Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

సాధన గ్రంథ మండలి, 102
జగద్గురు బోధలు

ఆఱవ సంపుటము
శ్రీ కంచి కామకోటి జగద్గురు
శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామి
ఆంధ్రానువాదము :
''విశాఖ''
పరిశోధకులు :
శతావధానులు, శ్రీ వేలూరి శివరామశాస్త్రి
''ఆంధ్రప్రభ'' నుండి పునర్ముద్రితం.
ప్రకాశకులు :
సాధన గ్రంథ మండలి, తెనాలి.
కాపీరైటుో       వెల రు. 20-00

యువ - మాఘము
మహా శివరాత్రి
ద్వితీయ ముద్రణ
న్యూ విజయ ఆర్టు ప్రెస్‌ - గాంధీచౌక్‌ - తెనాలి.



తొలి పలుకు

జగద్గురుబోధలు అఱవభాగ మిది. శ్రీ చరణుల ఉపదేశాలన్నీ ఆంధ్ర ముముక్షువులకు అందివ్వటం మహదానంద దాయకమైన విషయం.

ఈ ఉపన్యాసాలకూ, సంభాషణలకూ, ఒక అనుబంధం కూడ చేర్చినాము. స్వాముల వారిని కలసికొని వారితో ఇష్టా గోష్టి నెరపినటువంటి విదేశీయుల యొక్కయూ, స్వామివారి అంతరంగిక శిష్యుల యొక్కయూ, అనుభవ సంకలనం ఈ అనుబంధం. వీనిలో కొన్ని ప్రభలో కూడా ప్రకటింప బడ్డాయి. వానిని సంక్షిప్తంచేసి, చిరుతుక మార్పులతో ప్రచురించినాము.

ప్రస్తుతం శ్రీ వారు ఆంధ్రదేశంలో సంచరిస్తున్నారు. ఈ సమయంలోనే ఈ పుస్తకాన్ని వెలికి తెచ్చుటకు ప్రయత్నించడమైనది. ఈ ఉపన్యాసాలకు ఆంధ్రప్రభ ఇచ్చిన ప్రొత్సాహానికి మా కృతజ్ఞత. ఈ ఉపన్యాసములకు పుస్తక రూపమిచ్చి వానిని శాశ్వతము చేయడానికి పూనుకొన్న సాధన గ్రంథ మండలి - సంపాదకులు శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రిగారికీ నా అభినందనలూ, శుభాకాంక్షాలూ. ఈ వ్యాసములను పరిష్కరించిన కీ. శే. వేలూరి శివరామశాస్త్రిగారల ఆత్మశాంతికి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ.

ఇత్యేషా వాఙ్మయీపూజా

శ్రీమచ్ఛంకర పాదయోః,

అర్పితాతేన మేదేవః

ప్రీయతాం చ సదాశివః.




మండలి మాట

కల్లోలితేన కరుణారస వేల్లితేన

కల్మాషితేన కమనీయ మృదుస్మితేన,

మా మంచితేన తప కించన కుంచితేన

కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన.

- మూక పంచశతి

జగద్గురుబోధలు ఆరవసంపుటం ఈ తీరున అచ్చొత్తించ గలిగినందులకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఇందలి వ్యాసాలలో అధికభాగం 'విశాఖ' అనువదించగా 'ఆంధ్రప్రభ' యందు ప్రకటింప బడినవే. వారి సౌజన్యము వలన ఆంధ్రప్రభ సంపాదకులైన శ్రీనీలంరాజు వెంకట శేషయ్యగారి ఔదార్యము వలన మా మండలి ఆ వ్యాసములను గ్రంథ రూపములో ప్రకటించుటకు వీలుకలిగినది. వారికి మామండలి సదా ప్రణతకృతజ్ఞమై ఉంటుంది.

ఈ సంఘటమున 'విశాఖ' వ్యాసములే కాక శ్రీ జగద్గురువులతో సంభాషణ జరిపిన యితర దేశముల యొక్కయూ, శ్రీవారి ఆంతరంగిక శిష్యుల యొక్కయూ, అనుభవాలను ఈ సంపుటమున అనుబంధముగా చేర్చితిమి. వీనిలో కొన్ని ప్రభలో కూడ ప్రకటింపబడ్డాయి, ఆరచయితలకు మా కృతజ్ఞత.

శ్రీ జగద్గురువుల ఉపన్యాసములను ఈ విధముగా గ్రంథ రూపమున ప్రకటించుటకు, తమ ఆమోద అంగీకారములను వెలిబుచ్చి, తగు సలహాల నిచ్చుచు, శ్రీవారి చిత్రములను గూడ అనుగ్రహించి సహకరించిన ''ఆంధ్రప్రభ'' సంపాదకులు శ్రీ నీలం రాజు వెంకట శేషయ్యగారికి మా ధన్యవాదములు.

ఇక ఈ వ్యాసములలోని భాషను, సంస్కృత భాగములను మిక్కిలి శ్రమకోర్చి సంస్కరించిన శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారి సౌజన్యమునకు మండలి ఎంతయో ఋణపడి ఉన్నది. కీ. శే. శివరామ శాస్త్రి గారల ఆత్మ శాంతికి జగన్మాత కామాక్షిని ప్రార్థిస్తున్నాను.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page