Atma Vidya Vilasamu Chapters Last Page
1
ఆత్మ విద్యా విలాసము
శ్రీసదాశివ బ్రహ్మేన్ద్ర సరస్వతులు
అనువాదము
శంకర కింకరుడు
సాధన గ్రంథమండలి - తెనాలి.
కాపీరైటు] [వెల : 15-00
2
సర్వస్వామ్యములు
సాధన గ్రంథ మండలిని
భావ
శంకర జయంతి
విజయ ఆర్టు ప్రెస్,
తెనాలి.
3
''మఱ్ఱి మొదలును వీడి - మన నడుమ
నిన్న మొన్నటివరకు నడయాడిన శంభుమూర్తికి,
మౌనముద్రనువీడి - మహార్ధముల నెన్నిటినో
ప్రవచించిన దక్షిణాస్య మహాదేవునకు,
నేటికిని భక్తుల అంతరంగమున దోచి
''నీ ధర్మమును నీవేమి అనుసరించుచున్నావు?''
అని నిలదీసి అడుగుచున్న ఆచార్యమూర్తికి
శ్రీకంచికామకోటి పీఠాధీశ్వరులకు -
శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ యతీన్ద్రులకు
శంకర జయంతి సందర్భమున
భక్తితో దీనిని అర్పించుచున్నాము.''
4
శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్రస్తుతిః
''తాపత్రయార్త హృదయః
తాపత్రహార దక్షనమనమహమ్ |
గురువర బోధితమహిమా
శరణం యాస్యే తవాఞ్ఘ్రి కమలయుగమ్ ||
శబ్దార్థ విజ్ఞానయుతా హి లోకే
వసన్తి లోకా బహవః ప్రకామమ్ |
నిష్ఠాయుతా న శ్రుతదృష్టపూర్వా
వినా భవన్తం యతి రాజనూనమ్ ||
స్తోకార్చనప్రీత హృదంబుజాయ
పాకాబ్జ చూడాపరరూపధర్త్రే |
శోకాపహర్త్రే తరసా నతానాం
పాకాయ పుణ్యస్త్య నమో యతీశే ! ||
నాహం హృషీకాణి విజేతు మీశో
నాహం సపర్యా భజనాదికర్తుమ్ |
నిసర్గయా త్వం దయయైవ పాహి
సదాశివేమం కరుణాపయోధే ! ||''
-శ్రీశ్రీ జగద్గురు శృఙ్గగిరి
శ్రీసచ్చిదానన్ద శివాభినవ నృసింహభారతి.