Acharyavaani - Vedamulu     Chapters   Last Page

క్రీ||శే|| చల్లా శేషాచల శర్మగారి

ఆధ్వర్యమున జరిగిన

శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ

శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ

మహాస్వామివారి

వివిధ జయంత్యుత్సవములో ఆవిష్కరింపబడిన

గ్రంథములు.

సప్తాశీతితమ జన్మదినోత్సవాభివందన సంచిక

శ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రి, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మొ||లగు పండితుల వ్యాసములు, మరియు శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణములతో - (1980)

నడయాడు దైవము

కంచి ఋషీంద్రులు - Sri TMP Mahadevan వ్రాసిన The Sage of Kanchiకి తెలుగు అనుకృతి, శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారి 'సువర్ణోపదా' మరియు శ్రీ స్వామివారి దివ్య సందేశములతో (1982)

శ్రీవిద్యా పంచదశ మాలా మంత్రాద్ధారః

శ్రీ మధ్భాస్కర రాయకృత 'గురుకలా' వ్యాఖ్యా సమేతముగా శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి (రేపల్లె) సంపాదకత్వములో శ్రీ స్వామివారి 90వ జన్మదినోత్సవ సందర్భముగా ప్రచురింప బడిన పారాయణ విధి (1984)

మహాస్వామి

శ్రీవారి జన్మదినోత్సవముల సందర్భముగా శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి ప||ప|| జనార్థనానంద సరస్వతీస్వామి మొదలగు బ్రహ్మజ్ఞుల ఉపన్యాసములు. శ్రీవారితో అనుభవములున్న పెద్దలు వ్రాసినా వ్యాసములు శ్రీ స్వామివారు చెప్పిన ధార్మిక కధలకు అనువాదములతో మహాస్వామివారి జయంత్యుత్సవ అభినందన సంచిక. (1993)

మరియు :

ఆచార్యవాణి (ప్రథమ సంపుటము)

'అద్వైతము' 'వైదికమతము' 'గురు సంప్రదాయములపై శ్రీ కంచి మహాస్వామివారి అనుగ్రహ భాషణములకు 'విశాఖ'గారి తెలుగు సేత. (1993)

శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకరాచార్య

శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ శ్రీ చరణుల

దివ్య సందేశము

శ్లో|| మైత్రీం భజతాఖిల హృద్‌జైత్రీం

ఆత్మవదేవ పరానపి పశ్యత

యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత

త్యజత పరేష్వక్రమ మాక్రమణమ్‌|

తా|| అందరి హృదయములను జయించుమైత్రిని పెంచుము.

ఇతరుల నందరిని నీవలెనే చూచుకొనుము.

యుద్ధమును, స్పర్థను త్యజించుము.

ఇతరులపై అక్రమ ఆక్రమణను వదలిపెట్టుము.

శ్లో|| జననీ పృథ్వీ కామదుఘా7స్తే

జనకో దేవః సకల దయాళుః

దామ్యత దత్త దయధ్వం జనతాః

శ్రేయో భూయాత్‌ సకలజనానామ్‌||

పుడమితల్లి అన్ని కోర్కెలను పిదుక గలదు.

తండ్రి పరమేశ్వరుడు అందరియెడ దయాళువు.

ఓ! ప్రపంచప్రజలారా! దయా దాన నిగ్రహాదులను అలవరచుకొనుడు.

మీకెల్లరకు శ్రేయమగుత.

___________________________________________

ఈ సందేశము 23 అక్టోబర్‌ 66వ ఐక్యరాజ్యసమితిలో

శ్రీమతి యమ్‌.యస్‌. సుబ్బలక్ష్మిచే గానము చేయబడినది.

___________________________________________

Acharyavaani - Vedamulu     Chapters   Last Page