Acharyavaani - Vedamulu     Chapters   Last Page

ఆచార్యవాణి

(ద్వితీయ సంపుటము)

వేదములు

కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య

శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ - మహాస్వామివారి ఉపన్యాసములు

తెనుగు అనుకృతి - పింగళి సూర్యసుందరం

ప్రకాశకులు

కంచి శ్రీ మహాస్వామి శతాబ్ది ప్రచురణలు

'గురుకృప'

18A, అజీజ్‌నగర్‌ రెండవవీధి,

కోడంబాక్కం, మదరాసు - 600 024.

 

ప్రథమ ముద్రణము ః మే 1997

ద్వితీయ ముద్రణము ః జనవరి 1999

వెల ః రూ|| 50/-

ఈ ఆచార్యవాణి (రెండవ సంపుటము) కామాక్షీ సేవాసమితి బొంబాయి వారి అనుమతితో ఆంగ్లేయమున ప్రచురింపబడిన "The Hindu Dharma" యొక్క "Vedas" అను అధ్యాయము అనువదింపబడి, తెనాలి మాండలీకాశ్రమము వారి పాక్షిక ఆర్థిక సహాయముతో ప్రచురింపబడింది.

గ్రంధ ప్రాప్తి స్థానములు :

1. కంచికామకోటి పీఠము - కాంచీపురము

2. ''గురుకృప'', 18A, అజీజ్‌నగర్‌ రెండవవీధి,

కోడంబాక్కం, చెన్నై - 600 024.

ఫోన్‌ : 044-4849728, 4847152.

3. సి-68, బాలాజీ టవర్స్‌, 1-1-538,

గాంధీనగర్‌, హైదరాబాద్‌ - 80. ఫోన్‌ : 040-7668023.

4. ఆధ్యాత్మిక పుస్తక విక్రయ కేంద్రములు, స్కందగిరి,

కాచిగూడ మరియు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.

 

మహాస్వామి సంచిక ఆవిష్కరణ సందర్భముగా

శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారు.

శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వారు.

 

శ్రీః

శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య పరంపరాగతమ్‌

శ్రీకామకోటి మహా సంస్థానమ్‌.

యాత్రాస్థానమ్‌ - ఖాట్మండు 24-4-97

సర్వప్రాణి హితమయినవి, సర్వధర్మమూలమయినవి యగు వేదాంగముల యొక్క సారభూతమయిన సిద్ధాంతములు మాగురుదేవులు ''శ్రీ మహాస్వామివారు'' అతి చిన్న మాటలలో, సులభగ్రాహ్యముగ తమ అనేక అనుగ్రహ భాషణములలో విడమరచి చెప్పియున్నారు. అవి ''దైవత్తిన్‌ కురల్‌'' అనుపేర ద్రావిడ భాషలో ఆరుసంపుటములుగ వెలువరించబడియున్నవి. కొన్ని ఆంగ్లమున తర్జుమా చేయబడినవి.

అందుకొన్ని విషయములు ఇతః పూర్వము జగద్గురు బోధలు అనుపేర పదిసంపుటములుగను, ఆచార్యవాణి యనుపేర ఒక సంపుటముగను తెనుగున ముద్రింపబడియున్నవి. ఇప్పుడు ''ఆచార్యవాణి'' పరంపరలో శ్రీ మహాస్వామివారు వేదములపై చేసిన ప్రసంగములు ఆంగ్లేయమునుండి అనువదింపబడి ''కంచి శ్రీ మహాస్వామి శతాబ్ది ప్రచురణలు'' వారిచే ప్రచురింపబడుచున్నవని తెలిసికొని ఎంతయో సంతుష్టులమయినాము.

తెనుగువారికి మహోపకారమయిన ఈ పుణ్యకార్యములో పాలుపంచుకొనిన అనువాద కర్తలు శ్రీ పింగళి సూర్యసుందరంనకు, ద్రవ్యసహాయమొనర్చిన శ్రీ చావలి శ్రీరాంనకు, సంవిధాన కర్త చల్లా విశ్వనాధశాస్త్రికినీ, తదితరులకూ మాగురుదేవుల కృపజేత సర్వాభీష్ట ఫలసిద్ధి యగుగాక యని నారాయణ స్మృతి పూర్వకముగ ఆశీర్వదించుచున్నాము.

ఇతి నారాయణస్మృతిః

(కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య

శ్రీమజ్జయేంద్ర సరస్వతీ శ్రీ చరణులొసగిన శ్రీముఖము)

 

Acharyavaani - Vedamulu     Chapters   Last Page