Paramacharya pavanagadhalu    Chapters   

విషయానుక్రమణిక

3-Chapter వినయానికి ఆయన పెట్టింది పేరు. ఏమీ లేని విస్తళ్లెన్నో ఎగిరి పడుతూ ఉండే యీ రోజుల్లో అన్నీ వున్న ఆ విస్తరి అణగి మణగి వుండేది.
4-Chapter శ్రీకంచి కామకోటి పీఠాధిపతులు, జగద్గురు శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (పరమాచార్య) వారిని గురించి తెలియని వారు అరుదు. వారి పావనగాథలు అసంఖ్యాకం. అందులో కొన్నింటిని పుస్తకరూపంగా కూర్చారు.
5-Chapter

పరమాచార్య పావనగాథలను నూరింటిని కూర్చి పుస్తక రూపంగా వెలువరించాలన్న ఆలోచన ముందుగా శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారికి కలిగింది. ఆ సమయానికి నేనక్కడ వుండటం వలన ఈ అవకాశం అర్హత లేకపోయినా, పూర్వ జన్మ సుకృతమో, అదృష్టమో, ఏదయితేనేం నాకు దక్కింది.

6-Chapter 'నడిచే దేవుడు' గా పేరు పొందిన పరమాచార్య గారి దర్శనం తరచుగా చేసికొనే భాగ్యం ఇటీవల కొన్ని సంవత్సరాలుగా నాకు కలుగుతూ వచ్చింది. అందుకు ఆ మహానుభావుని అనుగ్రహం కారణం అనుకుంటాను.
7-Chapter శ్రీకంచి కామకోటి పీఠం 66వ ఆచార్యస్వామి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి VI (1891-1907 ఒక సారి యాత్రలు చేస్తూ తిండివనం (దిండివనం) దగ్గరలో నున్న సారం గ్రామానికి వచ్చారు. శంకరాచార్యుల దర్శనం చేయటానికి
8-Chapter

స్వామినాథన్‌ యింటికి ఓ రోజు వాళ్ల నాన్న గారి మిత్రుడొకరు వచ్చారు. ఆయన న్యాయవాది. అంతేకాదు, ఆయనకు జ్యోతిషం కూడా తెలుసు. తన రెండవ కొడుకు జాతకాన్ని ఓసారి చూడవలసిందని శాస్త్రి గారు కోరగా ఆయన వచ్చారు.

9-Chapter స్వామినాథన్‌ చిన్న పిల్లవాడుగా వున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక గండుపిల్లి ఒకరోజు వాళ్ల యింట్లో దూరింది. ఏదన్నా తినే వస్తువు దొరుకుతుందేమోనని అది అక్కడా యిక్కడా వెతుక్కుంది. ఇంతలో రాగి ముంత ఒకటి దాని
10-Chapter చిన్నప్పుడు స్వామినాథన్‌ చేతులకు బంగారు మురుగులుండేవి. ఒక రోజు అతడు బయట ఆడుకొంటుంటే, అతని మురుగులను కాజెయ్యాలన్న వుద్దేశ్యంతో వొక దొంగ అతని దగ్గరకు వచ్చాడు. అటూ యిటూ చూసి దగ్గరలో పెద్ద
11-Chapter స్వామినాథన్‌కు అయిదేండ్ల వయసు వచ్చింది. అప్పుడు వాళ్ల నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు పోర్టోనోవో లో ఉపాధ్యాయులుగా వున్నారు. ఆ సంవత్సరం చిదంబరక్షేత్రంలో ఇలైమైక్కినార్‌ గుడిలో కుంభాభిషేకం జరుగుతోంది.
12-Chapter స్వామినాథన్‌ చిన్నతనం నుండి చురుకైన పిల్లవాడు. ఏకసంతగ్రాహి. ఒకసారి వింటేనే ఏ పాఠమైనా అతనికి కంఠతా వచ్చేసేది. తన క్లాసు పాఠాలే గాక, తన పై క్లాసు వాళ్ల పాఠాలు కూడా యిలా వింటూనే పట్టేసేవాడు.
13-Chapter స్వామినాథన్‌కు పదేండ్ల వయసులో అతని తండ్రికి తిండివనం బదిలీ అయింది. అందువల్ల అతడు అక్కడి ఆర్కాట్‌ మిషన్‌ స్కూల్లో రెండవఫారంలో చేరాడు. చదువులో చురుకుగా వుండటం మూలంగా అతనికి ఎన్నో బహుమతులు
14-Chapter శ్రీకంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్రశేఖర సరస్వతి శంకరాచార్యులు వారు (66వ పీఠాధిపతి) కలవై గ్రామంలో యాత్రలో వుండగా 1907లో సిద్ధిపొందారు. తరువాత 67వ ఆచార్యులుగా పీఠాన్ని ఎక్కినవారు. శ్రీమహదేవేంద్ర సరస్వతి.
15-Chapter

జగద్గురువులుగా స్వామి వారు అభిషేకించబడిన 1907 ప్రాంతంలో కంచి కామకోటి పీఠం కంచిలో కాక కుంభకోణంలో వుండేది. అందువల్ల ఆచార్యులుగా కలవైలో అభిషేకించబడిన తరువాత శ్రీ చంద్రశేఖర సరస్వతి కుంభకోణం బయలుదేరి దారిలో తిండివనంలో ఆగారు.

16-Chapter కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని చేపట్టిన తరువాత గురువుల నుండి శిక్షణ పొందే అవకాశం తనకు లేకపోవడం ఆయనకు ఎప్పుడూ వెలితిగా అనిపించేది. అయినా తన బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా నిర్వహించటానికి తగిన శిక్షణ పొందే
17-Chapter జగద్గురు శంకరాచార్యులుగా అభిషేకించబడిన తర్వాత 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతిస్వామి చేసిన మొదటి విజయయాత్ర జంబుకేశ్వరానికి కావటం విశేషం. ఇది 1908లో జరిగింది.
18-Chapter స్వామి వారి భక్తులలో అన్ని మతాల వారూ వుండేవారు. 1920లో ఆయన వేదారణ్యం వెళ్లారు. అక్కడ సముద్రస్నానం చేశారు.
19-Chapter 1921లో స్వామి వారు విజయయాత్ర చేస్తున్నరోజులలో కుంభకోణంలో మహామాఘ స్నానం చేయడానికి వచ్చారు. విజయయాత్రలో ఉన్న స్వాముల వారు యాత్ర ముగిసేదాక మఠానికి తిరిగి వెళ్లటం సాంప్రదాయం కాదు.
20-Chapter స్వాముల వారిని చూడటానికి ఎంతోమంది వస్తుంటారు. అందులో పామరులూ, పండితులూ అందరూ వుంటారు.

21-Chapter

శ్రీ చంద్రశేఖర సరస్వతి 1907లో ఆశ్రమం స్వీకరించగా, మరో చంద్రశేఖరులు, శ్రీ చంద్రశేఖర భారతి స్వామిగా 1912లో శృంగేరి పీఠాన్ని అధిరోహించారు. ఇద్దరూ గొప్ప పండితులే. ఇద్దరూ ఆత్మదర్శనం చేసి జీవన్ముక్తులయిన ఆధ్యాత్మిక
22-Chapter శృంగేరీ శంకరాచార్యులు చంద్రశేఖర భారతి ఎప్పుడూ బ్రహ్మతత్వమననం చేస్తూ ఒళ్లు తెలియని స్థితిలో వుంటుండేవారు. అలౌకికానందం అనుభవిస్తూ ఆయన మరి ఏ విషయాలను పట్టించుకొనేవారు కాదు. కొందరు ఆయన గొప్ప తనం గ్రహించలేక ఆయనకు పిచ్చి అని పొరపడేవారు.
23-Chapter పరమాలూరు శివన్‌ స్వామి వారి భక్తులు, శివన్‌ మహామాఘమహోత్సవంలో లక్షలాది మంది యాత్రికులు ఉచితంగా భోజన వసతి ఏర్పాటుచేసిన దాత. 1926 ప్రాంతంలో స్వామి ఉపవాస దీక్ష గురించి శివన్‌ విని, చలించి దీక్షను విరమించ
24-Chapter జూన్‌ 7వ తేదీకి ఒక ప్రత్యేకత వుంది. 1927వ సంవత్సరంలో ఆ రోజున ఆచార్య వినోబా భావే మొదటి సారి గాంధీజీని కలుసుకున్నారు. తిరిగి 1956 లో సరిగ్గా అదే రోజు వినోబా భావే మరో మహాత్ముడు పరమాచార్యను సందర్శించారు.
25-Chapter స్వాముల వారు జగద్గురువులే కాని ఎవరు ఏది చెప్పినా ఓపిగ్గా వింటారు. అందులో ఏమాత్రం మంచివున్నా గ్రహిస్తారే కాని వీళ్లెవరు నాకు చెప్పటానికి? - అన్న అహం ఆయనలో కనిపించదు.

26-Chapter

చిన్న వయసులో ఆచార్య పీఠాన్ని అధిష్ఠించిన చంద్రశేఖర సరస్వతి గారిని చూసుకోవడానికి యిద్దరు వ్యక్తులు వుండేవారు. వారిద్దరు 66వ స్వామి వారి శిష్యులు. ఒకరు తుమ్మలూరు రామకృష్ణయ్య, మరొకరు అడయపాలెం పశుపతి అయ్యర్‌.
27-Chapter స్వాములవారి భక్తులలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, విదేశీయులు అన్ని వర్గాల వారు ఉన్నారు. ఆయన భక్తగణం కేవలం మానవులకే పరిమితం కాదు.
28-Chapter

అది 1927వ సంవత్సరం. భారతస్వాతంత్ర్యసమరానికి సారథ్యం వహిస్తున్న మహాత్మాగాంధి దక్షిణ భారత పర్యటన చేస్తున్నారు. ఆయన పాల్‌ఘాటు చేరుకున్నప్పుడు అక్కడ దగ్గరలో నెల్లిచెరి వద్ద కంచి కామకోటి పీఠాధిపతి మకాం చేసివున్నట్లు తెలిసింది. గాంధీజి వెళ్లి పరమాచార్యుని దర్శించారు.

29-Chapter అది 1929వ సంవత్సరం. స్వామివారు ఏదో యాత్రలో వున్నారు. ఉత్తర ఆర్కాటు జిల్లా పొలిమేర గ్రామంలో ఒక సన్యాసి వచ్చి ఆయనను కలిశాడు. ఆ సన్యాసికి హిందీ, మరాఠీ తప్ప వేరే భాషారాదు. కాని ఆయనకు వచ్చిన ఇబ్బంది భాషతో  
30-Chapter శ్రీకాళహస్తి అనగానే వాయులింగ రూపంలో వున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి అందరికీ గుర్తుకు వస్తాడు. ఇక్కడి గర్భగుడిలో రెండు దీపాలు వెలుగుతూంటాయి. లింగానికి అటూఇటూ ఒకే ఎత్తులో ఒకే వరుసలో, ఒకటి ఎప్పుడూ
31-Chapter స్వాములవారెప్పుడూ ఏదో ఒక కార్యం తలపెడుతూ వుండేవారు. ఒకసారి ఇలయాత్తంలో ఆయన వున్నప్పుడు విద్వత్‌ సదస్సు నొకదానిని ఏర్పాటు చేయాలన్న యోచన వచ్చింది. మత విశ్వాసాలను పెంపొందించటం,
32-Chapter

ఆచార్యులవారికి తాడేపల్లి వారు చదివి వినిపిస్తున్న రామాయణాన్ని వారి తండ్రి అప్పయ్య శాస్త్రిగారు రచించారు. అది కొంత అసంపూర్తిగా వుండగా ఆయన మరణించగా, రాఘవనారాయణ శాస్త్రిగారు దానిని పూరించి అచ్చొత్తించారు.

33-Chapter

ఆచార్యులవారికి తాడేపల్లి వారు చదివి వినిపిస్తున్న రామాయణాన్ని వారి తండ్రి అప్పయ్య శాస్త్రిగారు రచించారు. అది కొంత అసంపూర్తిగా వుండగా ఆయన మరణించగా, రాఘవనారాయణ శాస్త్రిగారు దానిని పూరించి అచ్చొత్తించారు.
34-Chapter కంచి కామకోటి మఠంలో అనంతానందస్వామి అని ఒక సన్యాసి వుండేవాడు. ఆయన స్వాముల వారికి ఎంతో సన్నిహితుడు. వారి అంతరంగిక కార్యదర్శి కూడా. ఒకరోజు స్వామివారు ఆయనతో 'నీవు కామాక్షి గుడికి వెళ్లి,
35-Chapter ఈ ప్రపంచం ధర్మం ఆధారంగా నడుస్తూ వుంది. ధర్మానికి మూలం వేదం. వేదం మంత్ర స్వరూపం కాబట్టి శబ్ద రూపంలో అది ఆకాశంలో ఎప్పుడూ వ్యాపించి వుంటుంది. ఆత్మ శక్తి గల మహాఋషులు ఆ మంత్రాలను దర్శించి తమ శిష్యులకు ఇస్తారు. గురు శిష్యపరంపర వేదాలను రక్షిస్తూ వుంటుంది.
36-Chapter ఒకసారి ఒక కుర్రవాడు చుట్టచుట్టు కొని పడుకున్న తాచుపాముపై పొరపాటున కూచున్నాడు. అయినా అదేం చిత్రమో, ఆ పాము ఆ పిల్లవాడిని ఏమీ చేయకుండా నెమ్మదిగా అవతలకు వెళ్లిపోయింది. మరోసారి ఆ పిల్లవాడే నదిలో స్నానం చేస్తూ
37-Chapter జగద్గురువులకు అనేక మంది రచయితలు, గౌరవాభిమానాలతో తమ రచనలను పంపుతుంటారు. అలా మఠానికి వందల కొలది పుస్తకాలు వచ్చి చేరుతూ వుంటాయి. ఆ రచయితల కోర్కె తమ రచనలు స్వామి వారి దృష్టికి వెళ్లాలనే.
38-Chapter జగద్గురువులకు అనేక మంది రచయితలు, గౌరవాభిమానాలతో తమ రచనలను పంపుతుంటారు. అలా మఠానికి వందల కొలది పుస్తకాలు వచ్చి చేరుతూ వుంటాయి. ఆ రచయితల కోర్కె తమ రచనలు స్వామి వారి దృష్టికి వెళ్లాలనే.
39-Chapter స్వామి వారిని రోజూ ఎన్నో వందల మంది భక్తులు దర్శిస్తుంటారు. కొందర్ని ఆయన పలకరించి నాలుగు మాటలు మాట్లాడుతుంటారు. అలా ఆయనను దర్శించటానికి వచ్చిన వారిలో ఒక రోజు కనకమ్మ అనే ఆమె ఉంది.
40-Chapter తెనాలిలో తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారని వొక గొప్ప పండితుడుండే వాడు. పరమాచార్యులు వలెనే వీరికి కూడ శౌచము, సదాచారాల విషయంలో పట్టుదల జాస్తి. వీరి తండ్రి అప్పయ్య శాస్త్రి గారు శ్రీరామకథామృతాన్ని మొదలుపెట్టి,
41-Chapter చిదంబరంలో నటరాజస్వామి ఆలయం వుంది. ఇక్కడి లింగం ఆకాశలింగం అంటారు. నిజానికి అక్కడ ఒక గదిలో నటరాజమూర్తిగా శివుడున్నాడు. ప్రక్కనే మరో గదికి ఎప్పుడు తెరవేసి వుంచుతారు. టిక్కెట్టు తీసికొన్న వారికి మాత్రం
42-Chapter కంచి కామకోటి పీఠాధిపతులకు ఎందరో మహారాజులు, జమిందారులు, సంపన్న గృహస్థులు విలువయిన కానుకలను, ద్రవ్యాన్ని సమర్పించుకొని తరిస్తుంటారు. కన్యాకుమారి నుండి నేపాల్‌ వరకు ఆచార్యుల పర్యటనలలో ఆయనకు సన్మాన సత్కారాలు జరుగుతూ వుండేవి. ఆయన కేదీ అక్కరలేదు. ఎవరేది యిచ్చినా అది మఠానికే.
43-Chapter దక్షిణాదిన యిదివరకు యిద్దరు గొప్ప శివభక్తులుండేవారు. ఒకరు జ్ఞాన సంబంధర్‌, ఈయన బ్రాహ్మణుడు, రెండవ వారు అప్పర్‌, ఈయన వెళ్లాలజాతికి చెందినవాడు. ఇతడు మొదట జైనమతం తీసుకొన్నాడు. కాని తరువాత తన అక్కతిలకవతి అనే గొప్ప శివభక్తురాలి వలన తిరిగి శివభక్తుడుగా మారాడు.
44-Chapter ఒకసారి స్వామి వారు తిరుచునాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒక గ్రామంలో వారు వెళ్లుతూ వుంటే ఒక దృశ్యం ఆయన కంటపడింది. ఒక చిన్న పిల్లవాణ్ణి వాళ్ల అక్కయ్య దేనికో మందలిస్తూ వుంది. ఆ అమ్మాయి వయసు 12 మించదు.
45-Chapter ఒకసారి కామకోటి మఠంలో స్వామి సన్నిధిని యం.యస్‌.సుబ్బలక్ష్మి గారు కచేరీ చేశారు. సుబ్బలక్ష్మి గారికి భగవద్భక్తి ఎక్కువ. అందులోను కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య అంటే ఎంతో గౌరవం, భక్తీను.

46-Chapter

ఒకసారి స్వాములవారు అమ్మవారి పూజ చేస్తున్నారు. వందలాది ప్రేక్షకులు తన్మయత్వంతో అది వీక్షిస్తున్నారు. అమ్మవారి విగ్రహానికి కట్టిన పట్టుపావడాను చూసి ప్రేక్షకులలో వున్న ఓ చిన్నపిల్ల ముచ్చట పడింది.
47-Chapter స్వాముల వారు 1933లో నవరాత్రులు తంజావూరులో నిర్వహించారు. అప్పుడే వారు ఉత్తర భారతయాత్ర చేయాలని సంకల్పించారు, అదీ పాదచారిగా.
48-Chapter కంచిస్వామి వుపన్యాసాలలో చిన్న చిన్న కథలు వుండేవి. విషయాన్ని తేలికగా అర్థం చేసికోవడానికి యివి తోడ్పడేవి.
49-Chapter 1938లో స్వాములవారు నెల్లూరు వచ్చారు. పురజనులకోరికపై అక్కడ దాదాపు 3 నెలలున్నారు. ఒక రోజు ఏదో గోష్ఠి జరుగుతూ వుంటే మండలీక వేంకటశాస్త్రి గారు చరమవృత్తి అని ఏదో చెప్పబోయారు. వెంటనే స్వామి, 'శాస్త్రీ! చురమవృత్తి అంటే ఏమిటి?' అని అడిగారు.
50-Chapter కంచి కామకోటి పీఠానికి కోట్ల కొలది రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. వేలాదిగా పరివారం వున్నారు. లక్షలాదిగా భక్తులున్నారు. అయితే ఆ పీఠాధిపతి తినేది పిడికెడు అటుకులో! పేలాలో! కట్టేది ఖద్దరుకాషాయం! వాడేవి చెక్కతో చేసిన పాత్రలు! పడుకొనేది అంగ వస్త్రం పరచిన కటిక నేల.
51-Chapter మన దేశ రాజ్యాంగ రచన ప్రారంభ##మైన తొలినాళ్లనుండి స్వాములవారు మత ప్రయోజనాలకు (ఏ మతమైనా గానీండి!) భంగం లేకుండా చూడాలని ప్రయత్నం చేశారు. మత స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగంలో ప్రాధమిక హక్కుగా గుర్తింపజేసి రక్షణ కల్పించాలన్నది శ్రీవారి లక్ష్యం.
52-Chapter కంచి కామకోటి పీఠాధిపతులుగా ప్రస్తుతం వున్న శ్రీ జయేంద్ర సరస్వతి పూర్వాశ్రమ నామం సుబ్రహ్మణ్య అయ్యర్‌. వీరు తంజావూరు జిల్లా తిరుళ్లిణికిలో 1935లో జన్మించారు. ఔచథ్యగోత్రీకులు. ఋగ్వేదీయులు. వడమశాఖ బ్రాహ్మణులు.
53-Chapter 1949 లో స్వాములవారు తంజావూరు జిల్లా పేరాలం రైల్వే జంక్షను దగ్గర వున్న విల్లుపూడి అనే గ్రామంలో నాలుగు రోజులు విడిది చేశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు కొంతకాలం జనరల్‌ మేనేజర్‌గా వున్న టి.కె. త్యాగరాజన్‌ అక్కగారి
54-Chapter స్వాములవారు శ్రీశైలం వెళ్లారు ఒకసారి. ఆది శంకరులవారు శ్రీశైలం దర్శించారు. వారు హాటకేశ్వరం దగ్గరలో ఒకలోయలోకి మెట్లు దిగి పోయి, అక్కడ వున్న ఒక గుహలో పరదేవత నారాధించారు. ఆయన ఆ గుహలో సమాధినిష్ఠులై యోగసాధన చేశారు. పరదేవత సాక్షాత్కారాన్ని పొందారు.
55-Chapter అప్పుడు స్వాములవారు మాంబలంలో వున్నారు. రాత్రి పన్నెండు గంటలవరకూ గోష్ఠి జరుగుతూనే వుంది. అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారితో కలిసి అలా వేకువఝాము (5 గం. కావచ్చింది.) న స్వామి గోష్ఠి ముగించి దండం, కమండలం తీసుకొని బయలుదేరారు.
56-Chapter శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారు స్వాములవారి దర్శనం చేసుకొని తనపేరు, గోత్రం, ఋషులు, శాఖ మొదలయిన వాటితో ప్రవర చెప్పుకున్నారు. తరువాత నమస్కారం చేశారు.
57-Chapter చల్లా శివరామశర్మగారు గూడూరు పాలిటెక్నిక్‌లో జాయిన్‌కావటానికి వెళ్తున్నారు. ఆ రోజుల్లో స్వాములవారు నగరిలో మకాం చేస్తున్నారు. తమ తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు, స్వామి దర్శనానికి శర్మగారు.
58-Chapter భారతీయ విద్యాభవన్‌ అధ్యక్షులు శ్రీ ధర్మసే ఖటావ్‌ స్వాముల వారి దర్శనం చేశారు. ఖటావ్‌ ను స్వామివారికి పరిచయం చేశారు, అక్కడున్న వారు.
59-Chapter ఒకసారి వీణలో మహావిద్వాంసులొకరు స్వామిని దర్శించారు.
60-Chapter రష్యా దేశస్థుడు డాక్టర్‌ యస్‌.ఐ. తులాయేవ్‌ ఒకసారి స్వాముల వారిని దర్శించారు. ఆయనకు ఒక సందేహం కలిగింది.
61-Chapter కృష్ణాజిల్లాలో పండరిపూర్‌ అని వొక వూరుంది. అక్కడ ఒకసారి మకాం చేశారు. స్వామి. అర్థరాత్రి సమయంలో ఆయనకొక ఆలోచన వచ్చింది. దివిసీమ తుఫాన్‌లో అనేక వందల మంది మరణించారు. అకాలంగా మరణించిన ఆ ప్రేతాత్మలకు భోజనం వేదనాదమే. అది ఏర్పాటు చేసి వెళ్లాలి. ఇది వారి సంకల్పం.

62-Chapter

అక్కడ వొక తోపుడు రిక్షా పెట్టి వుంది. దానిలో పీటలూ, చెక్కపాత్రలూ, ఒకటో రెండో ఖద్దరు శాఠీలు (కాషాయం రంగువి) వున్నాయి. ఆ రిక్షా పక్క నిలుచున్న వారు స్వామి సేవ కోసం వచ్చిన స్వచ్ఛంద సేవకులు. స్వామికి తొంబయి యేళ్లు

63-Chapter

శ్రీ ఉప్పులూరి పున్నయ్య శాస్త్రిగారు వేదాంత శాస్త్ర నిధి. వారిది గుంటూరు. చాలా కాలంగా వారికి కంచి స్వామిని కలిసి తమకు గల కొన్ని సందేహాలను అడిగి సమాధానాలు తెలిసికోవాలని వుండేది. ఎలాగయితేనేం. వీలు చిక్కించుకొని ఒక
64-Chapter మద్దులపల్లి మాణిక్యశాస్త్రి గారు విజయవాడలోని ఒక కళాశాలలో వేదాంత పండితులుగా పని చేస్తుండగా ఆయనకు రెండు సంస్కృత గ్రంథాలతో పని పడింది. అవి ఎక్కడా దొరకలేదు. ఎవరో కంచి వారికి రాసి చూడమన్నారు.
65-Chapter శ్రీవారొక వూళ్లో మకాం చేస్తూ అక్కడ వున్నగుళ్లు చూడటానికి పోయారు. ఆయన ప్రక్క కల్లూరి వెంకటసుబ్రహ్మణ్యం దీక్షితులు గారున్నారు.
66-Chapter విజయవాడలో శోధన్‌ పెయింట్స్‌కు చెందిన హరిసోదరులు ఆధ్యాత్మిక చింతన గల పండితులు. వారు తమ స్వగ్రామంలో గాయత్రిదేవి ఆలయం కట్టి నిత్యధూపదీప నైవేద్యాదులతో పూజ చేయిస్తున్నారు.
67-Chapter మధుర మీనాక్షి, కంచి కామాక్షీ, కాశీ విశాలాక్షి అని అమ్మవారు ముఖ్యంగా యీ మూడుచోట్లా ప్రసిద్ధి చెందింది.
68-Chapter కంభంపాటి నాగేశ్వరరావు గారు కంచిస్వామి భక్తులు. ఆయన కాశీకి వెళ్లి గంగ తీసికొని వచ్చారు. ఎవరో ఆయనతో ఆ గంగను రామేశ్వరంలో కలపాలని చెప్పారు. కాని ఆ సాంప్రదాయం ఏమిటో సరిగా వివరించలేదు. కంచి వెళ్లి స్వామినే
69-Chapter శ్రీ చల్లా శేషాచల శర్మగారిది గురజాడ. ఆయన పూర్వీకులు శ్రీ విద్యా ఉపాసకులు. ఆ పుణ్యఫలం వల్ల ఆయనకు కంచి స్వామి అనుగ్రహం లభించింది.
70-Chapter స్వామి కొన్నాళ్లు కంచిలో శివస్థానం అనే చోట వుండేవారు. అది వొక పెరట్లో వున్న కుటీరం. స్వామి అందులో వుంటూ ఏకాంతంగా, మౌనంగా తపస్సు చేసికొంటూ వుండేవారు. ఆయనను చూడటానికి వచ్చేవారు గోడ యివతల నిలుచొని
71-Chapter అలహాబాదులో సహస్రలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని సంకల్పించారు కంచి స్వామి. ఆ లింగాన్ని తయారు చేసే బాధ్యత గణపతిస్థపతికి అప్ప చెప్పారు.
72-Chapter ఉయ్యూరులో సావిత్రమ్మ గారని ఒక యిల్లాలుంది. ఆవిడ ఎన్నో ఏళ్లుగా వున్నట్లుండి భయపడుతుండటం, ఏ కారణం లేకుండా జడుసుకోడం చేస్తుండేది. ఒక రోజు కలలో ఆమెకొక యతి కన్పించి, అభయముద్రను చూపి
73-Chapter భద్రాచలంలో కుంభాభిషేకం జరుగుతోంది. శ్రీ చంద్రశేఖర సరస్వతి భద్రాచలం వచ్చారు. స్వాముల వారు గోదావరి స్నానానికి వెళ్లిన సమయానికే గణపతి స్థపతి కూడా స్నానానికి వెళ్లారు. ఆయన మెడలో వున్న నవరత్నమాల అప్పుడు
74-Chapter కాశీలో కామకోటీశ్వరాలయాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. కంచి స్వామికి. ఆయన సంకల్పానుసారం పని ప్రారంభ##మై చురుకుగా జరుగుతోంది. స్వామి వారు మాత్రం ఆ స్థలాన్ని దర్శించలేదు.
75-Chapter శ్రీవారు గురజాడలో చల్లా శేషాచల శర్మగారి యింటి యందు విడిది చేసి వున్నప్పుడు, వారి పాదాలకు బంగారు పూలతో పూజ చేయాలనే సంకల్పం శర్మగారికి కలిగింది. ఆరోజు పాదపూజ శర్మగారిదని నిర్ణయం అయింది. సామాన్యంగా
76-Chapter విజయవాడ వచ్చినపుడు స్వామికి అక్కడ భక్తులు వజ్ర కిరీటం పెట్టారు. ముఖమల్‌ పరుపులు పరచిన పూల పల్లకిలో ఊరేగించారు. ఆ వైభవాన్ని కనులారా చూడలేకపోయిన వారిలో చల్లా శేషాచలశర్మ గారొకరు.
77-Chapter స్వాములవారు ఆనంద తాండవపురంలో ఒక రోజు అనుగ్రహభాషణ చేశారు. ఆయన ఉపన్యాసం సంస్కృతంలో అద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తూ అద్భుతంగా సాగింది. ఆ సభలో కూర్చున్న శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారికి
78-Chapter ఒకసారి పుట్టపర్తి నారాయణాచార్యలు గారు, పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీవారణాసి రామమూర్తి (రేణు) గారు స్వాముల వారి దర్శనం చేసుకున్నారు.
79-Chapter 'స్వామి! నా కుమార్తెకు వొక సంబంధం చూశా. కాని, వరుడు తరపు వాళ్లు పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారు. నాకంతశక్తిలేదు. సంబంధం మంచిది. వదలుకోలేను, మీరే నాకు దారి చూపించాలి' అని వేడుకొన్నాడు.
80-Chapter 1956లో స్వామి ఆరోగ్యం సరిగా లేదు. అప్పుడే కుంభకోణంలో మహామాఖ తటాకంలో మహామాఖోత్సవాలు జరిగాయి. ఆ వుత్సవాలు 12 సంవత్సరాల కొకసారి వస్తాయి. స్వామి కాలినడకన కంచి నుండి కుంభకోణం వెళ్లి ఆ తటాకంలో స్నానం
81-Chapter బ్రిటీషు జాతీయుడు సర్‌ పాల్‌బ్రూక్‌ 1958లో మదరాసులో స్వాముల వారిని కలిసారు. రాత్రి 8.30 గం.ల సమయం. చుట్టూ కొబ్బరి చెట్లున్నాయి. మధ్యలో ఒక గడ్డి వాము. ఆరుబయట ఏర్పాటయింది ఆ సమావేశం.
82-Chapter 1960లో స్వామి ఎలియత్తాన్‌లో మకాం చేశారు. అదో చిన్న పల్లె. ఆ వూరు ప్రత్యేకత ఏమంటే ఆ వూళ్లో యిళ్లన్నీ గుళ్లే. ఆ వూళ్లో జనమంతా ఏదో ఒక ఆలయంలో పూజారులే కాని ఏదో ఒక గుడికి సంబంధంలేని వారంటూ ఎవ్వరూ లేరు, అక్కడ. ఆ వూళ్లో గుళ్లనూ, గోపురాలనూ కట్టించింది ద్రవిడ దేశంలో నాటుకోటి సెట్లు. వారంతా కోటికి పడగెత్తిన వారే.
83-Chapter అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సైరాక్యూజ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా వున్న డేనియల్‌ స్మిత్‌ 1962లో భారతదేశం వచ్చారు. అప్పుడు ఆయన ఆగమశాస్త్రాలలో పాంచరాత్రం గురించి పరిశోధన చేస్తున్నారు.
84-Chapter శ్రీపురాణాల రామకృష్ణ శాస్త్రి గారికి పుత్ర సంతానం లేక స్వామిని వేడుకొన్నారు. సేతు స్నానం, నాగప్రతిష్ఠ చేయవలసిందని చెప్పి స్వాముల వారు ఆశీర్వదించారు. ఆయన 1963లో కుటుంబసమేతంగా రామేశ్వరం
85-Chapter అది 1963. తిరుచినాపల్లిలో వున్నారు, స్వామి దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ. పెద్ద స్వాములు నవరాత్ర దీక్షలో వుండి, ఆ కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, కనుక ఇంటర్‌వ్యూలు రద్దు చేశారు.
86-Chapter కృష్ణాజిల్లాలో నాగాయలంక అని ఒక వూరుంది. ఆ వూరి లాంచీల రేవు గుండా వందలాది జనం కృష్ణానది దాటి గుంటూరు జిల్లాకు పోయి వస్తుంటారు. అలాంటి చోట గుడి వుంటే మంచిదని శ్రీ కోదండ రామాలయం, రమాసహిత
87-Chapter శ్రీ నీలం రాజు వెంకటశేషయ్య గారు సుప్రసిద్ధ పత్రికా సంపాదకులే గాక నిరంతర ఆధ్యాత్మిక చింతన కలవారు. విశేషించి కంచిస్వామి భక్తులు.

88-Chapter

స్వాముల వారు ఎప్పుడు ఏ పని ఎందుకు చేస్తారో అర్థమయ్యేది కాదు. అయితే ఆయన చేసే ప్రతి పనికి ఏదో ప్రయోజనం వుంటుంది. అదేమిటో మనం గ్రహించటానికి ఒక్కోసారి చాలా సమయం పట్టేది.

89-Chapter

స్వాముల వారంటే అమిత భక్తిగల శిష్యులెందరో వున్నారు. అట్టి వారిలో ఒకరు తన కుమారునికి చంద్రశేఖర్‌ అని స్వామి వారి పేరు పెట్టుకొన్నాడు. ఆ సంగతి స్వామివారికి విన్నవించుకున్నాడు కూడా.
90-Chapter 1966లో విజయదశమి నాడు ప్రఖ్యాత గాయని శ్రీమతి యం.యస్‌. సుబ్బలక్ష్మి అమెరికా వెళ్లింది. అక్కడ ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ హాలులో ఆమె పాట కచేరి జరిగింది. ఆమె గానానికి అక్కుడున్న వారంతా మంత్రముగ్ధుల్లా అయిపోయారు. ఇంతకూ, ఆమె పాడినపాట రాసిందెవరో కాదు, పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామే. ఆ కీర్తన యిది......
91-Chapter 1968లో శ్రీవారు హైదరాబాదులో చాతుర్మాస్యం చేశారు. అప్పుడు కౌతా మనోహర్‌ గారి యింట బసచేసి వున్నారు.
92-Chapter ఒకసారి ఆర్థర్‌ ఐసెస్‌బర్గ్‌ స్వాముల వారిని కలుసుకున్నారు. సంభాషణ ప్రారంభిస్తూ ఐసెస్‌ బర్గ్‌ సరియైన ప్రశ్న వేయటం జ్ఞానోదయానికి ప్రాతిపదిక అని అంటారు కదా! నేను జ్ఞానిని అనుకొందాం. అప్పుడు నేను మిమ్ములను అడుగదగిన ప్రశ్న ఏది?' అని ప్రశ్నించారు.
93-Chapter అర్థరాత్రి సమయం. అర్జంటుకేసని డాక్టరు గారినిపిలుచుకొని పోయారు. ఇంకొకరింకొకరయితే డాక్టరు గారు కాస్త బద్దకించే వాడేమో కాని ఆ రోగి సంగతి తెలిసిన వాడు కనుక అశ్రద్ధ చేయలేదు. బంధువులు ఆదుర్దా కొద్దీ పిలిచారు గనుక తన తప్పు లేకుండా వెళ్లేడా కాని ఆయనకూ ఆ రోగి బతుకుతాడన్న ఆశ##లేదు.
94-Chapter అది పవిత్ర రామేశ్వర క్షేత్రం. దక్షిణ సముద్ర తీరంలో ఒక పూరిపాక వొకటి. ఆ పాకలో శంకరాచార్యుల వారి నిలువెత్తు పాలరాతి విగ్రహం ఉలుల, సుత్తుల చప్పుళ్ల మధ్య రూపుదిద్దుకుంటోంది. ఎంతో శ్రద్ధగా దీక్షతో ఆ విగ్రహాన్ని
95-Chapter స్వాముల వారొకసారి చిదంబరం నుంచి వస్తూ, ఆనంద తాండవపురం చేరారు. ఆయనకు స్వాగతం చెప్పటానికి ఆ వూళ్లో పిన్నలూ, పెద్దలూ అంతా వచ్చారు. అక్కడ చేరిన వారిలో పిల్లలే ఎక్కువగా వున్నారు. ఆ పిల్లల్ని చూసి స్వాముల వారికి
96-Chapter ఆ రోజు పూజ పూర్తయింది. అంతవరకూ ఆనందతన్మయులై ఆ పూజను తిలకిస్తున్న జనమంతా లేచి వరుసలు కట్టి నిలుచుంటున్నారు, తీర్థం తీసికోడానికి.
97-Chapter ఒకసారి స్వాముల వారు మదరాసు వచ్చారు. అక్కడ త్రిపుర సుందరీ, చంద్రమౌళీశ్వరుల పూజ చేస్తున్నారు. స్వామి ఆదేశంపై శ్రీ జయేంద్ర సరస్వతి పూజలో కూర్చొని వున్నారు. వేసిన పందిళ్లు చాలక జనం కిటకిటలాడుతూ మైదానమంతా నిండిపోయారు.
98-Chapter వానమామలై జియ్యర్‌ గారు వైష్ణవులందరకూ గురువు. ఆయన చాలా వృద్ధులైనారు. కంచి కామకోటి పరమాచార్యను గురించి ఆయన ఎందరి నోటనో విన్నారు. వారిని వొకసారి స్వయంగా కలుసుకోవాలని ఆయన కనిపించింది.
99-Chapter అది 1978. చావలి సుబ్రహ్మణ్యశాస్త్రి గారనే స్వామి భక్తునికి వొకసారి జబ్బు చేసింది. స్పృహ కూడ లేని స్థితిలో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు శ్రీరాం హంపి వెళ్లి అక్కడ మకాం చేస్తున్న కంచి కామకోటి పెద్ద
100-Chapter స్వామి వారు ఉదారహృదయులు. కాని ఎవరయినా తప్పు చేస్తే వొప్పుకొనే వారు కాదు. అయితే ఆయన వాళ్లను శిక్షించే తీరు విలక్షణంగా వుండేది.
101-Chapter డాక్టర్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావుగారు పేరొందిన సర్జన్‌. విజయవాడలోనే గాక ఆయన పేరు ఆ ప్రాంతమంతా సుపరిచితమే.
102-Chapter పొన్నేరికి దగ్గరలో తండలం అని వొక చిన్న వూరుంది. ఆ వూళ్లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో బ్రహ్మశ్రీ ముక్కామల కృష్ణమూర్తి శాస్త్రి గారనే వేద పండితులొకరున్నారు. ఆయన నాలుగవ కుమారుడు శంకరం.
103-Chapter నల్లగొండ జిల్లాలో ఒక సిమెంటు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. 1983 ఫిబ్రవరిలో నిర్మాణం పూర్తి అయింది. మోటార్లు అమర్చాలి. బెంగుళూరులోని ఒక ప్రభుత్వ సంస్థ దగ్గర ఆ ఫ్యాక్టరీకి కావలసిన మోటార్లు అమ్మకానికి సిద్దంగా వున్నాయి.
104-Chapter 1983లో స్వామి వారు కర్నూలులో చాతుర్మాస్యం చేసినప్పుడు ఆయనకు ఆ జిల్లా కలక్టర్‌ శ్రీ అగర్‌వాలా స్వాగతం పలికి నగరం లోకి తీసుకొని వచ్చారు. ఆ సందర్భంలో ఆయన కంచి పెద్ద స్వాముల వారికి తనను తాను పరిచయం
105-Chapter 1983లో కర్నూలులో కంచి స్వాములు చాతుర్మాస్యం చేసేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.టి.రామారావు గారు చాతుర్మాస్యం ముగిసే రోజుకు కర్నూలు వచ్చి వీడ్కోలు చెప్పాలని తలచారు కాని అలా చేయటం వారికి కుదరలేదు.
106-Chapter

దలైలామా టిబెటన్ల మత గురువు. చైనా టిబెట్టును ఆక్రమించుకోక ముందు, ఆయన దాని పరిపాలకుడు కూడ.

107-Chapter శ్రీ శంబరాజు వెంకటేశ్వర రావు గారు షిరిడి సాయి భక్తులు. ఆయన హైదరాబాదులో హిమాయత్‌నగర్‌లో వుంటారు.
108-Chapter ఒకసారి స్వాముల వారు చెంగల్పట్టులో వుండగా ఆయనను పాల్‌ బ్రంటన్‌ వచ్చి దర్శించారు. ఆయన సుప్రసిద్ధ పత్రికా రచయిత. దర్శనం తరువాత కొంత సేపు స్వాముల వారితో మాట్లాడి ఆయన మదరాసుకు వెళ్లారు.
109-Chapter ఒకసారి పరమాచార్య మధ్యలో తన ప్రసంగం ఆపి, వింటూ కూర్చున్న సభ్యులలో వొకరిని పిలచి 'ఆంధ్రా యాజిటేషన్‌ అంటున్నారే, ఏమిటి?' - అని అడిగారు. తాము చెబుతున్న ప్రవచనం మధ్యలో ఆపి ఆచార్యులు రాజకీయ విషయాలను గురించి తనను ప్రత్యేకించి అడగటం ఆయనకు వింతగా తోచింది. అయినా ఏదో తోచిన జవాబు చెప్పారాయన.
110-Chapter ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి స్వాముల వారి దర్శనం చేశాడు. ఆయనకు 80 సంవత్సరాల వయసుంటుంది. ఆ బ్రాహ్మణుడు స్వాముల వారితో ''స్వామి! మీకు కనకాభిషేకం చేసి ఆ దివ్య దృశ్యం చూడాలని నా కాశగా వుంది. మీరు తప్పక వొప్పుకోవాలి', అని కోరాడు. స్వాముల వారు ఏం చెప్పలేదు.
111-Chapter కంచి కామకోటి పీఠం 63వ ఆచార్యులు శ్రీ మహదేవేంద్ర సరస్వతికి తంజావూరు మహారాజు శర్ఫోజి 1801లో తంజావూరులో కనకాభిషేకం చేశారు. అప్పుడు 500 బంగారు ముద్రికలను వినియోగించారు. వాటి విలువ 1987లో వేసిన అంచనా ప్రకారం రూ.1.5 లక్షలు.
112-Chapter కనకాభిషేకానికి వచ్చే ముందు స్వాముల వారు కలవై, ఇలయాత్తంలకు వెళ్లి వచ్చారు. కలవైలో స్వాముల వారి కన్న ముందు పీఠాధిపతిగా వున్న 67వ ఆచార్యులు శ్రీ మహాదేవేంద్ర సరస్వతి - (VI)  (1907-1907) వారి సమాధి, వారికన్న
113-Chapter శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (V)  (1814-1851) (కంచి కామకోటి పీఠానికి 64వ ఆచార్యులు) జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరీ దేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి తాటంక ప్రతిష్ఠ చేశారు. వారు తిరిగి కుంభకోణంలోని తమ మార్గానికి
114-Chapter

1. నడిచే దేవుడు

- నీలంరాజు వెంకట శేషయ్య

115-Chapter

l వినోదపు పన్ను రాయితీ...

l పూర్తిగా రాష్ట్రంలో నిర్మించే చిత్రాలకు 5 పర్సెంటేజి పాయింట్లు...

Paramacharya pavanagadhalu    Chapters