV²R…V ƒyLS¸R…VßáV¬s @LiaRP»][ NRPW²T… Dƒyõƒ«sV @¬s ¾»½ÌÁVxqsVN]¬s A @LiaRP##®ƒs[ A»R½øÇì؃«s ryµ³R…ƒ«s»][ ƒyLS¸R…VßáV²R…VgS LRiWxmsoµj…µôR…VN]LiÈÁW ®ªs×ýÁƒ«sxmsöV²R…V ª«sWƒ«sª«so²R…V µ³R…ƒ«sVù²R…ª«so»y²R…V. A»R½¬s ÒÁ„s»R½Li ¿RÁLji»yLóRiLi @ª«so»R½VLiµj…. ‡ÁVµôðj…ú}msLRißá ¿Á[»R½ ¿Á[NRPWlLi[ @x¤¦¦¦LiNSLS¬sõ »R½gæjiLi¿RÁVN]LiÈÁW gRiVLRiVÇì؃«s ryµ³R…ƒ«s»][ A»R½øaRPNTPò¬s @Õ³Áª«sXµôðj… ¿Á[xqsVN]LiÈÁW ª«s}qsò úxms¼½ ª«sWƒ«sª«so²R…V ƒ«sLRiƒyLS¸R…VßáV²R…VgS LRiWxmsoµj…µôR…VN]LiÉزR…V.
కబీర్‌దాస్ ఒక దోహాలో అనగా ఒక పద్యంలో గురువుని కుమ్మరితో పోల్చాడు. గురువు శిష్యుడనే కుండను చక్కగా తయారు చేస్తూ ఉన్నప్పుడు, కుండకు చక్కని రూపం రావటానికి ఆ కుండను బయటనుంచి కొడుతూ ఉంటాడు. అట్లా పై నుంచి కొడుతూనే ఆకుండ లోపల కూడా చేయి పెట్టి ఆ కుండ ఆకారాన్ని సుందరంగా రూపొందిస్తాడు అని కబీరుదాసు వివరించాడు. అంటే గురువు ఆత్మజ్ఞానం చేత లోపలి నుంచే పనిచేసి సాధకుడు తన తప్పులు తాను తెలుసుకొనేటట్లు చేస్తాడు. అట్లా చేస్తూనే సాధకుడు ఆత్మానందం అనుభవించేటంత వరకు లోపలనుంచే సన్మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. కాన ఆత్మ గురువు శిష్యుని వెన్నంటి ఉండి లోపల బయటకూడా మార్గాన్ని తెలుసుకొనేటట్లు చేస్తాడు. రమణమహర్షికూడా దీన్నే మరొకలా బోధించారు. నిరాకారమైన ఆత్మే గురువై నీ లోపల ఉంటాడు. నీకు మార్గం చూపించటానికే గురువు బయటుంటాడు అని చెప్పారు. లోన బయట రెండు వైపుల సాధకుడు రూపు దిద్దుకొనేటట్లు గురువు కుమ్మరి కుండను తయారు చేసినట్లు తయారు చేస్తూ సాధకుని ఉన్నతికి తీసుకు వెళతాడు. కాన సాధకుడు బుద్ధి ప్రదర్శించే అహంభావాన్ని విడిచిపెట్టి ఆత్మజ్ఞానంతో, సత్‌చిత్‌ల సంయోజనంతో, ఆత్మానందాన్ని పొందటానికి నిరంతరం సాధన చేయాలి.
ఇక ఆచరణలో మనస్సుకు వచ్చే సమస్యల గురించి ఆలోచించినప్పుడు ప్రతిపనికి పురోగతిని కాంక్షిస్తూ ముందుకు పరుగెత్తే మనస్సుకు ఆత్మజ్ఞానం అడ్డుకట్టవేస్తుంది. ఈ ఆత్మజ్ఞానంలో సాధకుడు దేన్ని కాంక్షించకుండా సాధన చెయ్యవలసి వస్తుంది; మనస్సు తనను తాను మరిచిపోవలసిన స్థితి తటస్థిస్తుంది. దానితో ప్రతిపనికీ పురోగతిని కాంక్షిస్తూ నడవటానికి అలవాటు పడ్డ మనస్సు ప్రగతిలేదని బాధపడుతుంది. మనస్సనేదే లేని స్థితిలో పొందే అనుభూతిని నిర్ణయించటానికి మనస్సు ఎట్లా ఉపకరిస్తుంది. గాఢ నిద్రాస్థితిలో మెలకువగా ఉండి పొందటానికి గురుజ్ఞానం అనే ఆత్మచైతన్యమే ఉపకరిస్తుంది కాని బుద్ధి ఏ మాత్రం ఉపకరించదు. సత్ చిత్‌లు ఒక అంశతో మాత్రమే కూడి చైతన్యమైన బుద్ధిని పక్కకు తొలగించి గురుజ్ఞానంతో సాధనతో సంపూర్ణమైన అంశ అయిన ఆత్మానందంతో సాధకుడు అనుభూతిని పొందాలి, సుఖశాంతుల్ని అనుభవించాలి.
బుద్ధియొక్క వృత్తికి అంటే దాని నడవడికకు, జీవనోపాయానికి దానికి జీవశక్తిని ఎవరు ఇచ్చారు? ఆత్మలోని సత్‌చిత్‌లు అందిస్తూ ఉన్నాయి. ఆ సత్ చిత్‌ల అంశ వల్లే బుద్ధి ప్రకాశిస్తూ ఉంది. అంతే కాని బుద్ధి స్వయంప్రకాశ##మైంది కాదు గదా! ఆత్మయే స్వయంప్రకాశ##మైంది గదా! బుద్ధి స్వయం ప్రకాశం కాకపోయినా ప్రకృతి సిద్ధమైన లోపలి విషయాలను అనుభవించటానికి తానే స్వయం ప్రకాశ##మై వెలుగొందుతూ ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. అందు వల్లే బుద్ధి అజ్ఞానంతో నేను తెలుసుకొంటున్నాను అని అన గలుగుతుందే కాని నిజానికి దానికి ఆ శక్తి లేదు కదా! బుద్ధిలో ప్రకాశిస్తూ ఉన్న ఆ చైతన్య శక్తినే ఆధ్యాత్మిక పరిభాషలో చిదాభాసుడని అంటారు. అంటే చిత్ చేత చైతన్యమై ప్రకాశమానమైన బుద్ధిని గురించి తెలుసుకోలేక బుద్ధి ప్రకాశిస్తూ ఉంది అని దానికి ఆ చైతన్య శక్తిని ఆరోపించటం జరుగుతుంది; ప్రకృతి విషయాలతో తాదాత్మ్యం పొందినప్పుడు దాని నడవడికకు, జీవన విధానానికి వస్తు విషయ రూపాల్ని ధరించి ఆయా అనుభూతుల్ని పొందుతుంది. అదే విధానాన్ని బుద్ధిచేత ఆత్మజ్ఞానాన్ని పొందటానికి దాన్ని అంతర్ముఖం చేయిస్తే అదే మార్గంలో బుద్ధి సంచరించి ఆత్మకు సంబంధించిన ఆ అనుభూతిని పొందుతుంది. ఇక దాని తర్వాత ఆత్మ చైతన్యవంతమై ప్రకాశమానమై వెలుగొందుతుంది కాన దాన్ని ప్రకాశింప చేయటానికి మరొకటి అవసరంలేదు. కాన ఆత్మ ప్రకాశమానంగా వెలుగొంది సాధకునికి ఆత్మానుభూతిని అందిస్తుంది.
బాలయోగీశ్వర్ గురుమహారాజ్‌జీ గారు ఆత్మ ప్రకాశాన్ని గురించి ఈ క్రింది విధంగా వివరించారు.
The knowledge was essential then and it is essential now. The cause of illusion is still the same, and that is darkness inside man. But this knowledge is such that it can remove the darkness from all over the world at the same time. It is said that even if thousands and thousands of suns rise, the light will not be able to equilibrate the light of that Divine light, so bright it is ! It can not be seen by these eyes, which perish, but this Supreme Light, this most powerful and absolutely Holiest Light in the world, is only visible through the Third Eye. So if we want to have peace now, we have to go to feet of the master of the time.
- Guru Maharaj ji.
''ఆత్మ జ్ఞానం అవసరం అయి ఉంది. అట్లా అనుకొన్నప్పుడు అది ఇప్పుడు అవసరం అయి ఉంది. భ్రాంతికి కారణం అయిన మానవునిలో ఉన్న అజ్ఞానాంధకారం ఇప్పటికీ అట్లాగే ఉంది. ఈ జ్ఞానం ప్రపంచం మొత్తం నుంచి సర్వత్రా అలముకొని ఉన్న చీకటిని పారద్రోల గలదు. వేల వేల (శతసహస్ర) సూర్యుల కాంతులు ఉదయించినప్పటికీ ఆత్మ జ్ఞానమనే దివ్యజ్యోతి ప్రకాశానికి సరితూగ లేవు. అది అంత దేదీప్య మానమైంది. నశించేటటువంటి ఈ చర్మచక్షువులకు అది దృగ్గోచరం కాదు. అద్వితీయం, అనంత శక్తిమంతం, అతి పవిత్రం అయిన ఈ కాంతి స్వరూపాన్ని ఆత్మజ్ఞాన మనే మూడవ కంటి ద్వారా మాత్రమే చూట్టానికి వీలవుతుంది. కనుక మనం శాంతి కావాలనుకొన్నట్లయితే కాలానికి గురువైనవాని పాదాల్ని ఆశ్రయించాలి.''
- గురుమహారాజ్ జీ.
మానవుడు కాలానికి తగిన గురువును స్వీకరించి, కాలానికి తగిన జ్ఞానాన్ని తీసుకొని, కాలానికి తగిన పాత్రను వహించి ఆత్మజ్ఞానంతో, ఆత్మమార్గ సాధనతో, ఆత్మానందంతో తరించాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ''అహమాత్మా గుడా కేశా'' (10-20) అన్నాడు. అంటే అర్జునా నేను ఆత్మను అయి ఉన్నాను అని చెప్పాడు. అంటే మానవులు అందరు లోపల భగవంతునికలిగి ఉన్నారు. ప్రతి వాళ్ళ యొక్క ఆత్మశక్తి భగవంతుడే అయి ఉన్నాడు. అంటే మానవులందరు ఏ వ్యత్యాసం లేకుండా ఆత్మ జ్ఞానాన్ని పొందటానికి, ఆత్మానందాన్ని అనుభవించటానికి అర్హులై ఉన్నారు. ఆత్మ అందరికీ ఒకటే అయి ఉన్నందువలన మానవులందరిలోను ఏ వ్యత్యాసం లేదు. ఆత్మానుభవానికి అందరూ అర్హులై ఉన్నారు. కాన ఆత్మజ్ఞాన సాధకులు ఓర్పుతో, పట్టుదలతో, నిరంతరం సాధనతో ఆత్మజ్ఞాన సాధనతో జీవించాలి. దాని వల్ల అందరికీ శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. కాన సాధకుడు ఉదయాన్నే లేవగానే బ్రాహ్మీముహూర్తంలో సాధన చెయ్యటం ఉత్తమం అయి ఉంది. నిద్ర లేవగానే మనస్సును మళ్ళీ వెంటనే లోపలకు పంపటం చాలా తేలిక అయి ఉంది అని రమణ మహర్షి చెప్పి ఉన్నారు. సాధనను గురించి సాధ్యాసాధ్యాల గురించి మీన మేషాలు లెక్కించే సామాన్య మానవుని గురించి ఇక్కడ ఒక్క విషయం ఉదాహరణగా వివరిస్తాను. పరిశీలించి చూడండి. సామాన్య మానవుడనే గొంగళి పురుగు ఆత్మ జ్ఞాన సాధనతో సీతాకోక చిలుకగా మారతాడు. సీతాకోక చిలుక అనే జ్ఞాని తేనేటీగల తేనెపట్టులో ప్రవేశించి ఆత్మానందం అనే తేనెను జుర్రి శాంతి సౌఖ్యాలతో బయటకు వస్తాడు. అది ఎవరికి వారు స్వానుభవంతో గ్రహించవలసిందే అయి ఉంది. కాన ఎవరికి వారు ఆత్మానందాన్ని అనుభవించటానికి కాలానికి తగిన గురువును ఆశ్రయించి, ఆయనను సేవించి తరించాలి. కాన తేనెను తేనె పట్టునుంచి జుర్రుకునే ''స్ఫింక్'' అనే సీతాకోక చిలుకను గురించి వివరిస్తాను. ఈ సీతాకోక చిలుక రెక్కలు నల్లగాను, పొట్ట పసుపు రంగులోను ఉంటాయి. వీపుమీద పసుపు, తెలుపు రంగులలో చుక్కల ముగ్గులాంటి డిజైన్ ఉంటుంది. ఆ సీతాకోకచిలుక తేనెతుట్టెలో ప్రవేశిస్తూ ఉంటే తేనెటీగలు కుట్టవా అని మీరు ఆశ్చర్యపడుతూ ఉన్నారు కదూ! అది ఏ బాధా లేకుండా కడుపు నింపుకొని హాయిగా బయటకు వస్తుంది. రాణీ తేనెటీగకు ఆనందం కలిగినప్పుడు తేనెతుట్టె అరల వెంట పరుగెత్తుతూ ఒక రకమైన ధ్వనిని చేస్తూ పాటపాడుతుంది. ఆ గానాన్ని విన్న తేనెటీగలు మైమరచిపోతాయి. అటువంటి సమయంలో ఈ సీతాకోకచిలుక రాణీ తేనెటీగ గొంతును అనుకరిస్తూ పాట పాడుతుంది. కాపలా ఈగలు ఈ పాట విని మైమరచిపోయి ఉన్న సమయంలో సీతాకోక చిలుక తేనెతుట్టెలో దూరి తేనెను తాగుతుంది. తన మాయలో పడిన తేనెటీగలు స్పృహలోకి రాకముందే వీలయినంత త్వరగా తనకు హాని కలుగకుండానే బయటకు రావటానికి ప్రయత్నం చేస్తుంది. కాన మనస్సును మైమరపించి దానికి శక్తిని ఇస్తూ ఉన్న మూలాధారం దగ్గరకు మనస్సు ద్వారానే చేరాలి. కాన దానికి అనుకూలంగా మనస్సును తయారు చేయటానికే సీతాకోక చిలుక పాడినపాటలాగా గురుమహారాజ్‌జీ జ్ఞానం సాధనలో పనిచేస్తుంది. గురుకృప, గురువు ఆశీర్వాదం, గురుసేవ, గుర్వాజ్ఞాపాలన వంటివి ఈ కార్యసాధనకు అవసరం అనేది గ్రహించాలి. మానవుని లోపల ఉన్న ఆత్మ అనుమతించనిదే ఏ సాధకుడు లోనికి వెళ్ళలేడు. ''ప్రపత్తి అంత సులభం కాదు. అహాన్ని చంపటం అంత తేలిక కాదు. ఆత్మానుగ్రహంవల్ల-భగవంతుడే మనస్సుని అంతర్ముఖం చేస్తేనే-ప్రపత్తి కలుగుతుంది.'' అని రమణ మహర్షి చెప్పి ఉన్నారు. కనుక ప్రత్యక్షదైవమైన గురువు ఎడల అంకితభావంతో జీవించాలి. గురువును కాని, భగవంతుని కాని ఏదో ఆశించి సేవించాలని సాధకుడు ప్రయత్నం చేయకూడదు. మీరాబాయి ఏవిధంగా లోకంలో పురుషుడొక్కడే ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా స్త్రీలే అని చెప్పి భగవంతుని ప్రేమించిందో, ఆరాధించిందో ఆ విధంగా లోనున్న భగవంతుని ఆ విధంగా ప్రేమించి, ఆరాధించి సాధకుడు అసాధ్యమనుకొనే దాన్ని సుసాధ్యం చేసుకోవాలి.
26 ఆత్మానో విక్రియా నాస్తి
బుద్ధేర్బోధో న జాత్వితి
జీవః సర్వమలం జ్ఞాత్వా
జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి || 26
A»R½øƒ«sM = ఆత్మకు, విక్రియా = బాగాపనిచేయటం అనే కర్తృత్వం, న + అస్తి = లేదు, బుద్ధేః=బుద్ధికి, బోధః = స్వయంగా ఏపనిచేయటానికైనా కావలసిన జ్ఞానశక్తి, న జాతు + ఇతి = లేనే లేదు, జీవః = జీవుడు, సర్వం = అంతా, అలం = బాగా, జ్ఞాత్వా = తెలుసుకొని, జ్ఞాతా = నేనే తెలుసుకొంటూ ఉన్నాను, ద్రష్టా = నేనే చూస్తూ ఉన్నాను అని, ముహ్యతి = భ్రమిస్తూ ఉన్నాడు.
తా|| ఆత్మకు తానైపూనుకొని పనిచేయటం అనే కర్తృత్వం లేదు. బుద్ధికి ఏ పనిచేయటానికైనా కావలసిన శక్తిగాని, జ్ఞానం గాని స్వయంగా లేనే లేవు. జీవుడు లోకంలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసుకొని, నేనే అంతా తెలుసుకొంటున్నాను, నేనే అంతా చూస్తూ ఉన్నాను అని భ్రమ చెందుతూ ఉన్నాడు.
వివరణ :- ఆత్మకు ఏ పనిలోను కర్తృత్వం అనేది లేదు. బుద్ధికి కూడా ఏ పనిచేయటానికి కావలసిన శక్తి లేదు. అయితే మరి ఈ పనులన్నీ ఈ విధంగా అవ్వటానికి మూలకారణం ఎక్కడ ఉంది. అనే సమస్య ఉత్పన్నం అవుతూ ఉంది. దానికే ఆచార్యుల వారు జీవుడు అనే వాడే ఈ పనులన్నీ చేయిస్తూ ఉన్నాడు అని వివరించారు. అయితే ఈ జీవుడు ఎవరు ? అంటే మాయ ఆవరించిన ఆత్మే జీవుడు అయి ఉన్నాడు. అని అర్థం చేసుకోవలసి వస్తుంది. ఈ మాయ ఆవరించటం అంటే ఏమిటి ? అని మరొక ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది. ఈ మాయ ఆవరించటం అనేది మానవుని జీవలక్షణం అని వివరించి ఉన్నారు. ఒకే వస్తువును అందరూ ఒకేలా చూసినా అందరూ ఒకేలా ఆలోచించరు. మానవుడు జీవించే ఇంటి వాతావరణాన్ని బట్టి, ఆతని పరిసరాల్నిబట్టి, ఆతని నడవడికను బట్టి, ఆతని ఆశయాల్ని బట్టి, ఆతని నాగరికత సంస్కృతులను బట్టి, ఆతని తల్లిదండ్రులు ఆతనికి ఇచ్చిన జన్యులక్షణాల్ని బట్టి ఆతని ప్రవర్తనా విధానం మారుతూ ఉంటుంది. కాన ఈ మాయ అనేది కూడా ఆ మానవుడు ఆ విధంగా ప్రవర్తించటానికి అనుకూలమైన ప్రేరణను కలిగిస్తూ ఉంటుంది అని ఒక విధంగా చెప్పుకోవచ్చు. మానవుని జన్మపరంపర అనే ఒక మార్గం ఉండటంవల్ల ఆతని ప్రారబ్ధకర్మవల్ల ఆ విధంగా నడవటానికి ఆతని జీవలక్షణం ప్రేరేపిస్తూ ఉంది అని కూడా అనవచ్చు. అహంకారమే జీవుడు అని కూడా అనవచ్చు. ఈ జీవుణ్ణి గురించి ఎన్ని రకాలుగా ఏమేమి చెప్పినా మనకు కనిపించే జీవలక్షణాలన్నిటికీ ఆ జీవుడే కారణం అవుతూ ఉన్నాడు. ఈ జీవుడే అహంకారాన్ని ప్రేరేపిస్తూ, బంధాలు, సెంటిమెంట్సు (గౌరవంతో కూడిన ప్రేమ)ను అభివృద్ధి చేసి మానవుని పతనానికి కారణభూతం అవుతూ ఉన్నాడు. అందుకే ఏ మానవుడయినా ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేక ప్రవర్తిస్తూ ఉంటే చూసినవారు ఆతణ్ణి నైతికంగా పతనం అవుతూ ఉన్నావు అని నిందించటం జరుగుతూ ఉంటుంది. దానికి ఆతడు ఇది ప్రారబ్దకర్మ అని, అదే నన్ను అట్లా చేయిస్తూ ఉంది అని అంటూ ఉంటాడు. అదే విధంగా ఒకడు త్యాగం, అహింస వంటి ఉత్తమ గుణాలతో సంచరిస్తూ ఉన్నప్పుడు మానవులు ఆతణ్ణి కారణ జన్ముడు అని, పూర్వజన్మలో ఏ సన్యాసో అయి ఉండి మళ్ళీ ఈ జన్మలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాడు అని అంటూ ఆతనిని స్తుతిస్తూ ఉంటారు. ఆయా విధాలుగా మానవులందరూ జీవుని లక్షణాలకు అనుకూలంగా సంచరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను ఆధ్యాత్మిక చింతనా విధానానికి గాని, ఆధ్యాత్మిక ప్రవర్తనా విధానానికి గాని, ఆధ్యాత్మిక ఆచరణ మార్గానికి గాని ఆలోచించేటప్పుడు ఎవరినైనా ఎట్లా మార్చగలం అని ఆవేదన చెందుతూ వారి వారి ప్రారబ్ధ కర్మకు వదిలివేయటమేనా అని ఆలోచించవలసిన సమస్య ఉత్పన్నం అవుతూ ఉంది. ఎవరినికూడా ఆ విధంగా వదిలివేయటానికి వీలులేదు. మానవులను బాల్యం నుంచి చదివిస్తూ, తల్లి దండ్రులు, సంఘం వాళ్ళను సక్రమ మార్గంలో తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లే ఆధ్యాత్మిక గురువులు కూడా వాళ్ళను తీర్చిదిద్దటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గురుకృప వల్ల, గురువు ఆశీస్సుల వల్ల, గురువు ఇచ్చే ఆత్మ బోధవల్ల, వారిని సేవారంగంలో ప్రవేశ##పెట్టటం వల్ల ఈ జన్మలోనే వాళ్ళు మోక్షసాధనకు అర్హులు అవుతూ ఉన్నారు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో అన్నట్లు మనస్సే అన్నిటికి కారణం అయి ఉంది. మానవునికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎట్లా పనిచేస్తూఉన్నాయో మనస్సుకూడా అట్లాగే అంతరింద్రియమై పనిచేస్తూ ఉంది. అందుకే దాన్ని కారణం అంటే పనిముట్టు అని అన్నారు. అది అంతః కరణం అయింది. ఆ పనిముట్టును ఉపయోగించుకొనే విధానాన్ని బట్టి దాని నడవడిక ఉంటుంది. దాన్ని శత్రువుగాను చేసుకోవచ్చు లేదా దాన్ని మిత్రుడుగాను మార్చుకోవచ్చు. అది ఎవరికి వారు నిర్ణయించుకోవలసిన విషయమేకాని ఇతరులు నిర్ణయించి చెప్పేదికాదు. ఏ మార్గానికైనా ఏదైనా పద్ధతిలో చెప్పి చేయించగలరుగాని ఆత్మమార్గంలో మాత్రం ఇతరులు చెప్పగలరేకాని చేయించలేరు. ఎవరి ఇంద్రియాల్ని వాళ్ళు నిగ్రహించుకోవటానికి నిరంతరం ఇందులో సాధన చేయవలసి ఉంటుంది. అంగసౌష్ఠవం సుందరంగా ఉండాలంటే ఎన్నిరకాల వ్యాయామాలు చేయవలసి ఉంటుందో, ఎన్ని రకాల బాధలకు లోనవ్వవలసి వస్తూ ఉంటుందో అదేవిధంగా మనస్సును దారిలో పెట్టుకోవటానికి ఆ విధంగానే అనేక రకాలుగా శ్రమించ వలసి ఉంటుంది. శ్రమించకుండా, శ్రద్ధ లేకుండా ఏ పనీ సుందరంగా తయారవ్వదుకదా! తలమీద వెంట్రుకలు అందంగా తయారవ్వాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేయవలసి వస్తూ ఉంది కదా! అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో అహంకారంతో ప్రవర్తిస్తున్న జీవుని దారిలో పెట్టుకోవటానికి ఆత్మమార్గంలో సాధన చేయవలసి ఉంటుంది. ఆత్మగురువును వాళ్ళ శక్తి కొలది వాళ్ళ విజ్ఞాన వివేకాలతో, కృపా కటాక్షాలతో జీవుని దారిలో పెట్టటానికి అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాన సక్రమమైన మార్గంలో పయనించి ఉన్నతికి చేరటానికి గురువును ఆశ్రయించి ధన్యులు కావాలి.
జీవుణ్ణి గురించి వివరిస్తూ సుందర ''చైతన్యానంద స్వామి వారు చైతన్యబుద్ధిలో ప్రతిబింబించటం వలన జనించిన చిదాభాసుడే జీవుడు''అన్నారు. ఆ చిదాభాసుడైన జీవుడు దేహానికే పరిమితుడను అనుకోవటం వల్ల భ్రాంతికి లోనయ్యాడు. కాన రాగద్వేషాలకు నిలయం అయ్యాడు. కర్తృత్వాన్ని ఆపాదించుకొన్నాడు కాన తానే జ్ఞాతను అని, తానే ద్రష్టను అని వ్యవహరిస్తూ ఉన్నాడు. దీని వల్ల అశాంతికి నిలయం అయ్యాడు. ఈ అశాంతిని తొలగించుకోవటానికి దేహభ్రాంతిని, జీవభ్రాంతిని అర్థం చేసుకొని నేను దేహాన్ని కాదు, జీవుణ్ణి కాదు, నేను ఆత్మని అని తెలుసుకొని మానవుడు నడుచుకోవలసిన అవసరం ఉంది. అది సామాన్యంగా మానవులకు వయసుమళ్ళిన తర్వాత మాత్రమే అర్థం అవుతూ ఉంది. కారణం సామాన్య మానవులకు బాల్యంలోను, ¸°వనంలోను, ఆధ్యాత్మిక భావనకు, ఆత్మజ్ఞాన భావనకు మనజీవన విధానంలో స్థానం లేకుండా పోయింది. దాని వల్ల ఆత్మ మార్గాన్ని సామాన్యులు తెలుసుకోలేక పోతూ ఉన్నారు. కావున అందరికి ఆత్మమార్గాన్ని తెలుసుకోవటానికి వీలుగా జీవన విధానంలో దీనికి ¸°వనకాలం నుంచి అయినా స్థానాన్ని కల్పించటానికి విజ్ఞానం, వివేకం కలిగిన వాళ్ళందరు ఆలోచించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. విద్యాప్రణాళికలో దీనికి స్థానం కల్పించి ప్రోత్సాహించ వలసిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞులు ఆలోచించాలి.
మానవుడు అనే నాణానికి ఒక వైపు మనస్సు రెండవవైపు ఆత్మ అనేవి ఉన్నాయి. ఆ నాణం నుంచి ఏ ఒక్కటీ తొలగించటానికి వీలు లేదు. కాన వాటిని సమన్వయం చేసుకొని జీవించటమే ఉత్తమమైన మార్గం అని అందరూ ఆలోచించేటట్లు చేయాలి.
జీవునికి సంబంధించిన నిర్వచనాన్ని గురించి ఆలోచించినట్లయితే దాన్ని మాయ ఆవరించిన ఆత్మ అన్నా, అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా, నేను అన్నా, చిదాభాసుడు అన్నా, జీవ బ్రహ్మఅన్నా, జీవాత్మ అన్నా, బ్రహ్మసృష్టి అన్నా ఎన్ని రకాలుగా ఎన్నిపేర్లు పెట్టుకొన్నా మానవునిలో ఉన్నది మాత్రం అక్కడ ఒక్కటే. అదే మానవుని మనస్సు. మనస్సును అంతఃకరణ చతుష్టయం అని పేరు పెట్టి మానవులు పనిచేయిస్తూ ఉంది ఆ ఒక్కదానితోనే. అయినప్పటికి రకరకాల పరిస్థితిల్లో రకరకాలుగా దాని స్థానాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఎట్లా పిలుస్తూ ఉన్నారో అట్లాగే జీవుడు అనేది కూడా మనస్సుకు ఒక నామం మాత్రమే అయి ఉంది. అది పనిచేసే విధానాన్ని బట్టి, దాని పరిస్థితుల్ని బట్టి, దాని స్థానాన్ని బట్టి, మానవుని జీవన విధానాన్ని బట్టి మానవుడు నడుచుకోవటానికి వీలుగా శాస్త్ర పరిభాషలో వివిధ నామాలతో వివరిస్తూ ఉన్న విధానమే కాని వేరు కాదు అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అందువల్ల ఆ మనస్సును దారిలో ఎట్లా పెట్టుకోవాలని ఆలోచించటానికి కళ్ళముందుకనిపించే గుడ్డివాడిని ఉదాహరణగా స్వీకరించి ఆలోచించినట్లయితే విషయం బాగా అర్థం చేసుకోవటానికి సులభతరం అవుతుంది అనుకొంటూ ఉన్నాను. గుడ్డివాడు ఏమీ చూడకుండానే కర్రపుచ్చుకొని నడుస్తూ కర్ర ఆధారంతోనే గమ్యాన్ని ఎట్లా చేరగలుగుతున్నాడో అదే విధంగా ఆత్మ జ్ఞానం అనే కర్రతో గురుమార్గంలో పయనించినప్పుడు వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రపరిభాషలు, ఆచారవ్యవహారాలు వంటివి ఏమీ తెలియని సాధకుడు కూడా అనుకొన్నది అనుకొన్నట్లు నడుస్తూ మనస్సును మార్గంలో పెట్టుకోగలుగుతాడు అని అర్థం అవుతుంది. మనస్సు చెప్పినట్లు మానవుడు నడవటం కాకుండా ఆత్మజ్ఞానం చెప్పినట్లు మనస్సును నడిపించినప్పుడు సాధకుడు గమ్యం చేరడానికి వీలు కుదురుతుంది.
27 రజ్జు సర్పవదాత్మానం
జీవో జ్ఞాత్వా భయం వహేత్
నాహం జీవః పరాత్మేతి
జ్ఞాతశ్చేత్ నిర్భయో భ##వేత్ || 27
LRiÇêÁÙxqsLRiöª«s»`½ = తాడు నందు పాము ఉంది అని భ్రమ చెందునట్లు, ఆత్మానం = ఆత్మను, జీవః = జీవునిగా, జ్ఞాత్వా = తెలుసుకొని, భయం = భయాన్ని, వహేత్ = పొందుతూ ఉన్నాడు, జీవః = జీవుణ్ణి, న + అహం = నేను కాను, పర + ఆత్మ + ఇతి = నేను పరమాత్మనుఅయిఉన్నాను అని, జ్ఞాతః + చేత = తెలుసుకొన్నట్లయితే, నిర్ + భయః = భయం అనేది లేనటువంటి వాడుగా, భ##వేత్ = అవ్వగలడు.
తా||చీకట్లో తాడును తాకి పాము అని భయపడుతూ ఉన్నట్లుగా ఆత్మను గురించి తెలియక జీవునిగా అర్థం చేసుకొని మానవుడు భయానికి లోనవుతూ ఉన్నాడు. నేను జీవుణ్ణి కాను, నేను పరమాత్మనే అయి ఉన్నాను అనే జ్ఞానాన్ని పొందిన వెంటనే మానవుడు భయం అనేది లేనటువంటి వాడుగా అవుతూ ఉన్నాడు.
వివరణ:- చీకటిలో చిన్న చిరుదీపం కూడా చీకటిని పారద్రోలగలుగుతూ ఉన్నట్లు ఆత్మజ్ఞానం పొందిన వెంటనే అది దుఃఖాన్ని పారద్రోలుతుంది. మానవునికి ఆత్మజ్ఞానంతో తాను జీవుణ్ణికాదు అని తెలియగానే శరీరం ఆనందంతో కంపిస్తుంది. తాను పరమాత్ముణ్ణ కాని మామూలుగా సామాన్యులు అందరూ భావిస్తూ ఉన్న సామాన్య మనిషిని కాను అని అనుకొన్న వెంటనే బుద్ధి ప్రదర్శిస్తూ ఉన్న స్వరూపస్వభావాలు అన్నీ కూడా ఆత్మకు సంబంధించినవికావు అని అర్థం అవుతుంది. అది ఎప్పుడు అర్థం అవుతుందో అప్పటి నుంచి మానవుడు తాను బ్రహ్మనే కాని దేహాన్ని కాదు అని నిరంతరం భావన చేస్తూ ఉండాలి. అట్లా భావన చేస్తూ ఉంటే ఆ మనస్సు -శబ్ద స్పర్శరూపరస గంధాదుల వల్ల జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు - కల్పిస్తూ ఉన్న కోరికలకు తాను బాధ్యుడను కాను అని అనుకోవటానికి వీలు కుదురుతుంది. దాని వల్ల శరీరంలో వచ్చే ప్రేరణల్ని, మార్పుల్ని అరికట్టటానికి, నిరంతరం గమ్యాన్ని కాంక్షించిన లక్ష్యానికి-మనస్సుకి మధ్య సంఘర్షణ జరుగుతూ కార్యం ప్రారంభంలోనే ఆగిపోవటానికి వీలు కుదురుతుంది. ఆ విధమైన పరిణామాల వల్ల శరీరంలో అణువణువు నందుపూర్వం చేకూరే అలజడులు తొలగిపోతూ వాటి స్థానంలో శాంతి సౌఖ్యాలు చోటు చేసుకుంటాయి. దాని వల్ల మానవుడికి ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది.
రజ్జు సర్ప న్యాయం అనేది సామాన్యులందరికీ తెలిసిందే. చీకటిలో ప్రతిచిన్న కదలికకు, ప్రతి చిన్న శబ్దానికి కూడా దయ్యాలని, భూతాలని భయపడిపోతూ మానవులు చచ్చి బ్రతుకుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ దీపం వెలిగించగానే వణికిపోతూ ఉన్నవాళ్ళు కాస్తా హాయిగా ప్రశాంతంగా గాలి పీల్చుకొంటారు. వెలుతురు అనేది చీకటినే కాక భయాన్నికూడా తొలగిస్తూ ఉంది. జూలియస్ సీజర్ పిరికివాడు నిరంతరం మరణిస్తూ ఉంటాడని, ధైర్యస్థుడు ఒక్కసారే మరణిస్తాడని చెప్పిన మాటల్ని గుర్తుచేసుకొన్నట్లయితే ఆత్మజ్ఞాని నిరంతరం ధైర్యంతో జీవించగలుగుతాడు అని బోధపడుతుంది. చీకటిలో నడుస్తూ ఉన్న మానవునికి తాడుతగలగానే పాము తగిలినట్లు భావన రేకెత్తి భయకంపితుణ్ణి చేస్తుంది. ఆ చీకటి తొలిగేటంతవరకు ఆ భయం తొలగదు. మానవుడిలో ఉన్న జీవభ్రాంతే చీకటి అయి మానవుణ్ణి దుఃఖ భూయిష్ఠుణ్ణి చేస్తూ ఉంది. శరీరమే నిత్యం అని, సత్యమని, తాను దేహమేనని దేహభ్రాంతితో ఉన్నంతవరకు ఆ జీవుడికి దుఃఖం తప్పదు. ఆ జీవభ్రాంతి తొలగాలంటే, ఆ జీవుడు శుద్ధం అవ్వాలంటే మానవుడు తాను చేసే ప్రతికార్యమందు శుద్ధచైతన్యంగా రూపుదిద్దుకోవటానికి నిరంతరం ప్రయత్న సాధన కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పుడో ఆనందం వస్తుంది అని, ఎప్పుడో జన్మరాహిత్యం అవుతుంది అని నిరంతరం ఈ సంఘర్షణలో బాధపడటం ఎందుకు ? అని ప్రశ్నించే వాళ్ళకు ఇనుపకళాయిని ఉదాహరణగా చూపించతగి ఉంది. అది తోమగా తోమగా తెల్లగా కనిపిస్తుంది. వాడుకోవటానికి అందంగా ఉంటుంది. అట్లాతోమకుండా ప్రక్కన పడవేస్తే తుప్పెక్కి పోతుంది. కాన ఆత్మజ్ఞాన సాధనలో ముందుకు నడిస్తే జీవించిఉండగానే సుఖశాంతులు పొందవచ్చు అని తెలుసుకోవాలి. నిరంతరం నేను ఆత్మనే అని భావించే భావనలో ఈ చేసే పనులన్నిటికీ, భావనలన్నిటికి బాధ్యుడను నేను కాను, అవి అన్నీ కూడా బుద్ధి వల్ల చేకూరుతూ ఉన్నయ్యేకాని వేరు కాదు అనే ఆలోచన క్రమేపి స్థిరం అవుతుంది. దానివల్ల చేకూరే శాంతి, ఆనందం ఎట్లా ఉంటుందో ఎవరికి వారు అనుభవపూర్వకంగా అనుభవించవలసిందేకాని ఇతరులు చూపించటానికి వీలు అయ్యేదికాదు. కులం, మతం, జాతి, లింగభేదం, ఆచార వ్యవహారాలు, రోగాలు, దుఃఖాలు, బాధలు, నిందాస్తుతులు వంటివి అన్నీ కూడా దేహానికి సంబంధించినవే కాని ఆత్మకు కావు. జీవభ్రాంతి ఉన్నవారికే అవి అన్నీ రాశీభూతం అయి బాధిస్తూ ఉంటాయి కాని అవి అన్నీ ఆత్మకు కావని తెలుసుకోవాలి. సంఘం అనే ప్రిజంను కంటి ముందు ఉంచి లోకంలో జరిగే సంఘటనలన్నిటినీ తిలకిస్తూ ఉంటే ఒకే కాంతి ఏడు రంగులుగా కనిపిస్తూ ఉన్నట్లు సంఘం అంతా వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. సాధకుడు మనస్సు అనే ప్రిజంను కంటి ముందునుంచి తొలగించగానే స్వచ్ఛమైన, సత్యమైన తెల్లటికాంతి అనే ఆత్మ- జ్యోతి వలె దర్శనం ఇస్తుంది.
మానవుడు నేను ఆత్మను అని అనుకొన్నట్లయితే వెంటనే పరిపూర్ణుడు, సంసార రహితుడు, అకర్త, అభోక్త, నిత్యుడు, నిరాకారుడు అవుతూ జ్ఞానంతో, ఆనందంతో జీవించగలుగుతాడు. నేను జీవుణ్ణి అనుకొన్నట్లయితే పరిచ్ఛిన్నుడు, సంసారి, కర్త, భోక్త, అనిత్యుడు అయి దుఃఖభూయిష్ఠుడు అవుతూ జీవిస్తూ ఉంటాడు. కాన జ్ఞానానికి అజ్ఞానానికి గల వ్యత్యాసాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానంతో, వివేకంతో, వివేచనా మార్గంతో మానవుడు జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఆత్మను గురించి తెలియటమే విద్య, జ్ఞానం అయితే ఆత్మను గురించి తెలియక పోవటమే అవిద్య, అజ్ఞానం అయి ఉన్నాయి.
28 ఆత్మావభాసయత్యేకో
బుద్ధ్యాధీ నీంద్రియాణ్యపి
దీపో ఘటాదివత్ స్వాత్మా
జడై సై#్తర్నావ భాస్యతే || 28
µk…xmsM = దీపం, ఘట + ఆదివత్ = కుండ మొదలైన వాటిని (ప్రకాశింప చేయుచున్నట్లు), ఆత్మ = ఆత్మ, ఏకః = ఒక్కటే, బుద్ధి + ఆధీని = బుద్ధి ఆధీనంలో ఉన్న వాటిని, ఇంద్రియాణి + అపి = ఇంద్రియాల్ని కూడా, అవభాసయతి= ప్రకాశింపచేస్తూ ఉంది. జడైః = చైతన్యం లేనటువంటివి, తైః = అయిన బుద్ధిమొదలైన ఇంద్రియాలు, స్వ + ఆత్మ = తమంతటతాముగా, న + అవ భాస్యతే = ప్రకాశింపలేవు.
తా|| దీపం కుండ మొదలైన జడవస్తువుల్ని ప్రకాశింప చేస్తూ ఉన్నట్లుగా ఆత్మ ఒక్కటే బుద్ధి, ఇంద్రియాలు మొదలైన అవయవాలన్నిటిని కూడా ప్రకాశింప చేస్తూ ఉంది. జడాలు అయినటువంటివి అంటే చైతన్యం లేనటువంటివి అయిన భౌతిక పదార్థాలుకాని, బుద్ధి ఇంద్రియాలు వంటివి కాని వాటంతట అవి ప్రకాశించలేవు.
వివరణ :- సామాన్య మానవులు ఆత్మ అస్తిత్వాన్ని అంటే ఆత్మ ఉంది అనే జ్ఞానాన్ని తెలుసుకోలేనివాళ్ళు, అంటే సమాధి స్థితిలో సాక్షాత్కరించుకోలేనివాళ్ళు, లేదా అనుభూతి పొందలేనివాళ్ళు దాన్ని ఎట్లా తెలుసుకొంటారు అంటే అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవటానికి వీలవుతుంది. గాఢ నిద్రలో ఆత్మ ఉన్న స్థితిని అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవటానికి వీలవుతుంది. అదీకాని నాడు ప్రకృతిలోని వివిధ శక్తులద్వారా అనుమానాన్ని బట్టి తెలుసుకోవటానికి వీలవుతుంది. దాన్ని అర్థం చేసుకొనేటట్లు చెయ్యటానికే ఆచార్యులవారు ఇక్కడ దీపాన్ని ఉపమానంగా సూచించారు. పగలు సూర్యునివల్ల అన్నిటిని చూడగలుగుతూ ఉన్నాం కదా! అట్లాగే రాత్రులు దీపం వల్ల అన్నిటిని చూడటానికి వీలవుతూ ఉంది కదా! ఇప్పుడు అట్లా ఆత్మను గురించి ఆలోచించినప్పుడు ఒక ఉదాహరణను పరిశీలించటం ఎంతైనా తగి ఉంది. అదేమిటంటే మానవుడు మరణించిన తర్వాత శరీరంలోని అవయవాలన్నింటినుంచి, ఇంద్రియాలన్నింటినుంచి ఆత్మశక్తి లోపించినట్లు అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవటానికి వీలవుతూ ఉంది. మానవుని ఇంద్రియాలన్నిటి లోను శక్తిమంతంగా కనిపించే గుండెకాయ, మనస్సు రెండు కూడా స్వయం ప్రకాశాలు కావు అని మరణం తర్వాత తెలుస్తుంది. మనస్సే అన్ని కార్యాలు చేస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నప్పటికి అది కూడా ఆత్మశక్తి వల్లే ఆ కార్యాలన్నిటినీ చేస్తూ ఉందని మరణం తర్వాత సామాన్యమానవులు కూడా అర్థం చేసుకోవటానికి వీలవుతూ ఉంది. భౌతిక ప్రపంచంలోని జడాలైన వస్తువులన్నీ ఎట్లా స్వయం ప్రకాశకాలు కావో అట్లాగే మానవ దేహంలోని అన్ని ఇంద్రియాలు కూడా స్వయం ప్రకాశకాలు కావు అని అర్థం అవుతుంది. అయితే ఒక వ్యత్యాసం ఏమిటంటే లోకంలో ఉన్న వాటిని ప్రకాశింపచేయటానికి దీపం కావలసి వస్తుంది. శరీరావయాల్ని, ఇంద్రియాల్ని, మనస్సుని ప్రకాశింప చేయటానికి బయటినుంచి ఇంకొక దీపం అక్కరలేదు. దేహం లోపల ఉన్న ఆత్మను ప్రకాశింప చేస్తే చాలు దేహం స్వయం ప్రకాశంగా వెలుగొందుతుంది. మానవ దేహంలో ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూ చైతన్యవంతంగానే ఉంది. కాని అట్లా చైతన్యవంతంగా ఉంది అని మానవుడు తెలుసుకోవాలి అంటే గాఢ నిద్రాస్థితికి మెలకువగా ఉండగా ఇంద్రియాలన్నిటినీ తీసుకువెళ్ళాలి. ఏ జ్ఞానేంద్రియాల ద్వారా అయితే, ఏ శబ్ద స్పర్శ రూప రస గంధాలనే తత్త్వాల ద్వారా అయితే బాహిరమైన లోక విషయాలన్నిటిని తెలుసుకొంటూ ఉన్నాడో అట్లాగే వాటిని దేహంలోపటికి పంపగలిగితే అవి బహిర్గతంగా ఎట్లా సంచరించటానికి అలవాటు అయి ఉన్నాయో అట్లాగే దేహం లోపల ఉన్నవాటితో కూడా అట్లాగే సంచరించటానికి అలవాటు పడతాయి. ఆ ఇంద్రియాలు అన్నీ పొందాలనుకొన్న లక్ష్యం ఆత్మ గనుక ఆత్మజ్యోతిగా, ఆత్మ నాదంగా, ఆత్మశబ్దంగా, ఆత్మానందంగా ఆత్మను పొందటానికి సాధన చేస్తూ మనస్సుకు ఆ లక్ష్యాన్ని అందించటం వల్ల లోని శబ్దాన్ని వింటుంది, లోని స్పర్శను అనుభవిస్తుంది, లోని రూపాన్ని దర్శిస్తుంది, లోని రసాన్ని ఆస్వాదిస్తుంది, లోని గంధాన్ని ఆఘ్రాణిస్తుంది. ఆ విధంగా అన్నీ ఏకమై చేకూర్చే ఆత్మానందంలో లీనమై మనస్సు శుద్ధచైతన్య రూపంలో నిలిచిపోతుంది. బాలుడు అవసరానికి ఏడుస్తాడు. వాని కోరిక తీర్చగానే మైమరచి ఆటలో లీనమై ఆనందిస్తూ ఉంటాడు. సాధకుడు ఆ విధంగా బాలుని వలె గడపాలని ఆలోచించాలి. సాధకుడు రేపటికి కూడబెట్టాలనే ఆలోచనలతోగాని, అధికమైన కోరికలతోగాని జీవించాలని అనుకోకుండా గడపగలగాలి. దైవభక్తిని బాహిరమైన పూజల వంటి వాటితో ఆపకుండా ప్రేమకోసం ప్రేమించినట్లు భగవద్భక్తి కోసమే భక్తి అని శుద్ధ భక్తితో భగవదారాధనతో, ఆత్మారాధనతో నిలవాలి. కర్మచేస్తూ ఉన్నప్పటికి కర్మ దేహానిదే, నాది కాదు అనుకొంటూ ఆత్మదృష్టితో సాధకుడు ఆత్మయందే నిలిచి ఉండాలి. ఆ విధంగా లోకంలో ఉన్న వివిధ మార్గాలన్నిటినీ కూడా జ్ఞాన మార్గంలోకి సంగమింప చేసుకొని సాధకుడు తరించాలి. అప్పుడే ఆత్మసాధకులు ఏ గ్రంథాలు చదవనక్కరలేదు అనేది అర్థం చేసుకోవటానికి వీలుకుదురుతుంది. సాధకుడు ఆ విధంగా జీవించిననాడు సాధనలో అనుభూతిని పొందుతూ మళ్ళీ సాధననుంచి బయటకు రాగానే జీవితమనే నాటక రంగంలో వేషదారునిలా నటిస్తున్నట్లు గాక జీవనవిధానంలో కూడా ఆత్మతో సంయోజనం చెంది జీవించటం అలవడుతుంది. సాధకుడు ఆత్మను అక్కున చేర్చుకొని గడపాలి అనేది ఒక భావనగానో లేక ఒక ఆరాధనగానో కాక తన జీవన విధానంగా మార్చుకోవాలి.
ª«sWƒ«sª«so¬s BLiúµj…¸R…WÌÁV, ª«sVƒ«sxqsV=, úFyßØÌÁV xqs*»R½zqsµôðR…LigS ÇÁ²R…ª«sxqsVòª«soÛÍÁ[ @LiVV DƒyõLiVV. @„s xqs¿Á[»R½ƒyÌÁV NSª«so. ª«sWƒ«sª«so¬sÍÜ[ Dƒ«sõ A»R½ø INRPäÛÉÁ[ \¿Á»R½ƒ«sùª«sLi»R½\®ªsV DLiµj…. A \¿Á»R½ƒ«sù®ªs[V @¬sõÉÓÁ¬ds ƒ«s²R…Vxmso»R½W DLiµj…. A Çì؃«sLi xqsLjigS @LóRiLi @ª«s*ÉجsZNP[ BLiúµj…¸R…WÌÁ¬dsõ A»R½ø ª«sÌýÁ úxmsNSaRPª«sWƒ«sª«sVª«so»R½W DƒyõLiVV @¬s ¿ÁFyöLRiV. @LiÛÉÁ[ ¿Áª«soÌÁV ªyÈÁLi»R½ÈÁ @„s „sƒ«sÈÁLi ÛÍÁ[µR…V, NRPÎÏÁ§þ ªyÈÁLi»R½ÈÁ @„s ¿RÁW²R…ÈÁLi ÛÍÁ[µR…V, ƒ¯[LRiV µyƒ«sLi»R½ÈÁ @µj… ª«sWÉýزR…ÈÁLi ÛÍÁ[µR…V, ª«sVƒ«sxqsV= µyƒ«sLi»R½ÈÁ @µj… AÍÜ[ÀÁLi¿RÁÈÁLi ÛÍÁ[µR…V, xmsLi¿RÁúFyßØÌÁV ªyÈÁLi»R½ÈÁ @„s xms¬s¿Á[¸R…VÈÁLi ÛÍÁ[µR…V. ª«sWƒ«sª«so¬sÍÜ[ Dƒ«sõ xqsLRi* BLiúµj…¸R…WÌÁ ®ªsƒ«sVNRP A»R½ø aRPNTPò DLi²T…, @¬sõÉÓÁ¬ds @¬sõ „sµ³yÌÁ úxmsNSaRPª«sWƒ«sLi ¿Á[xqsWò @¬sõÉÓÁ¬s ƒ«s²T…zmsxqsWò DLiµj…. NSƒ«s µy¬sõ @LóRiLi ¿Á[xqsVN]¬s, µy¬sõ ALSµ³j…LiÀÁ µy¬s }qsª«sÍÜ[ »R½LjiLi¿RÁÈÁLi @ÌÁª«sLRiVèN][ªyÖÁ. µy¬sNTP ryµ³R…NRPV²R…V G„sV ¿Á¸R…WùÌÁLiÛÉÁ[ aRPLkiLRiLi @®ƒs[ úxms„sVøµR…ÍÜ[ \¿Á»R½ƒ«sùLi @®ƒs[ ƒ«sW®ƒsƒ«sV F¡zqs, µ³yùƒ«sLi @®ƒs[ ª«s¼½ò¬s ®ªs[zqs A»R½øÇì؃«sLi @®ƒs[ ÇÜ[ù¼½¬s ®ªsÖÁgjiLi¿yÖÁ. @xmsöV²R…V ryµ³R…NRPV¬sÍÜ[ ¬sLRiLi»R½LRiLi aSLi¼½ r¢ÆØùÌÁ»][ NRPW²T…ƒ«s Aƒ«sLiµR… ÇÜ[ù¼½ ®ªsÌÁVg]LiµR…V»R½VLiµj….
సామాన్య మానవులు కూడా తమను తాము అర్థం చేసుకొని ఆలోచించు కోవటానికి వీలుగా గురుమహారాజ్‌జీ చెప్పిన ఒక్క ఉదాహరణను ఉదాహరిస్తాను. మట్టిలో నీళ్ళు పోస్తే అది బురదగా మారిపోతుంది. ఆ పోసే నీళ్ళనే మట్టిలో తగుపాళ్ళలో పోసి పిసికినట్లయితే, బంకగా అయ్యేటట్లు దాన్ని తొక్కి తయారు చేసినట్లయితే అది కుండలు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అట్లాచేసిన పచ్చి కుండలో నీళ్ళపోస్తే ఆ కుండ విచ్చిపోయి మళ్ళీ బురద మట్టి అయిపోతుంది. అట్లా కాకుండా ఆ పచ్చికుండను కాల్చి సిద్ధం చేస్తే నీళ్ళను నిలవ ఉంచుకోవటానికి పనికి వస్తుంది. ఆ మార్పులవలన అది ఎండాకాలంలో చలివేంద్రంలో దానిలో పోసిన నీటిని చల్లబర్చి ఎంతో మంది దాహంతో నున్న బాటసారుల దప్పిని తీర్చి హాయిని ఆనందాన్ని ఇస్తుంది. అట్లాగే ఆత్మజ్ఞానానుభూతి పొందిన మానవుడు మార్పుచెంది సర్వప్రాణులకు ఆనందాన్ని కల్గిస్తాడు. కుండ నీళ్ళను చల్లబరుచుకోవటానికి పనికివస్తుంది. నీళ్ళను కాచుకోవటానికి పనికివస్తుంది. కాన సామాన్య మానవులు కూడా తమ దేహాన్ని, ఇంద్రియాల్ని ఆత్మజ్ఞానానికి అనుకూలంగా తయారుచేసుకోవాలని ఆలోచించినట్లయితే ఉన్నతులుగా రూపు దిద్దుకోవటానికి వీలు కుదురుతుంది అని తెలుసుకోవాలి.
29 స్వబోధే నాన్యబోధేచ్ఛా
బోధరూపత యాత్మనః
నదీపస్యాన్య దీపే చ్ఛా
యథా స్వాత్మా ప్రకాశ##తే ||ఙ 29
¸R…V´y = ఏ విధంగా అయితే, దీపస్య = దీపానికి, స్వాత్మా ప్రకాశ##తే = తన కాంతిని తాను తెలుసుకోవటానికి, అన్యదీపేచ్ఛాన = ఇంకొక దీపం అవసరం ఎట్లాలేదో (అట్లాగే), బోధ రూపతయా = జ్ఞాన స్వరూపం అయి ఉండటం వల్ల, ఆత్మనః = ఆత్మకు, స్వబోధే = తనను తాను తెలుసుకోవటానికి, అన్యబోధేచ్ఛాన = ఇంకొక జ్ఞానం అవసరం లేదు.
తా|| ఏ విధంగా అయితే దీపానికి తన కాంతిని తాను తెలుసుకోవటానికి ఇంకొక దీపం ఎట్లా అవసరం లేదో అట్లాగే జ్ఞాన స్వరూపమైన ఆత్మకు తనను తాను తెలుసుకోవటానికి ఇంకొక జ్ఞానం అవసరం లేదు.
వివరణ :- జడ పదార్థాల్ని చీకటిలో చూట్టానికి దీపం అవసరం అవుతూ ఉంటుంది. కాని ఆ దీపాన్ని చూట్టానికి ఇంకొక దీపం అవసరం లేదు కదా! అట్లాగే జ్ఞాన స్వరూపమై ఆత్మ జడపదార్థాలైన శరీరం, మనస్సు, ఇంద్రియాలు వంటి వాటిని ప్రకాశింపచేస్తూ ఉండగా ఆ జ్ఞాన ప్రకాశాన్ని ప్రదర్శింప చేయటానికి ఇంకొక జ్ఞానం అక్కరలేదు కదా! ఆత్మే జ్ఞాన స్వరూపం. అంటే లోకంలో ఉన్న అన్ని రకాల జ్ఞానాన్ని తెలుసుకోవటానికి కావలసిన నిజమైన జ్ఞానాన్ని ఇస్తూ ఉంది ఆత్మే అయి ఉంది. ఆత్మ వల్లే అన్నీ తెలుస్తూ ఉన్నాయి. లోకంలో మానవుడు తెలుసుకొనే జ్ఞానాలు అన్నీ నిజమైన జ్ఞానాలు కావు, ఆత్మజ్ఞానం తెలుసుకొని, ఆత్మమార్గంలో ఆత్మతో జీవించటమే నిజమైన జ్ఞానం. అట్లా తెలుసుకోవటానికి ఆత్మే గురువై జ్ఞాన ద్వారాన్ని తెరుస్తుంది. ఆత్మ శక్తి వలే బాహిరంగా గురువు కూడా లభిస్తాడు. ఆ విధంగా ఆత్మతో ద్వంద్వాతీతంగా జీవించటమే నిజమైన జ్ఞానం. ఆత్మను గురించి తెలుసుకోకపోవటమే నిజమైన అజ్ఞానం.
ఆత్మ చిత్ ప్రకాశం అయి ఉంది. ఆత్మ అంటే చైతన్య వంతమైన, జీవ శక్తి అయిన జ్యోతి అయి ఉంది. అది స్వయంప్రకాశం కాన దాన్ని ప్రకాశింప చేయటానికి మరొక జ్యోతి అవసరంలేదు. సూర్యచంద్రులు, నక్షత్రాలు, అగ్నివంటివి కూడా ఆత్మ ప్రకాశం ముందు వెలవెలపోతాయి. సూర్యుడు ఏవిధంగా తాను ప్రకాశిస్తూ ప్రపంచంలోని సర్వజీవరాసుల్ని ప్రకాశింపచేస్తూ ఉన్నాడో ఆ విధంగానే ఆత్మజ్యోతి మానవుని శరీరాన్ని, మనస్సును, బుద్ధిని, ఇంద్రియాల్ని ప్రకాశింపచేస్తూ పరంజ్యోతిగా వెలుగొందుతూ ఉంది. మానవునిశరీరంలో ప్రకాశిస్తూఉన్న ''నేను''అనే ఆత్మను తెలుసుకోవటమే సర్వవేదాంత సిద్ధాంత సారమై ఉంది. సర్వ ఉపనిషత్తుల సారం కూడా నేనే ఆత్మను అని తెలుసుకోవటమే అయి ఉంది. గురుమహారాజ్‌జీ గారు ఏమి చెబుతారంటె నేను ఏదైనా దీని మీద ఒక గ్రంథం రాయాలంటే ఆ గ్రంథంలోఒకే ఒక్క వాక్యం ఉంటుంది. అదేమిటి అంటే నేను ఆత్మనై ఉన్నాను అని తెలుసుకోవటం, పరమాత్మలోనే ఉన్నాడు అని తెలుసుకోవటం అని అంటూ ఉంటారు. పరమాత్మను బయట ఎక్కడా వెతుకవలసిన పనిలేదు. పరమాత్మ పేరు మీదుగా కొనసాగిస్తూఉన్న బాహిరమైన మానసిక మార్గాలన్నీ తొలగించి అంతరంగంలో ఉన్న ఆత్మమార్గంలో మనస్సును లయింప చేయటమే కావాలి. అది ఒక్కటే సాధనలో సాధించవలసి ఉంది. ఆత్మే తన నిజ స్వరూపం అని భావన చేస్తూ ఆచరణలో దానితో జీవించటమే చేయవలసి ఉంది. ఆ యధార్థాన్ని అర్థం చేసుకోవటానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని మార్గాలు ఉత్పన్నం అయ్యాయి. దానికి గురువు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ వివేచనతో ఆత్మతో జీవించాలి. ఆత్మతో జీవించటానికి, ఆత్మానుభూతిని పొందటానికి, ఆత్మే సత్యమైంది నిత్యమైంది అని తెలుసుకోవటానికి ఆత్మజ్ఞాన బోధకులైన విజ్ఞుల మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని విడువకుండా నిరంతరం సాధన చేసిననాడు నిత్య సత్యమైన సచ్చిదానందాన్ని సాధకుడు అనుభవించ గలుగుతాడు. జాగ్రదవస్థలోను, స్వప్నావస్థలోను స్థూల సూక్ష్మశరీరాలతో జీవిస్తూ ఉన్న ఆలోచనలతోను, భావాలతోను గడుపుతూ ఉన్నంత కాతం ఆత్మానుభూతి చేకూరదు. అవి తొలగిన మరుక్షణం అంటే మనస్సు ఆత్మలో లయించిన మరుక్షణం స్వయంప్రకాశంగా, అద్వితీయంగా, అనంతంగా ఆత్మ వెలుగొందు తుంది.
జాగ్రదవస్థలో వస్తువులను అన్నిటినీ సూర్యుడు ప్రకాశింపచేస్తూ ఉన్నాడు కదా! మరి స్వప్నావస్థయందు వస్తువుల్ని ప్రకాశింప చేస్తూ ఉంది ఏది అయి ఉంది? అది ఆత్మ ప్రకాశ##మే అయి ఉంది అని తెలుస్తూ ఉంది కదా! సుషుప్తిలో దేహం చైతన్యవంతంగా దేని వల్ల ప్రకాశమానమై ఉంది? ఆత్మవల్లే అని తెలుస్తూ ఉంది కదా! వీటి వల్ల మొత్తానికి తెలిసింది ఏమిటి అంటే ఆత్మ స్వయం ప్రకాశం అని అర్థం చేసుకోవటానికి వీలు కుదురుతుంది కదా! సుషుప్తిలో ఆత్మ చైతన్య వంతమై ఉంది అని తెలుసుకొంటూ ఉంది ఏది? ఆత్మే అయి ఉంది కదా! అందుకే ఆత్మజ్ఞానంతో ధ్యానంలో ఆత్మ దగ్గరకు చేరుకోవటానికి ప్రయత్నం చేయాలి. కావున వీటి అన్నిటి వల్ల అర్థం చేసుకొంది ఏమిటి అంటే మెలకువ, కల నిద్రలకు సాక్షిమాత్రంగా చైతన్యంగా వెలుగొందుతూ ఉండేదే ఆత్మ అని, ఆలోచనల సమాహారంతో ఉదయిస్తూ సమసిపోతూ ఉండేదే మనస్సు అని తెలుస్తూ ఉంది. అందువల్ల ఆలోచనల సమాహారంతో నేను అనే అహంభావంతో నిలుస్తూ ఉన్న అహంకారాన్ని ధ్యానంలో తొలగించుకొంటే మిగిలే ప్రకాశమానమైన చైతన్యమే ఆత్మ అయి ప్రకాశిస్తుంది. గురువు అయిన వాడు తన జ్ఞానం అనే ధ్యానంతో మానవుని మనస్సును ఉడుకబెట్టి భగవంతుడనే ఆత్మకు దాన్ని ప్రసాదంగా సమర్పిస్తాడు. అప్పుడు ప్రకాశంగా వెలుగొందే ఆత్మప్రకాశ##మే జ్ఞానం. అట్లాంటి జ్ఞాన స్వరూపమైన ఆత్మను తెలుసుకోవటానికి ఇంకొక జ్ఞానం అవసరం లేదు. అట్లాంటి ఆత్మతో జీవిస్తూ ఉన్న మానవునికి లభించేదే సంపూర్ణ జ్ఞానం, సుఖం, శాంతి, ఆనందం అయి ఉన్నాయి.
మానవుడు స్వప్నానుభవం నుండి జాగ్రదవస్థకు వచ్చినప్పుడు అది స్వప్నం అని ఎట్లా తెలుసుకొంటూ ఉన్నాడో అట్లాగే సాధకుడు సాధనలో ద్వంద్వాతీత స్థితి నుంచి జాగ్రదవస్థకు అంటే లోకంలోకి జీవించటానికి వచ్చినప్పుడు తాను అనుభవించిన ఆ ప్రకాశ##మే, ఆ జ్ఞానమే ఆత్మ అని తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. దానివల్ల ఆత్మను గురించి వివరించిన మహావాక్యాలను గుర్తుచేసుకోవటం ఎంతైనా అవసరం అయి ఉంది. (1) సో2 హం - అంటే వాడే నేను, ఈ దేహం చేత నేను అని అనుకొనే నేను నేను కాదు. ఈ శరీరాన్ని విడిచి లోనున్న ఆ సర్వశక్తి మంతుడైన ఆత్మనే నేను అని భావన చేయాలి. (2) తత్త్వమసి- అంటే అదే నువ్వు అయి ఉన్నావు అంటే ఆ బ్రహ్మమే నువ్వు అయి ఉన్నావు అని. (3) అహమాత్మా-అంటే ఆ పరాత్పరుడు అయిన నేనే ఆత్మను అయి ఉన్నాను అని. (4) త్వమేవా2 హం - అంటే నువ్వే నేను అంటే ఆ పరాత్పరుడను నేనే అని. (5) అయమాత్మా బ్రహ్మా - అనగా ఈ ఆత్మ బ్రహ్మమే అయి ఉంది అని. (6) సర్వం ఖల్విదం బ్రహ్మ-అంటే సర్వం బ్రహ్మమే అయి ఉంది అని. (7) జీవో బ్రహ్మైవ నా పరం- అంటే ఈ జీవుడు బ్రహ్మమే కాని వేరు అయిఏది ఏదీ కాదు అని ఈ విధంగా ఆత్మ ఒక్కటే స్వయం ప్రకాశ##మై, అనంతమై, నిత్యమై విరాజిల్లుతూ ఉంది అని అర్థం చేసుకొంటూ నిరంతర సాధనతో మానవుడు జీవించాలి. జనక మహారాజు ఆత్మ అనే చక్రవర్తిగానే రాజు అనే ఋషి అయి జీవించాడు.
30 నిషిధ్య నిఖిలోపాధీన్
నేతి నేతీతి వాక్యతః
విద్యా దైక్యం మహావాక్యైః
జీవాత్మ పరమాత్మనోః || 30
ƒ«s B¼½ = ఇది ఆత్మ కాదు, ఇతి = అని, వాక్యతః = వేదాలు ఉపనిషత్తులు చెప్పిన మహావాక్యాలకు అనుకూలంగా విచారణ సాగించి, నిఖిల + ఉపాధీన్ = సమస్తమైన జీవనోపాధికి ఉపయోగపడుతున్న దారిబత్తాలను అన్నింటిని, నిషిధ్య=త్రోసివేసి, మహావాక్యైః = వేదాలు ఉపనిషత్తుల యందలి మహావాక్యాల చేత బోధింపబడిన, జీవాత్మ = జీవుడైన ఆత్మ, పరమాత్మనోః = పరబ్రహ్మం యొక్క, ఐక్యం = ఏకత్వాన్ని, విద్యాత్ = గ్రహించాలి.
తా|| ఇది ఆత్మకాదు, ఇది ఆత్మకాదు, అని అపరోక్షానుభూతికి చెప్పిన మహావాక్యాలను విచారణచేస్తూసమస్తమైన ఉపాధుల్ని త్రోసివేసి మహావాక్యాలు బోధించిన జీవబ్రహ్మైక్యాన్ని గ్రహించాలి.
వివరణ :- జీవుడు ఆత్మతో ఎట్లా జీవించాలో ఇక్కడ ఆచార్యులు వారు తెలియచేస్తూ ఉన్నారు. మానవుడు ఎట్లా జీవించాలో నేర్పే జీవితకళను ఇక్కడే తెలియజేశారు. జీవితంలో మానవుడు పరిపూర్ణత పొందాలంటే నేను జీవుణ్ణికాను అన్నంత మాత్రం చేత ఆత్మ అయిపోడు. ఆత్మగా జీవించలేడు. జీవన విధానంలో ఏవేవి అనాత్మ పదార్థాలో, ఏవేవి అనిత్యాలో వాటిని మరల మరల గుర్తుచేసుకొంటూ, వాటిని తొలగించుకొంటూ, వాటిని విడిచిపెడుతూ నడవాలి. ఈ శరీరం ఆత్మకాదు, ఈ కోరికలు అన్నీ బుద్ధి కల్పిస్తూ ఉన్న కల్పనలే కాని ఇవి ఆత్మకు సంబంధించినవి కావు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సాక్షి మాత్రమైన ఆత్మనే నేను అయి ఉన్నాను, ఈ పంచకోశాలు ''నేను''గా జీవించటానికి అవరోధంగా ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో, పట్టుదలతో, ఓర్పుతో నిరంతరం సాధన చేయాలి. ఇది నిరంతరమైన మానసిక సాధన అయి ఉంది. దీని యందు చిదాత్మ స్వరూపమందు ఆరోపించబడిన అనాత్మ పదార్థాలన్నిటిని తొలగించుకొంటూ వెళ్ళాలి. పంచకోశాలు అనే అయిదు ఆవరణలు కోటగోడల్లా ఆత్మను చుట్టుకొని ఉన్నాయి. ఒక్కొక్క కోటగోడను తొలగిస్తూవెళ్తే ఆత్మ అనే భగవంతుని అంతః పురంలోకి ప్రవేశించగలుగుతాము. కోశాలంటే సంచుల్లా ఒకదానిమీద ఒకటిగా ఒక్కొక్కటే ఆత్మను మూసి ఉన్నాయి అని అనుకోకండి. జీవుడు జీవించటానికి ప్రవర్తించే ప్రవర్తనలో ప్రదర్శించే గుణాలు, తత్త్వాలు రకరకాలుగా ఆయా కోశాలనే అవయవాలను నడుపుతూ ఉన్నాయి. గురుజ్ఞానం అనే ఆత్మ ధ్యానమార్గంలో ప్రతిరోజు క్రమక్రమంగా ఒక్కొక్క ఆవరణను ఆత్మలో లీనం అయ్యేటట్లు చేసుకొంటూ వెళ్తూ ఉంటే క్రమేపి, క్రమేపి ఆ కోశాలు తొలగిపోయి ఆత్మపురంలోకి ప్రవేశించటానికి ద్వారం తెరచుకొన్నట్లు అవుతుంది. శరీరం నవద్వార పురం కదా! ధ్యానంలో ఒక్కొక్క ద్వారం మూసుకుపోతూ పనిచేయకుండా అచేతనంగా ఆత్మశక్తిలో లీనం అవుతూ వస్తుంది. నవ ద్వారాలంటే కళ్ళురెండు, చెవులు రెండు, నోరు ఒకటి, ముక్కు రెండు, మూత్ర పురీషాదులు రెండు కలిసి మొత్తం తొమ్మిది రంధ్రాలు, ఈ నవద్వారాలు ధ్యానంలో సాధకునికి తెలియకుండానే పనిచేయని స్థితి చేకూరి దశమద్వారం అయిన మూడవ కన్ను ఆజ్ఞా చక్రం అయిన భ్రూమధ్యం వద్ద తెరుచుకొని ఆత్మజ్యోతి దర్శనం లభిస్తుంది. అందుకే గురువులు ఆజ్ఞాచక్రం వద్ద కేంద్రీకరింప చేయిస్తారు. ఆజ్ఞా చక్రం సాధకునికి స్వాధీనం అయిననాడు క్రింది అయిదు చక్రాలు వాటంతట అవే స్వాధీనం అవుతాయి. దానికి కావలసిన అపరోక్షానుభూతికి ఇది ఆత్మకాదు, ఇది ఆత్మకాదు అని సాధన చేయాలి. ఆత్మ జ్ఞానం వల్ల, గురు కటాక్షం వల్ల, గుర్వాశీర్వాదం వల్ల, గురుసేవ వల్ల, గురుబోధ వల్ల, గురు దర్శనం వల్ల, అనుభూతి చేకూరుతుంది.
మానవుని అన్ని అరిష్టాలకు దేహాత్మ భ్రాంతి అనే మాయే కారణం అయి ఉంది. మాయకు మూలకారణం అహంకార మమకారాలు. నేతినేతి యందు కావించే ఆత్మా అనాత్మల వస్తువిచారణతో మిథ్యాజ్ఞానమైన దేహాత్మ భ్రాంతి తొలగిపోతుంది. దానికి గురుమహారాజ్‌జీ మాయ అనే ఉదాహరణను చెపుతూ ఉంటారు. నన్ను మాయ సమీపిస్తూ ఉండగానే దూరంనుంచే నేను ఇది మాయ, ఇది మాయ, ఇది మాయ అని గ్రహించగలుగుతాను. మాయను దూరం నుంచే తొలగిస్తూ ఉంటాను. మీరు ఆ మాయను గ్రహించలేకపోతూ ఉంటారు. కాన సాధకుడు ప్రకృతిలోను, లోకకార్యాల్లోను ఎదురయ్యే వాటిని దూరం నుంచే గ్రహిస్తూ ఇది మాయ, ఇది మాయ, ఇది మాయ అని అర్థం చేసుకొంటూ, వాటిని తొలగించుకొంటూ వెళ్ళాలి. మహమ్మదు రెండు నిమిషాల్లో మరణం సమీపిస్తూ ఉంది అనగా మాయ మహమ్మదును సమీపించి నువ్వు మాయను జయించావు అని చెప్పిందట. మహమ్మదు ఇంకా రెండు నిమిషాలు ఉంది. ఆ రెండు నిమిషాలు కూడా గడిస్తే అప్పుడు మాయను జయించాను అని అనుకొంటాను కాన అట్లా అనుకోవటానికి ఇంకా రెండు నిమిషాలు ఆగాలి అన్నాడట. కాన మాయను జయించటం అనేది ఆచరణలో ఎంత కష్టం అయి ఉందో అర్థం చేసుకోవటానికి ఈ ఉదాహరణ బాగా ఉపకరిస్తుంది. ప్రకృతి విషయాలు, నిత్యకృత్యాల్లో అవసరమయ్యే కార్యాలు, అవసరాలు మానవుణ్ణి వంచితుణ్ణి చేయటానికి పొంచి ఉంటాయి. కాన మాయ ఛాయ వలె మానవుణ్ణి అంటిపెట్టుకొనే ఉంటుంది. కాంతి అంచునే చీకటి ఉన్నట్లు మానవుని జ్ఞానపుటంచునే మాయ ఆవరించి ఉంటుంది. కాన నిరంతరం ఇది ఆత్మకాదు, ఇది ఆత్మ కాదు అని అనాత్మ పదార్థాలను తొలగించుకొంటూ సాధకుడు నిలవగలగాలి. అవరోధాల్ని ఎవరు పోగొట్టుకొంటే వాళ్ళకి వాళ్ళ యొక్క యథార్థ స్వరూపం అయిన భగవత్స్వరూపం అనుభవానికి వస్తుంది. ఎవరి విశ్వాసాలు వాళ్ళు గౌరవించుకొంటూనే, ఎవరి అలవాట్లకు వాళ్ళు లోబడే ఆత్మమార్గంలో ఆత్మ జ్ఞానంతో సాధన కొనసాగిస్తే లక్ష్యాన్ని తేలిగ్గా చేరగలుగుతారు. గురు మహరాజ్‌జీ కృప, దీవెనలు అంత గొప్పవి. ఆత్మవిశ్వాసం అన్నిటికన్నా గొప్పది.
శరీరాన్ని ఇంద్రియాల్ని, మనస్సుని దాటి అంతర్ముఖం అయిననాడే మానవుడు సత్యంతో జీవించటం జరుగుతుంది. దానికి వేదాల్లోను, ఉపనిషత్తుల్లోను చెప్పిన మహావాక్యాలైన (1) ప్రజ్ఞానం బ్రహ్మ (2) అహం బ్రహ్మస్మి (3) తత్త్వమసి, (4) అయమాత్మా బ్రహ్మ (5) త్వమేవా2 హం (6) ఏకమేవాద్వితీయం బ్రహ్మ (7) అహమాత్మా (8) ఆనందో బ్రహ్మ (9) జీవో బ్రహ్మైవ నా పరః వంటి వాటిని తెలుసుకొని, వాటిని విచారణ చేసి అద్వైతులుగా జీవించాలి. జీవబ్రహ్మం అభేద స్వరూపాన్ని తెలుసుకొని, ఉపాధులను విడిచిపెట్టి జీవించాలి.
31 అవిద్యకం శరీరాది
దృశ్యం బుద్బుదవత్ క్షరమ్
ఏ తద్విలక్షణం విద్యాత్
అహం బ్రహ్మేతి నిర్మలమ్ || 31
@„sµR…ùNRPLi = అవిద్య వలన కల్పింపబడిన, శరీరాది = దేహేంద్రియాదులు, దృశ్యం = దృశ్యాలయినవి, బుద్బుదవత్ = నీటి బుడగల వలె, క్షరమ్ = క్షణ భంగురాల వంటివై నశించిపోతాయి, నిర్మలం = పరిశుద్ధమైన, బ్రహ్మ = బ్రహ్మం, ఏతత్ = వీటికి, విలక్షణం = విలక్షణమైన వాడు, ఇతి = ఈ విధంగా, అహం = నేను (ఆ పరబ్రహ్మాన్ని అని), విద్యాత్ = తెలుసుకో.
తా|| అవిద్య వలన కల్పింపబడిన దేహేంద్రియాదులు దృశ్యాలు అయి ఉన్నాయి. త్రివిధ శరీరాలు, పంచకోశాలు, ఆత్మకు దృశ్యాలై ఉన్నాయి. ఇవి అన్నీ కూడా నీటి బుడగవలె క్షణభంగురాలు కాన నశించి పోతాయి. పరిశుద్ధమైన బ్రహ్మంవీటికి విలక్షణమైన వాడు. అట్టి పరిశుద్ధమైన, బ్రహ్మాన్ని నేనే అయి ఉన్నాను అని వివేచనతో తెలుసుకోవాలి.
వివరణ :- ఆత్మజ్ఞానం లేకపోవటం వల్లే అవిద్య ఆవరిస్తూ ఉంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడలేక పోవటమే అవిద్య అవుతుంది. సర్వ రజ్జుభ్రాంతిలాగా మానవుడు పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుడై ఉండి కూడా పరిమితమైన దేహేంద్రియ భ్రాంతికి లోనవుతూ ఉన్నాడు. కాన నువ్వు శరీరానివి కాదు, పరబ్రహ్మ స్వరూపానివి అని వివేచనతో తెలుసుకొని జీవించమని ఆచార్యులవారు బోధిస్తూ ఉన్నారు. నిత్యానిత్యవస్తు వివేకంతో, విచారణచేసి, వివేచనతో ''అహం బ్రహ్మాస్మి'' అని జీవించాలి. ఇది ఏ విధంగాలభిస్తుంది అని ప్రశ్నించుకొంటే గురువులను ఆశ్రయించి, ఆత్మజ్ఞానాన్ని స్వీకరించి, ఆత్మమార్గంలో, నిత్యం సాధనలో జీవించిన నాడు అది లభిస్తుంది అని అర్థం అవుతుంది.
జీవుడు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలనే త్రివిధ శరీరాల ద్వారా ఆత్మతో తాదాత్మ్యాన్ని పొంది, పంచ కోశాల ద్వారా ప్రకాశమానం అవుతూ ఉన్న అనుభవాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాన ఆత్మ అనేది స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు, పంచకోశాలకు అతీతంగా, సాక్షి మాత్రంగా ఉంది. కాన అట్లా ఉన్న ఆత్మే పరబ్రహ్మం అయి ఉంది అని తెలుసుకొని జీవించాలి అని ఆచార్యులవారు బోధిస్తూ ఉన్నారు. కనిపించే దృశ్యం కన్నా చూసే ద్రష్ట విలక్షణంగా ఉంటాడు కదా! ఆలోచించే మనస్సుకన్నా ఆలోచనల్ని తెలుసుకొనేవాడు విలక్షణంగా ఉంటాడు. కాన నాలోని దైవాంశ##మే వీటన్నిటిని ప్రకాశింపజేస్తూ ఉంది అని తెలుసుకొని సాధకుడు పరబ్రహ్మంగా జీవించాలి. జాగ్రత్, స్వప్న, సుషుప్తి వంటి అవస్థలలో ఏ అవస్థలో ఉన్నవానికి ఆ అవస్థకు సంబంధించిన జ్ఞానం ఉంటూ ఉంది. కానీ వీటి అన్నింటి యందు చైతన్యవంతమైన ఆత్మ అన్ని అవస్థలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉంది. కాన తాను త్రివిధ అవస్థలకు విలక్షణంగాను, అన్నిటిని దర్శించువానిగను ఉన్న ఆ పరబ్రహ్మాన్ని నేనే అని తెలుసుకొని జీవించాలి. ఏది దృశ్యమో అది నశిస్తుంది. కాన శరీరాదులు నీటి బుడగల వలె నశిస్తాయి అని వాటికి విరోధంగా, మారకుండా, చైతన్యంగా ఉండే ఆత్మే శాశ్వతంగా ఉంటుంది అని, అటువంటి ఆత్మనే నేను కాన అహంకారమనే గృహస్థు నశించినా, లేక చిరకాలం ఉన్నా నాకేమి సంబంధం లేదని, నేను బ్రహ్మాన్ని అని భావించి సాధకుడు జీవించాలి అని ఆచార్యులవారు బోధించారు.
(32) దేహాన్యత్వాన్నమే జన్మ
జరాకార్శ్యా లయాదయః
శబ్దాదివిషయైః సంగః
నిరీంద్రియ తయా న చ || 32
®µ…[x¤¦¦¦ + అన్యత్వాత్ = శరీరం కంటే నేను భిన్నం అయినవాడను కాన, మే = నాకు, జన్మ = పుట్టుక, జరా = ముసలితనం, కార్శ్యా = శరీరం సడలుట వంటి పరిణామం చెందుట, లయాదయః = నశించుట అనగా మరణించుట, న = లేదు, చ=మరియు, నిరీంద్రియ తయా = జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు లేని వాడను కావున, శబ్ద+ఆదివిషయైః = శబ్ద స్పర్శ రూప రస గంధాల వంటి తత్త్వ విషయాలతో, సంగః = సంపర్కం, న=లేదు.
తా|| శరీరం కంటే నేను భిన్నం అయిన వాడిని అవటం వల్ల నేను పుట్టటం కాని, ముసలితనం రావటంకాని, శరీరం సడలటం వంటి పరిణామాలు రావటం కాని, మరణించటం కాని నాకు లేవు. అంతే కాకుండా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు లేనివాడను అవటం వల్ల శబ్ద స్పర్శ రూప రస గంధాల వంటి తత్త్వ విషయాలతో కూడా నాకు సంపర్కం లేదు.
వివరణ :- ఆత్మ అంటే నామరూప రహితమైన ''నేను'' చేత పిలువబడునది. భగవంతుడు అయినా కూడా గుండె మీద చెయిపెట్టి చూపిస్తూ నేను చూశాను, నేను చూస్తున్నాను అనే అంటాడు కాని తనను గురించి చెప్పుకోవటానికి వేరొక విధంగా చెప్పడు. కాన ఆ పరాత్పరుని నామం కూడా ''నేనే'' అని రమణ మహర్షి చెప్పి ఉన్నారు. కాన ఆత్మే ఆ పరాత్పరుడు అయి ఉన్నాడు. ఆత్మ రూపరహితుడు కాన నిరవయవుడు, అశరీరుడు కాన చావు పుట్టుకలు లేనివాడు, ఇంద్రియాతీతుడు కాన ఇంద్రియ వ్యాపారాల వంటి శబ్ద స్పర్శరూప రస గంధాల వంటి విషయ తత్త్వాలతో సంబంధంలేని వాడు. అయితే మరి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్న ఈ పరిణామాలు అన్నీ ఏమిటి? వాటి మాట ఏమిటి? అని ప్రశ్నించుకొన్నప్పుడు అవి అన్నీ దేహానికి సంబంధించినవేకాని అవేవీ ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మకు ఇంద్రియ విషయాలతో సంబంధంలేదు కాన విషయసుఖాలతో కూడా సంబంధంలేదు. ఈ విధంగా శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనస్సుని విచారణ చేసి, అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినవారికి విషయవాంఛ, విషయవ్యామోహం అనేవి కూడా ఉండవు. విషయ వ్యామోహం లేదు కాన సాధకునికి మాయ ఆవరించలేదు కాన సాధనలో ఇంద్రియ దోషాలనుంచి విడివడి సాధకుడు సాధన చెయ్యటానికి వీలుకుదురుతుంది.
ఈ దేహం నేను కాను కాన ఈ దేహబాధలు నావి కావు, దేహానికి సంబంధించిన వాళ్ళు కూడా నా వాళ్ళు కారు, ఈ దేహానికి చేకూరే వృద్ధి క్షయాలు కూడా నావి కావు, ఇంద్రియాలు నావి కావు కాన ఇంద్రియాలు చేసే పనులన్నీ కూడా నావి కావు. అవి అన్నీ జీవుని చేత కల్పించబడుతూ ఉన్న మాయాజాలమే కాని మరొకటి కాదు. వీటి అన్నిటికి శక్తిని ఇస్తూ ఉన్న సాక్షిమాత్రుడనే కాని నేను వేరు కాదు. నేను పరబ్రహ్మాన్నే కాని వేరు కాదు. అని సాధకుడు ఈ విధంగా వివేచనతో విచారణ చేస్తూ, తనకు వచ్చే ఆలోచనలను మూలంలోనే నిలిచిపోయేటట్లు చేస్తూ వివేచనామార్గంలో నడవాలి.
ఒక ఉదాహరణను సాధకులు పరిశీలించగోరుతున్నాను. మ్యాగ్నెట్లు దాన్ని సమీపించిన ఇనుముకు కూడా అయస్కాంత శక్తిని ఇస్తుంది. దాన్ని కూడా అయస్కాంతంగా మారుస్తుంది. ఇనుపముక్క అయస్కాంతం యొక్క నిరంతర రాపిడి వల్ల అయస్కాంత శక్తిని సంపాదిస్తుంది. ఇనుము అయస్కాంతాన్ని సమీపించినప్పుడు కదా ఆ ఇనుముకు అయస్కాంతపు గుణాలు లభించాయి. ఇనుము అయస్కాంతం పరిధిలోకి వెళ్ళినప్పుడు కదా అది తన సమీపానికి ఆకర్షించుకొంటుంది. కాన సాధకుడు తన ఇంద్రియాల్ని మనస్సులో ఆత్మజ్ఞానం ద్వారా లయింపచేసి మనస్సును ఆత్మ చెంతకు తీసుకొనివెళ్ళినప్పుడు కదా ఆమనస్సు కూడా ఆత్మగా పరిణామం చెందటానికి వీలుకుదురుతుంది. కాన సాధకుడు నిరంతర సాధనతో భ్రమరకీట న్యాయంగా పరిణామం చెందాలి. సాలీడు తాను కట్టుకొన్నగూటిని కూడా తనలోకి ఎట్లా తీసుకొంటుందో అట్లాగే ప్రపంచం అనే మాయలో అల్లుకుపోయిన మనస్సును లోనికి తీసుకొని ఆత్మ చెంతకు మనస్సును చేర్చటానికి నిరంతర సాధనే ప్రధానం అయి ఉంది కాని మరొకటి ఏదీ ఉపకరించదు. ఎవరికి వారు అభివృద్ధి చెందటానికి, ఆత్మగా ఉండటానికి పట్టుదల, ఓర్పు, నమ్మకం, విశ్వాసం, నిరంతర సాధన కావాలి.
గురుమహారాజ్‌జీ తన చేతిని అందించి శిష్యులను పైకి ఎత్తటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కాని తాను అందించే చేతి దాకా శిష్యులు వచ్చేటట్లు అభివృద్ధి చెందాలి కదా! నన్ను ఇంకా క్రిందికి లాగాలని ప్రయత్నం చేయకండి, నా చేతిని అందుకోవటానికి ఎదిగి రండి అని ప్రబోధిస్తూ ఉంటారు. ఆయన బోధవల్ల, ఆయన జ్ఞానంవల్ల సాధకులు ఆత్మగా జ్ఞానంలో నిలుస్తారు కాన ఆత్మగా దివారాత్రాలు నిలిచేటట్లు సాధన చేయవలసిన అవసరం ఉంది.
33 అమన స్త్వాన్న మే దుఃఖ
రాగద్వేష భయాదయః
అప్రాణో హ్యమనాః శుభ్ర
ఇత్యాది శ్రుతి శాసనాత్ || 33
@ª«sVƒ«s ryòQ*»`½ = మనస్సుకంటే భిన్నమైనవాడను కాన, మే = నాకు, దుఃఖ = దుఃఖం, రాగ = బంధం, ద్వేష = అసూయ, భయాదయః = భయం మొదలైనవికారాలు, న = లేవు, అప్రాణః = ప్రాణంకాదు, అమనాః = మనస్సుకాదు, శుభ్రః = పరిశుద్ధమైంది, ఇతి+ఆది = ఈవిధంగా చెప్పేటటువంటి మొదలైన మాటలు, హి=నిజంగా, శ్రుతిశాసనాత్ = వేదశాసనమై ఉంది.
తా|| మనస్సు కంటే భిన్నమైనవాడను కాన నాకు దుఃఖం, బంధం, అసూయ, భయం వంటి మొదలైనవికారాలు లేవు, ఆత్మ ప్రాణంకాదు, మనస్సుకాదు, పరిశుద్ధమైంది అని వేదశాసనమై ఉంది.
వివరణ :- మనస్సు కోతివలె సంచరిస్తూ ఉంది అని, చంచలమైంది అని, కుక్కలాగా అటు ఇటూ పరుగెత్తుతూ ఉంటుంది అని, గాలిని ఎట్లా పట్టుకోలేమో మనస్సును కూడా అట్లా పట్టుకోలేము అని ఈవిధంగా మనస్సునుగురించి రకరకాలుగా చెపుతూ ఉంటారు. ఈ మనస్సుయొక్క చంచలత్వం వలే మానవునికి జీవితం బంధహేతువు అయింది. మానవుడు దాన్ని జయించలేను అనే భావనకు లోనయి దానికి బానిస అవుతూ వచ్చాడు. సామాన్య మానవులు ఆవిధంగా దానికి లోనై, దానితో నిలకడలేని వాళ్ళుగా నిలిచిపోతూఉన్నారు. అటువంటివాళ్ళు గాలివాటుగా సంచరిస్తూ ఏ ఎండకు ఆగోడుగు పడుతూ నడుస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. దానికి విరుగుడుగా మానవులు జీవన అవసరాలకు కావలసిన తాత్కాలిక ఉపశమనమార్గాల్ని స్వీకరించి, చివరికి దుఃఖనివృత్తిని పొందలేక, శాంతిసౌఖ్యాలు చేకూరక చరమ స్థితిలో బాధపడుతూ దుఃఖ మగ్నులై గడుపుతూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారికి ఆత్మమార్గం ఉత్తమ మార్గంగా కనిపిస్తూ ఉంది. ఆత్మజ్ఞానం అటువంటివారికి కరదీపికగా నిలుస్తూ ఉంది. ఎందుకని అంటే ఆత్మ మనస్సుకాదు, ఆత్మ మనస్సుకు లోబడి లేదు, మనస్సే ఆత్మమీద ఆధారపడి ఉంది. ఆత్మశక్తితోనే మనస్సు నడుస్తూ ఉంది. కాన మనస్సుకు సంబంధించిన బాధ, బంధం, అసూయ, భయం వంటి రకరకాల వికారాలు ఆత్మకు లేవు. మనస్సు వలే జగత్తు అంతా మానవుని లోపల అల్లుకోవటం జరుగుతూ ఉంది. ఆత్మ అంటే జ్ఞానం. జ్ఞానాన్ని మనస్సు కల్పించే జగత్తనే మాయాజాలం అంతా ఏమీ చేయలేదు. అట్లాంటప్పుడు ఆత్మ మనస్సు ఎట్లా అవుతుంది? అయితే ఆత్మ మనస్సుకాదని ఎట్లా నిరూపిస్తాం అంటే గాఢనిద్రాస్థితే సరైన ఉదాహరణ అయి ఉంది. గాఢనిద్రలో మనస్సు, సర్వఇంద్రియాలతో కలసి ఆత్మలో లయిస్తూ ఉంది. కాన అప్పుడు శరీరంలో మిగిలిఉన్నది ఏమిటి అంటే ఒక్క చైతన్యవంతమైన ఆత్మే అయి ఉంది. కాన ఆత్మ మనస్సు కంటే భిన్నమైంది అని తెలుస్తూ ఉంది. అట్లాగే ఆత్మకు ప్రాణ ధర్మాలు కూడా లేవు. ప్రాణ ధర్మమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆత్మకు లేవు. రక్తంలో ఇనుము భాగమైన అతి సూక్ష్మమైన కణం ప్రాణ వాయువును స్వీకరించి శరీరం అంతా ఆ ప్రాణ వాయువును వ్యాపింప చేస్తూఉంది. దాని వల్ల ఆత్మశక్తి ఇనుంకణం ద్వారా సర్వత్రా వ్యాపించి ఉంది అని అంటూ ఉన్న దాన్ని ఆలోచించ వలసి ఉంది.
34 నిర్గుణో నిష్క్రియోనిత్యో
నిర్వికల్పో నిరంజనః
నిర్వికారో నిరాకారో
నిత్యముక్తో2 స్మి నిర్మలః || 34
@zqsø = నేను, నిర్గుణ = త్రిగుణాలైన సత్త్వరజస్తమో గుణాలు లేనివాడను, నిష్క్రియః = ఏ పనులు చేయని వాడను, నిత్యః = శాశ్వతుణ్ణి, నిర్వికల్పః = ఏవికల్పాలు లేనివాడను, నిరంజనః = దోషం లేనివాడను, నిర్వికారః = వికారం లేని వాడను, నిరాకారః = ఆకారం లేని వాడను, నిత్యముక్తః = ఎల్లప్పుడు స్వతంత్రంగా ఉండు వాడను (శాశ్వతంగా ముక్తిని పొందినవాడను), నిర్మలః = పరిశుద్ధమైన వాడను (ఎట్టి మాలిన్యాలు లేనివాడను).
తా|| (ఆత్మనే) నేను ఏ గుణాలు లేనివాడిని, ఏ పనులు చేయనివాడిని, శాశ్వతమైన వాడిని, ఏ వికల్పాలు లేనివాడిని, ఏ దోషాలు లేనివాడిని, ఏ వికారాలు లేనివాడిని, ఏ ఆకారం లేనివాడిని, ఏ బంధాలు లేకుండా స్వతంత్రంగా ఉండే వాడిని, పరిశుద్ధమైన వాడిని అయి ఉన్నాను.
వివరణ :- ఆత్మకు ఏ గుణాలు లేవు కాన దానికి ఏ కర్మలు చేయటం అనేది ఉండదు. ఆత్మకు పుట్టటం, మరణించటం అనేవి లేవు కాన అది శాశ్వతమై ఉంటుంది. ఆత్మకు ఏ కోరికలు లేవు కాన దానికి సంకల్ప వికల్పాలు ఉండవు. ఆత్మ ఏ కర్మలు చేయటం అనేదే లేదు కాన దానికి ఏ దోషాలు అంటవు. ఆత్మఆకాశం వలె సర్వత్రా తానే వ్యాపించి ఉండటం వల్ల దానికి రూపం అనేది లేదు. ఆత్మ దేనికి లోబడి లేదు కాన అది స్వతంత్రుడు, నిత్యముక్తుడు అయి ఉంటుంది. ఆత్మకు ఏ కోరికలు లేవు. ఏ కార్యాలు లేవు, దేనికి లోబడి లేదు కాన అది ఏ మాలిన్యాలు అంటకుండా నిర్మలుడు అయిఉంటుంది. ఈ విధంగా ఆత్మ శరీరానికి, మనోబుద్ధులకు, ఇంద్రియాలకు అతీతంగా ఉంటూ ఉంది కాన దానికి శరీర కర్మలతో కాని, శరీర ధర్మాలకుకాని, మనోబుద్ధులకు సంబంధించిన రాగద్వేషాలతోకాని, కోరికల విషవలయంతో కాని ఏ సంబంధం లేకుండా ఉంటుంది. ఆత్మ ప్రకృతికి విలక్షణంగా కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల యొక్క జీవశక్తి తానే అయి ఉన్నా ప్రకృతికి సంబంధించిన గుణాలతో కాని, పరివర్తన చెందటంతో కాని, ఏ సంబంధం లేకుండా నిత్య చైతన్యంగా విరాజిల్లుతూ ఉంది. అలంకరించుకొనే ఆభరణాలు ఎన్నిరకాలుగా ఉన్నా వాటిలో ఉన్న బంగారం ఒక్కటే అయి ఉన్నట్లు ప్రకృతి అంతా అనేకమైన వాటితో ఆవరించి ఉన్నప్పటికి వాటి ఆత్మ ఒక్కటే అయి గుణ కర్మరహితంగా శాశ్వతంగా ఉంటూ ఉంది.
ఆత్మే సాధకుడు కాన ధ్యాన సాధనతో ఏ విధంగా సాధకుడు నిలుస్తాడో అర్థం చేసుకోవటానికి ఈ విషయం బాగా వీలు కల్పిస్తూ ఉంది. సాధకుడు సంకల్ప వికల్పాలు లేకుండా, నిర్వికారంగా, స్వతంత్రుడుగా ధ్యానంలో నిలుస్తాడు. సాధకుడు ఆత్మయందే లగ్నమై ఉంటాడు కాన ఏ గుణాలూ ఉండవు, ఏ కర్మలూ ఉండవు, ఏ పనులు లేకుండా పాపరహితుడుగా నిర్మలుడుగా నిలుస్తాడు. ఆత్మ జనన మరణాలనే మార్పులేకుండా ప్రకాశిస్తూ చైతన్యవంతంగా ఉంటుంది కాన సాధకుడు నిత్య చైతన్యవంతంగా ప్రకాశిస్తాడు. సాధకునికి ధ్యానంలో దేహం, ఇంద్రియాలు, మనస్సు అనేవి అన్నీ కూడా లయించి పోతాయి. కాన నిరాకారుడు, నిర్మలుడు, నిరంజనుడు అయి నిలుస్తాడు. సాధకునికి సాధనలో శాంతి సౌఖ్యాలు లభిస్తాయి కాన దేశకాల పాత్రలకు అతీతంగా శాశ్వతుడుగా సాధకుడు నిలుస్తాడు. సాధకుడు సాధనలో వస్తురహితమైన చైతన్యంతో లీనమై ప్రశాంతంగా నిలుస్తాడు కాన ముక్త స్వరూపుడై ప్రకాశిస్తాడు. ఈ విధంగా సాధకుడు ఆత్మజ్ఞానమనే సాధనలో ఏ రూపంలో నిలుస్తాడో, ఏ విధంగా శాంతి సౌఖ్యాలతో ఆనందిస్తాడో మరొక దృక్కోణంతో అర్థం చేసుకోవటానికి ఈ శ్లోకం వీలు కల్పిస్తూ ఉంది.
ఇట్టి ఆత్మాను భూతిని పొందటానికి హృదయదాహం కలవారు సద్గురువును చేరి హృదయదాహాన్ని తీర్చుకోవటానికి నిరంతరం కృషిచేయాలి. ఇక్కడ నందదాసు గురువును గూర్చి చెప్పినది ఉదాహరిస్తాను. బ్రాహ్మణ భక్తుడైన నందదాసు పుణ్యక్షేత్రాల దర్శనార్థం భక్త తులసీదాసు అనుమతి తీసుకొని తోటి భక్తులతో ప్రయాణిస్తూ దారిలో వివాహిత అయిన క్షత్రియ స్త్రీ సౌందర్యానికి దాసుడై ఆమెను దర్శించి ఆనందించే ఆరాధకునిగా మారాడు. ఆ విధంగా సౌందర్యో పాసకుడుగా నిలిచిన ఆతడు కాలానుగుణంగా ప్రకృతి ఉపాసకునిగా మారి కవితాఝరిలో లీనమై అందుండి గోకులంలో గోస్వామి విఠలనాధ్ అనే గురువు యొక్క కృపాకటాక్షంతో తన గమ్యాన్ని గ్రహించి పరాత్పరుని ఉపాసకునిగా మారాడు. అప్పుడు అటువంటి నందదాసు గురువును గూర్చి రచించిన మాటలు బహు ఉదాత్తంగా ఉన్నాయి. (వివరంగా తెలుసుకోవటానికి ''చంద్రభాగాతరంగాలు''చూడండి. వింతగా సుందరంగా ఉంది)
''ముముక్షువులు సాగరంలోని ముత్యపు చిప్పలాటి వాళ్ళు గురువు అందులో వర్షించే స్వాతి చినుకు వంటివారు. వర్షపు నీటిలోని ఒక్క చినుకుతో దాహం తీరుతుంది. ఉప్పునీరు సముద్రమంత ఉండిమాత్రం ఏం ప్రయోజనం''? అని వివరించాడు.
ఈ జీవిత నౌకలో ఒక్కొక్క రోజు వ్యర్థంగా గడిచి వెళ్ళిపోకుండా ధ్యానంతో ప్రతిరోజు ఒక భవన నిర్మాణ రాయిగా చేసుకొంటూ వెళ్ళాలి. అప్పుడు ఆతని ఆత్మజ్ఞానంలో ఆతని సాధన అనే కాంక్రీటు జీవిత భవనాన్ని సుందరంగా, గట్టిగా తయారు చేస్తుంది.
35 అహ మాకాశావ త్సర్వం
బహి రంతర్గతో2 చ్యుతః
సదా సర్వసమ స్సిద్ధః
నిస్సంగో నిర్మలో2 చలః || 35
@x¤¦¦¦Li = నేను, ఆకాశవత్ = ఆకాశం వలె, సర్వం = అన్నిటి యందును, బహిః = బయట, అంతః = లోపట, గతః = నిండి ఉన్నాను, అచ్యుతః నాశనం లేనివాడిని, సదా = ఎల్లప్పుడూ, సర్వసమః = ఎట్టి మార్పులు లేకుండా అన్నిటి యందును సమ దృష్టి కలవాడను, నిస్సంగః = దేనితోనూ బంధం లేనివాడను, నిర్మలః = ఏ విధమైన మలినాలు లేకుండా స్వచ్ఛంగా ఉండే యోగ్యుడను, అచలః = చలనంలేని వాణ్ణి.
తా|| నేను ఆకాశం ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉందో ఆ విధంగా సర్వత్రా వ్యాపించి బయట లోపల నిండి ఉన్నాను. నాశనంలేని వాణ్ణి. ఎల్లప్పుడూ ఎట్టిమార్పులు లేకుండా అన్నిటి యందును సమదృష్టి కలవాడను. పరిశుద్ధమైన వాడను. దేనితోనూ ఏ విధమైన బంధాలు లేనివాడను. ఏ విధమైన మలినాలు లేకుండా స్వచ్ఛంగా ఉండే యోగ్యుణ్ణి. అచలుణ్ణి.
వివరణ :- ఆత్మ అస్తినాస్తి విచికిత్సాహేతువు అయింది. అంటే ఆత్మ ఉందా లేదా అనే జిజ్ఞాసతో ఆలోచించటానికి హేతువు అయి ఉంది. మ్యాపులో కొండను చూపించేటప్పుడు విస్తీర్ణం ఎక్కువగా ఉండి భూమి మీద ఉండే కొండను చూపించటానికి గుర్తుగా పెద్దసున్నా కనిపిస్తూ ఉంటుంది. అదే కొండ యొక్క శిఖరాన్ని చూపించటానికి ఆ కొండయొక్క సున్నాల వరుసక్రమంలో చిట్టచివరి చిన్న సున్నా కొండశిఖరానికి గుర్తుగా కనిపిస్తుంది. అట్లాటి ఉన్నతమైన ఎత్తైన శిఖరాన్ని చూపించటానికి చిన్న చుక్కవంటి చిన్న సున్నా ఎట్లా కనిపిస్తూ ఉందో అట్లా ఆత్మ శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి అనంతమై ఉన్నతంగా ఉంది. అందువల్లే దాన్ని తెలుసుకోవటం కష్టం అవుతుంది. అందుకే అది విచికిత్సా హేతువు అయింది. పంచభూతాలైన ఆకాశం గాలి అగ్ని నీరు భూమి క్రమంగా శబ్ద స్పర్శ రూప రస గంధాల్ని ఇస్తూ ఉన్నాయి కదా! ఆ భూతాలు క్రమంగా సూక్ష్మం నుంచి స్థూలం అయినయి కదా! కాన ఆకాశం సూక్ష్మం అయి ఉంది అని తెలుస్తూ ఉంది కదా! అట్లాగే ఆత్మ ఆకాశం వలె సూక్ష్మం అయి ఉంది. సూక్ష్మం అయిన ఆకాశం లోపల బయట సర్వత్ర ఎట్లా వ్యాపించి ఉందో అట్లాగే సూక్ష్మమైన ఆత్మసర్వత్ర వ్యాపించి ఉంది. ఆకాశంలోకి ఎన్ని మలినాలు వెళ్ళినా ఆకాశానికి ఏ మలినాలు ఏ విధంగా అంటటంలేదో అదే విధంగా ఆత్మ సర్వానికి జీవశక్తిని ఇస్తూ ఉన్నా సర్వావయవ చైతన్యానికి కారణం అయి అన్నిటితోను సంబంధం ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నా ఏ మలినాలు అంటటం లేదు, ఏ బంధాలు కలిగి ఉండటం లేదు. ఆకాశానికి ఏ విధంగా అంతం లేదో ఆ విధంగా ఆత్మకు కూడా అంతంలేదు. కాన ఆత్మ అచ్యుత స్వరూపం అయి ఉంది., ఆత్మ సర్వత్ర వ్యాపించి ఉంది కాన దానికి కదలటానికి ఖాళీ ఎక్కడా లేదు. కాన అచలమై పర్వతం వలె నిశ్చలంగా ఉంది. ఆకాశానికి ఎట్లా ఆకారం లేదో అట్లాగే ఆత్మకు కూడా ఆకారం లేకుండా నిరాకారమై ఉంది. ఆకాశానికి ఏ విధంగా అవధులు లేవో ఆవిధంగా ఆ ఆత్మకు కూడా అవధులు లేవు. స్వయం ప్రకాశమానమైన సూర్యుడు సమదృష్టితో అన్నిటికీ ఏ విధంగా సమానంగా కాంతిని ప్రసరింపజేస్తూఉన్నాడో ఆ విధంగానే స్వయం ప్రకాశ##మైన ఆత్మ అన్నిటినీ సమంగా ప్రకాశింపజేస్తూ ఉంది. ప్రకృతి యందు శరీరం మాయా కల్పితమైన వికారాలచే అనేక మార్పులు చెందుతూ ఉండగా ఆత్మ ఎట్టి వికారాలు లేకుండా స్వచ్ఛంగా, నిర్మలంగా, పరిశుద్ధంగా, ఏ బంధాలు లేకుండా, నిశ్చలంగా ఉంటుంది. కాన సాధకుడు నేనే ఆత్మను అని భావన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ యొక్క ఈ గుణాలతో తాదాత్మ్యం చెంది ఉండాలి. సాధకుడు నేను అచ్యుతుణ్ణి కాన మృత్యుంజయుణ్ణి అని భావన చేయాలి. శరీరానికి దాపురిస్తూ ఉన్న రోగానికి కాని, వృద్ధాప్యానికి కాని, బాధకి కాని తాను బాధ్యుడను కాను అని భావన చేస్తూ శుద్ధమైన వాడుగాను, నిస్సంగుడుగాను, నిర్మలుడు గాను ఉండాలి. సాధకుడు దీపం ఉండగానే శరీరం అనే ఇల్లు చక్క పెట్టుకోవటానికి అలవాటు పడాలి. మానవుడు నిర్మించుకొన్న సంసారం అనే దీపాన్ని తొలగిస్తే ఆత్మ అనే చంద్రుని వెన్నెలలో ఆహ్లాదాన్ని అనుభవిస్తాడు.
36 నిత్యశుద్ధ విముక్తైకం
అఖండానంద మద్వయం
సత్యం జ్ఞాన మనంతం యత్
పరం బ్రహ్మా2 హమేవ తత్ || 36
¬s»R½ù = నిత్యమైంది, శుద్ధ = మాలిన్యాలు లేనిది, విముక్త = ఏ బంధాలు లేకుండా స్వేచ్ఛను పొందింది, ఏకం=ఒక్కటేఅయింది, అఖండ+ఆనందం=మొక్కపోని ఆనందం అయింది, అద్వయం = రెండు కాంది, సత్యం = నశించ కుండా ఉన్న నిజమయింది, జ్ఞానం = జ్ఞాన స్వరూపం అయింది, అనంతం = అవధి అనేది లేనిది, తత్ = అది అయిన, యత్పరం బ్రహ్మం = ఈ సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరబ్రహ్మాన్ని, అహమేవ = నేనే అయి ఉన్నాను.
తా|| నిత్యమైంది, శుద్ధమైంది, ముక్తమైంది, ఏకమయింది, అఖండానంద మయింది, అద్వయమయింది, సత్యమైంది, జ్ఞానమైంది, అనంతమైంది, అయిన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే అయి ఉన్నాను.
వివరణ :- సత్యస్వరూపం అయింది, జ్ఞాన స్వరూపం అయింది, అనంతమైంది, సర్వత్రా వ్యాపించి ఉంది, ప్రకాశించేది అయిన ఆ బ్రహ్మాన్ని నేనే అయి ఉన్నాను అనేది ఆత్మమార్గం ద్వారానే తెలుస్తుంది. అట్లా తెలిసిననాడు ఆత్మజ్ఞానమే బ్రహ్మ జ్ఞానం అని తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత గురువు మీద నమ్మకంతో, విశ్వాసంతో పట్టుదలతో, ఓర్పుతో, గురువాక్యపాలనకు అనుకూలంగా నిరంతరం సాధన చేయటం వల్ల సత్యస్వరూపం అయిన ఆత్మ సిద్ధిస్తుంది. దాని వల్ల నేను బ్రహ్మ స్వరూపాన్ని అనే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. దానితో ఆత్మానందం సిద్ధిస్తుంది. మూడు అవస్థలలోను, బ్రహ్మభావంతో, బ్రహ్మజ్ఞానంతో, బ్రహ్మానందంతో నిత్య కృత్యాల్ని నెరవేరుస్తూ సంఘంలో మామూలు మానవుడుగా ఉన్నట్లే జీవించటానికి ఆత్మజ్ఞానం ఆవిధంగా వీలుకల్పిస్తుంది. నిత్యం, నిరంతరం, ఆ బ్రహ్మాన్ని గురించి చింతిస్తూ సాధనచేస్తూ ఉండటమే జ్ఞానాభ్యాసం అవుతుంది. కాన ధ్యానంలో సాధకుడు ఈ విధమైన అనుభవాల్ని పొందటానికి నిరంతరం ఆ భావనలో ఉంటే ఆ బ్రహ్మ భావం దానంతట అదే రక్తాణువుల్లో జీర్ణించి పోయి నిత్యానందంగా ప్రకాశిస్తుంది.
ఈ సృష్టిలో ఉన్న అతి విచిత్రాలలోకి ఎల్లా విచిత్రమైంది ఏమిటి అంటే ఒక శాశ్వతమైంది ఒక అశాశ్వతమైన దాంట్లో ఇమిడి ఉండటం, ఒక అనంతమైంది ఒక పరిమితమైన దాంట్లో చేరి ఉండటం, అతి శక్తిమంతమైంది పరిమిత శక్తికల దాంట్లో కూడి ఉండటం, అన్నిటికి చేతనత్వాన్ని ఇచ్చేది అచేతనమైన దాంట్లో నిలిచి ఉండటం, సర్వానికి ప్రకాశాన్ని ఇచ్చేది స్వయంప్రకాశం కాని జడంతో కలిసి ఉండటం, పరిశుద్ధమైంది మలభాండంలో చేరి ఉండటం, ముక్తమైంది మోక్షాన్ని వెతికే దాంట్లో ఉండటం. ఈ విధంగా విషయాన్ని ఆలోచించి చూసినప్పుడు ఆ పరబ్రహ్మం బహువిచిత్రమైన కళాకారుడుగా దర్శనమిస్తూ ఉంటాడు.
మానవుడు నిత్యం ఏ అనంతమైన శక్తి కావాలని ప్రకృతి అంతటా వెతుకుతూ ఉంటాడో ఆ అనంతమైన శక్తిని ''నేనే'' అని గ్రహించలేకపోవటమే అతి విచిత్రాలలోకి ఎల్ల విచిత్రం అయింది అని దాన్ని గ్రహించిన నాడు, నాశనం అయ్యే ఈ ప్రకృతికి ఆధారభూతమైన ఏ ఆత్మ అయితే నిత్యమై ఉందో ఆ ఆత్మ తనలోనే ఉంది అని తెలుసుకొంటాడు. అహంభావంతో విర్రవీగి సంచరిస్తూ ఉన్న ఈ మనస్సుకు ఈ శరీరాన్ని బానిసను చేస్తూ ఉన్నామే కాని ఈ మనస్సు వ్యక్తిత్వం కలిగింది కాదు, సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మమాత్రమే శక్తిమంతమైంది అని తెలుసుకొంటాడు. మనస్సు శుద్ధమైంది కాదు, లోనున్న ఆత్మే శుద్ధమైంది అని తెలుసుకొంటాడు. ఈ మనస్సుకు ఈ శరీరానికి, ఈ ఇంద్రియాలకు సంబంధం లేకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నటువంటి ఆత్మే ముక్తమైంది అని అర్ధం అవుతుంది. సాధనలో శరీరాన్ని, ఇంద్రియాల్ని దాటి ఆ ఆత్మ తేజస్సులో సాధకుడు లీనం అవుతూ ఉండటంవల్ల ఆ ఆత్మే ఏకమయింది, అఖండానందమైంది, అద్వితీయమైంది అని అనుభవం కలుగుతుంది. ప్రకృతిలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్న ఈ దేహం, ఈ వస్తు జాలం మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానమే నిజంగా సత్యమైంది అని నమ్మి ఉన్న సాధకునికి ఇవేవీ సత్యమైనవి కావు, ఆత్మజ్ఞానమే సత్యమైంది, నిత్యమైంది అతీతమైంది అని అవగాహన కలుగుతుంది. కావున సాధకుడు ఆ పరబ్రహ్మాన్ని నేనేఅయి ఉన్నాను అని తెలుసుకొంటాడు. కస్తూరి మృగం అడివి అంతా కస్తూరి వాసనకోసం వెతుకుతూ ఉన్నట్లు ఆ పరబ్రహ్మస్వరూపం కోసం అనంతంగా, అనిశ్చలంగా, పరిశోధిస్తూ వెతుకుతూ ఉన్నాను అని అర్థం చేసుకోగలుగుతాడు. ఆ పరబ్రహ్మాన్ని నేనే అయి ఉన్నాను అని తెలిసిన మరుక్షణం అనంతమైన దుఃఖసాగరం నుంచి ఒడ్డుకు చేరినట్లు అనిపిస్తుంది, ఎనలేని విశ్రాంతి లభిస్తుంది. అంతఃకరణ చతుష్టయానికి ఉన్న చాంచల్యం క్రమేపి తొలగిపోవటం ప్రారంభిస్తుంది. సుఖశాంతులకు దారి సుగమం అవుతుంది. అప్పుడు సాధకుడు స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. కాంతాకనకాలకు, వ్యామోహాలకు లోనవ్వలసింది లేదు అని తెలుస్తుంది. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తనను ఎంతటి బానిసలుగా తయారు చేసింది అర్థం చేసుకోవటానికి వీలుకలుగుతుంది.
సాలెపురుగు తన నివాస గృహాన్ని తనలోనుంచే ఎట్లా తెచ్చుకొంటుందో సాధకుడు తన మనస్సులోంచే దుఃఖాల గూటిని నిర్మించుకోవటం జరుగుతుంది అని తెలుస్తుంది. కావున గతం గతుకుల బాట అని నెమరు వేసుకొంటు దుఃఖిస్తూ గడపటం కాకుండా భవిష్యత్తును బంగారు బాట చేసుకోవటానికి ఆత్మజ్ఞానంతో నిరంతరం సాధనచేయాలి. దేహభ్రాంతితో, సాధకుడు జీవించినంతకాలం మనస్సుకోరికల విషవలయంలో చిక్కి బాధ అనే ఆరని కుంపటితో సతమత మౌతూ గడపవలసి వస్తుంది అని అర్థం చేసుకోవాలి.
37 ఏవం నిరంతరభ్యస్తా
బ్రహ్మై వాస్మీతి వాసనా
హరత్యవిద్యా విక్షేపాన్
రోగానివ రసాయనం || 37
L][gSƒ±s = రోగాన్ని, రసాయనం = మందు, ఇవ = వలె (ఏ విధంగా అయితే నివారిస్తుందో ఆ విధంగా), బ్రహ్మ+ఏవ+అస్మి+ఇతి=నేనే బ్రహ్మాన్మి అని (ఆలోచించే విధంగా) ఏవం,=ఈవిధంగా, నిరంతరభ్యస్తా=నిరంతరం అభ్యసించటం వల్ల (ఏర్పడిన), వాసనా=సంస్కారం, అవిద్యావిక్షేపాన్=ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల ఏర్పడిన చాంచల్యాలన్నింటిని, హరతి = నశింపచేస్తూ ఉంది.
తా|| అనారోగ్యాన్ని మందు ఏ విధంగా నివారిస్తుందో ఆ విధంగా నేనే బ్రహ్మాన్ని అని నిరంతరం అభ్యసించటంవల్ల అభివృద్ధి చెందిన సంస్కారం మనోచాంచల్యాన్ని నశింప చేస్తుంది.
వివరణ :- ఔషధాన్ని సేవించటం అనేది తాత్కాలిక ఉపశమనమే కాని జీర్ణించి పోయిన రోగం ఎప్పుడైనా, ఎక్కడైనా, సంపూర్ణంగా నివారింపబడుతుందా అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేనే బ్రహ్మాన్ని అనే ఆత్మ భావన, ఆత్మసాధన, ఆత్మమార్గంలో జీవించటం అనేవి మహోన్నతమైన కార్యాలై ఉన్నాయి. ఇవి తాత్కాలిక ఉపశమనాలు కావు. ఆత్మజ్ఞానం అనేదే మహోన్నతమైంది. ఆత్మ జ్ఞానంతో జీవించటం అంటే సాధకుడు నిజమైన భగవంతునికి నిజమైన నీరాజనం అర్పించటం అవుతుంది. కాన దీన్ని నిరంతరం తీవ్రంగా అభ్యసించటం వల్ల సాధకుడుసమీప భవిష్యత్తులోనే ఉన్నత ఫలితాన్ని పొందుతాడు. కాన సాధకుడు వస్తు ప్రపంచం నుంచి వీలైనంత దూరంగా జరగటానికి వీలైనంత తొందరగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానితో అలవాటు అయిఉన్న మనోచాంచల్యం తొలగి మనస్సుకు స్థిరత్వం చేకూరటానికి వీలు ఏర్పడుతుంది. కావున ప్రపంచ వ్యామోహాలైన కీర్తిప్రతిష్ఠలు, కాంతాకనకాలు, అవసరాలకు మించిన సుఖకాంక్షలు తొలగించు కొంటూ జీవించటం అలవరచుకోవాలి, అంటే ఇందులో సాధకుడు చేస్తున్నపని ఏమిటి అంటే దేహం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు మొదలైన వాటిని క్రమేపి నిగ్రహించటానికి నిరంతరం సాధన కొనసాగిస్తూ ఉన్నాడన్నమాట. దాని వల్ల మనస్సుకు ఉత్తమ సంస్కారాలు అలవడతాయి. అయినప్పటికి మనస్సును చలించకుండా ఆపటం అనేది వీలయ్యే పని కాదు. కాన ఆమనస్సుకు ఉన్నతమైన, పరబ్రహ్మపరమైన దివ్య ఆలోచనల్ని అందించాలి. అందుకే సాధకుడు అహంబ్రహ్మాస్మి అని బ్రహ్మభావన కలిగి చరించాలి. దానితో మనస్సు ఆత్మతో అనుసంధానం అయి జీవించటానికి తలొగ్గుతుంది. మనస్సు ఉదాత్తమైన భావాలు స్వీకరించటం వల్ల, ఉన్నతమైన ఆదర్శాలతో నిరంతరం కృషి చేస్తూ ఉండటం వల్ల అది ఉన్నతమైన స్థానంలో సంచరించటానికి వీలుకలుగుతుంది.
మానవుడు పుట్టిన దాది తల్లి దండ్రులు, పరిసరాలు, అన్నీకూడా జీవాత్మ భ్రాంతిని పెంచి పోషించటం వల్ల జీవాత్మ భావన ఏ విధంగా స్థిరపడిందో అదే విధంగా నేనే బ్రహ్మాన్ని అని బ్రహ్మభావన చేయటం వల్ల, దానికి అనుకూలమైన బ్రహ్మభావనాపరులతో సంచరించటం వల్ల, సత్సంగాలతో గడపటం వల్ల, ఆత్మ భావనకు అనుకూలమైన విధంగా పరిసరాలను, వాతావరణాన్ని చేకూర్చుకోవటం వల్ల, దానికి అనుకూలంగా నిత్యం సాధన చేస్తూ ఉండటం వల్ల బ్రహ్మభావన స్థిరపడుతుంది. బ్రహ్మమే అయి ఉండి జీవాత్మ భావనకు లోనవ్వటం జరిగిందే కాని నిజానికి సాధకుడు బ్రహ్మమే కాన సాధనకు పూర్వం, సాధనతర్వాత కూడా బ్రహ్మంగానే నిలుస్తాడు. ముందు వచ్చిన చెవులు కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు మనస్సు మొరాయిస్తూ ఉంటుందేగాని దాన్ని మచ్చికచేసుకోవటం వల్ల, ఆత్మభావన యందు శాంతి సౌఖ్యాలకు అలవాటుపడటం వల్ల అందులోనే రమించటానికి మనస్సు అలవాటుపడుతుంది.
మానవునికి అహంకారం అనేది ముందు నడుస్తూ, ద్వైత భావంతో మానవుడు నిరంతరం సంచరించేటట్లు చేస్తుంటుంది. అంతే కాని అద్వైతభావానికి అంత తేలిగ్గా ముడిపడిరాదు. కాన అహంబ్రహ్మాస్మి అన్నంత మాత్రం చేత అహంకారం వెంటనే తొలగిపోదు. దానికి నిరంతర సాధన చేయాలి. ఆచరణలో అద్వైతభావంతో సంచరించకలిగిన నాడే అహంబ్రహ్మాస్మి అనేది నిరంతర సాధనకు అందివస్తుంది.
కుమ్మరి వాని చెల్లెలు, నామ్‌దేవ్ తల పక్వంకాని పచ్చికుండ అని గేలి చేసింది. ఆ అవమానాన్ని భరించలేక నామ్‌దేవ్ పాండురంగని ఆలయానికి చేరి ఆతని దుఃఖాన్నంతా ఆ భగవంతునికి వ్యక్తం చేసుకొన్నాడు. నామ్‌దేవ్‌కి పండరీపురనాథుడైన పాండురంగడు ప్రత్యక్షమై ఆతనితో మాట్లాడటం అనేది అలవాటు అయి ఉంది. కాన పాండురంగడు నామ్‌దేవ్ యొక్క అపరిపక్వత అనేది నిజమేనని చెప్పటంతో ఆతడు ఇంకా దుఃఖానికి లోనయ్యాడు. పాండురంగడు నువ్వు మోక్షం పొందాలంటే గురువును ఆశ్రయించాలని చెప్పాడు. ఆ విధంగా నామ్‌దేవ్ భగవంతుని నుండి గురువు యొక్క అవసరాన్ని తెలుసుకొని పాండు రంగడు సూచించిన గురువు చెంతకు చేరాడు. అది పాడుపడిన గుడి. ఆ గుడిలో ఒక వృద్ధుడు శివుని లింగంపై కాళ్ళుపెట్టుకొని ఉన్నాడు. నామ్‌దేవ్ అది చూసి సహించలేకపోయాడు. దానికి ఆ వృద్ధుని నిందిస్తూ వెంటనే ఆ కాళ్ళను తీసి లింగంలేని కాళీ ప్రదేశంలో పెట్టాడు. అక్కడ కూడా లింగం ఉద్భవించింది. వెంటనే ఆ కాళ్ళను ఇంకొక మూలకు, ఇంకొక మూలకు తిప్పుతూ ఎన్ని చోట్లకు మార్చినా ప్రతిచోట లింగం ఉద్భవించి ఆ వృద్ధుని కాళ్ళను మోస్తూ కనిపించింది. ఆ విధంగా అలసిపోయిన నామ్‌దేవ్ ఆశ్చర్యంతో గురువుకు నమస్కరించాడు. గురువు ఎక్కడ లింగంలేదో అక్కడ తన కాళ్ళను పెట్టమని నామ్‌దేవ్‌ను కోరాడు. నామ్‌దేవ్ చేతులు ఎత్తేయటంతో నామ్‌దేవ్‌యొక్క నిస్సహాయతను, అవిద్యను తెలుసుకొని ఆతనికి ఆ పరాత్పరుడు లేని చోటులేదని తెలియజేశాడు. ద్వైతభావంతోను, అహంకారంతోను, పరులను తక్కువగా చూసే స్వభావంతోను సంచరించే అలవాటు కలిగిన నామ్‌దేవ్‌కు అద్వైతభావం వెనువెంటనే అనుభవం అయింది. అప్పటినుంచి ఆ గురువు చెంతే ఆత్మజ్ఞానంతో ఆత్మసాధనతో జీవిస్తూ, గురుసేవ చేసుకొంటూ కాలం గడుపుతుండగా సంవత్సరం అయిన తర్వాత పాండురంగడే స్వయంగా నామ్‌దేవ్ వద్దకు వచ్చి నువ్వు పండరీపురం రావలసిందిగా కోరాడు. నువ్వు లేకపోతే నాకు బాగోకపోవటమే కాదు, పురవాసులంతా నీ రాకకోసం తపిస్తున్నారన్నాడు. నామ్‌దేవ్ గురువును విడిచి రాలేనని చెప్పాడు. సర్వత్ర భగవంతుని దర్శిస్తూ, సచ్చిదానందాన్ని అనుభవిస్తూ, అద్వైతాన్ని చవిచూస్తున్న నామ్‌దేవ్ పాండురంగని కోరికను నిరాకరించి, గురుసేవలో ఆ పాడుపడిన గుడిలోనే జీవితాంతం గడిపాడు కావున సాధకులు అహంబ్రహ్మాస్మి అనుకోవటంతో పాటు, అద్వైత ఆచరణను, పరులసేవా తత్పరతను అలవరుచుకొని జీవించాలి.
38 వివిక్తదేశ ఆసీనో
విరాగో విజితేంద్రియః
భావయే దేక మాత్మానం
తమనన్త మనన్య ధీః || 38
„s„sNRPò®µ…[aRP = ఏకాంత ప్రదేశమందు, ఆసీనః = కూర్చొని, విరాగః = కోరికలు లేనివాడవై, విజిత+ఇంద్రియః = ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకొన్నవాడవై, అనన్యధీః = లక్ష్యమునందే చిత్తం కలిగిన వాడవై, తం = అది (ఆత్మ), ఏకం = అద్వైయం, అనంతం = అంతంలేనిది అయిన, ఆత్మానం = ఆత్మస్వరూపాన్ని, భావయేత్ = ధ్యానం చేయాలి.
తా|| ఏకాంత ప్రదేశంలో కూర్చొని కోరికల్ని తొలగించినవాడవై, ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకొన్నవాడవై, నిశ్చలమైన చిత్తంతో అద్వితీయమైంది, అనంతమైంది అయిన ఆత్మ స్వరూపాన్ని ధ్యానం చేయాలి.
వివరణ :- మనస్సుకు ఆత్మతో అనుసంధానం చేయటానికి సాధకుడు ముందుగా సిద్ధం చేసుకోవలసిన జాగ్రత్తలను అన్నిటిని శంకరాచార్యులవారు ఇక్కడ వివరించారు. (1) ఎట్టి ఉపద్రవాలు కలుగ నటువంటి ఏకాంత స్థలం కావాలి. (2) కోరికలు నశించాలి. (3) ఇంద్రియాలు స్వాధీనం కావాలి. (4) చలించని మనస్సు ఉండాలి (5) స్థిమితంగా ఎక్కువసేపు కూర్చోవటానికి వీలుకావాలి. ఇట్లా ఇన్నిటిని ప్రతినిత్యం సిద్ధంచేసుకోవటానికి సాధకుడు సాధనచేస్తుండాలి. కాన అవి అన్నీ సాధకుని నిత్యకృత్యాలు కింద అలవాటు అయిపోతాయి. ధ్యానం అంటేనే స్వస్వరూపంతో అనుసంధానం అయి గడపటం, అంటే ఒకే దాని యందు అన్నిటిని లగ్నం చేసేటట్లు చేసి దాని యందు అవి అన్నీ ఆనందించేటట్లు చేయటం.
ఉండటానికి సొంతకొంపే లేక ఇల్లు ఇరకాటంగా బాధపడే ఈ అధునాతన యుగంలో ధ్యానమునకు ఒక గది ఏర్పాటు చేసుకోవటం ఎంత కష్టం అవుతుందో ఆలోచించండి. అట్లాంటి పరిస్థితుల్లో ఏకాంతం ఎట్లా కుదురుతుంది అని చాలామంది ఎదురు ప్రశ్నవేస్తుంటారు. ఆ విధమైన ఆలోచనలతో లేనిదానికి బాధపడకుండా ఉన్నంతలో ఏకాంతాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. అదీ కుదరనప్పుడు ఒక విశాలమైన పొడుగాటి వస్త్రాన్ని శిరస్సుపైనుంచి మొత్తం శరీరం అంతా కప్పుకొని కూర్చోవటం నేర్చుకొంటే శారీరకంగా, మానసికంగా కూడా ఏకాంతాన్ని ఏర్పరుచుకొన్నట్లు అవుతుంది అని ఆధునిక గురువులు చెబుతుంటారు. కాన సాధకుడు తనకు వీలైన పరిసరాలను, పరిస్థితులను తనకు అనుకూలమైన వాతావరణంగా మార్చుకొని, తనలోపటికి తాను వెళ్ళటానికి వీలైన ప్రయత్నం చేయాలి. సద్గురువు వద్ద జ్ఞానము పొందిన తరువాత ధ్యానంలో పరిణతి చెందినవారికి అందరిలో ఉండగానే ఏకాంతంగా ఉండటం కుదురుతుంది. కాని ప్రారంభదశలో అంతటి ఏకాగ్రత కుదరదు. కాన సాధకుడు వీలైనంతవరకు సర్దుబాటుతో తృప్తిపడి ఉన్నదానితో సాధనకు ప్రాధాన్యం ఇచ్చి శ్రద్ధాసక్తులతో నిరంతరం సాధన చేయాలి. ఏకాంతం ఏర్పాటు చేసుకోవటానికి వీలుకుదిరినప్పుడు తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి ఒక్క రెక్కమాత్రమే ఓరగా తెరిచి, పైనఫ్యాను వీలైనంత నెమ్మదిగా తిరిగే దాంట్లో పెట్టి, ధ్యానానికి కూర్చోవాలి. బహిర్ముఖంగా సంచరించే ఇంద్రియాల్ని అంతర్ముఖం చేయాలని ప్రయత్నం కొనసాగిస్తుండటం వల్ల వ్యతిక్రమంగా అన్నీ పనిచేయటానికి పూనుకోవటంవల్ల చెమటపడుతుంది. కాన శరీరానికి గాలితో శాంతిని కలిగించటానికి ఫ్యాను అవసరం అవుతుంది. గది నిశ్శబ్దంగా ఉండేటట్లు చూడాలి. అశాంతిని, ఉద్రేకాన్ని అలజడులను కలిగించే ఏవిధమైన చిత్రపటాలు ఆగదిలో లేకుండా చూసుకోవాలి. సుఖాసనంలో కూర్చోవాలి. ఏ విధంగా కూర్చున్నా పర్వాలేదుకాని వెన్నుపూస, కంఠం, శిరస్సు తిన్నగా ఒకే లైనులో ఉండేటట్లు చూసుకోవాలి. అది కూడా వీలుకాని పక్షంలో పడక కుర్చిలో కూర్చొని, లేదా పడుకొని, లేదా గోడకు ఆనుకొని అయినా సరే ప్రతినిత్యం విడవకుండా సాధన చెయ్యాలి. క్రమేపి సాధకునికి ఆరోగ్యం కుదుటపడి వీలుకుదిరినప్పుడు బాసింపట్టు (సకల ముకలం) వేసుకొని కూర్చొని సాధన చేయాలి. ధ్యానానికి కూర్చొనేటప్పుడు ప్రారంభంలో గురువును ధ్యానించాలి. గురువుమీద సంపూర్ణ విశ్వాసంతో ఆయనను తలచుకోవాలి. ఇక్కడ ఛత్రపతి శివాజీ గురువును తలచుకొన్న విధానాన్ని పరిశీలించగోరుతున్నాను. శివాజీ గురువైన సమర్థరామదాసు శివాజీని విడిచి తన ఆశ్రమానికి వెళ్ళటానికి పూర్వం శివాజీని పరీక్షించి వెళ్ళాలనుకొన్నాడు. శివాజీ గురుదర్శనార్థం వచ్చేటప్పటికి గురువు కళ్ళు చింతనిప్పుల్లాగా ఉబ్బిపోయి ఉన్నాయి. కళ్ళవెంట ధారాపాతంగా నీరుకారుతుంది. అది చూసేటప్పటికి శివాజీ చలించిపోయాడు. ఏమి జరిగిందో తెలుసుకోవటానికి ఆదుర్దాపడిపోయాడు. దాని నివారణోపాయానికి ఏ వైద్యం చేయించాలో తెలుసుకోవటానికి ప్రయత్నంచేశాడు. మౌనంగా ఉన్న రామదాసు మెల్లిగా అది నీవల్ల కాదులే అని జవాబు చెప్పాడు. నేను చెయ్యలేక పోవటం ఏమిటి స్వామి మీ దుఃఖం నివృత్తికోసం, మీ ప్రాణరక్షణ కోసం నా ప్రాణాల్ని ఇచ్చి అయినా చేయిస్తానన్నాడు. అది ఇతరుల వల్ల అయ్యేది కాదు, నువ్వే చెయ్యాలి అన్నాడు. శివాజీ నేనే చేస్తానన్నాడు. అయితే నువ్వు అడివికి వెళ్ళి ఈనిన సింహం పాలు తీసుకు వచ్చి నాకంటిలో పోస్తే అది తగ్గుతుంది అని చెప్పాడు. అది ఎంత భాగ్యం, ఇప్పుడే వెళ్లి సింహం పాలు తీసుకు వచ్చి పోస్తానని గుర్రాన్ని ఎక్కి శివాజీ బయలుదేరి వెళ్ళాడు. అడివి అంతా గాలించినా ఎక్కడా ఈనిన సింహం కనిపించలేదు. అట్లాగే ఇంకా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఆఖరికి ఒక మూల సింహం పిల్ల ఎదురు వస్తూ కనిపించింది. గుర్రందిగి దాన్ని చేత్తో నిమిరి వదిలేటప్పటికి అది తల్లి దగ్గరకు వెళ్ళింది. దాని వెనకాలే శివాజీ వెళితే తల్లి గాండ్రించి శివాజీ మీద పడబోయింది. శివాజీ కళ్ళు మూసుకొని సాష్టాంగ నమస్కారం చేస్తూ గురువును ఈ విధంగా తలచుకొన్నాడు ''ఓ గురు మహారాజ్‌జీ ! మీరు సర్వసమర్ధులు, మీరు చేయలేని దేమున్నది. నేను మీ శరణాగతుణ్ణి. మీరు నన్ను కరుణించండి, మీరు నన్ను కరుణించండి; మీరు నన్ను కరుణించండి''అని వేడుకొన్నాడు. శివాజీ కళ్ళు తెరచి చూసేటప్పటికి సింహం ఎదురుగుండా కూర్చొని ఉంది. సింహం పిల్ల ఒక ప్రక్క పాలుతాగుతుంది. శివాజీ లేచి తాను వెంట తెచ్చుకొన్న బంగారు గిన్నెలోకి రెండవ ప్రక్కనుంచి పాలు పిండుకొన్నాడు. సింహానికి నమస్కరించి లేచి గుర్రాన్ని ఎక్కి గురువుచెంతకు చేరాడు. గురువు నేత్రాలు మామూలుగా ఉన్నాయి. శివాజీ గురువుకు జరిగింది అంతా విన్నవించుకొన్నాడు. గురువును రాజప్రాసాదంలోనే ఉండమని ప్రాధేయపడ్డాడు. గురువు దానికి సమ్మతించక తనపేరుమీదుగా రాజ్యాన్ని పాలించమని చెప్పి ఆయన ఆశ్రమానికి ఆయన వెళ్ళిపోయాడు. కాన గురువు మీద నమ్మకం, విశ్వాసం ఉంచటం అంటే శివాజీ ఆచరించిన విధంగా అంతటి నమ్మకంతో, ప్రపత్తితో గురుజ్ఞానాన్ని సాధన చేయటానికి పూనుకోవాలి. కాన సాధనలో కూర్చోవటానికి పూర్వం గురువును శివాజీ మాటల్లోనే తలచుకొని కూర్చుంటే విరాగత్వం, విజితేంద్రియత్వం చేకూరుతాయి. కారణం ఏమిటంటే గురుజ్ఞానం అంటేనే దైవం. సాధకుడు జ్ఞానం తీసుకొనే రోజునే ఆతని శరీరాన్ని, ఆతని ఇంద్రియాల్ని గురువుకు అర్పించే గురుజ్ఞానం స్వీకరించటం జరిగింది. కాన సాధనకు ఉపక్రమించేటప్పుడే గురువును తలచుకోవటంవల్ల ఆతని శరీరం, ఇంద్రియాలు అన్నీ కూడా తనకు దూరం అయ్యాయి అనే భావన చేకూరుతుంది. ఆ విధంగా అన్ని అవయవాల్ని, అన్ని ఇంద్రియాల్ని విశ్రాంతపరచి, ఒక్క ఆత్మతోనే తాను ఉన్నాననే భావనతో సాధకుడు ఆత్మ సాధనలో కూర్చోవాలి. గురుమహారాజ్‌జీ, మీ దర్బారునందు ఖాళీ జోలె పట్టుకొని నుంచున్న బిచ్చగాడిని. మీరు ఏమిచ్చినా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ జోలె నిండితే అంతకన్నా పెద్ద జోలె పట్టుకొని నుంచుంటాను. అదీ నిండితే అంత కన్నా పెద్ద జోలె పట్టుకొని నుంచుంటాను. మీరు ఏది ఇచ్చినా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను అని వేడుకోవాలి. ఆ విధంగా సాధకుడు వేడుకోవటం వల్ల గురువుకు పూర్తిగా శరణాగతి కోరినట్లు అవుతుంది. అప్పటికి కూడా ఇంద్రియాలు మాటవిననినాడు గురువును తలచుకొంటే ఇంద్రియాలకు నిగ్రహం లభిస్తుంది. గురునామమే మంత్రమై ఇంద్రియాలకు నిగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
ఆ విధంగా అనన్యమైన చిత్తంతో, అద్వితీయమైన ఆత్మను ధ్యానించాలి. ఆ ఆత్మ పరిమితమైన శరీరంలో ధ్యానింపబడుతున్నా అది అనంతమైంది, అఖండమైంది, నిరంజనమైంది కాన సాధకుడు కూడా అనంతుడు, అపరిచ్ఛిన్నుడు, నిరంజనుడు అవుతాడు. అద్వయమైన ఆత్మ అమరమయింది కాన సాధకుడు కూడా అమరుడవుతాడు. ఆ విధంగా పరబ్రహ్మమైన ఆత్మను తెలుసుకొని సాధనలో నిరంతరం ఆత్మగా అనుభూతినొందుచున్ననాడు అమృత స్వరూపుడుగా రూపుదిద్దుకొంటాడు. త్రికరణ శుద్ధిఅంటే మనోవాక్కాయ కర్మలందు శుద్ధి లభిస్తుంది. దోషరహితుడుగా సంచరిస్తాడు. కాన ప్రతిరోజూ కనీసం ఒక్క గంటసేపైనా విడవకుండా తెల్లవారు జామున సాధన చేస్తూ ఉండాలి. తెల్లవారు జామున బ్రాహ్మీముహూర్తములో కుదరని నాడు రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే ఒక గంటపాటు సాధన చేయాలి. అది అలవాటు అయిననాడు సాధకునికి ఏ రోజు అయినా సాధన చేయలేకపోతే చాలా అశాంతిగా ఉన్నట్లు, ఏదోలా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని వల్ల ధ్యానం అనేది ఎంతటి శాంతిని సుఖాన్ని ఇస్తుందో ఆలోచించి చూడండి. ధ్యానం అనేది మనస్సును తుడిచిన పలకలా తయారు చేస్తుంది, మోసాన్ని త్యాగము చేసి బాలుని మనస్తత్త్వము ఏర్పరుచుకోవాలి.
ఏ సజీవ గురువు ఇచ్చిన జ్ఞానం అయినా సరే, అది ఒక అక్షరం అయినా, ఒక మాట అయినా, ఒక మంత్రం అయినా, ఒక యంత్రం అయినా, ఒక తంత్రం అయినా దాన్నే నమ్మి, ఆగురువునే నమ్మి, విశ్వాసంతో దానికి అనుకూలంగా సాధన చేయాలి. గురుజ్ఞానమే దైవం అని గురుమహారాజ్ జీ గారు చెప్తారు. సాధకునికి ధ్యానంలో హృదయ పాత్ర ఎప్పుడు నిండిదో గురుమహారాజ్‌జీకే తెలుస్తుంది. అది నిండితే అది పగులగొట్టి అంతకన్నా పెద్ద పాత్రను ఇస్తారు. అది కూడా నిండితే అంతకన్నా పెద్దపాత్రను ఇస్తారు. అంటే హృదయం విశాలత చెంది పూర్తిగా ఆత్మతో నిండి పోతూ ఉంటుంది. అనుభూతి పొందుతుంది. శిష్యుడు తీసుకొంటూనే ఉంటాడు. కాన గురువే శిష్యుని ఉన్నతికి బాటను వేస్తారు. త్రిశంకునిలా శరీరంతో పైమెట్టుకు వెళ్ళాలనుకొంటే వీలు కాదు. ఆత్మకు ఒక్కదానికే ఉన్నతికి పైమెట్టుకు చేరటానికి వీలుకుదురుతుంది. హృదయానికి సంబంధించిన తాళం చెవి గురువు వద్దే ఉంటుంది. కాన గురువు మీద విశ్వాసం ఉంచి సాధకుడు నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. గురువు, జ్ఞానం, శిష్యుడు అనేది త్రికోణం. దానిలో ఒకదానికి ఇంకొకటి ముడిపడి ఉంది. జ్ఞానంతో గురువు నిరంతరం శిష్యునితో సంబంధం కలిగి ఉంటాడు.
39 ఆత్మన్యేవాఖిప్రలం దృశ్యం
ప్రవిలాప్య ధియా సుధీః
భావయేదేక మాత్మానం
నిర్మలాకాశవత్సదా || 39
µ³j…¸R…WM = బుద్ధిచేత, అఖిలం సమస్తమైన, దృశ్యం = దృశ్య ప్రపంచాన్ని, ఆత్మని+ఏవ = ఆత్మయందే, ప్రవిలాప్య = లయింపచేసి, నిర్మల+ఆకాశవత్ = నిర్మలమైన ఆకాశం వలె, ఏకమ్+ఆత్మానం = అద్వైయమైన ఆత్మను, సుధీః = బుద్ధిమంతుడు, సదా = ఎల్లప్పుడు, భావయేత్ = ధ్యానించాలి.
తా|| బుద్ధి నైపుణ్యం చేత సమస్తమైన దృశ్య ప్రపంచాన్ని ఆత్మయందే లయింపచేసి, నిర్మలమైన ఆకాశం వలె ఉన్న అద్వయమైన ఆత్మను బుద్ధిమంతుడు ఎల్లవేళలా ధ్యానించాలి.
వివరణ :- క్రిందటి శ్లోకంలో సాధకుడు సాధన ఎట్లా చేయాలో బోధించి ఈ శ్లోకంలో జాగ్రదవస్థలో సాధకుడు బుద్ధిద్వారా దృశ్యప్రపంచాన్ని ఎట్లాదూరంలో చెయ్యాలో సూచించారు. సాధకుడు ఇరవైనాలుగు గంటల్లోను నిద్రావస్థను వదిలివేస్తే మిగిలిన కాలం అంతా ధ్యానంలో కాని లేదా నిస్వార్థమైన సేవాకార్యక్రమంలో కాని, లేదా భగవంతునిలో అనుసంధానం అయి ఉండే కార్యాల్ని చెయ్యటంలో కాని, లేదా ఉచ్ఛ్వాస నిశ్వాసాల యందు మనస్సు లగ్నం చేసి కార్యాల్ని నిర్వర్తిస్తూ గడపటంలో కాని నిమగ్నం చెయ్యాలి. ప్రతి మానవుడు తాను ప్రత్యేకంగా ఉన్నానని భావిస్తుంటాడు. దృశ్యం, దృక్కు, ద్రష్ట వేరువేరని భావిస్తుంటాడు. మూడు ఒక్కటేనని, మూడింటి యొక్క శక్తి ఆత్మయే అయి ఉంది అని, కాన తాను ఆత్మనే కాని వేరు కాదని అనుభవానికి తెచ్చుకొని పరమాత్మగా జీవించటానికే ప్రయత్నం చెయ్యాలి. దాన్నే యోగం అంటారు. యోగం అంటేనే కలయిక. మానవుని మనస్సును ఆత్మతో కలపటం కావాలి. మానవుని శరీరంలో ఉన్నవే రెండు. ఒకటి ఆత్మ, రెండు మనస్సు. అశాశ్వతమైన మనస్సు అనే సేనానిని శాశ్వతమైన, పరాత్పరుడైన ఆత్మ అనే రాజు పరిధిలో లీనమై ఉండేటట్లు చేయటమే చేయవలసిన కార్యక్రమం అంతాను.
ప్రతిమానవునికి ప్రతిక్షణం ప్రత్యక్షంగా ప్రపంచం కనిపిస్తుంటుంది. దానివల్ల రేకెత్తే ఆలోచనలు, ఇంద్రియ చలనాలు, ఉద్రేకాలు, ఆవేశాలు, సుఖదుఃఖాలు వంటివి మానవుని క్షణక్షణం వెంటాడుతుంటాయి. అట్లాంటి స్థితితో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్య ప్రపంచాన్ని విచక్షణా జ్ఞానంతో, వివేచనా పద్ధతితో, అనాత్మపదార్థాల్ని తొలగించుకొంటూ ఆత్మతోనే జీవించాలి అనేది సమస్యగా కనిపిస్తుంటుంది. సాధకుడు ప్రతిరోజు ఆత్మజ్ఞానంతో ఆత్మతో లయిస్తూ ఉండటం వల్ల కనిపిస్తున్న శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా అశాశ్వతాలని తెలుసుకోగలుగుతాడు. ఆత్మ సాధనలో ఏ విధంగా దృశ్య ప్రపంచాన్ని తొలగించుకోగలుగుతున్నాడో అదేవిధంగా జాగ్రదవస్థలో కూడా బుద్ధికుశలతతో దృశ్య ప్రపంచాన్ని తొలగించుకొని ఆత్మతో జీవించాలి. జడ భరతుడు ఏ విధంగా జీవించగలిగాడో ఆ విధంగా సాధకుడు నిద్రలేచినది మొదలు మళ్ళీ శయనించే వరకు ఆత్మతోనే జీవిస్తూ దృశ్య ప్రపంచాన్ని ఆత్మలో లయింపచేయగలగాలి. అంటే సాధకుడు కనిపిస్తున్నవి, ప్రతిఫలిస్తున్నవి అన్నీ కూడా మనస్సు, బుద్ధిచేత ఏర్పడిన దృశ్య ప్రపంచమే కాని అవి తానుకాదని, తాను ఆత్మనని, కనిపించే వాటికి శాశ్వతత్వం లేదని, తాను సాక్షిమాత్రుడనని భావించి, శాశ్వతమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, అనంతమైన, అద్వయమైన ఆత్మతో జీవించాలి.
సాధకుడు శాశ్వతమైంది ఏదో గురు ప్రబోధంతో, గురువు ప్రసాదించిన ఆత్మజ్ఞానంతో తెలుసుకోగలిగాడు. గాఢ నిద్రలో అజ్ఞానంలో ఆత్మతోనే జీవిస్తున్నాడు. సాధనలో కూడా ఆత్మతో జీవించగలుగుతున్నాడు. ఇక పోతే జాగ్రదవస్థలోనే సమస్య ఉత్పన్నమౌతుంది. దాన్ని నివారించుకోవటానికే బుద్ధి కుశలత అవసరం అవుతుంది. జ్ఞానార్జనతో గ్రహించిన విజ్ఞతతో సాధకుడు ఆత్మతో జీవించటానికి అలవాటు పడగలిగిన నాడు ఆతడు కలికితురాయిగా నిలవగలుగుతాడు. సాధకుడు తాత్కాలికమైన వ్యామోహాలకు లోనుకాకుండా, క్షణికానందాలకు తల ఒగ్గకుండా, శాశ్వతమైన సచ్చిదానందం యొక్క ఔన్నత్యాన్ని గ్రహించినవాడై జీవించాలి. అప్పుడు సాధకుడు సాధనలో ఆత్మజ్ఞాని వేషం వేసినట్లు జీవించటం కాక నిజజీవితంలోకూడా, నిత్యకృత్యాల్లో కూడా ఆత్మజ్ఞానివేషంతోనే జీవించగలుగుతాడు. కాని నిరంతరం సాధకుడు జ్ఞానిగానే జీవించటం జరుగుతుంది. దాని వల్ల సచ్చిదానందాన్ని అనుభవించటానికి వీలుకలుగుతుంది. ఇది ఏమైనా అంత తేలికైందా అంటే అది అంత తేలికైంది మాత్రం ఏమీ కాదు. అది అంత తేలికైందే అయితే ఇంత మంది, ఇంత కాలం ఇన్ని రకాలుగా, ఇన్ని శాస్త్రాలుగా ఎందుకు చెపుతూ ఉంటారు? అందుకే ఆ జ్ఞానంలో కొద్దిమందే శిరోధార్యంగా కనిపిస్తూ ఉంటారు. శాస్త్ర పరిశోధనల్లో (సైన్సులో) వంద పరిశోధన ఫలితాలకన్నా అధికంగానే ప్రజల అవసరాలకు, సుఖాలకు, అందించిన ఆల్వా ఎడిసన్ ఏమన్నాడో తెలుసా? ప్రతి పరిశోధన ఫలితంలో నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు శ్రమ, ఒక్కపాలే స్ఫూర్తి ఉంటుంది అని చెప్పాడు. కాన దేనికైనా నిరంతరం సాధన చేయాల్సే ఉంటుంది. కృషీతో నాస్తి దుర్భిక్షం కాన నిరంతర సాధనతో ఆత్మానంద ఫలితాన్ని సాధించి సుఖశాంతుల్ని అనుభవించాలి. ప్రపంచం అనే ప్రిజంను ముందు పెట్టుకొంటేనే ఒకే రంగైన తెల్లని కాంతి అనే ఆత్మ ఏడు రంగులతో కూడిన ప్రపంచంగా కనిపిస్తుంది. ప్రపంచానికి ముందు అద్దాన్ని పెట్టుకొంటేనే ప్రపంచం కనిపిస్తుంది. అట్లాగే ప్రపంచానికి ముందు మనస్సు పెట్టుకొంటేనే ప్రపంచం కనిపిస్తుంది. కాన ప్రపంచానికి ముందు ప్రతి ఫలింపచేసే మనస్సును తొలగిస్తే ఏ దృశ్యం ఉండదు. కాన మనస్సు స్థానంలో అప్పుడు ఆత్మే నిలుస్తుంది. అందువల్ల జాగ్రదవస్థలో కూడా సాధకుడు ఆత్మతోనే జీవించటానికి నిరంతర సాధన చేయాలి. మనస్సును ఆత్మయందు ఏకాగ్రత చెందేటట్లు చేస్తే మనస్సుకు రెండవ విషయం లేకుండా పోతుంది. దాన్ని అర్థం చేసుకోవటానికి స్వప్నావస్థను ఆలోచిస్తే బాగా బోధపడుతుంది. స్వప్నావస్థలో దర్శించిన దృశ్యప్రపంచం అంతా జాగ్రదవస్థలోకి రాగానే స్వప్నదృశ్యమంతా లీనమైనట్లు, మనస్సు జాగ్రదవస్థలో దర్శిస్తున్న దృశ్యప్రపంచం అంతా ఆత్మానుభవంలోకి తీసుకువెళితే దృశ్య ప్రపంచం అంతా లీనమై పోతుంది. ఆ విధంగా మనస్సు ఆత్మలోకి ఉపసంహరింపబడుతుంది. కారణమేమిటంటే లక్ష్యమైంది ఉన్నతమైన ఆనందం కాన అశాశ్వతమైన దృశ్య ప్రపంచం పెద్దగీతలోకి చిన్నగీత లీనమయినట్లు లీనమవుతుంది.
సాధకుడు ఆత్మ సాధనలో బ్రహ్మభావన తప్ప మిగిలిన సంకల్పాలు ఏవీ లేకుండా నిరంతరంసాధన చేస్తూ ఉంటే, ఆ భావన తైలధారలాగా అవిచ్ఛిన్నంగా కొనసాగితే, అది ధ్యానం అవుతుంది. అంతటి ధ్యానసిద్ధిని సాధించినవానికి సహితం జాగ్రదవస్థ సంకల్ప వికల్పాలతో, సుఖదుఃఖాలతో విచ్ఛిన్నకరంగానే మనస్సుకు కనిపిస్తుంటుంది. అట్లాంటి స్థితిలో కూడా సాధకుడు బుద్ధి కుశలతతో ఆత్మయందు నిలుస్తుంటే, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతుంటే, అభేదస్వరూపమైన ఆత్మను అనుభవించగలుగుతాడు. కాన దానిని సాధన చేయాలని శంకరాచార్యుల వారు బోధించారు.
విశ్వమంతా అద్దంలో ఎట్లా కనిపిస్తుందో, ఆత్మలో కూడా ఆ విధంగానే ప్రపంచం అంతా ప్రతిఫలిస్తుంది. ప్రపంచం శాశ్వతమైంది అనే మాయ చేత, ప్రపంచం వెలుపల ఉంది అనే భ్రమ చేత మనస్సులో ప్రపంచం ప్రతిఫలిస్తున్నట్లు అనిపిస్తుంది. అది నిజం కాదు. స్వప్న ప్రపంచం అంతా మెలకువరాగానే మరుగుపడుతున్నట్లు ఆత్మ జ్ఞానోదయం కలుగగానే స్వప్నం వంటి ప్రపంచం అంతా ఆత్మలో లీనమై అభేదస్వరూపంతో సాధకునికి ఆత్మానుభవాన్ని చేకూరుస్తుంది. కావున ఆకాశం వలె సర్వగతమైన ఆత్మలో మనస్సును లయింపచేసి శాశ్వతానందాన్ని సాధకుడు అనుభవించాలి.
40 రూప వర్ణాదికం సర్వం
విహాయ పరమార్థవిత్
పరిపూర్ణ చిదానంత
స్వరూపేణావతిష్ఠతే || 40
LRiWxms ª«sLñRi+ఆదికం=రూపం రంగు మొదలైన, సర్వం=సమస్త ప్రపంచ బంధం, విహాయ = వదలి పెట్టి, పరమార్థవిత్ = పరమేశ్వరుని జ్ఞానాన్ని గ్రహించిన వాడు, పరిపూర్ణ = సంపూర్ణమైన, చిత్+ఆనందస్వరూపేణ=సచ్చిదానంద స్వరూపమై, అవతిష్ఠతే = ప్రకాశిస్తాడు.
తా|| ప్రపంచంలోని నామరూపాది సమస్త బంధాల్ని వదిలిపెట్టి పరమేశ్వరుని జ్ఞానాన్ని గ్రహించినవాడు సంపూర్ణమైన సచ్చిదానంద స్వరూపమై ప్రకాశిస్తాడు.
వివరణ :- ఆత్మజ్ఞానంతో జీవిస్తున్నవాడు తాను దేహాన్నికాదు. ఆత్మను అని జీవిస్తూ లోకంలో ఉన్న వస్తు విషయాల్ని కూడా నామరూపరహితంగా చూసిననాడు చిదానందంతో ఉంటాడు. కనిపిస్తున్న వారిని నామ రూప వర్ణాదులు లేకుండా చూడటమే కాక తనకు కూడా నామరూపాదులులేవని, తనకు ఏ బంధాలు లేవని జీవిస్తాడు. రమణ మహర్షిని భగవాన్ అని పిలిస్తే అది మీరు పెట్టుకొన్న పేరు నాకు నామరూపాలు ఎక్కడివి అన్నారు. రమణ అనే పేరు ఉందికదా అంటే అది కూడా మీరు పెట్టుకొన్నదే, నాకు నామం ఎక్కడిది? నేను నేనే. నాకు నామరూపాలు కల్పింపబడ్డాయి అని ఆయన అంటూ ఉండేవారు ప్రత్యక్షంగా నామరూపాలతో మానవులందరు కనిపిస్తుంటే నామరూప రహితమని ఎట్లా తెలుస్తుంది. అని రమణ మహర్షిని అడిగితే అది అంతా భావనే, అది అంతా ఆచరణలో అనుభ##వైకవేద్యం అవుతుంది అన్నారు. కండ్లు మూసి మనస్సును అంతర్ముఖంచేస్తే ఆత్మజ్ఞానానుభవం తెలిసింది. కండ్లు తెరిచి మనస్సును అంతర్ముఖం చేయటం ఎట్లాగంటే రమణ మహర్షి ''కండ్లు తెరిచి మనస్సును అంతర్ముఖం చేయటం కొంతకష్టమే. దానికి మనోబలం ఎక్కువ కావాలి. ప్రపంచ విషయాలలో తగుల్కొనిన మనస్సు కలుషితమై ఉంటుంది. దానికి విషయాలు లేకుండా ఉంటే నిర్మలమైందే అయి ఉంటుంది. వెలివిషయాల ప్రభావం పడకుండా, అన్యచింతలు మాని తత్త్వపరంగా మనస్సును నిల్పటమే ధ్యానం''అన్నారు. కాన కళ్ళు తెరిచి ఉండగానే ఆత్మజ్ఞానంతో ''పరమార్థవిత్'' అవటం కొంత కష్టమైందే అయినా సాధకుడు లక్ష్యమందు అధికమైన పట్టుదల కలిగినవాడు కాన, మనోబలం ఎక్కువ కలిగి ఉంటాడు కాన, రూప వర్ణాదికాలు లేకుండా ప్రపంచాన్ని, ప్రపంచ విషయాల్ని, ప్రపంచంలోని మనుషుల్ని చూడగలుగుతాడు.
ధ్యానం అంటే విద్యుచ్ఛక్తి దీపాన్ని వెలిగించటానికి స్విచ్‌వేయటం వంటిది. ఆ స్విచ్ ప్రత్యేకంగా విద్యుచ్ఛక్తిని పుట్టించటం లేదు. విద్యుచ్ఛక్తి ఎక్కడికి కావాలో అక్కడికి ప్రవహించటానికి ఒక దారిని ఏర్పాటు చేస్తుంది. అంతే. అది అంతకన్నా అధికంగా ఏమీ చెయ్యటంలేదు. ఈ ఉదాహరణకు అనుకూలంగా జ్ఞాని సంఘంలో ప్రవర్తించే ప్రవర్తనా స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానికి దేహం ఉంటుంది. కాని దేహాత్మ బుద్ధి లేదు. పరిధిలేని కేంద్రబిందువు వంటి వాడుగా జ్ఞాని నిలుస్తాడు. కాన కళ్ళు తెరిచి ఉన్నా మనోబలంతో విద్యుచ్ఛక్తి బల్బుకు స్విచ్ వేసినట్లు నామరూపాలు లేకుండా అఖండ ఆత్మగా ప్రత్యక్షంగా కనిపిస్తున్న వాళ్లను చూడగలుగుతాడు. సుషుప్తిలో ఏ విధంగా అహంకారం నశించిందో ఆ విధంగా జాగ్రదవస్థలో కూడా ఆత్మజ్ఞాని అహంకార రహితంగా ఆత్మతోనే సర్వాత్మగా, వస్తు విషయజాలాన్ని చూడగలుగుతాడు. కానసచ్చిదానంద రూపంలో జీవించగలుగుతాడు. సామాన్య మానవునికైతే ఇది నా శరీరం, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అనే భావనతో నామరూపాత్మకమైన దర్శనం కలుగుతుంది. జ్ఞానికి నాది అనేది ఏదీ లేదు. శరీరం కూడా జ్ఞానికి నాది అనేది కాదు. కాన జ్ఞానికి నామరూపవర్ణాత్మకమైన ఏ బంధాలు ఉండవు. కాన జ్ఞాని సచ్చిదానంద రూపంలోనే జీవించగలుగుతాడు.
రమణ మహర్షి తల్లి ఆయన వద్దనుంచి ఇంకొక కుమారుని వద్దకు వెళ్ళాలనుకొన్నప్పుడు ఆయన ''నీకు ఆత్మానందం కావాలో, పిల్లలు-బంధాలు అనేవి కావాలో బాగా ఆలోచించుకొని వెళ్ళు'' అన్నాడు. ఆ మాటలు విన్న తల్లి వెళ్ళలేక పోయింది. రమణ మహర్షి తల్లిని ఆవిధంగా నామరూప రహితమైన ఆత్మానందం కోసం జీవించమన్నాడే కాని నామరూపాత్మకమైన విధంగా జీవించటానికి సమ్మతించలేదు. ఆయన లోకానికి ఏ జ్ఞానాన్ని బోధించాడో, తల్లికి కూడా అదే జ్ఞానాన్ని బోధించాడు. తాను కూడా అదే ఆచరించాడు. నామరూప వర్ణాదికాలు జాగ్రదవస్థలో తొలగిన నాడే నిజమైన ఆత్మానుభవం కలుగుతుంది. అది ధ్యాన సాధనలో కుదిరిననాడు జాగ్రదవస్థలో కూడా సాధన ద్వారా నామరూప వర్ణాది రహితంగా ప్రపంచాన్ని దర్శించటం అలవరచుకోవాలి. జాగ్రదవస్థలో ఆత్మజ్ఞానంతో నామరూపాదులు లేకుండా జీవించాలంటే (1) గట్టి ప్రయత్నం కావాలి. (2) నేను ఆత్మను అని తెలిసి ఉండాలి. (3) తలపులు, బంధాలు అరికట్టాలి. ''ఒక్క తలంపునైనా, ఏ క్షణకాలమైనా నిలుపగల్గినా, లక్ష్యమైన నిశ్చలతకు అభిముఖంగా ఎంతో ముందుకు సాగినట్లే'' అని రమణ మహర్షి చెప్పి ఉన్నారు. నామ రూప వర్ణ రహితంగా సంఘాన్ని చూడటం అంటే జాగ్రదవస్థలో అందరిలో తాను ఒక్కడుగా జీవిస్తూ ధ్యానస్థితిలో నడవటం అని తెలుసుకోవాలి. ఇది కూడా ఒక రకమైన ధ్యానం. అదే నిజమైన ధ్యానం. అది పట్టుబడిన నాడు సచ్చిదానంద స్థితి స్థిరంగా నిలుస్తుంది. ఇది భావన మాత్రమే కాదు ఆచరణ యోగ్యమై ఉంది. కాన సాధకునికి దీనిలో మహోన్నతమైన స్థితి లభిస్తుంది.
''ప్రతిరోజూ జరిగే పనులు అన్నిటికి సూర్యుడు ఎట్లా అవసరమో చూడు. వానిలో అతడేమీ పాల్గొనడు. అయినా అతని సన్నిధిలో తప్ప అవి జరగవు. ఆ క్రియల సాక్షి అతడు ఎట్లాగో ఆత్మవిషయమూ అట్లే''. అని రమణమహర్షి చెప్పారు. ''కృష్ణుడు నేను కర్తను కాను అయినా కార్యాలు అన్నీ జరుగుతాయి అన్నాడు. కృష్ణుడు తాను కర్తను కాదు అనటం చూడు. ఇది సూర్యుడు లోక వర్తనంలాగా ఉంది'' అన్నారు రమణ మహర్షి. ఆ విధంగా పనులు జరుగుతూ ఉంటాయి. అన్నం తినాలంటే వండాలి. తింటానికి ప్రయత్నం చెయ్యాలి. అవేవీ లేకుండా ఆ కార్యాలన్నీ, ఎట్లానెరవేరతాయి. అయినా వాటిలో దేనిలోను జ్ఞాని కర్తనని అనుకోడు. రమణ మహర్షి తెల్లవారు జామున 4గం||లకే ఆశ్రమంలో కూరల్ని తరగటానికి వంట వాళ్ళను లేపుతున్నది చూస్తే వారు ఆశ్రమ పాలనలో ఏమీ పట్టని మహర్షే అయి ఉండి, ఆయనకు ఏ అవసరం లేకుండానే కార్యాల్లో నిమగ్నం అవటం కనిపిస్తుంది. ఆయన వద్దకు దర్శనానికి వచ్చిన వాళ్ళందరి సమస్యలకు సమాధానాలు ఇచ్చి ఆత్మబోధ చేయటం ఆ విధంగానే కనిపిస్తుంది. ''సగం నిద్రలో ఉన్నబిడ్డకు తల్లి ఆహారం తినిపిస్తుంది. నిద్రలేచాక పిల్లవాడు నేను అన్నం తినలేదు అంటాడు. కాని తిన్నది లేనిది తల్లికి తెలుసుకదా! అట్లాగే జ్ఞాని తాను గమనించకుండానే కర్మలు చేస్తాడు''అని రమణ మహర్షి చెప్పారు.
గురుమహారాజ్‌జీగారు ఒక సందర్భంలో ''ఒక రాముడు దశరథుని కుమారుడు. ఒక రాముడు ప్రతి వ్యక్తి యందు నివసించి ఉన్నాడు. ఒక రాముడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఒక రాముడు వాటన్నిటికీ విలక్షణంగా ఉన్నాడు. ఏ రాముణ్ణి ఏ రాముడి కోసం వదిలేస్తారు. మనం ఎవరిని కొలవాలి. మానవ రూపంలో ఉండి వెళ్ళిపోయిన రాముణ్ణా? అందరిలో అంతటా ఉన్న రాముణ్ణా? ఎవరిని కొలుస్తారు?'' అని అడిగారు. ఆంజనేయుడు అందరి రాముళ్ళను కొలిచాడు అని చెప్పారు. ఆ విధంగా భగవంతుని పేరిట సర్వాంతర్యామి అయిన ఆత్మారాముణ్ణి ప్రతివ్యక్తిలో దర్శించాలని, ప్రతి వ్యక్తిలో ఆ భగవంతుడు ఉన్నాడని మహారాజ్‌జీ అద్వైతాన్ని ప్రబోధించారు.
జ్ఞాని నామరూప రహితంగా దర్శిస్తూ ఉంటాడు. ఆత్మకు సంబంధించిన అవరోధాలన్నీ ఆత్మ జ్ఞానం చేత దాటి ఉత్తమ మానవుడుగా మానవత్వంతో జీవించ గలుగుతాడు. సమస్తమైన నామరూపాత్మక మంతా మిథ్యే అని బోధించ గలుగుతుంటాడు. ఈ విధమైన పరతత్త్వ బోధతో స్థిరత్వం పొంది బ్రహ్మేతర భ్రాంతి లేకుండా జీవించగలుగుతుంటాడు.
41 జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదః
పరే నాత్మని విద్యతే
చిదానందైక రూపత్వాత్
దీప్యతే స్వయమేవహి || 41
xmslLi[ = పరమమైన, ఆత్మని = ఆత్మ యందు, జ్ఞాతృ = ద్రష్ట, జ్ఞాన = దృష్టి, జ్ఞేయ = దృశ్యం (అనే త్రిపుటి), భేదః = భేదాలు, న విద్యతే = లేవు, చిత్+ఆనంద+ఏకరూపత్వాత్ = చిదానంత స్వరూపం ఒక్కటే అవ్వటం చేత, హి = నిజంగా, స్వయమ్+ఏవ = స్వతస్సిద్ధంగా, దీప్యతే = ప్రకాశిస్తుంది.
తా|| శ్రేష్ఠమైన ఆత్మయందు అనగా పరమేశ్వర స్వరూపమైన స్వచ్ఛమైన ఆత్మయందు తెలుసుకొనే మనస్సు, తెలుసుకోవటానికి ఉపకరించే జ్ఞానం, తెలియబడేటటువంటి జగత్తుతో కూడిన దృశ్యం అనే త్రిపుటి భేదాలు ఏవీ లేవు. అది సత్ చిత్ ఆనంద స్వరూపం అయి ఉండటం వల్ల దానంతట అదే ప్రకాశిస్తుంది.
వివరణ :- మానవుడు జన్మించింది మొదలు ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచం అనే పుస్తకాన్ని జ్ఞానార్జన అనే పేరు మీదుగా నిరంతరం చదవటానికి ప్రయత్నిస్తుంటాడు. ఎంత ఎక్కువగా ప్రపంచాన్ని తెలుసుకొంటే అంత ఎక్కువగా జ్ఞానం కలవాడను అనే భావనతో తృప్తి చెందుతుంటాడు. ఆ విధంగా మానవుడు తన సర్వశక్తి యుక్తుల్ని బహిర్ముఖంగా ఉపయోగిస్తూ జీవిస్తుంటాడు. తన శరీరంలోని ఇంద్రియాలతోనే తనను తాను తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆలోచించటానికి ఏనాడు ప్రయత్నం కూడా చేయడు. ఆత్మజ్ఞానం అనే ప్రత్యేక విషయం మానవుని ముందుకు రాగానే తనను తాను తెలుసుకోవటానికి పూనుకొంటాడు. అప్పటి వరకు ఆతడు చేస్తున్న ప్రతికార్యమందు జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయాలనే మూడు విభాగాలున్నాయి అని తెలుసుకొంటాడు. ''జ్ఞాతృ'' అంటె తెలుసుకొనేవాడు లేక ద్రష్ట లేక కర్త అంటే విషయాన్ని తెలుసుకొనే మనస్సే జ్ఞాత అవుతుంది. ''జ్ఞానం'' అంటే తెలివి లేక దృష్టి-దృక్కు లేక కర్మ అంటే జ్ఞేయాన్ని తెలుసుకోవటానికి ఉపకరించేదే జ్ఞానం అవుతుంది. ''జ్ఞేయం'' అంటే తెలుసుకోబడేది లేక దృశ్యం అంటే జగత్తు తెలియబడుతుంది గనుక జ్ఞేయం అవుతుంది. ఈ మూడింటిని కలిపి త్రిపుటి అంటారు. ఈ మూడింటికి శక్తిని ఇస్తుంది, చైతన్యంతో నడిపిస్తుంది ఆత్మే. కాని ఆత్మ సాక్షిమాత్రంగా ఉంటుంది. ఆత్మ మార్గంలో ఆత్మజ్ఞానంతో సంచరిస్తున్న సాధకుడు పరమాత్మ స్వరూపంగా శుద్ధచైతన్యంతో ఉన్నప్పుడు తెలుసుకొనే మనస్సు, చూసే కన్ను, చూడబడే దృశ్యం ఏవీ లేవు. దృక్కు, దృశ్యం రెండు భ్రాంతియే అవ్వటం వల్ల శుద్ధచైతన్యం మనస్సులో ప్రతిఫలించదు. మనస్సు ఆత్మలో లీనమైపోతుంది. అంటే మనస్సు అచేతనం అవుతుంది. అంటే మనస్సు కోరికలు, ఆలోచనలు లేని స్థితికి చేరుతుంది. దాని వల్ల శుద్ధచైతన్యంలో జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయమనే భేదాలు ఏవీ లేకుండా అది సచ్చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తుంది. గాఢ నిద్రాస్థితిలో ఏ విధమైన వస్తు రహితస్థితిని సాధకుడు అనుభవిస్తున్నాడో, మెలకువగా ఉన్న జాగ్రదవస్థలో కూడా ఆ విధమైన వస్తురహిత చైతన్యాన్నే అనుభవిస్తాడు. దీన్నే మేలుకొన్న సుషుప్తి అంటారు. అంటే సాధకుడు సాధనలో ధ్యానానుభవాన్ని పొందుతున్నట్లే, జాగ్రదవస్థలో కూడా మేలుకొని నిద్రపోవటం అనే అనుభవాన్ని పొందుతాడు. దానివల్ల సాధకుడు అందరిలో ఉంటూనే సచ్చిదానందాన్ని అనుభవిస్తూ స్వయంప్రకాశంగా ఉంటాడు.
ఇక్కడ సచ్చిదానందానికి ఏకాగ్రతకు గల వ్యత్యాసాన్ని వివరిస్తాను. సాధకుడు ప్రత్యక్షంగా ఇంట్లోనే కూర్చోని ఉంటాడు. పక్కనే అనేకం జరుగు తుంటాయి. తన ముందు నుంచే పిల్లవాడు బయటకు వెళ్లిపోతుంటాడు. ఇంట్లో వాళ్ళు ఆయన ఈ పిల్లవాడిని పట్టుకొంటాడనుకొంటారు. పట్టుకోడు. ఆయనకు కావలసిన వస్తువులన్ని ఆయన ముందు తెచ్చిపెడతారు. అవేవీ ఆయన పట్టించుకోడు. ఆ పిల్లవాడు మీ ముందునుంచేవెళ్ళాడు కదా? చూడలేదంటారు ఏమిటి? మీముందే అవన్నీ పెట్టాంకదా? అట్లా ఏమి చూడనట్లు వింతగా చూస్తారేమిటి? అంటారు. ఆ సాధకునికి కళ్ళముందు జరుగుతున్నవే అయినా ఆతనికేమీ తెలియవు. ఆతని కళ్ళు తెరిచే ఉన్నాయి. దృశ్యాలన్నీ కళ్ళముందు జరిగాయి. అయినా ఆ సాధకునికి అవేవి పట్టలేదు. సాధకునికి కళ్ళుతెరిచి ఉన్నా దృష్టి లేక దృక్కు పని చేయటం లేదు. దృశ్యం కూడా కళ్ళ ముందే ఉన్నా దృశ్యం యొక్క ఆవశ్యకత సాధకునికి పట్టలేదు. కాన రెండూ లోపించటం వల్ల దాని కోసం పనిచేసే ద్రష్ట అయిన మనస్సు కూడా అచేతనమై ఉండి పోయింది. ఆ విధంగా సాధకుడు లోకంలో ఆత్మ జ్ఞానానుభవంతో ఉండటమే చిదానందంలో ఉండటం అవుతుంది. అంటే మెలకువగా ఉండగానే, అవయవాలన్నీ పనిచేస్తున్నట్లు కనిపిస్తుండగానే ఏవీ పనిచెయ్యని స్థితిలో ఆనందం చేకూరే స్థితి సాధకునికి లభించింది. దాన్నే అవధూత లక్షణం అంటారు.
దీనికి వ్యతిక్రమంగా ఇంకొక ఉదాహరణ వివరిస్తారు. పిల్లవాడు పరీక్షకు వెళ్ళుతున్నాడు. డిస్టింక్షను కాదు, గోల్డుమెడల్ కొట్టాలనే లక్ష్యసాధనలో ఉన్నాడు. పోస్టుగ్రాడ్యుయేషన్‌లో మొదటి సంవత్సరంలో అంతటి ఉన్నత స్థితిలోనే ఉన్నాడు. ఈ ఏడు కూడా అట్లాగే మార్కులు పొందగలిగితే తన లక్ష్యం నెరవేరుతుంది. అందువల్ల పిల్లవాడు చదివే విషయంలో నిమగ్నమై ఇంట్లో సంచరిస్తున్నాడు. అతని ముందే కాఫీ పెట్టినా చూడలేదంటాడు. అతని ముందే ఇతరమైన అనేక విషయాలు జరుగుతున్నా ఏవీ చూడలేదంటాడు. ఏవీ తెలియవు అంటాడు. మరి ఏమి చేస్తున్నట్లు అన్నీ చూస్తున్నట్లే కనిపిస్తుంది. కానీ అతని కళ్ళు అతని ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాధానాల మీద లగ్నమై ఉన్నాయి, చేతిలో పుస్తకం కూడా లేదు. ఏమీ ముందు లేకుండానే రాయవలసిన విషయాన్ని మననం చేసుకొంటున్నాడు. కాన అతనికి దృశ్యం ఉంది. దృక్కు ఉంది. మనస్సుపని చేస్తుంది. ఇక్కడ విద్యార్థి ఏవీ కనపడటం లేదంటున్నాడే కాని అంతర్ముఖంగా ధారణ-ధ్యానాలు చేస్తున్నాడు. ఆతని మనస్సు కళ్ళు, సమధానాలనే దృశ్యం అన్నీ చైతన్యంతో కూడి ఉన్నాయి. ఇది కూడా జాగ్రదవస్థలోనే జరుగుతుంది. ఇది సచ్చిదానందం కాదు. ఇది ఏకాగ్రత సచ్చిదానందానికి, ధారణ-ధ్యానాలకు గల వ్యత్యాసాన్ని బాగా ఈ ఉదాహరణలు పోల్చి చూసుకొంటే బాగా ఉపకరిస్తాయి అనుకొంటున్నాను.
జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయాలు అనే త్రిపుటిలేని జాగ్రదవస్థను సాధకుడు అనుభవించినప్పుడు మాత్రమే మెలకువగా ఉన్నప్పుడు సచ్చిదానందం చేకూరుతుంది. పరీక్షరాయాలనే పిల్లవానికి కూడా ఏకాగ్రత ఉంది, విషయంలో అంటే లక్ష్యంలో లీనమై పొందే ఆనందం ఉంది. రెండూ ఉన్నాయి కాని అది సచ్చిదానందం కాదు. బాహిరంగా జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయాలు లేనట్లు కనిపిస్తున్నాయి కదా అన్నా సచ్చిదానందం అనుభవిస్తున్న సాధకునికి దీనికి వ్యత్యాసం ఉంది. విద్యార్థికి పరీక్ష అనే ఆందోళన ఉంది. గోల్డుమెడలు కొట్టాలి అనే కోరిక వెంటాడుతుంది. రాయటానికి నెమరు వేయవలసిన విషయంపై మనస్సు విపరీతంగా శ్రమపడుతుంది. ఆ విధంగా పరీక్ష రాయాలనే కుర్రవానికి ఏ మాత్రం విశ్రాంతి లేకుండా, లోకం ఏమీ పట్టకుండా, నిరంతర శ్రమలో లీనమై ఉన్నాడు. అందులో అతడు పొందే ఆనందం పరిచ్ఛిన్నమైంది. తాత్కాలికమైంది. అతడు చేస్తున్న పని ఏకాగ్రతకు సంబంధించింది మాత్రమే అవుతుంది. సచ్చిదానందం కాదు. సచ్చిదానందం గాఢనిద్రాస్థితి వంటిది. తురీయానికి చేరటానికి చేరువైన స్థితి. నిర్వికల్ప సమాధికి ముందు అనుభవిస్తూ ఉండే సవికల్ప సమాధి స్థితి. ఇంత వివరణలు అవసరమా? సాధకునికి స్వాభావికంగా, సహజ సిద్ధంగా గురుకృపతో అనుభవాలన్నీ అతని యోగ్యతను బట్టి వస్తూ తెలుస్తూ ఉంటుంది గనుక ఇవి చదవటం వల్ల అతని అనుభవాలు కల్పితములయ్యే ప్రమాదముంది. యోచించండి. అనేవారుంటారు. అది తప్పు. సాధకునికి విషయం తెలియాలి. ఆ విధంగా సాధకుడు ఆత్మజ్ఞాన సాధనలో జాగ్రదవస్థలోనే జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయాలు అనే స్థితులు ఏవీ లేకుండానే చిదానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు!
సత్, చిత్, ఆనందాలనే అస్తి, భాతి, ప్రియ అని అంటారు. అస్తి అంటే ఉంది అని. ఏది ఉంది? ఏది శాశ్వతమైందో, ఏది శక్తిమంతమైందో ఏది నిజమైందో, ఏది సత్యమైందో అది ఉంది అని. లోకంలో సత్యం పలికితే ఇన్ని గొడవలు లేవురా? అందుకే ఉన్నది ఉన్నట్లు చెప్పరా నాయనా! సత్యం కావాలి అంటారు. కాన ఇక్కడ సత్యం అంటే ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవటానికే 'సత్' అన్నారు. నిద్రలోని ఆత్మే 'సత్' అని రమణ మహర్షి చెప్పారు. అస్తి అనే పదం మీద నుంచే అస్తికులు అనేపదం వచ్చింది. అంటే ఆత్మ ఉంది అనే వాళ్ళే ఆస్తికులు అయ్యారు. ఆత్మ లేదు అనే వాళ్ళే నాస్తికులు అయ్యారు. ఏది సత్యమైందో, ఏది శక్తిమంతమైందో, ఏది శాశ్వతమైందో అది లేదు అని నాస్తికులు అంటున్నారు. ఏ శక్తి నాస్తికులు నమ్ముతున్నారో ఆ శక్తి శరీరానికి సంబంధించి స్వతస్సిద్ధంగా ఉత్పన్నమైందే కాని శరీరానికి వేరుగా ఇంకొక శక్తి అనేది ఏదీ లేదు అని నాస్తికులు అంటున్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు మూలాధారాలైన ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి వంటి పాంచ భౌతికాలు కలిసి ఉత్పన్నమైన శ##క్తే శరీరంలో ఉత్పన్నమైందని, అది సర్వసహజమని, ఒకదానితో ఒకటి కలిసి నిలవ ఉంటే, మురగబెడితే, పులిస్తే అందులోంచి మరొకరకమైన మార్పుతో కూడింది వస్తుంది కదా? ''కల్లు, సారా వంటి మత్తుపానీయాల్ని తయారు చేసే రకరకాల పదార్థాలు ఏవీకూడా వాటికవి మత్తును కలిగించవు. కాని వాటిని తగుపాళ్ళలో కలిపి మిశ్రమం చేస్తే వాటిలోంచి నిషావస్తుంది. అట్లాగే గాలి, నిప్పు, నీరు, నేల కలిసి చైతన్యయుతమై యాదృచ్ఛికంగా శరీరంలో చైతన్య శక్తి ఉద్భవించిందని చార్వాకులు 2500 సం|| క్రితమే వాదించారు'' నిర్జీవ పదార్థం నుంచి సజీవ పదార్థం పుడుతుంది కదా? అట్లాంటి రూపంలోనే శరీరంలో శక్తి వచ్చింది అని నాస్తికులు అంటున్నారు. పసుపు సున్నం కలిపితే పారాణి అవుతుంది కదా! అట్లాగే పాంచభౌతికాల్లో ఆకాశాన్నివిడిచి మిగిలిన నాలిగింటిని తీసుకొని వాటి వల్లే యాదృచ్ఛిక చైతన్యం వచ్చింది అని చార్వాకులు అనేక సంవత్సరాలు వాగ్వివాదాలు చేసి సాంఘిక రాజకీయచైతన్యాన్ని తేగలిగారే కాని ఆత్మానుభవం దగ్గరకు వచ్చేటప్పటికి వారి వాదం తేలిపోయింది. నిర్వికల్ప సమాధి పొందిన బ్రహ్మం గారిని ఉదాహరణగా స్వీకరిస్తే ఆ విషయం బాగా అర్థం అవుతుంది.
బ్రహ్మంగారి శిష్యుడైన ముస్లింను అడివినుంచి ఏవో కొన్నితెమ్మని బ్రహ్మంగారు అతనిని అడివికి పంపారు. ఆ రెండవ రోజు బ్రహ్మంగారు సమాధి అయ్యారు. ముస్లిం శిష్యుడు దగ్గర లేకుండా సమాధికావాలని, అతడు ఉంటే సమాధికి సమ్మతించడని బ్రహ్మంగారు ఆ విధంగా చేశారు. అడివిలో వారం రోజులు వెతికి, వెతికి కావలసినవి దొరకక ఆవేదన పడుతూగురువును చూడాలని ఆ ముస్లిం శిష్యుడు ఆశ్రమానికి వచ్చేశాడు. గురువుగారు సజీవ సమాధి అయ్యారని అక్కడ ఉన్నవారు చెప్పారు. దాన్ని సహించలేక ఆ ముస్లిం శిష్యుడు ఆ సమాధిని పగులగొట్టి లోనికి వెళ్ళి గురువుగారిని కదిపి, కదిపి, నానా యాతన పడి ఒక గంటకు బ్రహ్మంగారిని మామూలు స్థితికి తేగలిగాడు. బ్రహ్మంగారు ఆ శిష్యుని ఓదార్చి పంపి మళ్ళీ సమాధిని మూయించేశారు. వారం రోజులు ఆహారపానీయాలు లేకుండానే బ్రహ్మంగారు నిర్వికల్ప సమాధిలో ఉండటం అందరూ చూశారు కదా! ఆ సమాధి స్థితి నుంచి ఆయనను మామూలు స్థితికి తీసుకు రావటానికి గంట ప్రయత్నం చేయవలసి వచ్చింది కదా! ఇక్కడ శరీరంలోనే శరీరానికి వేర్పాటుగా ఆత్మశక్తి అనేది ఒకటి ఉంది అని అర్థం అవుతుంది గదా! నాస్తికులు ఆత్మ విషయాన్ని ఆ విధంగా వివేకంతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలే కాని ముసలి పీనుగులు చావబోయే ముందు సజీవ సమాధి అంటారు అని నిందించుకొంటూ విషయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించటం తగిందికాదు. దీనికి ఇంకొక ఉదాహరణను కూడా వివరిస్తాను. పాలుకాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటిలో కాస్త పెరుగు తోడు పెడితే దాన్ని కదపకుండా ఒక రకమైన వాతావరణంలో పెడితే అది తోడుకొంటుంది. ఎక్కువ శీతలంగా ఉండే ఫ్రిజ్‌లో పెడితే అది తోడుకోదు. ఎక్కువ వేడితగిలే ఏ పొయ్యిప్రక్కనన్న పెడితే అదితోడుకోదు. దాన్ని అటు ఇటు కదిపినా అది తోడు కోదు. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటే పాలు తోడు కొని పెరుగును ఇస్తుంది. ఆ పెరుగును చిలికి మజ్జిగ నుంచి వచ్చిన వెన్న ఆ మజ్జిగలో మునగదు. అట్లా వెన్నలాగా శరీరంలోనే ఉన్నట్లు కనిపిస్తున్న ఆత్మే శరీరంతో కలిసి సంచరిస్తున్నట్లే ఉన్నా ధ్యానం ద్వారా దాన్ని వేర్పరిచి, కేంద్రీకరించి దాని స్థానంలో దాన్ని ఉంచిననాడు, శరీరానికి ఏ సంబంధం లేకుండానే నిర్వికల్ప సమాధిలో ఆత్మ నిలుస్తుంది. కాన శరీరం ఉండగానే ఆ విధమైన స్థితిని పొందటానికి, సచ్చిదానందాన్ని అనుభవించటానికి, ప్రయత్నం చేసి, ఎవరికి వారు ఆనందాన్ని అనుభవించాలి.
''అస్తి''ని గురించి తెలుసుకోవటానికి మొదలు పెట్టి నిర్వికల్ప సమాధి స్థితివరకు చెప్పుకొంటు వచ్చాం. ఇప్పుడు 'భాతి'ని గురించి చెప్పుకోవలసి ఉంది. సూర్యోదయాన్ని సుప్రభాతం అంటాం కదా! అట్లాగే ప్రభాతం అన్నా ప్రకాశ##మే. ప్ర అనే అక్షరాన్ని తొలగించి భాతము అన్నా ప్రకాశ##మే, కాంతే. భాతము అనే పదం నుంచే 'భాతి' అనే పదం వచ్చింది. భాతి అన్నా కాంతే. దాన్నే చిత్ అంటారు. 'ప్రియం' అంటే ఇష్టం, ఆనందం అని అర్థం. వస్తువులు మార్కెట్టులో దొరక్కుండా, ధరపెరిగిపోతే ప్రియం అయిపోయింది అంటాం కదా! అందరికి దాని అవసరం ఎక్కువ అయిన కొద్దీ అందరికి అది ఇష్టం అయి ప్రియం అయిపోతుంది. లోకంలో అందరికీ ఆత్మ ఇష్టమయిందే అయిపోతే అది కూడా ప్రియం అయిపోతుంది. ఆ విధంగా అస్తి, భాతి, ప్రియాలు కలిసి సచ్చిదానందం అయ్యాయి. ఈ సచ్చిదానందంతో జీవించటానికి లోకంలో ఇతరులను ప్రేమించాలి. ఇతరుల చేత ప్రేమింపబడాలి. ఇతరులను ఆత్మగా గౌరవించి, ఆత్మగా గౌరవింప బడాలి. ఇతరులను మనం సరిగా చూడకపోతే ఇతరులు మనలను ఎందుకు సరిగా చూస్తారు. ఇతరులకు సుఖశాంతులు ఇవ్వకపోతే ఇతరులు మనకు సుఖశాంతులు ఎందుకు కలుగనిస్తారు. సామాన్య మానవులు పైకి మేకతోలు కప్పుకొని ప్రవర్తిస్తున్నప్పటికి కుల, మత, జాతి, లింగ భేదాలు ఎదురయినప్పుడు సర్వ సహజమైన జంతులక్షణాలతో నక్కలాగానో, తోడేలుగానో ప్రవర్తిస్తుంటే ఎదుటివారు పులిలాగానో, సింహంలాగానో ప్రవర్తించకుండా ఉండటానికి వీలవుతుందా? నేనే గొప్పవాడిని, నా మంత్రమే గొప్పది. నా పూజే గొప్పది, నా సాకారరూపమైన నా దేవుడే గొప్పవాడు అంటూ ఈ విధమైన భేదాలతో ఎదుటి వారిని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు ఎంతకాలం అని సహించి అణిగిమణిగి ఉంటారు? మతం పేరిట మారణహోమాలు సృష్టిస్తుంటే శాంతి ఎక్కడిది? సుఖం ఎట్లా వస్తుంది? దేవుని గుళ్ళోకి వెళ్ళి మోగించే ఘంటానాదం, వెలిగించే దీపారాధన, అర్పించే హారతి కర్పూరం వంటి వాటి యొక్క ప్రతీకలైన నాదాన్ని, జ్యోతిని, అంతర్ముఖంగా అనుభవించటానికి ప్రయత్నించి సచ్చిదానందాన్ని అనుభవించకుండా త్రిపుటితోనే అంటే జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయాలతోనే జీవిస్తూ ఉంటే ఆనందం ఎట్లా లభిస్తుంది? శరీరం ఉండగానే, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకొని జీవించిననాడు మానవులు వ్యక్తులుగా గాక సర్వశక్తి సంపన్నులుగా మారతారు. ఆత్మారాధనలో ఆత్మశక్తిగా మారితే వ్యక్తిగా ఉన్నా అనంతశక్తిగా మారతారు. అన్ని మతాలవారు, అన్ని జాతులవారు, అన్నికులాల వారు ఒక్కటే అయిన ఆత్మకల వాళ్ళు అని అనుకొంటే అనంతశక్తిగా రూపొంది శాంతి సౌఖ్యాలతో జీవిస్తారు. ఆత్మశక్తితో జీవించి, ప్రపంచ శాంతిని స్థాపిద్దాం అంటారు గురుమహారాజ్‌జీ గారు. అట్లాంటి శాంతి కోసం ''సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి సాయపడదాం'' అనే దాన్ని ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించిననాడు జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయాలు అనే త్రిపుటి లేకుండా అంతా ఆత్మగా పరిణామం చెంది, వ్యక్తి శక్తిగా జీవించటానికి వీలు కుదురుతుంది. తోటి వాళ్ళను కల్మషంతో, కశ్మలంతో చూస్తుంటే సుఖశాంతులు ఎట్లా లభిస్తాయి? దుఃఖమే మిగులుతుంది. ఆత్మ అయిన భగవంతుడు అందరిలో ఉన్నాడు. కాని మహాత్ముల హృదయాల్లో ఆయన ప్రకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అట్టి మహాత్ములు జాగ్రదవస్థలో కూడా సచ్చిదానందాన్ని అనుభవిస్తూ, ప్రకాశమానంగా వెలుగొందుతారు. అట్లాంటి సచ్చిదానందాన్ని అనుభవించటానికి బద్ధ కంకణులై ప్రయత్నం చేసి సాధించాలి.
42 ఏవ మాత్మా రణౌ ధ్యాన
మథనే సతతం కృతే
ఉదితావ గతిర్జ్వాలా
సర్వాజ్ఞానేంధనం దహేత్ || 42
Gª«sLi = ఈ విధంగా, ఆత్మ = ఆత్మ అనేటటువంటి, అరణౌ = అగ్ని పుట్టించటానికి కొయ్య మధ్య భాగంలో గుంటగా చేసి ఉపయోగించుకోవటానికి అనుకూలంగా ఉన్న కొయ్యలో, సతతం = ఎల్లవేళల, ధ్యానమథనే = ధ్యానమనే దాన్ని ఒరిపిడి పెట్టి త్రచ్చుట అనేటటువంటిది, కృతే = జరిగితే, ఉదిత = పుట్టిన, అవగతిః = తెలివి అనే, జ్వాలా = అగ్ని,
సర్వ+అజ్ఞాన+ఇంధనం = సమస్తమైన అజ్ఞాన మనే కట్టెలను, దహేత్ = దగ్ధం చేయును.
తా|| ఈవిధంగా ఆత్మ అనే అరణిలో ఎల్లవేళల ధ్యాన మనే మథనం జరిగితే తెలివి అనే అగ్ని పుట్టి సమస్తమైన అజ్ఞానమనే కట్టెల్ని దహించి వేస్తుంది.
వివరణ :- అరణి ః హోమ క్రతువును ఆచరించటానికి అయిదుగదులతో కూడిన హోమ గుండం ఉంటుంది. ఆ అయిదు గదుల్లో రెండు గదులు ఖాళీగా ఉంటాయి. మూడు గదుల్లో మాత్రం అగ్ని ఉంటుంది. ఆ మూడు గదుల్లో ఉన్న అగ్నిని ఆహవనీయం. దక్షిణాగ్ని, గార్హపత్యం అని అంటారు. వాటినే త్రేతాగ్ను లంటారు. పవిత్రతకు ఆ త్రేతాగ్నుల్ని పోలుస్తుంటారు. ఆ త్రేతాగ్నులను అరణి నుండే ఉద్భవించేటట్లు చేస్తారు. రెండు కట్టెల మధ్య గుండ్రంగా ఉన్న గుంటల్ని చేసి, రెండు వైపుల గుండ్రంగా తయారు చేసిన ఒక చిన్న కట్టెను ఆ రెంటి మధ్య ఉంచి, దాన్ని రెండు కట్టెల చేత అదిమి పెట్టి మథించటం చేత ఆ ఒరిపిడికి అగ్ని పుడుతుంది. ఆ అగ్నిని బాగా రాజిల్ల చేసి అగ్నికణాల్ని చేస్తారు. అవి హోమగ్నులుగా ఉంచి మూడు పూటల హోమద్రవ్యక్రతువు నెరవేరటానికి సమిధలనే రావికట్టెల్ని వేస్తారు. ఆ విధంగా హోమాగ్ని ఇరవైనాలుగు గంటలు రగులుతుంటుంది. అవి పోతే మళ్లీ మంచి ముహూర్తం చూసి ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది కాన మూడు పూటల అగ్నిహోత్రకార్యక్రమాన్ని నెరవేర్చుకొంటూ వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కాన అరణి అనగానే అందులో అంతటి పవిత్ర భావం కలిగి ఉంది. కట్టె, కట్టె రాస్తే అగ్ని వచ్చే రోజులు నుంచి స్విచ్ఛి వేస్తే అగ్ని వచ్చే రోజుల వరకు అభివృద్ధి చెంది ఉన్న పరిస్థితుల్లో కూడా అగ్నిహోత్ర క్రతువుకి కావలసిన అగ్నిని ఇప్పటికీ ఆ విధంగానే తయారు చేసుకొంటున్నారు. అరణిని ఉదహరించటంలో అగ్నిని పుట్టించటానికి ఆచారం, సంప్రదాయం వంటివి ఎంతటి అధిక ప్రాధాన్యాన్ని వహించి ఉన్నాయో అదేవిధంగా ఆత్మ జ్ఞాన సాధనమందు సాధకుడు అధికమైన శ్రమ, పట్టుదల, ఓర్పు, ఆత్మవిశ్వాసం, గురు జ్ఞానమందు నమ్మకం, గుర బోధయందు నమ్మకం కలిగి సంచరించటం వంటివి ప్రధానమైన విషయాలుగా స్వీకరించి సాధన చేయాలని బోధించినట్లున్నది. అరణికిపైన ఉంచిన కట్టెను ఉత్తరారణి అని క్రింద ఉంచిన కట్టెను అధరారణి అని అంటారు. ఆత్మ అనే అరణిలో ధ్యానం అనే మథనం జరగాలి అంటేఒక ప్రక్కన మనస్సు దాని ఆధిక్యంతో మానవుని నడపటానికి నిరంతరం అది సాధనచేస్తుంటే, దాని అధికారాన్ని అరికట్టి కాలికొనగోరు నుంచి తలమీది వెంట్రుకకొన వరకు వ్యాపించి ఉన్న ఆత్మను భ్రూమధ్యం దగ్గరకు తీసుకురావటానికి రెండవ ప్రక్కన ఆత్మజ్ఞానంలో నిరంతర సాధన చేయాలి. అరణిలో ఒక వైపు ఆత్మను, మరొకవైపు మనస్సును ఉంచి సాధకుడు ఆత్మధ్యానమనే మధ్యకట్టెతో మథనం చెయ్యాలి. సాధకుని సాధన వల్ల మనస్సు యొక్క ఆధిక్యతను అరికట్టటానికి వీలవుతుంది. ఆ విధంగా సాధకుడు సాధన చేస్తుంటె అజ్ఞానమనే కట్టెలు ఆటంకంగా నిలుస్తాయి. అజ్ఞానమనే ఆటంకాలు ఏమిటి అంటే పంచభూతాల చేత ఏర్పడిన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, ప్రపంచం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం, దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన, రాగద్వేషాది గుణసముదాయం అయి ఉన్నాయి.
ఆత్మ సాధన అనే ఉన్నతమైన ఆశయమే సాధకుని మనస్సును అదుపులోకి తెస్తుంది. ఆత్మానందంలో లీనమవ్వాలనే ఆదర్శమే అతనిని నిరంతరం లక్ష్యం వైపుకు నడుపుతుంది. దానికి అనుకూలంగా జీవించటానికి విరామం దొరకినప్పుడల్లా ఆత్మజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలనే చదువుతుండాలి. మత, సాంఘిక, రాజకీయ ద్వేషాలకు సంబంధించిన గ్రంథాలను ఆతడు చదవకూడదు. అతడు ఆత్మతోనే మనస్సు కలిసి ఉండేటట్లు, గురు జ్ఞానంతో, ఆత్మమార్గంలో నడుస్తూ ఉండటం వల్ల ఆతని మనస్సుకు శాంతి లభిస్తుంది. దాని వల్ల అతని మనస్సులో క్రమేపి ఆలోచనల సంఖ్య తగ్గుతుంది. ఆత్మజ్ఞానంతో మనస్సును మథిస్తూండటం వల్ల ఆతనికి పాత స్మృతులు తగ్గుతాయి. ఆ విధంగా సాధకునికి మనస్సనే ప్రవాహం నిలకడగా ప్రవహించే స్థితికి వస్తుంది. దానికితోడు ఆతనికి రేపు ఏమవుతుందనే భయంతోనో, ఆందోళనలతోనే, ఆశలతోనే జీవించవలసిన అవసరం లేకపోవటంవల్ల ఆతనికి క్రమక్రమంగా మనస్సు నెమ్మదించి శాంతి సౌఖ్యాలను చేకూరుస్తుంది. కావున అరణిలో అగ్నిని రగిలేటట్లు చేయటానికి ఎంత ఓర్పుతో ప్రయత్నం చేయటం జరిగిందో అంత ఓర్పుతోనే మనస్సును ఆత్మతో లయింప చేసి జ్ఞానాగ్ని రగిలేటట్లు నిరంతరం కృషిచేయాలి. సాధకునికి సాధనలో జ్యోతి కనిపించినా, శబ్దం వినిపించినా సాధన నెరవేరిందని భ్రమప్రమాదాలకు లోనవ్వకూడదు. ఆత్మ యొక్క చైతన్య కిరణాలను శరీరం నుంచి వేరు చెయ్యటం ఏమంత తేలికైన పని కాదు. ఇది అతి నెమ్మదిగా నడిచే పద్ధతి. ఎన్నో సంవత్సరాలుగా బయట తిరగటానికి అలవాటుపడిన మనస్సును అదుపులోకి తెచ్చి అంతర్ముఖంగా నిలపటానికి తొందరలో సాధ్యమయ్యే పనికాదు. నిరంతర సాధన వల్ల మనస్సు ఆత్మలో లీనమవటానికి వీలు కుదురుతుంది. ముళ్ళమీది గుడ్డను తీయటానికి ఎంత జాగ్రత్తను తీసుకొంటామో అంత జాగ్రత్తను తీసుకొని ఆత్మను ఒక చోట చేర్చి మనస్సును అందులో నిలిపేటట్లు సాధన చెయ్యాలి. ముళ్ళమీది గుడ్డను తియ్యటానికి అశ్రద్ధగా గుడ్డ కొసను పట్టుకొని ఒక్క మాటుగా లాగితే అది ఎట్లా చిరిగిపోతుందో అట్లాగే ఆత్మను అందుకోవాలనే ఆవేశంగాని, అదుర్దాగాని పొందితే ఆత్మ చెల్లాచెదురైపోతుంది. ఆస్ట్రేలియాలో కంగారు అనే జంతువు మనుషులందరితో పాటే ప్రకప్రక్కనే తిరుగుతుందని, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని అది అనుకొంటె మరుక్షణమే అది అందకుండా అనంత దూరం పారిపోతుందని, అట్లాగే ఆత్మను పట్టుకోవాలని చూస్తే అందకుండా దూరం అవుతుందని ఒక సందర్భంలో గురుమహారాజ్‌జీ వివరించారు. కాన ధ్యానం నిరంతరం కొనసాగిస్తూ, ప్రాపంచిక విషయాలవైపు మొగ్గు చూపుతున్న మనస్సు మాట వినకుండా, నేను ఆత్మను, శరీరాన్ని కాదు అని నిరంతర బ్రహ్మభావన చేస్తూ గడిపితే అది మెల్లిమెల్లిగా సిద్ధిస్తుంది. ప్రాపంచిక అవసరాలు ఎంత వరకు అవసరమో అంతవరకు మనస్సును ఉపయోగించుకొంటూ, కాలం అంతా మనస్సు ఆత్మలో లీనం అయి ఉండేటట్లు ఆత్మజ్ఞానంతో నిలుపగలుగుతుండాలి. అప్పుడు సాధకుడు మనస్సు చేత ఆకర్షింపబడే బలహీనతలకు లోనవకుండా జీవించ గలుగుతాడు. దీని వల్ల జ్ఞానంతో అజ్ఞానం నశించి 'అహంబ్రహ్మాస్మి' అని సాధకుడు జీవించగలుగుతాడు.
దీనినే భగవద్గీత యందలి జ్ఞానయోగం అనే దృష్టితో తిలకిస్తే ఈ క్రింది విధంగా దర్శనమిస్తుంది. అనురాగం, భయం క్రోధం విడిచిన వాళ్ళకు (4-10) జ్ఞాన తపస్సు అలవడుతుంది. కామ సంకల్పాలను విడిచి కర్మలు చేయు వారి కర్మలను జ్ఞానాగ్ని (4-19) దగ్ధం చేస్తుంది. ద్వంద్వాతీతుడై కర్మలాచరించటం వల్ల ఆతని కర్మలు (4-22) ఆతనిని బంధించవు. ద్రవ్య యజ్ఞం కన్నా, తపోయజ్ఞం కన్నా, యోగయజ్ఞం కన్నా కూడా జ్ఞాన యజ్ఞం (4-28) శ్రేష్ఠ తరమయింది. కావున సాధకుడు చేసే ప్రతి నిష్కామకర్మాచరణ చిత్తశుద్ధికి దోహదం చేస్తుంది. ఆతనికి చిత్తశుద్ధి చేత జ్ఞానం ఉద్భవిస్తుంది. ఆ జ్ఞానం చేత అతడు జ్ఞాన తపస్సు చేస్తాడు. దానితో అతనికి జ్ఞానాగ్ని ఉద్భవిస్తుంది. అప్పుడు ఆతడు జ్ఞానఖడ్గాన్ని స్వీకరించి అజ్ఞానమనే అడ్డంకుల నన్నిటిని ఖండిస్తాడు. ఆత్మ జ్ఞానం, గురుబోధ అనేవి ఆతనికి జ్ఞాన నౌకగా ఉపకరిస్తాయి. ఈ విధంగా ఆత్మారణిని మథించటం అనే దానిలో జ్ఞాన యజ్ఞమనే దాన్ని ఎట్లా చెయ్యాలో ఆచార్యులవారు బోధించినట్లయింది.
సద్గురు మహారాజ్‌జీ వద్ద జ్ఞానాన్ని తీసుకొని నిరంతర సాధన చేస్తే సాధకుడు పొందే అనుభూతి ఎంతటి సుందరతరమైందో ఆయన ఒక సందర్భంలో వివరించారు.
In this knowledge you can get to a point where you open your eyes, and you see nothing except Light, all you hear is Music, all you can feel in the Word vibrating; all you can drink at the time is nectar. And it is so beautiful because that whole energy which is in our bodies just comes together completely, just fills us up, and there we are, feeling just so beautiful.
- Maharaj Ji
(Book : from the quotations of Guru Maha Rajji's Last cover page).
ఈ జ్ఞానమార్గంలో పయనించిన నువ్వు చేరుకోగల గమ్యమందు నీకు కనిపించేది అనూహ్యమైన తేజస్సు మాత్రమే, వినపడేది విశ్వసంగీతమే, ఆత్మ స్వరసంచారం (అనహద నాదం, శబ్దం) కూడా అనుభ##వైక వేద్యం అవుతుంది. ఆ పరమానంద స్థితి యందు నువ్వు ఆస్వాదించేది అమృతమే. అది చాలా సుందరమైంది. ఎందుకంటే మనలోని సర్వశక్తులు కలిసి, ఆపాద మస్తకం అలముకొని కలగజేసే దివ్యానుభూతి సుందరతరమైంది.
- మహారాజ్ జీ
ఆత్మ మార్గంలో జీవించేవాళ్ళు వాళ్ళకున్న శక్తి సంపదను జబ్బులు నయం చేసుకోవటానికో, మహిమలు ప్రదర్శించటానికో, దారిద్ర్యబాధల్ని తొలగించు కోవటానికో, ధనంకోసమో దుర్వినియోగం చేసుకోరు. జీవిత సత్యం కోసం వారికి ఉన్న శక్తి సంపదను సద్వినియోగం చేసుకొంటారు. వాళ్ళు నిరంతరం చిదానందంతో జీవిస్తారు. దాన్నే ఎస్.ఎస్.కొహెన్ తన గ్రంథమైన ''గురు రమ'' అనే దాంట్లో వివరిస్తూ రమణ మహర్షిని గురించి ఈ క్రింది వాక్యాలు రాశారు. ''ఆ శరీరం తీవ్రమైన వ్యాధిగ్రస్తమైంది. శస్త్ర చికిత్సకి బలి అయింది. రేడియం వల్ల మాడింది. పటుత్వం గల మందులకు గురి అయింది. అయినా ఆ కళ్ళల్లో కాంతి సన్నగిల్లలేదు. ముఖంలోని ఆనందతాండవం సమసిపోలేదు. ఎటువంటి మహాద్భుతాలు జరుగుతున్నాయి. దానిలో ఎటువంటి రహస్యాలున్నాయి!''
ఆత్మజ్ఞానంలో, ఆత్మానందంలో ఎటువంటి అద్భుతాలున్నాయో ఎవరికి వారు స్వానుభవం చేత తెలుసుకోవాల్సిందే కాని ఇతరులు చెప్పలేరు. కొద్దిపాటి శక్తి ఉంటేనే ఎన్నో దుర్మార్గాలు ఆచరించే ఈ సంఘంలో ఎన్నోశక్తులు ఇమిడి ఉన్న ఆత్మజ్ఞాన పరులు తమ బాధల్ని సహితం తొలగించుకోవటానికి ప్రయత్నం చేయకపోవటం అనేది అందరూ ఆలోచించవలసి ఉంది. ఆత్మానందం, ఆత్మజ్ఞానం ఎంతకష్టమైందో కదా! ఎంత ఉత్తమమైందో కదా! అదృష్టాన్ని జారవిడువకండి.
43 అరుణనేవ బోధేన
పూర్వ సంతమసే హృత్
తత ఆవిర్భవేదాత్మ
స్వయమే వాంశు మానివ || 43
@LRiVâßá[ƒ«s = తొలి ఉషస్సు నందలి ఎర్రని కాంతిపుంజాలతో కూడిన సూర్యునిచే, పూర్వం = ముందే, సన్తమసేహృతే = సమస్త చీకటి నశించిపోగా, ఇవ = ఏవిధంగా అయితే, అంశుమాన్ = సూర్యుడు, ఆవిర్భవేత్ = ఉదయిస్తాడో, తత = ఆ విధంగానే, బోధేన = ఆత్మజ్ఞానం చేత అజ్ఞానం నశించిపోగా, ఆత్మ = ఆత్మ, స్వయమేవ = స్వయంగానే ప్రకాశిస్తుంది.
తా|| తొలి ఉషస్సు నందలి ఎర్రని కాంతిపుంజాలతోకూడిన సూర్యుని చేత ముందే సమస్తమైన చీకటి నశించిపోగా, ఏవిధంగా అయితే సూర్యుడు ఉదయిస్తాడో, ఆవిధంగానో ఆత్మజ్ఞానం చేత అజ్ఞానం నశించి పోయి ఆత్మ స్వయంగానే ప్రకాశిస్తుంది.
వివరణ :- సూర్యోదయం కాక ముందే తొలి ఉషస్సు అంధకారాన్ని మెల్లమెల్లగా చెల్లాచెదురు కావించగా సూర్యోదయం స్వయంప్రకాశం కాన అది లోకాన్నంతా ప్రకాశంతో వెలుగొందేటట్లు చేసింది. ఆత్మజ్ఞానంతో సాధకునికి జ్ఞానకిరణాలు ఉద్భవించి ఆతనిలో ఉన్న అహంకారం అనే అంధకారాన్ని మెల్ల మెల్లగా తొలగిస్తుంది. దానితో సాధకునికి అహంకార మమకారాలు తొలగిపోతాయి, కోరికలు నశిస్తాయి. రాగద్వేషాలు ద్వంద్వతీతంగా పరిణమిస్తాయి. ఆ విధంగా ఆత్మప్రకాశానికి పూర్వం సాధకునిలో సద్గుణాలు-శాంతి సహజీవనం చేస్తాయి. ఈ విధంగా సాధకునిలో దేహభ్రాంతి నశించి జ్ఞానతేజం విజృభించి ప్రకాశమానంగా వెలుగొందుతుంది. కాన సాధకుడు సూర్యునివలె ఆత్మప్రకాశంతో వెలు గొందుతాడు. సాధకుడు ఆత్మజ్ఞానాన్ని అభ్యసించటం వల్లె ఆతడు బ్రహ్మస్వరూపంగా రూపొందగలిగాడు. కావున జిజ్ఞాసులు ఆత్మజ్ఞాన సాధనే శ్రేష్ఠ తరమైందని గ్రహించాలి. సాధకునికి ఆత్మదర్శనం అయింది అంటే ఆతడు ఏదో కొత్త వస్తువుని కనుక్కోలేదు. ఆతడు తన నిజతత్త్వాన్నే ఉన్నది ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఎవరైనా సరే లోకంలో ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా, ఏ విషయం సాధించాలన్నా ''మామూలు వ్యవహారాన్ని అయితే కొద్దికొద్దిగా పురోగమించటం మానవునికి అలవాటు. కాని ఆత్మ జ్ఞానం అట్లా లభించేది కాదు. అది హఠాత్తుగా సంభవిస్తుంది'' అని, అది ''ఉషస్సు వంటిది'' అని రమణ మహర్షి చెప్పి ఉన్నారు. మానవులందరికీ గాఢనిద్రలో మనస్సు ఏ విధంగా అంతర్ధానమై పోతుందో ఆ విధంగా సాధకునికి ఆత్మజ్ఞాన సాధన వల్ల మనస్సు ఆత్మలో అంతర్ధానమైపోతుంది. దాని వల్ల అజ్ఞానమనే అంధకారం తొలగి ఆత్మప్రకాశమానమై వెలుగొందుతుంది.
మానవులు అనేక పరిస్థితుల్లో అనేక విధాలుగా మారుతూ అనేక రకాలుగా కనిపిస్తారు. కాని మానవుని నిజమైన స్థితి ఏదీ అంటే ఆత్మతో కలిసి జీవించటమే. సాధకుడు చదువుకొన్న రోజుల్లో విద్యార్థి అయ్యాడు. డాక్టరేటు చేశాక ఆయన చదివిన విషయంలో నిష్ణాతుడయ్యాడు. అదే ఆయన పదిమందికి బోధించాడు. కాని తనకు చేకూరిన ఆశాంతిని పోగొట్టుకోవాలన్నప్పుడు, ఆత్మజ్ఞానం కావాలనుకొన్నప్పుడు మళ్ళీ గురువును ఆశ్రయించి శిష్యుడుగా మారాడు. సాధనలో ఆత్మప్రకాశాన్ని, ఆత్మానందాన్ని పొందాక బ్రహ్మజ్ఞానంతో ప్రకాశమానంగా వెలుగొందాడు. కాన మానవుని పరిస్థితులు, ఆతని అనుభవాలు ఆతడు అనేక రకాలుగా ఉన్నట్లు కనిపించిందేకాని ఆతని నిజస్థితి ఆత్మానందంతో నిలిచిన నాడు ఆతనికి అవగతమయింది. ఇప్పుడు పంచకోశాల్ని శరీరానికి సంబంధించిన మూడు అవస్థలయిన స్థూలశరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం దాటి ఆతడు అఖండమయిన ఆత్మతో ప్రకాశమానంగా వెలుగొందాడు. కాన సాధకునికి సత్యం తెలిసింది.
కాన ఇందులో ప్రధానంగా అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ ఆత్మజ్ఞానమార్గం ఏ వ్యక్తిని, ఏ సమయంలోను బానిసను చేయదు, ఏ వ్యక్తినైనా స్వయంశక్తితో, స్వానుభవంతో, స్వయంప్రకాశంగా వెలుగొందేటట్లు చేస్తుంది. సద్గురువు సాధకునికి నిజాన్ని బోధిస్తాడు, సాధనకు కావలసిన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమస్యలు తొలగటానికి ఉపాయాలు బోధిస్తాడు, ఆనందమార్గానికి కావలసిన ధైర్యాన్ని పొందగలిగేటట్లు చేస్తాడు. దానితో సాధకుడు లోకంలో వరదప్రవాహంలా ప్రవహిస్తున్న మనస్సనే ప్రవాహాన్నీ జీవనవిధానంలో నిలకడగా ప్రవహించేటట్లు చేస్తాడు, మనస్సును శుభ్రమైన పలకలా తయారు చేస్తాడు. దానితో సాధకునికి శుభోదయం అవుతుంది.
కాక జిజ్ఞాసువులు ఆ విషయాన్ని తర్కబుద్ధితో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే విషయం సుబోధమవుతుంది. ఎవరిని వారు రెండువైపుల దర్శించుకోవాలంటే రెండువైపుల నిలువుటద్దాలు పెట్టుకోవాలి. అట్లాగే శరీరాన్ని, మనస్సుని అర్థం చేసుకొని జీవించాలంటే ఒక ప్రక్క గురువుని, రెండవ ప్రక్క గురుజ్ఞాన సాధనను పెట్టుకోవాలి. ఒక తాళం చెవి గురువు వద్ద ఉంటే రెండవ తాళం చెవి సాధకుని వద్ద ఉంది. ఆ రెండింటిని ఉపయోగిస్తేనే ఆత్మజ్ఞానమనే బ్యాంకు లాకర్ తెరవటానికి వీలుకుదురుతుంది. కాన ఆత్మజ్ఞానం కావాలనుకొన్న సాధకులు గురువును విశ్వసించి, గురుజ్ఞానాన్ని నమ్మి నిరంతరం ఓర్పుతో, పట్టుదలతో సాధన చేయబట్టేనిజం నిగ్గుతేల్చుకో గలుగుతారు. కాన ఏ వ్యక్తి అయినా నాకు శరీరం వద్దు అన్నా కుదరదు, మనస్సు వద్దు అన్నా కుదరదు, ఆత్మానందం పొందటానికి ప్రతివ్యక్తికి శరీరం కావాలి, మనస్సు కావాలి. సాధకుడు శరీరం ఉండగానే మనస్సును మచ్చికచేసుకొని ఆత్మలో దాన్ని లీనమయ్యేటట్లు చేయగలుగుతాడు. శరీరంతోనే ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. సాధకుడు సచ్చిదానంద స్థితిలో శరీరం, మనస్సులేని స్థితిని అనుభూతిపొందుతాడు. కాన సాధకులు శరీరాన్ని, మనస్సును అన్ని విధాల నిత్యం శుద్ధిచేసుకొంటూ, సక్రమంగా పోషించుకొంటూ, గమ్యాన్ని చేరటానికి ప్రయత్నం చేయాలి. కార్యసాధకుడు కష్టంబున్, సుఖంబున్ లెఖ్ఖకు రానీయడు అన్నట్లు సాధకులు, జిజ్ఞాసువులు నిరంతరం ఆత్మకోసం పరితపించాలి. ధీరులైన వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడే ఇంకా ఎక్కువ స్థిరంగా నిలుస్తారు అని తెలిసి సాధనలో పట్టుదలతో, ఓర్పుతో నిలవాలి. మిన్నువిరిగి మీదపడుతుంది అన్నంత కష్టాలు అడ్డువస్తున్నా సాధకుడు లెక్కచేయకుండా, తన లక్ష్య సాధనకోసం నిరంతరం సాధన చేయాలి.
గురుమహారాజ్‌జీ ఢిల్లీ ఆశ్రమంలో సత్సంగాలందు సాధకులలో కల ఒక ప్రధానమైన లోపాన్ని ఎత్తి చూపుతూ ఉంటారు. ప్రేమీలు ఆశ్రమానికి గురుదర్శనం కోసం వచ్చేటంతసేపు గురుదృష్టితో ఉంటారు. ఆశ్రమం చేరాక ఇంటి ధ్యాసలో పడిపోతారు అని మహారాజ్‌జీ గారు అంటూ ఉంటారు. మహారాజ్‌జీ ఎత్తి చూపిన లోపాన్ని సాధకులు సాధన విషయంలో కూడా అర్థం చేసుకొని సరిదిద్దుకోవాలి. సాధకుడు సాధనలో కూర్చునేటప్పుడు ఆత్మజ్ఞానంమీదే సంపూర్ణమైన దృష్టికలిగి ప్రేమానందాలతో సాధనలో కూర్చుంటాడు. సాధన కొద్ది సేపు కొనసాగేటప్పటికి మనస్సు సంసారం మీదికి తీసుకువెళుతూ ఉంటుంది. సాధకుడు దాన్ని సరిదిద్దుకోవటానికే నిరంతరం సాధన చేయాలి. అదే విధంగా జిజ్ఞాసువులు జ్ఞానం తీసుకొనేటంత వరకు ఆత్మజ్ఞానం మీద విపరీతమైన శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తారు, గురువుజ్ఞానం ప్రసాదించిన తర్వాత సాధకులు సాధన కోసం ఎన్నో సమస్యలు అడ్డువస్తున్నాయి అంటూ ఉంటారు. అట్లాంటి మాట ఎవరు, ఎప్పుడు, ఏ విధంగా చెప్పినా కూడా అది చెప్పతగింది కాదని ఎవరికి వారే అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయిన కార్యాన్ని ప్రారంభించటానికి ముందే లాభనష్టాలు, కష్టసుఖాలు బేరీజు వేసుకొని దీర్ఘ దర్శిలా ముందుకు నడవాలి. అంతే కాని దీర్ఘసూత్రుడులా ఎవ్వరూ తటపటాయించకూడదు. రెండు బోటుల మీద కాళ్ళువేసి ఎవరూ ప్రయాణం చేయలేరు. కాన ఆత్మజ్ఞానం కావాలనుకొనే వాళ్ళు, సంఘంలో ఉన్న దుఃఖాన్నుంచి విముక్తి కావాలనుకొనే వాళ్ళు గురుజ్ఞానాన్ని క్రమం తప్పకుండా నిరంతరం సాధనచేయాలి. మందు వాడేవాళ్ళు ఒక పూట మందు వేసుకొని రెండుపూటలు మానేసి మళ్ళీ రెండుపూటలు వాడి మళ్ళీ రెండు రోజులు మానేసి రోగం నయం కావటం లేదు అంటే ఎక్కడైనా జబ్బు నయం అవుతుందా? జబ్బుతగ్గాలంటే డాక్టరు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించాలి కదా! అప్పుడే కదా రోగి సత్ఫలితాలు పొందుతాడు. కాన సాధకులు ముందు చూపుతో అన్నిటి కంటే ఆత్మజ్ఞానానికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి సాధనను కొనసాగించాలి. మూడు పూటల ఆహారం శరీరానికి ఎంత అవసరమో సాధనకూడా సాధకునికి అంత అవసరము. సాధన నిరంతరం కొనసాగించినప్పుడే సాధకునికి ఆత్మజ్ఞానంలో ఉన్న లఘు బిగువులు అర్థం అవుతాయి.
44 ఆత్మాతు సతతం ప్రాప్తోపి
అప్రాప్తవ దవిద్యయా
తన్నాశే ప్రాప్తవద్భాతి
స్వకంఠాభరణం యథా || 44
A»R½ø = ఆత్మ, తు = నిజానికి, సతతం = ఎల్లప్పుడు, ప్రాప్తోపి = ప్రాప్తించి ఉన్నప్పటికి, అవిద్యయా = ఆత్మజ్ఞానం తెలియక శరీరమే ఆత్మ అనే అజ్ఞానం చేత, అప్రాప్తవత్ = పొందబడటం లేదు, తత్+నాశే = ఆ అజ్ఞానం నశించగానే, స్వకంఠాభరణం = కంఠమునందలి ఆభరణం, యథా = వలె (ఆత్మ), ప్రాప్తవత్=ప్రాప్తించిందిగా, భాతి = గోచరిస్తుంది.
తా|| ఆత్మ నిజానికి ఎల్లప్పుడూ లోపట ప్రాప్తించే ఉన్నప్పటికి అజ్ఞానంచేత అది పొందబడుట లేదు. ఆ అజ్ఞానం నశించగానే కంఠమునందలి ఆభరణం పోయిందని తెలివితక్కువ తనం చేత ఇల్లంతా వెతికి ఆఖరికి మెడలోనే ఉందని తెలుసుకొన్నట్లుగా ఆత్మ లోపటే ప్రాప్తించిందిగా ప్రత్యక్షం అవుతుంది.
వివరణ :- పసిపిల్లలు వాళ్ళు చేస్తున్న పనిని ప్రేమిస్తారు తప్ప డబ్బు హోదా, కీర్తిప్రతిష్ఠలు వంటివి ఏవీ ఆశించరు. ఎవరైనా సరే చేస్తున్న పని పట్ల ఆసక్తి పెంచుకొంటే విసుగెత్తే కార్యం కూడా వాళ్ళకు సాహసకృత్యంగా మారిపోతుంది. కృషి ఉంటే మానవులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ''ఈ ప్రపంచం అంతా తానే భగవత్ స్వరూపం అని తెలుసుకొనే వరకు నేను ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తినీ ఉత్తేజపరుస్తూ ఉంటాను'' అని వివేకానందుడు చెప్పి ఉన్నాడు. ఇట్లాంటి మాటలు ఎన్ని విన్నా ఆత్మను వ్యతిరేకించే వ్యక్తి మానవునిలో ఆత్మ ఎక్కడుందయ్యా అంటూ ఉంటే లోకంలో వస్తువులన్నీ తెలుసుకోవటానికి ఏది శక్తిని ఇస్తుందో అదే అని తెలుసుకో అని చెప్పవలసి వస్తుంది. అది విన్న మానవుడు నా పురుష ప్రయత్నం చేత నేను వస్తువులన్నిటిని తెలుసుకొంటున్నాను. నేను మనస్సు చేత గడించిన జ్ఞానం చేత నా కార్యాలన్నీ నేను చూస్తున్నాను. కాన వస్తు జ్ఞానం అంతా పురుషతంత్రమే కాని మరొకటి కాదా అని అతడు వాదిస్తాడు. అది నిజంకాదు. నువ్వు గాఢనిద్రలోకి వెళ్ళినప్పుడు నీ మనస్సు, నీ శరీరం, నీ ఇంద్రియాలు అన్నీ విశ్రాంతి తీసుకొంటూ ఉంటే ఏది నిన్ను నడుపుతుందో అదే నిన్ను మేల్కొని ఉన్నప్పుడుకూడా అన్నీ తెలుసుకోవటానికి కావలసిన జీవశక్తిని ఇచ్చి రక్షిస్తుంది కాని మనస్సు కాదు అని ఆతనికి చెప్పవలసి వస్తుంది. కాన అటువంటి వివాదగ్రస్తునికి వస్తుతంత్రాన్ని బోధించవలసి వస్తుంది. వస్తువులన్నిటిని గ్రహించాలనే తపనతో మానవుడు తన చుట్టూ ఉన్న ప్రతిజ్ఞానాన్ని గ్రహించటానికి ప్రయత్నించాడు. మానవుడు తనలో ఉన్న నిజమైన శక్తిని తెలుసుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని విడిచిపెట్టి మిగిలిన వన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. దానివల్లే మానవుడు ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవటానికి భ్రమ ప్రమాదాలకు లోనవుతున్నాడు. ఆ పరిస్థితుల్లో మానవునిలో ముద్రలుగా పేరుకుపోయిన వస్తువుల్ని ఒక్కొక్కదాన్నే తగ్గించుకొంటూ వస్తే వస్తు రహిత జీవశక్తి మానవునికి కనిపిస్తుంది. ఆ విధంగా వస్తురహితమైన శుద్ధ చైతన్యం మానవునిలో నిరంతరం ఉంది. అట్లా ఉన్నదాన్ని తెలుసుకోవటాన్నే వస్తుతంత్రం అంటారు. తనపై తాను ఆధారపడి ఉన్నదాన్నే వస్తుతంత్రం అంటారు. తనపై తాను ఆధారపడి ఉన్నదాన్నే ఆత్మ అంటారు. తన ప్రకాశాన్ని ప్రకాశింపచేయటానికి ఇంకొక ప్రకాశం అక్కరలేనిదే ఆత్మ. ఆ ఆత్మే వస్తుప్రపంచాన్ని తెలుసుకోవటానికి జ్ఞానశక్తిని ఇస్తుంది. అది ఎల్లవేళల మానవునిలో ప్రాప్తమై ఉంది. ఆ ప్రాప్తమై ఉన్నదాన్ని తెలుసుకోవటానికి బదులు మానవుడు దేహమనే సంసారంలో చుట్టూఉన్న వస్తువులన్నిటిని మనస్సులోపల ముద్రల రూపంతో ఏర్పాటు చేసుకొని అంధకారాన్ని తయారు చేసుకొంటున్నాడు. మానవుడు ఆ ముద్రల సమూహాలన్నిటినీ తొలగించుకొంటూ వెళ్ళాలి. శరీరం కూడా ఒక వస్తువే. మానవుడు వాటన్నిటిని గురుతంత్రం ద్వారా ఒక్కొక్కటి తొలగించుకొంటూ శుద్ధచైతన్య స్థితికి చేరవలసి వస్తుంది.
''ధ్యానం అంటే సాధకుడు మనస్సును తనవైపుకే మరల్చుకొని లోపలివైపుకు తిప్పుకోవటం అవుతుంది. దాని వల్ల సాధకునికి మనస్సులో ఆలోచనా తరంగాలన్ని ఆగిపోవటమే కాక ప్రపంచం అంతా కూడా ఆగిపోతుంది. అది ఒక భావనా పద్ధతి ద్వారా జరుగుతుంది. శరీరంలో ఉన్న మూలతత్వాలన్నిటినీ పరిశుభ్రపరిచే పద్ధతి ద్వారా ధ్యానం కొనసాగుతుంది. ఒక్కొక్క తత్త్వమూ మరొక దానిలో లీనమయి, అది అంతకన్నా ఉన్నతమైన దానిలో లీనమయి, చివరకు ఆత్మలో లీనమవుతుంది. అప్పుడు సాధకుడు ఆత్మ స్వరూపుడుగా నిలుస్తాడు'' అని వివేకానంద చెప్పాడు. కాన ఆ విధంగా మానవుడు రావటానికి గురువు ఇచ్చిన ఆత్మజ్ఞానంతో శబ్దాన్ని గ్రహిస్తున్న చెవి శక్తిని లోపలికి ప్రవేశింప చేస్తే చెవి తొలుగుతుంది. లోనున్న శుద్ధచైతన్య ధ్వనియే నిలుస్తుంది. స్పర్శను గ్రహించటానికి చర్మ జ్ఞానానికి ఇచ్చిన చైతన్యాన్ని లోనికి ప్రవేశింపచేస్తే చర్మం తొలుగుతుంది. శుద్ధచైతన్య స్పర్శయే నిలుస్తుంది. రూపాన్ని గ్రహిస్తున్న కంటి దృష్టికి ఇచ్చిన చైతన్యాన్ని లోనికి ప్రవేశింపచేస్తే శుద్ధచైతన్య దృక్కేనిలుస్తుంది. రసాన్ని గ్రహిస్తున్న నాలుక రసాస్వాదనకు ఇచ్చిన చైతన్యాన్ని లోనికి ప్రవేశింప చేస్తే శుద్ధచైతన్య గంధమే నిలుస్తుంది. ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధాలను స్వీకరిస్తున్న వస్తువులైన చెవి, చర్మం కన్ను, నాలుక, ముక్కు అనే వాటిని అంతర్ముఖం చేసి శుద్ధచైతన్యంలో లీనమయ్యేటట్లు చేయటం వల్ల అవి తొలగటమే కాక వాటిని నడుపుతున్న మనస్సుకూడా అచేతన మవుతుంది. ఆ విధంగా మనస్సు ఎప్పుడు లేనిది అయిందో శరీరం కూడా లేనిదిగా అవుతుంది. దానితో దేహం అనే వస్తువుకూడా లోపించి ఎల్లవేళల ప్రాప్తమయిన ఆత్మ దర్శనమిస్తుంది. కాన పురుషయత్నం చేత జ్ఞానాన్ని గ్రహిస్తున్నాను అనే పురుష తంత్రాన్ని - ఆత్మ - జ్ఞానమే గురుతంత్రంతో లోన పేరుకు పోయిన వస్తువులన్నింటిని తొలగించుకొంటు వెళితే మానవునిలో వస్తు రహిత చైతన్యం (Objectless awareness) అయిన ఆత్మ స్వయం ప్రకాశంగా వెలుగొందుతుంది అని చెప్పవలసి వస్తుంది. కాన సాధకుడు పురుష తంత్రాన్ని గురుతంత్రంతో తొలగించి వస్తుతంత్రంతో నిలవాలి. ఆ విధంగా సాధకుడు సాధనలో నిలవటాన్నే బ్రహ్మస్వరూపంతో నిలవటం అన్నారు. అది సాధకునికి ఎల్లవేళలా ప్రాప్తమయి ఉంది. ఉయ్యాల్లో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు మెళ్ళో కంఠాభరణం పెట్టుకొని ఇల్లంతా వెతికినట్లు ఉండదని ఆచార్లవారు వివరించారు. బాల్యంనుంచి లోకజ్ఞానం కావాలని విషయాలను నిరంతరం జల్లెడపట్టం వల్ల ఆత్మతొలగిపోయి వస్తువులనే ముద్రలన్నీ మిగిలిపోయి మనస్సులో అంధకారం పేరుకుపోయింది. ఆత్మజ్ఞానం అనే చేటతో వస్తువుల్ని చెరగటంతో పొల్లు, తాలు, రాయి రప్ప తొలగి మంచి వస్తువు మిగిలినట్లు శరీరం, మనస్సు, ఇంద్రియాలు అనే వస్తువులన్నీ తొలగి సారవంతమైన, ప్రకాశవంతమైన ఆత్మ మిగులుతుంది. అది ఎప్పుడూ ప్రాప్తమయ్యే ఉంది. దక్షిణామూర్తి సనక సనందనాదులకు మౌనంతోనే జ్ఞానోదయమయ్యేటట్లు చేసి ఆత్మానందం కలిగించి నట్లుగా గురువు ఆత్మ జ్ఞానంతో శుద్ధచైతన్యమైన పరబ్రహ్మ సాధకుడుగా నిలిచేటట్లు చేయగలుగుతాడు.
అయితే కన్ను చెవి, ముక్కు, నాలుక చర్మం అనే వస్తువులు ఏవీ లేకుండా, శరీరం అనేది కూడా లేకుండా ఆత్మానందాన్ని అనుభవించటం అనేది ఎట్లా జరుగుతుంది అనే సంశయం ఉత్పన్నమవుతుంది. అనుభవించేవాడు అనేవాడు ఒకడు ఉంటే కదా అనుభవం అనేది తెలియటానికి కాన అట్లాటి పరిస్థితుల్లో ఈ ఆత్మానుభవం ఎట్లా ఉంటుంది? ఎవరు అనుభవిస్తారు అని సంశయం ఉత్పన్నం అవుతుంది. సమస్తమైన ఆలోచనలకు, భావాలకు, దృశ్యాలకు, రూపాలకు స్పర్శలకు, గంధాలకు శబ్దాలకు శక్తిని ఇచ్చి ప్రకాశింప చేస్తున్న శక్తి ఆత్మే కనుక వాటి నన్నిటిని ఉపసంహరించుకొనిన నాడు స్వయం ప్రకాశ##మైన ఆత్మే ప్రకాశంగా మిగులుతుంది. జ్ఞాన స్వరూపమైన ఆత్మకు తెలుసుకోవటానికి వేరొక జ్ఞానం అక్కరలేదు. కాన ఆత్మగా నిలవటానికి గురువు ప్రసాదించిన ఆత్మజ్ఞానం కూడా ఆత్మలో లీనమై స్వచ్ఛమైన, నిర్మలమైన, శుద్ధచైతన్యమైన ఆత్మ స్వయం ప్రకాశంగా మిగులుతుంది. సూర్యుని చూట్టానికి ఇంకొక కాంతి సహాయం అక్కరలేనట్లే, ఆత్మానుభవం అనుభవించటానికి శరీరం, మనస్సు, ఇంద్రియాలు అనే వస్తువులన్నిటిని నిరసించటంవల్ల అవి ఏవీ లేకుండానే నిత్యానందమైన ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మే జ్ఞాన స్వరూపం కనుక, ఆత్మే ఎరుక కనుక, ఆత్మే చిదానందం కనుక, ఆత్మే సత్యం కనుక, ఆత్మే ఆనందానుభవాన్ని అనుభవిస్తుంది. కనుక దీన్ని అపరోక్షానుభూతి అంటారు. గురువు ప్రసాదించిన ఆత్మజ్ఞానమనే ధ్యాన సాధన సాధకునిలో ఉన్న అజ్ఞానమనే లోటును తొలగించటానికి ప్రసాదించిందే కాని వేరుకాదు. సాధన మార్గాలే ఆత్మకాదు. సాధనలే ఆత్మ అయితే సాధన అయిపోగానే ఆత్మ మరుగు పడాలి. సాధనలో ఆత్మ అట్లా మరుగవ్వటం లేదు. సాధన చివరిలో ఆత్మ ప్రకాశంగా నిలుస్తుంది. సాధనకు గురువు ప్రసాదించిన జ్ఞానక్రియలు కూడా ఆత్మలో లీనమై సాధకుడు ఆత్మగా వెలుగొందుతాడు. సాధన అనేది అజ్ఞానాన్ని తొలగించి ఆత్మను దర్శించటానికి వీలయ్యేటట్లు చేస్తుంది. అందుకే గురుమహారాజ్‌జీగారు ఆత్మజ్ఞాన సాధనయందు జ్ఞానం కూడా చివరికి ఆత్మలో లీనమయిపోతుంది అని చెపుతుంటారు.
ఆత్మజ్ఞాన మనే జ్ఞానమార్గానికి గురువు కావాలి. సాధకుడు జీవించిన గురువువద్ద జ్ఞానం స్వీకరించాలి. మానవుడు పొరపాటుగా భగవంతుని బయట వెతుకుతూ ఉంటే, ఆత్మమార్గంలో సాధకుడు బయట వెతకటం మాని దేహంలోపలకు వెళ్ళి ప్రాప్తమయిన దానితో ఆనందిస్తాడు. సాధకునికి ఆత్మ అనే భగవంతుని బయట వెతకవలసిన అవసరం లేదని గురుజ్ఞానం తెలుసుకొనేటట్లు చేస్తుంది. ఏకత్వంలో అనేకత్వం, అనేకత్వంలో ఏకత్వం సాధకునికి దీనియందు బాగా అవగాహన అవుతుంది. ఆత్మను సాధించటానికి అనేక మార్గాలున్నా జ్ఞానమార్గమే ఉత్తమ మైందని గురువులు దీనికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి బోధిస్తున్నారు.
సాధకుడు తనపనులు తాను త్రికరణశుద్ధిగా ఆచరిస్తూ తన విధి నిర్వహణ ద్వారా తన దివ్యత్వాన్ని తెలుసుకోవటానికే కర్మయోగం చేస్తున్నాడు, అట్లాగే సాధకుడు తనకు ఒక బాహిర్గతమైన శక్తి, బలం కావాలనుకొన్నప్పుడు ఒక సగుణ దైవాన్ని ఆశ్రయించి, ఆయన యందు ప్రదర్శించే ప్రేమతో ఆయన యందు కల దివ్యత్వాన్ని గ్రహించటానికే భక్తియోగం చేస్తున్నాడు. అట్లాగే సాధకుడు మనస్సును ఆధీనంలో ఉంచుకోవటానికి చేసే ప్రయత్నం ద్వారా తన దివ్యత్వాన్ని తెలుసుకోవటానికే రాజయోగం చేస్తున్నాడు. అదే విధంగా సాధకుడు ఆత్మజ్ఞానం ద్వారా తన దివ్యత్వాన్ని తెలిపే మార్గమైన జ్ఞానయోగాన్ని ఆశ్రయించి పరబ్రహ్మంగా నిలుస్తున్నాడు. ఈ విధంగా ప్రధానంగా లోకంలో బోధిస్తున్న నాలు మార్గాల్లో ''ఏ మార్గంలో భగవంతుని చేరాలను కొంటె సాధకుడు ఆ మార్గంలో పయనించవచ్చు కాని ఆదారిలో ఇతరులెవ్వరినీ క్రిందకు తోయకు'' అని వివేకానందుడు బోధించాడు. అంటే ఇతర మార్గాలను, ఇతర మార్గాల ననుసరించే వారిని, ఇతర మార్గాలను బోధించే వారిని కించపరచ వద్దు అని వివేకానందుడు బోధించాడు ''శ్రీ శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని పర్వతాల యందు, అరణ్యాల యందు వదిలేశారు. నేను దాన్ని అక్కడ నుంచి ఈ దైనందిన ప్రపంచం నందు, సంఘము నందు, ఎల్లెడల విస్తరింప చేస్తానికి వచ్చాను'' అని వివేకానందుడు చెప్పాడు. కావున ఆత్మజ్ఞాన మార్గాన్ని జ్ఞానులైనవారు ఈ దైనందిన ప్రపంచంలో, సంఘంలో ఎల్లెడల విస్తరించేటట్లు తమ శక్తి కొలది ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని భావించాలి. నేటి సంఘస్థితి ఎంతటి అస్తవ్యస్త పరిస్థితుల్లో నడుస్తుందో చూస్తుంటె ఇంటింటికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని బోధించ వలసిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది.
45 స్థాణౌ పురుషవద్ భ్రాంత్యా
కృతా బ్రహ్మణి జీవతా
జీవస్య తాత్త్వికే రూపే
తస్మిన్ దృష్టే నివర్తతే || 45
róyßÝ = కొమ్మలులేని చెట్టుమోడు, పురుషవత్ = పురుషుని వలె కనిపించినట్లు, భ్రాంత్యా = మాయచే, బ్రహ్మణి = బ్రహ్మం అయిన ఆత్మలో, జీవతా = జీవత్వం, కృతా = కల్పింపబడింది, జీవస్య = జీవుని యొక్క, తాత్త్వికేరూపే = నిజస్వరూపం, తస్మిన్ = ఆత్మలో, దృష్టే = దర్శించినప్పుడు (తెలుసుకొన్నప్పుడు) నివర్తతే = (మానవుడు జీవుడు కాదు అనునటువంటిది అర్థమై జీవత్వ భ్రాంతి) తొలగింపబడుతుంది.
తా|| చెట్టుమోడు దూరం నుంచి చూసినప్పుడు పురుషుని వలె కనిపించినట్లుగానే మాయచేత బ్రహ్మం అయిన ఆత్మలో జీవుడు అనేది కల్పింపబడింది. జీవుని యొక్క నిజస్వరూపం ఆత్మలో తెలుసుకొన్నప్పుడు మానవుడు జీవుడు కాదు అనేది అర్థమై జీవత్వ భ్రాంతి తొలగింపబడుతుంది.
వివరణ :- సాధకునకు చెట్టుమోడు దూరం నుంచి మనిషిలాగా కనిపించినట్లే అజ్ఞానం చేత బ్రహ్మమే జీవుడు అని అనిపిస్తుంది. సాధకునికి ఆత్మజ్ఞానంతో ఆత్మ దర్శనం కలిగినప్పుడు జీవుని యొక్క యథార్థ స్వభావం తెలుస్తుంది. దాని వల్ల సాధకునికి మానవుడు జీవుడు కాదు అనేది అర్థం అవుతుంది. అయినా చెట్టుమోడు మనిషిగా ఎందుకు కనిపించింది? దూరం నుంచి చూడటం వల్ల లేదా చీకటిలో చూడటం అనే లోపాలవల్ల ఆ విధంగా లోప భూయిష్ఠమై కనిపించింది. అదే విధంగా మానవులకు దేహాత్మభ్రాంతి వల్ల బ్రహ్మం జీవుడుగా కనిపిస్తున్నాడు. అజ్ఞానం వల్లే అసత్యమైన జీవభావం ఉదయిస్తుంది. నిజమైన ఆత్మజ్ఞానం తెలిసిన వెంటనే జీవునియందు కల సర్వభ్రాంతులు తొలగిపోతున్నాయి. అయితే ఏ విధంగా ఈ అజ్ఞానం పారద్రోలటానికి వీలవుతుంది అంటే సాధకునికి తీవ్రమైన విశ్వాసం, నమ్మకం, కలిగి గురుజ్ఞానాన్ని నిరంతరం సాధన చేస్తూ ఉంటే అజ్ఞానం పటాపంచలవుతుంది. దానితో సాధకునికి జీవుడు, అహంకారమమకారాలు అనేవి నశించిపోతాయి. సాధకుడు ఆత్మస్వరూపునిగా భావన చేస్తూ ఆత్మానందంతో నిలుస్తాడు. సాధకుడు సర్వత్ర ఆత్మభావనతో దర్శిస్తూ జీవించగలుగుతాడు. సాధకుడు అట్లా దర్శించటానికి ఆత్మజ్ఞానం సాధనకు ఉపకరించింది. కావున సాధకుడు చిట్టచివరకు జీవుణ్ణి, ఆత్మజ్ఞానాన్ని కూడా వదిలేసి ఆత్మతో జీవించగలుగుతాడు. దానికే రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణను వివరించారు. ''కాలిలోని ముల్లు తీయటానికి మరొకముల్లు అవసరం అవుతుంది. ముల్లు తీసివేశాక ఆరెండు ముళ్ళనీ బయట పారవేస్తారు''. అని చెప్పారు. దాని వల్ల చివరకు సాధకుడు ఆత్మతోనే జీవించగలుగుతాడు.
జీవాత్మ భ్రాంతి తొలగించుకోవటాన్ని అర్థం చేసుకోవటానికే ముండకోపనిషత్తులో (3-1,2) ఎప్పుడూ కలిసి ఉండే స్నేహితులైన రెండు బంగారు పక్షుల ఇతివృత్తాన్ని వివరించారు. ఒక చెట్టు మీద రెండు పక్షులున్నాయి. ఒక పక్షి పైకొమ్మమీద ప్రశాంతంగా, గంభీరంగా, తనయందే తాను సుప్రతిష్ఠమై కూర్చొని ఉంది. కింద కొమ్మమీద ఉన్న పక్షి అశాంతితో, అలజడితో ఆ చెట్టు కాయల్ని తింటూ ఉంది. ఆ కాయలు కొన్ని తియ్యగాను, కొన్ని చేదుగాను ఉన్నాయి. అయినా ఆ కింది పక్షి అట్లా తింటూ ఉండగానే అది చేదుగా ఉన్న ఒక పండు తిని కొంచెం సేపు ఆగి పైన గంభీరంగా కూర్చున్న పక్షిని చూసింది కాని వెంటనే ఆ పైనున్న పక్షిని మరచి పోయింది. యథావిధిగానే ఆ చెట్టు పళ్ళను తింటూనే కాలం గడిపింది. మళ్ళీ ఒక చేదుపండు తినేటప్పటికి పైనున్న పక్షి దిశకు కొన్ని గంతులు వేసింది. ఆ విధంగా చాలా సార్లు జరిగాక కింద ఉన్న పక్షి పైన కూర్చున్న పక్షిదగ్గరకు చేరింది. దానితో కింద పక్షి పైన పక్షితో కలిసి పోయింది. అప్పుడు ఆ కింద పక్షి ఇట్లా అనుకొంది. ఇంతకు పూర్వం రెండు పక్షులు లేవనీ, తానే పైన కూర్చొని ప్రశాంతంగా, గంభీరంగా ఉన్న పక్షినని, తనలోతానే లీనమైఉన్న పక్షినని అనుకొంది. సాధకుడు సాధనలో ఈ విధంగా ఆత్మతో లీనం అవుతాడని, సాధకునికి జీవ భ్రాంతి తొలగి పోతుందని ఇందులో వివరించారు. ఇదే శ్వేతశ్వతరోప నిషత్తులో (4-6,7)నూ ఉంది.
చెట్టుమోడుకు సంబంధించిన భ్రాంతి విషయంలో సాకార నిరాకారాలను గూర్చి కూడా ఆలోచించతగి ఉంది. ఇక్కడ రమణ మహర్షి సాకార భ్రాంతిని గూర్చి చెప్పిన విషయాన్ని సాధకులు నిర్మల హృదయంతో అవగాహన చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస అందరు దేవుళ్ళను చూశారని ఒక పృచ్ఛకుడు రమణ మహర్షితో అంటే అది భ్రాంతేనని రమణమహర్షి వివరించారు. రామకృష్ణ పరమహంస ఆయా విగ్రహాల్లో ఆయా రూపాలు చూశారంటే, ఆయా విగ్రహాల్లో అందరికీ అట్లాగే కనబడాలి, ఇతరులకు అట్లా కనబడటం లేదు కదా? కావున అది భ్రాంతి వల్లె అట్లా అనిపిస్తుంది అని రమణ మహర్షి చెప్పారు. చెట్టుమోడునందు పురుషుడు కనిపించినంత మాత్రం చేత చెట్టుమోడులో ఏ మార్ఫూరాలేదు. చెట్టుమోడు పురుషుడు కాలేదు. కాన అది భ్రాంతి వల్లనే అట్లా అనిపించింది అని తెలుస్తుంది. ఆయా రూపాల్లో చూడాలనే ఆకాంక్షతో ఉన్న మానవునికి ఆ చెట్టుమోడులో భ్రాంతి వల్ల పురుషుడు దర్శనమిచ్చాడు కాని చెట్టుమోడులో పురుషుడు లేడు. చూసే మానవుని మనస్సులో భ్రాంతి తొలగగానే నిజమైన చెట్టుమోడు దర్శనమిచ్చింది. అట్లాగే సాధకునకు సంఘమునందలి భ్రాంతి తొలగగానే ఆతడు ఆత్మజ్ఞానంతో ఆత్మదర్శనం పొందగలుగుతున్నాడు. దానితో ఆతనికి జీవభ్రాంతి తొలగి బ్రహ్మభావన, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానందం సిద్ధిస్తాయి.
భారతీయ జీవన విధానంలో వాస్తవిక జీవనంలో హెచ్చుతగ్గులు, ఊహాజీవితంలో అద్వైతంగా కనిపిస్తున్నాయి. ఈ వైరుధ్యాన్ని ఆత్మజ్ఞాన మార్గం, ఆత్మసాధన అనేవి పరిష్కరించి మానవ సంఘంలో మహోన్నతమైన ఆదర్శవాదుల్ని, ఆచరణ యోగ్యంగా ప్రదర్శించి చూపగలుగుతున్నాయి. అద్వైత భావనలో అంతర్లీనంగా విశ్వమానవతా భావం, సర్వదృష్టికి అంతర్గతమైన ఏకతాసూత్రం ప్రస్ఫుటమవుతున్నాయి. శంకరాచార్యుల వారు ప్రతిదేవతా విగ్రహాన్ని స్తుతిస్తూ అనేక గ్రంథాలు రాశారు. ఆయన సామాజిక చట్రానికి కట్టుబడే వాటియందు వైరాగ్యబోధన, భగవద్భక్తిని బోధించారు. అయినా చిట్టచివరకు ఆయన నిరాకారమైన ఆత్మవాదిగా సంఘంలో నిలిచారు. ఆయన బోధనకు, ఆచరణకు వ్యత్యాసం ఉండటం వల్ల కాశీలో అంత్యజుడు తప్పుకోమనేవాడెవడు, తప్పుకోబడేవాడెవడు అని ఆయనను ఎదురు ప్రశ్నించాడు. దానితో ఆయనలో సంపూర్ణమైన పరిణతి చేకూరి ''ఆత్మబోధ'' గ్రంథాన్ని రాసి ఉంటారని అనుకొంటూ ఉంటాను. సంఘంలో అశాంతితో, భయభ్రాంతులతో సతమతమవుతున్న మానవ జీవనవిధానాన్ని ఆయన ఆత్మబోధ ఒక పరిష్కారం చూపినట్లయింది. కర్మకాండల పేరుమీదుగా, రకరకాలుగా మానవుని పీడించే ఆధ్యాత్మిక భ్రమల నుండి మానవులను తప్పించి ఆయన ఆత్మజ్ఞానం శాంతి సౌఖ్యాలను చేకూర్చింది. ఆయన మేధోపరంగా ఒక ఉన్నతమైన జిజ్ఞాసను రేకెత్తించి, ఆత్మ మార్గమనే ఉన్నత స్థితిని ఆనాడు సంఘంలో స్థాపించి ఆయన శాంతికి మార్గగామి అయ్యారు.
46 తత్త్వ స్వరూపానుభవా
దుత్పన్నం జ్ఞాన మంజసా
అహం మమేతి చా జ్ఞానం
బాధతే దిగ్భ్రమాదివత్ || 46
µj…N`P+భ్రమ+ఆదివత్+ఆంజసా = వెళ్లవలసిన దిక్కు తెలియక తిరుగుతున్న మానవుడు సూర్యోదయం కాగానే తూర్పు పడమరలు తెలిసి వెళ్లవలసిన దిక్కు ఏవైపో తెలుసుకొని పెడదారిని వదిలివేసినట్లు, తత్త్వస్వరూప+అనుభవాత్ = భగవంతుని తత్త్వస్వరూపమైన ఆత్మస్వరూపం అనుభవించటంచేత, ఉత్పన్న = పుట్టిన, జ్ఞానం = ఆత్మజ్ఞానం, అహం = నేను అనే శరీర భ్రాంతిని, మమ = నాది అనే శరీర భ్రాంతిని, మమ = నాది అనే సంసార బంధాలకు సంబంధించిన మమకార భ్రాంతిని, ఇతి = ఈ విధంగా, చ = మరియు, అజ్ఞానం = లోకమే శాశ్వతమనే దేహభ్రాంతిని, బాధతే = అంతమొందిస్తుంది.
తా|| వెళ్ళ వలసింది ఏ వైపుకో తెలియక తిరుగాడుతున్న మానవుడు సూర్యోదయం కాగానే తూర్పుపడమరలు తెలిసి వెళ్ళవలసిన దిక్కు ఏవైపో తెలుసుకొని పెడదారిని వదలివేసినట్లుగా ఆత్మజ్ఞానం నేను నాది అనే భ్రాంతిని అంతమొందిస్తుంది.
వివరణ :- మానవుడు చీకటిలో తాను వెళ్ళవలసిన దారి తెలియక బాధ పడుతుంటాడు. అట్లాగే మానవుడు నేను అనే అహంకారంతో శరీరమే సర్వస్వం అని బాధకు లోనవుతుంటాడు. నా తల్లి దండ్రులు, నా భార్యా పిల్లలు, నా కీర్తి ప్రతిష్ఠలు, నా ధనం అంటూ నాది అనే మమకారంతో మానవుడు అంధకారంలోకి కూరుకుపోతుంటాడు. సూర్యోదయం కాగానే బాటసారికి దారీ తెన్నూ తెలిసి గమ్యాన్ని చేరినట్లు మానవునికి గురువు లభించగానే ఆత్మజ్ఞానం తెలిసి ఆత్మానందం లభించటానికి దారి తెన్ను తెలుస్తుంది. సాధకునికి ఆత్మ విజ్ఞానం తెలియగానే అహంకార మమకారాలు క్రమేపీ నశించి పోతాయి. ఈ విధంగా ఆత్మజ్ఞాన మనే సూర్యకాంతి సాధకునికి జ్ఞానమనే వెలుగు ప్రసాదించి గమ్యాన్ని చేరుస్తుంది. సాధకునికి ఆత్మజ్ఞానం చేత నేను నాది అనే బీజం ధ్యానమనే పెనంలో వేయించబడుతుంది. దాని వల్ల సాధకునికి నేను నాది అనే అహంకార మమకారాలు శక్తిహీనమై శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా సాధకుని చెప్పుచేతల్లోకి వస్తాయి. దానితో సాధకునకు స్వార్థం అనేది నశించి, నిస్వార్థం మాత్రమే నిలుస్తుంది. దానితో విశ్వమానవతాభావం, వసుధైక కుటుంబం వంటి ఉన్నత లక్షణాలు సాధకునిలో చోటు చేసుకొంటాయి. దానితో నిరంతరం సాధకునికి ఆనందం నిలుస్తుంది.
లలిత కళలను ఉదహరణగా తీసుకొని నిస్వార్థబుద్ధితో కళను సాధన చేసినప్పుడు, కళను ప్రదర్శించినప్పుడు సాధకునికి ఆనందం లభిస్తుంది అని లలిత కళలను ఆరాధించే వాళ్ళు అంటూ ఉంటారు. ''లలిత కళలు సౌందర్య ప్రధానాలు. ఈ లలితకళల నుండి కలిగే ఆనందాన్ని అనిర్వచనీయమూ, అలౌకికమూ అంటారు. అనిర్వచనీయం అంటే ఇట్లా ఉంటుంది అని మనం వర్ణించి చెప్పలేనిది. మంచి ఆహారాన్ని తిన్నప్పుడూ, ఇష్టమైన వాళ్ళను చూసినప్పుడు కలిగే ఆనందం లౌకికం. అంటే ఒక లాభం వల్ల కలిగే ఆనందం అది. లలిత కళల వల్ల కలిగే ఆనందం ఇటువంటిది కాదు. ఎటువంటి ప్రయోజనమూ లేకుండానే కలిగే ఆనందం ఇది. అందువల్ల దీన్ని అలౌకికం అన్నారు. అనుభ##వైక వేద్యం అని కూడా అన్నారు. అంటే మనం అనుభవించి తెలుసుకోవలసిందే తప్ప ఒకరు చేప్తే తెలిసేది కాదు'' అని లలితకళల ఆనందాన్ని గురించి వివరిస్తూ ఉంటారు. అంటే కళ కళకోసమే, ప్రేమ ప్రేమకోసమే, భగవంతుడు భగవంతుడి కోసమే, ఆనందం ఆనందం కోసమే అని చెప్పుకొన్నప్పుడు అక్కడ నేను, నాది అనే వ్యక్తిత్వం లేకుండా అహంకార, మమకారాలు లేకుండా ఆనందం సిద్ధిస్తుంది. ఆ విధంగానే ఆత్మ జ్ఞానంతో ధ్యానంలో భగవంతుడైన ఆత్మలో సాధకుడు సాధనలో కలిసినప్పుడు అనిర్వచనీయమయిన, అనుభ##వైకవేద్యమైన ఆనందం మాత్రమే కలుగుతుంది. అదే సచ్చిదానందం.
కాన మానవునికి ప్రతి ఒక్క కార్యంలోను, నేను నాది అనేవి లేనప్పుడు నిస్వార్థపూరితమైన భగవంతుడే నిలుస్తాడు. కాన శంకరాచార్యులవారు ఇక్కడ ఆత్మజ్ఞానంతో, ఆత్మమార్గంలో మానవుడు నడిచినప్పుడు, నేను నాది అనేది లేకుండా ఆతని గమ్యమైన ఆత్మ నిలుస్తుందని బోధించారు. నేను, నాది అనే ప్రేమలో ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక కోరిక ఆతనికి బహిర్గతంగా చోటు చేసుకొంటాయి. నేను, నాది అనేది విడిచిన సాధకునికి సంబంధించిన భగవంతుని ప్రేమలో ఆత్మజ్ఞానానికి సర్వ ఇంద్రియాలు, శరీరం, మనస్సువంటి వాటి అన్నింటిలోను చంచలత్వం తొలగి నిర్మలత్వం చేకూరుతుంది. మీరాబాయి అనుభవించిన ఆనందం ఇటువంటిదే. ఆమె సాకారంనుంచి నిరాకారానికి అంతర్ముఖం అయింది. ఆత్మమార్గంలో గురుబోధతో నిరాకారమైన ఆత్మానందం లక్ష్యమై సాధన చేయటం వల్ల సాధకునికి నేను, నాది అనేవి లేకుండా పోతాయి. అందుకే love is god ప్రేమే దైవం అని అంటూ ఉంటారు. భగవంతుడనే ఆత్మారాధనలో సాధకునికి ప్రేమ మినహా ఏవీ లేకుండా ఆనందం చేకూరుతుంది. మానవుల ప్రేమ అనగానే శారీరకమైన పర్యవసాయిగా ఇద్దరు ప్రేమికుల మధ్య తాత్కాలికమైన ఆనందం చివరికి మిగులుతుంది. భగవంతుని ప్రేమయందు ఇంద్రియాలు అంతర్ముఖం అయినప్పుడు అటువంటి రెండవ వ్యక్తి ఎవరూ నిలవరు. భగవంతుని ప్రేమలో శాశ్వతానందం మిగులుతుంది. ఈ నిర్మలానందాన్నే బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు తన భార్య అయిన మైత్రేయికి బోధించాడు. ఆత్మ మార్గంలో నేను, నాది అనే అజ్ఞానం నశించి పోయి తాను చేరవలసిన పరబ్రహ్మం ప్రతికార్యంలోను చోటు చేసుకొని ఆతనికి ఆనందమే పర్యవసాయిగా నిలుస్తుంది.
47 సమ్యక్ విజ్ఞానవాన్ యోగీ
స్వాత్మన్యే వాఖిలం జగత్
ఏకంచ సర్వమాత్మాన
మీక్షతే జ్ఞానచక్షుసా || 47
xqsª«sVùN`P „sÇì؃«sªyƒ±s = పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానియైన, యోగి = యోగి, జ్ఞాన చక్షుషా = జ్ఞానమనే కంటిచేత, అఖిలం సమస్తమైన, జగత్ = విశ్వాన్ని, స్వా+ఆత్మన్యేవ = తన ఆత్మయందే, చ = మరియు, సర్వం = అంతా కూడా, ఏకం = ఒకే చైతన్యం అయిన, ఆత్మానం = తన ఆత్మగా, ఈక్షతే = చూస్తాడు.
తా|| పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానియైన యోగి జ్ఞానమనే కంటి చేత సమస్తమైన విశ్వాన్ని తన ఆత్మయందే చూస్తాడు. మరియు సమస్తమైన ప్రపంచం అంతా కూడా ఒకే చైతన్యం అయిన తన ఆత్మగా దర్శిస్తాడు.
వివరణ :- అశాశ్వతమైన ఈ శరీరం తాను కాదని, శాశ్వతమైన ఆత్మే తానని తెలుసుకొని సచ్చిదానందంతో జీవించగలిగిన ఆత్మజ్ఞానియే పరిపూర్ణమైన యోగి అవుతాడు. అతడు సర్వకాల సర్వావస్థల యందు ఆత్మతో జీవించగలుగుతాడు. అతడు సాటిలేని ఆనందంతో మునిగి ఉంటాడు. కాన తనకంటే ఇతర వస్తువు ఏదీ అతనికి సాధనలో కనిపించదు. దానివల్ల సర్వమూ బ్రహ్మంగానే అతనికి కనిపిస్తుంది. అటువంటివాడు సాధనలో లేని సమయంలో కూడా తాను బ్రహ్మమేనని, కనిపించే సమస్త ప్రపంచమూ బ్రహ్మమేనని జ్ఞానోదయం పొందుతాడు.
ఆకాశం (space) అనంతమైందని, అది అనంతంగా వ్యాపిస్తుందని, దానికి పరిధిలేదని, దానికి అంతంలేదని, శాస్త్ర పరిశోధకులు భావిస్తున్నారు. ఆ విధంగానే చైతన్యం కూడా అనంతమైంది, అంతంలేంది అయి ఉంది. కాన ఆత్మ ఏదో ఒక ఉపాధి అనగా ఒక శరీరాన్ని మాత్రమే ఆశ్రయించి ఉంది అని అనుకోవటానికి వీలుకానిది. శుద్ధచైతన్యమే ఆత్మ కాన ఆత్మజ్ఞానికి అనంతమైన ఆత్మలోనే సర్వప్రాణులు ఉన్నాయి అని అనుభవమవుతుంది. అంటే క్రిమికీటకాదులు, పక్షులు, జంతువులు, పండితులు, పామరులు, భాగ్యవంతుడు, బీదవాడు, ఉన్నతుడు, అధముడు, పురుషుడు, స్త్రీ అని వ్యత్యాసం లేకుండా అన్నిటి యందును ఆత్మచైతన్యం ఒక్కటే అని ఆత్మజ్ఞానికి తెలుస్తుంది. కాన జ్ఞాని తన ఆత్మలోనే సర్వం ఉన్నాయి అని, అన్నిటిలోను తాను ఉన్నానని భావిస్తాడు. జ్ఞానికి ఏకత్వంలో అనేకత్వం, అనేకత్వంలో ఏకత్వం ద్యోతకమవుతాయి. అనంతమైన ఈ విశ్వగోళాలన్నిటి యందును ఉన్న పరమాత్మ ఒక్కడే కాన, పరమాత్మకు భిన్నంగా మరొకటి లేదని ఆత్మజ్ఞాని అనుభవాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞానికి అన్యంగా రెండవ వస్తువును దర్శించలేని స్థితి సిద్ధిస్తుంది. దాని వల్ల ఆతడు ఆత్మలోనే సర్వవిశ్వాన్ని దర్శిస్తాడు. అంతా ఆత్మ స్వరూపమే కాన ప్రపంచంలో ఆత్మ కాకుండా ఇంకొకటి ఏదీ లేదని ఆతడు తెలుసుకొంటాడు. ''ఆత్మైక్యం పొందిన యోగి సమస్త ప్రాణికోటులందును సమదృష్టి కలవాడై, తాను సర్వప్రాణి కోటులందు ఉన్నాననియు, సర్వప్రాణికోటులు తన యందు ఉన్నాయనియు, చూస్తాడు'' అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో (6-29) చెప్పాడు.
ఈ విధంగా చూడటం అనేది సామాన్యులకు వీలుపడదు. సామాన్యులు దేహభావనతో ఉంటారు. కాన వారికి దేహానికి దేహానికి మధ్య భేదం కనిపిస్తుంది. ఆత్మజ్ఞాని ఉపాధులందున్న భేదాన్ని చూడడు. కాన ఆతనికి ఆత్మభావనే దర్శనం ఇస్తుంది. ఆత్మజ్ఞానికి సాధనలో జ్యోతి మాత్రమే అనుభూతమై సర్వప్రపంచమూ మరుగునపడిపోతుంది. కాన ఆతడు సర్వమూ ఆత్మయే అని దర్శించగలుగుతాడు. ఆత్మయోగి కాని వాడు ఆ విధంగా చూడలేడు. ఆత్మజ్ఞానికి దీనివల్లనే నైతికోన్నతి సిద్ధిస్తుంది. ఎవరికి వారు తాము ఆత్మజ్ఞానులం అయ్యామా లేదా అని తెలుసుకోవటానికి కూడా ఈ భావన ఉపకరిస్తుంది. అన్నిటి యందును సమదృష్టి, సర్వభూతదయ, వంటి ఉన్నత గుణాలు కనిపిస్తున్నప్పుడే ఆత్మతో సాధకుడు జీవిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. లేని నాడు సాధకుడు పరిణతిని పొందలేదని తన సాధనను తీవ్రతరం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మానవుడు సర్వత్ర సమదృష్టితో ఉండగలగటాన్ని, ఆత్మతో జీవించటాన్నే ఈనాడు చాలామంది సహజయోగం అని చెపుతున్నారు. ఆంధ్రుడైన జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా విదేశాలలో ఈ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని గురించే బోధించారు. అమెరికాలో థియోసాఫికల్ సొసైటీవారు జిడ్డు కృష్ణమూర్తిగారికి వారి సొసైటీకి పట్టాభిషేకం చేయటానికి అన్నీ సిద్ధం చేసుకొన్నాక దాన్ని కాలదన్ని ఆత్మజ్ఞానాన్ని గురించే లోకానికి చాటిచెప్పాడు.
''వేదాధ్యయనం వల్ల కాని, వివేకం వల్లకాని, శ్రవణం వల్ల కాని, ఆత్మ జ్ఞానం కలుగదు. ఆత్మను ఎంచుకొన్న వారికే అది లభిస్తుంది. అట్టివారికే తన తత్త్వాన్ని ఆత్మ చూపుతుంది..'' అని కఠోపనిషత్తులో (1-2-23) చెప్పబడి ఉంది. ఆత్మ అనే భగవంతుని అనుగ్రహం ఎవరికి కలుగుతుందో వారికే ఆ ఆత్మ దర్శనం లభిస్తుంది. వారికే ప్రపంచం అంతా స్వచ్ఛమైన జ్యోతి వలె ప్రకాశిస్తుంది. అదే బ్రహ్మం. అంటే అక్కడ మనస్సుకు స్థానం లేదు. అక్కడ మనస్సు ఆత్మలో లీనమైపోతుంది. అందువల్ల ఆత్మజ్ఞానికి అన్నిటి యందు బ్రహ్మమే దర్శనమిస్తుంది. సాధకుడు సాధన చేస్తున్నది దేన్నో కొత్తదాన్ని తెలుసుకోవటానికి కాదు. సాధకుడు సాధనలో తన నిజతత్త్వాన్ని తెలుసుకోవటానికే ఆతడు నిరంతరం సాధన చేస్తున్నాడు. సాధనలో పరిపూర్ణ ప్రగతి సాధించినప్పుడే ఆతడు సర్వజీవులను తనలోను, తనను సర్వజీవులలోను చూడగలుగుతాడు. సాధకుడు భగవంతుని ప్రేమవాహినిలో మునిగిపోతే భగవంతుని భక్తి అనే ప్రేమ వెల్లువలో ఆతనికి జన్మతః వచ్చినటువంటి నేను నాది అనే వ్యక్తిత్వం కొట్టుకుపోయి బ్రహ్మత్వమే నిలుస్తుంది.
ఆత్మజ్ఞానం, ఆత్మమార్గం, ఆత్మానందం అనేవి ఆధునిక కాలంలో చాలామందికి ఆదర్శాలుగా కనిపిస్తున్నాయే కాని ఆచరణయందు అవి గాలికి కొట్టుకుపోతున్నాయి. కారణం ఏమిటంటే వాళ్ళ అవసరాలు వాళ్ళను ఆ విధంగా బాధిస్తున్నాయి. వాళ్ల అవసరాలైన కాంతకనకాల ముందు, వాళ్ళను పట్టిపీడిస్తున్న కామక్రోధాదుల ముందు ఆత్మజ్ఞానమనే ఆదర్శం పేలపిండిలా ఎగిరిపోతుంది. వాళ్ళ జీవనవిధానంతో వాళ్ళ అవసరాలు అంత ప్రాధాన్యం వహిస్తున్నాయి. వ్యామోహాలకు నిలయమైన నేటి సమాజంలో వాళ్ళ అవసరాలముందు అన్ని ఆదర్శాలూ కొట్టుకుపోతున్నాయి అని జ్ఞానం తీసుకొన్న వాళ్ళుకూడా బాధను వ్యక్తం చేస్తున్నారే కాని వాళ్ళు ఆచరణలో, సాధనలో స్థిరంగా పాతుకోలేక పోతున్నారు. సాధకులు విడువలేని వ్యసనాలకు, సుఖాలకు, ఆకాంక్షలకు ఆత్మజ్ఞానం, ఆత్మమార్గం, ఆత్మ సాధన సరైన పరిష్కారాన్ని అందిస్తుందని, ఆచరణలో ఓర్పుతో, పట్టుదలతో వాళ్ళు నిలిచిననాడు సంపూర్ణంగా వాళ్ళు తెలుసుకో గలుగుతారు.
48 ఆత్మై వేదం జగత్సర్వం
ఆత్మనో2న్యత్ న విద్యతే
మృదో యద్వత్ ఘటాదీని
స్వాత్మానం సర్వమీక్షతే || 48
xmnsVÈÁ+ఆదీని = కుండలు మొదలైనవి, మృదః = మట్టినుండి వచ్చినవే అని ఏవిధంగా తెలుస్తుందో, యద్వత్ = ఆవిధంగానే (ఆత్మజ్ఞానం కలిగిన వానికి), ఇదం = ఈ, సర్వం = సమస్తమైన, జగత్ = విశ్వం, ఆత్మ+ఏవ = ఆత్మయే అయి ఉంది. ఆత్మనః+అన్యత్ = ఆత్మకంటే వేరుగా, న విద్యతే = ఇంకొకటి ఏదీ లేదు (అని తెలిసి), ఈక్షతే = చూడబడుతున్న, సర్వం = సమస్తమైన ప్రపంచం, స్వ+ఆత్మానం = తన ఆత్మయే (అని తెలిసి జీవిస్తాడు).
తా|| కుండలు మొదలైనవి మట్టినుండి వచ్చినవే అని ఏవిధంగా తెలుస్తుందో ఆ విధంగానే ఆత్మజ్ఞానం కలిగిన వానికి ఈ సమస్తమైన ప్రపంచం ఆత్మయే అయి ఉంది. అంత కంటే వేరుగా ఇంకొకటి ఏదీ లేదు అని తెలిసి చూడబడుతున్న సమస్త ప్రపంచం తన ఆత్మయే అని తెలిసి జీవిస్తాడు.
వివరణ :- సాధకునికి సర్వం ఆత్మగా కనిపించటంవల్ల ఆతడు జీవన్ముక్తుడవుతాడు. దానివల్ల ఆతడు జ్ఞానసిద్ధుడై తనను ఆశ్రయించిన వారి కందరకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు. ఇక్కడ ప్రధానంగా గ్రహించవలసింది ఏమిటంటే ఆత్మజ్ఞానం తెలియటం వేరు, జ్ఞాన సిద్ధుడు అవటం వేరు అనేది బాగా అర్థం చేసుకోవాలి. గురువు బోధించిన ఆత్మజ్ఞానం తెలియగానే సాధకుడు ఆత్మను అయిపోయానని భావించరాదు. సాధకుడు ఎక్కడకు చేరాలో, ఎట్లా చేరాలో, ఏ విధంగా సాధన చేయాలో వంటివి గురువు శిష్యునికి బోధించాడు. దానితో గురువు ఇచ్చిన జ్ఞానాన్ని సాధకుడు నమ్మి, జ్ఞానమునందు, గురువునందు విశ్వాసంతో సాధకుడు నిరంతరం సాధన చేసిననాడు, అరుణోదయం అయినట్లు, జగత్తు అంతా అదృశ్యమై అనంతమైన కాంతి దృశ్యమానం అవుతుంది. అప్పుడు సాధకునికి కాంతి తప్ప మరొకటి ఏదీ కనిపించని స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో ఆతడు ఆత్మానందంలో లీనమైపోతాడు. ఆతనికి దృశ్యమాన ప్రపంచం అంతా గోచరించకుండా పోతుంది. ఆతనికి వినిపించే శబ్దం అంతా నిశ్శబ్దంలో లీనమై పోతుంది. ఆ విధంగా సాధకునకు ఏదీ కనబడకుండా, వినబడకుండా అయిననాడు ఆతడు ఆత్మలో లీనమై అఖండానందామృత మహాసముద్రంలో ఓలలాడతాడు. అప్పుడు అంతా ఆత్మే తప్ప మరొకటి ఏదీ లేదని ఆతనికి అవగతమవుతుంది. ఆ విధంగా సాధకుడు ఆత్మతత్త్వ బోధనలో స్వస్వరూపజ్ఞానాన్ని గ్రహించటంవల్ల ఆత్మే సర్వస్వం అని, ఆత్మలోనే అన్నీ ఉన్నాయి అని అద్వైతభావంతో సర్వాన్ని తిలకించగలుగుతాడు.
దీన్ని అవగాహన చేసుకోవటానికే మట్టితో చేయబడిన కుండను కార్యకారణ సంబంధానికి అనుకూలంగా శంకరాచార్యులవారు ఉదాహరించారు. లోకం అంతా వస్తువులుగాను, రకరకాల జీవరాసులుగాను కనిపిస్తూ ఉంటే అంతా ఆత్మేనని, ఆత్మలోనే అన్నీ ఉన్నాయి అని ఎట్లా తెలుస్తుంది. అనే దానికే ప్రత్యక్ష సాక్ష్యంతో నిరూపించి చూపించారు. నగలన్నీ అనేకంగా కనిపిస్తున్నా అందులో ఉన్న బంగారం ఒకటే కదా? సముద్రంలో అలలన్నీ అనేకం కనిపిస్తున్నా అందులో ఉన్న నీరంతా ఒకటే కదా? కుండా మొదలైన అనేక పింగాణీ పాత్రలు కనిపిస్తున్నా అవి తయారవటానికి ఉపయోగపడిన మన్ను ఒకటే కదా? ఆవిధంగానే అనేకమంది అనేక రకాలుగా కనిపిస్తున్నా వారిలో ఉన్న చైతన్యం ఒకటే అయి ఉంది అని సాధకుడు తన అనుభవం ద్వారా గ్రహించగలుగుతాడు. కారణజ్ఞానమైన మట్టి ద్వారా కార్యజ్ఞానమైన కుండలు తెలిసినట్లుగానే కారణజ్ఞానమైన ఆత్మద్వారా కార్యజ్ఞానమైన ప్రపంచ వస్తువులు అన్నీ తెలుస్తున్నాయి. కుండలు మట్టికంటే వేరుకానట్లే ప్రపంచం అంతా కూడా ఆత్మకంటే వేరుకాదు అని సాధకుడు తెలుసుకొని అద్వైత భావంతో సంఘాన్ని, జీవుల్ని, ప్రకృతిని చూడగలుగుతాడు.
ఇది వినటానికి ఆశావాదంగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే లోకంలో వాళ్ళ వాళ్ళ అవసరాలకు, వాళ్ళ అర్థాలకు అనుకూలంగా ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని మూడు ముక్కలు చేసి మూడు అర్థాలు చెప్పి, అద్వైత మంటే, విశిష్టాద్వైత మంటే, ద్వైతమని ప్రక్కవాడి బుర్రను తినేసే సంఘంలో మానవులకు శాంతి సౌఖ్యాలు ఎట్లా లభిస్తాయి ? మగవాడికి ఒక్కడికే జంధ్యం వేస్తే పవిత్రం కాలేదు, స్త్రీకి కూడా జంధ్యం వేయాలి. అని ఆర్యసమాజ్ వాళ్ళు అందరికి గాయత్రీ మంత్రాన్ని బోధించి, ప్రతి ఇంటిలో హోమగుండాన్ని ఏర్పరచి, క్రతుకార్యక్రమంతో జీవితాన్ని నడపాలని ఒక ప్రక్క ప్రయత్నిస్తుంటే, హరే రామ హరే కృష్ణ వాళ్ళు ప్రతివానికి పిలకపెట్టి, జంధ్యం వేసి, గాయత్రీ మంత్రాన్ని నేర్పి, అందర్ని బ్రాహ్మల్ని చేస్తామని మరొక ప్రక్క కార్యక్రమాల్ని కొనసాగిస్తుంటే, ఈ సంఘంలో మానవునకు సుఖశాంతులు ఎక్కడ లభిస్తాయి? సమసమాజస్థాపనకు, ఉన్నత సమాజ స్థాపనకు ప్రయత్నిస్తామని కర్మకాండలకు ప్రాధాన్యాన్ని ఇచ్చి, ఉన్న నిజం దగ్గరకు మానవుని చేర్చకుండా నడచిననాడు మానవునకు శాంతి సౌఖ్యాలు ఏ విధంగా చేకూరుతాయి? విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని విడిచి అందరిలోను ఆత్మ దర్శించిననాడు శంకరాచార్యులవారు బోధించిన బ్రహ్మసత్యం. జగం మిథ్య, బ్రహ్మసర్వస్వం అనేవి ఆచరణయోగ్యం అవుతాయి.
తోటివారి అనుభవంతో ప్రేరణపొంది సాధన ప్రారంభించినవారికి ఉత్సాహం ఎక్కువ కలుగుతుంది గనుక స్వామి శివానంద సరస్వతిగారు రాసిన Spiritual Experiencences ధ్యానము అనుభూతి అనే గ్రంథంలో చెప్పిన కొన్ని అనుభవాల్ని ఇక్కడ పేర్కొంటాను. సాధకునికి గురువు సాంగత్యం ఎల్లవేళల ఉండటానికి వీలుకానప్పుడు అనుభవం ఉన్న సాధకుని పర్యవేక్షణలో సాధన చేసిన నాడు అద్భుతమైన అభివృద్ధి చేకూరుతుందని స్వామి శివానంద సరస్వతిగారు చెప్పి ఉన్నారు.
''ధ్యానంలో అరుదుగా దేదీప్యమానమైన ప్రకాశంతో వెలుతురును చూడగలవు. ఈ ప్రకాశవంతమైన కాంతి హృదయంలో కల సుషుమ్న నుండి వెలువడుతుంటుంది' (21పేజీ)
''దివ్య జ్యోతి అనేది గాఢమైన చీకటి గదిలో సన్నని రంధ్రం గుండా సూర్యకాంతి ప్రసరించినట్లుగా సాధకునికి ఈ సన్నని కాంతి కిరణం కనబడుతుంది'' ''ఈ ఆకస్మిక జ్యోతి యొక్క కాంతి వైభవం సాధకునికి తలమునకలు చేసి, శ్వాసను బంధించి, నోటమాట పెగల నీయదు.'' ''సాధకునికి కృతజ్ఞతా భావంతో, శరీరం కంపిస్తుంది. దైవమే ఈ జ్యోతి రూపంలో ప్రచండమైన తేజస్సుతో కూడి ఆవిర్భవించినప్పుడు సాధకుడు నిరుత్తరుడై తత్తరపడి దిగ్భ్రమ చెందుతాడు''. ''సాధకుడు ఇలాంటి దృశ్యం కనిపించగానే భయపడతాడు. శరీర చైతన్యం దాటి వెళ్ళటానికి గజగజవణుకుతాడు. శరీర చైతన్యం దాటి వెళ్ళేటప్పుడు తిరిగి యథాస్థితికి వస్తానా? రానా? అని దిగులుపడతాడు. ఈ మాత్రానికి భయపడ వలసింది లేదు. మన ఈ ప్రయత్నాలన్నీ శరీర చైతన్యం అధిగమించి ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో ఏకం కావటానికే కదా!'' (29వ పేజీ నుంచి 31 పేజీవరకు)
''అనాహత శబ్దం వినిపిస్తుంది. దీన్నే నాదానుసంధానం అంటారు'' ''సాధకుని సాధన వల్ల నాడీ మండలం పరిశుద్ధం చెంది సూక్ష్మమైన ప్రాణశక్తి యొక్క ప్రవాహం ఏర్పడటానికి చిహ్నంగా ఈ శబ్దాలు వినిపిస్తాయి. ఈ అనాహత శబ్దాన్ని ఓంకార ధ్వని అని కూడా అంటారు''. ''ఈ దివ్యమైన అనాహత శబ్దాలు ప్రతి ప్రాణిలోనూ, ఎల్లప్పుడూ వినబడుతూ ఉంటాయి. ఈ అంతర్వాణిని వినటానికి సహనంతో కూడిన సాధనలు అవసరం''. బొటన వ్రేళ్ళతో నీ చెవులు మూసి కళ్ళుమూసి శ్రద్ధగా హృదయం ఏకాగ్రత చేసినప్పుడు ఈ అనాహత శబ్దాలు వినబడతాయి. అందుకు ఎంతో శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇక్కడ వినటం అనేది ప్రసక్తి కాదు. ఆ వినబడేదాని కంటే వేరేగా ఉండి వినేది ఏదో అది ప్రస్తుత ముఖ్యవిషయం''
అదేవిధంగా అనేక రకాలైన శబ్దాలు వినిపిస్తాయి. ''మొట్టమొదట చిట్ శబ్దం, రెండవది చిణ్ చిణ్ శబ్దం మూడవది గంటానాదం, నాల్గవది శంఖారావం, ఐదవది వీనానాదం, ఆరవది తాళధ్వని, ఏడవది పిల్లనగ్రోవి శబ్దం, ఎనిమిదవది భేరీనాదం, తొమ్మిదవది మృదంగ శబ్దం, పదియవది మేఘాల ఉరుముల శబ్దం వినిపిస్తాయి. ఈ పదవ శబ్దం అన్ని శబ్దాల్ని అధిగమించగలదు. ఆ తర్వాత ఆశబ్దం నిశ్శబ్దమై ఇక ఏ శబ్దమూ వినిపించదు.
(22వ పేజీనుంచి 23వ పేజీవరకు)
అదే విధంగా ధ్యానసాధనలో ఒక్కొక్కప్పుడు సాధకునికి కదలికలు వస్తాయి. ''ధ్యాన సాధన ప్రారంభ దశలో చేతుల మీద, కాళ్ళమీద, మొండెం మీద, శరీరం అంతటా నెమ్మెదిగా కుదిపినట్లు కదలికలు వస్తాయి. ఒక్కొక్క దఫా ఈ కదలికలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయినా భయపడ వలసిన పని లేదు. సాధన వదిలి పెట్టవలసిన పనిలేదు. ఇవి ఏమీ నష్టం కలిగించవు. కొత్తగా ప్రాణశక్తి ప్రవహించటం వల్ల, నాడుల్లో చైతన్యం ఏర్పడి, దాని ఫలితంగా కండరాలు సంకోసించినప్పుడు ఈ కదలికలు ఏర్పడతాయి. సాధకునికి సాధన కారణంగా నాడీ మండలం శుద్ధమై కొత్త ప్రాణశక్తి ప్రవాహం ఏర్పడినట్లు ఈ కదలికల మూలంగా గుర్తించవచ్చు. కొద్ది రోజుల తర్వాత ఈ కదలికలు కనిపించవు''.
''ధ్యాన సమయంలో అప్పుడప్పుడు శరీరంలో తిమ్మెర ఏర్పడుతుంది. ఇది, ధ్యాన విధానంతో ఆయా అవయవాల నుండి ప్రాణశక్తిని మెదడుకు తీసుకుపోబడిన కారణంగా ఆ భాగల్లో స్తబ్ధత ఏర్పడి తిమ్మెరగా మారుతుంది. ఈ స్థితిని కూడా సాధకుడు అధిగమిస్తాడు. ఇది సాధకుని ధ్యానాభివృద్ధికి ఒక చక్కని సూచన. ఇప్పుడు ఎక్కువ శ్రమించి సహనంతో ఎంతో సాధన చేయ వలసి ఉంది. ఉత్సాహంతో సంతోషంగా ఉండు.''
(17వ పేజీ నుండి 18వ పేజీ వరకు)
సాధనలో సాధకునికి అమృత స్రావం పానం చేయటం జరుగుతుంది.''కపాలం క్రింది భాగాన, నోటి అంగిలికి మూలమున ఈ సోమరస ఉద్భవ స్థానం ఉంది. ఈ రసం జిహ్వకు ఇంపుగా ఉంటుంది. ఈ రసం ప్రథమ స్థితిలో ఉప్పగా, తర్వాత ఆల్కహాల్ వలె, తర్వాత చేదుగా, ఆ తర్వాత అనుభవంలో వరుసగా నెయ్యి, పెరుగు, తేనె, తాటిరసం, ఆపైన చివరగా అమృతం వలె ఉండగలదు. (63వ పేజీలో)
ఈ అనుభవాలన్నీ ఆత్మసాక్షాత్కారం కాదు. ఇవి అన్నీ సాధకుని ఉత్సాహపరచి ముందుకు నడిపించటానికి ఉపకరిస్తాయి. గురువునుంచి వచ్చే ప్రేరణ వల్ల ఆనందం అధికమవటానికి ఇవి ఉపకరిస్తాయి. అంతే కాని వేరుకాదు. సాధకుడు ఈ ప్రేరణలన్నిటిని ఎగర గొట్టి సాధన అధికతరం చేస్తూ ముందుకు నడవాలి.
''కొందరిలో ఈ దృశ్యానుభవాలు ఏవీ ఉండవు. అయినప్పటికి సాధనలో అభివృద్ధి కనిపిస్తుంది.'' (13వ పేజీ)
కావున సాధకుడు గురువు ఆజ్ఞను పాటిస్తూ ఆయన ఆజ్ఞాపాలనో నడుస్తుండాలి. సాధకునికి సహోదర భావం, వసుదైక కుటుంబం వంటి ఉన్నత ఆశయాలు ఆచరణలో కొనసాగుతూ ఉండాలి. అప్పుడే సాధకునికి గమ్యం చేరువ అవుతుంది.
49 జీవన్ముక్తస్తు తద్విద్వా
న్పూర్వోపాధి గుణాన్ త్యజేత్
సచ్చిదానంద రూపత్వాత్
భ##వేద్భ్రమర కీటవత్ || 49
ú˳ÏÁª«sVLRi NUPÈÁª«s»`½ = తుమ్మెద వల్ల పురుగు తుమ్మెదగా మారినట్లు, జీవత్+ముక్తః+తు = జీవించి ఉండగానే శరీరాన్నుంచి ఆత్మకు విముక్తి కావించి ఆత్మతో జీవించ గలిగిన వాడు అయితే, తత్+విద్వాన్ = ఆ ఆత్మకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కలిగి, పూర్వ+ఉపాధి గుణాన్ = ఆత్మజ్ఞానంతో జీవించటానికి పూర్వం శరీరానికి అలవాటు అయి ఉన్న గుణాలను, త్యజేత్ = వదిలిపెట్టి, సత్+చిత్+ఆనంద రూపత్వాత్ = సచ్చిదానంద రూపం అవటం చేత (బ్రహ్మచింతన చేత బ్రహ్మంగా మారుతున్నాడు).
తా|| భ్రమరంవల్ల కీటకం భ్రమరంగా మారినట్లు, జీవన్ముక్తుడు అయితే, ఆత్మజ్ఞానం కలిగి పూర్వశరీరానికి అలవాటు అయి ఉన్న గుణాలను వదిలిపెట్టి, సచ్చిదానంద రూపం అవటం చేత నిరంతరం బ్రహ్మ చింతన చేత బ్రహ్మంగా మారుతున్నాడు.
వివరణ :- సాధకుడు తనకు పూర్వంనుంచి ఉన్న ఉపాధి గుణాలను మార్చుకొని బ్రహ్మభావనకు అనుకూలంగా జీవిస్తుంటే, ఆత్మజ్ఞానంతో నిరంతరం ఆతడు సాధన చేస్తుంటే, పసిబాలుని హృదయంతో నిష్కపటంతో జీవిస్తుంటే, మానవత్వాన్ని ఆచరణలో ఆతడు కొనసాగిస్తుంటే, ప్రపంచం అంతా ఆతనికి వసుధైక కుటుంబంగా కనిపిస్తుంటే, లోకం అంతా ఆతనికి బ్రహ్మమే అనే భావన నిలుస్తుంటే, అప్పుడు ఆతడు జీవన్ముక్తుడవుతాడు. అన్నిటికీ అయితే, అయితే అంటుంటే ఎప్పటికి సాధకుడు పరిశుద్ధుడవుతాడు అనే సమస్య సామాన్యమైన జిజ్ఞాసువులకు ఉద్భవిస్తూ ఉంటుంది కదా? కారణం సంఘంలో ఉన్న అత్యధిక సంఖ్యాకులు స్వార్థపూరిత చింతనతో, ముక్కుపుటాలు అదిరిపోయేటంత దుర్గంధ భూయిష్ఠంగా జీవితాల్ని కొనసాగిస్తుంటే, జిజ్ఞాసువునకు ఆత్మమార్గం అనేది, ఆత్మజ్ఞానం అనేది శ్మశానంలో మంగళశ్లోకాలు పలికినట్లుగా ఉంటుంది కదా అని ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారు వాపోతుంటారు. ఆ విధంగా ఆలోచించే వాళ్ళకు, ఆ విధంగా జీవించే వాళ్ళకు గురుమహారాజ్‌జీ గారు ఒకే ఒక్క ఔషధం సేవించటానికి అందిస్తానంటూ ఉంటారు. నేను ప్రసాదించే ఆత్మజ్ఞానం స్వీకరించండి, జ్ఞానం మీద నమ్మకం, విశ్వాసం ఉంచి ప్రతినిత్యం ఒక గంట సాధన చేస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తుంటే, ఆ ఆత్మ జ్ఞానమే మీరు మలభాండంగా భావిస్తున్న శరీరాన్ని పవిత్ర దేవాలయంగా చేస్తుంది అని అంటారు. జిజ్ఞాసువులు ఉన్నదాన్ని నిందించుకొంటూ బాధపడటం కాదు చేయవలసింది; ప్రతి దినం ఒక్కొక్క లోపాన్ని సాధనలో తొలగించుకోవటానికి, మనస్సుకు బోధించుకొంటూ, వాసనాక్షయానికి అనుకూలంగా జీవిస్తూ ముందుకు నడవాలి. దానికోసమే సాధకులైన ఉత్తములు పూనుకొని ఈ ఉత్తమ కార్యాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని కార్యనిర్వహణను కొనసాగించాలి. దానికే వివేకానందుడు ఆయన సంపూర్ణ గ్రంథావళిలో 4వ భాగంలో 246 పేజీలో ఈ విధంగా బోధించారు.
''అనంత ఆనందాన్ని మనకు ప్రసాదించే మార్గం ధ్యానం. ప్రార్థనలు, కర్మకలాపాలు, ఇతర విధాలైన పూజలు ఇవన్నీ పూజలు ధ్యానం యొక్క ప్రాథమిక స్థితులు మాత్రమే. ప్రార్థన చేస్తూ ఏదో ఒకటి నివేదన చేస్తావు. ఒక సిద్ధాంతం ప్రకారం ప్రతిఒక్కటీ ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేస్తుంది. కొన్ని పదాలు, పుష్పాలు, ప్రతిమలు, దేవాలయాలు, హారతి ఇవ్వటానికి ఉపయోగించే దీపారాధనలు ఇత్యాదులు ఆధ్యాత్మిక దృక్పథానికి మనస్సును చేరుస్తాయి. కానీ ఆ దృక్పథం మరెచ్చటా లేదు. మానవుని ఆత్మలోనే ఉంది. మనుష్యులంతా ఇది చేస్తూనే ఉన్నారు. కానీ వారు తెలియకుండా దేనిని చేస్తున్నారో, దానినే తెలుసుకొని (ధ్యానంలో సాధకులు) చేస్తారు. అదే ధ్యానం యొక్క శక్తి. నెమ్మదిగా క్రమక్రమంగా మనకి మనం తర్ఫీదు ఇచ్చుకోవాలి''. అట్లా తర్ఫీదు ఇస్తుంటే ధ్యాన సాధనలో సాధకునికి ఆత్మ ఏ విధంగా మారుతుందో చెప్పటానికి వివేకానందుడు ఆయన సంపూర్ణ గ్రంథావళిలో 4వ భాగంలో 227 పేజీలో ఈ విధంగా చెప్పాడు. ''మానవుని ఆత్మ నిర్మలమైన స్ఫటికం వంటిది. కానీ దాని దగ్గర ఏ వస్తువుంటే, ఆ వస్తువు రంగును పొందుతుంది అది. ఆత్మ దేనిని స్పర్శిస్తే దాని రంగునే పొందుతుంది. అదే కష్టమైన విషయం. అదే బంధాన్ని కలుగచేస్తుంది. ఆ రంగు ఎంత దృఢంగా ఉంటుందంటే, స్ఫటికం తనను తాను మరచి, ఆ రంగులోనే కలిసిపోతుంది. ఉదాహరణకి - స్ఫటికం ప్రక్కన ఎర్రపూవు ఉన్నదనుకోండి. స్ఫటికం ఆ ఎర్ర రంగునే పొంది, దానితోనే తాదాత్మ్యం చెంది, తాను కూడా ఎరుపేనని అనుకొంటుంది.
ఈ శరీరం అనే రంగునే తీసుకొని ఆసలు మన స్వరూపమే మరిచాం. మనకుగల భయాలు, చింతలు, ఆందోళనలు, కష్టాలు, దోషాలు, బలహీనతలు, చెడుగుణాలు - వీటి అన్నిటికీ మూలహేతువైన గొప్పపొరపాటు మనం శరీరం అనుకోవటమే!
ధ్యాన సాధనను కొనసాగించాలి. స్ఫటికానికి తానేమిటో తనకు తెలుసు. అనుకూల సమయమందు తన స్వంత రంగును తాను పొందుతుంది ఇతర అన్ని విషయాల కన్నా ధ్యానమే మనల్ని సత్యానికి దగ్గరగా చేరుస్తుంది'' అని వివేకానందుడు చెప్పాడు.
భగవంతుణ్ణి మనకు బాహ్యంగా కనుగొనుట అసాధ్యం. బయట కనిపించు దివ్యత్వం అంతటకు మన ఆత్మయే కారణం. మనమంతా శ్రేష్ఠులమైన దేవాలయాలమే.''అని వివేకానందుడు ఆయన సంపూర్ణ గ్రంథావళి 5వ విభాగంలో 59వ పేజీలో చెప్పాడు.
úxms¼½ª«sWƒ«sª«so²R…V »R½ƒ«s aRPNTPò¬s »yƒ«sV ‡Áz¤¦¦¦LæRi»R½Li ¿Á[xqsVN][ª«sÉجsNTP úxms¸R…V»R½õLi ¿Á[¸R…WÖÁ. µy¬sNTP úxms¼½ª«sWƒ«sª«so¬sNTP INRP ryµ³R…ƒ«s NSªyÖÁ. A ryµ³R…ƒ«s ÛÍÁ[NRPF¡¾»½[ ª«sWƒ«sª«so²R…V »R½ƒ«s aRPNTPò¬s »yƒ«sV ¾»½ÌÁVxqsVN][ÛÍÁ[²R…V. @µôR…LiÛÍÁ[NRPF¡¾»½[ (ª«sVƒ«s ª«sVVÆجsõ) ª«sVƒ«sLi µR…Lji+Li¿RÁÛÍÁ[Li NRPµy @¬s „s®ªs[NSƒ«sLiµR…V²R…V @LiÉزR…V. ª«sVƒ«sNRPV ª«sVƒ«s A»R½ø »R½xmsö ®ªs[L]NRP ˳ÏÁgRiª«sLi»R½V²R…V ÛÍÁ[²R…V @¬s „s®ªs[NSƒ«sLiµR…V²R…V A¸R…Vƒ«s xqsLixmspLñRi úgRiLi´yª«s×Á 2ª«s „s˳ØgRiLiÍÜ[ 470ª«s }msÒÁÍÜ[ xqsöxtísQLigS ¿ÁFyö²R…V.
''మానవ శరీరంలోని దేవుని పూజించలేకపోయినట్లయితే ఇతర దేవాలయం ఏదీ ప్రయోజనకారి కాజాలదు'' అని వివేకానందుడు ఆయన సంపూర్ణ గ్రంథావళి 2 విభాగం 306వ పేజీలో చెప్పాడు.
మనం ఏది భావిస్తే అదే అవుతాం అని అందరూ నమ్మి ప్రతినిత్యం ఆత్మమార్గంలో సాధన కొనసాగించాలి. దానికి ఉదాహరణగా సన్యాసి వ్యభిచారి కథ వినదగింది.
ఒక సన్యాసి ఒక వ్యభిచారి వద్దకు వెళ్ళి అనేక సార్లు నువ్వు నరకానికి వెళతావు అని ఆయన హెచ్చరింస్తుండేవాడు. పేదరికంలో ఉన్న ఆ స్త్రీ జీవనోపాధికి తనకున్న ఒకే ఒక మార్గాన్ని మార్చుకోలేక తన దైన్యస్థితిని భగవంతునికి తెలియజేస్తూ, రోదిస్తూ, విలపిస్తూ, తనను క్షమించమని ఆమె ప్రార్థించేది. కాల క్రమేణా ఆ ఇద్దరు చనిపోయారు. వేశ్య స్వర్గానికి వెళ్ళింది. సన్యాసి నరకానికి వెళ్ళాడు. ఆవిడ విముక్తి కోరింది గనుక ఆవిడకు స్వర్గం లభించింది. సన్యాసి ఉత్తముడైన ఎప్పుడూ ఇతరులలోని చెడును విమర్శించటం పైననే కేంద్రీకృతం చేశాడు. కనుక ఆతనికి నరకం ప్రాప్తించింది. కనుక సాధకుడు నిరంతరం ఏది ఆశిస్తాడో అది పొందుతాడు అని వివేకానందుడు ఆయన సంపూర్ణగ్రంథావళిలో 8వ విభాగంలో 19వ పేజీలో ఈ విషయాన్ని ఉదాహరించి చెప్పాడు.
మానవుడు ఏది కావాలంటే అదే అవుతాడు అని అనటానికి ఉదాహరణగా అబ్రహం లింకను జీవిత చరిత్రను తీసుకోవచ్చు. అబ్రహం లింకను చిన్నప్పటి నుంచి నిరంతరం అమెరికా ప్రెసిడెంటు కావాలని భావించాడు. అమెరికా ప్రెసిడెంటు అయిన వాషింగ్టన్ జీవిత చరిత్రను అనేకసార్లు చదివాడు. దానికోసం ఓర్పుతో, పట్టుదలతో, విశ్వాసంతో నిరంతరం సాధనచేశాడు. మునిసిపాలిటి కౌన్సిలర్ వంటి వాటికి పోటి చేసి గెలిచాడు. తన చుట్టూ ఉన్న వారికి నిరంతరం సేవ చేశాడు. అట్లాగే అధ్యక్షోపన్యాసం ఇవ్వటానికి వెళ్ళటానికి తగిన బట్టలు కూడా లేవు. ఆ స్థితిలో ఆతని భార్య ఆయనకు సూటును కుట్టించి ఇచ్చింది. అది వేసుకొని ఆయన ఉపన్యాసం ఇవ్వటానికి నడిచి వెళుతుంటే దారిలో ఒక వృద్ధస్త్రీ ట్రయనుకు వెళ్ళటానికి చాలా ఆందోళన పడుతుంది. ఆవిడ పెట్టెను మోసేవాడు దొరకక బాధపడుతుంది. ఆవిడ ట్రయనుకు టైం అయిపోయింది. అబ్రహాంకు కూడా అధ్యక్షోపన్యాసానికి వెళ్ళటానికి ఎంతో టైం లేదు. అయినా ఆయన ఆవిడ బాధను అర్థంచేసుకొని ఆవిడపెట్టెను తన నెత్తమీదపెట్టుకొని ట్రయనులో ఆ పెట్టెపెట్టి, ఆవిడను తన రెండు చేతులతో ఎత్తి కదులుతున్న ట్రయనులో పెట్టి ఆమెను ట్రయనుకు అందించగలిగాడు. ఆవిడ నీ పేరిమిటి నాయనా అని అడిగితే ఆబ్రహాం లింకన్ అని చెప్పాడు. ప్రెసిడెంటుకు పోటీ చేస్తున్న ఆబ్రహాంలింకనువా అని అడిగితే అవునని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. దాని తర్వాత ఆదుర్దగా అధ్యక్షోపన్యాసానికి నడిచి వెళుతుంటే దారిలో పంది ఆర్తనాదం వినిపించింది. ఏమిటి దాని నిస్సహాయస్థితి అని అనుకొంటు ఆ ధ్వని వస్తున్న వైపుగా ఆయన వెళ్ళాడు. పంది ఊబిలో కూరుకుపోయి రాలేకపోతుంది. దాన్ని రక్షించటానికి ప్రయత్నిస్తే తన సూటు పాడైపోతుంది. తనకు ఆ సమయంలో ఆ బట్టలు ఎంతో ముఖ్యం అనే భార్య నానా కష్టాలు పడి తయారు చేయించి ఇచ్చింది. అయినా లెఖ్ఖ చేయకుండా దాన్ని రక్షించి తన లక్ష్యాన్ని చేరటానికి బట్టల్ని దులుపుకొంటూ ఆయన వెళ్ళాడు. అందరూ ఆయన మలిన వస్త్రాలను చూసి ఆయనను గేలి చేశారు. వాళ్ల అవహేళనలను, నవ్వుల్ని లెక్కచెయ్యకుండా తాను చెప్పదలచింది ఉపన్యసించాడు. మలిన వస్త్రాలతో ఉన్నా అమలిన హృదయంతో, అమలిన భావాజాలంతో ఆయన సభికుల హృదయాలను అలరింప చేశాడు. ఆయన ఆశయాలకు ముగ్ధులైన ప్రజలు లింకనును ప్రెసిడెంటుగా గెలిపించారు. లింకను ప్రెసిడెంటు అయినా కూడా ఆయన జీవితకాలంలో ఏనాడు ఎప్పుడూ ఏ చర్చిలోను మెంబరుగా చేరలేదు. ఎంతమంది ఎన్ని విధాల ఆయనను అడిగినా తిరస్కరించాడు. ఎందుకంటే ఏ చర్చివారైనా సరే మానవత్వంతో మేము ప్రవర్తిస్తాము అని ప్రకటిస్తే వాళ్ళ చర్చిలో చేరతానన్నాడు. కావున లింకన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోదగి ఉంది. సంఘంలో సాధకులను మలినదేహులని నిందిస్తూ మలిన చిత్తాలతో జీవిస్తూ, చాలా కాలంగా సుఖాల్ని అనుభవిస్తున్నాం అని భావన చేస్తూ, చాలా కాలంగా స్పెషల్ రిజర్వుడు తరగతిగా ఉంటూ, సంఘాన్ని ద్వైతంగా భావిస్తూ, హేళన చేస్తున్నా, న్యూనతగా చూస్తున్నా వాళ్ళను లెక్కచెయ్యకుండా సాధకుడు నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అనే బ్రహ్మ భావనతోనే జీవించాలి. బ్రహ్మ భావన నిరంతరం మనస్సును ప్రేరేపిస్తుండటం వల్ల సాధకుని అణువణువు ఆ భావనకు అనుకూలంగా మారటానికి వీలు కుదురుతుంది. కావున సాధకుడు నిరంతరం సాధన కొనసాగించాలి.
సాధకుడు జీవన్ముక్తుడు కావాలంటే పూర్వ ఉపాధిగుణాల నుంచి విముక్తి కావాలని శంకరాచార్యులవారు బోధించారు గదా! దానిని అర్థం చేసుకోవటానికి రమణ మహర్షి ఒక కథను వివరించారు. చేపలు అమ్ముకొనే వాళ్ళు ఆనాటి చేపలను వాళ్ళు అమ్ముకొని వాళ్ళ ఊరు నడిచి వెళుతుంటే, దారిలో వర్షం కుండపోతగా కురిసింది. దాని వల్ల వాళ్ళు దారి ప్రక్కనే ఉన్న పూల వ్యాపారి ఇంట్లో తల దాచుకొన్నారు. ఆ రాత్రంతా ఎంతకీ వర్షం తగ్గలేదు. దాని వల్ల ఏమీ చేసేది లేక ఆ ఇంటి యజమాని అయిన పూలవ్యాపారి ఆ రాత్రికి అక్కడే ఉండమని వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు అక్కడ పడుకోవటానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళకు నిద్రపట్టలేదు. కారణం ఏమిటంటే ఆ పూల వ్యాపారి ఆ మరునాడు అమ్ముకోవటానికి దాచి ఉంచిన పూలవాసనవల్ల నిద్రపట్టలేదు. అప్పుడు వాళ్ళు ఇంటి బయట ఉంచిన వాళ్లచేపల బుట్టలను తెచ్చి వాళ్ళ ప్రక్కన పెట్టుకొంటే వాళ్ళకు ప్రశాంతంగా నిద్రపట్టింది. కావున మానవులకు వాళ్ల వాళ్ల పాత అలవాట్లనేవి, పాత గుణాలనేవి వాళ్ళను ఎట్లా వెంటాడుతుంటాయో అర్థం చేసుకోవటానికి రమణ మహర్షి ఈ కథను బోధించారు. అట్లాగే సాధకుని విషయం తీసుకొంటే ఆతని పాత అలవాటులు, ఆతని పూర్వ ఉపాధి గుణాలు అనేవి ఆతనిని ఎట్లా బాధిస్తుంటాయో అర్థం చేసుకోవటానికి వీలుకుదురుతుంది. సాధకుడు ధ్యాన సమయమందు తన స్థితికి తగిన విధంగా కాషాయవస్త్రం, లేడి చర్మం, స్ఫటికమాల, దీపారాధన, హారతి వంటివి అనేకం కావాలని రకరకాల సెంటిమెంట్సుతో బాధపడుతుంటాడు. కావున సాధకులు జిజ్ఞాసతో, వివేకంతో ఇటువంటి పూర్వ ఉపాధి గుణాలనుండి విముక్తి కావాలి. అదే విధంగా ఉన్నత శాస్త్ర పరిశోధకుడైన సి.వి.రామన్‌ని తీసుకొని మరొక ఉదాహరణగా పరిశీలిస్తే పూర్వ ఉపాధి గుణాలు ఎట్లా బాధిస్తాయో బాగా అర్థం అవుతుంది. సి.వి.రామన్ సూర్యగ్రహణం నాడు ఒక భౌతిక శాస్త్ర పరిశోధకుడైన అమెరికన్‌తో సంభాషిస్తుండగా మధ్యలో ఇప్పుడే వస్తానని ఆయనతో చెప్పి రామన్ స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చాడట. గ్రహణం అయిపోయినందు వల్ల సి.వి.రామన్ స్నానం చేసి వచ్చాడని అమెరికన్ గ్రహించి మీరు ఉత్తమ భౌతికశాస్త్ర పరిశోధకులు కదా. మీకు ఈ ఆచార వ్యవహారాలేమిటి అని అడిగితే అది సైన్సు ఇది సెంటిమెంటు అని సి.వి.రామన్ చెప్పాడట. పూర్వ ఉపాధి గుణాలు మానవుల్ని ఎట్లా బాధిస్తుంటాయో సాధకుడు బాగా అర్థం చేసుకొని తాను బ్రహ్మంగా రూపొంది, చుట్టూ ఉన్నవారిని కూడా జీవన్ముక్తుల్ని చేయటానికి తాను ఆదర్శవంతంగా జీవించాలి.
కీటకం పూర్వ ఉపాధి గుణాలను వీడి నిరంతరం భ్రమరాన్నే ధ్యానించటం వల్ల భ్రమరంగా మారిన భ్రమరకీటన్యాయాన్ని ఆచార్యులవారు చాలా సుందరంగా బోధించారు. భ్రమరం మట్టితో గూడు నిర్మిస్తుంది. ఆ గూటికి అది రంధ్రాన్ని ఏర్పరస్తుంది. అప్పుడు అది ఒక కీటకాన్ని తీసుకువచ్చి తాను నిర్మించిన గూట్లో పెడుతుంది. భ్రమరం తన తిరుగుడును తగ్గించుకొని దాని లక్ష్యానికి అనుకూలంగా గూటిముందు చేరి నిరంతరం ధ్వని చేస్తుంది. గూటి లోపల ఉన్న కీటకానికి ఏ అవసరాలు లేకపోవటం వల్ల ఏ పనులయందును ఆసక్తిలేకుండా ఎల్ల వేళలా భ్రమరాన్నే ధ్యానిస్తుండటం వల్ల తాను కూడా భ్రమరంగానే మారిపోతుంది. రమణ మహర్షి భ్రమరం గూడు నిర్మించటం, అది కీటకాన్ని తేవటం, కీటకం భ్రమరంగా మారటం అనేవి అన్నీకూడా తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఇక్కడ కీటకం గూటిలో కదలకుండా ఉండిపోయింది. దానికి భ్రమరం ధ్యాన తప్పితే మరొక పనిలేకుండా పోయింది. ఆ విధంగా కీటకం భ్రమరాన్ని ఆలోచిస్తుండటం వల్ల అది భ్రమరంగా మారిపోయింది. ఈ విషయాన్నే మన ఇంట్లో జరిగే విషయాల్లో పరిశీలించి చూస్తే కూడా బాగా అర్థం అవుతుంది. సాధారణంగా ఇంట్లో పిల్లలు చేసే పనులు చూసి పెద్దవాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళనే పిల్లలు అనుకరించి నటించి చూపిస్తుంటారు. తల్లి దండ్రులు, అక్కయ్యలు, అన్నయ్యలు వంటి పెద్దవాళ్ళు ఎట్లా మాట్లాడతారో, ఎట్లా భోజనం చేస్తారో, ఎట్లా నడుస్తారో, ఏఏ విధంగా రకరకాల పనులు చేస్తుంటారో వంటివి అన్నీ పిల్లలు జాగ్రత్తగా పరిశీలిస్తుండటం వల్ల వాటినే మళ్ళీ పెద్దల ముందు వాళ్ళు ప్రదర్శించి చూపిస్తుంటారు. కావున పెద్దవాళ్ళు ఆత్మజ్ఞానానికి అనుకూలంగా సంచరిస్తుంటే ఇంట్లో ఉన్న చిన్నవాళ్ళు కూడా అదే విధంగా రూపుదిద్దుకొంటారు. ఎవరైనాసరే దేనియందు శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు దాన్ని తప్పకుండా సాధిస్తారు అనటానికి అనుకూలంగానే రామకృష్ణ పరమహంస వివేకానందుణ్ణి శ్రద్ధ వహించి ధ్యానం చేయమని బోధిస్తుంటే వివేకానందుడు హాస్టలు రూముప్రక్కనే నిరంతరం మోటారు మోగుతుంటుందని, ఇక ఆ మోతలో ఏకాగ్రత ఎక్కడ కుదురుతుందని ఎదురు ప్రశ్న వేస్తే, దానికి రామకృష్ణపరమహంస ఆ మోటారు ధ్వనినే కేంద్రీకరించి ధ్యానం చేయమని వివేకానందుడుకి చెప్పారు. దానితో వివేకానందుడికి ధ్యాన సిద్ధి లభించింది. అందువల్లే వివేకానందుడు ఆనందాన్ని పొందటానికి, శాంతిని పొందటానికి అనేక విధాల బోధిస్తూ వచ్చాడు. ''నీ నిజతత్త్వం గురించి అనుభూతి పొందే వరకు, నీవూ, ఆ దైవమూ ఒక్కటే అని అనుభూతి కలిగే వరకూ, రేయింబవళ్ళూ ఆ నిజతత్త్వం గురించి నీకు నీవు చెప్పుకొంటు ఉండు'' అని వివేకానందుడు ఆయన సంపూర్ణ గ్రంథావళి 8వ విభాగం 37వ పేజీలో చెప్పాడు. అంతటి తీవ్రతపనతో సాధకుడు సాధన చేస్తూ బ్రహ్మంగా మారాలి అని వివేకానందుడు బోధించాడు.
సాధకుడు బ్రహ్మంగా మారిన తర్వాత బ్రహ్మంగా జీవిస్తానని, సచ్చిదానందం అనుభవిస్తూ గడపటం వల్ల, ఆతనికి ఒక్కనికే ఫలితం లభిస్తుంది. అట్లా అనుభవిస్తూ బ్రహ్మంగా దీర్ఘకాలం ఉన్నవాడు ఎట్లా ఉంటాడో తెలుసుకోవటానికి ముచికుందుని కథ చూస్తే తెలుస్తుంది. శ్రీకృష్ణుడు ముచికుందుని గుహలో ప్రవేశించి, కాలయవనుణ్ణి ముచికుందునిచేత సంహరింపచేశాక ముచికుందునితో కలిపి గుహబయటకు వచ్చేటప్పటికి, ముచికుందుడు మానవులను చూసి ఆశ్చర్యపడతాడు. మనుష్యులందరు ఇంత పొట్టివాళ్ళుగా, చిన్నవాళ్ళుగా ఉన్నారేమిటని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు మీరు యోగనిద్రలోకి వెళ్ళి చాలాకాలమైంది. కాలాన్ని బట్టి మానవులలో, శరీరంలో మార్పులు వచ్చాయి అని అంటాడు. ఆ విధంగా అనేక యుగాలు యోగసమాధిలో గడిపేవాళ్ళు ఉన్నారని దీన్ని బట్టి తెలుస్తుంది. కాని జీవన్ముక్తుడు ఆ విధంగా సచ్చిదానందాన్ని అనుభవిస్తూ, బ్రహ్మంగా జీవిస్తూ గడపటం కాక, బ్రహ్మజ్ఞానంతో తోటివారిని కూడా బ్రహ్మజ్ఞానులుగా చేసి తరించాలని వివేకానందుడు చెప్పాడు.
''అద్వైతాను భూతి పొందవలెనను వాంఛ వలన కొన్నిసార్లు ఉన్మత్తునివలె నృత్యం చేయవచ్చు. మరికొన్నిసార్లు బాహ్యస్మృతి కోల్పోవచ్చు. మంచి విషయాన్నంతటిని తానొక్కడే అనుభవించటం వల్ల సంతోషం కలుగునా? అది ఇతరులతో పంచుకోవాలి. అద్వైతానుభూతి వల్ల నీకు వ్యక్తిగతంగా ముక్తి కలిగిందనుకో కాని దాని వల్ల ప్రపంచానికి ఏమి ఒరిగింది? ఈ శరీరం వదిలిపెట్టేలోగా సర్వప్రపంచానికి ముక్తి కలగజేయాలి. అప్పుడే నువ్వు శాశ్వత సత్యమునందు సుస్థిరంగా ఉండగలుగుతావు. ''అటువంటి మహాదానందానికి అవధులు ఉన్నయ్యా నాయనా'' అని వివేకానందుడు ఆయన సంపూర్ణ గ్రంథావళి 7వ భాగంలో 162 వ పేజీలో శిష్యునికి బోధించాడు. ఆ విధంగా సాధకుడు బ్రహ్మజ్ఞానంతో ఇతరులు కూడా బ్రహ్మంగా జీవించేటట్లు సేవ చేయాలి. సాధకుడు ఆ విధమైన సేవ ఆచరణయోగ్యం చేసుకొన్ననాడే అతడు బ్రహ్మంగా, సుస్థిరంగా నిలవగలుగుతాడు. అందుకే అందరికీ బ్రహ్మానందం ఇవ్వాలని మహారాజ్‌జీ నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు.
50 #9; తీర్త్వా మోహార్ణవం హత్వా
రాగద్వేషాది రాక్షసాన్
యోగీ శాంతి సమాయుక్తః
ఆత్మారామో విరాజతే || 50
¹¸…Wgki = ఆత్మజ్ఞానంతో జీవన్ముక్తుడైనవాడు, మోహ + ఆర్ణవం = మోహమనే సముద్రాన్ని, తీర్త్వా = దాటి, రాగ ద్వేష+ఆది = రాగద్వేషములనెడి, రాక్షసాన్ = రాక్షసులను, హత్త్వా = చంపి, శాంతి సమాయుక్తః = శాంతితో కూడిన, ఆత్మారామః = ఆత్మ అనే రాముడు కలవాడై, విరాజతే = ప్రకాశిస్తాడు.
తా|| ఆత్మజ్ఞానం కలిగినవాడు మోహమనే సముద్రాన్ని దాటి, రాగద్వేషాలనే రాక్షసుల్ని సంహరించి, ప్రశాంతమైన జీవనంతో ఆత్మానుభూతి పొందినవాడై, బ్రహ్మానందంతో ప్రకాశిస్తాడు.
వివరణ :- మోహం అంటే కోరికల విషవలయం. అంటే మోహపూరితుడు దుఃఖాలకు నిలయమై, రాగద్వేషాలతో కూడి ఉంటాడు. ఈ సంఘంలో మానవుడు సుఖాన్ని కాంక్షించి దుఃఖాన్ని తెచ్చుకొంటున్నాడు. కాన దుఃఖభూయిష్ఠుడయిన మానవుడు దాన్ని తొలగించుకొని సుఖాన్ని పొందాలనుకొన్నప్పుడు, ఆత్మమార్గం ఆతనికి సుందరతరమైన దారిని అందిస్తుంది. ఆతడు ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించటం వల్ల ఆతనికి వ్యామోహాలనే విషయవలయం తొలగిపోతాయి. సాధనలో ఆతడు ద్వంద్వాతీతుడు అవుతున్నాడు. శోకమోహాలుకాని, ఆకలి దప్పులు కాని, జరామరణాలుకాని ఆతనిని వెన్నంటి ఉండకుండా పోతున్నాయి. ఆతడు భయరహితుడవుతున్నాడు. కావున ఆతనికి పరమశాంతి లభిస్తుంది. అటువంటి సాధకుడు సంఘంలో జీవిస్తూ పనులన్నీ చేస్తున్నప్పటికీ, ఆతడు ఆత్మతో కూడి జీవనం కొనసాగిస్తుండటంవల్ల ఆతడు శాంతి సుఖాలతో జీవన్ముక్తుడై గడుపుతున్నాడు.
దీన్ని తెలియచెయ్యటానికే ఆదికవియైన వాల్మీకి మహర్షి రామాయణ పాత్రల్ని ప్రతీకలుగా స్వీకరించి రామాయణ ఇతివృత్తాన్ని ఆత్మజ్ఞానమార్గానికి అనుకూలంగా రచించారు. ఆత్మజ్ఞానంతో ఆత్మానందాన్ని పొంది ఆత్మారాముడుగా జీవించటమే ప్రతి మానవునికి కావలసిన ప్రధానమైన లక్ష్యం అయి ఉండాలి అనే వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఆదర్శంగా చూపించారు. దాన్నే ఆదిశంకరులు ఈ శ్లోకంలో వివరించారు. రాముని ఆనందానికి నిలయం లేక శాంతికి నిలయం అయిన సీత ఆయనకు దూరం అవ్వటంతో శాంతికి ప్రతీక అయిన సీత కోసం రాముడు సముద్రాన్ని దాటవలసి వచ్చింది. అంటే రాముడు దాటవలసిందే మోహ సముద్రాన్ని. ఆత్మజ్ఞాని దాటవలసిందే కోరికల విషయవలయాన్ని. రామునిచేత సంహరింపబడింది రావణాది రాక్షసులే. ఆత్మజ్ఞానిచేత సంహరింపబడవలసింది కామాది అంతశ్శత్రువులనే రాక్షసులే. సీత రామునికి లభించినట్లే ఆత్మజ్ఞానికి శాంతి లభిస్తుంది. రాక్షసులకు ప్రతీక అయిన దశముఖుడంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలిసి పది ముఖాలు అని అర్థం చేసుకోవాలి. స్థూల శరీరమే రావణాసురుడు. సూక్ష్మశరీరమే కుంభకర్ణుడు, కారణశరీరమే విభీషణుడు. రాముడంటే సర్వహృదయాల్లో రమించువాడు అని ఈ విధంగా రామాయణంలో పాత్రలన్నిటినీ ప్రతీకలుగా తీసుకొని వాల్మీకి మహర్షి ఆత్మజ్ఞానానికి అనుకూలంగా రామయణాన్ని హృద్యంగా రచించి ఆనందాన్ని ప్రసాదించాడు. శంకరాచార్యుల వారు దానినే పరమ హృద్యంగా చిన్న శ్లోకంలో వివరించారు.
ఇక్కడ ఆత్మారాముని పేర్కొనుట వల్ల ఆత్మ అనేది ఒక్క భారతీయులకే చెందుతుంది అని భావించరాదు. ఆత్మ అనేది సర్వమానవ సమానమై ఉంది. గురుమహారాజ్‌జీగారు ఒకసారి ఆత్మారాముని గురించి ఈ విధంగా చెప్పారు. ''ఒక రాముడు దశరథుని కుమారుడు. ఒక రాముడు ప్రతివ్యక్తి యందు నివసించి ఉన్నాడు. ఆ అందరిలో ఉన్న రాముడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఏ రాముణ్ణి ఏ రాముడికోసం వదిలేస్తారు. ఎవరైతే ప్రతి హృదయంలోను ఉన్నాడో ఆతడు సర్వాంతర్యామి. మనం ఎవరిని కొలవాలి? మానవ రూపంలో ఉండి వెళ్ళిపోయిన రాముణ్ణా ? అందరిలో అంతట ఉన్న రాముణ్ణా? ఎవరిని కొలుస్తారు?'' అని సర్వమానవ సమతా భావంతో ప్రబోధించారు. కావున మానవులు ఆత్మజ్ఞానంతో, సర్వమత సహనంతో, సంఘీభావంతో జీవించాలి. అప్పుడే మానవులందరికీ శాంతి లభిస్తుంది.
ఇక్కడ మానవులు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ప్రపంచాన్ని భిన్నమతాల జీవనవేదికగా గుర్తించాలి. ప్రతి దేశాన్నీ అక్కడున్న ప్రజలు భిన్నమతాల జీవన వేదికగా గుర్తించాలి. అప్పుడే అది ప్రతి దేశం యొక్క సమగ్రతకు, సమతకు శాంతికి దోహదం చేస్తుంది. అంతేకాని అధికసంఖ్యాకులుగా ఉన్నవారి మతనియమాలకు లోబడే మిగిలిన మతాల వారందరి జీవన సంస్కృతి ఉండాలని, దానినే జాతీయ జీవన సంస్కృతిగా పరిగణించాలని అనటం వల్ల జాతీయ సమగ్రత, శాంతి సుస్థిరత ఎన్నటికి సమకూరదు. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలను మానవతా దృక్పథంతో చూడటం ద్వారానే వాటికి పరిష్కారం సాధించగలం కాని, మతం పేరిట, ఆధ్యాత్మిక దృక్పథంతో చూడటం ద్వారా ఏ నాటకీ పరిష్కారం చేకూరదు . అట్లా చూడటంవల్ల సమస్యలు మరింత జటిలం కావటానికే దోహదం చేస్తాయి కాని మరొకటి కాదు. సమాజ హితానికి హాని చేయని మేరకు వెలసి వర్థిల్లే స్వేచ్ఛ అన్ని విశ్వాసాలకు చేకూర్చాలి. వట్టి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ద్వారానే నైతిక విలువలను పునరుద్ధరించగలం అని అనుకోవటం నేటికాలంలో తగింది కాదు. సగటు మానవుణ్ణి ఛాందస మత భావజాలం నుంచి విముక్తి చేసి, శాస్త్రీయ చైతన్యాన్ని కలిగించి, ప్రజాస్వామిక ఆలోచనా పరునిగా మలచవలసిన తరుణంలో మతచ్ఛాయలలో నైతిక విలువల బోధన అవసరం ఉందని భావించటం కాదు ఈనాడు చేయవలసింది.
హిందూ దేశంలో మహమ్మదీయ, క్రైస్తవ మతాలు అనేక విధాల వ్యాప్తి చేయటానికి ప్రయత్నం చేస్తుంటే హిందువులు ఎట్లా ఊరుకోవాలి అనే ఒక రాజకీయవాదం ఉంది. హిందూ దేశస్థులైన రామకృష్ణ మిషన్‌వారు, పరమ హంస యోగానందగారికి సంబంధించిన యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు, రాధాస్వామి సత్సంగ్ బ్యాస్ వారు, మహేష్ యోగి మిషన్ వారు, హరేరామ హరే కృష్ణవారు, డివైన్ యునైటెడ్ ఆర్గనైజేషన్ వారు వంటి అనేక మంది వాళ్ళ వాళ్ళకు తగిన విధంగా తగిన మార్గాల్లో ప్రపంచం అంతా ఆత్మచైతన్యం అయ్యేందుకు కృషి చేస్తున్నారు. పాశ్చాత్యులు ప్రాచీన హైందవాన్ని వ్యాప్తి చెయ్యాలనే దృక్పథంతోనే వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారని అక్కడివారు భ్రమపడటం కూడా జరుగుతుంది. ఆ మిషన్సువాళ్ళందరు చేస్తుంది ఆత్మచైతన్యానికి సంబంధించిందేకాని మత ప్రచారం కాదు. సర్వులలో ఉన్న ఆత్మను తెలుసుకొని సర్వులు ఆత్మభావనతో జీవించేటట్లు చేయటానికే వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మతం పేరిట ఆధ్యాత్మిక చింతన రగుల్కొల్పటం అనేది కాదు చేయవలసింది, ఆత్మపేరిట సర్వమానవ చైతన్యం అనేది రగుల్కొల్పటం చేయవలసి ఉంది. ప్రతి వానిలోను ఆత్మ అనే భగవంతుడే ఉన్నాడని, ఆ ఆత్మారామునే సేవించాలి కాని మరొకటి కాదు అని తెలుసుకొనేటట్లు చేయాలి. మానవత్వమే దైవత్వం, మానవ సేవే మాధవ సేవ, కాన మానవతా దృక్పథంతో ఆత్మమార్గాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సాధనను ప్రతివారు పరిశీలించి, ఆచరించి, ప్రబోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ భావించాల్సిన అవసరం ఆసన్నమై ఉంది.
గురుమహారాజ్‌జీ ఆత్మమార్గం, అనేది దగాపడిన తమ్ములకు, పీడిత, తాడిత ప్రజలకు అనేగాక సర్వమానవ సమాజ పరిరక్షణకు సర్వరోగ నివారిణిగా ఉపకరిస్తూ సాధన కొనసాగిస్తుంది. ఇది పాతకొత్తల మేలుకలయికగా నడుస్తూ అందరికీ ఆచరణయోగ్యంగా ఉపకరిస్తుంది. ఇది ఈనాటి సామాజిక అవసరాలికి అనుకూలంగా అన్ని విధాల అమరి ఉంది. ఆత్మ మార్గం అంటే ఛాందస వాసనల నుంచి బయటపడటం ప్రధాన కార్యమై ఉండాలి. అంతే కాని మూసపోసిన ప్రాచీన సంప్రదాయం అంటూ నడవాలని చూస్తే అది ఆత్మమార్గానికి ఔన్నత్యాన్ని ఇవ్వదు. ఆధ్యాత్మిక చింతన అనగానే ఏదో ఒక వర్గానికి సంబంధించిన ఆలోచన అని కాక, వ్యక్తి వికాసంతో పాటు సామాజిక స్పృహ, సామాజిక ఉన్నతి ఉన్నప్పుడే అది ఆత్మమార్గానికి దోహదం చేస్తుంది. కావున ఆత్మమార్గంలో సాధకుడు ఆదర్శంగా నడిచి కుల మత కక్షలు, జాతి విద్వేషాలు వంటివి రూపమాపటానికి ఆతడు ఆతని సేవలో అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. సాధకుడు సేవలో ఆదర్శంగా నిలిచిననాడే ఆతని ఆత్మోన్నతి సుస్థిరంగా, శాంతిమయంగా నిలుస్తుంది. దీన్ని సాధించటం కోసం సాధకుడు సేవాసాధనలో స్వార్థం అనే మసి అంటని ఆత్మార్పణ భావం, ఆత్మసాధన ప్రధానం కావాల్సి ఉండాలి.
జిజ్ఞాసువు కపటత్వం తొలగించుకొని, బాలుని హృదయం స్వీకరించి, ఆ కాలంలో ఉన్న మహాపురుషుని ఆశ్రయించి, ఆత్మ జ్ఞానం తీసుకొని, ఆత్మమార్గంలో సాధన కొనసాగిస్తుంటే శరీరం లోపల ఆవరించిన చీకటిని అది పారద్రోలుతుంది. సూర్యకాంతి, చంద్రకాంతి, సర్వవస్తుప్రకాశం అంతరించి అంధకారమే ఉందనుకొన్నప్పుడు ఆతడు సాధనలో సర్వప్రకాశమానమైన కాంతిలో లీనమవుతాడు. సాధకునికి సాధనలో బాహిరమైన సర్వశబ్దాలు అంతరించి నిరంతరం లోన మ్రోగుతున్న నాదంతో లీనమయి ఆనందాన్ని పొందుతాడు. సాధకుడు ఈ విధంగా ప్రతినిత్యం సాధన చేయటంవల్ల ఆత్మారాముడుగా నిలిచి శాంతిని ఆనందాన్ని పొందుతాడు. కాన ప్రపంచ మందలి సర్వులు ఆత్మకలిగి ఉన్నామని తెలుసుకొని, ఆత్మజ్ఞానాన్ని తీసుకొని, జ్ఞానాన్ని నమ్మి, గురుబోధను విశ్వసించి, నిరంతరం సాధన చేసినప్పుడు సర్వమానవులు మోహసముద్రాన్ని, రాగద్వేషాది రాక్షసులకు అధిగమించి శాంతి, ఆనందం వంటివి పొందగలుగుతారు.
ఒకరికోసం పదిమంది, పదుగురికోసం ప్రతి ఒక్కరు అనే సామాజిక భావన రాజ్యాంగ పుటలకే పరిమితమై కొనసాగుతూ ఉంది. అది అందరికీ ఆచరణ యోగ్యం కావాలంటే గురుమహరాజ్‌జీగారి ఆత్మ మార్గం స్వీకరించి సాధన చేసిననాడు అది సఫలీకృతమవుతుంది. అందరూ ఆత్మలే అనే భావన సాధకునిలో నిలిచిన నాడు పదిమందికోసం తాను జీవించాలనేది సర్వసామాన్యమైన భావనగా ప్రతిసాధకునికి నిలుస్తుంది.
51 #9; బాహ్యా2నిత్య సుఖాసక్తిం
హిత్వాత్మ సుఖ నిర్వృతః
ఘటస్థ దీపన త్వ్సస్థ ః
స్వాన్త రేవ ప్రకాశ##తే || 51
ËØx¤¦¦¦ù = బయట, అనిత్య = నిత్యం కానటువంటి వాటి యందు (అనగా భ్రాంతినికొల్పే వస్తువులందు), సుఖ + ఆసక్తి = సుఖాన్ని కాంక్షించే గుణాన్ని, హిత్వా = విడిచి, ఆత్మసుఖ నిర్వృతః = ఆత్మ సుఖమునందే నిలిచిన వాడై, స్వస్థః = తృప్తిపొందుతూ, ఘటస్థ = కుండ యందలి, దీపవత్ = దీపం వలె, స్వ + అంతరేవ = తనలోనే, ప్రకాశ##తే = ప్రకాశిస్తుంటాడు.
తా|| బాహిరమందు శాశ్వతం కానటువంటివి ఏవి భ్రాంతిని కొల్పుతుంటాయో వాటియందు సుఖాన్ని కాంక్షించే గుణాన్ని విడిచి, ఆత్మ సుఖమునందే నిలిచినవాడై తృప్తి పొందుతూ కుండయందలి దీపం వలె తనలోనే ప్రకాశిస్తుంటాడు.
వివరణ :- సాధకుడు బాహిరం అయినవి భ్రమ అని ఎప్పుడు తెలుసుకొంటాడో అప్పుడు అతడు లోపటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. లోపటఎప్పుడు ఆత్మ సుఖంతో ఆతడు నిలుస్తాడో అప్పుడు ఆతడు నిరంతరం తనలోనే ప్రకాశిస్తాడు. అందువల్ల ఆత్మజ్ఞానం సాధకుని నిరంతరం అంతర్ముఖం అవటానికి ప్రోత్సహిస్తుంది. అంటే ఈ ఆత్మచైతన్యం బాహిర మందు లేదా అంటే సర్వత్రా ఉంది కాని సాధకుడు ప్రారంభంలో ఆత్మచైతన్యాన్ని సర్వత్రా చూడలేడు. చిన్న చిరుదీపం కూడా నాలుగు గోడల మధ్యలో ఉన్న వస్తువుల్ని అంధకారంలో చూపించగలుగుతుంది. అదే చిరుదీపాన్ని విశాలంగా బాహిరంగా ఉన్న ప్రదేశంలోకి తీసుకువస్తే అది బాహిరంగా అంత కాంతిమంతంగా వస్తువుల్ని చూపించలేదు. కాన గురువు సాధకుని అంతర్ముఖం చేయటానికి చూస్తాడు. దాని వల్ల సాధకుడు ఆత్మానుభవం తేలిగ్గా పొందగలుగుతాడు. అప్పుడు సాధకుడు తన ఆత్మానుభవంతో చేకూరిన జ్ఞానం వల్ల సర్వత్రా కూడా ఆత్మచైతన్యాన్ని దర్శించ గలుగుతాడు. సాధకుడు అంతర్ముఖమై ఆత్మానందాన్ని పొందిన తర్వాత బాహిరమైన అశాశ్వత సుఖాలకు అర్రులు చాచడు. లోప పొందే సుఖంముందు బాహిరంగా పొందే సుఖం అల్పమైంది అవటంవల్ల, శాశ్వత సుఖముందు అశాశ్వత సుఖం వెలవెల పోతుంది గనుక ఆత్మజ్ఞాని ఆత్మయందే నిశ్చలంగా నిలిచి దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు, అటువంటి సాధకుని ముఖం తేజస్సుతో ప్రకాశమానంగా వెలుగొందుతుంటుంది. అటువంటి జ్ఞానికి మనస్సు నందు ఏ కోరికలు ఉండవు. కాన ఆతనికి బ్రహ్మేతర మేదీయు స్ఫురించదు. ఎల్లప్పుడు ఆతడు తనలో ఉన్న బ్రహ్మమునందే నిలుస్తాడు. కాన ఆతనిని స్థిత ప్రజ్ఞుడు అంటే నిశ్చలమైన ఆత్మ జ్ఞానం కలవాడు అంటారు అని శ్రీకృష్ణుడు(భ.గీ.2-55)చెప్పాడు.
ఇంద్రియ నిగ్రహం కావాలంటే ఎవరికి వారు దాన్ని సాధించాల్సి ఉంది అది సాధించాలంటే దానికి ప్రథమసోపానమే అంతర్ముఖం అవటం అనేది అయి ఉంది. అందువల్ల సాధకుడు అంతర్ముఖం అవటానికి ప్రతినిత్యం గురుజ్ఞానంతో ధ్యానంలో సాధన చేయాలి. సాధకుడు ఆ విధంగా సాధన చేయటం వల్ల ఇంద్రియాలన్నీ కూడా క్రమక్రమంగా ధ్యానంలో లీనమవటానికి అలవాటు పడిపోతాయి. దాని వల్ల సాధకుడు ఆత్మలో లీనమై కుండలో దీపం చలనం లేకుండా ఎట్లా ప్రకాశిస్తుందో అట్లా ఆత్మతో ప్రకాశిస్తాడు.
సంఘంలో ఉన్న దుఃఖాన్ని తొలగించుకోవటానికి ఆత్మజ్ఞానం కంటే ఉత్తమమైన జ్ఞానం మరొకటి లేదు. సంఘంలో అసమానతలు ఉన్నంత వరకు విద్వేషాలు, అంతఃకలహాలు, దుర్మార్గాలు కొనసాగుతూనే ఉంటాయి. వాటిని రూపుమాపాలంటే, నైతికమార్గంలో సమత, సౌఖ్యాలు చేకూర్చాలంటే ఆత్మ మార్గం ఒక్కటే సరైన రోగ నివారిణి అయి ఉంది. ఈ ప్రపంచంలో బాధల్ని పొగొట్టటం కంటే మించిన ఆనందం మరొకటి లేదు. ఆత్మ మార్గం బాధల్ని పారద్రోలి, నిత్యం ఆనందంతో మానవులు జీవించేటట్లు చేస్తుంది. సామాన్య మానవులు తెలియని స్వర్గం కన్నా తెలిసిన నరకం మేలని ఆ విధంగా జీవించటానికే ప్రయత్నిస్తుంటారు కాని అది సరైంది కాదు. ఆత్మజ్ఞానం నిత్యసత్యాన్ని తెలుసుకొనేటట్లు చేసి మానవులు నిత్యానందంతో జీవించేటట్లు చేస్తుంది.
52 #9; ఉపాధి స్థో 2 పి తద్ధర్మై
రలిప్తో వ్యోమనమ్మని ః
సర్వ విన్మూఢ వత్తిష్ఠే
దసక్తో వాయు వచ్చరేత్ || 52
ª«sVV¬sM = మనన శీలుడైన - మౌని అయిన ఆత్మజ్ఞాని, ఉపాధిస్థ ః + అపి = మానవ శరీరంతో కూడి ఉన్నప్పటికీ, వ్యోమవత్ = ఆకాశం వలె, తత్ + ధర్మ్యైః = శరీరానికి సహజమైన సత్వరజస్తమో గుణాలచేత, అలిప్తః = అంటకుండా ఉంటాడు, సర్వవిత్ = లోకవిషయాలన్నీ సంపూర్ణంగా తెలిసి ఉన్నప్పటికీ - సర్వులు ఆత్మే అయి ఉన్నారు అని తెలిసి ఉన్నప్పటికీ, మూఢవత్ = ఏమీ తెలియని మూర్ఖుని వలె, తిష్ఠేత్ = మెలగును, వాయువత్ = గాలివలె, అసక్తః = నిస్సంగుడై-ఆసక్తిలేనివాడై, చరేత్ = సంచరించును.
తా||ఆత్మజ్ఞాని అయిన ముని మానవ శరీరంతో కూడి ఉన్నప్పటికీ ఆకాశం లాగా శరీరానికి సహజమైన గుణాలు ఏవీ అంటకుండానే జీవిస్తాడు. ఆతనికి లోకవిషయాలన్నీ పరిపూర్ణంగా తెలిసినప్పటికీ ఏమీ తెలియనని మూర్ఖునిలాగానే గాలి వలె నిస్సంగుడై సంచరిస్తాడు.
వివరణ :- ప్రతి వ్యక్తికీ ఈ ప్రపంచంలో స్థానం ఉంది. అతడు చేయటానికి ఒక కార్యం ఉంది. ఆ కార్యాన్ని నిర్వహిస్తాడా లేదా అనేది అతడి ఇష్టం మీద ఆధారపడి ఉంది. మానవ జన్మ ఎత్తినందుకు ఆత్మతో జీవిస్తూ, ఆత్మానందంతో గడపటం అనేది ప్రతి మానవుడు చేయవలసిన కార్యం అయి ఉంది. అది చేసిన వాడు ముని అవుతాడు. ముని అయినవాడు కూడా సంఘంలోనే జీవిస్తుంటాడు. కాన సంఘంలో జీవిస్తున్నప్పుడు ఆతనికి చుట్టూ ఉన్న విషయాలన్నీ కనిపిస్తుంటాయి. అయినప్పటికి ముని అయిన ఆత్మజ్ఞాని అన్నీ ఆత్మలే అని తెలిసి, ఏమీ తెలియని మూర్ఖునివలె జీవిస్తాడు. ముని దేహం చేత బద్ధుడై ఉన్నా, ఆత్మజ్ఞానంచేత అనుభూతి పొంది ఉండటంవల్ల కాలానికి లోబడక, కాలానికి ప్రభావితుడు కాక, కాలాన్ని దిగమ్రింగి జీవితాన్ని కొనసాగిస్తాడు. మునికి విషయభోగాల యందు విరక్తి అనేది మొదటి మెట్టు అయి ఉంది. లౌకిక భోగైశ్వర్యాలు, సుఖాకాంక్షలు, కీర్తి ప్రతిష్ఠలు, వ్యామోహాలు అనేవి జీవితాన్ని మళ్ళీ పతనావస్థకు తీసుకువెళతాయి అని తెలుసుకాబట్టి ముని అటువంటివాటిని కాంక్షించకుండా, ఏవీ అంటకుండా ఆకాశంలాగా, గాలిలాగా సంచరిస్తాడు. ఒకసారి ఆత్మానంద రసాస్వాదన రుచి చూసిన తర్వాత ముని అయిన వాడు మళ్ళీ బహిర్ముఖుడు అవటానికి గాని, విషయానుభవాలకు గాని ఇష్టపడడు. అందువల్ల మునికి చుట్టూ ఉన్నవన్నీ కూడా కంటక ప్రాయంగా కనిపిస్తాయి. దేహం ధరించటమే బంధం అని తెలిసి, కర్మకు లోబడటమే బంధం అని తెలిసి, కాలానికి వశుడవటమే బంధం అని తెలిసి కూడా ఆత్మజ్ఞాని అయిన విశ్వామిత్రుడు మేనకకు లోబడ్డాడు, త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. కాన ప్రతిజీవిని మాయ నిరంతరం వెన్నాడుతుంటుంది కాన తెలిసి తెలిసి మాయకు లోబడకుండా ఉండాలని ముని అయినవాడు కూడా జీవిస్తుండాలి. సామాన్య మానవుడు అయితే కనిపించే దృశ్యమానమంతా కావాలనే తపనలో విపరీతమైన బరువును మోస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఆత్మజ్ఞానం చేత ముని అయిన వాడు అటువంటి బరువు మోయటం తగిందికాదని తెలిసి ఆత్మజ్ఞానమనే కంటితో లోకాన్ని చూస్తుంటాడు. దానివల్ల ఆత్మజ్ఞాని బారవహుడు కాడు. లోకంలో దేహాన్ని చూసే వాడు అధముడు అవుతాడనీ, మనస్సును చూసే వాడు మధ్యముడు అవుతాడనీ, ఆత్మను చూసేవాడు ఉత్తముడు అవుతాడనీ శ్రీ విద్యాప్రకాశానంద గిరిగారు బ్రహ్మానంద వైభవం అనే గ్రంథంలో 224 పేజీలో వివరించారు. ఉత్తముడైన ముని దృష్టి పరమోత్తమం అయి ఉంటుంది కాన అతడు లోకంలోనే జీవిస్తున్నా ఆతనికి భేద దృష్టి ఉండదు. ఆతడు అభేద దృష్టితోనే జీవిస్తాడు. కాన ఆతనికి మంచీ చెడు అనేవి ఏవీ ఉండవు. వాయువు గంధాన్ని స్వీకరించి వ్యాప్తి చేస్తున్నప్పుడు ఆ గంధంలోని మంచి చెడులతో ఏ విధంగా ఆ వాయువుకు సంబంధంలేకుండా ఉంటుందో అదే విధంగా ఆత్మజ్ఞాని లోకకార్యాల్లో జీవిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆ కార్యాల్లో ఉన్న మంచీ చెడు అనేవి ఏవీ కూడా ఆతనికి అంటవు.
కర్తృత్వం అంతా కూడా మానసిక సృష్టే కాని, ఆత్మకు ఏమీ సంబంధం లేదు అని ఆత్మజ్ఞాని అనుభవపూర్వకంగా తెలుసుకొంటాడు కాన ఆతడు సంపూర్ణమైన లోకజ్ఞానం కలిగిఉన్నప్పటికీ ఆతడు లోకంలో ఏదీ అంటకుండా చరిస్తాడు. ముని ఉపాధిగతుడయినప్పటికీ, లోక కార్యాలు చేయవలసి వచ్చినప్పటికీ, సేవాతత్పరతతో సేవ చేయవలసి వచ్చినప్పటికీ ఏవీ కూడా అంటకుండానే ఆతడు జీవిస్తాడు. కావున ఆతనికి కర్తృత్వం అంటదు, అతడు ఫలభోక్త కాడు, ఆతడు నిస్సంగుడై సంఘసేవ చేస్తాడు. పాత్రలో ప్రతిఫలించిన ఆకాశానికి పాత్రలో ఉన్న పదార్థాల మంచిచెడులతో ఏ విధంగా సంబంధం లేదో ఆ విధంగానే ఆత్మజ్ఞాని అయిన ముని ఏవీ అంటకుండా అనాసక్తుడై జీవిస్తాడు.
ఎవరినైతే వస్తువులు ప్రేరేపించలేవో, ఎవరినైతే ఉద్రేకాలు రెచ్చగొట్టలేవో, ఎవరినైతే సంకల్పాలు కదిలించలేవో ఆతడే ఆత్మజ్ఞాని అవుతాడు అని తెలిసిన వివేకానందుడుకూడా ఒక్కొక్కసారి సర్వత్రాదైవత్వాన్ని చూడలేని స్థితి ఎట్లా ఉంటుందో ఈ విధంగా (ఆయన సంపూర్ణగ్రంథావళి 2వ విభాగం 151వ పేజీలో) చెప్పాడు. ''నేను ఒక వీధిలో భగవంతుడు ప్రతిమనిషి యందు కలడు, కలడు అని అనుకొంటూ నడుస్తున్నాను. ఎదురుగా ఒక బలమైన వ్యక్తి వచ్చి నన్ను ప్రక్కకు నెట్టాడు. నేను కాలిత్రోవపై అడ్డంగా పడిపోయాను. నేను వేగంగా ముడిచిన పిడికిలితో లేచి, నాశిరస్సునందు రక్తప్రసరణ ఎక్కువ కాగా, కోపంతో అతణ్ణి ఎదుర్కోవటానికి వెళ్తాను. వెంటనే నేనొక పిచ్చివానివలె అవుతాను. నాలో ఉన్న మొత్తం మంచితనం పోయి, ఎదురుగా ఉన్న వానిలో దైవానికి బదులు దయ్యాన్ని చూస్తాను''. అని చెప్పాడు. కాన ఆత్మజ్ఞానికి జీవన విధానంలో కష్టాలు ఎదురయినప్పటికీ కూడా సహనంతో జీవించాల్సి ఉంటుంది. అందుకే ఏసు క్రీస్తు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమని చెప్పాడు. గాంధీ అహింసా సిద్ధాంతంతోనే, సత్యాగ్రహంతోనే, కొల్లాయి గుడ్డతోనే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తోకముడిచేటట్లు చేయగలిగాడు. ఆత్మజ్ఞానికి చుట్టుముట్టిన కష్ట సమయాల్లో కూడా ధైర్యం, ఓర్పు, సహనం సమకూడి ఉండాలి, ఉంటాయి.
ప్రపంచంలో ఆత్మజ్ఞాని అనేవాడు తనకనేది ఏదీ లేకుండా సర్వాన్ని వదిలేసినప్పుడు ఇక ఆతనికి ఏమి మిగులుతుంది అంటే దైవమే మిగులుతుంది అని వివేకానందుడు బోధించాడు. ''నువ్వు నీ భార్యతో కలిసి జీవించవచ్చు. భార్యని వదిలేయటం కాక ఆమెలో దైవాన్ని చూడాలి. నీ బిడ్డల్ని వదిలేయటం కాక వాళ్ళల్లో దైవాన్ని దర్శించాలి అని వివేకానందుడు (ఆయన సంపూర్ణ గ్రంథావళి 2వ విభాగంలో 146వ పేజీలో)బోధించాడు. వేదాంత బోధ అంటే ఇదే అని ఆయన చెప్పాడు. కావున ఆత్మజ్ఞాని అయిన వాడు ఆత్మద్వారా ఆత్మబలాన్ని పొందాలి. ఆత్మవిద్య ద్వారా అమృతత్వాన్ని ఆస్వాదించాలి. ఆ విధంగా చేయటం వల్ల ఆత్మ జ్ఞాని జీవన్ముక్తుడై అమరుడవుతాడు.
53 #9; ఉపాధి విలయా ద్విష్ణౌ
నిర్విశేషం విశేన్మునిః
జలే జలం వియద్వ్యోమ్ని
తేజ స్తేజసి వా యథా || 53
ÇÁÌÁLi=నీరు, జలే = నీటిలోకి, వియత్=ఆకాశం, వ్యోమ్ని=ఆకాశంలోకి, తేజః=వెలుతురు, తేజసి=తేజస్సులోకి, వా=మరియు, యథా=ఏ విధంగా అయితే కలుస్తున్నాయో ఆ విధంగానే, మునిః=ఆత్మజ్ఞాని, ఉపాధి విలయాత్=శరీరం నశించగానే, విష్ణౌ=సర్వవ్యాపి అయిన చైతన్యంలో, నిర్విశేషం = సంపూర్ణంగా, విశేత్=కలిసిపోవును.
తా|| నీరు నీటిలోకి, ఆకాశం ఆకాశంలోకి, వెలుతురు వెలుగులోకి ఏ విధంగా అయితే కలిసిపోతున్నాయో ఆ విధంగానే ఆత్మజ్ఞాని శరీరం నశించగానే సర్వవ్యాపి అయిన చైతన్యంలో సంపూర్ణంగా ఆతని ఆత్మ కలిసిపోతుంది.
వివరణ :- విష్ణౌ అనే పదాన్ని ఆత్మ జ్ఞాన మార్గ ప్రబోధంలో ఎక్కడ వచ్చినా, సృష్టి స్థితి లయకారకులైన వారిలో స్థితికారకుడైన విష్ణువుగా కాక సర్వవ్యాపకుడైన చైతన్యంగానే దాన్ని స్వీకరించాలి. ఆత్మ జ్ఞానికి కూడా గతించేవరకు శరీరం ఉంటుంది కనుక అది ఉన్నంత వరకు ఆత్మజ్ఞాని ప్రారబ్ధాధీనమైన శరీరాన్ని, దాని పారబ్ధానికి దాన్ని విడిచి ఆతడు ఆత్మతోనే జీవిస్తాడు. రామకృష్ణ పరమహంస కంఠానికి కాన్సరు వస్తే అదే మాట చెప్పాడు. రమణ మహర్షి చేతికి కాన్సరు వస్తే అదేమాట చెప్పాడు.
కుండలోని ఆకాశం కుండ పగిలిపోగానే ఆకాశంలో కలిసిపోయింది అని అంటాము. నిజానికి అది దానికి సంబంధించిన సత్యమే కాని కుండ ఏర్పడినప్పుడు ప్రారంభంలో ఆకాశం కుండతో పాటు వేరు అవటం కాని, మళ్లీ కుండ పగిలిపోగానే కుండలోని ఆకాశం అనంత ఆకాశంలో మళ్ళీ కలిసిపోవటం గాని ఏవీ ప్రత్యేకంగా జరగలేదు. అయినప్పటికీ సంబంధిత సత్యాలుగా అట్లా చెప్పుకొంటూ ఉంటాము. ఆ విధంగానే ఆత్మజ్ఞాని చైతన్యం సర్వవ్యాపకమైన చైతన్యం ఎల్లవేళలా ఒక్కటే అయి ఉంది. అయినప్పటికీ శరీరధారణ వల్ల సంబంధిత సత్యంగా ఆత్మజ్ఞాని శరీరం విడిచినప్పుడు సర్వవ్యాపకమైన పరబ్రహ్మంలో కలిసిపోయిందని చెప్పుకొంటాము. ఏది ఏ విధంగా ఉన్నప్పటికీ చివరి గడియలలో ఆత్మజ్ఞాని అయిన వాడు ఆత్మజ్ఞాన సాధనలో కూడిన ధ్యానంలో ఉండి గతించాలి అని గురుమహారాజ్‌జీ గారు చెపుతుంటారు. ఆత్మజ్ఞాని అట్లా ఆత్మజ్ఞానంలో ఉండగా శరీరాన్ని విడవటంవల్ల నదులు ఏ విధంగా అయితే సముద్రంలో కలిసి నామరూపాల్ని కోల్పోతున్నాయో ఆ విధంగానే ఆత్మజ్ఞాని తనకున్న నామరూపాల్ని ఉనికిని విడిచి పరబ్రహ్మంలో లీనమైపోతాడు. గురుమహారాజ్‌జీ తండ్రిగారైన హంస్ మహారాజ్‌జీగారు సత్సంగు చెపుతున్నపుడు మధ్యలో లేచి, ప్రక్కరూంలోకి వెళ్ళి ఆత్మజ్ఞాన సాధనలో కూర్చొని శరీరాన్ని విడిచిపెట్టారు. కావున ఆత్మజ్ఞానులు ఆ విధానాన్ని తెలిసి చివరిగడియల్ని సద్వినియోగం చేసుకోవాలి.
54 #9; యల్లాభాన్నా పరో లాభః
యత్సుఖాన్నా పరం సుఖం
యత్ జ్ఞానాన్నా పరం జ్ఞానం
తద్బ్రహ్మేత్యవధార యేత్|| 54
¸R…V»`½+లాభాత్=ఏది లభించిన పిదప, అపరః = ఇకపొందవలసిన, లాభః = లాభం అనేది ఏదీ,, న= లేదో, యత్+సుఖాత్ = ఏ సుఖాన్ని అనుభవించిన పిదప, అపరం = ఇక పొందవలసిన, సుఖం = సుఖం అనేది ఏదీ, న=లేదో, యత్+జ్ఞానాత్=ఏ జ్ఞానం పొందిన పిదప, అపరం= ఇక పొంద వలసిన, జ్ఞానం = జ్ఞానం అనేది ఏదీ, న=లేదో, తత్=అదియే, బ్రహ్మం=బ్రహ్మం, ఇతి=అని, అవధారయేత్=తెలిసికో.
తా|| ఏది లభించిన పిదప ఇక పొందవలసిన లాభం అనేది ఏదీ లేదో, ఏ సుఖాన్ని అనుభవించిన పిదప ఇక పొంద వలసిన సుఖం అనేది ఏదీ లేదో, ఏ జ్ఞానాన్ని పొందిన పిదప ఇక పొందవలసిన జ్ఞానం అనేది ఏదీ లేదో అదే బ్రహ్మం అని తెలుసుకో.
వివరణ :- బాలురు కనిపించిన ప్రతి వస్తువును దాచుకొంటూ, వాటితో ఆడుకొంటూ ఆనందిస్తూ, అవి అన్నీ కూడా తమకు లాభాన్నీ, సుఖాన్నీ ఇస్తున్నాయి అని నిర్మలమైన హృదయంతో ఆనందిస్తుంటారు. అందుకే నిష్కల్మష హృదయులైన బాలుర్ని చూస్తే పెద్దవాళ్ళు సంతసిస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకు పనికిరావని బయట పారవేస్తున్న ప్రతివస్తువును పిల్లవాడు ఇంట్లోనే ఇంకొక ప్రక్కన పెట్టి అది తనకు లాభదాయకమని, అది తనకు సుఖాన్ని ఇస్తుందని వాటితో ఆడుకొంటూ సంతోషిస్తుంటాడు. క్రమేపి పెద్దవాడు అవుతున్న కొద్ది కనిపించే వాటిలో కంటికి నదరుగా ఉండే వాటినే, మేటి వస్తువుల్నే తనకు ఉపయోగపడేవి అని అనుకొనే వాటినే తీసి దాచుకొంటూ వాటితో లాభాన్ని, సుఖాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు. వస్తువుల్ని గురించి ఇతరులను అడిగి తెలుసుకొంటూ బాలుడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొంటున్నానని ప్రతిరోజు ఆనందాన్ని అనుభవిస్తూ తృప్తి పడుతుంటాడు. క్రమేపి బాలుడు ¸°వన స్థితికి వచ్చేటప్పటికి వ్యక్తిత్వం కావాలని, తన ప్రత్యేక అభిరుచులు తాను తీర్చుకోవాలని కాంక్షిస్తూ గడుపుతాడు. అప్పుడు ఆతడు కోరే లాభం, సుఖం, జ్ఞానం అన్నీ కూడా అంతకు ముందు ఆతడు కోరే వాటికంటే విలక్షణంగా కనిపిస్తుంటాయి; అవి అన్నీ కూడా స్వార్థపూరితంగా ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ ఆతడు కాంక్షించేవన్నీ స్వార్థపూరితమైనవని ఆతడు ఏనాడూ అనుకోడు. కనీసం ఆ వయసులోనైనా ఆతనికి ఆత్మజ్ఞానం తెలిపి, అదియే బ్రహ్మమని చెప్పినా ఆతడు నమ్మటానికి వీలులేని స్థితిలో ఈనాటి సంఘం నడుస్తుండటంవల్ల నిజమైన బ్రహ్మజ్ఞానం, నిజమైన జ్ఞాననేత్రం అందరికీ అందకుండా పోతుంది. అయిదు సంవత్సరాల వయస్సప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొంది, జ్ఞానానందాన్ని అనుభవించిన శ్రీ సంత్ బాలయోగీశ్వర్ మహారాజ్‌జీ గారు కూడా ఈనాడు పద్దెనిమిది సంవత్సరాలు దాటితేగాని ఎవ్వరికీ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వటంలేదు. సుందర చైతన్యానంద స్వామి వారు కూడా 20 నుంచి 24 ఏళ్ళ మధ్య వయస్సున్న వారికి మాత్రమే సాధనకు ఆశ్రమంలో స్థానాన్ని కల్పించి సాధన చేయిస్తున్నారు. ఆ విధంగా గురువులనుంచి జ్ఞాననేత్రాన్ని పొంది, సచ్చిదానందాన్ని అనుభవించినవారికి మాత్రమే బ్రహ్మానందంలో ఉన్న లాభం, సుఖం, జ్ఞానం అనే ఔన్నత్యాన్ని లోక విషయాలతో పోల్చి అవగాహన చేసుకోవటానికి వీలుకుదురుతుంది.
ఈ విధంగా లోకాన్ని పరిశీలించి, ఆలోచించదలచినప్పుడు అద్దంలో ప్రతిబింబించే ఫలాల్ని భుజించాలనుకొనేవారు బాలురే అవుతారు కాని తెలివిగలవారు కాదు, విషయ సుఖాలను వెన్నంటేవారు బాలురే అవుతారని కఠోపనిషత్తుకూడా వివరించింది. కావున ప్రాపంచిక విషయ విలాసాల వల్ల వచ్చే లాభం, సుఖం, జ్ఞానం అనేవి నిజమైనవి కావని తెలుసుకొని నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవులు పెద్దవాళ్ళయి, వృద్ధులు అవుతున్నకొద్దీ, వాళ్ల సొంత శరీరం కూడా వాళ్ళకు బరువుగానే కనిపిస్తుంటుంది. కాన మానవుల్ని వ్యాధులు బాధించకుండా ఉన్నప్పుడే, కామాదులు వేధించకుండా ఉన్నప్పుడే, ముసలితనం ముసరకుండా ఉన్నప్పుడే బ్రహ్మజ్ఞానమనే గురుజ్ఞానంతో మానవులు జీవించటం నేర్చుకోవాలి.
లోకంలో ఎక్కడ చూసినా అంతా స్వార్థంతోనే నడుస్తుంది. వర్తకుడు ఎప్పుడైనా సరే కొలిచేటప్పుడు లాభం అంటాడే కాని ఒకటి అని లెక్కించడు. అదే విధంగా ప్రతివాడు ఎంతసేపు తనకు లాభం కావాలనే కాంక్షిస్తాడు కాని తోటి వారి లాభం, తోటివారి సుఖం, తోటి వారి బాధా నివృత్తి అనేవి ఆలోచించాలని కూడా తలంచడు; విషయ సుఖమే పరమావధిగా భావిస్తాడు. దేహ సంబంధమైన లాభాలు, సుఖాలు అన్నీ కూడా క్షణికమైనవి, తాత్కాలికమైనవి. అవి అన్నీకూడా ఇంకా అనుభవించాలి అనే కాంక్షనే పెంచుకొంటూపోతాయి కాని తృప్తిని, శాంతిని ఇవ్వవు. అయినప్పటికీ సామాన్యులు వాళ్ళు అనుభవిస్తున్న విషయసుఖాల కన్నా మించిన సుఖం, ఆనందం మరొకటి లేదని సంబరపడిపోతూఉంటారు. లాభం, సుఖం, జ్ఞానం అనేవి ఇంకొక దానితో పోల్చి చెప్పుకోవటానికి వీలయ్యేవే కాని నిజంగా ఇవేవీ సంపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చేవి కావు. అయినప్పటికీ మానవులు వాళ్లకు అందుబాటులో ఉన్న వాటినుండే లాభాన్ని, సుఖాన్ని, జ్ఞానాన్ని పొందాలని కాంక్షిస్తుంటారు. నిజంగా తెలివిగలవాళ్ళు ఎవ్వరూ కూడా వృథాగా ఏ వస్తువుని పోగొట్టుకోవటానికి ఇష్టపడరు. లోకంలో వాళ్ళకు అందుబాటులో ఉన్న వస్తువు లభిస్తుందనే హామీ వాళ్ళకు లభించినప్పుడే లోకవస్తువుల్ని వాళ్ళు త్యాగం చెయ్యటానికి ఇష్టపడతారు. కావున దానికి అనుకూలంగా మానవులకు జ్ఞానజ్యోతిని ప్రసాదించటానికి గురువులు ప్రయత్నం చేయాలి. లెక్కల్లో ఎన్ని సున్నాలు ఉన్నా వాటి ప్రక్కన ఒకటి పెట్టినప్పుడే ఆ సున్నాలన్నిటికి విలువవచ్చి అవి రాణించినట్లుగా మానవులకు ఆత్మజ్ఞానమనే బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చినప్పుడే అన్ని లాభాలకన్నా, అన్ని సుఖాలకన్నా, అన్ని జ్ఞానాలకన్నా బ్రహ్మజ్ఞానం గొప్పదని వాళ్ళు తెలుసు కోగలుగుతారు. కావునే శంకరాచార్యులవారు లాభం, సుఖం, జ్ఞానం అనే ఆ మూడింటిని బ్రహ్మతో పోల్చి చెప్పుతూ వాటికి కల భేదత్వాన్ని సూచిస్తూనే అభేదత్వాన్ని బ్రహ్మంతో నిరూపించారు.
ప్రతివాని ముందు లోకంలో తప్పించుకోవటానికి వీలుకానివనే కొన్ని ఆపదలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. పుట్టిన ప్రతివాడికి రోగం రావటం, ముసలితనం రావటం, మరణం రావటం అనేవి ఎప్పటికైనా తప్పవు. ''వృద్ధాప్యం అనే యోధుడు ముందు దారి చూపిస్తుండగా, భయంకర వ్యాధులనే సైనికులతో కూడి మృత్యువు అనే శత్రువు నీ పైకి దండెత్తటానికి వస్తుండగా, రక్షకుడను భగవంతుని ఎందుకు ఆశ్రయించవు'' అని మహానుభావులు అందరినీ హెచ్చరించి ఉన్నారు. శాశ్వతమగు పరమాత్మను ఆశ్రయించినవాడు వార్ధక్యాన్నీ, మృత్యువునీ అవలీలగా జయిస్తాడని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. కావున రోగం, ముసలితనం, మరణం వంటివాటిని దాటి శాశ్వత లాభాన్ని, శాశ్వత సుఖాన్ని, అవిచ్ఛిన్నమైన ఆనందాన్ని, జన్మ రాహిత్యాన్ని పొందటానికి కావలసిన బ్రహ్మజ్ఞానాన్ని, గడించటానికే మానవులు నిరంతరం కృషి చేయాలి.
ప్రతివాడు తానెవడో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటమే నిజమైన జ్ఞానం కావున అటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని సాధకుడు బ్రహ్మజ్ఞానంతో సాధన చేయటం వల్ల బ్రహ్మంగా రూపొందటం కంటే ఈ లోకంలో మరొకటి గొప్పది లేదని తెలుసుకొంటాడు. ఆత్మజ్ఞాన మనేది జీవుడనే ఏనుగును బంధాల నుంచి విడుదల చేసి సముద్ధరిస్తుంది. అది లోకంలో అజ్ఞానమనే చీకటిలో సంభవించే ప్రతిబంధకాలన్నిటినీ తొలగించి నిజమైన జ్ఞానజ్యోతిగా ప్రకాశిస్తుంది. అందువల్లే ''తమసోమా జ్యోతిర్గమయ''అన్నారు. అంటే చీకటి నుండి వెలుగులోకి తీసుకొని వెళ్ళు అని ప్రార్థించటం జరుగుతుంది. కావున మనస్సును బహిర్ముఖంగా పోనీయకుండా అంతర్ముఖం కావించి, ఆత్మ యందు దాన్ని స్థాపించి, జ్ఞానంతో నిరంతరం సాధనలో ఉన్న వాడే బ్రహ్మజ్ఞాని అవుతాడు; ఆతడే బ్రహ్మం అవుతాడు.
లోకంలో సామాన్య మానవులు ప్రతి బింబానందమే వాస్తవమైన ఆనందమని భ్రమసి దాని వెంట పడుతుంటారు. మహదానందం ఇచ్చేది చంద్రుడే అని తెలిసిన తర్వాత కూడా చిత్రంలో ఉన్న చంద్ర బింబం వెంట ఎవడు పయనిస్తాడు? లోకంలో ఉన్న సమస్త ఆనందాలు బ్రహ్మానందంలోనే ఇమిడి ఉన్నాయి. కాన సాధకుడు ఇంద్రియ సుఖాలు పరమ సుఖాలు కావని, ప్రాపంచిక వైభవాలు పరమ సుఖాలు కావని తెలుసుకొని జీవిస్తాడు. ఆతడు ఆత్మ అనే బ్రహ్మంతోనే బంధం పెట్టుకొని లోకంలోని బంధాలన్నిటిని త్యజించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాని వల్ల సాధకునికి దేహానికి సంబంధించిన భోగ సమూహాలన్నీ కూడా విషతుల్యంగా కనిపిస్తాయి. అందువల్ల ఆతడు ఆత్మదాహం కలిగినప్పుడల్లా ఆత్మ అనే అద్భుతాన్నే సేవిస్తాడు కాని దేహభోగం అనే విషాన్ని సేవించడు. సర్వజీవుల యొక్క బాహ్యాభ్యంతరాల యందు ప్రకాశిస్తున్నది సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మమే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో (6-62లో)చెప్పాడు.
లోకంలో ఆనందం అనేది బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉంది. ఒక వస్తువు వల్ల వచ్చిన ఆనందం కొన్ని రోజులైన తర్వాత తగ్గిపోవచ్చు లేదా ఆ వస్తువు మీద వ్యామోహం తగ్గవచ్చు, లేదా మరొక నూతన వస్తువు మీదికి మోజు మరల వచ్చు, లేదా అది పోతుందేమో ననే భయం కలగవచ్చు. ఆ విధంగా దాని వల్ల అశాంతి దాపురించవచ్చు. కావున బాహిరమైన వస్తువులతో, కోరికలతో ఆనందాన్ని పొందాలనే దాన్నుంచి ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదో దాన్ని తెలుసుకొని అట్టి ఆత్మ అనే బ్రహ్మను పొందటమే నిజమైన పరబ్రహ్మ జ్ఞానం అని తెలుసుకొంటాడో అటువంటివాడు కోరదగింది మరొకటి ఈ లోకంలో ఉండదు. వశిష్ఠుడు ఆత్మజ్ఞానాన్ని తెలియచేయటానికి యోగవాశిష్ఠం అంతా వివరించి చెప్పిం తర్వాత, అంతా విన్న శ్రీరామ చంద్రుడు జ్ఞాన నేత్రం తెలియకుండా అనవసరంగా జీవితకాలంలో పదహారు సంవత్సరాలు వృథాపుచ్చానుకదా అని బాధ చెందాడు. శ్రీరాముడు గడిచిపోయిన ఒక్క క్షణం కూడా మళ్ళీ రాదుకదా అని దుఃఖాన్ని అనుభవించాడు. కావున లోకంలో ఏది లాభం అనుకొంటున్నారో, ఏది సుఖం అనుకొంటున్నారో, ఏది జ్ఞానం అనుకొంటున్నారో అవేవీ నిజమైనవి కావు. అని తెలిసిన మరుక్షణం తమ అమూల్యమైన జీవితకాలం అంతా వృథా అయిపోయింది గదా అని ఆలోచించకుండా మానవులు వెనువెంటనే శాశ్వతలాభాన్ని, శాశ్వత సుఖాన్ని, శాశ్వత జ్ఞానాన్ని ఇచ్చే ఆత్మ జ్ఞానంతో జీవించటానికి నిరంతరం సాధన చేసి బ్రహ్మానందంతో నిలవటానికి పూనుకోవాలి. ఒక్కొక్క అడుగు నడుస్తూ వెళుతూ ఉంటేనే ఒక నాటికి గమ్యాన్ని చేరగలుగుతారు.
55 #9; యద్దృష్ట్వా నాపరం దృశ్యం
యద్భూత్వా న పునర్భవః
యత్ జ్ఞాత్వా నా పరం జ్ఞేయం
తద్బ్రహ్మేత్యవధారయేత్ || 55
¸R…V»`½+దృష్ట్వా = దేనిని చూడగా, అపరం=ఇతరమైన దానిని, దృశ్యం = చూడవలసిన అవసరం, న=లేదో, యత్+భూత్వా=దేనిని పొందిన, పునః+భవః = తిరిగి జన్మించవలసిన అవసరం, న=లేదో, యత్+జ్ఞాత్వా=దేనిని తెలుసుకొనిన, అపరం=ఇతరమైన దానిని, జ్ఞేయం=తెలుసుకోవలసిన అవసరం, న=లేదో, తత్=అదే, బ్రహ్మా=బ్రహ్మం, ఇతి=అని, అవధారయేత్=తెలుసుకోవాలి.
తా|| దేనిని చూసిన ఇతరమైన దానిని చూడవలసిన అవసరం లేదో, దేనిని పొందిన తిరిగి జన్మించవలసిన అవసరం లేదో, దేనిని తెలుసుకొంటే, ఇతరమైన దానిని తెలుసుకోవలసిన అవసరం లేదో అదే బ్రహ్మం అని తెలుసుకోవాలి.
వివరణ :- ఏదైనా ఒక వస్తువును చూడాలని, దేనినైనా పొందాలని, అదేమిటో తెలుసుకోవాలని ఎవరికైనా ఈ విధంగా కోరికలు కలుగుతున్నాయి. అంటేనే ఆ జీవికి పరిపూర్ణత్వం చేకూరలేదని అర్థం చేసుకోవాలి. వాంఛ అనేది మానవుని ఆంతర్యంలోని అసంపూర్ణతకు వ్యక్తరూపం. వాంఛ అంటే లోక బంధాలకు సంబంధించిన బందిఖానా. కావున దాన్నుంచి విముక్తి పొందటానికి సాధకుడు ఆత్మానుభవంకోసం సాధన చేయాలి. దాని ఫలితంగా ఆత్మజ్ఞానికి బంధ బీజాలు నశించిపోతాయి. ఆతనికి బ్రహ్మానందం సిద్ధిస్తుంది. అట్టి బ్రహ్మజ్ఞానికి చూడాలని, పొందాలని, తెలుసుకోవాలని ఉండదు. సాధకునికి అహంకారం నశించి ఆత్మానందంతో జీవిస్తాడుకాన ఆతడే బ్రహ్మమని తెలుసుకో గలుగుతాడు.
ఆత్మజ్ఞానం తెలియట మంటే మానవుడు లోకంలో ఏది జ్ఞానం అని తెలిసి నడుస్తుంటాడో అది అంతా ఆత్మజ్ఞానానికి తగింది కాదని తెలుసుకొని దాన్ని మరచి పోవటానికి, దాన్ని తొలగించుకోవటానికి సాధనలో ఆతడు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తుంటాడు. ఆ విధంగా ఆత్మజ్ఞాని ప్రతినిత్యం పూర్వవాసనలను అన్నింటిని క్రమేపి అంతరించి పోయేటట్లు సాధన చేస్తుంటాడు కాన ఆతనిలో క్రమేపి కోరికలతో చేసే కర్మలు గతించిపోతాయి. కాన ఆతనికి తెలుసుకోవలసింది, చూడాల్సింది, అనుభవించాల్సింది అనేవి ఏవీ మిగిలి ఉండవు. ఈ శ్లోకంలో చూడటం, పొందటం, తెలుసుకోవటం అనే భేదసూచన నుండి బ్రహ్మ భావన అనే అభేద భావనను నిరూపించి చూపించటం జరిగింది.
56 #9; తిర్యగూర్ధ్వ మథః పూర్ణం
సచ్చిదానంద మద్వయం
అనంతం నిత్యమేకం యత్త
ద్బ్రహ్మే త్యవధారయేత్|| 56
ELóRiQ*Li=పైన, అథః=క్రింద, తిర్యక్=అడ్డంగా ఉన్న నాలుగు దిక్కుల, పూర్ణం=నిండిన, సత్+చిత్+ఆనందం=సచ్చిదానంద స్వరూపమైంది, అద్వయం=రెండు కానిది అంటే అద్వైత మయింది, అనంతం =ఆది అంతం లేకుండా అనంతమైంది, నిత్యం=ఎల్లవేళలా ఉండునది, ఏకం=ఒక్కటే ఉంది అనగా ఇంకొకటి లేంది, యత్=ఏది అయిఉందో, తత్=అదే, బ్రహ్మ=బ్రహ్మం, ఇతి=అని, అవధారయేత్=తెలుసుకోవాలి.
తా||లోపల బయట అన్నిటిలోను నిండి, అన్ని దిక్కుల వ్యాపించి ఉంది, సచ్చిదానంద స్వరూపమైంది, రెండు కానిది, ఆది అంతం లేకుండా అనంతమైంది. త్రికాలాలలోనూ ఉండేది, ఏకమైంది, ఏది అయి ఉందో అదే బ్రహ్మం అని తెలుసుకోవాలి.
వివరణ :- బ్రహ్మానందం యొక్క ఉన్నతత్త్వాన్ని పోల్చి చెప్పటానికి తీసుకొన్నవన్నీ, సాధకుడు సాధనలో ఉన్నప్పుడు, ఆతనికి ప్రత్యాహారస్థితిలో, అటువంటివన్నీ మనస్సులో గుంజాటనపడేటట్లు చేస్తాయి. కాన వాటిని అవగాహన చేసుకోవటానికి ప్రత్యాహారాన్ని, బ్రహ్మానందాన్ని వివరిస్తాను. 54వ శ్లోకం నుంచి 56వ శ్లోకం వరకు ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచిస్తే ఆనందం అనే అనుభవం యొక్క ఉన్నత స్థితి బాగా అర్థం అవుతుంది. అనుభవం ఆనందం అనేవి రెండూ కూడా ఒక్కచోటే కలిసి ఉంటాయి. లౌకికానుభవం ఎప్పుడు త్యాగం చేయటం జరుగుతుందో అప్పుడు ఆత్మానుభవం జరుగుతుంది. ఎప్పుడు ఆత్మానుభవం జరుగుతుందో అప్పుడు బ్రహ్మానందం అనుభవించటం జరుగుతుంది. కనుక జ్ఞానమార్గంలో అలౌకికానుభవం, అలౌకికానందం అనేవి పరస్పరం అర్థనారీశ్వర తత్త్వంలా కలిసి జీవిస్తాయి. ప్రపంచాన్ని, ప్రపంచ విషయాల్ని పొందే కాంక్షతో ప్రయత్నం చేసే ఆనందాన్ని సుఖం అంటారు. బ్రహ్మానందం అట్లాంటిది కాదు. బ్రహ్మానందం తృప్తి నిస్తుంది. సుఖం పరాపేక్షమైతే ఆనందం స్వాపేక్ష మవుతుంది. సుఖం సంకుచితమైతే ఆనందం విశాలమవుతుంది. సుఖం దేశకాల పాత్రలతో కూడి ఉంటే ఆనందం దేశకాల పాత్రలకు అతీతమై ఉంటుంది. ఈ విధంగా పొందే బ్రహ్మానందానుభూతిని అపరోక్షానుభూతి అంటారు. అపరోక్షానుభూతిని గూర్చి శంకరులవారు ఒక గ్రంథాన్ని కూడా రాశారు. అపరోక్షానుభూతిని ప్రత్యక్షానుభూతి అని అనకూడదన్నారు. ఎందుకంటే అపరోక్షానుభూతి ప్రాపంచిక విషయం కాకుండా భగవంతుని విషయం అనుభవించటం అవుతుంది. సత్సంగాల్లో విని, పుస్తకాల్లో చదివి గ్రహించిన జ్ఞానాన్ని పరోక్షజ్ఞానం అంటారు. ఆ విధంగా గ్రహించి బుద్ధిలో దాచి ఉంచిన జ్ఞానాన్ని ఎవరైతే ప్రత్యక్షంగా సాధనలో అనుభవానికి తెచ్చుకొని అనుభవిస్తారో వాళ్ళకు అది అపరోక్షానుభూతి అవుతుంది. ఆ విధంగా ఆత్మానందం యొక్క రహస్యాన్ని కేవలం పరోక్షంగానే కాకుండా అపరోక్షంగా కూడా ఎవడు గ్రహిస్తాడో వాడు జీవుడనబడడు, వాడు భగవంతుడవుతాడు. ఆ విధంగా సాధకుడు బ్రహ్మంగా రూపొందటాన్నే అపరోక్షానుభూతి అన్నారు. మానవుడు అజ్ఞానంలో నేను బ్రహ్మాన్ని కాను అని భావించాడు, జ్ఞానాన్ని గ్రహించి, అనుభూతి పొందిన తర్వాత నేను బ్రహ్మాన్ని అని అవగాహన పొందాడు. కాని నిజానికి ఒకప్పుడు కానిదీ లేదు. మరొకప్పుడు అయిందీ లేదు. ఎప్పుడూ ఒక్కటిగానే ఉన్నాడు అని అర్థం చేసుకోవటాన్నే అద్వైతం అంటారు. అంటే అనుభూతి పొందటానికి పూర్వం ఎట్లా ఉన్నాడో అనుభూతి పొందిన తర్వత కూడా అట్లాగే ఉన్నాడు. మనిషిలో ఏ మార్పు రాలేదు. జీవన విధానం పరిశీలిస్తే మాత్రమే తెలియటానికి వీలైన విధంగా ఉంటాడు. ఆతని శరీరం మంచి తేజస్సుగా ఉంటుంది. ముఖంలో కాంతి వెలుగొందుతుంది. నేత్రాలు కళాకాంతులతో ప్రకాశిస్తాయి. కంఠం సున్నిత మవుతుంది. నడక మందమవుతుంది. తొట్రుపాటు, తొందరపాటులు ఉండవు. మానసికంగా చూస్తే సత్వబుద్ధి పెంపొందుతుంది. శాంతం తాండవిస్తుంది. మాటలు మృదుత్వంతో మాధుర్యం కలిగి ఉంటాయి. కామక్రోధాదులు సడలిపోతాయి. వీటన్నింటివల్ల ఆతనిలో ఆత్మజ్ఞానాభివృద్ధి జరిగిందని తెలుస్తుంది. ఈ విధంగా అద్వైతంలో ఉన్న అతి సున్నితమైన రహస్యాన్ని అవగతం చేసుకోవాలి. భగవంతుని తెలుసుకొంటాడు, అనుభవిస్తాడు, ఆనందిస్తాడు. కాని అది ఎట్లాటిదో, ఏమిటో చెప్పలేడు. అందుకనే భగవదనుభవం అంటే అనిర్వాచ్యం అన్నారు. అటువంటి దాన్నే అపరోక్షానుభూతి అని, అపరోక్షజ్ఞానం అని అన్నారు. లైంగికపరంగా కూడా మనుషులు హాయిని పొందుతారని, ఆనందాన్ని అనుభవిస్తారని కొన్ని ఆశ్రమాలు వక్రమార్గంలో ప్రబోధిస్తున్నాయి. కాని అది తగింది కాదు. అంతకంటే వేయిరెట్లు ఉన్నతంగా ఆత్మమార్గంలో ధ్యానసాధన అనేదాని వల్ల సాధకునికి శాంతి చేకూరుతుంది, ఆనందం ఉత్పన్నం అవుతుంది. దానితో ఆతడు శాంతి ఆనందాలనే జోడుగుర్రాల బండి మీద స్వారీ చేయగలుగుతాడు. కావున ఆత్మ వికాసానికి అడ్డుగోడలుగా నిలిచిన కామాంధుల్ని, మత సిద్ధాంతాల్ని, ఆచార వ్యవహారాల్ని ప్రక్కన పెట్టి సాధకుడు నిరంతరం సాధన కొనసాగించాలి. ఆత్మమార్గంలో ఏ విధమైన అభూతకల్పనా కథల వంటివి ఉండవు. సాధకుడు అపరోక్షానుభూతితో ఉత్తమ మానవుడవుతాడు. ఆత్మవాదిగా, ఆదర్శవాదిగా నిలుస్తాడు. అటువంటివాడు మతం పేరిట జీవితాన్ని లాభసాటి వ్యాపారంగా ఏనాటికీ చేయలేడు. ఎట్టి పరిస్థితుల్లోను సత్యవాదిగానే నిలుస్తాడు. మహాత్మాగాంధీ ''నా రాజకీయం సత్యం, నా మతం సత్యం'' అన్నట్లుగా సాధకుని జీవనం నిరంతరం సత్యంతో పోరాటంగా సాగుతుంది. మతం పేరిట మరొకనిపై దెబ్బతీయటం అనేది ఆత్మమార్గంలో మచ్చుకైనా కనిపించదు. ''తనకన్నా బలహీనునిపై దెబ్బ తీయాలనుకోవటం నీచత్వమే అవుతుంది'' అని నెహ్రూ చెప్పిన మాటలను పరమత ద్వేషాల విషయంలో గుర్తుంచుకొని నడవాల్సి ఉంటుంది.
ఎవరి జీవితంలో వాళ్ళు, వాళ్ల జీవితాల్ని ప్రయోగశాలగా చేసి, ప్రయోగాలు చేస్తూనే జీవిస్తున్నారు. ఎవరి ప్రయోగ ఫలితం వారికే దక్కుతుంది. అయితే ఈ ఆత్మ అనేది కూడా శాస్త్రపరిశోధనకు అందుతుందా అంటే ఇంతవరకు అది అందలేదు. నిజమైన భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త ఎప్పుడూ తత్త్వవిచారకుడే అని ఐన్‌స్టీన్ చెప్పాడే కాని అది సరిఅయింది కాదు అని అనిపిస్తుంది. కారణం ఏమిటంటే భౌతిక విజ్ఞాన శాస్త్రానికి ఆత్మ ఉనికి ఈనాటికి కూడా తెలియలేదు. ప్రకాశమానమై వెలుగొందుతున్న ఆత్మ అంతఃపురంలోకి అడుగుపెట్టకుండా ఉన్న ఇంద్రియాల ద్వారా అవగాహన అయిన జ్ఞానం మీద ఆధారపడే భౌతిక విజ్ఞాన శాస్త్రం ఆత్మయొక్క వస్తుస్వరూపాన్ని నిర్ణయించాలని ప్రయత్నిస్తుంది. కనుక ఆత్మ విషయం భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలకు అవగాహన అవటం లేదు. ఆజ్ఞా చక్రం వద్ద వెలుగును ప్రకాశింప చేస్తున్న సుషుమ్నా నాడి వెంట్రుక కన్నా ఎంతో సన్నగా ఉంటుందని, అది భూతద్దంతో పరిశీలించి కనుగొందామని ఎన్నివిధాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా దొరకటం లేదని, అది ధ్యాన సాధకునికి మాత్రమే అనుభవం అవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. సాధకుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆతనికి తెలియకుండానే శ్వాస నిలిచిపోతుంటుంది లేదా చాలా సున్నితంగా నడుస్తుంటుంది. ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు సాధకునికి తెలియకుండానే కుండలినీ ఊర్థ్వగమనమై సహస్రారాన్ని చేరటం, తిరిగి దాని స్వస్థానమైన మూలాధారానికి అది చేరటం కూడా జరుగుతుంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. జ్ఞానమార్గంలో సాధకుడు తాను క్రియాయోగానికి అనుకూలంగా ప్రాణాయామం చేయటం లేదు కనుక కుండలినీ జాగరణం జరగటం లేదని అనుకోనక్కరలేదు. సాధకుడు గురుజ్ఞానంతో సాధన మార్గంలో సాధన కొనసాగిస్తుంటే అంతర్ముఖంగా జరగవలసిన కార్యాలన్నీ జరుగుతూనే ఉంటాయి. అరుణోదయం అయ్యేవరకు సూర్యోదయం తెలియనట్లు సంపూర్ణ ఫలితాలు బహిర్గతం అయ్యేవరకు సాధకునికి వాటిని గురించి వివరంగా తెలియదు.
సహజంగా లోకంలోని మానవుల్లో నూటికి తొంభైమందికి పైగా భక్తిమార్గంలోనే జీవిస్తుంటారు. భగవంతుని మీద భారం మోపి, ఆయనకు ఒక నమస్కారం పారేసి, వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు ప్రాపంచిక సంబంధాలన్నిటికంటే భగవంతుడే ఎక్కువ అనే అభిప్రాయం ఎప్పుడు అధికమవుతుందో అప్పుడు చెల్లాచెదురుగా, భిన్న భిన్నంగా, ముక్కలు ముక్కలుగా ప్రవహిస్తున్న వాళ్ళ ప్రేమ ప్రవాహాలన్నింటినీ భగవంతుని భక్తి ప్రవాహంగా చేసేస్తారు. ఆ విధంగా వారి లౌకికప్రేమలను దారి మళ్ళించి, అభివృద్ధి మార్గంలో ఏక ప్రవాహమయ్యేటట్లు చేస్తారు. దాని వల్ల అది పూర్ణత్వాన్ని సంతరించుకొని నిజమైన భక్తిగా రూపొందుతుంది. భగవంతుని ముందు తమ చుట్టూ తిరుగుతున్న, వ్యామోహపెడుతున్న చిన్న చిన్నవిగా ఉన్నవన్నీ అల్పమైనవనే భావన వారిలో ఉద్భవించటం వల్ల వాటన్నిటినీ త్యాగం చేసి వాళ్ళు భగవంతుని భక్తిలో నిలవటం జరుగుతుంది. అయినప్పటికీ కోరికల విషవలయం వారిని వెన్నంటి నడుస్తూనే ఉంటుంది. అటువంటి వాళ్ళకు జ్ఞానమార్గం అవగతమై, ఆత్మమార్గానికి ధ్యానాన్ని మళ్ళించాలని చూస్తున్నప్పుడు వాళ్ళకు ఆధారమైన భూమిని వదిలేసి ఆకాశానికి ఎగరటం ఎట్లా అని వాళ్ళు ఆలోచనలో పడిపోతారు. తమకు ఆధారమైన కొమ్మను వదిలి పైకొమ్మ మీద కాలువేస్తే ఎట్లా అని వాళ్ళు తపనపడి పోతుంటారు. ఓ భగవంతుడా ముందు నువ్వు చేతిని అందించవయ్యా, ఈ లౌకిక వాంఛల్ని వదిలేస్తాం అంటే ఆ భగవంతుడు ముందు లౌకిక వాంఛల్ని వదిలేయవయ్యా తర్వాత చేతిని అందిస్తానంటాడు. అందుకే ఈ జ్ఞానమార్గాన్ని సామాన్యులు తల్లకిందుల వ్యవహారం అంటారు. ఎక్కడైనా ఉన్న స్థితిని వదలకుండా మరో గొప్పస్థితిని పొందటం అనేది ఎక్కడా, ఎప్పుడూ సాధ్యం కాదు గదా! ఆ విధంగా అవటానికి ఇష్టపడక పోతే ఎవరికైనా ఎదుగుదల ఎట్లా సాధ్యం అవుతుంది? ఈ అవగాహన కలిగి దానికోసం నిరంతరం ప్రయత్నిస్తూ విడువకుండా కృషిచేస్తుండాలి.
అనంతమైన పరాత్పరుని ఆధిక్యతను గ్రహించి, సంకుచితమైన ప్రపంచాన్ని విడిచిపెట్టి, భగవంతునితో అనుసంధానమై జీవించటాన్నే జ్ఞానమార్గం అన్నారు. అయితే దీనికి నిరంతరం ధ్యాన సాధన కావాలి. ధ్యాన సాధనలో సాధకునికి ప్రత్యాహారం అనేది ప్రారంభదశ అవుతుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు ధ్యానమనే భవనానికి పునాది వంటివి అయితే ప్రత్యాహారం అనేది భవనానికి గోడలు నిర్మించటం వంటిది అవుతుంది. ప్రత్యాహారం అంటే ఇంద్రియాల్ని విషయాలనుంచి మరలించి అంతర్ముఖం చేయటం, మనస్సులో ఏ లౌకిక భావాలు లేకుండా చేయటం, ధ్యానంలో మనస్సుకి ఏ విధమైన ఆటంకాలు రానీకుండా మనస్సుని సంసిద్ధం చేయటం అని అనవచ్చు. ప్రత్యాహారాన్నే ప్రతి+ఆహారం అని విడదీస్తే మనస్సుకి లోకవస్తువులతో సమానమైన ఆహారాన్ని దానికి అందివ్వటాన్నే ప్రత్యాహారం అనవచ్చు. అట్లాంటప్పుడు గురుజ్ఞానం అనే ఆహారంతో మనస్సును ఆజ్ఞాచక్రం దగ్గర నిలిపే ప్రయత్నమే ప్రత్యాహారం అవుతుంది. అంటే సాధకుని మనస్సు మీదికి లోకంలో ఉండే సుఖకాంక్షలు రాకుండా ఉండేస్థితిని కలిగించటమే ప్రత్యాహారం అవుతుంది. అంటే సాధకుడు మనస్సులో చూడాలి, పొందాలి, తెలుసుకోవాలి, లాభం, సుఖం, జ్ఞానం వంటి లౌకిక భావాలులేకుండా శాశ్వతానందం కావాలనే ప్రేమతో మనస్సును లయింపచేయటానికే సాధకుడు ప్రతినిత్యం సాధన చేస్తుండాలన్నమాట. చెరువు మీదికి గాలి రాకుండా ఉంటే చెరువులో అలలు రాకుండా ఉంటాయి. అట్లాగే మనస్సు మీదికి లౌకిక ఆలోచనలు రాకుండా ఉంటే చంచలత్వం లేకుండా ఉంటుంది. చెరువు మీదికి గాలి రాకుండా ఎట్లాచెయ్యలేమో మనస్సుమీదికి సుఖాకాంక్షలు, ఆశలు అనేవి రాకుండా అట్లా చెయ్యలేము. అయినప్పటికీ సాధకుడు సాధనలో గురుజ్ఞానం అనే ఆహారం మనస్సుకు ప్రతిరోజూ అందిస్తూ, నియమప్రకారం సాధన చేస్తే మనస్సును నిశ్చలం చేయవచ్చు. అయితే ఆ సాధన ఎట్లా ఉంటుందో చెప్పటానికి రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉదాహరణను ఉదాహరించిఉన్నారు. పాచి పెట్టిన చెరువులో నీళ్ళు తాగాలంటే ఆ చెరువులో నీళ్ళను శుభ్రపరిచేటందుకు పాచిని చేతులతో ప్రక్కకుతోస్తూనే ఉండాలి. కొంచెం ఏమరుపాటు కలిగిందా అంటే మరల ఆ పాచి శుభ్రజలాన్ని కప్పేస్తుంటుంది. ఆ పాచిని ప్రక్కన నిలిపి ఆ నీళ్ళను తాగాలంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలో మనస్సును శుభ్రపరిచి ధ్యానంలో పానంచేసేటట్లు చేయటానికి అంత జాగ్రత్తతీసుకోవాలని చెప్పారు. మనం దేన్ని కావాలనుకొంటున్నామో దాన్ని పొందటంకోసం, ప్రయోజనం లేనివాటిని విడిచిపెడుతుంటే మనం కావాలనుకొన్నదాని మీద మనస్సు లగ్నమవుతుంది. ధ్యానంలో మనస్సుని ఇంద్రియాల్ని అణిచిపెట్టినంత మాత్రం చేత అవి నిరోధింపబడినట్లు కాదు. వాటి సహజ ప్రవృత్తికి సంబంధించిన బలహీనతలు శరీరంలో గూడు కట్టుకొని ఉంటాయి. ఆ సహజ బలహీనతలనే వాటిని శరీరంలో లేకుండా కూకటి వేళ్ళతో పెకలించే వరకూ అవిపోయినట్లుకాదు. ఆ బలహీనతలు సమూలంగా పోయే స్థితి వరకూ ప్రతినిత్యం సాధన చేస్తూనే ఉండాలి. సాధకునికి అభ్యాస వైరాగ్యాలనే రెండూ కూడా రెండు కళ్ళులాటివి. వాటిని నిరంతరం సాధనచేస్తూనే ఉండాలి. కామాదులనేవి శరీరానికి సంబంధించినవి కావు. అవి మనస్సుకు సంబంధించినవి మాత్రమే. మనస్సు కనీసం ఏడు సెకండ్ల కాలం నిలపగలిగితే ధ్యానం కుదిరినట్లే అని అనుభవజ్ఞులు చెబుతున్నారంటే దాన్ని సాధించటానికి, అనుభవించటానికి ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఎవరికి వారు ఆలోచించుకొని, ఎవరి లోపాల్ని వారు ప్రతినిత్యం సరిదిద్దుకొంటూ శ్రద్ధగా సాధన కొనసాగించాలి.
ధ్యానానికి మనస్సును ఆ విధంగా సిద్ధం చెయ్యటం అంటే సాధకుడు శరీరాన్ని, మనస్సుని త్యాగం చేసిననాడే అది కుదురుతుంది. సాధకుడు లోకసుఖాల్ని త్యాగం చెయ్యాలి, కనిపించే ప్రతిదాన్ని కాలతన్నేయాలి. ఉన్నదానితో తృప్తి పొందాలి. అప్పుడే సాధకుడు బ్రహ్మస్వరూపంగా రూపొందుతాడు. అయితే ఆ బ్రహ్మస్వరూపం ఎట్లా ఉంటుంది అని ఉపనిషత్తులన్నీ వెతికిచూసినా ఎక్కడా దాన్ని స్పష్టంగా వర్ణించలేదు. ఆ బ్రహ్మానికి గుణాలు కూడా లేవు. బ్రహ్మం అంటే సజాతీయ, విజాతీయ భేదరహితమైందన్నారు. ఒక వస్తువులో కల, అంతర్భాగాలలో కల భేదం అనే వ్యత్యాసం కూడా లేని దాన్నే బ్రహ్మం అన్నారు. అంటే మనస్సు ఎప్పుడు పరిశుద్ధమవుతుందో అప్పుడు ఆ మనస్సు బ్రహ్మం అవుతుంది. మనస్సు ఎప్పుడు ప్రాపంచిక విషయాలనుండి దూరం అవుతుందో అప్పుడు కేవలం భగవత్స్వరూపం అవుతుంది. అంటే మానవునిలో అజ్ఞానం నశించగానే శరీరం, మనస్సు లోపించి బ్రహ్మం మిగులుతుంది. సాధకుడు బ్రహ్మంగా రూపొందటం అంటే ఆతనిలో ఉండే అహంకారపూరితమైన కోరికలు, ఆరాటపెట్టే కోరికలు, ఆందోళన చేకూర్చే సంఘటనలు వంటివి అన్నీ సర్దుకొని, సాధకునిలో ఉండే రకరకాలైన ఇంద్రియాలు అన్నీ కూడా సమ్మేళనం చెంది, సంయమనం చెంది ప్రశాంత వాతావరణానికి అన్నీ వచ్చాయి అని అర్థం చేసుకోవలసి వస్తుంది.
A „sµ³R…LigS ryµ³R…NRPV²R…V ryµ³R…ƒ«sÍÜ[ ú‡Áx¤¦¦¦øLigS LRiWF~Liµj…ƒ«sxmsöV²R…V ÍÜ[NRPLi ÍÜ[¬s Aƒ«sLiµyÌÁ¬dsõ µy¬sª«sVVLiµR…V @ÍØö¼½ @ÍØöQ\ÛÍÁ F¡»yLiVV. @LiµR…VZNP[ ‡ÁXx¤¦¦¦µyLRißáùNRP Dxms¬sxtsQ»R½VòÍÜ[ C ÍÜ[NRPLiÍÜ[ DLi®²…[ xqsVÆØÌÁ¬dsõ F¡ÖÁè ¿RÁW}qsò A xqsÀÁèµyƒ«sLiµR…LiÍÜ[¬s INRP xmsLRiª«sWßáVª«so»][ xqsª«sWƒ«sLi @ª«so»y¸R…V¬s ¿ÁFyöLRiV. „s®ªs[NSƒ«sLiµR…V²R…V ¿ÁÈíÁVNTPLiµR… NRPWL]胫s µ³yùƒ«sLi ¿Á[xqsVòLiÛÉÁ[ µ][ª«sVÌÁV µR…ÈíÁLigS aRPLkiLRiLi ¬sLi²y Aª«sLjiLiÀÁF¡LiVVƒy A»R½¬sNTP µ][ª«sVÌÁ ËØ®µ³…[„dsV ¾»½ÖÁ¸R…VNRPVLi²y µ³yùƒ«sLiÍÜ[ ÖdÁƒ«s\®ªsV Dƒyõ²R…V @LiÛÉÁ[ ryµ³R…ƒ«s FsÉýØ DLi²yÍÜ[ AÍÜ[ÀÁLi¿RÁLi²T…. ryµ³R…NRPV²R…V ryµ³R…ƒ«sÍÜ[ A „sµ³R…LigS @¹¸…[Vù zqós¼½ ª«sLRiNRPV LSªyÌÁ¬s xmsÈíÁVµR…ÌÁ»][, JLRiVö»][, ƒ«sª«sVøNRPLi»][, „saS*xqsLi»][ ¬sLRiLi»R½LRiLi ryµ³R…ƒ«s ¿Á[¸R…WÖÁ. ryµ³R…NRPV²R…V ryµ³R…ƒ«sÍÜ[ ª«sLiÉÓÁ„dsVµR… CgRiªyÖÁƒy, µ][ª«sVªyÖÁƒy NRPW²y »][ÌÁVN]LiÈÁW DLiÉزR…V. @ƒ«sVN][NRPVLi²y Ëܵôj…LiNRPgS¬s, ‡ÁÖýÁgS¬s „dsVµR… xms²T…¾»½[®ƒs[ Gµ][ N]Lixmsª«sVV¬sgjiF¡LiVVƒ«sÈýÁV NRPLigSLRiV xms²T…F¡»R½VLiÉزR…V. @ÉýØLiÈÁxmsöV²R…V ryµ³R…NRPV¬sNTP aRPLkiLRiLi „dsVµR… ªyù®ªsWx¤¦¦¦Li FsNRPä²R… »]ÌÁgjiƒ«sÈýÁV? ˳ÏÁ¸R…VLi FsNRPä²R… F¡LiVVƒ«sÈýÁV? NSƒ«s ryµ³R…NRPV²R…V ®µ…[x¤¦¦¦Li „dsVµR… G ªyù®ªsWx¤¦¦¦Li ÛÍÁ[NRPVLi²y ÒÁ„sLi¿RÁÉجsNTP úxms¸R…V»R½õLi ¿Á[xqsWò, ryµ³R…ƒ«s ¿Á[¸R…VÉجsNTP ¬sLRiLi»R½LRiLi NRPXztsQ ¿Á[¸R…WÖÁ.
మానవుడు నిరంతరం అసంపూర్ణుడై, కోర్కెల వలయంలో చిక్కుకొని, జీవన విధానాన్ని కొనసాగిస్తుంటాడు. కావున ఆ అసంపూర్ణత్వాన్ని పూరించుకోవటానికి, కోరికలతో ఫలితాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రతి ఫలితం కొంత వరకే సుఖాన్ని, లాభాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కాన మానవుడు అసంపూర్ణంగానే నిలుస్తాడు. కావున దాన్ని పూరించుకోవటానికి ఇంకొక కోరిక ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. మానవుని జీవితం ఈ విధంగా అసంపూర్ణమైన కోరికలతో అలరారటం కంటే పరిపూర్ణమైన బ్రహ్మానందంతో అలరారటం ఉత్తమమైందని తెలిసి జీవించటం మానవుడు నేర్చుకోవాలి.
జ్ఞాన మార్గంలో జీవిస్తున్నవాళ్ళను ఇంటిలో ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్న సంఘం అనేక విధాల ఇబ్బందులకు లోనయ్యేటట్లు చేస్తుంటారు. మేమందరం గాడిదలమని, నువ్వుమాత్రమే గుర్రానివని అనుకొంటున్నట్లున్నావేమిటి అనే భావన లోన కలిగి ఉండి ఆత్మ జ్ఞానిని సామాన్యమానవులు అనేక హింసలకు లోనయ్యేటట్లు చేస్తుంటారు. ఆత్మజ్ఞాని స్థిర నిశ్చయంతో సర్వాటంకాలకు ఉదాసీన భావంతో లక్ష్యపెట్టకుండా గడపాలి. అట్లాంటి ఓర్పుకలిగి ఉండటాన్నే తితిక్ష అంటారు. సాధకునిలో సత్త్వగుణం ఉన్నతంగా నిలిచిననాడు ఓర్పుతో ఉండగలుగుతాడు. ఏసుక్రీస్తు శిలువ వేసినా ఓర్పును కోల్పోలేదు. మహమ్మదును ఊరూర వెళ్ళగొట్టినా సహనాన్ని కోల్పోలేదు. రామకృష్ణ పరమ హంసను చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నిరకాల బాధలకు లోను చేసిన లక్ష్యపెట్టలేదు. రమణ మహర్షిని బాల్యంలో రాళ్ళతో కొట్టినా లెక్కచెయ్యలేదు. అటువంటి ఓర్పు, సహనం కలిగిన నాడు ఆత్మజ్ఞాని బ్రహ్మంగా నిలవగలుగుతాడు.
సాధకుడు ముఖ్యంగా గ్రహించవలసింది ఏమిటంటే తానున్న పరిస్థితుల్ని బట్టి, తన చుట్టూ ఉన్న వాతావరణాన్నిబట్టి లక్ష్యసిద్ధి అనేది ఆధారపడి ఉంటుందని అవగాహన చేసుకొని నడవాలి. సత్సంగత్వం చేత, నిస్సంగత్వం, నిస్సంగత్వంచేత నిర్మోహత్వం, నిర్మోహత్వంచేత నిర్మలత్వం చేకూరుతుందని బాగా అవగాహనచేసుకొని సాధకుడు సాధనను కొనసాగిస్తుండాలి. లోకంలో ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వారైనా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వెనువెంటనే మార్చలేరు. కాన ఉన్నంతలో సర్దుకొంటూ తెలిసి జీవించటం నేర్చుకోవాలి. అయినప్పటికీ వీలు కుదురుతున్నప్పుడు పరిస్థితులను అనుకూలంగా మార్చుకొంటూ ఏకాంతంలోకాని, సత్సాంగత్యంలోకాని జీవిస్తూండాలి. అటువంటప్పుడే ఆతడు బ్రహ్మ భావనతో జీవించటానికి కాలం దోహదం చేస్తుంది. అందుకే కాలం కర్మం కలిసి రావాలంటారు.
57 అతద్వ్యా వృత్తి రూపేణ
వేదాంతైః లక్ష్యతే 2 ద్వయం
అఖండానంద మేకం యత్త
ద్బ్రహ్మేత్యవధారయేత్ || 57
ªyùª«sX¼½ò LRiW}msßá = వేరు చేసే విధానం చేత, అతత్=ఇదికాదు అని అసత్ వస్తువుల్ని నిషేధం చేసిన తర్వాత, యత్=ఏదైతే, వేదాంతైః = వేదాంత శాస్త్రం చేత, లక్ష్యతే = సూచింపబడిందో, తత్ = అది, అద్వయం = ద్వయంకానిది, అఖండానందం=నిరంతరం ఆనంద స్వరూపమైంది, ఏకం=ఏకమయింది, బ్రహ్మ=బ్రహ్మం, ఇతి=అని, అవధారయేత్=తెలుసుకోవాలి.
తా|| వేరు చేసే విధానం చేత ఇది కాదు అని అసత్ వస్తువుల్ని నిషేధం చేసిన తర్వాత ఏదైతే వేదాంత శాస్త్రం చేత సూచింపబడిందో అది ద్వయం కానిది, నిరంతరం ఆనంద స్వరూపం అయింది, ఏకమయింది అయిన బ్రహ్మం అని తెలుసుకోవాలి.
వివరణ :- ఏది సత్ వస్తువు? ఏది అసద్వస్తువు? అని విచారణ చేయాలి. అట్లా ఆత్మ జ్ఞానంతో విచారణచేసినప్పుడు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలన్నీ అసద్వస్తువులే; ఇంద్రియాలు మనస్సు అసద్వస్తువులే, ప్రకృతి అయిన అజ్ఞానం కూడా అసద్వస్తువే అని ఆ విధంగా తెలుస్తాయి. అట్లా ఆత్మ తప్ప చుట్టూ మిగిలి ఉన్న సర్వమూ అసద్వస్తువే అని విచారణ వల్ల తెలుస్తుంది. కాన అసద్వస్తువులను అనగా నశించేవాటిని విడిచిపెట్టి, శాశ్వతమైన జ్ఞాననేత్రాన్ని ఆశ్రయించి ఎవరికి వారు బ్రహ్మంగా జీవించాలి. అప్పుడు సాధకుడు సచ్చిదానంద రూపంగా మారి సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తాడు. అప్పుడు సాధకుడు తనలో ప్రకాశిస్తున్నదే అందరిలోనూ ఉందని, అనంతమైందిగా వ్యాపించి ఉందని, విభజించటానికి వీలుకానిదిగా ఉందని, సూక్ష్మాతిసూక్ష్మమై ఉందని, నిత్యమైందని, ఆ పరబ్రహ్మతత్త్వాన్నే వేదాంత శాస్త్రం చెబుతుందని అదే తానని తెలుసుకొని తృప్తితో జీవిస్తాడు.
ఏది అనాత్మ వస్తువు అనే దానిని ఏ విధంగా నిరసించావు అంటే దేనికి ఆది అంతాలు ఉన్నాయో, ఏది నశిస్తుందో అట్లాంటి అసద్వస్తువు అని నిరసించాము. ఏది అనన్యవస్తువు అనేది ఎట్లా నిరూపించావు అంటే జాగ్రద్య్వప్న సుషుప్త్యవస్థల్లో కూడా ఏదీ చలించకుండా శాశ్వతంగా ఉందో అది అనన్యవస్తువైన ఆత్మ అని సమర్థించుకొంటూ నిరూపించుకొన్నాము. దాని వల్ల ఉపనిషత్తులు శతకోటి పర్యాయాలు ఉటంకించి చెప్పిన ఆత్మ అనే బ్రహ్మాన్ని స్వీకరించి తృప్తిని పొందాము. దాని వల్ల ప్రకృతి ప్రకాశానికి, సర్వవస్తు జీవరాశికి జీవాధారభూతమైంది ఆ బ్రహ్మమే అని, అదే పరబ్రహ్మ స్వరూపమై ఉంది అని సాధకుడు అనుభవపూర్వకంగా తెలుసుకొని, సచ్చిదానందంతో జీవించటం జరిగింది. అంతేకాని అది అంతా ఊహాజనితమైంది కాదు. అది అంతా భ్రమ ప్రమాదాలకు లోనయ్యేది కాదు.
సర్వవ్యాపకుడైన బ్రహ్మను ఎవ్వరూ సూటిగా వెళ్లి చేరలేరు. ఎవ్వరూ భగవంతుని చూడలేరు. అట్లా చూశానని చెబుతున్నాడంటే ఆతనికి బ్రహ్మమంటే ఏమిటో తెలియదనిగాని, లేదా చూడకుండానే చూశానని చెబుతున్నాడని కాని అనుకోవలసి వస్తుందని స్వామి చిన్మయానందగారు వివరించారు. కావున సాధకుడు ఆత్మ అనే భగవంతుని ప్రేమ బంధంతో సర్వజీవరాసులతో కూడి-తామరాకుమీద నీటి బొట్టులా-జీవించగలగాలి. బుద్ధిమంతులైనవారు ధ్యాన సాధనలో తమ్ముతాము తెలుసుకోవటం వల్ల ఈ విషయం అంతా తెలుసుకోవటానికి వీలు కుదురుతుంది.
58 అఖండానంద రూపస్య
తస్యానంద లవాశ్రితాః
బ్రహ్మాద్యాస్తారతమ్యేన
భవాన్త్యా నన్దినో2 ఖిలాః || 58
@ÐÁÍØM = సమస్తమైన, బ్రహ్మాద్యాః = బ్రహ్మాది దేవతలు, తస్య = ఆతని, అఖండానంద రూపస్య = అఖండానంద స్వరూపమైన బ్రహ్మరసంలో, ఆనందలవాశ్రితాః = స్వల్పమైన ఆనంద రసాన్ని, తారతమ్యేన = వారి వారి తర తమ భేదాల్ని అనుసరించి, ఆనంది నః = ఆనందించిన వారు, భవంతి = అవుతున్నారు.
తా|| సమస్తమైన బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆతని (అంటే ఆ పరబ్రహ స్వరూపమైన ఆ భగవంతుని) అఖండానంద స్వరూపమైన బ్రహ్మరసంలో స్వల్పమైన ఆనంద రసాన్ని వారి వారి భేదాల్ని అనుసరించి ఆనందించిన వారవుతున్నారు.
వివరణ :- సృష్టిస్థితి లయకారులలో కల బ్రహ్మకు, ఈ పరబ్రహ్మకు చాలా వ్యత్యాసం ఉంది. ఈపరబ్రహ్మస్వరూపమే పరాత్పరుడై ఉన్నాడు. ఆయనే ఆనందసాగరమై ఉన్నాడు. ఈ జగత్తుయొక్క సృష్టిస్థితి లయాదులన్నీ ఎవని వల్ల కలుగుతున్నాయో ఆయనే పరబ్రహ్మమని బ్రహ్మసూత్రాల్లో (1-2) వ్యాసుడు వివరించాడు. ఆత్మ అనే బ్రహ్మానందంలో ఒక లవమాత్రమే బ్రహ్మ అనుభవిస్తున్నాడనగా ఆ ఆత్మానందం ఎంత ఉన్నతమైందో సాధకుడు గ్రహింప తగి ఉంది. బ్రహ్మాది దేవతలందరూ వారి అర్హతకు తగిన విధంగా తరతమ భేదాలతో అనుభవిస్తున్నారని తైత్తరీయ ఉపనిషత్తు వారి వారి వాటాలతో సహా వివరించింది. అయినప్పటికీ కూడా వారందరూ ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఆనంద సాగరం నుండే వారు గ్రహిస్తున్నారనగా సాధకుడు సాధనను ఎంత శ్రద్ధగా నిరంతరం కొనసాగించాలో ఎవరికి వారు పరిశీలించుకొని నడువవలసి ఉంది. ఎవరి కృషికి తగిన ఫలితం వారికి లభిస్తుంది కాన నిరంతరం ఓర్పుతో, పట్టుదలతో, నమ్మకంతో, విశ్వాసంతో కొనసాగించాలి. ఎవరి కర్మలకనుగుణంగా వారి గుణాలు ఏర్పడుతున్నట్లే ఎవరి సాధనకనుకూలంగా వారి ఆనందానుభవం ఏర్పడుతుందని ఎవరికి వారు తెలుసుకొని నడవాలి.
సాధకుడు ఆత్మతత్త్వంలో అనంతమైన బ్రహ్మానందాన్ని అనుభవించటానికి అన్ని విధాల వీలవుతుంది. కారణం ఏమిటంటే వాసనాప్రవాహంలో కొట్టుకుపోయే మనస్సుకు గురువు ఆత్మజ్ఞానమనే మరొక ఆలోచనా ప్రవాహాన్ని దానికి అందించి సాధన చేయిస్తాడు కాన ఆ గురుతంత్రమనేది ఆ మనస్సును అరికట్టి అపరోక్షానుభూతిని పొందేటట్లు చేయగలుగుతుంది. కావున సాధకుడు వీలైనంత వరకు ఆత్మ జ్ఞానంతో జీవించాలి. పరిపూర్ణమైన ఆనందం నేనే అని తెలిసి సాధకుడు జీవించాలి. అయినప్పటికీ కొన్నికొన్ని ఆశ్రమాల్లో ఇప్పటికి కూడా ఆత్మజ్ఞాన సాధనకు ఓంకార సాధనానికి కూడా ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. కాని అది సరైంది కాదని శ్రుతిసార సంగ్రహం అని ప్రతీతి గన్న శ్రీరామ గీత 48వ శ్లోకాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ''నామ రూపాత్మకమైన చరాచర జగత్తంతా కూడా ఓంకార రూపమేనని ధ్యానించటం అజ్ఞానదశలో మాత్రమే కాని జ్ఞానదర్శనం తర్వాత కాదు''అని శ్రీరాముడు లక్ష్మణుడికి బోధించాడు. గురువు శిష్యునికి ఆత్మజ్ఞానం ఎప్పుడు ప్రసాదిస్తాడో అప్పటి నుంచే జ్ఞానదర్శనంఅయినట్లు కాన సాధకులు జ్ఞానోదయంతో జీవించాలి. ప్రతినిత్యం బ్రహ్మానుభవం అనుభవిస్తున్న సాధకునికి బ్రహ్మానందం అప్రయత్నంగా, అనాయాసంగా లభిస్తుంది. కావున సాధకుడు ''కొబ్బరికాయలోని నీటిని తాగినాక కాయను పారేసినట్లు బ్రహ్మానందాన్ని అనుభవించిన తర్వాత శరీరం కోరే కోరికలన్నిటినీ త్యజించాలి'' అని శ్రీరాముడు లక్ష్మణునికి శ్రీరామగీతలో 34వ శ్లోకంలో వివరించాడు, ఆ స్థితిలో సాధకుడు ప్రారబ్ధ క్షయం అవటాన్ని ప్రత్యక్షసాక్షిగా చూస్తూ జీవిస్తాడని శ్రీరామగీత 54వ శ్లోకంలో చెప్పారు. రామకృష్ణ పరమహంస, రమణమహర్షి ఇద్దరూ కూడా కాన్సర్‌తో శరీరం క్షీణిస్తున్నా దాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తూ కాలాన్ని వెళ్ళదీశారు.
59 తద్యుక్త మఖిలం వస్తు
వ్యవహారస్త దన్విత ః
తస్మాత్సర్వగతం బ్రహ్మ
క్షీరే సర్పిరి వాఖిలే || 59
OUPQlLi[ = పాలయందు, సర్పిః = వెన్న, అఖిలే ఇవ = సర్వత్రా వ్యాపించి ఉన్నట్లుగా, బ్రహ్మ=బ్రహ్మం, సర్వగతం = సర్వవ్యాపకమై ఉంది, తస్మాత్=అందుచేత, అఖిలం = సమస్తమైన, వస్తు=వస్తువులు, తద్=ఆపరబ్రహ్మంచేత, యుక్తం = పరివ్యాప్తమై ఉంది, తదన్వితః = ఆ పరబ్రహ్మం వలననే, వ్యవహారః = కర్మలు జరుగుతున్నాయి.
తా|| పాలయందు వెన్న సర్వత్రా వ్యాపించి ఉన్నట్లుగా బ్రహ్మం సర్వవ్యాపకమై ఉంది. అందుచేత సమస్తమైన వస్తువులన్నీ ఆ పరబ్రహ్మం చేత పరివ్యాప్తమై ఉన్నాయి. ఆ పరబ్రహ్మం వలననే పనులన్నీ జరుగుతున్నాయి.
వివరణ :- బ్రహ్మసత్యం, జగం మిథ్య, బ్రహ్మ సర్వస్వం అన్నట్లు సత్యమైన భగవంతుడు ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. ఆ విధంగా విశ్వమంతా బ్రహ్మమే అయి ఉంది. ఆ పరబ్రహ్మ స్వరూపం వల్లనే లోకంలో అన్ని పనులు జరుగుతున్నాయి. మానవులకు అన్ని రకాలైన ఆలోచనాశక్తులు ఆయన వలననే వస్తున్నాయి. కావున ఆ పరాత్పరుడు లేనిది అంటూ ఏదీ లేదు. ప్రతి వ్యక్తిలోను బ్రహ్మం అనే చైతన్యం ఉన్నట్లే అన్నిటా ఆ చైతన్యమే ఉంది. ఆ బ్రహ్మమనే చైతన్యం వల్లనే జీవరాశిలో జీవకళ ఉట్టిపడుతుంది. ఆయన అనుగ్రహం లేనినాడు సర్వప్రపంచం చైతన్యవిహీనమై, కళావిహీనమై, అందవిహీనమై నశిస్తుంది. కావున అన్నిటికీ ఆ పరబ్రహ్మమే కారణమై ఉన్నదని తెలుసుకోవటానికి పాలలో వెన్నను వివేచనా దృక్పథంతో పరిశీలించి చూడటానికి అనుకూలంగా చక్కటి దృష్టాంతాన్ని వివరించారు.
పాలను చూసినప్పుడు వెన్నకనబడక పోయినా పాలలో సర్వత్రా వెన్న వ్యాపించి ఉంది. పాలనుతోడుపెట్టి, పెరుగు చిలికి, మజ్జిగ చేసి తీసిన వెన్న మజ్జిగలో తేలుతుంది. వెన్న మనకు కనిపిస్తున్నప్పుడు పాలు చూద్దామన్న కనిపించవు. అట్లాగే సాధకునికి బ్రహ్మానందం అనుభవించేటప్పుడు ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలు చూద్దామన్నా ఏవీ కనిపించవు. ఆ విధమైన అనుభూతిని పొందటానికి సాధకుడు ఏ విధంగా సాధన చెయ్యాలో చూట్టానికే పాలను పరిశీలించి చూద్దాం. పాలవలె ఉన్న మనస్సుకు గురుమహారాజ్‌జీ సత్సంగాలనే శ్రవణం చేయించాలి. లేదా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలనే నిరంతరం వింటూ ఉండేటట్లు చేయాలి. ఆ విధంగా మనస్సనే పాలను శ్రవణమనే అగ్నితోకాచి మననమనే తోడు వేసి ధారణ అనే పెరుగు చేయాలి. అంటే ఆత్మకు సంబంధించిన మాటలనే నిరంతరం విమర్శనా దృక్పథంతో, వివేకంతో ఆలోచించుకొంటూ ఉండటం వల్ల అనే త్రికాలాల్లోను మననమై రక్తాణువుల్లో జీర్ణించి పోతాయి. అప్పుడు ధ్యానమనే కవ్వంతో పెరుగును మథించాలి. దాని వల్ల పాలనుంచి వెన్నవచ్చినట్లే సాధకునికి బాహ్యాభ్యంతరాలలో బ్రహ్మమే దర్శనభాగ్యం చేకూరుస్తుంది. కావున సర్వప్రకృతి వ్యక్తులకు మూలపురుషుడు బ్రహ్మమే అని, ఆ బ్రహ్మం ఇందు కలడందులేడని సందేహింప పని లేదని, సర్వత్రా ఆతడే వ్యాపించి ఉన్నాడని, సాధకుడు సర్వంబ్రహ్మమయం అనుకొంటూ బ్రహ్మంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. ''జ్ఞాన చక్షువు కలవానికి సర్వమూ బ్రహ్మస్వరూపమే, సృష్టి బ్రహ్మం కన్నా వేరుకాదు, బ్రహ్మం సృష్టి చేయనూలేదు. బ్రహ్మం సృష్టికి ఆధారమూ కాదు. సృష్టిలో అంతర్లీనమూ కాదు, బ్రహ్మమే సృష్టి, సృష్టి వీక్షణంలో దృష్టి దోషం లేనిచో అంతా బ్రహ్మమే'' అని సుందర చైతన్యానంద స్వామివారు చెప్పారు.
బ్రహ్మం సర్వత్రా వ్యాపించి ఉంటే మాకెందుకు కనిపించటంలేదని సామాన్యమానవులు అనుమానాన్ని ప్రకటిస్తున్నారు. ఏ విషయం తెలుసుకోవాలన్నా ప్రతివాళ్ళు దాని కోసం నిరంతరం కృషి చేయాలి. ఎవరైనా వారుకోరుకొనే దానిలో నిగ్గుతేలితేనే దానిలో రసాస్వాదన అనేది వాళ్ళకు చేకూరుతుంది. అంతేకాని ప్రతివానికి ప్రత్యక్షప్రమాణం కావాలంటే భగవంతుని విషయం అట్లా వీలుకుదురుతుందా? మానవునిలో నిక్షిప్తమై ఉన్న వ్యక్తిని ఎవరికి వారు గ్రహించ వలసిందే కాని ఎవరూ దాన్ని బయటకు తీసి చేతిలో పెట్టలేరు. కాని దానికి కూడా ఒక సాధన శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని ఈ గ్రంథంలో అంతా విస్తరించి, వివరించి అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు. కాన దానికోసం జిజ్ఞాస ఉన్నవారు దాన్ని సరిగా అవగాహన చేసుకొని, ఉత్తమ విద్యార్థులై ఉత్తమ ఫలితాన్ని పొందటానికి సాధన చేసి సాధించటానికి నిరంతరం కృషి చేయాలి. గురుమహారాజ్‌జీ ప్రథమంలో రోజుకు ఒక గంట సేపు సాధన చేయమంటున్నాపరు. అదే ప్రేమీ (శిష్యుడు) ఉన్నత ఫలితాలు కావాలని ఆశించి ఆయనను ఆశ్రయించినప్పుడు ఢిల్లీలో ఉన్న ఆశ్రమంలో రోజుకు నాలుగు గంటలు సాధన చేయిస్తున్నారు. వారే ఇంకా ఉన్నంత ఫలితాలు కావాలనుకొన్నప్పుడు రోజుకు పద్దెనిమిది గంటలు సాధన చేయించి సమాధి స్థితిని కూడా పొందేటట్లు చేయించగలుగుతున్నారు. కాన సాధకులు ప్రారంభంలో సుఖశాంతులు, ఆనందం వంటివే ప్రధానంగా స్వీకరించి, సాధన చేసి, తృప్తి పడటం మంచిది. జిజ్ఞాస అధికతరంగా ఉన్న వారి లోపల ఉన్న ఆత్మ ప్రబోధం అధికమై, ఆరోగ్యం, వయస్సు వంటివి అనుకూలించి, పై మెట్టుకు వెళ్ళాలనే చింతన నిరంతరం వెన్నాడిన నాడు, ఎవరి శక్తికి తగినట్లు వారికి, గురుమహారాజ్‌జీ కృపాకటాక్షాలను అందించి ఆనందింప చేస్తున్నారు. కాన సాధకులు నిరంతరం ఎవరికి తగినంత వాళ్ళు సాధన చేసి ఉత్తమ ఫలితాల్ని పొందాలని, ఆనందించాలని ప్రయత్నం కొనసాగించాలి. ప్రతినిత్యం సాధకులు సాధనానంతరం, వారి వారి అనుభూతుల్ని సాధననుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అనుభవించటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సాధకుడు సాధనానంతరం కొంతసేపు ఎవరితోను మాట్లాడకుండా తాను పొందిన అనుభూతి నిలిచేటట్లు ఏకాంతంలో ప్రయత్నం చేస్తుండాలి. సాధన అయిన వెంటనే లౌకిక ప్రవృత్తిలోకి దిగజారిపోకుండా ఉండటానికి ఎవరికి వారు వీలుకుదిరినంత వరకూ ప్రయత్నిస్తూ గడపటం నేర్చుకోవాలి. కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్లు గురుమహారాజ్‌జీ సాధకునికి కావలసినవన్నీ సత్సంగ్, సేవా, భజన్, దర్శన్ అనే నాలుగు ముక్కల్లోనే తేల్చేశారు. అందువల్ల సాధకులు ప్రతివారం క్రమం తప్పకుండా సత్సంగాలకు వెళ్ళి సత్సంగీయులతో గడపటం నేర్చుకోవాలి. దాని వల్ల ఒకే భావం కలిగిన వారు ఒకే చోట చేరుతుండటం వల్ల ఒకరి భావాలు మరొకరు ప్రతిబింబించేటట్లు జీవించగలుగుతారు. దాని వల్ల సత్సంగీయులందరూ సుఖశాంతులతో జీవించగలుగుతారు. ఒకే భావాలు కలిగిన వారు ఒకే చోట చేరుతుండటంవల్ల ఉత్తమ ఫలితాలు తొందరగా చేకూరుతాయి. లౌకిక వాసనాప్రవృత్తులు తొందరగా తొలగిపోవటానికి వీలుకుదురుతుంది.
60 అనణు మస్థూల మహ్రస్వ
మదీర్ఘ మజ మవ్యయం
అరూప గుణ వర్ణాఖ్యం
తద్బ్రహ్మే త్యవధారయేత్ || 60
@ƒ«sßáV iM = సూక్ష్మం కానిది, అస్థూలం = స్థూలం కానిది, అహ్రస్వం=పొట్టీ కానిది, అదీర్ఘం = పొడుగూ కానిది, అజం=పుట్టుకలేనిది, అవ్యయం=మార్పులేనిది, అరూపగుణ వర్ణాఖ్యం = రూపం కాని, గుణంకాని, వర్ణం కాని, నామం కాని లేనిది, తత్=అది, బ్రహ్మ=బ్రహ్మం, ఇతి = అని, అవధారయేత్=ధ్యానించు.
తా|| సూక్ష్మం కానిది, స్థూలం కానిది, పొట్లీ కాంది, పొడుగూ కానిది, పుట్టుక లేనిదీ, మార్పులేనిదీ, రూపం లేనిదీ, గుణం లేనిదీ, వర్ణం లేనిదీ, నామం లేనిదీ ఏదో అదే బ్రహ్మం అని ధ్యానించు.
వివరణ :- బ్రహ్మం అనేది సూక్ష్మంకాదు, ఎందుకంటే సర్వవ్యాపకమై ఉంది. అట్లా అనుకొందామా అంటే అది స్థూలంకాదు, ఎందుకంటే అణువును ముక్కలు చేసి అందులో ఉన్న ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను కింద ఉన్న ఏ ముక్కను చూద్దామన్నా అంతకన్నా సూక్ష్మమై అది సర్వత్రా వ్యాపించి ఉంది. లేదా రూపం ధరించి లేదు కాన అది స్థూలం కాదు. దానికి రూపమే లేదు కాన పొట్టి కాదు పొడుగు కాదు, సృష్టికే కారణంకాన జన్మించుటలేదు, చావుపుట్టుకలు లేవుకాన మార్పులేదు, అది వస్తువు కాదు కాన రూపం లేదు, లేదా నాశనం లేదుకాన గుణం లేదు, పుట్టుకలేదు కాన వర్ణం లేదు, గుణాలు లేవు వర్ణం లేదు కాన జాతి లేదు, నామం లేదు, ఆ విధంగా బ్రహ్మాన్ని గుర్తించటానికి ఏ గుర్తూ లేదు. అన్నింటికీ కారణం ఆతడే అయి జీవుల్ని పాలిస్తున్నాడు. ఏ రూపం లేకుండా సర్వశక్తి వంతమైనవాడు, ఈ భూప్రపంచాన్నే కాక ఖగోళంలోని సర్వ నక్షత్రాలను క్రమం తప్పకుండా నడిపే వ్యక్తి కలిగిన వాడు అయిన ఆ పరబ్రహ్మానికి మరొక పాలకుడు లేడు. ఆతనికి తండ్రి కూడా లేడు. స్వయంశక్తి సంపన్నుడు. స్పర్శకు కూడా దొరకడు, అనుభవానికి కూడా రాడు, ఆలోచనలకు కూడా లొంగడు. అయితే ఈ చైతన్య శక్తి సర్వత్రా ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లు రమణ మహర్షిని పృచ్ఛకులు ఒక కొంటె ప్రశ్న వేశారు. మానవుల్లో చైతన్యమే ఆ బ్రహ్మం అంటున్నారు కదా? మానవుడు మరణించిన తర్వాత ఆ కళేబరం కూడా భగవంతుడేనా అని అడిగారు. ఇట్లా వచ్చారా? ఆ శవం కూడా భగవంతుడే అన్నారు. అడిగిన వాళ్ళకు ఏమి చెయ్యాలో తోచలేదు. చైతన్యవిహీతమైన దాంట్లో ఇంకా ఏమి ఉందీ అని వారి భావన. శవాన్ని అట్లా వదిలేస్తే దానిలో నుంచి క్రిమి పుడుతుంది. కాన ప్రతి అణువు ఆ పరాత్పరుని శక్తి కూడి ఉంది. ఆ శక్తికి ఉచ్చ నీచ మనే భేదం లేదు. కాన అటువంటి దాన్ని వితండ వాదంతో కనుక్కోవాలని ప్రయత్నించటం తగింది కాదు. ఆయనను కనుక్కోవటానికి గాని, ఆయనను అనుభవించటానికి గాని, ఆ ఆత్మ అనే భగవంతుడు శక్తిని ఇస్తేనే, ఆయన కరుణిస్తేనే అది సిద్ధిస్తుంది. ఆ పరాత్పరుడు కరుణించి జ్ఞాన నేత్రం ప్రసాదిస్తేనే కాని చదివేది కూడా అర్థం కాదు. అట్లాంటి పరాత్పరుని పరిమితమైన జ్ఞానంతో కొలవాలనుకోవటం హాస్యాస్పదమైన విషయం. కాన అనుభవజ్ఞులైనవారు చెప్పిన దాన్ని స్వీకరించి, సాధనలో ఆ బ్రహ్మానందాన్ని అనుభవించటానికి, ఆ బ్రహ్మానందంతో జీవించటానికి సాధకులైన వారు ప్రతినిత్యం ఓర్పుతో, పట్టుదలతో, నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి.
61 యద్భాసా భాస్యతే 2 ర్కాదిః
భాసై#్యర్యస్తు న భాస్యతే
యేన సర్వమిదం భాతి
తద్బ్రహ్మేత్యవధారయేత్ || 61
¸R…Vµy÷éry=దేని ప్రకాశం చేత, అర్కాది = సూర్యాదులు, భాస్యతే=ప్రకాశిస్తున్నారో, భాసై#్య=ఆ ప్రకాశిస్తున్న సూర్యాదులచే, యః=అది-అబ్రహ్మం, తు=నిజానికి, నభాస్యతే=ప్రకాశించుటలేదు, యేన=దేనిచేత, సర్వం=సమస్తమైన జగత్తంతా, ఇదం=ఇది, భాతి=ప్రకాశించునో, తత్=అది, బ్రహ్మ=బ్రహ్మం, ఇతి=అని, అవధారయేత్=తెలుసుకో.
తా|| దేని కాంతిచేతనైతే సూర్యాదులు ప్రకాశిస్తున్నారో, దేనిని ఆ సూర్యాదులు ప్రకాశింపచేయలేరో, దేనిచేతనైతే సమస్తమైన జగత్తంతా ప్రకాశిస్తుందో అదే బ్రహ్మం అని తెలుసుకో.
వివరణ :- పగలు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. పచనానికి, మానవ జీవనానికి అనుకూలంగా అగ్ని ప్రకాశిస్తుంది. ఆ విధంగా స్వయం ప్రకాశం అనిపించే విధంగా ప్రకాశిస్తున్నవి అన్నీ కూడా స్వయంప్రకాశకాలు కావు. ఆ పరబ్రహ్మం ప్రకాశంచేతే అవి అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. అట్లాంటప్పుడు తమ ప్రకాశానికేప్రకాశ##మై వెలుగొందుతున్న ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అవి ఏ విధంగాను ప్రకాశింప చేయలేవు. మానవుని ఆత్మ అంతటి ఉన్నతమైన ప్రకాశశక్తి కలిగి ప్రకాశిస్తుంది. మానవునిలో సూక్ష్మాతిసూక్ష్మంగా వెలుగొందుతున్న ఆత్మఅనే భగవంతుడు స్వయం ప్రకాశమానమైన వాడు. ఆ స్వయంప్రకాశమానమైన ఆత్మ అనే బ్రహ్మమే మానవునితో అన్ని కార్యాల్ని చేయిస్తుంది. ఆ స్వయంప్రకాశ##మైన చైతన్య శక్తి చేతనే మానవులు బాహ్యాభ్యంతరాలలో సంచరించగలుగుతున్నారు. కావున అటువంటి స్వయంప్రకాశ##మైన పరంజ్యోతినే బ్రహ్మమని తెలుసుకొని సాధకుడు సాధనలో బ్రహ్మప్రకాశంతో జీవించాలి. ఆ ప్రకాశంచేతే ఈ కనిపించే జగత్తంతా శోభాయమానంగా వెలుగొందుతుందని తెలుసుకొని బ్రహ్మభావనతో సాధకుడు జీవించాలి.
62 స్వయమంతర్బహిర్వ్యాప్య
భాసయన్నఖిలం జగత్
బ్రహ్మప్రకాశ##తే వహ్ని
ప్రతప్తాయ స పిండవత్ || 62
ª«sz¤¦¦¦õ=అగ్ని, ప్రతప్తాయ సపిండవత్ = బాగా ఎర్రగా కాలిన ఇనుప ముద్దలో తాను కాంతిమంతంగా ప్రకాశించే విధంగా, బ్రహ్మ=బ్రహ్మం, అంతః=లోపల, బహిః=బయట, అఖిలం=సమస్త, జగత్=ప్రపంచం, భాసయత్=ప్రకాశిస్తూ, వ్యాప్య=వ్యాపించి ఉంది.
తా|| అగ్ని బాగా ఎర్రగా కాలిన ఇనుపముద్దలో తాను కాంతిమంతంగా ప్రకాశించే విధంగా బ్రహ్మం బాహ్యాభ్యంతరాల యందు వ్యాపించి సమస్త ప్రపంచాన్ని తాను ప్రకాశింప చేస్తూ వ్యాపించి ఉంది.
వివరణ:- ఇనుము చూట్టానికి నల్లగా ఉంటుంది. ముట్టుకోవటానికి చల్లగా ఉంటుంది. అగ్ని చూట్టానికి ఎర్రగా ఉంటుంది. ముట్టుకోవటానికి వేడిగా ఉంటుంది. కావున అనుభవజ్ఞానాన్ని చూస్తున్న పరిజ్ఞానంతో వివరించటానికి వీలుకాదని తెలుసుకోవాలి. శరీరమే ఆత్మ అనుకొనేవారికి ఆత్మజ్ఞానం అందువల్లే తెలియటంలేదు. ఇనుపగుండు అగ్నిలో కాలటం వల్ల అగ్ని లక్షణాలైన ఎర్రని రంగు, వేడి అనేవి కలిగి అది ప్రకాశిస్తుంది. అదే విధంగా జడమైన, చైతన్య రహితమైన ఈ దేహం, ఈ ప్రకృతిలో ఉన్న అన్ని వస్తువులూ కూడా పరబ్రహ్మం యొక్క సంపర్కంతో చైతన్యవంతమై, ప్రకాశమానమై వెలుగొందుతున్నాయి. కాన ఇనుప ముద్దకు ఉన్న వేడి, దాని ప్రకాశం అగ్ని ధర్మాలే కాని ఇనుప ముద్ద ధర్మాలు కావు. పైకి దర్శించటానిక ఇనుము వేడిగా ఉన్నట్లు, ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తుంది. అంతమాత్రం చేత అవి ఇనుము యొక్క ధర్మాలని భ్రమపడినవాడు అజ్ఞాని అవుతాడు. అగ్ని ధర్మాలను తెలుసుకొని ఆ జ్ఞానంతో జీవించినవాడు జ్ఞాని అవుతాడు. అదే విధంగా మానవునిలో ఉన్న ఆత్మధర్మాలను తెలుసుకొని, ఆత్మతో, ఆత్మజ్ఞానంతో, ధ్యాన మార్గంలో జీవించి దాని శక్తిని, ప్రకాశాన్ని వేరుచేసి, దానితో ఆనందించువాడు జ్ఞాని అవుతాడు. కావున సాధకులు పాలనుండి వెన్నను వేరు చేసినట్లు ధ్యానం ద్వారా ప్రతి అణువు నుండి చైతన్యశక్తిని వేరుచేసి, ఆ సచ్చిదానందంతో జీవించటానికి సాధకుడు ప్రతినిత్యం అభ్యాసం చేయాలి. ఈ సృష్టి ఈ విధంగా సృష్టింపబడటానికి నిమిత్త కారణం ఆపరబ్రహ్మమే అయి ఉన్నాడు. సృష్టిని నడపటానికి కావలసిన సహాయకారణం కూడా తానే అయి ఉన్నాడు. కావున బ్రహ్మం బాహ్యాభ్యంతరాల యందు వ్యాపించి సర్వసృష్టిని నడుపుతూ, ఏదీ తనకు అంటకుండా ఉంటున్నాడు. కావుననే ఆతడు స్వయంజ్యోతి స్వరూపుడై పరంజ్యోతిగా వెలుగొందుతున్నాడు. మానవుడు ప్రతిదానిని నేనే ఆలోచిస్తున్నాను, నేనే చేస్తున్నాను, అన్నిటికి నేనే అనే అహంకారంతో సంచరిస్తున్నప్పటికీ, వాటన్నిటికీ శక్తినిచ్చి ప్రకాశింపచేస్తున్నది ఆ బ్రహ్మమే. దీనినే కేనోపనిషత్తు సుందరంగా వివరించింది. దేని చేత మనస్సు సర్వమూ గ్రహిస్తుందో, దేని చేత కళ్ళు చూస్తున్నాయో, దేని చేత ముక్కువాసన చూస్తుందో అదే ఆత్మ స్వరూపమని చెప్పింది. స్వయంశక్తి లేని-జ్ఞానేంద్రియాలకు శక్తినిచ్చి ఆత్మే వాటన్నిటినీ నడుపుతుంది. అగ్ని ఏ విధంగా ఇనుపముద్దకు శక్తిని ఇచ్చి వేడిని, ప్రకాశాన్ని కలిగించిందో అదే విధంగా ఆత్మ జడ పదార్థాలైన వాటన్నిటినీ చైతన్యవంతం చేసి నడుపుతుంది. కాన ఆత్మ అనే బ్రహ్మం పరంజ్యోతి అయి స్వయంప్రకాశంగా వెలుగొందుతూ సర్వవ్యాపకమై ప్రకాశిస్తుంది.
63 జగద్విలక్షణం బ్రహ్మ
బ్రహ్మణో 2 న్యన్న కించన
బ్రహ్మాన్యద్భాతి చేన్మిథ్యా
యథా మరుమరీచికా || 63
ú‡Áx¤¦¦¦ø = బ్రహ్మం, జగత్=ప్రపంచానికి, విలక్షణం = సామాన్యలక్షణాలతో పరిశీలించటానికి వీలుకానిది, బ్రహ్మణః = బ్రహ్మానికి, అన్యత్=వేరుగా, కించన=కొద్దిగా కూడా ఏమీ, న=లేదు, బ్రహ్మాన్యత్=బ్రహ్మానికి వేరుగా, భాతి=గోచరించేది, చేత్=అయినట్లయితే, మరు మరీచికా=ఎండమావిలో నీరు, యథా=వలె, మిథ్యా=అసత్యమైంది.
తా|| బ్రహ్మాన్ని ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పరిశీలించటానికి వీలుకాకుండా విలక్షణంగా ఉంది. బ్రహ్మం స్పర్శలేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. బ్రహ్మాని కంటే వేరుగా ఈ ప్రపంచంలో ఏదైనా గోచరించినట్లయితే అది ఎండమావిలో నీటి వలె అసత్యమైందే!
వివరణ :- జగత్స్పర్శ తగలకుండా బ్రహ్మం తానుగా ఉందా? బ్రహ్మ స్పర్శ తగలకుండా ప్రపంచం తానుగా ఉందా? అంటే రెండూ కూడా ఒకదానితో ఒకటి కూడి ఉన్నట్లుగా ఉన్నాయి. బ్రహ్మానికి దేనితోనూ సంబంధం లేకుండా ఏదీ అంటకుండా ఉంటుంది కాని బ్రహ్మం అంటకుండా ఈ భూలోకంలో ఏ వస్తువూలేదు. నామ, రూప, వస్తు భేదాలతో రకరకాలుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా స్వశక్తితో కూడి ఉంది అని భావిస్తే అది ఎండమావిలో నీరు ఎట్లా లేదో అట్లాగే ఈ లోకంలో కనిపించే వాటన్నిటిలో స్వతస్సిద్ధంగా శక్తి అనేది దేనికీ కూడా లేదు. లోకంలో చూసే వన్నీ భ్రమ చేత, దృష్టి భేదం చేత బహునామరూపాలుగా దృశ్యమానమవుతున్నాయే కాని మరొకటి కాదు. సాధకునికి భ్రమ తొలగగానే, సాధనలో విక్షేపాలు తొలగి బ్రహ్మం అనంతమైన బ్రహ్మంగా అనుభూతిని ఇస్తుంది. అందువల్లబ్రహ్మం కంటే అన్యంగా ఈ భూప్రపంచంలో ఇంకొక వస్తువేదీ లేదు. అన్నీ బ్రహ్మంతోనే కూడి ఉన్నాయి. కావున తేలిన సారాంశం ఏమిటంటే ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' అంటే సర్వమూ బ్రహ్మమే. బ్రహ్మం కానిది ఏదీ లేదు. అయినా ఇంద్రియాలకు, మనస్సుకు, బ్రహ్మం గోచరంకావటం లేదు. శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీకూడా సాధనలో ఆత్మలో లీనమయినప్పుడే ఆత్మానుభూతి ఆత్మానందం కలుగుతున్నాయి. అందువల్లనే బ్రహ్మాన్ని ఎవరూ తెలుసుకోలేరని, ఎవరైనా నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నాను అంటే అది వట్టి అబద్ధమే అవుతుంది అని భాగవతి రామమోహనరావుగారు ఆత్మబోధలో చెప్పారు. ఈ ప్రపంచంలో చూస్తూ తెలుసుకొంటున్న వాటి తెలివి కంటే ఆ బ్రహ్మం నిశ్చయంగా విలక్షణమైంది. అంతేకాకుండా తెలియబడకుండా, అవ్యక్తంగా ఉండే దాని కంటే కూడా ఆ బ్రహ్మం అతీతమైంది అని కేనోపనిషత్తు వివరించింది. కాన బ్రహ్మం ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పరిశీలించటానికి వీలయింది కాదు. బ్రహ్మాన్ని సామాన్య లక్షణాలతో చూశానని చెబితే ఎండమావిలో నీటిని తాగానని చెప్పినట్లే అవుతుంది. అది భ్రాంతి జనితమే కాని మరొకటి కాదు. ఈ భ్రాంతికి లోకంలో మరు మరీచికా భ్రాంతి-ఎండమావిని చూసి నీరనుకోవటం, శుక్త రజత భ్రాంతి-ముత్యపు చిప్పను చూసి వెండి అనుకోవటం, స్థాణుపురుషభ్రాంతి-చెట్టుమోడును చూసి మనిషి అనుకోవటం, సర్పరజ్జు భ్రాంతి-తాడును చూసి పామనుకోవటం వంటి వాటిని ఉదాహరిస్తుంటారు.
ఎడారిలో నీరు లభించదు కదా? ఒయాసిస్సును విని ఉండటం వల్ల ఎండలో కాంతి కిరణాలు నీటి చాలులా భ్రమకొల్పటం వల్ల దాహార్తిని పొందిన మానవుడు దానిని నీరని భ్రమపడి దానివెంటపడి పరుగుతీసి ఇంకా ఎక్కువగా అలసిపోయి, చివరికి సూర్యరశ్మిలో కనిపించిన నీటి భ్రమను గ్రహించుకొంటాడు. అదే విధంగా ఈ ప్రపంచంలో ఆనందంగా భావించే వాటి వెంట పడి అలసిపోయిన మానవుడు, ఇవి అన్నీ భ్రమలే అని తెలుసుకొని, నిజమైన ఆనందంకోసం గురువును ఆశ్రయించి బ్రహ్మానందాన్ని లోపలే అనుభవించగలుగుతాడు.
బ్రహ్మానందం బయట వెతికితే దొరకదని, బయట దొరికేది ద్వైతమేనని, లోపలికి ఇంద్రియాలను మరలించి భగవంతుని చేరినప్పుడే అద్వైతానందం లభిస్తుందని, అజ్ఞానం నుంచి జ్ఞానానికి మళ్ళిన తర్వాత మాత్రమే మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు. దీనినే పరమ భక్తుడైన ఆంజనేయుడు రామునితో చక్కగా వివరించాడు అని గురుమహారాజ్‌జీ చెపుతూ ఉంటారు. ''(1) ప్రభూ నేను శరీర తాదాత్మ్యంతో ఉన్నప్పుడు నీదాసుణ్ణి (2) మనో బుద్ధులతో తాదాత్మ్యం చెంది జీవుడుగా జీవించినప్పుడు నేను నీలో ఒక భాగాన్ని (3) నా స్వరూపంలో నిలిచినప్పుడు నీవే నేను'' అని తన తాదాత్మ్యాన్ని మూడు విధాలుగా విభజించాడు ఆంజనేయుడు (1) శరీర స్థాయినుంచి చూసినప్పుడు దాసుడయ్యాడు. (2) మానసిక స్థాయినుంచి చూసినప్పుడు భగవంతునిలో ఒక భాగం అయ్యాడు (3) ఆత్మ స్థాయి నుంచి చూసినప్పుడు బ్రహ్మంగా రూపొందాడు. సాధకుడైనా కూడా (1) తాను వాతావరణాన్ని తట్టుకోలేనప్పుడు, బాధల్ని భరించలేనప్పుడు ద్వైతంగా జీవిస్తాడు. భగవంతుడికి భక్తుడిగానే భావిస్తూ, ప్రార్థిస్తూ రక్షించమని దాసుడుగానే వేడుకొంటాడు (2) సాధకుడు ఏదైనా కార్యాన్ని, కవిత్వాన్ని జ్ఞాన తత్త్వాన్ని స్వయంగా సాధించినట్లు భావించినప్పుడు తన శక్తిని, తన వివేకాన్ని తలచుకొని ఉప్పొంగిపోయి తనను భగవంతునిలో ఒక భాగంగా భావిస్తాడు. (3) సాథకుడు సాధనలో శాంతి సౌఖ్యాలను పొంది, ఆత్మానందంతో జీవిస్తూ గడుపుతున్నప్పుడు తానే పరమాత్మనని, తానే బ్రహ్మాన్నని బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. కావున సాధకుడు ద్వైత భావన నుండి విశిష్టాద్వైతానికి విశిష్టాద్వైతం నుండి అద్వైతానికి చేరుతూ అద్వైత భావంతో జీవించగలుగుతాడు. అద్వైత భావంతో లోక కార్యాల్లో జీవిస్తూ సాక్షి మాత్రంగా జీవనాన్ని కొనసాగిస్తూ, మనస్సుకూ, శరీరానికీ కలిగే కోరికలు మొదలైనవన్నీ తనవికావని, అవి వాటి వాసనా ఫలితంగా అవి అనుభవిస్తున్నాయని భావిస్తూ బ్రహ్మంగా జీవించగలుగుతాడు. అప్పుడు జీవుడే పరబ్రహ్మ స్వరూపంగా జీవించగలుగుతాడు.
(1) గురుమహారాజ్‌జీ శిష్యులైన ప్రేమీలు, మహాత్మాలు సంఘ సభ్యులందరికీ లేక జిజ్ఞాసువులకు సేవ చేస్తున్నప్పుడు ద్వైతభావంతోనే వారి సేవ కొనసాగుతుంది. అయినప్పటికీ వారందరూ భగవంతుని భక్తులే అనే భావనతో కూడి దాసులుగా సేవచేయటం వల్ల సేవాభావంలో తాదాత్మ్యం చెంది వారు ఆనందించటం జరుగుతుంది. (2) గురుకార్యాలను కాని, జిజ్ఞాసువుల కార్యాలను కాని తమ నేర్పుతో నెరవేరుస్తున్నామని వారికి భావన కలిగినప్పుడు ప్రేమీలు, మహాత్మాలు విశిష్టాద్వైతంతో భావంతో గడుపుతుండటం కనిపిస్తుంటుంది. (3) ప్రేమీలు, మహాత్మాలు సాధనలో పొందిన అద్వైత భావాన్ని బయటలోకంలో జీవిస్తున్నప్పుడు కూడా మౌనంగా అనుభవించగలిగినప్పుడు అద్వైతానుభూతితో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ బ్రహ్మంగా జీవించగలుగుతారు. కాని అది దీర్ఘకాలం వారిలో నిలవటం లేదు. దానిని శాశ్వతంగా నిలిచేటట్లు నిరంతరం సాధన చేయగలిగిన నాడు సర్వం బ్రహ్మంగా నిరంతరం దర్శనభాగ్యం పొందగలుగుతారు. జీవన విధానం మూడుగా కనిపిస్తున్నా సాధకుడు అద్వైతమే సచ్చిదానంద నిలయమని తెలిసి జీవించాలి - దాన్నే ప్రబోధించాలి.
సాధకుడు జీవన విధానంలో భగవంతుని నాటకరంగంలో తాను కూడా ఒక పాత్రనే కాని మరొకటి కాదు అని, ఫలితం కూడా నాది కాదు అని, నాకు వచ్చిన ఆలోచన - చేసిన పని - వచ్చిన ఫలితం అన్నీ ఆ భగవంతునివే అని భావన చేయగలిగిననాడు, అన్నీ ఆ పరబ్రహ్మానికి ఆత్మార్పణ చేసుకొన్ననాడు ఇక సాధకునిలో తనదీ అని చెప్పుకోదగింది ఏదీ మిగలకుండా పోతుంది. కనుక సాధకుడు బ్రహ్మంగా రూపొందగలుగుతాడు. సాధకుడు నిలబడినప్పుడు ఆతని నీడ ఆతని అంత ఎత్తు ఉంటుంది. ఆతడు వంగినప్పుడు ఆతని నీడ సగమవుతుంది. ఆతడు ఆత్మార్పణ చేసుకొని ఆ పరబ్రహ్మం ముందు మోకరిల్లినప్పుడు, సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నీడ అనేదే లేకుండా పోతుంది. కాన సాధకుడు ఆ విధంగా ద్వైతంనుండి విశిష్టాద్వైతానికి మరలుతున్నప్పుడు గ్రహించుకొని అద్వైతానికి అనుకూలంగా జీవితాన్ని కొనసాగించటానికి అలవరచుకోవాలి. అప్పుడు సాధకుడు బ్రహ్మంగానే జీవించగలుగుతాడు. సాధకునిలో అహంకారం అనేది సర్వం కరిగిపోవటంతో సాధకుడే బ్రహ్మంగా, బ్రహ్మమే సాధకుడుగా కనిపిస్తారు. సాధకుడు ఆ విధంగా జీవించగలిగిన నాడు ఆతనిలో మానవత్వం మూర్తీభవించి, చుట్టూ ఉన్న వారికి ఆదర్శవంతంగా కనిపిస్తాడు. ఆతని చుట్టూ ఉన్న వారు తాము కూడా ఆ విధంగా మారాలని భావించటానికి వీలుకుదురుతుంది. ఇక్కడ సాధకుడు గమనించవలసిన విషయం ఒక్కటుంది. అదేమిటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ .ఒకేలా ఉన్నప్పటికీ, ఆత్మమార్గం తనకు నిబ్బరాన్ని, స్థైర్యాన్ని, నిర్భయత్వాన్ని, సత్యభావాన్ని, ధర్మనిరతిని, నీతి నైర్మల్యాన్ని చేకూర్చ గలిగిందని గ్రహించాలి. అవి అన్నీ కలిసి సాధకుని లక్ష్యానికి చేరువగా ఉండేటట్లు నిరంతరం సహకరిస్తుంటాయి. అటువంటి ఆత్మజ్ఞాని ప్రాపంచిక విషయాల్లో అందరిలా ప్రతిస్పందించడు. ఆతని ఇంద్రియాలు సంయమనంతో నడుస్తాయి. వాటి ప్రతిస్పందన శరీరానందానికి, ఇంద్రియానందా లకు కాక ఆత్మానందానికి అనుకూలంగా జరుగుతుంది. కావున మానవులు బ్రహ్మజ్ఞానాన్ని గురువునుంచి పొంది, మనస్సును నిగ్రహించటం నేర్చుకొని, మనస్సుకు తగిన శిక్షణనిస్తే సుఖశాంతులతో మనగలుగుతారు. ఆ విధంగా ఉన్నవాడు భూతకాలపు భూతంతోగాని, భవిష్యత్ కాలపు ఆకాశహర్మ్యాలతో గాని గడపకుండా వర్తమానంతోనే జీవించగలుగుతాడు. భూత కాలంలో జరిగిన అనుభవాల జ్ఞాపకాల సమూహమే నేను అనే అహంకారంగా నిలుస్తుంది. ఆ నేనులో భవిష్యత్కాలపు ఆశలు చోటు చేసుకొని వర్తమానంలో అహంకారంతో జీవించేటట్లు చేస్తుంటాయి. గతాన్ని, భవిష్యత్తుని సమాధిచేసి వర్తమానంతో ఉత్సాహంగా జీవించగలిగితే అహంకారాన్ని తుదముట్టించటానికి వీలవుతుంది. దాని కొరకు సాధకుడు ఆ పరబ్రహ్మానికి ఆత్మార్పణ చేసుకొంటే బ్రహ్మంగా నిలుస్తాడు. అప్పుడు సాధకుడు తనలో ఉన్న మహోత్తమమైన పరమ పదార్థం తన నిజస్వరూపమేనని అపరోక్షానుభూతినొంది పరిపూర్ణుడవుతాడు.
నీ కులం ఏమిటి అంటే మానవ కులం అని, నీ మతం ఏమిటి అంటే ఆత్మ మతమని, నీ జాతి ఏమిటి అంటే అద్వైత జాతి అని సాధకుడు జీవించ గలిగిన నాడు తాను బ్రహ్మ స్వరూపంగా సర్వకాల సర్వావస్థలలోనూ నిలవగలుగుతాడు.
64 దృశ్యతే శ్రూయతే యద్య
ద్బ్రహ్మణో2న్యన్న తద్భవేత్
తత్త్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ
సచ్చిదానంద మద్వయమ్ || 64
µR…XaRPù¾»½[ = చూసేది, శ్రూయతే=వినేది, యద్యత్=ఏది ఉందో, తత్=అది, బ్రహ్మణః+అన్యత్=బ్రహ్మం కంటే వేరుగా, న=లేదు, తత్త్వ జ్ఞానాత్=ఆత్మ జ్ఞానం కలుగగానే, చ=మరియు, తద్బ్రహ్మ = ఆ బ్రహ్మం, సచ్చిదానందం = సచ్చిదానందమైంది, అద్వయమ్ =రెండుకానిది, భ##వేత్=కనబడుతుంది.
తా|| చూసేది, వినేది అంతా కూడా బ్రహ్మం కంటే వేరుగాలేదు. ఆత్మజ్ఞానం కలుగగానే ప్రపంచం అంతా సచ్చిదానంద స్వరూపమైన అద్వయబ్రహ్మంగా కనబడుతుంది.
వివరణ :- ఇంతకు ముందు శ్లోకంలో అంతా బ్రహ్మమయమని చెప్పి ఈ శ్లోకంలో అన్ని కార్యకలాపాలు బ్రహ్మమయమే అని చెబుతున్నారు. శరీరం, శరీరంలో ఉన్న ఇంద్రియాలు అన్నీ కూడా జడమే కనుక అవి వినాలన్నా, చూడాలన్నా బ్రహ్మచైతన్యం వాటికి కలగటం వల్లే అవి వినగలుగుతున్నాయి, అవి చూడగలుగుతున్నాయి కాన వినేది, చూసేది అన్నీ కూడా బ్రహ్మమే. బ్రహ్మజ్ఞానం అనే ఆత్మమార్గం తెలిసి ఆత్మ అనే బ్రహ్మంతో జీవిస్తున్న వారికి అంతా బ్రహ్మంగానే కనిపిస్తుంది. బంగారం లేకుండా ఆభరణాలు లేనట్లు, సముద్రం లేకుండా అలలు లేనట్లు, మట్టి లేకుండా పాత్రలు లేనట్లు, బ్రహ్మ చైతన్యం లేకుండా జీవులు లేరు. కాన సర్వం బ్రహ్మ మయం అవుతుంది. సాధకుడు సాధనలో ఆనందం అనుభవిస్తున్నప్పుడు ప్రకృతి అంతా నశించి సర్వం బ్రహ్మమయం అనిపించినట్లే, సాధనలేని సమయంలో కూడా ఆతనికి ప్రపంచం అంతా నామరూపాలు లేకుండా బ్రహ్మమయంగా కనిపించిన నాడు ఆతడు జీవన్ముక్తుడు అవుతాడు. అది ఎట్లా తెలుస్తుంది అంటే కలలో చూసిన వన్నీ కలగన్నవానికంటే వేరుగా లేవు కదా? ఆ విధంగానే సాధనలేని సమయంలో జాగ్రదవస్థలో వినేవి, చూసేవి అన్నీ కూడా బ్రహ్మం కంటే వేరు కాదు గదా? అంతా బ్రహ్మ చైతన్యంతో కూడి ఉన్నదే కదా? అది తెలిసి జీవించిననాడు సర్వం సచ్చిదానంద స్వరూపంగానే కనిపిస్తుంది. సర్వప్రపంచం ఆతనికి అద్వయమైన బ్రహ్మంగానే గోచరిస్తుంది. దాని వల్ల ఆతడు జీవన్ముక్తుడవుతాడు. ఆతనికి ''ఏకమేవా2 ద్వితీయం బ్రహ్మ''అనేది దర్శన మిస్తుంది.
65 సర్వగం సచ్చిదాత్మానం
జ్ఞాన చక్షుర్నిరీక్షతే
అజ్ఞాన చక్షుర్నేక్షేత
భాస్వంతం భానుమంధవత్ || 65
xqsLRi*gRiLi = అంతటా ఉన్నటువంటి, సత్ + చిత్ + ఆత్మానం = సచ్చిదానందమయమైన ఆత్మను, జ్ఞాన చక్షుః = జ్ఞానమనే నేత్రాలే, నిరీక్షతే = చూస్తాయి, భాస్వంతం = ప్రకాశవంతంగా వెలుగొందేటటువంటి, భానుం = సూర్యుణ్ణి, అంధవత్ = గుడ్డివాడు ఏ విధంగా చూడలేడో ఆ విధంగా, అజ్ఞాన చక్షుః = ఆత్మజ్ఞానం లేకపోవటంచేత ఆతని కళ్ళు, న ఈక్షతే = చూడలేవు.
తా|| అంతటా ఉన్నటువంటి సచ్చిదానందమైన ఆత్మను జ్ఞాననేత్రాలే చూస్తాయి. ప్రకాశమానమైన సూర్యుణ్ణి గుడ్డివాడు ఏ విధంగా చూడలేడో ఆ విధంగానే ఆత్మజ్ఞానం లేని వాని కళ్ళకు ఆత్మ కనిపించదు.
వివరణ :- ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా చూసేవాడి దృక్కోణాన్నిబట్టే అవి అర్థం అవుతాయి. చూసేవాడికి ఆత్మజ్ఞానం ఉంటే కనిపించేవన్నీ బ్రహ్మంగా కనిపిస్తాయి. బ్రహ్మజ్ఞానం లేనివానికి అన్నీ నామరూపాలతోనే సృష్టి అంతా జగదాకారంగా కనిపిస్తాయి. అంధత్వానికి గల కారణం తొలగగానే అంధుడు సూర్యుణ్ణి చూసినట్లు అజ్ఞానం తొలగగానే అజ్ఞాని కూడా ఆత్మను దర్శించగలుగుతాడు. జ్ఞాననేత్రమంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే పేరుమీదుగా నాలుగురకాలుగా పనిచేస్తున్న మనస్సు ఏకమై అది ఆత్మలో గురుజ్ఞానంతో లీనమవటమే. ఆ విధంగా లీనమవటానికి సాధకునికి గురుజ్ఞానం లభించిన తర్వాత అది జరుగుతుంది. దానితో ఆతనికి అంధకారం తొలుగుతుంది. ఆతడు క్రమేపి బ్రహ్మానందంలో లీనమవుతాడు. గురుజ్ఞానంవల్ల సాధకుడు మరచిపోయిన ఆత్మను తెలుసుకొని ధ్యానం ద్వారా తానే బ్రహ్మాన్నని తెలుసుకొంటాడు. బ్రహ్మం అనేది విషయం కాకపోవటం వల్ల బ్రహ్మం అందరికీ తెలియటం లేదు. తెలుసుకొనేవాడు బ్రహ్మానికి వేరుగా లేడు కాన ఆత్మజ్ఞానం తెలిస్తే గాని అజ్ఞానికి బ్రహ్మం గోచరంకాదు. బ్రహ్మం వస్తు రూపంలో కనిపించదుగదా! బ్రహ్మం శుద్ధ చైతన్యం కదా ! శుద్ధచైతన్యం ఎవరికి తెలుస్తుంది ? ఆత్మజ్ఞానమనే జ్ఞాననేత్రం లభించినవారికి మాత్రమే ఆ శుద్ధచైతన్యం తెలుస్తుంది. కనుక జ్ఞానులకు గురుకృపవల్ల ఆ ఎరుక కలుగుతుంది. సాధకుడు గురుకటాక్షంవల్ల సాధనలో తన సహజ స్వరూపమైన ఆత్మను జ్ఞప్తికి తెచ్చుకొని తన సహజ స్వరూపాన్ని అనుభూతి పొందుతాడు. సామాన్య మానవుడు ఆత్మజ్ఞానం తెలియకపోవటం వల్ల అంధునివలె విషయవాంఛలతోనే సుఖాన్ని వెతుకుతూ సచ్చిదానందంలేదని భ్రమపడతాడు. సామాన్యమానవుడు సూర్యుని చూడలేని గుడ్డివాని వంటి వాడే కాని మరొకటి కాదు కారణమేమిటంటే ఆతడు అనుభవజ్ఞులైన జ్ఞానులమాట వినటంలేదు. ఒకవేళ విన్నా, విన్నదాన్ని ఆచరించి సాధనకు ఓర్చి, నిజాన్ని నిగ్గుతేల్చుకోవటానికి నమ్మకం, విశ్వాసం, పట్టుదల, లక్ష్యసాధనయందు నిరంతర కృషి కలిగి ఉండటంలేదు. అటువంటి లోపాల్ని సామాన్య మానవుడు గ్రహించలేకపోవటం వల్ల సచ్చిదానందాన్ని పొందలేకపోతున్నాడు. ఎదురు, ఆతడు సచ్చిదానందమైన ఆత్మేలేదని నిందిస్తున్నాడు. దానికి దేవాలయానికి గల ప్రతీకల్ని పరిశీలిద్దాము. అప్పుడు జ్ఞాననేత్రాన్ని గురించి తెలుసుకోవటానికి వీలు కుదురుతుంది. సంఘంలో ఎక్కువగా మానవులందరూ భక్తి మార్గంలోనే సంచరిస్తుంటారు. ఎక్కువమంది దేవాలయానికి వెళ్ళి పూజచేసుకొని వస్తూ పవిత్రులమయ్యామని భావిస్తుంటారు. ఆ విధమైన పవిత్రత చేకూరటమే ప్రతి మానవునికి కావలసింది. అందుకోసమే పూర్వులు ఆగమ శాస్త్రాన్ని అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రాన్ని ఆత్మజ్ఞానానికి అనుకూలంగానే ఏర్పరచి దేవాలయాలను నిర్మింప చేశారు. కానీ సామాన్య మానవులందరికీ అది తెలియకపోవటం వల్ల సాకార పూజా విధానంలోనే తృప్తిపొంది అంతర్ముఖం అవ్వటం గురించి ఆలోచన చేయలేకపోతున్నారు. భగవంతుని దేవాలయానికి ఆత్మతో కూడి ఉన్న మానవ దేవాలయానికీ ఉన్న సామీప్య సాదృశ్యాలను ఈ కింద పోల్చి వివరించి చూపిస్తాను. నిజానికి పంచేంద్రియ నిగ్రహాన్ని కొనసాగిస్తూ ఆలయంలో అర్చన కొనసాగించటాన్నే పూజవిధానం అంటున్నాము. దాన్ని ఆ విధంగా అందరూ తెలుసుకొనేటట్లు జ్ఞానులైనవాళ్ళందరూ పూనుకొని అందరికీ తెలియజేయాలి.
దేవాలయం ఆత్మతో కూడిన శరీరమనే దేవాలయం
1. గుడి గోపురం ఎత్తుగా కనిపిస్తుంది. 1. మానవుని తల ఉన్నతంగా ఎత్తుగా పైన ; ; ఉంటుంది.
2. గుడిపైన బొమ్మలు చెక్కి ఉంటాయి. 2. లోపల మానసికంగా భద్రపరిచిన ; ; చిత్రాలుంటాయని తెలియజేస్తుంది.
3. బూతు బొమ్మలు చెక్కి ఉంటాయి. 3. మనస్సులో కదిలే దుష్ట సంకల్పాలను ; ; విడిచి ముందుకు వెళ్ళాలని సూచించటం ; ; జరుగుతుంది.
4. బొమ్మల్ని విస్మరించి లోనికి వెళ్ళాలి. 4. మానసిక సంకల్పాలను అధిగమించి ; ; కామాదులే ప్రధానం కాదని, వాటిని విడిచి అంతర్ముఖం కావాలని గ్రహించటం జరుగుతుంది.
5. బలిపీఠం వద్ద సాష్టాంగ నమస్కారం 5. అంతర్ముఖమైన ఆత్మజ్ఞాని అహంకారాన్ని చేయాలి. బలి ఇచ్చి ఆత్మకు సంపూర్ణ శరణాగతుడవటం జరుగుతుంది.
6. ధ్వజస్తంభాన్ని, దాని మీద 6. ఆత్మ అనే హృదయ మందిరంలో
ఉన్న పతాకాన్ని దర్శిస్తాడు. ప్రవేశించే హక్కును గ్రహిస్తాడు. ఆ
ద్వారం ఒక్కరికే ప్రవేశాన్ని ఇస్తుంది. అది శరీరానికి ప్రవేశాన్ని ఇవ్వదు. ఆత్మకు మాత్రమే అది ప్రవేశాన్ని ఇస్తుంది. అంతఃకరణ చతుష్టయం లయించిననాడు ఆత్మకు భగవన్మందిరంలో ప్రవేశం లభిస్తుంది. ఆ ద్వారాన్ని తెరిచే తాళం చెవి నా వద్ద ఉందని గురు మహారాజ్‌జీ అంటూ ఉంటారు.
7. వాహనమూర్తిని దర్శిస్తాడు. 7. సాధకుడు ప్రాపంచిక విషయాలను విడిచి
పెట్టి వాహనమూర్తి వలె ఆత్మ అనే భగవంతుని మోయాలని తెలుసు కొంటాడు.
8. వాహనమూర్తికి భగవంతునికి 8. భక్తుడు ఏ మార్గంలో నడుస్తున్నా
మధ్య నిలబడ కూడదు. ; ; భక్తునికి భగవంతునికి మధ్య జ్ఞానికూడా 9; 9; నిలబడకూడదు. ఆత్మప్రబోధం మాత్రమే
చేయాలి. ఆ భక్తునికి ఆ సంస్కారం ఉంటే
ఆత్మజ్ఞానానికి ఆతడే అంది వస్తాడని 9; 9; తెలుసుకొంటాడు.
9. గర్భాలయంలో ప్రవేశం అంతా 9. హృదయ గుహ చెంత అవిద్య ఆవరించి
చీకటిమయంగా ఉంటుంది. అంతా చీకటిమయంగా ఉంటుంది.
10. కొంతకాలం నిలబడితే తెర 10. కొంతకాలం అక్కడే వేచిఉండగా సాధన
తొలగుతుంది. కొనసాగుతుంది. అజ్ఞానపుతెర తొలగు
తుంది.
11. గంటలు మ్రోగుతాయి. 11. అనహద (అనాహత) శబ్దమనే #9; #9; గంటానాదం వినబడుతుంది.
12. నీరాజనం ఇవ్వబడు తుంది. 12. జ్ఞానప్రకాశమనే నీరాజనం ప్రకాశిస్తుంది.
13. సాకారమైన దైవదర్శనం 13. ప్రకాశవంతమైన వెలుగులో. #9; #9; జరుగుతుంది. #9; #9; ఆత్మదర్శనం జరుగుతుంది.
14. భగవంతుని ముందు నేత్రాలు 14. కళ్ళతో తపనపడుతూ బాహిరంగా
మూసుకొని సంపూ ర్ణంగా #9; #9; దర్శించవలసినవి లేవని తెలుసుకొని
తనలో తాను లీన మవుతాడు. #9; #9; లోకాకాంక్షలు తొలగించుకొని #9; #9; అంతర్ముఖంగా నిలవ గలుగుతాడు.
15. చేతులు జోడించి హృదయ 15. జీవుడు బ్రహ్మ ఐక్యమై జీవాత్మగా #9; #9; స్థానం చెంత ఉంచుకొని అనగా ఆత్మ బ్రహ్మగా నిలుస్తాడు.
నమస్కరిస్తాడు.
16. కన్నులకు భగవంతుని దర్శనం 16. ఆత్మ అనే భగవంతుని తప్ప అన్యవస్తు
తప్ప మరొక దృశ్యం కనిపించదు. దర్శనం అవాంఛనీయమని తెలుస్తుంది.
దృగింద్రియ (కళ్ళు) నిగ్రహం జరుగుతుంది.
17. మంత్రాలు, ఘంటానాదాలు 17. భగవత్సంబంధమైన విషయాన్నే
వినిపిస్తాయి. ఆలకించాలి అనే భావన స్ఫురిస్తుంది.
శోత్రేంద్రియ (చెవులు) నిగ్రహం జరుగుతుంది.
18. పువ్వులు, సుగంధాలు 18. లోపల చోటుచేసుకొన్న సమస్తమైన
విరజిమ్మే వాసనలు ఆవరిస్తాయి. పూర్వవాసనలను భగవంతుని పాదాలచెంత సమర్పించాలనే అంతరార్థం స్ఫురిస్తుంది. ఘ్రాణంద్రియ
(ముక్కు) నిగ్రహం జరుగుతుంది.
19. తీర్థప్రసాదాలు స్వీకరిస్తాడు. 19. ఆత్మ ప్రసాదాన్ని స్వీకరించటం ద్వారా
ప్రసాద బుద్ధిని ఏర్పరుచుకొంటాడు. రసనేంద్రియ (నాలుక)నిగ్రహం జరుగుతుంది.
20. చందన భస్మాదులు 20. ఆత్మ స్పర్శద్వారా భగవద్భక్తిని
పూసుకోవటం, చెవిలో పూవులు హృదయంలో నింపుకోవటం పెట్టుకోవటం జరుగుతుంది. జరుగుతుంది. త్వగింద్రియ (చర్మం) నిగ్రహం జరుగుతుంది.
21. బయటకు వచ్చిన తర్వాత 21. ఆత్మ దర్శనం తర్వాత ఆత్మస్థితుడై
ఒకచోట కూర్చొని, కళ్ళు ఆత్మానందం అనుభవిస్తూ అంతర్ముఖుడై
మూసుకొని, ధ్యానమగ్నుడై ఉండాలనే అంతరార్థాన్ని గ్రహిస్తాడు. ఏ
ప్రశాంతచిత్తంతో లేచి వస్తాడు. కార్యాలు ఆచరిస్తున్నా బ్రహ్మభావంతో సాక్షిమాత్రంగా జీవించటం అలవర్చు కొంటాడు.
______________________________________________
ఈ విధంగా చూస్తే భక్తుడు ఆలయంలో ప్రవేశించి బయటకు వచ్చేవరకూ ఆతడు చేసే ప్రతి పనీ కూడా భగవంతుడైన అనంత చైతన్యంలో లీనమవటానికి కావలసిన ప్రతీకలుగా స్వీకరించి ఆచరించేటట్లు చేయిస్తున్నారని తెలుస్తుంది.
పరమహంస యోగానంద ఆత్మకథ అయిన ఒక యోగి ఆత్మకథలో ఒక యోగి రెండురూపాలు ధరించటాన్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవటానికి పరమహంస యోగానంద బయలుదేరి వెళ్తున్నప్పుడు దారిలో కనిపించిన ఆలయ విగ్రహానికి ఎందుకు నమస్కారం పెట్టాలి ? మనలోనే ఆత్మ ఉంది కదా అని అనుకొని దేవునికి నమస్కారం పెట్టకుండా ముందుకు సాగిపోతాడు. ఆయన దర్శించాలనుకొంటున్న రెండు రూపాల్లో కనిపించే ఆ యోగియే ఆయనకు దారిలో కనిపించి నువ్వు ఆలయాన్ని ఆ విధంగా తృణీకరించి వెళ్ళినందువల్లే నువ్వు దారి తప్పావు అని హితబోధ చేస్తాడు. నిరాకారంతో జీవిస్తున్నా సాకారమైన భగవంతుని, సాకార సాధకుల్ని తృణీకరించి విస్మరించి నడవకూడదని తెలియచేస్తాడు. సాధకుడు తన రూపమైన సాకారంనుంచే నిరాకారమైన తన ఆత్మవద్దకు చేరి ఆత్మ అనే బ్రహ్మంగా నిలవాలి. సాధకుడు బ్రహ్మం కావటానికి పూర్వం ఎట్లా ఉన్నాడో బ్రహ్మం అయిన తర్వాత కూడా అట్లాగే ఉన్నాడు. అద్వైతంలో గ్రహించవలసిన అతి సూక్ష్మ రహస్యమిదే. ఆత్మజ్ఞానం తెలియని వారికి, ఆత్మతో జీవించని వారికి, విగ్రహారాధకులకు తెలియని దాన్ని ఒక్కసారిగా ఎవ్వరూ నిరూపించి చూపించలేరుకదా! దాని వల్ల ఆత్మజ్ఞాని కూడా బాహిరమైన పూజలుకాదు చేయవలసింది ఆంతరికమైన అర్చనలు చేయాలని తెలిసి సాధనలో జీవించాలి. అంతేగాని అర్చనలను, దేవాలయాలను తూష్ణీభావంతో చూడకూడదు. ఆత్మజ్ఞానికి కూడా పక్వస్థితినొందిన భక్తి కావాలి. అదే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఆచరించి చూపించారు. వాళ్ళు ఆత్మతోనే జీవిస్తూ పైకి భక్తులులాగా నిలిచారు. జ్ఞానికి ఏ పూజలు అవసరంలేదు. కాని హృదయరాముని పూజించటం, ప్రేమించటం, కావాలి. హృదయమే తానై తరించాలి.
ఈ శరీరం నిజంగా ఉత్తమమైన దేవాలయం. దాన్ని శుభ్రపరిచి, దాన్ని భద్రపరిచి దానిలో ప్రవేశించి ఆనందాన్ని పొందాలి. ఈ శరీరంలో అమూల్యమైన రత్నాలున్నాయి. దానికి కావలసిన ప్రయత్నాన్ని, శక్తిని ఇచ్చే గురువు కూడా తానే అయి లోపలే ఉన్నాడు. ఆయనే ఆయనను చేరటానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే బాహిరమైన గురుదేవుని చెంతకు కూడా చేరుస్తాడు. ''గురువు తానే, సాక్షాత్కరించేది తానే గురుమూలంగా శబ్దాన్ని ఇచ్చి అనుగ్రహించేది కూడా తానే'' అని సిక్కుల ఆది గ్రంథంలో చెప్పబడి ఉంది. దానికే బుల్లేషా అనే గురువు ''నేను బాహిరమైన దేవాలయాల్లో ప్రవేశించినంత కాలం నా మనస్సులో భీతే నిలిచిపోయింది. అంతర్ముఖం అయి ఆయనను ఆరాధించి, ఆయనకోసం ప్రేమతో నిత్యం అంతర్ముఖంగా వెతికిననాడు నాదాలు వినిపించాయి. ఆయన దర్శనం లభించింది, ఆయనతో ఆనందించటం కుదిరింది. భీతి తొలగింది, ధైర్యం చేకూరింది. సుఖశాంతులు లభించాయి'' అని చెప్పాడు. కబీరు కూడా ''ఈ శరీరమనే మట్టి పాత్రలో ఉన్న అంధకారంలోనే సృష్టికర్త అయిన భగవంతుడు ఉన్నాడు'' అని చెప్పాడు. ఏసుక్రీస్తు కూడా ''ఈ శరీరం సజీవమైన దేవాలయం అని, భగవత్ సామ్రాజ్యం నీలోనే ఉంది'అని చెప్పాడు. మరి ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రబోధిస్తున్నా మానవులందరూ ఎందుకు బయట వెతుకుతున్నారంటే సాకారంతో తృప్తిపడి తమ బాధ్యతను ఆ భగవంతుని మీద పడవేసి తాము తేలిగ్గా సుఖశాంతులతో గడపగలమనే భ్రమతో జీవిస్తున్నారు. మానవుని బాధ్యత ఏదో మానవుడు తెలుసుకోకుండా నడవటానికే మానవుడు ఈ విధంగా సంచరిస్తున్నాడని ఎవరికి వారికి తెలియక పోవటం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. ఆ విషయాన్నేఅనేకమంది మహాపురుషులు, అనేక గ్రంథాలు తెలియజేస్తున్నా నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. బాహిరమైన సుఖాకాంక్షతో బాల్యం అంతా ఆటల్లో గడుపుతున్నాడు, ¸°వనం అంతా కామపిపాసతో, పశుప్రవృత్తితో గడుపుతున్నాడు, వయస్సు మళ్ళే సమయానికి సంసార బాధ్యతలతో సతమతమై గడుపుతున్నాడు. పళ్ళు ఊడే సమయానికి ఎవరూ తనను లక్ష్యపెట్టనిస్థితిలో ఆ పరాత్పరుడే దిక్కని వెతకటానికి పూనుకొంటున్నాడు. అప్పుడు కూడా అంతర్ముఖం అవటానికి, సజీవ గురువును వెతుక్కోవటానికి పూనుకొంటున్నాడు. దానితో పుణ్యకాలమంతా దేవులాటల్లోనే జరిగిపోతుంది. కాన తెలిసిన జ్ఞానంతో, జ్ఞాన మార్గంలో జీవించటానికి మానవులందరూ ప్రయత్నంచేసి నేర్చుకోవాలి.
ఆధ్యాత్మిక శాస్త్రంలో పరిశోధనలు జరిపిన మహాత్ములందరూ కూడా మానవుడు ప్రత్యక్షంగా చూస్తున్న ప్రపంచం, దాని వెనక చూడటానికి వీలులేకుండా ఉన్న ఇతర లోకాలు అన్నీ కూడా ఈ శరీరంలోనే ఉన్నాయని, మానవుడు అంతర్ముఖం అయి పరబ్రహ్మం అయిన ఆత్మ అనే ఆ పరమేశ్వరుని చేరిననాడు ఆయన సృష్టించిన అణువణువుని పరికించి, తనివితీరా చూడటం సాధ్యమవుతుందని చెబుతున్నారు.అదే ఈశ్వరాలయమైన మానవదేహంలో ఉన్న ఔన్నత్యం అనే దాన్ని అందరూ గ్రహించి దాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. మానవులు ఈ శరీరమనే దేవాలయంలో ఉన్న రత్నాలను పొందలేక మేము దరిద్రులమని బాధలను అనుభవిస్తున్నారు.
ఈ శరీరంలో ఉన్న నవద్వారాలైన రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు, కింది భాగంలో ఉన్న రెండు మలద్వారాలు అన్నీకూడా మానవుని ధ్యాసను, మానవుని దృష్టిని బాహ్య ప్రపంచంలోకి తీసుకుపోతున్నాయి. అట్లా బాహిరంగా పోకుండా వాటన్నిటినీ అంతర్ముఖం చేసి వాటిని మూడవ కన్ను దగ్గరకు తీసుకురావటానికే ఆత్మ మార్గంలో సాధకుడు సాధన చేస్తున్నాడు.ఆ స్థానాన్నే యోగ మార్గంలో ఆజ్ఞాచక్రం అన్నారు. సిక్కులు తీస్రతిల్ అన్నారు. మహమ్మదీయులు సుక్తా-ఎ-సై#్వదా అన్నారు. భారతీయులు శివనేత్రం అన్నారు. కావున ఆపదవ ద్వారాన్ని తెరవటానికే గురువు కావలసి వస్తున్నాడు. ఆ పదవ ద్వారం భగవంతుడు నివాసం చేస్తున్న వైపుకు తెరుచుకొని ఉంది. కాన ఆ మూడవ నేత్రం దగ్గరకు చేరటానికి ప్రతి మానవుడు ఆత్మజ్ఞానంతో, ఆత్మమార్గంలో నిరంతరం సాధన చేసి, జీవించి ఉండగానే సుఖశాంతుల్ని అనుభవించాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాదు చేయవలసింది. తెలివి ఉండగానే చేతులు కాలకుండా చూసుకొని, ఆకులు పట్టుకోకుండానే ఆ ఆధ్యాత్మిక అగ్నిగుండంలో ఇనుపగుండు ప్రవేశిస్తున్నట్లు గురుజ్ఞానంతో ప్రవేశించి బ్రహ్మంగా రూపొందటం నేర్చుకోవాలి. మానవుడు మరణించే స్థితిలో కూడా ఆత్మజ్ఞానంతో భృకుటి మధ్య నిలిచిననాడు ఈ ప్రపంచానికి సంబంధించినంతవరకూ మరణించినవాడయినప్పటికీ అంతర్గతంలో పూర్తిగా జాగృతితో ఉంటాడు. కాన మానవుని ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది.
A»R½øª«sWLæRiLiÍÜ[ A»R½øÇì؃y¬sõ gRiVLjiLi¿Á[ Kƒ«sõ»R½ùLigS ¿ÁxmsöÈÁLi ª«sÌýÁ „sVgjiÖÁƒ«s xmsµôðR…»R½VÌÁ¬sõÉÓÁ¬ds ÀÁƒ«sõ¿RÁWxmso ¿RÁW²R…ÈÁLi NS¬s, „sª«sVLji+Li¿RÁÈÁLi NS¬s ÌÁORPQQùLigS |msÈíÁVN]¬s ƒ«s²R…VxqsVòƒyõLRi¬s ˳؄sLi¿RÁÈÁLi »R½gjiLiµj… NSµR…¬s ¾»½ÖÁ¸R…V¿Á[xqsVòƒyõƒ«sV. C ª«sWLæRiLi ¿yÍØ xqsVÌÁ˳ÏÁ##\®ªsVLiµj…. µk…¬sÍÜ[ A²y ª«sVgS @®ƒs[ Û˳Á[µR…Li ÛÍÁ[µR…V. }msµR… ªyÎÏÁ§þ, g]xmsö ªyÎÏÁ§þ @®ƒs[ Û˳Á[µR…Li ÛÍÁ[µR…V. Fsª«sLji ÒÁª«sƒ«s „sµ³yƒ«sLiÍÜ[ ªyLRiV ÒÁ„sLi¿RÁª«s¿RÁVè. A¿yLRi ª«sùª«s¥¦¦¦LSÌÁV, NRPLRiøNSLi²R…ÌÁV, G„ds ÛÍÁ[ª«so. úxms¼½L][ÇÁÚ @Li»R½LRiVøÅÁ\®ªsV A»R½øÇì؃«sLi»][ A»R½ø@®ƒs[ ˳ÏÁgRiª«sLi»R½V¬s ALSµ³j…Li¿RÁÈÁ®ªs[V ¿Á[¸R…Vª«sÌÁzqsƒ«s xms¬s. µk…¬sNTP xqsLi»`½ xmsoLRiVxtsv\ÛÍÁƒ«s gRiVLRiVª«soÌÁV aRPNTPò¬s úxmsryµj…xqsWò @ƒ«sV¬s»R½ùLi xqs»R½ùª«sWLæRiLiÍÜ[ ƒ«s²T…¿Á[ÈÁÈýÁV ¿Á[ryòLRiV. NSƒ«s C ª«sWLæRiLi @LiµR…LRiW A¿RÁLjiLi¿RÁ»R½gjiLi\®µ… DLiµj…. A xmsLRiª«sW¾»½[ø gS²³R…¬súµR…ÍÜ[ Dƒ«sõ ª«sWƒ«sª«so¬s ®ªs[VÍÜäÛÍÁ[öÈÁLiµR…VNRPV xqsµæR…VLRiV LRiWxmsLiÍÜ[ C ÍÜ[NRPLiÍÜ[NTP ª«sxqsVòƒyõ²R…V. NSª«soƒ«s @ÈÁVª«sLiÉÓÁ gRiVLRiVª«soƒ«sV AúaRPLiVVLiÀÁ »R½LRiVßãÜ[Fy¸R…W¬sõ ª«sWƒ«sª«soÌÁV F~LiµyÖÁ. C úxmsxmsLi¿RÁLi @Li»y Ëص³yª«sV¸R…V\®ªsV DLiµj…. A Ëص³R…ÖÁõ µyÈÁÉجsNTP C ÇÁƒ«søÍÜ[®ƒs[, C aRPLkiLRiLiÍÜ[®ƒs[ ¬sgRiW²³R…LigS »R½LjiLixmsÛÇÁ[}qs A»R½ø aRPNTPò DLiµj…. ¬dsÎÏÁþƒ«sV ÀÁÖÁNTP¾»½[ ®ªsƒ«sõLSµR…V NRPµy? NSƒ«s @¬sõ ª«sWLæSQÍýÜ[NTP A»R½øª«sWLæRiLi Dƒ«sõ»R½\®ªsVLiµj… NSƒ«s @LiµR…LRiW µy¬sõ {qs*NRPLjiLiÀÁ, ryµ³R…ƒ«s¿Á[zqs, »R½LjiLi¿RÁÉجsNTP úxms¸R…V»R½õLi ¿Á[¸R…WÖÁ.
దేవాలయాల దగ్గర ఉన్న చెట్ల కింద నివసిస్తూ, నేలపై నిద్రపోతూ, లేడి చర్మాలే వస్త్రాలుగా ధరిస్తూ, భోగాలన్నీ వదిలిపెట్టి సంచరించేటటువంటి వైరాగ్యం కలిగినా సుఖం లభించదు. కారణం ఏమిటంటే ఇంద్రియాల్ని అంతర్ముఖం చేసి సాధన చేయాలనే అభ్యాసం లేకుండా వట్టి వైరాగ్యం కలిగి ఉన్నా ఆనందం లభించదు. అభ్యాస వైరాగ్యాలనేవి ఆత్మ మార్గానికి రెండూ రెండు కళ్ళు లాంటివి. ఈ మార్గంలో మనస్సును పరబ్రహ్మమునందు లగ్నం చేయాలి. అట్లా లగ్నం చేసి ఏ విధంగా గడిపినా అంటే యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, బంధుమిత్రులతో గడిపినా ఎప్పుడూ ఆనందంతోనే ఉంటాడు. ఈ ఆత్మమార్గం ప్రపంచంలో ఉండగానే ప్రాపంచిక విషయాలకు లోనుకాకుండా ఉండేటట్లు చేస్తుంది. అదే జ్ఞాననేత్రం వల్ల లభించే ఉత్తమమైన లాభం.
66 శ్రవణాదిభి రుద్దీప్తో
జ్ఞానాగ్ని పరితాపితః
జీవ స్సర్వ మలాన్ముక్తః
స్వర్ణవత్ ద్యోతతే స్వయం || 66
xqs*LñRiª«s»`½ = బంగారం పుటం పెడితే ఏ విధంగా మాలిన్యాలు అన్నీ వీడి, స్వయం = తన కాంతి చేత తానే, ద్యోతతే = ప్రకాశిస్తుందో ఆ విధంగా, జీవః = జీవుడు, శ్రవణాధి భిః = శ్రవణాదుల చేత, ఉద్గీప్తః = ప్రభావితుడై, జ్ఞానాగ్ని పరితాపితః = ఆత్మజ్ఞానమనే అగ్నియందు పరితపింపచేయబడి,సర్వమలాత్ = సమస్తమైన మాలిన్యాలనుండి, ముక్తః = విడివడి, ద్యోతతే = ప్రకాశిస్తున్నాడు.
తా|| బంగారాన్ని పుటం పెడితే ఏ విధంగా మాలిన్యాలన్నీ వీడి తన కాంతి చేత తానే ప్రకాశమానంగా వెలుగొందుతుందో అదే విధంగా జీవుడు శ్రవణాదుల చేత ప్రభావితుడై ఆత్మజ్ఞానమనే అగ్నియందు పరితపింపచేయబడి, సమస్తమైన మాలిన్యాల నుండి విడివడి ప్రకాశిస్తున్నాడు.
వివరణ :- ఆత్మజ్ఞాన మార్గంలో సంత్ పురుషులైన గురువుల బోధకు, ప్రాచీన ఆశ్రమాల గురువుల బోధకు వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రాచీన ఆశ్రమాలలో శ్రవణం అంటే వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాదులవంటివి వినటం, వాటిని మననం చేయటం ఉంటుంది. సంత్ పురుషుల మార్గంలో గురువులు చెప్పే సత్సంగాలే ఉన్నతమైన ఆత్మజ్ఞానానికి ఉత్తమమైన సోపానాలు. దానినే సాధకులు మననం చేసి, సంత్ పురుషులు ఇచ్చిన ఆత్మజ్ఞానాన్ని నిరంతరం ఓర్పుతో, పట్టుదలతో ధ్యానం చేస్తూ పురోభివృద్ధిని పొందుతున్నారు. ప్రాచీన మార్గంలో దేహాదులు పవిత్రం చేయటానికి అనేక నిబంధనలు ఏర్పరిచి వాటి ద్వారా బాహిరమైన, ఆంతరమైన ఇంద్రియాలను శుద్ధి చేయటానికి ప్రయత్నం చేశారు. ఈ పరిశుద్ధి చేయటం అనే పునాదిని నిర్మించుకోవటానికి పడే అనేక శ్రమలతోనే సాధకుని పుణ్యకాలం అంతా గడిచిపోయి కావలసిన ఆత్మజ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి సాధకుడు విసిగిపోవటమో లేకపోతే దారితప్పటమో జరుగుతూ వస్తుంది. ఆధునికులైన సంత్ పురుషులు ఇంద్రియ శుద్ధికి సంబంధించిన బాధ్యతను ఎవరిది వారికి వదిలి, ధ్యానసాధనకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి, అసలైన జ్ఞానాన్ని శిష్యులకు అందించి, నిరంతరం సాధన చేయించటంవల్ల ఇంద్రియ మాలిన్యాలన్నీ క్రమేపీ తొలగించుకొంటూ సాధకులు పురోగమిస్తూ వస్తున్నారు. దానివల్ల సాధకులకు ఆత్మమార్గం అందరికీ తేలిక అయి, సాధనయోగ్యంగా ఉండటం వల్ల అనేకమంది తృప్తినొంది, నిరంతరం సాధన చేస్తున్నారు. ఆర్యసమాజ్ వారయితే ఒక హోమ క్రతువునే ప్రతినిత్యం ఆచరించేటట్లు నేర్పుతున్నారు. సాధనకు ప్రాణయామాన్ని నిబంధనగా కొనసాగిస్తున్నారు. అదే విధంగా హరేరామ హరేకృష్ణ వాళ్ళయితే అందరికీ గుండు గీకించి, పిలకపెట్టి, సంధ్యావందన కార్యక్రమంతో జందెం వేసి అందరినీ బ్రాహ్మల్ని చేస్తున్నామన్నారు. ఈ విధంగా అనేక ఆశ్రమాలు అనేక విధాలుగా అనేక మార్గాలు ఆచరిస్తూ, బాహిరమైన తంతుకే అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి ఆచార వ్యవహారాలతో సాధకుడు సాధనలో ఉన్నాననే తృప్తిని కలిగించటానికి ప్రయత్నం చేస్తున్నారు. అవేవీ కూడా సంపూర్ణంగా సాధకుని ఇంద్రియాలను అంతర్ముఖం చేయలేకపోతున్నారు. దానితో ఆత్మమార్గం అందరికీ అందుబాటులో లేకుండా ఉండిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో సంత్ పురుషులు ఆత్మమార్గాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఏ.సి.భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆత్మసాక్షాత్కారానికి అందరూ అర్హులు కాదన్నారు. ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన కుటుంబాలు, సంపన్న కుటుంబాలు మాత్రమే ఆత్మ సాక్షాత్కార మార్గంలో ప్రగతి సాధించటానికి అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటాయి అన్నారు. ఈ విధమైన భావన ఎంతమాత్రం తగింది కాదు. ప్రతివానికి లోపల ఆత్మ ఉంది. ప్రతివానికి లోపల ఆత్మ వ్యాపించి ఉన్న ప్రకృతి ఆవరించి ఉంది. ప్రతివానికి విశ్వంతో సంబంధం ఉంది. ప్రతివానికి బయటా, లోపలా వ్యాపించి ఉన్న భగవంతునితో సంబంధం ఉంది. అటువంటి అనుసంధానాన్ని, ఆత్మచైతన్యాన్ని, ఆత్మమార్గాన్ని తెలుసుకోవటం అనే అవసరం అందరికీ ఉంది. కావున దానికోసం ప్రతివాడూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని సాధించటానికి ప్రతివాడూ పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మజ్ఞానం అనేది కొందరికే పరిమితం చేయటం అనేది హాస్యాస్పదమైన విషయం అని అందరూ తెలుసుకోవాలి.
అయినా భక్తి వేదాంతస్వామి ప్రభుపాదులవారు ఆలోచించిన విధానాన్ని ఒక్కసారి పరిశీలించి చూద్దాము. ''డాక్టరు పట్టాని పొందాలంటే దాని అర్హతకు తగిన శిక్షణ ఎట్లా పొందవలసి ఉంటుందో అట్లాగే కృష్ణచైతన్యోద్యమంలో ఆత్మ సాక్షాత్కారానికి, వారు తెలివైన వారినే తీసుకొని వారికి మనస్సును, ఇంద్రియాలను నియంత్రించుకోవటం ఎలాగో, సత్యవర్తనులుగా జీవించటం ఎలాగో, బాహ్యంగానూ, అంతరంగంగానూ శౌచాన్ని (పారిశుద్ధ్యాన్ని) సాధించటం ఎలాగో, వివేకవంతులు కావటం ఎలాగో, తమ విజ్ఞానాన్ని జీవితంలో వినియోగించుకోవటం ఎలాగో, భగవచ్చైతన్యం సాధించటం ఎలాగో శిక్షణ ఇస్తున్నామన్నారు. మేము భారతదేశపు వర్ణవ్యవస్థను అమెరికాలో ప్రవేశ##పెట్టటం లేదు. హిందూదేశంలో ఉన్న వర్ణవ్యవస్థలో బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి దుష్టుడూ బ్రాహ్మణుడుగా చెలామణి అవుతున్నాడు. అతని అలవాట్లు పంచమ వర్ణానికి చెందినవైనా ఆతడు బ్రాహ్మణ వంశంలో పుట్టటం వల్ల అతనిని అగ్రవర్ణస్థుడుగా అంగీకరిస్తున్నారు. కాని మేము అలా అంగీకరించము. బ్రాహ్మణుడుగా తగిన శిక్షణ పొందితేనే గాని మేము అతనిని అగ్రవర్ణస్థుడుగా అంగీకరించము. అతడు భారతీయుడు కానీయండి, యూరోపియన్ కానీయండి, అమెరికన్ కానీయండి, అధమకులంలో పుట్టనీయండి, అగ్రకులంలో పుట్టనీయండి ఆ సంగతి మేము పట్టించుకోము. తెలివైన ఏ వ్యక్తినైనా, అగ్రకులపు ఆచారాలను అలవరచుకొనేటట్లు శిక్షణ ఈయవచ్చును. నా శిష్యుల తలమీద మేము భారతీయుల వర్ణ వ్యవస్థను రుద్దుతున్నామనే ఈ అపోహను మేము తొలగించదలచుకొన్నాము. మేము కేవలం ఒకటో రకం ధీమంతులనే ఎంచుకొని, వారు అన్ని రంగాలలోను అగ్రేసరులుగా ఉండేటట్లు వారికి శిక్షణ ఇస్తున్నాము'' అన్నారు. (ఆత్మ సాక్షాత్కార శాస్త్రం 66వ పేజీ నుంచి) కృష్ణచైతన్య సంఘంలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని ప్రయత్నించేవాళ్ళు ఎవరైనా సరే ధీమంతులు కావాలని, అందులో చేరిన అందరినీ బ్రాహ్మల్ని చేస్తామని వారు చెబుతున్నారు. సంత్ పురుషుల మార్గంలో అట్లాంటి వ్యత్యాసంగాని, ఆ విధంగా సంఘాన్ని భేదబుద్ధితో తిలకించటంగాని లేదు.
ప్రాచీన మార్గంలో ఆత్మజ్ఞానం స్వీకరించటానికి నాలుగు ప్రధానమైన మహావాక్యాలను స్వీకరించారు. సహజంగా శిష్యుడు గురువు ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవటాన్నే శ్రవణం అన్నారు. గురువు (1) ''తత్త్వమసి'' అని బోధిస్తాడు. తత్ అంటే బ్రహ్మం, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. అనగా నువ్వే బ్రహ్మం అయి ఉన్నావు అని గురువు బోధిస్తాడు. ఆ విధంగా అది శ్రవణ వాక్యం అయింది. అప్పుడు సాధకుడు నేను అంటే ఆత్మ కదా ? అని దానిని విచారణ చేయటం మొదలు పెడతాడు. ఆ విధంగా దాన్ని నిరంతరం మననం చేస్తుండటం వల్ల (2) ''అయ మాత్మా బ్రహ్మ'' (అయం ఆత్మా = ఈ ఆత్మ, బ్రహ్మ = బ్రహ్మంగా ఉంది) అనగా ఈ ఆత్మ బ్రహ్మంగా ఉందని తెలుసుకొని నేను బ్రహ్మాన్ని అనే నిర్ణయానికి వస్తాడు. కాన దీనిని మనన వాక్యం అన్నారు. దానితో సాధకుడు (3) ''అహం బ్రహ్మాస్మి'' అని (అహం = నేను, బ్రహ్మ = బ్రహ్మంగా, అస్మి = అయి ఉన్నాను అని) నిదిధ్యాసమనే నిరంతర ధ్యానంలో తెలుసుకొంటాడు. అందువల్ల అహం బ్రహ్మాస్మి అనే దాన్ని నిదిధ్యాస వాక్యం అన్నారు. తర్వత (4) ధ్యానంలో అద్వితీయమైన ఆనందంలో మునిగి బాహ్యప్రజ్ఞ లేకుండా ఉంటూ ఉండటాన్ని తెలియజేస్తూ ''ప్రజ్ఞానం బ్రహ్మ'' అని అన్నారు. అంటే ఆత్మే బ్రహ్మ అని చెప్పారు. ఇది అనుభవ వాక్యం అవుతుంది. ఆ విధంగా సాధకుడు నిరంతర పరిణామ క్రమంలో సాధనలో బ్రహ్మంగా రూపొందాడు. కావున ఈ నాలుగు మహాకావ్యాలు క్రమపద్దతిలో శిష్యుణ్ణి గురువు అంతటి వాణ్ణి చేశాయి. కావున ఈ క్రమ వికాసాన్ని పరిశీలించి చూసినప్పుడు బంగారాన్ని పుటం పెడితే మాలిన్యం వీడి స్వయంప్రకాశంగా వెలుగొందట మనేది ఏమిటో స్పష్టంగా బోధపడుతుంది.
(1) శ్రవణం అంటే అసలు వినటం అని అర్థం. మానవుడు పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి ఇతరులు చెప్పింది విని ఆచరిస్తూ వస్తాడు. ప్రతి మానవుడు తన జీవన విధానానికి ఇతరులతో సర్దుకొని, సంఘానికి అనుకూలంగా ఒదిగి నడవటానికి అవసరమయినవి ఏవేవి ఉన్నాయో అవన్నీ వింటూనే ఉంటాడు. ధర్మం, నీతి, భక్తి, అంటూ అనేక విధాలుగా చెప్పేవన్నీ వింటూనే ఉంటాడు. అందులో అనేకమైనవి తనకి నచ్చినవంటూ ఆచరిస్తూ, తనకు నచ్చనివంటూ కొన్నిటిని వదిలేస్తూ ప్రతి మానవుడు తనదైన ఒక మార్గంలో నడుస్తూనే ఉంటాడు. అట్లాంటప్పుడు ఆధ్యాత్మిక చింతనలో, ఆత్మబోధలో శ్రవణం అంటే ఏమిటి అంటే ఇంద్రియాల్ని నిగ్రహించటానికి, ధ్యానానుష్ఠానానికి, కావలసిన విధంగా శరీరాన్ని ఇంద్రియాల్ని మలచుకోవటానికి, కావలసిననట్లు తయారవటానికి వినేవాటినే శ్రవణం అంటున్నారు.
(2) మననం అంటే విన్నవాటిని నిరంతరం తర్జనభర్జనలతో, తర్కవితర్కాలతో లోపల ఆలోచించుకొని తన వయస్సుకు, ఆరోగ్యానికి, జీవన విధానానికి, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలంగా వాటిని సర్దుబాటుచేసుకొని ఆచరణ యోగ్యంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి మనస్సులో చేసే ప్రయత్నాన్నే మననం అంటున్నారు.
(3) నిదిధ్యాస అనే ధ్యానము అంటే తాను శ్రవణంచేసిన వాటిని, తర్కించుకొని, బుద్ధితో మననం చేసిన వాటిని ధ్యానంలో అనుసంధానం చేకూర్చుకొని గురుజ్ఞానానికి అనుకూలంగా ఇంద్రియాలన్నిటికీ సంయమనాన్ని చేకూర్చటం జరుగుతుంది.
ఈ విధంగా ప్రతిసాధకునికి సాధనలో క్రమశిక్షణ అవసరమై ఉంది. ఈ విధమైన క్రమశిక్షణ లేకుండా ఏ సాధకుడు కూడా ఉన్నతమైన ఫలితాల్ని పొందలేడు. ఆచరణ అన్నిటికన్నా కష్టమైంది. శ్రవణ మననాదులందు లభించిన జ్ఞానం స్థిరమవటానికే సాధకునకు సేవ అనేది దోహదపడుతుంది. బంగారం వన్నె ఒరిపిడిరాయి తేల్చి చెప్పినట్లు సేవవల్లే అహంబ్రహ్మాస్మి అనేది ఆచరణలో సాధ్యం అవుతుందో లేదో తెలుసుకోవటానికి వీలుకుదురుతుంది. సేవ చేసేటప్పుడు సాధకుడు ఎదుర్కొనే రకరకాల సమస్యల్ని పరిష్కరించుకోవటానికి పడేయాతనలో మనస్సు, శరీరం, ఇంద్రియాలు అన్నీ కూడా, ప్రతినిత్యం పరిశుద్ధమవుతూ, మాలిన్య రహితంగా తయారవుతాయి. కావున సాధకునకు శ్రవణ మననాదులు పరిశుద్ధమవటానికి ఎంత ముఖ్యమవుతున్నాయో సేవకూడా అంతకన్నా ఎక్కువే ముఖ్యమవుతుంది. అందుకే గురుమహారాజ్‌జీ సాధనలో ఉత్తమ ఫలితాల్ని పొందటానికి సేవకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. మానవుడు పుట్టటం అనేదే సేవకోసం పుట్టాడేమో అని అనిపిస్తుంటుంది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా శరీరం కోసం పని చేస్తుంటాయి. శరీరం - తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం, భార్యపిల్లలకోసం, మిత్రుల కోసం, సంఘం కోసం, రాజకీయ మత సిద్ధాంతాకోసం, ఆత్మకోసం ఇట్లా - అనేక రకాలుగా అది సేవచేస్తూ పోషణ భారాన్ని స్వీకరిస్తూ గడుపుతుంది. శరీరం శరీరం కోసమే గాక, శరీరం ఆత్మకోసం ఉందనేది బాగా బోధపడిననాడు, దాని కోసం తగిన విధంగా దానికి తర్ఫీదు ఇచ్చిననాడు సేవచేయటం అనే కార్యానికే నిజమైన సార్థకత చేకూర్చినట్లవుతుంది. ఆత్మజ్ఞానంతో, ఆత్మమార్గంలో, చేసే సేవలో స్వార్థంతోపాటు పరమార్థం కూడా ఒకేసారి నెరవేరుతుంటాయి. పర్యవసానంగా సేవ అనేది నిస్వార్థ సేవగా మారి, భగవత్సేవగా చరితార్థత పొందుతుంది. నిస్వార్థ సేవలో, భగవత్సేవలో పరిపూర్ణమైన ఆత్మానందం సిద్ధిస్తుంది. ఆత్మ అనే భగవత్సేవలో, భగవత్ పూజలో తృప్తి, ఆనందం లభిస్తున్నాయి. ఆత్మమార్గంలో సేవ అనేది మానవ అవసరాల్ని తీర్చే ఉత్తమ సాధనమై జీవితానికి పరిపూర్ణత చేకూరుస్తుంది. సేవ ద్వారా మానవుడు శరీరాన్ని పుటం పెట్టటం జరుగుతుంది. శరీరంలోని అధిక భాగం మాలిన్యాల్ని సేవ ద్వారానే శుద్ధి చేయటం జరుగుతుంది. సేవద్వారా నేను దేహాన్నికాను, మనస్సును కాను, నేను ఆత్మబ్రహ్మని అని-అహంబ్రహ్మాస్మి-అనుకొంటూ ఎదురయ్యే వికారాల్ని సాక్షిమాత్రంగా దర్శించటానికి కుదురుతుంది.
సామాన్యమైన జీవుడు మాలిన్యంతో కూడిన వాడైతే, మాలిన్యం తొలగిన జీవుడు పరమాత్మ అవుతున్నాడు. కావున సాధకుడు నిరంతరం ప్రయత్నపూర్వకంగా అంతఃకరణాన్ని నిర్మలం చేస్తుండాలి. దానివల్ల సాధకునిలో ఆత్మ స్వతస్సిద్ధంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా ప్రకాశిస్తుంది. జ్ఞానము, జ్ఞాని వేరుకానందున జీవి అనేవాడు జ్ఞాన స్వరూపమనే అనుభవం పొందుతాడు. అందువల్ల ప్రతి సాధకునికి ప్రతి దినం పారమార్థిక క్రమశిక్షణ అవసరం ఎంతైనా ఉంది. దానివల్లే లక్ష్యసిద్ధి చేకూరుతుంది. సాధకునిలో నిజమైన కృషి లోపించి, నిజమైన శిష్యరికం చేయకపోతే అసలుకే మోసం వస్తుంది. అటువంటి వాళ్ళే ఇవన్నీ అయథార్థాలని అంటూ ఉంటారు.
సాధకుడు నిజంగా మలాల నుంచి విముక్తుడయ్యాడంటే విషయ వాంఛల నుంచి విముక్తుడయ్యాడన్నమాట, దేహభ్రాంతి నుంచి, మనోవికారాల నుంచి విముక్తుడయ్యాడన్నమాట. అవి సాధకునికి ఎప్పుడు చేకూరుతాయో అప్పుడు ఆతడు అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహం కలిగిన వాడవుతాడు. దానివల్ల ఆతనికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆతడు తన నిజస్వరూపంలో తాను లీనమవ్వ గలుగుతాడు. దానివల్ల ఆతనికి ఆత్మానుభూతి చేకూరుతుంది.
ఆత్మానందమనే సాధనలో మానవుని లోపల ఉన్న ఆత్మ అనే భగవంతుని కృప ఏభై పాళ్ళయితే, గురుకృప పాతిక పాళ్ళయి, సాధకుని కృషి మిగిలిన పాతిక పాళ్ళతో ఫలసిద్ధి లభిస్తుందని కొన్ని ఆశ్రమాలు చెప్పుతున్నాయి. కావున సాధకుని కృషి ఏమాత్రం పురోభివృద్ధి చెందినా దానికి గురుకృప తోడై, ఆ భగవంతుడు ఆత్మానందాన్ని అంది వచ్చేటట్లు చేస్తాడు. మానవునిలో అంతర్ముఖంగా ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపం కృప ఉన్నప్పుడే గురువును ఆశ్రయించాలనే ధ్యాస, ధ్యాన సాధన కొనసాగించాలనే ప్రేరణ కలుగుతాయి. దానిని మానవుడు సద్వినియోగం చేసుకొన్ననాడు జన్మకు సార్థకత చేకూరుతుంది.
67 హృదాకాశోదితోహ్యాత్మా
బోధభానుస్తమో 2 పహృతా
సర్వవ్యాపి సర్వాధారీ
భాతి భాసయతే 2 ఖిలమ్ || 67
x¤¦¦¦XµR…¸R…V + ఆకాశ + ఉదితః = హృదయం అనే ఆకాశంలో పుట్టిన, ఆత్మాహి = ఆత్మయే, బోధభానుః = జ్ఞానం అనే సూర్యుడై, తమః = అజ్ఞానమనే చీకటిని, అపహృతః = పారద్రోలి, సర్వవ్యాపి = అంతటా వ్యాపించి, సర్వ + ఆధారి = సమస్తానికి ఆధారమై, భాతి = ప్రకాశిస్తూ, అఖిలం = సమస్తాన్నీ, భాసయతే = ప్రకాశింపచేస్తుంది.
తా|| హృదయం అనే ఆకాశంలో పుట్టిన ఆత్మయే జ్ఞానమనే సూర్యుడై వెలుగొంది అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, అంతటా వ్యాపించి, సమస్తానికి ఆధారమై ప్రకాశిస్తూ సమస్తాన్నీ ప్రకాశింప చేస్తుంది.
„sª«sLRißá :c ª«sWƒ«sª«so²R…V xqs»R½òQ*gRiVßáLi»][ ÒÁ„sxqsVòƒ«sõxmsöV²R…V, ª«sVLiÀÁ ƒ«s²R…ª«s²T…NRP NRPÖÁgji, ¬ds¼½¬s¸R…Vª«sWÌÁ»][ xqsLi¿RÁLjixqsVòƒ«sõxmsöV²R…V, A»R½²R…V úxmsµR…Lji+xqsVòƒ«sõ NRPLRiVßá, µR…¸R…V, ÇØÖÁ, ú}msª«sV, »yùgRiLi, Aƒ«sLiµR…Li, »R½Xzmsò ª«sLiÉÓÁ gRiVßØÌÁ»][ @ÌÁLSLRiV»R½Vƒ«sõxmsöV²R…V A»R½¬s ª«sVƒ«sxqsV= Dƒ«sõ zqós¼½®ƒs[ x¤¦¦¦XµR…¸R…VLi @LiÈÁVƒyõLRiV. A „sµ³R…LigS x¤¦¦¦XµR…¸R…VLi @LiÛÉÁ[ ª«sWƒ«sª«so¬s aRPVµôðR…\®ªsVƒ«s ª«sVƒ«s}qs= NS¬s A»R½¬sÍÜ[ LRiNRPò úxmsryLRiLi NS„sLi¿Á[ gRiVLi®²…NS¸R…V NSµR…V. A»yøƒ«sV˳ÏÁW¼½¬s NRPÖÁgjiLi¿Á[ róyƒy®ƒs[õ x¤¦¦¦XµR…¸R…VLi @LiÈÁVƒyõLRiV. @µj… lLiLi²R…V NRPƒ«sVõÌÁ ª«sVµ³R…ù ª«sVW²R…ª«s ®ƒs[ú»R½Li DLi®²…[ róyƒ«sLi ª«sµôR… DLiµj…. ª«sVW²R…ª«s ®ƒs[ú»R½Li DLi®²…[ róyƒy®ƒs[õ AÇìØ¿RÁúNRPLi @¬s @LiÉØLRiV. ª«sWƒ«sª«soÌÁV LSú¼½ ¬súµR…F¡¹¸…[VÈÁxmsöV²R…V @LiµR…LjiNUP NRPW²y A róyƒ«sLiÍÜ[ ª«sVƒ«sxqsV= A»R½ø»][ ÖdÁƒ«sª«sVª«so»R½VLiµj…. ryµ³R…NRPV¬s ª«sVƒ«sxqsV=ÍÝNTPNRP úxmsª«sX¼½òNTP ª«sVLRiÖÁ, µ³yLjiøNRP»R½»][, \®ƒsLRiøÌÁùLi»][ gRi²R…Vxmso»R½Vƒ«sõxmsöV²R…V @µj… x¤¦¦¦XµR…¸R…VLi @ª«so»R½VLiµj…. @ÈÁVª«sLiÉÓÁ Dƒ«sõ»R½ róyƒ«sLi ƒ«sVLiÀÁ ª«sWƒ«sª«so¬sNTP Çì؃«sª«sV®ƒs[ xqsWLRiVù²R…V úxmsNSbP}qsò A»R½¬sNTP @Çì؃«sª«sV®ƒs[ ÀdÁNRPÉÓÁ »]ÌÁgjiF¡»R½VLiµj…. ryª«sWƒ«sù ª«sWƒ«sª«soÌÁ x¤¦¦¦XµR…¸R…VLi ÍÜ[NRPªyLi¿³RÁÌÁ»][ NRPW²T… @Çì؃«sLi»][ xqsLi¿RÁLjixqsVòLiÈÁVLiµj…. @ÈÁVª«sLiÉÓÁ @Çìجs x¤¦¦¦XµR…¸R…W¬sNTP Çì؃¯[µR…¸R…VLi NRPÌÁVgRigS®ƒs[ »yƒ«sV úxmsNSbPxqsWò xqsLS*¬sõ NRPW²y úxmsNSbPLixms¿Á[ryò²R…V. LRi»R½õLi »yƒ«sV úxmsNSbPxqsWò B»R½LRiVÌÁƒ«sV NRPW²y úxmsNSbPLixms¿Á[xqsVòLiµj…. NSª«soƒ«s A»R½øÇìجs LRi»R½õª«sVßÓá ª«sÛÍÁ »yƒ«sV úxmsNSbPxqsWò B»R½LRiVÌÁƒ«sV NRPW²y Çì؃«sVÌÁVgS »R½¸R…WLRiV ¿Á[ryò²R…V.
సాధకుడు ఏదో ఒక క్రియను ప్రత్యేకంగా చేయాలని సాధన లక్ష్యంకాదు. సాధకునితో గురువు ఎన్ని క్రియలు చేయించినా సాధకుని సంస్కారానుసారం ఆతని దుస్సంస్కారాలన్నింటినీ క్షీణింప చేయటానికే చేయిస్తారు. ఆ విధంగా సాధకుని సాధనలో దుస్సంస్కారాలన్నీ క్షీణించగానే సాధకుడు ఏ క్రియలు లేని నిర్మలమైన స్థితిలో హృదయారామంలో ఆత్మారామునితో నిలుస్తాడు. అందువల్ల సాధకుడు ఏ క్రియా విశేషంలో కూడా ఆసక్తుడై ఉండకూడదు. సాధకునకు సాధనలో ఏ క్రియాలేని స్థితి ఎప్పుడు లభిస్తుందో అప్పుడు ఆతనికి ఏ శ్రమాలేని స్థితి సిద్ధిస్తుంది. సాధకుడు తన స్వస్థానంలో తాను నిలుస్తాడు. ఆ పరిస్థితుల్లో సాధకుడు లయయోగంలో తనకు తాను తెలియకుండానే నిలుస్తాడు. సాధకునకు ఏమీ తెలయకుండానే లోన దానంతట అదిగా విన్పిస్తున్న నాదముతో మనస్సు లీనమై ఉండటాన్నే లయ యోగం అంటారు. దీనినే అనహతనాదంతో లీనమై ఉండటం అని కూడా అంటారు.
68 దిగ్దేశ కాలాద్యనపేక్ష్య సర్వగం
శీతాది హృన్నిత్య సుఖం నిరంజనం
యస్స్యాత్మ తీర్థం భజతే వినిష్క్రయః
స సర్వవిత్ సర్వగతో 2 మృతో భ##వేత్ || 68
„s¬sztsQäQû¸R…VM = సమస్త కర్మల్ని విడిచిపెట్టి, దిక్ + దేశ + కాల + ఆది = ప్రాచ్యులు పాశ్చాత్యులు అనేటటువంటి దిక్కు దేశం కాలం అనే మొదలైన వాటిని, అనపేక్ష్య = విడిచిపెట్టి, సర్వగం = సర్వమూ వ్యాపించింది, శీత + ఆది హృత్ = చల్లగా ఉంది వేడిగా ఉంది అనేటటువంటి ద్వంద్వాలను తొలగించింది, నిత్యసుఖం = నిరంతరం సుఖాల్ని ఇచ్చింది, నిరంజనం = దేన్ని అంటనిది అయిన, స్వ + ఆత్మ తీర్థం = తన ఆత్మ అనే తీర్థస్థానంలో, యః = ఎవడు, భజతే = ధ్యానిస్తాడో, సః = వాడు, సర్వవిత్ సర్వం తెలిసినవాడు, సర్వగతః = సర్వవ్యాపి, అమృతః = అమరుడు, భ##వేత్ = అవుతున్నాడు.
తా|| సమస్త కర్మల్ని విడిచిపెట్టి, ప్రాచ్యులు, పాశ్చాత్యులు అనే దిక్కు దేశం కాలం అనే వాటిని విడిచిపెట్టి, సర్వమూ వ్యాపించింది, శీతోష్ణాది ద్వంద్వాలను తొలగించింది, నిరంతరం సుఖాన్ని ఇచ్చింది, దేన్ని అంటనిది అయిన తన ఆత్మ అనే తీర్థస్థానంలో ఎవడు ధ్యానిస్తాడో వాడు సర్వం తెలిసిన వాడు, సర్వవ్యాపి, అమరుడు అవుతున్నాడు.
వివరణ :- సత్ స్వరూపమైన ఆత్మకు ఏవీ అంటవు. దానికి దేశం కాలం వ్వవహారం అనే పరిమితులు ఉండవు. అది ఎల్లవేళల ఎప్పుడూ వ్యాపించి ఉంటుంది. దానికి ద్వైత భావం లేనేలేదు. కాన అటువంటి ఆత్మతో ఎవడు జీవిస్తుంటాడో, అటువంటి వాడు సర్వకోరికల్ని విడిచిపెట్టి, సర్వకర్మల్ని విడిచిపెట్టి, రాగద్వేషాలు లేనివాడై, తన ఆత్మానందంలో జీవిస్తాడు. అట్లా ఉన్న మహనీయుడు తనే సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, బ్రహ్మము అయి జీవిస్తాడు. అటువంటివాడు అమృత తత్త్వాన్ని పొందుతాడు. ఆత్మనే ధ్యానిస్తూ ఆత్మతోనే జీవిస్తున్నవాడు ఆత్మ వేత్త అవుతాడు. ఆతడు ధన్యుడవుతాడు. ఎందుకంటే ఆతడే సర్వేశ్వరుడవుతాడు, ఆతడే సర్వం తెలిసినవాడవుతాడు, ఆతడే సర్వాంతర్యామి అవుతాడు, ఆతడే అన్నిటికీ కారణభూతుడవుతాడు. కావున అటువంటివాడు ఆనంద స్వరూపుడై జీవిస్తాడు.
సర్వత్రా కలుషితమై కనిపిస్తున్న ఈ సంఘానికి ఆత్మజ్ఞానమనే సాధనమార్గం ఈనాడు అందరికీ మృతసంజీవినిలా ఉపయోగపడుతుందని, అది అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలుందని తెలియజేస్తున్నాను. దానికి అనుకూలంగా ఈ గ్రంథంలో భక్తి అక్కరలేదని ప్రబోధిస్తున్నానని భ్రమప్రమాదులకు ఎవ్వరూ లోనుకావద్దని హృదయ పూర్వకంగా అర్థిస్తున్నాను. భక్తి మార్గమనే సముద్రంలో జీవితమనే ఓడ ఎక్కి పయనిస్తున్నవాడు, మత మనే సముద్రంలో జీవితమనే ఓడ ఎక్కి పయనిస్తున్నవాడు, తన జీవితమనే ఓడలోంచి సముద్రంలోకి దూకాలని ఏనాడూ అనుకోడు. చుట్టూ ఉన్న వాతావరణం, సంఘం అంతా కూడా ప్రతిమానవుడికి సముద్రంలా కనిపిస్తుంటుంది. అటువంటి మానవుడికి భక్తి మార్గాన్ని వదలాలన్నా, తాను ఏ మతంలో జన్మించి జీవిస్తున్నాడో ఆ మతాన్ని వదలాలన్నా తన చుట్టూ ఆవరించి ఉన్న సముద్రమనే సంఘంలో ఏ ఆధారం లేకుండా మునిగిపోతానని భ్రమతో, నిశ్చేష్టతతో నిలిచిపోతుంటాడు. భక్తి, మతం అనేవి మానవునికి అనేక కోరికల్ని తీర్చి, శక్తిని ప్రసాదిస్తున్నాయి అని కూడా భ్రమపడుతూ జీవిస్తుంటారు. అట్లాటి మానవులకు సంత్ పురుషులు మీ దేహమే నావగా నిలిచి, గురుజ్ఞానమే తెడ్డుగా ఉపయోగపడి, గురుకృపే సముద్రపు అలలనుంచి రక్షించే దైవం అయి, గురువనే జ్ఞానమే రక్షణ కవచంగా ఏర్పడి మిమ్ముల్ని ఒడ్డుకు చేరుస్తాయి అని హామీ ఇస్తున్నారు, నిరూపించి చూపిస్తున్నారు.
LRiª«sVßá ª«sVx¤¦¦¦L<jiÍØ G gRiVLRiVª«so ÛÍÁ[NRPVLi²y®ƒs[ xmsoÈíÁVNRP»][ A»R½øÇì؃«sLi zqsµôðj…LiÀÁƒ«s ÑÁ²ïR…V NRPXxtñsQª«sVWLjiògSLRiV NRPW²y ®µ…[ªyÌÁ¸R…VLi ª«sWƒ«sª«so¬s E¥¦¦¦ÍÜ[NRPLiÍÜ[Li¿Á[ DµR…÷é„sLiÀÁLiµR…¬s @ƒ«sV˳ÏÁª«sxmspLRi*NRPLigS ¾»½ÖÁ¸R…VÛÇÁ[aSLRiV. @LiVV¾»½[ ®µ…[ªyÌÁ¸R…W¬sõ „s²T…ÀÁ|msÛÉíÁ[|qs¸R…WùÌÁ®ƒs[ „dsVLRiV úxmsËÜ[µ³j…xqsVòƒyõLS @¬s ryª«sWƒ«sVùÌÁV úxmsbPõLi¿RÁª«s¿RÁVè. @Li¾»½[NSNRPVLi²y ®µ…[ªyÌÁ¸R…VLi „s²T…ÀÁ |msÛÉíÁ[}qsò ˳ÏÁNTPò N][ÍÜ[öLiVVƒ«s ªyÎÏÁþª«so»R½VƒyõLRiVgRiµy @¬s xqsLiaRPLiVVLi¿RÁª«s¿RÁVè. A „sµ³R…LigS ª«sWƒ«sª«soÌÁLiµR…LRiW »R½ª«sVNRPV Aµ³yLRi\®ªsVƒ«s„s N][ÍÜ[öª«sÈÁLi ª«sÌýÁ gRiW²R…V N][ÍÜ[öLiVVƒ«s xmsORPVÍýØgS „sx¤¦¦¦LjiLi¿RÁª«sÌÁzqsƒ«s zqós¼½ ª«sxqsVòLiµR…¬s ú˳ÏÁª«sVNRPV ÍÜ[ƒ«sª«sÈÁLi NRPW²y ÇÁLRiVgRiV»R½VLi²R…ª«s¿RÁVè. NS¬s ¬sÇجsNTP A»R½øª«sWLæRiLiÍÜ[ ª«sWƒ«sª«so²R…V ˳ÏÁNTPò¬s N][ÍÜ[öª«sÈÁLi ÛÍÁ[µR…V. ª«sWƒ«sª«so²R…V ËØz¤¦¦¦LRi\®ªsVƒ«s ˳ÏÁNTPò ƒ«sVLiÀÁ @Li»R½LRiVøÅÁ\®ªsVƒ«s ˳ÏÁNTPòNTP Aµ³yLRiLi @LiVVƒ«s D»R½òª«sV ª«sWLæRiLiÍÜ[ xms¸R…V¬sLiÀÁ, ÌÁOSQQù¬sõ »R½xmsöNRPVLi²y ¿Á[LRigRiÌÁVgRiV»R½Vƒyõ²R…V. xqsLixmnsVLiÍÜ[ úxms¿yLRiLiÍÜ[ Dƒ«sõ INRP NRP´R…ƒ«sV „sª«sLjiryòƒ«sV. INRP ƒ«sW¼½ÍÜ[ lLiLi²R…V ƒ«sNRPäÌÁV xms²T… ª«sVLRißÓáLi¿y¸R…VÈÁ. A ¬dsLRiV µy¬sª«sÌýÁ ª«sVÖÁƒ«s\®ªsVF¡¸R…WLiVV. A ¬dsLRiV NRPLixmsoN]²R…V»R½VƒyõLiVV. @LiµR…Vª«sÌýÁ A ¬dsLRiV xms¬sNTP LSª«s¬s, ªyÉÓÁ¬s aRPVµôðj… ¿Á[¸R…WÌÁ¬s, µy¬sN][xqsLi @®ƒs[NRP x¤¦Ü[ª«sWÌÁV, xmspÇÁÌÁV, úª«s»yÌÁV @¬dsõ ¬sLRi*z¤¦¦¦LiÀÁ @„s aRPVµôðj… @¸R…Wù¸R…V¬s ¼d½LóRiQúxmsryµyÌÁV @LiµR…LjiNUP xmsLiÀÁ|msÉíÓÁ, @LiµR…Lji¬ds »R½XzmsòxmsLji¿yLRiÈÁ. A „sµ³R…LigS A ¬dsLRiV aRPVµôðj… @LiVVLiµj… @¬s @ƒ«sõLi»R½ª«sWú»R½Li ¿Á[»R½ A ¬dsLRiV aRPVµôðj… @ª«so»y¸R…W? A ¬dsÉÓÁÍÜ[ ¿Á[Lji Dƒ«sõ aRPªyÌÁ ª«sWÖÁƒyù¬sõ, A ¬dsÉÓÁ NRPaRPøÍجsõ ‡Áz¤¦¦¦LæRi»R½Li ¿Á[¸R…VNRPVLi²y, A ¬dsÉÓÁ¬s »][²T… FyLRiËÜ[¸R…VNRPVLi²y @„s aRPVµôðj… @ª«so»y¸R…W? @®µ…[ „sµ³R…LigS ª«sWƒ«sª«so¬s ª«sVƒ«sxqsV=ÍÜ[ }msLRiVNRPVF¡LiVVƒ«s ª«sWÖÁƒyùÌÁ¬dsõ ‡Áz¤¦¦¦LæRi»R½Li ¿Á[¸R…VNRPVLi²y A ª«sVƒ«sxqsV=ƒ«sV aRPVµôðj… ¿Á[¸R…WÌÁLiÛÉÁ[ „dsÌÁVNSµR…VgRiµy ? ª«sVƒ«sxqsV=ÍÜ[ Dƒ«sõ ª«sWÖÁƒyùÌÁ¬dsõ F¡LiVV aRPVµôðj… @LiVVƒ«sxmsöV®²…[ NRPµy A aRPVµôðR… ª«sVƒ«sxqsV= A»R½ø»][ ÖdÁƒ«sª«sV¹¸…[Vùµj… ? @ÉýØ ª«sVƒ«sxqsV=ƒ«sV aRPVµôðj… ¿Á[¸R…WÌÁƒ«sõxmsöV²R…V, ª«sVƒ«sxqsV=ƒ«sV @Li»R½LRiVøÅÁLi ¿Á[¸R…WÌÁƒ«sõxmsöV²R…V ª«sVƒ«sxqsV=ƒ«sV ÍÜ[xmsÖÁNTP ¼d½xqsVNRPV ®ªsÎÏÁþÉجsNTP ryµ³R…ƒ«s ¿Á[¸R…WÖÁ NRPµy ?
కాన విజ్ఞులైనవారు వివేకంతో విజ్ఞాన దృష్టితో విషయాన్ని అర్థం చేసుకొని మనస్సును శుభ్రపరచాలి. అంతే కాని పైపై మైపూతల వల్ల, లోపల పేరుకుపోయిన దుష్టసంకల్పాలన్నీ తొలగిపోవు. దానికోసమే ఆత్మజ్ఞానం, ఆత్మమార్గం, ధ్యానపద్ధతి మానవులకు అవసరమై ఈనాడు కనిపిస్తున్నాయి.
మానవుని జీవన విధానంలో చేకూరే వాటిని ఆలోచించటానికి, ఆతని వయస్సును గురించి, ఆతని చేష్టలను గురించి అనుశ్రుతంగా మా ఇంటిలో మా పెద్దలు చెప్పుతూ ఉన్న ఒక కథను వివరిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మ మానవుణ్ణి, గాడిదను, కుక్కను, కోతిని సృష్టించి అందరికీ కూడా నలభై సంవత్సరాల జీవన ప్రమాణాన్ని ఇచ్చానని చెప్పాడట. గాడిద తన జీవితమంతా బరువులు మోయటానికే సరిపోవటంతో ఈ బరువుల బాధను భరించలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నాకు ఈ గాడిద బరువుల బాధ వద్దు. నా వయః ప్రమాణాన్ని సగం తగ్గించండి అని వేడుకొందట. దాని బాధను విన్న బ్రహ్మ దాని వయః ప్రమాణాన్ని ఇరవై సంవత్సరాలు చేశానన్నాడట. కుక్కను అందరూ ఛీ, ఛీ అని కసరుకొంటుంటే ఆ బాధను సహించలేకపోయిన కుక్క బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అందరు ఛీ, ఛీ అని కసరుకొంటూ దూరంగా పొమ్మని తోలుతున్నారు, ఈ బ్రతుకు భారం ఇంత వద్దు, నా వయస్సు సగం తగ్గించండి స్వామీ అని వేడుకొందట. దానితో బ్రహ్మ దాని బాధను అర్థం చేసుకొని దాని వయః ప్రమాణాన్ని ఇరవై సంవత్సరాలు చేశాడట. తర్వాత కోతి కూడా అదే విధంగా బ్రహ్మను చేరి నన్ను కోతి వేషాలని వెకిలి చేష్టలని తూష్ణీ భావంతో చూస్తూ నిందిస్తున్నారు కాన నాకు కూడా వయస్సు సగం తగ్గించండి అని వేడుకొందట. బ్రహ్మ అట్లాగేనని దానికి చెప్పి పంపాడట. ఆ మూడింటి తర్వాత మానవుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నా వయస్సు పెంచాలండి, నేను చేయవలసిన పనులు చాలా మిగిలి పోయాయి కాన నాకు ఇంకా అరవై సంవత్సరాలు ఎక్కువ ఇవ్వాలి అని కోరుకొన్నాడట. బ్రహ్మ అట్లాగే ఇస్తానని చెప్పి గాడిద, కుక్క, కోతి తగ్గించుకొన్న వాటి మొత్తం అరవై ఏళ్ళు కలిపి మానవుణ్ణి నూరేళ్ళు బ్రతకమని చెప్పి పంపాడట. మానవుడు సంతోషం పట్టలేకపోయాడట. ఎంత ఎక్కువకాలం నేను బ్రతక గలుగుతున్నాను అంటూ సంబరపడిపోయాడట. మానవుడు నలభై ఏళ్ళు దాటాక పిల్లల పెళ్ళిళ్ళని, పిల్లల ఆస్తులు పెంచాలని, పిల్లల పిల్లలను అభివృద్ధి చేయాలని, ఇట్లా రకరకాల బరువు బాధ్యతలు గాడిదలాగా పెంచుకొంటూ, 60 ఏళ్ళ తర్వాత నా పిల్లలు, నా మనమలు, నా మనమరాళ్ళు అంటూ ప్రేమా, ఆప్యాయతలతో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఛీ, ఛీ అని చీదరించుకొంటూ, దూరంగా ఉండమని కసరుకొంటూ కుక్కను తోలినట్లు అందరూ తోలుతూ వచ్చారట. అట్లా మానవుడు చీదరింపులు, చీత్కారాలతో 80 ఏళ్ళ వరకు కుక్క బ్రతుకు బ్రతికాడట. ఇక 80 ఏళ్ళ తర్వాత అందరూ కోతి పనులు చేస్తున్నాడంటూ అవతలకి తోలుతుంటే, నిందిస్తుంటే ఆ బాధలన్నీ భరిస్తూ మానవుడు నూరేళ్ళ వరకు గడిపాడట. ఆ విధంగా మానవుడు మానవుడుగా జీవించకుండా 40 ఏళ్ళు దాటిన తర్వాత గాడిద, కుక్క, కోతి వయస్సులు స్వీకరించి జీవించినందుకు వాటిలాగానే ప్రవర్తిస్తూ, వాటిలాగానే బాధల్ని అనుభవిస్తూ, కాలాన్ని వెళ్ళదీసి, జీవితం మీద విరక్తి కలిగి తనువును చాలించాడట. అందువల్ల ప్రతి మానవుడు తన జీవితం ఎట్లా ఉండాలి అనేది ముందుగానే బాగా ఆలోచించుకోవలసిన అవసరం ఉందని తెలుసుకొని, సుఖశాంతులనేవి దేనివల్ల లభిస్తాయో బాగా ఆలోచించుకొని జీవించటం నేర్చుకోవాలి. అప్పుడు ప్రతి మానవుడికి అతను జీవించటానికి కావలసిన జీవిత పథకం సక్రమమైన మార్గంలో నడవటానికి వీలు ఏర్పడుతుంది. ఆ విధంగా ఆలోచించినప్పుడు తెలివిగల మానవుడు ఆధ్యాత్మికంగా సద్గురువైన వానిని ఆశ్రయించి, ఆత్మజ్ఞానాన్ని తీసుకొని, ఆయన సత్సంగాల ద్వారా ఆనందాన్ని పొందుతూ సుఖంగా జీవించినప్పుడు జీవితం చరితార్థమవుతుంది ఈ విధంగా ఆలోచించిననాడు మానవుడు తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తూ కాలం గడపాలని తెలుసుకొంటాడు. అట్లా జీవించగలిగిన వాడు తాను తరించటమేగాక తన చుట్టూ ఉన్న వారిని సహితం ఉద్ధరించటానికి మార్గం ఏర్పరిచినవాడవుతాడు. కావున ఆత్మమార్గం అందరికీ సుఖశాంతుల్ని ఆనందాన్ని ప్రసాదిస్తుందని తెలుసుకొని సాధనచేసి తరించటానికి ప్రయత్నించండి.