Aathmabodha Chapters Last Page
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీ.శే. లుక్కాలక్ష్మయ్య, సుమిత్రమ్మ గార్లకు
నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మా తల్లిగారు నిరంతరం నువ్వు అందరిలాగా ఉండవురా అని
జ్యోతిష్కులు చెప్పారని ఎనలేని ''ఆశయాన్ని'' నాముందుంచి ఆశయం నిరంతరం గుర్తుంచుకొనేటట్లుచేసి అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లలను తల్లిదండ్రులలా ఆశయాలడోలికల్లో పెట్టి పెంచాలి.
నా శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావించి నన్ను ఇంతటి ఉన్నత విద్యా సంస్కారాలతో అభివృద్ధి చేసిన మా అన్నయ్య వదినలయిన పుణ్యదంపతులు లుక్కా బాబూరావు, రత్నం గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెనక ఆధారం లేని తమ్ములను, అన్నయ్యలు ఇట్లా ఆదుకొని పైకి తేవాలి.
1. సత్యమే దైవం
2. మానవత్వమే దైవత్వం
3. క్షమించటమే దైవత్వం
4. సహనమే దైవత్వం
5. ప్రేమించటమే ఆత్మ ఉన్నతికి మార్గం
6. మానవసేవే మాధవసేవ