Nadichedevudu   Chapters  

కృతాంజలి ఇది శ్రీకంచి కామకోటి 68వ పీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతి శ్రీచరణుల జీవితచరిత్ర కాదు.
జోస్యం నిజమైంది!

కుమారుడు చాలా చురుకైన వాడు. ఈడుకు మించిన తెలివి తేటలు కనబరుస్తున్నాడు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా కుశాగ్రబుద్ధి అంటున్నారు.

నా ప్రథమ సందర్శనం నాకు నలభై సంవత్సరాలు వచ్చేవరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దామన్న అభిలాష నాలో తలయెత్తలేదు.
స్వామితో సంభాషణ వైకుంఠ ఏకాదశికి కంచి వెళ్లాలని నేను సంకల్పించుకున్నది కంచి వరదుని సేవించుకోడం కొరకే. కామకోటి శంకరాచార్య దర్శనం తలవని తలంపుగా తలస్థించింది. అయినా దాని ప్రభావం నామీద చెరగని ముద్రవేసింది.
''వశిష్ఠాది మహర్షుల వంటివారు'' ''బాబూ! అది నడయాడుతున్న బ్రహ్మపదార్థం. దానిని గూర్చి ఎలా పలకడం? అంటారు తపస్వాధ్యాయనిరతులూ,
మతరక్షణకు మహత్తరకృషి భారతదేశంలో మతం మనుగడకు రాజ్యాంగరక్షణ చేకూరింది. మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణన పొందింది. అయితే, ఇందుకు ప్రధాన బాధ్యు లెవ్వరో దేశం మొత్తం మీద తెలిసినవారు ఎందరో లేరు.
కంచిస్వామి - వినోభా భావే ఇరువురు మహాపురుషులు సమావేశ##మై మాట్లాడుకున్నప్పుడు లోకానికి వారొక కొత్త వెలుగు చూపిస్తారు. ఒక నవీన సందేశాన్ని వినిపిస్తారు.
స్వామి వినోద ప్రియులు స్వామి వినోదప్రియులు. వారి హాస్యం సులలితం. వాక్కు చమత్కారమహితం.
''గ్రంథగ్రంధులు'' కవిగా, రచయితగా శ్రీగుంటూరు శేషేంద్రశర్మగారు సుప్రసిద్ధులు. ప్రాచీన, నవీన కవితారీతులలో సిద్ధహస్తులు.
దేవుడు చేసిన పెళ్ళి ''ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, తమ ఆశీస్సులు అర్థిస్తున్నాము.''
ఆ తల్లికి కలిగిన ఆనందం అడుగుతారూ! కరుణా జలధి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి దయకు పాత్రులైనవారు ఒక వింత అనుభవానికి లోనవుతారు. అది ఎంత ఆనందదాయకమో, అంత ఆశ్చర్యజనకం.
'అమ్మతో చెప్పుకో నీగోడు' స్వామి కంచి పొలిమేరల్లో ఉన్న శివాస్థానం వద్ద మకాంచేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించాడు.
సంస్కృతం చదివిన శాస్త్రిగారూ: నేనూ దక్షిణదేశంలో మధురకు సమీపాన ఎలియత్తాన్‌గుడి ఒక చిన్న గ్రామం. అయినా అది అన్ని గ్రామాల వంటిది కాదు. ఆ ఊళ్ళోఇళ్ళన్నీ దేవాలయాలు. ఆలయాల్లో అర్చన చేసే పూజారులూ, పరిచారకులూ తప్పితే, ఆ గ్రామ వాసులంటూ ఇతరు లెవ్వరూ లేరు.
''అభయం సర్వభూతేభ్యః' స్వామికి మిత్రులూ, శత్రువులూ అంటూ లేరు. ''అభయం సర్వ భూతేభ్యః'' అన్నదే స్వామి ఆశయం.
''నాపేరు ఎలా వచ్చిందో చెప్పమంటారా?'' డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఠాకూర్‌ బొంబైలో సుప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరుడు. మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రాంతాలలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖు లనేకులకు చికిత్సలు చేసి, ఘన వైద్యుడుగా పేరు పొందినవాడు.
పరమార్థ మార్గంలో పరమ నాస్తికుడు! అనుదినం స్వామిని దర్శించడానికి వచ్చే అశేషప్రజలో ఆర్తులూ, అర్థార్థులూ ఎందరో ఉంటారు. ఒకరికి రోగంనయం కావాలి. ఒకరికి దరిద్రం
''ఇక్కడే నా బాలాజీ!'' తమవద్ద శిష్యుడుగా చేరి కడవరకు తమకు శుశ్రూష చేస్తూ ఒక మహారాష్ట్ర సన్యాసి కథను కంచిస్వామి ఇలా వివరించారు.
భద్రాద్రినిధి సేకరణలో నాకు బలమెవ్వరు? 1959లో 'ఆంధ్రప్రభ' దినపత్రికను, వార పత్రికను మద్రాసునగరం నుండి విజయవాడకు తరలించడానికి నిర్ణయించారు.
ఆ చిరంజీవి అదృష్టం 'ఆచారశ్చైవ సాధూనాం ఆత్మన స్తుష్టి రేవచ' - మనువు
డాక్టర్లను 'చిత్తు' చేసిన స్వామి దివ్యశక్తి 1964లో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది.
''ఎల్లాం సామి అనుగ్రహందా!'' సుబ్బయ్య స్థపతికి తెలుగు బాగా రాదు, కంజీవరం వాస్తవ్యుడు కావడం చేత.
సర్వజ్ఞ పీఠం సార్థకం ఆదిశంకరభగవత్పాదులు మూడవ యేటనే దేశభాషలను అభ్యసించారు. అయిదో యేట సంస్కృతం చక్కగా నేర్చుకున్నారు. ఉపనీతులైన పిదప, ఎనిమిదో యేడు ముగిసేలోగా వేదశాస్త్రాలను పూర్తి చేశారు.
స్థపతికి అనుగ్రహం 1960లో భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయ సముద్ధరణకు బృహత్‌ ప్రయత్నం జరిగింది. రాష్ట్ర ప్రజలు, పిన్న పెద్ద లంతా లక్షలాది
'భక్తు డెందు చనిన పరతెంతు వెనువెంట' కొందరు భక్తుల అనుభవంలో ఉన్న మరొక విశేషం: స్వామిని దర్శించడానికి ఎక్కడినుంచి బయలుదేరినా,
అంధురాలికి దృష్టి! 1963 ఆశ్వయుజమాసం. తిరుచిరాపల్లిలో జాతీయకళాశాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ, శ్రీ జయేంద్ర సరస్వతీ.
అది ఒక లీల! 1965 లో మద్రాసు సమీపాన తిరువొత్తియూర్‌లో నా షష్టిపూర్తి స్వామి సమక్షంలో శాస్త్రీయంగా జరగడం నా అదృష్టం.
జర్మనీ పర్యటనమా, జగద్గురు ఆదేశమా? హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శిష్టాచారపరులు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళరాదు
మూగికి మాటలు! శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని, సమీపంలో ఉన్న ఆనందతాండవపురం చేరారు.
కలియుగ ఋష్యశృంగులు! 1960 మేనెల. స్వామి మధుర సమీపాన ఇలయత్తాన్‌గుడిలో మకాం చేస్తున్నారు. కుటుంబంతోసహా మేము రామేశ్వర యాత్రకు బయలుదేరాము. మధురలో మీనాక్షి అమ్మవారిని సేవించుకుని,

''ఆచార్యుల వారిలో అల్లాను చూస్తున్నాను''

దేశ సంచారం చేస్తూ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహారాష్ట్రలోని సతారా పట్టణంలో కొంతకాలం మకాం చేశారు.
''నీలంరాజును ఎరుగుదువా?'' దేశ సంచారం చేస్తూ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహారాష్ట్రలోని సతారా పట్టణంలో కొంతకాలం మకాం చేశారు.

భక్తజన సులభులు

1926లో ఆచార్యస్వామి కారంబక్కుడి నుంచి పుదుక్కోటకు వెళ్లేప్పుడు అనేకమంది ప్రజలు గుంపులుగా వచ్చి వారిని దర్శించారు. వారిలో కొందరు మహమ్మదీయులు కూడా ఉన్నారు.
నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు!

ఎంతటి స్వల్ప విషయంలో నైనా తమ కర్తవ్య నిర్వహణలో స్త్రీలూ, పురుషులూ అప్రమత్తులుగా ఉండడం అవసరమని బోధిస్తారు స్వామి.
ఉదాహరణ:

''అదే నాకూ ఆశ్చర్యం!'' మద్రాసు మకాంలో మైలాపూరులోని సంస్కృత కళాశాల భవనంలో స్వామి విడిది. భవనం చుట్టూత పందిళ్లు వేశారు వేలాది ప్రజకూచునేందుకు.

''నేనంటే స్వామికి ఎక్కువ యిష్టం''

స్వామికి సన్నిహితు లైనవారు ఒక వింత అనుభవం పొంది ఆనందిస్తారు.
సౌజన్యానికి మారుపేరు స్వామి ఔదార్యానికి మేరలేదు. అద్వైతులే కాదు, శైవ, వైష్ణవాది ఏ శాఖకు చెందిన వారినైనా స్వామి ఎంతో గౌరవంతో చూస్తారు. స్వీయప్రతిష్ఠగానీ, పీఠగౌరవంగానీ అందుకు
''ప్రాణదాత స్వామి'' ''శేషయ్యగారూ, ఆ ఆనందాన్ని నేను అనుభవించగలనేగాని, వివరించలేను. అది చాలు నా జీవితానికి'' అంటూ, అతిథిసత్కారాలతో...
వింత శిక్ష! కంచిమఠాన్ని అంటిపెట్టుకుని ఎందరో పరిచారకులున్నారు. వేదాధ్యయనపరులు, జమాఖర్చు లెక్కలు రాసేవారు, ఉత్తర ప్రత్యుత్తరాలు చూసేవారు, వంటవాళ్ళు, పశువులను కాచేవాళ్ళు, కావలి వాళ్ళు, మేళగాళ్ళు మొదలైన వారంతా.
మరుపురాని సంఘటన శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రి
''స్వామి కరుణతో కడుపు పండింది'' సంతానం కోసం జపాలూ, తపాలూ, దానాలూ, ధర్మాలూ చేస్తారు. ఔషధాలు సేవిస్తారు. శస్త్రచికిత్స చేయించుకుంటారు. ఇన్ని చేసినా, కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు.

స్వామిసన్నిధిలో షష్టిపూర్తి

విశ్వావసునామ సంవత్సర మార్గశిర బహుళ ఏకాదశి నేను పుట్టిన రోజు. విశాఖ నక్షత్రం. ఇంగ్లీషుతేది 1905-12-22. మన పంచాంగం లెక్కకు 1965 డిసెంబరు 20 తేదికి 60 సంవత్సరాలు నిండుతవి.
''ఆదిశంకరుల అవతారమే''

''రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆదిశంకరులు కాశీ మహాక్షేత్రానికి విచ్చేసి, హిందూమత పునరుజ్జీవనానికి పునాదులు వేశారని ఎరుగుదుము.

జీవకారుణ్యానికి పరాకాష్ఠ స్వామి జీవకారుణ్యం ఆదర్శప్రాయం. అనన్యసాధ్యం.
శ్రీ కాంచీ క్షేత్రం

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా|
పురీద్వారవతీ చైవ సపై#్తతే మోక్ష దాయకాః||

మతంపరంగా హిందువులకు జరుగుతూవున్న అన్యాయం స్వామితో ఏ.యస్‌. రామన్‌ ఇంటర్వ్యూ
దోషాలన్నిటికి విరుగుడు వర్ణవ్యవస్థ ప్రశ్న: వర్ణవ్యవస్థను తాము ఎలా సమర్థిస్తారు? దేశకాల పరిస్థితులకు విరుద్ధంగా కనిపించే ఈ విధానాన్ని సంస్కరించడానికి, మార్చడానికి అవకాశం ఉన్నదా?...

సంస్కృతం జాతీయ భాష

ప్రశ్న: భాషా సమస్యపై స్వామివారి అభిప్రాయాన్ని తెలుసుకో గోరుతున్నాను.
త్యాగానికి తక్షణ ఫలం 1929 ఫిబ్రవరిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దక్షిణార్కాటు జిల్లాలో పర్యటన చేశారు. ఆ పర్యటనలో ఒకరోజు స్వామి తండలం అనే గ్రామం గుండా ప్రయాణిస్తున్నారు.
''శ్రీవారే ప్రమాణం'' శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ చరణుల 70వ జయంతి సందర్భంగా, నాప్రార్థనపై శ్రీ మండలీక వేంకటశాస్త్రి మహోదయులు ఆనాడు 'ఆంధ్రప్రభ'కు వ్రాసిన అమూల్య వ్యాసం.
శ్రీ జయేంద్ర సరస్వతి కామకోటిపీఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ జయేంద్రసరస్వతీ శ్రీ చరణుల పూర్వాశ్రమనామం శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్‌.

నిరాడంబర దాత రాచూరి రంగదాసు

శ్రీరాచూరి రంగదాసుగారి పూర్వీకులు మూడు దశాబ్దాలకుపైగా హైదరాబాదులో స్థిరపడిన వారు.
'నీకు లక్ష్మీకటాక్షం ఉంటుంది' కామకోటిపీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిస్వామివారిని ప్రప్రధమంగా దర్శించే భాగ్యం ఇలయత్తాన్‌ గుడిలో 1962 సంవత్సరంలో నాకు కలిగింది.
'స్వామిని స్మరించి శస్త్రచికిత్స 1967 సంవత్సరంలో విజయవాడ నుంచి వెలువడే 'ఆంధ్రప్రభ' లో వారంవారం శ్రీ కంచికామకోటిపీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతిస్వామివారి ఉపన్యాసాలు ప్రకటిస్తూండేవారు. మే మా ఉపన్యాసాలు చదువుతూ వచ్చాము.

సన్నిధాన భాగ్యం

శ్రీవారు అరవదేశంలో సంచారం చేస్తున్నారు. వేసవిసెలవులలో వారి సన్నిధికి వెళ్లటం నాకు అలవాటు. ఒకనాటి సాయంత్రం వారు తమిళంలో ఉపన్యాసం ప్రారంభించారు.
బిడ్డకు సంతోషం - స్వామికి సంతృప్తి! శ్రీ త్రిపుర సుందరీ చంద్రమౌళీశ్వరులను స్వామి పూజిస్తున్నారు. వేలాది భక్తులు శ్రద్ధతో పూజను వీక్షిస్తున్నారు. అమ్మవారికి అలంకరించిన పట్టుచీరె అందరినీ ఆకర్షిస్తున్నది.
మహాపురుష సంశ్రయం వేదశాస్త్రాభివృద్ధికై జీవితం అంకితం చేసిన వారిలో దక్షిణ భారతదేశంలో శ్రీకౌతా సూర్యనారాయణరావుపంతులుగారు అగ్రగణ్యులు. వేదవిజ్ఞానాభివృద్ధి ప్రచారం కోసం నేటికి 98 సంవత్సరముల ముందు శ్రీ దేవీ శరన్నవరాత్ర వేదశాస్త్రసభను స్థాపించి
శ్రీ విజయేంద్ర సరస్వతి క్రీస్తుకు పూర్వం సుమారు అయిదుశతాబ్దాల కిందట ఆద్య శంకరాచార్యులచే స్థాపించబడిన శ్రీ కంచికామకోటిపీఠం అధిపతుల పరంపరలో 1983, మే నెల 24 తేది సోమవారంనాడు ఆ పీఠాన్ని అధిష్ఠించిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి 70వ వారు.
అడుగడుగునా స్వామి అనుగ్రహం

శిల్పకళానిధి, శిల్పకళా విద్వన్మణి, పద్మశ్రీ
గణపతి స్థపతి

కరుణావరుణాలయులు శ్రీ కంచికామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీస్వామి పాదులు జంగమతీర్థ చక్రవర్తి. శ్రీవారి చరణస్పర్శ భూమిలోని అణువణువును పవిత్ర తీర్థం కావిస్తుంది. వారు సర్వజ్ఞులు, సర్వసములు...
'సాక్షాత్తు భగవంతుడే!' (కంచిస్వామివారిచే ప్రభావితులైన శ్రీ వెంకటేశ్వర్లుగారు హైదరాబాద్‌ నగరంలో రెండు దేవాలయాలను నిర్మించి, వాటిని సక్రమంగా పరిపాలించడమే గాక, ఎన్నో పుణ్యకార్యాలకు సహాయం చేస్తున్నారు. ఎందరో పండితులను సత్కరిస్తున్నారు.

'నా యోగక్షేమాలు శ్రీవారే తీర్చి దిద్దుతున్నారు'

కీర్తిశేషులైన మా తండ్రి శ్రీ మాగంటి శ్రీరాములుగారు పూర్వం విజయవాడ, రాజమండ్రి పట్టణాలలో కలప వ్యాపారంచేసి లాభాలు గడించారు. విజయవాడలో దక్కన్‌ టింబర్‌ డిపో మా వ్యాపారకేంద్రం.
'ప్రతిష్ఠ ఎప్పుడు?' నాగాయలంక లాంచీలరేవు గట్టున సంతరోజున చేపల తట్టలు, గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునే వారు. అక్కడి నుండి లాంచీలమీద సుమారు వేయి మంది పెనుమూడి మీదిగా గుంటూరుజిల్లాకు పోతారు. దాదాపు వేయిమంది అక్కడికి వస్తారు.
ఇదంతా స్వామి కటాక్షం

- శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి
జగతీ మవితుం కవితాకృతయో
విచరన్తి మహా మహసశ్ఛలతః.

ఆదిలో ఉన్నది వేదమతం ప్రపంచంలో అనేక మతా లున్నవి. మతా లన్నిటికీ ప్రత్యేకమైన పేర్లున్నవి. ఆయా మత సంస్థాపకుల పేర్లతో అవి వ్యవహరించబడుతున్నవి.
శ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రి అనుభవాలు తర్క వేదాంతాచార్య శ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రిగారు విజయవాడలో 'సర్వతంత్ర స్వతంత్ర కళాశాల'లో తర్క వేదాంత శాస్త్రపండితులుగా నియమించబడినారు. ఆ సందర్భంలో, వేదాంత న్యాయరక్షామణి, భాట్టదీపిక (మీమాంస) అనే రెండు సంస్కృతగ్రంథాలు వారికి కావలసివచ్చాయి.
స్వామి ఆశ్రిత కల్పవృక్షం నాకు పుత్రసంతానం కలుగునట్లు అనుగ్రహించవలసినదిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులను ఆశ్రయించాను. శ్రీవారు ఆశీర్వదిస్తూ సేతుస్నానం, నాగప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను చేయవలసిందని ఆదేశించారు.
'నన్ను నిజంగా గుర్తించావా?' శ్రీ చల్లాశేషాచల శర్మగారు కృష్ణాజిల్లా గురజాడ గ్రామవాసులు. వీరి ధర్మపత్ని సావిత్రమ్మగారు. శ్రీ శర్మగారి పూర్వులు శ్రీవిద్యోపాసకులు.

ప్రస్తుతులు

కంచికామకోటిపీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీస్వాములవారు దివ్యజ్ఞాన సంపన్నులు. భూతభవిష్యద్వర్తమానజ్ఞులు. విజ్ఞులు. అపరశంకర స్వాములు. ఒకప్పుడు నా అకాలమృత్యువును పోగొట్టినవారు. వారికి నేను ప్రత్యహము వ్యాసునకు వలె మానసికారాధనను చేస్తూ ఉంటాను. వారి పాదయుగ్మం సర్వదా నా శీర్షాన ధరిస్తారు.
మాయ - బ్రహ్మ

ఆంగ్లమూలం : జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి.
అనువాదకర్త - డాక్టర్‌ రాణీరామకృష్ణ

రాజ్యాంగమా, ధర్మశాస్త్రమా? అస్పృశ్యతానివారణ విషయమై 1927లో మహాత్మాగాంధి, కామకోటి శంకరాచార్యులకు జరిగిన రహస్య సంభాషణలలో స్వామివారు వెల్లడించిన అభిప్రాయాల దృష్ట్యా, అమెరికా దేశస్థుడు డాక్టర్‌ ఎల్డర్‌ అడిగిన ప్రశ్నలకు ప్రస్తుత దేశపరిస్థితులలో భారతపౌరుల కర్తవ్యాన్ని గురించి స్వామి చెప్పిన సమాధానం గమనించవలసి ఉన్నది.
గాంధి - స్వామి రహస్య గోష్ఠి నా విద్యార్థిదశలో నేను చదువుకు స్వస్తి చెప్పడానికి మహాత్మగాంధి బోధలు కారణం. గాంధీజీ ప్రబోధించిన విద్యాలయ, న్యాయస్థాన, శాసనసభా బహిష్కరణోద్యమ (Triple Boycott) ప్రభావం చేత చదువు మానివేసి, స్వాతంత్ర్య సంరంభంలో పాల్గొన్నాను. ఆమూలంగా, రాజకీయాల్లో మహాత్ముడు నాకు నాయకుడేగాక, గురువైనాడ
గోష్ఠి వివరాలు చరిత్రాత్మమైన శ్రీ చంద్రశేఖర సరస్వతీ - మహాత్మగాంధి సమావేశం ప్రాచీనకాలంలో ఋషుల ఆశ్రమ వాటికలలో వలె ఒక గోశాలలో జరిగింది
ఇరువురు మహనీయులు గాంధిమహాత్ముని రచనల సమగ్రచరిత్రకు ప్రధానసంపాదకులైన ప్రొఫెసర్‌. కె. స్వామినాధన్‌ 'స్టేట్స్‌మన్‌' పత్రికకు ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖలో వెల్లడించిన విషయాలు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామిపట్ల గాంధిగారికి గల పూజ్యభావాన్ని వ్యక్తపరుస్తున్నవి.
''రామభక్తులలో అగ్రగణ్యులు గాంధిగారు'' రాజ్యాంగవేత్తగా, భారత స్వాతంత్ర్య ప్రదాతగా, అహింసాసిద్ధాంత ప్రవర్తకుడుగా గాంధిమహాత్ముడు అద్వితీయుడు.
స్వామివార్లతో నా అనుభూతులు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని ప్రప్రధమంగా దర్శించే భాగ్యం నంద్యాలలో మహా నందీశ్వర ఆలయంలో 1968 వ సంవత్సరంలో నాకు కలిగింది.

Nadichedevudu   Chapters